Worlds Richest Dog Gunther: Selling Miami Mansion For Rs 238 Crore, Viral News In Telugu - Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుక్క.. వందల కోట్ల వారసత్వ ఆస్తి!

Published Sat, Nov 20 2021 9:14 AM | Last Updated on Sat, Nov 20 2021 10:05 AM

Worlds Richest Dog Gunther VI Is Selling Miami Mansion For Rs 238 Crore - Sakshi

World's Richest Dog: నిజానికి చాలామంది ఏంటీ ఈ జీవితం మరి విలువ లేకుండా పోయింది. మరీ కుక్క కన్న హీనంగా జీవిస్తున్నాం ఛీ అని అనుకుంటూ ఉంటాం. కానీ ఈ కుక్కని చూశాక అందరూ బతికితే ఈ కుక్కలా బతకాలి అని కచ్చితంగా అనుకుంటారు. ఏంటి ఇలా చెబుతున్నారు అని అనుకోకండి. ఇది నిజం యూఎస్‌లోని మియామిలో నివశిస్తున్న కుక్కను చూసి ఎవరైన ఇలానే అనుకుంటారు.

(చదవండి: ఆ మూడు వ్యవసాయ బిల్లులు రద్దవ్వడంతో నాకు చాలా సంతోషంగా అనిపించింది)

అసలు విషయంలోకెళ్లితే...యూఎస్‌లోని మియామిలో నివసిసున్న కుక్క ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుక్క. పైగా దీనికి వందల కోట్లు విలువ చేసే భారీ బంగ్లా కూడా ఉంది. అయితే ఈ కుక్క పేరు గుంథర్ VI.  ఈ కుక్క తాత గుంథర్ IV అనే మరో కుక్క నుంచి 500 మిలియన్ డాలర్ల(రూ.3715 కోట్లు) సంపద వారసత్వంగా లభించింది. గత కొన్ని దశాబ్దాలుగా ఈ కుక్కలకు ఆస్తులు లభిస్తున్నాయి. ఈ కుక్క వంశానికి చెందిన గుంథర్ III 1992లో మరణించింది. దీంతో దాని చివరి యజమాని జర్మన్ కౌంటెస్ కార్లొట్టా లైబెన్‌స్టెయిన్ నుంచి ఈ కుక్కకు 58 మిలియన్ డాలర్లు (సుమారు రూ.431 కోట్లు) విలువ చేసే ట్రస్ట్‌ వారసత్వంగా లభించింది.

అంతేకాదు రోజులు గడిచే కొద్ది ఆ ఆస్తుల విలువ పెరుగడం వల్ల గుంథర్ VI ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుక్కగా రికార్డులకెక్కింది. ఈ కుక్కల ఆఖరి యజమాని చనిపోయిన తర్వాత హ్యాండర్ల బృందం వీటి బాధ్యతలు చూసుకుంటున్నారు. అయితే ఈ గుంథర్‌ VI తాను నివశిస్తున్న టుస్కాన్‌ విల్లాను అమ్మకానికి పెట్టింది.  ఈ మేరకు ఈ భారీ సౌధాన్ని 2000 సంవత్సరంలో మడొన్నా నుంచి కొనుగోలు చేశారు. అయితే అప్పట్లో ఈ బంగ్లా విలువ రూ.7.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.53 కోట్లు). కానీ ఇప్పుడు దీన్ని రూ.238 కోట్లకు అమ్మకానికి పెట్టారు. అంతేకాదు ఈ భవనాన్ని 1928లో నిర్మించారు.

ఇందులో మొత్తం తొమ్మిది బెడ్‌రూమ్‌లు, ఎనిమిది బాత్‌రూమ్‌లు, ఔట్ డోర్ స్విమ్మింగ్ పూల్‌ ఉన్నాయి. పైగా ఈ ఇంటిని విక్రయించే బాధ్యతను ది అసోలిన్ టీమ్‌కు చెందిన ‘రూతీ అండ్ ఏతాన్ అస్సౌలిన్‌’ సంస్థ స్వీకరించింది. ఈ మేరకు ఆ సంస్థ నిర్వాహకురాలు రుతీ మాట్లాడతుతూ...అత్యంత ఖరీదైన ఈ భారీ సౌధానికి యజమాని కుక్క అని నేను ఆశ్చర్యపోయాను. అసలు నేను మొదట నమ్మలేకపోయాను. పైగా ఈ భవనానికి గొప్ప చరిత్ర ఉంది. అంతేకాదు గుంథర్ VIతో మేం సమావేశమైనప్పుడు ఆ కుక్క పరుగెత్తుకుంటూ వచ్చి నాకు ముద్దిచ్చింది. ఓహో ఇది మాతో తను ఒప్పందం చేసుకోవడం ఇష్టమే అన్నట్లుగా ఇలా ముద్దిచ్చినట్లుందని భావిస్తున‍్నా" అని అన్నారు.

(చదవండి:  ఆ హోటల్‌లో దెయ్యాలు..! ‘ఎలిజిబెత్‌’.. అంటూ మగ గొంతుతో పిలిచి..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement