ఓ వ్యక్తి వందేళ్లు జీవించడమే ఓ కల అన్నట్లుంది ఇప్పటి పరిస్థితి. బతకడం మాటా అటుంచి అసలు ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా బతుకు ఈడ్చగలమా అన్నదే సందేహం. ఎందుకంటే ఇప్పుడున్న కాలుష్యం, కల్తీల మధ్య క్షణ క్షణం మృత్యు గండంలా ఉంది జీవితం. కానీ ఈ వృద్ధుడు ఆయుష్షులో సెంచరీని దాటేశాడు. ఎవరా వ్యక్తి..? అతడి ఆరోగ్యం రహస్యం ఏంటో చూద్దామా..!
బ్రిటన్‌కి చెందిన టిన్నిస్‌వుడ్ అనే వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు. అతడు ఉత్తర ఇంగ్లాండ్‌లో మెర్సీసైడ్‌లో 1912లో జన్మించాడు. అతని వయసు ప్రస్తుతం 111 ఏళ్ల 222 రోజులు. ఆయన పోస్టల్‌లో రిటైర్డ్ అకౌంటెంట్‌గా పనిచేసి రిటైర్డ్ అయ్యిన వ్యక్తి. దీర్ఘాఆయుష్షులో సెంచరీని దాటేశాడు. దీంతో గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కి టైటిల్‌ని గెలుచుకున్నాడు. ఈ రికార్డు ఇంతకుమునుపు వెనిజులా జువాన్ విసెంట్ పెరెజ్ మోరా మీద ఉంది. ఆమె 114 ఏళ్ల జీవించి సుదీర్ఘకాలం జీవించిన వ్యక్తి గిన్నిస్ రికార్డు టైటిల్‌ని పొందింది. ఆమె తర్వాత ఈ టైటిల్ని టిన్నిస్‌వుడ్ గెలుచుకోవడం విశేషం.
అయితే ఇంతలా సుదీర్ఘకాలం ఆరోగ్యకరంగా జీవించేందుకు మీరు ఏ డైట్ ఫాలో అయ్యేవారు, ఎలాంటి ఆహారం తీసుకుంటారని ప్రశ్నించగా..ఆయన చిరునవ్వు చిందిస్తూ తన డైట్‌కి సంబంధించిన సీక్రేట్ అంటూ ఏం లేదని, సాధారణంగానే తీసుకునే వాడినని చెప్పారు. తాను ప్రత్యేకమైన ఫుడ్ అంటూ ఏం తీసుకోలేదని అన్నారు. ఇప్పటికీ ప్రతి శుక్రవారం ఇష్టమైన చేపలు, చిప్స్ తింటానని అన్నారు. ఇంతలా సుదీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించడమనేది కేవలం అదృష్టమని అని ఆయన అన్నారు.
ఇదిలా ఉండగా సుదీర్ఘకాలం జీవించిన వ్యక్తుల గురించి జెరొంటాలజీ రీసెర్చ్ గ్రూప్ శోధించి మరీ ఇలా గిన్నిస్ టైటిల్‌ని అందిస్తోంది. అంతేగాదు ప్రపంచంలోనే ఎక్కువకాలం జీవించిన సూపర్ సెంటెనరియన్స్ జాబితాను లిస్ట్ చేస్తుంది. ఇందులో 116 ఏళ్ల 54 రోజుల వరకు జీవించిన జపాన్‌కు చెందిన జిరోమాన్ కిమురా అత్యంత వృద్ధుడు. కాగా, 117 సంవత్సరాల వయస్సు గల స్పెయిన్‌కు చెందిన మరియా బ్రన్యాస్ మోరేరా జీవించి ఉన్న అత్యంత వృద్ధ మహిళ ఈ జాబితాను చూస్తే కొంచెం మనిషి ఆయుష్షు మెరుగుపడుతుందనాలో, తగ్గుతుందనాలో.. తెయని పరిస్థితి నెలకొందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది నిరంతరం మారుతూ ఉంటోందని అన్నారు ఆరోగ్య నిపుణులు.
(చదవండి: సిక్సర్‌ల బ్యాటర్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే..!)
Comments
Please login to add a commentAdd a comment