![FIFS launches Sports Data Gameathon to boost AI and tech in sports](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/Sports-Data-Gamethon.jpg.webp?itok=Of1pIS6E)
భారతదేశ ప్రీమియర్ ఇన్‌స్టిట్యూట్‌ల కోసం ఇదోక స్పోర్ట్స్ AI ఛాలెంజ్...
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10, 2025: స్పోర్ట్స్ టెక్‌లో భారతదేశాన్ని గ్లోబల్ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫాంటసీ స్పోర్ట్స్ (FIFS) ఆధ్వర్యంలో డ్రీమ్11 సమర్పనలో స్పోర్ట్స్ AI ఛాలెంజ్ ‘స్పోర్ట్స్ డేటా గేమ్‌థాన్’ను ప్రారంభించింది. ఈ అధునాతన సాంకేతిక పోటీ డేటాను సమగ్రపరచడంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML) వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను క్రీడలకు ఉపయోగించుకోవడానికి నూతన మార్గాలను అన్వేషించే దిశగా అడుగులేస్తుంది.
ఈ గేమ్‌థాన్‌లో ప్రీమియర్ ఇన్‌స్టిట్యూట్‌ల నుండి విద్యార్థి జట్లు పాల్గొంటాయి. ఇందులో పాల్గొనే వారు ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సందర్భంగా రోజువారీ ఫాంటసీ స్పోర్ట్స్ ఫార్మాట్‌లో పోటీపడతారు. ముఖ్యంగా డేటా అనలిటిక్స్ నైపుణ్యాలను ఉపయోగించుకుంటూ, గేమ్‌థాన్ యొక్క బదిలీ పరిమితులు ఇతర నియమాలకు కట్టుబడి విజేతగా నిలవడానికి వ్యూహాన్ని రూపొందించడంలో ఏఐ, ఎమ్‌ఎల్ నమూనాలను నిర్మించాలి.
ఈ ప్రతిష్టాత్మక పోటీకి 30 కి పైగా ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపాయి. వారి వ్యూహాత్మక ప్రణాళికలను సమీక్షించిన తర్వాత., IIT బాంబే, IIT ఢిల్లీ, IIT ఖరగ్‌పూర్, IIT కాన్పూర్, IIIT ధార్వాడ్ వంటి సంస్థల నుండి 52 జట్లు షార్ట్‌లిస్ట్ చేయబడ్డాయి. మొదటి మూడు జట్లు వరుసగా రూ.12.5 లక్షలు, 7.5 లక్షలు, 5 లక్షలు అందుకుంటూ మొత్తంగా 25 లక్షల బహుమతిని గెలుచుకుంటారు.
గేమ్‌థాన్ అంతటా విద్యార్థులకు మద్దతుగా, FIFS ఇద్దరు నిపుణులను ఆన్-బోర్డ్ చేసింది - ప్రఖ్యాత క్రికెట్ విశ్లేషకుడు జాయ్ భట్టాచార్య మరియు USలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో AI వైస్ డీన్ ప్రొఫెసర్ విశాల్ మిశ్రా, విద్యార్థి బృందాలకు వారి నిపుణుల మార్గదర్శకత్వాన్ని అందిస్తారు.
ఈ సందర్భంగా FIFS డైరెక్టర్ జనరల్ జాయ్ భట్టాచార్య మాట్లాడుతూ.., "స్పోర్ట్స్ డేటా గేమ్‌థాన్ యొక్క మొదటి ఎడిషన్‌ను ప్రారంభించడానికి మేము సంతోషిస్తున్నాము. మా ప్రయత్నానికి విశేష స్పందన లభిస్తుంది. ఈ గేమ్‌థాన్‌లో ప్రధానంగా యువతరం పోటీ పడటం పట్ల మేము సంతోషిస్తున్నామ’’ని అన్నారు.
‘స్పోర్ట్స్ డేటా గేమ్‌థాన్’ అనేది ఆవిష్కరణకు ప్రోత్సాహక వేదికగా మారడంతో పాటు భారతదేశాన్ని స్పోర్ట్స్ టెక్నాలజీలో ప్రపంచ నేతగా ఎదగడమే లక్ష్యంగా ముందుకు తీసుకెళ్లన్నుంది. ఈ తరంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న స్పోర్ట్స్ అనలిటిక్స్ రంగంలో యువ ప్రతిభను పెంపొందించడంతో గేమ్‌థాన్ అభిమానుల భాగస్వామ్యాన్ని పునర్నిర్వచించడానికి.. అత్యాధునిక సాంకేతికత, డిజిటల్ కంటెంట్ అనుసంధానం చేసే విశిష్టమైన వ్యవస్థను పెంపొందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment