తూర్పు గోదావరి జిల్లా కగియం మండలం ధామిరెడ్డిపల్లెలో ఉండమట్ల శ్రీనివాస్(32) అనే వ్యక్తి అనుమాస్పద స్థితిలో మృతి చెందాడు.
కడియం: తూర్పు గోదావరి జిల్లా కగియం మండలం ధామిరెడ్డిపల్లెలో ఉండమట్ల శ్రీనివాస్(32) అనే వ్యక్తి అనుమాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆదివారం ఉదయం ఇంటి తలుపు తెరిచి చూసే సరికి శ్రీనివాస్ ఉరేసుకుని కనిపించాడు. ఎవరైనా చంపి ఉరేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.