richest
-
దేశంలోనే రిచెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్.. జీతం రూపాయి!
దేశంలో ఐఏఎస్ అధికారులకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. వారి నేపథ్యం, వ్యక్తిగత విషయాలపైనా చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ఈ క్రమంలో పలువురు ఐఏఎస్ అధికారులు వార్తల్లో నిలుస్తుంటారు. వారిలో హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ అమిత్ కటారియా ఒకరు. ఇటీవల ఆయన వార్తల్లోకి వచ్చారు.ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో పనిచేస్తున్న అమిత్ కటారియా దేశంలోనే అత్యంత సంపన్న ఐఏఎస్ అధికారులలో ఒకరిగా వెలుగులోకి వచ్చారు. ఈ ప్రత్యేకత గణనీయమైన దృష్టిని ఆకర్షించింది. అంత సంపన్నుడైన ఆయన సర్వీస్‌లో చేరిన కొత్తలో కేవలం ఒక్క రూపాయి మాత్రమే జీతంగా తీసుకున్నారు. దీంతో ప్రజాసేవ పట్ల తనకున్న అంకితభావాన్ని ప్రదర్శించారు.అమిత్ కటారియా విద్యా నేపథ్యం కూడా అద్భుతంగా ఉంది. కొన్ని మీడియా నివేదికల ప్రకారం.. కటారియా తన పాఠశాల విద్యను ఆర్కే పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పూర్తి చేశారు. తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఢిల్లీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీతో పట్టభద్రుడయ్యారు. 2003లో యూపీఎస్ఈ పరీక్షలో 18వ ర్యాంక్ సాధించి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో చోటు సంపాదించారు.ఉన్నత వ్యాపార కుటుంబంఅమిత్ కటారియా రియల్ ఎస్టేట్‌లో స్థిరపడిన వ్యాపార కుటుంబం నుండి వచ్చారు. వీరికి ఢిల్లీ, సమీప ప్రాంతాలలో మంచి లాభాలు ఇస్తున్న వెంచర్లు ఉన్నాయి. సంపన్నుడైనప్పటికీ కటారియా తన కెరీర్ ప్రారంభంలో సర్వీస్‌లో చేరిన తర్వాత కేవలం రూపాయి వేతనం తీసుకోవడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు.అయితే కొన్ని సందర్భాలలో తన చర్యలతో వివాదాస్పదమూ అయ్యారు. 2015లో ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ కలెక్టర్‌గా ఉన్న సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా స్వాగతం పలుకుతూ సన్ గ్లాసెస్ ధరించడం వివాదాస్పదం అయ్యింది. దీన్ని ప్రోటోకాల్ ఉల్లంఘనగా భావించిన రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసు ఇచ్చింది.ఇక వ్యక్తిగత విషయానికి వస్తే అమిత్ కటారియా కమర్షియల్ పైలట్ అయిన అశ్మిత హండాను వివాహం చేసుకున్నారు. ఈ జంట తరచుగా తమ వ్యక్తిగత విశేషాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. కాగా అమిత్ కటారియా నెట్‌వర్త్ సుమారు రూ.8.90 కోట్లని అంచనా. -
కాసులు కురిపించిన షేర్లు.. కుబేరుల్లో రెండో స్థానానికి జెఫ్ బెజోస్
అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్‌కు షేర్లు కాసులు కురిపించాయి. ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి చేర్చాయి. 3 బిలియన్ డాలర్లు (రూ.25 వేల కోట్లు) విలువైన అమెజాన్ షేర్లను బెజోస్ ఇటీవల విక్రయించారు. దీంతో ఈ సంవత్సరానికి ఆయన మొత్తం స్టాక్ అమ్మకాలు 13 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం.. బెజోస్ 1.6 కోట్లకు పైగా షేర్లను విక్రయించారు. ఇటీవల భారీగా పెరిగిన అమెజాన్ స్టాక్ ధరను ఆయన సద్వినియోగం చేసుకున్నారు. ఒక్కో షేరు ధర 200 డాలర్లను తాకింది. అమెజాన్ స్టాక్ గత సంవత్సరంలో 40 శాతానికి పైగా పెరిగింది. ఇటీవల ప్రకటించిన మూడవ త్రైమాసిక ఫలితాలు అంచనాలను మించి రాణించడంతో గత వారం రోజుల్లోనే షేర్ల విలువ 7 శాతం పెరిగింది.ఇదీ చదవండి: చనిపోయినా.. చచ్చేంత సంపాదనఅమెజాన్ స్టాక్‌ల విలువ పెరగడంతో బెజోస్ సంపద కూడా పెరిగింది. ఇది గత సంవత్సరంలో 42.8 బిలియన్ డాలర్లు పెరిగింది. ఈ నవంబర్ 3 నాటికి, బెజోస్ 220 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో రెండవ స్థానంలో ఉన్నారు. టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ 262 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో ఉండగా, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ 201 బిలియన్ డాలర్లతో మూడవ స్థానంలో ఉన్నారు. -
అత్యంత ధనవంతుల జాబితాలోని టాప్ 10 ఎన్ఆర్ఐలు (ఫొటోలు)
-
ప్రపంచంలోనే అత్యంత సంపన్న నటి ఎవరో తెలుసా?
ప్రపంచంలోనే అత్యంత సంపన్న నటి ఎవరో చెప్పగలరా? మీరు ఊహించినట్టు టేలర్ స్విఫ్ట్, రిహన్న, సెలీనా గోమెజ్ అయితే కాదు. ఎందుకంటే ఈ ముగ్గురి మొత్తం సంపద కలిపినా కూడా ఆ నటి సంపదకు సరితూగదు. ఆశ్చర్యంగా అనిపించినా ఇది అక్షరాల నిజం. అంతేకాదు అందరి కంటే ఎక్కువ సంపద కలిగివున్నప్పటికీ ఆమె ఏమీ పాపులర్ నటి కాదు. ఆమె ఖాతాలో ఒక్క బాక్సాఫీస్ విజయం కూడా లేదు. మరి ఆమెకు అంత సంపద ఎలా వచ్చింది?ఫోర్బ్స్ ప్రకారం.. అత్యంత సంపన్న నటుడు టైలర్ పెర్రీ. అమెరికాకు చెందిన ఆయన నటుడిగా, నిర్మాతగా, నాటక రచయితగా ప్రసిద్ధుడు. ఆయనకు సొంత స్టూడియోతో పాటు, మాడియా హిట్ ఫ్రాంచైజీ ఉండడంతో అతడు 1.4 బిలియన్ డాలర్ల సంపద కలిగివున్నాడు. అత్యంత సంపన్న నటిగా ఈ జాబితాలో ముందున్న అమెరికన్ యాక్ట్రస్-ఆంట్రప్రెన్యూర్ జామీ గెర్టజ్.. ఆస్తుల ఎంతో తెలిస్తే అవాక్కవడం పక్కా. టైలర్ పెర్రీ సంపద కంటే 5 రెట్లు కంటే ఎక్కువని ఫోర్బ్స్ అంచనా వేసింది. జామీ గెర్టజ్ ఆస్తుల నికర విలువ 8 బిలియన్ డాలర్లు. అంటే 66 వేల కోట్ల రూపాయల పైమాటే. ప్రపంచంలోని సెలబ్రిటీలందరిలోనూ ఆమె అత్యంత సంపన్నురాలు. టేలర్ స్విఫ్ట్ (1.6 బిలియన్ డాలర్లు), రిహన్న (1.4 బిలియన్ డాలర్లు), సెలీనా గోమెజ్ (1.3 బిలియన్ డార్లు) తరువాతి స్థానంలో ఉన్నారు. మడోన్నా.. నాన్-బిలియనీర్‌గా టాప్-5లో చోటు దక్కించుకుంది.టాప్ 10లో జూహీ చావ్లాటాప్-5లో మిగిలిన నలుగురి మొత్తం సంపద కంటే కూడా జామీ గెర్టజ్ సంపదే ఎక్కువని ఫోర్బ్స్ అంచనా వేసింది. టాప్-5లో నిలిచిన ఐదుగురు నటీమణులు నటనతో పాటు ఇతర వ్యాపకాలతో ఆస్తులు కూడబెట్టారు. టేలర్ స్విఫ్ట్, రిహన్న, సెలీనా గోమెజ్, మడోన్నా.. యాక్టింగ్‌తో పాటు మ్యూజిక్ కెరీర్, మేకప్ బ్రాండ్లతో సంపద పోగేశారు. జామీ గెర్టజ్ విషయానికి వస్తే ఆమె వ్యాపార పెట్టుబడులతో అందరి కంటే ఎక్కువగా సంపాదించారు. మెయిన్ స్ట్రీమ్ నటి రీస్ విథర్స్పూన్ ఏడవ స్థానంలో ఉంది. టాప్ 10లో ఉన్న ఏకైక భారతీయ నటి జూహీ చావ్లా మాత్రమే. హురున్ రిచ్ లిస్ట్ ప్రకారం ఆమె సంపద సుమారు రూ.4600 కోట్లు.చదవండి: టిన్ అండ్ టీనా మూవీ రివ్యూఎవరీ జామీ గెర్టజ్?జామీ గెర్టజ్.. అమెరికాలోని షికాగోలో 1965లో జన్మించారు. 80వ దశకంలో నటనా జీవితాన్ని ప్రారంభించారు. 1981లో ఎండ్లెస్ లవ్‌తో సినీ రంగ ప్రవేశం చేశారు. 1987లో లెస్ దేన్ జీరో సినిమాలో రాబర్ట్ డౌనీ జూనియర్‌కి జోడీగా నటించడంతో ఆమెకు గుర్తింపు దక్కింది. అదే సంవత్సరం ది లాస్ట్ బాయ్స్ సినిమాలో ప్రముఖ పాత్రను పోషించి ప్రశంసలు అందుకున్నారు. 90 దశకంలో ట్విస్టర్ వంటి సినిమాల్లో నటించారు. ప్రధాన నటిగా విజయాలు దక్కకపోవడంతో తర్వాత సహాయ పాత్రలకు పరిమితమయ్యారు. అల్లీ మెక్‌బీల్ టీవీ షోతో ప్రేక్షుకులకు దగ్గరయి ఎమ్మీ నామినేషన్ సాధించారు. చివరిసారిగా 2022 చిత్రం ఐ వాంట్ యు బ్యాక్ సినిమాలో అతిథి పాత్రలో ఆమె కనిపించారు.చదవండి: ఓటీటీలో హాలీవుడ్ రొమాంటిక్ మూవీ.. 20 భాషల్లో స్ట్రీమింగ్అంత సంపద ఎలా వచ్చింది?జామీ గెర్టజ్ నటనా జీవితంలో పెద్దగా విజయాలు లేకపోయినా ఆమె అత్యంత సంపన్న నటిగా ఎలా ఎదిగారనేది అందరికీ ఆసక్తి కలిగించే విషయం. అమెరికన్ బిలియనీర్ వ్యాపారవేత్త టోనీ రెస్లర్ను వివాహం చేసుకోవడంతో ఆమె దశ తిరిగింది. భర్తతో కలిసి వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడంతో ఆమె సంపద బాగా పెరిగింది. వీరిద్దరూ నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (NBA)లో అట్లాంటా హాక్స్, మేజర్ లీగ్ బేస్‌బాల్‌లో మిల్వాకీ బ్రూవర్స్ జట్లకు సహ-యజమానులుగా ఉన్నారు. వీటితో పాటు ఇతర వ్యాపారాల్లోనూ జామీ గెర్టజ్ పెట్టుబడులు కలిగివుండడంతో రిచెస్ట్ యాక్ట్రస్‌గా ఆమె టాప్‌లో ఉన్నారు. -
రూ.16 లక్షల కోట్ల మార్కు దాటిన ‘మార్క్’ సంపద!
మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ప్రపంచంలోని నాలుగో అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. 200 బిలియన్ డాలర్లు(రూ.16 లక్షల కోట్లు) మించి నికర విలువను సంపాదించిన అతికొద్ది మంది వ్యక్తుల్లో ఒకరిగా స్థానం సంపాదించారు. ఈమేరకు బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్‌లో వివరాలు వెల్లడయ్యాయి. జుకర్‌బర్గ్ సంపద ప్రస్తుతం 201 బిలియన్ డాలర్ల(రూ.16.8 లక్షల కోట్లు)కు చేరుకుంది.ఇప్పటివరకు టెస్లా సీఈఓ ఇలోన్ మస్క్ 272 బిలియన్ డాలర్ల(రూ.22.7 లక్షల కోట్లు) సంపదతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. తర్వాత స్థానాల్లో వరుసగా అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్ (211 బిలియన్ డాలర్లు-రూ.17.6 లక్షల కోట్లు), ఎల్వీఎంహెచ్ ఛైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ (207 బిలియన్ డాలర్లు-రూ.17.3 లక్షల కోట్లు) ఉన్నారు. జుకర్‌బర్గ్ ఇప్పటివరకు నాలుగోస్థానంలో ఉన్న ఓరాకిల్ కార్పొరేషన్ సహవ్యవస్థాపకులు లారీ ఎల్లిసన్‌ను వెనక్కినెట్టారు.ఇదీ చదవండి: వడ్డీతో కలిపి రూ.8,465 కోట్లు చెల్లించిన ఎయిర్టెల్బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం టాప్ 10 ధనవంతులు..ఇలోన్ మస్క్జెఫ్ బెజోస్బెర్నార్డ్ ఆర్నాల్ట్మార్క్ జూకర్బర్గ్లారీ ఎల్లిసన్బిల్గేట్స్లారీపేజ్స్టీవ్ బామర్వారెన్బఫెట్సెర్జీబ్రిన్ -
ఆ గణపతికి 69 కిలోల బంగారు నగలు.. రూ. 400 కోట్ల బీమా
ముంబై: ప్రతి ఏటా దేశంలో గణపతి నవరాత్రులు అత్యంత వైభంగా జరుగుతుంటాయి. ఈ సారి సెప్టెంబర్ 7 నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అలాగే సెప్టెంబర్ 17 న గణేష్ నిమజ్జనం జరగనుంది. మహారాష్ట్రలో గణపతి నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతాయి.ముంబైలోని ఏర్పాటు చేసే ప్రతి గణపతి విగ్రహం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ముంబైలోని జీఎస్బీ సేవా మండలి ప్రతిష్ఠించే గణపతి విగ్రహం ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంటుంది. ఈ మండలి వడాలాలోని కింగ్స్ సర్కిల్ సమీపంలో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ విగ్రహానికి 69 కిలోల బంగారు నగలను ధరింపజేయనున్నారు. అలాగే రూ. 400 కోట్ల బీమా కూడా చేయించనున్నారు. మహారాష్ట్ర సంప్రదాయాలకు అనుగుణంగా ఇక్కడ నిత్యం పూజలు, అర్చనలు నిర్వహించనున్నారు. -
ప్రపంచంలోనే అత్యంత సంపన్న పిల్లి ..ఇన్‌స్టాలో ఒక్కో పోస్ట్‌కి ఏకంగా..!
ఎక్కువ సంపాదన కోసం రకరకా మార్గాల్లో అన్వేషిస్తుంటాడు మనిషి. అలా కష్టపడగా..కష్టపడగా.. కొన్నేళ్లకు ధనవంతుడవుతాడు. అదికూడా కొందరికే సాధ్యమవుతుంది. అలా ఓ జంతువు కూడా సంపాదించగలదంటే నమ్ముతారా..!. ఇది చిన్నప్పటి నుంచి దాని విభిన్నమైన లుక్స్‌తో సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రజాధరణ పొంది డబ్బులు ఆర్జించడం మొదలుపెట్టింది. అలా ప్రంపచంలోనే అత్యంత ధనవంతురాలైన పిల్లిగా రికార్డు సృష్టించింది. ఇంతకీ ఈ పిల్లి అంతలా ఎలా సంపాదిస్తుంటే..ఆ పిల్లి పేరు నాలా. ఇది కాలిఫోర్నియాకు చెందిన సియామీ టాబీ మిక్స్ క్యాట్. 2010లో వరిసిరి మేతచిట్టిఫాన్ అనే మహిళ ఈ నాలా అనే పిల్లిని జంతు సంరక్షణ కేంద్ర నుంచి దత్తత తీసుకుంది. అప్పుడు దాని వయసు కేవలం ఐదు నెలలే. 2012లో వరిసిరి తన స్నేహితులకు, కుటుంబ సభ్యలతో తన పెంపుడు పిల్లి క్యూట్ ఫోటోలను షేర్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఇన్‌స్టాలో దాని పేరుతో ఒక ప్రొఫెల్ క్రియేట్ చేసింది. కొద్ది కాలంలోనే ఈ పిల్లి వేలాది ప్రజలను ఆకర్షించింది. అలా ఆ పిల్లి ఇన్‌స్టాలో 4.5 మిలియన్ల మంది ఫాలోవర్ల ఉన్న జంతువుగా గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పింది. ఈ పిల్లి అందమైన తలపాగా, నీలికళ్లతో చూపురులను కట్టిపడేస్తుంది. ఇలా నాలాకు పెరిగిన భారీ ఫాలోయింగే..పెంపుడు జంతువుల విభాగంలో ఫోర్బ్స్ టాప్ ఇన్ఫ్లుయెన్సర్ల జాబితాలో చేర్చింది. అంతేగాదు ఈ పిల్లి పేరు మీదుగా లివింగ్ యువర్ బెస్ట్ లైఫ్ అకార్డింగ్ టు నాలా క్యాట్' అనే ఈబుక్‌ను కూడా కలిగి ఉంది. అలాగే ఆమె సొంత వెబ్సైట్ 'లవ్ నాలా' పేరుతో ప్రీమియం క్యాట్ ఫుడ్ బ్రాండ్‌ను కలిగి ఉంది. నివేదికల ప్రకారం ఈ లవ్ నాలా బ్రాండ్ హస్బ్రో, రియల్ వెంచర్స్, సీడ్ క్యాంప్‌ల వంటి పెట్టుబడుదారుల నుంచి వందల కోట్లు ఆర్జిస్తోంది. ఈ పిల్లి సంపాదనలో ఎక్కువ భాగం సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్స్, ప్రొడక్ట్స్ ప్రకటనలు, బ్రాండ్ల ద్వారానే ఎక్కువగా ఆర్జిస్తోంది. ఈ పిల్లి ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు, టిక్‌టాక్, యూట్యూబ్‌తో సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కూడా ప్రొఫైల్‌ను కలిగి ఉంది. అయితే ఈ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ల సాయంతో జంతు సంరక్షణ పట్ల అవగాహన కల్పించడం, స్వచ్ఛంద సంస్థలకు నిధులు సేకరించడం వంటివి చేస్తుంది ఆ పిల్లి యజమాని వరిసిరి. కాగా, నాలా తర్వాత ప్రపంచంలోని రెండవ అత్యంత సంపన్న పిల్లి ఒలివియా బెన్సన్. ఈ పిల్లి నికర విలువ రూ. 813 కోట్లు. మూడవ అత్యంత సంపన్న పిల్లి దివంగత జర్మన్ ఫ్యాషన్ డిజైనర్ కార్ల్ ఒట్టో లాగర్ఫెల్డ్కు చెందిన చౌపెట్టే. దీనికి రూ. 109 కోట్లు సంపద ఉంది.(చదవండి: 12 ఏళ్లుగా అతనిది 30 నిమిషాల నిద్రే..!) -
ఆర్యమన్ విక్రమ్.. అత్యంత సంపన్న భారత క్రికెటర్ (ఫోటోలు)
-
బాలీవుడ్లో టాప్-5 కుబేరులు వీళ్లే.. అమితాబ్ ప్లేస్ ఎంతంటే?
బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల కల్కి మూవీతో మెప్పించిన ఆయన ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్‌పతి షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా బాలీవుడ్లో అత్యంత సంపన్నుల జాబితాను హురున్ ఇండియా రిచ్‌లిస్ట్ -2024 పేరుతో విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో అమితాబ్ నాలుగో ప్లేస్‌లో నిలిచారు.ఇటీవల విడుదలైన హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024లో అమితాబ్ బచ్చన్ కుటుంబ నికర ఆస్తుల విలువ రూ.1,600 కోట్లు అని వెల్లడించింది. అతనికంటే ముందు షారుఖ్ ఖాన్ (రూ.7300 కోట్లు), జూహీ చావ్లా కుటుంబం (రూ.4600 కోట్లు), హృతిక్ రోషన్ (రూ. 2000కోట్లు) అతని ముందున్నారు.ఈ లిస్ట్‌లో కరణ్ జోహార్ రూ.1400 కోట్లతో ఐదోస్థానంలో నిలిచారు.అయితే అమితాబ్ తన చిన్న వయసులో కోల్‌కతాలో నెలకు రూ.400 ఉద్యోగంలో పని చేసినట్లు వెల్లడించారు. కాలేజీ పూర్తి చేసిన తర్వాత కోల్‌కతాలో జాబ్ చేసేందుకు వెళ్లానని తెలిపారు. ఓకే గదిలో దాదాపు 8 మందితో కలిసి ఉండేవాడినని పేర్కొన్నారు. కేవలం నేల మీద పడుకునేవాడినని ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. కాగా.. ఇటీవల కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో కంటెస్టెంట్‌గా పాల్గొన్న ఓ వ్యక్తి తాను పుణెలో ఓకే గదిలో ఎనిమిది మందితో కలిసి జీవిస్తున్నట్లు అమితాబ్‌తో అన్నారు. ఈ సందర్భంగా తాను కూడా ఆ స్థాయి నుంచే వచ్చినట్లు అమితాబ్ వెల్లడించారు.ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్‌పతి 16 షూటింగ్లో బిజీగా ఉన్న అమితాబ్ ఆ తర్వాత సెక్షన్ 84 చిత్రంలో కనిపించనున్నారు. అంతేకాకుండా రజనీకాంత్ నటిస్తోన్న వేట్టైయాన్లోనూ నటించనున్నారు. -
‘ధన రాశి’ ఇదే.. అత్యధిక సంపన్నులు వీళ్లే..
దేశంలోని అత్యంత సంపన్నుల జాబితాను హరున్ ఇండియా ఇటీవల విడుదల చేసింది. జులై 31 నాటికి రూ.1000 కోట్లు, అంతకుమించిన సంపద కలిగిన వారితో రూపొందించిన ఈ జాబితా ప్రకారం.. కర్కాటక రాశిలో జన్మించినవారి సంపదే ఈ ఏడాది అత్యధికంగా వృద్ధి చెందింది. ఇక మిగిలిన రాశుల స్థితిగతులేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయండి...తాజా హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం.. కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు ఇది ఉత్తమ సంవత్సరం. తరువాత మిథునం, సింహ రాశి ఉన్నాయి. కర్కాటక రాశి వ్యక్తుల సంచిత సంపదలో 84 శాతం పెరుగుదలను చూసింది. మిథున రాశి వారి సంపద 77 శాతం వృద్ధితో రెండో స్థానంలో ఉంది. మూడవ స్థానంలో సింహరాశి ఉంది. వీరి సంచిత సంపద 68 శాతం పెరిగింది.అదే విధంగా 64 శాతం సంపద పెంపుతో ధనుస్సు రాశి, 61 శాతం వృద్ధితో తులారాశి నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఇక మకరం సంచిత సంపదలో 58 శాతం పెరుగుదలను చూసింది. తరువాత మీన రాశి 46 శాతం వృద్ధిని సాధించింది. కుంభం, కన్య రాశులు 39 శాతం సంపద వృద్ధితో ఎనిమిదవ స్థానాన్ని పంచుకున్నాయి. ఇక మేషం, వృశ్చికం, వృషభ రాశులు వరుసగా 34 శాతం, 33 శాతం, 32 శాతం సంపద వృద్ధితో చివరి స్థానాలకు పరిమితమయ్యాయి.మిథునం ఇలా అగ్రస్థానంమొత్తం మీద, సంపద వృద్ధి పరంగా కర్కాటక రాశి ముందంజలో ఉంది. కానీ సంపన్నుల సంఖ్య విషయంలో మిథునం అగ్రస్థానంలో ఉంది. జాబితాలోని ధనవంతులలో 9.9 శాతం మంది ఈ రాశి వారే. వీరిలో కుమార్ మంగళం బిర్లా, ఎల్ఎన్ మిట్టల్ వంటి ప్రముఖులు ఉన్నారు.(Disclaimer: వ్యక్తుల విజయం, సంపాదన రాశుల బట్టి కాక, వారి కృషిని బట్టి ఉంటాయి. దీర్ఘకాలిక లక్ష్యం, అంకితభావంతో కృషి చేసేవారు తమ రంగంలో తప్పక విజయం సాధిస్తారు.) -
Hurun Rich List 2024: అంబానీని మళ్లీ దాటేసిన అదానీ
న్యూఢిల్లీ: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ దెబ్బ నుంచి వేగంగా కోలుకున్న పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ (62) దేశీయంగా అత్యంత సంపన్నుల జాబితాలో మరోసారి రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీని (67) అధిగమించి అగ్రస్థానం దక్కించుకున్నారు. ఏడాది వ్యవధిలో ఆయన సంపద ఏకంగా 95 శాతం ఎగిసి రూ. 11.6 లక్షల కోట్లకు చేరింది. హురున్ గురువారం విడుదల చేసిన సంపన్నుల జాబితా– 2024లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2023 నివేదికలో అదానీ సంపద 57 శాతం క్షీణించి రూ. 4.74 లక్షల కోట్లకు పడిపోయింది.అప్పుడు అంబానీ సంపద రూ. 8.08 లక్షల కోట్లుగా నమోదైంది. తాజాగా అంబానీ మొత్తం సంపద 25 శాతం పెరిగి రూ. 10.14 లక్షల కోట్లకు చేరడంతో ఆయన రెండో స్థానంలో నిల్చారు. తాజా జాబితాలో జూలై 31 నాటి వరకు రూ. 1,000 కోట్ల పైగా నికర విలువ ఉన్న భారతీయ సంపన్నులను పరిగణనలోకి తీసుకున్నారు. ఈసారి కుబేరుల సంఖ్య 220 మేర పెరిగి 1,539కి చేరింది. మొత్తం సంపద 46 శాతం వృద్ధి ెచంది రూ. 159 లక్షల కోట్లకు చేరింది. ఇది సౌదీ అరేబియా, స్విట్జర్లాండ్ దేశాల సంయుక్త జీడీపీ కన్నా అధికం కాగా భారతదేశ జీడీపీలో సగానికన్నా అధికం కావడం గమనార్హం. భారత్‌లో ప్రతి ఐదు రోజులకు ఒక కొత్త బిలియనీరు నమోదయ్యారు. మరిన్ని విశేషాలు.. ⇒ హురున్ టాప్–5 జాబితాలో హెచ్‌సీఎల్ అధిపతి శివ్ నాడార్ (రూ. 3.14 లక్షల కోట్లు) మూడో స్థానంలో, సీరమ్ ఇనిస్టిట్యూట్‌కి చెందిన సైరస్ పూనావాలా (రూ. 2.89 లక్షల కోట్లు) ఒక స్థానం తగ్గి నాలుగో స్థానంలో ఉన్నారు. సన్ ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వి రూ. 2.50 లక్షల కోట్ల సంపదతో ఆరు స్థానం నుంచి అయిదో స్థానానికి చేరారు. ⇒ 7,300 కోట్ల సంపదతో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తొలిసారిగా ఈ లిస్టులో చోటు దక్కించుకున్నారు.టాప్–3లో హైదరాబాద్.. 17 మంది కొత్త కుబేరులు జత కావడంతో హైదరాబాద్ తొలిసారిగా బెంగళూరును అధిగమించింది. 104 మంది సంపన్నులతో సంఖ్యాపరంగా మూడో స్థానంలో నిలి్చంది. తెలంగాణలో 109 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 9 మంది అత్యంత సంపన్నులు ఉన్నారు. 396 మంది కుబేరులతో ముంబై అగ్రస్థానంలో, 217 మందితో న్యూఢిల్లీ రెండో స్థానంలో ఉంది. అత్యంత సంపన్న తెలుగువారిలో మురళి దివి (దివీస్), సి.వెంకటేశ్వర రెడ్డి –ఎస్.సుబ్రహ్మణ్యం రెడ్డి (అపర్ణ కన్స్ట్రక్షన్స్), జీఎం రావు–కుటుంబం (జీఎంఆర్), హర్షా రెడ్డి పొంగులేటి (రాఘవ కన్స్ట్రక్షన్స్), పి.పి.రెడ్డి–పీవీ కృష్ణా రెడ్డి (ఎంఈఐఎల్), బి.పార్థసారథి రెడ్డి–కుటుంబం (హెటిరో ల్యాబ్స్), ప్రతాప్ రెడ్డి–కుటుంబం (అపోలో హెల్త్‌కేర్), పీవీ రామ్‌ప్రసాద్ రెడ్డి (అరబిందో ఫార్మా) తదితరులు ఉన్నారు. -
ధనవంతుల జాబితాలో వెనక్కి తగ్గిన అంబానీ (ఫోటోలు)
-
ఆసియాలోనే అత్యంత సంపన్న గ్రామం, మనదేశంలోనే.. ఎక్కడుందంటే?
ప్రపంచంలో అంత్యంత సంపన్న వ్యక్తులు, దేశాలు, నగరాల గురించి మీరు వినే ఉంటారు. మరి సంపన్న గ్రామం గురించి మీరెప్పుడైనా విన్నారా? అవును మీరు విన్నది నిజమే. మనదేశంలోని ఓ రాష్ట్రానికి చెందిన గ్రామం ఆసియాలోని అత్యంత సంపన్న గ్రామంగా అవతరించింది. ఇంతకి ఆ గ్రామం ఎక్కడుంది? ఆ ఊరు విశేషాలేంటో తెలుసుకుందాం? పదండి. ఒక్క భారత్‌లోనే కాదు. ప్రపంచంలోనే వ్యాపారం చేయడంలో గుజరాతీలను మించిన వారు లేరని అంటారు. కాబట్టే మన దేశంతో పాటు ప్రపంచ వ్యాపారం రంగంలో వీరే అగ్రస్థానంలో ఉంటారు. తాజాగా గుజరాత్ రాష్ట్రం, కఛ్ జిల్లా, భుజ్ తాలూకాలో మధాపర్ గ్రామం మొత్తం ఆసియాలోనే అత్యంత సంపన్న గ్రామంగా ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామ వాసుల డిపాజిట్లు మొత్తం రూ.7,000 కోట్లకు పైమాటే. గణాంకాల ప్రకారం.. మధాపర్ జనాభా 2011లో 17,000 నుండి దాదాపు 32,000గా ఉంది. ఈ ఊరిలోనే హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, పీఎన్బీ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ, యూనియన్ బ్యాంక్‌తో పాటు మొత్తం ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు అన్నీ కలిపి 17కి పైగా ఉన్నాయి. అయినప్పటికీ, ఇతర బ్యాంకులు సైతం ఈ ఊరిలో తమ బ్రాంచీలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. సంపన్న గ్రామంగా అవతరించడానికి కారణంమధాపర్ సంపన్న గ్రామంగా అవతరించడానికి ఎన్ఆర్ఐలే కారణమని తెలుస్తోంది. విదేశాల్లో నివసిస్తున్న ఆ ఊరి ప్రజలు గ్రామంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న బ్యాంకుల్లో ప్రతిఏటా కోట్ల మొత్తంలో డబ్బులు డిపాజిట్లు చేస్తుంటారు. విదేశాల్లో ఎక్కువగా ఆఫ్రికన్ దేశాల్లో నివసిస్తున్నారు. సెంట్రల్ ఆఫ్రికాలోని నిర్మాణ వ్యాపార రంగాల్లో గుజరాతీలు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఈ ఊరిలో మిగిలిన వారు యూకే,ఆస్ట్రేలియా,అమెరికా, న్యూజిలాండ్‌లో నివసిస్తున్నారు.ఊరికి ఏదో ఒకటి చేయాలనిఈ సందర్భంగా చాలా మంది గ్రామస్తులు విదేశాలలో నివసిస్తున్నారు. పని చేస్తున్నప్పటికీ, వారు తమ గ్రామ అభివృద్దికి అండగా నిలుస్తున్నారని, వారు నివసించే ప్రదేశంలో కాకుండా మధాపర్ గ్రామంలో ఉన్న బ్యాంకుల్లో డబ్బును డిపాజిట్ చేసేందుకు ఇష్టపడతారని జిల్లా పంచాయతీ మాజీ అధ్యక్షుడు పరుల్బెన్ కారా తెలిపారు.సకల సౌకర్యాలకు నిలయంగాగ్రామంలోని జాతీయ బ్యాంకు స్థానిక బ్రాంచ్ మేనేజర్ మాట్లాడుతూ భారీగా డిపాజిట్లు రావడంతో అభివృద్ధి చెందుతుందన్నారు. నీరు, పారిశుధ్యం, రహదారి వంటి అన్ని ప్రాథమిక సౌకర్యాలు ఉన్నాయి. బంగ్లాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, సరస్సులు, దేవాలయాలు ఉన్నాయని మేనేజర్ చెప్పారు. -
ప్రపంచంలోనే అత్యధిక ధనవంతులు ఉన్న నగరాలు (ఫొటోలు)
-
బిలీయనీర్లకు బ్యాడ్ ఫ్రైడే
స్టాక్ మార్కెట్ ఎప్పుడెలా ఉంటుందో ఊహించలేము. కొన్ని సార్లు భారీ లాభాలను తెచ్చిపెడితే, మరికొన్ని సార్లు చావుదెబ్బ కొడుతుంది. ఇదంతా సంపన్నులకు సర్వసాధారణమే.. అయినప్పటికీ తాజాగా అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ ఒక్కరోజులోనే (శుక్రవారం) 15.2 బిలియన్ డాలర్లు నష్టపోయారు.బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. అమెజాన్.కామ్ ఇంక్ షేర్లు భారీగా పతనమవ్వడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుమారు 500 మంది ధనవంతులు సంపద 134 బిలియన్ డాలర్లు తగ్గింది. ఇందులో గరిష్టంగా జెఫ్ బెజోస్ 15.2 బిలియన్ డాలర్లు నష్టపోగా.. ఈయన నికర విలువ 191.5 బిలియన్లకు పడిపోయింది.నాస్డాక్ 100 ఇండెక్స్ 2.4 శాతం పడిపోవడంతో.. టెస్లా బాస్ మస్క్, ఒరాకిల్ కార్పొరేషన్ లారీ ఎల్లిసన్ ఇద్దరూ నష్టాలను చవి చూసారు. దీంతో వీరి సంపద 6.6 బిలియన్ డాలర్లు, 4.4 బిలియన్ డాలర్లు తగ్గింది. దీంతో దిగ్గజ పారిశ్రామిక వేత్తలు మాత్రమే కాకుండా.. చాలామంది పెట్టుబడిదారులు గందరగోళానికి గురయ్యారు.వ్యక్తిగత సంపద పరంగా మస్క్ తర్వాత స్థానంలో నిలిచిన బెజోస్ ఏడాది పొడవునా అమెజాన్ షేర్లను స్థిరంగా విక్రయించారు. ఒక్క ఫిబ్రవరిలో తొమ్మిది ట్రేడింగ్ రోజులలో సుమారు 8.5 బిలియన్ల విలువైన స్టాక్‌ను విక్రయించారు. గత నెలలో ఒక రోజు అమెజాన్ షేర్లు రికార్డు స్థాయికి చేరాయి. దీంతో బెజోస్ 5 బిలియన్స్ విలువైన 25 మిలియన్ అదనపు షేర్లను విక్రయించే ప్రణాళికను వెల్లడించారు. కానీ ఇటీవల భారీగా నష్టపోయారు. -
ఇండోనేషియాలో అత్యంత సంపన్న కుటుంబం ఇదే..
ఆసియాలో అత్యంత సంపన్నుడు ఎవరు అంటే.. అందరూ చెప్పే సమాధానం ముకేశ్ అంబానీ. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అయిన ఈయన నికర విలువ 120.3 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువని తెలుస్తోంది. నీతా అంబానీ, అంబానీ వారసులు అందరూ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూనే ఉన్నారు. ఆసియాలో రెండో అత్యంత సంపన్న కుటుంబం ఏదనే విషయం ఇక్కడ తెలుసుకుందాం.ఆసియాలో రెండో అత్యంత సంపన్న కుటుంబం హార్టోనో ఫ్యామిలీ అని తెలుస్తోంది. వీరి నికర విలువ 38.8 బిలియన్ డాలర్లు అని సమాచారం. వీరి కుటుంబ ఆదాయం జార్మ్ గ్రూప్‌తో ప్రారంభమైంది. ప్రస్తుతం వీరు సిగరెట్ పరిశ్రమలోని అగ్రగాములలో ఒకరుగా ఉన్నారు.హార్టోనో సోదరుల కూడా వ్యాపార రంగంలో గణనీయమైన వృద్ధి సాధించారు. వీరు ఇండోనేషియాలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకులలో పెట్టుబడులు కూడా పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. హార్టోనో కుటుంబానికి ఎలక్ట్రానిక్స్, ప్రాపర్టీ, అగ్రిబిజినెస్ వంటి వ్యాపారాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: అన్నింటా రికార్డులే.. నిర్మలమ్మ ఖాతాలో మరో ఘనతహార్టోనో ఫ్యామిలీ అధీనంలో జకార్తాలోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ పాలిట్రాన్ అండ్ ప్రైమ్ రియల్ ఎస్టేట్ ఉన్నాయి. వీరి కుటుంబ వ్యాపారం ఇండోనేషియాలో ఆర్థిక వృద్ధికి గణనీయంగా దోహదపడింది. దీన్ని బట్టి చూస్తే వీరి సంపద ఎంత ఉంటుందనేది ఇట్టే అర్థం చేసుకోవచ్చు. -
ప్రపంచంలో అత్యంత సంపన్న కుటుంబాలివే.. అంబానీ ప్లేస్? (ఫోటోలు)
-
ఈ బిచ్చగాడు ఎంత రిచ్ అంటే.. ఏకంగా రూ.కోటి ఇన్సూరెన్స్!
పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ క్షీణిస్తోంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయిలో ఉండటంతో ప్రజలు నిత్యావసరాల కోసం విపరీతమైన ధరలు చెల్లిస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం తన రుణాన్ని తీర్చడానికి విదేశాల నుంచి అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితిలో ఆ దేశంలో ఓ బిచ్చగాడు ఉన్నాడు. అతని సంపాదన తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు..పాకిస్తాన్ అంబానీగా పిలిచే ఈ సంపన్న బిచ్చగాడి చాలా మందికి తెలియకపోవచ్చు. అతని ఆస్తి రూ.కోట్లలో ఉంటుంది. తన పిల్లలను ఖరీదైన పాఠశాలలో చేర్పించడమే కాకుండా కోటి రూపాయలకు బీమా చేయించాడు. పాకిస్థాన్ కు చెందిన ఈ ధనిక బిచ్చగాడి పేరు షౌకత్ అని పాకిస్థాన్ లోని ఏఆర్వై వార్తా కేంద్రం తెలిపింది.పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో ముల్తాన్ నగరంలో నివసిస్తున్నాడు ఈ రిచెస్ట్ బిచ్చగాడు. 2021 అక్టోబర్‌లో షౌకత్ బ్యాంకు ఖాతాలో 1.7 మిలియన్లు ఉన్నాయని పాకిస్తాన్ టాప్ ట్యాక్స్ కలెక్టింగ్ ఏజెన్సీ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ (ఎప్బీఆర్) నివేదించింది. ఇతను రోజుకు రూ.1000 కి తక్కువ కాకుండా అడుక్కుంటాడు. షౌకత్ పిల్లలు పాకిస్తాన్‌లోని ముల్తాన్ సిటీలోని అత్యంత ఖరీదైన పాఠశాలలో చదువుతున్నారు. ఈ సంపన్న యాచకుడు కోటి పాకిస్థానీ రూపాయలకు తన పిల్లలకు బీమా చేయించాడు. అంతేకాకుండా తన ఆర్థిక స్థితిగతులపై తరచూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతుంటాడు. -
ఆసియా కుబేరుడిగా మళ్లీ అదానీ
న్యూఢిల్లీ: ఆసియాలోనే అత్యంత సంపన్నుల జాబితాలో అదానీ గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ మరోసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీని అధిగమించారు. 111 బిలియన్ డాలర్ల సంపదతో అగ్రస్థానం దక్కించుకున్నారు. అంతర్జాతీయంగా కుబేరుల లిస్టులో 11వ స్థానంలో నిల్చారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ రిపోర్టు ప్రకారం అంబానీ 109 బిలియన్ డాలర్ల సంపదతో అంతర్జాతీయంగా 12వ స్థానంలో ఉన్నారు. అదానీ 2022లోనే ఆసియాలో నంబర్ వన్ సంపన్నుడిగా ఎదిగారు. అంతే కాదు స్వల్ప సమయం పాటు ప్రపంచంలోనే రెండో స్థానంలో నిల్చారు. అయితే, ఆయన గ్రూప్ కంపెనీల ఖాతాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ ఆరోపించడంతో 2023 జనవరిలో అదానీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ తర్వాత పరిణామాలతో గ్రూప్ సంస్థల షేర్లన్నీ కుదేలై ఏకంగా 150 బిలియన్ డాలర్ల విలువ కరిగిపోయింది. దీంతో ఆసియాలో అత్యంత సంపన్నుడిగా అంబానీ మళ్లీ అగ్రస్థానం దక్కించుకున్నారు. మరోవైపు, ఆరోపణలను దీటుగా ఎదుర్కొని, అదానీ క్రమంగా దిద్దుబాటు చర్యలు తీసుకుంటూ గ్రూప్‌ను మళ్లీ నిలబెట్టుకున్నారు. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 10 గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 17.51 లక్షల కోట్లకు చేరడంతో ఆయన సంపద కూడా పెరిగింది. మొత్తం మీద 2024లో అదానీ నికర విలువ 26.8 బిలియన్ డాలర్లు పెరగ్గా, అంబానీ సంపద 12.7 బిలియన్ డాలర్లు పెరిగింది. -
బ్రిటన్‌లో అత్యంత సంపన్నుడు భారతీయుడే..!
భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త గోపీచంద్ హిందూజా యూకేలో అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. ‘ది సండే టైమ్స్ రిచ్ లిస్ట్’ యూకేలోని 1,000 మంది సంపన్నులు లేదా కుటుంబాలతో వారి మొత్తం నెట్‌వర్త్ ప్రకారం జాబితా రూపొందించింది. ఈ జాబితాలో హిందుజా గ్రూప్ ఛైర్మన్ గోపీచంద్ హిందూజాను అగ్రస్థానంలో నిలిచారు.‘ది మిర్రర్’ ప్రకారం.. హిందుజా కుటుంబం ఆరు సంవత్సరాలుగా బ్రిటన్‌లో అత్యంత సంపన్నులుగా నిలుస్తూ వస్తోంది. ర్యాంకింగ్ ఆధారంగా హిందూజా నెట్‌వర్త్ అంతకు ముందు సంవత్సరంలోని 35 బిలియన్ పౌండ్ స్టెర్లింగ్స్ (సుమారు రూ. 3.7 లక్షల కోట్లు) నుంచి సుమారు 37.196 బిలియన్ పౌండ్ స్టెర్లింగ్స్‌కు (సుమారు రూ. 3.9 లక్షల కోట్లు) పెరిగింది.జీపీగా పిలిచే గోపీచంద్ హిందూజా భారత్‌లో 1940లో జన్మించారు. హిందూజా ఆటోమోటివ్ లిమిటెడ్ ఛైర్మన్ అయిన ఆయన గత సంవత్సరం తన సోదరుడు శ్రీచంద్ హిందూజా మరణించిన తరువాత తమ వ్యాపార సమూహానికి నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. గోపీచంద్ 1959లో ముంబైలోని జై హింద్ కళాశాల నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. వెస్ట్‌మినిస్టర్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. దీంతోపాటు లండన్‌లోని రిచ్మండ్ కళాశాల నుంచి ఆర్థికశాస్త్రంలో గౌరవ డాక్టరేట్‌ను పొందారు. గోపీచంద్ తండ్రి, పరమానంద్ హిందూజా 1914లో హిందూజా ఫ్యామిలీ కంపెనీని స్థాపించారు. -
ప్రపంచంలోనే అత్యంత ధనిక ఖైదీ..!
ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు గురించి విని ఉంటారు. అలాగే అత్యంత వ్యాపార దిగ్గజాలుగా పేరుగాంచిన వారి గురించి కూడా విని ఉంటారు. కానీ ఇదేంటి అత్యంత ధనిక ఖైదీ. ఖైదీల్లో ధనికులు ఉంటారా..! అని విస్తుపోకండి. ఎందుకంటే ఈ వ్యక్తి గురించి తెలిస్తే తప్పక ఔనని అంటారు. అతడెవరంటే..క్రిప్టోకరెన్సీ సంస్థ బినాన్స్ వ్యవస్థాపకుడు చాంగ్‌పెంగ్ జావోకి యూఎస్ కోర్టు గత మంగళవారమే నాలుగు నెలల శిక్ష విధించింది. దీంతో జావో ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఖైదీగా నిలిచినట్లు యూఎస్ టెలిగ్రాఫ్ పేర్కొంది. ఆయన గతేడాది యూఎస్ మనీలాండరింగ్‌కి సంబంధించిన నిరోధక ఆంక్షల చట్టాలను ఉల్లంఘింట్లు అంగీకరించడంతో సీటెల్ కోర్టు జావోకు ఈ శిక్షను విధించింది. నిజానికి జావోకు ఈ నేరంలో మూడేళ్ల జైలు శిక్ష విధించాలని న్యాయవాదులు నుంచి ఒత్తిడిచ్చినా..జడ్డి అతడి అతని దాతృత్వ రికార్డు, ప్రవర్తనను పరిణలోకి తీసుకుని నాలుగు నెలల జైలు శిక్షను మాత్రమే విధించారు. నాలుగు నెలల జైలు శిక్షఅనుభవిస్తున్న జావో తన బినాన్స్ సంస్థ ద్వారా దాదాపు మూడు వేల కోట్ల సంపదను కలిగి ఉన్నాడు. దీంతో అతడు అత్యంత సంపన్న ఖైదీలలో ఒకరిగా నిలిచాడు. 47 ఏళ్ల జావో యూఎస్ అధికారిక ఒప్పందంలో భాగంగా గతేడాది బినాన్స్ సీఈవో పదవి నుంచి వైదొలిగారు. అయినప్పటికీ బినాన్స్‌లో ఆయన 90% వాటాను కలిగి ఉండటం విశేషం. పైగా మనీలాండరింగ్ ఆరోపణల పరిష్కారంలో భాగంగా ఫిబ్రవరిలో రూ. 35 వేల కోట్లు చెల్లించడానికి బినాన్స్ సంస్థ అంగీకరించింది.కాగా,2017లో ఈ బినాన్స్ సంస్థ ఏర్పాటయ్యింది. ఇది చాంగ్‌పెంగ్ జావోను ఒక్కసారిగా బిలియనీర్‌గా మార్చేసింది. ఈ సంస్థ క్రిప్టో ఎక్స్ఛేంజీలను నడుపుతూ.. ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తోంది. ఎప్పుడైతే క్రిప్టో మార్కెట్ కుప్పకూలిపోయిందో అప్పటి నుంచి చట్టబద్దతను ఉల్లంఘించి..నష్టాల బాట పట్టింది. చెప్పాలంటే కుప్పకూలిని క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్ ఎఫ్‌టీఎక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సామ్ బ్యాంక్‌మ్యాన్ ఫ్రైడ్ చేసి బిలయన్ డాలర్ల మోసానికి గానూ 25 ఏళ్ల జైలు శిక్ష విధించిన వారాల తర్వాత జావో నేరం వెలుగులోకి వచ్చింది. జావో అధిక రిస్క్‌తో కూడిన పెట్టుబడుల కోసం కస్టమర్ ఫండ్లలో బిలియన్ డాలర్లను స్వాహ చేసినట్లు విచారణలో వెల్లడయ్యింది. (మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో 60 ఏళ్ల మహిళ..!) -
చిరంజీవి, షారుక్‌ను మించి.. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ధనిక కుటుంబం వారిదే! (ఫొటోలు)
-
యూఎస్‌లోనే అత్యంత సంపన్న మహిళగా..ఏకంగా రూ. 75 వేల కోట్లు..!
భారతదేశంలోనే పుట్టి, పెరిగిన ఒక మహిళ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించింది. ఆహర్నిశలు కష్టపడి కంపెనీని వృద్ధిలోకి తీసుకొచ్చింది. యూఎస్‌లోనే అత్యంత పిన్నవయస్కురాలైన మహిళా వ్యాపారవేత్తగా నిలవడమే గాక ఫోర్బ్స్‌లో కూడా చోటు దక్కించుకుంది. ఎవరీమె అంటే.. భారత్‌కి చెందిన నేహా నార్ఖేడే పుట్టింది, పెరిగింది పూణేలోనే. ఆ తర్వాత యూఎస్‌లోని జార్జియా టెక్‌లో కంప్యూటర్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అక్కడే లింక్డ్ఇన్, ఒరాకిల్ వంటి కంపెనీల్లో పనిచేసి కాన్ఫ్లూయెంట్ అనే కంపెనీని స్థాపించింది. ప్రారంభంలో గణనీయమైన ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ అనతి కాలంలోనే రూ. 75 వేల కోట్ల టర్నోవర్‌తో దూసుకువెళ్లడం ప్రారంభించింది. అలా నేహా అత్యంత పిన్న వయస్కురాలైన పారిశ్రామిక వేత్తగా, అమెరికాలో ఎనిమిదొవ అత్యంత సంపన్న మహిళగా అవతరించింది. చిన్నతనంలో తాను ఇందిరా గాంధీ, కిరణ్‌బేడి, ఇంద్రానూయి వంటి ప్రముఖులు గురించి చదవడం వల్ల విజయవంతమైన వ్యాపారవేత్తగా రాణించగలిగానని చెబుతోంది. ఆమె కంపెనీ పబ్లిక్‌గా మారిన తర్వాత 2021 నాటికల్లా రూ. 13 వేల కోట్లకు చేరుకుంది. అనూహ్యంగా ఆమె సంపద 2022లో దారుణంగా పడిపోయి దాదాపు రూ. 8 వేల కోట్ల నష్టాన్ని నష్టాలను చవిచూసింది. అయినప్పటికీ మళ్లీ కంపెనీని లాభాల బాటపట్టించింది. ప్రస్తుతం నేహా కంపెనీ నికర విలువ ఏకంగా రూ. 75 వేల కోట్లు. అంతేగాదు మార్చి 2023లో నార్ఖేడ్ మోసాలను గుర్తించే సంస్థ ఓస్కిలార్ అనే కొత్త కంపెనీను కూడా స్థాపించింది. అంతేగాదు ఫోర్బ్స్ మ్యాగ్జైన్లో స్వీయ సంపన్న మహిళల జాబితాలో నేహా చోటు దక్కించుకోవడం విశేషం. (చదవండి: మహిళా ఎన్ఆర్ఐ ‘చెత్త’ బిజినెస్.. రూ.1000 కోట్లు టార్గెట్) -
ప్రంచంలోనే అత్యంత సంపన్న శునకం! ఆస్తుల జాబితా వింటే..
చాలామంది టైం బాగోకపోయినా, అనుకున్న పని జరగకపోయినా ఛీ.. కుక్క బతుకు అని అంటుంటారు. కానీ ఈ కుక్క గురించి విన్నాక మీ అభిప్రాయం మార్చుకుంటాంటారు. ఆ కుక్కలా లైఫ్ ఉంటే బాగుండును అనుకుంటారు. దాని ఆస్తుల వివరాలు, బ్యాంకు బాలెన్స్‌లు వింటే షాకవ్వుతారు. దానికున్న సెక్యూరిటీ, బతుకుతున్న రేంజ్ వింటే వామ్మో అంటారు. ఇప్పుడూ చెప్పబోయే ఈ కుక్క ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుక్కగా గుర్తింపు పొందింది. దీని పేరు గున్థర్ VI. ఇది జర్మన్ షెపర్డ్ కుక్క. ఇది సుమారు రూ. 500 కోట్ల విలువచేసే విలాసవంతమైన ఇంటిలో ఉంటుంది. అలాగే తిరిగేందుకు బీఎండబ్ల్యూ కార్లు, సరదాగా షికారు చేయడానికి ప్రైవేట్ షిప్ సౌకర్యం తదితరాలు ఉన్నాయి. దీనికి స్వంత ఫుట్‌బాల్ క్లబ్ ఉంది. ఆ కుక్క డబ్బును పర్యవేక్షించేది 66 ఏళ్ల ఇటాలియన్ వ్యవస్థాపకుడు మౌరిజియో మియాన్. కుక్కకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడం, దాని బాగోగోలు చూసుకోవడం అతని బాధ్యత. అయితే ఈ కుక్కకు అంత డబ్బు ఎలా వచ్చిందంటే..? అ కుక్క తాత గున్థర్ III నుంచి ఈ సంపదను వారసత్వంగా పొందాడు. జర్మన్ కౌంటెస్ కార్లోట్టా లీబెన్‌స్టెయిన్ అనే ధనికుడు ఈ గున్థర్ IIIని ప్రేమగా పెంచుకునేవాడు. అయితే ఆ ధనికుడు కొడుకు విషాదకరంగా ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో వారుసులెవరూ లేకుండా పోయారు. దీంతో లీబెన్‌స్టెయిన్ చనిపోయేంత వరకు ఆ కుక్కనే ప్రేమగా చూసుకునేవాడు. అతను వెళ్తూ వెళ్తూ..దాదాపు రూ. 600 కోట్ల ఆస్తిని ఆ కుక్క పేరు మీద రాసి వెళ్లిపోయాడు. అంతేగాదు ఆ డబ్బును, కుక్కను పర్యవేక్షించేలా ఇటాలియన్ ఫార్మటిస్ట్ మౌరిజియో మియాన్‌కి బాధ్యతలు కూడా అప్పగించాడు. అలా గుంథర్ ట్రస్ట్ ఏర్పడింది. నాడు ఆరు వందల కోట్లగా ఉన్న ఆస్తి కాస్త గున్థర్ VI టైంకి వచ్చేటప్పటికీ దాని విలువ ఏకంగా రూ. 3 వేల కోట్లకు చేరింది. యజమాని లిబెన్స్టెయిన్ వదలిపెట్టి వెళ్లిన సంపదతో విలాసవంతమైన ఇళ్లు, విల్లాలు, ఓ ప్రైవేట్ ఓడ కొనుగోలు మౌరిజియో మియాన్చేశాడు. అంతేగాదు ఈ కుక్క బిజినెస్ క్లాస్‌లోనే ప్రయాణిస్తుందట. అలాగే ఆ కుక్కుబాగోగులు చూసుకునేందుకు సిబ్బంది, బయటకు వెళ్లేటప్పుడూ చుట్టూ గట్టి సెక్యూరిటీ ఉండటం విశేషం. అంతేగాదు ఈ గున్థర్ VI తర్వాత ఈ ఆస్తి అంతా దాని పిల్లలకు వెళ్తుంది. ఇలా ఆ కోట్ల ఆస్తి అంతా ఈ గున్థర్ కుక్క వంశానికే చెందుతుందన్నమాట. ఈ గున్థర్ కుక్కలు గోల్డెన్ స్పూన్ బేబి మాదిరి కుక్కలన్నమాట. బిజినెస్ మ్యాగ్జైన్లో ఈ కుక్క గురించి పలు కథనాలు వచ్చాయి. అలాగే దీనిపై పలు డాక్యుమెంటరీలు కూడా రావడం విశేషం. (చదవండి: షాపు షట్టర్లో కోటు చిక్కుకోవడంతో పాపం ఆ మహిళ..!) -
రూ.5 వేల జీతానికి నానా అగచాట్లు.. ఇప్పుడు ఏకంగా...
సాధారణంగా ప్రైవేటు టీచర్లంటే చిన్నచూపు ఉంటుంది. తక్కువ జీతం ఉంటుందని, పెద్దగా సంపాదన ఉండదని భావిస్తారు. కానీ టీచింగ్‌తోనే ఎడ్టెక్ సంస్థలు పెట్టి రూ.కోట్లు సంపాదిస్తున్న వారూ ఉన్నారు. వారిలో దేశంలోనే రిచెస్ట్ టీచర్‌గా నిలిచిన ఓ వ్యక్తి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.. ప్రస్తుతం భారతదేశంలో అత్యంత సంపన్న ఉపాధ్యాయుడిగా నిలిచారు ఫిజిక్స్‌వాలా ( PhysicsWallah ) వ్యవస్థాపకుడు, సీఈవో అలఖ్ పాండే ( Alakh Pandey ). అయితే దేశంలో రిచెస్ట్ టీచర్ బైజూస్ రవీంద్రన్ అని చాలామంది వాదించవచ్చు. కానీ ఇప్పుడు ఆ టైటిల్ ఆయనది కాదు. ఫోర్బ్స్ ప్రకారం బైజూస్ పతనం తర్వాత, దాని నికర విలువ కూడా రూ. 830 కోట్లకు పడిపోయింది. అంటే రూ. 2000 కోట్ల కంటే ఎక్కువ నెట్‌వర్త్ ఉన్న అలఖ్ పాండేనే దేశంలోనే అత్యంత ధనిక ఉపాధ్యాయుడు. ప్రముఖ ఉపాధ్యాయుడు, ఎంటర్‌ప్రిన్యూర్‌గా పేరొందిన అలఖ్ పాండే సాధారణంగా లైమ్‌లైట్‌కు దూరంగా ఉంటారు. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖలో ఈ స్టార్టప్ నమోదై ఆయన వార్షిక వేతనం వెల్లడి కావడంతో వార్తల్లోకి వచ్చారు. భారతీయ టెక్, స్టార్టప్ సంస్థల సమాచారం అందించే ‘Inc42’ నివేదిక ప్రకారం.. అలఖ్ పాండే వేతనం 2022 ఆర్థిక సంవత్సరంలో రూ. 9.6 కోట్లు. దీంట్లో ఆయన రూ.5 కోట్లను తగ్గించుకున్నారు. అయినప్పటికీ 2023 ఆర్థిక సంవత్సరంలో అలఖ్ పాండే వేతనం రూ. 4.57 కోట్లు. ఇంత ఆదాయం ఉన్న అలఖ్ పాండే మొదటి సంపాదన ఎంతో తెలుసా.. కేవలం రూ.5 వేలు. అది కూడా చాలా మంది పిల్లలకు ట్యూషన్లు చెప్పడం ద్వారా వచ్చేది. యాక్టర్ కావాలనుకున్నాడు దేశంలో 101వ యునికార్న్ కంపెనీ ఫిజిక్స్‌వాలాను స్థాపించిన అలఖ్ పాండే ఒక టీచర్‌గానే చాలా మందికి తెలుసు. అయితే యాక్టర్ కావాలన్నది తన కల అని ఎంత మందికి తెలుసు? అలహాబాద్‌లో జన్మించిన అలఖ్ పాండే యాక్టర్ అవ్వాలనే కోరికతో నుక్కడ్ నాటకాల్లో పాల్గొనేవాడు. అయితే ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో 8వ తరగతి నుంచే ట్యూషన్లు చెప్పడం ప్రారంభించాడు. అలఖ్ పాండే, ఆయన సోదరి చదువుల కోసం వారి తల్లిదండ్రులు తమ ఇంటిని అమ్మేశారు. అలఖ్ పాండే చాలా చురుకైన విద్యార్థి. 10వ తరగతిలో 91 శాతం, 12వ తరగతిలో 93.5 శాతం మార్కులు వచ్చాయి. కోటి మందికిపైగా సబ్స్క్రైబర్లు ఐఐటీలో చేరాలనుకున్న అలఖ్ పాండే కాన్పూర్‌లోని హార్కోర్ట్ బట్లర్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నాడు. అయితే, కోర్సు మూడవ సంవత్సరం తర్వాత కాలేజీ మానేశాడు. 2017లో యూపీలో ఒక చిన్న గది నుంచి యూట్యూబ్ వీడియోలను రూపొందించడం ప్రారంభించాడు. కోవిడ్ మహమ్మారి సమయంలో అలాఖ్ పాండే వీడియోలు చాలా విజయవంతమయ్యాయి. ఎంతగా అంటే ఓ ఎడ్-టెక్ కంపెనీని ప్రారంభించేంతలా. ఇందులో ఇప్పుడు 500 మందికి పైగా టీచర్లు, 100 మంది టెక్నికల్ సిబ్బంది పనిచేస్తున్నారు. యూట్యూబ్‌లో ఫిజిక్స్‌వాలా చానల్‌కు కోటి మందికిపైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు.