machine learning
-
ఐదేళ్లలో నైపుణ్యాలు నిరుపయోగం!
భవిష్యత్తులో ఏఐ, ఆటోమేషన్, మెషిన్ లెర్నింగ్ వంటి రంగాల్లో భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదుగుతుందని గ్లోబల్ లేబర్ మార్కెట్ కాన్ఫరెన్స్ (జీఎల్ఎంసీ) నివేదిక విడుదల చేసింది. సాంకేతిక విభాగాల్లో గ్లోబల్ సౌత్‌లో ఇండియా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపింది. ‘నేవిగేటింగ్ టుమారో’ పేరుతో విడుదల చేసిన ఈ రిపోర్ట్‌లో భారత్ జాబ్ మార్కెట్ వైవిధ్యంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని పేర్కొంది. అయితే భారతీయ నిపుణుల్లో సగానికిపైగా వచ్చే ఐదేళ్లలో తమ నైపుణ్యాలు ఉపయోగంలో లేకుండా పోతాయని ఆందోళన చెందుతున్నట్లు నివేదిక తెలియజేసింది.నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు..సాంకేతిక అభివృద్ధికి అనుగుణంగా ఇప్పటికే వివిధ రంగాల్లో పని చేస్తున్న సిబ్బంది నైపుణ్యాలు నేర్చుకునేందుకు ఆందోళన చెందుతున్నారు. 55 శాతం మంది తమ నైపుణ్యాలు వచ్చే ఐదేళ్లలో పాక్షికంగా లేదా పూర్తిగా వాడుకలో లేకుండా పోతాయనే భయంతో ఉన్నారు.ఈ ధోరణి యూకేలో 44 శాతం, ఆస్ట్రేలియాలో 43 శాతంతో కనిష్టంగా, బ్రెజిల్లో అధికంగా 61 శాతం, చైనాలో 60 శాతంగా ఉంది.భారత్‌లో 32 శాతం మంది రాబోయే ఐదేళ్లలో రీస్కిల్లింగ్ అవసరాలను గుర్తించారు. ఇది చైనాలో 41 శాతం, వియత్నాం 36 శాతం, యూకే 14 శాతం, యూఎస్ఏ 18 శాతంగా ఉంది.రానున్న రోజుల్లో సాంకేతికత అవసరాలు పెరుగుతాయి. అందుకు అనుగుణంగా భారత యువత నైపుణ్యాలు పెంచుకుంటుంది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఆటోమేషన్ వంటి సాంకేతిక రంగాల్లో యువత నైపుణ్యం పెంచుకోవాలని ఆసక్తిగా ఉంది.ఇదీ చదవండి: దడ పుట్టిస్తున్న బంగారం! తులం ఎంతంటే..?అభివృద్ధి చెందుతున్న నైపుణ్య అవసరాలకు అనుగుణంగా విద్య, శిక్షణా వ్యవస్థలు మరింత మెరుగుపడాలి.19 శాతం మంది ప్రస్తుతం కొత్త నైపుణ్యాలకు అనువైన విద్యా విధానం లేదని అభిప్రాయపడ్డారు. ఈ అభిప్రాయం ముఖ్యంగా 21 శాతం మంది యువకులలో (18-34) ఉంది.భారత్‌లో నైపుణ్యాలు పెంచుకోవడానికి సమయాభావం-40 శాతం మంది, ఆర్థిక పరిమితులు-38 శాతం మందికి అడ్డంకిగా ఉందని పేర్కొన్నారు. ఈ విషయంలో భారత్‌తో సమానంగా బ్రెజిల్లో సమయం లేకపోవడం, ఆర్థిక పరిమితులు వరుసగా 43 శాతం, 39 శాతంగా, దక్షిణాఫ్రికాలో 45 శాతం, 42 శాతంగా ఉంది. నార్వే, యూకే వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో వీటిని పెద్దగా అడ్డంకులుగా భావించడంలేదు. నార్వేలో ఇది వరుసగా 27 శాతం, 28 శాతంగా ఉంది. యూకేలో 31 శాతం, 24 శాతంగా ఉంది.భారతీయ నిపుణులు సాంకేతికంగా స్కిల్స్ పెంచుకోవడానికి అవకాశాలను వెతుకుతున్నారు. -
ఏఐ మార్గదర్శకులకు...ఫిజిక్స్ నోబెల్
స్టాక్ హోం: వైద్య శాస్త్రం మాదిరిగానే ఫిజిక్స్‌లో కూడా ఈ ఏడాది నోబెల్ అవార్డు ఇద్దరు సైంటిస్టులను వరించింది. మెషీన్ లెరి్నంగ్‌ను కొత్త పుంతలు తొక్కించి.. కృత్రిమ మేధ వికాసానికి మార్గదర్శకులుగా నిలిచిన సైంటిస్టులు జాన్ హాప్ఫీల్డ్, జెఫ్రీ హింటన్‌లు అత్యున్నత పురస్కారం అందుకోనున్నారు. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మంగళవారం ఈ మేరకు ప్రకటించింది. గతేడాది ఫిజిక్స్ నోబెల్‌ను ముగ్గురు సైంటిస్టులకు అందించడం తెలిసిందే. హింటన్.. ఫాదర్ ఆఫ్ ఏఐ హింటన్ ఫాదర్ ఆఫ్ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)గా ప్రసిద్ధుడు. కెనడా, బ్రిటన్ పౌరసత్వమున్న ఆయన టొరంటో వర్సిటీలో పని చేస్తున్నారు. హాప్‌ఫీల్డ్‌ది అమెరికా. ప్రిన్స్టన్ వర్సిటీలో పని చేస్తున్నారు. వారు రూపొందించి, అభివృద్ధి చేసిన భౌతిక శాస్త్ర నియమాలు, పనిముట్లు నేటి శక్తిమంతమైన మెషీన్ లెర్నింగ్‌కు పునాదులని నోబెల్ కమిటీ కొనియాడింది. ‘వారు అభివృద్ధి చేసిన ఆర్టిఫీషియల్ న్యూరల్ నెట్వర్క్స్ సహాయక మెమరీలుగా ఎన్నో రంగాల్లో కీలక సేవలు అందిస్తున్నాయి.ఫేషియల్ రికగ్నిషన్ మొదలుకుని, యాంత్రిక అనువాదం దాకా అన్నింటా అవి మన జీవితంలో భాగంగా మారాయి‘ అని ప్రశంసించింది. అయితే, ఈ సాంకేతిక ప్రగతి మన భవిష్యత్తుపై ఎన్నో సందేహాలను లేవనెత్తిందని అభిప్రాయపడింది. మానవాళికి మేలు జరిగేలా దీన్ని సురక్షిత, నైతిక పద్ధతుల్లో వాడటం చాలా ముఖ్యమని పేర్కొంది. ఈ ఆందోళనలు సహేతుకమేనని హింటన్ తరచూ చెబుతుంటారు. వీటిపై మరింత స్వేచ్చగా మాట్లాడేందుకు వీలుగా ఆయన గూగుల్‌లో ఉన్నతోద్యోగాన్ని కూడా వదులుకోవడం విశేషం. ఈ నేపథ్యం దృష్ట్యా తనకు అత్యున్నత పురస్కారం రావడం నమ్మశక్యంగా లేదని చెప్పారాయన. మానవాళిని ఏఐ కనీవినీ ఎరగని రీతిలో ప్రభావితం చేయడం ఖాయమని ఆయన ఇప్పటికే జోస్యం చెప్పారు. దీన్ని ఏకంగా పారిశ్రామిక విప్లవంతో పోల్చారు. -
అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం
సాక్షి, హైదరాబాద్: వయోవృద్ధులు అంటే చిన్న పిల్లలతో సమానం. చిన్న పిల్లలను చూసుకున్నట్టే వారినీ చూసుకోవాలి, కాపాడుకోవాలి. ఇప్పుడున్న బిజీ ప్రపంచంలో చాలా మందికి తమ కుటుంబాల్లోని పెద్ద వయసువారిని చూసుకోవడం ఇబ్బందిగా మారుతోంది. ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుకోవాలని ఉన్నా.. అది ప్రాక్టికల్‌గా సాధ్యపడకపోవచ్చు. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ వేరే ప్రాంతాలు, దేశాల్లో ఉండేవారు.. ఇంట్లోనే ఉన్నా పొద్దస్తమానం పనుల ఒత్తిడితోనే సతమతం అయ్యేవారు.. పెద్దవారి ఆరోగ్యం, ఆలనాపాలనా చూసుకోవడానికి ‘టెక్నాలజీ’సాయం చేస్తోంది.వృద్ధుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసే స్మార్ట్ వాచీలు, పరికరాలు మార్కెట్లోకి వచ్చాయి. రక్తపోటు, గుండె వేగం, షుగర్ లెవల్స్ వంటి వివరాలను ఎప్పటికప్పుడు గమనించి.. ‘మెషిన్ లెర్నింగ్ ప్రోగ్రామ్’ల సాయంతో ఆరోగ్యాన్ని విశ్లేషించి హెచ్చరించే పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఏదైనా ఇబ్బంది ఏర్పడితే వెంటనే.. చికిత్స అందించేందుకు, పెద్దలకు అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు చేందుకు వీలు ఏర్పడుతోంది. పెద్దల కోసం ‘అన్వయ’!..: హైదరాబాద్ కేంద్రంగా ‘అన్వయ కిన్ కేర్ టెక్నాలజీ’వృద్ధులకు అవసరమైన సేవలు అందిస్తుంది. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వయోవృద్ధులను స్మార్ట్ వాచ్ సాయంతో గమనిస్తూ ఉండవచ్చు. అందులో ప్రత్యేక యాప్ పెద్దల ఆరోగ్యాన్ని గమనించడమే కాదు.. ఒకవేళ జారిపడినా, ఏదైనా ప్రమాదం జరిగినా వెంటనే పిల్లలకు అలర్ట్ పంపుతుంది.పిల్లలు గనుక దగ్గర లేకపోతే అన్వయ కేర్ సెంటర్ తమ సిబ్బందిని వెంటనే పంపి అవసరమైన సాయం అందిస్తుంది. అంతేకాదు.. వయోవృద్ధుల్లో చాలా మందికి ‘డిమెన్షియా (మతిమరుపు)’వ్యాధి వస్తుంటుంది. ఏం చేస్తున్నామో కూడా తెలియని, అర్థంకాని స్థితిలోకి వెళ్లిపోతుంటారు. అలాంటి వారికోసం కూడా ‘అన్వయ’లో సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. జియో ట్యాగింగ్, జియో ఫెన్సింగ్ వంటివాటితో పెద్దలను మానిటర్ చేస్తారు. నిర్ధారిత ప్రాంతం వదిలి పెద్దవారు బయటకి వెళ్తే.. వెంటనే పిల్లలకు మెసేజ్ వెళ్తుంది. ఎక్కడున్నారో ఆచూకీ చూపుతుంది. -
ఏఐకి రూ.19 లక్షలు సైబర్ సెక్యూరిటీకి రూ.18 లక్షలు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు యాజ మాన్య కోటా సీట్ల బేరసారాల జోరు పెంచాయి. వీలైనంత ఎక్కువ డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా కంప్యూటర్ బ్రాంచీల్లో సీట్లను పెద్ద మొత్తంలో అమ్ముకోవాలని చూస్తున్నాయి. డిమాండ్ ఉన్న టాప్ కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్లు సామాన్యులు ఆశించే స్థాయిలో లేవని తెలుస్తోంది.ఇంజనీరింగ్ సెట్ ఫలితాలు మరో పది రోజుల్లో రానుండటంతో యాజమాన్య సీట్ల వైపు ఎక్కువ మంది ఆశలు పెట్టుకుంటున్నారు. వాస్తవానికి ప్రభుత్వ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే యాజమాన్య కోటా సీట్లను భర్తీ చేయాల్సి ఉన్నప్పటికీ ఈ నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. అయితే, సీట్లు కొనుగోలు చేసేవాళ్లు, విక్రయించే కాలేజీలకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో తామేమీ చేయలేక పోతున్నామని అధికారులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. డబ్బు కడితేనే సీటు గ్యారంటీరాష్ట్రంలో ఈ ఏడాది 1.09 లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఉండే వీలుంది. ఇందులో 30% అంటే దాదాపు 31 వేల సీట్లు మేనేజ్మెంట్ కోటా కిందకొస్తాయి. ఇందులో టాప్ కాలే జీల్లో 19 వేల సీట్ల వరకూ ఉండగా, వీటిలో సగం సీట్లను ఎన్ ఆర్ఐ కోటా కింద భర్తీ చేయాలి. బీ కేటగిరీ సీట్లను జేఈఈ, ఈఏపీసెట్ ర్యాంకర్లు, ఇంటర్లో మార్కులు ఎక్కువ వచ్చిన వారికి క్రమానుగతంగా ఇవ్వాలి. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎన్ఆర్ఐ కోటా సీట్లకు ఏడాదికి 5 వేల డాలర్లు (దాదాపు రూ. 4 లక్షలు) వసూలు చేసుకునే వీలుంది. అయితే, బీ కేటగిరీ సీట్లకు దరఖాస్తు చేసే వాళ్ల వివ రాలు ప్రభుత్వ సంస్థల పరిధిలోకి రావడం లేదు. ఆన్లైన్ విధానంలోనూ ఉండటం లేదు. దీన్ని సాకుగా తీసుకుని యాజమాన్యాలు ముందే సీట్లను అమ్ముకుంటున్నాయి. ఈఏపీ సెట్లో మంచి ర్యాంకు రాదని తెలిసిన వాళ్లు సీట్ల కోసం ఎగబడుతున్నారు. సెట్ రిజల్ట్ వస్తే డిమాండ్ పెరుగు తుందని, సీట్లు కూడా అయిపోయే ప్రమాదం ఉందని యాజ మాన్యాలు డిమాండ్ సృష్టిస్తున్నాయి. ప్రతీ రోజు ప్రత్యేక విభాగాలు పెట్టి సీట్ల కోసం వచ్చే వారిని ఒప్పించి, మెప్పించి డబ్బు వసూలు చేస్తున్నాయి. సీటు ఇవ్వాలంటే ముందే డబ్బులు కట్టి రిజర్వు చేసుకోవాలని షరతు విధిస్తున్నాయి. నోటిఫికేషన్ వచ్చాకే అడ్మిషన్లు యాజమాన్య కోటా సీట్ల భర్తీకి ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ ఇస్తుంది. అప్పుడు మాత్రమే సీట్లు భర్తీ చేయాలి. ఇందుకు విరుద్ధంగా సీట్లు అమ్ముకునే సంస్థలపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్‌గా ఉంది. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్ర్యాంకర్లకూ గాలం» జేఈఈ ర్యాంకర్లతో కాలేజీ యాజ మాన్యాలు రాష్ట్ర ఇంజనీరింగ్ సీట్లకు కౌన్సెలింగ్‌లో దరఖాస్తు చేయించేందుకు వ్యూహరచన చేస్తున్నాయి. ఇలాంటి వాళ్లకు రాష్ట్ర సెట్లోనూ మంచి ర్యాంకు వస్తుంది. కంప్యూటర్ బ్రాంచీలో సీటుకు దరఖాస్తు చేస్తే తొలి కౌన్సెలింగ్‌లోనే సీటు వస్తోంది. జాయినింగ్ రిపోర్టు చేసి సీటు కన్ఫమ్ చేసుకుంటున్నారు. ఆఖరి దశ కౌన్సెలింగ్ తర్వాత, స్పాట్ అడ్మిషన్‌కు ముందు సీటు వదులుకుని, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరతారు. ఇలా ఖాళీ అయిన సీట్లనూ యాజమాన్యాలు భారీ మొత్తంలో అమ్ముకుంటాయి. కంప్యూటర్ బ్రాంచీలో సీటుకు రూ.18 లక్షల వరకూ వసూలు చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) వంటి కోర్సులకు ఏకంగా రూ. 19 లక్షల వరకూ డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో 58 శాతం సీట్లు కంప్యూటర్ కోర్సుల్లోనే భర్తీ అవుతున్నాయి. -
ఏఐ వినియోగంపై ఆర్బీఐ దృష్టి
ముంబై: రిజర్వ్ బ్యాంక్ తాజాగా తమ కార్యకలాపాల్లో కృత్రిమ మేథ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) వినియోగంపై మరింతగా దృష్టి పెడుతోంది. బ్యాంకింగ్ పర్యవేక్షణ అవసరాలకు వీటిని వినియోగించుకునేలా తగు సిస్టమ్స్‌ను రూపొందించేందుకు అంతర్జాతీయ కన్సల్టెన్సీలు మెకిన్సే అండ్ కంపెనీ, యాక్సెంచర్ సొల్యూషన్స్‌ను ఎంపిక చేసింది. భారీ డేటాబేస్‌ను విశ్లేషించేందుకు, బ్యాంకులు.. ఎన్‌బీఎఫ్‌సీల నియంత్రణను మెరుగుపర్చేందుకు ఈ సిస్టమ్స్ ఉపయోగపడనున్నాయి. ఈ కాంట్రాక్టు విలువ రూ. 91 కోట్లు. ఆర్బీఐ గతేడాది సెప్టెంబర్‌లో ఏఐ, ఎంఎల్ కన్సల్టెంట్ల నియామకం కోసం ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను (ఈవోఐ) ఆహా్వనించింది. ప్రాథమిక మదింపులో ఏడు సంస్థలు షార్ట్‌లిస్ట్ అయ్యాయి. బోస్టన్ కన్సలి్టంగ్ గ్రూప్ (ఇండియా), డెలాయిట్ టచ్ తోమాత్సు ఇండియా, ఎర్న్స్ట్ అండ్ యంగ్, కేపీఎంజీ అష్యూరెన్స్ అండ్ కన్సలి్టంగ్ సరీ్వసెస్ తదితర సంస్థలు కూడా పోటీపడ్డాయి. -
చాట్ జీపీటీ విద్యారంగం పూర్తిగా మారబోతుంది..
-
ఆ సత్తా భారత్ సొంతం
కేవడియా(గుజరాత్): ప్రపంచ నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని భారత్ ముందుండి నడిపించగలదని, ఆ సామర్థ్యం భారత్ సొంతమని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. గుజరాత్‌లోని కేవడియాలో జరుగుతున్న ఇండస్ట్రీ 4.0 అనే సదస్సునుద్దేశిస్తూ ప్రధాని మోదీ వర్చువల్‌గా ఒక సందేశం పంపారు. అందులోని సారాంశం ఆయన మాటల్లోనే.. ‘ అధునాతన సాంకేతికత ఆలంబనగా నాలుగో పారిశ్రామిక విప్లవం మొదలవ్వాలి. సృజనాత్మక ఆలోచనలతోనే ఇది సాధ్యం. వేర్వేరు కారణాల వల్ల గత పారిశ్రామిక విప్లవాల్లో భారత్ భాగస్వామి కాలేకపోయింది. ఇండస్ట్రీ 4.0కు సారథ్యం వహించే సుధృఢ లక్షణాలు దేశానికి ఉన్నాయి. యువజనాభా, డిమాండ్, స్వేచ్ఛాయుత వాణిజ్యానికి బాటలుపరిచే కేంద్ర ప్రభుత్వం సమష్టిగా దీన్ని సుసాధ్యంచేయగలవు. ప్రపంచ వస్తు గొలుసు వ్యవస్థలో భారత్ కీలక భూమిక పోషించేలా చేయగల సమర్థత దేశీయ పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలకు ఉంది. ఇందుకోసం సంస్కరణలు తెస్తూ, రాయితీల తోడ్పాటు అందిస్తూ అధునాతన సాంకేతికతను సంతరించుకున్న ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషిచేస్తున్నాం’ అని ప్రధాని మోదీ అన్నారు. ‘3డీ ప్రింటింగ్, మెషీన్ లెర్నింగ్, డేటా అనలైటిక్స్, ఎల్ఓటీ వంటి రంగాల్లో పారిశ్రామికాభివృద్ధితో ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్ వృద్ధిచెందుతోంది’ అని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే కార్యక్రమంలో అన్నారు. ఈ సందర్భంగా మంత్రి గుజరాత్ కోసం 75 , కర్ణాటక కోసం 100 ఈవీ బస్సులను ప్రారంభించారు. పుణెలోని ఇండస్ట్రీ 4.0(సీ4ఐ4) ల్యాబ్‌నూ మొదలుపెట్టారు. స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్‌పై భారీ పరిశ్రమల శాఖ ప్రత్యేక దృష్టిపెట్టింది. పర్యావరణహిత అభివృద్ధిని భారత్ చాటిచెప్పింది పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే ఆర్థికాభివృద్ధిని భారత్ సాధిస్తోందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. అక్టోబర్ రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు భారత్ ‘వైల్డ్‌లైఫ్ వీక్’ను పాటిస్తోంది. ఈ మేరకు దేశ ప్రజలకు మోదీ హిందీలో గురువారం ఇచ్చిన సందేశాన్ని కేంద్ర పర్యావరణశాఖ శుక్రవారం ట్వీట్ చేసింది. ఆ సందేశంలో మోదీ ఏం చెప్పారంటే.. ‘పరిశ్రమలతోనే ఆర్థికాభివృద్ధి సాధ్యం. అయితే, పరిశ్రమలతో పర్యావరణానికి ముప్పు పొంచి ఉంటుంది. కానీ, పర్యావరణానికి ప్రమాదం వాటిల్లకుండానే ఆర్థికాభివృద్ధి దిశగా పయనించడమెలాగో ప్రపంచానికి భారత్ సాధించి చూపింది. సరైన విధానపర నిర్ణయాలు, అమలుతోనే ఇది సాకారమైంది. తోటి జీవాల పట్ల, జీవావరణం, జీవ వైవిధ్యం మీద మనిషి మరింత దృష్టిసారించాలి. భారత్ గడిచిన ఎనిమిదేళ్లలో కొత్తగా 259 స్థలాలను అభయారణ్యాలుగా గుర్తించి సంరక్షణ బాధ్యతలు తీసుకుంది. పులుల సంఖ్యను రెట్టింపు చేసుకుంటూ లక్ష్యాన్ని నిర్దేశిత సమయంకంటే ముందే చేరుకున్నాం. ఆసియా సింహాలు, గజరాజుల సంఖ్యా పెరుగుతోంది’ అని అన్నారు. -
ఎమర్జింగ్ టెక్నాలజీ..రెండు అంచుల కత్తి: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్, బ్లాక్‌చైన్, డేటా సైన్సెస్ వంటి ఆధునిక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిజ్ఞానం రెండు వైపులా పదును ఉన్న కత్తిలాంటివి. ఈ ఎమర్జింగ్ టెక్నాలజీ (కొత్త, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ) వినియోగంతో కలిగే లాభనష్టాలపై ప్రభుత్వాలకు పూర్తి అవగాహన ఉండాలి’ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో భాగంగా ‘ప్రజా బాహుళ్యంలోకి కృత్రిమ మేథస్సు (ఏఐ).. ప్రజల్లో విశ్వాసం కల్పించాల్సిన ఆవశ్యకత’ అనే అంశంపై మంగళవారం జరిగిన చర్చాగోష్టిలో కేటీఆర్ తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రభుత్వాలకు నియంత్రణ అధికారాలు ఇవ్వాలి ‘ఫేషియల్ రికగ్నిషన్ (ముఖాన్ని బట్టి వ్యక్తుల గుర్తింపు), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించడంలో ప్రజల విశ్వాసం, నమ్మకం పొందడమే ప్రభుత్వాలకు అత్యంత సవాలుతో కూడుకున్న అంశం. డేటా భద్రత, దాని వినియోగంలో నిష్పక్షపాతంగా వ్యవహరించడంతో పాటు, అనుమతి లేకుండా నిఘా కార్యకలాపాలకు ఈ టెక్నాలజీని ఉపయోగించబోమనే భరోసా ప్రజలకు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. ఎమర్జింగ్ టెక్నాలజీ వినియోగంపై ప్రభుత్వ విభాగాలకు ఎలాంటి నియంత్రణ అధికారాలు ఉండాలనే అంశాన్ని స్పష్టంగా నిర్దేశిస్తేనే ప్రజలకు భరోసా ఏర్పడుతుంది. పార్లమెంటరీ విధానంలో ప్రభుత్వాలకు నియంత్రణ అధికారాలు ఇవ్వాలి..’అని కేటీఆర్ సూచించారు. టెక్నాలజీని సరైన రీతిలో ఉపయోగించాలి ‘ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఆధారంగా నేరస్తులు, తప్పిపోయిన వ్యక్తులను గుర్తించడం పోలీసులకు సులభమవుతుంది. దీనిద్వారా నేరాల నియంత్రణ, సమర్థ పోలీసింగ్ సాధ్యమవుతుందని ప్రభుత్వాలు అర్థం చేసుకుంటున్నాయి. అయితే ఈ టెక్నాలజీని ఉపయోగించే ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం కలిగించేందుకు మరిన్ని చర్యలు చేపట్టాలి. ఈ టెక్నాలజీని సరైన రీతిలో ఉపయోగిస్తే పోలీసులతో పాటు ప్రజలకు కూడా విస్తృత ప్రయోజనాలు కలుగుతాయి. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా సేకరించే డేటా, ఇతర ఫలితాలను ప్రజలతో పంచుకున్నపుడే ఈ ప్రక్రియ విజయవంతం అవుతుంది..’అని మంత్రి వ్యాఖ్యానించారు. చర్చాగోష్టిలో నిప్పన్ ఎలక్ట్రిక్ కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ తకయుకి మోరిట, ఉషాహిది సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఈడీ ఎంజీ నికోల్, ఎడ్జ్టెక్ సీఈఓ కోయెన్వాన్ ఓస్ట్రోమ్ పాల్గొన్నారు. అలాగే దావోస్ వేదికగా డెలాయిట్ గ్లోబల్ సీఈఓ పునీత్ రంజన్ మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. డిజిటల్ హెల్త్, డిజిటల్ ఎడ్యుకేషన్, వాతావరణ మార్పు అంశాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడంపై చర్చించారు. నోవార్టిస్ విస్తరణ ప్రణాళికలు ‘అనేక దేశాల్లో తయారీ యూనిట్లతో పాటు పరిశోధన కేంద్రాలను కలిగిన నోవార్టిస్ హైదరాబాద్‌లో కంపెనీ విస్తరణ ప్రణాళికలు రూపొందిస్తోంది. భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న బహుళ జాతి ఫార్మా కంపెనీల్లో నోవార్టిస్ సామర్థ్యం అతిపెద్దది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నోవార్టిస్ కార్యాలయం 9వేల మంది ఉద్యోగులతో రెండో అతిపెద్ద కార్యాలయంగా మారింది. హైదరాబాద్‌లోని ఆవిష్కరణలు, నైపుణ్యం కలిగిన మానవ వనరుల వల్లే ఇది సాధ్యమైంది.’అని నోవార్టిస్ సీఈఓ వాస్ నరసింహన్ దావోస్‌లో కేటీఆర్‌తో భేటీ సందర్భంగా వ్యాఖ్యానించారు. సోదరుడు వైఎస్ జగన్‌తో భేటీ అద్భుతం డబ్ల్యూఈఎఫ్ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో కేటీఆర్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. వైఎస్ జగన్‌తో దిగిన ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేస్తూ.. ‘నా సోదరుడు ఏపీ సీఎం జగన్‌తో భేటీ అద్భుతంగా జరిగింది..’అని మంత్రి ట్వీట్ చేశారు. మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రేతోనూ కేటీఆర్ భేటీ అయ్యారు. తెలంగాణ ఐటీ, లైఫ్‌సైన్సెస్ రంగంపై ఆదిత్య ఠాక్రే ఆసక్తి చూపగా, పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణ చేపట్టిన హరితహారం, పంచాయతీరాజ్ చట్టంలో 10 శాతం నిధులను గ్రీన్ బడ్జెట్ కింద కేటాయించడం గురించి కేటీఆర్ వివరించారు. తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు త్వరలో హైదరాబాద్ రానున్నట్లు ఆదిత్య థాకరే తెలిపారు. ఏపీ లోక్‌సభ సభ్యులు మిథున్‌రెడ్డి, ఎన్ఈసీ కార్పొరేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నొరిహికో ఇషిగురో, భారతి ఎంటర్ప్రైజెస్ చైర్మన్ భారతి మిట్టల్, వైస్ చైర్మన్ రాజన్ భారతి మిట్టల్, హెచ్‌సీఎల్ ఎండీ విజయ్ గుంటూరు, భారత్ ఫోర్జ్ డిప్యూటీ ఎండీ అమిత్ కళ్యాణిలు కేటీఆర్‌ను కలిశారు. ఆశీర్వాద్ రూ.500 కోట్ల పెట్టుబడి తెలంగాణలో రూ.500 కోట్లు పెట్టుబడితో 500 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించాలని ఆశీర్వాద్ పైప్స్ (ఎలియాక్సిస్) నిర్ణయించింది. ఈ మేరకు దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో మంగళవారం ఒప్పందం కుదిరింది. తెలంగాణలో ఏర్పాటు చేసే ప్లాంట్ ద్వారా స్టోరేజి, డిస్ట్రిబ్యూషన్ పైప్స్, ఫిట్టింగ్స్ వంటి ప్లాస్టిక్ ఉత్పత్తులు తయారు చేస్తామని కంపెనీ సీఈఓ కోయిన్ స్టికర్ వెల్లడించారు. ఉత్పత్తులను దేశీయ మార్కెట్‌కే పరిమితం చేయకుం డా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తామన్నారు. -
ఏపీజే ఎడ్యుకేషన్‌తో ఏడబ్ల్యూఎస్ జట్టు
న్యూఢిల్లీ: బోధన రంగంలో టెక్నాలజీని మరింత విస్తృతంగా వినియోగించుకోవడంలో విద్యా సంస్థలకు తోడ్పాటు అందించే దిశగా ఏపీజే ఎడ్యూకేషన్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) కలిసి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ యాక్సిలరేటర్ ప్రో గ్రాం (ఎన్‌ఈపీఏపీ)ను ఆవిష్కరించాయి. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా విద్యా రంగంలో పబ్లిక్ డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనకు ఇది తోడ్పడనుంది. విద్యా సంస్థల కు మార్గదర్శకత్వం వహించేందుకు ఎన్‌ఈపీఏపీ తోడ్పడగలదని ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. విద్యా సంస్థల సవాళ్లను గుర్తించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి టెక్నాలజీల సాయంతో పరిష్కార మార్గాలను రూపొందించడంలో ఎన్‌ఈపీఏపీ సహకారం అందిస్తుంది. అలాగే రిమోట్ లెర్నింగ్, ఆన్లైన్ పరీక్షల నిర్వహణ..మదింపు, మీడి యా సేవలు, కంటెంట్ డెలివరీ తదితర అంశాల్లో విద్యా సంస్థలకు అవసరమైన తోడ్పాటు అందిస్తుంది. బోధన, అభ్యాసం, ప్లానింగ్, నిర్వహణ వంటి అంశాల్లో విస్తృతంగా టెక్నాలజీని ఉపయోగించడం .. వివిధ ప్లాట్‌ఫామ్‌లను సపోర్ట్ చేసేలా విద్యా రంగంలో బహిరంగ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేయడం అనే రెండు ప్రధాన లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని ఎన్ఈపీ 2020ని రూపొందించారు. చదవండి: అదానీ చేతికి హోల్సిమ్ ఇండియా -
సరికొత్త విప్లవం: అమెజాన్ బట్టల దుకాణం
Amazon Announced Physical Cloth Store: ఆన్లైన్ ఈ-కామర్స్ రారాజు అమెజాన్ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ-వరల్డ్ నుంచి రియల్ వరల్డ్‌లోకి అడుగుపెట్టనుంది. ఈ మేరకు లాస్ ఏంజెల్స్‌లో క్లాతింగ్ స్టోర్‌ను(bricks-and-mortar clothing store) ప్రారంభించనున్నట్లు కంపెనీ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. కాలిఫోర్నియా నగరం లాస్ ఏంజెల్స్‌లో అమెజాన్ కంపెనీ ఈ ఏడాది చివర్లో ఈ క్లాత్ స్టోర్‌ను ప్రారంభించనుంది. అమెజాన్ స్టైల్ స్టోర్ ప్రత్యేకత ఏంటంటే.. కస్టమర్లు అమెజాన్ యాప్‌ని ఉపయోగించి దుస్తుల QR కోడ్లను స్కాన్ చేయడం, తమకు కావాల్సిన సైజులతో పాటు రంగులను ఎంచుకోవవచ్చు. ఆపై వాటిని ప్రయత్నించడానికి ఫిట్టింగ్ రూమ్‌లకు అనుమతిస్తారు. ఇదంతా స్మార్ట్ మెథడ్‌లో కొనసాగుతుంది. ఇక ఈ ఫిట్టింగ్ రూమ్‌లను ‘‘పర్సనలైజ్డ్ స్పేస్’’గా పేర్కొంటూ.. అందులోనూ టచ్ స్క్రీన్లను ఏర్పాటు చేస్తారు. అవసరం అనుకుంటే ఆ స్క్రీన్ మీద కస్టమర్ తమకు కావాల్సిన దుస్తుల్ని ఎంచుకోవవచ్చు. తద్వారా అటు ఇటు తిరగాల్సిన అవసరం లేకుండా.. బోలెడు టైం ఆదా అవుతుంది. యాప్ ద్వారా షాపర్స్ అభ్యర్థించిన వస్తువులతో పాటు ఆప్షన్స్ ద్వారా కార్ట్‌కు జోడించిన(యాడ్ చేసిన) ఎంపికలను సైతం ఆ ఫిట్టింగ్ రూంకి పంపిస్తారు. ‘‘కస్టమర్ షాపింగ్ చేస్తున్నంతసేపు అమెజాన్ మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్‌లు యాక్టివేట్‌గా ఉంటాయి. అవి వాళ్లకు తగిన, రియల్ టైం సిఫార్సులను ఉత్పత్తి చేస్తాయి. తద్వారా కస్టమర్లు ఇబ్బంది పడకుండా కావాల్సినవి ఎంచుకోవచ్చు’’ అని అమెజాన్ ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాదు డెలివరీ విషయంలో ఆన్సైట్ ఆపరేషన్స్ తరహాలోనే అత్యాధునిక టెక్నాలజీ ద్వారా త్వరగతిన చేయిస్తాయి. మార్కెట్లో అమెజాన్ ఆధిపత్యం అధికంగా ఉంటోందని పోటీదారులు, ప్రభుత్వాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీటెల్(వాష్టింగ్టన్) కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెజాన్.. ఫిజికల్ స్టోర్ల ద్వారా తన రిటైల్ ఉనికిని విస్తరించేందుకు ముందుకు వచ్చింది. ఇదిలా ఉంటే 2017లో అమెజాన్ హోల్ ఫుడ్స్ మార్కెట్ గ్రోసరీ చైన్‌ను $13.7 బిలియన్ డాలర్లకు చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. తద్వారా ఫిజికల్ రిటైల్‌లో ఈ చర్య, ఈ-కామర్స్ దిగ్గజపు ఉనికిని గణనీయంగా విస్తరించింది. చదవండి: అమెజాన్ 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్'..! 70 శాతం మేర తగ్గింపు! -
రాబోయే రోజుల్లో ఈ రంగాల్లో భారీ ఉద్యోగ అవకాశాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది టెక్నాలజీ ఆధారిత రంగాల్లో నియామకాలు జోరుగా ఉంటాయని మాన్స్టర్.కామ్ నివేదిక తెలిపింది. ‘ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ వంటి రంగాల్లో నియామకాల డిమాండ్ పెరుగుతుంది. వేగవంతమైన సాంకేతికతను స్వీకరించడంతో ఏఐ, మెషీన్ లెర్నింగ్ పాత్ర 2022లో వృద్ధి చెందుతుంది. నూతన సాధారణ స్థితికి అనుగుణంగా కంపెనీలు సంస్థాగత వ్యూహాలు, లక్ష్యాలను మార్చుకున్నప్పుడు సాంకేతికతను స్వీకరించడం మళ్లీ రెట్టింపు అయింది. ఉద్యోగాల మార్పు, ఉపాధి సంక్షోభం నేపథ్యంలో నిపుణులైన మానవ వనరుల కోసం వేట పెరగడంతో నైపుణ్యం పెంచుకునే ప్రక్రియ కొత్త స్థాయికి చేరుకుంది. భవిష్యత్తులో ప్రతిభను నిలుపుకోవడంలో ఉద్యోగి సౌలభ్యం కీలకం. మార్కెట్లో ఉన్న భారీ డిమాండ్‌తో ఉద్యోగులు తమకు నచ్చిన వృత్తిని ఎంచుకోవడానికి తలుపులు తెరుస్తోంది. మూడవ అతిపెద్ద మార్కెట్‌గా.. ఏఐ, మెషీన్ లెర్నింగ్ విభాగాల్లో పెట్టుబడులు వచ్చే రెండేళ్లు ఏటా 33.49 శాతం అధికం అవుతాయి. చాట్‌బోట్స్ వినియోగం పెరుగుతుంది. వేగంగా విస్తరిస్తున్న భారతీయ ఫిన్‌టెక్ రంగం 2025 నాటికి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద మార్కెట్‌గా అవతరిస్తుందని అంచనా. 2022లో ఐటీ పరిశ్రమ ఏడు శాతం వృద్ధి చెందుతుంది. 2021–22 ద్వితీయార్థం 4,50,000 మంది స్థూల ఉద్యోగుల చేరికను చూసే అవకాశం ఉంది. బిగ్ డేటా అనలిటిక్స్ ఉద్యోగాలకు భారీ డిమాండ్ ఉండొచ్చు. ఫిన్‌టెక్, రిటైల్, ఈ–కామర్స్, సోషల్ కామర్స్‌లో సేల్స్ నిపుణుల అవసరం అధికం కానుంది. ఉద్యోగులు ఇంటి నుంచి పని చేసేందుకే ఉత్సాహం చూపుతుండడంతో ద్వితీయ శ్రేణి నగరాల్లో చిన్న కార్యాలయాల ఏర్పాటు లేదా కో–వర్కింగ్ స్పేస్‌ను వినియోగించుకోవాలని కంపెనీలు చూస్తున్నాయి. ఫ్రెషర్ల కోసం నియామకాలు గడిచిన మూడు నెలల్లో పెరిగాయి. ఈ ఏడాది ఇవి మరింత అధికం కానున్నాయని టాలెంట్ అక్విజిషన్ అనలిస్ట్ రేచల్ స్టెల్లా రాజ్ తెలిపారు. చదవండి: బెంగళూరుకి ఝలక్ ! నియామకాల్లో హైదరాబాద్ టాప్ -
కృత్రిమ మేధలో ట్యూరింగ్ టెస్ట్ అంటే ఏమిటి?
తెల్లనివన్నీ పాలూ కాదు... నల్లనివన్నీ నీళ్లూ కాదు! అలాగే.. స్మార్ట్ఫోన్లు మొదలుకొని ఈ కామర్స్ గోదాముల వరకూ.. అన్నిచోట్ల ఉండేది ఒకే రకమైన కృత్రిమ మేధ కూడా కాదు! ఒక్కో చోట.. ఒక్కో టెక్నాలజీ! అన్నింటిలోనూ కామన్... ఈ శతాబ్దపు టెక్నాలజీగా పేరు సంపాదించుకున్న ఈ కృత్రిమ మేధ! ఏమిటిది? ఎన్ని రకాలు? తేడాలేమిటి? కృత్రిమ మేధ అంటే..? పేరులో ఉన్నట్లే కృత్రిమమైన మేధ. అంటే.. జంతువులు, మనుషుల్లోని సహజమైన మేధ కాకుండా.. ఇదే రకమైన బుద్ధిని యంత్రాలూ ప్రదర్శించడం. కొంచెం సులువుగా చెప్పుకోవాలంటే.. మనుషుల్లా ఆలోచించడమే కాకుండా తదనుగుణంగా స్పందించే సాంకేతిక పరిజ్ఞానం అనవచ్చు. స్థూలంగా ఈ కృత్రిమ మేధలో మూడు అంశాలు ఉంటాయి. మొదటిది నేర్చుకోవడం... పసిపిల్లలు తమ పరిసరాలను పరిశీలిస్తూ ఎలాగైతే విషయాలను అర్థం చేసుకుంటారో.. కృత్రిమ మేధను అభివృద్ధి చేసే సమయంలోనూ కొన్ని ప్రాథమిక అంశాలను అందించి వాటిద్వారా కొత్త విషయాలను నేర్చుకునేలా చేస్తారు. రెండోది రీజనింగ్! తెల్లగా ఉందన్న వెంటనే అవి పాలు అని అర్థం చేసుకోకుండా.. తర్కాన్ని జోడించి విషయాలను తెలుసుకోవడం అన్నమాట. ముచ్చటగా మూడోది.. తప్పులు దిద్దుకోవడం.. నడక నేర్చుకునే క్రమంలో పిల్లలు కొన్నిసార్లు కిందపడ్డా.. బ్యాలెన్స్‌ను కాపాడుకోవడంలో చేసిన తప్పులను దిద్దుకున్నట్లే కృత్రిమ మేధ తాలూకూ సాఫ్ట్వేర్ నేర్చుకున్న అంశాల్లో ఏవైనా తప్పులు ఉంటే వాటిని సరిచేసుకుంటుందన్నమాట. ట్యూరింగ్ టెస్ట్! కృత్రిమ మేధ పూర్తిస్థాయిలో పనిచేస్తోందా? లేదా? తెలుసుకునేందుకు బ్రిటిష్ శాస్త్రవేత్త అలన్ ట్యూరింగ్ 1943లోనే ఓ పరీక్షను ప్రతిపాదించాడు. ట్యూరింగ్ టెస్ట్ అని పిలుస్తారు దీన్ని. కంప్యూటర్, మనిషి సంభాషించుకుంటూండగా... న్యాయనిర్ణేత వారికి కొన్ని ప్రశ్నలు వేస్తాడు. వాటి ద్వారా ఎవరు మనిషి ఎవరు కాదు? అన్నది తేల్చలేకపోతే... కంప్యూటర్ ట్యూరింగ్ టెస్ట్ పాసైనట్లు లెక్క. 2014లో పదమూడేళ్ల ఉక్రెయిన్ బాలుడి మాదిరిగా ఓ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ట్యూరింగ్ టెస్ట్‌లో పాల్గొంది. న్యాయనిర్ణేతలతో సంభాషణలు జరిపినప్పుడు కనీసం 33 శాతం మంది అవతలివైపు ఉన్నది మనిషేనని గట్టిగా భావించారు. ఎన్ని రకాల టెక్నాలజీలు.. రోబోటిక్స్: కృత్రిమ మేధతో పనిచేసే రోబోల డిజైనింగ్, తయారీ, అభివృద్ధి అన్నీ ఇందులో భాగం. అవసరాన్ని బట్టి వేర్వేరు పనులు చేయగల రోబోలను తయారు చేస్తారన్నమాట. ఉదాహరణకు కార్ల ఫ్యాక్టరీలో రోబోటిక్ హ్యాండ్ వంటివి అవసరమైతే.. శస్త్రచికిత్సలు చేసేందుకు సునిశితమైన కదలికలు కలిగిన రోబోలు అవసరమవుతాయి. హోటల్లో వెయిటర్‌గా, సూపర్మార్కెట్లో క్యాషియర్‌గా వ్యవహరించే రోబోలకు ఆయా పనులకు తగ్గ డిజైనింగ్, సామర్థ్యాలు అవసరమవుతాయని వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. మెషీన్ లెర్నింగ్: అంకెలు, అల్గారిథమ్‌ల సాయంతో యంత్రాలు/కంప్యూటర్లు కొత్త కొత్త విషయాలను నేర్చుకోవడాన్ని మెషీన్ లెర్నింగ్ అంటారు. మొదట్లో కొన్ని తప్పులు జరిగినప్పటికీ మనిషి మాదిరిగానే అనుభవంతో కచ్చితత్వం అలవడుతుంది మెషీన్ లెర్నింగ్‌లో. యంత్రం/కంప్యూటర్ నేర్చుకుంటున్న క్రమంలో మనిషి పాత్ర ఉంటే దాన్ని సూపర్వైజ్డ్ మెషీన్ లెర్నింగ్ అని, లేకపోతే అన్సూపర్వైజ్డ్ అని పిలుస్తారు. కస్టమర్ సర్వీస్ మొదలుకొని మెడికల్ డయాగ్నసిస్ వరకూ మెషీన్ లెర్నింగ్‌కు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్: మనిషి మాట్లాడే భాషను అర్థం చేసుకుని తదనుగుణంగా స్పందించేందుకు ఉద్దేశించిన కృత్రిమ మేధ విభాగం ఈ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్ఎల్పీ) టెక్నాలజీ. మీరెప్పుడైనా గ్రామర్లీని ఉపయోగించారా? ఇంగ్లిషు భాషలో మనం రాసే వాక్యాల వ్యాకరణాన్ని సరిదిద్దేందుకు పనికొస్తుందిది. ఎన్ఎల్పీ ద్వారా పనిచేస్తుంది. ఈ మెయిళ్లలో స్పామ్‌ను గుర్తించేదీ, సోషల్‌మీడియాపై పెట్టే నిఘా, కొన్ని వెబ్సైట్లలో మనతో మాట్లాడే చాట్బోట్లూ ఈ ఎన్ఎల్పీ ఆధారంగా తయారైనవే. అటానమస్ వెహికిల్స్: డ్రైవర్లు అవసరం లేని కార్ల గురించి మనం తరచూ వింటూ ఉంటాం. వాహనంలో ఏర్పాటు చేసిన పలు రకాల సెన్సర్లు, కెమెరాల ద్వారా అందే సమాచారం మొత్తాన్ని ఏ క్షణానికి ఆ క్షణం విశ్లేషించుకుంటూ తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం ఆ అటానమస్ వెహికల్స్ టెక్నాలజీలో జరిగే ప్రక్రియ. టెస్లా కొన్నేళ్ల క్రితం ఈ డ్రైవర్ల అవసరం లేని వాహనాలను అందుబాటులోకి తేగా... చట్టపరమైన సమస్యల కారణంగా వాటి వినియోగం పూర్తిస్థాయిలో జరగడం లేదు. భారత్‌లో ఇటీవల కొన్ని మోడళ్ల కార్లలో పరిమిత స్థాయిలో ఈ అటానమస్ వెహికిల్ టెక్నాలజీని వాడటం మొదలుపెట్టారు. రొబోటిక్ ప్రాసెస్ ఆటొమేషన్: కృత్రిమ మేధ విషయంలో అతితక్కువ విలువ ఉన్న టెక్నాలజీ ఇదే కావచ్చు. పదేపదే చేయాల్సిన పనిని యంత్రాలకు లేదా సాఫ్ట్‌వేర్‌కు అప్పగించడం ఈ రొబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్. లెక్కలేయడం, రికార్డుల నిర్వహణ వంటివి దీనికి ఉదాహరణలు. న్యూరల్ నెట్వర్క్: శరీరంలోని నాడులు, నాడీవ్యవస్థ మెదడు పనితీరుల ఆధారంగా యంత్రాలకు నిర్దిష్టమైన పనులు నేర్పడం, చేసేలా చేయడం కోసం ఈ న్యూరల్ నెట్‌వర్క్‌లను వాడతారు. మెదడులోని న్యూరాన్ల మధ్య సంబంధాలు ఉన్నట్లే.. కృత్రిమ మేధకు చెందిన న్యూరల్ నెట్‌వర్క్‌లో కొన్ని అల్గారిథమ్‌లను ఉపయోగిస్తారు. ఆన్లైన్ మోసాలను గుర్తించేందుకు ఎక్కువగా వాడుతూంటారు దీన్ని. స్టాక్‌మార్కెట్ తీరుతెన్నుల అంచనాకు, రిస్క్ అనాలసిస్ వంటి వాటికీ ఈ కృత్రిమ మేధ బాగా ఉపయోగపడుతుంది. మెషీన్ విజన్.. యంత్రాలకు కళ్లు తీసుకొస్తే అది మెషీన్ విజన్. రంగు చూసి పండా? కాయా? అన్నది తెలుసుకున్నట్లే యంత్రం కూడా తన దృష్టితో కొన్ని విషయాలను అర్థం చేసుకునేలా చేస్తారు దీంట్లో. బిస్కెట్ల ఫ్యాక్టరీలో దీన్ని వాడారనుకోండి.. విరిగిపోయిన వాటిని ఎక్కడికక్కడ గుర్తించి అవి ప్యాక్ కాకుండా జాగ్రత్త పడవచ్చు. అలాగే పండ్లు, కాయగూరల్లో పనికిరాని వాటిని వేరు చేసేందుకూ మెషీన్ విజన్ ఉపయోగపడుతుంది. బార్కోడ్ల సమాచారాన్ని గుర్తించేందుకూ ఇదే టెక్నాలజీని వాడతారు. – సాక్షి, హైదరాబాద్ -
‘బ్లాక్‌చెయిన్’పై తాన్లా దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీ సీపాస్ (కమ్యూనికేషన్ ప్లాట్‌ఫాం యాజ్ ఏ సర్వీస్) దిగ్గజం తాన్లా ప్లాట్‌ఫామ్స్.. కొత్త ఆవిష్కరణలపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి ఇన్నోవేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తోంది. ప్రత్యేకంగా బ్లాక్‌చెయిన్, ఆర్టీఫిషీయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీ న్ లెర్నింగ్ (ఎంఎల్), క్రిప్టోగ్రఫీ తదితర అంశాల్లో ఆవిష్కరణల కోసం దీన్ని ఉపయోగించనుంది. సుమారు 92,000 చ.అ. విస్తీర్ణంలో దాదాపు రూ. 70 కోట్లతో ఈ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు క్యూ2 ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీ వ్యవస్థాపక చైర్మన్, సీఈవో ఉదయ్ రెడ్డి తెలిపారు. దీనికోసం 300 మంది సిబ్బందిని రిక్రూట్ చేసుకుంటున్న ట్లు, మార్చి నాటి కల్లా ఇది అందుబాటులోకి రానున్నట్లు ఆయన చెప్పారు. అలాగే, టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో కలిసి అందిస్తున్న వైజ్లీ ప్లాట్‌ఫామ్‌ను నాలుగో త్రైమాసికంలో అంతర్జాతీయ మార్కెట్లలో పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టేందుకు కసరత్తు జరుగుతోందని ఉదయ్ రెడ్డి వివరించారు. దీనికి సంబంధించి ఒక అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ అడ్వైజరీ సర్వీసులు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గేమింగ్, ఫిన్‌టెక్‌తో సీపాస్కు ఊతం.. కొన్నాళ్లుగా నెలకొన్న పరిస్థితులతో డిజిటలైజేషన్ జోరందుకుందని, దీంతో సీపాస్ విభాగానికి మరింత ఊతం లభిస్తోందని ఉదయ్ రెడ్డి తెలిపారు. బ్యాంకింగ్, బీమా, ఎడ్టెక్, గేమింగ్, ఫిన్‌టెక్ తదితర విభాగాలు ఇందుకు గణనీయంగా తోడ్పడుతున్నాయని చెప్పారు. ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ మొదలైన వాటి రూపంలో వినియోగదారులకు కంపెనీలు సందేశాలు పంపేందుకు అవసరమైన సీపాస్ సర్వీసులకు డిమాండ్ భారీగా పెరుగుతోందని పేర్కొన్నారు. ఆటో–డెబిట్ నిబంధనల్లో మార్పులు వంటి నియంత్రణ సంస్థలపరమైన చర్యలు, వాట్సాప్ లాంటి ఓవర్ ది టాప్ (ఓటీటీ) ప్లాట్‌ఫామ్‌లకు కావాల్సిన సర్వీసులు మొదలైనవి సంస్థ వ్యాపార వృద్ధికి దోహదపడుతున్నాయని ఉదయ్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో తాన్లా అవకాశాలను అందిపుచ్చుకుని, వేగంగా వృద్ధి చెందుతోందని ఉదయ్ రెడ్డి చెప్పారు. దేశీ రెవెన్యూ మార్కెట్లో తమ వాటా 45 శాతం పైగా ఉందని ఆయన వివరించారు. కోవిడ్ టీకాల విషయంలో ఓటీపీలు మొదలైనవి పంపేందుకు సంబంధించి ప్రభుత్వానికి కూడా తమ సంస్థ సరీ్వసులు అందిస్తోందని పేర్కొన్నారు. క్యూ2లో లాభం 67% జూమ్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో తాన్లా ప్లాట్‌ఫామ్స్ నికర లాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 67% ఎగిసి రూ. 136 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నికర లాభం రూ. 81 కోట్లు. ఆదాయం 44% వృద్ధితో రూ. 842 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో ఇది రూ. 583 కోట్లు. ప్రస్తుత కస్టమర్లతో పాటు కొత్త కస్టమర్ల చేరిక, మార్కెట్ వాటా పెంచుకోవడం తదితర అంశాల ఊతంతో ఇది సాధ్యపడిందని ఉదయ్ రెడ్డి వివరించారు. సమీక్షాకాలంలో కొత్తగా 87 కస్టమర్లు జతయ్యారని ఆయన పేర్కొన్నారు. క్యూ4లో 111 మంది ఉద్యోగులు చేరారు. పర్యావరణ, సామాజిక, గవర్నెన్స్ (ఈఎస్జీ) లక్ష్యాలకు సంబంధించి తెలంగాణ విద్యా శాఖతో తాన్లా ఫౌండేషన్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. -
ఈ–కామర్స్‌పై మరింతగా ఐటీసీ దృష్టి
న్యూఢిల్లీ: ఈ–కామర్స్‌పై, ఆధునిక వ్యాపార విధానాలపై పారిశ్రామిక దిగ్గజం ఐటీసీ మరింతగా దృష్టి పెడుతోంది. ఉత్పాదకతను పెంచుకోవడానికి, వ్యయాలను తగ్గించుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ మొదలైన ఆధునిక డిజిటల్ టెక్నాలజీలను వినియోగించుకుంటోంది. 2020–21 వార్షిక నివేదికలో కంపెనీ ఈ విషయాలు వెల్లడించింది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో వినియోగదారులు ఇళ్ల నుంచే కొనుగోళ్లు జరిపేందుకు ప్రాధాన్యమిస్తుండటంతో ఈ–కామర్స్‌కు ఊతం లభించిందని పేర్కొంది. ఇంటర్నెట్ వినియోగం .. డిజిటల్ చెల్లింపుల లావాదేవీలు పెరగడం, ఆకర్షణీయమైన పథకాలు, ఉత్పత్తుల విస్తృత శ్రేణి, వేగవంతమైన డెలివరీలు మొదలైనవి ఈ విభాగం మరింతగా ప్రాచుర్యంలోకి వచ్చేందుకు దోహదపడుతున్నాయని ఐటీసీ అభిప్రాయపడింది. ఇలాంటి అంశాలన్నింటి తోడ్పాడుతో గత నాలుగేళ్లుగా తమ మార్జిన్లు గణనీయంగా మెరుగుపడ్డాయని పేర్కొంది. డోమినోస్, స్విగ్గీ, జొమాటో, డుంజో వంటి సంస్థలతో చేతులు కలపడం ద్వారా వినియోగదారులకు ఉత్పత్తుల లభ్యత పెరిగిందని ఐటీసీ తెలిపింది. ’ఐటీసీ స్టోర్ ఆన్ వీల్స్’ మోడల్‌తో 13 నగరాల్లో 900 పైగా రెసిడెన్షియల్ కాంప్లెక్సులకు ఉత్పత్తులను అందిస్తున్నట్లు పేర్కొంది. గతేడాది సరిగ్గా లాక్‌డౌన్‌కు ముందు ప్రారంభించిన ఐటీసీ ఈ–స్టోర్‌కు మంచి స్పందన లభిస్తోందని, రాబోయే నెలల్లో దీన్ని మరింత వేగవంతంగా విస్తరించనున్నట్లు కంపెనీ తెలిపింది. -
విద్యార్థులు, నిరుద్యోగులకు డీఆర్డీఓ శుభవార్త
న్యూఢిల్లీ: విద్యార్థులు, నిరుద్యోగులకు డీఆర్డీఓ శుభవార్త తెలిపింది. భారత ప్రభుత్వ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీఓ), డీమ్డ్ విశ్వవిద్యాలయం ఆద్వర్యంలో స్వల్ప కాలనికి రెండు షార్ట్ టర్మ్ ఆన్లైన్ కోర్సులను ప్రారంభిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), సైబర్ సెక్యూరిటీపై రెండు స్వల్పకాలిక ఆన్లైన్ కోర్సులను ప్రారంభించింది. ఈ రెండు కోర్సులు 12వారాల పాటు కొనసాగుతాయి. వారంలోని ఐదు రోజులలో రోజుకి రెండు గంటల చొప్పున ఈ ఆన్లైన్ క్లాస్ నిర్వహించనున్నారు.(చదవండి: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్) ఆన్లైన్ ప్రవేశ పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక అనేది ఉంటుంది. గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఈ కోర్సులలో ఏదైనా స్ట్రీమ్‌లో ప్రవేశం పొందవచ్చు. డిగ్రీ ఫైనల్ చదువుతున్న విద్యార్థులు కూడా ప్రవేశపరీక్షకు హాజరయ్యేందుకు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష రుసుము ఉచితం కాగా, ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఒక్కో కోర్సు ధరఖాస్తు కోసం అభ్యర్థులు 15 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కోర్సుల ప్రవేశ పరీక్షల కోసం రిజిస్ట్రేషన్ జనవరి 28 నుంచి అధికారిక వెబ్సైట్ https://onlinecourse.diat.ac.in/DIATPortal/ ద్వారా ప్రారంభమవుతుంది. ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అడ్మిషన్ ఫీజును ఫిబ్రవరి 26లోగా చెల్లించాల్సి ఉంటుంది. డీఆర్డీఓ ఆన్లైన్ కోర్సుల 2021: రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: జనవరి 28 రిజిస్ట్రేషన్ చివరి తేదీ: ఫిబ్రవరి 15 ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ప్రవేశ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 20 సైబర్ సెక్యూరిటీ ప్రవేశ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 21 మూడు కోర్సుల ఫలితాలు విడుదల తేదీ: ఫిబ్రవరి 22 రుసుము చెల్లించాల్సిన చివరి తేదీ: ఫిబ్రవరి 26 ఆన్లైన్ క్లాస్ ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 28 -
సైబర్‌దాడులకు కృత్రిమ మేథతో చెక్..
న్యూఢిల్లీ: సైబర్‌దాడులను గుర్తించేందుకు, సమర్ధంగా ఎదుర్కొనేందుకు కంపెనీలు ఇకపై మరింతగా కృత్రిమ మేథ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) వంటివి ఉపయోగించనున్నాయి. అయితే, హ్యాకర్లు కూడా ఇదే సాంకేతికతతో మరింత వేగంగా, కచ్చితత్త్వంతో దాడులు చేసే ముప్పు కూడా పొంచి ఉంది. భారత మార్కెట్లో సైబర్ సెక్యూరిటీ అంశంపై డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (డీఎస్‌సీఐ), కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ ఇండియా నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం.. డేటా గోప్యత, భద్రత విషయంలో.. నియంత్రణ సంస్థలపరమైన ఆంక్షలు 2020లో తారస్థాయికి చేరుకోనున్నాయి. దీంతో దేశీ సంస్థలు అటు అంతర్జాతీయంగా నియంత్రణలతో పాటు దేశీయంగా వ్యక్తిగత డేటా భద్రత చట్టాలకు కూడా అనుగుణంగా పనిచేయాల్సి రానుంది. ఫలితంగా డేటా భద్రతకు సంబంధించిన వ్యవస్థలను మెరుగుపర్చుకునేందుకు దాదాపు అన్ని సంస్థలూ మరింత వెచ్చించనున్నాయి. -
ఆ రెండింటితో 25 ఏళ్ల వయసులోనే మిలియనీర్!
సాక్షి, న్యూఢిల్లీ : 25 సంవత్సరాల వయసులోనే మీరు మిలియనీర్ కావాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ నేర్చేసుకోండి అట. వచ్చే ఏళ్లలో ప్రపంచాన్ని నడిపించేది ఈ రెండేనట. ఇప్పటికే సిలికాన్ వ్యాలీ కంపెనీలు ఈ రెండు తెలిసిన వారికి భారీ ఎత్తున ప్యాకేజీలు కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఫేస్బుక్, గూగుల్ లాంటి కంపెనీలు ఈ ఏఐ, మిషన్ లెర్నింగ్ తెలిసిన వారికి ఏడాదికి 5 లక్షల డాలర్లకు పైగా ప్యాకేజీతో తమ కంపెనీల్లోకి రిక్రూట్ చేసుకుంటున్నాయని తెలిసింది. ఇప్పటి వరకు ఈ రెండు పూర్తిగా తెలిసిన వారు కేవలం 10వేల మంది నిపుణులు మాత్రమే ఉన్నారని తాజా రిపోర్టులు పేర్కొన్నాయి. ప్రస్తుతం సిలికాన్ వ్యాలీలో మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిఫియల్ ఇంటెలిజెన్స్ మాత్రమే అతిపెద్ద ట్రెండ్లని రిపోర్టులు తెలిపాయి. ఏఐ టాలెంట్ ఉన్న వారికి టెక్ దిగ్గజాలు ఎంత ప్యాకేజీ ఇవ్వడానికైనా వెనుకాడటం లేదని తెలిసింది. న్యూయార్క్ టైమ్స్ రిపోర్టు ప్రకారం.. కేవలం ఇంజనీరింగ్, మాస్టర్ లెవల్ డిగ్రీ, తక్కువ ఏళ్ల అనుభవమున్నా ఏఐ స్పెషలిస్టు అయితే వారికి 3 లక్షల డాలర్ల నుంచి 5 లక్షల డాలర్ల వేతనాలను సిలికాన్ వ్యాలీ కంపెనీలు చెల్లిస్తున్నాయట. ఒకవేళ ఏఐ ప్రాజెక్టులో అనుభవం వచ్చిన తర్వాత గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, ఆపిల్ లాంటి కంపెనీలైతే మిలియన్ వేతనాలైనా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాయని రిపోర్టు తెలిపింది. ప్రస్తుతం వారికి అంతలా డిమాండ్ ఉందని పేర్కొంది. ఇటీవల కాలంలో ఏఐ, మిషన్ లెర్నింగే టెక్ ప్రపంచాన్ని నడిపిస్తున్నాయని తెలిపింది. వీటిల్లో నిపుణులైన వారు పెద్ద పెద్ద సమస్యలను కూడా ఏఐ, మిషన్ లెర్నింగ్‌తో పరిష్కరించవచ్చని రిపోర్టులు పేర్కొంటున్నాయి. దీంతో ఐఐటీ లాంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లు తమ విద్యార్థులకు ఏఐను ఆఫర్ చేయడం ప్రారంభించాయి. మిషన్ లెర్నింగ్, ఏఐపై తమ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఐఐటీ-హైదరాబాద్ స్పెషల్ కోర్సును కూడా ప్రారంభించింది. -
ఆపిల్ చేతికి హైదరాబాద్ కంపెనీ
హైదరాబాద్ : టెక్ దిగ్గజం ఆపిల్ మరో స్టార్ట్ అప్ కంపెనీని సొంతం చేసుకుంది. హైదరాబాద్ ఆధారిత మెషీన్ లెర్నింగ్ సాఫ్ట్ వేర్ కంపెనీ 'తుప్ల్ జంప్' ను కొనుగోలు చేసింది. రోహిత్ రాయ్ ,బుద్ధవరపు సత్య ప్రకాష్, దీపిక్ సహ వ్యవస్థాపకులుగా 2013లో ప్రారంభించారు. యూనిక్ సాఫ్ట్ వేర్ ద్వారా పెద్దమొత్తంలో కంపెనీల డాటాను స్టోర్, ప్రాసెస్ , విజువలైజ్ తదితర అంశాల్లో విశేషమైన సేవలు అందిస్తోందని టెక్ క్రంచ్ నివేదించింది. అపాచీ స్పార్క్ ప్రాసెసింగ్ ఇంజిన్, అపాచీ కాసాండ్రా, ఎన్ ఓఎస్ క్యూఎల్ డేటాబేస్ లాంటి ఓపెన్ సోర్స్ డేటా టూల్స్ లో మంచి ప్రవేశ ముందని వెంచురీ బీట్ వ్యాఖ్యానించింది. మరోవైపు రోహిత్ రాయ్, సత్యప్రకాష్ ఇప్పటికే ఇద్దరూ ఆపిల్ లో జాయిన్ కాగా, మూడవ సహ వ్యవస్థాపకుడు దీపక్ ఆలూరు అనప్లాన్ లో చేరారు. ఆపిల్ తన టెక్ సేవల విస్తరణ లోభాగంగా చిన్న టెక్నాలజీ కంపెనీలను కొనుగోలు చేస్తోందని టెక్ క్రంచ్ రిపోర్ట్ చేసింది. మరోవైపు ఈ వార్తలతో తుప్ల్ కంపెనీ వెబ్ సూట్ మూతబడింది. ఈ వార్తలపై మరిన్ని వెల్లడి కావాల్సి ఉంది.