పాత డిజైన్‌ను కొనసాగించాలి
Published Thu, Jul 21 2016 1:33 AM | Last Updated on Tue, Mar 19 2019 9:20 PM
» స్వాపురం (భువనగిరి అర్బన్) : మండలంలోని బస్వాపురం రిజర్వాయర్ ప్రాజెక్ట్‌ను పాత డిజైన్ ప్రకారమే నిర్మాణం చేయాలని భూనిర్వాసితుల కమిటీ కన్వీనర్ దయ్యాల నర్సింహ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం బస్వాపురంలో రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఇటీవల పెంచిన టీఎంసీలను తగ్గించాలని, కొంత మంది ప్రయోజనాల కోసం 14.6 టీఎంసీలుగా పెంచాలని నిర్ణయం తీసుకోవడం సరైందికాదన్నారు. ఇప్పటికైనా గ్రామాలను, గ్రామ ప్రజలను, రైతులను దృష్టిలో పెట్టుకుని పెంచిన టీఎంసీలను తగ్గించాలన్నారు. అలాగే భూములు కోల్పోయే రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలని, ఇళ్లకు ఇళ్లు కట్టించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సర్పంచ్ రాసాల నిర్మల, నాయకులు వెంకటేశం, ఉడుత విష్ణు, సత్యనారాయణ, రమేశ్, నర్సింహ, జహంగీర్, వెంకటేశం, మల్లయ్య పాల్గొన్నారు.
Advertisement
Advertisement