స్టాక్ మార్కెట్ ఎప్పుడెలా ఉంటుందో ఊహించలేము. కొన్ని సార్లు భారీ లాభాలను తెచ్చిపెడితే, మరికొన్ని సార్లు చావుదెబ్బ కొడుతుంది. ఇదంతా సంపన్నులకు సర్వసాధారణమే.. అయినప్పటికీ తాజాగా అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ ఒక్కరోజులోనే (శుక్రవారం) 15.2 బిలియన్ డాలర్లు నష్టపోయారు.
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. అమెజాన్.కామ్ ఇంక్ షేర్లు భారీగా పతనమవ్వడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుమారు 500 మంది ధనవంతులు సంపద 134 బిలియన్ డాలర్లు తగ్గింది. ఇందులో గరిష్టంగా జెఫ్ బెజోస్ 15.2 బిలియన్ డాలర్లు నష్టపోగా.. ఈయన నికర విలువ 191.5 బిలియన్లకు పడిపోయింది.
నాస్‌డాక్ 100 ఇండెక్స్ 2.4 శాతం పడిపోవడంతో.. టెస్లా బాస్ మస్క్, ఒరాకిల్ కార్పొరేషన్ లారీ ఎల్లిసన్ ఇద్దరూ నష్టాలను చవి చూసారు. దీంతో వీరి సంపద 6.6 బిలియన్ డాలర్లు, 4.4 బిలియన్ డాలర్లు తగ్గింది. దీంతో దిగ్గజ పారిశ్రామిక వేత్తలు మాత్రమే కాకుండా.. చాలామంది పెట్టుబడిదారులు గందరగోళానికి గురయ్యారు.
వ్యక్తిగత సంపద పరంగా మస్క్ తర్వాత స్థానంలో నిలిచిన బెజోస్ ఏడాది పొడవునా అమెజాన్ షేర్లను స్థిరంగా విక్రయించారు. ఒక్క ఫిబ్రవరిలో తొమ్మిది ట్రేడింగ్ రోజులలో సుమారు 8.5 బిలియన్ల విలువైన స్టాక్‌ను విక్రయించారు. గత నెలలో ఒక రోజు అమెజాన్ షేర్లు రికార్డు స్థాయికి చేరాయి. దీంతో బెజోస్ 5 బిలియన్స్ విలువైన 25 మిలియన్ అదనపు షేర్లను విక్రయించే ప్రణాళికను వెల్లడించారు. కానీ ఇటీవల భారీగా నష్టపోయారు.
Comments
Please login to add a commentAdd a comment