నవోదయ.. ఆరోతరగతిలో ప్రవేశానికి.. | Navodaya entry in sixth class | Sakshi
Sakshi News home page

నవోదయ.. ఆరోతరగతిలో ప్రవేశానికి..

Published Sat, Oct 18 2014 11:53 PM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM

నవోదయ.. ఆరోతరగతిలో ప్రవేశానికి.. - Sakshi

నవోదయ.. ఆరోతరగతిలో ప్రవేశానికి..

విధి విధానాలు..
ఈ పథకం ఉద్దేశాలు..
గ్రామీణ ప్రాంత ప్రతిభావంతులైన విద్యార్థులకు అధిక ప్రాధాన్యతని స్తారు. ఉన్నత ప్రమాణాలతో కూడిన అధునాతన విద్యను అందించడం ముఖ్యఉద్దేశం. సాంస్కృతి సంప్రదాయాలు, విలువలు పెంపొందించడం, పర్యావరణంపై సదావగాహన, సాహసోపేత కృత్యాలతోపాటు, క్రీడలు, వ్యాయామ విద్యలో శిక్షణ ఇస్తారు.

ఎవరు అర్హులు?
నవోదయ విద్యాలయంలో ప్రవేశం కోరే అభ్యర్థులు 1-5-2002 ముందు గానీ 31-4-2006తర్వాత గానీ జన్మించి ఉండరాదు. ఈ నిబంధన ఎస్సీ, ఎస్టీ వారితోపాటు అన్ని వర్గాల వారికి వర్తిస్తుంది.ప్రస్తుతం ఐదోతరగతి చదువుతున్న వారై ఉండాలి.అభ్యర్థి 30-9-2014లోగా ఐదోతరగతిలో ప్రవేశం పొందకపోతే అతడు/ఆమె నవోదయ విద్యాలయంలో దరఖాస్తు చేసుకోవడానికి అర్హతను కోల్పోతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక అభ్యర్థి ప్రవేశ పరీక్షకు రెండోసారి హాజరయ్యేందుకు వీలులేదు.

పరీక్ష రాసే భాష..
అభ్యర్థి ఐదోతరగతి ఏ మాధ్యమంలో చదువుతున్నాడో ప? కూడా అదే భాషలోనే రాయాల్సి ఉంటుంది.
పరీక్షలోని విభాగాలు  పరీక్ష మూడు భాగాలుగా ఉంటుంది. 100 మార్కులకు 100 ప్రశ్నలు ఉంటాయి. సమయం 2 గంటలు.
మేథాశక్తి పరీక్ష: ప్రశ్నలు 50, మార్కులు 50, సమయం ఒక గంట.
గణిత పరీక్ష: ప్రశ్నలు 25, మార్కులు 25, సమయం అరగంట.
భాషా పరీక్ష: ప్రశ్నలు 25, మార్కులు 25, సమయం అరగంట.
దరఖాస్తులు: బ్లాక్ విద్యాశాఖాధికారి, మండల విద్యాధికారి, జిల్లా విద్యాధికారి నుంచి పొందవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తు ఫారాన్ని ఈనెల 31లోగా మండల విద్యాధికారికి అందజేయాలి.

రిజర్వేషన్ల వివరాలు..
జిల్లాలోని పాఠశాలలో గల 80 సీట్లలో కనీసం 75 శాతం గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు, మిగిలిన సీట్లను పట్టణ ప్రాంత అభ్యర్థులకు కేటాయించారు.
గ్రామీణ ప్రాంతాల నుంచి సీట్లు కోరే వారు ఆ ప్రాంతంలోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 3, 4, 5వతరగతి విద్యా సంవత్సరాలు పూర్తిగా చదివి ఉండాలి.
ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, బాలికలకు 1/3 వంతు, వికలాంగులకు 3 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement