stock
-
బిలీయనీర్లకు బ్యాడ్ ఫ్రైడే
స్టాక్ మార్కెట్ ఎప్పుడెలా ఉంటుందో ఊహించలేము. కొన్ని సార్లు భారీ లాభాలను తెచ్చిపెడితే, మరికొన్ని సార్లు చావుదెబ్బ కొడుతుంది. ఇదంతా సంపన్నులకు సర్వసాధారణమే.. అయినప్పటికీ తాజాగా అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ ఒక్కరోజులోనే (శుక్రవారం) 15.2 బిలియన్ డాలర్లు నష్టపోయారు.బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. అమెజాన్.కామ్ ఇంక్ షేర్లు భారీగా పతనమవ్వడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుమారు 500 మంది ధనవంతులు సంపద 134 బిలియన్ డాలర్లు తగ్గింది. ఇందులో గరిష్టంగా జెఫ్ బెజోస్ 15.2 బిలియన్ డాలర్లు నష్టపోగా.. ఈయన నికర విలువ 191.5 బిలియన్లకు పడిపోయింది.నాస్డాక్ 100 ఇండెక్స్ 2.4 శాతం పడిపోవడంతో.. టెస్లా బాస్ మస్క్, ఒరాకిల్ కార్పొరేషన్ లారీ ఎల్లిసన్ ఇద్దరూ నష్టాలను చవి చూసారు. దీంతో వీరి సంపద 6.6 బిలియన్ డాలర్లు, 4.4 బిలియన్ డాలర్లు తగ్గింది. దీంతో దిగ్గజ పారిశ్రామిక వేత్తలు మాత్రమే కాకుండా.. చాలామంది పెట్టుబడిదారులు గందరగోళానికి గురయ్యారు.వ్యక్తిగత సంపద పరంగా మస్క్ తర్వాత స్థానంలో నిలిచిన బెజోస్ ఏడాది పొడవునా అమెజాన్ షేర్లను స్థిరంగా విక్రయించారు. ఒక్క ఫిబ్రవరిలో తొమ్మిది ట్రేడింగ్ రోజులలో సుమారు 8.5 బిలియన్ల విలువైన స్టాక్‌ను విక్రయించారు. గత నెలలో ఒక రోజు అమెజాన్ షేర్లు రికార్డు స్థాయికి చేరాయి. దీంతో బెజోస్ 5 బిలియన్స్ విలువైన 25 మిలియన్ అదనపు షేర్లను విక్రయించే ప్రణాళికను వెల్లడించారు. కానీ ఇటీవల భారీగా నష్టపోయారు. -
ఆగని బుల్ పరుగు
ముంబై: ఆటో, ఎఫ్ఎంసీజీ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు మరో రికార్డు స్థాయిలకు చేరాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు సెంటిమెంట్ బలపరిచాయి. అధిక వెయిటేజీ మారుతీ సుజుకీ(7%), ఎంఅండ్ఎం(3%), ఐటీసీ(2%), ఐసీఐసీఐ బ్యాంక్(1%) రాణించి సూచీల రికార్డు ర్యాలీకి దన్నుగా నిలిచాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 391 పాయింట్లు పెరిగి 80,352 వద్ద ముగిసింది. నిఫ్టీ 113 పాయింట్ల లాభంతో 24,433 వద్ద స్థిరపడింది. ముగింపు స్థాయిలు ఇరు సూచీలకు సరికొత్త రికార్డు. ఉదయం లాభాలతో మొ దలైన స్టాక్ సూచీలు రోజంతా లాభాల్లో ట్రేడయ్యాయి.ఆటో, ఎఫ్ఎంసీజీతో పాటు కన్జూమర్ డ్యూరబుల్స్, రియలీ్ట, వినిమయ, ఫార్మా, యుటిలిటీ, కన్జూమర్ డిస్రే్కషనరీ షేర్లకూ కొనుగోళ్ల మద్దతు లభించింది. ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 437 పాయింట్లు బలపడి 80,397 వద్ద, నిఫ్టీ 123 పాయింట్లు ఎగసి 24,444 వద్ద జీవితకాల గరిష్టాలు నమోదు చేశాయి. రికార్డు ర్యాలీలోనూ టెలికం క్యాపిటల్ గూడ్స్, టెక్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అమెరికా చట్ట సభల్లో ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగానికి ముందు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.మారుతీ పరుగు⇒ పర్యావరణహిత వాహనాలను ప్రోత్సహించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హైబ్రిడ్ కార్ల రిజి్రస్టేషన్ పన్ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. యూపీ సర్కా రు నిర్ణయంలో దేశంలో ఈ తరహా కార్లను ఉత్పత్తి చేసే మారుతీ సుజుకీ కంపెనీ షేర్లకు భారీ కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈలో 6.60% పెరిగి రూ.12,820 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 8% దూసుకెళ్లి రూ.12,955 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లో అత్యధికంగా లాభపడిన షేరు ఇదే. ⇒ నైరుతి రుతుపవనాలు రాకతో దేశవ్యాప్తంగా ఖరీఫ్ సందడి మొదలైంది. దీ ంతో వినియోగ ఆధారిత రంగ ఎఫ్ఎంసీ జీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈః రూ. 451.27 లక్షల కోట్లు ⇒ స్టాక్ సూచీలు రికార్డు స్థాయికి చేరడంతో ఇన్వెస్టర్ల సంపద సైతం జీవితకాల గరిష్టానికి చేరుకుంది. మంగళవారం ఒక్క రోజే రూ.1.56 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ ఆల్‌టైం గరిష్టం రూ. 451.27 లక్షల కోట్లకు చేరింది. -
రికార్డుల ర్యాలీ
ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో పాటు బ్యాంకులు, ఐటీ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ మూడో రోజూ కొనసాగింది. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు రోజంతా పరిమిత శ్రేణిలో కదలాడి ఇంట్రాడే, ముగింపులో సరికొత్త రికార్డులు లిఖించాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి ఆర్థిక సంవత్సరం(2024–25) కోసం వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న సమగ్ర బడ్జెట్ వృద్ధికి ప్రాధాన్యతనిస్తూనే., ప్రజారంజకంగా ఉంటుందని మార్కెట్ వర్గాలు విశ్వసిస్తున్నాయి. సెన్సెక్స్ ఉదయం 242 పాయింట్ల లాభంతో 77,235 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌లో 374 పాయింట్లు పెరిగి 77,366 వద్ద జీవితకాల గరిష్టాన్ని తాకింది. చివరికి 308 పాయింట్ల లాభంతో 77,301 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో నిఫ్టీ 113 పాయింట్లు బలపడి 23,579 వద్ద రికార్డు గరిష్టాన్ని నమోదు చేసింది. ఆఖరికి 92 పాయింట్లు 23,558 వద్ద ముగిసింది. బ్యాంకులు, ఐటీతో పాటు రియలీ్ట, కన్జూమర్, యుటిలిటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు 1శాతం, అరశాతం చొప్పున రాణించాయి. ఆటో, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అమెరికా మార్కెట్లు జీవితకాల గరిష్టానికి చేరుకోవడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇన్వెస్టర్ల సంపద రయ్...సెన్సెక్స్ నాలుగోరోజూ రాణించడంతో బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మొత్తం విలువ జీవితకాల గరిష్టానికి చేరింది. మంగళవారం ఒక్కరోజే రూ.2.42 లక్షల కోట్లు పెరగడంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 437.24 లక్షల కోట్లకు చేరింది. ఈ మొత్తం 4 రోజుల్లో రూ.10.29 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది.⇒ అమెరికా ఫ్యాషన్ దుస్తుల సంస్థ హానెస్ బ్రాండ్స్‌తో వ్యాపార కాంట్రాక్టు కొనసాగింపుతో పాటు జీబీఎస్టీతో కొత్త వ్యాపార భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో విప్రో షేరు 3% పెరిగి రూ.492 వద్ద ముగిసింది. ⇒ రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి 156 తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ల కొనుగోళ్ల ఆర్డర్ దక్కించుకోవడంతో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) షేరు 6 శాతం పెరిగి రూ. 5,533 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 7% ఎగసి రూ. 5,565 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది. -
ఇక ‘నిఫ్టీ నెక్ట్స్ 50’ ఫ్యూచర్స్
ముంబై: నేషనల్ స్టాక్ ఎక్సేచంజీ నేటి(బుధవారం) నుంచి ‘నిఫ్టీ నెక్ట్స్ 50’ సూచీ డెరివేటివ్ కాంట్రాక్టులు ప్రవేశపెడుతోంది. మూడు నెలల ఫ్యూచర్స్, ఆప్షన్స్ కాంట్రాక్టులను ట్రేడింగ్‌కు అందుబాటులో ఉంచుతుంది. ప్రతినెలా చివరి శుక్రవారం ఈ కాంట్రాక్టుల గడువు ముగుస్తుంది. నిఫ్టీ 100లోని నిఫ్టీ 50 కంపెనీలు మినహా మిగితా కంపెనీలన్నీ ఈ సూచీలో ఉంటాయి. ఈ ఏడాది మార్చి 29 నాటికి ఈ సూచీలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.70 లక్షల కోట్లుగా ఉంది. ఎన్ఎస్ఈలోని నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువలో ఇది సుమారు 18%గా ఉంది. ఈ కాంట్రాక్టు్టలపై అక్టోబర్ 31 వరకు ఎలాంటి ట్రాన్సాక్షన్ చార్జీలు ఉండవని ఎన్ఎస్ఈ పేర్కొంది. మూడో రోజూ సూచీలు ముందుకే... స్టాక్ సూచీలు మంగళవారం స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. సెన్సెక్స్ 90 పాయింట్లు పెరిగి 73,738 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 32 పాయింట్లు బలపడి 22,368 వద్ద నిలిచింది. సూచీలకిది ఇది మూడో రోజూ లాభాల ముగింపు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 411 పాయింట్లు ఎగసి 74,060 వద్ద, నిఫ్టీ 111 పాయింట్లు దూసుకెళ్లి 22,448 వద్ద ఇంట్రాడే గరిష్టాలు నమోదు చేశాయి. అయితే అధిక వెయి టేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరులో లాభా ల స్వీకరణ, క్రూడాయిల్ ధరల రికవరీ, విదేశీ ఇన్వెస్టర్లు విక్రయాలతో సూచీల లాభాలు పరిమితమయ్యాయి. టెలికం, రియల్టీ, యుటిలిటీ, కన్జూమర్, కమోడిటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించాయి. మెటల్, ఇంధన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫాలోఆన్ఆఫర్(ఎఫ్‌పీఓ) ద్వారా రూ.18వేల కోట్లు సమీకరించడంతో వొడాఫోన్ ఐడియా షేరు 12% పెరిగి రూ.14.39 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 14% ఎగసి రూ.14.42 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. -
టాటాతో రిలయన్స్ డీల్! అంబానీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి?
భారతదేశంలో అత్యంత సంపన్నుడైన రిలయన్స్ అధినేత 'ముఖేష్ అంబానీ' సబ్స్క్రిప్షన్ బేస్డ్ శాటిలైట్ టీవీ అండ్ వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ అయిన టాటా ప్లేలో 29.8% వాటాను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే.. నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, అమెజాన్లు గట్టి పోటీ ఎదుర్కోవాల్సి వస్తుంది. భారతదేశ టెలివిజన్ పంపిణీ రంగంలో తన ఉనికిని బలోపేతం చేసుకోవడానికి ఓటీటీ ప్లాట్‌ఫామ్, జియోసినిమా పరిధిని విస్తరించడానికి ముఖేష్ అంబానీ ఈ వ్యహాత్మక చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. టాటా గ్రూప్‌కు చెందిన హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్‌కు టాటా ప్లేలో 50.2 శాతం వాటా ఉంది. దేశీయ దిగ్గజానికి మాత్రమే కాకుండా సింగపూర్ ఫండ్ టెమాసెక్‌కు టాటా ప్లేలో 20 శాతం వాటా ఉంది. ఇప్పటికే టాటా ప్లేలో తన వాటాను టాటా గ్రూప్‌కు విక్రయించడానికి టెమాసెక్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ చర్చల సారాంశం ఇంకా బయటపడలేదు. అయితే ఇప్పుడు రిలయన్స్, టాటాల మధ్య ఒప్పందం కుదిరితే.. టాటా గ్రూప్, రిలయన్స్ మధ్య కుదిరిన మొదటి ఒప్పందం ఇదే అవుతుంది. ఒప్పందం కుదిరితే.. రిలయన్స్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ జియోసినిమా పరిధిని టాటా ప్లే కస్టమర్లకు అందించనుంది. ఇదీ చదవండి: అన్నంత పని చేసిన టెక్ దిగ్గజం - దినదినగండంగా టెకీల పరిస్థితి! -
కుప్పకూలిన దిగ్గజ కంపెనీ స్టాక్..
-
ఆరంభ లాభాలు ఆవిరి
ముంబై: గరిష్ట స్థాయిల వద్ద ఆఖరి గంటలో లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో స్టాక్ సూచీలు మంగళవారం ఆరంభంలో ఆర్జించిన భారీ లాభాలను కోల్పోయి స్వల్పలాభాలతో గట్టెక్కాయి. ఇంట్రాడేలో 680 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ చివరికి 31 పాయింట్ల స్వల్ప లాభంతో 71,386 వద్ద నిలిచింది. నిఫ్టీ ట్రేడింగ్‌లో 211 పాయింట్లు ఆర్జించింది. ఆఖరికి 32 పాయింట్లు్ల పెరిగి 21,545 వద్ద నిలిచింది. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు మధ్యాహ్నం వరకు స్థిరమైన లాభాలతో ముందుకు కదిలాయి. అయితే ఆఖరి గంటన్నరలో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఇంట్రాడే గరిష్టం నుంచి దాదాపు ఒక శాతం దిగివచ్చాయి. బ్యాంకింగ్, మీడియా, ఎఫ్ఎంసీజీ, సర్విసెస్ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఆటో, మెటల్, ఐటీ, ఫార్మా, రియల్టీ, ఇంధన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. చిన్న తరహా షేర్లకు డిమాండ్ లభించడంతో బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ 0.37% లాభపడింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.991 కోట్ల షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.104 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియాలో జపాన్ (1%), సింగపూర్ (0.50%), చైనా (0.20%) మినహా మిగిలిన అన్ని దేశాల స్టాక్ సూచీలు అరశాతం మేర నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు అరశాతానికి పైగా పతనమయ్యాయి. అమెరికా మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అధిక వాల్యుయేషన్ ఆందోళనలు, ఆసియా మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు మన మార్కెట్లో లాభాల స్వీకరణకు పురిగొల్పాయని జియోజిత్ ఫైనాన్సియల్ సర్విసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ► సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియాతో 10 బిలియన్ డాలర్ల విలీనంపై సందిగ్ధత నెలకొనడంతో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ షేరు 8% పతనమైన రూ.256 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 13% క్షీణించి రూ.242 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. షేరు భారీ పతనంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.2,036 కోట్లు నష్టపోయి రూ.24,613 కోట్లకు దిగివచ్చింది. ► బజాజ్ ఆటో రూ.4,000 కోట్ల బైబ్యాక్ ప్రకటించడంతో కంపెనీ షేరు 2% పెరిగి రూ.7,094 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 6% ఎగసి రూ.7,420 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. ఈ క్రమంలో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించింది. ► జ్యోతి సీఎన్సీ ఆటోమేషన్ ఐపీఓకు తొలి రోజు విశేష స్పందన లభించింది. ఇష్యూ ప్రారంభమైన తొలి కొన్ని గంటల్లోనే షేర్లు పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయ్యాయి. పబ్లిక్ ఇష్యూలో భాగంగా కంపెనీ మొత్తం 1.75 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా 4.40 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. మొత్తంగా మొదటి రోజే 2.51 రెట్ల ఓవర్ సబ్‌స్రై్కబ్ అయ్యింది. ఇందులో రిటైల్ విభాగం 8.25 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల విభాగం 3.63 రెట్లు, క్యూఐబీ కోటా 2 రెట్లు సబ్‌స్రై్కబ్ అయ్యాయి. -
15 గంటలుగా మండుతూనే...
ఒంగోలు సబర్బన్: ప్రకాశం జిల్లా ఒంగోలులోని గాంధీ రోడ్డు సమీపంలోని పప్పు బజార్లో ఉన్న కాయర్ రోప్ మర్చంట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున సునీల్ కాయర్ రోప్ మర్చంట్స్ గోడౌన్లో మంటలు వ్యాపించాయి. ఒంగోలు ఫైర్ ఇంజన్లతో పాటు టంగుటూరు, కొండపి, బాపట్ల జిల్లా అద్దంకి నుంచి 8 ఫైర్ ఇంజన్లు తీసుకువచ్చి మంటలను అదుపు చేస్తున్నారు. 15 గంటలకు పైగా మంటలు దట్టంగా వ్యాపిస్తూనే ఉన్నాయి. భారీగా స్టాక్ ఉండటంతో మంటలు అదుపులోకి రావడం లేదు. ఈ ప్రమాదంలో రూ.2 కోట్లకు పైగా నష్టం వాటిలినట్లు సమాచారం. -
సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో ప్రారంభమై అదేచోట ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గడిచిన మూడు రోజులుగా నష్టాల్లో పయనిస్తున్నాయి. శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు సాయంత్రం దాదాపుగా ప్రారంభ స్థాయిల వద్దే ముగిశాయి. ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో పకడ్బందీ ఆర్థిక వ్యవస్థ ఏర్పాటుకు వడ్డీరేట్లు పెంచాల్సిందేనని యూఎస్ ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ అన్నారు. ఇందుకు రానున్న రోజుల్లో వడ్డీరేట్లు పెంచక తప్పదని ప్రకటించారు. పావెల్ ప్రకటనతోపాటు వారంతంలో అమ్మకాలు వెల్లువెత్తడంతో గ్లోబల్ ఇండియన్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 231.36 పాయింట్లు నష్టపోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 82.05 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 32 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 454 పాయింట్లు పతనమయ్యాయి. స్మాల్ క్యాప్ సూచీ 0.7 శాతం మేర నష్టపోయింది. ఎన్ఎస్ఈలో కోటక్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, టీసీఎస్, ఎన్టీపీసీ, నెస్లే, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా కన్జూమర్, ఎయిర్ టెల్, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్ సర్వ్, సన్ ఫార్మా కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి. ఐటీసీ, టాటా స్టీల్, బీపీసీఎల్, దివీ ల్యాబ్స్, సిప్లా, హిందుస్థాన్ యూనీలివర్, హీరో మోటార్స్, యూపీఎల్, హిందాల్కొ, ఎస్బీఐ, గ్రాసిమ్, పవర్ గ్రిడ్, ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, డాక్టర్ రెడ్డీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, కోల్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు నష్టాలతో ముగిశాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
ప్రముఖ సంస్థపై కేసులు.. ఉత్పత్తులపై క్యాన్సర్ ఆరోపణలు!
డాబర్ కంపెనీకి సంబంధించిన మూడు అనుబంధ సంస్థలపై యూకే, కెనడాలో వేల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. సంస్థ తయారుచేస్తున్న హెయిర్ రిలాక్సర్ ఉత్పత్తులు అండాశయ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్‌కు కారణమవుతున్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. డాబర్ కంపెనీ ఆయా దేశాల్లో ఈ ఉత్పత్తులను వివిధ బ్రాండ్ పేర్లతో విక్రయిస్తోంది. ఎఫ్ఎంసీజీ కంపెనీలపై ఇప్పటికే 5,400 కేసులు నమోదయ్యాయి. డాబర్ అనుబంధ సంస్థలైన నమస్తే లేబొరేటరీస్, డెర్మోవివా స్కిన్ ఎసెన్షియల్స్, డాబర్ ఇంటర్నేషనల్ సంస్థలపై వివిధ కోర్టుల్లో కేసులు దాఖలయ్యాయి. దీనికి తోడు ఇటీవల డాబర్ ఇండియా రూ.320.6 కోట్లకు జీఎస్టీ డిమాండ్ వడ్డీ, జరిమానా నోటీసును అందుకుంది. క్యాన్సర్ ఆరోపణలపై కంపెనీ స్పందిస్తూ.. ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, సరైన పరిశోధన చేయకుండానే అనుబంధ సంస్థలపై కేసులు పెట్టారని పేర్కొంది. కేసుల పరిష్కారానికి కంపెనీ లీగల్ వాభాగాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఈ వార్తల నేపథ్యంలో డాబర్ స్టాక్స్ మార్కెట్లో నష్టపోయాయి. అయితే ఈ అంశం వల్ల ఆర్థిక కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం ఉండదని కంపెనీ పేర్కొంది. డాబర్..చ్యవన్‌ప్రాష్, హోనిటస్ దగ్గు సిరప్, లాల్ దంత్ మంజన్ టూత్‌పేస్ట్, అశోకరిష్ట టానిక్, రియల్ జ్యూస్‌లు, ఓడోమాస్, వాటికా హెయిర్ ప్రొడక్ట్స్, పుదిన్ హర, హజ్మోలా వంటి ఉత్పత్తులను తయారు చేస్తుంది. -
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం..లాభాల్లో డిఫెన్స్ స్టాక్స్
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపధ్యంలో డిఫెన్స్ రంగ స్టాక్‌లు కొంత లాభాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికాకు చెందిన వాటితోపాటు ఇండియన్ మార్కెట్లో లిస్ట్ అయిన డిఫెన్స్స్టాక్లో ర్యాలీ కనబడుతుంది. యుద్ధంలో వాడే వార్హెడ్ల్లో ఉపయోగించే టెక్నాలజీ సంబంధించిన కంపెనీలు సహా ఆయుధాలు తయారు చేసే కంపెనీల షేర్ల లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇండియన్ మార్కెట్లో లిస్టయిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, మజగావ్‌డాక్ షిప్‌బిల్డర్స్, భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్, సోలార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, పారస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్, భారత్ ఫోర్జ్ లిమిటెడ్ వంటి రక్షణరంగ స్టాక్‌లు లాభాల్లో కొనసాగుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సమయంలోనూ డెఫెన్స్ స్టాక్స్‌లో మంచి ర్యాలీ కనిపించింది. అయితే కొన్ని విమానయాన కంపెనీలు ఇజ్రాయెల్‌కు రాకపోకలను నిలిపివేయడంతో ఎయిర్‌లైన్ స్టాక్స్ పడిపోయాయి. బ్లూమ్‌బెర్గ్ వరల్డ్ ఎయిర్‌లైన్స్ ఇండెక్స్ మార్చి తర్వాత 2.6శాతం మేర క్షీణించింది. డెల్టా ఎయిర్ లైన్స్ ఇంక్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్ హోల్డింగ్స్ ఇంక్, అమెరికన్ ఎయిర్‌లైన్స్ గ్రూప్ ఇంక్ కంపెనీలు ఇజ్రాయిల్‌కు తమ సేవలను రద్దు చేసుకున్నాయి. -
నష్టాల్లోంచి లాభాల్లోకి...
ముంబై: ఆఖరి గంటలో అధిక వెయిటేజీ రిలయన్స్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు సోమవారం ఇంట్రాడే నష్టాలను భర్తీ చేసుకొని స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభం నుంచీ సానుకూల సంకేతాలు అందిపుచ్చుకున్నాయి. ట్రే డింగ్‌లో 501 పాయింట్లను కోల్పోయిన సెన్సెక్స్ చివరికి 79 పాయింట్ల లాభంతో 65,402 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 170 పాయింట్ల పతనం నుంచి తేరుకొని ఆరు పాయింట్ల స్వల్ప లాభంతో 19,435 వద్ద ముగిసింది. మెటల్, బ్యాంక్స్, ఫైనాన్స్, ఇంధన, ఫార్మా, కన్జూమర్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం ఎక్సే్చంజీలకు సెలవు ప్రకటించారు. ► అదానీ పోర్ట్స్ ఆడిటర్ బాధ్యతల నుంచి డెలాయిట్ ని్రష్కమణతో అదానీ గ్రూప్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అత్యధికంగా అంబుజా సిమెంట్స్ షేరు 3.50% పతనమైంది. ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్ ప్రైజెస్ షేరు 3.26% నష్టపోయింది. అదానీ ట్రాన్స్మిషన్స్ 2.50%, ఏసీసీ, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ విల్మార్, అదానీ టోటల్ గ్యాస్ షేర్లు 2% వరకు నష్టపోయాయి. అదానీ పోర్ట్స్ 1.50%, ఎన్డీటీ 1.30%, అదానీ పవర్ ఒక శాతం పతనయ్యాయి. ► రూ.880 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో గతవారం ఐపీఓకు వచి్చన టీవీఎస్ సప్లై చివరి రోజు నాటికి 2.78 రెట్ల సబ్‌్రస్కిప్షన్ సాధించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 2.51 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయగా మొత్తం 6.98 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. -
ఆ ఒక్క మాటతో.. ఎలాన్ మస్క్‌కు రూ.1.64 లక్షల కోట్లు నష్టం!
టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు భారీ షాక్ తగిలింది. టెస్లా కార్ల ధరల్ని తగ్గిస్తామంటూ మస్క్ చేశారు. అంతే ఆ నిర్ణయంతో టెస్లా షేర్ వ్యాల్యూ భారీగా క్షీణించింది. మస్క్ సంపదలో 20.3 బిలియన్ డాలర్లు (రూ.1.64లక్షల కోట్లు) కోల్పోయారు. బ్లూంబెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం..ఎలాన్ మస్క్ మొత్తం సంపద 234.4 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే ఈ ఏడాది ప్రారంభం నుంచి మస్క్ ప్రతీరోజు 530 మిలియన్ డాలర్లు సంపాదించినట్లు నివేదిక పేర్కొంది. ప్రస్తుతం, మస్క్ నెట్ వర్త్‌ను మొత్తంలో ఏడు సార్లు కోల్పోయారు. అయినప్పటికీ, ప్రపంచ ధనవంతుల జాబితాలో ప్రథమ స్థానంలో కొనసాగుతున్నారు. ప్రముఖ లగర్జీ గృహోపకరణాల సంస్థ ఎల్వీఎంహెచ్ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్ 201 బిలియన్ డాలర్లతో రెండవ స్థానంలో కొనసాగుతున్నారు. మస్క్‌కు ఆర్నాల్ట్‌ల మధ్య వ్యత్యాసం కేవలం 33 బిలియన్ డాలర్లు మాత్రమే. మస్క్‌తో పాటు ఒక్కరోజులోనే భారీ మొత్తంలో సంపద కోల్పోయిన జాబితాలో టెస్లా సీఈవోతో పాటు ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీల అధినేతలు సైతం ఉన్నారు. వారిలో అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్, ఒరాకిల్ కార్పొరేషన్ లారీ ఎల్లిసన్, మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో స్టీవ్ బల్మెర్, మెటా బాస్ మార్క్ జుకర్ బర్గ్, ఆల్ఫాబెట్ కోఫౌండర్ లారీ పేజ్,సెర్గీ బ్రిన్ ఇలా టెక్ కంపెనీల సంపద 2.3శాతంతో 20.3 బిలియన్ డాలర్ల సంపద నష్టపోయినట్లు అమెరికన్ స్టాక్ మార్కెట్ నాస్డాక్ 100 ఇండెక్స్ తెలిపింది. ఒక్కరోజే 9.7 శాతం న్యూయార్క్ కేంద్రంగా ఎలక్ట్రిక్ కార్ల తయారీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న టెస్లా షేర్ల విలువ ఏప్రిల్ 20 నుంచి తగ్గుతూ వస్తున్నాయి. జులై 20న 9.7 శాతంతో టెస్లా షేర్ ధర 262.90 డాలర్ల వద్ద కొనసాగుతూ వస్తుంది. ఇక, ఏప్రిల్ 20 నుండి టెస్లా భారీ నష్టాల్ని చవిచూస్తున్నట్లు మస్క్ ఓ సందర్భంలో తెలిపారు. టెస్లా మదుపర్లలో అలజడి అంతేకాదు ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో నాలుగు సంవత్సరాల కనిష్టానికి పడిపోయి గ్రాస్ మార్జిన్‌పై ప్రతికూల ప్రభావం చూపించాయి. తాజాగా, అమెరికా ప్రభుత్వం ఆర్ధిక మాంద్యాన్ని అదుపు చేసేందుకు వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోతే టెస్లా ధరలను తగ్గించాల్సి ఉంటుందని కంపెనీ మస్క్ హెచ్చరించారు. మస్క్ చేసిన ఈ ప్రకటనతో టెస్లా షేర్ హోల్డర్లలో తీవ్ర అలజడిని రేపింది. షేర్లను అమ్ముకోవడంతో ఎలాన్ మస్క్ సంపద భారీ క్షిణీంచింది. చదవండి👉 భారత్‌లో టెస్లా కార్ల తయారీ.. ధరెంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు -
టెలికాంకు మంచి భవిష్యత్?
-
వామ్మో రూ.4 కోట్లు! ప్రపంచంలో అత్యంత ఖరీదైన స్టాక్ ఇదే..
దేశీయ టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్ షేర్ విలువ రూ.లక్ష వద్ద ట్రేడ్ అయిందని తెలిసి ముక్కున వేలేసుకున్నాం. ఇదే భారత్‌లో ఖరీదైన షేర్ అని భావిస్తుండగా ప్రపంచంలో అత్యంత ఖరీదైన షేర్ గురించి తెలిసింది. వారెన్ బఫ్ఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హతావే క్లాస్ A షేర్లు దాదాపు ఒక సంవత్సరం పాటు ఒక్కొక్కటి 5,00,000 డాలర్ల కంటే ఎక్కువగా ట్రేడ్ అయ్యాయి. అంటే భారతీయ కరెన్సీలో రూ.4 కోట్లకుపైనే. జూన్ 13న న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో ఈ షేరు 513,655.58 డాలర్ల వద్ద ముగిసింది. ఐదేళ్లుగా షేరును కలిగి ఉన్న ఇన్వెస్టర్లు దాని విలువలో 80 శాతం మేర పెరుగుదలను చూశారు. అధిక ధర కారణంగా కొంత మంది ఇన్వెస్టర్లు స్టాక్ కొనుగోలు చేసేందుకు ముందుకురానప్పటికీ కేవలం త్వరగా లాభాలు ఆర్జించడం కంటే ఓపికగా, దీర్ఘకాలిక వృద్ధిపై దృష్టి పెట్టే ఇన్వెస్టర్లు ముందుకు వస్తారని బెర్క్‌షైర్ హతావే సీఈవో వారెన్ బఫ్ఫెట్ చెబుతున్నారు. అలాంటివారే తనకు కావాల్సిందని ఆయన పేర్కొన్నారు. అస్థిరత ఎక్కువగా ఉండే తక్కువ ధరల స్టాక్‌లలో ప్రోత్సాహకం ఉండదని బఫెట్ తెలిపారు. ఇన్వెస్టర్లకు మరింత అంతర్గత విలువను సృష్టించే స్టాక్‌కు ఆయన ప్రాధాన్యతనిస్తారు. బఫెట్ 1996లో 517,500 క్లాస్ B షేర్లను పరిచయం చేశారు. ఆ స్టాక్ ధర సుమారు 30,000 డాలర్లు. క్లాస్ A బెర్క్‌షైర్ షేర్ల మాదిరిగా కాకుండా క్లాస్ B షేర్ల విషయంలో స్టాక్ స్ప్లిట్ జరగవచ్చు. 2010 జనవరి 21న ఒక స్టాక్ స్ప్లిట్ 50:1 నిష్పత్తిలో జరిగింది. బెర్క్‌షైర్ హతావే మార్కెట్ క్యాపిటలైజేషన్ 737.34 బిలియన్ డాలర్లు. క్లాస్ A షేర్ల ద్వారా 15 శాతం, క్లాస్ B షేర్ల ద్వారా 0.01 శాతం కంపెనీని బఫెట్ కలిగి ఉన్నారు. MRF stock today hit the ₹1,00,000 mark. It became the 1st stock in the Indian Market to ever touch the 6 figure mark. The most expensive stock in the world is Berkshire Hathaway at 400,000$ (around 3.2Crore per stock). Long way to go, but hope MRF crosses that mark one day. — Akshat Shrivastava (@Akshat_World) June 13, 2023 -
వ్యాల్యూ స్టాక్ గుర్తించడం ఎలా?
అంతర్గతంగా ఎంతో విలువ దాగి ఉన్న స్టాక్స్‌ను గుర్తించడం ఎలా? – కపిల్ వాస్తవ విలువ కంటే తక్కువలో ట్రేడ్ అవుతున్న (అండర్ వ్యాల్యూడ్) స్టాక్‌ను గుర్తించం కూడా ఒక కళేనని చెప్పుకోవచ్చు. డిస్కౌంటింగ్ సూత్రాన్ని ఇక్కడ అమలు చేసి చూడాల్సి ఉంటుంది. అంటే వచ్చే ఐదు, పదేళ్ల కాలంలో కంపెనీ ఆదాయాలు ఏ మేరకు వృద్ధి చెందుతాయో చూడాలి. అలాగే, యాజమాన్యం ఎంత ఉత్తమమైనది? అన్నది కూడా చూడాలి. కంపెనీ నిధులను నిజాయితీగా నిర్వహిస్తారా? విశ్వసనీయత కలిగిన వారేనా? అలాగే, ఆ కంపెనీ పనిచేస్తున్న రంగంలో మంచి వృద్ధికి అవకాశం ఉందా? భవిష్యత్తు ఉన్నదేనా? అవకాశాలను అనుకూలంగా మార్చుకోగలదా? వీటిని విశ్లేషించుకోవాలి. అలాగే, మీకు మంచిగా కనిపించిన కంపెనీల గురించి ఎన్నో ప్రతికూల వ్యాఖ్యానాలు వినిపిస్తుంటాయి. వాటన్నింటినీ తట్టుకుని పెట్టుబడులను కొనసాగించే బలం కూడా కావాలి. నేను మూడు, నాలుగేళ్ల కోసం ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో ఉన్నందున, ఇక్కడి నుంచి వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు ఉన్నందున లాంగ్‌టర్మ్ బాండ్లలో ఇన్వెస్ట్ చేయడం మంచిదేనా? దీనికంటే మరేదైనా మెరుగైన ఆప్షన్ ఉందా? – అంకిత్ ముద్రా వడ్డీ రేట్లు, వీటికి సంబంధించిన సైకిల్ (కాల వ్యవధి) అనేవి ఊహించనివి. పరిస్థితులు, సూక్ష్మ ఆర్థిక అంశాల ఆధారంగా ఇవి మార్పులకు లోనవుతుంటాయి. కరోనా మహమ్మారి రాకతో ఫైనాన్షియల్ మార్కెట్లలో పరిస్థితులను చక్కదిద్దేందుకు 2020 మార్చి–మేలో వడ్డీ రేట్ల కోతను గుర్తుకు తెచ్చుకోండి. ద్రవ్యోల్బణం నియంత్రణకు ఇటీవల వరుసగా చేపట్టిన రేట్ల పెంపులు కూడా ఒక నిదర్శనమే. కచ్చితంగా వడ్డీ రేట్ల సైకిల్‌ను అంచనా వేయడం ఎవరి వల్లా కాదు. ఆ విధమైన అంచనాలతో పోర్ట్‌ఫోలియో ఏర్పాటు చేసుకోవడం రిస్క్ తీసుకోవడమే అవుతుంది. కనుక స్థూల ఆర్థిక అంశాల కంటే మీ పెట్టుబడుల కాలవ్యవధికి అనుగుణమైన సాధనాలపై దృష్టి సారించడమే మంచిది. మూడు నాలుగేళ్ల కోసం ఇన్వెస్ట్ చేసుకునేట్టు అయితే అప్పుడు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే మెరుగైన సాధనానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అదే సమయంలో పెట్టుబడికి రక్షణ ఉండాలి. అటువంటప్పుడు షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ అనుకూలం. ఈ పథకం కాల వ్యవధి, మీ పెట్టుబడుల కాల వ్యవధికి ఒకే రకంగా ఉంటుంది. ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీల్లో (డెట్ సాధనాలు) పెట్టుబడులు పెట్టడం వెనుక ఉద్దేశ్యం స్థిరమైన రాబడులు ఆశించడమే. ఈక్విటీల్లో మాదిరి అస్థిరతలు లేకుండా, పెట్టుబడికి రక్షణ కల్పించుకోవడం. లాంగ్ టర్మ్ బాండ్ ఫండ్స్ చూడ్డానికి ఆకర్షణీయంగా అనిపించొచ్చు. కానీ అవి ఎంతో అస్థిరతలతో ఉంటాయి. దీర్ఘకాలంలో షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌లో మాదిరే రాబడులను ఇస్తాయి. డెట్ ఫండ్స్ ఎంపిక చేసుకునేప్పుడు అనుసరించాల్సిన సూత్రం మీ పెట్టుబడుల కాల వ్యవధి, ఎంపిక చేసుకునే సాధనం పెట్టుబడుల కాలవ్యవధి ఒకే విధంగా ఉండాలి. ఇక మీ పెట్టుబడుల కాలవ్యవధి మూడు నాలుగేళ్లు కనుక ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్‌ను కూడా చూడొచ్చు. ఈక్విటీలతో వచ్చే రిస్క్ కొంత ఇందులో ఉంటుంది. ఇవి ఈక్విటీలు, డెట్, ఆర్బిట్రేజ్ సాధనాల్లో ఇన్వెస్ట్ చే స్తాయి. లాంగ్ డ్యురేషన్ ఫండ్స్ కంటే ఎక్కువ రాబడులు ఇస్తాయి. అచ్చమైన ఈక్విటీలతో పోలిస్తే తక్కువ అస్థిరతలతో మెరుగైన రాబడులు ఇస్తాయి. ధీరేంద్ర కుమార్ - సీఈఓ, వ్యాల్యూ రీసెర్చ్ -
యూట్యూబర్లూ బీ కేర్‌పుల్: నటుడికి, ఆయన భార్యకు సెబీ షాక్
సాక్షి, ముంబై: షేర్ మార్కెట్ , స్టాక్ సంబంధిత అంశాలపై తప్పుడు సమాచారంతో మోసం చేస్తున్న యూ ట్యూబర్లకు మార్కెట్ రెగ్యులేటరీ సెబీ భారీ షాకిచ్చింది. సోషల్ మీడియా ద్వారా మార్కెట్ మానిప్యులేషన్‌కు పా ల్పడుతున్న సాధన బ్రాడ్కాస్ట్ ప్రమోటర్లతో సహా, 31 యూట్యూబర్లను గురువారం బ్యాన్ చేసింది. అనేక ఫిర్యాదుల నేపథ్యంలో సెబీ ఈ చర్య తీసుకుంది. అమాయక పెట్టుబడిదారులను మోసంచేస్తూ యూట్యూబర్లు కుమ్మక్కయ్యారని మండిపడింది. ముఖ్యంగా యూట్యూబ్‌లో తప్పుదోవ పట్టించే వీడియోలను అప్లోడ్ చేయడం ద్వారా సాధనా బ్రాడ్కాస్ట్ షేర్లను మానిప్యులేట్ చేశారంటూ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీపై సెబీ కఠిన చర్యలు తీసుకుంది. అర్షద్ వార్సీ, అతని భార్య మరియా గోరెట్టిని కూడా మార్కెట్లో ట్రేడింగ్ చేయకుండా సెబీ నిషేధించింది. అర్షద్ వార్సీ రూ.29.43 లక్షలు, ఆయన భార్య రూ.37.56 లక్షల లాభం ఆర్జించారని సెబీ పేర్కొంది. అంతేకాదు ఆయా సంస్థలనుంచి రూ. 41.85 కోట్ల అక్రమ లాభాలను రెగ్యులేటర్ స్వాధీనం చేసుకుంది. షేర్ పంప్ అండ్ డంప్ స్కీమ్‌లో అర్షద్‌తో సహా 45 మంది యూట్యూబర్లను సెబీ దోషులుగా గుర్తించింది. నిందితుడు అర్షద్ వార్సీతో సహా చాలా మంది యూట్యూబర్లు పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించడం ద్వారా వారి వాల్యూమ్‌ను పెంచుతున్నారని తద్వారా ప్రతి నెలా రూ.75 లక్షల వరకు సంపాదిస్తున్నారని సెబీ తెలిపింది. యూట్యూబ్ క్రియేటర్లతో కలిసి స్టాక్లను షార్ప్‌లైన్ బ్రాడ్కాస్ట్ షేర్ల మానిప్యులేషన్స్‌కు పాల్పడుతున్నారంటూ 24 ఎంటిటీలను కూడా స్టాక్ మార్కెట్ నుండి సెబీ నిషేధించింది. షార్ప్‌లైన్ బ్రాడ్కాస్ట్ లిమిటెడ్ స్క్రిప్‌లో ఏప్రిల్ నుండి ఆగస్టు 2022 వరకు తప్పుడు వాల్యూమ్లకు దారితీసిందనీ, దీంతో కొంతమంది వాటాదారులు భారీ లాభాలను బుక్ చేసుకున్నారని , ఇది ట్రేడ్ ప్రాక్టీస్ నిబంధనల ఉల్లంఘన అని పేర్కొంది. సాధనా బ్రాడ్‌కాస్ట్‌కి సంబంధించి ఏప్రిల్ 27, 2022 నుండి సెప్టెంబర్ 30, 2022, షార్ప్‌లైన్ బ్రాడ్కాస్ట్ ఏప్రిల్ 12, 2022 నుండి ఆగస్టు 19, 2022 మధ్య లావాదేవీలను సెబీ విచారించింది. సెబీ తన రెండు మధ్యంతర ఉత్తర్వుల్లో, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నేరస్తులందరినీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏ విధంగానైనా సెక్యూరిటీలను కొనుగోలు చేయడం, విక్రయించడం లేదా డీల్ చేయకుండా నిరోధించింది. అలాగే ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ డెరివేటివ్ కాంట్రాక్ట్‌లలో వారు ఏదైనా ఓపెన్ పొజిషన్లు ఉంటే ఈ ఆర్డర్ తేదీ నుండి లేదా అటువంటి కాంట్రాక్టుల గడువు ముగిసే మూడు నెలలలోపు, ఏది ముందుగా అయితే, అటువంటి పొజిషన్లను మూసివేయవచ్చు/స్క్వేర్ ఆఫ్ చేయాలని కూడా ఆదేశించింది. కాగా సెబీ చాలా కాలంగా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లను నియంత్రించేందుకు సిద్దమవుతోంది. రెండేళ్ల క్రితమే ఈ విషయంలో నిబంధనల రూపకల్పన కసరత్తు మొదలైంది. -
రూ.2,500 కోట్ల షేర్లను బైబ్యాక్ చేశాం, బజాజ్ ఆటో ప్రకటన
న్యూఢిల్లీ: బజాజ్ ఆటో తన వాటాదారుల నుంచి 64,09,62 షేర్లను బైబ్యాక్ చేసింది. ఇందుకు రూ.2,500 కోట్లు వెచ్చించినట్టు ప్రకటించింది. జూలై 4న బజాజ్ ఆటో షేర్ల బైబ్యాక్‌ను ప్రారంభించింది. సోమవారం సమావేశమైన బైబ్యాక్ కమిటీ, అక్టోబర్ 10తో బైబ్యాక్ ముగించేందుకు ఆమోదం తెలిపినట్టు పేర్కొంది. బహిరంగ మార్కెట్లో ఒక్కో షేరును రూ.4,600కు మించకుండా కొనుగోలు చేయా లని ఈ ఏడాది జూన్ 27న బజాజ్ ఆటో నిర్ణయించడం గమనార్హం. బైబ్యాక్ తర్వాత ప్రమోటర్లు, ప్రమోటర్ల గ్రూపు మొత్తం వాటా 53.77 శాతం నుంచి 54.98 శాతానికి పెరిగింది. -
యాంఫీ చైర్మన్‌గా బాలసుబ్రమణియన్ పునర్నియామకం
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ సంస్థల సమాఖ్య యాంఫీ చైర్మన్‌గా ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ ఎండీ ఎ. బాలసుబ్రమణియన్ మరోసారి ఎన్నికయ్యారు. ఎడెల్వీస్ ఏఎంసీ ఎండీ, సీఈవో రాధిక గుప్తా వైస్ చైర్‌పర్సన్‌గా కొనసాగనున్నారు. సెప్టెంబర్‌లో జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు యాంఫీ వెల్లడించింది. తదుపరి వార్షిక సమావేశం వరకూ ఇద్దరూ తమ తమ పదవుల్లో కొనసాగుతారు. బాలసుబ్రమణియన్ యాంఫీ ఫైనాన్షియల్ లిటరసీ కమిటీకి ఎక్స్–అఫీషియో చైర్మన్‌గా కూడా ఉంటారు. అటు ఆపరేషన్స్, రిస్క్‌ల కమిటీకి గుప్తా చీఫ్‌గా వ్యవహరిస్తారు. ఇక ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్) కమిటీ చైర్మన్‌గా నిప్పన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్ చీఫ్ సందీప్ సిక్కా ఎన్నికయ్యారు. యాంఫీలో 43 ఏఎంసీలకు సభ్యత్వం ఉంది. -
తెలివంటే ఇదే మరి..రూ.2150కి అమ్మి రూ.640కి షేర్లు కొన్న పేటీఎం సీఈవో!
ప్రముఖ ఫిన్ టెక్ దిగ్గజం పేటీఎం డైరెక్టర్ విజయ్ శేఖర్ శర్మ రూ.11 కోట్లకు 1.7 లక్షల షేర్లను కొనుగోలు చేశారు. ఇదే విషయాన్ని సంస్థ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. పేటీఎం సంస్థ గతేడాది నవంబర్‌లో ఐపీవోకి వెళ్లింది. ఐపీవోలో ఒక్కో షేరు రూ.2150 వద్ద పలికింది.ఆ సమయంలో విజయ్ శేఖర్ శర్మ పేటీఎం షేర్లను కొనుగోలు చేసే అధికారం లేదు. ఒకవేళ కొనుగోలు చేయాలని పేటీఎం ఐపీవో వచ్చిన ఆరునెలల ఎదురు చూడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మే 30న విజయ్ శేఖర్ శర్మ 1,00,552 షేర్లను రూ.6.31 కోట్లకు, మే 31వ తేదీన 71,469 షేర్లను రూ.4.68 కోట్లకు కొనుగోలు చేశారు. దీంతో వీటి వాల్యూ మొత్తంగా రూ.11 కోట్లుగా ఉందని కంపెనీ పేర్కొంది. -
రాజకీయాల నుంచి ''ఆ ముసలోళ్లను ఎలిమినేట్ చేయండి సార్''..!
స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ మరోసారి తన నోటికి పనిచెప్పారు. 70 ఏళ్ల వయస్సు పైబడిన వారిని రాజకీయ పదవులకు పోటీ చేయకుండా నిషేధించాలని పిలుపునిచ్చారు. ట్వీట్లో చట్టసభ సభ్యులు ఎవరనేది ప్రస్తావించనప్పటికీ, ప్రస్తుత అధ్యక్షుడు జో బిడెన్, మాజీ అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్, ఇద్దరూ 70 ఏళ్లు పైబడిన వారు. కొద్ది రోజుల క్రితం ఎలన్ సెటైర్లు వేసిన సెనేటర్ సాండర్స్ వయస్సు 80 సంవత్సరాలు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఎలన్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడానికి అనేక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. Let’s set an age limit after which you can’t run for political office, perhaps a number just below 70 … — Elon Musk (@elonmusk) December 2, 2021 ఎలన్ మస్క్ అమెరికా నేతల్ని పరోక్షంగా కర్ర కాల్చి వాత పెడుతున్నారు. నవంబర్ 13న వాషింగ్టన్లో కొంతమంది డెమోక్రాట్లు ఎలన్ మస్క్, జెఫ్ బేజోస్, మార్క్ జుకర్‌బర్గ్ లాంటి బిలియనీర్లపై పన్నులు పెంచాలని ఒత్తిడి చేశారు. బిలియనీర్లు స్టాక్స్ ధర పెరిగినప్పుడు వారు ఎటువంటి షేర్లను విక్రయించకపోయినా పన్నులు చెల్లించాలని ఒత్తిడి చేశారు. అదే సమయంలో అమెరికా సెనేట్ బడ్జెట్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న సాండర్స్ అమెరికాలోని 0.1 శాతం ఉన్న అత్యంత ధనవంతులు కుటుంబాలపై వార్షిక పన్నును ప్రతిపాదించారు. ‘‘అత్యంత ధనవంతులు వారి వంతు పన్నులను సక్రమంగా చెల్లించాల్సిందిగా మనం డిమాండ్ చేయాలి’’ అంటూ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌పై ఎలన్ తనదైన స్టైల్లో సాండర్స్ పై సెటైర్లు వేశారు. ‘‘ సాండర్స్ నువ్వు బతికున్నావనే విషయాన్ని నేను మర్చిపోతుంటాను..ఇప్పుడేమంటావ్.. నేను మరింత స్టాక్ అమ్ముకోవాలని నువ్వు కోరుకుంటున్నావా.. చెప్పు’’ అంటూ ఎలన్ మస్క్ విరుచుకుపడ్డాడు. అయితే తాజాగా ఎలన్ చేసిన 'ఎలిమినేట్' వ్యాఖ్యలకు కారణం సెనెటర్లు బిలియనీన్లు పన్నులు కట్టాలని సెనెటర్లు చేసిన డిమాండ్లేనని తెలుస్తోంది. బిలియనీన్లు పన్నులు చెల్లించాలని డిమాండ్ చేయడంతో ఎలన్..టెస్లాలోని తన శాతం షేర్లను అమ్మకానికి పెడుతున్నట్లు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ దెబ్బకు టెస్లా షేర్లు భారీగా పతనమయ్యాయి. దీంతో లక్షకోట్లుకు పైగా నష్టం వాటిల్లింది. ఆ నష్టాన్ని తట్టుకోలేకనే ఈ బిలియనీర్ 70ఏళ్లకు పై బడిన వారిని రాజకీయాల్లో పదవులకు పోటీ చేసేందుకు అనర్హులుగా గుర్తించాలని ట్వీట్లో పేర్కొన్నారు. ఇప్పుడు ఎలన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు అగ్రరాజ్యం అమెరికాలో చర్చాంశనీయం కాగా..ఆ వ్యాఖ్యల ప్రభావం ఎలన్పై భారీగా ఉండొచ్చనేది విశ్లేషకులు చెబుతున్నమాట. చదవండి: లక్ష కోట్లకుపైగా నష్టం.. అయినా ‘అయ్యగారే’ నెంబర్ 1 -
అదృష్టం అడ్రస్ వెతుక్కుంటూ వచ్చింది..! లక్ష పెట్టుబడి..లాభం రూ.20 లక్షలు..!
అదృష్టం అడ్రస్ వెతుక్కుంటూ రావడం' అంటే ఇదేనేమో..! కరోనా వేరియంట్‌తో దేశీయ మార్కెట్లో లక్షల కోట్లు బూడిదపాలవుతుంటే..అదే మార్కెట్లో మల్టీ బ్యాగర్ స్టాక్స్ మాత్రం కనకవర్షం కురిపిస్తున్నాయి. మల్టీ బ్యాగర్లో పెన్నీస్టాక్స్ 'రాధే డెవలపర్స్' కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లకు వరంగా మారింది. కేవలం మూడు నెలల్లో ఆ స్టాక్స్‌పై 1,904శాతం రాబడితో ముదుపర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్ట్ 26,2021న ఈ స్టాక్ వ్యాల్యూ రూ.17.07 ఉండగా.. నవంబర్ 26 నాటికి రూ.342.30కి పెరిగింది. దీంతో మూడు నెలల క్రితం ఈ స్టాక్స్ లో రూ.1లక్ష పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు రూ.20.04 లక్షలు సంపాదించారు. లక్షల కోట్లు ఆవిరి కానీ కరోనా వేరియంట్ కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు 8% క్షీణించి దాదాపు రూ.14 లక్షల కోట్లు బూడిపాలయ్యాయి. అదే సమయంలో శుక్రవారం రోజు రాధే డెవలపర్స్ షేర్లు గురువారం నాడు మార్కెట్లు ముగిసే సమయానికి రూ.325.95తో పోలిస్తే 4.99% పెరిగి శుక్రవారం రోజు రూ.342.2 ఆల్ టైమ్ హైని తాకాయి. స్టాక్ పనితీరు బిఎస్ఈలో రాధే డెవలపర్స్ స్టాక్స్ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.861.66 కోట్లకు పెరిగింది. మొత్తం 1.30 లక్షల షేర్లు రూ.4.44 కోట్ల టర్నోవర్‌తో చేతులు మారాయి. పనితీరు 5 రోజులు, 20 రోజులు, 50 రోజులు, 100 రోజులు, 200 రోజుల సగటు కంటే ఎక్కువగా ఉంది. షేర్ ఈ సంవత్సరం ప్రారంభం నుండి 3,603% లాభపడింది. ఒక సంవత్సరంలో వ్యాల్యూ 3,540% పెరిగడంపై ముదుపర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
స్టాక్ మార్కెట్ కుబేరులు.. వాళ్ల సక్సెస్ వెనుక ఉన్న కంపెనీలు ఇవే
షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి భవిష్యత్తు పట్ల నిశ్చింతంగ ఉండాలంటే మంచి కంపెనీలను ఎన్నుకోవడం ఎంతో ముఖ్యం. ఎప్పుడు ఒకే సంస్థపై కాకుండా నాలుగైదు విభిన్న రంగాలకు చెందిన బెస్ట్ కంపెనీలు సెలక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేయడం మేలు. షేర్ మార్కెట్‌కి సంబంధించిన ప్రాథమిక సూత్రాల్లో ఈ రెండు ఎంతో ముఖ్యం. వీటిని తూచా తప్పకుండా పాటించిన వారికి స్టాక్ మార్కెట్లో కలిసి వచ్చింది. కాసుల వర్షం కురిపించింది. పట్టు పెంచుకోవాలి అయితే మంచి కంపెనీలను ఎంచుకోవడం, భవిష్యత్తు ఉన్న రంగాలను ముందుగానే పసిగట్టడం వంటి పనులు చేయాలంటే ఎంతో నేర్పు, మార్కెట్ పట్ల అవగాహన ఉండాలి. లేదంటే చాన్నాళ్లుగా మార్కెట్లో కొనసాగుతూ తమ ఇన్వెస్ట్మెంట్కి తగ్గ లాభాలను ఆర్జిస్తున్న వారిని పరిశీలించడం బెటర్. తద్వారా మార్కెట్ మీద పట్టు పెంచుకోవచ్చనేది ఆర్థిక నిపుణుల సలహా. పోర్ట్‌ఫోలియో రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా, రాధాకిషన్ దమానీ, అజీమ్ ప్రేమ్‌జీ ఇలా స్టాక్ మార్కెట్లో చాలా కాలం నుంచి కొనసాగుతూ తమ పొర్ట్‌ఫోలియోలో వివిధ సెక్టార్లకు చెందిన కంపెనీల స్టాక్లను మెయింటైన్ చేస్తున్నారు. ఇందులో కొన్సి షేర్ల ధరలు మార్కెట్ ఎంట్రీ లెవల్లో ఉన్న వారు భరించలేని ధరతో ఉన్నాయి. మరికొన్ని కొంచెం తక్కువ ధరలలో అందుబాటులో ఉన్నాయి. బిగినర్లు కూడా ఇన్వెస్ట్ చేసేందుకు అనువుగా ఉన్నాయి. అందులో కొన్నింటి వివరాలు .. అజీమ్ ప్రేమ్‌జీ మన దేశంలో ఉన్న అపర కుబేరుల్లో ఒకడైన అజీమ్ ప్రేమ్‌జీ పోర్ట్‌ఫోలియోలో విప్రో, ట్యూబ్ ఇండియా, జైడస్ వెల్నెస్, ట్రెంట్ లిమిటెడ్ కంపెనీలు ఉన్నాయి. ఇందులో విప్రోలో బ్రాండ్ కింద హోంకేర్, పర్సనల్ కేర్, వెల్నెస్, మేల్‌గ్రూమింగ్, ఆఫీస్ సొల్యూషన్ వంటి ఉత్పత్తులు ఉన్నాయి. ఆ తర్వాత హెల్త్‌కేర్‌లో జైడస్, దుస్తుల విభాగంలో టాటా సబ్సిడరీ ట్రెంట్, ఆటోమొబైల్ విభాగంలో టీఐ కంపెనీల షేర్ల తన పోర్ట్‌ఫోలియోలో ఉంచుకున్నారు అజీమ్ ప్రేమ్‌జి. - విప్రో షేరు ధర ప్రస్తుతం రూ.652లుగా ఉంది. గతేడాది ఈ షేరు ధర కేవలం రూ.351గా నమోదు అయ్యింది - ట్యూబ్ ఇండియా (టీఐ) షేరు ధర ప్రస్తుతం రూ.83.60లు ఉండగా ఏడాది కిందట రూ. 16.90లుగా ఉంది. - జైడస్‌వెల్ షేర్ ధర రూ.2050 ఉండగా ఏడాది కిందట రూ.1720గా ఉంది. - ట్రెంట్ షేర్ ధర రూ.1095 ఉండగా ఏడాది కిందట రూ. 681గా ట్రేడ్ అయ్యింది. రాకేశ్ అండ్ రాధకిషన్ - మార్కెట్ బిగ్బుల్ రాకేశ్ ఝన్‌ఝున్‌వాలా విషయానికి వస్తే ఆయన పోర్ట్‌ఫోలియోలో టైటాన్, ఎన్సీసీ, క్రిసిల్, టాటా కమ్యూనికేషన్స్‌లు ఉన్నాయి. రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా అసోసియేట్స్ పోర్ట్‌ఫోలియోలో పైన పేర్కొన్న మూడింటితో పాటు ఎస్కార్ట్ కూడా ఉంది. - డీమార్ట్ సంస్థల అధినేత ఒకప్పటి మార్కెట్ బేర్ రాధాకిషన్ దమానీ పోర్ట్‌ఫోలియోలో డీమార్ట్, ది ఇండియా సిమెంట్స్, సుందరం ఫైనాన్స్, వీఎస్టీ ఇండస్ట్రీస్‌లు ఉన్నాయి. - ఆశీష్ దావన్ పోర్ట్‌ఫోలియోలో బిర్లాసాఫ్ట్, మ్యాక్స్ హెల్త్‌కేర్, ఐడీఎఫ్సీ, గ్లెన్‌మార్క్‌లు ఉన్నాయి - ముఖుల్ అగర్వాల్ పోర్ట్‌ఫోలియోలో ఇంటెలెక్ట్, రెలిగేర్, మాస్టెక్, ఏపీల్ అపోలోలు ఉన్నాయి. -
కోటీశ్వరులయ్యే మంత్రం చెప్పిన బాబా రామ్‌దేవ్.. సెబీ సీరియస్
యోగా గురువు రామ్‌దేవ్ బాబా మరోసారి చిక్కుల్లో పడ్డారు. యోగా క్లాసుల సందర్భంగా ఆయన చెప్పిన ఆర్థిక పాటాలపై సెబీ సీరియస్ అయ్యింది. అభ్యంతర వ్యాఖ్యలు ఎందుకు చేశారో చెప్పాలంటూ వివరణ అడిగింది. ఈ షేర్లు కొనండి కరోడ్‌పతి కండి ఇటీవల యోగా తరగతులు నిర్వహిస్తున్న సందర్భంగా అక్కడికి వచ్చిన వారిని ఉద్దేశించి బాబా రామ్‌దేవ్ ప్రసంగించారు. ‘ ఈ సందర్భంగా మీ అందరికీ కోటీశ్వరులు అయ్యే మంత్రం చెబుతాను జాగ్రత్తగా వినండి. మీరంతా ఈ రోజే డీ మ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేయండి. స్టాక్ మార్కెట్లో లావాదేవీలు నిర్వహించేందుకుద అన్నీ ఏర్పాట్లు చేసుకోండి. నేను చెప్పినప్పుడు రుచి సోయా కంపెనీకి చెందిన షేర్లు కొనండి. అలా కొన్న వాటిని తిరిగి అమ్మడం , కొనడం వంటి పనులు చేయకండి. వాటిని కొన్న వెంటనే ‘సమాధి’ చేయండి. ఎక్కువ కాలం మీ దగ్గరే ఉంచుకోండి. పతంజలి తర్వాత లక్ష కోట్ల రూపాయల కంపెనీ అయ్యే అర్హతలు రుచి సోయాకు ఉన్నాయి’ అంటూ చెప్పారు. సెబీ సీరియస్ స్టాక్ మార్కెట్లో జరిగే లావాదేవీలను సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) సంస్థ నిర్వహిస్తోంది. సెబీ నిబంధనల ప్రకారం సరైన నైపుణ్యం, సర్టిఫైడ్‌కాని వ్యక్తులు షేర్ల కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన సలహాలు ఇవ్వకూడదు. అలా చేయడం వల్ల మార్కెట్‌పై అవగాహన లేని వారు తమ డబ్బులు నష్టపోయే అవకాశం ఉంది. కానీ బాబా రామ్‌దేవ్ ఈ నిబంధనను పట్టించుకోకుండా బహిరంగగా సలహా ఇవ్వడంపై సెబీ సీరియస్ అయ్యింది. దీనిపై రామ్‌దేవ్ బాబాను వివరణ కోరింది. సోయా రుచికి నోటీసులు రామ్‌దేవ్ బాబాకు చెందిన పతంజలి సంస్థ సోయారుచికి ప్రమోటర్‌గా ఉంది. ఇటీవల అదనపు నిధులు మార్కెట్ నుంచి సమీకరించేందుకు ఫాలోఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీవో)కి వెళ్లేందుకు ఆగస్టులో సెబీ నుంచి అనుమతులు సాధించింది. త్వరలో ఈ సంస్థ ఎఫ్‌పీవో ద్వారా రూ. 4300 కోట్లు సమీకరించే లక్ష్యంతో ఉంది. అయితే ఇంతలో రామ్‌దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు ఈ సంస్థను చిక్కుల్లో పడేశాయి. రుచితో పాటు ఎప్‌పీవోకి మర్చంట్‌బ్యాంకర్లు ఉన్న వారికి సెబీ నోటీసులు జారీ చేసింది. లభించని వీడియో కరోడ్‌పతి మంత్ర, సోయా రుచి షేర్లకు సంబంధించి జాతీయ మీడియాలో వార్తలు రావడం తప్పితే సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో ఎక్కడా లభించడం లేదు. అయితే యోగా తరగతుల్లో బాబా మాట్లాడే సమయంలో కొందరు వీడియో తీశారని, ఆ ఫుటేజీ సెబీకి చేరిందని తెలుస్తోంది. సెబీ నుంచి నోటీసులు వచ్చిన తర్వాత ఆ వీడియోను తొలగించినట్టు సమాచారం. చదవండి : IIFL Wealth Hurun India 2021: ఆనంద్ మహీంద్రా, రాకేశ్ జున్‌జున్‌వాలా..అతని తర్వాతే..! -
అమెరికా షేర్లలో పెట్టుబడి ఈజీ..!
‘గుడ్లు అన్నింటినీ తీసుకెళ్లి ఒకే బుట్టలో పెట్టరాదు’ అని ఇన్వెస్ట్మెంట్లో ప్రాథమిక సూత్రం ఒకటి ఉంది. ఇన్వెస్టర్లు అందరూ పాటించాల్సిన సూత్రం ఇది. కానీ, పెట్టుబడుల్లో వైవిధ్యాన్ని అందరూ పాటించరు. కొంత మంది మాత్రం ఈక్విటీల్లో, బాండ్లలో, బంగారంలో ఇలా భిన్నమైన సాధనాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా రిస్క్ తగ్గించుకునే సూత్రాన్ని అనుసరిస్తుంటారు. ఇలా పెట్టుబడులను ఒకటికి మించిన వేర్వేరు సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల.. ఒక్కో సమయంలో ఒక్కో సాధనం చూపించే అసాధారణ పనితీరు నుంచి ప్రయోజనం పొందొచ్చు. పైగా కొన్ని సందర్భాల్లో ఒక్కో విభాగం నష్టాలను చూడాల్సి వస్తుంది. అటువంటి సందర్భాల్లో రిస్క్‌ను తగ్గించుకున్నవారు అవుతారు. ఈక్విటీ పెట్టుబడులను సైతం అన్నింటినీ మన మార్కెట్లలోనే ఇన్వెస్ట్ చేయడం కాకుండా, కొంత భాగాన్ని యూఎస్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం కూడా వైవిధ్యమే అవుతుంది. ఒకప్పుడు లేని ఈ అవకాశాన్ని నేడు పలు బ్రోకరేజీ సంస్థలు తమ ఇన్వెస్టర్లకు అందిస్తున్నాయి. భౌగోళికంగా భిన్న మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం అన్నది ఒకే మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడంతో పోలిస్తే ఆటుపోట్లను అధిగమించి మెరుగైన రాబడులకు వీలు కల్పిస్తుంది. పైగా మన ఈక్విటీ మార్కెట్లలో అందుబాటులో లేని వినూత్న అవకాశాలు యూఎస్ ఈక్విటీల్లో ఉన్నాయి. ఫేస్బుక్, యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ ఈ తరహా సంస్థలు మన మార్కెట్లలో లిస్ట్ అయి లేవు. కానీ, ఈ దిగ్గజాలు ఎప్పటికప్పుడు మరింత బలపడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా యూజర్లను కలిగి ఉన్నవి కావడంతో వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వృద్ధి ఫలాలను పొందొచ్చు. అమెరికాలో సెక్యూరిటీల నియంత్రణ మండలి అయిన ‘ఎస్ఈసీ’ ఫ్రాక్షనల్ షేర్లలోనూ ఇన్వెస్ట్ చేసుకునేందుకు అనుమతిస్తోంది. ఉదాహరణకు చాలా ఖరీదైన షేరును కొనుగోలు చేయాలనుకునే వారి దగ్గర తక్కువ పెట్టుబడే ఉన్నట్టయితే.. అప్పుడు ఆ స్టాక్‌లో కొంత భాగాన్ని కొనుగోలు చేసుకోవచ్చు. తమవద్దనున్న ఫ్రాక్షనల్ షేర్ల విలువకు తగినట్టు ఓటింగ్ హక్కులతోపాటు డివిడెండ్‌కు అర్హులవుతారు. తమ పిల్లలను అమెరికాలో ఉన్నత విద్యకు పంపించాలనుకుంటుంటే అమెరికన్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచి ఆలోచన అవుతుందని నిపుణులు చెబుతున్నారు. తద్వారా వారి విద్యకు అవసరమైన మొత్తాన్ని స్టాక్స్ పెట్టుబడుల రూపంలో సమకూర్చుకోవచ్చు. ఇన్వెస్ట్ చేయడం ఎలా..? దేశీయంగా ఈక్విటీల్లో నేరుగాను, లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటున్నట్టే.. యూఎస్ స్టాక్ మార్కెట్లలోనూ నేరుగా స్టాక్స్ కొనుగోలు చేసుకోవచ్చు. లేదా అక్కడి స్టాక్స్‌లో పెట్టుబడుల అవకాశాలను కల్పిస్తున్న మ్యూచువల్ ఫండ్స్ పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. నేరుగా ఇన్వెస్ట్ చేసుకునేందుకు అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ వేదికలు అయిన వెస్టెడ్ ఫైనాన్స్, స్టాకాల్, విన్వెస్టా ఉన్నాయి. భారత్‌కు చెందిన బ్రోకరేజీ సంస్థలు ఐసీఐసీఐ డైరెక్ట్, యాక్సిస్ సెక్యూరిటీస్, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, యూఎస్ బ్రోకరేజీ సంస్థలతో ఒప్పందం చేసుకుని అమెరికా స్టాక్స్‌లో పెట్టుబడుల సేవలను ఆఫర్ చేస్తున్నాయి. ఇందులో ఐసీఐసీఐ డైరెక్ట్.. ఇంటరాక్టివ్ బ్రోకర్స్ ఎల్ఎల్సీతోను, యాక్సిస్ సెక్యూరిటీస్ వెస్టెడ్ ఫైనాన్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి విదేశాల్లో ట్రేడింగ్ అకౌంట్ ప్రారంభానికి కేవైసీ డాక్యుమెంట్లతోపాటు దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. పాన్, గుర్తింపు ధ్రువీకరణ, నివాస ధ్రువీకరణ పత్రాలు అవసరం అవుతాయి. అకౌంట్ ఓపెనింగ్ చార్జీలు, బ్రోకరేజీ చార్జీలు, కమీషన్లు సంస్థలను బట్టి మారిపోతాయి. ఉదాహరణకు ఐసీఐసీఐ డైరెక్ట్ అయితే అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫామ్‌పై అకౌంట్ ప్రారంభానికి ఎటువంటి చార్జీలను వసూలు చేయడం లేదు. కానీ, వార్షిక సబ్స్క్రిప్షన్ చార్జీగా రూ.999–9,999 మధ్య చెల్లించుకోవాలి. బ్రోకరేజీ కింద ఒక షేరుకు యూఎస్ సెంట్ నుంచి 2.99 డాలర్ల వరకూ వసూలు చేస్తున్నాయి. అంటే కస్టమర్లు ఎంచుకున్న ప్లాన్ ఆధారంగా చార్జీల్లో మార్పు ఉంటుంది. ఐసీఐసీఐ డైరెక్ట్ కస్టమర్లకు ‘గ్లోబల్ స్టార్టర్’, ‘గ్లోబల్ అడ్వాంటేజ్’ అనే రెండు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. వెస్టెడ్ ఫైనాన్స్ బేసిక్ ప్లాన్ అకౌంట్ ప్రారంభానికి రూ.399 చార్జీ వసూలు చేస్తోంది. ఇది మినహా ఇతరత్రా బ్రోకరేజీ లేదా కమీషన్లను వసూలు చేయడం లేదు. మోడల్ పోర్ట్‌ఫోలియో తదితర విలువ ఆధారిత సేవలతో కూడినప్రీమియం ప్లాన్‌ను ఎంచుకున్న వారికి అకౌంట్ ప్రారంభ చార్జీల మినహాయింపు ఉంటుంది. నిధుల బదిలీ.. ఆర్బీఐ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద విదేశాల్లో తమ ట్రేడింగ్ ఖాతాలకు నిధులను బదిలీ చేసుకోవచ్చు. ప్రతీ ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 2,50,000 డాలర్లను పంపుకునేందుకు అనుమతి ఉంటుంది. ఎల్ఆర్ఎస్ మార్గంలో నిధుల బదిలీ సేవలను చాలా వరకు బ్రోకర్లు అందిస్తున్నారు. మరి ఒకవేళ అక్కడి స్టాక్స్‌ను విక్రయించి ఆ నిధులను తిరిగి వెనక్కి పొందాలంటే అందుకు కొంత సమయం తీసుకుంటుంది. బ్యాంకుల వద్ద ప్రాసెసింగ్‌కు పట్టే సమయంతోపాటు, అమెరికాలో టీ ప్లస్ 3 సెటిల్మెంట్ విధానం అమల్లో ఉంది. అంటే విక్రయించిన నాటి నుంచి నాలుగో రోజు నిధులు అకౌంట్లో జమ అవుతాయి. మన దేశంలో టీప్లస్ 2 విధానం అమల్లో ఉంది. మినహాయింపులు.. భారతీయ ఇన్వెస్టర్లు ప్రస్తుతానికి యూఎస్ ఈక్విటీల్లో, లిస్టెడ్ బాండ్లలో, ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేసుకునేందుకు అవకాశం ఉంది. అమెరికన్ స్టాక్ ఎక్సే్చంజ్‌ల్లో ఇతర దేశాల కంపెనీల లిస్టింగ్‌కు కూడా అనుమతి ఉంది. ప్రస్తుతానికి 465 అమెరికాయేతర కంపెనీలు యూఎస్ ఎక్సే్చంజ్‌ల్లో క్రాస్లిస్డ్ అయి ఉన్నాయి. వీటిల్లోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అమెరికాలో వచ్చే ఐపీవోలకు దరఖాస్తు చేసుకునే అవకాశం మాత్రం లేదు. భారత్‌లో నివసించే వారు అంతర్జాతీయ మార్కెట్లలో మార్జిన్ ట్రేడింగ్, లెవరేజీ ట్రేడింగ్‌కు ఆర్బీఐ అనుమతించడం లేదు. దీనికి అదనంగా కొన్ని బ్రోకరేజీ సంస్థలు అదనపు నియంత్రణలు పెడుతున్నాయి. ఉదాహరణకు ఐసీఐసీఐ డైరెక్ట్ అయితే అంతర్జాతీయ ట్రేడింగ్ అకౌంట్ ప్రారంభించే ఇన్వెస్టర్‌కు కనీసం 5,000 డాలర్ల నెట్‌వర్త్ ఉండాలంటూ నిబంధన అమలు చేస్తోంది. అంటే కనీసం రూ.3.7 లక్షల నెట్‌వర్త్ అయినా ఉండాలన్నమాట. ఇక రాబడులపై పన్నుల భారం కూడా మోయాల్సి ఉంటుంది. అమెరికా ఈక్విటీల్లో పెట్టుబడులపై అందుకునే డివిడెండ్‌పై 25 శాతం విత్‌హోల్డింగ్ ట్యాక్స్ పడుతుంది. అయితే, ఇటువంటి పన్నులను ఫామ్ 67ను దాఖలు చేయడం ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ నేరుగా యూఎస్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసుకునేందుకు తగినంత నైపుణ్యం ఉంటే ఫర్వాలేదు. లేకుంటే చేతులు కాల్చుకున్నట్లే. కనుక కొత్త ఇన్వెస్టర్లు, తగినంత సమయం వెచ్చించలేని వారికి ఫండ్స్, ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ (విదేశీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే పథకాలు) అందుబాటులో ఉన్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ యూఎస్ బ్లూచిప్ ఈక్విటీ ఫండ్, నిప్పన్ ఇండియా యూఎస్ ఈక్విటీ అపార్చునిటీస్ ఫండ్, డీఎస్పీ యూఎస్ ఫ్లెక్సిబుల్ ఈక్విటీ ఫండ్, ఎడెల్వీజ్ యూఎస్ వ్యాల్యూ ఈక్విటీ ఆఫ్‌షోర్ ఫండ్, మోతీలాల్ ఓస్వాల్ నాస్డాక్ 100 ఇలా ఎన్నో పథకాలు అమెరికా స్టాక్స్‌లో పెట్టుబడి అవకాశాలను అందిస్తున్నాయి. టీసీఎస్ పడుతుంది.. విదేశీ స్టాక్స్‌లో పెట్టుబడులు నిజంగా మంచి అవకాశమే. ఇందులో సందేహం లేదు. కానీ పైన చెప్పుకొన్నట్టు పన్నుల భారాన్ని కూడా గమనించాలి. అక్టోబర్ 1 నుంచి ఒక ఏడాదిలో రూ.7లక్షలకు మించి నిధులు పంపించుకుంటే (విదేశీ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్‌కు పంపుకునే నిధులపైనా) 5 శాతం మూలం వద్ద పన్నును బ్యాంకులు వసూలు చేయాలని (టీసీఎస్) కొత్త నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ ఆధార్, పాన్ కార్డు ఇవ్వని వారి విషయంలో టీసీఎస్ 10 శాతం అమలవుతుంది. ‘‘ఈ నిబంధన తీసుకురావడం వెనుక ఉద్దేశ్యం పన్ను పరిధిని పెంచడమే. ప్రభుత్వం వద్దనున్న సమాచారం ప్రకారం చూస్తే చాలా మంది వ్యక్తులు ఎల్ఆర్ఎస్ పథకాన్ని ఉపయోగించుకుని ఎటువంటి పన్నులు చెల్లించడం లేదు’’ అని వెస్టెడ్ ఫైనాన్స్ సీఈవో విరమ్ షా పేర్కొన్నారు. విదేశీ స్టాక్స్, బాండ్లు, ప్రాపర్టీలపై ఇన్వెస్ట్ చేసే భారతీయులకు ఈ నిబంధన వల్ల వ్యయాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, నిజాయితీపరులైన వారు రిటర్నులు దాఖలు చేసి టీసీఎస్‌ను రిఫండ్‌గా పొందొచ్చని సూచిస్తున్నారు. ‘‘విదేశీ లావాదేవీల ప్రారంభ వ్యయాలను ఇది అధికం చేస్తుంది. అయితే, ఈ వ్యయాలను పన్ను రిటర్నులను దాఖలు చేసి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒక ఏడాదిలో రూ.7లక్షల్లోపు నగదు పంపుకునే ఇన్వెస్టర్లపై ఈ నిబంధనలు ఎటువంటి ప్రభావం చూపించవు’’ అని విన్వెస్టా సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ జైన్ తెలిపారు. విదేశీ విద్య కోసం, విదేశీ పర్యటనల కోసం నిధుల వ్యయాలపై నిబంధనల్లో మార్పు ఉంది. ఒకవేళ విదేశీ విద్య కోసం బ్యాంకులో రుణం తీసుకుని పంపిస్తున్నట్టు అయితే.. అది కూడా రూ.7లక్షలు మించిన సందర్భంలో 0.5 శాతాన్ని టీసీఎస్‌గా మినహాయిస్తారు. అదే విదేశీ పర్యాటక ప్యాకేజీలను బుక్ చేసుకుంటే ఎంత విలువ అన్నదానితో సంబంధం లేకుండా 5 శాతం టీసీఎస్ అమలవుతుంది. ఒకవేళ సొంతంగా విదేశీ పర్యటనను (ట్రావెల్ ఏజెన్సీలతో సంబంధం లేకుండా) బుక్ చేసుకుంటే ఈ పన్ను పడదు.