భారత్‌తో విడిపోయాక పాకిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడింది. అయితే నాటి నుంచి పాక్ ఆర్థిక పరిస్థితి ఏనాడూ సుస్థిరంగా ఉన్న దాఖలాలు లేవు. కరోనా కాలం అనంతరం పాక్ పరిస్థితి మరింత దయనీయంగా తయారయ్యింది. అనంతరం వచ్చిన వరదలు పాకిస్తాన్‌ను అతలాకుతలం చేశాయి. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో పాక్ అధిక ధరలతో అట్టుడికిపోతోంది. నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం పాకిస్తాన్‌ను కబ్జా చేశాయి. అయితే ఇన్ని ప్రతికూలతల మధ్య ‘పాకిస్తాన్ రిచెస్ట్ మ్యాన్’ కథ అందరికీ స్ఫూర్తినిస్తుంది.
ఇంజినీరుగా కెరియర్ ప్రారంభం
పాకిస్తాన్‌కు చెందిన షాహిద్ ఖాన్ 1950, జూలై 18న లాహోర్‌లో జన్మించారు. కొంతకాలం పాక్‌లోనే ఉండిన ఆయన అనంతదం అమెరికాకు వెళ్లారు. తిరిగి ఇప్పుడు పాకిస్తాన్‌కు వచ్చి స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. ఇంజినీరుగా ఆయన తన కెరియర్ ప్రారంభించారు. షాహిద్ ఖాన్ 1980లో తన మాజీ యజమాని నుండి ఆటో విడిభాగాల సరఫరా సంస్థ ‘ఫ్లెక్స్ ఎన్ గేట్’ను కొనుగోలు చేశారు. అప్పటి నుంచి నిరంతర ప్రగతి బాటలో ముందుకు సాగుతున్నారు.
ఫోర్బ్స్ కోటీశ్వరుల జాబితాలో స్థానం
మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం షాహిద్ ఖాన్ విజయంలో వన్ పీస్ ట్రక్ బంపర్‌కు సంబంధించిన డిజైన్ కీలకంగా మారింది. ఫోర్బ్స్ కోటీశ్వరుల జాబితాలో చేరిన షాహిద్ ఖాన్‌కు చెందిన కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 69 ప్లాంట్స్ ఉన్నాయి. వీటిలో 26 వేలకుపైగా సిబ్బంది పనిచేస్తున్నారు. షాహిద్ ఖాన్ ఎన్‌ఎఫ్ఎల్‌కు చెందిన జాక్సన్‌విల్లే జాగ్వార్‌కు కూడా యజమాని. 2012లో ఆయన దీనిని కొనుగోలు చేశారు. దీనితో పాటు అతనికి యూకేలో ఒక ఫుట్‌బాల్ కంపెనీ కూడా ఉంది.
ఆటోపార్ట్స్ తయారీ కంపెనీతో..
షాహిద్ ఖాన్‌కు చెందిన కంపెనీ ఆటోపార్ట్స్‌ను తయారు చేసి, విక్రయిస్తుంటుంది. ఇదే అతనికి వచ్చే ఆదాయంలో అత్యంత కీలకమైనది. ఫోర్బ్స్ అందించిన రియల్ టైమ్ బిలియనీర్స్ రిపోర్టును అనుసరించి షాహిద్ ఖాన్ మొత్తం ఆస్తి 12.1 బిలియన్ డాలర్లు. షాహిద్ ఖాన్ పాకిస్తాన్‌లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తన 16 ఏళ్ల వయసులో కేవలం 500 డాలర్లతో అమెరికా చేరుకున్నారు. అక్కడ తన వ్యాపార విజయంతో వేల కోట్ల విలువైన సామ్రాజ్యాన్ని స్థాపించారు.
చదువుకునే సమయంలో కష్టాలు
షాహిద్‌ఖాన్ అమెరికాలోని ఇలినాయిస్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. గతంలో షాహిద్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను అమెరికాలో చదువుకునే సమయంలో డిష్‌వాషర్ పని కూడా చేశానని తెలిపారు. 1971లో షాహిద్ ఖాన్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. 1999లో మెకానికల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం షాహిద్ ఖాన్‌ను విశిష్ట పూర్వ విద్యార్థిగా గుర్తించి, ఘనంగా సన్మానించింది.
ఇది కూడా చదవండి: భార్యను 12 ఏళ్లుగా ‘టార్చర్ రూమ్’లో బంధించి.. ఘోరానికి పరాకాష్ట!
Comments
Please login to add a commentAdd a comment