- ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు..
- గంట ముందే కేంద్రానికి చేరుకోవాలన్న ప్రిన్సిపాల్
రేపు నవోదయ 9వ తరగతి ప్రవేశ పరీక్ష
Published Fri, Jun 23 2017 12:05 AM | Last Updated on Wed, Sep 5 2018 8:36 PM
పెద్దాపురం :
జవహార్ నవోదయ విద్యాలయలో 9వ తరగతి ప్రవేశానికి ఈ నెల 24న ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ వి.మునిరామయ్య తెలిపారు. గురువారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాదుతూ జిల్లాలోని సుమారు 272 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారన్నారు. జిల్లావ్యాప్తంగా పెద్దాపురం నవోదయ విద్యాలయలోనే పరీక్ష జరుగుతుందని, విద్యార్థులు ఉదయం 9 గంటలకు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని పేర్కొన్నారు. హాల్ టిక్కెట్లు విద్యార్థులందరికీ పోస్టు ద్వారా పంపామని, ఏ కారణం చేతనైనా అందని విద్యార్థులు నేరుగా పరీక్షా కేంద్రానికి ఒక అటెస్టెడ్ పాస్‌పోర్టు సైజు ఫోటో తీసుకుని 23 సాయంత్రం లోగా నవోదయ విద్యాలయలో సంప్రదించి డూప్లికేట్ హాల్ టికెట్ పొందాలని సూచించారు. పరీక్ష ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ బందోబస్తు సహా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ప్రవేశ పరీక్షపై ఎటువంటి సమాచారం కోసమైనా 08852–241354 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
Advertisement