న్యూఢిల్లీ: బజాజ్ ఆటో తన వాటాదారుల నుంచి 64,09,62 షేర్లను బైబ్యాక్ చేసింది. ఇందుకు రూ.2,500 కోట్లు వెచ్చించినట్టు ప్రకటించింది. జూలై 4న బజాజ్ ఆటో షేర్ల బైబ్యాక్‌ను ప్రారంభించింది. సోమవారం సమావేశమైన బైబ్యాక్ కమిటీ, అక్టోబర్ 10తో బైబ్యాక్ ముగించేందుకు ఆమోదం తెలిపినట్టు పేర్కొంది.
బహిరంగ మార్కెట్లో ఒక్కో షేరును రూ.4,600కు మించకుండా కొనుగోలు చేయా లని ఈ ఏడాది జూన్ 27న బజాజ్ ఆటో నిర్ణయించడం గమనార్హం. బైబ్యాక్ తర్వాత ప్రమోటర్లు, ప్రమోటర్ల గ్రూపు మొత్తం వాటా 53.77 శాతం నుంచి 54.98 శాతానికి పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment