
కూకట్‌పల్లి: విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుందని, ఒత్తిడిని అధిగమించగలరని ఏకాగ్రత పెరిగి చదువుల్లో మరింత రాణిస్తారని శ్రీచైతన్య విద్యాసంస్థల నిర్వహకులు తెలిపారు. సంస్థ ఛైర్మన్ బీఎస్ రావు.. జ్ఞాపకార్థం శ్రీచైతన్య విద్యాసంస్థలు కూకట్ పల్లి జోన్‌లోని వివిధ బ్రాంచ్‌ల విద్యార్థులకు జోనల్ లెవల్ స్పోర్ట్స్ మీట్‌ను హైదర్ నగర్ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించింది.

శ్రీ చైతన్య అంటే చదువు, ర్యాంకులు ఒక్కటే కాదని, తమ విద్యార్థులు క్రీడల్లోనూ రాణించగలరని కూకట్‌పల్లి ఏజీఎం శివరామకృష్ణ తెలిపారు. బీఎస్ రావు తెలుగు రాష్ట్ర ప్రజలకు సుపరిచితుడని, డాక్టర్‌గా వృత్తి బాధ్యతలు నిర్వహిస్తూ.. విద్యాసంస్థలను ప్రారంభించి శ్రీచైతన్య అనే బ్రాండ్‌ను సృష్టించారని ఆయన చూపించిన మార్గంలో నేడు ఎంతో మంది చదువుల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించారని కొనియాడారు.

సీనియర్లు, జూనియర్ల విభాగాలలో వేర్వేరుగా జరిగిన వివిధ క్రీడల్లో రాణించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఆయా బ్రాంచీల విద్యార్థులు చేసిన మార్చ్ ఫాస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్రీడా జ్యోతితో స్పూర్తిని పెంచి ఉత్తేజంతో విద్యార్థులు ఆటల్లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏజీఎం రవికుమార్, పార్ట్నర్ అడ్వైజర్ ఫర్ ఉమెన్ & చైల్డ్ వెల్ఫేర్ వినోద్ కుమార్ బుర్రా హాజరయ్యారు. ఆర్ ఐ శ్రీనివాసరెడ్డి, ఆల్ ఇండియా స్పోర్ట్స్ రీసోర్స్ పర్సన్ రాజశేఖర్, ఆయా బ్రాంచ్‌ల ప్రధానోపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


Comments
Please login to add a commentAdd a comment