Amazon Announced Physical Cloth Store: ఆన్‌లైన్ ఈ-కామర్స్ రారాజు అమెజాన్ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ-వరల్డ్ నుంచి రియల్ వరల్డ్‌లోకి అడుగుపెట్టనుంది. ఈ మేరకు లాస్ ఏంజెల్స్‌లో క్లాతింగ్ స్టోర్‌ను(bricks-and-mortar clothing store) ప్రారంభించనున్నట్లు కంపెనీ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది.
కాలిఫోర్నియా నగరం లాస్ ఏంజెల్స్‌లో అమెజాన్ కంపెనీ ఈ ఏడాది చివర్లో ఈ క్లాత్ స్టోర్‌ను ప్రారంభించనుంది. అమెజాన్ స్టైల్ స్టోర్ ప్రత్యేకత ఏంటంటే.. కస్టమర్‌లు అమెజాన్ యాప్‌ని ఉపయోగించి దుస్తుల QR కోడ్‌లను స్కాన్ చేయడం, తమకు కావాల్సిన సైజులతో పాటు రంగులను ఎంచుకోవవచ్చు. ఆపై వాటిని ప్రయత్నించడానికి ఫిట్టింగ్ రూమ్‌లకు అనుమతిస్తారు. ఇదంతా స్మార్ట్ మెథడ్‌లో కొనసాగుతుంది.
ఇక ఈ ఫిట్టింగ్ రూమ్‌లను ‘‘పర్సనలైజ్డ్ స్పేస్’’గా పేర్కొంటూ.. అందులోనూ టచ్ స్క్రీన్లను ఏర్పాటు చేస్తారు. అవసరం అనుకుంటే ఆ స్క్రీన్ మీద కస్టమర్ తమకు కావాల్సిన దుస్తుల్ని ఎంచుకోవవచ్చు. తద్వారా అటు ఇటు తిరగాల్సిన అవసరం లేకుండా.. బోలెడు టైం ఆదా అవుతుంది. యాప్ ద్వారా షాపర్స్ అభ్యర్థించిన వస్తువులతో పాటు ఆప్షన్స్ ద్వారా కార్ట్‌కు జోడించిన(యాడ్ చేసిన) ఎంపికలను సైతం ఆ ఫిట్టింగ్ రూంకి పంపిస్తారు.
‘‘కస్టమర్ షాపింగ్ చేస్తున్నంతసేపు అమెజాన్ మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్‌లు యాక్టివేట్‌గా ఉంటాయి. అవి వాళ్లకు తగిన, రియల్ టైం సిఫార్సులను ఉత్పత్తి చేస్తాయి. తద్వారా కస్టమర్లు ఇబ్బంది పడకుండా కావాల్సినవి ఎంచుకోవచ్చు’’ అని అమెజాన్ ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాదు డెలివరీ విషయంలో ఆన్‌సైట్ ఆపరేషన్స్ తరహాలోనే అత్యాధునిక టెక్నాలజీ ద్వారా త్వరగతిన చేయిస్తాయి.
మార్కెట్‌లో అమెజాన్ ఆధిపత్యం అధికంగా ఉంటోందని పోటీదారులు, ప్రభుత్వాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీటెల్(వాష్టింగ్టన్) కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెజాన్.. ఫిజికల్ స్టోర్ల ద్వారా తన రిటైల్ ఉనికిని విస్తరించేందుకు ముందుకు వచ్చింది. ఇదిలా ఉంటే 2017లో అమెజాన్ హోల్ ఫుడ్స్ మార్కెట్ గ్రోసరీ చైన్‌ను $13.7 బిలియన్ డాలర్లకు చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. తద్వారా ఫిజికల్ రిటైల్‌లో ఈ చర్య, ఈ-కామర్స్ దిగ్గజపు ఉనికిని గణనీయంగా విస్తరించింది.
చదవండి: అమెజాన్ 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్'..! 70 శాతం మేర తగ్గింపు!
Comments
Please login to add a commentAdd a comment