ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా అమెరికాలో జన్మించిన స్పానిష్ మహిళ బ్రన్యాస్ మోరారే నిలిచింది. ఆమె ఇటీవలే తన 117వ పుట్టిన రోజుని జరుపుకుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్సు ప్రకారం..ఫ్రాన్స్‌కు చెందిన 118 ఏళ్ల లూసిల్ రాండన్ మరణం తర్వాత మోరారేనే 117 ఏళ్లు సుదీర్థకాలం జీవించిన మహిళగా రికార్డు సృష్టించింది. ఇక మోరారే తల్లిదండ్రులు యూఎస్‌కు వలస వచ్చిన ఒక ఏడాది తర్వాత మార్చి 04, 1907న కాలిఫోర్నియాలో శాన్‌ఫ్రాన్సిస్కోలో జన్మించారు. మళ్లీ ఎనిమిదేళ్లకు స్పెయిన్ తిరిగి వచ్చి అక్కడ కాటలోనియాలో స్థిరపడింది. గత 22 ఏళ్లుగా మోరారే ఆ ప్రాంతంలోనే ఒక నర్సింగ్ హోమ్ రెసిడ్‌ఎన్సియా శాంటా మారియా డెల్ తురాలో కాలం వెళ్లదీస్తోంది.
ఈ వృద్ధురాలు ప్రపంచ యుద్ధాలు, స్పానిస్ అంతర్యుద్ధం, స్పానిష్ ఫ్లూ వంటి మహమ్మారీలన్నింటిని తట్టుకుంది. చివరిగా 2020లో కోవిడ్ -19తో పోరాడారు. ఆమె ఈ వైరస్ బారిన తన 113వ పుట్టిన రోజు జరుపుకున్న కొద్ది వారాలకే పడింది. అయినప్పటికి త్వరగా కోలుకోవడం విశేషం. ఇన్‌స్టాగ్రామ వేదికగా గిన్నస్ వరల్డ్ రికార్డ్స్ ఆ వృద్ధరాలికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడమే గాక గత ఏడాది జనవరి 2023న ఆమె ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా ధృవీకరించిన విషయాన్ని పేర్కొంది.
చింతించొద్దు, విచారించొద్దు..
మోరేరా తన ఆరోగ్య రహస్యంగా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ప్రశాంతంగా ఉండటం, కుటుంబం, స్నేహితులతో మంచి అనుబంధం, భావోద్వేగ స్థిరత్వం తదితర వాటివల్లే ఇంతలా ఆరోగ్యంగా సుదీర్ఘకాలం జీవించగలిగానని చెప్పుకొచ్చింది. అంతేగాదు ఎక్కువగా చింతించడం, విచారించడం మానేయాలని, విషపూరితమైన వ్యక్తులకు దూరంగా ఉండటం వంటివి చేస్తే ఆయురారోగ్యాలతో ఉండగలరని చెప్పుకొచ్చింది. ఇక ఆమె వ్యక్తిగత జీవితం దగ్గరకు వచ్చేసరికి మోరారే 1931లో కాటలాన్ వైద్యుడు జోన్ మోరెట్‌ను వివాహం చేసుకుంది. ఆమెకు ముగ్గురు పిల్లలు. ఆమె తన పెళ్లి రోజు చాలా సంఘటనలతో ముడిపడి ఉందని చెప్పింది. ఇక ఆమె భర్త 72 ఏళ్ల వయసులో చనిపోయారు. ప్రస్తుతం ఆమెకు ముగ్గురు పిల్లలు, 11 మంది మనవళ్లు, 13 మంది మనవరాళ్లు ఉన్నారు.
సైంటిస్టులు ఏం అన్నారంటే..
మోరారేతో మాట్లాడిన సైంటిస్ట్ మానెల్ ఎస్టేల్లర్ మాట్లాడుతూ.."ఆమెను పరీక్షించగా పూర్తిగా స్పష్టమైన తల ఉంది. కేవలం నాలుగేళ్ల వయసులో జరిగిన సంఘటనలను సైతం గుర్తించుకుంటుంది. అలాగే వృద్ధులకు ఉండే సాధారణ హృదయ సంబంధ వ్యాధులు ఏమీ లేవు. ఆమె కుటుంబంలో 90 ఏళ్లు పైబడిన వాళ్లు చాలామంది ఉండటం విశేషం. ఇక్కడ జన్యుసంబంధ కారణమే అయ్యి ఉండొచ్చు. ఇక మోరారే మూత్రం, లాలాజలం, రక్తనమునాలు ఆమె 80 ఏళ్ల కుమార్తెతో సరిపోలుతాయి. ఆమె డీఎన్‌ఏ వయసు సంబంధిత వ్యాధులతో పోరాడగల ఔషధ సృష్టికి దోహదపడొచ్చు" అని ఎస్టేల్లర్ అన్నారు.
(చదవండి: ప్రాణాంతక కేన్సర్‌తో పోరాడుతూ భావోద్వేగ పోస్ట్..'భర్తకు ప్రేమతో'..)
Comments
Please login to add a commentAdd a comment