ఏఐకి రూ.19 లక్షలు సైబర్‌ సెక్యూరిటీకి రూ.18 లక్షలు | Computer courses are calculated by colleges | Sakshi
Sakshi News home page

ఏఐకి రూ.19 లక్షలు సైబర్‌ సెక్యూరిటీకి రూ.18 లక్షలు

Published Thu, May 16 2024 4:59 AM | Last Updated on Thu, May 16 2024 4:59 AM

Computer courses are calculated by colleges

కంప్యూటర్‌ కోర్సుకు కాలేజీలు చెప్పిందే లెక్క

యాజమాన్య కోటాకు యమ డిమాండ్‌.. సెట్‌ రిజల్ట్స్‌కు ముందే బేరసారాలు

కాలేజీల కృత్రిమ డిమాండ్‌.. రిజర్వు చేసుకుంటేనే సీటు గ్యారంటీ అని షరతు

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలు యాజ మాన్య కోటా సీట్ల బేరసారాల జోరు పెంచాయి. వీలైనంత ఎక్కువ డిమాండ్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా కంప్యూటర్‌ బ్రాంచీల్లో సీట్లను పెద్ద మొత్తంలో అమ్ముకోవాలని చూస్తున్నాయి. డిమాండ్‌ ఉన్న టాప్‌ కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్లు సామాన్యులు ఆశించే స్థాయిలో లేవని తెలుస్తోంది.

ఇంజనీరింగ్‌ సెట్‌ ఫలితాలు మరో పది రోజుల్లో రానుండటంతో యాజమాన్య సీట్ల వైపు ఎక్కువ మంది ఆశలు పెట్టుకుంటున్నారు. వాస్తవానికి ప్రభుత్వ నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాతే యాజమాన్య కోటా సీట్లను భర్తీ చేయాల్సి ఉన్నప్పటికీ ఈ నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. 

అయితే, సీట్లు కొనుగోలు చేసేవాళ్లు, విక్రయించే కాలేజీలకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో తామేమీ చేయలేక పోతున్నామని అధికారులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. 

డబ్బు కడితేనే సీటు గ్యారంటీ
రాష్ట్రంలో ఈ ఏడాది 1.09 లక్షల ఇంజనీరింగ్‌ సీట్లు ఉండే వీలుంది. ఇందులో 30% అంటే దాదాపు 31 వేల సీట్లు మేనేజ్‌మెంట్‌ కోటా కిందకొస్తాయి. ఇందులో టాప్‌ కాలే జీల్లో 19 వేల సీట్ల వరకూ ఉండగా, వీటిలో సగం సీట్లను ఎన్‌ ఆర్‌ఐ కోటా కింద భర్తీ చేయాలి. బీ కేటగిరీ సీట్లను జేఈఈ, ఈఏపీసెట్‌ ర్యాంకర్లు, ఇంటర్‌లో మార్కులు ఎక్కువ వచ్చిన వారికి క్రమానుగతంగా ఇవ్వాలి. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 

ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లకు ఏడాదికి 5 వేల డాలర్లు (దాదాపు రూ. 4 లక్షలు) వసూలు చేసుకునే వీలుంది. అయితే, బీ కేటగిరీ సీట్లకు దరఖాస్తు చేసే వాళ్ల వివ రాలు ప్రభుత్వ సంస్థల పరిధిలోకి రావడం లేదు. ఆన్‌లైన్‌ విధానంలోనూ ఉండటం లేదు. దీన్ని సాకుగా తీసుకుని యాజమాన్యాలు ముందే సీట్లను అమ్ముకుంటున్నాయి. 

ఈఏపీ సెట్‌లో మంచి ర్యాంకు రాదని తెలిసిన వాళ్లు సీట్ల కోసం ఎగబడుతున్నారు. సెట్‌ రిజల్ట్‌ వస్తే డిమాండ్‌ పెరుగు తుందని, సీట్లు కూడా అయిపోయే ప్రమాదం ఉందని యాజ మాన్యాలు డిమాండ్‌ సృష్టిస్తున్నాయి. ప్రతీ రోజు ప్రత్యేక విభాగాలు పెట్టి సీట్ల కోసం వచ్చే వారిని ఒప్పించి, మెప్పించి డబ్బు వసూలు చేస్తున్నాయి. సీటు ఇవ్వాలంటే ముందే డబ్బులు కట్టి రిజర్వు చేసుకోవాలని షరతు విధిస్తున్నాయి. 

నోటిఫికేషన్‌ వచ్చాకే అడ్మిషన్లు 
యాజమాన్య కోటా సీట్ల భర్తీకి ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్‌ ఇస్తుంది. అప్పుడు మాత్రమే సీట్లు భర్తీ చేయాలి. ఇందుకు విరుద్ధంగా సీట్లు అమ్ముకునే సంస్థలపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్‌గా ఉంది. 
– ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్‌

ర్యాంకర్లకూ గాలం
» జేఈఈ ర్యాంకర్లతో కాలేజీ యాజ మాన్యాలు రాష్ట్ర ఇంజనీరింగ్‌ సీట్లకు కౌన్సెలింగ్‌లో దరఖాస్తు చేయించేందుకు వ్యూహరచన చేస్తున్నాయి. ఇలాంటి వాళ్లకు రాష్ట్ర సెట్‌లోనూ మంచి ర్యాంకు వస్తుంది. కంప్యూటర్‌ బ్రాంచీలో సీటుకు దరఖాస్తు చేస్తే తొలి కౌన్సెలింగ్‌లోనే సీటు వస్తోంది. జాయినింగ్‌ రిపోర్టు చేసి సీటు కన్ఫమ్‌ చేసుకుంటున్నారు.

 ఆఖరి దశ కౌన్సెలింగ్‌ తర్వాత, స్పాట్‌ అడ్మిషన్‌కు ముందు సీటు వదులుకుని, జాతీయ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో చేరతారు. ఇలా ఖాళీ అయిన సీట్లనూ యాజమాన్యాలు భారీ మొత్తంలో అమ్ముకుంటాయి. కంప్యూటర్‌ బ్రాంచీలో సీటుకు రూ.18 లక్షల వరకూ వసూలు చేస్తున్నాయి. 

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ), మెషీన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌) వంటి కోర్సులకు ఏకంగా రూ. 19 లక్షల వరకూ డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్రంలో 58 శాతం సీట్లు కంప్యూటర్‌ కోర్సుల్లోనే భర్తీ అవుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement