person
-
TG: మళ్లీ పులి దాడి.. వ్యక్తికి తీవ్ర గాయాలు
సాక్షి,కొమరంభీంజిల్లా: జిల్లాలో పులి మళ్లీ పంజా విసిరింది. తాజాగా మరొకరిపై పులి దాడి చేసింది. సిర్పూర్ (టీ) మండలం దుబ్బగూడకు చెందిన రైతు సురేష్‌పై శనివారం(నవంబర్30) పులి దాడి చేసి గాయపరిచింది. సురేష్ పొలంలో పనిచేస్తుండగా పులి ఒక్కసారిగా దాడి చేసింది.పులి గాట్లతో సురేష్ తీవ్రంగా గాయపడ్డాడు. సురేష్‌ను చికిత్స కోసం సిర్పూర్(టీ) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదే ప్రాంతంలో పులి దాడిలో శుక్రవారమే ఒక మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. పులి కోసం కాగజ్‌నగర్ కారిడార్‌లో ఫారెస్ట్ అధికారులు ఆపరేషన్ మ్యాన్ఈటర్ నిర్వహస్తున్నారు.మొత్తం 15 గ్రామాల్లో పులి కోసం వేట కొనసాగుతోంది.ఇదీ చదవండి: పులి కోసం డ్రోన్లతో వేట.. కాగజ్‌నగర్‌లో హై అలర్ట్ -
Hyderabad: పోలీసులను ప్రశ్నించినందుకు చేయి విరగ్గొట్టారు!
ముషీరాబాద్: రోడ్డుపై నిలుచున్న వ్యక్తిని ముషీరాబాద్ పోలీసులు అకారణంగా దాడి చేశారు. పోలీసుల దెబ్బలకు బాధితుని చేయి విరగడంతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆదివారం బాధితుడు ముషీరాబాద్ బీఆర్ఎస్ మీడియా సెల్ ఇన్చార్జి సత్యనారాయణబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... శనివారం రాత్రి తన ద్విచక్ర వాహనాన్ని స్నేహితుడు తీసుకెళ్లడంతో వాహనం కోసం వినోభానగర్‌లోని తన ఇంటి సమీపంలో రోడ్డుపై నిలుచోని ఉన్నానని తెలిపారు. స్నేహితుడి కోసం నిల్చున్నానని చెబితే... పార్సిగుట్ట నుంచి వినోభానగర్ వైపు వెళ్తున్న పోలీసులు ఇక్కడ నిలబడొద్దని సూచించారు. తన స్నేహితుడి కోసం నిల్చున్నానని చెబితే అయినా వెళ్లిపోవాలని దురుసుగా మాట్లాడారని అన్నారు. పక్కనున్న బార్‌ను మూయించరు కానీ తనను దబాయిస్తారేందని ప్రశ్నించినందుకు తనపై విచక్షణ రహితంగా లాఠీలతో కొట్టారన్నారు. చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి వెళ్లానని తెలిపారు. వైద్యులు పరీక్షలు చేసి చేయి విరిగిందని చెప్పారన్నారు. ఏఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయాలి... ఆదివారం ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ సీనియర్ నేతలు, మాదిగ రాజ్యాధికార పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నవీన్‌రాజ్ బాధితుడు సత్యనారాయణ బాబు ఇంటికి వెళ్లి పరామర్శించారు. అనంతరం బాధితుడిని ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఇన్స్పెక్టర్ రాంబాబుకు ఫిర్యాదు చేశారు. సత్యనారాయణ బాబుపై దాడి చేసిన ఏఎస్ఐ మోహన్‌రావు, ఇద్దరు కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేయాలన్నారు. వారిని సస్పెండ్ చేయని పక్షంలో స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని నాయకులు హెచ్చరించారు. -
ఆశలు సమాధి చేసి..
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): ఎక్కడో ఒకచోట బతికే ఉంటాడు.. క్షేమంగా తిరిగొస్తాడు.. అని ఎదురు చూసిన వారి ఆశలు ఆవిరయ్యాయి. 15 రోజుల కిందట వరదలో కొట్టుకుపోయిన వ్యక్తి విగత జీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యులు గుండెలు బాదుకున్నారు. కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆర్ఆర్పేటకు చెందిన పోలినాయుడు ముఠా కూలీ. అతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ నెల ఒకటో తేదీన ఉదయం పది గంటల సమయంలో తన పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా సింగ్‌నగర్, న్యూఆర్‌ఆర్‌పేట పరిసర ప్రాంతాలన్నీ బుడమేరు వరద ముంపునకు గురవుతున్నాయని తెలుసుకున్నాడు.ఇంట్లో వారికి ఫోను చేసి మరో పది నిమిషాల్లో సింగ్‌నగర్ దాటి ఇంటికి వచ్చేస్తున్నానని చెప్పాడు. ఈ క్రమంలో తన స్నేహితుడితో కలిసి న్యూ ఆర్‌ఆర్‌పేటలోని బుడమేరుపై ఉన్న వంతెన దాటుతుండగా ఒక్కసారిగా వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అతని స్నేహితుడు అతి కష్టం మీద బయటపడి విషయాన్ని పోలినాయుడు కుటుంబ సభ్యులకు, పోలీసులకు, అధికారులకు తెలియజేశాడు. అధికారులు ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు. వరద ప్రవాహానికి ఎక్కడైనా వెళ్లి బయటపడి ఉంటాడని, క్షేమంగా తిరిగొస్తాడని ఆశతో ఎదురు చూస్తున్నారు.అయితే ఆదివారం ఉదయం పోలినాయుడు గల్లంతైన ప్రదేశంలోని దేవినేని వెంకటరమణ మున్సిపల్ హైస్కూల్ వద్ద ఓ మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలినాయుడు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా ముళ్ల చెట్ల మధ్యలో ఆయన ఒక చెట్టుకొమ్మను గట్టిగా పట్టుకుని నీటిలో పడి ఉన్నాడు. చేతికి ఉన్న ఉంగరం, దుస్తులను బట్టి కుటుంబ సభ్యులు పోలినాయుడేనని నిర్ధారించుకున్నారు. విషయాన్ని సింగ్‌నగర్ పోలీసులకు తెలియజేయగా వారు మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైఎస్సార్సీపీ నేత కాళ్ల ఆదినారాయణ వారి కుటుంబ సభ్యులకు అండగా నిలిచి అంత్యక్రియలు జరిపించారు. వరద వదిలినా.. ఆ తల్లీ కొడుకుల్ని మృత్యువు వదల్లేదురామవరప్పాడు (విజయవాడ రూరల్): విజయవాడ పాత రాజీవ్‌నగర్‌కు చెందిన ఓ కుటుంబాన్ని బుడమేరు వరద ముంచేసింది. ఆ ముంపునుంచి తప్పించుకున్నా.. చివరకు లారీ రూపంలో దూసుకొచి్చన మృత్యువు తల్లీ కొడుకుల్ని మింగేసింది. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులో ఆదివారం రాత్రి లారీ ఢీకొన్న ఘటనలో స్కూటర్‌పై వెళ్తున్న పాతరాజీవ్నగర్ వాసులు లింగమనేని కృష్ణకుమారి (63), ఆమె కుమారుడు ప్రభుకుమార్ మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే.. బుడమేరు వరద కారణంగా పాత రాజీవ్‌నగర్‌లోని కృష్ణకుమారి ఇల్లు నీట మునిగింది.దీంతో ఆ కుటుంబం గుణదలలో ఉంటున్న కృష్ణకుమారి సోదరుడి ఇంటి వద్ద ఆశ్రయం పొందుతోంది. ప్రభుకుమార్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వరద ముంపు తగ్గడంతో తమ ఇంటిని రెండు రోజుల నుంచి శుభ్రం చేసుకుంటున్నారు. ఆదివారం కూడా ఇంటిని శుభ్రం చేసుకున్న అనంతరం తల్లీకుమారులు స్కూటర్‌పై గుణదల బయలుదేరారు. రామవరప్పాడు రింగ్ సమీపంలో లారీని గమనించక వారు కుడి వైపునకు మళ్లారు. లారీ ఆ స్కూటర్‌ను ఢీకొట్టడంతో తీవ్రగాయాలైన తల్లీకుమారులు ఘటనాస్థలంలోనే మృతిచెందారు. -
నామినేషన్‌కు ‘మృతుడు’.. కలెక్టరేట్లో కలకలం!
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని వీవీఐపీ సీటు అయిన వారణాసిలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తుండడంతో ఇది హాట్ సీటుగా మారింది. తాజాగా వారణాసిలో ‘నేను బతికే ఉన్నాను’ అనే ప్లకార్డు పట్టుకుని ఓ వ్యక్తి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు కలెక్టరేట్‌కు చేరుకున్నాడు. అతనిని చూసిన అక్కడున్నవారంతా ఆశ్యర్యపోయారు.సంతోష్ మురత్ సింగ్ అనే వ్యక్తి రూ. 25 వేల రూపాయలతోపాటు నామినేషన్ ఫారం పట్టుకుని కలెక్టరేట్‌కు వచ్చాడు. అయితే కలెక్టరేట్ గేటు వద్దనే అధికారులు ఆయనను అడ్డుకున్నారు. దీంతో కోపోద్రిక్తుడైన సంతోష్ మురత్ సింగ్ గేటు బయట ఆందోళనకు దిగాడు.సంతోష్ మురత్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ తాను చనిపోయినట్లు రెవెన్యూ రికార్డుల్లో అబద్దపు రాతలు రాయించి, కొందరు మోసపూరితంగా తన భూమిని స్వాధీనం చేసుకున్నారని వాపోయాడు. ఇప్పుడు తాను జీవించే ఉన్నానని నిరూపించుకునేందుకే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు.ఇలా ఎన్నికల్లో పోటీకి దిగడం సంతోష్‌కి కొత్తేమీ కాదు. 20 ఏళ్లుగా పలు ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నాడు. 2012లో రాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికల్లో కూడా పోటీ చేశాడు. 2014, 2019లలో వారణాసి లోక్‌సభ స్థానం నుంచి ప్రధాని మోదీపై పోటీ చేసేందుకు సంతోష్ నామినేషన్ దాఖలు చేశాడు. అయితే అతని దరఖాస్తు తిరస్కరణకు గురైంది.రెవెన్యూ రికార్డుల ప్రకారం వారణాసిలోని చితౌని నివాసి సంతోష్ మురత్ సింగ్ 2003లో ముంబైలో రైలులో బాంబు పేలుళ్లు సంభవించినప్పుడు మృతి చెందాడు. నకిలీ మరణ ధృవీకరణ పత్రం ఆధారంగా, అతని 1.5 ఎకరాల భూమిని అతని బంధువులు స్వాధీనం చేసుకుని, దానిని విక్రయించారు. సంతోష్ తాను సజీవంగానే ఉన్నానని, తన భూమిని దక్కించుకునేందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని అందరితో చెబుతుంటాడు. -
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు! ఆమె ఆరోగ్య రహస్యం ఇదే..!
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా అమెరికాలో జన్మించిన స్పానిష్ మహిళ బ్రన్యాస్ మోరారే నిలిచింది. ఆమె ఇటీవలే తన 117వ పుట్టిన రోజుని జరుపుకుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్సు ప్రకారం..ఫ్రాన్స్‌కు చెందిన 118 ఏళ్ల లూసిల్ రాండన్ మరణం తర్వాత మోరారేనే 117 ఏళ్లు సుదీర్థకాలం జీవించిన మహిళగా రికార్డు సృష్టించింది. ఇక మోరారే తల్లిదండ్రులు యూఎస్‌కు వలస వచ్చిన ఒక ఏడాది తర్వాత మార్చి 04, 1907న కాలిఫోర్నియాలో శాన్ఫ్రాన్సిస్కోలో జన్మించారు. మళ్లీ ఎనిమిదేళ్లకు స్పెయిన్ తిరిగి వచ్చి అక్కడ కాటలోనియాలో స్థిరపడింది. గత 22 ఏళ్లుగా మోరారే ఆ ప్రాంతంలోనే ఒక నర్సింగ్ హోమ్ రెసిడ్ఎన్సియా శాంటా మారియా డెల్ తురాలో కాలం వెళ్లదీస్తోంది. ఈ వృద్ధురాలు ప్రపంచ యుద్ధాలు, స్పానిస్ అంతర్యుద్ధం, స్పానిష్ ఫ్లూ వంటి మహమ్మారీలన్నింటిని తట్టుకుంది. చివరిగా 2020లో కోవిడ్ -19తో పోరాడారు. ఆమె ఈ వైరస్ బారిన తన 113వ పుట్టిన రోజు జరుపుకున్న కొద్ది వారాలకే పడింది. అయినప్పటికి త్వరగా కోలుకోవడం విశేషం. ఇన్స్టాగ్రామ వేదికగా గిన్నస్ వరల్డ్ రికార్డ్స్ ఆ వృద్ధరాలికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడమే గాక గత ఏడాది జనవరి 2023న ఆమె ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా ధృవీకరించిన విషయాన్ని పేర్కొంది. చింతించొద్దు, విచారించొద్దు.. మోరేరా తన ఆరోగ్య రహస్యంగా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ప్రశాంతంగా ఉండటం, కుటుంబం, స్నేహితులతో మంచి అనుబంధం, భావోద్వేగ స్థిరత్వం తదితర వాటివల్లే ఇంతలా ఆరోగ్యంగా సుదీర్ఘకాలం జీవించగలిగానని చెప్పుకొచ్చింది. అంతేగాదు ఎక్కువగా చింతించడం, విచారించడం మానేయాలని, విషపూరితమైన వ్యక్తులకు దూరంగా ఉండటం వంటివి చేస్తే ఆయురారోగ్యాలతో ఉండగలరని చెప్పుకొచ్చింది. ఇక ఆమె వ్యక్తిగత జీవితం దగ్గరకు వచ్చేసరికి మోరారే 1931లో కాటలాన్ వైద్యుడు జోన్ మోరెట్ను వివాహం చేసుకుంది. ఆమెకు ముగ్గురు పిల్లలు. ఆమె తన పెళ్లి రోజు చాలా సంఘటనలతో ముడిపడి ఉందని చెప్పింది. ఇక ఆమె భర్త 72 ఏళ్ల వయసులో చనిపోయారు. ప్రస్తుతం ఆమెకు ముగ్గురు పిల్లలు, 11 మంది మనవళ్లు, 13 మంది మనవరాళ్లు ఉన్నారు. సైంటిస్టులు ఏం అన్నారంటే.. మోరారేతో మాట్లాడిన సైంటిస్ట్ మానెల్ ఎస్టేల్లర్ మాట్లాడుతూ.."ఆమెను పరీక్షించగా పూర్తిగా స్పష్టమైన తల ఉంది. కేవలం నాలుగేళ్ల వయసులో జరిగిన సంఘటనలను సైతం గుర్తించుకుంటుంది. అలాగే వృద్ధులకు ఉండే సాధారణ హృదయ సంబంధ వ్యాధులు ఏమీ లేవు. ఆమె కుటుంబంలో 90 ఏళ్లు పైబడిన వాళ్లు చాలామంది ఉండటం విశేషం. ఇక్కడ జన్యుసంబంధ కారణమే అయ్యి ఉండొచ్చు. ఇక మోరారే మూత్రం, లాలాజలం, రక్తనమునాలు ఆమె 80 ఏళ్ల కుమార్తెతో సరిపోలుతాయి. ఆమె డీఎన్ఏ వయసు సంబంధిత వ్యాధులతో పోరాడగల ఔషధ సృష్టికి దోహదపడొచ్చు" అని ఎస్టేల్లర్ అన్నారు. (చదవండి: ప్రాణాంతక కేన్సర్‌తో పోరాడుతూ భావోద్వేగ పోస్ట్..'భర్తకు ప్రేమతో'..) -
ఎవరెస్టు ఎక్కిన రెండేళ్ల బుడ్డోడు
మాటలు నేర్చుకునే వయసులో బ్రిటీష్‌కు చెందిన రెండేళ్ల బుడ్డోడు టాట్ కార్టర్ అందరినీ ఆశ్చర్యపరిచే పనిచేశాడు. ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన పర్వతారోహకునిగా టైటిల్‌ను దక్కించుకుని అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను చేరుకున్న అతి పిన్న వయస్కునిగా టాట్ కార్టర్ నిలిచాడు. గతంలో చెక్ రిపబ్లిక్కు చెందిన నాలుగేళ్ల చిన్నారి ఎవరెస్ట్ బేస్ క్యాంపుకు చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా టాట్ కార్టర్ సాధించిన విజయంపై అతని తల్లిదండ్రులు సంతోషంలో మునిగితేలుతున్నాడు. ఈ ఘనత సాధించేందుకు టాట్ కార్టర్‌కు శ్వాస సంబంధిత శిక్షణ అందించామన్నారు. దీనికితోడు టాట్ కార్టర్‌కు ఎవరెస్టు అధిరోహణ సమయంలో ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు అందించామన్నారు. టాట్ కార్టర్ తన తల్లిదండ్రులతో పాటు ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చేరుకున్నాడు. ఈ సందర్భంగా టాట్ కార్టర్ తండ్రి ఒక ప్రకటనలో తమ కుటుంబం ఏడాదిగా ఆసియా పర్యటనలో ఉన్నదని, తన కుమారుడు టాట్ కార్టర్ 2023, అక్టోబర్ 25న తమతోపాటు ఎవరెస్టును అధిరోహించాడని తెలిపారు. తాను స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో నివాసముంటున్నానని, ఓ ప్రైవేట్ కంపెనీలో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నానని ఆయన తెలిపాడు. తాము శ్రీలంక, నేపాల్, మాల్దీవులతో సహా అనేక దేశాలను సందర్శించామని, ఎప్పటికప్పుడు వైద్య నిపుణుల సూచనలు, సలహాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. -
అమెరికాలో హైదరాబాదీ అనుమానాస్పద మృతి
హైదరాబాద్, సాక్షి: అమెరికాలో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడ్ని వనస్థలిపురానికి చెందిన కరుణాకర్‌రెడ్డిగా గుర్తించారు. స్విమ్మింగ్ పూల్‌లో మృతదేహంగా కనిపించాడాయన. కరుణాకర్ స్థానికంగా ఓ ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్లో పని చేస్తున్నట్లు సమాచారం. కరుణాకర్ మృతిపై ఆస్టిన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. -
అణకువ
‘‘ఆకులందున అణిగి మణిగి కవిత కోకిల పలుకవలెనోయ్’’ అంటారు గురజాడ. తన ఘనతని తాను ప్రకటించుకోవటం కాక, ప్రతిభని అవతలి వారు గుర్తించాలి. కోకిల కనపడ నవసరం లేదు. దాని గుర్తింపు మధురమైన కంఠస్వరం మాత్రమే. కావాల్సిన వారు దానిని వెతుక్కోవాలి. ఎందుకంటే – రత్నాన్ని అన్వేషించాలే కాని, అది తనని తాను ప్రకటించుకోదు. ‘‘అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది. ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది.’’ అనే సామెత తెలుసు కదా! నిండు కుండ లాగా తొణకకుండా బెణకకుండా ఉండటం సమృద్ధికి, సంపదకి సంకేతం. అది ఉత్తమ వ్యక్తిత్వ లక్షణం. ఎగిరెగిరి పడకుండా, తన గొప్పని, లేదా తానే గొప్ప అని ప్రకటించుకుంటూ, ప్రదర్శించుకుంటూ ఉండక పోవటమే అణకువ. ఎందుకంటే ఎవరైనా ఒక రంగంలో గొప్ప అనుకుంటే, అదే రంగంలో అంతకన్న ఘనులు అప్పుడే కాని, తరువాత కాని ఉండచ్చు. కనక అహంకరించకూడదు. తన స్థాయి ఏమిటో తెలుసుకుని ఉండాలి. నీలో గొప్పతనం ఉంటే అది నువ్వు ప్రకటించుకోకూడదు. ఇతరులు గుర్తించాలి. ఎట్లా? ప్రవర్తన ద్వారా, మాట ద్వారా. తన గొప్పతనం తానే చెప్పుకున్న వాడు హాస్యాస్పదుడు అవుతాడు. అంతకన్న ముందు ఆయుః క్షీణం అని పెద్దలు చెప్పిన మాట. పైగా తనని తాను పొగడుకోవటం ఆత్మహత్యా సదృశం. మహాపాతకం. అంటే నివృత్తి లేని పరిహారం, ప్రాయశ్చిత్తం లేని పెద్ద పాపం. నోటితో చెప్పక పోయినా తమ ప్రవర్తన ద్వారా తామే చాలా ఘనులు, ఇతరులు పనికిరానివారు అనే అభిప్రాయం కలిగేట్టు ప్రవర్తిస్తారు కొందరు. అది వారి విద్యావిహీనత ను సూచిస్తుంది. విద్య వల్ల మొదట వచ్చేది వినయం. (విద్య యొసగును వినయంబు, వినయంబు వలన పాత్రత, పాత్రత వలన ధనం, ధనం వల్ల ఐహికాముష్మిక సంపదలు బడయు నరుడు) అంటే వినయం అన్నది విద్యావంతుల లక్షణం. వినయ విధేయతలు లేని వారు డిగ్రీలు ఉన్నా విద్యావంతులుగా పరిగణింపబడరు. చదువు ‘‘కొన్నవారు’’ మాత్రమే అవుతారు. ‘‘వస్త్రేణ, వపుషా, వాచా, విద్యయా, వినయేన చ నరో యాతి గౌరవం’’ గౌరవార్హతలలో ప్రధానమైన ఐదింటిలో వినయం కూడా ఒకటి. అలా ఒదిగి ఉండటం మనిషి గొప్పతనాన్ని ఏ మాత్రం తగ్గించదు. ‘‘అనువు గాని చోట అధికుల మనరాదు/ కొంచెముండు / టన్న కొదువ గాదు / కొండ అద్దమందు కొంచెమై ఉండదా? విశ్వదాభిరామ వినుర వేమ.’’ పరిస్థితులు అనుకూలం గా లేనప్పుడు కొంచెం తగ్గి ఉండటం శ్రేయస్కరం. ఎవరో నన్ను గుర్తించి గౌరవించలేదు అనుకుని కుంగిపోవటం, గుర్తింపు కోసం పాకులాడటం దుఃఖానికి అవమానాలకి హేతువు లవుతాయి. కాస్త తల ఒగ్గి అనుకూల పరిస్థితులు వచ్చాక మళ్ళీ తల ఎత్తవచ్చు. సముద్రంలో అలలు ఎగసి ‘పడుతూ’ ఉంటాయి. ఎగిరితే ఆకాశంలో ఉండలేము కదా! కింద పడక తప్పదు. పడకుండా ఉండాలంటే ఎగరకూడదు. ఎదగాలి. ఉన్నత స్థానానికి వెళ్ళాలి అంటే పైకి క్రమం గా ఎక్కాలి. పైగా ఎత్తుకి వెళ్ళిన కొద్ది మరింత జాగ్రత్తగా ఉండాలి. నేల మీద ఉన్నప్పుడు పడితే చిన్న దెబ్బ. ఎంత ఎత్తునుండి పడితే అంత పెద్ద దెబ్బ. అణకువ తో ఉన్న వారి మీద పెద్దలకి వాత్సల్యం ఉంటుంది. వారి ఆశీస్సులు, సహాయ సహకారాలు ఉంటాయి. ఎంత ఒదిగితే అంత ఎదుగుతారు. – డా‘‘ ఎన్.అనంతలక్ష్మి -
ప్రేమ పెళ్లిళ్లను పెద్దలు కాదనలేరు: ఢిల్లీ హైకోర్టు
ఇకపై మేజర్లయిన పిల్లల పెళ్లిళ్లను పెద్దలు అడ్డుకోలేరు. వివాహానికి తగిన వయసు కలిగిన యువతీయువకులు తమకు ఇష్టమైన భాగస్వామిని వివాహం చేసుకోవచ్చని, ఇటువంటి సందర్భంలో ఆ జంటల వివాహానికి తల్లిదండ్రులు లేదా వారి కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పలేరని, రాజ్యాంగం ఆ జంటకు రక్షణ కల్పిస్తుందని ఢిల్లీ హైకోర్టు తేల్చిచెప్పింది. తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకున్న జంటలకు పోలీసులు రక్షణ కల్పిస్తారని, అవసరమైన పక్షంలో వారి కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు రక్షణ అందిస్తారని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. భార్యాభర్తల వివాహ హక్కును ఏ విధంగానూ తక్కువ చేయకూడదని, ఇలాంటి జంటలకు రక్షణ కల్పించాల్సిన రాజ్యాంగపరమైన బాధ్యత ఆ రాష్ట్రంపై ఉందని జస్టిస్ తుషార్ రావు గేదెల అభిప్రాయపడ్డారు. ఢిల్లీ హైకోర్టు ఒక కేసులో.. తల్లిదండ్రుల ఇష్టానికి విరుద్ధంగా వివాహం చేసుకున్న ఒక జంటకు పోలీసు రక్షణ కల్పిస్తూ, మేజర్లయిన యువతీయువకులు తమకు ఇష్టమైన వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం రాజ్యాంగం కల్పించిందని కోర్టు పేర్కొంది. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఒక జంట న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. వీరిలో భర్తపై నమోదైన తప్పుడు ఎఫ్ఐఆర్ను గత ఆగస్టులో కోఆర్డినేట్ బెంచ్ రద్దు చేసిందని జస్టిస్ గేదెలకు చెప్పారు. కాగా ఎఫ్ఐఆర్ పెండింగ్‌లో ఉన్న సమయంలోనే వారు వివాహం చేసుకుని, ఆనందంగా జీవిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ దంపతులకు హాని జరగకుండా చూసుకోవాలని ఢిల్లీ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఇది కూడా చదవండి: ‘రెడ్ లైట్ ఆన్- వెహికిల్ ఆఫ్’ అంటే ఏమిటి? ఢిల్లీలో ఎందుకు అమలు చేస్తున్నారు? Right To Marry Person Of Choice Protected Under Constitution, Not Even Family Members Can Object: Delhi High Court @nupur_0111 https://t.co/JEDBQuyQI8 — Live Law (@LiveLawIndia) October 26, 2023 -
యూదుల పవిత్ర గ్రంథం ‘తొరా’లో ఏముంది? బైబిల్‌తో సంబంధం ఏమిటి?
ఏ మతంలోనైనా విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడాన్ని మనం గమనించవచ్చు. జుడాయిజంలో కూడా అదే ఉంది. ఆధునిక విద్యతో పాటు యూదులు తమ పిల్లలకు తమ మత విలువలను కూడా బోధిస్తారు. ప్రతి యూదు కుటుంబంలో ఇది కనిపిస్తుంది. పిల్లలకు చదువుకునే వయసు రాగానే ఇంటి పెద్దలు జుడాయిజానికి సంబంధించిన విషయాల గురించి చెబుతారు. తమ పవిత్ర గ్రంథమైన ‘తోరా’ను వారిచేత చదివిస్తారు. ప్రతి యూదు ‘తోరా’ను తప్పక చదివి అర్థం చేసుకుంటారు. ఇది చదివిన వారే నిజమైన యూదునిగా ఆ మత పెద్దలు గుర్తిస్తారు. ‘తోరా’ యూదుల ఆరాధనా గ్రంథం. తోరా అనే పదం తోహ్-రా అంటే నేర్చుకోవడం అనే పదం నుండి రూపొందింది. మనం ఉపయోగిస్తున్న తోహ్-రా అనే పదం బైబిల్లోని మొదటి ఐదు పుస్తకాలను సూచిస్తుంది. వీటిని పంచగ్రంథం అంటారు. ఇవి జెనెసిస్, ఎక్సోడస్, లెవిటికస్, నంబర్స్, డ్యూటెరోనమీ. ‘తోరా’ను మోషే రాశాడని చెబుతారు. అందుకే దీనిని మోషే ధర్మశాస్త్ర గ్రంథం అని కూడా అంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూదులు ఈ పుస్తకం ద్వారానే తమ దేవుణ్ణి స్మరించుకుంటారు. భారతదేశంలోని యూదులు కూడా ఈ గ్రంథాన్ని పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. వారు నిర్వహించే పవిత్రమైన కార్యక్రమంలో ఖచ్చితంగా ఈ గ్రంథాన్ని ఉంచుతారు. సృష్టి ప్రారంభం నుంచి మోషే మరణం వరకు దేవుడు ప్రజలతో ఎలా వ్యవహరించాడో ఈ పవిత్ర గ్రంథంలో పేర్కొన్నారని చెబుతారు. దీనితో పాటు ప్రతి యూదు విశ్వసించాల్సిన మోషే చట్టాలు, నియమాలు దీనిలో ఉన్నాయని చెబుతారు. యూదుల ప్రత్యేక ప్రార్థన ఈ గ్రంథంలో కనిపిస్తుంది. యూదుల దేవుడైన యెహోవా పేరు ఈ పుస్తకంలో 1800 సార్లు కనిపిస్తుంది. ఇది కూడా చదవండి: యూదులు ఇతరుల రక్తాన్ని ఎందుకు ఎక్కించుకోరు? వారు చెప్పే కారణం ఏమిటి? -
చట్టానికి ఎవ్వరు చుట్టం కాదు: పండుగాయల రత్నాకర్
సాక్షి, అమరావతి: పాప భీతి, నైతిక విలువలు ఏమాత్రం లేని వ్యక్తి రాజకీయాల్లో ఉండడం ఎంత ప్రమాదకరమో చెప్పడానికి బాబే ఉదాహరణ అని ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ అన్నారు. బాబు 45 ఏళ్ళ క్రితం రాజకీయాల్లోకి వచ్చిందే సులువుగా సంపాదించుకోవడం కోసం, అక్రమంగా ప్రజల డబ్బును దోచుకుని తన అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడం కోసంమేనని ఆయన అన్నారు. ప్రజలపై, ప్రజాధనం పై ఏమాత్రం గౌరవం లేని వ్యక్తి చంద్రబాబని దుయ్యబట్టారు. అధికారం, డబ్బు, వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని తప్పుడు పనులు చేయడం, సొంతమనుషులకు దోచిపెట్టడం ఇవే చంద్రబాబు లక్ష్యాలని విమర్శించారు. 'స్కిల్ డెవెలప్ మెంట్ స్కాం జరిగిన తీరు రాష్ట్రమే సిగ్గుపడేలా ఉంది. 2014లో ఇంటికో ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్న చంద్రబాబు యువతను నమ్మించి నిలువునా మోసం చేశాడు. అంతటితో ఆగకుండా యువతకు నైపుణ్యాన్ని అందించి సుశిక్షితులు చేసే పేరుతో రూ.371 కోట్ల అవినీతికి పాల్పడ్డాడు. బాధ్యత మర్చిపోయి నైతిక విలువలు గాలికొదిలి ఇలాంటి దారుణమైన దోపిడీకి చంద్రబాబు పాల్పడ్డాడు.' అని రత్నాకర్ వెల్లడించారు. No more StayBN ….#SkillDevelopmentScam #CorruptionKingCBN #ScamsterChandrababu pic.twitter.com/1maEQJi1ho — Kadapa Rathnakar (@KadapaRathnakar) September 9, 2023 'ప్రజల కళ్లుగప్పి అవినీతి చేద్దామనుకున్న బాబు ఇవాళ అడ్డంగా దొరికిపోయి దబాయిస్తున్నాడు. చట్టం చంద్రబాబుకు చుట్టం కాదు. తప్పు చేస్తే చట్టం ఎంతటివారినైనా ఉపేక్షించదు. ప్రజాధనం ఇష్టమొచ్చినట్టు దోపిడీ చేస్తుంటే చట్టం చూస్తూ ఊరుకోదు. అందులో భాగంగానే ఈ రోజు బాబు అరెస్ట్ జరిగింది. ప్రభుత్వానికి కక్ష సాధించాలని ఉంటె ఎప్పుడో అరెస్ట్ అయ్యేవాడు. చంద్రబాబు అవినీతి చేసాడని రుజువయ్యాకే సీఐడీ అరెస్ట్ చేసింది.' అని రత్నాకర్ పేర్కొన్నారు. బాబు బరితెగించి చేసిన అవినీతి ఇది: 'ఏమాత్రం నియమనిబంధనలు పాటించకుండా, చట్టానికి భయపడకుండా బాబు బరితెగించాడు. సీమెన్స్ సంస్థకు తెలియకుండా ఆ సంస్థ పేరు వాడుకున్నారు. రూ. 3,350 కోట్ల ప్రాజెక్టులో 90% డబ్బు ప్రైవేట్ సంస్థ గ్రాంట్ ఇస్తుందన్నారు. ఎక్కడైనా ప్రైవేట్ సంస్థ 90% గ్రాంట్ ఇస్తుందా ? డీపీఆర్ లేకుండా ప్రాజెక్టుకు ఒకే చేశారు. తేదీలు లేకుండా ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఎంవోయూ కుదుర్చుకునే సమయానికి 90% గ్రాంట్ నిబంధన ఎత్తేశారు. షెల్ కంపెనీల ద్వారా చట్టం తన చుట్టం, వ్యవస్థలను మేనేజ్ చేయగలమన్న ధీమాతోనే బాబు దిగజారి ప్రవర్తించాడు. బాబుకు ఈ కేసులో కఠినమైన శిక్ష పడకతప్పదు.' అని రత్నాకర్ చెప్పారు. రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసిన చంద్రబాబు: '2014- 2019 వరకు బాబు అవినీతికి అడ్డుఅదుపూ లేకుండా పోయింది. వ్యవస్థలను అడ్డంపెట్టుకుని అడుగడుగునా చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడు. రాజధాని లక్షకోట్ల కుంభకోణం, పోలవరం దోపిడీ, నీరు-చెట్టు, జన్మభూమి కమిటీల లంచాలు, చంద్రన్న కానుకల పేరుతొ దోపిడీ, ఎన్నికలకు 6 నెలల ముందు అన్నా క్యాంటీన్ల నిర్మాణానికి ఇష్టమొచ్చిన రేటుకు కాంట్రాక్టులు.. ఇలా బాబు పాలన అవినీతిమయంగా సాగింది.' అని రత్నాకర్ చెప్పారు. 'దోపిడీయే ఏకైక లక్ష్యంగా రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసాడు. 75 ఏళ్ళ చరిత్రలో ఇలాంటి చెత్తపాలన మరెక్కడా జరగలేదు. ఆ ఐదేళ్లు ప్రజలను వేధించి తాను మాత్రం జేబులు నింపుకున్నాడు. బాబు పాలనపై విసుగెత్తిన రాష్ట్రప్రజలు సరైన సమయంలో బాబుకు గుణపాఠం చెప్పారు. బాబు అవినీతికి సరైన శిక్షగా 23 సీట్లకు పరిమితం చేశారు. 2024లో బాబుకు 23 సీట్లు కూడా వచ్చే పరిస్థితిలేదని జాతీయ సర్వేలే చెబుతున్నాయి. బాబుకు చట్టం ఎన్ని సంవత్సరాలు శిక్ష వేస్తుందో తెలియదు గానీ.. రాష్ట్ర ప్రజలు మాత్రం బాబుకు జీవితకాలం శిక్ష వేశారు.' అని పండుగాయల రత్నాకర్ అన్నారు. ఇదీ చదవండి: ఏమో.. తెలియదు.. గుర్తు లేదు.. సీఐడీ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు -
అలిపిరిలో బాంబు బ్లాస్ట్ బెదిరింపు ఫోన్ కాల్స్.. వ్యక్తి అరెస్టు..
తిరుమల: అలిపిరి వద్ద బాంబు బ్లాస్ట్ చేస్తానంటూ ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. నిందితున్ని తమిళనాడు రాష్ట్రం, సేలం జిల్లాకు చేందిన బాలాజీ(39)గా గుర్తించారు. అతన్ని ఈ రోజు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 15వ తారీఖున అలిపిరి చెక్ పాయింట్ ల్యాండ్ ఫోన్ కి కాల్ చేసాడో వ్యక్తి. మధ్యాహ్నం 3గంటలకు 100 మందిని బాంబ్ బ్లాస్ట్ తో చంపేస్తానని చెప్పడంతో వెంటనే అప్రమత్తం అయ్యారు పోలీసులు. టీటీడీ పోలీసు, విజిలెన్స్ అధికారుల సమన్వయంతో అలిపిరి చెక్ పాయింట్ తనిఖీ చేసారు. అయినప్పటికీ ఎక్కడా ఎటువంటి పేలుడు పదార్ధాలు లభించలేదు. బాంబు పేలుడుకు సంబంధించి ఫోన్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఎవరైనా ఆకతాయి, దుష్ట చేష్టలకి పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తిరుమల డీఎస్పీ భాస్కర్ రెడ్డి అన్నారు. ఇదీ చదవండి: ఏపీ పంచాయతీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారుల హవా -
పాకిస్తాన్ ‘ఆణిముత్యం’.. ఎవరికీ తెలియని షాహిద్ ఖాన్ సక్సెస్ స్టోరీ!
భారత్‌తో విడిపోయాక పాకిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడింది. అయితే నాటి నుంచి పాక్ ఆర్థిక పరిస్థితి ఏనాడూ సుస్థిరంగా ఉన్న దాఖలాలు లేవు. కరోనా కాలం అనంతరం పాక్ పరిస్థితి మరింత దయనీయంగా తయారయ్యింది. అనంతరం వచ్చిన వరదలు పాకిస్తాన్‌ను అతలాకుతలం చేశాయి. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో పాక్ అధిక ధరలతో అట్టుడికిపోతోంది. నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం పాకిస్తాన్‌ను కబ్జా చేశాయి. అయితే ఇన్ని ప్రతికూలతల మధ్య ‘పాకిస్తాన్ రిచెస్ట్ మ్యాన్’ కథ అందరికీ స్ఫూర్తినిస్తుంది. ఇంజినీరుగా కెరియర్ ప్రారంభం పాకిస్తాన్‌కు చెందిన షాహిద్ ఖాన్ 1950, జూలై 18న లాహోర్‌లో జన్మించారు. కొంతకాలం పాక్‌లోనే ఉండిన ఆయన అనంతదం అమెరికాకు వెళ్లారు. తిరిగి ఇప్పుడు పాకిస్తాన్‌కు వచ్చి స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. ఇంజినీరుగా ఆయన తన కెరియర్ ప్రారంభించారు. షాహిద్ ఖాన్ 1980లో తన మాజీ యజమాని నుండి ఆటో విడిభాగాల సరఫరా సంస్థ ‘ఫ్లెక్స్ ఎన్ గేట్’ను కొనుగోలు చేశారు. అప్పటి నుంచి నిరంతర ప్రగతి బాటలో ముందుకు సాగుతున్నారు. ఫోర్బ్స్ కోటీశ్వరుల జాబితాలో స్థానం మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం షాహిద్ ఖాన్ విజయంలో వన్ పీస్ ట్రక్ బంపర్‌కు సంబంధించిన డిజైన్ కీలకంగా మారింది. ఫోర్బ్స్ కోటీశ్వరుల జాబితాలో చేరిన షాహిద్ ఖాన్‌కు చెందిన కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 69 ప్లాంట్స్ ఉన్నాయి. వీటిలో 26 వేలకుపైగా సిబ్బంది పనిచేస్తున్నారు. షాహిద్ ఖాన్ ఎన్ఎఫ్ఎల్కు చెందిన జాక్సన్విల్లే జాగ్వార్‌కు కూడా యజమాని. 2012లో ఆయన దీనిని కొనుగోలు చేశారు. దీనితో పాటు అతనికి యూకేలో ఒక ఫుట్‌బాల్ కంపెనీ కూడా ఉంది. ఆటోపార్ట్స్ తయారీ కంపెనీతో.. షాహిద్ ఖాన్‌కు చెందిన కంపెనీ ఆటోపార్ట్స్ను తయారు చేసి, విక్రయిస్తుంటుంది. ఇదే అతనికి వచ్చే ఆదాయంలో అత్యంత కీలకమైనది. ఫోర్బ్స్ అందించిన రియల్ టైమ్ బిలియనీర్స్ రిపోర్టును అనుసరించి షాహిద్ ఖాన్ మొత్తం ఆస్తి 12.1 బిలియన్ డాలర్లు. షాహిద్ ఖాన్ పాకిస్తాన్‌లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తన 16 ఏళ్ల వయసులో కేవలం 500 డాలర్లతో అమెరికా చేరుకున్నారు. అక్కడ తన వ్యాపార విజయంతో వేల కోట్ల విలువైన సామ్రాజ్యాన్ని స్థాపించారు. చదువుకునే సమయంలో కష్టాలు షాహిద్‌ఖాన్ అమెరికాలోని ఇలినాయిస్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. గతంలో షాహిద్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను అమెరికాలో చదువుకునే సమయంలో డిష్వాషర్ పని కూడా చేశానని తెలిపారు. 1971లో షాహిద్ ఖాన్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. 1999లో మెకానికల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం షాహిద్ ఖాన్‌ను విశిష్ట పూర్వ విద్యార్థిగా గుర్తించి, ఘనంగా సన్మానించింది. ఇది కూడా చదవండి: భార్యను 12 ఏళ్లుగా ‘టార్చర్ రూమ్’లో బంధించి.. ఘోరానికి పరాకాష్ట! -
విద్యుత్ స్తంభం ఎక్కి యువకుడి హల్చల్!
ఆదిలాబాద్: మావల పోలీసుస్టేషన్ పరిధిలోని కేఆర్కే కాలనీలో ఓ యువకుడు మద్యం మత్తులో విద్యుత్ స్తంభం ఎక్కి హల్చల్ చేశాడు. కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్న ప్రవీణ్ ఇంటి గొడవల కారణంగా సోమవారం స్తంభం ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. విద్యుత్ తీగలను పట్టుకుంటానని అనడంతో స్థానికులు సరఫరా నిలిపివేయించారు. ఎంత నచ్చజెప్పినా దిగిరాక తీగలు పట్టుకుని వేలాడారు. ఆ తర్వాత స్తంభం నుంచి జారి కిందపడగా స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు సదరు యువకుడిని చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. -
చిక్కడపల్లి టు చైనా!
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): చిక్కడపల్లికి చెందిన ఓ వ్యక్తి రూ.28 లక్షలు మోసపోయిన ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్ కేసు తీగలాగిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దుబాయ్ మీదుగా చైనాలో ఉన్న డొంక కదిపారు. ఈ కేసులో అనూహ్యంగా తెరపైకి వచ్చిన నలుగురు హైదరాబాదీయులు సైబర్ నేరాల్లో కొత్త కోణాన్ని బయటపెట్టారు. ఐసీసీసీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం మాట్లాడిన కొత్వాల్ సీవీ ఆనంద్ ఈ కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన అధికారులకు రివార్డులు అందించారు. చిక్కడపల్లి వాసి శివకుమార్ ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్‌లో రూ.28 లక్షలు కోల్పోయి మార్చిలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీన్ని దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ గంగాధర్ బాధితుడి నగదు ఆరు బ్యాంకు ఖాతాల్లోకి, వాటి నుంచి మరో 48 అకౌంట్లలోకి వెళ్లినట్లు గుర్తించారు. వీటి విషయం జాతీయ స్థాయిలోని సైబర్ కో–ఆర్డినేషన్ సెంటర్‌కు అందించగా...వాటిలో దేశ వ్యాప్తంగా వివిధ బ్యాంకు ఖాతాల నుంచి మరో రూ.584 కోట్ల లావాదేవీలు జరిగినట్లు సమాధానం వచ్చింది. ఆ బ్యాంకు ఖాతాల్లో రాధిక మర్చంట్స్ పేరుతో ఉన్న షెల్ కంపెనీది కూడా ఉంది. ఈ అకౌంట్‌తో లింకై ఉన్న సెల్ నెంబర్ నగరానికి చెందిన మునావర్ వాడుతున్నట్లు తెలియడంతో అప్రమత్తమైన అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తనతో పాటు నగర వాసులైన ఆరుల్ దాస్, సమీర్ ఖాన్, ఎస్.సుమేర్లను వికాస్, మనీష్, రాజేష్‌లు లక్నో పిలింపించారని బయటపెట్టాడు. వీరి ముంబై హవాలా నెట్‌వర్క్‌లో భాగమైన నయీమ్... సమీర్‌కు బంధువు కావడంతో పరిచయాలు ఏర్పడ్డాయి. మూడు నెలలు లక్నోలో ఉన్న నలుగురు నగర వాసులూ నకిలీ గుర్తింపు కార్డులతో 33 షెల్ కంపెనీలు, 65 బ్యాంకు ఖాతాలు తెరిచి వారికి అప్పగించి వచ్చారని తేలింది. వీళ్ళకు ఒక్కో ఖాతాకు రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు ముట్టిందని బయటపెట్టారు. వీరందించిన ఖాతాల్లో మరో రూ.128 కోట్ల లావాదేవీలు జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. ఇలా మొత్తం రూ.713 కోట్లు ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్‌లో దేశం దాటేశాయని అధికారులు తేల్చారు. నగరం, ముంబైల్లో ఉన్న వారిని పట్టుకున్న సైబర్ క్రైమ్ పోలీసులకు అహ్మదాబాద్‌కు చెందిన ప్రకాష్, కుమార్ వ్యవహారాలు తెలిశాయి. కీలకమైన ప్రకాష్ అనునిత్యం దుబాయ్, చైనాలకు వెళ్లి వస్తున్నాడని గుర్తించారు. జూన్ 30న చైనా నుంచి వచ్చిన ఇతగాడు తన నెట్‌వర్క్‌లోని ఓ వ్యక్తితో వాట్సాప్ ద్వారా మాట్లాడుతున్నాడు. ఇతడి నెంబర్ తెలుసుకున్న అధికారులు వాట్సాప్ యాక్టివేట్ అయిన నెట్వర్క్ గుర్తించారు. దీనికి లింకైన నెంబర్ లోకేషన్ ఆధారంగా ప్రకాష్ ముంబైలో ఉన్నట్లు పసిగట్టారు. హాలిడే కోసం అక్కడకు వెళ్ళిన ఇతడితో పాటు కుమార్‌ను పట్టుకుని సిటీకి తీసుకువచ్చారు. వీరి నుంచి భారీగా ల్యాప్టాప్స్, ఫోన్లు, షెల్ కంపెనీల లెటర్ హెడ్స్ కూడా స్వాదీనం చేసుకున్నారు. కాగా ఇలాంటి నేరగాళ్లు, నేరాలపై రిజర్వుబ్యాంకు, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్, జాతీయ దర్యాప్తు సంస్థకు సమాచారం ఇస్తామని సీపీ సీవీ ఆనంద్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
మెట్రోలో మద్యం అనుమతి.. ఎన్ని బాటిళ్ల వరకు తెలుసా..?
ఢిల్లీ: మెట్రో ప్రయాణం ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో మనందరికీ తెలుసు. భద్రతపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రయాణికులకు మెట్రో నగరాల్లో సేవలు అందిస్తున్నాయి. అయితే.. మెట్రోలో మద్యాన్ని తీసుకురావడానికి అనుమతి ఉంటుందా? ఎప్పుడైనా ఆలోచించారా? ఓ వ్యక్తి ట్విట్టర్ వేదికగా అడిగిన ఈ ప్రశ్నకు ఢిల్లీ మెట్రో(డీఎమ్ఆర్సీ ) సమాధానం తెలిపింది. రెండు మద్యం బాటిళ్ల వరకు తీసుకురావడానికి మెట్రోలో అవకాశం ఉంటుందని డీఎమ్ఆర్సీ స్పష్టం చేసింది. మెట్రోలో మద్యం సేవించడం మాత్రం నిషేధించింది. అయితే.. ఢిల్లీలో ఎయిర్‌పోర్టు లైన్లో తప్పా మిగిలిన రూట్లలో మద్యం తీసుకురావడానికి ఇప్పటివరకు అనుమతి ఉండేది కాదు. కానీ ఇటీవల ఢిల్లీ మెట్రో నిబంధనలను సడలించింది. Hi. Yes 2 sealed bottles of alcohol is allowed in Delhi Metro. — Delhi Metro Rail Corporation I कृपया मास्क पहनें😷 (@OfficialDMRC) June 30, 2023 ఈ అంశంలో యాజమాన్యం సీఐఎస్ఎఫ్, డీఎమ్ఆర్సీ సభ్యులతో ఓ కమిటీని వేసింది. ఈ నివేదిక ప్రకారం మెట్రో ఏ రూట్లోనైనా ఒక వ్యక్తి రెండు బాటిళ్ల మద్యం వరకు తీసుకురావచ్చని తెలిపింది. ఇదీ చదవండి: దేన్నీ వదలకుండా మాట్లాడారు.. మెట్రో రైలులో అనుభవంపై ప్రధాని మోదీ -
వివాహేతర సంబంధం.. నిర్జన ప్రదేశానికి పిలిచి.. కత్తితో..
కర్ణాటకాలోని చిక్కబళ్లాపూర్ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. వివాహేతర సంబంధంపై వచ్చిన కలహాలతో ఓ వ్యక్తి మరో వ్యక్తి గొంతును కోసేశాడు. అనంతరం బాధితుని గొంతు నుంచి రక్తాన్ని తాగే ప్రయత్నం చేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. నిందితునిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు నిందితున్ని విజయ్‌గా గుర్తించారు. నిందితుడు మరేశ్ అనే వ్యక్తి భార్యతో వివాహేతర సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య పలుమార్లు తగాదా కూడా జరిగింది. ఆ అంశంపై చర్చించడానికి బాధితున్ని విజయ్ నిర్జన ప్రదేశానికి పిలిచాడు. వాగ్వాదంలో విచక్షణ కోల్పోయిన నిందితుడు.. మరేశ్ గొంతును కత్తిరించాడు. అనంతరం పక్కనే కూర్చుని రక్తాన్ని తాగే ప్రయత్నం చేశాడు. ఓ బాటసారి వీడియో తీసి పోస్టు చేయగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి: కారు పార్క్ చేసిన మహిళ.. ఒక్కసారిగా వరద రావడంతో.. -
ఈ చిత్రంలో దాగున్న చిన్నారిని గుర్తుపట్టగలరా?
ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో నీలి ఆకాశంలో రాతిబండలు కనిపిస్తున్నాయి. కాని దానిలో రెండు గోధుమ రాళ్ల మధ్య ఓ చిన్నారి దాక్కుంది. అది కూడా పర్పుల్ కలర్(ఊదారంగు) టాప్ ధరించి రెండు చేతులు పైకి ఎత్తి ఉన్నట్లు కనిపిస్తుంది. చాలా ఓపికతో కనిపెటండి. మొదట చూస్తున్నప్పుడూ కాస్త గందరగోళం కనిపించిన కొద్ది సేపటి తర్వాత ఆ ఇమేజ్ స్పష్టంగా కనిపిస్తుంది. ట్రై చేయండి. ఈ చిత్రానికి వేల వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా తెలివిగా ట్రై చేసి కనుక్కొండి. లేదంటే కింద క్లియర్‌గా కనిపించే ఇమేజ్‌లో చూడండి మీకే తెలుస్తుంది ఆ చిన్నారి ఎక్కడ ఉన్నది. (చదవండి: స్కూల్ నిర్మించడం కోసం ఆ రైతు ఏం చేశాడంటే..) -
మెరుపులా వచ్చి కాపాడింది
పశ్చిమబెంగాల్లోని పుర్బ మేదినీపూర్ రైల్వేస్టేషన్లో... ప్లాట్‌ఫామ్‌పై నిల్చున్న ఒక వ్యక్తి ఉన్నట్టుండి పట్టాలపై తలపెట్టి పడుకున్నాడు. అటు నుంచి రైలు వస్తోంది. అవతలి ప్లాట్‌ఫామ్‌పై ఉన్న కె.సుమతి అనే రైల్వే కానిస్టేబుల్ మెరుపు వేగంతో పరుగెత్తుకు వచ్చి అతడిని పట్టాల మీది నుంచి బలవంతంగా లాక్కెళ్లింది. ఏమాత్రం ఆలస్యం అయినా అతడు చనిపోయేవాడు. దీనికి సంబంధించిన సీసీటీవి ఫుటేజిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీ ఎఫ్), ఇండియా ట్విట్టర్లో పోస్ట్ చేస్తే సుమతిపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ‘రైల్వేశాఖ మాత్రమే కాదు యావత్ దేశం గర్వించదగిన మహిళ’ ‘అంకితభావంతో కూడిన విధి నిర్వహణకు మానవత్వం, సాహసం తోడైతే... ఆ పేరు సుమతి’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో నెటిజనుల నుంచి వచ్చాయి. గత సంవత్సరం జార్ఖండ్‌లోని టాటానగర్ రైల్వేస్టేషన్లో మహిళా కానిస్టేబుల్ ఎస్కే మీనా ఒక వ్యక్తి రైలుకింద పడకుండా కాపాడిన వీడియో వైరల్ అయింది. -
ఇక్కడ ఆర్మీ చీఫే అత్యంత శక్తిమంతమైన వ్యక్తి: ఇమ్రాన్ ఖాన్
పాకిస్తాన్ రాజకీయాల్లో ఆర్మీ చీఫే అత్యంత శక్తిమంతమైన వ్యక్తి అని, అతని నిర్ణయాలే అందరూ అనుసరిస్తారని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను మళ్లీ అధికారంలోకి రాకుండా బహిష్కరించేందుకు అవినీతి మాఫియాకు మద్దతిస్తోందంటూ సైనిక వ్యవస్థపై మండిపడ్డారు. ఈ మేరకు ఖాన్ జమాన్ పార్క్ వద్ద ఉన్న తన నివాసం నుంచి తన మద్దతుదారులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు. దిగుమతి చేసుకున్న ప్రభుత్వాన్ని దించడం కోసం ప్రజలు సుప్రీం కోర్టుకి అండగా నిలబడాలని కోరారు. తాను అధికారంలోకి రాకూడదనే ఉద్దేశ్యంతోనే సైనిక వ్యవస్థ అవినీతి మాఫియా అయిన షరీఫ్‌లు, జర్దారీలకు అండగా ఉందని ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో విభజనపై ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని దేశానికి పెను విషాదంగా అభివర్ణించారు. ఈ దిగుమతి చేసుకున్న ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానానికి చెడ్డపేరు తెచ్చే ప్రయత్నం చేస్తోందని, ఈ తరుణంలో సుప్రీం కోర్టుకు అండగా నిలవాలని దేశానికి విజ్ఞప్తి చేస్తున్నాని అన్నారు. ప్రస్తుతం పాక్‌లో ప్రజాస్వామ్యం సుప్రీం కోర్టు అనే దారంతో వేలాడుతోందని, అందువల్ల ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వారందరూ దానికి అండగా నిలబడాలని చెప్పారు. ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి వ్యతిరేకంగా కుట్రలు చేయడం మానేయాలని అన్నారు. మే 14న పంజాబ్‌లో ఎన్నికలు నిర్వహించాలన్న నిర్ణయాన్ని దిక్కరిస్తూ ఉంటే ఈద్ తర్వాత వీధుల్లోకి రావడానికి సిద్ధంగా ఉండాలని ఖాన్ పిలుపునిచ్చారు. ముందు నుంచి తాను దీనికి నాయకత్వం వహిస్తున్నట్లు కూడా ప్రకటించారు. అవినీతి పాలకులను అంగీకరించమని ప్రజలను బలవంతం చేయలేమనే విషయాన్ని సైనిక వ్యవస్థ గుర్తుపెట్టుకోవాలన్నారు. అలాగే ఒక దేశం పురోగమిస్తున్నప్పుడూ హింసాత్మక వ్యూహాలు పనిచేయవనే వాస్తవాన్ని గుర్తించుకోవాలి. ఇంతకుముందు తన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మద్దతదారులను సైలంట్ చేసేలా హింసాత్మక కార్యకలాపాలకు దిగారని, ఐతే అవి పనిచేయలేదన్నారు. ఇక మీదట కూడా అవి పనిచేయవని నొక్కి చెప్పారు ఖాన్. తనను చంపడానికి కుట్ర జరుగుతోందని కూడా ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా, పాకిస్తాన్ ముస్లీం లీగ్ నవాజ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ప్రసంగాలను ఏ ఎలక్ట్రానిక్ మీడియా ప్రసారం చేయకూడదని అప్రకటిత నిషేధం విధించడం గమనార్హం. (చదవండి: నల్లులు కారణంగా చనిపోయిన ఖైదీ..దర్యాప్తు చేస్తున్న అధికారులు) -
షాకింగ్ ఘటన: చనిపోయిన ఉద్యోగికి పదోన్నత కల్పిస్తూ పోస్టింగ్!
సాక్షి, హైదరాబాద్: పదవీ విరమణ చేసిన ఓ ఇంజనీర్‌కు ఏకంగా ఎనిమిదేళ్ల పాటు డబుల్ శాలరీ ఇచ్చిన అంశాన్ని ఇంకా పూర్తిగా మరిచిపోక ముందే...తాజాగా చనిపోయిన మరో ఇంజనీర్‌కు ఏకంగా పదోన్నతి కల్పించడంతో పాటు పోస్టింగ్ కూడా ఇచ్చిన ఉదంతం వెలుగు చూసింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ హెచ్ఆర్ విభాగంలోని అధికారుల తప్పిదాలకు సంస్థ ఆర్థికంగా నష్టపోవడంతో పాటు ప్రజల్లో అభాసుపాలవుతోంది. రెండేళ్ల క్రితమే చనిపోయిన మల్లయ్య.. పి.మల్లయ్య (ఐడీ నంబర్ 1077222) మొదట్లో మెట్రోజోన్ పరిధిలోని డీఈ కేబుల్ ఆఫీసులో సబ్ ఇంజనీర్‌గా పనిచేశారు. అటు నుంచి బంజారాహిల్స్‌కు సబ్‌ఇంజనీర్‌గా బదిలీపై వెళ్లారు. అనారోగ్య కారణాల వల్ల ఆయన సుమారు రెండేళ్ల క్రితమే మృతి చెందారు. డిస్కం ఉన్నతాధికారులు చనిపోయిన మల్లయ్య స్థానంలో కారుణ్య నియామకం కింద ఆయన కుమార్తెకు సబ్ ఇంజనీర్‌గా ఉద్యోగం ఇప్పించారు. ప్రస్తుతం ఆమె సైబర్‌సిటీ సర్కిల్ ఆఫీసులోని కమర్షియల్ సబ్ ఇంజనీర్‌గా పని చేస్తోంది. రెండు రోజుల క్రితం పదోన్నతి రెండు రోజుల క్రితం 49 మంది సబ్ ఇంజనీర్లకు డిస్కం ఏఈలుగా పదోన్నతులు కల్పించింది. వీరిలో ఆ మేరకు పదోన్నతులు పొందిన వారి పేర్లతో సహా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే డిస్కం జారీ చేసిన ఈ జాబితాలో చనిపోయిన మల్లయ్య పేరు ఉండటమే కాకుండా ఆయనకు సబ్ ఇంజనీర్ నుంచి ఏఈగా పదోన్నతి కల్పించారు. ఏకంగా ఆయనకు వికారాబాద్‌లో పోస్టింగ్ కూడా ఇచ్చేశారు. ఏఈల జాబితాలో చనిపోయిన మల్లయ్య పేరు ఉండటాన్ని చూసి తోటి ఇంజనీర్లు ఆశ్చర్యపోయారు. అదేమిటని సంబంధిత సెక్షన్ అధికారులను, హెచ్ఆర్ డైరెక్టర్‌ను నిలదీశారు. దీంతో చేసిన తప్పిదాన్ని ఆ తర్వాత సరిదిద్దుకున్నారు. (చదవండి: ఖాతాలు, మనుషులే.. పారసైట్లు!) -
Viral Video: ఉన్నపలంగా లారీ డోర్ తీసాడు.. తర్వాత ఏమైందంటే..!
-
పశువుల కాపరి పై దాడి చేసిన పులి..
-
కోర్ట్ లో టిప్పులు.. యూనిఫామ్ పై QR కోడ్..
-
Viral Video: గుజరాత్ లో కేజ్రీవాల్ కోసం వికలాంగుడి ప్రచారం..