old
-
వారి కోసం జుకర్‌బర్గ్ ఫ్యావరెట్ హుడీ వేలం : మార్క్ డ్యాన్స్ వైరల్ వీడియో
మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తనకెంతో ఇష్టమైన పాత హుడీని వేలం వేశారు. తద్వారా వచ్చిన సొమ్మును టెక్సాస్ పాఠశాల సంక్షేమం కోసం వినియోగించనున్నారు. బిజినెస్ ఇన్సైడర్ ప్రకారం, ఈ ప్రియమైన హూడీతోపాటు బిడ్ దక్కించుకున్న వ్యక్తికి జుకర్‌బర్గ్ స్వయంగా చేతితో రాసిన నోట్ కూడా దక్కింది. దీనిని ఫేస్బుక్ స్టేషనరీలో రూపొందించారట.2019లో తరచుగా ధరించే నల్లటి హూడీ లాస్ ఏంజిల్స్‌లో జరిగిన వేలంలో భారీ ధరకు అమ్ముడు బోయింది. జూలియన్స్ ఆక్షన్స్ వారి "స్పాట్లైట్: హిస్టరీ అండ్ టెక్నాలజీ" సిరీస్‌లో భాగంగా గత గురువారం ఈ వేలం నిర్వహించింది. దీనికున్న పర్సనల్ టచ్, క్రేజ్ అభిమానులను స్పష్టంగా ఆకట్టుకున్నాయి. దీంతో చాలా వేగంగా బిడ్డింగ్ జరిగింది. దాదాపు 22 బిడ్లు వచ్చాయి. చివరకు రూ.13 లక్షల కంటే ఎక్కువ ధర పలికింది. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck) ఇది తన ఆల్-టైమ్ ఫేవరెట్లలో ఒకటిగా అభివర్ణించారు జుకర్‌బర్గ్. , "నేను తొలినాళ్లలో దీన్ని ఎప్పుడూ ధరించేవాడిని. దాని లోపల మా అసలు మిషన్ స్టేట్మెంట్ కూడా ప్రింట్ అయి ఉంది" అని గుర్తు చేసుకున్నారు. ఈ హూడీ 2010 నాటిది. ఇదే ఏడాది జుకర్‌బర్గ్ టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు. ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తం సొమ్మను టెక్సాస్‌లోని పాఠశాల పిల్లలకు మద్దతు ఇవ్వడానికి అంకితం చేస్తామని మార్క్ ప్రకటించారు. దీంతోపాటు పాటు ఆపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ ధరించిన సిగ్నేచర్ బో టై కూడా వేలంలో అమ్ముడైన ఇతర ప్రసిద్ధ వస్తువులలో ఒకటిగా దాదాపు రూ. 31 కోట్లకు బిడ్దక్కించుకుంది. దీని అసలు ధర వెయ్యి డాలర్లుమాత్రమే.మార్క్ డ్యాన్స్, భార్య ఫిదా మరోవైపు మార్చి 1న, భార్య ప్రిస్సిల్లా చాన్ పుట్టినరోజు సందర్భంగా జుకర్‌బర్గ్ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ టక్సేడోలో పార్టీలో ఎంట్రీఇచ్చి టక్సేడోను చింపేసి మరీ, ఒక్క ఉదుటున స్టేజ్‌పైకి అద్భుతమైన నీలిరంగు జంప్‌సూట్‌లో పాట పాడి, డ్యాన్స్ చేశాడు. దీంతో చాన్ ఫిదా అయిపోయింది. తెగ వైరలవుతోంది. 2025 గ్రామీ అవార్డుల వేడుకలో బెన్సన్ బూన్ బ్యూటిఫుల్ థింగ్స్ ప్రదర్శన ఇస్తున్నప్పుడు ధరించిన జంప్‌సూట్ కూడా ఇలాంటిదేనట. -
ఏజ్‌లో సెంచరీ కొట్టిన మరో బామ్మ..హెల్త్ సీక్రెట్ ఏంటంటే..
సుదీర్ఘకాలం జీవించిన వ్యక్తులు గురించి విన్నా..ఆ వ్యక్తులు ఇంకా జీవించి ఉన్నా ఓ సెన్సెషన్ అవుతోంది. ప్రస్తుతం జస్ట్ ముప్పై దాటగానే ఏవో వ్యాధుల బారినపడుతోంది యువత. నలభై, యాభైలకే వృద్ధుల కంటే దారుణంగా అయిపోతున్నారు. కడుపు నిండా తినలేని దుస్థితి. ఇలాంటి పరిస్థితులో కొందరు ఏజ్‌లో సెంచరీ దాటి మరి జీవించి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. మొన్నటిదాక జపాన్‌లోని బామ్మ..ఇవాళ బ్రెజిల్‌లోని మరో బామ్మ సుదీర్ఘకాలం జీవించి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ బామ్మ వయసు ఎంతంటే..బ్రెజిల్‌కు చెందిన నన్ ఇనా కానబారో ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘకాలం జీవిస్తున్న వ్యక్తుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా సుదీర్ఘకాలం జీవిస్తున్న సూపర్సెంటెనరియన్లను ట్రాక్ చేసే లాంగేవిక్వెస్ట్ అనే సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. వీల్‌చైర్‌లో ఉండే ఆ బామ్మ ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా ప్రకటించింది. ప్రస్తుతం ఆమెకు 117 ఏళ్లు. ఆమె సుదీర్ఘజీవిత కాలం బతకడానికి గల కారణం తెలిస్తే విస్తుపోతారు. ఎందకంటే ఆమెకు నలుగురుని నవ్వించేలా జోక్స్ వేయడం అంటే ఇష్టమే. ఇదే తన హెల్త్ సీక్రెట్ అని అంటోంది బామ్మ ఇనా. ఖాళీ సమయాల్లో పూలతో సూక్ష్మ చిత్రాల తయారు చేయండం, ప్రార్థనలు చేయడం అంటే ఆమెకు ఇష్టమట. అంతేగాదు చిన్న వయసులోనే నన్‌గా మారి భక్తిమార్గంలోకి వెళ్లిపోయింది ఈ బామ్మ. పైగాభగవంతుడిపై ఉండే విశ్వాసం మనల్ని ఆయురారోగ్యాలతో బతికేలా చేస్తుందని నమ్మకంగా చెప్పింది. నిజానికి ఆమె ఇన్నేళ్లు బతుకుతుందని అస్సలు అనుకోలేదని ఆమె మేనల్లుడు క్లెబర్ కానబారో అన్నారు. ప్రస్తుతం ఈ బామ్మ రిటైర్మెంట్ హోమ్‌లో ఉంటుంది. ప్రతి శనివారం ఆమె మేనల్లుడు తనను చూడటానికి వస్తుంటాడు. ప్రస్తుతం ఆమె బలహీనంగా, మాట్లాడలేని స్థితిలో ఉంది. కానీ మేనల్లుడు క్లెబర్ వాయిస్ వినగానే ఉత్సాహంగా మాట్లాడే యత్నం చేస్తుందట. ఇదిలా ఉండగా, లాంగేవిక్వెస్ట్ పరిశోధకుల ప్రకారం, ఆమె జూన్ 8, 1908న దక్షిణ బ్రెజిల్‌లోని ఒక పెద్ద కుటుంబంలో జన్మించారు. ఆమె ముత్తాత 19వ శతాబ్దంలో బ్రెజిల్ స్వాతంత్ర్యం పోరాటంలో పాల్గొన్న బ్రెజిలియన్ జనరల్. ఇక ఈ బామ్మ ఉపాధ్యాయురాలిగా పనిచేసి రిటైరయ్యింది. ఆ తర్వాత రియో గ్రాండే డో సుల్లో స్థిరపడింది. ఆమె ఆరోగ్యకరమైన అలవాట్లు, ప్రశాంతమైన జీవన విధానమే తన సుదీర్ఘకాల జీవన రహస్యమని అంటోంది బామ్మ ఇనా. డిసెంబరులో జపాన్‌కు చెందిన టోమికో ఇటూకా మరణం తర్వాత ఈ బామ్మ సుదీర్ఘకాలం జీవించిన వృద్ధురాలిగా అగ్రస్థానంలో నిలిచింది. (చదవండి: గిరి ‘గడబ’ ప్రకృతితో మమేకం) -
Income Tax: పాత విధానమా.. కొత్త విధానమా..?
ఆర్థిక సంవత్సరం 2020–21 నుంచి కొత్త విధానం అమల్లోకి వచ్చింది. మీకు ఇష్టమైతే ఈ విధానాన్ని ఎంచుకోవచ్చు. గడువు తేదీలోపల ఎంపిక చేసుకోవచ్చు. ఆ తర్వాత అయితే, కొత్త విధానమే పాటించాలి. పాత విధానంలో మినహాయింపులు ఉన్నాయి. రేట్లు 10 శాతం, 20 శాతం, 30 శాతం.. ఇలా ఉన్నాయి. కొత్త విధానంలో మినహాయింపులు ఉండవు. రేట్లు 5,10, 15, 20, 30 శాతంగా ఉన్నాయి. పైన చెప్పినవన్నీ వ్యక్తులకు, హిందూ ఉమ్మడి కుటుంబాలకు వర్తిస్తాయి. ఏ ప్రాతిపదికన ఎంచుకోవాలి? » మీ ఆదాయ స్వభావం » మీ ఆదాయం » సేవింగ్స్ » పెట్టుబడులు » సొంతిల్లు రుణం – రుణం మీద వడ్డీ » మెడికల్ ఖర్చులు, కొన్ని జబ్బుల మీద ఖర్చులు » జీతం మీద ఆదాయం ఒక్కటే ఉంటే ఒకలాగా ఆలోచించాలి » జీతంతో పాటు ఇతర ఆదాయాలు ఉంటే మరొకలాగా ఆలోచించాలి » వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు .. వారి ఇన్వెస్ట్మెంట్ విధానం » ఉద్యోగస్తులు వారికి ఇష్టమైన విధానాన్ని ఎంచుకోవచ్చు. ప్రతి సంవత్సరం మార్చుకోవచ్చు. » వ్యాపారస్తులకు అలా మార్చుకునే వెసులుబాటు లేదు » ఒకరితో ఒకరు పోల్చుకోకండి. మీ విధానం మీదే. మీ ఆదాయం మీదే. మీ పన్నుభారం మీదే.ఎటువంటి సేవింగ్స్ లేకపోతే కొత్త పద్ధతిలో రూ. 29,900 పన్ను భారం తగ్గుతుంది. సుమారు రూ. 30,000 మిగులు. అయితే, మీ చేతిలో ఎంతో నిలవ ఉంటుంది. దీన్ని మీరు దేనికైనా ఖర్చు పెట్టుకోవచ్చు. మీరిచ్చే ప్రాధాన్యత, మీ అవసరం మొదలైన వాటి ప్రకారం మీ ఇష్టం.మరో కేసులో కేవలం జీతం రూ. 7,00,000 కాగా సేవింగ్స్ లేవు అనుకుందాం. అప్పుడు..కొత్త పద్ధతిలో ట్యాక్స్ పడదు. పాత పద్ధతిలో పడుతుంది. పాత పద్ధతిలో పన్ను పడకూడదంటే, ఆ మేరకు సేవింగ్స్ చేయాలి. సేవింగ్స్ అంటే మీ ఫండ్స్ బ్లాక్ అవుతాయి. ఆటోమేటిక్‌గా అందరూ కొత్త దాని వైపే మొగ్గు చూపుతారు. అయితే ఉద్యోగంలో కంపల్సరీగా పీఎఫ్ మొదలైన సేవింగ్స్ ఉంటాయి. ముందు జాగ్రత్తగా మనం సేవ్ చేస్తుంటాం. మన అవసరాలను, కలలను, ఆలోచనలను దృష్టిలో పెట్టుకోవాలి. ఒకే కుటుంబంలో ఇద్దరు ఉద్యోగస్తులంటే, ఒకరు సేవ్ చేసి మరొకరు మానేసి.. ఇద్దరూ కొంత చేసి.. ఇలా ఎన్నో ఆలోచనలే మీ ట్యాక్స్ ప్లానింగ్‌కి దారి తీస్తాయి.పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు. -
పురాతన శైలపుత్రి ఆలయానికి భక్తుల క్యూ
వారణాసి: దేశవ్యాప్తంగా దసరా శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ రోజుల్లో అమ్మవారి తొమ్మిది రూపాలకు పూజలు నిర్వహిస్తారు. నవరాత్రులలో తొలి రోజున శైలపుత్రి రూపాన్ని పూజిస్తారు.శివుని నగరంగా పేర్కొనే వారణాసిలో శైలపుత్రి అమ్మవారి పురాతన ఆలయం ఉంది. నవరాత్రుల తొలిరోజున ఈ ఆలయంలో ఎంతో ఘనంగా పూజలు జరుగుతాయి. ఈ నేపధ్యంలో నేటి తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఈ పురాతన ఆలయం వారణాసి సిటీ స్టేషన్‌కు కొద్ది దూరంలో ఉంది. ఈ శైలపుత్రి ఆలయాన్ని ఎవరు నిర్మించారనేది ఇప్పటికీ స్పష్టం కాలేదు.ఆలయ పూజారి మీడియాకు ఈ ఆలయానికి సంబంధించిన పురాణ కథను తెలిపారు. శైలపుత్రి అమ్మవారు శైలరాజు ఇంట్లో జన్మించారు. ఆ సమయంలో నారదుడు అక్కడికి వచ్చి, శైలపుత్రి ఎంతో ప్రతిభావంతురాలవుతుందని తెలిపారట. శైలపుత్రికి చిన్నప్పటి నుంచే మహాశివునిపై ఇష్టం ఏర్పడింది. ఆమె పెరిగి పెద్దయ్యాక కాశీకి చేరుకుని, శివుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు తపస్సు చేసింది. కుమార్తె కోసం వెదుకుతూ కాశీ చేరుకున్న శైలరాజు కూడా తపస్సు ప్రారంభించాడని చెబుతారు. అనంతర కాలంలో ఈ ప్రాంతంలో శైలపుత్రితో పాటు ఆమె తండ్రి శైలరాజు ఆలయాలు నిర్మితమయ్యాయి. శైలపుత్రి ఆలయంలో మహాశివుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు.ఇది కూడా చదవండి: శోభాయమానంగా ఇంద్రకీలాద్రి -
'వృద్ధి'ల్లుతోంది
సాక్షి, అమరావతి: ఏపీతో సహా దక్షిణాది రాష్ట్రాలో జనాభా వృద్ధి తగ్గుతోంది. ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తర్‌ప్రదేశ్, బీహార్ జనాభా వృద్ధి పెరుగుతోంది. 2011 జనాభా లెక్కలతో పోల్చి చూస్తే 2024లో పలు రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల, తగ్గుదల, వృద్ధుల సంఖ్య పెరుగుదలను విశ్లేషిస్తూ ఎస్బీఐ రీసెర్చ్ నివేదికను విడుదల చేసింది. 2011 జనాభా లెక్కలతో పోల్చితే 2024 అంచనాల మేరకు తమిళనాడు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో జనాభా వృద్ధి క్షీణించిందని నివేదిక తెలిపింది. దక్షిణాది రాష్ట్రాల్లో 2011లో జనాభా వృద్ధి 15% ఉండగా 2024 అంచనాల మేరకు జనాభా వృద్ధి 12 శాతానికి తగ్గిపోయిందని పేర్కొంది.ఉత్తరాది రాష్ట్రాల్లో 2011 లెక్కల ప్రకారం జనాభా వృద్ధి 27 శాతం ఉండగా 2024 అంచనాల మేరకు అది 29 శాతానికి పెరిగిందని వెల్లడించింది. కేరళ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఏపీ రాష్ట్రాల్లో వృద్ధుల సంఖ్య ఎక్కువగా పెరుగుతోందని నివేదిక తెలిపింది. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, అసోం రాష్ట్రాల్లో వృద్ధుల సంఖ్య తక్కువగా పెరుగుతోందని వెల్లడించింది. ఏపీలో 2011 జనాభా లెక్కల ప్రకారం 60 ఏళ్లు పైబడిన వృద్ధుల సంఖ్య 50 లక్షలు ఉండగా ఇది మొత్తం జనాభాలో 10.1%గా ఉంది. 2024 అంచనాల మేరకు వృద్ధుల జనాభా 70 లక్షలకు పెరిగింది. ఇది మొత్తం జనాభాలో 12.4%గా ఉంది. అంటే 2011–24 నాటికి వృద్ధుల సంఖ్య 2.3% పెరిగింది. 2011 జనాభాతో పోల్చి చూస్తే 2024 అంచనాల మేరకు కేరళలో 16.5 శాతం, తమిళనాడు 13.6 శాతం, హిమాచల్ ప్రదేశ్ 13.1 శాతం, పంజాబ్ 12.6 శాతం వృద్ధులు పెరిగారు. అతి తక్కువగా వృద్ధుల జనాభా 2024 అంచనా మేరకు బిహార్‌లో 7.7 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 8.1 శాతం, అసోంలో 8.2 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. -
ఏజ్‌లో సెంచరీ దాటి రికార్డు సృష్టించిన బామ్మ..ఆమె ఒకప్పుడూ..!
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవన విధానంలో సుదీర్థకాలం బతకం బహుకష్టంగా ఉంది. ఏవో ఒక రోగాలతో 60 లేదా డెభైకే టపా కట్టేస్తున్నారు. సెంచరీ కొట్టడం గగనంగా ఉంది. అలాంటి జపాన్‌కి చెందిన టోమికో ఇటూకా అనే బామ్మ ఏకంగా 116 ఏళ్ల జీవించి రికార్డు సృష్టించి. ప్రపంచంలో సుదీర్ఘకాలం బతికిన మహిళగా గిన్సిస్ రికార్డ్సులో స్థానం సంపాదించుకుంది. ఈ విషయాన్ని జెరోంటాలజీ రీసెర్చ్ గ్రూప్ వెల్లడించింది. ఇటూకా పుట్టిన తేదీ సంవత్సరం ఆధారంగా వరల్డ్ సూపర్సెంటెనేరియన్ ర్యాంకింగ్ జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. ఈ రీసెర్చ్ గ్రూప్ 110 లేదా అంతకంటే ఎక్కువ వయసుగల వ్యక్తుల వివరాలను ధృవీకరిస్తుంది. ఇటీవల 117 ఏళ్ల మరియా బ్రాన్యాస్ మరణం తరువాత జపాన్‌కి చెందిన 116 ఏళ్ల టోమికో ఇటూకా ఎక్కువ కాలం జీవించిన మహిళగా గిన్నిస్ రికార్డులకెక్కింది. ఆమె ఆషియా నగరంలోని ఒక నర్సింగ్ హోమ్‌లో ఉంటుంది. ఆమె తాను పుట్టిన తేదీని కూడా ధృవీకరించింది. ఆ బామ్మ సాధించిన రికార్డు గురించి ఆమెకు చెప్పగానే.. వెంటనే థాంక్యూ అని చలాకీగా చెప్పిందంట. అంటే ఆమె స్పందంచిన తీరు చూస్తే..ఆమె ఈ వయసులో కూడా ఎంతో ఉషారుగా, స్పష్టంగా వినగలుగుతున్నారని తెలుస్తోంది. ఇక ఈ బామ్మ ఇటూకా మూడు నెలల క్రితమే తన పుట్టిన రోజుని జరుపుకుందట. ఒసాకాలో జన్మించిన ఈ బామ్మ ఉన్నత పాఠశాలలో వాలీబాల్ క్రీడాకరిణి. 20వ ఏటన వివాహం చేసుకుందంట. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు ఉన్నారట. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో భర్త నడుపుతున్న టెక్స్టైల్ ఫ్యాక్టరీకి సంబంధించిన పనుల్లో సహాయం చేసేవారట. ఆమె వృద్ధ ఆశ్రమంలో చేరడానికి ముందు 1979లో భర్త మరణానంతరం నారాలో ఒంటరిగా నివసించింది. అంతేకాదండోయ్ ఏకంగా 3,067-మీటర్లు (10,062-అడుగులు) మౌంట్ ఆన్టేక్ను ఏకంగా రెండుసార్లు అధిరోహించిందట. వందేళ్లు నిండిన తర్వాత కూడా సుదీర్ఘ పాదయాత్రలు చేసిందట. ఆమె లైఫ్‌స్టైల్..ఆమె క్యాల్పిస్ అనే ప్రసిద్ధ పెరుగు రుచిగల పానీయాన్ని తీసుకుంటుంది. ఆమెకు ఇష్టమైన ఆహారం అరటిపండ్లు అని ఆమె సంరక్షకురాలు చెబుతోంది. (చదవండి: బరువు తగ్గడంలో 'పంచకర్మ' ది బెస్ట్!..అనుభవాన్ని షేర్ చేసుకున్న రోహిత్ రాయ్!) -
సుదీర్ఘకాలం జీవించాలంటే..ఈ అలవాట్లు ఉండాలంటున్న పరిశోధకులు!
వందేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మన పెద్దవాళ్లు ఆశీర్వదిస్తుంటారు. నేటి ఉరుకులు పరుగుల జీవన విధానంలో సక్రమమైన జీవనశైలి అనుసరించక ఆయుర్దాయం పడిపోతుంది. జస్ట్ యాభైకే అనేక వ్యాధుల బారినపడి 60 ఏళ్ల వరకు బతికి బట్టగట్టగలగడం గగనంగా ఉంది. అయితే కొందరూ మాత్రం వయసు పరంగా సెంచరీ దాటి మరీ ఆరోగ్యంగా జీవించడం విశేషం. అలా మనం అన్నేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలంటే ఈ అలవాట్లను తమ జీవన విధానంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో సవివరంగా చూద్దాం..!.వందేళ్లు జీవించిన వృద్ధులు విజయవంతమైన వృద్ధాప్యానికి ఉదాహరణగా నిలుస్తారు. అంతేగాదు వీళ్లు తరుచుగా దీర్ఘకాలికి వ్యాధుల బారిన పడటం అనేది తక్కువగా ఉంటుంది. పైగా 90లలో కూడా తమ పనులు తామే చేసుకుంటూ స్వతంత్రంగా జీవిస్తారు. అందుకు ప్రధాన కారణం జన్యుశాస్త్రమే అయినా, దీంతోపాటు 60% వారు అనుసరించే చక్కటి జీవనశైలి అని చెబుతున్నారు నిపుణులు. దీర్ఘాయువుపై 2000 సంవత్సరం నుంచి పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు 34 అధ్యయనాల్లో అందుకు గల కారణాల జాబితాను సవివరంగా తెలిపారు. వందేళ్ల ఆయువుకు దోహదం చేసిన ఆహారం, మందుల వాడకం గురించి కూడా ప్రస్తావించారు. అయితే ఆయా అధ్యయనాల్లో సుదీర్ఘ దీర్ఘాయువు కోసం కీలకమైన నాలుగు అలవాట్లను జీవనశైలిలో భాగం చేసుకోవాలని సూచించారు. అవేంటంటే..సంతులిత ఆహారం: వందేళ్లు హాయిగా జీవించాలంటే ఆహారంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండాలని చెబుతున్నారు. సుమారు 57 నుంచి 65% ప్రోటీన్, కొవ్వులు ఉంటాయి. ఆహారంలో ప్రధానంగా పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు, మెడిటేరియన్ డైట్, చేపలు, చిక్కుళ్లు, ఉంటాయి. ముఖ్యంగా ఉప్పు తక్కువ తీసుకోవడం అత్యంత ముఖ్యం అని చెబుతున్నారు. తక్కువ మందుల వాడకం: చాలా వరకు మందులు వాడకానికి దూరంగా ఉండేలా జీవనశైలి ఉండాలి. పూర్వం పెద్దవాళ్లు సహజసిద్ధమైన వాటితోనే చికిత్స పొందుతూ ఇంగ్లీష్ మందులకు దూరంగా ఉండేవారు. వాళ్లు రోగాల బారిన పడటం అరుదుగా ఉండేది. పైగా చాలా ఏళ్లు జీవించేవారని చెబుతున్నారు. అందువల్ల మందుల వాడకాన్ని వీలైనంతగా తగ్గించేలా మంచి ఆహారపు అలవాట్లు చేసుకోవాలని సూచిస్తున్నారు. మంచి నిద్ర: నాణ్యమైన నిద్ర అత్యంత అవసరం. రోజుకి ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోడం అనేది మొత్తం ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. ప్రకృతిలో జీవించడం: గ్రామాల్లో జీవించే వారిలో సుమారు 75% మంది సుదీర్ఘకాలం జీవిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇలా ప్రకృతిలో ఎక్కువగా గడపడం వల్ల ఒత్తిడి, దీర్ఘకాలికి వ్యాధుల బారిన పడటం తక్కువగా ఉంటుందని తెలిపారు పరిశోధకులు. వాస్తవానికి ఇవన్నీ వందేళ్లు జీవిస్తారని నిర్థారణ చేసి చెప్పలేకపోయిన ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచి ఆయుర్దాయం పెంచే అవకాశం ఉందని వెల్లడించారు పరిశోధకులు. (చదవండి: 'అరంగేట్రం' చేసిన తొలి నర్తకిగా 13 ఏళ్ల చైనా విద్యార్థిని రికార్డు..!) -
శతాధిక వృద్ధుడి స్ఫూర్తి.. పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు
సార్వత్రిక ఎన్నికలు రెండో దశ పోలింగ్‌లో ఆదర్శంగా నిలిచాడు ఈ శతాధిక వృద్ధుడు. శుక్రవారం జరిగిన లోక్‌సభ ఎన్నికల రెండో విడతలో ఓటు వేయడానికి 102 ఏళ్ల హాజీ కరమ్ దిన్ జమ్మూలోని పోలింగ్ బూత్‌కు చేరుకున్నాడు. చేతి కర్ర, కుటుంబ సభ్యుల సాయంతో జమ్మూ నియోజకవర్గంలోని రియాసి జిల్లాలోని పోలింగ్ స్టేషన్‌కి వచ్చి ఓటేశాడు.ఓటు వేసిన అనంతరం శతాధిక వృద్ధుడు తన సిరా వేసిన వేలిని చూపిస్తూ బూత్ బయట ఫొటోలకు పోజులిచ్చాడు. "ఈ వయస్సులో ఈ పోలింగ్ స్టేషన్లో ఓటు వేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ప్రతిసారీ ఓటు వేశాను. 102 సంవత్సరాల వయస్సులో ఈ ప్రయాణం నేటికీ కొనసాగుతోంది" అని ఆయన వార్తా సంస్థ పీటీఐకి చెప్పారు.రియాసి జిల్లా జమ్మూ పార్లమెంటరీ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 22 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 17.81 లక్షల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. ఐదేళ్ల క్రితం ఆర్టికల్ 370 రద్దు చేసి రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత జమ్మూలో జరుగుతున్న మొదటి ప్రధాన ఎన్నికలు ఇవే. -
ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన 'కర్రీ' ఏంటో తెలుసా!
పురాతన తవ్వకాల్లో శాస్త్రవేత్తలు వెలికి తీసిన పనిముట్లు, ఆయుధాలు, విలువైన వస్తువుల గురించి కథలు కథలుగా విన్నాం. అలాగే వేటితో వంటలు చేసుకునేవారు, వారు ఉపయోగించిన వంట సామాగ్రి గురించి విన్నాం. కానీ పురాతన కాలంలో ఎలాంటి కూరలు వండుకునేవారు, ఏం తినేవారు తెలియదు. వాటి గురించి చరిత్రకారులు రాసిన దాఖాలాలు కూడా లేవు. అయితే తాజాగా ఫర్మానాలో జరిపిన తవ్వకాల్లో నాలుగువేల ఏళ్ల నాటి పురాతన వంటకం వెలుగులోకి వచ్చింది. మన పూర్వీకులు అప్పట్లోనే అలా వండుకుని తినేవారా అని కంగుతిన్నారు శాస్త్రవేత్తలు. ఇంతకీ అదేం కర్రీ?.. ఏ దేశపు వంటకం అంటే.. మన పూర్వీకుల తరుచుగా ఏం వంటకాలు వండుకుని తినేవారు అనే దిశగా సాగిన తవ్వకాల్లో కొంత వరకు పురొగతి సాధించారు శాస్త్రవేత్తలు. ప్రతి వంటకం తరతరాలుగా ఒకరి నుంచి ఒకరికి వచ్చిన వంటకాలే. అయితే ఆ కాలంలో కుండలు, దంతాల అవశేషాల సామాగ్రితో చేసుకునేవారు. ఇక్కడ శాస్త్రవేతలు హరప్పా నగరమైన రాఖీగర్హికి ఆగ్నేయంగా ఉన్న ఫర్మానాలో పూర్వీకుల వంటకాలు గురించి చేసిన అన్వేషణలో నాలుగు వేల ఏళ్ల నాటి పురాతన వంటకాన్ని గుర్తించారు వారు తవ్వకాల్లో ఒక కుండలో పసుపు, అల్లం, వెల్లుల్లి, వంకాయలతో చేసి అవశేషాలను గుర్తించారు. ఈ మిశ్రమం ఆధునికులకు బాగా తెలిసిన రెసిపీనే. ముఖ్యంగా ఇది భారతదేశ వంటకం. దీంతో ఈ కూర ప్రస్తుతం ఇప్పటి వరకు నమోదయ్యిన పురాతన కూరల్లో ఒకటిగా నిలిచింది. మన పూర్వీకులు, అరటి పండ్లు, మామిడి వంటివి తినేవారని, పొట్లకాయ, ఖర్జురాలు ఎక్కువగా ఉపయోగించినట్లు తవ్వకాల్లో గుర్తించారు గానీ కచ్చితమైన ఆధారాలు లేవు. అయితే తాజాగా గుర్తించిన పురాతన కూరలో వాడిన అల్లం పసుపు హరప్పా నాగరికతకు సంబంధించిన తవ్వకాల్లోనే గుర్తించడం జరిగింది. అంతేగాదు ఈ సుగంధ ద్రవ్యాలే 2023లో వియత్నాంలో 2 వేల ఏళ్ల నాటి ఇసుకరాయి స్లాబ్‌పై కనిపించి కూర అవశేషాల్లో కూడా గుర్తించారు శాస్త్రవేత్తలు. అక్కడ పరిశోధకులు మైక్రోస్కోపిక్ ద్వారా స్టార్చ్ ధాన్యాలను పరిశీలించారు. విశ్లేషణలో పసుపు, అల్లం, వంటి విభిన్న సుగంధద్రవ్యాల మూలాలను గుర్తించారు. దీన్ని బట్టి చూస్తే ఆసియా వంటకాల మూలాలు చరిత్రలో స్థిరంగా ఉన్నాయని తెలుస్తోందన్నారు శాస్తవేత్తలు. ఇక పురాతన వంటకాన్ని ఎలా చేస్తారో చూద్దామా..! మన భారతీయలు ఈజీగా చేసుకునే వంకాయ వేపుడే!.. నాటి పుర్వీకులు చేసుకునేవారు. ఈ ఆధారాలను బట్టి చూస్తే.. వంకాయ వేపుడు పురాతన వంటకంగా తెలుస్తోంది. ఈ రెసిపీని నాటి పూర్వీకులు ఎలా చేసుకున్నారనే దాని గురించి ప్రముఖ చెఫ్ కునాల్ ఇన్స్టాగ్రామ్ వేదికగా సవివరంగా వెల్లడించారు. కావాల్సిన పదార్థాలు. . రెండు పెద్ద సైజు వంకాయలు నాలుగు టేబుల్ స్పూన్ల నూనె అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు పసుపు ఉప్పు తగినంత తయారీ విధానం: ఓ కడాయిలో నూనె వేసుకుని పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, కరివేపాకు వేయించి ఆ తర్వాత తరిగి పెట్టుకున్నవంకాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసుకుని మగ్గనివ్వాలి. ఓ ఐదు నిమిషాలు అలాగే స్టవ్ మీద ఉంచి తర్వాత దించేయాలి. అంతే వంకాయ వేపుడు రెడీ..! View this post on Instagram A post shared by Kunal Kapur (@chefkunal) (చదవండి: 'మోదీ మామిడి': ఈ పండు ప్రత్యేకత ఏంటో తెలుసా..!) -
OLD: ఆసక్తిని పెంచుతున్న క్రైమ్ థ్రిల్లర్ ‘ఓఎల్‌డీ’ కాన్సెప్ట్ గ్లింప్స్
మణికంఠ వారణాసి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓఎల్‌డీ’(OLD). రాకేశ్ శ్రీపాద దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అల్టిమేట్ సినీ ప్లానెట్ పతాకంపై జి రాణి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మే మొదటి వారం లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. జూన్ చివరి వారం లో చిత్రాన్ని విడుదల చేస్తారు. ఉగాది పండుగను పురస్కరించుకొని కాన్సెప్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రాకేష్ మాట్లాడుతూ.. ‘ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ చిత్రం. 2008 టైం పీరియడ్ లో జరిగే కథ. మా చిత్రానికి "ఓ ఎల్ డి" టైటిల్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాం. మే మొదటి వారం లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటాం. జూన్ చివరి వారం లో చిత్రాన్ని విడుదల చేస్తాం’ అని తెలిపారు. -
ఆయుష్షులో సెంచరీ కొట్టి.. గిన్నిస్ రికార్డు కెక్కిన వృద్ధుడు!
ఓ వ్యక్తి వందేళ్లు జీవించడమే ఓ కల అన్నట్లుంది ఇప్పటి పరిస్థితి. బతకడం మాటా అటుంచి అసలు ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా బతుకు ఈడ్చగలమా అన్నదే సందేహం. ఎందుకంటే ఇప్పుడున్న కాలుష్యం, కల్తీల మధ్య క్షణ క్షణం మృత్యు గండంలా ఉంది జీవితం. కానీ ఈ వృద్ధుడు ఆయుష్షులో సెంచరీని దాటేశాడు. ఎవరా వ్యక్తి..? అతడి ఆరోగ్యం రహస్యం ఏంటో చూద్దామా..! బ్రిటన్‌కి చెందిన టిన్నిస్వుడ్ అనే వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు. అతడు ఉత్తర ఇంగ్లాండ్‌లో మెర్సీసైడ్‌లో 1912లో జన్మించాడు. అతని వయసు ప్రస్తుతం 111 ఏళ్ల 222 రోజులు. ఆయన పోస్టల్లో రిటైర్డ్ అకౌంటెంట్‌గా పనిచేసి రిటైర్డ్ అయ్యిన వ్యక్తి. దీర్ఘాఆయుష్షులో సెంచరీని దాటేశాడు. దీంతో గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కి టైటిల్‌ని గెలుచుకున్నాడు. ఈ రికార్డు ఇంతకుమునుపు వెనిజులా జువాన్ విసెంట్ పెరెజ్ మోరా మీద ఉంది. ఆమె 114 ఏళ్ల జీవించి సుదీర్ఘకాలం జీవించిన వ్యక్తి గిన్నిస్ రికార్డు టైటిల్‌ని పొందింది. ఆమె తర్వాత ఈ టైటిల్‌ని టిన్నిస్వుడ్ గెలుచుకోవడం విశేషం. అయితే ఇంతలా సుదీర్ఘకాలం ఆరోగ్యకరంగా జీవించేందుకు మీరు ఏ డైట్ ఫాలో అయ్యేవారు, ఎలాంటి ఆహారం తీసుకుంటారని ప్రశ్నించగా..ఆయన చిరునవ్వు చిందిస్తూ తన డైట్‌కి సంబంధించిన సీక్రేట్ అంటూ ఏం లేదని, సాధారణంగానే తీసుకునే వాడినని చెప్పారు. తాను ప్రత్యేకమైన ఫుడ్ అంటూ ఏం తీసుకోలేదని అన్నారు. ఇప్పటికీ ప్రతి శుక్రవారం ఇష్టమైన చేపలు, చిప్స్ తింటానని అన్నారు. ఇంతలా సుదీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించడమనేది కేవలం అదృష్టమని అని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా సుదీర్ఘకాలం జీవించిన వ్యక్తుల గురించి జెరొంటాలజీ రీసెర్చ్ గ్రూప్ శోధించి మరీ ఇలా గిన్నిస్ టైటిల్‌ని అందిస్తోంది. అంతేగాదు ప్రపంచంలోనే ఎక్కువకాలం జీవించిన సూపర్ సెంటెనరియన్స్ జాబితాను లిస్ట్ చేస్తుంది. ఇందులో 116 ఏళ్ల 54 రోజుల వరకు జీవించిన జపాన్‌కు చెందిన జిరోమాన్ కిమురా అత్యంత వృద్ధుడు. కాగా, 117 సంవత్సరాల వయస్సు గల స్పెయిన్‌కు చెందిన మరియా బ్రన్యాస్ మోరేరా జీవించి ఉన్న అత్యంత వృద్ధ మహిళ ఈ జాబితాను చూస్తే కొంచెం మనిషి ఆయుష్షు మెరుగుపడుతుందనాలో, తగ్గుతుందనాలో.. తెయని పరిస్థితి నెలకొందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది నిరంతరం మారుతూ ఉంటోందని అన్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: సిక్సర్ల బ్యాటర్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!) -
బోసి నవ్వులకు భరోసా ఏదీ?
వేకువజామునే వచ్చి ‘అవ్వా.. తాత.. ఇదిగో మీ పింఛన్ సొమ్ము తెచ్చాను. తీసుకోండి’ అంటూ అప్యాయంగా పలకరించే వలంటీర్ సేవలను నిర్ధాక్షిణ్యంగా చంద్రబాబు రాక్షసానందం కోసం నిలిపివేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్నాయి. వృద్దులు, వికలాంగులు, వితంతువులు ఆశగా ఎదురు చూసే వలంటీర్లను ఆ సేవల నుంచి తొలగించారనే నిజాన్ని నమ్మలేక దిగాలు పడిపోయారు. వలంటీర్లను తొలగించాలంటూ చంద్రబాబు కుట్రతో ఎన్నికల కమిషన్‌కు íఫిర్యాదు చేయడంతో వారిని ఆ విధుల నుంచి తప్పించారు. దీంతో ప్రతి నెల మాదిరిగానే ఈ నెల సూర్యుడు పొడవకుండానే వస్తారని వేచి చూసి.. చూసి బారెడు పొద్దెక్కినా రాకపోవడంతో చంద్రబాబు కుటిలత్వం వల్ల పింఛన్ అందలేదని తెలుసుకుని గుండెలు అవిసేలా రోదించారు. ప్రతి నెలా ఒకటో తేదీన బోసి నవ్వులతో ఎదురు చూసే ఆ వృద్దులు మళ్లీ క్యూ లైన్లలో నిలబడాలా ? అనే చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకపక్క ఎండలు మండిపోతున్న తరుణంలో గంటలపాటు సచివాలయాల అరుగులమీద అధికారుల కోసం ఎదురుచూసిన జ్ఞాపకాలను చూసి ఆందోళన చెందుతున్నారు. - సాక్షి, నెట్వర్క్ ఇలాగైతే ఎలా..? ఈ చిత్రంలో కనిపిస్తున్న వృద్దురాలి పేరు పొటుకూరి గంగమ్మ. వయస్సు 85 సంవత్సరాలు. అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం పంచాయతీలోని సురేంద్రం. సొంతంగా ఏ పని చేసుకోలేదు. కనీసం లేచి నిలబడలేదు. ప్రతి నెల వలంటీర్ వచ్చి ఈమెకు పింఛన్ నగదు అందచేసేవారు. వలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయించకూడదని టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించడంతో ఈ నెల సకాలంలో పింఛన్ అందలేదు. ఈమె పింఛన్ తీసుకోడానికి సచివాలయానికి వెళ్లాలంటే నాలుగు ఫర్లాంగులు దూరం ప్రయాణించాలి. అడుగు తీసి అడుగు వేయలేని దుస్థితిలో ఉంది. ఇద్దరు పట్టుకుని ఆటోలో తీసుకువెళ్లాలి. ప్రస్తుతం సచివాలయానికి వెళ్లి తీసుకోవాలని చెప్పడంతో ఎలా వెళ్లాలి అని ఆందోళన చెందుతోంది. –పొటుకూరి గంగమ్మ, సురేంద్రం గ్రామం, అల్లూరి సీతారామరాజు జిల్లా అయ్యో అననివారు లేరు ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు నాళం శివకృష్ణ. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెంగళరావు నగర్‌కు చెందిన ఈయన పుట్టుకతో అంధుడు. పోలియో బారిన పడిన దివ్యాంగురాలు రాజేశ్వరిని వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు సంతానం. ఆరేళ్ల క్రితం శివకృష్ణకు రోడ్డు ప్రమాదంలో నడుము దెబ్బతిని స్పర్శ లేకుండా పోయింది. అప్పటి నుంచి మంచానికే పరిమితం అయ్యాడు. దివ్యాంగ (అంధుడు) పెన్షన్ పొందుతున్నాడు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుణ్యమా అని స్టాండ్ సహకారంతో నడుస్తున్న భార్య రాజేశ్వరికి కూడా పెన్షన్ మంజూరైంది. వచ్చే పింఛన్, అమ్మ ఒడి పథకంతో ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటూ జీవితం గడుపుతున్నారు. మంచానికే పరిమితమైన భర్త, స్టాండ్ సహాయంతో నడుస్తున్న భార్య ఇద్దరూ పింఛన్ కోసం కనీసం సచివాలయానికి కూడా వెళ్లలేని పరిస్థితి. ఇంటి నుంచి బయటకు వెళ్లలేని వారికి వలంటీర్ల సహకారంతో ప్రతినెలా 1వ తేదీన ఇంటికి వచ్చి పింఛన్ అందజేసేవారు. టీడీపీ నీచ రాజకీయాలకు ఈ కుటుంబం ఇప్పుడు దిక్కుతోచనిస్థితిలో పడిపోయింది. – అంధుడు శివకృష్ణతో భార్య రాజేశ్వరి వెంగళరావునగర్, గుంటూరు జిల్లా డయాలసిస్ ఎలా చేయించుకోవాలి ? 68 ఏళ్లు పైబడిన నేను చాలాకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నా. వారంలో ఒకసారి డయాలసిస్, మరో రోజు వైద్యం చేయించుకుంటున్నా. షుగరు, బీపీ, గుండెకు సంబంధించిన సమస్యలున్నాయి. ప్రతి నెలా వలంటీర్ వచ్చి 1వ తేదీన తెల్లవారకముందు రూ.10 వేలు పింఛన్ అందించేవాడు. వాటిని వైద్యం కోసం ఉపయోగిస్తాను. కానీ వలంటీర్లు పింఛన్ ఇవ్వడానికి వీల్లేదంటూ చంద్రబాబు చేసిన ఇబ్బందికి ఈ నెల పింఛన్ అందలేదు. సచివాలయానికి వెళ్లి క్యూలో నిలబడలేని పరిస్థితి. మా లాంటి రోగులను, వృద్ధులు, దివ్యాంగులను ఇబ్బందులు పెట్టి చంద్రబాబు ఏం సాధిస్తాడు. – మాతంగి వెంకాయమ్మ, డయాలసిస్ రోగి, హరిశ్చంద్రపురం, తుళ్లూరు మండలం, గుంటూరు జిల్లా సచివాలయాల్లో పడిగాపులు తప్పవా..? నాలుగు సంవత్సరాలుగా వలంటీర్ ప్రతి నెల 1వ తేదీన ఇంటికే వచ్చి పింఛన్ అందించేవాడు. నా లాంటి వృద్ధులకు ఎంతో మేలు జరిగేది. ఇప్పుడు సచివాలయాలకు వెళ్లి పింఛన్ తీసుకోవాలంటున్నారు. ఒకపక్క ఎండలు మండిపోతున్నాయి. అక్కడికి వెళ్లి పడిగాపులు కాసి తెచ్చుకొనేందుకు ఇబ్బందిగా ఉంటుంది. పింఛన్ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నాను, వలంటీర్ల ద్వారా పింఛన్ పంపిణీ నిలిపివేయాలనడం చాలా దారుణం. అధికారులు ఎప్పుడు వస్తారో ఎప్పుడు ఇస్తారో తెలియదు. వృద్దుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వలంటీర్ల ద్వారా పింఛన్ పంపిణీ కొనసాగించాలి. – సయ్యద్ పెద్దబీబి, ఉరుటూరు, వీరపునాయునిపల్లె మండలం, కడప జిల్లా అన్ని తానై చూసేది ఒకటోతేదీ వస్తే వలంటీర్ మా వీధిలోకి వచ్చి ఇంటింటికి వెళ్లి పింఛన్ ఇచ్చేది. గతంలో పెన్షన్ తీసుకునేందుకు కార్యాలయాల చుట్టూ తిరిగి బాధలు పడేదాన్ని. వలంటీర్ వ్యవస్థ వచి్చన తరువాత పెన్షన్‌తో పాటు అన్ని తానై చూసేది. గతంలో భారీ వర్షాలు రావడంతో మా ప్రాంతం వరద ముంపునకు గురైంది. ఇళ్లలోకి నీళ్లు చేరవడంతో ముందుగానే వలంటీరు వచ్చి జాగ్రత్తలు తీసుకుని మాకు పునరావాసం కలి్పంచి సహాయం చేసింది. అలాంటి వారిని పెన్షన్ల పంపిణీ బాధ్యత నుంచి తప్పించడం బాధాకరం. – గులాబ్జాన్, బాపక కాలువ, మదనపల్లె.చిత్తూరు జిల్లా. ఇక మాకు పస్తులే కాళ్లు చేతులు సన్నగిల్లి ఒంట్లో సత్తువ లేక మంచం పట్టాను. ఐదేళ్లుగా ఇంటికే పొద్దున్నే వలంటీర్ వచ్చి పెన్షన్ అందించేవారు. మా లాంటి వృద్ధులకు వరంలా ఉండేది. ఇప్పుడు మానవత్వం లేని రాజకీయ స్వార్థంతో మేమంతా సచివాలయం వద్ద పెన్షన్ తీసుకోవాలని చెబుతు న్నారు. వలంటీర్ తెచ్చి పింఛన్ ఇవ్వకుంటే పస్తులతో చావు తప్పదు. ఆర్.కరాపాడులో సచివాల యం వద్దకు వెళ్లేందుకు శరీరం సహకరించదు. మా లాంటి పేదలపై ఇటువంటి కక్షసాధింపు మంచిది కాదు –హత్తి త్రినాథ్, కన్నుపుట్టుగ, కవిటి మండలం, శ్రీకాకుళం జిల్లా ఈ పాపం ఊరికే పోదు నా వయసు 85 సంవత్సరాలు. అనారోగ్యంతో మంచంలో నుంచి లేవాలంటే ఇద్దరు మనుషులు పట్టుకుని లేపాలి. ప్రతి నెలా వలంటీరు ఇంటికి వచ్చి వృద్దాప్య పింఛన్ ఇచ్చేవాడు. ఈ నెల ఇంకా అందలేదు. సచివాలయానికి వెళ్లి తెచ్చుకోవాలంటే నా వల్ల కాదు. వలంటీర్ నేను ఉండే మంచం దగ్గరికే వచ్చి పింఛను ఇచ్చే వాడు. ఇప్పుడు అక్కడికి తీసుకెళ్లేవారు లేరు. ఈ పాపం ఊరికే పోదు – షేక్ బడేబి,కురిచేడు, ప్రకాశం జిల్లా నడవలేని నేను సచివాలయానికి ఎలా వెళ్లాలి? ఉదయం నుంచి వలంటీరు వచ్చి పింఛన్ ఇస్తారేమో అని ఎదురు చూశాను. మూడో తేదీ వరకు పింఛన్ ఇవ్వరని తెలిసింది. సచివాలయానికి వెళ్లి నేనే పింఛన్‌ను తెచ్చుకోవాలని చెబుతున్నారు. మోకాళ్లు నొప్పులతో నడవలేని స్థితిలో ఉన్నాను. ఇప్పటి వరకు గ్రామ వలంటీరు ఒకటొవ తేదీనే మా ఇంటికి వచ్చి పింఛన్ అందించారు. ఇప్పుడు వలంటీర్లు పని చేయకూడదని చెప్పడం దారుణం. వలంటీర్లు పనిచేయకపోతే నాలాంటి వాళ్లు చాలా ఇబ్బంది పడతారు. ఈ ఐదేళ్ల నుంచి పింఛన్ కోసం వెళ్లే నరకయాతన తప్పింది. మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితులు వచ్చాయి. – సూరగాని తులశమ్మ, జి.కొండూరు, ఎన్టీఆర్ జిల్లా) పింఛన్ కటకటే.. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాను. డయాలిసిస్ చేయించుకునే స్థోమత లేకపోయినప్పటికీ సీఎం జగన్ ప్రభుత్వం ఉచిత వైద్యంతోపాటు రూ.10 వేలు పింఛన్‌ను మూడు నెలలుగా అందజేస్తోంది. ప్రతినెలా ఒకటో తేదీనే వలంటీరు ఇంటికి వచ్చి పింఛన్ అందజేసేవారు. వలంటీర్లతో పింఛన్లు పంపిణీ చేయవద్దంటూ ఫిర్యాదు చేయడంతో ఈ నెల సచివాలయం వద్దకు వెళ్లి తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. నేను సచివాలయానికి వెళ్లి పింఛన్ తీసుకోవాలంటే చాలా ఇబ్బంది పడాలి. – నాబాన వెంకటే‹Ù, గర్భాం గ్రామం, మెరకమూడిదాం మండలం, విజయనగరం జిల్లా రెండు కిలోమీటర్లు నడవాలి ప్రతి నెలా ఒకటో తేదీన మా వలంటీరు ఇంటికి వచ్చి పింఛన్ ఇచ్చేది. ఇప్పుడు సచివాలయానికి వచ్చి పింఛన్ తీసుకోమంటున్నారు. మా ఇంటి నుంచి 2.కి.మీ దూరంలో ఉన్న వీరఘట్టం సచివాలయానికి నేను నడిచి వెళ్లాలి. ఓ పక్క ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఈ ఎండల్లో పింఛన్ కోసం వెళితే మళ్లీ తిరిగి ఇంటికి వస్తానో రానో అని భయంగా ఉంది. చంద్రబాబు తీరు సరైనదికాదు. – బిడ్డిక పెద్ద సుంబురు, అచ్చెపువలస గిరిజన గ్రామం, పార్వతీపురం మన్యం జిల్లా చంద్రబాబుకు కడుపుమంట ఎందుకో? వలంటీర్లు ఉదయాన్నే తలుపుతట్టి పింఛన్ డబ్బులు ఇచ్చేవారు. అంతేకాదు వలంటీర్ల వల్ల అనేక సమస్యలు పరిష్కారమవుతున్నాయి. ఇపుడు తగుదనమ్మా అని చంద్రబాబు వలంటీర్లను అడ్డుకుని పింఛన్ ఇవ్వకుండా చేస్తే ఎంత ఇబ్బంది. దీనివల్ల ఆయనకు ఒరిగేది ఏమిటి? – బి.మంగమ్మ, పింఛన్ లబి్ధదారు, చెందోడు, కోట మండలం, తిరుపతి జిల్లా మళ్లీ పాత కష్టాలేనా .నేను దివ్యాంగురాలిని. గతంలో పెన్షన్ కోసం మా నాన్న వెంకటరమణ ప్రతి నెలా ఒకటో తేదీన కె.నగరపాలెం పంచాయతీ కార్యాలయానికి ఆటోలో తీసుకొని వెళ్లేవారు. ఒక్కోసారి నెలకు రెండు మూడు సార్లు తిరగాల్సి వచ్చేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆ కష్టం తప్పింది.ఈ ఐదేళ్లు ఎక్కడికి వెళ్లకుండానే ఇంటికే పెన్షన్ వచి్చంది. ఇప్పుడు వలంటీర్లు పెన్షన్‌ను అందించకూడదని అంటున్నారు. – చల్లపల్లి ఎరి్నకుమారి, మంగమారిపేట, విశాఖ జిల్లా పింఛన్ కోసం పక్క ఊరికి వెళ్లాలా..? వలంటీర్లు నెలనెలా ఠంఛన్‌గా ఇంటికే వచ్చి అందజేసేవారు. ఇకపై పింఛన్ తీసుకునేందుకు పక్క ఊర్లో ఉన్న సచివాలయానికి వెళ్లాలా? నాకు చాలా ఏళ్లుగా ఆరోగ్యం బాగోలేక ఇంట్లో నుంచి కదలలేని పరిస్థితి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన వలంటీర్ల వ్యవస్థ ద్వారా నాకు పింఛన్ డబ్బులు ఇంటికి వచ్చి ఇచ్చేవారు. నడవలేని నాకు ఇక ఇబ్బందులు తప్పవు. అక్కడ పడిగాపులు కాసే ఓపిక నాకు లేదు. – వరికూటి మాలకొండారెడ్డి, చెన్నారెడ్డిపల్లి, పొదలకూరు మండలం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆయన బుద్ధే అంత నాకు పెన్షన్‌ను ప్రతి నెలా ఒకటో తేదీన మా వలంటీర్ తలుపుతట్టి ఇచ్చేవారు. చంద్రబాబు రాజకీయంలో ఇప్పుడు నేను పెన్షన్ తీసుకోవాలంటే మా గ్రామ సచివాలయానికి వెళ్లాలి. ఎక్కడ వడదెబ్బ తగులుతుందోనని భయమేస్తోంది. ఇలా ఇబ్బంది పెడుతున్న చంద్రబాబుకు మా ఉసురు తప్పక తగులుతుంది. – కోటపాటి పెంచలయ్య, దిగువపేటలోని గాం«దీవీది, సిద్దవటం, వైఎస్సార్ జిల్లా నేను సచివాలయానికి ఎలా వెళ్లేది? గత రెండేళ్లుగా పక్షవాతంతో కాళ్లు పూర్తిగా చచ్చుబడ్డాయి. లేవలేని దుస్థితి. 24 గంటలు మంచంపైనే ఉండాల్సి వస్తుంది. ప్రతి నెలా ఇంటి వద్దకే వచ్చి వలంటీర్ పింఛన్ ఇచ్చివెళ్లేది. ప్రస్తుతం వలంటీర్లకు పింఛన్ పంపిణీ నిలిపివేయడం చాలా దారుణం. నేను ఏవిధంగా సచివాలయానికి వెళ్లాలి. ఎలా పింఛన్ తీసుకోవాలని, వరుసలో ఎలా నిలబడాలి. గుర్తొస్తేనే భయమేస్తోంది. – సువార్తమ్మ, క్రిష్టిపాడు గ్రామం, దొర్నిపాడు మండలం, నంద్యాల జిల్లా ఆ తిప్పలు మాకొద్దు నాకు 77 ఏళ్లు. ఎవరూ లేరు. చెల్లెలు కొడుకే అన్నం పెడుతున్నాడు. నడవలేని దుస్థితిలో పింఛన్ డబ్బులే ఆసరా. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పింఛన్ కోసం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాంపురం నడిచి వెళ్లేవాళ్లం. ఇప్పుడు ప్రతి నెల వలంటీర్ ఇంటికొచ్చి పింఛన్ ఇస్తున్నారు. ఈ నెల పింఛన్ డబ్బులు కోసం ఎదురు చూశా. కానీ సచివాలయానికి వెళ్లి పింఛన్ తీసుకోవాలంటున్నారు. జీ.ఎర్రగుడి సచివాలయం వెళ్లాలంటే 14 కిలోమీటర్లు. నడవలేని స్థితిలో ఉన్న నేను అంతదూరం వెళ్లి పింఛన్ ఎలా తెచ్చుకోవాలో తెలియడం లేదు. మాలాంటి వాళ్లను ఇబ్బంది పెడితే ఏమొస్తుంది. – సయ్యద్ గూడమ్మ, తుగ్గలి మండలం, ఆర్.కొట్టాల గ్రామం, కర్నూలు జిల్లా -
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు! ఆమె ఆరోగ్య రహస్యం ఇదే..!
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా అమెరికాలో జన్మించిన స్పానిష్ మహిళ బ్రన్యాస్ మోరారే నిలిచింది. ఆమె ఇటీవలే తన 117వ పుట్టిన రోజుని జరుపుకుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్సు ప్రకారం..ఫ్రాన్స్‌కు చెందిన 118 ఏళ్ల లూసిల్ రాండన్ మరణం తర్వాత మోరారేనే 117 ఏళ్లు సుదీర్థకాలం జీవించిన మహిళగా రికార్డు సృష్టించింది. ఇక మోరారే తల్లిదండ్రులు యూఎస్‌కు వలస వచ్చిన ఒక ఏడాది తర్వాత మార్చి 04, 1907న కాలిఫోర్నియాలో శాన్ఫ్రాన్సిస్కోలో జన్మించారు. మళ్లీ ఎనిమిదేళ్లకు స్పెయిన్ తిరిగి వచ్చి అక్కడ కాటలోనియాలో స్థిరపడింది. గత 22 ఏళ్లుగా మోరారే ఆ ప్రాంతంలోనే ఒక నర్సింగ్ హోమ్ రెసిడ్ఎన్సియా శాంటా మారియా డెల్ తురాలో కాలం వెళ్లదీస్తోంది. ఈ వృద్ధురాలు ప్రపంచ యుద్ధాలు, స్పానిస్ అంతర్యుద్ధం, స్పానిష్ ఫ్లూ వంటి మహమ్మారీలన్నింటిని తట్టుకుంది. చివరిగా 2020లో కోవిడ్ -19తో పోరాడారు. ఆమె ఈ వైరస్ బారిన తన 113వ పుట్టిన రోజు జరుపుకున్న కొద్ది వారాలకే పడింది. అయినప్పటికి త్వరగా కోలుకోవడం విశేషం. ఇన్స్టాగ్రామ వేదికగా గిన్నస్ వరల్డ్ రికార్డ్స్ ఆ వృద్ధరాలికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడమే గాక గత ఏడాది జనవరి 2023న ఆమె ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా ధృవీకరించిన విషయాన్ని పేర్కొంది. చింతించొద్దు, విచారించొద్దు.. మోరేరా తన ఆరోగ్య రహస్యంగా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ప్రశాంతంగా ఉండటం, కుటుంబం, స్నేహితులతో మంచి అనుబంధం, భావోద్వేగ స్థిరత్వం తదితర వాటివల్లే ఇంతలా ఆరోగ్యంగా సుదీర్ఘకాలం జీవించగలిగానని చెప్పుకొచ్చింది. అంతేగాదు ఎక్కువగా చింతించడం, విచారించడం మానేయాలని, విషపూరితమైన వ్యక్తులకు దూరంగా ఉండటం వంటివి చేస్తే ఆయురారోగ్యాలతో ఉండగలరని చెప్పుకొచ్చింది. ఇక ఆమె వ్యక్తిగత జీవితం దగ్గరకు వచ్చేసరికి మోరారే 1931లో కాటలాన్ వైద్యుడు జోన్ మోరెట్ను వివాహం చేసుకుంది. ఆమెకు ముగ్గురు పిల్లలు. ఆమె తన పెళ్లి రోజు చాలా సంఘటనలతో ముడిపడి ఉందని చెప్పింది. ఇక ఆమె భర్త 72 ఏళ్ల వయసులో చనిపోయారు. ప్రస్తుతం ఆమెకు ముగ్గురు పిల్లలు, 11 మంది మనవళ్లు, 13 మంది మనవరాళ్లు ఉన్నారు. సైంటిస్టులు ఏం అన్నారంటే.. మోరారేతో మాట్లాడిన సైంటిస్ట్ మానెల్ ఎస్టేల్లర్ మాట్లాడుతూ.."ఆమెను పరీక్షించగా పూర్తిగా స్పష్టమైన తల ఉంది. కేవలం నాలుగేళ్ల వయసులో జరిగిన సంఘటనలను సైతం గుర్తించుకుంటుంది. అలాగే వృద్ధులకు ఉండే సాధారణ హృదయ సంబంధ వ్యాధులు ఏమీ లేవు. ఆమె కుటుంబంలో 90 ఏళ్లు పైబడిన వాళ్లు చాలామంది ఉండటం విశేషం. ఇక్కడ జన్యుసంబంధ కారణమే అయ్యి ఉండొచ్చు. ఇక మోరారే మూత్రం, లాలాజలం, రక్తనమునాలు ఆమె 80 ఏళ్ల కుమార్తెతో సరిపోలుతాయి. ఆమె డీఎన్ఏ వయసు సంబంధిత వ్యాధులతో పోరాడగల ఔషధ సృష్టికి దోహదపడొచ్చు" అని ఎస్టేల్లర్ అన్నారు. (చదవండి: ప్రాణాంతక కేన్సర్‌తో పోరాడుతూ భావోద్వేగ పోస్ట్..'భర్తకు ప్రేమతో'..) -
పాత ఫర్నిచర్ మినియేచర్
కాలంతో పాటు ఫర్నిచర్లో కూడా మార్పు వస్తోంది. పాత ఫర్నిచర్ ఇప్పుడు అపురూపంగా అనిపిస్తుంది. అలనాటి ఫర్నిచర్‌ను కళ్లముందుంచేలా వశిష్ట్ రజని తయారుచేసిన పాత ఫర్నిచర్ మినియేచర్లు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. చికాగాలోని ఆర్ట్ మ్యూజిక్యంకు వెళ్లి వచ్చిన తరువాత వశిష్ట్‌కు పాత ఫర్నిచర్ మినియేచర్లు తయారుచేయాలనే ఆలోచన వచ్చింది. 30 సంవత్సరాల వశిష్ట్ చికాగోలో ఇండస్ట్రియల్ డిజైనర్‌గా పనిచేస్తున్నాడు. -
రామాలయ ప్రాంగణాన్ని శుభ్రం చేసిన నటుడు
అయోధ్యలో ఈ నెల 22న బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠాపన మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ నటులు హాజరుకానున్నారు. ఇంతలో ఒక నటునికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్.. రామాలయ ప్రాంగణాన్ని, మెట్లను శుభ్రం చేస్తూ ఒక వీడియోలో కనిపించారు. ఈ వీడియో వైరల్ కావడంతో అభిమానులు జాకీష్రాఫ్‌ను మెచ్చుకుంటున్నారు. 66 ఏళ్ల జాకీ ష్రాఫ్ ముంబైలో జరిగిన పురాతన రామాలయాన్ని శుభ్రపరిచే కార్యక్రమంలో పాల్గొన్నారు. రామునిపై ఆ నటునికి ఉన్న భక్తిని, అతని సింప్లిసిటీని అభిమానులు కొనియాడుతున్నారు. ‘ఎక్స్’లో షేర్ చేసిన ఈ వీడియోను యూజర్స్ అమితంగా ఇష్టపడుతున్నారు. పలువురు అభిమానులు రకరకాలుగా కామెంట్లు కూడా చేస్తున్నారు. ఒక యూజర్ జాకీని ఉద్దేశించి ‘జీరో నుంచి హీరోగా మారిన వ్యక్తి’ అని కామెంట్ చేయగా, మరొకరు, 'కెమెరా ముందు.. కెమెరా వెనుక అత్యంత వినయుడు' అని రాశారు. జాకీ ష్రాఫ్ అప్పుడప్పుడు పలు సామాజిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంటారు. నిరుపేద చిన్నారులకు వైద్య చికిత్స చేయించేందుకు, అలాంటి వారికి విద్య అందించేందుకు జాకీష్రాఫ్ విరాళాలు అందిస్తుంటారు. ఆయన సేంద్రీయ వ్యవసాయ క్షేత్రాన్ని కూడా నిర్వహిస్తున్నారు. #WATCH | Maharashtra: Amruta Fadnavis wife of Maharashtra Deputy CM Devendra Fadnavis & Bollywood actor Jackie Shroff took part in the cleanliness drive of the oldest Ram temple in Mumbai. (14.01) pic.twitter.com/mhdkzcNB5x — ANI (@ANI) January 14, 2024 -
అదే బరి.. వీరులు వారే..
మేకల కళ్యాణ్ చక్రవర్తి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి బరిలోకి దిగడమంటే ఆషామాషీ కాదు. పోటీ చేసి గెలవాలంటే అంత ఈజీ కాదు. పదేపదే పోటీ చేస్తుంటే..ఓసారి గెలిచి మరోమారు ఓడిపోతుంటే.. పదే పదే గెలుస్తుంటే.. లేదా పదే పదే ఓడిపోతుంటే.. ఆ ఉత్కంఠ అనుభవిస్తేనే కానీ అర్థం కాదు. అలా పదేపదే పోటీ చేయడం కత్తిమీద సాము లాంటిదే. పోటీ చేసిన వారే పదేపదే పోటీ చేయడం.. ఒకే నియోజకవర్గంలో నేతలు రెండు నుంచి ఐదు సార్లు తలపడితే వారినే ‘పాతకాపు’లంటారు. నియోజకవర్గం మారినా, పార్టీలు మారినా కొన్ని నియోజకవర్గాల్లో పోటీ వారి మధ్యనే ఉంటుంది. ఆ నియోజకవర్గంలో ఆ ఇద్దరు ప్రధాన ప్రత్యర్థులు అలా పాతుకుపోతారంతే. ఇలాంటి పాతకాపులు ఈసారి కూడా హోరాహోరీ తలపడుతున్నారు. చిరకాల ప్రత్యర్థులపై అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాతకాపుల పోటాపోటీ ఎలా ఉందంటే..! నిజామాబాద్ బోధన్‌లో గత ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి హోరాహోరీ తలపడిన షకీల్ అహ్మద్, సుదర్శన్‌రెడ్డి ఈసారి కూడా అవే పార్టీల నుంచి బరిలో ఉన్నారు. నిజామాబాద్ రూరల్లోనూ పాతకాపులే మళ్లీ పోటీ పడుతున్నారు. 2018లో నిల్చున్న బాజిరెడ్డి గోవర్ధ్దన్ (బీఆర్ఎస్), భూపతిరెడ్డి (కాంగ్రెస్)లు ఈసారీ బరిలో ఉన్నారు. బాల్కొండలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి (బీఆర్ఎస్)పై గత ఎన్నికల్లో బీఎస్పీ పక్షాన తలపడిన సునీల్‌కుమార్ ఈసారి కాంగ్రెస్ నుంచి తలపడుతున్నారు. ఆదిలాబాద్ సిర్పూర్ నియోజకవర్గంలో ఇద్దరు పాతకాపులు పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో తలపడిన కోనేరు కోనప్ప (బీఆర్ఎస్)పై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పాల్వాయి హరీశ్ ఇప్పుడు బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్య (బీఆర్ఎస్), జి.వినోద్‌లు మళ్లీ పోటీ పడుతున్నారు. అయితే, గత ఎన్నికల్లో వినోద్ బీఎస్పీ నుంచి పోటీ చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి గా రంగంలో ఉన్నారు. మంచిర్యాలలో ఎన్.దివాకర్‌రావు (బీఆర్ఎస్), కె.ప్రేమ్‌సాగర్‌రావు (కాంగ్రెస్) మళ్లీ అవే పార్టీల తరఫున రంగంలోకి దిగారు. నిర్మల్‌లో వరుసగా ఏడోసారి ఇంద్రకరణ్ రెడ్డి పోటీ చేస్తుండగా ఆయనపై రెండు వరుస ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులుగా తలపడిన మహేశ్వర్‌రెడ్డి, కూచాడి శ్రీహరిరావులిద్దరూ ఈసారి ఆయనపై బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి పోటీలో నిలిచారు. ఖమ్మం పినపాకలో గత ఎన్నికల్లో రేగా కాంతారావు (కాంగ్రెస్), పాయం వెంకటేశ్వర్లు (బీఆర్ఎస్) నుంచి పోటీ చేయగా, ఇప్పుడు కూడా వీరే తలపడుతున్నా పార్టీలు మారారు. ఇల్లెందులోనూ ఇదే పరిస్థితి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన హరిప్రియానాయక్ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కోరం కనకయ్య కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. మధిరలో గత నాలుగో ఎన్నికల్లోనూ మల్లు భట్టి విక్రమార్క, లింగాల కమల్రాజ్లే ప్రధాన ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. భట్టి కాంగ్రెస్ అభ్యర్థి గా నాలుగుసార్లు రంగంలో ఉండగా, కమల్‌రాజ్ మాత్రం రెండుసార్లు సీపీఎం నుంచి, రెండోసారి బీఆర్ఎస్ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. భద్రాచలం నుంచి పొదెం వీరయ్య (కాంగ్రెస్), తెల్లం వెంకట్రావు (బీఆర్ఎస్) వరుసగా రెండోసారి పోటీ చేస్తున్నారు. మెదక్ అందోల్ నియోజకవర్గంలో మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ (కాంగ్రెస్), చంటి క్రాంతి కిరణ్ (బీఆర్ఎస్)లు వరుసగా రెండోసారి బరిలో ఉన్నారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డి (కాంగ్రెస్), చింత ప్రభాకర్ (బీఆర్ఎస్)లు వరుసగా నాలుగోసారి అమీతుమీ తేల్చుకుంటున్నారు. పటాన్చెరులోనూ 2018 ఎన్నికల్లో తలపడిన మహిపాల్‌రెడ్డి (బీఆర్ఎస్), శ్రీనివాస్‌గౌడ్ (కాంగ్రెస్)లే 2023 ఎన్నికల్లోనూ పోటీ పడుతున్నారు. వరంగల్ డోర్నకల్‌లో రెడ్యానాయక్ (బీఆర్ఎస్), రామచంద్రునాయక్ (కాంగ్రెస్) మధ్య రెండోసారి పోటీ జరుగుతోంది. నర్సంపేటలో దొంతి మాధవరెడ్డి (కాంగ్రెస్), పెద్ది సుదర్శన్‌రెడ్డి (బీఆర్ఎస్) మూడోసారి తలపడుతున్నారు. భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డి (బీఆర్ఎస్), గండ్ర సత్యనారాయణరావు (కాంగ్రెస్) రెండోసారి పోటీపడుతున్నారు. గత ఎన్నికల్లో వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ నుంచి, సత్యనారాయణరావు ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. రంగారెడ్డి జిల్లా మల్కాజ్‌గిరిలో వరుసగా రెండోసారి మైనంపల్లి హనుమంతరావు, ఎస్.రాంచందర్‌రావు (బీజేపీ)ల నడుమ పోరు జరుగుతోంది. మైనంపల్లి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి దిగగా, ఈసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. కుత్బుల్లాపూర్‌లో కేపీ వివేకానంద (బీఆర్ఎస్), కూన శ్రీశైలం గౌడ్ మధ్య రెండోసారి పోటీ జరుగుతోంది. శ్రీశైలం గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి, ఈసారి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం జనరల్ స్థానంగా మారిన తర్వాత జరుగుతున్న నాలుగు ఎన్నికల్లోనూ మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డిలే ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నారు. అయితే గతంలో బీఎస్పీ నుంచి, ఇండిపెండెంట్‌గా పోటీచేసిన మల్రెడ్డి ఈసారి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. మంచిరెడ్డి కిషన్‌రెడ్డి 2009, 2014లో టీడీపీ నుంచి పోటీ చేయగా, 2018, 2023లో బీఆర్ఎస్ నుంచి బరిలో ఉంటున్నారు. పరిగిలో కొప్పుల మహేశ్‌రెడ్డి, టి.రామ్మోహన్‌రెడ్డి మధ్య బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి వరుసగా రెండోసారి పోటీ జరుగుతోంది. వికారాబాద్లోనూ మెతుకు ఆనంద్ (బీఆర్ఎస్), గడ్డం ప్రసాద్‌కుమార్ (కాంగ్రెస్) రెండోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కరీంనగర్ జగిత్యాల నుంచి సంజయ్‌కుమార్ (బీఆర్ఎస్), టి.జీవన్‌రెడ్డి (కాంగ్రెస్) వరుసగా మూడోసారి తలపడుతున్నారు. గత రెండు ఎన్నికల్లో చెరోసారి విజయం సాధించగా, ఈసారి ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ (బీఆర్ఎస్)పై అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ (కాంగ్రెస్) వరుసగా ఐదోసారి పోటీ చేస్తున్నారు. ఐదు ఎన్నికల్లో ఓటమిపాలైనా గత ఎన్నికల్లో కేవలం 441 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిన ఆయన మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మంథనిలో పుట్టా మధు (బీఆర్ఎస్), దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (కాంగ్రెస్) వరుసగా నాలుగోసారి ఢీ కొడుతున్నారు. పెద్దపల్లి నుంచి దాసరి మనోహర్‌రెడ్డి (బీఆర్ఎస్), విజయరమణారావు (కాంగ్రెస్) వరుసగా రెండోసారి తలపడుతున్నారు. కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ (బీఆర్ఎస్)పై బండి సంజయ్ (బీజేపీ) వరుసగా మూడోసారి పోటీ చేస్తున్నారు. చొప్పదండిలోనూ సుంకె రవిశంకర్ (బీఆర్ఎస్), మేడిపల్లి సత్యం (కాంగ్రెస్) మధ్య రెండోసారి పోటీ నెలకొంది. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ (బీఆర్ఎస్)పై పాతకాపు కె.కె.మహేందర్‌రెడ్డి (కాంగ్రెస్) మరోమారు పోటీ చేస్తున్నారు. ఒక్కసారి మినహా గత నాలుగు ఎన్నికల్లోనూ ఆ ఇద్దరే ముఖాముఖి తలపడటం గమనార్హం. నల్లగొండ దేవరకొండ (ఎస్టీ) నియోజకవర్గంలో బాలూనాయక్ (కాంగ్రెస్), రవీంద్రకుమార్ (బీఆర్ఎస్) రెండోసారి తలపడుతున్నారు. కోదాడలో పద్మావతిరెడ్డి (కాంగ్రెస్), బొల్లం మల్లయ్య (బీఆర్ఎస్), సూర్యాపేటలో జగదీశ్‌రెడ్డి (బీఆర్ఎస్), దామోదర్‌రెడ్డి (కాంగ్రెస్)లు వరుసగా రెండుసార్లు తలపడుతున్నారు. నల్లగొండలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి మధ్య మూడోసారి పోటీ జరుగుతోంది. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (కాంగ్రెస్), కె. ప్రభాకర్‌రెడ్డి (బీఆర్ఎస్) మధ్య కూడా వరుసగా మూడోసారి పోటీ జరుగుతోంది. భువనగిరిలో పైళ్ల శేఖర్‌రెడ్డి (బీఆర్ఎస్), కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్) మధ్య కూడా వరుసగా రెండోసారి సమరం జరుగుతోంది. నకిరేకల్‌లో వేముల వీరేశం, చిరుమర్తి లింగయ్యల నడుమ మూడోసారి పోటీ జరుగుతోంది. అయితే, గత ఎన్నికల్లో ఈ ఇద్దరు పోటీ చేసిన పార్టీలు వేర్వేరు కావడం గమనార్హం. మహబూబ్‌నగర్ కొడంగల్ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి (బీఆర్ఎస్) నడుమ రెండోసారి యుద్ధం జరుగుతోంది. అచ్చంపేటలో గువ్వల బాలరాజు (బీఆర్ఎస్), చిక్కుడు వంశీకృష్ణ (కాంగ్రెస్) కూడా వరుసగా రెండోసారి తలపడుతున్నారు. కల్వకుర్తి నుంచి జైపాల్‌యాదవ్ (బీఆర్ఎస్), టి.ఆచారి (బీజేపీ) కూడా రెండోసారి పోటీ పడుతున్నారు. కొల్లాపూర్‌లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (కాంగ్రెస్), హర్షవర్దన్‌రెడ్డి (బీఆర్ఎస్) మూడోసారి పోటీ చేస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో ఈ ఇద్దరూ పోటీ చేసిన పార్టీల నుంచి కాకుండా మరో పార్టీ నుంచి పోటీ చేస్తుండటం గమనార్హం. -
ఆ టోకెన్‌తో థియేటర్లో జీవితాంతం ఉచితంగా సినిమాలు
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అంటారు. చాలామంది పాత వస్తువులను జాగ్రత్తగా దాచేందుకు ఇష్టపడతారు. అయితే కొన్నేళ్ల తర్వాత అవి బయట పడినప్పుడు వాటిని చూసినవారు తెగ ఆశ్యర్యపోతుంటారు. అయితే ఇప్పుడు మనం తెలుసుకునేది దీనికి భిన్నం. 1766 నాటి ‘థియేటర్ టోకెన్’ ఇప్పుడు బ్రిటన్‌లో వేలం వేస్తున్నారు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఆ టొకెన్ ఉంటే థియేటర్లో రోజూ సినిమాలను ఉచితంగా చూడవచ్చు. అయితే ఈ టోకెన్ కొనుగోలు చేయాలంటే భారీగా సొమ్ము చెల్లించాలివుంటుంది. గార్డియన్ తెలిపిన వివరాల ప్రకారం బ్రిటన్‌లోని బ్రిస్టల్ ఓల్డ్ విక్ థియేటర్‌ను నిర్మించివారు ముందుగా 50 ప్రత్యేకమైన టోకెన్లు తయారు చేశారు. ఈ టోకెన్లు కలిగినవారు థియేటర్లో ప్రదర్శించే ప్రతీ సినిమాను ఉచితంగా చూడవచ్చని ఆ టోకెన్లపై రాసి ఉంది. 250 ఏళ్లపాటు దాచివుంచిన ఈ టోకెన్లు ఇటీవల బయటపడ్డాయి. ఇప్పుడు వీటిని వేలం వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. థియేటర్ ప్రారంభ సమయంలో ఈ 50 టోకెన్లను తయారు చేశారు. కొందరు వాటిని వినియోగించారు. మరికొందరు విక్రయించారు. ఈ నేపధ్యంలో అనేక నకిలీ టోకెన్లు కూడా తయారయ్యాయట. విల్ట్‌షైర్‌లోని హెన్రీ ఆల్డ్రిడ్జ్ అండ్ సన్ వేలం హౌస్‌లో ఈ టోకెన్లు విక్రయిస్తున్నట్లు వేలం హౌస్ ప్రతినిధి మీడియాకు తెలిపారు. 1766లో థియేటర్ వాటాదారు విలియం జోన్స్‌కు టోకెన్ నంబర్ 35ను జారీ చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. 1815 నాటికి ఇది ప్రముఖ బ్రిస్టల్ బ్లూ గ్లాస్ తయారీదారు అయిన జాన్ వాధమ్ దగ్గరకు చేరింది. ఈ టోకెన్ ఇప్పటికీ ఈ కుటుంబం వద్ద ఉంది. మరో టోకెన్ అష్టన్ కోర్ట్‌కు చెందిన స్మిత్ కుటుంబం దగ్గరుంది. వేలం నిర్వహిస్తున్న సంస్థ ఒక టోకెన్ ధరను 2,500 పౌండ్లు అంటే సుమారు రూ. 2.51 లక్షలుగా నిర్ణయించింది. బ్రిస్టల్ ఓల్డ్ విక్ థియేటర్ ప్రతినిధి మాట్లాడుతూ మేము ఈ టోకెన్ల వినియోగానికి అనుమతిస్తాం. వారికి జీవితాంతం ఉచితంగా సినిమాలు చూసే అవకాశాన్ని కల్పిస్తాం. కాగా ఈ థియేటర్‌ను ‘థియేటర్ రాయల్’ అని పిలుస్తారు దీనిని కింగ్ స్ట్రీట్‌లో 1764-1766 మధ్య కాలంలో నిర్మించారు. ఇది కూడా చూడండి: 21 ఏళ్లకు యాసిడ్ బాధితురాలికి న్యాయం! -
అత్యంత పురాతన మానవుల పాదముద్రలు లభ్యం
అమెరికాలోని న్యూ మెక్సికోలో పురాతన మానవ పాదముద్రలను కనుగొన్నారు. ఇవి ఇక్కడి వైట్ సాండ్స్ నేషనల్ పార్క్‌లో గుర్తించారు. ఒక నూతన అధ్యయనంలో కనుగొన్న ఈ పాలియో-మానవ పాదముద్రలు 23,000 నుండి 21,000 సంవత్సరాల క్రితం నాటివని తెలుస్తోంది. ఈ మానవ పాదముద్రలు ఏనాటివో తెలుసుకునేందుకు అధ్యయనంలో రెండు పద్ధతులు ఉపయోగించారు. ఈ పాదముద్రలు కనిపించిన ట్రాక్‌వేలు 23,000 నుండి 21,000 సంవత్సరాల నాటివని అంచనా వేశారు. అంటే అవి మంచు యుగంలోని అత్యంత శీతల భాగమైన ‘లాస్ట్ గ్లేసియల్ మ్యాగ్జిమమ్’ (26,500 నుండి 19,000 సంవత్సరాల క్రితం) కాలం నాటివి. 13 వేల సంవత్సరాల క్రితం ఉత్తర అమెరికాకు వచ్చిన మొదటి మానవులు క్లోవిస్ ప్రజలు అని పురావస్తు శాస్త్రవేత్తలు గతంలో భావించారు. గత కొన్ని దశాబ్దాలలో పురావస్తు శాస్త్రవేత్తలు క్లోవిస్‌కు పూర్వం అంటే 13 వేల సంవత్సరాల క్రితం అమెరికాలో నివసించే వ్యక్తులకు సంబంధించిన ఆనవాళ్లను కనుగొన్నారు. అయితే ఆయా ప్రదేశాలలో చాలా వరకు ఆధారాలు నిర్థారించే స్థాయిలో లేవు. వైట్ సాండ్స్ ట్రాక్‌వే ఇప్పుడు ఉత్తర అమెరికాలో పురాతన మానవులకు సంబంధించిన ప్రత్యక్ష సాక్ష్యంగా మారింది. ఫలితంగా మొదటి అమెరికన్ల రాక తేదీని గణనీయంగా వెనక్కి నెట్టినట్లయ్యింది. కాథ్లీన్ స్ప్రింగర్‌తో కలిసి అధ్యయనానికి నాయకత్వం వహించిన జెఫ్రీ పిగటి మాట్లాడుతూ లాస్ట్ గ్లేసియల్ మాగ్జిమమ్ సమయంలోనే ప్రజలు ఇక్కడ ఉన్నారనడానికి మా వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయన్నారు. ఇది కూడా చదవండి: బిల్డింగ్‌ను ఢీకొని 1000 పక్షులు ఎందుకు మృతిచెందాయి? -
144 ఏళ్ల మెడికల్ స్టోర్ ఎలా బయటపడింది? దానిలో ఏమేమి ఉన్నాయి?
చరిత్రకు సంబంధించిన పలు అంశాలు ఎప్పటికీ ఆసక్తికరంగానే ఉంటాయి. తాజాగా 114 ఏళ్ల క్రితం నాటి మెడికల్ స్టోర్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 1880లో ప్రారంభమైన ఈ స్టోర్ 1909 వరకూ సవ్యంగానే నడిచింది. ఈ స్టోర్‌ను బ్రిటన్‌లో విలియం వైట్ అనే వ్యక్తి నిర్వహించేవాడు. అతని మరణానంతరం ఈ స్టోర్ మూతపడింది. ఇన్నాళ్ల తరువాత ఈ స్టోర్ తలుపులు తెరవగానే లోపల ఆశ్చర్యం కలిగించే పలు వస్తువులు కనిపించాయి. మెట్రో యూకే తెలిపిన వివరాల ప్రకారం ఈ మెడికల్ స్టోర్ గురించి 80 ఏళ్ల క్రితమే వెల్లడయ్యింది. అయితే విలియం వైట్ మనుమడు 1987లొ దీని గురించి బహిరంగంగా తెలియజేశాడు. తరువాత దీనిని ప్రజల సందర్శనార్థం తెరిచాడు. ఈ స్టోర్‌లో లిక్విడ్ మెడిసిన్‌తో నిండిన జార్లు, స్కేళ్లు, వైట్ రైటర్ మొదలైనవి లభ్యమయ్యాయి. విలియం వైట్ మరణానంతరం అతని ఇంటిని విక్రయించే సమయంలో ఈ రహస్య గదిని కనుగొన్నారు. అప్పుడు వైట్ కుమారుడు చార్లెస్ ఈ స్టోర్‌ను మూసివేశాడు. ఒక పరిశోధకుడు చెప్పిన దాని ప్రకారం స్టొర్లోని సామాను పరిశీలించి చూస్తే, విలియం ఒక కెమిస్ట్ అని తెలుస్తోంది. అలాగే అతను గ్రోసరీ సామాను కూడా భద్రపరిచేవాడు. అయితే నాటి వస్తువులు ఇప్పుడు ప్రమాదకరంగా పరిణమించాయి. ఈ దుకాణంలో కొన్ని వనమూలికలు కూడా లభించాయి. ఈ దుకాణాన్ని చూసేందుకు జనం తరలివస్తున్నారు. ఇది కూడా చదవండి: హిట్లర్ విషాహార భయాన్ని ఎలా దాటాడు? చివరికి ఎలా మరణించాడు? -
అది పాత సైకిలే.. కానీ వారి ఆనందం వెలలేనిది!
ఒక్కోసారి చిన్నచిన్న ఆనందాలు కూడా వెలకట్టలేనంత సంతృప్తినిస్తాయి. ఎవరికైనా చిన్నతనంలో కుటుంబంతో గడిపిన ప్రతి క్షణం జీవితాంతం గుర్తుండిపోతుంది. మనం బాల్యంలో అందుకున్న చిన్నపాటి మిఠాయి కూడా మనల్ని ఆనందడోలికల్లో ముంచెత్తుతుంది. ఇటీవల అటువంటి ఆనందాలను తిరగతోడే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ ఎమోషనల్ వీడియో చిన్నిచిన్ని సంతోషాలను ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో నేర్పుతుంది. తండ్రీకుమారుల ఆనందం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఎవరి హృదయాన్నయినా ఇట్టే ఆకట్టుకుంటుంది. ఈ 15 సెకన్ల వీడియోలో తండ్రీకొడుకులు తమ ఇంటి ముందు సైకిల్ దగ్గర నిలబడి ఉండటాన్ని గమనించవచ్చు. తరువాత తండ్రి ఆ సైకిల్‌కు పూలమాల వేసి, నీటిని చిలకరించిన తర్వాత, సైకిల్‌కు పూజ చేస్తాడు. దీనిని చూస్తూ పిల్లవాడు ఆనందంతో గెంతులేస్తుంటాడు. వీడియోలో కనిపిస్తున్న సైకిల్ పాతదే కావచ్చు కానీ వారి ఆనందం వర్ణించేందుకు వీలు కాకుండా ఉంది. ఈ వీడియోను ఐఎఎస్ అధికారి అవనీష్ శరణ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. వీడియోను షేర్ చేసిన ఆయన.. ‘ఇది సెకండ్ హ్యాండ్ సైకిల్ మాత్రమే. అయినా వారి ముఖాల్లో సంతోషాన్ని ఒక్కసారి చూస్తే.. కొత్త మెర్సిడెస్ బెంజ్ కొన్నట్లుగా ఉంది. ఈ వీడియోను ఇప్పటివరకూ 85 వేల మందికి పైగా లైక్ చేయగా, 3 వేల మందికి పైగా యూజర్లు వీడియోపై తమ ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. ఒక యూజర్ ‘బహుశా ప్రపంచంలోని ఖజానానంతా వెచ్చించినా ఇంతటి ఆనందాన్ని కొనుగోలు చేయలేకపోవచ్చు’ అని రాశారు. మరొక యూజర్ ‘వీరి సంతోషానికి ధర లేదు సార్’ అని రాశారు. అయితే కొంతమంది వినియోగదారులు ఈ వీడియోను షేర్ చేసే బదులు మీరు వారికి కొత్త సైకిల్ కొనుగోలు చేసి ఇవ్వవచ్చుకదా అని ఆ ఐఏఎస్ అధికారికి సూచించారు. ఇది కూడా చదవండి: ఖలిస్తానీ ఉగ్రవాదుల ఓసీఐ కార్డుల రద్దు? It’s just a second-hand bicycle. Look at the joy on their faces. Their expression says, they have bought a New Mercedes Benz.❤️ pic.twitter.com/e6PUVjLLZW — Awanish Sharan 🇮🇳 (@AwanishSharan) May 21, 2022 -
కరెంట్ తీగల్లోనూ ముడుపుల డొంక
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో కోట్లాది రూపాయలు చేతులు మారినట్లుగానే విద్యుత్ శాఖలోనూ భారీ ఎత్తున అవినీతి చోటుచేసుకుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఈ శాఖలో జరిగిన అనేక అవినీతి, అవకతవకలను విద్యుత్ రంగ నిపుణులు ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. విద్యుత్ తీగల మార్పిడి కాంట్రాక్టు వ్యవహారంలో టెండరు నిబంధనలు సైతం మార్చేసి రూ.కోట్ల విలువైన పనులను రెండు ప్రైవేటు సంస్థలకు అడ్డగోలుగా కట్టబెట్టిన వ్యవహారాన్ని వారు ఉదహరిస్తున్నారు. సర్కారు పెద్దలు కోరుకున్న ఆ సంస్థల జేబుల్లోకి రూ.కోట్లు వెళ్లిపోయిన విధానాన్ని వివరిస్తున్నారు. తక్కువకే వేస్తామంటే వద్దని.. చంద్రబాబు హయాంలో ఏపీ ట్రాన్స్‌కో పరిధిలో 132, 220 కిలోవాట్ల (కేవీ) సామర్థ్యం గల విద్యుత్ లైన్లు 45 వేల కిలోమీటర్ల పొడవున ఉండేవి. అయితే, ఇందులో చాలావరకూ తీగలు వంగిపోయి, తెగిపోయే స్థితిలో సరఫరాకు అంతరాయం కలిగిస్తున్నాయి. దీంతో పాత తీగలను తొలగించి, కొత్తవి వేయాలని 2014లో నిర్ణయించారు. 2016లో కేంద్ర ప్రభుత్వ హామీతో పలు ఆరి్థక సంస్థల నుంచి పొందాలని భావించినప్పటికీ రుణానికి హామీగా ఉండలేమని కేంద్రం చెప్పడంతో కొన్నేళ్లు ఊరుకున్నారు. 2018లో మళ్లీ తెరపైకి ఈ అంశాన్ని తీసుకొచ్చారు.తొలి విడతగా 90 కిలోమీటర్ల మేర 15 లైన్లు మార్చాలని భావించి, మేలో టెండర్లు పిలిచారు. కిలోమీటర్ మేర విద్యుత్ తీగల పనులను రూ.4.5 లక్షలకే పూర్తిచేసేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. కానీ, ఆయా సంస్థలు ప్రీ బిడ్‌లో అర్హత పొందకుండా ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేశారు. ముందే కుదిరిన ‘ఒప్పందం’ ప్రకారం రెండు సంస్థలు మాత్రమే అర్హత పొందాయి. పోటీలేకపోవడంతో ఈ రెండు కంపెనీలు కుమ్మక్కై టెండర్లో కిలోమీటర్‌కు రూ.6 లక్షల చొప్పున కోట్ చేశాయి. 90 కిలోమీటర్లకు రూ.1.35 కోట్లు అదనంగా చెల్లించేందుకు ట్రాన్స్‌కో సిద్ధపడింది. ఈ వ్యవహారం ఇంతటితో ఆగిపోలేదు. మిగిలిన 45 వేల కిలోమీటర్లలో కనీసం 25 వేల కిలోమీటర్లలోనూ ఇదే తంతు కొనసాగింది. ఫలితంగా రూ.675 కోట్లు ప్రైవేటు సంస్థల జేబుల్లోకి, అక్కడి నుంచి అప్పటి ప్రభుత్వ పెద్దలకు అప్పనంగా వెళ్లాయి. కాంట్రాక్టుపై టీడీపీ ప్రజాప్రతినిధి కన్ను.. ఇక ఈ కాంట్రాక్టుపై కన్నేసిన విజయవాడకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధి కోల్‌కతాకు చెందిన ఓ సంస్థ పేరుతో టెండర్ వేశారు. ఇతర సంస్థలను పోటీ నుంచి ఉపసంహరించుకునేలా చేశారు. హైదరాబాద్, ముంబైకు చెందిన నాలుగు సంస్థలు మాత్రం పోటీలో నిలిచాయి. సాంకేతిక అంశాల సాకుతో ఈ నాలుగు సంస్థలపై అనర్హత వేటువేసి తప్పించారు. వివరణ ఇస్తామని ఆ నాలుగు సంస్థలు మొత్తుకున్నా ఆలకించలేదు. దీంతో టీడీపీ ప్రజాప్రతినిధికి బినామీగా ఉన్న కోల్‌కతా సంస్థ టెండర్లు దక్కించుకుంది. అయితే, ట్రాన్స్‌కో లైన్లు మార్చేందుకు ఒక్కొక్కటి 100 మీటర్లకు పైగా ఎత్తు ఉండే టవర్లను కృష్ణా నదిలోని లంక భూముల్లో ఏర్పాటుచేయాలి. నదిలో దాదాపు 500 క్యూబిక్ మీటర్ల మేర పటిష్టంగా పునాదులు నిర్మించాలి. కానీ, కోల్‌కతా సంస్థకు ఇలాంటి ప్రాజెక్టులు చేసిన అనుభవంలేదు. అయినా బినామీ కావడంతో టెండర్ దక్కేలా చేసి ముడుపులు దండుకున్నారు. అనుభవంలేని సంస్థకు హైటెన్షన్ లైన్లు.. నిజానికి.. బయటి వ్యక్తులకు చిన్న పని అప్పగించాలన్నా గతంలో ఎలా చేశారో బేరీజు వేసుకున్నాకే నిర్ణయాలు తీసుకుంటారు. పనితీరు, అనుభవం ప్రాతిపదికగా నిర్ణయాలు తీసుకుంటారు. మరి వందల కోట్ల రూపాయల ప్రజాధనంతో ముడిపడి ఉన్న వ్యవహారాల్లో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో ప్రభుత్వానికి ప్రత్యేకంగా చెప్పాలా? కానీ, అమరావతిలో రూ.380 కోట్లతో చేపట్టిన హైటెన్షన్ విద్యుత్ లైన్ల మార్పిడి కాంట్రాక్టును ఇలాంటి పనుల్లో అనుభవంలేని సంస్థ చేతిలో పెట్టారు. కోల్‌కతాకు చెందిన ఓ బినామీ సంస్థ పేరుతో కథ నడిపించి పోటీదారులను తప్పించారు. 400 కేవీ విద్యుత్ లైన్లను అమరావతిలో నిర్మాణాల కోసం ఇబ్రహీంపట్నం సమీపంలోని లంక భూముల మీదుగా మళ్లించాలని ట్రాన్స్‌కో నిర్ణయించింది. 15 కి.మీ. మేర రెండు వరుసలుగా కొత్త లైన్ల నిర్మాణాన్ని ట్రాన్స్‌కో, సీఆర్డీఏ ఆమోదించాయి. దీనికోసం రూ.380 కోట్ల అంచనా వ్యయంతో ట్రాన్స్‌కో టెండర్లు పిలిచింది. -
పురావస్తు తవ్వకాల్లో విచిత్ర అద్దం.. అది అట్టాంటి ఇట్టాంటిది కాదట!
ఇజ్రాయెల్‌లో ఒక విచిత్ర ఉదంతం వెలుగు చూసింది. ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రాంతానికి చెందిన 10వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల యువతికి పురాతన అద్దం దొరికింది. ఇది 1500 ఏళ్ల క్రితం నాటిదని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ అద్దాన్ని పురాతన కాలంనాటి ప్రజలు తమపై చెడు దృష్టి పడకుండా ఉండేందుకు ఉపయోగించేవారని సమాచారం. హైఫాకు చెందిన ఆ అమ్మాయి పేరు అవివ్ వీజ్‌మన్. ఈ అమ్మాయి ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ చేపట్టిన పురావస్తు తవ్వకాల కార్యక్రమంలో పాల్గొంది. ఈ సమయంలో ఆమెకు అద్దం లభించింది. ఇజ్రాయెల్ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ తవ్వకాల పనుల్లో 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారిలో అవివ్ వీజ్‌మన్ ఒకరు. పురావస్తు శాస్త్రానికి సంబంధించిన సమాచారాన్ని విద్యార్థులకు తెలియజేయడమే ఈ కార్యక్రమ లక్ష్యం. బైజాంటైన్ కాలం నాటి అద్దం ఈ అద్దం దొరికిన ప్రదేశానికి ఉష అని పేరు పెట్టారు. ఇది బైజాంటైన్ కాలం నాటిదని సమాచారం. ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ క్యూరేటర్ నెవిట్ పోపోవిచ్ తెలిపిన వివరాల ప్లేట్ మధ్యలో ఉన్న ఈ గాజు అద్దం 6వ శతాబ్దపు బైజాంటైన్ కాలం నాటి 'మ్యాజిక్ మిర్రర్'లో భాగమని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ అద్దం అంత్యక్రియలకు బహుమతిగా ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. భవనం గోడ నుండి బయటపడిన అద్దం తవ్వకాల్లో భాగంగా డిగ్గర్లు తమ పనిలో నిమగ్నమై ఉండగా, 17 ఏళ్ల అవియాకు ఆ అద్దం కనిపించింది. ఆమె దానిని సీనియర్ అధికారులకు చూపించింది. దానిని పరిశీలించిన అధికారులు అది1500 సంవత్సరాల నాటి అద్భుత అద్దం అని, దానిని చెడు దృష్టిని పోగొట్టుకునేందుకు ఉపయోగించేవారని తెలిపారు. ఇది దెయ్యాలు తరహా దుష్టశక్తులను దూరం చేస్తుందని నాటి కాలంలో నమ్మేవారట. దుష్టబుద్ధి కలిగినవారు ఈ అద్దంలో వారి ప్రతిబింబాన్ని చూసుకున్నప్పుడు, అద్దం యజమానిపై చెడు ప్రభావం ఉండదని నమ్మేవారట. అంత్యక్రియలకు బహుమతులుగా ఇలాంటి అద్దాలు ఇచ్చేవారని చరిత్ర చెబుతోంది. ఇది కూడా చదవండి: వింతజీవుల అకస్మాత్తు దాడులు.. గ్రహాంతరవాసులే అంటున్న జనం! -
వైన్ షాపుల లైసెన్సులకు లాటరీ.. ఉత్తర్వులు జారీ.. రూ.2 వేల కోట్ల ఆదాయం!
సాక్షి, హైదరాబాద్: వచ్చే రెండేళ్లకు ఏ4 (వైన్) షాపులకు లైసెన్సులు కేటాయించే ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు లైసెన్సుల జారీకి సంబంధించిన నిబంధనలతో కూడిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. సీఎస్ శాంతికుమారి జారీ చేసిన జీఓ నంబరు 86 ప్రకారం పాత పాలసీలోని నిబంధనల ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి, నవంబర్ 30, 2025 వరకు మద్యం విక్రయించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 2,620 షాపులకు లైసెన్సులు జారీ చేస్తారు. ఇందుకు లాటరీ పద్ధతినే పాటిస్తారు. దరఖాస్తు ఫీజు కూడా గతంలో లాగానే రూ.2లక్షలుగా ఉంటుంది. ఎక్సైజ్ ఫీజు శ్లాబులూ, ఇతర నిబంధనలన్నీ గత పాలసీ మేరకే ఉంటాయి. గతంలో మాదిరిగానే గౌడ సామాజికవర్గానికి 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తారు. ఈ రిజర్వేషన్ల ప్రకారమే జనాభా ప్రాతిపదికన ఏ జిల్లాలో ఎన్ని షాపులు కేటాయించాలో బుధవారమే నిర్ణయించారు. ఈ షాపుల సంఖ్య ప్రకారం గురువారం ఆయా జిల్లాల కలెక్టర్లు డ్రాలు నిర్వహించి ఏ షాపులు ఏ ఏ వర్గాలకు కేటాయించాలో నిర్ణయిస్తారు. ఇతర షాపులకు కూడా లాటరీ పద్ధతిలోనే లైసెన్సులు ఇస్తారు. లాటరీ ప్రక్రియ జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో గతంలో నిర్వహించిన విధంగానే జరుగుతుందని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వైన్ షాపుల కేటాయింపు ద్వారా ఈసారి కూడా రూ.2వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఏ4 షాపుల కేటాయింపు నిబంధనలు ఇలా... ♦ లైసెన్సులకు గత పాలసీ మాదిరిగానే దరఖాస్తు చేసుకోవాలి. ఫీజులోనూ ఎలాంటి మార్పు లేదు. రూ.2లక్షలు దరఖాస్తు కోసం చెల్లించాలి. లాటరీ వచి్చనా రాకపోయినా ఆ డబ్బులు ప్రభుత్వానికే జమవుతాయి. ఒకరు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు కూడా చేసుకోవచ్చు. ♦ రెండేళ్ల పాటు మద్యం విక్రయించుకునే ఫీజు గతంలోలాగే ఉంచారు. పాత స్లాబుల ప్రకారమే ఫీజులు నిర్ధారించారు. 5వేల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో సంవత్సరానికి రూ.50 లక్షలు, 5–50వేల జనాభా వరకు రూ.55 లక్షలు, 50వేల నుంచి లక్ష జనాభా వరకు రూ.60లక్షలు, లక్ష నుంచి 5లక్షల జనాభా వరకు రూ.65లక్షలు, 5 నుంచి 20లక్షల జనాభా వరకు రూ.85లక్షలు, 20లక్షల పైన జనాభా ఉన్న ప్రాంతాల్లో షాపులకు రూ.1.10 కోట్లు ఎక్సైజ్ ఫీజుగా నిర్ణయించారు. ♦ జీహెచ్ఎంసీ పరిధిలోని షాపులకు వర్తించే స్లాబు, జీహెచ్ఎంసీకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే షాపులకు, ఇతర కార్పొరేషన్లకు వర్తించే స్లాబులను కూడా ఐదు కిలోమీటర్ల పరిధిలోని షాపులకు వర్తింపజేస్తారు. మున్సిపాలిటీలకు వర్తించే స్లాబును ఆయా మున్సిపాలిటీలకు రెండు కిలోమీటర్ల దూరంలోని షాపులకు కూడా వర్తిస్తుంది. ♦ లైసెన్స్ ఫీజు ప్రతి ఏడాది ఆరు వాయిదాల్లో చెల్లించవచ్చు. అంటే రెండేళ్లలో 12 సార్లు ఫీజు చెల్లించాలి. ఇందుకు సంబంధించి బ్యాంకు గ్యారెంటీ కింద మొత్తం ఫీజులో 25 శాతానికి ఇస్తే సరిపోతుంది. ♦ గతంలో మాదిరిగానే దరఖాస్తుతోపాటు ధరావతు (ఈఎండీ) చెల్లించాల్సిన అవసరం ఉండదు. ♦ మద్యం విక్రయాల ద్వారా లైసెన్సీలకు కమిషన్ (మార్జిన్) కూడా గతంలో ఉన్న విధంగానే నిర్ణయించారు. వార్షికఫీజు కంటే 10 రెట్ల టర్నోవర్ వరకు 27 శాతం మార్జిన్ ఇస్తారు. మీడియం, ప్రీమియం బ్రాండ్లపై 20 శాతం, బీర్లపై 20 శాతంగా మార్జిన్ నిర్ధారించారు. పదిరెట్ల టర్నోవర్ దాటిన తర్వాత మాత్రం అన్ని బ్రాండ్లకు 10శాతం మార్జిన్ మాత్రమే ఇస్తారు. ♦ పర్మిట్రూం కోసం అదనంగా ఏడాదికి రూ.5లక్షలు చెల్లించాలి. వాకిన్‌స్టోర్ కావాలంటే మరో రూ.5లక్షలు చెల్లించాలి. ♦ జీహెచ్ఎంసీ, పరిసర ప్రాంతాల్లోని షాపులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, ఇతర ప్రాంతాల్లోని షాపులు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు విక్రయాలు జరుపుకోవచ్చు. మద్యం బాటిల్ లేబుల్‌పై ఉన్న ధరకు మాత్రమే విక్రయించాలి. ప్రతి షాపులో మూడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. దరఖాస్తు ప్రక్రియ ద్వారా కేటాయింపబడని షాపులకు మళ్లీ టెండర్లు పిలవాలా లేక అవుట్లెట్లు ఏర్పాటు చేయాలా అనే దానిపై ఎక్సైజ్ కమిషనర్ నిర్ణయం తీసుకుంటారు. -
ప్రభుత్వాస్పత్రుల్లో కార్పొరేట్‌కు మించి సౌకర్యాలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): కార్పొరేట్ ఆస్పత్రుల్లో కూడా లేని అత్యాధునిక వైద్య సదుపాయాలను ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులోకి తెస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని వెల్లడించారు. విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలోని మాతా శిశు విభాగంలో రూ.5.53 కోట్లతో ఏర్పాటు చేసిన నవజాత శిశు వైద్య విభాగాలు ఎస్ఎన్సీయూ(స్పెషల్ న్యూ బోర్న్ కేర్ యూనిట్), ఎన్ఐసీయూ (నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్)లను గురువారం మంత్రి ప్రారంభించారు. ప్రసూతి విభాగంలో ఇప్పటికే 250 పడకలు అందుబాటులో ఉండగా.. అదనంగా 40 పడకలను నవజాత శిశు వైద్యం కోసం అందుబాటులోకి తెచ్చినట్టు మంత్రి తెలిపారు. తక్కువ బరువు, కామెర్లు వంటి అనారోగ్య కారణాలతో అప్పుడే పుట్టిన శిశువులకు అత్యవసర విభాగ అవసరాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం రూ.5.53 కోట్లతో ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 61 ఎస్ఎన్సీయూలు, ఎన్ఐసీయూలు అందుబాటులో ఉన్నాయని, వాటికి అదనంగా రూ.31.51 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా మరో 12 అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఇక్కడి ఎంసీహెచ్ బ్లాక్ నిర్మాణ పనులను సైతం త్వరలో ప్రారంభిస్తామని రజిని తెలిపారు. కాగా, రాజీవ్‌నగర్‌లోని ఆస్పత్రిని 50 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయాలని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు, వైఎస్సార్ సీపీ తూర్పు ఇన్చార్జి దేవినేని అవినాశ్, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్ తదితరులు పాల్గొన్నారు. -
బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి.. చివరకు..
పాట్నా: బిహార్‌లో బోరుబావిలో పడిన చిన్నారిని అధికారులు ఎట్టకేలకు సురక్షితంగా బయటకు తీశారు. కొన్ని గంటలపాటు తీవ్రంగా శ్రమించి బాలుని ప్రాణాలను కాపాడారు. నలంద జిల్లాలోని కులు గ్రామంలో ఈ రోజు మూడేళ్ల చిన్నారి ఆడుకుంటూ 40 అడుగుల బోరుబావిలో పడిపోయాడు. చిన్నారిని బయటకు తీయడానికి విపత్తు నిర్వహణ శాఖ(ఎన్డీఆర్ఎఫ్) సిబ్బంది సహాయక చర్యలను చేపట్టింది. బాలున్ని శివమ్ కుమార్‌గా గుర్తించారు. గ్రామ సమీపంలో ఓ రైతు బోరు బావి తవ్వి, అక్కడ నీరు పడకపోవడంతో దానిని పూడ్చకుండా అలాగే వదిలేశాడు. అక్కడే బాలున్ని తల్లి పొలంలో పనిచేస్తుండగా.. సమీపంలో ఆడుకుంటున్న బాలుడు అకస్మాత్తుగా బావిలో పడిపోయాడు. దీంతో అప్రమత్తమైన గ్రామస్థులు సమాచారాన్ని పోలీసులకు అందించారు. సహాయక చర్యలు చేపట్టినట్లు నలంద నగర పంచాయతీ అధ్యక్షుడు నలిన్ మౌర్య తెలిపాడు. సమాచారం అందించిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నామని అధికారి శంభు మండల్ తెలిపారు. బాబు ఏడుపు శబ్దం తమకు వినిపిస్తున్నట్లు వెల్లడించారు. జేసీబీ మెషిన్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టామని తెలిపారు. ఆక్సిజన్ సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఇదీ చదవండి: సినిమా రేంజ్లో.. దంపతుల పక్కా స్కెచ్.. టమాటా లారీ హైజాక్.. -
‘పెళ్లిళ్లే నా ఆరోగ్య రహస్యం’.. ఐదో పెళ్లి చేసుకున్న 90 ఏళ్ల వరుని స్టేట్మెంట్
సౌదీ అరబ్ మీడియాలో 90 ఏళ్ల వృద్ధుని వివాహం హెడ్‌లైన్స్‌లో నిలిచింది. ఈ 90 ఏళ్ల వృద్ధుడు తాజాగా ఐదవ వివాహం చేసుకుని, సౌదీ అరబ్‌లో అత్యధిక వయసు కలిగిన వరునిగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆ వృద్ధుడు తన ఐదవ భార్యతో హనీమూన్ ఎంజాయ్ చేస్తూ, భవిష్యత్‌లోనూ ఇలానే మరిన్ని పెళ్లిళ్ఘు చేసుకుంటానని చెబుతున్నాడు. గల్ఫ్‌న్యూస్‌కు చెందిన ఒక రిపోర్టు ప్రకారం నాదిర్ బిన్ దహైమ్ వాహక్ అల్ ముర్షీదీ అల్ ఓతాబీ తాజాగా సౌదీలోని అఫీస్ ప్రాంతంలో తన ఐదవ వివాహం చేసుకున్నాడు. సోషల్ మీడియాలో ఈ వృద్ధ పెళ్లికొడుకుకు సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో అతిథుల ఆ వృద్ధ వరునికి ఐదవపెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆ వృద్ధ వరుడు అపరిమితమైన ఆనందంతో ఉప్పొంగిపోతూ కనిపిస్తున్నాడు. ఈ వీడియోలో ఒక మనుమడు తన తాతకు వివాహ శుభాకాంక్షలు తెలియజేయడం కనిపిస్తుంది. సౌదీకి చెందిన ఈ వృద్ధ పెళ్లికొడుకు అరేబియా టీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ అవివాహితులంతా తప్పకుండా వివాహం చేసుకోవాలనే సందేశాన్నిచ్చాడు. ఈ పెళ్లి తరువాత కూడా మరో పెళ్లి చేసుకుంటానని అన్నాడు. వైవాహిక జీవితం ఎంతో శక్తివంతమైనదని, పెళ్లి చేసుకోవడంవలన జీవితంలో ప్రశాంతత దొరుకుతుందని అన్నారు. తన దీర్ఘాయుష్షకు కారణం తాను చేసుకున్న పెళ్లిళ్లేనని తెలిపాడు. 90 برس کی عمر میں پانچویں شادی رچانے والے معمر ترین سعودی دلہا نے کنوارے نوجوانوں کا کیا مشورہ دیے، ویڈیو دیکھیےhttps://t.co/laYvvZpxUy pic.twitter.com/da0hb4WE3w — العربیہ اردو (@AlArabiya_Ur) July 13, 2023 ఇది కూడా చదవండి: ప్రియునితో ఉండగా పిన్నికి దొరికిపోయింది.. కంగారులో బ్రిడ్జిపై నుంచి దూకేసి.. -
వేలానికి 121 ఏళ్ల క్యాడ్బరీ చాక్లెట్.. నాటి తీయని వేడుకకు గుర్తుగా..
121 ఏళ్ల పురాతన క్యాడ్బరీ చాక్లెట్ వేలానికి వెళుతోంది. చాలామందికి క్యాడ్బరీ కంపెనీ చాలా పురాతనమైనదనే విషయం తెలియదు. 1902లో ఒక చిన్నారికి స్కూలులో ఈ క్యాడ్బరీ చాక్లెట్ ఇవ్వగా, ఆమె జాగ్రత్తగా దానిని దాచిపెట్టుకుంది. విశేష సమయాల కోసం ప్రత్యేకంగా.. వివరాల్లోకి వెళితే 1902లో ఇంగ్లండ్ కింగ్ ఎడ్వర్డ్-VII, క్వీన్ అలగ్జాండ్రాల పట్టాభిషేకం సందర్భంగా ఈ ప్రత్యేకమైన చాక్లెట్ తయారుచేశారు. నాటి రోజుల్లో ఇంత ఖరీదైన చాక్లెట్లు పిల్లలకు అంత సులభంగా లభించేవికాదు. నాటి రోజుల్లో చదువుకుంటున్న 9 ఏళ్ల మేరీ ఎన్ బ్లాక్మోర్కి లభ్యమైన ఈ చాక్లెట్‌ను తినకుండా, మహారాజుల పట్టాభిషేకానికి గుర్తుగా జాగ్రత్తగా దాచుకుంది. దశాబ్దాల తరబడి ఆ కుటుంబం దగ్గరే.. ఈ వెనీలా చాక్లెట్ మేరీ కుటుంబం దగ్గర కొన్ని దశాబ్ధాలుగా భద్రంగా ఉంది. అయితే ఇప్పుడు మేరీ మనుమరాలు దీనిని వేలం వేసేందుకు నిర్ణయించుకున్నారు. మేరీ మనుమరాలు జీన్ థమ్సన్కు ఇప్పుడు 72 సంవత్సరాలు. జీన్ ఈ చాక్లెట్‌ను తీసుకుని హెన్సన్‌కు చెందిన వేలందారుల దగ్గరకు వెళ్లినప్పుడు వారు ఈ చాక్లెట్ అస్తిత్వాన్ని పరిశీలించారు. ‘చాక్లెట్‌ను చిన్నారి తాకనైనా లేదు’ హెన్సన్ వేలందారులలో సభ్యుడైన మార్వెన్ ఫెయర్లీ మాట్లాడుతూ ‘ఆ సమయంలో ఇది ఎంతో అమూల్యమైన కానుక. ఈ చాక్లెట్ చిన్నారులకు అంత సులభంగా లభ్యమయ్యేది కాదు. ఇది ఎంతో ప్రత్యేకమైనది కావడంతోనే నాడు ఆ చిన్నారి కనీసం తాకకుండా కూడా భద్రపరిచింది’ అని అన్నారు. కాగా ఈ చాక్లెట్ డబ్బాపై కింగ్, క్వీన్ల చిత్రాలు ముద్రితమై ఉన్నాయి. వేలంలో లభించనున్న అత్యధిక మొత్తం ఈ చాక్లెట్ వేలం హెన్సన్లో జరగనుంది. వేలంలో దీని ధర కనీసంగా £100 నుంచి £150 (సుమారు రూ. 16 వేలు)వరకూ పలకనుందని అంచనా. ఇంతకు మంచిన ధర కూడా పలకవచ్చని, ఎందుకంటే ఒక్కోసారి చాలామంది చారిత్రాత్మక వస్తువులకు అధ్యధిక విలువ ఇస్తుంటారని మార్వెన్ ఫెయర్లీ పేర్కొన్నారు. డబ్బా తెరవగానే సువాసనలు రాజ కుటుంబానికి చెందిన పురాతన వస్తువులపై అందరికీ అమితమైన ఆసక్తి ఉంటుంది. ఈ 121 ఏళ్ల పురాతన చాక్లెట్ ఎప్పుడో ఎక్స్పైర్ అయిపోయింది. తినేందుకు ఏమాత్రం యోగ్యమైనది కాదు. దీనిని ఎవరూ తినలేరు కూడా. అయినా ఈ టిన్ తెరవగానే సువాసనలు వస్తున్నాయని ఫెయర్లీ తెలిపారు. ఇది కూడా చదవండి: సరస్సును ఖాళీ చేయిస్తారట.. ఎందుకుంటే.. -
నాటి మొఘల్ చిత్రాలతో నేటి వరదల ఢిల్లీకి పోలిక.. ఫొటోలు వైరల్..
ఢిల్లీ: దేశ రాజధానిలో వరదలు విజృంభించాయి. యమునా నది చరిత్రలో ఎన్నడూ లేనంతగా రికార్డ్ స్థాయిలో ఉప్పొంగింది. ఢిల్లీ ప్రధాన మార్గాలపైకి వరద నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాలన్నీ నదిలో మునిగిపోయాయి. చారిత్రక కట్టడాలైన ఎర్రకోట, సుప్రీంకోర్టుకు కూడా వరద నీరు వచ్చి చేరింది. ఇంతకూ ఇంతటి పెను ప్రళయం ఎందుకని? ఎత్తైన ప్రాంతాలన్నింటినీ నదే ఆక్రమించిందా? లేక నది భాగాన్నే మనం ఆక్రమిస్తే.. ఈ విపత్తు సంభవించిందా? 'నీరు పల్లమెరుగు' అని అంటారు పెద్దలు.. లోతట్టు ప్రాంతాల నుంచి నీరు ప్రవహిస్తుందని అర్ధం. ఆ నీటి మార్గాన్నే మనం నది అంటున్నాం. మరి నది తన మార్గం మరవదు కదా..! అంటే మనమే దాని మార్గాన్ని ఆక్రమించామని చెప్పకనే అర్థమవుతోంది. అయితే.. ఓ ట్విట్టర్ యూజర్ మొఘల్ కాలం నాటి పిక్చర్స్‌ను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఆనాటి ఫొటోల్లో యమునా నది రెడ్ ఫోర్ట్ వెనక గోడలను ఆనుకుని ప్రవహిస్తున్నట్లు ఉంది. ఆనాటి పిక్చర్స్‌లో కనిపించినట్లే.. నేడు వరదలతో కూడిన ఢిల్లీలో దృశ్యాలు ఒకేలా ఉన్నాయంటూ ఆ నెటిజన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. శతాబ్ధాలు మరిచినా.. నది మరువునా తన మార్గం అంటూ కామెంట్ పెట్టాడు. A river never forgets! Even after decades and centuries pass, the river would come back to recapture its borders. Yamuna reclaims it's floodplain. #Yamuna #DelhiFloods pic.twitter.com/VGjkvcW3yg — Harsh Vats (@HarshVatsa7) July 13, 2023 ఇదీ చదవండి: Delhi Floods: రికార్డులు బ్రేక్ చేసిన యమున.. ఎర్రకోటను తాకిన వరద నీరు 'ప్రకృతి ఎప్పుడు తన ధర్మాన్ని మరవదు. తనదైన విషయాన్ని దేన్ని వదలదు. అంతటిని మళ్లీ కలిపేసుకుంటుంది' అని అర్థం వచ్చేలా మరో ట్విట్టర్ యూజర్ తన కామెంట్లో పేర్కొన్నాడు. దశాబ్దాలు గడిచినా యమునా నది తన మార్గాన్ని మరవలేదంటూ మరికొందరు స్పందించారు. మనం నది మార్గాన్ని ఆక్రమించుకున్నప్పటికీ బలీమైన శక్తితో అది తన మార్గాన్ని మళ్లీ తీసుకుంటుందని మరో వ్యక్తి కామెంట్ చేశారు. Nature always comes back to reclaim it's course....#DelhiFloods2023 #Yamuna #RedFort pic.twitter.com/woEieUoyaN — Rohit Sharma (@rohitzsharmaz) July 14, 2023 ప్రస్తుతం వరదలతో యమునా నది ప్రవాహం 45 ఏళ్ల నాటి రికార్డులను బ్రేక్ చేసింది. 207.49 మీటర్లకు చేరి ఢిల్లీని ముంచెత్తే ప్రయత్నమే జరిగింది. ఢిల్లీలో ప్రధాని భాగాలైన మహాత్మా గాంధీ రాజ్‌ఘాట్, దేశ రాజధాని నడిబొడ్డున ఉన్న సుప్రీంకోర్టు వరకు యమునా వరద నీరు వచ్చి చేరిందంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కాలనీలన్నీ జలమయమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్థమైంది. త్రాగునీరు వ్యవస్థలు దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చివరికి దేశ సైన్యం ఎంట్రీ ఇచ్చే స్థాయికి పరిస్థితి చేరింది. Unforgettable is the river's resilience! Through the passage of time, spanning decades and centuries, the Yamuna returns to reclaim its floodplain, reminding us of its unyielding power. #Yamuna #DelhiFloods pic.twitter.com/TDJZ4CAqWK — Randhir Singh 🇮🇳 (@randhirs) July 13, 2023 ఇదీ చదవండి: Delhi Floods Highlights: ఇంకా జల దిగ్బంధంలోనే ఢిల్లీ -
ఆ వందేళ్ల అనకొండకు సెలవులిచ్చి, ఎందుకు పంపిస్తున్నారంటే..
అనకొండ.. ఈ పేరు వినగానే మన మదిలో మనుషులను మింగివేసే అత్యంత భారీకాయం కలిగిన పాము కనిపిస్తుంది. దీనిని మనం తొలిసారి హాలీవుడ్ సినిమా ‘అనకొండ’లో చూసివుంటాం. అయితే మనం ఆ సినిమాలో చూసినది యానిమేషన్ అనకొండ. అయితే ఇప్పుడు మనం అలాంటి నిజమైన అనకొండ గురించి తెలుసుకోబోతున్నాం. వందేళ్ల వయసుగల ఆ అనకొండకు ఇప్పుడు సెలవులిచ్చి వేరే ప్రాంతానికి పంపిస్తున్నారు. ఆ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అనకొండ ఎక్కడుందంటే.. ఈ అతిపెద్ద అనకొండ జర్మనీకి చెందిన ఫ్రాంక్‌ఫర్ట్‌లోని సెన్కెన్బర్గ్స్ నేచురల్ హిస్టరీ మ్యూజియంలో ఉంది. వందేళ్ల చరిత్ర కలిగిన ఈ మ్యూజియంలో ఒక అనకొండ కాపిబారా(జంతువు)ను మింగేస్తూ కనిపిస్తుంది. దానిని చూడగానే అది నిజమేనని అనిపిస్తుంది. మ్యూజియంలో మరమ్మతు పనులు జరుగుతున్నందున ఈ అనకొండకు కొంతకాలం సెలవులిచ్చారు. దానిని వేరే ప్రాంతానికి తరలిస్తున్నారు. An exhibit of an anaconda devouring a capybara at the Senckenberg Natural History Museum in Frankfurt is undergoing restoration. Taxidermists say climate change is one of the reasons why it needs a makeover pic.twitter.com/KM1LataPZL — Reuters (@Reuters) July 6, 2023 ఈ మ్యూజియంలో ఇంకా ఏమి ఉన్నాయంటే.. ఈ మ్యూజియంలో ఈ అనకొండ మాత్రమే కాదు, వివిధ రకాల జీవుల శిలాజాలు కనిపిస్తాయి. అలాగే ఈ మ్యూజియంలో రకరకాల డైనోసార్లు కూడా ఉన్నాయి. We will be next. #ExtinctionRebellion #DieIn under dinosaurs at the @Senckenberg Natural History Museum in #Frankfurt, during the #MuseumsNight #ndmffm. @ExtinctionR @ExtinctionR_DE pic.twitter.com/jIlP4MOzJ8 — JuliaKrohmer (@JuliaKrohmer) May 12, 2019 అనకొండలో రకాలివే.. అనకొండ ప్రధానంగా నాలుగు రకాలు. ఇందులో గ్రీన్ అనకొండ, బొలీవియన్ అనకొండ, డార్క్ స్పాటెడ్ అనకొండ ఎల్లో అనకొండ ప్రముఖమైనవి. వీటిలో గ్రీన్ అనకొండలు అతిపెద్దవి. పరిమాణంలో ఎంతో బరువైనవి. గ్రీన్ అనకొండలు ప్రధానంగా దక్షిణ అమెరికా ఖండం బ్రెజిల్, ఈక్వెడార్, పెరూ, కొలంబియా, వెనిజులా, సురినామ్, గయానా దేశాలలో కనిపిస్తాయి. మగ, ఆడ అనకొండల పొడవు విషయానికి వస్తే ఆడ అనకొండ.. మగ అనకొండ కంటే పొడవుగా ఉంటుంది. @jsnell @imyke my thought when you spoke of the snail and the pig on Upgrade. My favorite exhibit as a kid in the natural history museum in Frankfurt pic.twitter.com/TkhOGYLGJZ — Jenni Brehm (@Pfenya) May 13, 2018 ఇది కూడా చదవండి: శరవేగంగా రామాలయ నిర్మాణ పనులు.. -
పాత సామాన్లు కొంటాం..! పనిచేయని ఫోన్లు, పరికరాలు కొంటున్న ఫ్లిప్‌కార్ట్..
పనిచేయని పాత స్మార్ట్ఫోన్లు, ఫీచర్ ఫోన్లు, టీవీలు, ఫ్రిజ్‌లు, ఎయిర్‌కూలర్లు తదితర గృహోపకరణాలను ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేస్తోంది. ఎక్స్ఛేంజ్ ద్వారా పాతవి ఇచ్చి కొత్త ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. ఇందు కోసం హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రవేశపెట్టింది . ఎలక్ట్రానిక్ వ్యర్థాలను (ఈ-వేస్ట్) తగ్గించడంతోపాటు పనికిరాని ఉపకరణాలను డిస్పోజ్ చేయడంలో కస్టమర్లు ఎదుర్కొనే సవాళ్లను పరిష్కరించడం లక్ష్యంగా ఫ్లిప్‌కార్ట్ ఈ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది. అధీకృత విక్రేతలతో భాగస్వామ్యం ద్వారా రీఫర్బిష్మెంట్, రీసైక్లింగ్ లేదా సరైన డిస్పొజల్ ద్వారా ఈ-వ్యర్థాల సంస్కరణ బాధ్యతను ఫ్లిప్‌కార్ట్ చేపట్టింది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్న దేశంగా ఉన్న భారత్ ఉన్న నేపథ్యంలో ఈ పరిస్థితిని మార్చాల్సిన ఆవశ్యకతను గుర్తించి ఈ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టినట్లు ఫ్టిప్‌కార్ట్ చెబుతోంది. ఈ ప్రోగ్రామ్ ఆకర్షణీయమైన బైబ్యాక్ ఆఫర్లు, పని చేయని ఉపకరణాలను ఇంటి వద్దకే వచ్చి పికప్ చేసుకోవడం, హ్యాండ్-ఇన్-హ్యాండ్ ఎక్స్ఛేంజ్ ద్వారా కొత్త ఉత్పత్తులను అందిస్తుంది. డేటా తొలగింపు ఈ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అదనంగా పాత మొబైల్ ఫోన్లు, స్మార్ట్ఫోన్లు, ఫీచర్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను రీఫర్బిష్ లేదా డిస్పోజ్ చేయడానికి ముందు వాటిలోని డేటా తొలగింపుపై ప్రత్యేక దృష్టి పెడుతుంది. సమర్థవంతమైన సాంకేతిక ప్రక్రియలు, విస్తృతమైన లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌తో ఒకే సారి కస్టమర్లకు అవాంతరాలు లేని సేవలను ఫ్లిప్‌కార్ట్ అందిస్తుంది. దీనిపై ఫ్లిప్‌కార్ట్ రీ-కామర్స్ సీనియర్ డైరెక్టర్, బిజినెస్ హెడ్ అశుతోష్ సింగ్ చందేల్ మాట్లాడుతూ.. కొత్త ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ ద్వారా కస్టమర్లు తమ వద్ద ఉన్న పని చేయని ఎలక్ట్రానిక్, ఇతర ఉపకరణాలను ఇచ్చి కొత్త ఉత్పత్తులు కొనుక్కునేలా వినూత్నమైన, సౌకర్యవంతమైన పరిష్కారాన్ని అందించాలనుకుంటున్నట్లు తెలిపారు. దీనివల్ల కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఇదీ చదవండి: కొత్త కొత్తగా.. మోటో జీ32 స్మార్ట్‌ఫోన్ కొత్త వేరియంట్లు -
బైకు తెచ్చిన భారీ లాభం.. పాత బైక్‌కు రూ.3 కోట్లు!
హాలీవుడ్ సినిమా ‘ఘోస్ట్ రైడర్’లో హీరో కంటే, ఆ హీరో నడిపిన మోటర్ బైక్ బాగా పాపులర్ అయింది. అలా సామాన్యులకు కూడా స్పోర్ట్స్ బైక్స్‌పై ఆసక్తిని పెంచింది ఆ సినిమా. అయితే, స్వతహాగానే చాలామంది అబ్బాయిలకు మోటర్‌బైక్స్, కారులంటే చాలా పిచ్చి. అలాంటి ఓ పిచ్చితోనే యూకేకు చెందిన వాకర్స్, 1973లోనే 150 పౌండ్లు (రూ. 16 వేలు) ఖర్చు పెట్టి 1931 నాటి రోల్స్‌రాయ్స్ కంపెనీ తయారు చేసిన ‘బ్రౌ సుపీరియర్ ఎస్ఎస్100’ మోడల్ బైక్ కొనుగోలు చేశాడు. ఈ మోటర్ బైక్ గరిష్ఠంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి సూపర్‌బైక్. దాదాపు ఇరవై సంవత్సరాలు సంతోషంగా ఈ సూపర్‌బైక్‌ను నడిపిన వాకర్స్.. తర్వాత కారు కొని, బైకును మూడు దశాబ్దాలకుపైగా గ్యారేజ్‌కే పరిమితం చేశాడు. ప్రస్తుత ఆర్థిక ఇబ్బందుల కారణంగా తనకెంతో ఇష్టమైన ఈ సూపర్బైకును వేలానికి ఉంచడంతో కళ్లుచెదిరే ధర పలికింది. ఫ్రాన్స్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ సూపర్‌బైక్‌ను 2.80 లక్షల పౌండ్లు (రూ.3 కోట్లు) చెల్లించి కొనుగోలు చేశాడు. అంటే రెండు వేల రెట్ల లాభం. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యాభై ఏళ్ల తర్వాత కూడా ఈ మోటర్‌బైకు మంచి కండిషన్లోనే ఉండటం. ఇక వచ్చిన డబ్బును తన కాలి శస్త్రచికిత్సకు ఉపయోగిస్తానని వాకర్స్ చెప్పాడు. -
అత్యంత అందమైన టాప్ 10 రోమన్ యాంఫీథియేటర్స్
-
బ్రిటిషర్లు, మొఘల్ చక్రవర్తులకే అప్పు.. నాటి సంపన్న భారతీయ వ్యాపారి..
స్వాతంత్య్రానికి పూర్వం నుంచే చరిత్రలో భారతీయులు అనేక విషయాల్లో కేంద్ర బిందువులుగా నిలిచారు. అలాగే వ్యాపారంలోనూ చరుకైన పాత్ర పోషించిన భారతీయులు ఉన్నారు. విర్జీ వోరా మొఘల్ పాలనలో పెద్ద పేరున్న వ్యాపారవేత్త. ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్తగా ఆయనను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గుర్తించింది. ఈస్ట్ ఇండియా కంపెనీకి ఫైనాన్షియర్ చరిత్రకారుల ప్రకారం.. విర్జీ వోరా 1617 - 1670 మధ్య కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి పెద్ద ఫైనాన్షియర్. 1590లో జన్మించిన విర్జీ వోరా 1670లో మృతి చెందారు. హోల్‌సేల్ వ్యాపారి అయిన ఆయన వ్యక్తిగత సంపద అప్పట్లో సుమారు రూ. 80 లక్షలు. అంటే ఇప్పట్లో అది కొన్ని లక్షల కోట్లకు సమానం. ఆ మేరకు ఆయన ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్త అని అర్థం చేసుకోవచ్చు. చారిత్రక పత్రికల ప్రకారం.. విర్జీ వోరా మిరియాలు, బంగారం, ఏలకులు, ఇతర సుగంధ ద్రవ్యాల వ్యాపారం నిర్వహించేవారు. 1629 - 1668 మధ్య కాలంలో బ్రిటీష్ వారితో అనేక విధాలుగా వ్యాపార సంబంధాలు నెరిపిన విర్జీ వోరా తన వ్యాపార సామ్రాజ్యాన్ని పటిష్టంగా నిర్మించుకున్నారు. అప్పట్లో అన్ని వ్యాపారాల్లో విర్జీ వోరాదే ఏకైక గుత్తాధిపత్యం. ఉత్పత్తుల మొత్తం స్టాక్‌ను కొనుగోలు చేసి వాటిని భారీ లాభంతో విక్రయించేవాడు. షాజహాన్‌కు అరబ్ గుర్రాలు విర్జీ వోరా వడ్డీ వ్యాపారి కూడా. సొంతంగా వ్యాపారాలు పెట్టుకునే బ్రిటిష్‌వారికి ఆయన డబ్బు అప్పుగా ఇచ్చేవారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ భారతదేశంలోని దక్కన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో యుద్ధం కారణంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు డబ్బు కోసం విర్జీ వోరాను ఆశ్రయించినట్లు చెబుతారు. విర్జీ వోరా మొఘల్ రాజు షాజహాన్‌కు నాలుగు అరబ్ గుర్రాలను బహుమతిగా ఇచ్చాడని కూడా చరిత్రకారులు పేర్కొంటారు. -
టాప్ ఇండియన్ సెలబ్రిటీస్ ఏజ్డ్ ఇమేజెస్
-
74 ఏళ్ల వయసులో రియల్ఎస్టేట్ ఏజెంట్! పరీక్ష రాసి మరీ..
Oldest Real Estate Agent: వయసు శరీరానికే కానీ ఉత్సాహానికి కాదు.. వృద్ధాప్యం దేహానికే కానీ నిరంతరం పనిచేసే తత్వానికి కాదు.. అని నిరూపిస్తున్నారు ముంబైకి చెందిన ఓ రియల్ ఎస్టేట్ ఏజెంట్. ముంబైలోని ములుండ్ మైక్రో-మార్కెట్ ప్రాంతానికి చెందిన ఎస్ఎం మాల్డే. ఓల్డెస్ట్ రియల్ ఎస్టేట్ ఏజెంట్. మే 20న మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (మహారేరా) నిర్వహించిన యోగ్యత పరీక్షలో 74 ఏళ్ల వయసులో ఉత్తీర్ణులయ్యారు. 75 శాతం మార్కులు సాధించారు. మాల్డే నాలుగు దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఈ వయసులో పరీక్ష ఎందుకు? ఈ వయసులో మాల్డే పరీక్ష ఎందుకు రాశారో మనీ కంట్రోల్ వార్తా సంస్థకు తెలియజేశారు. తాను పరీక్ష రాయడానికి కారణాలు కేవలం రెండే రెండు. ఒకటి ఈ పరీక్ష ఉత్తీర్ణులైనవారికి అధీకృత రియల్ ఎస్టేట్ ఏజెంట్లుగా గుర్తిస్తుంది. రెండోది మరికొన్ని ఏళ్లపాటు రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పనిచేయాలనేది. తాను ఇన్నేళ్లుగా రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పనిచేస్తున్న తనకు అధీకృత గుర్తింపు లేదని, ఈ పరీక్ష ఉత్తీర్ణుడయ్యాక ఇప్పుడు తనకు గుర్తింపు లభిస్తుందని మాల్డే చెబుతున్నారు. మహారేరా మొదటి బ్యాచ్ పరీక్షకు మాల్డే హాజరయ్యారు. దీని ఫలితాలు ఇటీవలే విడుదలయ్యాయి. అప్పుడు కొంత అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న తాను కోలుకుని మళ్లీ తన వృత్తిలోకి వచ్చేశానని, మంచి ఇల్లు కొనాలనుకునేవారికి మంచి సలహాలు, సూచనల ద్వారా సహాయం అందిస్తుంటానని మాల్డే పేర్కొన్నారు. తనకు వ్యాపారం అన్నది ప్రాధాన్యం కాదని, కొనుగోలుదారులకు సరైన గైడెన్స్ ఇవ్వాలన్నది తన ప్రథమ సంకల్పమని వివరించారు. అందుకు తనకు ముంబై ప్రాంతంలో మంచి పేరు ఉందని చెప్పారు. చిన్న గది నుంచి ప్రీమియం అపార్ట్మెంట్ వరకు.. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ వృత్తిలో తన ప్రయాణం గురించి మాల్డే మాట్లాడుతూ.. తాను ఒక చిన్న గదిలో నివసించానని, ఈ రోజు ములుండ్ ప్రాంతంలో ప్రీమియం అపార్ట్మెంట్లో ఉంటున్నానని గర్వంగా చెప్పారు. 750 చదరపు అడుగుల కార్పెట్‌తో కూడిన 2 బీహెచ్‌కే అపార్ట్మెంట్ అది. తనకు గుర్తింపుతోపాటు అన్ని ఇచ్చిన తన వృత్తికి ధన్యవాదాలు చెబుతున్నారు. కాగా మాల్డే కుమార్తె యూకేలో ఉంటున్నారు. తన 40 ఏళ్ల రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ కెరీర్లో మాల్డే ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్లో 20,000కుపైగా లావాదేవీలు చేసుంటారు. ఇప్పటికీ నెలలో కనీసం మూడు లావాదేవీలను లక్ష్యంగా పెట్టుకున్నారాయన. వీటిలో ఒకటి తన కోసం, మరొకటి తన ఉద్యోగుల ఖర్చుల కోసం, మిగిలినది తన ఆఫీస్ నిర్వహణ ఖర్చుల కోసమని మాల్డే వివరించారు. కాగా మహారేరా మే 20 న నిర్వహించిన యోగ్యత పరీక్షకు హాజరైనవారిలో 95 శాతం ఉత్తీర్ణులయ్యారని మే 30న ప్రకటించింది. మొదటి బ్యాచ్ పరీక్షకు 423 మంది హాజరుకాగా 405 మంది ఉత్తీర్ణులయ్యారు. గృహ కొనుగోలుదారులు, డెవలపర్ల మధ్య వారిధిగా వ్యవహరించే రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఈ పరీక్ష తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిబంధన తీసుకొచ్చింది. ఆ రాష్ట్రంలో దాదాపు 39,000 మంది మహారేరా నమోదిత రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఉన్నారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి తమ రిజిస్ట్రేషన్‌ను వీరు పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. ఇదీ చదవండి ➦ పార్లమెంట్ నూతన భవనం: ఖర్చెంత.. కట్టిందెవరు? ఆసక్తికర విషయాలు.. -
విమర్శకుల నోళ్లు మూయించిన అప్పాజీ
కర్ణాటక ఎన్నికల్లో మంత్రులు సహా కీలక నేతలెందరో ఓటమితో భంగపడ్డ వేళ.. ఆ రేసు గుర్రం విక్టరీని దావణగెరె దక్షిణ నియోజకవర్గం ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. వయసైపోయింది.. ఇంకేం పోటీ చేస్తాడు? టికెట్ ఇచ్చినా గెలుస్తాడా? అంటూ విమర్శించిన వాళ్ల నోళ్లు మూయిస్తూ అధిష్టానం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుని మరీ గ్రాండ్ విక్టరీ సాధించారు 92 ఏళ్ల కాంగ్రెస్ నేత శామనూరు శివశంకరప్ప ఉరఫ్ అప్పాజీ. ఈ అసెంబ్లీ ఎన్నికల కోసం శివశంకరప్పకు కాంగ్రెస్ మరోసారి టికెట్ ఇచ్చినప్పుడు సొంత నేతలు తీవ్ర విమర్శలు చేశారు. దీంతో దీటుగా బదులిచ్చిన శివశంకరప్ప.. ‘‘నేను రేసు గుర్రాన్ని.. అందుకే కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చింది. భారీ మెజారిటీతో గెలుస్తా’’ అని శపథం చేశారు. మాటలతోనే కాదు.. ఇప్పుడు ఫలితాల్లో చేతల్లోనూ చూపించారు. దాదాపు 28 వేల ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు. 👉 శామనూరు శివశంకరప్ప 1994లో రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. అదే సంవత్సరంలో దావణగెరె నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999లో లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన.. 2004లో మరోసారి దావణగెరె నుంచి పోటీ చేసి గెలుపొందారు. 👉 2008 నుంచి దావణగెరె దక్షిణ నుంచి పోటీ చేస్తున్నారు. 2013, 2018, 2023లో వరుసగా గెలుపొందారు. మొత్తంగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 👉 ఈ దఫా ఎన్నికల్లో మళ్లీ బరిలోకి దిగి.. హుషారుగా ప్రచారంలో పాల్గొన్నారు. 👉 కర్ణాటక ఎన్నికల చరిత్రలోనే అత్యంత వృద్ధ అభ్యర్థిగా బరిలోకి దిగి శివశంకరప్ప మరోసారి జయకేతనం ఎగురవేశారు. 👉 దావణగెరె దక్షిణ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 👉 శివశంకరప్పకు 84,298 ఓట్లు రాగా, ఆయన సమీప బీజేపీ అభ్యర్థి అజయ్ కుమార్ కు 56,410 ఓట్లు పడ్డాయి. 👉 ఈ ఎన్నికల్లో శివశంకరప్పకు పోటీగా బీజేపీ అజయ్‌కుమార్‌ను నిలబెట్టింది. ఆ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న ముస్లింలతో అజయ్‌కుమార్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో బీజేపీ విజయం సాధించడం ఖాయమనుకున్నారు. కానీ దావణగెరె నియోజకవర్గ ప్రజలు తమ అప్పాజీకే గెలుపు కట్టబెట్టారు. -
బైడెన్ ఐదేళ్లలో చనిపోతారు.. రిప్లబికన్ అధ్యక్ష అభ్యర్థి సంచలన వ్యాఖ్యలు..
వాషింగ్టన్: వచ్చే ఏడాది జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరఫున నిక్కీ హేలీ బరిలో ఉన్నారు. అయితే ఫాక్స్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బెడైన్‌కు ఓటేస్తే ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ప్రెసిడెంట్ అవుతారని, ఎందుకంటే ఆయన ఐదేళ్లకు మించి బతకరని హేలీ అన్నారు. జో బైడెన్ ప్రస్తుత వయసు 80 ఏళ్లు దాటింది. హేలీ వయసు 51 ఏళ్లే. అందుకే ఎన్నికల ప్రచారంలో వయసునే ప్రధాన అస్త్రంగా మలుచుకుని ముందుకెళ్లాలని హేలీ భావిస్తున్నారు. వృద్ధులను ఎన్నుకునే ముందు ఆలోచించాలని అమెరికన్లను కోరుతున్నారు. సరిగ్గా ఆరోగ్యంగా లేని వారు అగ్రరాజ్యాన్ని ముందుకెలా నడిపిస్తారని ప్రశ్నిస్తున్నారు. 75 దాటి ఎన్నికల్లో పోటీ చేసేవారికి మానసిక సామర్థ్య పరీక్షలు నిర్వహించాలనే కొత్త డిమాండ్‌ను ఆమె తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం 80 ఏళ్లు దాటిన బైడెన్.. మరో ఐదేళ్లు ఆరోగ్యంగా ప్రాణాలతో ఉంటారని తనకు నమ్మకం లేదని హేలీ అన్నారు. మరోవైపు తాను మరోసారి డెమోక్రాట్ల తరఫున అధ్యక్ష బరిలో ఉంటున్నట్లు బైడెన్ మంగళవారమే అధికారికంగా ప్రకటించారు. తాను పూర్తి ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నానని స్పష్టం చేశారు. శ్వేతసౌధం కూడా బైడెన్ కోటు ధరించి జాగింగ్ చేస్తున్న ఫొటోలను షేర్ చేసింది. తీరిక లేకుండా ఆయన చేస్తున్న వివిధ పర్యటనల షెడ్యూల్‌ను కూడా వెల్లడించింది. దీంతో బైడెన్ తనకు ఎలాంటి ఆరోగ్య, మానసిక సమస్యలు లేవని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా రిపబ్లికన్లను ఓడించి బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. చదవండి: గ్రీన్‌కార్డులపై ‘కంట్రీ లిమిట్’ తొలగించండి -
కర్ణాటకలో ఆసక్తికరంగా పాత మైసూరు పోరు
-
పాఠాలతో పాటు క్రమశిక్షణ నేర్చుకున్నాను: మెగాస్టార్ చిరంజీవి
-
కొత్త సిరీస్ లాంచ్ తరువాత పాత సిరీస్‌కు ఆపిల్ గుడ్‌బై!
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం ఆపిల్ మరో సంచలన నిర్ణయం తీసుకోనుందిట. సెప్టెంబరు 7న నిర్వహించనున్న గ్లోబల్ ఈవెంట్ ఆపిల్ కొత్త మోడల్ సిరీస్ వాచెస్ లాంచ్ కాగానే పాత సిరీస్‌ను నిలిపివేయనుందని తెలుస్తోంది. ఆపిల్ వాచ్ సిరీస్ 3 మోడల్‌లు త్వరలో నిలిపియనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. సాఫ్ట్వేర్ అప్డేట్ కారణంగా మార్కెట్లో వీటి విక్రయాలను నిలిపివేయనుందట.రాబోయే watchOS 9 Apple Watch Series 3కి సపోర్ట్ చేయని కారణంగా ఆన్లైన్ స్టోర్‌లో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విక్రయించబడుతున్న ఆపిల్ వాచ్ సిరీస్ 3 మోడల్స్‌ను త్వరలో ఆపివేస్తుందని తాజా సమాచారం. ఈ నేపథ్యంలోనే అమెరికా,వాచ్ సిరీస్ 3 కాన్ఫిగరేషన్లలో మూడు ప్రస్తుతం యూకే ఆస్ట్రేలియాలో స్టాక్‌లో లేవనీ, అమెరికా స్టోర్‌లో సిరీస్ 3 మోడల్ అందుబాటులో లేవని MacRumors రిపోర్ట్ చేసింది. 2017లో ఆపిల్ వాచ్ సిరీస్ 3ను లాంచ్ చేసింది. కాగా కరోనా మహమ్మారి రెండేళ్ల తరువాత యుఎస్‌లోని ఆపిల్ కుపెర్టినో క్యాంపస్‌లో మెగా ఈవెంట్ నిర్వహించనుంది. ఇందులో నాలుగు ఐఫోన్ 14 మోడల్స్‌తోపాటు, వాచెస్, ఇతర ప్రొడక్ట్స్‌ను తీసుకొస్తోందని అంచనా. ముఖ్యంగా వాచెస్ సిరీస్ 8, వాచ్ ప్రో, హై-ఎండ్ సిరీస్ 8 మోడల్, సెకండ్ జనరేషన్ ఆపిల్ వాచ్ ఎస్ఈని లాంచ్ చేయనుందని ఊహాగానాలున్నాయి. -
Draupadi Murmu: సంబురంగా చిందులేసిన ద్రౌపది ముర్ము!
వైరల్: ఎక్కడో ఒడిశాలో మారుమూల పల్లెలో పుట్టి కౌన్సిలర్ స్థాయి నుంచి.. ఇవాళ దేశ ప్రథమ పౌరురాలి స్థాయికి ఎదిగి.. తొలి గిరిజన రాష్ట్రపతిగా చరిత్ర సృష్టించారు ద్రౌపది ముర్ము(64). జులై 25న సర్వసత్తాక గణతంత్ర్య భారత్‌కు 15వ రాష్ట్రపతిగా ఆమె ప్రమాణం చేయబోతున్నారు. ఈ తరుణంలో.. ద్రౌపది ముర్ముకు సంబంధించిన అరుదైన ఫొటోలు, వీడియోలు కొన్ని వైరల్ అవుతున్నాయి. అందునా ఆమె హుషారుగా పాట పాడుతూ.. సరదాగా చిందులు (గిరిజన సంప్రదాయ నృత్యాలను చిందులనే వ్యవహరిస్తారు) వేసిన వీడియో ఒకటి కూడా విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. అయితే ఆ వీడియో ఆమె రాష్ట్రపతిగా ఎన్నికైనందుకు చేసింది కాదు. అసలు ఆ వీడియో ఈ మధ్యది కాదు. తన రాజకీయ ప్రస్థానంలో ప్రజానేతగా ఆమెకంటూ మంచి గుర్తింపు దక్కింది. 2018లో జార్ఖండ్ గవర్నర్‌గా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. ఆ సమయంలో ఆమె స్వగ్రామం నుంచి వెళ్లిన కొందరు మహిళలు.. రాంచీ రాజ్‌భవన్ ఎదుట గిరిజన సంప్రదాయ నృత్యాలు నిర్వహించారు. ఆ సందర్భంలో హుషారుగా ఆమె వాళ్లతో కలిసి చిందులేసి.. పాట పాడారు అంతే. ముర్ము స్వగ్రామం ఒడిశా మయూర్భంజ్ జిల్లా రాయ్‌రంగ్‌పూర్ ప్రజలు.. దీదీ అని ఆమెను ఆప్యాయంగా పిల్చుకుంటారు. అందుకే ఆమె ఏ పదవిలో ఉన్నా.. తమ ఊరికే గర్వకారణమని భావిస్తుంటారు. తాజాగా ఆమె రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచిన మరుక్షణమే ఆమె ఘన విజయాన్ని ఊరంతా సంబురంగా చేసుకుంది. ఇదీ చదవండి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీతం ఎంతో తెలుసా? -
పాత వీడియోతో.. వివాదంలో రిషి సునాక్!
లండన్: భారత సంతతికి చెందిన బ్రిటిష్ పొలిటీషియన్ రిషి సునాక్.. బ్రిటన్ ప్రధాని రేసులో ముందంజలో ఉన్నారు. పీపుల్స్ ఛాయిస్‌గా ఆయన పేరు ప్రధానంగా వినిపిస్తోంది అక్కడ . ఈ తరుణంలో.. ఆయనకు సంబంధించిన ఓ పాత వీడియో వైరల్ కావడమే కాదు.. విమర్శలకు తావు ఇస్తోంది. ఆయన చేసినవి వర్గీకరణ, వివక్షకు సంబంధించిన వ్యాఖ్యలు కావడమే విమర్శలకు ప్రధాన కారణం. కేవలం ఏడు సెకండ్ల నిడివి ఉన్న వీడియోనే హైలెట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు కొందరు. తనకు రాజకుటుంబానికి చెందిన వాళ్లు, ఉన్నత వర్గాలకు చెందిన వాళ్లే స్నేహితులుగా ఉన్నారని, వర్కింగ్ క్లాస్ నుంచి స్నేహితులెవరూ లేరంటూ చాలా క్యాజువల్‌గా సమాధానం ఇచ్చాడు రిషి సునాక్. 2001లో బీబీసీ డాక్యుమెంటరీ కోసం చేసిన ఇంటర్వ్యూలో రిషి సునాక్ పైవ్యాఖ్యలు చేశాడు. "I have friends who are aristocrats, friends who are upper class and friends who are working class....well not WORKING CLASS!" The 'People's Chancellor' in the making, 2001 🙄@PeterStefanovi2@campbellclaret@allthecitizens@reece_dinsdale pic.twitter.com/t372I9A9F8 — Kathryn Franklin (@DerbyDuck) March 27, 2022 ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండడంపై.. పీపుల్స్ ఛాన్స్లర్ ఇతనేనా? అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. శ్రమ జీవి వర్గాన్ని గౌరవించలేనివాడు ప్రధాని పదవికి ఎలా అర్హుడు అవుతాడంటూ నిలదీస్తున్నారు మరికొందరు. అయితే పనిమాలా కొందరు ఈ పని చేస్తుండడంతో.. రిషికి మద్దతుగా నిలుస్తున్న వాళ్లు కూడా లేకపోలేదు. ఇదిలా ఉంటే.. కన్జర్వేటివ్ పార్టీ తరపున రిచ్మండ్(యార్క్స్) పార్లమెంట్ సభ్యుడైన సునాక్ రిషి.. ఎక్స్‌చెకర్ ఛాన్స్లర్ పదవికి రాజీనామా సైతం చేశారు. దీంతో ప్రధాని రేసులో ఈయన పేరే ప్రముఖంగా ఉంది అక్కడ. -
కొన్న రేటు రూ. 500.. అమ్మింది ఏమో రూ. 16 లక్షలకు!!!
Wooden Chair Bought From Junk Shop Brings Luck For UK Lady: అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో తలుపు తడుతుందో తెలియదు. ‘టకాటకా’మని బాదినప్పుడే తలుపు తీయాలి. ఓ మహిళ అలా చేసింది కాబట్టే ఇంట కాసుల వర్షం కురిసింది. జంక్ షాపులో కొన్న ఓ పాత కుర్చీ ఆమె జీవితాన్నే మార్చేసింది. ఎలాగో ఇది చదవండి.. ఈస్ట్ సస్సెక్స్(యూకే) బ్రిగ్టన్కు చెందిన ఓ మహిళ.. పాత సామాన్లు అమ్మే ఓ షాపు నుంచి ఆమధ్య ఓ కుర్చీ కొనుక్కుంది. దాని ధర 5 పౌండ్లు(మన కరెన్సీలో 500రూ. దాకా). అయితే అప్పుడు దాని విలువ ఆమెకి తెలియదు. పాత సామాన్లపై ఆసక్తి ఉన్న ఓ దగ్గరి బంధువు ఆ కుర్చీ మీద వేసిన డేట్ చూశాడు. స్టడీ చేసి దాని గొప్పతనం గురించి చెప్పడంతో ఆమె దానిని వేలంపాటకు తీసుకెళ్లింది. వేలంలో ఆమెకు 16, 250 పౌండ్లు వచ్చాయి. మన కరెన్సీలో దాని విలువ రూ. 16 లక్షల 40 వేల రూపాయలకు పైనే. ఆ కుర్చీ 20వ శతాబ్దంలో వియన్నా(ఆస్ట్రియా) ఎవంట్ గార్డే ఆర్ట్ స్కూల్‌కి చెందిందట. ఆస్ట్రియన్ పెయింటర్ కోలోమన్ మోసర్ 1902లో దానిని డిజైన్ చేశాడట. కోలోమన్ సంప్రదాయ శైలిలను వ్యతిరేకిస్తూ.. మోడ్రన్ ఆర్ట్ వర్క్ ద్వారా ఆస్ట్రియాలో పేరు సంపాదించుకున్నారు. నిచ్చెన తరహా స్టైల్లో పట్టీలను ఉపయోగించి ఆ కుర్చీనీ రూపొందించారాయన. ఇదంతా తెలిశాక ఆ మహిళ ఆ పాత కుర్చీతో ఎస్సెక్స్‌లోని స్వోడర్స్ యాక్షనీర్స్ ఆఫ్ మౌంట్ఫిట్చెట్ వాళ్లను సంప్రదించింది. వాళ్లు దానిని వేలం వేయగా.. ఆస్ట్రియాకు చెందిన ఓ డీలర్ దానిని 16,250 పౌండ్లు చెల్లించి దక్కించుకున్నాడు. విశేషం ఏంటంటే.. 120 ఏళ్లు గడుస్తున్నా కుర్చీ ఇంకా ఒరిజినల్ కండిషన్లోనే ఉండడం. చదవండి: వాసి వాడి తస్సాదియ్యా! 23 ఏళ్లకే 400 కోట్ల సంపాదన! -
కొత్త సంవత్సరం వచ్చేసింది.. అయితే ఇలా చేయండి!
పాత భావాలు... పారేయము. అటక మీద పాత సరుకు.. పారేయము. పంచేయము. పాత బట్టలు, బూట్లు... పారేయము. పంచేయము. అవసరం లేని ఇంటిని ఆక్రమించిన చెడిపోయిన వస్తువులు? పారేయము. పంచేయము. కొత్తవి రావాలంటే పాతవి ఖాళీ చేయాలి. కొత్త సంవత్సరం వచ్చేసింది. పాతవి పారేయండి. లేదా అవసరం ఉన్నవారికి పంచేయండి.కొత్తకు దారివ్వండి. కొత్త సంవత్సరం వస్తుంటే కొత్త నిర్ణయాలు తీసుకోవాలనిపిస్తుంది. దానికి ముందు పాతవి పారేయాలి కదా. పాతను తీసేయాలి కదా. అక్కరలేని పాతవి అక్కర ఉన్నవారికి కనీసం పంచేయాలి కదా. ఆ పని చేయము. కొత్త సంవత్సరానికి రెడీ కావడం అంటే కొత్తగా రెడీ కావడమే. కొత్త సంవత్సరంలో తేలిగ్గా ప్రవేశించాలి. పాత లగేజ్‌తో కాదు. ఎన్ని ఉంటాయి పాతవి ఇళ్లల్లో. పేరబెట్టుకొని. అడ్డంగా. స్పేస్ ఆక్యుపై చేసి. ఇంట్లో ఏయే పాత వస్తువుల బరువు దించుకోవాలో చూద్దామా? ఆ భారీ పాత సోఫా మన ఇంటి సోఫా జన్మ సంవత్సరం ఏమోగాని దాని ఆయుష్షు తీరి చాలా రోజులై ఉంటుంది. కవర్లు మార్చి, చిరిగిన చోట ప్యాచ్ వేసి, కిరకిరమంటుంటే మానేజ్ చేస్తూ, చిల్లులు పడుంటే పైన బెడ్‌షీట్ వేస్తూ... డబ్బులు లేకపోతే సరే. ఉంటే కొత్త సోఫా తెచ్చుకోండి. ఇల్లు కొత్తదిగా కనిపించాలంటే మారే కాలంతో పాటు వచ్చే ఫర్నీచర్ తెచ్చుకోవాలి. ఖరీదైనదే అక్కర్లేదు. రోడ్‌సైడ్ కూడా మోడరన్ ఫర్నీచర్ దొరుకుతుంది. ఆ పాత సోఫాను వాచ్‌మన్‌కు ఇచ్చేయండి. దానిని పెన్నిధిగా భావించే ఏ కారు డ్రైవర్కో లేదంటే అవసరం ఉన్నవారికో ఇచ్చేయండి. ఇల్లు బరువు తగ్గుతుంది. కొత్త కళ వస్తుంది. పాత బట్టలు, పుస్తకాలు ప్రతి ఇంట్లో ఏవి ఉన్నా ఏవి లేకున్నా ఇవి ఇబ్బడి ముబ్బడిగా ఉంటాయి. భర్తవి, భార్యవి, పిల్లలవి మళ్లీ పొరపాటున వేసుకోరు అని తెలిసినా ఆ బట్టలను కూరి కూరి బీరువాలలో నింపి ఉంటారు. వాటిని ఈ చలికాలంలో పేదవారికి పంచేస్తే ఎంత గుండె తేలిక. ఇల్లు తేలిక. పిల్లలు స్కూలు పుస్తకాలు కూడా దాచి ఉంటారు. పాత క్లాసులవి ఎందుకు. ఎవరికైనా ఇచ్చేయొచ్చు. ఇంట్లో ఎప్పటెప్పటివో పుస్తకాలు ఉంటాయి. వాటిలో కొన్నే విలువైనవి. కొన్ని ఒకసారి చదివితే చాలనిపించేవి. ఆ ఒకసారి చదవదగ్గ పుస్తకాలను వేరేవాళ్లకు ఇచ్చేయాలి. హ్యాపీగా ఉంటుంది. షూ ర్యాక్ క్లీన్ చేయండి ప్రతి ఇంటి షూ ర్యాక్ పాత చెప్పులు, బూట్లు దుమ్ముపట్టి పోయి ఉంటాయి. వాటిని వాడేది లేదు. అలాగని పారేసేది లేదు. పిల్లల షూస్ కూడా ఉంటాయి. వాటిని పేద పిల్లలకు ఇచ్చేస్తే సంతోషంగా వేసుకుంటారు. చెప్పులు నిరుపేదలకు ఇచ్చేస్తే వేసుకుంటారు. పాతవి పోతే కొత్త చెప్పులు కొనుక్కోవచ్చు. ఈ న్యూ ఇయర్‌కి కొత్త చెప్పులు తొడుక్కోండి. అటక మీద ఉంటుంది రహస్యం అటక మీద తోసేస్తాం చాలా. పాత తపేలాలు, కీబోర్డులు, చెంబులు, కుర్చీలు, మిక్సీలు, గ్రైండర్లు... అవన్నీ ఎందుకు దాస్తామో తెలియదు. వాటిని ఎవరికైనా ఇస్తే సరి చేయించుకుని వాడుకుంటారు. లేదా పాత సామాన్లవాడికి వేస్తే మనకే కొద్దిగా చిల్లర వస్తుంది. అవి బూజుపట్టి వికారంగా కనిపిస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పరిపూర్ణంగా తిరుగాడదు. ఇంకా బాల్కనీల్లో అక్కర్లేని సామాన్లు ఉంటాయి. వాష్ ఏరియాల్లో బోలెడన్ని పనికిరాని వస్తువులు ఉంటాయి. మిద్దె మీద కొందరు పనికి రానిదంతా దాస్తారు ఎందుకో. అన్నీ పారేయండి. పంచేయండి. కొత్త సంవత్సరం కోసం ఇంటిని మీ మనసును తేలిగ్గా చేసుకోండి. కొత్త వెలుతురు కు దారి ఇవ్వండి. అదిగో ఇవాళ మీరు ఫలానా వస్తువు ఇచ్చారన్న ఆనందంతో కొంతమంది అయినా న్యూ ఇయర్లోకి అడుగు పెట్టేలా చేయండి. సరేనా? -
Boycott Myntra.. ఎందుకో తెలుసా?
Boycott Myntra trending on Twitter: మనోభావాలు.. దెబ్బతినడానికి ప్రత్యేకించి కారణాలు అక్కర్లేని రోజులివి. అలాంటిది చిన్న కారణం దొరికినా.. వివాదాన్ని రేపి, రచ్చ చేసి గోల చేస్తున్నారు చాలామంది. ఈ తరుణంలో దుస్తుల ఈ-కామర్స్ సంస్థ మింత్రా విమర్శలు ఎదుర్కొంటోంది. బాయ్‌కాట్ మింత్రా పేరుతో సోషల్ మీడియాలో కుప్పలుగా పోస్ట్‌లు కనిపిస్తున్నాయి. దానికి కారణం.. ఓ పాత ఫేక్ పోస్ట్. లోగో మార్పుతో వివాదంలో నిలిచిన మింత్రా.. ఇప్పుడు మరో విమర్శను ఎదుర్కొంటోంది. మహాభారత దుశ్వాసన పర్వంలో కృష్ణుడు, ద్రౌపదికి వలువలు అందించే ఘట్టాన్ని తమ ప్రమోషన్‌కు వాడుకుందనేది మింత్రాపై వినిపిస్తున్న ఆరోపణ. ఈ కారణంతోనే హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మింత్రా వ్యవహరించిందని.. కాబట్టి తక్షణమే దానిని అన్-ఇన్స్టాల్ చేయాలని విమర్శలు వినిపిస్తున్నాయి. Shame On Myntra . Retweet And #BoycottMyntrahttps://t.co/kPROnzxLwh — Sadhvi Prachi (@Sadhvi_prachi) August 23, 2021 This is not an ad, it is a direct insult to Hinduism & Hindu’s everywhere. It’s time to send a message loud & clear: Anti-Hindu propaganda will no longer be met with passivity. It will be met with action. #BoycottMyntra pic.twitter.com/EThpeT0xrL — Kavita (@Sassy_Hindu) August 22, 2021 Guy's this has not been done by @myntra it is a post shared on 2016 which has popped now . I'm not supporting myntra but what wrong is wrong . An I'm not an anti-Hindu . I love my religion but we should not blindly tweet without knowing thefact do fact check once #BoycottMyntra pic.twitter.com/MIH2NDt5v4 — B Sanki (@sanjubhujlthapa) August 23, 2021 Abe yaar bc pagal hain kya log? #BoycottMyntra but why? 5 saal pehle ka incident hai ye and myntra has said they didn’t create this artwork neither did they endorse it. Bhai ek baar double check to kar liya karo!🤦🏻♂️ pic.twitter.com/Hl5osQcNT0 — Sanjay Beniwal (@noSanjayBeniwal) August 23, 2021 ఈ మేరకు ఉదయం నుంచి విపరీతమైన పోస్టులు ట్విటర్లో కనిపిస్తుండడంతో.. ట్రెండింగ్‌లోని వచ్చింది. అయితే ఈ పోస్ట్ కొత్తది కాదు. మింత్రా డిజైన్ చేసింది అంతకన్నా కాదు. 2016లోనే ఈ ఫేక్ పోస్ట్ వైరల్ అయ్యింది. ఆ టైంలోనే స్పందించిన మింత్రా.. అలాంటి ఆర్ట్ వర్క్‌ను తాము సృష్టించలేదని, ఎండోర్స్ కూడా చేయలేదని స్పష్టం చేసింది. ఇప్పుడు మళ్లీ హిందుత్వఅవుట్లౌడ్( @hindutvaoutloud) అనే ఇన్స్టాగ్రామ్ పేజీ నుంచి ఈ పోస్ట్ అప్లోడ్ అయ్యింది. కొందరు మింత్రాకు మద్దతుగా ఈ ఫేక్ ఓల్డ్ పోస్ట్‌పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. View this post on Instagram A post shared by Outloud (@hindutvaoutloud) -
నిలిచిపోనున్న ఇండిగో పాత విమానాలు
న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన సంస్థ ఇండిగో తన పాత విమానాలకు స్వస్తి పలకాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి కొత్త ‘ఏ 320 నియో’ విమానానికి.. అన్మోడిఫైడ్ ప్రాట్ అండ్ విట్నీ (పీడబ్ల్యూ) ఇంజన్లను కలిగిన పాత విమానాలను నిలుపుచేయాల్సి ఉంటుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తాజాగా ఆదేశించింది. ఇక వచ్చే ఏడాది జనవరి 31 నాటికి మొత్తం 97 ఏ 320 నియో విమానాల్లో పీడబ్ల్యూ ఇంజిన్లను మార్చాల్సిందేనని ఇటీవలే డీజీసీఏ ఆదేశించిన విషయం తెలిసిందే. గడువుతేదీ లోపు మార్చకపోతే వీటిని నిలిపివేయాల్సి ఉంటుందని పేర్కొంది. -
విశ్వాసముంటే.. నాలుగేళ్ల అధికాయుష్షు!
దైవాన్ని, మతాన్ని నమ్మేవారు ఇతరుల కంటే నాలుగేళ్లు ఎక్కువ బతికేందుకు అవకాశముంది అంటున్నారు శాస్త్రవేత్తలు. అమెరికాలో ఇటీవల ఒక అధ్యయనం జరిపి మరీ తాము ఈ అంచనాకు వచ్చామని లారా వాలెస్ అనే శాస్త్రవేత్త తెలిపారు. సాధారణంగా మతాన్ని నమ్మిన వాళ్లు ధార్మిక కార్యక్రమాలు లేదంటే సామాజిక కార్యకలాపాల్లో స్వచ్ఛందంగా పాల్గొంటూ ఉంటారని.. ఇలాంటి వారు ఇతరుల కంటే ఎక్కువ కాలం బతుకుతారని గతంలోనే అనేక పరిశోధనలు స్పష్టం చేశాయని లారా అంటున్నారు. ఈ నేపథ్యంలో తాము మతాల వివరాలను సేకరించేందుకు సంస్మరణ సభలను ప్రాతిపదికగా తీసుకున్నామని, కుటుంబ సభ్యులు, మిత్రులు చెప్పిన వివరాలను పరిగణనలోకి తీసుకుంటూనే.. మరణించిన వ్యక్తి స్త్రీయా, పురుషుడా? వివాహమైందా? లేదా? అన్నవీ గమనించి పరిశీలించినప్పుడు మతాన్ని నమ్మినవారు దాదాపు 6.48 ఏళ్లు ఎక్కువ జీవించేందుకు అవకాశముందన్న అంచనాకు వచ్చామని వివరించారు. అమెరికాలోని మొత్తం 43 ప్రధాన నగరాల్లోని 1096 మందిపై జరిగిన రెండో అధ్యయనంలో ఇది 5.64 ఏళ్లుగా ఉన్నట్లు స్పష్టమైందని, మొత్తమ్మీద చూస్తే మతవిశ్వాసాలు కలిగి ఉండటం.. ధార్మిక, సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనడం నాలుగేళ్ల ఆయుష్షునిస్తుందని తెలుస్తోందని లారా చెప్పారు. -
మాయమవుతున్న మన చరిత్ర
మహానగర చరిత్ర మాయమవుతోంది. చారిత్రక కట్టడాలు ఒక్కొక్కటిగా మట్టిలో కలిసిపోతున్నాయి. నగరం నడిబొడ్డున నిజాం కాలంలో నిఘా కేంద్రంగా సేవలందించిన ఎత్తయిన కట్టడం శిథిలావస్థలో ఉంది. 1850లో నిజాం సైన్యాధిపతి టిప్పుఖాన్శత్రువుల కదలికలను గుర్తించేందుకు దీనిని నిర్మించారు. ‘టిప్పు వాచ్ టవర్’, ‘సిటీ లుక్ ఔట్’గా ప్రసిద్ధి చెందిన ఈ చారిత్రక కట్టడం ఇప్పుడు ధ్వంసమవుతోంది. మల్టీప్లెక్స్ నిర్మాణాల కోసం చరిత్రను ఖతం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని చరిత్ర సంపదను కాపాడాలని చరిత్రకారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘సిటీ లుక్ ఔట్’ కట్టడంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సాక్షి, సిటీబ్యూరో :నిజాం కాలంలో సైన్యాధిపతిగా పనిచేసిన టిప్పుఖాన్ ఈ చారిత్రక కట్టడాన్ని నిర్మించాడు. ఆయన తండ్రి నిజాం సైన్యంలో పనిచేసేవాడు. దీంతో టిప్పుఖాన్ యుద్ధ విద్యల్లో నైపుణ్యం పొంది సైన్యంలో చేరాడు. అనతి కాలంలోనే సైన్యాధిపతిగా ఎదిగాడు. నిజాం పాలకులకు దగ్గరయ్యాడు. నగర సంరక్షణ నిమిత్తం ప్రహరీనిర్మాణం, నిఘా కేంద్రం ఏర్పాటు బాధ్యతలను నిజాం టిప్పుఖాన్కు అప్పగించాడు. ఎత్తయిన ప్రదేశంలో నిఘా కేంద్రం ఏర్పాటు చేయాలని భావించిన టిప్పుఖాన్.. ప్రస్తుతలక్డీకాపూల్లోని ఎత్తయిన కొండపైదీనిని నిర్మించాడు. నగరంపై నజర్... 1850లో 162 అడుగుల ఎత్తులో లక్డీకాపూల్‌లోని ఎత్తయిన కొండపై దీనిని నిర్మించాడు టిప్పుఖాన్. ఇక్కడి నుంచి చూస్తే గోల్కొండ ఫతేమైదాన్, హుస్సేన్‌సాగర్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాలన్నీ కనిపించేవి. ఇక్కడి నుంచే నగరంలో ఏం జరుగుతుందనేది? సైనికులు ఎప్పటికప్పుడు కనిపెడుతుండేవారు. శత్రువుల కదలికలు, సైనికుల శిక్షణ, ఇతర కార్యకలాపాలను నిశితంగా పరిశీలించేవారు. ఈ కట్టడం నాలుగు వైపులా గోడలకు మధ్యలో రంధ్రాలు ఉంటాయి. విధులు నిర్వర్తించే సైనికులు అందులో నుంచి బైనాక్యూలర్లతో నగరంపై నజర్ పెట్టేవారు. ఈ ప్రదేశం నుంచి చూస్తే సిటీ మొత్తం మన కళ్లకు కడుతుంది. అందుకే ఇది ‘టిప్పుఖాన్ వాచ్ టవర్’, ‘సిటీ లుక్ ఔట్’గా ప్రసిద్ధి చెందింది. ఇప్పటికే మెట్ల తొలగింపు... ఇంతటి ఘన చరిత్ర ఉన్న ‘సిటీ లుక్ ఔట్’ కట్టడం ఇప్పుడు ధ్వంసమవుతోంది. టవర్ పైకి వెళ్లేందుకు ఉన్న మెట్లను ఇప్పటికే తొలగించారు. ఇక్కడ కొత్తగా నిర్మిస్తున్న భవనాలే ఇందుకు కారణమవుతున్నాయి. కూల్చివేతలకు రంగం సిద్ధమైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అభివృద్ధి ముసుగులో చారిత్రక కట్టడం అంతర్థానం అవుతున్నా... అధికారులు ఆవైపు వెళ్లడం లేదు. ఇలాంటి చారిత్రక కట్టడాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రభుత్వం వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చరిత్రకారులు, నిపుణులు కోరుతున్నారు. నగరంలోని అన్ని ప్రాంతాలను ఈ టవర్ నుంచి చూసే వీలుందని, దీనికి మరమ్మతులు చేసి అభివృద్ధి చేస్తే టూరిజం కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పరిరక్షించాలి... చారిత్రక కట్టాడాలు రాన్రాను కనుమరుగైపోతున్నాయి. నగరంలో ప్రతి కదలికలపై నజర్ పెట్టేందుకు టిప్పుఖాన్ ఈ సిటీ లుక్ ఔట్ నిర్మించాడు. ఇక్కడ ఓవైపు గుట్ట మొత్తం ధ్వంసమైంది. టవర్‌పై ఎక్కడానికి మార్గం లేకుండా పోయింది. ప్రభుత్వం చొరవ తీసుకొని టవర్ చుట్టూ గ్రీనరీ ఏర్పాటు చేసి, టవర్ పైకి ఎక్కేందుకు మార్గం ఏర్పాటు చేస్తే పర్యాటక ప్రదేశంగా మారుతుంది. అదే విధంగా ఎంతో విలువైన ఈ చారిత్రక కట్టడం రాబోయో తరాలకు జ్ఞాపకంగా మిగులుతుంది. – అనురాధారెడ్డి,ఇన్టాక్ సంస్థ రాష్ట్ర కో–కన్వీనర్ -
అతుకుల బండి.. ఆదిత్యునికండి!
అరసవల్లి: విఖ్యాత అరసవల్లి సూర్యనారాయణ స్వామి తెప్పోత్సవానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. హంస నావికా ఉత్సవానికి ఇంకా ఒక్క రోజే ఉంది. పవిత్ర ఇంద్రపుష్కరిణిలో ముగ్గురు దేవేరులతో క్షీరాబ్ధి ద్వాదశి సందర్భంగా హంసవాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనం ఇచ్చేందుకు స్వామి సతులతో సిద్ధంగానే ఉన్నారు. అయితే ఆయన విహరించే వాహనమే ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తోంది. బుధవారం సాయంత్రం జరగనున్న ఈ ఉత్సవానికి అన్ని ఏర్పా ట్లు పకడ్బందీగా చేసేందుకు ఆలయ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే వారిలో కూడా బయటకు చెప్పలేని ఆవేదన కనిపిస్తోంది. గత ఏడాది తెప్పోత్సవంలో కనిపించిన నావకు ఇప్పటి నావకు అసలు పోలిక లేకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వాహన ఫ్రేమింగ్‌లో ఎక్కడచూసినా ఏదో ఒక లోపం కనిపిస్తోంది. వెల్డింగ్‌లు చేసీ చేసీ ఎలాగోలా హంస వాహనాన్ని సోమవారం సాయంత్రానికి సిద్ధం చేశారు. పదేళ్ల కిందట నగరానికి చెందిన పేర్ల ప్రభాకరరావు అనే దాత ఇచ్చిన ఈ హంస వాహనానికి ప్రత్యేక బోల్ట్ ఫిటింగ్ సౌకర్యం ఉండేది. ఇప్పుడు ఆ విధమైన పరిస్థితులు లేవు. బోల్టులు లేకపోవడం, కొన్ని ఫ్రేములు కన్పించకపోవడంతో చాలా చోట్ల వెల్డింగ్ అతుకులు తప్పలేదు. దీంతో ఇప్పుడు వాహనం రూపురేఖలే మారిపోయాయి. గత ఏడాది ఈ వాహనాన్ని అనంతపురం పంపించడంతోనే ఈ దుస్థితి నెలకొందని అధికారులంటున్నారు. జిల్లాలో ఇన్చార్జి మంత్రిగా పనిచేసిన కాలంలో మంత్రి పరిటాల సునీత ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా కుంతిమట్టి (వెంకటాపురం)లో కృష్ణ, రాయలసీమ నదుల అనుసంధాన కార్యక్రమంలో భాగంగా అక్కడి అనం త పద్మనాభ స్వామి దేవాలయ తెప్పోత్సవానికి ఆదిత్యుని హంస వాహనాన్ని గత ఏడాది డిసెంబర్ 12న తరలించారు. మంత్రి ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల సూచన మేరకు ఆలయ ఈ వాహనాన్ని ‘అనంత’కు తరలించారు. అయితే నాడు వాహనాన్ని తీసుకెళ్లిన తర్వాత అదే నెలలో 15 వతేదిన తిరిగి వాహనం అరసవల్లికి చేరుకుంది. అయితే అనంతపురం తెప్పోత్సవంలో వీలు కోసం ఆదిత్యుని హంస వాహనాన్ని ఇష్టానుసారంగా మార్చేసి, ఫ్రేమింగ్ మార్చేయడంతో ఇప్పుడు ఆదిత్యుని వాహనం తీరు మారిపోయింది. ఎక్కడికక్కడ బోల్టుల సిస్టమ్ పాడైపోయింది. దీంతో చేసేదేమీ లేక వెల్డింగ్లతో లోపాలను కప్పేసే ప్రయత్నాలు చేస్తున్నారు. వాహన తరలింపు అధికారికంగానే జరిగిందని ఆలయ అధికారులు చెబుతుంటే హంస వాహనాన్ని దేవాదాయ శాఖ ఆర్జేసి ఉత్తర్వుల మేరకు సవ్యంగా తీసుకెళ్లి, అలాగే తిరిగి తెచ్చామని, ఇందుకుగాను విరాళంగా రూ.11,001 లను అరసవల్లి దేవాలయానికి చెల్లించామని అనంతపురం కార్యక్రమ వైదిక నిర్వాహకుడు నేతేటి భాస్కరరావు ‘సాక్షి’కి తెలిపారు. గతంలోనే.. గతంలో ఇక్కడ విధుల్లో ఉన్న లక్ష్మణరావు అనే ఉద్యోగి నిర్వాకంతోనే హంస వాహనానికి చెందిన పలు సామగ్రి మాయమైందనే ఆరోపణలు కూడా స్థానికంగా వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆలయంలో కొన్ని ఇనుప వస్తువులను దొంగతనంగా అమ్మకానికి తీసుకెళ్లాడన్న ఆరోపణలతో లక్ష్మణరావును ఆలయ ఈఓ శ్యామలాదేవి సస్పెండ్ చేసిన సంగతి పాఠకులకు తెలిసిందే. అయితే ఈ ఉద్యోగి నిర్వాకంతోనే వాహన గోడౌన్ నుంచి పలు వస్తువులు, సామగ్రి మా యమయ్యాయని, దీనికి తోడు వాహన తరలింపు తర్వాత ఫ్రేమింగ్ పాడైందని, పేర్లు చెప్పడం ఇష్టం లేని పలువురు ఆలయ ఉద్యోగులు తెలిపారు. వాహనం అతుకులతో నెట్టుకురావడంతో గతంలోలాగా ఎక్కువమందిని తీసుకెళ్లే సామర్థ్యం ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం నాటి తెప్పోత్సవం విజయవంతంగా నిర్వహిస్తామని, తెప్ప వినియోగంలో ఎక్కడా ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సంబంధిత ఆలయ ఉద్యోగులు ‘సాక్షి’కి తెలిపారు. -
చదువులమ్మ చెట్టు నీడలో..
పూర్వ విద్యార్థుల సమ్మేళనం రాజమహేంద్రవరం రూరల్: ఇరవై ఏళ్ల క్రితం బొమ్మూరులోని జిల్లావిద్యాశిక్షణ కేంద్రం (డైట్)లో ఛాత్రోపాధ్యాయులుగా శిక్షణ పొంది... ఇప్పుడు ఉపాధ్యాయులుగా స్థిరపడిన 1997–98 బ్యాచ్ విద్యార్థులు ‘స్నేహ గౌతమి’పేరుతో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం చదువులమ్మ చెట్టునీడలో ఉల్లాసంగా .. ఉత్సాహంగా జరుపుకున్నారు. తమకు విద్యాబుద్దులు నేర్పించిన ఉపాధ్యాయులను గురుపౌర్ణమి సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఆనాడు తమకు లెక్చరర్‌గా ఉన్న అప్పారి జయప్రకాశరావు నేడు డైట్ కళాశాలకు ప్రిన్సిపాల్‌గా ఉండడం ఆనందంగా ఉందని స్నేహ గౌతమి అధ్యక్షుడు ఐ.మోహన్ అన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన వారంతా ఉభయగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నామని సభకు పరిచయం చేసుకున్నారు. అలనాటి తీపి గుర్తులను జ్ఞాపకం చేసుకోవడంతో అప్పటి చిలిపి పేరులతో పిలుచుకుంటూ స్నేహమాధుర్యాన్ని ఒకరికొకరు పంచుకున్నారు. తమకు బోధించిన గురువులు అప్పారి జయప్రకాశరావు, గంగారాం, బాలచందర్, ఈవీఎస్.జ్యోతి, కేవీ రమణ, గోవిందు, వై.నాగేశ్వరరావు, ఆర్.నాగేశ్వరరావు, ఐజీహెచ్‌ఎన్.ప్రసాద్, వీవీఎన్ ఆచార్యులు, బి.వెంకట్రావు, అన్నాజీరావులను ఘనంగా సత్కరించారు. పూర్వ విద్యార్థులను ఉద్ధేశించి డైట్ ప్రిన్సిపాల్ జయప్రకాశరావు మాట్లాడుతూ తమ వద్ద ఉపాధ్యాయ శిక్షణ పొంది, ఉపాధ్యాయులుగా పనిచేస్తూ 20 ఏళ్ల తరువాత స్నేహగౌతమి పేరుతో కలుసుకుని గురుపౌర్ణమి రోజున సత్కరించడం చాలా ఆనందరంగా ఉందన్నారు. టి.బంగారునాయుడు, కెఎస్.మల్లేశ్వరరావు, భమిడిపాటిఫణికుమార్, సత్తిబాబు, సూర్యకిరణ్, కృష్ణంరాజు, కవిత, నాగమణి తదితరులు పాల్గొన్నారు. -
పాత కరెన్సీ కలకలం
జాతీయ రహదారిపై తరలిస్తుండగా రూ.47.98 లక్షలు స్వాధీనం నిందితులు ఉభయ గోదావరి జిల్లా వాసులు రాజానగరం : నల్లధనాన్ని అరికట్టేందుకు, నకిలీ కరెన్సీని నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నవంబరులో రద్దు చేసిన రూ.500, రూ.వెయ్యి నోట్ల మార్పిడికి గడువు ముగిసిపోయింది. అంతేకాక ఈ నోట్లు ఎవరి దగ్గరైనా ఉంటే నేరంగా పరిగణిస్తామని కూడా హెచ్చరించారు. అయినా నోట్ల మార్పిడికి అక్రమార్కులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. జాతీయ రహదారిపై మోటారు బైకులపై తీసుకువెళ్తున్న రూ.47 లక్షల 98 వేల 500 పాత నోట్లను, నిందితులను పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. రద్దు అనంతరం మార్పిడికి గడువు ముగిసిన తరువాత ఈ నోట్లను కలిగి ఉండడం నేరంగా పరిగణించి వారిని అదుపులోకి తీసుకున్నామని రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా అడిషనల్ ఎస్పీ రెడ్డి గంగాధరరావు తెలిపారు. బుధవారం స్థానిక పోలీసు స్టేషను వద్ద ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. ముందుగా అందిన సమాచారం మేరకు రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ ఇచ్చిన ఆదేశాలను అనుసరించి తూర్పు మండల డీఎస్పీ కె. రమేష్‌బాబు ఆధ్వర్యంలో ఇన్చార్జ్ సీఐ ఎం.ముక్తేశ్వర్రావులు తమ సిబ్బందితో జాతీయ రహదారిపై కలవచర్ల జంక్షన్ వద్ద నిర్వహిస్తున్న సోదాల్లో ఈ నోట్లు పట్టుబడ్డాయి. ఎనిమిది మంది వ్యక్తులు నాలుగు మోటారు బైకులపై ప్రయాణిస్తూ కాకినాడ ఏడీబీ రోడ్డుకు మలుపు తిరుగుతున్న సమయంలో సోదా చేసేందుకు ప్రయత్నించగా పారిపోయే ప్రయత్నం చేశారు. అప్రమత్తంగా ఉన్న పోలీసులు వారిని చుట్టముట్టి వారి వద్ద ఉన్న వస్తువులను తనిఖీ చేయడంతో పాత కరెన్సీ దొరికింది. నిందితులు ఉభయ గోదావరి జిల్లాల వారే ఈ ఘటనలో పట్టుబడిన నిందితులు ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వారే కావడం గమనార్హం. వీరిలో ఏ–1గా ఉన్న కొప్పినీటి హరికృష్ణ (35) పాలకొల్లుకు చెందిన వాడు కాగా, ఏ–2 మేకా శాంతకుమార్ (39) కాకినాడకు చెందిన వారు. అలాగే మిగిలిన నిందితులు కోటేడి సతీష్‌కుమార్ (35) కరప మండలం, వేళంగికి చెందిన వాడు కాగా అంబటి రమేష్ (35), రాయపాటి బాలాజీ (31), పల్లా సత్తిరాజు (51), రాయుడు సత్యనారాయణ (47), గంటా వెంకటనరసింహరావులు రాజమహేంద్రవరానికి చెందిన వారు. వీరు ప్రయాణిస్తున్న నాలుగు మోటారు బైకులతోపాటు వారి వద్ద ఉన్న తొమ్మిది సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టు ఏఎస్పీ తెలిపారు. ఆరా తీస్తున్నాం ప్రభుత్వం, రిజర్వు బ్యాంకులు రద్దు చేసిన కరెన్సీ నోట్లను వీరు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? అసలు ఈ సొమ్ములు వీరికి ఎలావచ్చాయి? వీటిని ఏవిధంగా మారుస్తారు? ఇప్పటికి ఇలా ఎంత కాలం నుంచి చేస్తున్నారు? అసలు వీటికి ఐటీ లెక్కలు ఉన్నాయా? అనే వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని అడిషనల్ ఎస్పీ తెలిపారు. రద్దు చేసిన నోట్లను కలిగివుండటమే ఒక నేరం అయితే వాటిని మార్చేందుకు వేరొకచోటకు తరలించే ప్రయత్నం చేయడం కూడా నేరమే అవుతుందన్నారు. -
వృద్ధురాలి దారుణ హత్య
సిమెంట్ ఇటుకతో తలపై మోదిన వైనం జగ్గంపేట : ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలు పప్పుల మంగ (56) జగ్గంపేట శ్రీరామ్‌నగర్‌లో ఆదివారం తెల్లవారు జాము సమయంలో దారుణ హత్యకు గురైంది. నూతనంగా నిర్మించుకున్న ఇంట్లో ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు సిమెంట్ ఇటుకతో తల, ఇతర శరీర భాగాలపై బలంగా గాయపర్చడంతో ఆమె మృతి చెంది ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. రోజు మాదిరిగా ఇంటి బయట కనిపించకపోవడంతో ఆదివారం సాయంత్రం ఇరుగు పొరుగుకు వారు లోపలకు వెళ్లి చూడగా మంగ చనిపోయి ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్సై అలీఖాన్, సీఐ కాశీ విశ్వనాథం, సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి హత్య జరిగిన తీరును పరిశీలించి, స్థానికులను విచారించారు. మంగ నిద్రించిన మంచం ఇరిగిపోయి ఉండడం, సిమెంట్ ఇటుకలకు రక్తపు మరకలు, ఆమె శరీరభాగాలపై బలమైన గాయాలు ఉండడంతో పెనుగులాట జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలు శ్రీరామ్‌నగర్‌లో ఉన్న ఇంటిని సుమారు రూ.30 లక్షలకు అమ్ముకుంది. అప్పులు తీర్చివేసి, మిగిలిన సొమ్ములో సుమారు రూ.10 లక్షలతో స్థలం కొనుగోలు చేసుకుని నూతనంగా ఇల్లు నిర్మించుకుంది. ఇంటి పనులు పూర్తికావడంతో ప్రభుత్వం ఇచ్చే హౌసింగ్ రుణం కోసం ఎదురు చూస్తోంది. కుమార్తె ఇంటి వద్ద భోజనం చేసి రాత్రిపూట కొత్త ఇంటిలో ఒంటరిగా నిద్రిస్తుంది. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. శ్రీరామ్‌నగర్‌లో వేరే చోట అల్లుడు, కుమార్తె కానూరి దేవి ఉంటుండగా వారి వద్ద కొడుకు ఉంటున్నాడు. ఆమె ఉంటున్న ఇంటి వద్ద సొమ్ములు గాని, బంగారు వస్తువులు కాని లేకపోవడంతో హత్యకు గల కారణాలు వేరే ఏదైనా కారణమవ్వచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని బలభద్రపురం గ్రామానికి చెందిన మంగ శ్రీరామ్‌నగర్‌లో స్థిరపడింది. హత్యకు గల కారణాలను పోలీసులు అన్వేషిస్తుండగా క్లూస్‌టీమ్ ఆధారాలను సేకరించింది. పోలీసు జాగిలాన్ని రంగంలోకి దించారు. వివాహేతర సంబంధం కోసం వేరే మహిళకు తన ఇంటి వద్ద ఆశ్రయం ఇస్తుండడంతో ఆమె భర్త ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్త మవుతున్నాయి. అన్ని కోణాలలో కేసు విచారిస్తున్నామని, మంగది హత్యేనని నిందితుల గురించి సోమవారానికి స్పష్టత వచ్చే అవకాశం ఉందని సీఐ కాశీవిశ్వనాథం, ఎస్సై అలీఖాన్ తెలిపారు. అనుమానస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
పెంచిన బిడ్డే ప్రాణం తీసింది
పిఠాపురం : బిడ్డలు లేని ఆ తల్లి ఓ అనాథ ఆడపిల్లను దత్తత తీసుకుని పెంచింది. తన ఆలన పాలన చూస్తుందని ఆశించింది. పెంచి పెద్దచేసి ఓ అయ్య చేతిలో పెట్టింది. ఇన్నాళ్లూ తనను పెంచి పెద్దచేసి జీవితాన్ని ఇచ్చిన ఆ తల్లిని ఆస్తి కోసం భర్తతో కలిసి పీకనులిమి దారుణంగా అంతమొందించిన ఘటన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో సంచలనం సృష్టించింది. ఈ నెల 17న లయన్స్‌క్లబ్ కల్యాణ మండపం సమీపంలో వృద్ధురాలి అనుమానాస్పద మృతి కేసు మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి పిఠాపురం సీఐ అప్పారావు పట్టణ పోలీసు స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పిఠాపురం లయన్స్‌క్లబ్ కల్యాణ మండపం సమీపంలో వృద్ధురాలు కేతినీడి ఉమాదేవి (71) తన ఇంట్లో నివాసముంటోంది. భర్త లేని ఆమె అనాథ బలిక అయిన హేమమాలినిని దత్తత తీసుకుంది. పెంచి పెద్దచేసి పిఠాపురం మండలం మాధవపురానికి చెందిన ఆళ్ల నారాయణకు ఇచ్చి పెళ్లి చేసింది. నారాయణ ఖాళీగా తిరుగుతూ డబ్బుకోసం ఉమాదేవిపై ఒత్తిడి తెచ్చేవాడు. డబ్బు ఇవ్వడానికి ఆమె నిరాకరించడంతో నారాయణ తన భార్య హేమమాలినిని తీసుకుని గొల్లప్రోలులో వేరు కాపురం పెట్టాడు. వారు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారన్న సంగతి తెలుసుకుని ఉమాదేవి వారిద్దరినీ తీసుకు వచ్చి తన ఇంట్లోనే పెట్టుకుంది. నారాయణ రెండు నెలల నుంచి ఉమాదేవికి చెందిన బంగారు వస్తువులు దొంగచాటుగా తీసి తాకట్టు పెట్టుకుని జల్సాలు చేసేవాడు. ఇది గమనించిన ఉమాదేవి తన వస్తువులు ఎందుకు తీస్తున్నావని ప్రశ్నించింది. అయినా మారకపోవడంతో తన ఇంట్లో ఉండడానికి వీల్లేదు.. వెళ్లి పోవాలని నారాయణను హెచ్చరించింది. 16వ తేదీన ఇంటికి వచ్చిన నారాయణను తన వస్తువులు రేపటి లోగా ఇచ్చి తన ఇంటి నుంచి వెళ్లిపోవాలని చెప్పింది. ఇంట్లోకి వెళ్లిన నారాయణ తన అత్తను ఎలాగైనా అంతమొందించాలని భార్యకు నూరిపోశాడు. అర్ధరాత్రి వంటింట్లో నిద్రిస్తున్న ఉమాదేవిని కాళ్లు చేతులు కదలకుండా హేమామాలిని పట్టుకోగా, భర్త నారాయణ పీక నులిమి తువ్వాలు మెడకు బిగించి చంపేశాడు. ఆ తర్వాత బాత్రూమ్లో జారిపడిపోయినట్టు అందరినీ నమ్మించారు. ఆటోలో స్థానిక ప్రైయివేటు ఆస్పత్రికి తీసుకువెళ్లగా అక్కడి సిబ్బంది ఆమె చనిపోయిందని చెప్పగా ఇంటికి తీసుకు వచ్చి దహన సంస్కారాలు చేసేందుకు ప్రయత్నించారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న ఉమాదేవి బంధువులకు సమాచారం ఇచ్చారు. కుమార్తె, అల్లుడు తన ఆస్తి కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఉమాదేవి గతంలోనే బంధువులకు చెప్పింది. అనుమానం వచ్చిన ఆమె బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ అప్పారావు ఆధ్వర్యంలో పట్టణ ఎస్సై శోభన్ఉమార్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు. ఇంతలో మృతురాలి ఇంటికి వచ్చిన ఆమె బంధువులు హేమామాలినిని నిలదీయగా తన భర్త సహకారంతో తల్లిని హత్య చేసినట్టు ఒప్పుకుంది. సోమవారం రాత్రి పట్టణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్టు సీఐ సీఐ అప్పారావు తెలిపారు. కార్యక్రమంలో పట్టణ ఎస్సై శోభన్‌కుమార్, అదనపు ఎస్సై మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
పాతనోట్లు.. కొత్తపాట్లు
సత్యదేవుని హుండీల్లో రూ.3.60 లక్షల పాతనోట్లు డిపాజిట్ చేసుకోని బ్యాంకులు ఆర్బీఐకి లేఖ రాసిన దేవస్థానం అధికారులు అన్నవరం : జనవరి, ఫిబ్రవరి నెలల్లో సత్యదేవుని హుండీలలో భక్తులు సమర్పించిన రూ.3.60 లక్షలు విలువైన రూ.వెయ్యి, రూ.500 పాత నోట్లు భవితవ్యం ఏమిటి?. వీటిని రిజర్వ్‌బ్యాంక్ తీసుకుని కొత్తనోట్లు ఇస్తుందా?. మార్చి తర్వాత కూడా హుండీల్లో పాతనోట్లు వస్తే ఏమిచేయాలి అనే విషయాలపై అన్నవరం దేవస్థానం వర్గాలు సతమతమవుతున్నాయి. బ్యాంకులు తీసుకోకపోవడంతో రూ.3.60 లక్షల విలువైన పాతనోట్లను దేవస్థానం ఖజానాలో భద్రపరిచారు. గతేడాది నవంబర్ ఎనిమిదో తేదీ రాత్రి నుంచి రూ.500, రూ.వెయ్యి పాతనోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ నెలాఖరు వరకు పాతనోట్లను వాణిజ్యబ్యాంకులు, పోస్టాఫీసుల్లో మార్పిడి చేసుకునే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే ఆ నోట్లను తీసుకుంటుదని ప్రకటించారు. పాతనోట్ల రద్దు తర్వాత నవంబర్‌లో రెండుసార్లు, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిల్లో ఒక్కోసారి సత్యదేవుని హుండీలను తెరిచారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో వచ్చిన సుమారు రూ.25 లక్షల విలువైన పాతనోట్లను బ్యాంకులు డిపాజిట్ చేసుకున్నాయి. ఆ తర్వాత వచ్చిన నోట్లను మాత్రం తీసుకోలేదు. బ్యాంకుల నిరాకరణ జనవరిలో స్వామివారి హుండీలను తెరవగా రూ.1.70 లక్షలు విలువైన పాత రూ.500, రూ.వెయ్యినోట్లు వచ్చాయి. ఫిబ్రవరిలో రూ.1.90 లక్షలు విలువైన పాతనోట్లు వచ్చాయి. ఈ రెండు నెలల హుండీ ఆదాయాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రాబ్యాంకుల్లో జమచేశారు. వాటిలో పాతనోట్లను ఆ బ్యాంకులు తీసుకోకపోవడంతో దేవస్థానం ఖజానాలోనే భద్రపరిచారు. పాతనోట్లను తీసుకుని కొత్తవి మంజూరు చేయాలని అన్నవరం దేవస్థానం అధికారులు రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా చెన్నై బ్రాంచ్ అధికారులకు గత నెలలో లేఖ రాశారు. దీనిపై ఎటువంటి సమాధానం రాలేదు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం హుండీల్లో వచ్చిన పాతనోట్లను తీసుకోవడానికి ఆర్బీఐ నిరాకరించినట్టు తెలియడంతో దేవస్థానం వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
90 ఏళ్ల డాక్టర్...67 ఏళ్ల ప్రాక్టీస్..
వయసు పైబడే కొద్దీ శరీర బలహీనతలు ఆవహించి చాలామంది ఇంటికి పరిమితమవుతారు. కొంతమంది అయితే కాస్త దూరం నడవాలన్నా చాలా ఆయాసపడతారు. అలాంటి వాళ్లందరికీ రష్యాలోని మాస్కోలో ఉన్న అల్లా ఇల్లించినా ఒక ఆదర్శం. ఎందుకంటే ఆమె వయసు ప్రస్తుతం దాదాపు 90 ఏళ్లకు చేరుకుంది. ఆ పెద్దావిడ ప్రస్తుతం మాస్కోలోని ఒక హాస్పిటల్లో సర్జన్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ప్రాణాలు నిలబెట్టుకోవడానికి పాకులాడే ఈ వయసులో ఆమె రోజుకు నాలుగు ఆపరేషన్లు చేసి ఎంతో మందికి ప్రాణదానం చేస్తోంది. 67 ఏళ్లుగా దాదాపు పది వేలకు పైగా శస్త్రచికిత్సలు చేసింది. డాక్టర్ అనేది వృత్తి కాదని.. అది ఒక జీవిత విధానమని చెప్పే అల్లా.. వృద్ధాప్యం మీద పడినప్పటికీ అలసిపోకుండా పనిచేస్తూ అంధుడైన తన మేనల్లుడితోపాటు 8 పిల్లులను సైతం పోషిస్తోంది. తన రిటైర్మెంట్ గురించి ప్రశ్నించిన ఒక ఎఫ్ఎం స్టేషన్ వారితో తాను రిటైర్ అయితే ఆపరేషన్లు ఎవరు చేస్తారు? అంటూ చమత్కరించింది. అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యంత వృద్ధ సర్జన్‌గా తనను తాను ఆమె అభివర్ణించుకున్నారు. అన్ని రకాల ఆహారపదార్థాలు తినడం, ఎక్కువగా నవ్వడం, ఏడ్వడమే తన ఆరోగ్య రహస్యమని అల్లా బోసినవ్వులు చిందిస్తూ మురిసిపోయింది. -
మోహనరెడ్డి పీఆర్ కళాశాల పూర్వ విద్యార్థే
పద్మశ్రీ అందుకున్న నాలుగో పూర్వ విద్యార్థి హర్షం వ్యక్తం చేసిన పూర్వ విద్యార్థి సంఘం భానుగుడి (కాకినాడ సిటీ) : జిల్లాలో విద్యా చరిత్రకు పునాదిగా నిలిచిన పిఠాపురం రాజా డిగ్రీ కళాశాల మరో ఘనకీర్తిని సొంతం చేసుకుంది.1880వ దశకం నుంచి నేటి వరకు కొన్ని లక్షల మంది విద్యార్థుల ఉన్నతికి ఈ కళాశాల కల్పవల్లిగా నిలిచిన విషయం తెలిసిందే. వాణిజ్య, పారిశ్రామిక రంగాలలో విశేష సేవలందించి, భారత కీర్తిని ఆ రంగాల్లో ప్రపంచ యవనికపై సగర్వంగా నిలిపినందుకు పద్మశ్రీ అవార్డు అందుకున్న డాక్టర్ బీవీఆర్ మోహనరెడ్డి (సైయెంట్ వ్యవస్థాపకులు) పీఆర్ ప్రభుత్వ కళాశాల పూర్వ విద్యార్థి. ఇప్పటికి ఈ కళాశాలకు చెందిన నలుగురు పూర్వ విద్యార్థులు పద్మ పురస్కారాలు అందుకోవడం కళాశాల కీర్తిని మరింత పెంచింది. ఇప్పటికి నలుగురు.. 1935లో పీఆర్ ప్రభుత్వ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన మామిడికుదురుకు చెందిన ప్రముఖ కవి భోయిభీమన్న (1973 పద్మశ్రీ,, 2001 పద్మభూషణ్),1950లో బోటనీ, జువాలజీలతో డిగ్రీ చదివిన పశ్చిమ గోదావరి చిట్టవరానికి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త మంగిన వెంకటేశ్వరరావు (1999 పద్మశ్రీ), 1940లో ఈ కళాశాలలో డిగ్రీ చదివిన ద్రాక్షారామకు చెందిన వీణా వాయిద్య, సంగీత కళాకారుడు ఈమని శంకరశాస్త్రి (1974 పద్మశ్రీ)లతో పాటు ప్రస్తుత పద్మశ్రీ అవార్డు గ్రహీత బీవీఆర్ మోహనరెడ్డి నలుగో వ్యక్తి కావడం విశేషం. ఉన్నత విద్య ఇక్కడే.. బీవీఆర్ మోహనరెడ్డి తండ్రి ఏపీఎస్పీలో ఉద్యోగ దీత్యా కాకినాడకు వచ్చారు. దీంతో మోహనరెడ్డి తన ఉన్నత విద్య అంతటినీ ఇక్కడే పూర్తిచేశారు. కాకినాడ మెక్లారిన్ ఉన్నత పాఠశాలలో ఎస్ఎస్ఎల్సీని పూర్తిచేసి,1965–66లో పీఆర్ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చదివారు. 1966 నుంచి 70 వరకు జేఎన్టీయూకేలో ఇంజనీరింగ్Š చేశారు. ఆ తర్వాత ఐఐటీని ఖరగ్‌పూర్‌లో పూర్తిచేశారు. ఈ క్రమంలో మోహనరెడ్డి ఇక్కడ అనేక మంది స్నేహితులను సంపాదించుకున్నారు. తాను చదువుకున్న పీఆర్ కళాశాలలో ఆయన రూ.22 లక్షలతో మినీ ఆడిటోరియాన్ని నిర్మించారు. గతేడాది కళాశాలలో జరిగిన గ్రాడ్యుయేషన్ డే లో విద్యార్థులకు ఆయన స్వయంగా డిగ్రీ పట్టాలను అందించి ప్రగతి పథంలో నడవాలని పిలుపునిచ్చారు. బీవీఆర్ మోహనరెడ్డికి పద్మశ్రీ పురస్కారం దక్కడం పట్ల పీఆర్ కళాశాల పూర్వ విద్యార్థి సంఘం హర్షం వ్యక్తం చేసింది. -
పాత పద్ధతిలోనే పింఛన్లు
వేలిముద్ర ఆధారిత ట్యాబ్‌ల ద్వారా పంపిణీకి చర్యలు డీఆర్డీ ఏ నుంచి ఎంపీడీఓలకు ఆదేశాలు కాకినాడ సిటీ / రాయవరం: జిల్లాలో సామాజికభద్రతా పింఛన్లను పాత పద్ధతిలోనే వేలిముద్ర ఆధారిత ట్యాబ్‌ల ద్వారా జనవరి నెల నుంచి పంపిణీ చేయనున్నారు. 50 రోజుల క్రితం రూ.500, రూ.1000 నోట్లు రద్దుతో ఏర్పడ్డ నగదు కొరత నేపథ్యంలో ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, కల్లుగీత, అభయహస్తం లబ్ధిదారులకు ప్రతీనెల ఇచ్చే సామాజిక భద్రతా పింఛన్ల సొమ్మును నగదు రూపంలో చెల్లించే విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసింది. నేరుగా లబ్ధిదారులకు పింఛను సొమ్మును ఇవ్వకుండా వారి బ్యాంకు ఖాతాలకు వేయాలని నిర్ణయించిందే తడువుగా ఇక్కట్లను అంచనా వేయకుండా డిసెంబర్ ఒకటిన లబ్ధిదారుల ఖాతాలకు జమ చేసింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 4,75,823 మంది లబ్ధిదారుల్లో 4,48,640 మంది వృద్ధులు, వితంతువులు, చేనేత, కలుగీత, అభయహస్తం, దివ్యాంగుల్లో కొందరికి రూ.వెయ్యి చొప్పున, మరో 27,183 మంది దివ్యాంగులకు రూ.1500 చొప్పున చెల్లించాల్సి ఉండగా రూ.500 కొత్త నోట్లు అందుబాటులోకి రాకపోవడం, రూ.100 నోట్లు కొరత ఉన్నందున బ్యాంకు ఖాతాలో వేసిన సొమ్ము లబ్ధిదారులకు అందక, చేతిల్లో చిల్లిగవ్వ లేక తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. తమఖాతాల్లో వేసిన సొమ్మును తీసుకునేందుకు పింఛనుదారులు బ్యాంకుల వద్ద గంటల తరబడి లైన్లలో నిల్చున్నా నగదు కొరతతో చేతికందని పరిస్థితి నెలకొంది. ఈ మేరకు అధికారులు 15 రోజుల తరువాత క్షేత్రస్థాయిలో స్వైపింగ్ మెషీన్లతో వివిధ బ్యాంకుల బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారా పింఛన్ల సొమ్ము పంపిణీకి చర్యలు తీసుకోడంతో ఈ పంపిణీ ప్రక్రియ నెల పొడవునా సాగి బుధవారం 28వ తేదీతో ముగిసింది. ఈ నెలలో ఎదుర్కొన్న ఇబ్బందులు, వెల్లువెత్తిన వ్యతిరేకతతో ప్రభుత్వం జనవరిలో యథావిధిగా పాత పద్ధతిలోనే పంపిణీకి ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు జనవరి నెలకు విడుదలైన సామాజిక పింఛన్ల సొమ్మును బుధవారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల ఎంపీడీవోల ఖాతాలకు పంపించారు. ఆయా మండలాల అధికారులు నగదును బ్యాంకుల నుంచి విత్‌డ్రా చేసి గ్రామాల్లో ఒకటో తేదీ నుంచి పంపిణీ చేయనున్నారు. నగదు సిద్ధం చేయండి.. 2017 జనవరి నుంచి ఎన్టీఆర్ భరోసా పథకంలో పింఛన్లు ట్యాబ్‌ల ద్వారా ఇవ్వనున్న నేపథ్యంలో అవసరమైన నగదు సిద్దం చేయాలని బ్యాంకులకు ఎంపీడీవోలు సమాచారం పంపించారు. ఈ నెల 28వ తేదీకి ఆయా బ్యాంకు శాఖల పరిధిలో అవసరమైన సొమ్మును సిద్ధం చేయాలని ఎంపీడీవోలు వారి పరిధిలోని బ్యాంకులకు సమాచారం అందించారు. దీని ప్రకారం జిల్లాలో ఉన్న 750 బ్యాంకు శాఖల ద్వారా ఎన్టీఆర్ భరోసా పథకం కింద అందజేసే పింఛన్ సొమ్ము రూ.52కోట్లు ఈ నెలాఖరుకు బ్యాంకు అధికారులు సిద్ధం చేయాల్సి ఉంటుంది. -
ఆ భారీ మొత్తం వెనుక పెద్దలెవరు?
కొవ్వాడ వద్ద నోట్ల పట్టివేత వ్యవహారంలో పోలీసుల వైఖరిపై సర్వత్రా విమర్శలు వీఆర్‌లోకి ఒకటో పట్టణ ట్రాఫిక్ ఆర్ఎస్సై శంకరప్రసాద్ సహా ముగ్గురు కానిస్టేబుళ్లు కాకినాడ క్రైం : కాకినాడ రూరల్ కొవ్వాడ రైల్వే గేటు సమీపంలో అక్రమంగా తరలిస్తు్తన్న పెద్దనోట్ల పట్టివేత వ్యవహారంలో ట్రాఫిక్ పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పెద్దనోట్లను కాకినాడకు చెందిన ఓ వైద్యుని ఇంటికి తరలిస్తున్నట్లు వెల్లడికావడంతో తరలిస్తు్తన్న వ్యక్తుల నుంచి పోలీసులు బేరసారాలకు దిగి రూ. 5 లక్షలు లంచం తీసుకుని,అసలైన నిందితులను విడిచిపెట్టేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ అక్రమపర్వానికి సంబంధించి విశ్వసనీయంగా తెలిసిన వివరాలిలా ఉన్నాయి. ఈనెల 4న రాత్రి కాకినాడ ఒకటో పట్టణ ట్రాఫిక్ ఆర్ఎస్సై శంకరప్రసాద్ ఆధ్వర్యంలో ఇంద్రపాలెం–పైన రహదార్లో వాహనాల తనిఖీ చేపట్టారు. మాచవరం నుంచి కాకినాడకు ఓ వాహనంలో అక్రమంగా తరలిస్తు్తన్న పెద్ద నోట్లను గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ. 18 లక్షల విలువైన పెద్దనోట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే పెద్దనోట్ల నగదు పట్టివేత, స్వాధీనంపై పోలీసులు అత్యంత గోప్యత పాటించారు. భారీ మొత్తంలో ముడుపులు చేతులు మారాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. అక్రమ నగదు స్వాధీనంపై సోమ, మంగళవారాల్లో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పిన పోలీసులు అలా చేయకపోవడం ఆరోపణలకు ఊతమిచ్చింది. నగదు పట్టివేత, కేసు నమోదులో పోలీసుల వైఖరి పలు సందేహాలకు తావిచ్చింది. అక్రమ నగదు పట్టివేతపై పోలీసులపై ఆరోపణలు రావడాన్ని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్ సీరియస్‌గా పరిగణించి దర్యాప్తు చేపట్టాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. నోట్ల పట్టివేత వ్యవహారంలో సిబ్బంది సొమ్ములకు ఆశపడి అక్రమాలకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడి కావడంతో కాకినాడ ఒకటో పట్టణ ట్రాఫిక్ ఆర్ఎస్సై శంకరప్రసాద్, ముగ్గురు కానిస్టేబుళ్లు గంగాధర్, ప్రసాద్, పరశురాంరెడ్డిలను వీఆర్‌లోకి పంపుతూ ఎస్పీ రవిప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం వీరిపై శాఖాపరమైన దర్యాప్తుకు ఆదేశించారు. స్వాధీనం చేసుకున్న పెద్దనోట్లను ఎవరి దగ్గరకు తీసుకెళుతుండగా పట్టుకున్నారు, ఎంత మంది అక్రమ రవాణాలో పాల్గొన్నారన్నది తెలుసుకుని, పట్టుకునేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ అధికారులను ఆదేశించారు. -
పరభాషలో కన్నా.. మాతృభాషలో అధ్యయనమే మిన్న
జాతీయస్థాయి సదస్సులో నన్నయ మాజీవీసీ జార్జ్ విక్టర్. భానుగుడి(కాకినాడ) : మాతృభాషలో అధ్యయనం వల్లే చైనా, జపాన్‌లు అభివృద్ధి చెందాయని నన్నయ్య విశ్వవిద్యాలయం మాజీ వీసీ ఆచార్య జార్జివిక్టర్ పేర్కొన్నారు. జాతీయ సమైక్యత–సాంఘీకరణ పోకడలు అనే అంశంపై పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ నాయకులకు, అధికార యంత్రాంగానికి సరైన సామాజిక దృక్పథం కొరవడిందన్నారు. సోమవారం కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన ఈ సదస్సులో కుల, వర్ణ వ్యవస్థ, సాంస్కృతిక వైవిధ్యాలు పై విస్తృత స్థాయిలో పరిశోధన జరిగితేనే కుల వ్యవస్థపై అసహనం సమసిపోయి జాతీయ సమైక్యతకు దోహదం చేస్తుందన్నారు. సమావేశంలో డాక్టర్ సుధాకర్‌బాబు మాట్లాడుతూ పంజాబ్‌లోని ఖలిస్థాన్ ఉగ్రవాదులను చెరసాల నుంచి తప్పించడం జాతీయ సమైక్యతకు ముప్పుగా పరిణమించవచ్చన్నారు. సదస్సులో నన్నయ రిజిస్ట్రార్ ఆచార్య నరసింహారావు మాట్లాడుతూ జాతి సంపదను అసమానంగా పంచబడడం, రాజకీయ పార్టీల సిద్ధాంతాలు, అవిద్య, ఆహార కొరత మొదలైన అంశాలు జాతీయ సమైక్యతకు ముప్పుగా పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ చప్పిడి కృష్ణ, కందుల ఆంజనేయులు, యూజీసీ కోఆర్డినేటర్ హరిరామ ప్రసాద్, ఆర్గనైజింగ్ మెంబర్స్ వి.చిట్టిబాబు, కె.నరసింహారావు, స్వామి, పాండురంగారావు, పారేశ్వర సాహు, డాక్టర్ వీపురి సుదర్శన్ తదితరులు సదస్సులో పాల్గొన్నారు. -
లైంగిక దాడి నిందితుడి అరెస్టు
ఆలమూరు : సభ్య సమాజం తలదించుకునేలా ముక్కుపచ్చలారని మూడున్నరేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన వేమగిరి జాన్ (65) ఆలమూరు పోలీసులు బుధవారం ఆరెస్ట్ చేశారు. స్థానిక పోలీసు స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామచంద్రపురం డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ, మండపేట సీఐ వి.పుల్లారావు పాల్గొని కేసు వివరాలను తెలియజేశారు. ఈనెల 16న స్థానిక ఎస్సీ పేటలోని చిన్నారికి చాక్లెట్ ఇస్తానని మాయ మాటలు చెప్పి జాన్ తన ఇంటికి తీసుకుపోయాడు. ఆ చిన్నారి నోట్లో చాక్లెట్‌ను ఉంచి లైంగిక దాడికి పాల్పడ్డాడు. తీవ్రమైన నొప్పి వస్తుందంటూ ఆ చిన్నారి ఏడుస్తూ తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. అప్పటికే రక్తస్రావం అవుతున్న విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన ఎస్సై పి.దొరరాజు ఆధ్వర్యంలో పోలీసుల బృందం అప్పటికే పరారీలో ఉన్న నిందితుడు జాన్ కోసం గాలింపు చర్యలు చేపట్టింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు నిందితుడు జాన్‌ను బుధవారం అతని నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ఆలమూరు ఏఎఫ్సీఎం కోర్టులో నిందితుడిని గురువారం హాజరుపర్చనున్నట్లు డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. -
‘మాయ’ ముఠా తిరుగుతోంది..!
తస్మాత్ జాగ్రత్తా.. మూడురోజుల్లో మూడు ఘటనలు జగిత్యాల అర్బన్ : వృద్ధులను ఏదైనా పనిమీద బయటకు పంపిస్తున్నారా..? అయితే వారికి విలువైన వస్తువులు ఇచ్చి వెళ్లనివ్వకండి. ఎందుకంటే వృద్ధులు కనిపిస్తేచాలు వారి ముందు పర్సు లేదా మరేదైనా వస్తువు పడేసి ‘అవి మీవే.. సరిగ్గా చూసుకోండి..’ అంటూ మాటల్లోదింపి మోసం చేసే ముఠా జగిత్యాల ప్రాంతంలో సంచరిస్తోంది. వస్తువును పడేయడమే కాకుండా.. అందులో నకిలీ బంగారంపెట్టి.. దానిని పంచుకుందామంటూ నిజమైన బంగారాన్ని ఎత్తుకెళ్తోంది. ఇలాంటి ఘటనలు మూడురోజుల్లోనే రెండుచోట్ల చోటుచేసుకున్నాయి. ఏడాది క్రితం ఇలాంటి ఘటన మెుదటిసారిగా జగిత్యాలలోనే జరిగింది. ఆ తర్వాత సిరిసిల్లలో కలకలం రేపింది. తాజాగా మంగళవారం మెట్‌పల్లిలోనూ ఇలాంటి ఘటనే జరగడం చర్చనీయాంశమైంది. ఘటనలకు పాల్పడుతున్న ముఠాలో ఓ పురుషుడితోపాటు ఇద్దరు మహిళలు పాల్గొంటున్నట్లు సమాచారం. వృద్ధులే టార్గెట్ ఈ ముఠా ఎక్కువగా వృద్ధులనే టార్గెట్ చేస్తోంది. పట్టణంలోని ఎల్జీరామ్ లాడ్జి సమీపంలో కొడిమ్యాలకు చెందిన వృద్ధురాలు మ్యాక ఎల్లవ్వ ఆయుర్వేద మందుల కోసం వచ్చింది. ఈమె ముందు ఇద్దరు మహిళలు పర్సును పడేశారు. అనంతరం పర్సు మీదేనా అంటూ మాటల్లో దింపారు. ఇంతలో మరోవ్యక్తి వచ్చి అందులో బంగారు కడ్డీ ఉందని, పంచుకుందామని నమ్మించారు. కడ్డీ ఇచ్చినందుకు తమకు నమ్మకంగా ఏదైనా వస్తువు ఇవ్వాలని మాటల్లో దింపారు. మాయలో పడిన ఎల్లవ్వ మెడలోని పుస్తెలతాడు, కమ్మలను ఇవ్వగా అక్కడినుంచి ఉడాయించారు. ఎల్లవ్వ బంగారంలాంటి కడ్డీని స్వర్ణకారుడి వద్ద చూపించగా నకిలీదని తేల్చడంతో లబోదిబోమంది. మరో సంఘటనలో మెట్‌పల్లిలోని మఠంవాడకు చెందిన యమగంగు కూరగాయల కొనుగోలుకు సంతకు వెళ్లింది. అక్కడ ఇద్దరు మహిళలు, ఒక మగ వ్యక్తి తారసపడి మాటలు కలిపారు. ఆమె ముందు ఓ వస్తువును పడేసి తనదే అన్నట్లు నమ్మించి మాటల్లో ముంచారు. అది బంగారుకడ్డీ అని, చూసిచెప్పినందుకు తమకూ వాటా ఇవ్వాలని మాయ చేశారు. కడ్డీ 20 తులాలు ఉంటుందని, అది ఉంచుకుని తమకు ఏదైనా ఇవ్వుమని సలహా ఇచ్చారు. దీంతో ఆమె కూడా పుస్తెలతాడు, కమ్మలు ఇచ్చి కడ్డీని స్వర్ణకారుడి వద్దకు వెళ్లి చూపించగా నకిలీదిగా తేల్చడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇలాంటి ఘటన సిరిసిల్లలోనూ జరిగినట్లు సమాచారం. తస్మాత్ జాగ్రత్త మహిళలు, ముఖ్యంగా వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు పేర్కొంటున్నారు. ఏడాదిక్రితం ఇలాంటి సంఘటనలు కోకోలల్లుగా జరిగాయి. ఓ పురుషుడితోపాటు ఇద్దరు మహిళలు ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు తెలిసింది. జగిత్యాల, మెట్పల్లిలో ఇలాంటివే జరగడంతో ముఠా తిరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రజలు జాగ్రత్తగా ఉండకపోతే మరిన్ని సంఘటనలు అవకాశం ఉంది. అత్యాశకు పోవద్దు – కరుణాకర్‌రావు, సీఐ బంగారు కడ్డీ దొరికిందని నమ్మబలికితే నమ్మవద్దు. మాయముఠా తిరుగుతోంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ‘బంగారం వస్తువు దొరికింది. మీ వద్ద ఉంచుకోండి..’ అని చెబితే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. వారిని నమ్మవద్దు. మహిళలు, వృద్ధులు అత్యాశకు పోవద్దు. ఏదైనా ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. -
వృద్ధురాలిపై అత్యాచారం
దమ్మపేట: మండలంలోని నాగుపల్లిలో 60 ఏళ్ల ఓ వృద్ధురాలిపై అదే గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ బండి రమేష్ (35) బుధవారం రాత్రి అత్యాచారం చేశాడు. ఎస్ఐ జలకం ప్రవీణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..సదరు వృద్ధురాలి భర్త, చిన్న కుమారుడు గతంలోనే చనిపోయారు. పెద్ద కొడుకు పెళ్లయ్యాక అత్తారి ఊరిలో ఉంటున్నాడు. ఈమె గ్రామంలో పనులు చేసుకుంటూ జీవిస్తోంది. గండుగులపల్లికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ బండి రమేష్ నాగుపల్లిలో ఉంటూ పనిచేసుకుంటూ..బంధువైన బాధితురాలి ఇంటికి వచ్చి వెళుతుంటాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి 11:30 గంటల సమయంలో అతను మద్యం సేవించి వృద్ధురాలి ఇంటికి వచ్చి..నిద్రిస్తున్న ఆమె నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బయట ఎవరిౖకెనా చెబితే చంపేస్తానని బెదిరించి వెళ్లిపోయాడు. గురువారం ఉదయం తాను పనిచేస్తున్న గ్రామంలోని కృష్ణారావు అనే వ్యక్తికి ఈ ఘటన గురించి ఏడుస్తూ చెప్పడంతో..ఆయన పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ మేరకు బాధిత వృద్ధురాలి ఫిర్యాదు మేరకు అశ్వారావుపేట సీఐ రవికుమార్ పర్యవేక్షణలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రవీణ్‌కుమార్ వివరించారు. -
వీడిన వృద్ధురాలి హత్యకేసు మిస్టరీ
రావులపాలెం: రావులపాలెంలో సంచలనం కలిగించిన గొలుగూరి శేషాయమ్మ(70) హత్యకేసు మిస్టరీ వీడింది. రావులపాలెం పోలీసులు మూడు రోజుల్లోనే కేసు ఛేదించి నలుగురు నిందితులను అరెస్టు చేశారు. అమలాపురం డీఎస్పీ ఎల్. అంకయ్య గురువారం సాయంత్రం రావులపాలెం పోలీస్‌స్టేçÙన్లో విలేకరుల సమావేశంలో చోరీ సొత్తుతోపాటు నింది తులను చూపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం రావులపాలెం చిన్నవంతెన సమీపంలోని రామాలయం వీధిలో గొలుగూరి శేషాయమ్మ అద్దెకు ఉంటోంది. పక్క పోర్షన్లో అద్దెకు ఉంటున్న సత్తి భాగ్యలక్ష్మి, సత్తి వీర్రాఘవరెడ్డి దంపతులు కిరా ణా వ్యాపారం చేసుకొంటున్నారు. వ్యాపారంలో నష్టాలు వచ్చి అప్పులపాలైన వారు శేషాయమ్మ వద్ద కూడా రూ. 40 వేలు అప్పుగా తీసుకున్నారు. భాగ్యలక్ష్మి అన్న కొవ్వూరి వెంకటరెడ్డి అరటి వ్యాపారం చేసి నష్టపోయి అప్పుల పాలయ్యాడు. శేషాయమ్మను చంపి ఆమె వద్ద ఉన్న డబ్బు, బంగారు ఆభరణాలు చోరీ చేసి తమ అప్పులు తీర్చుకోవాలని భాVýæ్యలక్ష్మి, వీర్రాఘవ రెడ్డి, వెంకటరెడ్డి, అతని భార్య రోజా పథకం రచించారు. ఆమేరకు గత నెల 28వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో సత్తి వీర్రాఘవరెడ్డి, వెంకటరెడ్డి రోడ్డుపై కాపలాగా ఉండగా భాగ్యలక్ష్మి, రోజాలు శేషాయమ్మను వడ్డీ డబ్బు ఇస్తామని పిలిచి ఆమె చీరకొంగునే మెడకు బిగించి భాVýæ్యలక్ష్మి కిందపడేయగా రోజా ఆమె నోరు ముక్కు మూసివేసి ఊపిరిరాడకుండా చేసి హత్య చేశారు. ఆమె ఒంటిపై ఉన్న 8 బంగారు గాజులు, రెండు పేటల బంగారు గొలుసు, దుద్దుల జత దొంగిలించారు. దర్యాప్తులో పోలీçసులకు అనుమానం రావడంతో భాVýæ్యలక్ష్మి, రోజాలతో పాటు వారి భర్తలను అదుపులోకి తీసుకుని విచారించడంతో వాస్తవాలు వెలుగు చూశాయి. వారివద్ద నుంచి శేషాయమ్మకు చెందిన 18 కాసుల ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నింది తులను శుక్రవారం కొత్తపేట కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీచెప్పారు. సీఐ పీవీ రమణ, ఎస్సై పీవీ త్రినాథ్, అదనపు ఎస్సై శోభన్‌కుమార్, ఏఎస్సై ఆర్‌వీరెడ్డి, పీఎస్సైలు సురేంద్ర, మూర్తి, కానిస్టేబుల్ స్వామిలను ఆయన అభినందించారు. -
వృద్ధ దంపతుల ఆత్మహత్యపై కేసు నమోదు
కుమార్తె, కుమారులు, బంధువులపైనా కేసులు కాకినాడ రూరల్: కాకినాడ – సామర్లకోట రోడ్డులో నివాసం ఉంటున్న తెలుగుదేశంపార్టీ నగర మహిళ అధ్యక్షురాలు, జన్మభూమి కమిటీ సభ్యురాలు పలివెల లక్ష్మిరాజు తల్లిదండ్రులు ఇద్దరూ ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆగమేఘాలపై వారిని దహనం చేసిన తీరు మరిన్ని అనుమానాలను రేకెత్తిస్తోందని లక్ష్మీరాజు బంధువలు కొందరు అర్బన్ వీఆర్వో పి. జగదీష్‌కు గురువారం ఫిర్యాదు చేశారు. ఆయన టూ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. వివరాల్లోకి వెళ్తే కాకినాడ–సామర్లకోట రోడ్డులోని ఐడియల్ కళాశాలకు కొద్ది దూరంలో రోడ్డు పక్కనే ఆక్రమిత స్థలాల్లో తెలుగు మహిళ నగర అధ్యక్షురాలు పలివెల లక్ష్మీరాజు, ఆ ఇంటి సమీపంలోనే ఆమె తల్లిదండ్రులు మల్లెల సూర్యనారాయణ (65), మల్లెల హైమావతి (50) ఉంటున్నారు. రోడ్డు విస్తరణలో లక్ష్మీరాజు ఇంటిని తొలగించడంతో ఆమె తల్లిదండ్రుల ఇంట్లోనే నివాసం ఉంటోంది. లక్ష్మీరాజు నిత్యం తల్లిదండ్రులను వేధించేదని, ఒక్కొక్కసారి చేయి కూడా చేసుకొనేదని, దాంతో వారు తీవ్ర మనస్తాపానికి గురై బుధవారం రాత్రి 9.30 – 10 గంటల మధ్య ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానికులు తెలిపారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి వచ్చేసరికి మృతదేహాలను కాకినాడ శ్మశాన వాటికకు తరలించినట్టు తెలుసుకొని అక్కడకు వెళ్లారు. అప్పటికే సూర్యనారాయణ, హైమావతిల దహన క్రియలను లక్ష్మిరాజు, ఆమె సోదరులు పూర్తి చేసేశారు. అక్కడే పోలీసులు లక్ష్మీరాజు, ఆమె సోదరులు, బంధువుల నుంచి సమాచారాన్ని నమోదు చేసుకున్నారు. వీఆర్వో జగదీష్ ఇచ్చిన సమాచారం మేరకు పలివెల లక్ష్మీరాజు, ఆమె ముగ్గురు అన్నదమ్ములపైన, ఆమె బంధువుల కొందరిపైన కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు టూ టౌన్ సీఐ చైతన్యకృష్ణ తెలిపారు. -
మృత్యువుతో పోరాడి.. చివరకు ఓడి...
‘మత్తు మందు’ సంఘటనలో అత్త మృతి ఆగంతకుడికిపై హత్య కేసు నమోదు అమలాపురం టౌన్ : అమలాపురంలో అత్తాకోడళ్లకు మత్తు ఇచ్చిన ఆగంతకుడు.. ఇల్లు దోచుకున్న ఘటనలో అత్త మరణించింది. మత్తు ప్రభావం నుంచి బయటపడకపోవడంతో, కోమాలో ఉండి చికిత్స పొందుతున్న అత్త గన్నవరపు సీతామహాలక్ష్మి(84) ఆదివారం ఉదయం చనిపోయింది. దీంతో చోరీకి పాల్పడిన ఆగంతకుడిపై పట్టణ సీఐ వైఆర్కే శ్రీనివాస్.. హత్య కేసు నమోదు చేశారు. ఈ నెల 24న పట్టపగలు అమలాపురం కూచిమంచి అగ్రహారంలోని గన్నవరపువారి వీధిలో పైఅంతస్తులో నివసిస్తున్న ఉపాధ్యాయుడు వెంకటరమణ ఇంట్లో ఈ ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఆయన ఇంట్లో లేని సమయంలో ఓ ఆగంతకుడు విద్యుత్ బిల్లు తీసుకునే వ్యక్తిగా ఇంట్లోకి వచ్చాడు. వెంకటరమణ భార్య, తల్లికి మత్తు మందు ఇచ్చి, రూ.7 లక్షల విలువైన బంగారు నగలు, వెండి వస్తువులు అపహరించాడు. మత్తుమందు ప్రభావంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన అత్తాకోడళ్లలో, కొన్ని గంటల తర్వాత కోడలు తెలివిలోకి వచ్చింది. ఘటన జరిగినప్పటి నుంచి మత్తు తీవ్రతతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన అత్త సీతామహాలక్ష్మిని పట్టణలలోని ఓ ఎమర్జన్సీ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీతామహాలక్ష్మి ఆదివారం మరణించడంతో ఆమె కుటుంబంలో విషాదం అలుముకుంది. మత్తు ఇవ్వడం వల్లే ఆమె మరణించిందన్న కారణంతో నిందితుడిపై పోలీసులు అదనంగా హత్య కేసు కూడా నమోదు చేశారు. అత్తాకోడళ్లకు క్లోరోఫామ్ ఇచ్చినట్టుగా వైద్యులు ధ్రువీకరించారు. ఈ కేసును త్వరగా ఛేదించాలని పోలీసులను డిప్యూటీ సీఎం, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఇప్పటికే ఆదేశించడంతో, ఈ కేసులో లోతుగా దర్యాప్తు జరుగుతోంది. స్థానికులు పథకం ప్రకారం చేశారా, బయటి నుంచి వచ్చిన వ్యక్తులు చేశారా అనే దిశగా విచారణ చేస్తున్నారు. -
పాతపథకాలకు ప్రారంభోత్సవాలా?
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వీణవంక: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటనతో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమిలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. యూపీఏ హయాంలో చేపట్టిన పథకాలకే శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారని ధ్వజమెత్తారు. ఆదివారం వీణవంకలో జరిగిన ఓ కార్యక్రమానికి వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మంచినీటి పథకాలకు కొత్తగా మిషన్ భగరీథ పేరుతో ప్రారంభోత్సవాలు చేస్తున్నారని విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా జైపూర్‌లో 1200ల మెగావాట్ల సింగరేణి విద్యుత్ కేంద్రం పనులు యూపీఏ హయాంలోనే 95 శాతం పూర్తయ్యాయని తెలిపారు. ఆ ప్లాంట్‌ను మోదీ ఇప్పుడు జాతీకి అంకితం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.10 వేల కోట్లు మంజూరు చేసిన సంగతి మర్చిపోయారని ప్రశ్నించారు. యూపీఏ ప్రభుత్వంలోనే మనోహరబాద్–కొత్తపల్లి రైల్వే లైన్‌కు గ్రీన్‌సిగ్నల్ వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ పాత పథకాలను కొత్తవి అంటూ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. మోడీ పర్యటన అంటూ కోట్లు ఖర్చుచేశారే తప్ప.. తెలంగాణకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. మెదక్ జిల్లా రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్న సంఘటనపై ప్రధాని స్పందించకపోవడం దారుణమని అన్నారు. తెలంగాణలో ఎన్నో సమస్యలు ఉన్నాయని.. వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఉద్యోగుల విభజనపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్న విషయం గుర్తించుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతామని స్పష్టం చేశారు. టీపీసీసీ చైర్మన్ వెంట మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షుడు మృత్యుంజయం, మాజీ ఎమ్మెల్యేలు ఆరపెల్లి మోహన్, అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు తుమ్మేటి సమ్మిరెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
మిర్యాలగూడ : స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1982–84వ సంవత్సరంలో ఇంటర్మిడియట్‡పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు ఆదివారం కళాశాలలో సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు సుబ్బారావు, రామశేషయ్య, సత్యనారాయణలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు నజీర్, ఉపేందర్‌రెడ్డి, నర్సింహ్మరావు, వేణు, ప్రేమసాగర్, మధు, వెంకటేశ్వర్లు, సోమలింగం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
గిన్నిస్ పుటల్లో ఎక్కనున్న గజరాజు!
కేరళ గజరాజుకు ప్రత్యేక గౌరవం దక్కింది. ఆసియాలోనే అత్యంత ఎక్కువకాలం జీవించిన ఏనుగుగా 86 ఏళ్ళ వృద్ధ ఏనుగు గిన్నిస్ రికార్డులకు ఎక్కనుంది. వృద్ధాప్యంలోనూ హుషారుగా గడిపేస్తున్న ఏనుగు గురించి యజమానులు.. ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డ్ (టీడీబీ) గిన్నిస్ అధికారులకు వివరాలతో లేఖ రాశారు. ప్రపంచంలోనే జీవించి ఉన్న అత్యంత వృద్ధ ఏనుగుగా దాక్షాయణి గురించి లేఖలో వివరించారు. ప్రాణాలతో జీవిస్తున్న ఏనుగుల్లో దాక్షాయణి ప్రపంచంలోనే అత్యంత వృద్ధ ఏనుగు అని ట్రావెన్ కోర్ దేవస్థాన బోర్డు అధ్యక్షుడు పరీయర్ గోపాలకృష్ణన్ తెలిపారు. కేరళ అటవీశాఖ రికార్డులు కూడా అదే విషయాన్ని స్సష్టం చేస్తున్నట్లు వెల్లడించారు. వృద్ధ ఏనుగుగా గుర్తింపు పొందిన దాక్షాయణిని ఈ సందర్భంగా ట్రావెన్ కోర్ బోర్డు ప్రత్యేకంగా సత్కరించింది. దేవస్వం మినిస్టర్ కడకంపల్లి సురేంద్రన్ సత్కార కార్యక్రమాన్ని ప్రారంభించగా.. ఫారెస్ట్ మినిస్టర్ కె. రాజు పంచదేరం టైటిల్ తో ఏనుగును సత్కరించారు. ట్రావెన్ కోర్ రాజులు దాక్షాయణిని టీడీబీ కి బహుమతిగా ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఏనుగు ఛంగలూర్ మహాదేవ ఆలయంలో ఉంటోంది. కేరళ పోస్టల్ సర్వీస్ కూడా దాక్షాయణి పేరిట ఓ ప్రత్యేక పోస్టల్ కవర్ ను రిలీజ్ చేసే ఉద్దేశ్యంలో ఉంది. తైవాన్ కు చెందిన ఏనుగు.. 85 ఏళ్ళ వయసులో 2003 లో చనిపోగా... దాక్షాయణి 86 ఏళ్ళు జీవించిఉన్న ఏనుగుగా ప్రత్యేక గౌరవాన్ని దక్కించుకుని, గిన్నిస్ పుటలకు ఎక్కనుంది. -
పాత డిజైన్‌ను కొనసాగించాలి
» స్వాపురం (భువనగిరి అర్బన్) : మండలంలోని బస్వాపురం రిజర్వాయర్ ప్రాజెక్ట్‌ను పాత డిజైన్ ప్రకారమే నిర్మాణం చేయాలని భూనిర్వాసితుల కమిటీ కన్వీనర్ దయ్యాల నర్సింహ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం బస్వాపురంలో రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఇటీవల పెంచిన టీఎంసీలను తగ్గించాలని, కొంత మంది ప్రయోజనాల కోసం 14.6 టీఎంసీలుగా పెంచాలని నిర్ణయం తీసుకోవడం సరైందికాదన్నారు. ఇప్పటికైనా గ్రామాలను, గ్రామ ప్రజలను, రైతులను దృష్టిలో పెట్టుకుని పెంచిన టీఎంసీలను తగ్గించాలన్నారు. అలాగే భూములు కోల్పోయే రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలని, ఇళ్లకు ఇళ్లు కట్టించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సర్పంచ్ రాసాల నిర్మల, నాయకులు వెంకటేశం, ఉడుత విష్ణు, సత్యనారాయణ, రమేశ్, నర్సింహ, జహంగీర్, వెంకటేశం, మల్లయ్య పాల్గొన్నారు. -
నాన్న తోసేశాడు.. చెట్లు రక్షించాయ్!
థానేః ఆరేళ్ళ ఆ చిన్నారి పట్ల తండ్రే కాసాయి వాడిలా ప్రవర్తించాడు. పసిప్రాణం అని చూడకండా నిర్దాక్షిణ్యంగా నదిలో విసిరేశాడు. అయితే తండ్రి రాక్షసుడిలా ప్రవర్తించినా... నదీమతల్లి మాత్రం ఆమె గర్భంలో అల్లారుముద్దుగా పెరుగుతున్న పచ్చని చెట్లను ఆమె ప్రాణాలకు అడ్డువేసింది. దాంతో పదకొండు గంటలపాటు చెట్లను పట్టుకొని ప్రాణాలు కాపాడుకొన్న ఆమెను... అదృష్టవశాత్తూ అటుగా వచ్చిన ఓ సెక్యూరిటీ గార్డు రక్షించాడు. థానే, బద్లాపూర్ లోని వాలివ్లీ బ్రిడ్జి ప్రాంతంలో జరిగిన ఘటన కన్నతండ్రి కర్కశత్వానికి నిదర్శనంగా నిలిచింది. బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు గుప్పెట్టో పెట్టుకొని చెట్లను పట్టుకొని ఏడుస్తున్నఆరేళ్ళ చిన్నారిని అక్కడి కనస్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్న ఓ సెక్యూరిటీ గార్డు చూసి రక్షించడంతో ఆమె ప్రాణాలతో బయట పడింది. కొత్త బూట్లు కొనిస్తానని నమ్మించి, ఉత్సాహంగా తనతో వచ్చిన ఆరేళ్ళ కూతుర్ని ఆమె తండ్రితోపాటు, అతడి స్నేహితుడు బలవంతంగా అల్హాస్ నదిలోకి తోసేసిన ఘటన స్థానికులను విస్మయ పరచింది. స్థానిక మోహన్ గ్రూప్ కనస్ట్రక్షన్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న 35 ఏళ్ళ రమేష్ భైర్ సదరు చిన్నారి నదిలో ప్రాణాలతో ఉన్నట్లుగా గమనించాడు. తాను నదివైపునుంచీ వెడుతుండగా ఎక్కడో పాప అరుపులు, ఏడుపు వినిపించాయని, కానీ నదిలోకి చూస్తే ఎవ్వరూ కనిపించలేదని చెప్పాడు. తర్వాత కాసేపు నిశితంగా బ్రిడ్జిమీద నిలబడి చూస్తే బ్రిడ్జి కందిభాగంలోని చెట్లను పట్టుకొని ఓ పాప కనిపించడంతో నిర్ఘాంతపోయిన తాను వెంటనే పోలీసులకు, ఫైర్ సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం అందించినట్లు తెలిపాడు. 15 నిమిషాల్లో అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది పాపను రక్షించినట్లు రమేష్ వెల్లడించాడు. పాపను నదినుంచీ బయటకు తీసిన అనంతరం ఆమె చెప్పిన వివరాలను బట్టి వర్తక్ నగర్ కు చెందిన ఏక్తా తులసిరామ్ సియానిగా పాపను గుర్తించామని రమేష్ భైర్ తెలిపాడు. నదిలో ఎలా పడిపోయావ్ అని అడిగితే.. తన తండ్రి, అతడి స్నేహితుడు కలసి తనను నదిలోకి విసిరేసినట్లు తెలిపిందని చెప్పాడు. తనకు షూ కొనిస్తానని చెప్పి... బయటకు తీసుకెళ్ళి నిదిలో విసిరేశారని పాప చెప్పిన వివరాలను బట్టి కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు తమకు ఫోన్ కాల్ రాగానే ఘటనా ప్రాంతానికి చేరుకొని, ఓ తాడుకు ఎయిర్ ట్యూబ్ ను కట్టి నదిలోకి దిగి, పాపను ట్యూబ్ పై కూర్చోపెట్టుకొని 20 నిమిషాల్లోపలే ప్రాణాలతో రక్షించినట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు. ఇదిలా ఉంటే పాప తల్లి వర్తక్ నగర్ పోలీస్ స్టేషన్ లో అంతకు ముందురోజే మిస్సింగ్ కేసు నమోదు చేసిందని, మైనర్ బాలిక కావడంతో కడ్నాప్ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు సీనియర్ పోలీస్ ఇనస్పెక్టర్ కెజి గవిట్ తెలిపారు. అనంతరం బద్లాపూర్ నది ప్రాంతంలో పాప దొరికి నట్లుగా సమాచారం అందడంతో ఆమెను వైద్య పరీక్షలకు పంపించామని, తమ సిబ్బంది తండ్రి ఆచూకీ కోసం వెతుకుతున్నట్లు తెలిపారు. -
పదేళ్ళు దాటితే..
రాయపూర్ః దేశంలో పొల్యూషన్ పై పోరాటం ప్రారంభమైంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన పద్ధతులతో కాలుష్యాన్ని నివారించేందుకు అక్కడి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. అందులోభాగంగా తాజాగా పదేళ్ళు దాటిన ట్రక్కులు, బస్సులు, ఆటోలను బ్యాన్ చేసేందుకు ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఓ సంవత్సరం పాటు గడువు ఇస్తున్నామని, ఆలోపు కొత్త వాహనం కొనే ప్రయత్నం చేసుకోవాలని వాహన యజమానులకు రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అంతేకాక 'ఈ' రిక్షాలను కొనేవారికి ప్రత్యేక ఆర్థిక సాయం అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం కొత్త ప్రతిపాదన అమల్లోకి తెస్తోంది. పన్నెండేళ్ళు దాటిన బస్సులు, పదేళ్ళు దాటిన ట్రక్కులు, ఆటో రిక్షాలు వంటి కమర్షియల్ వాహనాలు రోడ్లపై తిరగకుండా నిలిపివేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. గాలిలో కాలుష్యాన్ని తగ్గించి, వాతావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా ముందడుగు వేయాలని ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్.. సీనియర్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఛత్తీస్ ఘడ్ ఎన్విరాన్మెంట్ కంజర్వేషన్ బోర్డ్ ఛైర్ పర్సన్ అమన్ కుమార్ సింగ్ తెలిపారు. ఇప్పటినుంచీ పదేళ్ళు దాటిన ట్రక్కులు, ఆటోలు, పన్నెండేళ్ళు దాటిన బస్సులకు అనుమతులు ఇవ్వొద్దని, వాహన యజమానులు కొత్త వాహనాలు కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఓ సంవత్సరం పాటు గడువు ఇవ్వాలని సూచించినట్లు తెలిపారు. అలాగే ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన ఎనిమిదేళ్ళు దాటిన పాత వాహనాలకు రిజిస్ట్రేషన్లు కూడ చేయొద్దని ఆదేశించినట్లు తెలిపారు. 'ఈ' రిక్షాలను ప్రోత్సహించేందుకు గాను ఆర్థిక సాయం అందిస్తామని అన్నారు. వాతావరణ పరిరక్షణలో భాగంగా మరో నిర్ణయం తీసుకున్నామని, ఆన్ లైన్ మానిటరింగ్ తో పారిశ్రామిక కాలుష్య పరిమాణాన్ని అంచనా వేస్తామని సీఎం రమణ్ సింగ్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నెల్లో రెండుసార్లు పరిశ్రమల యాజమాన్యాలు ప్రవర్తిస్తే ఆయా యూనిట్లను మూసివేయిస్తామన్నారు. రాష్ట్ర రాజధాని రాయపూర్ లో పొల్యూషన్ తగ్గించేందుకు ఓ మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. గత నెల్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూ హెచ్ వో) వెల్లడించిన నివేదికల ప్రకారం అత్యధిక కాలుష్యంగల నగరాల్లో రాయపూర్ ఏడో స్థానంలో ఉందని, ప్రత్యేక యాక్షన్ ప్లాన్ తో రాయపూర్ లో వచ్చే రెండేళ్ళలో కాలుష్యం నివారించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మాస్టర్ ప్లాన్ లో భాగంగా రాయపూర్ లోని రైల్వే ట్రాక్ ప్రాంతాల్లో నివసించే వారికి ప్రధానమంత్రి ఉజ్వల్ పథకం ద్వారా డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లు అందిస్తామన్నారు. ఇందుకోసం ప్రత్యేక సర్వే చేపడుతున్నట్లు ఓ అధికారి తెలిపారు. అలాగే రాజధానిలో ఈ సంవత్సరం సుమారు 30 లక్షల వరకూ మొక్కలు నాటేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని, గృహాల్లోని వ్యర్థాలకోసం సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటుకు సైతం ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వెల్లడించారు. -
అడవుల్లో అద్భుతాన్ని కనిపెట్టిన బాలుడు!
మెక్సికో: శాటిలెట్ ఫొటోల ఆధారంగా ఓ బాలుడు అద్భుతాన్ని ఆవిష్కరించాడు. దట్టమైన అడవుల్లో నిక్షిప్తమైన, ఎవ్వరికీ కనపడకుండా మరుగున పడిపోయిన మయన్ నగరాన్ని గుర్తించాడు. మాయ నాగరికతకు చెందిన చరిత్ర ఆధారంగా పరిశోధనలు చేశాడు. సెంట్రల్ అమెరికాకు చెందిన మెక్సికన్ పర్వత ప్రాంతంలో వేల ఏళ్ళనాడు మరుగున పడిపోయిన నగరాన్ని 15ఏళ్ళ విలియమ్స్ గడౌరీ గుర్తించాడు. ఇప్పటివరకూ పరిశోధకుల కంట కూడ పడని దట్టమైన అడవులు, కొండలు, గుట్టల్లో దాగి ఉన్న ఆ అద్భుత 'మాయ' నగరాన్ని శాటిలెట్ చిత్రాల ద్వారా గుర్తించిన బాలుడు... ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా మారిపోయాడు. ప్రాచీన కళలు, సంస్కృతి ప్రతిబింబించే కట్టడాలు, అద్భుత నిర్మాణాలు ఇప్పుడా నగరంలో బయటపడి, వేల యేళ్ళ చరిత్రకు ఆనవాళ్ళుగా మారాయి. 2014 సంవత్సరంలోనూ పురావస్తు శాఖ వారు రెండు పురాతన పట్టణాలను కనుగొన్నారు. అయితే అప్పట్లో అడవుల్లో దాగి ఉన్న ఈ నగరాన్ని మాత్రం గుర్తించలేకపోయారు. తాను చదివిన ఓ పుస్తకం ఆధారంగా ఆ అదృశ్య నగరాన్ని గుర్తించినట్లు విలియమ్స్ గడౌరీ చెప్తున్నాడు. మాయ నాగరికత నాటి నిర్మాణాలన్ని మారుమూల ప్రాంతాలు, దట్టమైన అడవులు, పర్వతాల నడుమే ఉన్నట్లు తెలుసుకున్న అతడు... అలా ఎందుకు నిర్మించేవారో తెలుసుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఆ విషయంపై అధ్యయనాలు ప్రారంభించాడు. ఆ కాలంలో ప్రజలు నక్షత్రాలను ఎక్కువగా పూజించేవారని తెలుసుకుని ఆదిశగా అధ్యయనాలను మొదలు పెట్టాడు. నక్షత్రాల ఆధారంగా నగరాలను గుర్తించవచ్చన్న కోణంలో అడుగులు వేశాడు. గడౌరీ అనుకున్నట్లుగానే ఇప్పటిదాకా గుర్తించిన నగరాలన్నీ 22 నక్షత్ర సమూహాల స్థానంలోనే ఉన్నట్లు గుర్తించాడు. కానీ ఇంతకు ముందు పరిశోధకులు గుర్తించిన వాటిలో ఓ నగరం మిస్ అయినట్లు తెలుసుకున్న అతడు.. గూగుల్ ఎర్త్ ఆధారంగా పరిశోధనలు కొనసాగించి, రాడార్ శాట్-2 ఉపగ్రహ చిత్రాలద్వారా అడవుల్లో దాగిఉన్న అద్భుతాన్ని కనుగొన్నట్లు తెలిపాడు. ప్రస్తుత పరిస్థితుల్లో మానవమాత్రులు అడుగు పెట్టలేని అ మారుమూల యుకాతాన్ అడవుల్లోని నగరానికి తాను.. కాక్ చి అని గాని, మౌత్ ఆఫ్ ఫైర్ అనిగాని కొత్త పేరు పెట్టాలని కూడ భావిస్తున్నాడు. అయితే ఆ నగరం మానవ నిర్మితంగానే కనిపిస్తోందని, అయితే ప్రపంచం ఈ నంగరం ద్వారా కొత్త ఆవిష్కణను చూసే అవకాశం ఉందని న్యూ బ్రున్స్విక్ విశ్వవిద్యాలయం రిమోట్ సెన్సింగ్ లేబొరేటరీకి చెందిన డాక్టర్ ఆర్మాండ్ లా రాక్యూ చెప్తున్నారు. శాటిలెట్ చిత్రాల్లోని ఒక ఫొటో అక్కడి నిర్మాణాలు చతురస్రాకారంలో పిరమిడ్ ను పోలి ఉన్నట్లుగా తెలుస్తోందని చెప్తున్నారు. విలియమ్స్ కనుగొన్న పద్ధతిలో మాయన్ నగరం ఆధారంగా పురాతత్వవేత్తలు మరిన్ని నగరాలను కూడ గర్తించే అవకాశం ఉందన్నారు. తన కొత్త ఆవిష్కరణలను సైంటిఫిక్ జనరల్ లో ప్రచురించిన విలియమ్స్... 2017 లో జరిగే బ్రెజిల్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెయిర్ లో ప్రదర్శించనున్నట్లు కూడ తెలుస్తోంది. -
వందేళ్ళ వయసులో '100 మీటర్ల' రికార్డు
వందేళ్ళ వయసులో వంద మీటర్ల పరుగు... ఊహించడానికే కష్టంగా కనిపిస్తుంది కదూ... కానీ ఆ పోటీల్లో పాల్గొని ఏకంగా కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది ఇడా కీలింగ్. వందేళ్ళు జీవించడమే ఓ రికార్డుగా మారుతున్న ఈ కాలంలో వందేళ్ళ వయసులో వందమీటర్ల రేసులో పాల్గొని ఆమె ప్రపంచ రికార్డును సాధించింది. 80 ఏళ్ళ ఇతర పోటీదారుతో రేసులో కేవలం అత్యంత తక్కువ సమయంలో పరుగును పూర్తి చేసి ఇంతకు ముందున్న రికార్డును బ్రేక్ చేసింది. ఇడా కీలింగ్... వందేళ్ళ వయసులోనూ వంద మీటర్ల రేసులో పాల్గొనేందుకు వెనుకాడలేదు. పాల్గోవడమే కాదు ఏకంగా ఇంతకు ముందున్నజమైకా స్పింటర్ ఉసేన్ బోల్ట్ నెలకొల్పిన 9.56 సెకన్లలో 100 మీటర్ల ప్రపంచ రికార్డును తిరగరాసింది. కేవలం 1 నిమిషం17.33 సెకన్లలో వంద మీటర్ల రేస్ ను అవలీలగా పూర్తి చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పింది. పెన్ రిలే కార్నివాల్ గా పిలిచే పెన్ రిలే పోటీలు అమెరికాలో నిర్వహించే అత్యంత పురాతన, అతి పెద్ద ట్రాక్, ఫీల్డ్ పోటీలు. ఇవి ప్రతి యేటా ఏప్రిల్ 21 నుంచి నిర్వహిస్తుంటారు. ఫిలడెల్ఫియా ఫ్రాంక్లిన్ ఫీల్డ్ లోని యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా 1895 నుంచి ఈ పోటీలను నిర్వహిస్తోంది. ఈసారి పోటీల్లో పాల్గొని రికార్డును సాధించిన ఇడా కీలింగ్... రుచికోసం తినొద్దని, పోషక పదార్థాలు మాత్రమే ఆహారంగా తీసుకోవాలని, రోజుకోసారైనా వ్యాయామం చేయాలని క్రీడాకారులతోపాటు, సాధారణ ప్రజలకూ సలహా ఇచ్చింది. అంతేకాదు మనల్ని మనమే ప్రేమించుకోవాలని, మనమేం చేయాలనుకుంటున్నామో అది చేయాలని, మనకోసం ఎవ్వరూ ఏమీ చేయరంటూ సూచించింది. పౌర హక్కుల ఉద్యమ సమయంలో ఎంతో చురుగ్గా పాల్గొన్న కీలింగ్ కు నలుగురు కొడుకులుండేవారు. దశాబ్దాల క్రితమే భర్త మరణించగా.. ఇద్దరు కొడుకులు తీవ్ర మాదక ద్రవ్యాల అలవాటుతో మృతి చెందినట్లు ఓ పత్రిక అందించిన సమాచారాన్నిబట్టి తెలుస్తోంది. వయసు మీరుతుంటే ఒంటిపై పడే రోగాలకు పరుగే తన ప్రధాన చికిత్సగా మార్చుకున్న కీలింగ్... మొదటిసారి 67 ఏళ్ళ వయసులో రేసింగ్ లో పాల్గొంది. ఆ తర్వాత తన పరుగును ఎప్పుడూ ఆపలేదని ఓహియో బీకన్ జర్నల్ లో నివేదించిన వివరాలను బట్టి తెలుస్తోంది. -
1938లో డిగ్రీ.. 2016లో పీజీ..
పాట్నాః 'పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ' అన్న చందంగా ఉంది ఆ వృద్ధుడి ప్రయత్నం. 97 ఏళ్ళ వయసులోనూ చదువంటే సై అంటున్నాడు. ఎప్పుడో ఏడున్నరు దశాబ్దాల క్రితం గ్యాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయన.. ఇప్పుడు మళ్ళీ ఎకనామిక్స్ లో ఎం.ఏ పరీక్షలు రాసేందుకు సిద్ధమయ్యాడు. కుటుంబ బాధ్యతలతో డిగ్రీతోనే ఆపేయాల్సి వచ్చిన చదువును తిరిగి కొనసాగిస్తున్నాడు. బీహార్ కు చెందిన రాజ్ కుమార్ వైశ్యా ఎకనామిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ కోసం గతేడాది ఎన్ రోల్ చేసుకున్నాడు. 97 ఏళ్ళ వయసులోనూ మూడు గంటలపాటు ఎగ్జామ్ సెంటర్లో కూర్చొని మరీ ఆంగ్లంలో సమాధానాలను రాశాడు. 1938 లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రాజ్ కుమార్.. అప్పట్లో కుటుంబ బాధ్యతలతో పై చదువులు చదువలేక పోయాడు. అందుకే ఇప్పడు తన కోర్కెను తీర్చుకునేందుకు సన్నద్ధమయ్యాడు. నలందా ఓపెన్ యూనివర్శిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా పొందేందుకు 97 ఏళ్ళ వయసులో పరీక్షలు రాశాడు. ఎం.ఏ ఎకనామిక్స్ లో మొదటిభాగం పరీక్ష రాసేందుకు ఆయన సుమారు 23 పేపర్ షీట్లను వినియోగించినట్లు వర్శిటీ అధికారులు తెలిపారు. మిగిలిన విద్యార్థులకు ఏమాత్రం తీసిపోకుండా మూడు గంటలపాటు పరీక్షా కేంద్రంలో కూర్చొని మరీ పరీక్షలు రాయడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తించింది. ఆయనతోపాటు పరీక్షలు రాసిన వారంతా ఆయన మనవలకంటే కూడ చిన్నవారేనట. మాడ్చేస్తున్న ఎండలకు భయపడి జనం ఇళ్ళనుంచి బయటకు రాలేని సమయంలో ఆ వృద్ధుడు మిగిలిన యువ విద్యార్థులతో కలసి ఉత్సాహంగా పరీక్షలు రాశాడని వర్శిటీ అధికారులు చెప్తున్నారు. అయితే వైశ్యా ఈ వయసులో ఎకనామిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేయాలన్న పట్టుదలకు వెనుక రెండు కారణాలున్నాయట. ఒకటి తాను ఎం.ఏ పూర్తి చేయాలన్న కోరిక, రెండోది భారత్ ఎందుకు ఆర్థిక ప్రకగతిని సాధించి, సమస్యలను అధిగమించలేకపోతోందో తెలుసుకోవాలన్న ఆరాటమూనట. అందుకే ఇప్పుడు పరీక్ష రాసిన రాజ్ కుమార్...తన కల నెరవేరిందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. 1920 లో ఉత్తర ప్రదేశ్ బరెల్లీ పట్టణంలో పుట్టిన రాజ్ కుమార్ వైశ్యా... జార్ఘండ్ లో ఉన్న ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ 1980 లో పదవీవిరమణ పొందారు. ఆగ్రా యూనివర్శిటీలో 1938 లో డిగ్రీ పూర్తి చేసి, 1940 లో లా పట్టాను కూడ పొందారు. అయితే కుటుంబ బాధ్యతలతో తాను మాస్టర్స్ డిగ్రీని పొందలేకపోయానన్న కోరిక అలాగే ఉండిపోయిందని, ఇప్పుడా కోరిక తీరిందని వైశ్యా చెప్తున్నారు. పదేళ్ళ క్రితం భార్య చనిపోయిన అనంతరం వైశ్యా.. పాట్నా రాజేంద్రనగర్ కాలనీలోని చిన్న కుమారుడు సంతోష్ కుమార్ వద్ద ఉంటున్నాడు. సంతోష్ కుమార్ పాట్నాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పనిచేసి రిటైరయ్యారు. ఆయన భార్య భారతి కూడ పాట్నా యూనివర్శిటీలో ప్రొఫెసర్ గా పనిచేసి రిటైరయ్యారు. 97 ఏళ్ళ వయసులోనూ ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్న వైశ్యా... భారత శాఖాహార భోజనాన్నే ఇష్టపడతాడట. ఎప్పుడూ వేపుళ్ళను తిననని, మితంగానే భుజిస్తానని కూడ చెప్తున్నాడు. -
'యాపిల్' రీసైక్లింగ్ లో టన్ను బంగారం!
కంచి పట్టు చీరలు పాతవైనా వాటికో విలువ ఉంటుంది. ఎందుకంటే వాటి నేతకు వినియోగించే బంగారం, వెండి, కాపర్ వంటి వస్తువులు తిరిగి పనికొస్తాయి. అలాగే యాపిల్ ఐ ఫోన్లు బ్రాండ్ ఇమేజ్ మాత్రమే కాదు.. పాతపడిపోయినా అందులో వినియోగించే వస్తువులవల్ల కూడ దానికో విలువ ఉంటుందన్నమాట. ఇటీవల యాపిల్ కంపెనీ పాత ఫోన్లు రీసైకిల్ చేసి ఏకంగా ఓ టన్ను బంగారాన్ని సేకరించిందట. అంతేకాదు దాంతోపాటు ఫోన్లో వినియోగించే అల్యూమినియం, రాగి, స్టీల్ వంటి పదార్థాలను కూడ మిలియన్ల కొద్దీ టన్నులు సంపాదించిందట. యాపిల్ డివైజ్ లను రీ సైకిల్ చేయడం ద్వారా ఒక సంవత్సరంలో కంపెనీ ఓ టన్నుకు పైగా బంగారాన్ని సేకరించిందట. దాంతోపాటు 10.4 మిలియన్ కిలోల స్టీల్, రెండు మిలియన్ కిలోల అల్యూమినియం, 1.4 మిలియన్ కిలోల రాగిని కూడ సేకరించింది. ఒక్క బ్రాండ్ నేమ్ కే కాదు... ఫోన్ లో వినియోగించే వస్తువులు కూడ విలువైనవి కావడంతోనే యాపిల్ ఫోన్ కు అంత క్రేజ్ ఉందన్నమాట. పూర్తిగా పారేసే బదులు అవసరం లేని, పనికిరాని వస్తువులు పాత సామాన్ల వాళ్ళకి అమ్మేస్తుంటాం. అలానే యాపిల్ కంపెనీకూడ పనికిరాని ఐఫోన్లు, ఐ ప్యాడ్లు, మ్యాక్ కంప్యూటర్ల నుంచి 2015 సంవత్సరంలో సుమారు 28 మిలియన్ల యూరోలు ఖరీదైన మెటల్ ను సేకరించి సొమ్ము చేసుకుందట. మంచి బ్రాండ్ ఎలక్ట్రానిక్ వస్తువులు త్వరగా పాడవకుండా ఉండేందుకు వాటిలో కొద్దిపాటి బంగారాన్ని కూడ వినియోగిస్తుంటారు. ఈ నేపథ్యంలో యాపిల్ కంపెనీ రీ సైక్లింగ్ కార్యక్రమంలో భాగంగా పనికిరాని, పాత యాపిల్ వస్తువులను వినియోగదారులకు డబ్బు చెల్లించి కొనుగోలు చేసి కర్మాగారంలో శుద్ధి చేస్తుంది. ఇందులో లక్షల ఖరీదైన ఉక్కు, అల్యూమినియం, రాగిని సేకరించింది. తమ కంపెనీ ఎలక్ట్రానిక్ వస్తువులు తయారీలో నాణ్యతకోసం ఖరీదైన, విలువైన వస్తువులను వాడతామని యాపిల్ కంపెనీ సంవత్సరాంతపు రీసైక్లింగ్ నివేదికలో వెల్లడించింది. అంతేకాక ఇలా రీ సైకిల్ చేయడంవల్ల ఆయా పరికరాల్లోని పునరుత్పాదక శక్తి వినియోగంతోపాటు.. ప్రకృతికి, మనుషులకు ఎటువంటి నష్టం కలగకుండా ఉంటుందని తెలిపింది. తమ కంపెనీ వస్తువులద్వారా చైనా సరఫరాదారులతో పాటు ప్రపంచవ్యాప్తంగా అందరికీ పరిశుభ్రతను పాటించే అవకాశం ఉంటుందని యాపిల్ తన నివేదికలో తెలిపింది. -
బాలుడి కిడ్నాప్ ’విషాదాంతం’
-
ఆ అమెరికన్ డైమ్ చాలా కాస్ట్లీ గురూ..!
పది సెంట్లు విలువైన అమెరికన్ 'డైమ్' (నాణెం) ఇప్పుడు ఏకంగా రెండు మిలియన్ డాలర్లు పలికింది. నాణేల సేకరణే హాబీగా ఉన్నఓ వ్యక్తి ఆ పురాతన నాణేన్ని దక్కించుకునేందుకు ఏకంగా రెండు మిలియన్ డాలర్లు చెల్లించాడు. అయితే అంత డబ్బు చెల్లించాడంటే అందులో కచ్చితంగా ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుందని ఊహిస్తున్నారు కదూ... అవును మీరు ఊహించింది నిజమే. ఆ నాణెం అత్యంత ప్రాముఖ్యత కలిగిన అమెరికాకు చెందిన 1894 ఎస్ బార్బర్ డైమ్... ప్రపంచంలోనే అరుదైన నాణెంగా గుర్తింపు కూడా పొందింది. తంపాలోని హెరిటేజ్ ఆక్షన్స్ లో వేలానికి పెట్టిన ఆ నాణెం 1,997 డాలర్లకు అమ్ముడుపోయి వార్తల్లోకెక్కింది. 1804 డాలర్, 1913 లిబర్టీ నికెల్, 1894 ఎస్ బార్బర్ నాణేలు అమెరికన్ నాణేల చరిత్రలోనే అత్యంత ప్రాచీనమైన, అరుదైనవిగా గుర్తింపు పొందాయి. అదే విషయాన్ని హెరిటేజ్ ఆక్షన్స్ ఓ పత్రికా ప్రకటనలో తెలిపింది. శాన్ ఫ్రాన్సిస్కో మింట్ అప్పట్లో 2.5 మిలియన్ల డైమ్ లను ముద్రించిందట. అయితే అందులో సుమారు పది నాణేలు ఇప్పటికీ ఉనికిలో ఉన్నాయి. 1893 లో ఆర్థిక సంక్షోభం ఏర్పడటంతో కొత్త నాణేల ముద్రణకు డిమాండ్ ఏర్పడింది. దీంతో డైమ్ లను మెల్ల మెల్లగా కరిగించేశారు. అమెరికాలోని ఆక్షన్ హౌస్ లో జనవరి 6 నుంచి 11 వరకు పలు ఆమెరికన్ నాణేలను వేలానికి పెట్టారు. అయితే వీటిలో మిగిలిన అన్ని నాణేలు వందలు, వేల డాలర్లకే అమ్ముడు పోయాయి. ఇంతకు ముందు 2013 లో 1794 కు చెందిన ఓ వెండి డాలర్.. వేలంలో 10.016.875 డాలర్లు పలికి రికార్డు సృష్టించినట్లు కాలిఫోర్నియా.. ఇర్విన్ లోని వేలంపాటదారుడు స్టాక్స్ బౌవర్స్ చెప్తుండగా... ఇప్పుడు ఈ నాణెం సుమారు రెండు మిలియన్ డాలర్ల రేటు పలికి వార్తల్లో నిలిచింది. -
తరగతి గదిలో మూత్రం పోసిందని...
-
హైదరాబాద్‌లో నాలుగేళ్ల బాలుడు కిడ్నాప్
-
భూసేకరణ గీసిన చావుగీత
భార్య సంవత్సరీకం చేయలేనన్న బెంగతో పేదరైతు బలవన్మరణం ఏడు పదుల వృద్ధ్యాప్యం. చేతిలో చిల్లిగవ్వలేదు. కష్టసుఖాల్లో యాభై ఏళ్లు పాలుపంచుకున్న భార్య ఏడాది క్రితమే కాలధర్మం చేసింది. ఆమె సంవత్సరీకం నిర్వహించాలన్నది ఆ పేద రైతు చిన్న ఆశ. ఉన్న పదిసెంట్ల పొలాన్నిను అమ్మకానికి పెట్టారు. అయితే ఊహించని ఎదురుదెబ్బ. పోర్టు నోటిఫికేషన్లో అధికారులు ఆ పది సెంట్లనూ చేర్చారు. రూ.లక్షకు పొలాన్ని కొనేందుకు రూ.10 వేలు అడ్వాన్సుగా ఇచ్చిన రైతులు ఆ మొత్తాన్ని తిరిగి తీసుకున్నారు. భార్య సంవత్సరీకం చేయలేని ఈ బతుకు ఎందుకు అనుకున్నాడో లేక ఆమె వద్దకే వెళ్లి తన నిస్సహాయతను చెబుతామనుకున్నాడోగానీ ఆ పేద రైతు ఇంటి ముందున్న చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.. కాకర్లమూడి (పెడన రూరల్) : బందరు పోర్టు భూసేకరణలో తనకున్న కొద్ది పాటి భూమి పొతుందనే బెంగతో పేద రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన పెడన మండలం కాకర్లమూడి గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన లింగం వెంకటేశ్వరరావు(70)కు పది సెంట్ల పొలం ఉంది. కొద్దిపాటు భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తుంటారు. ఆయన భార్య సీతామహాలక్ష్మి గతేడాది మృతి చెందారు. వారికి నలుగురు కుమారులు, ఒక కుమార్తె. ఒక కుమారుడు గతంలో చనిపోయారు. పిల్లలందరికీ వివాహాలుకావడంతో వేరువేరుగా జీవిస్తున్నారు. వారిదీ అంతంత మాత్రపు జీవితాలే. భార్య సీతామహాలక్ష్మి చనిపోవడంతో మూడో కుమారుడు శివ ఇంటి వద్ద వెంకటేశ్వరరావు జీవనం సాగిస్తున్నారు. చేటుచేసిన పోర్టు నోటిఫికేషన్ మచిలీపట్నం పోర్టు కోసం బందరు మండలంలోని పలు గ్రామాలతో పాటు పెడన మండలంలో కాకర్లమూడి గ్రామంలోనూ భూములు సేకరించాలని అధికారులు నిర్ణయించారు. కాకర్లమూడిలో 1879 మంది రైతులకు చెందిన 864 ఎకరాల పొలాలను సేకరిస్తామని భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేశారు. లింగం వెంకటేశ్వరరావుకు చెందిన పది సెంట్లు పొలం కూడా ఆ నోటిఫికేషన్లో ఉంది. పది సెంట్లలో అతను ఇన్నాళ్లూ గొంగూర, తోటకూర, పొట్ల, చిక్కుడు సాగుచేసుకుని జీవనం సాగిస్తుం చారు. గత ఏడాది మరణించిన భార్యకు ఈ నెల 30వ తేదీన సంవత్సరీకం చేయాలని నిర్ణయించుకున్న వెంకటేశ్వరరావు ఆ పది సెంట్లు పొలాన్ని అమ్మకానికి పెట్టారు. స్థానిక రైతులు ఆ పొలాన్ని రూ.లక్ష కు కొనుగోలు చేసేందుకు బేరం కుదుర్చుకుని రూ.1ఏవేలు అడ్వాన్సుగా ఇచ్చారు. పోర్టు భూసేకరణలో ఆ పొలం ఉండటంతో అడ్వాన్సుగా ఇచ్చిన నగదును తిరిగి తీసుకున్నారు. దీంతో తన భార్యకు సంవత్సరీకం కూడా చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానని పలువురి వద్ద వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బాధతోనే శుక్రవారం ఉదయం ఐదు గంటలకు ఇంటి ముందున్న వేప చెట్టుకు తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుమారుడు స్వాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెడన ఎస్ఐ ఎ.గణేష్‌కుమార్, ఏఎస్ఐ శ్రీనివాసరావు, హెడ్ కానిస్టెబుల్ సుబ్రహ్మణ్యం, నాగమల్లేశ్వరరావు, వీరాబాబు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. రెవెన్యూ అధికారి రాజు నుంచిస్టేట్మెంట్ నమోదుచేశారు. కుటుంబాన్ని ఆదుకోవాలి పోర్టు భూసేకరణలో సన్నకారు రైతుల భూములను ప్రభుత్వం సేకరించడం అన్యాయమని వైఎస్సార్ సీపీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాదు పేర్కొన్నారు. వెంకటేశ్వరరావు మృతి విషయం తెలవగానే సంఘటనా స్థలానికి త రలి వెళ్లి మృతుడికి నివాళులర్పించారు. ఆయనతో పాటు పెడన మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు బండారు ఆనందప్రసాదు, పెడన మండల ప్రతిపక్ష నాయకుడు రాజులపాటి అచ్యుతరావు, మండల పార్టీ అధ్యక్షుడు దావు భైరవలింగం, పెడన కౌన్సిలర్ మెట్ల గోపి, కాకర్లమూడి సర్పంచి వాకలరావు, మాజీ సర్పంచి జన్యావుల మారేశ్వరావు, సీపీఎం నాయకులు పంచల రామ నరసింహారావు, సజ్జా మూర్తిరాజు, కొడాలి శర్మ, తదితరులు వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను ఓదార్చారు. -
సరదా హద్దు దాటింది!
వీక్షణం వయసులో ఉన్న అమ్మాయిలు ప్రేమలో పడటం మామూలే. బాయ్ ఫ్రెండ్‌తో సరదాగా షికార్లు చేయాలని సరదా పడటమూ మామూలే. అయితే ఈ సరదా చైనాలో పెద్ద అనర్థమే తెచ్చిపెడుతోంది. ఆడపిల్లల తల్లిదండ్రుల్ని బెంబేలెత్తిస్తోంది! గత కొద్ది కాలంగా చైనా అమ్మాయిల ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చిందని సర్వేలు చెబుతున్నాయి. జీవితంలో బాగా స్థిరపడిన తరువాతే పెళ్లి చేసుకోవాలని వారు అనుకుంటు న్నారట. ప్రేమ, పెళ్లి వంటి వాటికి సమయం కేటాయించలేక పోతున్నారట. అలాంటి వారికోసం కొత్త రకం సంస్థలు వెలిశాయి. అవేం చేస్తున్నాయో తెలుసా? పార్టీలకు, పిక్నిక్లకు వెళ్లడానికి బాయ్ఫ్రెండ్సని అద్దెకిస్తున్నాయి. గంటకింత, రోజుకింత అంటూ వసూలు చేస్తున్నాయి. దాంతో అమ్మాయిలు రుసుము చెల్లించి బాయ్‌ఫ్రెండ్‌ను అద్దెకు తీసుకుంటున్నారు. ఆ సమయం కాస్తా గడిచాక తమ చదువు, వృత్తులలో మునిగిపోతున్నారట! దాంతో ఆడపిల్లల తల్లిదండ్రులు అవాక్కయ్యి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారట! మరి ప్రభుత్వం ఇలాంటి సంస్థల మీద ఏ యాక్షన్ తీసుకుంటుందో చూడాలి!