navodaya
-
ప్రాణం తీసిన ఫ్లెక్సీ ఫ్రేమ్.. ప్రిన్సిపాల్ సస్పెండ్..
ఖమ్మం: మరో నాలుగు రోజుల్లో రీజినల్ స్థాయి క్రీడాపోటీలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయాల నుంచి విద్యార్థులు హాజరుకానున్న పోటీల్లో తాము సైతం పాల్గొంటామని ఉత్సాహంగా ఉన్న విద్యార్థుల్లో ఒకరు విద్యుదాఘాతంతో మృతి చెందడం విషాదాన్ని నింపింది. వివరాలు.. పాలేరులోని నవోదయలో వచ్చేనెల 3వ తేదీ నుంచి రీజినల్ స్థాయి క్రీడా పోటీలు జరుగనున్నాయి. దీంతో శనివారం సాయంత్రం ఫ్లెక్సీల ఏర్పాటుకు 12వ తరగతి విద్యార్థులు హలావత్ దుర్గానాగేందర్, శ్రీకుమార్.. ఈశ్వర్‌తో కలిసి ఇనుప ఫ్రేమ్ తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో ఫ్రేమ్ పైన ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలను తాకడంతో నాగేందర్ పడిపోగా, మిగిలిన ఇద్దరు షాక్ గురైనా తేరుకున్నారు. దీంతో స్థానికులు, ఉద్యోగులు నాగేందర్‌ను ఓ వ్యాపారి కారులో ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో అంబులెన్స్ రావడంతో అందులో ఎక్కించారు. అయితే, ఆస్పత్రికి చేరుకునేలోగా నాగేందర్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం గాయపడిన శ్రీకుమార్, ఈశ్వర్‌ను కూడా కలెక్టర్ గౌతమ్ సూచనలతో ఖమ్మం ఆస్పత్రి తీసుకెళ్లారు. ఆందోళన, దాడి విద్యార్థి నాగేందర్ స్వస్థలం కూసుమంచి మండలంలోని కోక్యాతండా. ఆయన తండ్రి బాలాజీ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ మేరకు నాగేందర్ మృతి చెందినట్లు తెలుసుకున్న కుటుంబీకులు చేరుకుని ‘మా కొడుకు మాకు కావాలి’ అంటూ గుండెలవిసేలా రోదించిన తీరు అందరినీ కలిసివేచింది. అలాగే, పెద్దసంఖ్యలో చేరుకున్న బంధువులు, తండావాసులు ప్రిన్సిపాల్, ఉద్యోగుల నిర్లక్ష్య మే ఘటనకు కారణమని ఆరోపిస్తూ డార్మెటరీల అద్దాలు, ఫర్నీచర్ పగులగొట్టారు. ఆర్డీఓ స్వర్ణలత, ఖమ్మంరూరల్ ఏసీపీ బస్వారెడ్డి పరిస్థితులు సమీక్షించగా, సీఐలు జితేందర్‌రెడ్డి, రాజిరెడ్డి బందోబస్తు ఏర్పాటుచేశారు. ఘటన జరిగిన 40 నిమిషాల వరకు ప్రిన్సిపాల్, ఉద్యోగులు పట్టించుకోలేదని, సకాలంలో ఆస్పత్రికి తరలిస్తే నాగేందర్ బతికేవాడని తెలిపారు. ప్రమాదానికి కారణమైన విద్యుత్ తీగలు కిందకు వేలాడుతున్నాయని తెలిసినా సరిచేయించలేదని ఆరోపించారు. సీపీఆర్ చేసినా దక్కని ప్రాణం నాగేందర్‌ను ఆస్పత్రికి తీసుకొచ్చే క్రమంలో 108 సిబ్బంది సీపీఆర్ చేస్తూ వచ్చినా ఫలితం దక్కలేదు. కాగా, విద్యార్థి సంఘాల నాయకులు ఆస్పత్రికి చేరుకుని అక్కడే ఉన్న ప్రిన్సిపాల్, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులతో పనులు చేయించడంతోనే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. టూటౌన్ పోలీసులు చేరుకుని వారికి నచ్చచెప్పినా వినకుండా ఆస్పత్రి ప్రవేశ ద్వారం వద్ద బైఠాయించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. పీడీఎస్‌యూ, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నాయకులు నామాల ఆజాద్, ఇటికల రామకృష్ణ, ప్రవీణ్, వెంకటేశ్, మస్తాన్, శ్రీకాంత్, మల్సూర్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని నవోదయ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ధరావత్ కీమానాయక్, నాగండ్ల దామోద్‌రావు డిమాండ్ చేశారు. కాగా, ఖమ్మం ఆర్డీఓ స్వర్ణలత శనివారం రాత్రి విద్యాలయకు చేరుకుని వివరాలు ఆరా తీశారు. అయితే, ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయడమే కాక నాగేందర్ కుటుంబానికి రూ.50లక్షల పరిహారం చెల్లంచి, అతడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని పలువురు డిమాండ్ చేశారు. ప్రిన్సిపాల్ సస్పెండ్ విద్యార్థి మృతికి బాధ్యుడిగా నిర్ధారిస్తూ నవోదయ ప్రిన్సిపాల్ ఏ.చంద్రబాబును సస్పెండ్ చేస్తూ నవోదయ విద్యాలయాల సమితి డిప్యూటీ కమిషనర్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. -
మలేరియాకు ర్యాడికల్ చికిత్స!
మళ్లీ మళ్లీ జ్వరం వస్తుండటం ఎందుకంటే... మలేరియా అనేది ప్రోటోజోవా అనే విభాగానికి చెందిన ఏకకణ జీవి అయిన ‘ప్లాస్మోడియమ్’ కారణంగా వస్తుంది. మళ్లీ ఇందులోనూ కొన్ని రకాలు ఉంటాయి. ఉదాహరణకు ప్లాస్మోడియమ్ వైవాక్స్, ప్లాస్మోడియమ్ ఓవ్యూల్. మిగతా రకాలు ఎలా ఉన్నా... ఇవి మాత్రం చికిత్స తర్వాత... మందులకు దొరికి నశించిపోకుండా ఉండేందుకు వెళ్లి కాలేయంలో దాక్కుంటాయి. ఒకవేళ ఇవి అక్కడ దాక్కుని ఉంటే... చికిత్స తర్వాత కొన్ని రోజులకూ లేదా కొన్ని నెలలకు సైతం మళ్లీ మళ్లీ జ్వరం తిరగబెడుతూ ఉంటుందన్నమాట. అందుకే దాన్ని పూర్తిగా తొలగించేలా చేయడానికే ఈ ‘ర్యాడికల్ చికిత్స’ అవసరమన్నమాట. మలేరియా వచ్చినప్పుడు కొంతమంది ప్రాథమికంగా చికిత్స తీసుకుని తగ్గగానే దాని గురించి మరచిపోతారు. నిజానికి మలేరియా తగ్గాక కూడా ఆ జ్వరానికి ‘ర్యాడికల్ ట్రీట్మెంట్’ అనే చికిత్స తీసుకోవాలి. అంటే శరీరంలోని మలేరియల్ ఇన్ఫెక్షన్ను పూర్తి స్థాయిలో తీసివేయడమన్నమాట. సాధారణంగా మలేరియా జ్వరం తగ్గిన రెండు వారాల పాటు ఈ చికిత్సను కొనసాగించాల్సి ఉంటుంది. లేకపోతే మలేరియా జ్వరం మళ్లీ రావచ్చు. మరప్పుడు ఏం చేయాలి? మలేరియా వచ్చాక అది ప్లాస్మోడియమ్ వైవాక్స్, ప్లాస్మోడియమ్ ఓవ్యూల్ రకానికి చెందిందా కాదా అని తెలుసుకోవడం కోసం ‘బ్లడ్ స్మియర్’ను మైక్రోస్కోప్ కింద పరీక్షించాల్సి ఉంటుంది. బాధితుడికి ప్లాస్మోడియమ్ వైవాక్స్ ఉందని తెలిశాక, వాస్తవానికి అతడికి ‘ప్రైమాక్విన్’ అనే మందును 14 రోజుల పాటు ఇవ్వాలి. అయితే వాళ్లలో ‘జీ6పీడీ’లోపం ఉంటే అలాంటివాళ్లకు ప్రైమాక్విన్ మందు ఇవ్వకూడదు. ఆ లోపం ఉందా లేదా అని తెలుసుకునేందుకు ‘జీ6పీడీ’ అనే పరీక్ష నిర్వహించి, లోపం లేనివాళ్లకు మాత్రమే ప్రైమాక్విన్ మందు ఇవ్వాల్సి ఉంటుంది. అలా మందును నిర్ణీత కాలంపాటు బాధితుడికి ఇచ్చి... అతడిలోనుంచి మలేరియాను సమూలంగా తొలగిపోయేలా చేయాలి. దీన్నే ‘ర్యాడికల్ ట్రీట్మెంట్’ అంటారు. డాక్టర్ జి. నవోదయ సీనియర్ ఫిజీషియన్, జనరల్ మెడిసిన్ -
ఉత్తమాభిరుచికి మారుపేరు నవోదయ
ఒకప్పుడు బెజవాడ ఏలూరు రోడ్డంటే పుస్త కాల మక్కా. ‘ఏ పుస్తక మైనా సరే– ఏలూర్ రోడ్ ఛలో’ అనేవారు. తర్వాత అదే కారల్‌మార్క్స్ వీధిగా వాసికెక్కింది. అందులో నవోదయ బుక్ షాప్ ఒక ల్యాండ్ మార్క్! అర్ధ శతాబ్దిపాటు నవోదయ ఒక వెలుగు వెలిగింది. మంచి చరిత్ర ఉంది. తెలుగు ప్రాచీన గ్రంథాల ప్రచురణలో వావిళ్ల వారికున్న కీర్తిప్రతిష్టల్ని ఆధునిక సాహిత్య ప్రచురణలో నవో దయ గడించింది. నవోదయ రామమోహనరా వుగా పేరు తెచ్చుకున్న అట్లూరి 1934లో గన్న వరం తాలూకా ఉంగుటూరులో జన్మించారు. స్కూల్ ఫైనల్ దాకా చదువుకున్న రావుకి తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషలలో మంచి ప్రవేశం ఉంది. పుస్తకాల ప్రూఫ్‌లు దిద్దడంలో ఆయన నిక్కచ్చ యిన మనిషి. మొదట్లో నవోదయ అంటే కమ్యూ నిస్ట్ సాహిత్యమని పేరుండేది. తర్వాత్తర్వాత విలు వలున్న అభ్యుదయ రచనలకు అచ్చులు కల్పిం చారు. బాపురమణల స్నేహం దొరకడంతో నవో దయ అందమైన మలుపు తీసుకుంది. పుస్తకం సైజు, బాపు దిద్దిన ముఖచిత్రం, బాపు మార్క్ కోతి అక్షరాలు, ఇంకా ఎన్నో చిలవలు పలవలతో నవోదయ పబ్లికేషన్స్ పుస్తకాల మార్కెట్‌ని అలంకరించేవి. ఆ క్రమంలో ముళ్లపూడి వెంకట రమణ పుస్తకాలు గిరీశం లెక్చర్లు, రుణానందల హరి, బుడుగు విడివిడిగా బాపు రమణీయంగా వెలువడ్డాయ్. బాపు కార్టూన్ సంపు టాలు వెలువడి నవ్వులు పండిం చాయి. చాలామంది రచయితలు తమ పుస్తకాలు నవోదయ బ్యానర్‌పై వస్తే బాగుండునని కలలు కనేవారు. వీఆర్ నార్ల సీత జోస్యం, నండూరి రామ మోహనరావ్ విశ్వరూపం, నరావ తారం సి. రామచంద్రరావు వేలుపిళ్లై, శ్రీరంగం నారాయణ బాబు రుధిర జ్యోతి, ఆరుద్ర పుస్తకాలు నవోదయ పేరుకి పెద్ద పీట వేశాయి. పుస్తకాలు పెట్టిచ్చే కాగితం కవర్లమీద బాపు కొంటె బొమ్మలు చిత్రాతిచిత్రంగా ఉండేవి. కస్టమర్లు కవర్లని కూడా దాచుకొనేవారు. బాపు గీసిన ప్రతి గీతని, వేసిన ప్రతిగీతని వాడుకుని అందమైన గ్రీటింగ్ కార్డ్స్‌ని రూపొందించేవారు. నవోదయ షాపు ఎప్పుడు చూసినా ‘బాపు బొమ్మల కొలువులా’ పరిమళిం చేది. ఆ తర్వాతి కాలంలో సత్యం శంకరమంచి విరచిత అమరావతి కథలు బాపు రేఖా చిత్రాలతో రమణ ముందుమా టతో వెలువడి సంచలనం సృష్టించింది. ఇంద్ర గంటి హనుమచ్ఛాస్త్రి, శ్రీకాంత శర్మ, శ్రీరమణ ఇత్యాదులు నవోదయ ఆథర్స్. మీరంతా మా ఆధ రువులని రావు తరచూ చమత్కరిస్తుండేవారు. నవోదయకి గుంటూరులో కూడా అన్ని హంగులతో శాఖ వెలిసింది. అప్పటి గుంటూరు మెడికోలలో చాలామందికి నవోదయ స్టెత స్కోప్ లాంటిది. అప్పట్నించీ డాక్టర్ జంపాల చౌదరి నవో దయ అభిమానిగా ఉన్నారు. తానా సంస్థకి మూల స్తంభం. రామ్మోహనరావుపై చాలా చాలా ఇష్టం కొద్దీ రావు దంపతుల్ని ఒక తానా ఉత్సవా లకు గౌరవంగా రప్పించి సత్క రించారు. కడదాకా రావుగారి యోగక్షేమాలు తెలుసుకుంటూ, వైద్య సలహాలిస్తూ డాక్టర్ జంపాల నవోదయ రుణం తీర్చుకున్నారు. అప్పటి ఎమెస్కో యజమాని ఎమ్మెన్ రావు, పలు వురు ఢిల్లీ ప్రచురణ కర్తలు డా‘‘ రావుతో ఆత్మీ యంగా ఉండేవారు. గడచిన రెండు మూడు దశాబ్దాలలో జనరల్ బుక్స్ వైపు చూసేవారు తగ్గి పోయారు. దాంతోబాటే నవోదయ ప్రాభవం తగ్గుతూ వచ్చింది. దాదాపు ముప్ఫై ఏళ్లనాడు ‘విజయవాడ బుక్ ఫెయిర్’ ఒక మహోత్సవంగా జరగడానికి నవోదయ రామ్మోహనరావు కార కులు. కమ్యూనిస్ట్ భావాలు, హేతువాద తత్వం కలిగిన రావు ఎప్పుడూ ఎక్కడా రాజీ లేకుండానే 86 ఏళ్ల జీవితం గడిపారు. 1955లో పర్వతనేని ఝాన్సీ, నవోదయ రామ్మోహనరావు ఇష్టపడి వివాహమాడారు. ఝాన్సీ నవోదయ సంపాదించు కున్న ‘గుడ్‌విల్’కి కొమ్ముకాశారు. బాపు రమణ లకు నిత్యం ఒకసారైనా ఫోన్లో మాట్లాడక అయ్యేది కాదు. బాపు ముద్దుగా రావుని ‘మావో గారూ!’ అని పిలిచేవారు. ఆ త్రయం కనుమరు గైంది. తెలుగు అక్షరానికి పెద్ద లోటు. వ్యాసకర్త : శ్రీరమణ, ప్రముఖ కథకుడు -
ఫలితం.. జాప్యం!
కడప ఎడ్యుకేషన్: కేంద్ర ప్రభుత్వ విద్యాలయ ప్రవేశంలో భాగంగా జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షను జిల్లావ్యాప్తంగా ఏప్రిల్ 21వ తేదీన నిర్వహించారు. పరీక్ష నిర్వహించి రెండు నెలలు దాటినా నేటికీ çఫలితాలు విడుదల కాకపోడవంతో వేలమంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కావస్తున్నా నేటికి నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాలు రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. నవోదయ పాఠశాలలో సీటు వస్తుందా లేక బయట స్కూల్స్‌లో చేర్చాలా అనే సందిగ్ధంలో విద్యార్థుల తల్లిదండ్రులు కొట్టుమిట్టాడుతున్నారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ కలిగిన నిరుపేద విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం మానవ వనరుల మంత్రిత్వశాఖ పరిధిలో జిల్లాలోని రాజంపేట మండలం నారమరాజుపల్లెలో జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటు చేశారు. ఇందులో ఐదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ఆరో తరగతిలో 80 సీట్ల ప్రవేశం కోసం ప్రతి ఏటా ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఎస్సీకి 14 శాతం, ఎస్టీకి 7.5 శాతం, దివ్యాంగులకు 3 శాతం సీట్లు ఉండగా జనరల్‌కు 60 సీట్లు, మిగతా 20 శాతం పట్టణ ప్రాంతాలకు సీట్లను కేటాయించారు. ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు 12వ తరగతి వరకు వసతితో కూడిన విద్యనందిస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ 21న జిల్లాలో 21 కేంద్రాల్లో పరీక్షను నిర్వహించగా మొత్తం 5779 మందికి గాను 4731 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. రెండు నెలలు పూర్తి అయినా పరీక్ష నిర్వహించి రెండు నెలలు దాటినా నేటికి ఫలితాలరె విద్యాలయ సమితి వెల్లడించకపోవడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎదురు చూడటంతోపాటు ఆందోళన చెందుతున్నారు. 80 సీట్లు భర్తీ చేసేందుకు నిర్వహించిన పరీక్ష పోటీ బాగా ఉండటంతో సీటు ఎవరికి వస్తుందో ఏయే ప్రాతిపధికన ప్రవేశం ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ఫలితాలను వెల్లడించిన అనంతరం వివిధ ధ్రువీకరణ పత్రాల కోసం మరి కొంతకాలం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఫలితాలను విడుదల చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. త్వరలో రావొచ్చు పరీక్ష ఫలితాల కోసం విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్న మాట వాస్తవమే. ఇందుకు సంబంధించిన ఫలితాల కోసం విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి మాకు ఫోన్స్ వస్తున్నాయి. మేము కూడా ఫలితాల కోసం ఫాలప్ చేస్తున్నాం. త్వరలో ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.– కేకే సురేష్‌బాబు, జవహర్ నవోదయ ప్రిన్సిపల్, నారమరాజుపల్లె -
నవోదయం.. జాప్యం
వర్గల్(గజ్వేల్) : జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష(జేఏన్‌వీఎస్‌టీ–2018) ఫలితాల వెల్లడిలో అంతులేని జాప్యం కొనసాగుతోంది. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఫలితాల జాడ లేదు. ఈక్రమంలో ఫలితాల కోసం వేచి చూడాలా? లేక ప్రైవేటు స్కూళ్లలో చేర్పించాలా? అనే సందిగ్ధంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు. ఫలితాలపై ఆరా తీసే వారికి నవోదయ వర్గాలు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నాయి. ఉమ్మడి జిల్లా(మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట) వ్యాప్తంగా ఆరో తరగతిలో కేవలం 80 సీట్లకు గాను సగటున ఒక్కో సీటుకు 100 మంది చొప్పున పోటీపడుతూ మొత్తం 8,456 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 6,623 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఈ లెక్కలే తల్లిదండ్రుల్లో నవోదయపై ఉన్న క్రేజ్‌ను స్పష్టం చేస్తుంది. ఎంట్రన్స్ నిర్వహణకు సంబంధించి సీబీఎస్ఈతో నవోదయ విద్యాలయ సమితి టైఅప్ అయ్యింది. దీని ప్రకారం ప్రవేశ పరీక్షను నవోదయ విద్యాలయ సమితి అధికారులు నిర్వహించగా, సీబీఎస్ఈ అధికారులు ప్రశ్నపత్రాలను వాల్యూయేషన్ చేసి ఫలితాలు వెల్లడిస్తారు. అక్కడి నుంచే మెరిట్, రిజర్వేషన్ప్రకారం ప్రవేశార్హత సాధించిన 80 మంది విద్యార్ధుల పేర్లతో కూడిన జాబితా విడుదల అవుతుంది. దీని ఆధారంగా ఆయా జిల్లాలలోని నవోదయ విద్యాలయాలు ఫలితాలు రిలీజ్ చేస్తాయి. ఆలస్యంగా ఎంట్రన్స్ పరీక్ష సాధారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని నవోదయ విద్యాలయాల్లో ఏటా ఫిబ్రవరి 10న ఎంపిక పరీక్ష నిర్వహిస్తారు. అదేవిధంగా 2018 విద్యా సంవత్సరం కోసం వర్గల్ జవహర్ నవోదయ విద్యాలయలో ఆరో తరగతిలో ప్రవేశం పొందేందుకు ఫిబ్రవరి 10న ఎంట్రస్ పరీక్ష జరుగుతుందని ప్రాస్పెక్టస్‌లో స్పష్టం చేశారు. ఏప్రిల్ లేదా మే మొదటి వారంలో ఎంట్రన్స్ ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. దరఖాస్తుల స్వీకరణ సరళీకరణ కోసం మాన్యువల్ పద్ధతికి స్వస్తి చెప్పి ఆన్లైన్ విధానం అమల్లోకి తీసుకొచ్చారు. అయితే, నిర్దేశిత ప్రణాళికకు అనుగుణంగా అధికారులు ఎంట్రన్స్ నిర్వహించలేదు. నూతన విధానంలో దరఖాస్తుల సమర్పణ, సాంకేతిక సమస్యలు తలెత్తడం, కొత్త విధానానికి అనుగుణంగా సీబీఎస్ఈ ప్రణాళిక రూపొందించుకోకపోవడం తదితర కారణాలు ఎంట్రన్స్ పరీక్ష వాయిదాకు దారి తీశాయి. సాంకేతిక కారణాలు గా చూపుతూ ఫిబ్రవరి 10న నిర్వహించాల్సిన పరీక్షను నిరవదికంగా వాయిదా వేస్తున్నట్టు నవోదయ విద్యాలయ సమితి ప్రకటించింది. దా దాపు రెండున్నర నెలలు ఆలస్యంగా ఏప్రిల్ 21న ఎంపిక పరీక్ష నిర్వహించారు. దీంతో రిజల్ట్ వెల్లడిలో అంతులేని తాత్సారం కొనసాగుతోంది. జూ న్ ముగిసినా ఎంట్రన్స్ ఫలితాలు రాకపోవడంతో సీబీఎస్ఈ వైఫల్యంపై విమర్శలువస్తున్నా యి. అంతా అయోమయం ప్రవేశ పరీక్ష ఫలితాల వెల్లడి కాకపోవడంతో తల్లిదండ్రులు అయోమయానికి గురవుతున్నారు. నవోదయ పాఠశాలలో తమ పిల్లలను చేర్పిస్తే ఫీజుల భారం తగ్గుతుందని, నాణ్యమైన విద్యతో పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని భావించిన వారి ఆశలు అడియాసలు అవుతున్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభమై నెలరోజులవుతున్నా ఫలితాలు జాడలేకపోవడంతో ఆర్థిక స్తోమత కలిగిన తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఆర్థిక స్తోమత లేని వారు మాత్రం ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉన్నారు. గిట్లయితే నవోదయ పేరు చెడిపోతది మేము పేదోళ్లం. నవోదయల సదువుకుంటే పిల్లల భవిష్యత్తు బాగుపడుతదని నమ్మకం. ఐదో తరగతి చదువుతుండగానే మా కొడుకుతోని నవోదయ పరీక్ష రాయించిన. సీటొస్తే ఫీజుల బాధ పోతది. బాగ చదువొస్తదనుకున్న. నమ్మకంగా సీటొస్తదనుకుంటే బడులు మొదలై నెలరోజులు దాటినా రిజల్ట్ వస్తలేదు. గిట్లయితే నవోదయ పేరు ఖరాబైతది. నమ్ముకం పోతది. బిరాన రిజల్ట్ పెడితే అయోమయం పోతది. – అశోక్, నెంటూరు ఫలితాల్లో జాప్యం వాస్తవమే.. నవోదయ ఎంట్ర¯Œస్ట్ టెస్ట్ ఫలితాల్లో జాప్యం జరుగుతున్న మాట వాస్తవమే. సీబీఎస్ఈ ఫలితాల జాబితా పంపిన వెంటనే విడుదల చేస్తాం. ఆన్లైన్ నేపథ్యంలో ఫిబ్రవరి 10న జరగాల్సిన పరీక్ష ఏప్రిల్ 21కి వాయిదా పడింది. రిజల్ట్స్ కోసం తల్లిదండ్రుల నుంచి పెద్ద సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయి. జూలై మొదటి వారంలోగా రిజల్ట్స్ వస్తాయనుకుంటున్నాం. ఫలితాలు వెల్లడి కాగానే వెంటనే పత్రికల ద్వారా విడుదల చేస్తాం. తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దు. – వెంకటరమణ, ప్రిన్సిపాల్, వర్గల్ నవోదయ -
ఫలితాల కోసం నిరీక్షణ
జనగామ అర్బన్: నవోదయ, గురుకుల విద్యాసంస్థల్లో అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించినా ఫలితాలు ఇంకా విడుదల కాలేదు. ఒక వైపు నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ప్రైవేట్ పాఠశాలల్లో సిలబస్ శరవేగంగా దూసుకెళ్తోంది. దీంతో అడ్మిషన్ టెస్ట్ రాసిన విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నవోదయ ప్రవేశ పరీక్షను నిర్వహించి దాదాపు రెండు నెలలు, గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్ల కొరకు పదిహేను రోజుల క్రితం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఫలితాలు విడుదల చేయడంలో అధికారులు తాత్సారం చేస్తుండడంతో విద్యార్థులు కలవరపాటుకు గురవుతున్నారు. మరోవైపు గతంలో చదివిన ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాల నుంచి అడ్మిషనతోపాటు బుక్స్, యూనిఫామ్స్ కొనుగోలు చేయాలని ఒత్తిడి వస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. నాణ్యమైన విద్య అందుతుందనే ఉద్దేశంతో నవోదయ, గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్లు కోసం తమ పిల్లలతో పరీక్ష రాయించిన తల్లిదండ్రులు ఫలితాలు రాకపోవడంతో ఏమి చేయాలో తోచక దిక్కులు చూస్తున్నారు. నవోదయకు 9700 మంది హాజరు.. 2018-19 విద్యా సంవత్సరానికి గాను నవోదయ పాఠశాలలో ఆరో తరగతిలోని 80 సీట్లకు నోటిఫికేషన్ వేయగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వ్యాప్తంగా 12,079 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు మొత్తం 54 కేంద్రాలలో ఏప్రిల్ 21న ప్రవేశ పరీక్ష నిర్వహించగా 9700 విద్యార్థులు హాజరయ్యారు. గురుకుల ప్రవేశ పరీక్షకు 6144 మంది.. జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలో 6, 7, 8, 9 తరగతుల్లో ఉన్న ఖాళీ సీట్ల కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొమ్మిది సెంటర్లలో అడ్మిషన్ టెస్ట్ నిర్వహించారు. వరంగల్ రూరల్, అర్బన్ జిల్లాలోని ఐదు కేంద్రాల్లో 4087 మంది, జయశంకర్, జనగామ, మహబుబాబాద్ జిల్లాల్లోని నాలుగు కేంద్రాల్లో 2057 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. నవోదయ, గురుకుల పాఠశాల రెండింటిలో అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్షలు రాసిన విద్యార్థులు సైతం కొందరు ఉన్నారు. -
రేపు నవోదయ 9వ తరగతి ప్రవేశ పరీక్ష
ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు.. గంట ముందే కేంద్రానికి చేరుకోవాలన్న ప్రిన్సిపాల్ పెద్దాపురం : జవహార్ నవోదయ విద్యాలయలో 9వ తరగతి ప్రవేశానికి ఈ నెల 24న ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ వి.మునిరామయ్య తెలిపారు. గురువారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాదుతూ జిల్లాలోని సుమారు 272 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారన్నారు. జిల్లావ్యాప్తంగా పెద్దాపురం నవోదయ విద్యాలయలోనే పరీక్ష జరుగుతుందని, విద్యార్థులు ఉదయం 9 గంటలకు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని పేర్కొన్నారు. హాల్ టిక్కెట్లు విద్యార్థులందరికీ పోస్టు ద్వారా పంపామని, ఏ కారణం చేతనైనా అందని విద్యార్థులు నేరుగా పరీక్షా కేంద్రానికి ఒక అటెస్టెడ్ పాస్‌పోర్టు సైజు ఫోటో తీసుకుని 23 సాయంత్రం లోగా నవోదయ విద్యాలయలో సంప్రదించి డూప్లికేట్ హాల్ టికెట్ పొందాలని సూచించారు. పరీక్ష ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ బందోబస్తు సహా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ప్రవేశ పరీక్షపై ఎటువంటి సమాచారం కోసమైనా 08852–241354 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. -
ఎదురు చూడాలా? ఎక్కడైనా చేరాలా?
-‘నవోదయ’ ప్రవేశపరీక్ష రాసిన విద్యార్థుల సందిగ్ధం -ఐదు నెలలైనా వెల్లడి కాని ఫలితాలు -ఏటా బడులు తెరిచే నాటికే విడుదల రాయవరం (మండపేట) : జవహర్ నవోదయ విద్యాసంస్థలో ఆరో తరగతిలో ప్రవేశానికి పరీక్ష నిర్వహించి ఐదు నెలలు కావస్తోంది. ఫలితాలు విడుదలైతే నవోదయలో చేరుదామనే ఆశతో వేలాదిమంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో తల్లిదండ్రులు తమ చిన్నారులను ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చేర్పించేందుకు సిద్ధమవుతున్నారు. నవోదయ పరీక్ష రాసిన పిల్లల తల్లిదండ్రులు కూడా ఫలితాల కోసం ఆదుర్దాగా నిరీక్షిస్తున్నారు. బిడ్డలు నవోదయలో సీటు సాధిస్తే సరేసరి, లేకుంటే వేరే స్కూళ్లో చేర్చడానికైనా ఫలితాలు వస్తే బాగుండుననుకుంటున్నారు. పల్లెల్లోని ప్రతిభావంతుల కోసం.. గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ అధునాతన విద్యావిధానాన్ని అందించడం కోసం 1986లో రూపొందించిన జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి కేంద్ర ప్రభుత్వం జవహర్ నవోదయ విద్యాలయాలను ప్రారంభించింది. ఈ పాఠశాలల్లో విద్యనభ్యసించే చిన్నారులకు హిందీ, ఇంగ్లిష్, తెలుగు భాషల్లో నాణ్యమైన విద్యనందిస్తారు. ఈ పాఠశాలలో 6వ తరగతిలో ప్రవేశానికి పరీక్ష రాసి ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు మాత్రమే అవకాశం లభిస్తుంది. 6వ తరగతిలో పరిమితంగా 80 సీట్లే ఉండడంతో అంతే మంది విద్యార్థులను చేర్చుకుంటారు. దీనికి సంబంధించిన ప్రవేశ పరీక్ష ఈ ఏడాది జనవరి 8న నిర్వహించారు. జిల్లాలో 80 సీట్లకు 64 కేంద్రాల్లో 13,600 మంది ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. పాఠశాలల పునఃప్రారంభం నాటికి పరీక్ష ఫలితాలు విడుదల కాలేదు. గతేడాది పాఠశాలల ప్రారంభ సమయానికి ఫలితాలు విడుదలయ్యాయి. ఆలోచనలో తల్లిదండ్రులు.. గత సోమవారం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఐదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఆరవ తరగతిలో ఎక్కడ చేర్పించాలోనన్న ఆలోచనలో పడ్డారు. నవోదయ పరీక్ష రాసిన విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. ప్రైవేటు పాఠశాలల్లో వేలకు వేలు ఫీజులు చెల్లించి తమ చిన్నారులను చేర్చిన అనంతరం నవోదయలో సీటు వస్తే పత్రాలు తీసుకోవడానికి ఇబ్బందులు పడాల్సి వస్తుందని తల్లిదండ్రులు వాపోతున్నారు. పరీక్ష రాసి ఐదు నెలలైనా.. నేటికీ ఫలితాలు విడుదల కాకపోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. సంబంధిత అధికారులు ఇప్పటికైనా వీటి ఫలితాల విడుదలకు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఫలితాలు రాక సందిగ్ధం పాఠశాలల పునఃప్రారంభం నాటికే నవోదయ ఫలితాలు విడుదల చేస్తే ప్రయోజనం ఉంటుంది. మా పాప లీలామాధురి నవోదయ ఎంట్రెన్స్ పరీక్ష రాసింది. ఐదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించింది. వేరే పాఠశాలలో చేర్పించాలా, వద్దా అనే మీమాంసలో ఉన్నాం. – కన్నూరి అర్జునుడు, టీచర్, రాయవరం ఇంత ఆలస్యం అనుచితం.. నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాలు ముందుగానే విడుదల చేసేవారు. ఈ ఏడాది బాగా ఆలస్యం అయిందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఏ పాఠశాలలో చేర్పించాలో నిర్ణయించుకోలేక పోతున్నారు. ఫలితాలు త్వరితగతిన విడుదల చేస్తే మంచిది. – పి. సుబ్బరాజు, అధ్యక్షుడు, ఎస్టీయూ -
ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్షలు
హిందూపురం అర్బన్ : నవోదయ పాఠశాలల్లో ప్రవేశం కోసం ఆదివారం జిల్లావ్యాప్తంగా 17 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు సుమారు 7 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. హిందూపురం నియోజవర్గంలో 623 మంది పరీక్ష రాశారు. హాల్‌టికెట్లు పొందిన వారిలో 47 మంది గైర్హాజరయ్యారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఎంజీఎం ఉన్నత పాఠశాలలో ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్షలు జరిగాయి. పరీక్షా కేంద్రాలను ఎంఈఓ గంగప్ప పరిశీలించారు. పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. -
నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయండి
► కొత్త జిల్లాల కోసం ప్రకాశ్ జవదేకర్‌ను కోరిన కడియం ► కేజీబీవీల్లో 12వ తరగతి వరకు విద్యనందించండి ► సర్వశిక్ష అభియాన్ నిధులు విడుదల చేయండి ► జిల్లాకు ఒకటి చొప్పున డైట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో జిల్లాకొకటి చొప్పున నవోదయ, కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు ఉప ముఖ్య మంత్రి మంత్రి కడియం శ్రీహరి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మరిన్ని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలను ఏర్పాటు చేయాలని, వాటిల్లో 12వ తరగతి వరకు విద్యను అందించాలని కోరారు. మంగళవారం టీఆర్ఎస్ ఎంపీలు జితేందర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి, సీతారాం నాయక్, జి.నగేశ్, బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్లతో కలసి కడియం శ్రీహరి ఢిల్లీలో కేంద్ర మంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సర్వశిక్షా అభియాన్ నుంచి రాష్ట్రానికి రావా ల్సిన నిధులు, కస్తూర్బా పాఠశాలల ఏర్పాటుపై చర్చించారు. రాష్ట్రంలో మండ లాల సంఖ్య కూడా పెరగడంతో విద్యాప రంగా వెనుకబడిన 110 మండలాల్లో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలు ఏర్పాటు చేయాలని జవదేకర్‌ను కోరారు. అనంతరం ఎంపీలతో కలసి కడియం మీడియాతో మాట్లాడారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే కొత్త కస్తూర్బా గాంధీ పాఠశాలలను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరినట్టు తెలిపారు. కస్తూర్బా పాఠశాలల్లో 8వ తరగతి వరకే కేంద్ర ప్రభుత్వం ఖర్చు భరిస్తోందని.. 9, 10వ తరగతుల విద్యార్థుల ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందని తెలిపారు. ఈ పాఠశాలలు మంచి ఫలితాలను సాధిస్తుండడంతో కేంద్ర సాయాన్ని 12వ తరగతి వరకు అందించాలని కోరామన్నారు. బాలికల విద్యకు ఇది దోహదపడుతుందని, బేటీ బచావో బేటీ పఢావోకు తోడ్పడుతుందని వివరించామని కడియం తెలిపారు. ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున టీచర్ ట్రైనింగ్ కేంద్రా (డైట్)లను మంజూరు చేయాలని కోరామన్నారు. అధికారులతో భేటీ... అనంతరం కేంద్ర మానవ వనరుల శాఖ కార్యదర్శితో కడియం, రాష్ట్ర విద్యాశాఖ ఉన్న తాధికారులు భేటీ అయ్యారు. మాధ్యమిక శిక్షా అభియాన్, సర్వశిక్షా అభియాన్ల కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారు. దీనిపై స్పందించిన మానవవనరులశాఖ కార్యదర్శి తెలంగాణకు రూ.500 కోట్లు విడుదల చేసేలా అధికారులకు ఆదేశాలి చ్చారని కడియం తెలిపారు. నిధులు విడుదల చేయండి.. సర్వశిక్షా అభియన్ కింద 2016-17కుగాను కేంద్రం ఇప్పటి వరకు కేవలం రూ. 217 కోట్లే విడుదల చేసిందని చెప్పారు. కానీ టీచర్ల జీతాల చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.915 కోట్లు చెల్లించాల్సి ఉందని.. కేంద్రం నిధుల విడుదలలో చేస్తున్న జాప్యం వల్ల టీచర్లకు జీతాలు అందని పరిస్థితి ఏర్పడుతుందని స్పష్టం చేశామని తెలిపారు. ఆయా అంశాలన్నింటిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని కడియం వెల్లడించారు. నవోదయ, కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుపై చర్యలు తీసుకుంటామని, సర్వశిక్షా అభియన్ నిధుల విడుదలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. దేశంలో 20 విద్యాలయాలకు ప్రపంచ స్థాయి విద్యాలయాల గుర్తింపు ఇచ్చేందుకు కేంద్రం ప్రతిపాదించిన నేపథ్యంలో... హైదరాబాద్‌లోని ఐఎస్బీ, ట్రిపుల్ ఐటీ, హైదరాబాద్ యూనివర్సిటీలు దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర మంత్రి సూచించారని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. -
21 నుంచి పెద్దాపురంలో ఎన్సీసీ శిబిరం
పెద్దాపురం : దేశ సమైక్యతను చాటే విధంగా పెద్దాపురం జవహర్ నవోదయ విద్యాలయలో జాతీయస్థాయి ఎన్సీసీ ప్రత్యేక శిక్షణ శిబిరం (స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంపు–2016) నిర్వహిస్తున్నట్టు ఎన్ఎస్ఎస్ కాకినాడ గ్రూపు కమాండర్ కల్నల్ ఎల్సీఎస్ నాయుడు తెలిపారు. విద్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 21 నుంచి 12 రోజుల పాటు విద్యాలయంలో శిబిరం జరుగుతుందన్నారు. 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 300 మంది సీనియర్ ఎన్సీసీ క్యాడెట్లు హాజరవుతారన్నారు. శారీరక శిక్షణ, యోగా, వ్యక్తిగత పోటీలు, విజ్ఞాన పర్యాటకాలు, మోటివేషన్ ఉపన్యాసాలు, సామాజిక సేవ తదితర అంశాలపై శిక్షణ ఇస్తామన్నారు. సమావేశంలో క్యాంపు డిప్యూటీ కమాండర్ లెఫ్టనెంట్ కల్నల్ నివేష్ ఎ షాల్వీ, ఎన్సీసీ అధికారులు పాల్గొన్నారు. -
క్లస్టర్స్ గేమ్స్‌లో జిల్లా నెంబర్‌వన్
నిజాంసాగర్ : రెండు రోజుల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర నవోదయ క్లస్టర్స్ గేమ్స్‌లో నిజామాబాద్ జిల్లా జవహార్ నవోదయ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించారు. బాలబాలికలకు కబడ్డీ, ఖోఖో, క్రికెట్, చెస్, టేబుల్‌టెన్నీస్, యోగా, రోప్స్కిప్పింగ్లో పోటీలు నిర్వహించారు. ఆయా విభాగాల్లో ఉ త్తమ ప్రతిబ కనబర్చి, రీజనల్ క్రీడలకు నిజామాబాద్ నుంచి 66 మంది విద్యార్థులు ఎంపికై, క్లస్టర్ స్థాయిలో గెలిచి జిల్లాను నంబర్‌వన్‌గా నిలిపారు. అలాగే మహబూబ్‌నగర్ నవోదయ విద్యాలయం నుంచి 28 మంది విద్యార్థులు రీజనల్ క్రీడలకు ఎంపికై, క్లస్టర్ గేమ్స్‌లో రెండో స్థానంలో నిలిచారు. శుక్రవారం సాయంత్రం నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయం లో ముగింపు కార్యక్రమం నిర్వహించారు. విజేతలకు నవోద య ప్రిన్సిపాల్ శేఖర్‌బాబు, పూర్వ విద్యార్థుల చేతుల మీదుగా షీల్డ్‌లు అందజేశారు. తెలంగాణ నవోదయ విద్యాలయల నుంచి 310 మంది విద్యార్థుల క్లస్టర్స్ గేమ్స్‌లో పాల్గొన్నారు. అందులో నుంచి 232 మంది విద్యార్థులు రీజనల్ క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 23, 24 తేదీల్లో కేంద్రీయ నవోదయ విద్యాలయ సమితి అధ్వర్యంలో రీజినల్ క్రీడలు జరుగుతాయి. క్లస్టర్ గేమ్స్‌లో సేవలందించిన పీఈటీలకు, టీచర్లకు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో నవోదయ వైస్ ప్రిన్సిపాల్ శోభనవల్లి, ఉపాధ్యాయులు శేషు పీఈటీలు బాబురావ్, నిరుపారాణి పూర్వ విద్యార్థులు నాగేందర్ తదితరులున్నారు. -
నాణ్యమైన విద్యకు నవోదయం
కలిదిండి : గ్రామీణ విద్యార్థులకు మెరుగైన విద్యనందించి ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఏర్పాటు చేసిన జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2017–18 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ‘జేఎన్‌వీఎస్’ సెలక్షన్ టెస్ట్–2017 పేరుతో ప్రకటన జారీ చేసింది. జిల్లాలోని వేలేరులో జవహర్ నవోదయ విద్యాలయంలో సీట్లను ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హత..... జిల్లాలో నివాసం ఉండే విద్యార్థులే అర్హులు. విద్యార్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఐదో తరగతి చదువుతూ ఉండాలి. విద్యార్థి మే 1, 2004 నుంచి ఏప్రిల్ 30, 2008 మధ్య కాలంలో జన్మించి ఉండాలి. ఈ నిబంధన ఎస్సీ, ఎస్టీలతో పాటు అన్ని వర్గాలకు వర్తిస్తుంది. 2016–17లో ఐదో తరగతిలో ఉత్తీర్ణత సాధిస్తేనే 2017–18లో నవోదయ విద్యాలయంలో ప్రవేశం కల్పించనున్నారు. సీట్ల కేటాయింపు.. గ్రామీణ ప్రాంత విద్యార్థుకు 75 శాతం సీట్లు, 25 శాతం పట్టణ ప్రాంత విద్యార్థులతో భర్తీ చేస్తారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల కోటాలో సీట్లు పొందాలంటే సంబంధిత ప్రాంతాల్లో విద్యార్థి 3,4,5 తరగతులు చదివి ఉండాలి. రిజర్వేషన్... మొత్తం సీట్లలో 15 శాతం ఎస్సీలకు, 7.5 శాతం ఎస్టీలకు, 1/3 వంతు బాలికలకు, 3 శాతం సీట్లు దివ్యాంగులతో భర్తీ చేస్తారు. ఎంపిక ... విధానం ఒక్కసారి ప్రవేశ పరీక్షకు హాజరైన వారు రెండోసారి రాసేందుకు అనర్హులు. ప్రవేశ పరీక్షలో ఎంపికైన విద్యార్థులు ప్రవేశానికి ముందే జూలై, 2017 లోపు నవోదయ విద్యాసమితి నియామవళిలో తెలిపిన విధంగా సంబంధిత ధ్రువీకరణ పత్రాలు అందించాలి. పూరించిన దరఖాస్తులు సంబం«ధిత పాఠశాల హెచ్ఎం ద్వారా ఎంఈవోలకు సమర్పించాలి. ప్రవేశపరీక్షలో విద్యార్థి పొందిన మార్కులు (ఎంపికైనా, కాకున్నా) తెలియజేయరు. జవాబు పత్రాలు తిరిగి పరిశీలించడానికి, తిరిగి మార్కులు లెక్కించడానికి అవకాశం ఉండదు. 8వ తరగతి వరకు మాతృభాషలో బోధిస్తారు. విద్యార్థులు 10, 12 తరగతి పరీక్షలు సీబీఎస్సీ సిలబస్ చదవాల్సి ఉంటుంది. పరీక్ష వి«ధానం... రెండు గంటల వ్యవధిలో ఉండే ఈ పరీక్షలో మూడు విభాగాలుంటాయి. మొత్తం వంద మార్కులకు వంద ప్రశ్నలుంటాయి. ప్రశ్నపత్రం తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో ఉంటుంది. ముఖ్యమైన తేదీలు.. దరఖాస్తులు అందించాల్సిన చివరి తేదీ : 16–09–2016, ప్రవేశ పరీక్ష తేదీ : 08–01–2017, పరీక్ష ఫలితాలను 2017 మే నెలలో విడుదల చేస్తారు. దరఖాస్తులు వేలేరు నవోదయ విద్యాలయం, అన్ని డీఈవో, ఎంఈవోల వద్ద ఉచితంగా లభిస్తాయి. వెబ్సైట్ www.navodya.nic.in, www.navodyagov.in దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయి. ప్రయోజనాలు ఇలా.... ఒకసారి ప్రవేశం పొందిన విద్యార్థులు 12వ తరగతి వరకూ చదివేందుకు అవకాశం కల్పిస్తారు. బాలబాలికలకు విడిగా వసతి ఉంటుంది. బోధనతోపాటు వసతి, ఆహారం, పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫాం ఉచితంగా అందిస్తారు. క్రీడలు, యోగా, ఎస్సీసీ, సంగీతం, చిత్రకళ తదితర రంగాల్లో శిక్షణ ఇస్తారు. కంప్యూటర్ విద్యతోపాటు, వీశాట్, ఎడ్యుసొసైటీ కనెక్టవిటీ, లైబ్రరీ, ఇంటర్నెట్ సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. -
నవోదయ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం
మామునూరు : వరంగల్ జవహర్ నవోదయ విద్యాలయంలో 2017–18 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలోకి ప్రవేశం కోసం 5వ తరగతి విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ పడాల సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు . జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పారు. జిల్లాలోని ఆయా మండల కేంద్రాల్లోని ఎంఈఓ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దరఖాస్తు ఫారాలను అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. పూర్తిచేసిన ప్రవేశపరీక్ష దరఖాస్తులు సెప్టెంబర్ 16వ తేదీ వరకు ఆయా మండల కేంద్రాల్లోని విద్యాశాఖ కార్యాలయం లో, లేక మామునూరు నవోదయ విద్యాలయంలో అందజేయాల న్నారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న పరీక్ష కేంద్రాల్లో 2017 జనవరి 8వ తేదీన అర్హత పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
విద్యార్థుల భవితకు.. ‘నవోదయం’
2017–18 విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్ విడుదల ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం సెప్టెంబరు 16 వరకు దరఖాస్తుల స్వీకరణ వచ్చే ఏడాది జనవరి 8న ప్రవేశ పరీక్ష జవహర్ నవోదయ విద్యాలయం.. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యనందించేందుకు 1986లో దీనిని ఏర్పాటు చేశారు. ఉత్తమ విలువలతో బోధన.. విద్యా ప్రమాణాల మెరుగు.. క్రీడా ప్రతిభను వెలికి తీయడంతో పాటు సమైక్యతా భావం పెంపొందించడం.. వంటి కార్యక్రమాలు సాధారణంగా ఇక్కడ అమలవుతుంటాయి. దేశవ్యాప్తంగా 598 నవోదయ విద్యాలయాలు ఉండగా.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 15 ఉన్నాయి. 2017–18 విద్యా సంవత్సరానికి ఆరోతరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియేట్ వరకు ఇక్కడ ఉచిత విద్యనందిస్తారు. ఈ పరీక్షకు ఎవరు అర్హులు, పరీక్షా విధానం, రిజర్వేషన్ తదితర వివరాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. – రాయవరం ఒక్కసారే అవకాశం.. వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించే పరీక్షలో అర్హత సాధించిన వారికి విద్యాలయంలోకి ప్రవేశం కల్పిస్తారు. వచ్చే నెల 16వ తేదీ లోపు అన్ని మండల, జిల్లా విద్యాశాఖ కార్యాలయాలతో పాటు నేరుగా పెద్దాపురం నవోదయ విద్యా సంస్థలో దరఖాస్తులు పొందవచ్చు. మొత్తం 80 సీట్లు ఉంటాయి. ఆరో తరగతిలో ప్రవేశానికి ప్రస్తుతం ఆయా మండలాల్లో ఐదో తరగతి చదువుతున్న బాలబాలికలు అర్హులు. ఈ ప్రవేశ పరీక్షకు ఒక్కసారి మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంది. అర్హతలు ఇలా.. 2016–17 విద్యా సంవత్సరంలో నిర్వహించే ప్రవేశ పరీక్షకు హాజరయ్యే బాలబాలికలు 2004 మే ఒకటో తేదీ నుంచి 2008 ఏప్రిల్ 30 మధ్య జన్మించి ఉండాలి. ప్రభుత్వం గుర్తించిన పాఠశాలల్లో 3, 4 తరగతులు ఉత్తీర్ణత సాధించి ఐదో తరగతి చదువుతున్న వారు మాత్రమే అర్హులు. గతేడాది ప్రవేశ పరీక్షకు హాజరైన వారు అనర్హులు. రిజర్వేషన్ విధానం.. నవోదయలో ప్రవేశానికి రిజర్వేషన్ విధానం అమలవుతుంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 75 శాతం, పట్టణ ప్రాంత విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయిస్తారు. షెడ్యూల్ కులాలకు 15 శాతం, షెడ్యూల్ తరగతులకు 7.5 శాతం, దివ్యాంగులకు మూడు శాతం రిజర్వేషన్ ఉంది. వసతులు.. బాలబాలికలకు ప్రత్యేక వసతి గృహాలు, అర్హత అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉంటారు. శాస్త్ర, సాంకేతికతతో కూడిన విద్య, క్రీడలు, యోగా ద్వారా విద్యార్థికి సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం కల్పిస్తారు. ఉచిత వసతి, భోజనం, పాఠ్యపుస్తకాలు, నోట్సులు, ఇంటర్నెట్ తదితర సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకు నామమాత్రపు రుసుం నెలకు రూ.200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. దరఖాస్తులు పొందండిలా.. అన్ని మండలాల్లో మండల విద్యాశాఖాధికారుల వద్ద, సర్వశిక్షాఅభియాన్ కార్యాలయం, జిల్లా విద్యాశాఖ కార్యాలయాల్లో, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో లభ్యమవుతాయి. నవోదయ వెబ్సైట్ జ్టి్టp://n్చఠిౌఛ్చీy్చజిyఛీ.జౌఠి.జీn, ఠీఠీఠీ.n్చఠిౌఛ్చీy్చ.nజీఛి.జీnలో కూడా దరఖాస్తులు పొంద వచ్చు. పూర్తి చేసిన దరఖాస్తులను సెప్టెంబరు 16లోపు సంబంధిత మండల విద్యాశాఖాధికారులకు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు లేదా పెద్దాపురం నవోదయ విద్యాలయంలో అందజేయవచ్చు. పరీక్షా విధానమిది.. నవోదయ ప్రవేశ పరీక్షను వచ్చే ఏడాది జనవరి 8న ఉదయం 11.30గంటలకు జిల్లాలో నిర్దేశించిన పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్షను విద్యార్థులు ప్రస్తుతం చదువుతున్న భాషను(తెలుగు/ఇంగ్లిష్) ఎంచుకొని పరీక్ష రాసే వీలుంది. ప్రవేశ పరీక్షలు 100 ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కులకు నిర్వహించే ప్రవేశ పరీక్ష రాసేందుకు రెండు గంటల సమయాన్ని కేటాయిస్తారు. మూడు విభాగాల్లో ప్రశ్నలు కేటాయిస్తారు. మేధాశక్తిపై 50 ప్రశ్నలు, గణితం, తెలుగు భాషపై ఒక్కొక్క విభాగానికి 25 ప్రశ్నలు వంతున 50 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా పత్రాల రూపకల్పన నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) నిర్వహిస్తుంది. ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులై ప్రవేశానికి ఎంపికైన వారికి మొదటి రెండు సంవత్సరాలు తెలుగు/ఇంగ్లిష్ భాషల్లో బోధిస్తారు. అనంతరం ఇంగ్లిష్‌లోనే బోధన చేస్తారు. -
మూతపడిన పుస్తకం-నవోదయ
అక్షర తూణీరం వారి ఆధరువులు (ఆధర్స్ని రా. రావు ఇలా అనేవారు) కాక పోయినా ఎందరో మహనీయులు నవోదయతో ఆత్మీయంగా ఉండేవారు. ఇందులో శ్రీశ్రీ, ఆరుద్ర, కాళీపట్నం కొన్ని శాంపిల్స్. ఒక ఘన చరిత్ర, నవోదయ అంటే మంచి అభిరుచి. నవోదయ అంటే ఒక సంప్రదాయం. ఒక సరదా. అరవైయ్యేళ్ల ప్రస్థానంలో మంచి పుస్తకాలు అందమైన గెటప్‌లో వెలువడి తెలుగు పాఠకులను అలరించాయి. ప్రారంభంలో కమ్యూనిస్టు సాహిత్యం వైపు మొగ్గు చూపినా, 1960 వచ్చేసరికి బాపురమణలు నవోదయని పూర్తిగా ఆవహించేశారు. నవోదయ రామ్మోహనరావు కూడా ఆ నమ్మకంలోనే ఉండేవారు. బుక్ షాపుగా, ప్రచురణ సంస్థగా నవోదయ ఒక వెలుగు వెలిగింది. వావిళ్ల, ఆంధ్రపత్రిక లాగే మంచి వేదికగా పేరు తెచ్చుకుంది. వ్యాపారం కంటే పాప్యులారిటీ, గ్లామర్ ఎక్కువగా ఉండేవి. విజయవాడ, గుంటూరు నవోదయలు సాంస్కృతిక కేంద్రాలుగా బతికాయి. లాండ్మార్క్స్గా నిలిచాయి. కవులకు అకవులకు కూడా విజయవాడ నవోదయ అడ్డాగా ఉండేది. ఆకాశవాణి ప్రయోక్తలకు, పత్రికా ప్రముఖులకు, లెక్చరర్లకు ఏలూరు రోడ్ నవోదయలో హాజరు వేసుకోవడం ఒక వ్యసనం. కొందరికి కొన్ని సాయంకాలాలు ఫలించి అనంతర కార్యక్రమాలకు బీజాలు పడేవి. ఎక్కడో ఏ నడిజాముకో అవి మొల కలెత్తేవి. నవోదయ రామ్మోహనరావు అంత సరసు డేమీ కాదు. మాట పెళుసు. అయినా బలమైన అయస్కాంత క్షేత్రం ఆయన చుట్టూ ఉండేది. పుస్తకాల ఎంపికలో రామ్మోహనరావుది రాచ మార్గం. పుస్తక ప్రచురణలో ఆయన అభిరుచిని ఎవరూ వంక పెట్టలేరు. ముళ్లపూడి రచనలు, నండూరి నరావతారం, విశ్వరూపం, ఇంద్రగంటి కీర్తితోరణం, శ్రీకాంతశర్మ పుస్తకాలు, శంకరమంచి అమరావతి కథలు, శ్రీరమణ రచనలు- ఇలా వెరసి టైటిల్స్ తక్కువేగానీ అన్నీ నవోదయకి కితాబులే. ‘‘బాపు బొమ్మలకైతే హలో, నవో దయకి చలో’’ అనేవారు. మొత్తం తెలుగునాట ఎవరికి బాపు ముఖచిత్రాలు కావాలన్నా నవో దయ అధీకృత ఏజెంటులా వ్యవహరించేది. బాపు కార్టూన్ల పుస్తకాన్ని నవోదయ ప్రచురించింది. ఆయన బొమ్మల్ని మార్చి పరిమార్చి గ్రీటింగ్ కార్డ్స్‌ని వెలువరించారు. రామ్మోహనరావు పుస్తక ప్రియులకు చేసిన సేవ గణనీయమైంది. అమెరికా తెలుగు సంఘం రామ్మోహనరావు దంపతులను తానా సభలకు రావించి సత్కరించింది. ఒక పుస్తక వ్యాపారిగా తానా సత్కృతి అందుకున్న ఘనత ఆయనదే. వారి ఆధరువులు (ఆధర్స్ని రా. రావు ఇలా అనేవారు) కాకపోయినా ఎందరో మహ నీయులు నవోదయతో ఆత్మీయంగా ఉండేవారు. ఇందులో శ్రీశ్రీ, ఆరుద్ర, కాళీపట్నం కొన్ని శాంపిల్స్. యువజ్యోతి ఎమ్వీయల్ నవోదయ ఆప్తవర్గంలోని వారు. ఎప్పుడైనా యస్పీ బాల సుబ్రహ్మణ్యం లాంటివారు మద్రాసు మెయిల్ కోసం నవోదయ గోదాములో నిరీక్షించేవారు. పుస్తకాల దొంతరల మీద కూచుని ఆధార షడ్జమాన్ని ఆలపిస్తూ, రైలు ఆలస్యాన్ని హాయిగా ఆస్వాదిస్తూ, నూజివీడు మిత్రులతో యస్పీబాసు గడపడం ఒక సరదా. విశాలాంధ్ర రాఘవాచారి, ఉషశ్రీ, పన్నాల భట్టు, శ్రీకాంతశర్మ సాయంత్రాలు తప్పక హాజరు వేసుకునేవారు. వారు రాగానే ‘‘గడ్డి తింటారా?’’ అని మర్యాదగా అడిగేవారు. అంటే బృందావన్ హోటల్ ఇడ్లీలని భావం. అక్కడ నుంచి ఎస్టీడీలు ఉచితంగా చేసుకుని ఉదారంగా మాట్లాడుకోవచ్చు. రైలు రిజర్వేషన్ కౌంటర్. సినిమా టికెట్లు లభించును. నండూరి రామ్మోహనరావు ఈవెనింగ్ ఎడిషన్ కోసం వచ్చేవారు. అనగా క్వార్టర్ బాటిల్‌ని పేపర్లో చుట్టి ఇప్పించడం. నవోదయ షాపు చాలా జంటల్ని కలిపింది. ఫిక్షన్, నాన్ఫిక్షన్ చూస్తూ మనసులు విప్పేవారు. మూతపడడం బాధాకరమే. కానీ ఆ ప్రాభవం, వైభవం లేకుండా దేనికి? రెండుమూడు తరాలకి నవోదయ ఒక అక్షర జ్ఞాపకం. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) శ్రీరమణ -
నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
పెద్దాపురం : పెద్దాపురం జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశానికి ఇటీవల నిర్వహించిన ప్రవేశ పరీక్షా ఫలితాలను బుధవారం నవోదయ ప్రిన్సిపాల్ వి. మునిరామయ్య విడుదల చేశారు. ఎఫ్01909,బి02454,ఎఫ్02490,ఎ04617,ఎ05518,ఎ05519,ఇ05603, ఇ05607,ఎ06117,ఇ06190,ఎఫ్06211,ఎ07531,ఎఫ్07710,ఎ08301, సీ11042,సీ11061,సీ16132,జె10409,జె15384,ఎన్00311.జె00634, ఎన్00954,ఐ00901,జె01937,ఎన్02130,ఎన్02791,ఎన్02975, జె03342, ఐ03571,జె03582,ఎన్04056,ఎం05018,ఎం05422,జె06050, కె06282,ఎం06289, ఎం06817,కె08140,కె08403,జె08592,కె08607, ఎం09556,ఐ10803,ఓ10837,ఓ10838.జె11094,ఎన్11736,ఐ11804, ఐ12509,ఐ12519,ఐ13307,ఐ13331,జె13721,జె14033,ఐ14198, ఎం15045,కె15456,జె15786,ఎం16319,ఎన్17258,ఎన్17460,కె17747,ఓ17855,కె03067,ఓ03379,కె03550,కె03551,కె03595,ఓ08454, కె08603,ఓ09649,ఓ13378,కె15832,కె17748,ఎల్00112,ఎల్00315, ఎల్01239,ఎల్03104,ఎల్04048 -
‘నవోదయ’ సమస్యలు కేంద్రం దృష్టికి తీసుకెళ్తా
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హామీ నవోదయ ఉద్యోగుల జాతీయ మహాసభలు ప్రారంభం సాక్షి, హైదరాబాద్: నవోదయ విద్యాలయ ఉద్యోగుల సమస్యలను సంబంధిత మంత్రిత్వ శాఖతో చర్చించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హామీ ఇచ్చారు. జాతీయ స్థాయిలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న నవోదయ ఉద్యోగుల సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అఖిలభారత నవోదయ విద్యాలయ ఉద్యోగుల సమాఖ్య 6వ జాతీయ మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో దత్తాత్రేయ మాట్లాడుతూ నవోదయ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. వారం రోజుల్లో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి వద్దకు నవోదయ ఉద్యోగ సంఘం ప్రతినిధులను తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రాజేంద్రన్, నవోదయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జగదీశ్ రాయ్ తదితరులు పాల్గొన్నారు. -
నవోదయ.. ఆరోతరగతిలో ప్రవేశానికి..
విధి విధానాలు.. ఈ పథకం ఉద్దేశాలు.. గ్రామీణ ప్రాంత ప్రతిభావంతులైన విద్యార్థులకు అధిక ప్రాధాన్యతని స్తారు. ఉన్నత ప్రమాణాలతో కూడిన అధునాతన విద్యను అందించడం ముఖ్యఉద్దేశం. సాంస్కృతి సంప్రదాయాలు, విలువలు పెంపొందించడం, పర్యావరణంపై సదావగాహన, సాహసోపేత కృత్యాలతోపాటు, క్రీడలు, వ్యాయామ విద్యలో శిక్షణ ఇస్తారు. ఎవరు అర్హులు? నవోదయ విద్యాలయంలో ప్రవేశం కోరే అభ్యర్థులు 1-5-2002 ముందు గానీ 31-4-2006తర్వాత గానీ జన్మించి ఉండరాదు. ఈ నిబంధన ఎస్సీ, ఎస్టీ వారితోపాటు అన్ని వర్గాల వారికి వర్తిస్తుంది.ప్రస్తుతం ఐదోతరగతి చదువుతున్న వారై ఉండాలి.అభ్యర్థి 30-9-2014లోగా ఐదోతరగతిలో ప్రవేశం పొందకపోతే అతడు/ఆమె నవోదయ విద్యాలయంలో దరఖాస్తు చేసుకోవడానికి అర్హతను కోల్పోతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక అభ్యర్థి ప్రవేశ పరీక్షకు రెండోసారి హాజరయ్యేందుకు వీలులేదు. పరీక్ష రాసే భాష.. అభ్యర్థి ఐదోతరగతి ఏ మాధ్యమంలో చదువుతున్నాడో ప? కూడా అదే భాషలోనే రాయాల్సి ఉంటుంది. పరీక్షలోని విభాగాలు పరీక్ష మూడు భాగాలుగా ఉంటుంది. 100 మార్కులకు 100 ప్రశ్నలు ఉంటాయి. సమయం 2 గంటలు. మేథాశక్తి పరీక్ష: ప్రశ్నలు 50, మార్కులు 50, సమయం ఒక గంట. గణిత పరీక్ష: ప్రశ్నలు 25, మార్కులు 25, సమయం అరగంట. భాషా పరీక్ష: ప్రశ్నలు 25, మార్కులు 25, సమయం అరగంట. దరఖాస్తులు: బ్లాక్ విద్యాశాఖాధికారి, మండల విద్యాధికారి, జిల్లా విద్యాధికారి నుంచి పొందవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తు ఫారాన్ని ఈనెల 31లోగా మండల విద్యాధికారికి అందజేయాలి. రిజర్వేషన్ల వివరాలు.. ► జిల్లాలోని పాఠశాలలో గల 80 సీట్లలో కనీసం 75 శాతం గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు, మిగిలిన సీట్లను పట్టణ ప్రాంత అభ్యర్థులకు కేటాయించారు. ► గ్రామీణ ప్రాంతాల నుంచి సీట్లు కోరే వారు ఆ ప్రాంతంలోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 3, 4, 5వతరగతి విద్యా సంవత్సరాలు పూర్తిగా చదివి ఉండాలి. ► ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, బాలికలకు 1/3 వంతు, వికలాంగులకు 3 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. -
పేద విద్యార్థులకు ఉచిత విద్య
మంచిర్యాల సిటీ, న్యూస్‌లైన్ : పదో తరగతి వరకు విద్యాశాఖ ఆధ్వర్యంలో నవోదయ, కేజీబీవీ, ఆశ్రమ, గురుకుల, ఎయిడెడ్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఉచితం వసతులతోపాటు చదువును అందిస్తోంది. దీనికి తోడుగా విద్యార్థి జీవితాన్ని మలుపుతిప్పేది ఇంటర్మీడియెట్ విద్య కూడా కావడంతో ప్రభుత్వ విద్యాసంస్థల్లో పదోతరగతి చదివి ఉత్తీర్ణులైన విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఉచితంగా చదువు చెప్పించడానికి విద్యాశాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు 2014-2015 విద్యాసంవత్సరానికి సంబంధించిన జీవో.ఎంఎస్.సంఖ్య. 235. ఎస్.డ బ్ల్యూ,(ఎడ్యుకేషన్-2), తేదీ: 28-03-2011 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో అర్హులైన వారిలో నుంచి 260 మంది విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్ చదువుతోపాటు ఎంసెట్ శిక్షణ, వసతి కూడా ఉచితంగా లభిస్తుంది. విద్యార్థుల ఎంపిక, కళాశాలల్లో ప్రవేశం, ఫీజుల చెల్లింపు సౌకర్యాలను ఏర్పర్చడానికి సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు బాధ్యత వ హిస్తారు. హైదరాబాద్‌లోని చైతన్య, నారాయణ, శ్రీగాయత్రి వంటి కార్పొరేట్ కళాశాలల్లో చేరడానికి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణ ఈనెల 5వ తేదీ నుంచి 14వ తేదీ వరకు పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాలోని విద్యార్థికి నచ్చిన కార్పొరేట్ కళాశాలలో చేరడానికి దరఖాస్తు చేసుకోడానికి అవకాశం ఉంది. పదో తరగతిలో విద్యార్థి సాధించిన ప్రతిభ ఆధారంగా ఈ నెల 16తేదీన అధికారులు కళాశాలను ఎంపిక చేసి ప్రవేశం కల్పిస్తారు. అర్హులు ప్రభుత్వ సంక్షేమ, ఆశ్రమ, కేజీబీవీ పాఠశాలల్లో చదివిన వారికి 50 శాతం, రెసిడెన్సియల్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు 20 శాతం, జిల్లా పరిషత్, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివిన వారికి 25 శాతం, అత్యుత్తమ ప్రైవేటు పాఠశాలల్లో చదివిన వారికి 5 శాతం చొప్పున సీట్లు కేటాయిస్తారు. బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థుల తలితండ్రుల వార్షికాదాయం రూ.లక్ష, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం రూ.2 లక్షల వరకు ఉండాలి. పదో త రగతిలో సాధించిన ప్రగతి కూడా పరిగణలోకి తీసుకొని ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోడానికి ముందు విద్యార్థి కులం, ఆదాయం, ఆధార్‌కార్డు, ఐఈడీ, రేషన్ కార్డు, పదో తరగతి గ్రేడింగ్, పదో తరగతి హాల్‌టికెట్టు, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల చిరునామా వివరాలను సిద్ధం చేసుకోవాలి. వీటి ఆధారాలతో ఆన్లైన్లో దర ఖాస్తు చేసుకోడానికి వీలు క లుగుతుంది.