store
-
క్విక్ విస్తరణ!
క్విక్ కామర్స్ కంపెనీలకు దండిగా నిధులు లభిస్తుండటంతో విస్తరణ జోరు పెంచాయి. నగరాల్లో ఈ మోడల్ మంచి సక్సెస్ సాధించడంతో జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్ బాస్కెట్ తదితర సంస్థలు డార్క్ స్టోర్ల సంఖ్యను భారీగా పెంచడంపై దృష్టి పెడుతున్నాయి. కిరాణాతో మొదలు పెట్టిన కంపెనీలు ఇప్పుడు నెమ్మదిగా ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, మేకప్, టాయ్స్ వంటి ఇతర ప్రొడక్టులను కూడా కార్ట్‌లోకి చేర్చుతున్నాయి. అయితే, బడా నగరాల్లో ఈ మైక్రో వేర్‌హౌస్‌ల కోసం స్థలాల వేట కష్టతరంగా మారుతోందని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి.సమీపంలోని ప్రాంతాలకు 30 నిమిషాల్లోపే ఆర్డర్లను డెలివరీ చేయడానికి వీలుగా ఏర్పాటు చేసే చిన్న స్థాయి గోడౌన్లను డార్క్ స్టోర్లుగా పేర్కొంటారు. కిక్కిరిసిన ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలంటే భారీ ఖర్చుతో కూడిన వ్యవహరం. అయినప్పటికీ కంపెనీలు తగ్గేదేలే అంటున్నాయి. మరోపక్క, రోజువారీ కార్యకలాపాల నిర్వహణ, క్విక్ డెలివరీ విషయంలో లోటుపాట్లు లేకుండా చూసేందుకు భారీ స్థాయిలో సిబ్బంది నియామకాలతో ఈ రంగంలో హైరింగ్ కళకళలాడుతోంది. చిన్న నగరాల్లో స్పీడ్... నగరాల్లోని కిక్కిరిసిన ప్రాంతాల్లో డార్క్ స్టోర్ల ఏర్పాటు సవాలుగా మారుతోందని జెప్టో సీఈఓ ఆదిత్ పలీచా చెబుతున్నారు. గత రెండు నెలల్లోనే బిలియన్ డాలర్లను (దాదాపు రూ.8,400 కోట్లు) సమీకరించడంతో కంపెనీ విలువ 5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కాగా, చండీగఢ్, భువనేశ్వర్ వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో వేగంగా స్థలాలు దొరుకుతుండటంతో అక్కడ విస్తరణ స్పీడ్ పెంచుతున్నామని పలీచా పేర్కొన్నారు. ‘ఈ రంగంలోకి నిధులు పుష్కలంగా వస్తున్నాయని పసిగట్టిన స్థిరాస్తి యజమానులు అద్దెలు భారీగా పెంచేస్తున్నారు.కొన్నిచోట్ల పోటీ కారణంగా బిడ్డింగ్‌లో పాల్గొనాల్సి వస్తోంది’ అని పలీచా వివరించారు. జొమాటో బ్లింకిట్ సైతం భటిండా, హరిద్వార్, విజయవాడ వంటి నగరాల్లో అడుగుపెట్టింది. కస్టమర్లకు వేగంగా సేవలదించేలా డార్క్ స్టోర్ల సైజును కంపెనీలు పెంచుతున్నాయి. గతంలో సగటున 2,500 చదరపు అడుగులున్న ఈ స్టోర్ సైజు 4,000–5,000 చ.అ.కు పెరిగింది. కొన్నిచోట్ల 10,000 చ.అ., మరికొన్ని చోట్ల ఏకంగా 25,000 చ.అ. డార్క్ స్టోర్లు కూడా ఏర్పాటవుతుండటం ఈ రంగంలో జోరుకు నిదర్శనం.‘అమ్మతోడు అరగంటలోపే డెలివరీ చేసేస్తాం’ క్విక్ కామర్స్ దిగ్గజం జెప్టో స్లోగన్ ఇది! ఇందుకు తగ్గట్టుగానే శరవేగంగా దూసుకెళ్తున్న క్విక్ కామర్స్ రంగంలో కంపెనీలు నువ్వానేనా అనేలా తలపడుతున్నాయి. బంపర్ వేల్యుయేషన్లతో ఈ రంగంలోకి పెట్టుబడులు వెల్లువెత్తుతుండటంతో సేవలను ‘క్విక్’గా విస్తరించేందుకు పోటీ పడుతున్నాయి. సిబ్బంది నియామకాలతో పాటు డార్క్ స్టోర్ల సంఖ్య, సైజును కూడా భారీగా పెంచుకుంటున్నాయి. దీంతో కస్టమర్లకు మరిన్ని ఉత్పత్తులు లభించడంతో పాటు మరింత వేగంగా సేవలు లభించేందుకు దోహదం చేస్తోంది.రూ. 300-500 : సగటు ఆర్డర్ విలువ (గతంలో ఇది 200–250గా ఉండేది)4,000 చ. అ. : డార్క్ స్టోర్ ప్రస్తుత సగటు సైజు (అంతక్రితం 2,500 స్థాయిలో ఉండేది). కొన్ని ఏరియాల్లో 10,000 చ. అ. స్టోర్లు కూడా ఉన్నాయి.హైరింగ్.. ఫుల్ స్వింగ్ ‘క్విక్’ విస్తరణ నేపథ్యంలో సిబ్బంది డిమాండ్ తారస్థాయికి చేరుకుంది. ‘ఈ రంగంలో అన్ని విభాగాల్లోనూ హైరింగ్ ఫుల్ స్వింగ్‌లో నడుస్తోంది. ఐదు ప్రధాన కంపెనీలు అగ్ర స్థానం కోసం పోటీ పడుతుండటమే దీనికి ప్రధాన కారణం. ప్రధానంగా లాజిస్టిక్స్ ఇక్కడ అత్యంత కీలక పాత్ర పోషిస్తుండటంతో ఇతర కంపెనీల్లోని నిపుణులైన ఉద్యోగులకు గాలం వేస్తున్నాయి’ అని ఒక క్విక్ కామర్స్ సంస్థ చీఫ్ వెల్లడించారు. ‘మినిట్స్’ పేరుతో లేటుగా ఈ విభాగంలోకి అడుగుపెట్టిన ఫ్లిప్‌కార్ట్ కార్యకలాపాల వేగం పెంచేందుకు బిగ్‌బాస్కెట్ వంటి ఇతర కంపెనీల నుంచి చాలా విభాగాల్లో సిబ్బందిని భర్తీ చేసుకుంటున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మరోపక్క, బిగ్‌బాస్కెట్ సైతం పూర్తి స్థాయి క్విక్ కామర్స్ మోడల్లోకి మారే ప్రయత్నాల్లో ఉండటం విశేషం. ఫ్లిప్‌కార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమితేశ్ ఝా ఇటీవలే స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ సీఈఓగా చేరారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో పాటు మధ్య స్థాయి మేనేజర్లకు డిమాండ్ నెలకొంది. క్యూ–కామర్స్‌లోని మార్కెటింగ్, ఆపరేషన్స్, సప్లయ్ చైన్, ఫైనాన్స్ ఇలా అన్ని విభాగాల్లోనూ వలసలు జోరందుకోవడం గమనార్హం. జెప్టో కూడా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, జొమాటో, స్విగ్లీ, ఓలా, అర్బన్ కంపెనీ తదితర కంపెనీల నుంచి కీలక సిబ్బందిని భారీగా నియమించుకుంటోంది. కంపెనీ ప్రధాన కేంద్రాన్ని బెంగళూరు నుంచి మంబైకి మార్చే సన్నాహాల్లో ఉన్న జెప్టో.. 500 మంది ఎగ్జిక్యూటివ్‌ల వేటలో ఉన్నట్లు పలీచా తెలిపారు. -
హైదరాబాద్‌లో సంయుక్త మీనన్ డైమండ్ స్టోర్ ప్రారంభం (ఫొటోలు)
-
కరివేపాకులు ఆరు నెలలు వరకు నిల్వ ఉండాలంటే..!
కరివేపాకులు కూరల్లో వేస్తే దాని రుచే వేరు. కరివేపాకుతో పెట్టే పోపు దగ్గర నుంచి పులుసులు వరకు అది ఉంటే ఏ రెసిపీ అయినా ఘమఘమలాడిపోవాల్సిందే. అలాంటి కరివేపాకుని నిల్వ చేసుకోవడం కాస్త కష్టంగా ఉంటుంది. ఎలా అయినా కనీసం నాలుగు రోజులు అవ్వంగానే నెమ్మదిగా గోధుమ వర్ణంలోకి వచ్చి వాసన పోయి..క్రమేణ ఆకుపచ్చదనం కూడా తగ్గిపోతుంది. ఎలా అయినా.. అబ్బా..! వీటిని నిల్వ చేయడం కష్టం రా బాబు అనుకుంటారు చాలామంది గృహిణులు. అందుకే చాలమంది వీటిని డ్రైగా చేసి పొడిరూపంలోనూ లేదా ఇతర విధాలుగా నిల్వ చేసుకుని కూరల్లో ఆ ఫ్లేవర్ వచ్చేలా చేస్తారు. అయితే ఆ సమస్యలన్నింటికి చెక్‌పెట్టేలా తాజాగా నిల్వ చేసుకునే సరికొత్త ట్రిక్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే..కరివేపాకులు నిల్వ చేయడం అంత ఈజీ కాదు. కానీ ఈ ట్రిక్ ఫాలో అయితే ఆకులు కలర్ మారకుండా, వాటి వాసన కూడా ఏ మాత్రం పోకుండా చక్కగా తాజాగా ఉంచుకోవచ్చు. ఏకంగా ఇలా ఆరునెలలపాటు నిల్వ చేసుకోవచ్చట. అదేంటంటే..ఒక ఖాళీ ఐస్ ట్రైని తీసుకుని అందులో కరివేపాకు కొమ్మలు నుంచి వేరు చేసిన ఆకులను మూడు లేదా నాలుగు చొప్పున ఆకులను ట్రైలో పెట్టుకుంటూ వచ్చి దానిలో నీళ్లు పోయాలి. ఆ ట్రైని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టాలి అంతే అవన్నీ గడ్డకట్టేసిన క్యూబ్‌లు మాదిరిగా అయిన తర్వాత బయటకు తీసి జిప్ లాక్ బ్యాగ్‌లో ఆ క్యూబ్‌లు వేసుకుని ఫ్రిడ్జ్‌లో భద్రపర్చుకోవాలి. కావాల్సినప్పడు ఆ బ్యాగ్ ఫ్రిడ్జ్‌లోంచి తీసి ఆ క్యూబ్‌లను ఓ గిన్నెలో వేసి దానిలో కొద్దిగా గోరు వెచ్చిని నీళ్లు వేసి కాసేపటి తరువాత చూస్తే తాజా కరివేపాకులు నీటిపై తేలుతూ కనిపిస్తాయి. అవి జస్ట్ ఇప్పుడే చెట్టునుంచి తెంపిన ఆకుల్లా తాజాగా కనిపిస్తాయి. వాటి వాసన కూడా పోదు. ఇలా ఆరునెలలపాటు సులభంగా నిల్వ చేసుకోవచ్చట. ఇది ఎక్కువగా శీతాకాలంలో ఉపయోగపడుతుందట. అయితే ఈ వీడియోని చూసిన నెటిజన్లు.. ఇలాంటి ట్రిక్ విదేశాల్లో ఉండే వారికి చాలా అద్భుతంగా ఉపయోగపుడుతుందని అంటున్నారు. అంతేగాదు జిప్‌లాక్ బ్యాగ్‌లో పుదీనా, కొత్తిమీర, పార్స్లీ ఆకులు ఉంచితే చాలా కాలం పాటు తాజాగా ఉంటాయని చెబుతున్నారు. View this post on Instagram A post shared by Dhara (@twinsbymyside) (చదవండి: రూ. 83 లక్షల జీతం వదులుకుని మరీ పేస్ట్రీ చెఫ్‌గా..రీజన్ వింటే షాకవ్వుతారు!) -
అత్యంత ఖరీదైన టీకప్పు..ధర వింటే షాకవ్వుతారు!
ఎన్నో విలాసవంతమైన వస్తువులను చూసుంటాం. వాచ్‌ల దగ్గర నుంచి హ్యండ్ బ్యాగ్‌లు, వ్యాలెట్ వరకు అత్యంత ఖరీదు పలికిన బ్రాండ్లు చూశాం. ఓ సాధారణ టీ కప్పు అత్యంత ఖరీదైనదిగా ఉంటుందంటే నమ్ముతారా. మహా అయితే రూ. 30 వేల నుంచి రూ. లక్ష రూపాయాల విలవు చేసే ప్రత్యేకమైన మెటీరియల్‌తో చేసి ఉండొచ్చు. అంతేగానీ మరీ ఇంత రేంజ్లో ధర ఉండదు. అంత ఖరీదైన టీకప్పు ఎక్కడ ఉందంటే.. జపనీస్ డిపార్ట్మెంట్ స్టోర్ చైన్ తకాషిమయాలో అత్యంత ఖరీదైన టీ కప్పు ఉంది. దీని ధర ఏకంగా రూ. 56 లక్షలు. దీన్ని స్వచ్ఛమైన 24 క్యారెట్ బంగారంలో తయారు చేశారట. అమ్మకానికి వివిధ బంగారు వస్తువులను ప్రదర్శనగా ఉంచగా ఈ టీకప్పు దురదృష్టవశాత్తు అపహరణకు గురయ్యింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఈ వస్తువుని జేబులో వేసుకుని పారిపోతున్నట్లు వీడియో ఫుటేజ్‌లో కనిపించింది. అయితే ఆ వ్యక్తి ఎవరన్నది తెలియరాలేదు. ఈ ప్రదర్శనలో దాదాపు వెయ్యికి పైగా టీవేర్ టేబుల్ వేర్ వంటి కళఖండాలు ఉన్నాయని, వాటిల్లో ఈ టీ కప్పు త్యంత ఖరీదైనదని అన్నారు తకాషిమయా స్టోర్ ప్రతినిధి. "తాము ఆ వస్తువులను అమ్మకానికి పారదర్శకమైన అన్‌లాక్ పెట్టేలో ఉంచామని, దీన్ని పసిగట్టిన కస్టమర్లు సులభంగా బయటకు తీసి ఉండొచ్చు. సీసీఫుటేజ్‌లో ఓ వ్యక్తి టీ కప్పుని తన బ్యాగ్‌లో వేసుకుని పారిపోతున్నట్లు మేము చూశాం. ప్రస్తుతం పోలీసులు సదరు వ్యక్తి కనిపెట్టే పనిలో ఉన్నారు. అయినప్పటకీ తమ స్టోర్ అమ్మకాల ప్రదర్శన నిరాటకంగా కొనసాగుతుందని, పైగా భద్రతను కూడా మరింత పటిష్టం చేస్తామని చెప్పారు." స్టోర్ ప్రతినిధులు. (చదవండి: చిచ్చర పిడుగు!..తొమ్మిదేళ్లకే ఏకంగా 75 కిలోలు..!) -
చీరలు కొన్న వాటిలానే ఉండాలంటే ఇలా చేయండి!
చీరలు వాడుతున్న కొద్దీ కొన్నప్పుడూ ఉన్నట్టు కనపించవు. కలర్ తగ్గిపోయి కట్టుకున్న నలిగిపోతున్నట్లు ఉంటుంది. కొత్త ఉన్నంత షైన్‌గా కనిపించదు. దీంతో ఈ షాపు మంచిది, అది మంచిది అంటూ షాపులు మార్చుతుంటాం. ఎన్ని చోట్లకు తిరిగి కొన్నా అదే తీరులో చీరలు ఉంటాయి. అలా కాకుండా చీరలు కొన్న ప్పుడే ఏ రేంజ్లో మెరుస్తూ కనిపిస్తున్నాయో అలానే ఉండాలంటే కొన్న చిట్కాలు పాటిస్తే చాలు ఎప్పటికీ కొన్న వాటిలానే ఉంటాయి. ఇక్కడ చీరలు మెయింటైయిన్ చేయడమపైనే ట్రిక్ అంతా దాగి ఉంది. ఆ ట్రిక్ ఏంటంటే.. ముందుగా చీరలను ఎలా పడితే అలా మడతలు పెట్టొద్దు. అలాగే మడత పెట్టి ఎక్కువ రోజులు ఉంచొద్దు. ఇలా చేస్తే రంగు మారుతుంది. పైగా చీన ముడతలు ముడతలుగా అయిపోతుంది. ముడతలు పడకుండ మధ్యలో ఒకసారి తీసి తిరిగి మడతపెట్టాలి. వాటిని వెలుతురు పడని ప్రదేశాల్లోనే పెట్టాలి. చీరను ఉతికేటప్పుడూ కూడా జాగ్రత్త పాటించాలి. చీరలు అన్నింటిని ఒకే విధంగా ఉతికితే త్వరగా పాడవుతాయి. వాషింగ్ మిషన్ లో చీరలన్నింటిని ఉతక్కూడదు. కొన్నింటిని మినహాయించాలి. ఎందుకంటే? కొన్ని వాషింగ్ మిషన్‌లో ఉంటే కలర్ దిగిపోయే అవకాశం చీర పాడయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి చీరలను చేత్తో నానబెట్టకుండా ఉతుక్కోవడం మంచిది. ఇంకొన్ని చీరలను ఉతక్కుండా డ్రైక్లీనింగ్‌కు ఇవ్వాలి. అలాగే కొన్ని లైట్ వైట్ చీరలను కొనేటప్పుడే ఎలా ఉతకాలి ఏంటన్నది అడిగి తెలసుకోవాలి. అలాగే ఐరన్ చేయడం వల్ల చీరలకు మంచి లుక్ వస్తుంది కాబట్టి ఐరన్ తప్పనిసరి. ఎక్కువ వేడి మీద అసలు ఐరన్ చేయొద్దు. ఇలా చేస్తే తొందరగా పాడవుతాయి. సిల్క్, పట్టు చీరలు ఐరన్ చేసేటప్పుడు కాటన్ క్లాత్ వేసి ఐరన్ చేస్తే ఫ్యాబ్రిక్ దెబ్బతినకుండా ఉంటుంది కాబట్టి ఈ చిట్కాను తప్పక గుర్తించుకోవాలి ఎంత మంచిగా మెయింటెన్ చేసినా కూడా చీరలపై మరకలు, మడతలు అలాగే ఉంటాయి. దీంతో ఎలా పడితే అలా కాకుండా.. మరకను మాత్రమే క్లీన్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత వెనిగర్, నిమ్మరసం, సబ్బుతో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. కొన్ని చీరలకు వర్క్ మరికొన్ని చీరలకు స్టోన్స్, ముత్యాలు ఉంటాయి కాబట్టి అలాంటి వాటిని విడివిడిగా ఉతకాలి. చీర నాణ్యతను బట్టి ఉతకే విధానంలో మార్పులు చేయాలి. లేదంటే అంత కష్టబడి డబ్బులు పెట్టి మరీ చేయించుకున్న వర్క్ పాడయ్యే పోయే ప్రమాదం ఉంటుంది. (చదవండి: ప్రపంచంలోనే బెస్ట్ డెజర్ట్‌గా భారతీయ స్వీట్! ఎన్నో స్థానంలో నిలిచిందంటే..) -
Kajal Aggarwal: హైదరాబాద్‌లో ఫ్యాషన్ స్టోర్ ప్రారంభించిన కాజల్ అగర్వాల్ (ఫొటోలు)
-
ఫ్రిజ్‌లో పెట్టిన కర్రీ తింటే డేంజరా?
రిఫ్రిజ్‌రేటర్లు వచ్చిన తర్వాత నుంచి వేస్ట్ అంటూ ఏమి ఉంచకుండా ప్రతీదీ దాంట్లోకే తోసేస్తున్నాం. ప్రతీ కూర మూడు నుంచి వారం రోజులకు పైనే ఫ్రిజ్‌లో పెట్టుకుని తింటున్నాం. ఇలానే తమిళనాడుకు చెందిన చిన్నారి ఫ్రిజ్‌లో పెట్టిన చికెన్ కర్రీ తిని మృతి చెందింది. ఆమె కుటుంబసభ్యులు కొద్ది పాటి అనారోగ్యానికి గురయ్యారు. ఇంతకీ ఫ్రీజ్‌లో పెట్టిన కూరలు తినొచ్చా? ఎన్ని రోజుల వరకు ఉంచి తింటే మంచిది? తమిళనాడులోని అరియలూరుకి చెందిన గోవిందరాజులు అనిర్బసి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. వాళ్లు కోడిమాంసం తెచ్చుకుని వండుకుని తినగా మిగిలింది ఫ్రిజ్‌లో పెట్టి మరుసటి రోజు తిన్నారు. అంతే ఇంటిల్లపాది ఆస్పత్రి పాలయ్యారు. కానీ చిన్న కుమార్తె పరిస్థితి విషమించి మృతి చెందింది. ఫుడ్ పాయిజ్ కారణంగా ఇలా జరిగి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. ఇంతకీ వాళ్లు సరిగా నిల్వ చేయలేదా? మరేదైనా అనేది తెలియాల్సి ఉంది. ఇలా అందరం సర్వసాధారణంగా చేస్తాం. కానీ పలు సందర్భాల్లో ఇలాంటి దిగ్భ్రాంతికర ఘటనలు తలెత్తుతున్నాయి. అసలు ఇంతకీ ఫ్రిజ్‌లో ఎలా నిల్వచేయొచ్చు. ఎన్ని రోజుల వరకు ఏ కూర అయినా ఉంచొచ్చు తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందాం!. కూరల్లో సాధారణంగా టమాట, కొబ్బరి, మసాలా దినుసులు జోడించి ఎక్కువసేపు ఉడికిస్తాం కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. అయితే మనకు నిల్వ ఉండాలనుకుంటే తక్కువ సేపట్లోనే ఉడికిపోయేలా వండుకోవాలి. ముఖ్యంగా నాన్‌వెజ్‌కి సంబంధించిన బటర్ చికెన్, వంటివి ఎక్కువసేపు మంటపై వండకూడదు. తక్కువ టైంలోనే వండేసి, ప్రిజ్‌లో పెట్టాలనుకున్న దాన్ని వేరుగా గాలి చొరబడిన బాక్స్‌లో వేసి ఫ్రిజలో పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. పైగా రుచి పాడవ్వదు. అలాగే కూర వండిన రెండు గంటల్లోపే ఫ్రిజ్‌లో నిల్వ ఉంచేలా చేస్తే మంచిది. అలాగే బట్టర్ చికెన్ వంటి కూరలు వండటానికి ముందే చికెన్‌ని మసాల, కారం పొడులతో చక్కగా మారినేట్ చేసుకుని ఫ్రిజ్ నాలుగు నుంచి ఐదు గంటలు ఉంచి వండుకోండి. అదికూడా జస్ట్ 30 నిమిషాలకు మించి ఉడకనివ్వకండి. అలాగే మటన్ వంటి కొన్ని రకాల నాన్‌వెజ్‌లు ఉడకటానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. అలాంటి వాటిని ప్రెజర్ కుక్కర్ వంటి వాటిల్లో వండుకోండి. త్వరితగతిన ఉడికిపోతాయి. పైగా ఫ్రిజ్‌లో ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు. అలాగే ఫ్రిజ్‌లో పెట్టాలనుకున్న కర్రీలను మంచి టైట్ బాక్స్‌లో ఉంచి పెట్టడం మంచిది. అలాగే ఫ్రిజ్‌ని కూడా ఎప్పటికప్పుడూ నీటిగా క్లీన్ చేసి ఉంచుకుంటే ఎలాంటి బ్యాక్టీరియాలు దరిచేరవు. ఫుడ్ పాయిజన్లు అవ్వడం జరగదు. ఏదైనా గానీ నిల్వ చేసుకోవాలనుకుంటే మాత్రం చల్లటి నీళ్లు పడకుండా ముందుగా వేరొక పాత్రలో తీసుకుని వెంటనే ఫ్రిజ్‌లో పెట్టేయండి. అంతేగానీ ఇష్టం వచ్చినట్లు కర్రీలో గరిటలు పెట్టి వాడేసి, ఆ తర్వాత మిగిలింది కదా అని ఫ్రిజ్‌లో పెట్టేస్తారు. ఆ తర్వాత రెండు మూడు రోజలుకు గానీ ఆ విషయం గుర్తుకు రాదు. అప్పటికే అది పాడైపోయి ఉంటుంది. ఇక పడేయ్యడం ఇష్టం లేక తిని ఆస్పత్రి పాలవ్వుతారు. దయచేసి ఇలాంటి పనులు అస్సలు చేయకండి. వంటకు సంబంధించిన విషయాల్లో కాస్త జాగురకతతో వ్యవహరించండి. (చదవండి: నలభైలో కూడా 20లా కనిపించాలంటే..! ఇలా చేయండి!) -
మసాలా దినుసులు ఘాటు పోకూడదంటే..ఇలా స్టోర్ చేయండి!
మన వంటింట్లో పప్పు తాలింపులకు ఉపయోగించే ఆవాలు, జీలకర్ర దగ్గర నుంచి నాన్‌వెజ్ లేదా బిర్యానీలు చేసేటప్పుడు ఉపయోగించే మసాలలన్నింటిని నిల్వ చేయడం కాస్త ఇబ్బంది. అందులోనూ రకరకాల సీజన్లు ఉండే మన ప్రదేశాల్లో మరింత కష్టం. అలాంటప్పుడూ వాటి రుచి పాడవకుండా ఎక్కువ కాలం వచ్చేలా స్టోర్ చేయాలంటే ఈ అద్భుతమైన టెక్నిక్స్ ఫాలోకండి. రుచి పోదు, తాజగా వాడుకోవచ్చు కూడా. మసాలా దినుసులు సరిగా నిల్వ చేయడానికి అనుసరించాల్సిన పద్ధతులు.. గాలి చొరబడిన కంటైనర్లు మీ సుగంధ ద్రవ్యాలను నిల్వ చేయడానికి గాలి చొరబడని కంటైనర్‌లో జాగ్రత్తగా నిల్వ చేయాలి. అలాగే సుగంధ ద్రవ్యాల్లో తేమ లేకుండా బాగా ఎండలో ఆరనిచ్చి జాగ్రత్తగా భద్రపర్చాలి. గాలి చొరబడి మూతలు ఉన్న జాడీ లేదా కంటైనర్లే మేలు. ఇలాంటివి అయితే సుగంధ ద్రవ్యాలు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. కూల్ స్టోరేజ్ గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేయడం ఎంత ముఖ్యమో అలాగే చల్లటి ప్రదేశంలో ఉంచడం అంతే ప్రధానం. సుగంధ ద్రవ్యాలు చాలాకాలం పాటు తాజాగా రుచిగా ఉంచాలనుకుంటే వేడిపొయ్యిలు, ఓవెన్లు, సూర్యరశ్మీకి దూరంగా ఉంచడం వంటివి చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో తేమ లేకుండా.. వర్షాకాలం లాంటి సీజన్లో వాటిని గాలి చొరబడని కంటైనర్‌లో ఉంచినప్పటికీ అట్టలు కట్టనట్లు అయిపోతాయి. వాటి రుచిలో కూడా మార్పు వస్తుంది. అలాంటప్పుడూ తేమను పీల్చుకునే ప్యాకెట్లలో నిల్వ చేసేంఉదకు ప్రయత్నించాలి. ఈ మసాలా దినులు గాలి లేదా తేమను ఆకర్షించే గుణం ఉంది కాబట్టి నిల్వ చేసుకునేటప్పుడు కాస్త జాగుకతతో ఉండాలి. లేబుల్ ఈ మసాల దినులు స్టోర్ చేసుకునే కంటైనర్లపై అవి ఎప్పుడు కొన్నారనే దాన్ని లేబుల్ చేయండి. దీని వల్ల అవి ఎంతకాలం వరకు తాజగా ఉంటాయో మీకు తెలిసేందుకు ఉపయోగపడుతుంది. ఒకవేళ వాడే ముందు బాగున్నాయా లేదా అన్న సందేహం వచ్చినప్పుడే ముందుగా దాన్ని లేబుల్ చేసి రాసి ఉంటారు కాబట్టి అది చూస్తే సరిపోతుంది. ఎలాంటి కన్ఫ్యూజన్ కూడా ఉండదు. పరిమిత స్థలం లేదా తేమ వాతావరణం వంటగదిలో పరిమిత స్థలమే ఉండి నిల్వచేసుకోవడం ఇబ్బందిగా మారినా లేదా ఎప్పటికీ తేమ వాతావరణమే అయితే మసాల దినుసులు నిల్వ చేయడం అంత ఈజీ కాదు. అలాంటప్పుడు కొద్ది మొత్తంలో వాటిని స్టోర్ చేసి మిగతా వాటిని గ్రైండ్ చేసి నిల్వ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పొడి చేసుకుంటే కూరల్లో కూడా సులభంగా వాడుకోవచ్చు. ఇది మిస్ చేశాం అనే సమస్య కూడా ఉండదు. తేమ వాతావరణంలో ఉండే వారికి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. (చదవండి: అత్యంత ఖరీదైన కాఫీ! సర్వ్ చేసే విధానం చాలా వెరైటీగా ఉంటుంది!) -
Geetha Madhuri Latest Photos: ‘లాఫ్లోర్’ క్లినిక్‌ని ప్రారంభించిన గీతా మాధురి (ఫొటోలు)
-
నిమ్మకాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా చేయండి!
మన ఇంట్లో ఎక్కువగా వాడే నిమ్మపండు లాంటి సిట్రస్ జాతి పళ్లను ఎక్కువ రోజులు తాజగా ఉంచడం కాస్త సమస్యగా ఉంటుంది. అలాగే పాయాసం, లేదా కిచిడీలో డేకరేషన్కి లేదా రుచి కోసం ఉపయోగించే సగ్గుబియ్యం లాంటివి హడావిగా ఆఫీస్‌కి వెళ్లేటప్పడూ వీటిని ఉపయోగించలేక ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే వాడటానికి ముందు ఆ సగ్గబియ్యాన్ని కొంచెంసేపు నీటిలో నాననివ్వాల్సి ఉంటుంది. బిజీబీజీ లేఫ్లో ఇలాంటి వాటి ఎన్నింటికో మంచి ఇంటి చిట్కాలు ఉన్నాయి వెంటనే ఫాలోకండి సత్వరమే ఆ ఇబ్బంది నుంచి బయటపడండి. సులువుగా వండేసుకోండి, కూరగాయాలు కూడా మంచిగా నిల్వ చేసుకోండి. ఈజీ చిట్కాలు శుభ్రంగా కడిగి తుడిచిన నిమ్మకాయలకు కొద్దిగా నూనె రాసి టిష్యూపేపర్ వేసిన బాక్స్‌లో పెట్టి రిఫ్రిజిరేటర్లో పెడితే ఎక్కువ రోజులపాటు తాజాగా ఉంటాయి. గ్లాసు నీళ్లలో కొద్దిగా వెనిగర్ వేసి టూత్‌బ్రష్‌లను నానబెట్టాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో కడిగితే టూత్‌బ్రష్‌లు శుభ్రపడతాయి. సగ్గుబియ్యం చక్కగా నానిన తరువాత నీటిని వడగట్టి ఎయిర్ టైట్ కంటైనర్‌లో వేసి రిఫ్రిజిరేటర్లో పెట్టాలి. ఇవి నాలుగైదు రోజులపాటు తాజాగా ఉంటాయి. అప్పటికప్పుడు సగ్గుబియ్యం నానపెట్టుకోకుండా ఇలా నిల్వచేసిన సగ్గుబియ్యాన్ని తీసుకుని వెంటనే కిచిడి, పాయసం, ఇడ్లీ, దోశల్లోకి వాడుకోవచ్చు. (చదవండి: ప్లాస్టిక్ మంచిదికాదని స్టీల్ వాటర్ బాటిల్స్ వాడుతున్నారా?) -
24 గంటలూ ఓపెన్... సిబ్బంది మాత్రం నిల్!
మార్కెట్లో రకరకాల దుకాణాలు వచ్చేస్తున్నాయి. ఈ ఏఐ పుణ్యమా అన్ని సాంకేతికతో కూడాన ఆధునిక స్టోర్లు మన ముందు ప్రత్యక్షమవుతున్నాయి. పైగా అన్నీ మన ఒడిలోకే వంచి వాలిపోయేలా పనులు చకచక అయిపోతున్నాయి. అయితే అదే తరహాలో ఇక్కడొక విలక్షణమైన స్టోర్ ఉంది. 24 గంటలు తెరిచే ఉంటుంది. కానీ ఒక్క సిబ్బంది కూడా ఉండరు. మరీ ఎలా పనిచేస్తుంది?. కస్టమర్లు ఎలా కొనుక్కుంటారు? అనే కదా డౌటు..!. అలాంటి వెరైటీ స్టోర్ సియోల్‌లో ఉంది. దీనిపేరు రామెన్ స్టోర్. దీనిలో మనకు కావల్సిన అన్ని వస్తువులు ఉంటాయి. మనం అక్కడే కొనుక్కుని ఎంచక్కా వండకుని తినేసి రావొచ్చు. మరీ బిల్ ఎలా పే చేయాలంటే..మనకు మనమే స్వతహాగా పే చేయడమే. అలాగైతే ఎవరైనా ఈజీగా వస్తువులన్నీ ఎత్తుకుపోవచ్చు కదా అంటారా..! అంతా ఈజీ కాదు. ఎందుకంటే..? అడగడుగునా సీసీ కెమెరాలు ఉంటాయి. మీరు నచ్చిన వస్తువులను తీసుకుని దాని పక్కనే ఉన్న బిల్‌పే చేసే ఆటోమెటిడ్ మెషిన్లో ఎంటర్ చేసి మనీ పే చేస్తే చాలు. ఒకరకంగా చెప్పాలంటే సెల్ఫ్ పేయింగ్ అన్నమాట!. ఈ మేరకు ఫుడ్ వ్లోగర్ లిల్లీ హ్యూన్ అనే ఆమె ఆ స్టోర్‌కి సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. అందులో ఆమె తనకు నచ్చిన న్యూడిల్స్, ప్రిపరేషన్‌కి కావాల్సిన పదార్థాల తోపాటు సైడ్ డిష్‌లను తాను ఎలా తీసుకుని బిల్ పే చేసిందో వివరించింది. ఆ తర్వాతా ఆమె అక్కడే ఎలా ఎంచక్కా వండుకుని తినేసిందో కూడా చెప్పింది. అక్కడ మనం కావల్సింది వండుకోవడమే గాక అందుకు కావాల్సిన సైడ్ డిష్‌లు కూడా ఉంటాయి. వాటికి మాత్రం బిల్ పే చేయాల్సిన అవసరం లేదు. అవి ఫ్రీ. ఐతే ఈ వీడియోని చూసిన నెటిజన్లు మాత్రం ఇది రియల్? ఆ..! అని ఆశ్చర్యపోయారు. చాలామంది ఇది వర్క్ ఔట్ అవ్వడం కష్టం అని అంటున్నారు. ఎందుకంటే ఆ సీసీటీవీలను కూడా పాడు చేసి ఎత్తుకుపోవడం వంటివి జరుగుతాయంటూ కామెంట్లు చేశారు. View this post on Instagram A post shared by Lily Huynh (@biteswithlily) (చదవండి: ఫ్రూట్ ఇడ్లీ గురించి విన్నారా? తయారీ విధానం చూస్తే..షాకవ్వుతారు!) -
Meenakshi Choudhary: బంజారాహిల్స్‌లో సందడి చేసిన నటి మీనాక్షి చౌదరి (ఫొటోలు)
-
Nita Ambani: రిలయన్స్ ‘స్వదేశ్ స్టోర్’ లాంఛ్. సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
-
120 మీటర్ల ఎత్తులో ఉన్న కొండను ఆనుకుని ఓ కొట్టు..ఎక్కడంటే
కొండ బండను ఆనుకొని ఉన్న ఈ చెక్క నిర్మాణం అధిరోహకులను రెస్క్యూ చేయడానికేమో అని అనుకుంటే అచ్చంగా పొరపాటే! అదో కొట్టు. చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లోని షినియుజాయ్ అనే సుందరమైన ప్రాంతం అది. అక్కడ 120 మీటర్ల ఎత్తులో కొలువై ఉన్న కొండను ఎక్కే అధిరోహకులకు.. ఆహారం, మంచినీరు, విశ్రాంతి వంటి కనీస వసతులు కల్పించాలని ప్రభుత్వం ఓ కొట్టు తెరిచింది. దాని పేరు ‘హ్యాంగింగ్ కన్వీనియెన్స్ స్టోర్. ’ ఈ ఫొటోలో కనిపిస్తున్నదదే! అందులో కేవలం ఒక వ్యక్తి మాత్రమే ఉండి.. పర్యాటకులకు సేవలు అందిస్తుంటాడు. అవసరమయ్యే వస్తువులన్నిటినీ తాడుతో కింది నుంచి పైకిలాగి ఈ కొట్టులో స్టోర్ చేస్తారు. కొన్నాళ్ల కిందటి వరకు కూడా మౌంటెనీర్సే తమకు అవసరమయ్యే వస్తువులన్నిటినీ మోసుకెళ్లేవారు. ఆ అవస్థ చూసే ప్రభుత్వం ఈ ఆలోచన చేసింది. ఇప్పుడు మౌంటెనీర్స్కి కావలసిన వస్తువులన్నీ తక్కువ ధరకే ఈ కొట్టులో లభిస్తున్నాయి. దాంతో మౌంటెనీరింగ్ ఈజీ అయింది.. ఆ కొట్టు వ్యాపారమూ జోరుగా సాగుతోంది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా మూతపడ్డ ఈ స్టోర్‌ను తిరిగి తెరవడంతో విషయం వైరల్ అయింది. (చదవండి: ఒకప్పుడు అది ఉప్పుగని! కానీ ఇప్పుడు..) -
ప్రముఖ డిజైనర్ అనూషరెడ్డి కలెక్షన్స్ స్టోర్‌లో సందడి చేసిన పాయల్ రాజ్‌పుత్ (ఫొటోస్)
-
144 ఏళ్ల మెడికల్ స్టోర్ ఎలా బయటపడింది? దానిలో ఏమేమి ఉన్నాయి?
చరిత్రకు సంబంధించిన పలు అంశాలు ఎప్పటికీ ఆసక్తికరంగానే ఉంటాయి. తాజాగా 114 ఏళ్ల క్రితం నాటి మెడికల్ స్టోర్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 1880లో ప్రారంభమైన ఈ స్టోర్ 1909 వరకూ సవ్యంగానే నడిచింది. ఈ స్టోర్‌ను బ్రిటన్‌లో విలియం వైట్ అనే వ్యక్తి నిర్వహించేవాడు. అతని మరణానంతరం ఈ స్టోర్ మూతపడింది. ఇన్నాళ్ల తరువాత ఈ స్టోర్ తలుపులు తెరవగానే లోపల ఆశ్చర్యం కలిగించే పలు వస్తువులు కనిపించాయి. మెట్రో యూకే తెలిపిన వివరాల ప్రకారం ఈ మెడికల్ స్టోర్ గురించి 80 ఏళ్ల క్రితమే వెల్లడయ్యింది. అయితే విలియం వైట్ మనుమడు 1987లొ దీని గురించి బహిరంగంగా తెలియజేశాడు. తరువాత దీనిని ప్రజల సందర్శనార్థం తెరిచాడు. ఈ స్టోర్‌లో లిక్విడ్ మెడిసిన్‌తో నిండిన జార్లు, స్కేళ్లు, వైట్ రైటర్ మొదలైనవి లభ్యమయ్యాయి. విలియం వైట్ మరణానంతరం అతని ఇంటిని విక్రయించే సమయంలో ఈ రహస్య గదిని కనుగొన్నారు. అప్పుడు వైట్ కుమారుడు చార్లెస్ ఈ స్టోర్‌ను మూసివేశాడు. ఒక పరిశోధకుడు చెప్పిన దాని ప్రకారం స్టొర్లోని సామాను పరిశీలించి చూస్తే, విలియం ఒక కెమిస్ట్ అని తెలుస్తోంది. అలాగే అతను గ్రోసరీ సామాను కూడా భద్రపరిచేవాడు. అయితే నాటి వస్తువులు ఇప్పుడు ప్రమాదకరంగా పరిణమించాయి. ఈ దుకాణంలో కొన్ని వనమూలికలు కూడా లభించాయి. ఈ దుకాణాన్ని చూసేందుకు జనం తరలివస్తున్నారు. ఇది కూడా చదవండి: హిట్లర్ విషాహార భయాన్ని ఎలా దాటాడు? చివరికి ఎలా మరణించాడు? -
గూగుల్, యాపిల్ ఆధిపత్యానికి చెక్! రంగంలోకి ఫోన్‌పే..
గూగుల్ (Google), యాపిల్ (Apple) ఆధిపత్యానికి చెక్ పెడుతూ మరో కొత్త యాప్ స్టోర్ రాబోతోంది. వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫిన్‌టెక్ కంపెనీ ఫోన్‌పే (PhonePe) తన మొబైల్ యాప్ స్టోర్‌ను డెవలపర్ల కోసం తెరుస్తోంది. ఇండస్ యాప్‌స్టోర్ (Indus Appstore) అనే పేరుతో మొబైల్ యాప్ మార్కెట్ ప్లేస్ ప్లాట్ఫామ్లో తమ యాప్‌లను ప్రచురించడానికి ఆండ్రాయిడ్ యాప్ డెవలపర్లను ఆహ్వానిస్తోంది. ఈ యాప్‌స్టోర్‌లో యాప్‌లను ఉంచడానికి కానీ, డౌన్లోడ్ చేసుకునేందుకు కానీ ఎటువంటి రుసుము ఉండదని తెలుస్తోంది. (High Severity Warning: ఐఫోన్లు, యాపిల్ ప్రొడక్ట్స్‌కు హై సివియారిటీ వార్నింగ్!) ఇండస్ యాప్‌స్టోర్ డెవలపర్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించినట్లు ఫోన్‌పే ధ్రువీకరించింది. ప్లాట్‌ఫామ్‌లోని యాప్ లిస్టింగ్‌లు మొదటి సంవత్సరం ఉచితంగా ఉంటాయని, ఆ తర్వాత నామమాత్రపు వార్షిక రుసుము వసూలు చేయనున్నట్లు తెలిపింది. ఇండస్ యాప్ స్టోర్‌లో డెవలపర్లు తమ యాప్‌లను ఇంగ్లిష్ కాకుండా మరో 12 భారతీయ భాషల్లో లిస్ట్ చేయవచ్చు. అలాగే ఆయా భాషల్లోని తమ యాప్ లిస్టింగ్‌లకు ఫొటోలు, వీడియోలను అప్లోడ్ చేయవచ్చు. యాప్‌లకు సంబంధించి తలెత్తే సమస్యల పరిష్కారానికి గూగుల్, యాపిల్ యాప్ స్టోర్ల లాగే ఇండస్ యాప్ స్టోర్ కూడా భారత్ కేంద్రంగా ఈ-మెయిల్ లేదా చాట్‌బాట్ ద్వారా 24x7 అంకితమైన సపోర్ట్ వ్యవస్థను అందిస్తున్నట్లు పేర్కొంది. యాప్‌స్టోర్ ప్రారంభానికి సంబంధించిన సమాచారాన్ని తాజాగా ఇండస్ యాప్‌స్టోర్ తమ వైబ్సైట్లో ప్రచురించింది. ఇండస్ యాప్‌స్టోర్ యూజర్లకు ఎలా అందుబాటులోకి రానున్నదో కూడా చూపించింది. అయితే ఈ యాప్‌స్టోర్ ఎప్పుడు లాంచ్ అవుతుందన్న దానిపై ప్రస్తుతం ఎటువంటి సమాచారం లేదు. -
సుప్రీంకోర్టు లాయర్ హత్య.. భర్తే చంపి స్టోర్ రూంలో..
లక్నో: ఉత్తరప్రదేశ్ నోయిడాలో దారుణం జరిగింది. సుప్రీంకోర్టు న్యాయవాది అయిన తన భార్యను భర్తే హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని బాత్రూంలో దాచి, తాను ఇంటి స్టోర్‌రూమ్‌లో తలదాచుకున్నాడు. బాధితురాలి సోదురుడు ఫోన్ చేసినప్పటికీ కాల్ లిఫ్ట్ చేయకపోయే సరికి అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రేణు సిన్హా(61), అజయ్ నాథ్‌లు భార్యభర్తలు. అజయ్ నాథ్ ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ మాజీ ఉద్యోగి. రేణు సిన్హ సుప్రీంకోర్టు లాయర్‌గా పనిచేశారు. వారు నోయిడాలో సొంత ఇంట్లో నివసిస్తున్నారు. అయితే.. ఆ ఇంటిని అజయ్ నాథ్ రూ.4 కోట్లకు అమ్మడానికి నిర్ణయించుకున్నాడు. అడ్వాన్స్ కూడా కొనుగోలుదారుని వద్ద తీసుకున్నాడు. కానీ బంగ్లా అమ్మడానికి రేణు సిన్హా అంగీకరించలేదు. ఈ విషయంలో ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో అజయ్ నాథ్.. రేణు సిన్హాను హత్య చేశాడు. అనంతరం ఇంటికి తాళం వేసి స్టోర్ రూమ్‌లో తలదాచుకున్నాడు. రేణు సిన్హా కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఆమె సోదరుడు అనుమానంతో ఇంటికి వచ్చి చూశాడు. అటు అజయ్ నాథ్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితురాలి ఇంటికి వచ్చిన పోలీసులు.. బాత్రూంలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. అన్ని రూంలలో చెక్ చేయగా.. స్టోర్ రూంలో నిందితున్ని పట్టుకున్నారు. నిందితున్ని ప్రశ్నించగా.. హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితున్ని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రేణు సిన్హ ఇటీవలే క్యాన్సర్ నుంచి కోలుకున్నట్లు ఆమె సోదరుడు తెలిపారు. రేణు సిన్హ, అజయ్ నాథ్‌ల మధ్య ఎప్పటి నుంచో వివాదాలు కొనసాగుతున్నట్లు వెల్లడించాడు. ఇదీ చదవండి: లేడీ అనురాధ డ్రగ్స్ దందా -
‘అయ్యయ్యో.. లోపలుండిపోయానే’.. మసాజ్ మిషన్‌లో నుంచి కేకలు..
పెద్దపెద్ద ఎలక్ట్రానిక్ స్టోర్స్‌లో మసాజ్ చైర్లు కనిపిస్తుంటాయి. ఇక్కడకు షాపింగ్‌కు వచ్చిన వినియోగదారులు ఒక్కోసారి ఇటువంటి చైర్లలో సేదతీరుతుంటారు. అయితే ఈ విధంగా మసాజ్చైర్లో కూర్చున్న వ్యక్తికి వింత అనుభవం ఎదురయ్యింది. ఈ ఉదంతం జపాన్‌లో చోటుచేసుకుంది. ఒక వినియోగదారు మసాజ్ చైర్లో సేద తీరుతూ నిద్రపోయాడు. రాత్రి కావడంతో స్టోర్ బంద్ అయిపోయింది. ఆ వ్యక్తి ఫోనులో ట్వీట్ ద్వారా సాయం అడినప్పుడు ఈ విషయం వెలుగుచూసింది. @_Asphodelus అనే పేరు కలిగిన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఈ వ్యక్తి ట్వీట్ చేశాడు. చీకటితో కూడిన ఒక ఫొటోను షేర్ చేసిన ఆయన ‘అయ్యయ్యో.. లోపలుండిపోయానే’ అని రాశాడు. కేఎస్ అనే పేరు కలిగిన స్టోర్ బంద్ అయి ఉండటాన్ని ఫోటోలో చూడవచ్చు. కాగా అనంతరం ఆ వ్యక్తి స్టోర్‌లోని అలారం మోగించగా పోలీసులకు ఈ సమాచారం అందింది. వెంటనే వారు స్టోర్ యజమానికి ఈ విషయాన్ని తెలియజేశారు. మొత్తం 10 మంది పోలీసు అధికారులు స్టోర్‌లో నుంచి అతనిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అతనిని దొంగ కాదని నిర్ధారించుకున్నారు. కాగా స్టోర్‌కు తాళాలు వేసిన సిబ్బంది మసాజ్ చైర్లో ఉండిపోయి ఇబ్బందిపడిన వ్యక్తిని క్షమాణలు కోరారు. అయితే ఈ స్టోర్‌లో ఆ వ్యక్తి ఎంతసేపు బందీ అయిపోయారన్న విషయం తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించిన పోస్టుకు 39 వేలకుపైగా షేర్లు వచ్చాయి. ఈ పోస్టు చూసిన ఒక యూజర్ ‘డిపార్ట్మెంటల్ స్టోర్‌లో బంద్కావడం అనేది తన చిన్నప్పటి కల అని అన్నారు. మరొక యూజర్ తాను అలా బందీ అయితే ‘ఎస్కేప్ ది రూమ్’ స్టయిల్ గేమ్స్ ఆడుకుంటానని అన్నారు. ఇది కూడా చదవండి: ‘ఏంట్రా ఇదంతా’..‘ఎవర్రా మీరు’.. ‘ఇదేందిది’.. వీటికి బాప్ ఈ వీడియో! え…… pic.twitter.com/AalynpL1PB — こばたつ (@afdc1257) August 15, 2016 -
అన్లిమిటెడ్ స్టోర్లలో 60% వరకు ఆఫర్లు
హైదరాబాద్: అరవింద్ లైఫ్‌స్టైల్ గ్రూప్ అనుబంధ సంస్థ అన్లిమిటెడ్ సోర్ట్ అన్ని రకాల బ్రాండెడ్ వస్త్రాలపై 60% వరకు ఆఫర్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా అన్ని అన్లిమిటెడ్ స్టోర్లలో ఆగస్టు మూడో తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. కస్టమర్లంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కంపెనీ కోరింది. అన్ని వయస్సుల వారికి సరిపడే సరికొత్త డిజైన్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. కొత్త డిజైన్లను కస్టమర్లు ఇష్టపడతారని, నాణ్యమైన ఉత్పత్తులు ఆకర్షిస్తాయని పేర్కొంది. -
మణిపూర్‌లో జవాన్ వికృత చేష్టలు.. మహిళను బయటకు లాగి..
ఇంఫాల్: మణిపూర్ అల్లర్లలో రోజుకో అమానవీయ ఘటన వెలుగులోకి వస్తోంది. కెమెరా సాక్షిగా జవాన్ చేతిలో ఓ మహిళ ఇబ్బందులను ఎదుర్కొంది. కిరాణ స్టోర్ నుంచి ఓ మహిళను బీఎస్ఎఫ్ జవాను విచక్షణా రహితంగా బయటకు లాగి పడేశాడు. మహిళ మెడపై జవాన్ చేతితో గట్టిగా పట్టుకోగా.. ఆ పట్టుబిగువుకు ఆమె విలవిల్లాడింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటన జులై 20న జరగగా.. సదరు జవాన్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. నిందితునిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీసీటీవీ వీడియో ప్రకారం.. ఓ బీఎస్ఎప్ జవాను రైఫిల్‌ను ధరించి ఉన్నాడు. ఓ కిరాణ స్టోర్ నుంచి ఓ మహిళను విచక్షణా రహితంగా బయటకు లాగాడు. జులై 20న ఈ ఘటన జరగగా.. నిందితునిపై కేసు నమోదు చేశారు. విధుల నుంచి తప్పించారు. నిందితున్ని సతీష్ ప్రసాద్‌గా గుర్తించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇద్దరు మహిళలను నగ్నంగా రోడ్డుపై ఊరేగించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇదే కాక ఇప్పటికే అక్కడి పోలీసు స్టేషన్లో పలు కేసులు నమోదయ్యాయి. వీటిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. చాలా స్టేషన్లలో జీరో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. కానీ వాటిపై ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. అలాగే ఫేక్ సోషల్ మీడియా పోస్టులపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సైబర్ సెల్ విభాగం దీనిపై ప్రత్యేకంగా పనిచేస్తోంది. ఇదీ చదవండి: మణిపూర్ అల్లర్లు.. అమరుని కుటుంబాన్ని రక్షించిన బీఎస్ఎఫ్.. -
వైజాగ్‌లో స్టార్‌బక్స్.. నోరూరించే మెనూ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కాఫీ విక్రయాల్లో ఉన్న టాటా స్టార్‌బక్స్ ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో స్టోర్‌ను తెరిచింది. దీంతో దేశవ్యాప్తంగా సంస్థ కేంద్రాలున్న నగరాల సంఖ్య 45కు చేరుకుంది. ఏపీలో ఇప్పటికే కంపెనీకి విజయవాడలో ఔట్లెట్ ఉంది. టాటా కంజ్యూమర్ ప్రొడక్ట్స్ సంయుక్త భాగస్వామ్యంలో 2012లో భారత్‌లో ప్రవేశించిన స్టార్‌బక్స్‌కు దేశవ్యాప్తంగా 350 స్టోర్లు ఉన్నాయి. ఈ స్టోర్‌లో అనుకూలమైన ఎంపికల శ్రేణిని టాటా స్టార్‌బక్స్ పరిచయం చేస్తోంది. కొత్త పిక్కో కప్ సైజుతో సహా, కాఫీ ప్రియులకు ఫేవరెట్ పానీయాలు అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఫిల్టర్ కాఫీ, మసాలా చాయ్, ఏలకుల చాయ్, మిల్క్‌షేక్‌లు, శాండ్విచ్లను ఆకర్షణీయమైన ఆఫర్లతో అందిస్తోంది. -
కూకట్‌పల్లిలో వస్త్ర దుకాణం ప్రారంభోత్సంలో మోడల్స్ సందడి (ఫొటోలు)
-
యాపిల్ స్టోర్స్‌లో సేల్స్‌పర్సన్‌లకు అదిరిపోయే జీతాలు!
అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ యాపిల్ ఇటీవల భారత్‌లో రెండు రీటైల్ స్టోర్లను ప్రారంభించింది. ముంబై, ఢిల్లీ నగరాల్లో ఏర్పాటు చేసిన ఈ స్టోర్లలో పనిచేసే సేల్స్ పర్సన్లకు, మేనేజర్లకు యాపిల్ భారీగా చెల్లిస్తోంది. ఈ స్టోర్లలో పనిచేసే వారు ఉన్నత విద్యావంతులు. ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంసీఏ, ఇంజనీరింగ్ ఉన్నత కోర్సులు అభ్యసించినవారు. ఇదీ చదవండి: ఐఫోన్ 14పై అక్షయ తృతీయ ఆఫర్.. ఏకంగా రూ.21 వేలు తగ్గింపు! వీరిలో కొందరు కేంబ్రిడ్జ్, గ్రిఫిత్ వంటి విశ్వవిద్యాలయాల్లో చదివినవారూ ఉన్నారు. యూరప్, మిడిల్ ఈస్ట్‌లోని యాపిల్ స్టోర్లలో పని చేస్తున్న కొంతమంది భారతీయులను ఇక్కడికి బదిలీ చేశారు. ఈ ఉద్యోగులందరికీ రీటైల్ అనుభవం ఉందని ఎకనమిక్స్ టైమ్స్ నివేదించింది. యాపిల్ కంపెనీ ముంబై , న్యూఢిల్లీ స్టోర్లలో 170 మంది సిబ్బంది నియమించింది. వీరికి గ్లోబల్ స్టాండర్డ్స్‌తో శిక్షణ ఇచ్చింది. ముంబై యాపిల్ స్టోర్‌లోని ఉద్యోగులు మొత్తం 25 భాషల్లో మాట్లాడగలరు. అలాగే ఢిల్లీ స్టోర్ సిబ్బంది 15 భాషలు మాట్లాడగలరు. స్టోర్‌కు విచ్చేసే కస్టమర్లతో భాష సమస్య రాకుండా యాపిల్ జాగ్రత్త పడుతోంది. అందుకే దాదాపు అన్ని ప్రముఖ భారతీయ భాషలు మాట్లాడే సిబ్బందిని తమ స్టోర్లలో నియమించింది. తమ స్టోర్లలో పనిచేసే సిబ్బందికి మంచి జీతంతో పాటు బీమా ప్రయోజనాలు, చెల్లింపు సెలవులు, స్టాక్ గ్రాంట్లు, యాపిల్ ఉత్పత్తులపై తగ్గింపులు, విద్య కోసం ఆర్థిక సహాయం వంటి సదుపాయాలు కల్పిస్తోంది. భారతదేశంలో ఆర్గనైజ్డ్ రిటైల్ ఉద్యోగులకు రూ. 25,000 నుంచి రూ. 30,000 దాకా జీతం లభిస్తోంది. అయితే యాపిల్ మాత్రం తమ రిటైల్ ఉద్యోగులకు నెలకు రూ. 1 లక్షకు పైగా చెల్లిస్తోంది. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
యాపిల్ స్టోర్ ముందు బారులుతీరిన కస్టమర్లు
ఢిల్లీలోని సాకేత్‌లో ఉన్న సెలెక్ట్ సిటీవాక్ మాల్లో గురువారం (ఏప్రిల్ 20) యాపిల్ రెండో స్టోర్ ప్రారంభమైంది. ఉదయం 10 గంటలకు యాపిల్ సీఈవో టిమ్‌కుక్ ప్రారంభించారు. స్టోర్ తెరవకముందే తెల్లవారుజాము నుంచే కస్టమర్లు, ఢిల్లీ నగరవాసులు పెద్దఎత్తున తరలి వచ్చారు. స్టోర్ బయట క్యూలో నిలబడ్డారు. (Apple Retail Store In Delhi: రెండో యాపిల్ స్టోర్‌ను ప్రారంభించిన టిమ్‌కుక్) యాపిల్ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో స్టోర్ ప్రారంభానికి ముందే కస్టమర్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. యాపిల్ ఫోన్లు, ఇతర ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు బారులు తీరారు. ఉత్పత్తుల కొనుగోలు కంటే స్టోర్‌ను సందర్శాలనే ఉద్దేశంతో చాలా మంది తరలివచ్చారు. #WATCH | People stand in queues at Delhi's Select City Walk Mall in Saket to witness the opening of India’s second Apple Store. pic.twitter.com/9mwk5gZmlu — ANI (@ANI) April 20, 2023 కాగా ముంబై స్టోర్ తర్వాత ఢిల్లీలో ప్రారంభించిన ఈ యాపిల్ స్టోర్ భారత్‌లో రెండోది. యాపిల్ ఉత్పత్తులైన ఐఫోన్లు, ఐప్యాడ్లకు కస్టమర్ల నుంచి అధిక డిమాండ్ ఉంది. అలాగే యాపిల్ టీవీలు, వాచ్‌లు, మొబైల్‌కు సంబంధించిన యాక్సెసరీలను ఈ స్టోర్‌లో కస్టమర్లకు అందుబాటులో ఉంచారు. ఇదీ చదవండి: apple saket: యాపిల్ ఢిల్లీ స్టోర్ ఫస్ట్ లుక్.. అదిరిపోయింది! -
రెండో యాపిల్ స్టోర్‌ను ప్రారంభించిన టిమ్‌కుక్
భారత్‌లో యాపిల్ రెండో స్టోర్ ఢిల్లీలోని యాపిల్ సాకేత్ (apple saket)ను సీఈవో టిక్‌కుక్ గురువారం (ఏప్రిల్ 20) ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవాన్ని తిలకించేందుకు కస్టమర్లు, నగరవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా టిమ్‌కుక్ కస్టమర్లకు అభివాదం చేసి స్వాగతం పలికారు. పలువురిని పలకరించారు. కస్టమర్లు కూడా చప్పట్లు కొడుతూ, బిగ్గరగా అరుస్తూ తమ మద్దతు తెలియజేశారు. ఇదీ చదవండి: apple saket: యాపిల్ ఢిల్లీ స్టోర్ ఫస్ట్ లుక్.. అదిరిపోయింది! #WATCH | Apple CEO Tim Cook meets customers visiting India’s second Apple Store at Delhi's Select City Walk Mall in Saket. pic.twitter.com/ZeEubKU92w — ANI (@ANI) April 20, 2023 ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో రెండు రోజుల ముందే తమ మొదటి స్టోర్‌ను స్టోర్‌ను యాపిల్ ప్రారంభించింది. ఢిల్లీలో ప్రారంభించిన ఈ యాపిల్ సాకేత్ స్టోర్ భారత్‌లో రెండవది. కాగా పరిమాణంలో ఢిల్లీ స్టోర్.. ముంబై స్టోర్ కంటే చిన్నది. స్టోర్ ప్రారంభానికి ముందే కస్టమర్లు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇదీ చదవండి: Tim Cook ఢిల్లీలో సందడి: వాటిపై మనసు పారేసుకున్న కుక్ -
యాపిల్ ఢిల్లీ స్టోర్ ఫస్ట్ లుక్.. అదిరిపోయింది!
యాపిల్ భారత్‌లో తన రెండవ స్టోర్ గురువారం (ఏప్రిల్ 20) ప్రారంభమవుతోంది. యాపిల్ సాకెట్ (apple saket)గా పిలుస్తున్న ఈ స్టోర్‌ను సీఈవో టిమ్ కుక్ ప్రారంభిస్తున్నారు. అధికారిక ప్రారంభానికి ఒక రోజు ముందు యాపిల్ తన ఢిల్లీ స్టోర్‌కు సంబంధించిన వివరాలను, చిత్రాలను వెబ్సైట్లో ప్రచురించింది. యాపిల్ ఉత్పత్తులను షాపింగ్ చేయడానికి, సేవలను పొందేందుకు యాపిల్ సాకెట్ కస్టమర్లకు అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని, ఇక్కడి సిబ్బంది కస్టమర్లకు అన్ని విధాలుగా సహకరిస్తారని కంపెనీ ఈ సందర్భంగా పేర్కొంది. అలాగే యాపిల్ ఉత్పత్తులు, సేవలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవడానికి స్టోర్‌లో ‘టుడే’ పేరుతో ఉచిత సెషన్లు ఏర్పాటు చేసింది. భారతదేశంలో తమ రెండవ స్టోర్ యాపిల్ సాకెట్‌ను ప్రారంభించడం ద్వారా ఢిల్లీలోని తమ కస్టమర్లకు ఉత్తమమైన సేవలు అందిస్తున్నందుకు సంతోషిస్తున్నామని యాపిల్ రిటైల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డెయిర్డ్రే ఓబ్రియన్ పేర్కొన్నారు. వెబ్సైట్ ఉంచిన ఫొటోల ప్రకారం.. యాపిల్ సాకెట్ స్టోర్‌లో ఐఫోన్లు, ఇతర ఉత్పత్తులను ప్రదర్శించేందుకు వైట్ ఓక్ టేబుల్లతో స్టోర్ ముందు భాగాన్ని సుందరంగా రూపొందించారు. భారత్‌లో తయారు చేసిన ఫీచర్ వాల్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. మరోవైపు ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఈ స్టోర్‌లో డెలివరీ పొందే సౌకర్యం ఉంది. ఇందుకోసం ప్రత్యేకమైన పికప్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఇతర అన్ని యాపిల్ స్టోర్ల మాదిరిగానే ఢిల్లీలోని యాపిల్ సాకెట్ స్టోర్ కూడా 100 శాతం పునరుత్పాదక ఇంధన శక్తితో నడుస్తుంది. ఈ స్టోర్‌లో 70 కంటే ఎక్కువ మంది నైపుణ్యం కలిగిన రిటైల్ టీమ్ ఉంది. దేశంలోని 18 రాష్ట్రాలకు వారు 15 కంటే ఎక్కువ భాషలు మాట్లాడతారు. డివైజ్ సెటప్ చేయడం, Apple IDని రికవరీ చేయడం, యాపిల్ కేర్ ప్లాన్‌ను ఎంచుకోవడం, సబ్స్క్రిప్షన్లను సవరించడం వంటి అన్ని విషయాలలో కస్టమర్లకు సహాయం చేసేందుకు ఇక్కడ జీనియస్ బార్ పేరుతో ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఇదీ చదవండి: Mukesh Ambani Birthday: వ్యాపారంలోకి రాకముందు ముఖేష్ అంబానీ ఏమవ్వాలనుకున్నారో తెలుసా? -
Neha Shetty Latest Photos: కొంపల్లిలో సందడి చేసిన నేహా శెట్టి (ఫొటోలు)
-
డిజీలాకర్ అంటే? డైనమిక్ కేవైసీతో లాభాలేంటి?
భారత ఫిన్‌టెక్‌ను ఐదు విభాగాలుగా వేరు చూసి చూడొచ్చు. క్యూఆర్ కోడ్ తదితర చెల్లింపులు, బిల్లుల చెల్లింపులు, ఇతర అగ్రిగేటర్ సేవలు, బై నౌ, పే లేటర్ సహా రుణ సదుపాయం, రుణాలిచ్చే ప్లాట్‌ఫామ్‌లు, డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్‌లు, ఇన్సూరెన్స్ ప్లాట్‌ఫామ్‌లు, వెల్త్ మేనేజ్మెంట్ సంస్థలు. ఈ ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించి సేవలు పొందాలంటే ప్రజలు గుర్తింపు పత్రాలను సమర్పించాల్సి (కేవైసీ) ఉంటుంది. గత కొన్నేళ్ల కాలంలో కేవైసీ ప్రక్రియను ఫిన్‌టెక్ సంస్థలు ఎంతో సులభతరం చేశాయి. ఫిన్‌టెక్ సంస్థలు డిజీలాకర్‌లో ఉన్న డాక్యుమెంట్లను పొందే అవకాశం కల్పిస్తామని 2023-24 బడ్జెట్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం నిజంగా ఒక పెద్ద మార్పు వంటిదే. డిజిటల్ ఇండియా మిషన్‌కు అనుగుణంగా భారత ప్రభుత్వం దేశంలో ఫిన్‌టెక్ పరిశ్రమ వృద్ధికి ఎన్నో సదుపాయాలు కల్పించింది. ఆధార్, పీఎం జన్ ధన్ యోజన, వీడియో కేవైసీ, యూపీఐ వంటివి ఎన్నో చేపట్టింది. ఫలితంగా భారత ఫిన్‌టెక్ పరిశ్రమ 2025 నాటికి 1.3 ట్రిలియ్ డాలర్ల స్థాయికి చేరుకోనుంది. డిజీలాకర్ ప్రస్తుతం డిజీలాకర్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన డాక్యుమెంట్ల డిజిటల్ కాపీలు స్టోర్ చేసుకునేందుకు వినియోగిస్తున్నారు. ప్రభుత్వం తాజా నిర్ణయం ఇతర డాక్యుమెంట్లను సైతం డిజీలాకర్‌లో స్టోర్ చేసుకునే దిశగా ప్రోత్సహిస్తుంది. వెబ్‌బ్రౌజర్, మొబైల్ యాప్ రూపంలో అందుబాటులో ఉన్న డిజీలాకర్‌ను డిజీయాత్ర యాప్‌పై ఐడెండిటీ వెరిఫికేషన్‌కు అనుమతిస్తున్నారు. దీంతో దేశీ విమానాశ్రయాల్లో కాంటాక్ట్‌లెస్ చెకిన్‌కు వీలు లభిస్తోంది. డైనమిక్ కేవైసీ డిజీలాకర్ సాయంతో కేవేసీ ప్రక్రియను మరింత సులభతరం చేయాలన్న ప్రభుత్వం నిర్ణయంతో కేవైసీ ప్రక్రియ క్రియాశీలంగా మారుతుంది. ఆధార్, పాన్ డేటా ఆధారంగా రిస్క్ సమీక్ష సాధ్యపడుతుంది. డిజిటల్ ఇండియా కార్యక్రమం దేశంలో మరింత విస్తరిస్తుంది. రుణాల లభ్యతను పెంచుతుంది. భారత ఫిన్‌టెక్ పరిశ్రమ దీర్ఘకాల వృద్ధికి బడ్జెట్ ఎంతో ముందడుగు వేసింది సాంకేతిక, విజ్ఞాన ఆధారిత వృద్ధి ప్రాధాన్యతను బడ్జెట్ గుర్తించింది. వివిధ ప్రభుత్వ ఏజెన్సీలు, నియంత్రణసంస్థలు కలిగి ఉండే పౌరుల డేటా విషయంలో ఏకీకృత పరిష్కారంపై దృష్టి సారించింది. నేషనల్ డిజిటల్ లైబ్రరీ సహా ఇతర చర్యలు ఫిన్‌టెక్ పరిశ్రమ వృద్ధికి ఎంతో లబ్ధి కలిగిస్తాయి. క్రెడిట్ కార్డులు యూపీఐతో లింక్ చేయడానికి ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం కూడా ఆహ్వానించతగినది. -
పంజాగుట్టలో డైమండ్ షోరూం ప్రారంభోత్సంలో అనుపమ పరమేశ్వరన్ సందడి (ఫోటోలు)
-
ఐకియా: ఇదెక్కడి క్రేజ్‌రా బాబోయ్! వైరల్ వీడియోస్
బెంగళూరు: స్వీడిష్ ఫర్నిచర్ రిటైలర్ ఐకియా ఇటీవల (జూన్ 22న) బెంగళూరులో తొలి అవుట్‌లెట్‌ను ప్రారంభించింది. అప్పటినుంచి బెంగళూరు ప్రజలు ఈ మాల్‌కు క్యూ కట్టారు. ఒకేసారి వందల సంఖ్యలో కస్టమర్లు ఐకియాకు తరలి వచ్చారు. అందులోనూ వీకెండ్ కావడంతో శనివారం మరింత రద్దీ నెలకొంది. భారీగా నెలకొన్న క్యూలతో వినియోగదారులను కట్టడి చేయడం,సెక్యూరిటీ కల్పించడం సిబ్బందికి తలకుమించిన భారంగా మారిపోయింది. దీనిపై ఫోటోలు, ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా షేర్ అవుతూ సందడి చేస్తున్నాయి. గంటలకొద్దీ పెద్ద పెద్ద క్యూలైన్లలో కస్టమర్లు వేచి ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో సందడి చేశాయి. దీంతో దెబ్బకి ఐకియా స్పందించి ట్విటర్లో ఒక ప్రకటన చేయాల్సి వచ్చింది. తమ స్టోర్‌కు వస్తున్న స్పందన దిగ్భ్రాంతి కలిగిస్తోంది. అయితే ప్రస్తుతం స్టోర్‌లో వేచి ఉండే సమయం 3 గంటలకు చేరింది. దయచేసి దీన్ని బట్టి ప్లాన్ చేసుకోండి మహానుభావా.. లేదా ఆన్లైన్ షాపింగ్ చేయండి అని వేడుకుంటూ ఐకియా ఇండియా తన అధికారిక ఖాతాలో ట్వీట్ చేయడం గమనార్హం. Bengaluru, we are overwhelmed by your response❣️ Current wait time at Nagasandra store is 3 hours. Please plan accordingly or shop online. For latest wait time updates, visit: — IKEAIndia (@IKEAIndia) June 25, 2022 మరోవైపు దీనిపై వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ట్వీట్ చేశారు. ఇది మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి క్యూలో ఉన్న ఎమ్మెల్యేలు కాదు, ఇమ్మిగ్రేషన్ క్యూ కాదు, కోవిడ్ టీకా క్యూ కానే కాదు, దర్శనం కోసం తిరుపతిలో క్యూలో నిల్చున్న భక్తుల క్యూ అంతకన్నాకాదు. ఇది బెంగళూరులో ఐకియా స్టోర్ ప్రారంభోత్సవం! అంటూ ఒక వీడియోను షేర్ చేశారు. It’s not MLAs queuing in Maharashtra to form government, It’s not an immigration queue to enter our country, It’s not a vaccination queue to avoid Covid wave, It’s not pilgrims queueing in Tirupati for darshan, It’s the opening of IKEA store in Bangalore! — Harsh Goenka (@hvgoenka) June 26, 2022 Nothing Just Bangalore people going to IKEA — Anish (@Aniiiiish) June 26, 2022 -
ఆంటీ తెలివిగా దుకాణంలో ఫోన్‌ను భలే నొక్కేసింది..!!
-
మీషో.. ‘సూపర్’ షో, ఇక కిరాణా సామాగ్రి కూడా కొనొచ్చు!
న్యూఢిల్లీ: సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడులున్న మీషో ఆన్లైన్ గ్రోసరీ విభాగంలో భారీగా విస్తరించేందుకు సిద్ధపడుతోంది. ఒకే చోట అన్నీ లభించేలా వేసుకున్న ప్రణాళికల్లో భాగంగా కీలక యాప్ ద్వారా గ్రోసరీ విభాగాన్ని సమీకృతం చేయనున్నట్లు మీషో పేర్కొంది. దేశీయంగా తదుపరి 100 కోట్ల(బిలియన్) యూజర్లకు సింగిల్ షాపింగ్ కేంద్రంగా నిలవాలని ఆశిస్తున్నట్లు తెలియజేసింది. మే నెల తొలి వారానికల్లా గ్రోసరీ బిజినెస్ ఇంటిగ్రేషన్‌ను పూర్తి చేయనున్నట్లు వెల్లడించింది. దీంతో ఫార్మిసోను మీషో సూపర్‌స్టోర్‌గా రీబ్రాండ్ చేయనున్నట్లు పేర్కొంది. కర్ణాటకలో షురూ: తొలుత కర్ణాటకలో పరిశీలనాత్మకంగా కీలక యాప్‌తో మీషో సూపర్‌స్టోర్‌ను జత చేసినట్లు మీషో వ్యవస్థాపక సీఈవో విదిత్ ఆట్రే తెలియజేశారు. తాజా పండ్లు, కూరగాయలు, హోమ్ కేర్, ప్యాకేజ్డ్ ఫుడ్, గ్రోసరీ సంబంధిత 500 ప్రొడక్టులను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 9 నెలల్లోపే మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లలోనూ యూజర్లను ఆకట్టుకుంటున్నట్లు తెలియజేశారు. 2022 చివరికల్లా 12 రాష్ట్రాలకు విస్తరించనున్నట్లు మీషో తెలియజేసింది. ప్రస్తుత ఇంటిగ్రేషన్‌తో 10 కోట్లకుపైగా యూజర్లు 8.7 కోట్ల ప్రొడక్ట్ లిస్టింగ్స్‌ను ఒకే ప్లాట్‌ఫామ్‌పై పొందవచ్చని వివరించింది. -
సరికొత్త విప్లవం: అమెజాన్ బట్టల దుకాణం
Amazon Announced Physical Cloth Store: ఆన్లైన్ ఈ-కామర్స్ రారాజు అమెజాన్ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ-వరల్డ్ నుంచి రియల్ వరల్డ్‌లోకి అడుగుపెట్టనుంది. ఈ మేరకు లాస్ ఏంజెల్స్‌లో క్లాతింగ్ స్టోర్‌ను(bricks-and-mortar clothing store) ప్రారంభించనున్నట్లు కంపెనీ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. కాలిఫోర్నియా నగరం లాస్ ఏంజెల్స్‌లో అమెజాన్ కంపెనీ ఈ ఏడాది చివర్లో ఈ క్లాత్ స్టోర్‌ను ప్రారంభించనుంది. అమెజాన్ స్టైల్ స్టోర్ ప్రత్యేకత ఏంటంటే.. కస్టమర్లు అమెజాన్ యాప్‌ని ఉపయోగించి దుస్తుల QR కోడ్లను స్కాన్ చేయడం, తమకు కావాల్సిన సైజులతో పాటు రంగులను ఎంచుకోవవచ్చు. ఆపై వాటిని ప్రయత్నించడానికి ఫిట్టింగ్ రూమ్‌లకు అనుమతిస్తారు. ఇదంతా స్మార్ట్ మెథడ్‌లో కొనసాగుతుంది. ఇక ఈ ఫిట్టింగ్ రూమ్‌లను ‘‘పర్సనలైజ్డ్ స్పేస్’’గా పేర్కొంటూ.. అందులోనూ టచ్ స్క్రీన్లను ఏర్పాటు చేస్తారు. అవసరం అనుకుంటే ఆ స్క్రీన్ మీద కస్టమర్ తమకు కావాల్సిన దుస్తుల్ని ఎంచుకోవవచ్చు. తద్వారా అటు ఇటు తిరగాల్సిన అవసరం లేకుండా.. బోలెడు టైం ఆదా అవుతుంది. యాప్ ద్వారా షాపర్స్ అభ్యర్థించిన వస్తువులతో పాటు ఆప్షన్స్ ద్వారా కార్ట్‌కు జోడించిన(యాడ్ చేసిన) ఎంపికలను సైతం ఆ ఫిట్టింగ్ రూంకి పంపిస్తారు. ‘‘కస్టమర్ షాపింగ్ చేస్తున్నంతసేపు అమెజాన్ మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్‌లు యాక్టివేట్‌గా ఉంటాయి. అవి వాళ్లకు తగిన, రియల్ టైం సిఫార్సులను ఉత్పత్తి చేస్తాయి. తద్వారా కస్టమర్లు ఇబ్బంది పడకుండా కావాల్సినవి ఎంచుకోవచ్చు’’ అని అమెజాన్ ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాదు డెలివరీ విషయంలో ఆన్సైట్ ఆపరేషన్స్ తరహాలోనే అత్యాధునిక టెక్నాలజీ ద్వారా త్వరగతిన చేయిస్తాయి. మార్కెట్లో అమెజాన్ ఆధిపత్యం అధికంగా ఉంటోందని పోటీదారులు, ప్రభుత్వాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీటెల్(వాష్టింగ్టన్) కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెజాన్.. ఫిజికల్ స్టోర్ల ద్వారా తన రిటైల్ ఉనికిని విస్తరించేందుకు ముందుకు వచ్చింది. ఇదిలా ఉంటే 2017లో అమెజాన్ హోల్ ఫుడ్స్ మార్కెట్ గ్రోసరీ చైన్‌ను $13.7 బిలియన్ డాలర్లకు చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. తద్వారా ఫిజికల్ రిటైల్‌లో ఈ చర్య, ఈ-కామర్స్ దిగ్గజపు ఉనికిని గణనీయంగా విస్తరించింది. చదవండి: అమెజాన్ 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్'..! 70 శాతం మేర తగ్గింపు! -
ఫుడ్ కంటైనర్‌లో స్పై కెమెరా!
మనం ఏదైన మాల్స్‌కి వెళ్లితే అక్కడ పెద్ద పెద్ద షోరూంల వాళ్లు భద్రత దృష్ట్యా స్పైకెమరాలు, సీసీ కెమరాలు వంటివి ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకంటే ఎక్కవ జనసందోహం ఉంటుంది. పైగా అక్కడ ఉన్న ఖరీదైన వస్తువుల చోరికి గురికాకుండా ఉండే నిమిత్తం ఈ ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. అయితే ఒక కస్టమర్ తన పెంపుడు పిల్లులు కోసం కొనుగోలు చేసిన ఫుడ్ కంటైనర్‌లో ఉన్న స్పై కెమెరాను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. (చదవండి: ఫుల్‌గా తాగి సెక్యూరిటీ గార్డ్‌తో గొడవపడిన మహిళ) అసలు విషయంలోకెళ్లితే..ఒక వ్యక్తి లిల్లిపుట్, గోలియత్ అనే రెండు పెంపుడు పిల్లులు ఉంటాయి. సదరు వ్యక్తి తన పిల్లులకు సంబంధించిన ఆహారాన్ని స్థానిక కో-ఆపరేటివ్ ఫ్రాంచైజీ వెల్కమ్ స్టోర్‌లో కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఒకరోజు అతను తన భార్యను ఆ ఆహార ప్యాకెట్లను తీసుకురమ్మని చెబుతాడు. దీంతో ఆమె ఆ ప్యాకెట్‌ని తీసుకుని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఆ ఫుడ్ ప్యాకెట్‌పై ఉన్న పిల్లి బొమ్మ తల మీద ఒక స్పై కెమెరా ఉంటుంది. దీంతో ఆమె ఈ విషయాన్ని తన భర్తకు తెలియజేసింది. అయితే అతను కూడా ఒక్కసారిగా షాక్‌కి గురవుతాడు. బహుశా సెక్యూరిటీ నిమిత్తం ఇలా షాపు వాళ్లు ఇలా ఏర్పాటు చేశారేమో పొరపాటున మనకు వచ్చేసిందేమో అని అనుకుంటారు. ఆ తర్వాత ఇంతవరకు ఆ కెమెరాలో ఏమైన రికార్డు అయ్యిఉందేమో అని సీసీఫుటేజ్ నిమిత్తం తనిఖీ చేసి చూడగా మరోసారి షాక్‌కి గురవుతాడు. ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే ఆ స్పై కెమెరాలో బ్యాటరీలు లేవు అందువల్ల అది వేటిని రికార్డు చేయలేదు. ఇంతవరకు స్టోర్ అయి ఉన్న డేటా ఏమి లేదని ఇది చూడటానికి ఆశ్చర్యంగానూ వింతగానూ ఉందని సదరు వ్యక్తి స్థానిక మీడియాకి తెలిపాడు. (చదవండి: రష్యా బస్సు ప్రమాదంలో ఐదుగురు మృతి) -
ఆంధ్రప్రదేశ్‌లో మెట్రో మూడవ స్టోర్, ఎక్కడంటే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హోల్‌సేల్ వ్యాపార దిగ్గజం మెట్రో క్యాష్ అండ్ క్యారీ తాజాగా గుంటూరులో స్టోర్‌ను ఏర్పాటు చేసింది. 44,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది నెలకొంది. 9,000 పైచిలుకు రకాల ఆహార, ఆహారేతర ఉత్పత్తులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో సంస్థకు ఇది మూడవ కేంద్రం కాగా, దేశవ్యాప్తంగా 30వ ఔట్లెట్. ఈ కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 500 మందికి ఉపాధి లభిస్తుందని కంపెనీ తెలిపింది. ఏపీలో ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో స్టోర్స్ ఉన్నాయి. దక్షిణాదిన కంపెనీ ఔట్లెట్ల సంఖ్య 14కు చేరుకుంది. దేశవ్యాప్తంగా 30 లక్షల పైచిలుకు కస్టమర్లు ఉన్నారు. -
బ్రిక్ అండ్ మోర్టార్ బిజినెస్‌లోకి గూగుల్
వెబ్‌డెస్క్ : ఆన్లైన్ బిజినెస్‌కి ఆఫ్‌లైన్ ఎక్స్‌పీరియన్స్‌ని జోడిస్తూ బ్రిక్ అండ్ మోర్టార్ బిజినెస్‌లోకి గూగుల్ ప్రవేశించింది. న్యూయార్క్ నగరంలో తొలి బ్రిక్ అండ్ మోర్టార్ బిజినెస్‌ని ప్రారంభించింది. న్యూయార్క్‌లో గూగుల్ సంస్థ అందిస్తోన్న సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ ఉత్పత్తులను వినియోగదారులు కొనుగోలు చేసేందుకు న్యూయార్క్‌లోని చెల్సియా ఏరియాలో బ్రిక్ అండ్ మోర్టార్ (ఆఫ్‌లైన్ టూ ఆన్లైన్) పద్దతిలో రిటైల్ స్టోర్‌ని గూగుల్ ప్రారంభించింది. గూగుల్‌కి పిక్సెల్ ఫోన్, స్టాడియా, వేర్ ఓఎస్ టూ నెస్ట్, ఫిట్‌బిట్ డివైజెస్ టూ పిక్సెల్బుక్స్ ఇలా పలు ఉత్పత్తులను ఇక్కడ అమ్ముతోంది. ఈ స్టోర్‌కి కస్టమర్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. విశాలమైన స్థలంలో ఏర్పాటు చేసిన మా గూగుల్ స్టోర్‌కి వచ్చిన వారికి ధన్యవాదాలంటూ ట్టిట్టర్లో పోస్ట్ చేశారు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్. బ్రిక్ అండ్ మోర్టార్ అంటే ఆన్లైన్, ఆఫ్‌లైన్ మార్కెట్ల కలయితే బ్రిక్ అండ్ మోర్టార్ స్టోర్. ఆఫ్‌లైన్‌లో ఉత్పత్తలను స్వయంగా పరిశీలించి అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్‌లను అడిగి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ప్రొడక్టు నచ్చితే స్టాక్ ఉంటే అక్కడే కొనక్కోవచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టవచ్చు. ఆన్లైన్లో కొనడానికి ముందు ఒక ప్రొడక్ట్ యొక్క రియల టైం ఎక్స్‌పీరియన్స్‌ని కష్టమర్లకి అందివ్వడం ఈ స్టోర్ల ముఖ్య ఉద్దేశం. ఆపిల్ తర్వాత బ్రిక్ అండ్ మోర్టార్ పద్దతిలో ఇప్పటికే ఆపిల్ సంస్థ యూఎస్‌లో ఒక స్టోర్‌ని ఓపెన్ చేయగా .. ఆ తర్వాత గూగుల్ కూడా రంగంలోకి దిగింది. త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ తరహా స్టోర్లను తెరిచే యోచనలో ఈ రెంటు టెక్ దిగ్గజ కంపెనీలు ఉన్నాయి. చదవండి : Father's Day: వాట్సాప్ న్యూ అప్డేట్ -
రిలయన్స్ బ్రాండ్స్ చేతికి జివామే!
సాక్షి, ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ఆన్లైన్ లోదుస్తుల సంస్థ జివామేను సొంతం చేసుకుంది. యాక్టోసెర్బా యాక్టివ్ హోల్‌సేల్‌లో మైనారిటీ వాటాను కొనుగోలు చేసినట్లు రిలయన్స్ సోమవారం నాటి ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ధృవీకరించింది. ఈ లావాదేవీ 2020 సెప్టెంబర్ 30 తో ముగిసిన మొదటి అర్ధ సంవత్సరంలో ముగిసిందని వెల్లడించింది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని అనుబంధ కంపెనీ రిలయన్స్ బ్రాండ్స్ యాక్టోసెర్బా యాక్టివ్ హోల్‌సేల్‌ను అసోసియేట్ కంపెనీగా పేర్కొంది. దీంతో ఆర్ఐఎల్ 38 సంస్థలను అసోసియేట్ కంపెనీలను తన ఖాతాలో వేసుకుంది. మార్కెట్ రెగ్యులేటరీ సెబీ ప్రకారం, ఈ కంపెనీలో 15 శాతం వాటాను కొనుగోలు చేసింది. జూలైలో, ఆర్ఐఎల్ అనుబంధ సంస్థ రిలయన్స్ బ్రాండ్స్, జివామెలోని రోనీ స్క్రూవాలా యాజమాన్యంలోని యునిలేజర్ వెంచర్స్ వాటాను కొనుగోలు చేసినట్లు తెలిపింది. కంపెనీ మొత్తం 15 శాతం వాటాను రిలయన్స్ బ్రాండ్స్‌కు అమ్మినట్లు స్క్రూవాలా తెలిపారు. 2011లో స్థాపితమైన బెంగళూరుకు చెందిన యాక్టోసెర్బా యాక్టివ్ హోల్‌సేల్, జివామే అని కూడా పిలుస్తారు. ఇది మహిళల కోసం ఆన్లైన్ లోదుస్తుల స్టోర్నునిర్వహిస్తుంది. స్టార్టప్ యాక్టివ్‌వేర్, స్లీప్వేర్, షేప్‌వేర్ వంటి ఇతర విభాగాలలోకి ప్రవేశించింది. జివామే వెబ్సైట్ ప్రకారం, ఇది 30-ప్లస్ రిటైల్ దుకాణాలను కలిగి, దేశవ్యాప్తంగా 800 కి పైగా భాగస్వామి దుకాణాలనుకలిగిఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ .32 కోట్లతో పోలిస్తే 2019 మార్చి నాటికి కంపెనీ రూ .19.5 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేయగా, రూ .140 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. -
యాడ్ దుమారం : తనిష్క్ స్టోర్‌కు బెదిరింపులు
అహ్మదాబాద్ : ప్రముఖ జ్యూవెలరీ బ్రాండ్ తనిష్క్ వివాదాస్పద యాడ్ కలకలం రేపుతోంది. ఈ యాడ్ లవ్ జిహాదీని ప్రోత్సహిస్తోందని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోయడంతో యాజమాన్యం దిగివచ్చి యూట్యూబ్ నుంచి ఈ యాడ్‌ను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. వివాదస్పద యాడ్‌పై గుజరాత్‌లోని కచ్ జిల్లాలో తనిష్క్ స్టోర్‌కు బెదిరింపులు వచ్చాయి. ఈ ప్రకటన సరైంది కాదని తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూ ఈ స్టోర్‌కు కొందరు బెదిరింపు కాల్స్ చేశారని పోలీసులు తెలిపారు. స్టోర్ వద్ద ఎలాంటి ఆందోళనలు, ఘర్షణలు చోటుచేసుకోలేదని ఈ ప్రాంతంలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశామని పోలీసు అధికారులు పేర్కొన్నారు. సోమవారం రాత్రి తనిష్క్ గాంధీధామ్ స్టోర్ వద్దకు నిరసనకారులు రాగా, స్టోర్ యాజమాన్యం క్షమాపణలు చెబుతూ నోట్ రాసినట్టు సమాచారం. ఈ యాడ్ సిగ్గుచేటని, దీనికి తమను మన్నించాలంటూ స్టోర్ మేనేజర్ రాసిన క్షమాపణ నోట్‌ను ఆందోళనకారులు స్టోర్‌పై అతికించారు. గత వారం తనిష్క్ విడుదల చేసిన యాడ్‌పై సోషల్ మీడియాలో ఓ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైన సంగతి తెలిసిందే. కాగా, ముస్లిం కుటుంబంలో అడుగుపెట్టిన హిందూ కోడలి సీమంతం థీమ్‌తో రూపొందించిన ఈ ప్రకటన, లవ్ జీహాదీని ప్రోత్సహించేవిధంగా ఉందంటూ నెటిజన్లు #BoycottTanishq ట్రెండ్ చేయడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇకపై తనిష్క్ ఆభరణాలు కొనే ప్రసక్తే లేదని, టాటా గ్రూప్‌నకు సంబంధించిన అన్ని ఉత్పత్తులపై దీని ప్రభావం ఉంటుందంటూ ట్రోల్ చేసిన నేపథ్యంలో తమ ఉద్యోగులు, భాగస్వాముల శ్రేయస్సు కోరి యాడ్‌ను డిలీట్ చేసినట్లు సంస్థ వెల్లడించింది. చదవండి : అందుకే ఆ యాడ్ తొలగించాం: తనిష్క్ -
నభా సందడి
-
100 మార్కును దాటిన మినిసో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జపనీస్ డిజైనర్ లైఫ్‌స్టైల్ బ్రాండ్ మినిసో భారత్‌లో 100 స్టోర్ల మార్కును దాటింది. రెండేళ్ల క్రితం భారత్‌కు ప్రవేశించిన మినిసో.. ప్రస్తుతం 43 నగరాల్లో 106 ఔట్లెట్లను నిర్వహిస్తోంది. పోటీ ధరలో ఉత్పత్తుల తయారీకి భాగస్వామ్య ఒప్పందాలు చేసుకుంటామని కంపెనీ ఇండియా జీఎం టైరోన్ లి వెల్లడించారు. దేశీయంగా విక్రయంతోపాటు అంతర్జాతీయ మార్కెట్‌కు వీటిని ఎగుమతి చేస్తామని పేర్కొన్నారు. -
టీటీడీకి చెందిన బర్డ్స్ ఆస్పత్రి మేదికల్ స్టోర్‌లో అక్రమాలు
-
విద్యుత్ గోదాములో దొంగలు పడ్డారు
తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని ‘స్టోర్స్’ అవినీతికి ఆలవాలంగా మారింది. ఇక్కడ ఇంటి దొంగలు కొందరు గుట్టుచప్పుడు కాకుండా ‘దోచుకుంటున్నారు’. కమీషన్లు ఇచ్చిన వారికే విద్యుత్ పరికరాలు పంపిణీ చేస్తున్నారు. కేబుళ్లు మొదలు ట్రాన్స్ఫార్మర్లు, సీటీమీటర్ బాక్సులు, ప్యానల్ బోర్డులు, కండక్టర్లు, డిస్కులు, ఇన్సులేటర్ల వరకు ఏది కావాలన్నా అడిగినంత కమీషన్ ఇచ్చుకోవాల్సి వస్తోంది. లేదంటే రోజుల తరబడి కాంట్రాక్టర్లు స్టోర్ల చుట్టూ తిరగాల్సిందే. ఈ అంశంపై ఇటీవల కొందరు కాంట్రాక్టర్లు ఆ శాఖ డైరెక్టర్‌కు స్వయంగా ఫిర్యాదు చేశారు. తాజాగా గురువారం రాత్రి సిటీస్టోర్ నుంచి గుట్టుచప్పుడు కాకుండా ఖరీదైన మెటీరియల్‌ను ఓ ప్రైవేటు డీసీఎంలో బయటకు తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడటం వివాదాస్పదంగా మారింది. దీనిపై కొందరు కేటీఆర్‌కు ట్విట్టర్లో ఫిర్యాదు చేయడంతో సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించడం గమనార్హం. సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి విద్యుత్ స్టోర్స్(విద్యుత్ పరికరాల నిల్వ, పంపిణీ కేంద్రాలు)అవినీతికి నిలయంగా మారాయి. కేబుళ్లు మొదలు ట్రాన్స్ఫార్మర్లు, సీటీమీటర్ బాక్సులు, ప్యానల్ బోర్డులు, కండక్టర్లు, కాసారాలు, మెటల్పార్ట్స్, డిస్కులు, ఇన్సులేటర్ల వరకు ఏదీ కావాలన్నా అడిగినంత కమీషన్ ఇచ్చుకోవాల్సిందే. లేదంటే సదరు కాంట్రాక్టర్లు స్టోర్ల చుట్టూ రోజుల తరబడి ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. ఎస్టిమేషన్ ప్రకారం డీడీ రూపంలో బిల్లు చెల్లించినా స్టోర్ నుంచి మెటీరియల్ తీసుకునేందుకు భారీగా ముడుపులు సమర్పించాల్సి వస్తోంది. ఇదే అంశంపై ఇటీవల కొందరు కాంట్రాక్టర్లు పీ అండ్ ఎంఎం డైరెక్టర్‌కు స్వయంగా ఫిర్యాదు చేయడంతో ఆయన సంబంధిత ఏడీఈని తీవ్ర స్థాయిలో మందలించారు. తాజాగా గురువారం రాత్రి సిటీస్టోర్ నుంచి గుట్టుచప్పుడు కాకుండా ఖరీదైన మెటీరియల్‌ను ఓ ప్రైవేటు డీసీఎంలో బయటికి తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడటం వివాదాస్పదంగా మారింది. దీనిపై కొందరు కేటీఆర్‌కు ట్విట్టర్లో ఫిర్యాదు చేయడంతో సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించడం గమనార్హం. ప్రాథమిక విచారణ అనంతరం స్టోర్ ఏఈ యాదయ్యను సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. నాణ్యత పేరుతో ఆంక్షలు... గ్రేటర్ పరిధిలో తొమ్మిది సర్కిళ్లు ఉండగా, వాటి పరిధిలో 50 లక్షలకుపైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇటీవల నగరశివార్లలో కొత్తగా వెలుస్తున్న బహుళ అంతస్తుల నిర్మాణాలు, వెంచర్లు, పారిశ్రామిక వాడలకు కరెంట్ సరఫరా చేసేందుకు కొత్తగా లైన్లు వేయాల్సి వస్తుంది. కొత్త లైన్లు, భూగర్భకేబుళ్లు, కొత్త సబ్స్టేషన్ల ఏర్పాటు వంటి ప్రభుత్వ పనులే కాకుండా, ప్రైవేటు వ్యాపార, వాణిజ్య సంస్థలు, అపార్ట్మెంట్లకు సంబంధించిన వర్కులను ప్రైవేటు కాంట్రాక్టర్లే ఎక్కువగా చేస్తుంటారు. ఇందుకు అవసరమైన మెటీరియల్‌ను గతంలో కాంట్రాక్టరే స్వయంగా బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసేవారు. అయితే కొందరు నాశిరకం మెటీరియల్ వాడుతున్నట్లు ఆరోపణలు రావడంతో ట్రాన్స్‌కో, బయటి మెటీరియల్‌పై ఆంక్షలు విధించింది. వర్క్ ఎస్టిమేషన్ తర్వాత అందుకయ్యే ఖర్చు మొత్తాన్ని సదరు కాంట్రాక్టర్ డీడీ రూపంలో సంస్థకు చెల్లిస్తేవారికి అవసరమైన మెటీరియల్‌ను డిస్కమే సరఫరా చేస్తుంది. ఇందుకుగాను ఎర్రగడ్డలోని హైదరాబాద్, రంగారెడ్డి స్టోర్లను ఏర్పాటు చేసింది. ఒక్కో మెటీరియల్‌కు ఒక్కో రేటు... ఇలా కొత్తలైన్లకు సంబంధించి ఎలాంటి విద్యుత్ మెటీరియలైనా ఇక్కడి నుంచి సరఫరా కావాల్సిందే. దీనిని అవకాశంగా తీసుకుంటున్న కొందరు ఇంజనీర్లు ఒక్కో మెటీరియల్‌కు ఒక్కో రేటు నిర్ణయించారు. ఎవరైనా కాంట్రాక్టర్ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఎలక్ట్రిక్ స్టోర్ నుంచి ట్రాన్స్ఫార్మర్ తీసుకువెళ్లాలంటే...ఎస్టిమేషన్ ఖర్చులు మొత్తం డీడీ రూపంలో చెల్లించిన తర్వాత కూడా స్టోర్ ఇంజినీర్లకు అదనంగా ముడుపులు చెల్లించాల్సి వస్తుంది. ఏడీఈకి రూ.1000, ఏఈకి రూ.500, హమాలీకి రూ.500 చొప్పున చెల్లించాల్సి వస్తోంది. ఇక ట్రాన్స్‌ఫోర్ట్ ఛార్జీలు అదనం. ఒక ట్రాన్స్ఫార్మర్ పొందాలంటే అదనంగా రూ.7నుంచి రూ.10వేల వరకు ముడుపులు సమర్పించుకోవాల్సి వస్తుంది. దీనికితోడు తూకంలోనూ మోసాలు తప్పడం లేదు. 100కేజీల కండక్టర్‌కు డీడీ చెల్లిస్తే...90 కేజీలే ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక చిన్నచిన్న ఫిన్ ఇన్సులేటర్లు, డిస్క్‌లు, వాటికి అమర్చే మెటల్ పార్ట్స్‌ను కూడా ఇవ్వకుండానే ఇచ్చినట్లు రికార్డుల్లో లెక్కలు చూపుతున్నారు. ఇలా మిగిల్చిన మెటీరియల్‌ను గుట్టుచప్పుడు కా కుండా బయటికి తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంటి దొంగల పనే.. అమీర్‌పేట: ఎర్రగడ్డ జీటీఎస్ కాలనీలోని ఎలక్ట్రికల్ స్టోర్స్ పనిచేసే ఉద్యోగి రూ.లక్షల విలువైన సామాగ్రిని కాజేసేందుకు యత్నించాడు. దీనిని గుర్తించిన మరో ఉద్యోగి ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో అప్రమత్తమై ఆయన బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సామగ్రిని తరళిస్తున్న వాహనాన్ని పట్టుకుని ఎస్ ఆర్‌నగర్ పోలీసులకు అప్పగించారు. కాగా అక్రమంగా మెటీరియల్ తరలిస్తున్న డీసీఎంపై టీఎస్ఎస్పీడీ సీఎల్ అని రాసి ఉండగా సదరు వాహనానికి సంస్థకు ఎలాంటి సంబంధం లేదని తేలడం గమనార్హం. సిటీ ఎలక్ట్రికల్ స్టోర్స్‌లో డివిజన్ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏడీ)తో పాటు మరో ఇద్దరు ఏఈలు కిందిస్థాయి సిబ్బంది పనిచేస్తుంటారు. ఏఈ యాదయ్య గురువారం సాయంత్రం గుట్టుచప్పుడు కాకుండా డీసీఎంలో సుమారు రూ.3 లక్షల విలువైన మెటీరియల్‌ను ఎలాంటి పేపర్లు లేకుండానే బయటికి తరలించాడు. దీనిని గుర్తించిన మరో ఉద్యోగి ఉన్నత అధికారులకు సమాచారం అందించాడు. అప్రమత్తమైన అధికారులు పోలీసులకు సమాచారం అందించడంతో సదరు డీసీఎం బాలానగర్ వైపు వెళుతున్నట్లు గుర్తించిన పోలీసులు దానిని అదుపులోకి తీసుకుని సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. స్టోర్స్ ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉండటంతో కేసును అక్కడికి బదలీ చేశారు. ఏడీ శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఐ అజేయ్‌కుమార్ తెలిపారు. ఏఈ యాదయ్యతో పాటు ఇతర సిబ్బందిని విచారిస్తున్నారు. వాహనం డ్రైవర్ నర్సింహ, మరో వ్యక్తి వెంకటేష్‌లను అదుపు లోకి తీసుకున్నట్లు తెలిపారు. -
హైదరాబాద్‌లో ఐకియా స్టోర్ ఫోటోలు మీకోసం..
-
మొబైల్స్ రిటైల్‌లోకి ‘హ్యాపీ’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్స్ విక్రయంలోకి సరికొత్త బ్రాండ్ ‘హ్యాపీ’ రంగ ప్రవేశం చేసింది. తొలి స్టోర్‌ను అనంతపూర్‌లో నటి సమంత అక్కినేని చేతుల మీదుగా సోమవారం ప్రారంభించింది. తొలి దశలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో స్టోర్లను విస్తరిస్తామని హ్యాపీ మొబైల్స్ ఎండీ కృష్ణ పవన్ ఈ సందర్భంగా తెలిపారు. ‘కస్టమర్లు, ఉద్యోగులు, భాగస్వాములు, ఈ రంగంతో ముడిపడి ఉన్న అందరూ సంతోషంగా ఉండాలన్న ప్రధాన విలువతో హ్యాపీ బ్రాండ్ కొనసాగుతుంది. తొలి ఏడాదే 150–200 ఔట్లెట్లను తెరవాలన్నది మా ప్రణాళిక. మొదటి సంవత్సరం రూ.500 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా చేసుకున్నాం. 1,000 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. ప్రతి స్టోర్‌లో లైవ్ డెమో జోన్స్ ఏర్పాటు చేస్తాం. కస్టమర్‌కు వినూత్న అనుభూతి కల్పించేందుకు వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తాం. అంతర్జాతీయ బ్రాండ్లతో 200ల దాకా మోడళ్ల డిస్ప్లే ఉంటుంది. వినియోగదార్ల కోసం బెస్ట్ డీల్స్ ఆఫర్ చేస్తున్నాం’ అని వివరించారు. టాప్ కంపెనీల యాక్సెసరీస్‌కు ప్రత్యేక ఏర్పాటు ఉంటుందని కంపెనీ ఈడీ కె.సంతోష్ తెలిపారు. రిపేర్ వస్తే స్టాండ్ బై ఫోన్‌ను కస్టమర్‌కు ఇస్తామని ఈ సందర్భంగా చెప్పారు. -
తెలుగు రాష్ట్రాల్లో వాల్‌మార్ట్ విస్తరణ
♦ రెండు రాష్ట్రాల్లో 10 స్టోర్ల చొప్పున ఏర్పాటు ♦ దేశవ్యాప్తంగా కొత్తగా 50 దుకాణాలు న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా రిటైల్ దుకాణాల్లో అగ్రగామిగా ఉన్న వాల్‌మార్ట్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా విస్తరించనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో 10 స్టోర్ల చొప్పున కొత్తగా 20 దుకాణాలను ఏర్పాటు చేయనుంది. అలాగే, మహారాష్ట్రలోనూ 10 స్టోర్లను ప్రారంభించనుంది. ప్రస్తుతం వాల్ మార్ట్ ఇండియా క్యాష్ అండ్ క్యారీ విభాగంలో (హోల్‌సేల్) దేశవ్యాప్తంగా 20 స్టోర్లను నిర్వహిస్తోంది. వీటి సంఖ్యను గణనీయంగా పెంచే ప్రణాళికలతో ఉంది. దేశవ్యాప్తంగా 50 దుకాణాలను ఏర్పాటు చేసే లక్ష్యంతో ఉన్న ఈ సంస్థ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో గణనీయ సంఖ్యలో ఏర్పాటు చేయాలని చూస్తోంది. ప్రభుత్వం నిబంధనలను సరళీకరిస్తే ఫుడ్ రిటైల్లోకీ అడుగు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ వర్గాలు తెలియజేశాయి. భారతీ గ్రూపుతో రిటైల్ భాగస్వామ్యానికి కొన్నేళ్ల క్రితం ముగింపు పలికిన వాల్‌మార్ట్ అప్పటి నుంచి సొంతంగా దుకాణాల ఏర్పాటుపై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఇతర సంస్థల నుంచి క్యాష్ అండ్ క్యారీ విభాగంలో పోటీ తక్కువగా ఉండడంతో అధిక అవకాశాలున్నాయని భావిస్తున్న యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలపై ప్రధానంగా దృష్టి పెట్టింది. వాల్‌మార్ట్ నిర్వహిస్తున్న స్టోర్లన్నీ హల్‌సేల్ విభాగంలోనివే. అంటే రిటైల్ దుకాణాదారులు, క్యాంటీన్లు, హోటళ్ల వారు ఈ స్టోర్లలో కొనుగోలు చేసేందుకు వీలుంటుంది. ఫుడ్ రిటైల్లోకీ అడుగు! ఇక ఫుడ్ రిటైల్‌పైనా కంపెనీ ఆసక్తితో ఉంది. ఈ విషయంలో మార్గదర్శకాల పరంగా స్పష్టత కోసం వేచి చూస్తోంది. ఫుడ్ రిటైల్‌లోకి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడం సానుకూల నిర్ణయమని, అయితే, ఆహారేతర ఉత్పాదనలను కూడా విక్రయించే వెసులుబాటు కల్పిస్తే ఆర్థికంగా గిట్టుబాటవుతుందని వాల్‌మార్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధి తెలిపారు. ‘‘భారత్‌లో కార్యకలాపాలను విస్తరించనున్నాం. వచ్చే కొన్నేళ్లలో ఏపీ, తెలంగాణ, యూపీ, ఉత్తరాఖండ్, హర్యానా, మహారాష్ట్రలో కొత్తగా 50 దుకాణాలను ప్రారంభించనున్నాం. మా బృందం ఇప్పటికే ఈ దిశగా కార్యాచరణ ప్రారంభించింది. కిరాణా దుకాణాలు, చిన్న, మధ్య స్థాయి సరఫరాదారులకు సాయం అందించేందుకు, వేలాది ఉద్యోగాల కల్పనకు మేము కట్టుబడి ఉన్నాం’’ అని వాల్‌మార్ట్ ఇండియా ప్రతినిధి పేర్కొన్నారు. -
అంగట్లో ప్రశ్నపత్రాలు!
► విద్యార్థుల చేతుల్లో 7వ తరగతి ► సామాన్యశాస్త్రం ఇంగ్లిష్ మీడియం పేపర్ ► వనపర్తిలో ఒకరోజు ముందే వెలుగులోకి ► క్వశ్చన్ పేపర్ ధర రూ.100 సాక్షి వనపర్తి : ఏడో తరగతి సామాన్యశాస్త్రం ఇంగ్లిష్ మీడియం పేపర్ వనపర్తిలో ఒకరోజు ముందుగానే విద్యార్థుల చేతుల్లోకి చేరింది. ప్రస్తుతం 10వ తరగతి మినహా అన్ని తరగతుల విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షలు ప్రారంభమైన రోజు నుంచి ఇదేతంతు కొనసాగుతోందని సమాచారం. స్థానికంగా ఉన్న మీసేవా కేంద్రాలు, జిరాక్స్ సెంటర్లు, స్టేషనరీ దుకాణాలు ప్రశ్నపత్రాలకు అడ్డాగా మారాయి. క్వశ్చ¯ŒS పేపర్‌ను రూ.100కు విక్రయిస్తున్నారని తెలిసింది. దీంతో విద్యార్థులు కొందరు పేపర్ కొనుగోలు చేసి ఇతర విద్యార్థులకు వాట్సాప్ ద్వారా పంపుకుంటున్నారని తెలుస్తోంది. గురువారం జరగాలి్సన సామాన్యశాస్త్రం పేపర్‌ను ఇలానే ఓ విద్యార్థి కొని తెచ్చుకోవడంతో తండ్రి మందలించాడని సాక్షిదృష్టికి వచ్చింది. వెంటనే ఈ విషయమై నిజానిజాలు తెలుసుకునేందుకు రంగంలోకి దిగడంతో అసలుసంగతి బయటపడింది. పరీక్ష ముందురోజే క్వశ్చన్ పేపర్ తెచ్చుకుని విద్యార్థులు బట్టీపట్టడం, లేదా మాస్‌కాపీయింగ్‌కు పాల్పడటం చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన పలువురు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నపత్రం మార్కెట్లో దొరకడం ఏమిటి అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కుమ్మక్కై ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితికి కారణమైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
రేషన్ బియ్యం పట్టివేత
రైస్‌మిల్లులో అక్రమంగా నిల్వచేసిన బియ్యం జ్యోతినగర్: ప్రభుత్వం పేదలకు పంపిణీచేస్తున్న రేషన్ బియ్యాన్ని కొందరు అక్రమార్కులు పక్కదారి పట్టిస్తున్న వైనంపై రామగుండం రెవెన్యూ అధికారులు దృష్టి సారించారు. ఓ రైస్‌మిల్లులో అక్రమంగా నిల్వచేసిన 126 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మంగళవారం సీజ్ చేశారు. రామగుండం గౌతమినగర్‌కు చెందిన వ్యాపారి గోలి రమణారెడ్డికి చెందిన శ్రీ సీతారామాంజనేయ స్వామి రైస్‌మిల్లులో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ చేశారనే సమాచారంతో ఆర్ఐ ఖాజామొహినొద్దిన్, వీఆర్ఓలు అజీం, అజయ్, రవీందర్ సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. మిల్లులో నిల్వచేసిన 252 (50 కిలోల) సంచులను గుర్తించి సీజ్ చేశారు. అక్రమ నిల్వలతో పాటు రైస్‌మిల్లుకు కనీసం పేరు లేకుండా నిర్వహిస్తున్న వైనంపై ఉన్నతాధికారులకు నివేదికలు అందజేస్తామని అధికారులు తెలిపారు. -
ఆ యాక్సిడెంట్ చేసింది ఓ కుక్క!
వర్జీనియా: యజమాని లేని సమయంలో ఇదే అదునుగా భావించి కారు నడిపిన ఓ కుక్క యాక్సిడెంట్ చేసింది. అమెరికాలోని వెస్ట్ వర్జీనియాలో ఇటీవల చోటుచేసుకున్న ఈ ఘటనలో.. ఓ షాపింగ్ మాల్ ప్రాంగణంలోకి దూసుకొచ్చిన కారు కాంక్రిట్ పిల్లర్‌ను ఢీకొంది. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా కారు వైపు పరిగెత్తి చూడగా.. అందులో మనుషులెవరూ లేకుండా, కేవలం రెండు కుక్కలు మాత్రమే ఉండటంతో షాక్ తిన్నారు. అనంతరం అక్కడకు చేరుకున్న ఓ మహిళ ఆ కారు తనదే అని.. అందులో ఉన్నది తన పెంపుడు కుక్కలని వెల్లడించింది. తాను షాపింగ్ మాల్‌లోకి వెళ్లిన సమయంలో కుక్కలు ఈ పని చేశాయని తెలిపింది. రెండు కుక్కల్లో ఒకటి ఎలా చేసిందో గానీ.. కారును స్టార్ట్ చేసి గేరు వేయటంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. కారు మాత్రం దెబ్బతింది. దీంతో సదరు మహిళపై ఎలాంటి కేసులు నమోదు కాలేదు. -
సామాన్యులకు 'అందని ద్రాక్ష'..!
జపాన్ః మనకు అందని ఎత్తులో ఉన్న ఏ విషయానికైనా 'అందని ద్రాక్ష' సామెతను ఉదహరిస్తుంటాం. కానీ జపాన్ లోని ఓ దుకాణందారుడు నిజంగా సామాన్యులకు అందని ద్రాక్షనే తన దుకాణంలో ప్రదర్శనకు పెట్టాడు. ఓ అరుదైన జాతికి చెందిన ద్రాక్షపళ్ళ గుత్తిని ఏకంగా లక్షల రూపాయలు వెచ్చించి వేలంలో దక్కించుకోవడమే కాదు... వాటిని తన దుకాణంలో ప్రదర్శనకు ఉంచి వచ్చినవారికి రుచి చూపించి ఇప్పుడు జపాన్ లోనే వార్తల్లో వ్యక్తిగా మారాడు. పాశ్చాత్య ప్రపంచంలో అరుదైన వైన్ కు ఎటువంటి గుర్తింపు ఉంటుందో అలాగే జపాన్ లో అరుదైన, ప్రత్యేకత కలిగిన పళ్ళను కొనుగోలు చేయడం, వినియోగించడం వారి హోదాకు గుర్తుగా భావిస్తారు. అదే నేపథ్యంలో జపాన్ లోని ఓ కిరాణా దుకాణం యజమాని రూబీ రోమన్ జాతికి చెందిన ద్రాక్షపళ్ళ గుత్తిని సుమారు 8 లక్షల రూపాయలకు వేలంలో దక్కించుకున్నాడు. అది తనకు గౌరవంగా భావించడమే కాదు... అలా లక్షలు పోసి కొన్న ద్రాక్షను ప్రదర్శనకు పెట్టి, అందరికీ ఉచితంగా రుచి చూపించాడు. ఆస్పత్రులను సందర్శించేప్పుడు, వివాహాలు, వేడుకల సందర్భాల్లో నాణ్యత కలిగిన, అరుదైన, రుచికరమైన పళ్ళను అందించడం జపాన్ సంప్రదాయాల్లో ఒక భాగమే కాక, హోదాగా కూడా భావిస్తారు. అందుకే అక్కడ అటువంటి ఖరీదైన పళ్ళను అమ్మేందుకు ప్రత్యేక దుకాణాలు కూడ ఉంటాయి. ప్రత్యేక పద్ధతుల్లో పండించిన, ఉత్పత్తి చేసిన పళ్ళ జాతులను ఆ యా దుకాణాల్లో అందుబాటులో ఉంచుతారు. అటువంటి పళ్ళను కొని, ఇతరులకు బహుమతిగా ఇవ్వడం కొనుగోలుదారులు సైతం హోదాగా భావిస్తారు. ఈ సీజన్ లో ప్రత్యేకంగా పండించిన రూబీ రోమన్ జాతికి చెందిన 30 ద్రాక్ష పళ్ళను కొన్నవాళ్ళలో జపాన్ లోనే తకమారూ కొనీషీ మొదటివాడు. పింగ్ పాంగ్ బంతుల సైజులో ఉన్న ఆ ద్రాక్ష.. నిజంగా రూబీ రోమన్ రత్నాల్లా ఉన్నాయని తెగ సంబరపడిపోతున్నాడు. అందుకే తాను సుమారు 8 లక్షల రూపాయలను వెచ్చించానని, తన దుకాణంలో ప్రదర్శనకు ఉంచి, అందరికీ రుచి చూపిస్తున్నానని గర్వంగా చెప్తున్నాడు. జపాన్ సముద్ర తీరంలోని ఇషికవ ప్రాంతంలో ఈ రూబీ రోమన్ జాతిని ఫిజిమోరీ వెరైటీ విత్తనాలతో మొదటిసారి 1992 లో పండించారు. ఈ ద్రాక్ష ఒక్కోటి కనీస బరువు 20 గ్రాములు ఉండటంతోపాటు, రసంలో 18 శాతం చక్కెర పాళ్ళు కలిగి ఉంటుంది. ఈ అరుదైన జాతి ద్రాక్షను మొదటిసారి 2008 లో జపాన్ పండ్ల మార్కెట్లో వేలానికి పెట్టారు. అయితే అప్పట్లో నిజంగానే అందని ద్రాక్ష పుల్లన అన్నట్లుగా దాని ధర కూడ ప్రపంచంలోని ద్రాక్ష పళ్ళ మార్కెట్లలోనే అత్యధిక ధర పలికింది. అంతేకాదు అత్యంత అరుదైన, ఖరీదైన ద్రాక్షగా కొత్త రికార్డు సృష్టించింది. అయితే వేలంలో రూబీ రోమన్ ద్రాక్షను పొందటం నాకెంతో ఆనందంగా ఉందని, ప్రత్యేక గౌరవం లభించినట్లుగా ఉందని కొనిషీ చెప్తున్నాడు. తన దుకాణానికి వచ్చిన కొనుగోలుదారులు రుచి చూడటంతోపాటు, కొందరు ఇతర వ్యాపారులు శాంపిల్ గా కూడ ఈ ద్రాక్షను తీసుకెళ్ళారని చెప్తున్నాడు. ఒక్కోటి సుమారు 25 వేల రూపాయల ఖరీదు చేసే ఆ పళ్ళను కొనిషీ జనానికి ఎలా ఉచితంగా ఇచ్చాడో తెలియదు కానీ, అతడి దుకాణం దగ్గర శాంపిల్స్ కోసం, రుచికోసం జనం క్యూ కట్టడం మాత్రం పెద్ద ఈవెంట్ గా మారిపోయింది. పత్రికలు, మీడియా లో ప్రత్యేక వార్తా కథనం అయిపోయింది. కాగా మార్కెట్లోకి కొత్తగా వచ్చిన అరుదైన జాతి ద్రాక్షను అందరికీ పరిచయం చేసి, తన అమ్మకాలను పెంచుకొనేందుకు సదరు వ్యాపారి ఆ మార్గం ఎంచుకొన్నాడా అన్న అనుమానం కూడా కలుగుతోంది. -
ఐకియా స్టోర్‌కు ఆగస్టు 11న శంకుస్థాపన
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : రిటైల్ రంగ దిగ్గజం, స్వీడన్‌కు చెందిన ఐకియా భారత్‌లో తొలి స్టోర్ శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. ఈ ఔట్‌లెట్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పుతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 11న శంకుస్థాపన చేయనున్నట్టు కంపెనీ వెల్లడించింది. హైటెక్ సిటీ సమీపంలో 13 ఎకరాల విస్తీర్ణంలో రూ.685.5 కోట్ల వ్యయంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. 2017 వేసవిలోగా నిర్మాణం పూర్తి చేసి స్టోర్‌ను ప్రారంభించాలనేది కంపెనీ ప్రణాళిక. 2025 నాటికి దేశవ్యాప్తంగా 25 ఔట్లెట్లను స్థాపించాలన్నది సంస్థ లక్ష్యం. భాగ్యనగరి సహా మొత్తం 9 నగరాల్లో ఇవి రానున్నాయి. వీటి ఏర్పాటుకు రూ.10,500 కోట్ల పెట్టుబడి పెట్టాలని కంపెనీ నిర్ణయించింది. -
రిటైల్ వార్‌కు ఐకియా రెడీ..!
హైదరాబాద్‌లో తొలిస్టోర్తో ఇండియాలోకి ♦ 2025 నాటికి దేశవ్యాప్తంగా 25 స్టోర్లు లక్ష్యం ♦ ఒక స్టోర్ సగటు వార్షిక టర్నోవర్ రూ.720 కోట్లు! ♦ అంతర్జాతీయంగా ప్రస్తుతం 348 స్టోర్లు ♦ గతేడాది అమ్మకాలు రూ.2.72 లక్షల కోట్లు; లాభం 24,200 కోట్లు ♦ ఇండియాలో టీవీలు కూడా ఐకియా బ్రాండ్‌తోనే అమ్మకం! ♦ మల్టీబ్రాండ్ రిటైల్‌కు అనుమతి లేకపోవటమే కారణం ♦ ఐకియా అంతర్జాతీయ వస్తువుల్లో ఇండియా వాటా 3 శాతమే ♦ ఐదేళ్లలో దీన్ని రెట్టింపు చేస్తామంటున్న సంస్థ ♦ ప్రస్తుతానికైతే చైనా నుంచి తెచ్చే వస్తువులే విక్రయం ♦ ఈ వస్తువుల డిజైన్, టెస్టింగ్ మాత్రం ఐకియా సొంతం నేను ఒక్కడిని ఒకవైపు... లోకం ఒకవైపు!! ఇప్పుడు యూరప్ రిటైల్ దిగ్గజం ఐకియాను చూస్తే అదే అనిపిస్తుంది. చెమ్చాలు, బల్బుల నుంచి బెడ్లు, కర్టెన్ల దాకా ఇంటికి కావాల్సిన హోమ్ ఫర్నిషింగ్ మొత్తాన్ని విక్రయించే ఐకియా... భారతదేశానికి కొత్త రిటైల్ అనుభవాన్ని పరిచయం చేస్తామంటోంది. యూరప్‌లో, అమెరికాలో మాదిరి తన స్టోర్లలో ఫర్నిచర్‌తో పాటు టీవీ, ఫ్రిజ్, మైక్రో ఓవెన్ల వంటి హోమ్ అప్లయెన్సెస్‌ను కూడా విక్రయిస్తామంటోంది. అదే జరిగితే... దేశంలో వివిధ బ్రాండ్లతో ఒకేసారి పోటీ పడుతున్నట్లే!! ఎనిమిదేళ్లుగా చైనాలో సైతం నిలకడగా మార్కెట్ వాటా పెంచుకుంటూ వస్తున్న ఈ సంస్థ... ఇండియాలో కూడా 2025 నాటికంటూ పెద్ద లక్ష్యాలే నిర్దేశించుకుంది. వచ్చే ఏడాది హైదరాబాద్‌లో స్టోర్ ప్రారంభించనున్న నేపథ్యంలో స్వీడన్‌లోని తన పుట్టినిల్లయిన ‘ఆల్మ్‌హల్ట్’లో తన టెక్నాలజీని, పని సంస్కృతిని కొందరు పాత్రికేయులకు ప్రత్యక్షంగా చూపించింది. ఆ విశేషాల సమాహారమే ఈ కథనం... ఆల్మ్‌హల్ట్(స్వీడన్) నుంచి మంథా రమణమూర్తి ఆల్మ్‌హల్ట్! నిజానికిది స్వీడన్లో ఓ చిన్న ప్రాంతం. కాకపోతే ఏడాదికి రూ.2.7 లక్షల కోట్ల అమ్మకాలు జరిపే ‘ఐకియా’ హృదయం మాత్రం ఇక్కడే ఉంది. దాని వ్యవస్థాపకుడు ఇంగ్వర్ కొంప్రాడ్ సొంత ప్రాంతం కావటంతో పాటు... ప్రపంచ ధనికుల్లో ఒకడిగా ఆయన ప్రస్థానం కూడా ఇక్కడి నుంచే మొదలైంది. సైకిల్‌పై వస్తువులు విక్రయించే స్థాయి నుంచి ఆయన తొలి ఐకియా స్టోర్‌ను ఆరంభించింది కూడా ఇక్కడే. ఇప్పుడు ఐకియా కార్పొరేట్ కార్యాలయాల్లో కొన్ని కొన్ని కొలువుదీరటంతో పాటు.. సంస్థ ఉత్పత్తులకు ఆత్మ లాంటి ఇన్నోవేషన్... డిజైన్... టెస్టింగ్... కొన్ని ప్రాంతాలకు అవసరమైన ఉత్పత్తితో పాటు ప్రచార విభాగం... క్యాటలాగ్ ముద్రణ... ఇవన్నీ కూడా జరిగేది ఆల్మ్హల్ట్లోనే. తయారీ నుంచి అమ్మకాల వరకూ భిన్నమే!! ఇతర తయారీ సంస్థల్లా ఐకియా తాను విక్రయించే వస్తువులన్నిటినీ తనే తయారు చేయదు. అలాగని వాల్‌మార్ట్ లాంటి రిటైల్ సంస్థల్లా ఇతరులు తయారు చేసిన వస్తువుల్ని మాత్రమే విక్రయించదు. కొన్ని ఫర్నిచర్ వస్తువుల్ని తాను తయారు చేయటంతో పాటు... తన స్టోర్‌లో విక్రయించే ప్రతి వస్తువునూ తనే డిజైన్ చేయటం... దాన్ని కాంట్రాక్టు తయారీ కంపెనీలకు అప్పగించటంతో పాటు, తయారైన వస్తువుల్ని తనే పరీక్షించటం ఐకియా ప్రత్యేకత. వీటికి తోడు ఆయా తయారీ ప్రాంతాల్లో ఐకియా సిబ్బంది దగ్గరుండి పర్యవేక్షిస్తుంటారని ఐకియా కమ్యూనికేషన్స్ (ఇండియా) హెడ్ పాట్రిక్ ఆంటోనీ ‘సాక్షి’తో చెప్పారు. ఇక స్టోర్‌లో విక్రయించేటపుడూ ఐకియా ప్రత్యేకత కనిపిస్తుంది. అంతర్జాతీయంగా పలు దేశాల్లో 348కి పైగా స్టోర్లను నిర్వహిస్తున్న ఈ సంస్థ... దాదాపు ప్రతిచోటా స్టోర్ డిజైన్ ఒకేలా ఉండేలా జాగ్రత్తపడుతుంది. కొనుగోలుదార్ల కోసం రకరకాల బెడ్రూమ్ సెటప్‌లను స్టోర్‌లోనే ఏర్పాటు చేయటంతో పాటు ప్రతి దానికీ ఓ కోడ్ నంబరుంటుంది. స్టోర్ ప్రవేశద్వారం వద్ద మనకిచ్చే ఫారంపై నచ్చిన వస్తువు తాలూకు కోడ్ నంబర్ వేస్తే చాలు. అది బిల్లింగ్ దగ్గరకు వచ్చేస్తుంది. పెపైచ్చు ప్రతి వస్తువునూ కార్లోనో, ట్రాలీలోనే తీసుకెళ్లేలా ఫ్లాట్‌గా ఉండే అట్టపెట్టెల్లో పెట్టి ఇవ్వటం ఐకియా ప్రత్యేకత. దీన్నే సంస్థ ‘ఫ్లాట్ ప్యాక్’ స్ట్రాటజీగా చెబుతుంది. ఇక్కడ కొనే ప్రతి వస్తువూ ఎవరికి వారే బిగించుకునేలా ఉంటుంది. మారుతున్న టెక్నాలజీతో... ‘ఆల్మ్‌హల్ట్’లో ప్రధానంగా ఐకియా భవిష్యత్ వ్యూహాలు కనిపిస్తాయి. 2009 నుంచీ ‘‘రూపం- పనితీరు - నాణ్యత - స్థిరత్వం-తక్కువ ధర’’ అనే ఐదు లక్షణాలూ ఉండే డెమొక్రటిక్ డిజైన్ కాన్సెప్ట్‌ను పాటిస్తున్నట్లు సంస్థ డిజైన్ మేనేజర్ ‘మార్కస్ ఎంగ్మన్’ చెప్పారు. ‘‘ప్రస్తుతం 70 ప్రొడక్ట్ ఇన్నోవేషన్ బృందాలున్నాయి. ఏటా 3,600 కొత్త వస్తువులు డిజైన్ చేస్తున్నాం. స్టోర్లలో అవి పాత వాటి స్థానాన్ని ఆక్రమిస్తుంటాయి. మొత్తం డిజైనర్లలో 20 మంది ఐకియా ఉద్యోగులు కాగా 170 మంది బయటివారు’’ అని వివరించారాయన. స్థిరత్వంలో భాగంగా పేపర్‌తో ఎం- బోర్డ్లను తయారు చేయడానికి, పర్యావరణానికి హాని చేయని వస్తువుల్ని వినియోగించడానికి ప్రయతిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్ కోసం ఐకియా ‘వర్చువల్ రియాలిటీని’ పరీక్షిస్తోంది. ఐకియా సాఫ్ట్‌వేర్‌ను డౌన్లోడ్ చేసుకుని వీఆర్ హెడ్సెట్ ద్వారా మనక్కావాల్సిన వస్తువుల్ని నిజంగా తాకుతున్నట్లుగా అనుభూతి చెందుతూ సెలక్ట్ చేసుకోవటం దీని ప్రత్యేకత. ‘‘ఇది భవిష్యత్ టెక్నాలజీ. దీని అమలుకు కొన్నేళ్లు పట్టొచ్చు. కానీ ఇదో గేమ్ చేంజర్’’ అని సంస్థ గ్లోబల్ కమ్యూనికేషన్స్ హెడ్ సుసాన్ పుల్వెరర్ అభిప్రాయపడ్డారు. సింగిల్ బ్రాండా? మల్టీ బ్రాండా? మరో చిత్రమేంటంటే దేశంలో మల్టీ బ్రాండ్ రిటైల్ సంస్థలు 100 శాతం పెట్టుబడి పెట్టడానికి ప్రస్తుతం అనుమతి లేదు. కాకపోతే ఐకియా సింగిల్ బ్రాండా... మల్టీ బ్రాండా అన్నది కూడా ఒకింత గందరగోళమే. ఎందుకంటే విదేశాల్లోని స్టోర్లలో టీవీలు, ఓవెన్ల వంటి హోమ్ అప్లయెన్సెస్నూ ఇది విక్రయిస్తోంది. అక్కడైతే వీటికి ఐకియా బ్రాండ్ ఉండదు. ఇదే ప్రశ్న పాట్రిక్‌ను అడగ్గా.. ‘‘నిజమే! చూడాలి. ఇండియాలో వాటికీ ఐకియా బ్రాండ్ తప్పకపోవచ్చు. మా వ్యూహాన్ని మార్చుకోవాలేమో’’ అన్నారాయన. అంటే.. ఐకియా టీవీలూ వస్తాయన్నమాట!!. కేటలాగే పెద్ద మీడియా!! ఐకియా స్టోర్లలో దొరికే కేటలాగ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ప్రపంచంలో అత్యధికంగా అంటే... ఏటా వివిధ భాషల్లో దాదాపు 22 కోట్లకుపైగా కేటలాగ్లు ముద్రిస్తుందీ సంస్థ. అంతే కాదు!! ప్రచారానికి పెట్టే ఖర్చులో 70 శాతం దీనికే పెడుతుంది. ఎందుకంటే ఇదే సంస్థ ప్రధాన ప్రచారాస్త్రం. ఆన్లైన్లో సైతం ఈ- కేటలాగ్ లభ్యమవుతుంది. మరో విశేషమేంటంటే ఏడాదికోసారి ముద్రించే కేటలాగ్‌లో... ధరలు కూడా ఉంటాయి. అవి ఏడాదంతా ఒకేలా ఉంటాయి. మధ్యలో పెరగవు. మూడేళ్ల నుంచే వ్యూహానికి పదును... ఐకియాను చూస్తే అంతర్జాతీయ కంపెనీల బ్రాండింగ్ వ్యూహం ఎంత పక్కాగా ఉంటుందో అర్థమవుతుంది. 1.5 బిలియన్ యూరోల పెట్టుబడితో ఇండియాలో అడుగుపెడుతున్నామని 2012లో ప్రకటించిన ఐకియా... అప్పటి నుంచీ తగిన ఏర్పాటు చేసుకుంటూ వస్తోంది. ఢిల్లీ తదితర నగరాల్లో వర్క్‌షాప్‌లు నిర్వహించి హోమ్ ఫర్నిషింగ్‌ను ఇష్టపడే వివిధ వర్గాలను వాటికి ఆహ్వానించింది. నగరాల్లో మధ్య తరగతి ఎలా పెరుగుతోందో, 2025 నాటికి ఎంత ఉంటుందో సర్వేలు చేసింది. పలు అంశాలు కలసి రావటంతో తొలి స్టోర్‌కు హైదరాబాద్‌నే వేదికగా నిర్ణయించింది. 2015లో హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో 13 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. అంతేకాదు!! 2014లోనే స్వీడిష్ ఎంబసీ వివిధ కళాశాలల విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించింది. ఫైనల్స్‌కు హైదరాబాదే వేదిక. విజేతలను ఉచితంగా స్వీడన్‌కు తీసుకెళ్లటంతో పాటు ఐకియా ప్రధాన కార్యాలయాన్నీ చూపించటం విశేషం. ఇక గతేడాది జనవరిలో హైదరాబాద్‌లో హోమ్ ఫర్నిషింగ్‌పై వర్క్‌షాప్‌లు నిర్వహించటంతో పాటు జూన్‌లో జాబ్ మేళానూ నిర్వహించింది. ఇండియాలో సోర్సింగ్ పెరుగుతుందా? ఐకియా 30 ఏళ్లుగా విదేశాల్లోని తన స్టోర్లలో విక్రయించడానికి ఇండియాలో రకరకాల వస్తువుల్ని తయారు చేయిస్తోంది. ప్రస్తుతం ఏటా ఇండియా నుంచి సోర్స్ చేస్తున్న వస్తువుల విలువ రూ.234 కోట్లు. వీటిలో అత్యధికం కర్టెన్లు, కార్పెట్ల వంటి కాటన్ వస్తువులే. ‘‘ప్రపంచ వ్యాప్తంగా 12 లక్షల మంది పత్తిరైతులుండగా ఒక్క ఇండియాలోనే 4 లక్షల మంది ఉన్నారు. ప్రపంచ పత్తి ఉత్పత్తిలో ఇండియా వాటా 11.5 శాతం. తక్కువ నీటిని వాడుతూ పండించేలా కాటన్ ఫర్ మోర్ సస్టెయినబుల్ సోర్సెస్ (సీఎంఎస్ఎస్) నినాదంతో మేం పనిచేస్తున్నాం. ఈ పద్ధతిలో పండించిన 85 లక్షల టన్నుల పత్తిని ఏటా కొంటున్నాం. ఇది మా పత్తి కొనుగోళ్లలో 35 శాతం. తెలంగాణ నుంచి 10 నుంచి 12 శాతం పత్తి కొంటున్నాం. జన్యు మార్పిడి (జీఎం) విత్తనాల విషయానికొస్తే దీన్లో రైతు నిర్ణయమే కీలకం. అయితే ప్రపంచంలో 90 శాతం పత్తి జీఎం విత్తనాలతోనే పండుతోందని గుర్తుంచుకోవాలి’’ అని ఐకియాలో కాటన్ లీడర్‌గా పని చేస్తున్న బిహార్ వాసి ప్రమోద్ సింగ్ చెప్పారు. హైదరాబాద్‌లో వచ్చే ఏడాది స్టోర్ ఆరంభించినా... దీన్లోని వస్తువులు మాత్రం అత్యధికం విదేశాల నుంచి తెచ్చినవే ఉంటాయి. ప్రస్తుతం ఐకియా తన స్టోర్ల కోసం చైనా నుంచి 25 శాతం, పోలండ్, స్వీడన్ల నుంచి తలా 8 శాతం సోర్స్ చేస్తోంది. ఇండియా నుంచి 3 శాతమే సోర్స్ చేస్తుండగా... దేశంలో అమ్మే వస్తువుల్లో కనీసం 30 శాతం స్థానికంగా తయారు చేసినవై ఉండాలనే నిబంధన ఇక్కడ ఉంది. అయితే తొలి ఐదేళ్లూ ఈ నిబంధన వర్తించదు కాబట్టి... వచ్చే ఐదేళ్లలో ఇండియా నుంచి సోర్స్ చేసే వస్తువుల్ని 30 శాతానికి పెంచుకుంటామని పాట్రిక్ ఆంటోనీ చెప్పారు. ‘‘మీరు చైనా నుంచి వస్తువుల్ని డంప్ చేసి విక్రయిస్తారు కదా? దీనివల్ల ప్రధాని నరేంద్రమోదీ చెబుతున్న మేకిన్ ఇండియా భావన దెబ్బతినదా?’’ అని ఆయన్ను ప్రశ్నించగా... ‘‘మేం ప్రస్తుతం ఏటా రూ.234 కోట్ల విలువైన వస్తువుల్ని ఇండియా నుంచి ఎగుమతి చేస్తున్నాం. మున్ముందు దీన్ని వేగంగా పెంచుతాం. వచ్చే ఐదేళ్లలో మేం దిగుమతి చేసుకునే వస్తువుల విలువకన్నా ఎగుమతి చేసేవే ఎక్కువగా ఉంటాయి’’ అని చెప్పారాయన. కాకపోతే ప్రస్తుతం సగటున ఒక ఐకియా స్టోర్ ఏడాదికి రూ.720 కోట్ల అమ్మకాలు జరుపుతోంది. 2025 నాటికి దేశంలో 25 స్టోర్లు ఏర్పాటు చేయాలన్నది ఐకియా లక్ష్యం. మరి ఆ లెక్కన.. 25 స్టోర్లలో విక్రయాలు 2015 నాటికి రూ.18,000 కోట్లుగా ఉంటాయి. ఆ మేరకు ఇండియాలో తయారీ పెరుగుతుందా? లేదా? అన్నది ప్రశ్నార్థకమే. -
రెండు శతాబ్దాల గుబాళింపులు
భారతదేశ రాజధాని ఢిల్లీ నగరంలో గులాబ్ సింగ్ జోషీ మాల్లో గులాబీ అత్తరు నేటికీ పురాతన పరిమళాలను వెదజల్లుతోంది. ఇది ప్రపంచంలోనే అతి పురాతన అత్తరు దుకాణంగా గుర్తింపు పొందింది. అంతేకాదు, ఈ సంస్థ తాను తయారుచేసే అత్తరుకి పేటెంటు హక్కులు కూడా సంపాదించుకుంది. ఆసియాలోకెల్లా అతి పెద్ద నగల మార్కెట్ అయిన దరీబా కలన్ ప్రాంతంలో 200 ఏళ్లనాటి అత్తరు దుకాణం ఇది. 1816 లో ఈ దుకాణానికి పునాది పడింది. అత్తరు తయారీకి వీరు తాజా పూలను, చందన తైలాన్ని ఉపయోగిస్తారు.‘‘ఈ దుకాణానికి అత్తరు రాణి అని పేరు పెట్టినా తప్పులేదు’’ అంటారు సందర్శకులు. ఆ దుకాణంలోకి అడుగు పెట్టగానే 1852 నాటి గోడ గడియారం గంటలు కొడుతూ స్వాగతం పలుకుతుంది. అత్తరు వ్యాపారం చేస్తున్న అదే కుటుంబానికి చెందిన ఏడవ తరానికి చెందిన గుంధీ ఆ గడియారాన్ని అపురూపంగా సంరక్షిస్తున్నాడు. తన పూర్వీకుల గురించి ఎన్నో విషయాలు వివరిస్తాడు గుంధీ. ‘‘ఈ అత్తరు దుకాణానికి ఆద్యుడు గులాబ్ సింగ్. అప్పట్లో రెండో అక్బర్ షా హయాంలో మొఘల్ వంశీకులకు అత్తరు సరఫరా చేసేవాడాయన. ఆ తరవాత ఎందరో ప్రముఖులు ఈ దుకాణాన్ని నిత్యం సందర్శించేవారు. మొఘల్ మహిళలు వీధులలోకి రారు కనుక, వారి రాణివాసం వారికి ప్రత్యేకంగా అత్తర్లు తయారుచేసి, వాటిని బెల్జియం కట్ గ్లాసు సీసాలలో బంధించి, వాసన చెడిపోకుండా గట్టిగా బిగించి, సరఫరాచేసిన ఘనత గులాబ్సింగ్ది. ‘‘ఆ సీసాలను నేటికీ మా దుకాణంలో అపురూపంగా భద్రపరచాం’’ అంటూ వాటిని ప్రేమగా చూపుతాడు గుంధీ. ‘‘మా దగ్గర సుమారు పన్నెండు రకాల అత్తర్లు దొరుకుతాయి. ప్రత్యేకంగా పెంచిన గులాబీ మొక్కల నుంచి, మల్లె మొక్కల నుంచి సేకరించిన తాజా పూలతో అత్తరు తయారుచేస్తాం. నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తాం. లేదంటే వీటి పరిమళం ఎంతోకాలం నిలబడదు’’ అంటాడు గుంధీ.ఉత్తరప్రదేశ్‌లో గులాబీ తోటలు పెంచుతూ, రూహ్ ఏ గులాబ్ అత్తరును గులాబీల నుంచి తయారుచేస్తున్నారు. అత్యధికంగా పదిగ్రాముల రూహ్ ఏ గులాబ్ ఖరీదు 18 వేల రూపాయలు. ఈ దుకాణంలో అత్యంత చౌకగా దొరకే గులాబీ అత్తరు పది గ్రాములు వెయ్యి రూపాయలు. ‘‘గులాబీలను తెల్లవారుజామునే కోసి, సూర్యోదయం కాకుండా పరిమళం పోకుండా, పని ప్రారంభించాలి. ఈ పని చేయడానికి ఎంతో నేర్పరితనం ఉండాలి’’ అంటాడు గుంధీ. మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్, పాకిస్థాన్ ప్రెసిడెంట్ జనరల్ పర్వేజ్ ముషార్రఫ్, ఢిల్లీ నగర ప్రముఖులు... ఎందరో ఈ అత్తరు దుకాణానికి అభిమానులు. - డా. వైజయంతి -
‘ముందు’కొస్తే కటకటాలే!
రోడ్డుపై వ్యాపారుల ఆగడాలకు చెక్ దుకాణం ముందు ఖాళీ స్థలం ఉంది.. అక్కడ షెడ్ వేసి వస్తువులు బయటపెట్టుకొని వ్యాపారం చేసుకుందామనుకుంటే ఇక కుదరదు. ఇన్నాళ్లు జరిగింది.. భవిష్యత్తులోనూ అలాగే ఉంటుందనుకుంటే పొరపాటు.. ఖాళీ స్థలాల్లో అనుమతి లేకుండా వ్యాపారం నిర్వహిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఆదిశగా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోనున్నారు. ఇందుకు ప్రత్యేకంగా 39(బీ) అప్లికేషన్ రూపొందించారు. దీని కారణంగా వాణిజ్య సముదాలు, ప్రైవేట్ దుకాణాలు, వ్యాపారుల ఆగడాలు అదుపుకానున్నాయి. - సాక్షి, సిటీబ్యూరో రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు చేసే వారి పనిపట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు సిద్ధమవుతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారి చర్యలకు చెక్ పెట్టనున్నారు. ఇందుకు 39(బీ)ను ఉపయోగించనున్నారు. ఇలా పనిచేస్తుంది జీపీఎస్ ఉన్న వీడియో స్వీప్ కెమెరాలు ట్రాఫిక్ పోలీసుల వాహనంపైనే పెట్టి తిప్పుతారు. ఆ వీడియో ద్వారా ఫొటోలను తీసుకుని ఏ ఏ దుకాణం నిబంధనలు అతిక్రమించిందో గుర్తిస్తారు. జీపీఎస్ లోకేషన్ ద్వారా సంబంధిత ఫొటోతో పాటు సదరు వ్యాపారి ట్రేడింగ్ లెసైన్స్, ప్రాంతం, సమయం తదితర వివరాలను 39(బీ) అప్లికేషన్లో నిక్షిప్తం చేస్తారు. తరువాత ఆ వివరాలను, జరిమానాను సంబంధిత వ్యాపారికి పంపుతారు. అపుడు చలాన్ చెల్లించాలి. ఇలా మూడుసార్లు ఒకే వ్యక్తి తప్పుచేస్తే అతని ట్రేడ్ లెసైన్స్ రద్దుచేయడంతోపాటు మూడు నెలల జైలు శిక్షణ కూడా విధిస్తారు. డ్రంకన్ డ్రైవ్ స్ఫూర్తితో.. నగరంలో పకడ్బందీగా సాగుతున్న డ్రంకన్ డ్రైవింగే స్ఫూర్తిగా ఈ ఆలోచన వచ్చింది. ఎప్పుడో మూడేళ్ల క్రితం ఐదుసార్లు మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన ఓ వ్యక్తి...ఇటీవల మళ్లీ పట్టుబడ్డాడు. సదరు వాహన నంబర్ ఆన్లైన్లో చెక్ చేయగా... ట్రాఫిక్ పోలీసుల ఈ-చలాన్ సిస్టమ్‌లో నిక్షిప్తమై ఉన్న అతడి డాటా వచ్చేసింది. ఆరోసారి పట్టుబడటంతో అతడికి మూడు నెలల జైలు శిక్షను విధించారు. ఈ ఘటనతోనే ప్రభుత్వ స్థలాల్లో వ్యాపారం నిర్వహిస్తున్న వారికి చెక్ పెట్టాలన్న ఆలోచన వచ్చింది. నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.అందుకే 39(బీ) అప్లికేషన్ కార్యరూ పం దాల్చిం దని ట్రాఫిక్ పోలీసు అదనపు డీసీ రంగనాథ్ తెలిపారు. -
ప్యారిస్ స్టోర్‌లోకి సాయుధుడు.. 10మంది బందీలు
ప్యారీస్: ప్యారిస్‌లో ఓ సాయుధుడు హల్ చల్ చేస్తున్నాడు. నగరానికి సమీపంలోని షాపింగ్ మాల్‌లోకి చొరబడి బీభత్సం సృష్టిస్తున్నాడు. ప్రస్తుతం అతడి బందీలో పదిమంది ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి హడావిడిగా చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. సాయుధుడు చొరబడిన విషయం తెలిసి చుట్టుపక్కలవారు చెల్లా చెదురుగా పారిపోతున్నారని సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
లాట్ మొబైల్ 101వ స్టోర్ విజయవాడలో
ప్రముఖ మొబైల్ రిటైల్ చైన్ లాట్ మొబైల్స్ సోమవారం విజయవాడలో తన 101వ స్టోర్‌ను ప్రారంభించింది. బ్రాండ్ అంబాసిడర్ అల్లు అర్జున్ అభిమానుల ఆనందోత్సాహాల మధ్య ఈ స్టోర్‌ను ప్రారంభించారు. విజయవాడలో సంస్థకు ఇది ఆరవ స్టోర్. పండుగ ఆఫర్లు... దీపావళిని పురస్కరించుకుని సంస్థ ‘‘లాట్ స్మార్ట్ ఫెస్ట్’ పేరుతో పలు ప్రత్యేక ఆఫర్లను కూడా అందిస్తోంది. ఐఫోన్స్6, 6 ప్లస్ కొనుగోళ్లపై రూ.8,000 విలువైన ప్రయోజనాలు- ఒక మొబైల్ కొంటే 2 నుంచి 4 వరకూ మొబైల్స్ ఉచితం- మొబైల్ కొంటే మెమెరీ కార్డ్, పవర్ బ్యాంక్ ఉచితం- రూ.4,999కే రెండు బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లు- రూ.9,999 స్మార్ట్ మొబైల్ కొంటే రూ.8,000 విలువచేసే ట్యాబ్లెట్ ఉచితం- రూ.6,999 స్మార్ట్ మొబైల్ కొంటే రూ.5,000 ట్యాబ్లెట్ ఉచితం- రూ.2,000కే 3జీ మొబైల్ వంటి ఆఫర్లు ఇందులో ఉన్నాయి. అన్ని బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డులపై మొబైల్స్ కొనుగోళ్లు చేయవచ్చని, ప్రతి కొనుగోలుపై ఒక ఖచ్చిత బహుమతి పొందవచ్చని కంపెనీ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. లాట్ మొబైల్స్ షోరూమ్‌లన్నింటినీ అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేశామని, అన్ని బ్రాండెడ్ మొబైల్స్ డెమోలు, అత్యాధునిక యాక్సెసరీలను అందుబాటులో ఉంచామన్నారు. -
మద్యం విక్రయాలపై డేగకన్ను
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : వరుస ఎన్నికల నేపథ్యంలో మద్యం విక్రయాలపై ఎక్సైజ్‌శాఖ నిఘా ముమ్మరం చేసింది. జిల్లా నలుమూలలా ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఒకేసారి మున్సిపల్ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ.. ఆ వెంటనే సార్వత్రిక ఎన్నికలు రావడంతో అధికారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎన్నికల నియమావళితో పాటు అదే సమయంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొనసాగుతుండటంతో మద్యం విక్రయాలపై ఎక్సైజ్ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకూ పాలకుల కనుసన్నల్లో నడిచిన మద్యం షాపులు, బార్లు వాటికి అనుసంధానంగా నడిచే బెల్ట్‌షాపులపై ఇప్పుడు అధికారులు చర్యలకు పూనుకుంటున్నారు. విచ్చలవిడి మద్యం అమ్మకాలతో పాటు అక్రమ మద్యం తరలింపు, ఎన్డీపీ మద్యం వచ్చే దారులపై నిఘా ఉంచారు. ఎన్నికలనగానే ప్రధానంగా చర్చకు వచ్చేది మద్యం వ్యవహారమే. మద్యం లేనిదే ఏ పార్టీ కార్యకర్తా ప్రచారానికి ఒక్క అడుగు కూడా ముందుకు వేయడు. అలాంటి పరిస్థితుల్లో గతేడాది ఎంతైతే మద్యం విక్రయించారో ఇప్పుడు కూడా అంతే మద్యం విక్రయించాలని ఎక్సైజ్‌శాఖ నిబంధన మద్యం వ్యాపారుల్లో గుబులు రేకెత్తిస్తోంది. సాధారణంగా నెల మొత్తం మీద వినియోగించే మద్యం ప్రస్తుత పరిస్థితుల్లో వారానికి కూడా సరిపోదంటే అతిశయోక్తికాదు. శాఖల మధ్య సమన్వయం ఎన్నికల్లో ఓటుకు నోటు కార్యక్రమాన్ని పోలీసులు, ఎన్నికల అధికారులు ఏ విధంగా అరికట్టాలో.. మద్యం ప్రవాహాన్ని కూడా పోలీసులు, ఎక్సైజ్ శాఖాధికారులు యూనిట్‌గా ఏర్పడి అరికట్టాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. జిల్లాలో మొత్తం 278 మద్యం షాపులు, 41 బార్లు ఉన్నాయి. ఇక బెల్ట్‌షాపులు సరేసరి. హైవే, రహదారుల వెంట నడుస్తున్న దాబాల్లో ఎక్కడా మద్యం విక్రయించకూడదు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే మద్యం షాపుల యజమానులపై ఫిర్యాదు చేసేందుకు అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఫిర్యాదులను 08592-233182 నంబర్‌కు ఫోన్ చేసి చెప్పవచ్చు. సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు 24 గంటలూ కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంటుంది. మద్యం అక్రమ రవాణాకు చెక్ అక్రమ మద్యం, ఎన్డీపీ మద్యం, కల్తీ మద్యం, బెల్లం ఊట, నాటుసారాను అరికట్టేందుకు జిల్లావ్యాప్తంగా ఎక్సైజ్‌శాఖ 8 చెక్ పోస్టులను ఏర్పాట చేసింది. అవి 5వ నంబర్ జాతీయ రహ దారిపై టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద, ఒంగోలు-కర్నూలు హైవేలో చీమకుర్తి వద్ద, అద్దంకి-హైదరాబాద్ హైవే బొల్లాపల్లి టోల్‌ప్లాజా వద్ద చెక్‌పోస్టులు రోజుమార్చి రోజు ఏర్పాటు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. దోర్నాల, గిద్దలూరు సమీపంలోని వైఎస్సార్ జిల్లా సరిహద్దు ఆదిమూర్తిపల్లి, కర్నూలు జిల్లా సరిహద్దు దిగువమెట్ట, పామూరు ప్రాంతాల్లో కూడా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వీటితో పాటు రెండు మొబైల్ పార్టీలను నియమించారు. రైళ్లలో మద్యం తరలింపును అరికట్టేందుకు ట్రైన్ చెకింగ్ టీమ్‌ను కూడా నియమించారు. వీటికి తోడుగా ఇంటెలిజెన్స్ డిటెక్షన్ టీమ్‌ను రంగంలోకి దించారు. షాపుల్లో మద్యాన్ని ఎంఆర్పీకే విక్రయించాలని, అలా కాకుండా నిబంధనలు అతిక్రమిస్తే ఆయా షాపులపై కేసులు నమోదు చేసి యజమానులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు ఎక్సైజ్‌శాఖ అధికారులకు వచ్చాయి. అధికారులు కఠినంగా ఉండాలి : ఎం.భాస్కరరావు ఈఎస్ ఎన్నికల నియమావళి అమలులో ఎక్సైజ్ అధికారులు కఠినంగా ఉండాలి. నిఘా ముమ్మరం చేసి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలి. మద్యం షాపులు సమయపాలన పాటించాలి. మద్యం అధిక ధరలకు విక్రయిస్తే కేసులు నమోదు చేయాలి. జిల్లాలో ఇప్పటికే 143 బైండోవర్ కేసులు నమోదు చేశాం. -
మందు మటాష్..నడుస్తున్న కేసు
-
రాష్ట్రంలో ఐకియా ఫర్నిచర్ స్టోర్
న్యూఢిల్లీ: స్వీడన్‌కు చెందిన ఫర్నిచర్ దిగ్గజం ఐకియా ఆంధ్రప్రదేశ్‌లో ఫర్నిచర్ స్టోర్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ సంస్థ భారత్‌లో రూ.10,500 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. ఈ పెట్టుబడి ప్రణాళికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌తోపాటు హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటకల్లో, నోయిడా(ఉత్తరప్రదేశ్) కూడా ఈ కంపెనీ స్టోర్స్‌ను ఏర్పాటు చేయనున్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఐకియా సీఈవో మైకేల్ ఓహిసన్ కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద శర్మను సోమవారం కలిశారు. ఈ సమావేశంలో ఐకెయా పెట్టుబడి ప్రణాళికలను ఆనంద శర్మకు ఓహిసన్ వెల్లడించారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ప్రణాళికల్లో భాగంగా ఈ 4 రాష్ట్రాల్లో స్టోర్స్ ఏర్పాటు కోసం భూసేకరణ ప్రయత్నాలను కూడా ఆయన ఆనంద్ శర్మకు వివరించారని ఆ వర్గాలు తెలిపాయి. ఈ వర్గాల కథనం ప్రకారం.., ఐకియా కంపెనీ ఇప్పటికే ఐకియా ఇండియా పేరుతో భారత అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది.