చరిత్రకు సంబంధించిన పలు అంశాలు ఎప్పటికీ ఆసక్తికరంగానే ఉంటాయి. తాజాగా 114 ఏళ్ల క్రితం నాటి మెడికల్ స్టోర్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 1880లో ప్రారంభమైన ఈ స్టోర్ 1909 వరకూ సవ్యంగానే నడిచింది. ఈ స్టోర్‌ను బ్రిటన్‌లో విలియం వైట్ అనే వ్యక్తి నిర్వహించేవాడు. అతని మరణానంతరం ఈ స్టోర్ మూతపడింది. ఇన్నాళ్ల తరువాత ఈ స్టోర్ తలుపులు తెరవగానే లోపల ఆశ్చర్యం కలిగించే పలు వస్తువులు కనిపించాయి.
మెట్రో యూకే తెలిపిన వివరాల ప్రకారం ఈ మెడికల్ స్టోర్ గురించి 80 ఏళ్ల క్రితమే వెల్లడయ్యింది. అయితే విలియం వైట్ మనుమడు 1987లొ దీని గురించి బహిరంగంగా తెలియజేశాడు. తరువాత దీనిని ప్రజల సందర్శనార్థం తెరిచాడు. ఈ స్టోర్‌లో లిక్విడ్ మెడిసిన్‌తో నిండిన జార్‌లు, స్కేళ్లు, వైట్ రైటర్ మొదలైనవి లభ్యమయ్యాయి. విలియం వైట్ మరణానంతరం అతని ఇంటిని విక్రయించే సమయంలో ఈ రహస్య గదిని కనుగొన్నారు. అప్పుడు వైట్ కుమారుడు చార్లెస్ ఈ స్టోర్‌ను మూసివేశాడు.
ఒక పరిశోధకుడు చెప్పిన దాని ప్రకారం స్టొర్‌లోని సామాను పరిశీలించి చూస్తే, విలియం ఒక కెమిస్ట్ అని తెలుస్తోంది. అలాగే అతను గ్రోసరీ సామాను కూడా భద్రపరిచేవాడు. అయితే నాటి వస్తువులు ఇప్పుడు ప్రమాదకరంగా పరిణమించాయి. ఈ దుకాణంలో కొన్ని వనమూలికలు కూడా లభించాయి. ఈ దుకాణాన్ని చూసేందుకు జనం తరలివస్తున్నారు.
ఇది కూడా చదవండి: హిట్లర్ విషాహార భయాన్ని ఎలా దాటాడు? చివరికి ఎలా మరణించాడు?
Comments
Please login to add a commentAdd a comment