Bajaj
-
రిటైర్మెంట్ ప్లాన్ కోసం కొత్త ప్లాన్
బజాజ్ అలియంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ గ్యారంటీడ్ పెన్షన్ గోల్ 2 అనే కొత్త రిటైర్మెంట్ పథకాన్ని ఆవిష్కరించింది. ఈ ప్లాన్‌ను పదవీవిరమణ సమయంలో నిర్దిష్టమైన రాబడులు వచ్చేలా రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. మార్కెట్లో ఈ తరహా రిటైర్మెంట్ ప్లాన్లు చాలా కంపెనీలు అందిస్తున్నాయి. ఇటువంటి పథకాల్లో ఇన్వెస్ట్ చేసేముందు పాలసీదారులు అన్ని వివరాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బజాన్ కొత్త పథకంలోకి కీలక అంశాలు కింది విధంగా ఉన్నాయి.దీర్ఘకాల వాయిదా: ఈ ప్రత్యేక ఫీచర్ 35 సంవత్సరాలలోపు వయసు ఉన్న వ్యక్తులు తమ ఆర్థిక భవిష్యత్తును ముందుగానే నిర్ణయించుకునేందుకు తోడ్పడుతుంది. వాయిదా వ్యవధిని 30 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. ఇది పొదుపు పెరగడానికి తగినంత సమయాన్ని అందిస్తుంది.మల్టిపుల్ యాన్యుటీ పేఅవుట్ ఆప్షన్లు: ఈ ప్లాన్ లైఫ్ యాన్యుటీ, జాయింట్ లైఫ్ యాన్యుటీ, రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ప్రైస్ (ఆర్ఓపీ) ఎంపికలతో సహా వివిధ యాన్యుటీ చెల్లింపు సదుపాయాలను అందిస్తుంది. ఇవి వ్యక్తిగత రిటైర్మెంట్ అవసరాలను తీర్చడానికి అనుగుణంగా ఉంటాయి.కస్టమైజబుల్ ఆర్ఓపీ: పాలసీదారులు కొనుగోలు ధర 50% నుంచి 100% రాబడిని ఎంచుకోవచ్చు. ఇది యాన్యుటీ చెల్లింపులను పెంచుతుంది.గ్యారంటీడ్ లైఫ్ టైమ్ ఇన్ కమ్: రిటైర్మెంట్ సమయంలో స్థిరమైన ఆదాయాన్ని ఇది నిర్ధారిస్తుంది.ఇదీ చదవండి: అదానీపై ఫిర్యాదుకు ప్రభుత్వ సాయం కోరిన ఎస్ఈసీఈ సందర్భంగా బజాజ్ అలియాంజ్ లైఫ్ ఎండీ, సీఈఓ తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. జీవన ప్రమాణాలు పెరుగుతున్న కొద్దీ చాలా మంది పదవీ విరమణ తర్వాత చాలాఏళ్లు జీవిస్తున్నారని చెప్పారు. కానీ సరైన ప్రణాళికలేక రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు కచ్చితంగా రిటైర్మెంట్ ప్లాన్‌ను తీసుకోవాలని పేర్కొన్నారు. -
ఒకసారి ఛార్జింగ్‌తో 153 కిలోమీటర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం బజాజ్ ఆటో ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ నుంచి సరికొత్త 35 సిరీస్‌ను ఆవిష్కరించింది. 3.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ సామర్థ్యంతో మూడు వేరియంట్లలో వీటిని రూపొందించింది. ఒకసారి ఛార్జింగ్‌తో 153 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.కొత్త చేతక్ రూ.1.2 లక్షల ధరతో మిడ్ వేరియంట్ 3502, రూ.1.27 లక్షల ధరతో టాప్–ఎండ్ వేరియంట్ 3501 మాత్రమే ప్రస్తుతానికి విడుదలైంది. వీటి టాప్ స్పీడ్ గంటకు 73 కిలోమీటర్లు. బేస్ వేరియంట్ అయిన 3503 కొద్ది రోజుల్లో రంగ ప్రవేశం చేయనుంది. ఈ వేరియంట్ టాప్ స్పీడ్ గంటకు 63 కిలోమీటర్లు. డెలివరీలు డిసెంబర్ చివరి వారం నుంచి ప్రారంభం అతుతాయని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: మళ్లీ భగ్గుమన్న బంగారం.. తులం ఎంతో తెలుసా?నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్, కాల్స్ అందుకునేలా స్మార్ట్ టచ్‌స్క్రీన్ పొందుపరిచారు. సీటు కింద 35 లీటర్ల స్టోరేజ్ ఏర్పాటు ఉంది. స్టోరేజ్ స్థలం పరంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లో ఇదే అత్యధికం. రిమోట్ ఇమ్మొబిలైజేషన్, గైడ్ మీ హోమ్ లైట్స్, జియో ఫెన్సింగ్, యాంటీ థెఫ్ట్, యాక్సిడెంట్ డిటెక్షన్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. 3501 మూడు గంటల్లో, 3502 వేరియంట్ 3 గంటల 25 నిముషాల్లో 80 శాతం చార్జింగ్ పూర్తి అవుతుందని కంపెనీ తెలిపింది. వారంటీ మూడేళ్లు లేదా 50,000 కిలోమీటర్లు ఉంటుందని పేర్కొంది. -
ఈ-టూవీలర్స్లోనూ పెద్ద కంపెనీలే..
హీరో మోటోకార్ప్, హోండా, టీవీఎస్, బజాజ్, సుజుకీ, యమహా.. భారత ద్విచక్ర వాహన మార్కెట్లో ఈ కంపెనీలదే రాజ్యం. మారుమూల పల్లెల్లోనూ ఈ బ్రాండ్ల వాహనాలే దర్శనమిస్తాయి. సువిశాల భారతావని అంతటా ఇవి తమ నెట్‌వర్క్‌ను దశాబ్దాలుగా పెంచుకున్నాయి. విక్రయ శాలలే కాదు సర్వీసింగ్‌ను కూడా కస్టమర్లకు చేరువ చేశాయి. మాస్ మార్కెట్‌ను పూర్తిగా ఇవి చేతుల్లోకి తీసుకున్నాయంటే ఆశ్చర్యంవేయక మానదు.- హైదరాబాద్, బిజినెస్ బ్యూరోఇంత బలమున్న ఈ దిగ్గజాలు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలోనూ పాగా వేస్తాయనడంలో సందేహం లేదు. ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ బజాజ్, టీవీఎస్ తమ సత్తా చాటుతున్నాయి. హీరో మోటోకార్ప్ క్రమక్రమంగా వేగం పెంచి నవంబర్‌లో టాప్–5 స్థానానికి ఎగబాకింది. పెద్ద కంపెనీలే ఈ–టూవీలర్స్లోనూ అడ్డా వేస్తాయని గణాంకాలు చెబుతున్నాయి. భారత ఈ–టూవీలర్స్ పరిశ్రమ ఈ ఏడాది నవంబర్ 11 నాటికే 10,00,000 యూనిట్ల మైలురాయిని దాటింది. మళ్లీ హమారా బజాజ్.. 2024 డిసెంబర్ తొలి వారంలో అమ్ముడైన ఎలక్ట్రిక్ టూ వీలర్స్‌లో టాప్–4 కంపెనీల వాటా ఏకంగా 82 శాతం ఉందంటే భవిష్యత్ ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. మిగిలిన 18 శాతం వాటా కోసం దేశవ్యాప్తంగా 200లకుపైగా బ్రాండ్లు పోటీపడుతున్నాయి. భారత స్కూటర్స్ మార్కెట్లో ఒకప్పుడు రారాజులా వెలుగొందిన బజాజ్.. ఇప్పుడు ఎలక్ట్రిక్ చేతక్ రూపంలో స్కూటర్స్ విభాగంలోకి రీఎంట్రీ ఇచ్చి హమారా బజాజ్ అనిపించుకుంటోంది.డిసెంబర్ తొలివారంలో బజాజ్ 4,988 యూనిట్లతో తొలి స్థానంలో నిలిచింది. టీవీఎస్ మోటార్ కంపెనీ 3,964 యూనిట్లతో రెండవ స్థానంలో ఉంది. ప్రస్తుతం ఈ రెండు కంపెనీల మధ్యే పోటీ తీవ్రంగా ఉంది. ఓలా 3,351, ఏథర్ ఎనర్జీ 2,523 యూనిట్లతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఓలా అమ్మకాలు అక్టోబర్‌లో 41,775 యూనిట్ల నుంచి నవంబర్‌లో 29,191 యూనిట్లకు పడిపోయింది. దేశవ్యాప్తంగా ఈ కంపెనీ వాహనాల నాణ్యతపై ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడం గమనార్హం. పెద్ద కంపెనీల మధ్యే పోటీ.. తదుపరితరం చేతక్‌ను డిసెంబర్ 20న ప్రవేశపెట్టేందుకు బజాజ్ రెడీ అయింది. 2019–20లో కేవలం 212 యూనిట్లు విక్రయించిన బజాజ్.. 2020–21లో 1,395 యూనిట్లు, ఆ తర్వాతి ఏడాది 8,187, 2022–23లో 36,260 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది. ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరంలో 1,15,702 యూనిట్లను సాధించింది. 2024–25 ఏప్రిల్–నవంబర్‌లో 1,34,167 యూనిట్లు రోడ్డెక్కాయి. టీవీఎస్ మోటార్ కంపెనీ 2023 జనవరిలో 10,465 యూనిట్ల సేల్స్ నమోదు చేసింది. ఏడాదిలోనే ఈ సంఖ్య 47 శాతం పెరిగింది.2024 నవంబర్‌లో ఈ కంపెనీ 26,971 యూనిట్ల అమ్మకాలను దక్కించుకుంది. ఈ నెలలోనే విదా వీ2 మోడల్‌ను ఆవిష్కరించిన హీరో మోటోకార్ప్ క్రమక్రమంగా ఈ–టూవీలర్స్‌లో పట్టు సాధిస్తోంది. ఈ కంపెనీ 2023 జనవరిలో 157 యూనిట్లు విక్రయించింది. 2024 జనవరిలో ఈ సంఖ్య 1,495కు చేరుకుంది. నవంబర్‌లో ఏకంగా 7,309 యూనిట్ల అమ్మకాలను సాధించి టాప్–5 స్థానాన్ని అందుకుంది. క్యూలో మరిన్ని దిగ్గజాలు.. 2025 తొలి త్రైమాసికం నుంచి నేను సైతం అంటూ హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా రెడీ అవుతోంది. యాక్టివా–ఈ, క్యూసీ1 మోడళ్లను కంపెనీ భారత మార్కెట్లో ఇటీవలే ఆవిష్కరించింది. 2025 జనవరి 1 నుంచి బుకింగ్స్ స్వీకరిస్తారు. ఫిబ్రవరి నుంచి డెలివరీలు ప్రారంభం అవుతాయని కంపెనీ ప్రకటించింది. సంస్థకు దేశవ్యాప్తంగా 6,000 పైచిలుకు సేల్స్, సర్వీస్ టచ్‌పాయింట్స్ ఉన్నాయి.2025లో 1,00,000 యూనిట్ల ఈ–స్కూటర్స్ తయారు చేయాలని లక్ష్యంగా చేసుకుందంటే కంపెనీకి ఉన్న ధీమా అర్థం చేసుకోవచ్చు. మరోవైపు సుజుకీ, యమహా ఎంట్రీ ఇస్తే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన పరిశ్రమ సరికొత్త రికార్డుల దశగా దూసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. యమహా ఇప్పటికే హైబ్రిడ్ టూ వీలర్స్ తయారు చేస్తోంది. సుజుకీ నియో ఎలక్ట్రిక్ టూ వీలర్ కొద్ది రోజుల్లో రంగ ప్రవేశం చేయనుంది. -
మెగా ఐపీఓ వేవ్!
స్టాక్ మార్కెట్లో బుల్ రంకెల నేపథ్యంలో పబ్లిక్ ఆఫర్లు (ఐపీఓ) పోటెత్తుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే 62 కంపెనీలు దాదాపు రూ.64,513 కోట్ల భారీ మొత్తాన్ని సమీకరించాయి. ఇందులో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ (రూ. 6,550 కోట్లు), ఫస్ట్‌క్రై (రూ. 4,194 కోట్లు), ఓలా ఎలక్ట్రిక్ (రూ.6,146 కోట్లు), డిజిట్ ఇన్సూరెన్స్ (2,165 కోట్లు) తదితర దిగ్గజాలున్నాయి. గతేడాది మొత్తంమీద 57 కంపెనీలు కలిపి రూ.49,436 కోట్ల నిధులను మార్కెట్ నుంచి దక్కించుకున్నాయి. దీంతో పోలిస్తే ఈ ఏడాది 29 శాతం అధికం కావడం గమనార్హం. మరోపక్క, మరో 75 కంపెనీలు రూ.1.5 లక్షల కోట్ల నిధుల వేట కోసం ఆవురావురుమంటూ వేచిచూస్తున్నాయి. ఇందులో 23 కంపెనీలకు సెబీ గ్రీన్ సిగ్నల్ కూడా లభించింది. హ్యుందాయ్ ఇండియా, స్విగ్గీకి ఇప్పటికే సెబీ ఇప్పటికే ఓకే చెప్పగా... తాజాగా విశాల్ మెగామార్ట్, ఆక్మే సోలార్, మమతా మెషినరీకి కూడా ఆమోదం లభించింది. సెబీ లైన్ క్లియర్ చేసిన ఐపీఓల విలువ దాదాపు రూ.72,000 కోట్లు! మిగా 53 కంపెనీలు రూ.78 వేల కోట్ల నిధుల సమీకరణ బాటలో ఆమోదం కోసం వేచి చూస్తున్నాయి. కాగా, రూ. 1,19,882 కోట్ల నిధుల సమీకరణతో 2021 ఏడాది అత్యధిక ఐపీఓల రికార్డును దక్కించుకుంది. మార్కెట్ రికార్డు పరుగుల నేపథ్యంలో మూడేళ్ల తర్వాత పబ్లిక్ ఇష్యూలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఆమోదం లభించినవి డిసెంబర్‌లోపు గనుక ఐపీఓలను పూర్తి చేసుకుంటే 2024 గత రికార్డును బ్రేక్ చేసే చాన్సుంది!! -
CNG-Powered Bike: ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్ (ఫొటోలు)
-
సీఎన్జీ బైక్ రేపే విడుదల.. పేరు తెలిసిపోయింది!!
దేశంలో మొట్టమొదటి సీఎన్జీ బైక్ శుక్రవారం విడుదలవుతోంది. బజాజ్ ఆటో లిమిటెడ్ తన మొట్టమొదటి సీఎన్జీ, పెట్రోల్ హైబ్రిడ్ మోటార్‌సైకిల్‌ను 'ఫ్రీడమ్ 125' పేరుతో విడుదల చేసే అవకాశం ఉంది.బజాజ్ సీఎన్జీ బైక్ పేరు 'బ్రూజర్' అని ఇంతకుముందు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా బజాజ్ ఆటో వెబ్సైట్లో పేరు లీక్ అయింది. 'ఫ్రీడమ్ 125'ని రెండు వేరియంట్లలో ఒకటి సాధారణ మోడల్, మరొకటి ప్రీమియం మోడల్లో విడుదల చేయాలని బజాజ్ ఆటో భావిస్తోంది. ఇందులో మరిన్ని కలర్ ఆప్షన్స్, ఫీచర్లు ఉండనున్నాయి.బజాజ్ ఆటో నుంచి వస్తున్న ఈ డ్యూయల్ ఫ్యూయల్ మోటార్‌సైకిల్‌లో పెట్రోల్ నుంచి సీఎన్జీకి అలాగే సీఎన్జీ నుంచి పెట్రోల్‌కు ఎప్పుడైనా మారేందుకు కంట్రోల్ బటన్ ఉంటుంది. ఇతర అంశాలలో రౌండ్ ఎల్ఈడీ హెడ్‌లైట్, మరింత ప్రాక్టికాలిటీని అందించే ఫ్లాట్ సీటు ఉన్నాయి.ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 'బజాజ్ బియాండ్' ఈవెంట్ సందర్భంగా, ఈ మోటార్‌సైకిల్ ధర రూ. 80,000 నుంచి రూ. 90,000 మధ్య ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఇది ఎంట్రీ-లెవల్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్లో పోటీ ఎంపికగా మారింది. తమ రాబోయే ఉత్పత్తుల కోసం బజాజ్ ఇంతకుముందు గ్లైడర్, మారథాన్, ట్రెక్కర్, ఫ్రీడమ్ అని నాలుగు వేర్వేరు పేర్లను ట్రేడ్‌మార్క్ చేసింది. -
ఐపీవోకు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 7,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవోలో భాగంగా రూ. 4,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో రూ. 3,000 కోట్ల విలువైన షేర్లను మాతృ సంస్థ బజాజ్ ఫైనాన్స్ విక్రయానికి ఉంచనుంది. ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు సన్నాహాలు ప్రారంభించింది. ఎగువ స్థాయి(అప్పర్ లేయర్) ఎన్‌బీఎఫ్‌సీగా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ 2025 సెపె్టంబర్‌కల్లా పబ్లిక్ ఇష్యూ చేపట్టవలసి ఉంది. కాగా.. భవిష్యత్ అవసరాలరీత్యా ఐపీవో నిధులను మూలధన పటిష్టతకు వినియోగించనుంది. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ వద్ద 2015లోనే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రిజిస్టర్ అయ్యింది. డిపాజిట్లు స్వీకరించని హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీగా కొనసాగుతోంది. రెసిడెన్షియల్, కమర్షియల్ ఆస్తుల కొనుగోలు, ఆధునీకరణ తదితరాలకు ఆర్థిక సహకారాన్ని అందిస్తోంది. ఆర్బీఐ వద్ద అప్పర్ లేయర్ ఎన్‌బీఎఫ్‌సీగా గుర్తింపు పొందింది. గృహ రుణాలు, మారి్టగేజ్, లీజ్ రెంటల్ డిస్కౌంటింగ్ తదితర సేవలు సమకూర్చుతోంది. గత ఆర్థిక సంవత్సరం(2023–24)లో 38 శాతం వృద్ధితో రూ. 1,731 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇటీవల గృహ రుణ కంపెనీలు ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండియా షెల్టర్ ఫైనాన్స్ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన సంగతి తెలిసిందే. -
పడగొట్టిన రిలయన్స్, హెచ్డీఎఫ్సీ
ముంబై: అధిక వెయిటేజీ రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. క్యూ3 ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో బజాజ్ ద్వయం, ఐటీసీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫెడరల్ ద్రవ్య విధాన వైఖరి వెల్లడి(బుధవారం)కి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ఫలితంగా స్టాక్ సూచీలు మంగళవారం ఒక శాతం పతనమయ్యాయి. సెన్సెక్స్ 802 పాయింట్లు నష్టపోయి 71,140 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 215 పాయింట్లు క్షీణించి 21,522 వద్ద నిలిచింది. ఉదయం స్తబ్ధుగా మొదలైన సూచీలు అమ్మకాల ఒత్తిడితో రోజంతా నష్టాల్లో కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్ 866 పాయింట్లు క్షీణించి 71,076 వద్ద, నిఫ్టీ 236 పాయింట్లు పతనమై 21,502 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు, రియల్టీ, మీడియా షేర్లకు మాత్రమే స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. కన్జూమర్ డ్యూరబుల్స్, క్యాపిటల్ గూడ్స్, విద్యుత్, ఎఫ్ఎంసీజీ, యుటిలిటీ, పారిశ్రామిక రంగాల షేర్లలో విక్రయాలు నెలకొన్నాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ సూచీలు 0.53%, 0.18% చొప్పున నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,971 కోట్ల షేర్లను విక్రయించారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1003 కోట్ల షేర్లను కొన్నారు. ఫెడ్ పాలసీ వెల్లడికి ముందు అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడయ్యాయి. ఇతర ముఖ్యాంశాలు... జీవితకాల గరిష్ట స్థాయి (రూ.2,918) వద్ద రిలయన్స్ షేరులో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. బీఎస్ఈలో ఈ షేరు 3% నష్టపోయి రూ.2815 వద్ద స్థిరపడింది. మంగళవారం ట్రేడింగ్‌లో 7% ర్యాలీ చేసింది. మరో అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లలోనూ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. దీంతో ఈ ప్రైవేట్ రంగ దిగ్గజం దాదాపు 1% నష్టపోయి రూ.1444 వద్ద ముగిసింది. ► క్యూ3 ఆర్థిక ఫలితాలు మెప్పించకపోవడంతో బజాజ్ ఫైనాన్స్ షేరు 5% నష్టపోయి రూ.6,815 వద్ద నిలిచింది. షేరు 5% క్షీణతతో మార్కెట్ విలువ రూ. 22,984 కోట్లు హరించుకుపోయి రూ.4.21 లక్షల కోట్లకు దిగివచ్చింది. బజాజ్ ఫైనాన్స్ పతనంతో ఇదే గ్రూప్ చెందిన బజాజ్ ఫిన్సర్వ్ షేరూ అమ్మకాల ఒత్తిడికి లోనైంది. బీఎస్ఈలో ఈ షేరు 3% నష్టపోయి రూ.1591 వద్ద నిలిచింది. ► ఐటీసీ డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాల అంచనాలను అందుకోలేకపోవడంతో షేరు 3% నష్టపోయి రూ.438 వద్ద నిలిచింది. ►లిస్టింగ్ రోజే ఈప్యాక్ డ్యూరబుల్ షేరు 10% నష్టపోయింది. ఇష్యూ ధర (రూ.230)తో బీఎస్ఈలో 2% డిస్కౌంట్‌తో రూ.225 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 11% పతనమై రూ.206 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరికి 10% నష్టంతో రూ.208 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1,990 కోట్లుగా నమోదైంది. ► మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా టాటా మోటార్స్–డీవీఆర్‌తో కలుపుకొని టాటా మోటార్స్ కంపెనీ మారుతీ సుజుకీని అధిగమించి అటో రంగంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. బుధవారం టాటా మోటార్స్ షేరు 2% పెరిగి రూ.859 వద్ద, టాటా మోటార్స్–డీవీఆర్ షేరు 1.63% లాభపడి రూ.573 వద్ద ముగిశాయి. ► బీఎల్ఎస్ ఈ–సర్విసెస్ ఐపీఓకు తొలిరోజు 15.63 రెట్ల అధిక స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 1.37 కోట్ల షేర్లను జారీ చేయగా 21.41 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. రిటైల్ కోటా 49.రెట్లు, సంస్థాగతేతర విభాగం 29.66 రెట్లు, క్యూబీఐ కోటా 2.19 రెట్లు సబ్‌స్రై్కబ్ అయ్యాయి. -
బజాజ్ చేతక్ ప్రీమియం బైక్ వచ్చేస్తోంది.. ఎలా ఉందో చూశారా?
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ బజాజ్ శుక్రవారం చేతక్ అర్బేన్, ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేయనుంది. అయితే ఈ బైక్ ధరలు ప్రస్తుతం ఈవీ మార్కెట్లో లీడింగ్‌లో ఉన్న ఓలా, ఎథేర్ ఈవీ స్కూటర్ల కంటే తక్కువేనని తెలుస్తోంది. ఓలా ఎస్1 ప్రో (రూ1,47,499), ఎథేర్ 450 ఎక్స్ (రూ.1,37,999) ధరలు ఇలా ఉండగా చేతక్ అర్బేన్ ధర రూ.1.15లక్షలు, చేతక్ ప్రీమియం ఎక్స్ షోరూం ధర రూ.1.35లక్షలుగా ఉంది. బజాజ్ సంస్థ 2019లో తొలిసారి చేతక్ ఎలక్ట్రిక్ బైక్‌లను మార్కెట్‌కు పరిచయం చేసింది. నాటి నుంచి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 140 నగరాల్లో లక్షకు పైగా వెహికల్స్‌ను అమ్మింది. ఇక తాజాగా విడుదల చేయనున్న రెండు వేరియంట్లలో 3.2 కేడబ్ల్యూ బ్యాటరీతో రానుంది. 127 కిలోమీటర్ల రేంజ్ వరకు ప్రయాణించచ్చు. అదనంగా చేతక్ ప్రీమియంలో 800 డబ్ల్యూ ఛార్జర్‌తో రానుంది. ఈ సదుపాయంతో చేతక్ ను 30 నిమిషాల్లో 15.6 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించవచ్చు. టాప్ స్పీడ్ గంటకు 73 కిలోమీటర్లు వరకు ప్రయాణించ్చు. ఇక ఈ బైక్‌లో బ్లూటూత్, యాప్ కనెక్టివిటీ, నోటిఫికేషన్ అలెర్ట్‌ల కోసం కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. కొత్త టీఎఫ్టీ స్క్రీన్ బ్లూటూత్ కనెక్టివిటీ, యాప్ ఆధారిత టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్/ఎస్ఎంఎస్/మ్యూజిక్ అలర్ట్‌లు, రిమోట్ ఇమ్మొబిలైజేషన్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్)ని అనుసంధానం చేస్తుందని భావిస్తున్నారు. కాగా ఈవీ మార్కెట్లో ఓలా ఎస్1 ప్రో, ఎథేర్ 450 ఎక్స్, సింపుల్ వన్లు.. బజాజ్ చేతక్‌తో పోటీ పడనున్నాయి. -
లాభాలు ఒకరోజుకే పరిమితం
ముంబై: దేశీయ స్టాక్ సూచీల లాభాలు ఒక్కరోజుకే పరిమితమయ్యాయి. బలహీన జాతీయ అంతర్జాతీయ సంకేతాలతో బుధవారం సెన్సెక్స్, నిఫ్టీలు ఒకశాతం మేర నష్టపోయాయి. మార్జిన్ల క్షీణత ఆందోళనలతో బ్యాంకింగ్, ఫైనాన్స్ కంపెనీల షేర్లలో పెద్ద ఎత్తున అమ్మకాలు నెలకొన్నాయి. అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ద్వయం, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 3–1% క్షీణించి సూచీల పతనాన్ని శాసించాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల అనూహ్య పెరుగుదల, అమెరికా వడ్డీ రేట్ల పెంపు అంచనాల భయాలు, పశి్చమాసియా దేశాల్లోని యుద్ధ పరిస్థితుల పరిణామాలు ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా బుధవారం సెన్సెక్స్ 551 పాయింట్లు నష్టపోయి 66 వేల స్థాయి దిగువన 65,877 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 140 పాయింట్లు నష్టపోయి 19,671 వద్ద నిలిచింది. ఉదయం స్వల్పలాభాలతో మొదలైన సూచీలు వెంటనే నష్టాల్లోకి మళ్లాయి. ఫార్మా, ఆటో షేర్లు మినహా అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో సూచీలు ఏ దశలో కోలుకోలేదు. ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 586 పాయింట్లు క్షీణించి 65,842 వద్ద, నిఫ్టీ 151 పాయింట్లు పతనమై 19,660 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.85%, 0.32% చొప్పున నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,832 కోట్ల ఈక్విటీ షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1,470 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియా, యూరప్ మార్కెట్లు అరశాతం నుంచి ఒకశాతం నష్టపోయాయి. కాగా అమెరికా మార్కెట్లు అరశాతానికి పైగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ‘‘బలహీన అంతర్జాతీయ సంకేతాలు, పశ్చిమాసియా దేశాల్లోని అనిశ్చిత పరిణామాలు దేశీయ మార్కెట్లో లాభాల స్వీకరణకు పురిగొల్పాయి. క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో ఉద్రికత్తలు మరింత ఎక్కువయ్యాయి. ఫెడ్ చైర్మన్ ప్రసంగానికి ముందు ఎఫ్ఐఐలు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు పాల్పడ్డారు. దేశీయ ఐటీ, ఫైనాన్స్ రంగ కంపెనీల క్యూ2 ఆర్థిక ఫలితాలు మెప్పించకపోవడం ఇన్వెస్టర్లను మరింత నిరాశపరిచింది’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జెసానీ తెలిపారు. ► సెప్టెంబర్ క్వార్టర్లో నికరలాభం 28% క్షీణించడంతో బీఎస్ఈలో బజాజ్ ఫైనాన్స్ షేరు 3% నష్టపోయి రూ.7,871 వద్ద స్థిరపడింది. ఫలితంగా కంపెనీ ఒక్కరోజులో రూ.13,345 కోట్ల మార్కెట్ విలువను కోల్పోయింది. ► యాజమాన్యం ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు ఆదాయ వృద్ధి అంచనాలు తగ్గించడంతో ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్ షేరు 6% క్షీణించి రూ.4,354 వద్ద స్థిరపడింది. ► జెన్సార్ టెక్నాలజీ క్యూ2 ఆర్థిక ఫలితాలు నిరాశపరడంతో కంపెనీ 6% నష్టపోయి రూ. 517 వద్ద స్థిరపడింది. ► సెన్సెక్స్ సూచీలోని 30 షేర్లకు గానూ టాటా మోటార్స్ 2%, సన్ ఫార్మా 1.50%, మారుతీ 0.50% షేర్లు మాత్రమే లాభపడ్డాయి. సూచీ ఒకశాతం పతనంతో ఇన్వెస్టర్లకు ఒక్కరోజులో రూ.2.42 లక్షల కోట్ల నష్టంవాటిల్లింది. బీఎస్ఈలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.321.40 లక్షల కోట్లకు దిగివచి్చంది. -
వచ్చే రెండేళ్లలో మరో 1,000 శాఖలు - సంజీవ్ బజాజ్
ముంబై: బజాజ్ ఫైనాన్స్ సూక్ష్మ రుణాలు, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎస్ఎంఈ), నాలుగు చక్రాల వాహనాలు, ట్రాక్టర్లకు రుణాలు ఇచ్చే వ్యాపారంలోకి అడుగు పెట్టనుంది. అలాగే, వచ్చే రెండేళ్లలో మరో 1,000 శాఖలను తెరవనున్నట్టు చైర్మన్ సంజీవ్ బజాజ్ తెలిపారు. బజాజ్ ఆటో కస్టమర్లకు రుణాలు ఇవ్వడం ద్వారా ద్విచక్ర వాహన ఫైనాన్స్‌లోకి అడుగు పెట్టామని, ఆ తర్వాత కన్జ్యూమర్ ఫైనాన్స్‌లోకి, అనంతరం ప్రాపర్టీపై రుణాలు ఇవ్వడంలోకి ప్రవేశించినట్టు చెప్పారు. ఇప్పుడు సూక్ష్మ రుణాలు, ఎంఎస్ఈ, ఇతర వాహన రుణాల విభాగంలోకి ప్రవేశించనున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం తమకు 4,000 శాఖలు ఉండగా, వచ్చే రెండేళ్లలో వీటి సంఖ్యను 5,000కు చేర్చనున్నట్టు పేర్కొన్నారు. 2008లో ఈ సంస్థ సేవలు ప్రారంభించగా, ప్రస్తుతం 4 కోట్ల కస్టమర్లను కలిగి ఉన్నట్టు సంజీవ్ బజాజ్ తెలిపారు. ఈ కాలంలో సంస్థ మార్కెట్ విలువ 450 రెట్లు పెరిగినట్టు చెప్పారు. రుణ ఆస్తులు 250 రెట్లు పెరిగి రూ.3 లక్షల కోట్లకు చేరినట్టు తెలిపారు. -
బజాజ్ గుడ్ న్యూస్:100 శాతం ప్యూర్ హెన్నా
ముంబై: బజాజ్ కన్జ్యూమర్ కేర్ 100 శాతం స్వచ్ఛమైన హెన్నా ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. అత్యధిక నాణ్యమైన హెన్నా ఆకుల నుంచి దీన్ని తయారు చేశామని, ఎలాంటి రసాయనాలు వాడలేదని సంస్థ ప్రకటించింది. నూరు శాతం సహజసిద్ధ సురక్షితమైన ఉత్పత్తి అని పేర్కొంది. ఇదీ చదవండి: వైట్‌హౌస్ డిన్నర్‌కోసం కడుపు మాడ్చుకున్నా..ఆసాంతం అద్భుతం: ఆనంద్ మహీంద్ర చేతులు, పాదాలకు సైతం వినియోగించుకోవచ్చని తెలిపింది. శిరోజాలకు మంచి కండీషన్‌తోపాటు సహజ రంగును ఇస్తుందని పేర్కొంది. తమ కస్టమర్లకు వినూత్నమైన, సహజ, సురక్షితమైన ఉత్పత్తులు అందించాలన్న నిబద్ధతకు ఈ ఉత్పత్తి నిదర్శనమని బజాజ్ కన్జ్యూమర్ కేర్ ఎండీ జైదీప్ నంది ప్రకటించారు. 25 గ్రాముల ప్యాకెట్ ధర రూ.10 కాగా, 75 గ్రాముల ధర రూ.35గా సంస్థ నిర్ణయించింది. రూ. 10వేల కోట్ల సుందర్ పిచాయ్ లగ్జరీ భవనం (ఫోటోలు) -
కొత్త వ్యాపారం ప్రారంభించిన బజాజ్
ముంబై: మ్యూచువల్ ఫండ్స్ వ్యాపారంలోకి బజాజ్ ఫిన్సర్వ్ అడుగు పెట్టింది. వచ్చే కొన్నేళ్లలో పెద్ద సంస్థగా అవతరించాలనే లక్ష్యంతో ఉన్నట్టు ప్రకటించింది. ఈ నెలాఖరులోపు లిక్విడ్, మనీ మార్కెట్ తదితర మూడు ఫిక్స్డ్ ఇన్కమ్ (స్థిరాదాయ/డెట్) పథకాలను ప్రారంభించనున్నట్టు తెలిపింది. ఆ తర్వాత కొన్ని రోజులకు నియంత్రణ సంస్థ అనుమతితో మరో 4 కొత్త పథకాలను తీసుకురానున్నట్టు గ్రూప్ చైర్మన్, ఎండీ సంజీవ్ బజాజ్ ప్రకటించారు. ఇప్పటికే మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో 42 సంస్థలు ఉన్నాయి. తమ గ్రూపు పరిధిలో ఎనిమిది సబ్సిడరీలు ఉన్నాయని, 7 కోట్ల మంది కస్టమర్లకు ఆర్థిక ఉత్పత్తులను అందిస్తున్నట్టు సంజీవ్ చెప్పారు. -
బజాజ్ అలియెంజ్ నుంచి బోనస్
ముంబై: ప్రయివేట్ రంగ సంస్థ బజాజ్ అలియెంజ్ గత ఆర్థిక సంవత్సరానికి (2022 - 23) గాను పాలసీదారులకు రూ. 1,201 కోట్ల విలువైన బోనస్ ప్రకటించింది. వెరసి అర్హతగల పార్టిసిపేటింగ్ పాలసీదారులకు వరుసగా 22వ ఏడాదిలోనూ బోనస్ చెల్లింపులను చేపట్టనున్నట్లు తెలియజేసింది. తాజా బోనస్‌లో రెగ్యులర్ రివర్షనరీ బోనస్ రూ. 872 కోట్లు, టెర్మినల్, క్యాష్ బోనస్ రూ. 329 కోట్లు కలసి ఉన్నట్లు వెల్లడించింది. అంతక్రితం ఏడాది (2021 - 22) రూ. 11.62 లక్షలకుపైగా పాలసీదారులకు రూ. 1,070 కోట్ల బోనస్ చెల్లించింది. -
డామినర్ 400 పై భారీ డిస్కౌంట్.. బజాజ్ ప్రేమికులకు పండగే
భారత ప్రభుత్వం 2023 ఏప్రిల్ నుంచి బిఎస్6 2 ఉద్గార నిబంధలను మరింత కఠినంగా అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఇదే సమయంలో వాహన తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను విక్రయించడానికి, కస్టమర్లను ఆకర్షించడానికి భారీ డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నాయి. దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'బజాజ్ డామినర్ 400' మీద కంపెనీ ఇప్పుడు రూ. 25,000 డిస్కౌంట్ ప్రకటించింది. ఇప్పటికే ఉన్న బిఎస్6 స్టాక్ క్లియర్ చేయడానికి కంపెనీ ఈ ఆకర్షణీయమైన ఆఫర్ తీసుకువచ్చింది. దీనితో పాటు తక్కువ డౌన్ పేమెంట్ స్కీమ్ కూడా అందుబాటులో ఉంది. బజాజ్ కంపెనీ అందిస్తున్న ఈ డిస్కౌంట్ వల్ల డామినార్ 400 రూ. 1,99,991 (ఎక్స్-షోరూమ్) వద్ద లభిస్తుంది. బిఎస్6 స్టాక్ క్లియర్ చేయడమే కాకుండా కంపెనీ యొక్క అమ్మకాలను పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. బజాజ్ డామినర్ 400 రూ. 1.36 లక్షల వద్ద 2016లో విడుదలైంది. బజాజ్ డామినార్ 400 మోటార్‌సైకిల్ 373 సీసీ సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్, డిఓహెచ్సి ఇంజన్ కలిగి 39.4 బిహెచ్పి పవర్, 35 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. అదే సమయంలో ఈ బైక్ 43 మిమీ యుఎస్డి ఫోర్క్స్, 110 మిమీ ట్రావెల్‌తో మోనోశాక్ పొందుతుంది. బజాజ్ డామినార్ 400 బ్రేకింగ్ విషయానికి వస్తే, ఈ బైక్ ముందువైపు 320 మిమీ డిస్క్ బ్రేక్స్, వెనుక వైపు 230 మిమీ డిస్క్ బ్రేక్స్ అందుబాటులో ఉంటాయి. ఇందులో మెరుగైన బ్రేకింగ్ కోసం డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ కూడా సఫోర్ట్ చేస్తుంది. -
మిలియన్ యూనిట్ల తయారీ మైలురాయి దాటిన కేటీఎం
హైదరాబాద్: ప్రపంచంలో నెంబర్ 1 ప్రీమియం మోటార్ సైకిల్ బ్రాండ్ కేటీఎం భారతదేశంలో మిలియన్ యూనిట్ల తయారీ మైలురాయిని అధిగమించింది. పుణేలోని బజాజ్ చకన్ ప్లాంట్ నుండి 1 మిలియన్ కేటీఎం మోటార్ సైకిల్– కేటీఎం అడ్వెంచర్ 390 విడుదలైంది. రికార్డు బైక్ ఆవిష్కరణ కార్యక్రమంలో బజాజ్ ఆటో ఎండీ, సీఈఓ రాజీవ్ బజాజ్, పియరర్ మొబిలిటీ ఏజీ (కేటీఎం మాతృ సంస్థ) సీఈఓ స్టీఫన్ పీరర్ (ఫొటోలో ఎడమ నుంచి కుడికి) తదితరులు పాల్గొన్నారు. ఆస్ట్రియన్ బ్రాండ్ కేటీఎం తన సబ్–400 సీసీ మోటార్‌సైకిళ్ల దేశీయ, ఎగుమతి యూనిట్ల తయారీకి బజాజ్ ఆటోతో భాగస్వామ్యాన్ని కొనసాగిస్తోంది. కేటీఎం ఇండియా 2014లో 1,00,000వ మోటార్‌సైకిల్‌ను, 2020లో 5,00,000వ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. కేవలం మరో మూడేళ్ల వ్యవధిలోనే కీలక మిలియన్ మైలురాయికి చేరుకోవడం గమనార్హం. చదవండి: Union Budget 2023: కేంద్రం శుభవార్త.. రైతులకు ఇస్తున్న సాయం పెంచనుందా! -
ఈవీల్లో అన్ని విభాగాల్లోకి వస్తాం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో అన్ని విభాగాల్లోకి ఎంట్రీ ఇస్తామని అర్బనైట్ వెల్లడించింది. ఎలక్ట్రిక్ వాహనాలను అర్బనైట్ బ్రాండ్‌లో బజాజ్ ఆటో ఆఫర్ చేస్తోంది. ఈ–టూ వీలర్స్‌లో ఏటా ఒక కొత్త మోడల్‌ను పరిచయం చేయాలన్నది బజాజ్ లక్ష్యమని అర్బనైట్ ప్రెసిడెంట్ ఎరిక్ వాస్ సాక్షి బిజినెస్ బ్యూరోకు బుధవారం తెలిపారు. ‘ఇందుకు అనుగుణంగా నూతన ఉత్పాదనలను అభివృద్ధి చేస్తున్నాం. చేతక్ లేదా ఇతర పేర్లతోనూ వాహనాలు రావొచ్చు. ఈవీ వ్యాపారం ఒక దీర్ఘకాలిక క్రీడ. ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ ద్విచక్ర వాహనాల అమ్మకాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ టూ వీలర్ల వాటా గతేడాది 9 శాతం. ఇప్పుడిది ఏకంగా 20 శాతానికి చేరింది. రెండేళ్లలో మొత్తం స్కూటర్ల విక్రయాల్లో 70 శాతం ఎలక్ట్రిక్ కైవసం చేసుకుంటుంది’ అని వెల్లడించారు. చేతక్ శకం మళ్లీ వస్తుంది.. నాణ్యతలో రాజీపడని కస్టమర్ల తొలి ప్రాధాన్యత చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని ఎరిక్ అన్నారు. ‘బ్రాండ్‌ను నిలబెట్టడానికి మన్నిక, సాంకేతికత, ఇంజనీరింగ్ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఎలక్ట్రిక్ త్రీ, ఫోర్ వీలర్ల విభాగంలోకి రాలేమని చెప్పలేను. చేతక్ అంటే అంచనాలు ఎక్కువ. సామాన్యుడి వాహనంగా వినుతికెక్కిన చేతక్ శకం మళ్లీ వస్తుంది. మొబిలిటీ కంపెనీ యూలు వినియోగిస్తున్న 10,000 పైచిలుకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ప్రత్యేకంగా తయారు చేసి సరఫరా చేశాం. మొబిలిటీని ఒక సేవగా దేశంలో ప్రోత్సహిస్తాం’ అని వివరించారు. ఎలక్ట్రిక్ టూవీలర్లను అద్దె ప్రాతిపదికన బెంగళూరు, ముంబై, ఢిల్లీలో యూలు ఆఫర్ చేస్తోంది. కాగా, నెలకు 200లకుపైగా చేతక్ స్కూటర్లను విక్రయిస్తున్నట్టు శ్రీ వినాయక మోబైక్స్ ఎండీ కె.వి.బాబుల్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో చేతక్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు మూడు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. -
ఆకట్టుకునేలా స్పోర్టీ లుక్‌లో పల్సర్ పీ150: ధర ఎంతంటే?
సాక్షి,ముంబై: బజాజ్ కంపెనీ దేశీయ మర్కెట్లో సరి కొత్త పల్సర్ స్పోర్ట్స్ బైక్‌ను లాంచ్ చేసింది. యూత్ క్రేజ్‌కు అనుగుణంగా కొత్తగా అప్డేట్ చేసి స్పోర్టీ లుక్‌లో పల్సర్ పీ150 బైక్‌ను ఆవిష్కరించింది. రేసింగ్ రెడ్, ఎబోనీ బ్లాక్ బ్లూ, ఎబోనీ బ్లాక్ వైట్, ఎబోనీ బ్లాక్ రెడ్, కరేబియన్ బ్లూ అనే 5 రంగుల్లో ఈబైక్ అందుబాటులోకి వచ్చింది. ధర: సింగిల్-డిస్క్, సింగిల్ సీట్ కలిగిన బైక్ ధర రూ.1.16 లక్షలు (ఎక్స్-షోరూమ్) అలాగే ట్విన్-డిస్క్, స్లిట్ సీట్ మోడల్ ధరను రూ.1,19,757 ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించింది కంపెనీ. ఇంజీన్, ఫీచర్లు 149 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ 8500 ఆర్పీఎమ్ వదర్ద 14.5 హెచ్‌పీని, 13.5Nm టార్క్‌ను విడుదల చేస్తుంది ఈ బైకులో యూఎస్బీ మొబైల్ చార్జింగ్ పోర్ట్, గేర్ ఇండికేటర్, సింగిల్ చానల్ ఏబీఎస్ బ్రేకింగ్ టెక్నాలజీ వంటి అధునాతన ఫీచర్లను తోపాటు,స్ప్లిట్ గ్రాబ్ రైల్, క్లిప్-ఆన్ బార్లు చ స్ప్లిట్ సీట్ సెటప్ డ్యూయల్-డిస్క్ వెర్షన్‌తో డిజైన్ మరింత ఆకర్షణీయంగా తీర్చి దిద్దింది. వెనకాల సీట్ కాస్త హైట్ ఇచ్చి . LED DRLలు , LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇతర ఫీచర్లుగా ఉన్నాయి. ఇక పోటీ విషయానికి వస్తే బజాజ్ పల్సర్ P150 హోండా యునికార్న్, హోండా ఎక్స్-బ్లేడ్ , సుజుకి జిక్సర్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. -
బజాజ్ ఎలక్ట్రికల్స్ లాభం రూ.62 కోట్లు
న్యూఢిల్లీ: ఎలక్ట్రికల్ ఉత్పత్తులు, ఉపకరణాల తయారీ దిగ్గజం బజాజ్ ఎలక్ట్రికల్స్ సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో రూ.62 కోట్ల నికరలాభం ఆర్జించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.62.5 కోట్లు నమోదు చేసింది. టర్నోవర్ 6.81 శాతం తగ్గి రూ.1,159 కోట్లుగా ఉంది. కన్జూమర్ ప్రొడక్ట్స్ ఆదాయం 2.45 శాతం తగ్గి రూ.883 కోట్లు, లైటింగ్ సొల్యూషన్స్ విభాగం 3.73 శాతం క్షీణించి రూ.276 కోట్లు, ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ సెగ్మెంట్ 39.4 శాతం పడిపోయి రూ.67 కోట్లకు వచ్చి చేరింది. ఆర్డర్ బుక్ అక్టోబర్ 1 నాటికి రూ.1,554 కోట్లు ఉందని కంపెనీ వెల్లడించింది. క్రితం ముగింపుతో పోలిస్తే బజాజ్ ఎలక్ట్రికల్స్ షేరు ధర బీఎస్ఈలో మంగళవారం 0.47 శాతం పెరిగి రూ.1,158.55 వద్ద స్థిరపడింది. -
రూ.2,500 కోట్ల షేర్లను బైబ్యాక్ చేశాం, బజాజ్ ఆటో ప్రకటన
న్యూఢిల్లీ: బజాజ్ ఆటో తన వాటాదారుల నుంచి 64,09,62 షేర్లను బైబ్యాక్ చేసింది. ఇందుకు రూ.2,500 కోట్లు వెచ్చించినట్టు ప్రకటించింది. జూలై 4న బజాజ్ ఆటో షేర్ల బైబ్యాక్‌ను ప్రారంభించింది. సోమవారం సమావేశమైన బైబ్యాక్ కమిటీ, అక్టోబర్ 10తో బైబ్యాక్ ముగించేందుకు ఆమోదం తెలిపినట్టు పేర్కొంది. బహిరంగ మార్కెట్లో ఒక్కో షేరును రూ.4,600కు మించకుండా కొనుగోలు చేయా లని ఈ ఏడాది జూన్ 27న బజాజ్ ఆటో నిర్ణయించడం గమనార్హం. బైబ్యాక్ తర్వాత ప్రమోటర్లు, ప్రమోటర్ల గ్రూపు మొత్తం వాటా 53.77 శాతం నుంచి 54.98 శాతానికి పెరిగింది. -
ఎల్ఐసీ, బజాజ్ హౌసింగ్ సంస్థల రుణ రేట్లు పెంపు
ముంబై: ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు తమ గృహ రుణ రేటును 50 బేసిస్ పాయింట్ల (0.50 శాతం) వరకూ పెంచాయి. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ విషయానికి వస్తే, అరశాతం వడ్డీ పెంపుతో వేతనం, వృత్తి పరమైన వ్యక్తులకు గృహ రుణ రేటు 7.70 శాతంగా ఉండనుంది. ఇక ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ప్రైమ్ లెండింగ్ 7.50 శాతం నుంచి 8 శాతానికి చేరింది. -
బజాజ్ సీటీ 125 ఎక్స్.. బోలెడు ఫీచర్లతో పాటు చార్జింగ్ సాకెట్ కూడా!
ఆటోమొబైల్ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న బజాజ్ త్వరలో దేశీయ మార్కెట్లోకి సీటీ 125 ఎక్స్(CT125X) పేరుతో కొత్త బైక్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ బైక్ ప్రస్తుతం ఉన్న CT110X కమ్యూటర్ బైక్ కంటే ఎత్తు కాస్త ఎక్కువగా ఉండబోతున్నట్లు సమాచారం. సీటీ 110ఎక్స్ తరహాలో రూపొందించిన ఈ బైక్ ఫీచర్ జాబితాను అప్డేట్ చేయడంతో పాటు బైక్ ఎక్స్టీరియర్ని కూడా కొత్త రంగులతో నింపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీని ధరను కస్టమర్లకు అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది బజాబ్. ప్రత్యేకతలు(అంచనా) ఇందులో.. టైల్లైట్ , టర్న్ ఇండికేటర్ల కోసం హాలోజన్ బల్బులు ఉన్నాయి. ట్యాంక్ గ్రిప్ ప్యాడ్లు, సీట్ కవర్, లగేజ్ క్యారియర్, అండర్ బెల్లీ ప్రొటెక్టర్ ప్లేట్ వంటివి ఫీచర్లు సాధారణ బైక్‌కు కాస్త భిన్నంగా దీన్ని నిలబెడుతుంది. ఇది కొత్త 125 సింగిల్-సిలిండర్ ఇంజన్‌తో రాబోతున్నట్లు సమాచారం. మరో ప్రత్యేకత ఏంటంటే సీటీ 125 ఎక్స్ తరహాలో ఉండే ఈ కొత్త బైక్‌లో మొబైల్ చార్జింగ్ సాకెట్ కూడా ఉంటుంది. దీంతో మనం బైక్‌పై ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా మొబైల్ ఫోన్‌ను చార్జింగ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ బైక్ సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో లేనప్పటికీ త్వరలో పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. సుదీర్ఘకాలంగా బజాజ్.. 125 సీసీ సెగ్మెంట్ బైక్‌లు విడుదల చేయలేదు. అందుకే ఈ సెగ్మెంట్లో పట్టు పెంచుకునేందుకు సీటీ 125 ఎక్స్ బైక్‌ను మార్కెట్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం బజాజ్ సీటీ 110 ఎక్స్ ధర రూ.66 వేలు ఉండగా బజాజ్ సీటీ 125ఎక్స్ ధర దీనిపై అదనంగా 10 నుంచి 15 వేలు మధ్యలో ఉండనున్నట్లు సమాచారం. చదవండి: భయమేస్తోంది! చార్జింగ్ పెట్టిన గంటకే పేలిన ఎలక్ట్రికల్ బైకులు -
లక్ష రూపాయల లోపు లభించే సూపర్‌బైక్స్ ఇవే!
సాక్షి, ముంబై: 190 మిలియన్లకు పైగా వాహనాలతో ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్‌గా నిలస్తోంది ఇండియా. ముఖ్యంగా హోండా,హీరో, బజాజ్, టీవీఎస్ లాంటి కంపెనీలతోపాటు బీఎండబ్ల్యూ లాంటి లగ్జరీ బైక్‌లో మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఎక్కువ మైలేజీ, స్మార్ట్ ఫీచరలతో లభించే ట్రెండీలుక్స్తో సరసమైన ధరలో లభించే బైక్స్‌పై కొనుగోలుదారులు ఆసక్తి ఎక్కువ ఉంటుంది. ఈ నేపథ్యంలో లక్ష రూపాయలలోపు ధరలో అందుబాటులోఉన్న బైక్‌లపై ఓ లుక్కేద్దాం. హోండా ఎస్పీ125 బీఎస్-6 నిబంధనలకుఅనుగుణంగా వచ్చిన హోండా తొలి బైక్ హోండా ఎస్పీ 125. ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్‌తో కూడిన BS6 కంప్లైంట్ 125cc ఇంజన్‌తో10.5bhp గరిష్ట శక్తిని 10.3Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈబైక్ రెండు వేరియంట్లలో, 5 కలర్స్‌లో లభిస్తోంది. ప్రారంభ ధర రూ. 82,243 (ఎక్స్-షోరూమ్) హీరో గ్లామర్ హీరోకు చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన బైక్‌లలో ఒకటి హీరో గ్లామర్ ..124.7cc ఇంజన్‌తో పనిచేస్తుంది.ఇది 10.72 bhp శక్తిని, 10.6 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బీఎస్-6 కంప్లైంట్ మోడల్‌తో చిన్న మార్పులతో మేక్ఓవర్ అయిన ఈ బైక్ ప్రారంభ ధర రూ.78,753 హీరో గ్లామర్ 12 వేరియంట్లు,13 కలర్ ఆప్షన్లలో లభ్యం. హోండా షైన్ హోండా షైన్ కూడా ఈ సెగ్మెంట్లో చాలా పాపులర్ బైక్. 124cc సింగిల్ సిలిండర్ఎయిర్-కూల్డ్ ఇంజన్‌తో పనిచేస్తుంది. 10 bhp , 11 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 6 కలర్ ఆప్షన్లలో లభ్యమవుతున్న హోండా షైన్ ధర రూ.77,338 (ఎక్స్-షోరూమ్) హీరో సూపర్ స్ప్లెండర్ హీరో ఐకానిక్ బైక్ స్ప్లెండర్ ప్రీమియం వెర్షన్ హీరో సూపర్ స్ప్లెండర్. ఇది 124.7సీసీ ఇంజన్ 10.72 bhp, 10.6 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రారంభ ధర రూ. 77,939 . టీవీఎస్ రైడర్ 125 టీవీఎస్ రైడర్ 125 124.8cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, త్రీ-వాల్వ్ ఇంజన్‌తో 11.2 bhp శక్తిని , 11.2 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. 4 కలర్స్, 3 వేరియంట్లలో లభ్యం. అద్భుతమైన డిజైన్‌తో ఆకట్టుకునే ఈ బైక్ ప్రారంభ ధర రూ. 88,078(ఎక్స్-షోరూమ్) బజాజ్ పల్సర్ 125 బజాజ్ పల్సర్ 125 ప్రస్తుతం భారతదేశంలో విక్రయించబడుతున్న పల్సర్ మోనికర్‌తో అత్యంత సరసమైన బైక్. రూ. 82,712 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర. 4 వేరియంట్లు 3 కలర్ ఆప్షన్లలో లభ్యం.ఈ బైక్‌లోని 124.4 సీసీ, ఎయిర్-కూల్డ్, DTSI ఇంజన్‌తో 1.64 bhp , 10.8 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. -
ఆ బైక్ మోడళ్ల ధరలు పెంచిన బజాజ్.. ఎంతంటే?
బజాజ్ కంపెనీ తమ బైక్‌లలోని కొన్ని మోడళ్ల ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపులో అత్యధికంగా డామినార్ 250 ధర రూ.6,400 పెరిగి రూ.1.75 లక్షలు కాగా, డామినార్ 400 ధర రూ.1,152 పెరిగి రూ.2.23 లక్షలకు చేరింది. వీటితో పాటు పల్సర్ సిరీస్ బైక్‌ల ధరలు కూడా పెరిగాయి. పల్సర్ N250 ధర రూ.1,299 పెరగగా, పల్సర్ NS200, RS200 ధరలు వరుసగా రూ.999, రూ.1,088 పెరిగాయి. పల్సర్ 125, 150, NS125, NS160 ధరలు కూడా పెరిగాయి. అవెంజర్ 220, అవెంజర్ 160 ధరలు కూడా రూ.1000 లోపు పెంచింది. ప్లాటినా 100 డ్రమ్ కమమ్యూటర్ ధర రూ.1,978 పెరిగి రూ. 63,130కు చేరగా, ప్లాటినా 110, CT100X ధర కూడా పెంచింది. చదవండి: Whatsapp: ఆ వాట్సాప్ వాడుతున్నారా! అయితే వెంటనే డెలీట్ చేయండి.. లేదంటే -
వస్తు సేవల పన్ను వ్యవస్థ సరళీకరణ అవశ్యం
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వ్యవస్థ మరింత సరళీకరణ అవసరమని పారిశ్రామిక వేదిక– సీఐఐ ప్రెసిడెంట్ సంజీవ్ బజాజ్ స్పష్టం చేశారు. విద్యుత్‌తో పాటు ఇంధనాన్ని కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. దీనివల్ల పరిశ్రమను మరింత పోటీ పరిస్థితుల్లో నిలబెట్టవచ్చని ఒక ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. జీఎస్టీ కింద ఉన్న పన్ను శ్లాబుల సంఖ్యను మూడుకు తగ్గించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం మినహాయించిన విభాగంకాకుండా, జీఎస్టీ 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం పన్ను శ్లాబ్‌లను కలిగి ఉంది. బంగారం, విలువైన, పాక్షిక విలువైన రాళ్లకు ప్రత్యేక పన్ను రేట్లు అమలవుతున్నాయి. నిత్యావసరాలపై 5 శాతం పన్ను రేటు మొదటిది. కార్లు, డీమెరిట్, లగ్జరీ, సిన్ గూడ్స్‌పై 28 శాతం అత్యధిక రేటు అమలవుతోంది. మధ్యస్థంగా 12, 18 శాతం రేట్లు అమలవుతున్నాయి. క్యాసినోలు, గుర్రపు పందాలు ఆన్లైన్ గేమింగ్ సేవలపై 18 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. రూపాయి అనిశ్చితికి ఆర్బీఐ చెక్ కాగా, డాలర్ మారకంలో రూపాయి ఒడుదుడుకులను నిరోధించి స్థిరీకరణ చేయగలిగిన సామర్థ్యం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి ఉందని సీఐఐ ప్రెసిడెంట్ అభిప్రాయపడ్డారు. ఇందుకు తగిన విదేశీ మారకపు నిల్వలు ఆర్బీఐ వద్ద ఉన్నాయని భావిస్తున్నట్లు తెలిపారు. ఏదోఒకరోజు రూపాయి తన స్వంత స్థాయిని కనుగొనవలసి ఉంటుందని మేము నమ్ముతున్నాము. అది భారత్ స్వంత పోటీతత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ‘‘అయితే మారకపు విలువ అస్థిరతను నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఆర్బీఐ ఇందుకు ప్రయ త్నిస్తుందని విశ్వసిస్తున్నాం’’ అని ఆయన అన్నారు. ద్రవ్యోల్బణం తగ్గే అవకాశం... అధిక ద్రవ్యోల్బణం గురించి ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ఇప్పటికే అనేక చర్యలు తీసుకుందని అన్నారు. ‘‘మీరు ద్రవ్యోల్బణాన్ని పరిశీలిస్తే, ఇందుకు ఇంధనం, ఆహార ధరలు కారణంగా కనబడుతున్నాయి. రుతుపవన పరిస్థితి బాగుంటుందని మేము విశ్వసిస్తున్నాము. ఈ పరిణామం కనీసం ఆహార ధరలను తగ్గడానికి దోహదపడుతుంది’’ అని ఆయన అన్నారు. ప్రస్తుతం తీవ్ర అనిశ్చితిలో ఉన్న ఇంధన ధర కూడా తగ్గడం ప్రారంభమవుతుందని భావిస్తునట్లు పేర్కొన్నారు. భారత్ పరిస్థితి బెటర్... భారత్ ఎకానమీపై బజాజ్ ఏమన్నారంటే... పరిశ్రమల సామర్థ్య వినియోగం 74–75 శాతానికి చేరుకుంది. లాజిస్టిక్స్, కెమికల్స్, కమోడిటీలు, నిర్మాణ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. గత రెండేళ్లుగా ప్రభుత్వం తీసుకున్న పలు కీలక చర్యల కారణంగా భారతదేశ ఎకానమీ అనేక ఇతర దేశాల కంటే మెరుగైన స్థితిలో ఉంది. గత కొన్ని త్రైమాసికాల్లో డిమాండ్ తిరిగి పుంజుకోడాన్ని మేము చూస్తున్నాము. అయితే గత నెలా, రెండు నెలల్లో కొంత నిరాశాజనక ఫలితాలు ఉన్నా... తిరిగి భారీగా పుంజుకుంటుందని భావిస్తున్నాము. ఆశాజనక మంచి రుతుపవనాలు, ద్రవ్యోల్బణం తగ్గుదల వల్ల భారత్ బలమైన వృద్ధిని తిరిగి చూడటం ప్రారంభిస్తుందని విశ్వసిస్తున్నాం. -
అదిరిపోయే పల్సర్ బైక్, అమ్మో ధర ఇన్ని లక్షలా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం బజాజ్ ఆటో పూర్తి నలుపు రంగులో పల్సర్ 250 వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. పల్సర్ ఎన్250, ఎఫ్250 ధర ఢిల్లీ ఎక్స్‌షోరూంలో రూ.1.5 లక్షలు ఉంది. సింగిల్ చానెల్ ఏబీఎస్ వేరియంట్ ఇప్పటికే ఉన్న రంగుల్లో లభిస్తుంది. డ్యూయల్ చానెల్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో ఇది రూపుదిద్దుకుంది. మెరుగైన గ్రిప్ కోసం వెడల్పాటి టైర్లు, ముందువైపు 300 ఎంఎం, వెనుకవైపు 230 ఎంఎం డిస్క్ బ్రేక్స్ ఏర్పాటు చేశారు. ఆవిష్కరించిన ఆరు నెలల్లోనే పల్సర్ 250 మోడల్లో 10,000 యూనిట్లు విక్రయించినట్టు కంపెనీ వెల్లడించింది. బీఎస్–6 ప్రమాణాలు అమలులోకి వచ్చిన తర్వాత 250 సీసీ విభాగంలో ఈ స్థాయి అమ్మకాలు నమోదు కాలేదని తెలిపింది. -
కొత్త ఇల్లు కొనేవారికి గుడ్‌న్యూస్..!
న్యూఢిల్లీ: కొత్త ఇల్లు కొనేవారికి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ గుడ్‌న్యూస్ తెలిపింది. కొత్త ఏడాది రాబోతున్న సందర్భంగా ఒక ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. అర్హులైన గృహ రుణ దరఖాస్తుదారులకు తక్కువ వడ్డీ రేటుకు హోమ్ లోన్స్ ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈ వడ్డీ రేట్లు 6.65% నుంచి ప్రారంభమవుతాయి. ఈ ఆఫర్ పొందాలంటే కొన్ని షరతులు కూడా విధించింది. ఈ ఆఫర్ పొందాలంటే రుణ దరఖాస్తుదారుడు వేతన ఉద్యోగి, వైద్యుడు లేదా చార్టర్డ్ అకౌంటెంట్ అయ్యి ఉండాలి. వేతన దరఖాస్తుదారులు కనీసం మూడు సంవత్సరాల పాటు ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగ సంస్థ లేదా బహుళజాతి సంస్థలో ఉద్యోగం చేసి ఉండాలి. ఎంబిబిఎస్ లేదా అంతకంటే ఎక్కువ అర్హత కలిగిన వైద్యులు, ఆసుపత్రి లేదా రిజిస్టర్డ్ హెల్త్ కేర్ ప్రొవైడర్‌తో లేదా వారి స్వంత ప్రాక్టీస్‌లో కనీసం 3 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం వైద్యులకు ఉండాలి. ప్రాక్టీస్ సర్టిఫికేట్, 3 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్లు కూడా ఈ ఆఫర్ పొందవచ్చు. క్రెడిట్ స్కోరు 750 పైగా ఉండాలి అలాగే, దరఖాస్తుదారుడి సిబిల్ స్కోరు 800 లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి అని తెలిపింది. వీరికి మాత్రమే గృహ రుణాలు 6.65% వడ్డీ రేటుకు లభిస్తాయి. 750 నుంచి 799 మంచి క్రెడిట్ స్కోరు కలిగి ఉన్నవారు కూడా ఈ వడ్డీ రేటును పొందే అవకాశం ఉన్నట్లు తెలిపింది. చివరి షరతు ఏమిటంటే కొత్త ఇల్లు కొనేవారు 26 జనవరి 2022 నాటికి రుణదాత అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 28 డిసెంబర్ 2021 నుంచి 26 జనవరి 2022 మధ్య కాలంలో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసి, 25 ఫిబ్రవరి 2022 నాటికి రుణం తీసుకున్న వారు మాత్రమే ఈ వడ్డీ రేటు పొందడానికి అర్హులు. (చదవండి: ఎలక్ట్రిక్ వాహన రంగంలో బజాజ్ ఆటో లిమిటెడ్ భారీగా పెట్టుబడులు!) -
కళ్లు చెదిరే లుక్స్‌తో సరికొత్త బజాజ్ పల్సర్..! లాంచ్ ఎప్పుడంటే..!
ప్రముఖ టూవీలర్ దిగ్గజం బజాజ్ ఆటో మరో సరికొత్త పల్సర్ బైక్‌లను రేపు లాంచ్ చేయనుంది. బజాజ్ పల్సర్ 250, బజాజ్ పల్సర్ 250ఎఫ్ భారత మార్కెట్లలోకి బజాజ్ రిలీజ్ చేయనుంది. బైక్ సరికొత్త లుక్స్‌తో రానుంది. 2021 బజాజ్ పల్సర్ 250 ఇంజన్ విషయానికి వస్తే.. ఈ బైక్‌లో కొత్త 250 సిసి ఎయిర్/ఆయిల్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ అమర్చారు. 26 పిఎస్ సామర్థ్యంతో .. గరిష్టంగా 22ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేయగలదు. 6-స్పీడ్ గేర్ ట్రాన్స్మిషన్ 2021 బజాజ్ పల్సర్ 250 సొంతం. చదవండి: స్కూటీ అమ్మకాల్లో టీవీఎస్ రికార్డ్ ! బజాజ్ పల్సర్ 250 స్ట్రీట్‌ఫైటర్ లుక్‌ను పొందగా, పల్సర్ 250ఎఫ్ సెమీ ఫెయిర్డ్ సెటప్ అమర్చారు. ఈ రెండు మోడళ్లలో ఒకే ఇంజిన్ సెటప్‌ను కల్గి ఉంది. కానీ ఎక్స్టీరియర్ డిజైన్ అండ్ స్టైలింగ్ పరంగా విభిన్నంగా ఉండనున్నాయి. ఈ బైక్‌లలో ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడి డిఆర్ఎల్ లు, ఇండికేటర్స్, స్ప్లిట్ సీట్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, బ్యాక్ మోనోషాక్ సస్పెన్షన్, అల్లాయ్ వీల్స్‌ను కల్గి ఉంది. ధర విషయానికి వస్తే..! బజాజ్ పల్సర్ 250 ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 1.35 లక్షలుగా ఉండనుంది. పల్సర్ 250ఎఫ్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.45 లక్షలుగా ఉండనుంది. బజాజ్ డోమినార్ 250 సేల్స్‌పై చూపకుండా బజాజ్ ప్రయత్నిస్తోన్నట్లు తెలుస్తోంది. చదవండి: ఎస్బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. రూ.342కే రూ.4 లక్షల బెనిఫిట్! -
బైకర్స్‌కి శుభవార్త ! మార్కెట్లో బజాజ్ డొమినార్ 400 అప్డేట్ వెర్షన్
ముంబై: లాంగ్‌రైడ్‌కి వెళ్లే బైకర్లకి, మోటోవ్లాగర్లకి శుభవార్త ! దేశీయంగా స్పోర్ట్స్ బైక్‌లలో ప్రత్యేక ఫ్యాన్ బేస్ కలిగిన డోమినార్ నుంచి మరో కొత్త వెర్షన్ వచ్చింది. బజాజ్ ఆటో తన ‘‘బజాజ్ డొమినార్ 400’’ మోడల్ అప్డేట్ వెర్షన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఎక్స్ షోరూం ధర రూ.2.16 లక్షలుగా ఉంది. ఇందులో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ టూరింగ్ యాక్ససరీసులతో పాటు టూరింగ్ రైడర్లకు కావల్సిన కనీస భద్రతా ఫీచర్లులున్నాయి. బీఎస్ 6 ప్రమాణాలతో బీఎస్ 6 ప్రమాణాలు కలిగిన 373.3 సీసీ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 40 పీఎస్ సామర్థ్యాన్ని ఉత్పత్తి చేయగలదు. ‘‘ద్వి చక్ర వాహన విభాగంలో డొమినార్ 400 తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. సుధీర్ఘ ప్రయాణాలను చేసే రైడర్లకి ఇప్పుడిది మొదటి ఎంపికగా మారింది’’ బజాజ్ ఆటో మార్కెటింగ్ హెడ్ నారాయణన్ తెలిపారు. -
కొత్త ఇల్లు కొనేవారికి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ శుభవార్త!
Bajaj Housing Finance Home Loan Rates: మీరు కొత్త ఇల్లు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్(బిహెచ్ఎఫ్ఎల్) నేడు (అక్టోబర్ 1) గృహ రుణాల వడ్డీ రేటును తగ్గించింది. వేతన, వృత్తిపరమైన దరఖాస్తుదారులకు వడ్డీ రేట్లను 6.75 శాతం నుంచి 6.70 శాతానికి తగ్గించింది. మంచి క్రెడిట్ స్కోర్, ఆదాయం & ఉపాధి ఉన్న దరఖాస్తుదారులు ఈ రోజు నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపింది. ఈ కొత్త వడ్డీ రేటు వల్ల గృహ రుణ గ్రహితలకు భారీగా ఆదా కానున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలలో తెలిపింది. ఇప్పటికే ఉన్న గృహ రుణం తీసుకున్న వినియోగదారులు గృహ రుణ బ్యాలెన్స్ ను బదిలీ చేసుకోవడం ద్వారా కొత్త రేటును పొందవచ్చని సంస్థ తెలిపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హౌసింగ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్(హెచ్డీఎఫ్సీ)తో సహా ఇతర బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్‌బిఎఫ్‌సీ)లు ఇటీవల పండుగ ఆఫర్లలో భాగంగా గృహ రుణ రేట్లలో భారీగా కోత విధించాయి. సెప్టెంబర్ 21న హెచ్డీఎఫ్సీ పండుగ ఆఫర్లలో భాగంగా 6.7 శాతానికే గృహ రుణాలను అందిస్తుందని తెలిపింది. రుణ మొత్తం, ఉపాధితో సంబంధం లేకుండా కొత్త రుణ దరఖాస్తులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ప్రత్యేక గృహ రుణ వడ్డీ రేటు రుణగ్రహీత క్రెడిట్ స్కోరుతో ముడిపడి ఉంటుంది. (చదవండి: కార్డు చెల్లింపులు.. ఇవాల్టి నుంచే కొత్త రూల్స్!) -
Sheelaa Bajaj: ధీర వనిత.. నానమ్మ కథ
షీలా బజాజ్ వయసు 78. దేహం కదలికలు కష్టమయ్యే వయసు. కీళ్లు కదలికలు తగ్గే వయసు. కానీ, ఆమె మాత్రం చురుగ్గా వేళ్లు కదుపుతోంది. వేగంగా అడుగులు వేస్తోంది. ఊలుతో స్వెటర్లు అల్లుతోంది. చలికాలంలో చంటి పిల్లల పాదాలు, చేతులకు తొడిగే ఊలు సాక్సు, గ్లవ్స్ కూడా చక్కగా అల్లేస్తోంది. చేతిలో నైపుణ్యం ఉంటే వార్థక్యం కూడా దూరమవుతుందని చెబుతోంది షీలా బజాజ్. అంతేకాదు, తన మనుమరాలు యుక్తి 78 ఏళ్ల వయసులో తనను సంపాదనపరురాలిగా మార్చిందని సంతోషపడుతోంది షీలా బజాజ్. నానమ్మ కథ షీలా బజాజ్ జీవితంలో అనేక ఎదురుదెబ్బలకు గురైంది. కొడుకు అర్ధంతరంగా మర ణించాడు. అప్పటికి అతడి కూతురు యుక్తి చిన్నపాప. మనుమరాలిలో కొడుకును చూసుకుంటూ కోడలికి ధైర్యం చెబుతూ కుటుంబానికి అండగా నిలిచింది. ఆమె మనోధైర్యాన్ని చూసి విధికి కన్నుకుట్టినట్లుంది. కోడలిని కూడా పొట్టన పెట్టుకుంది. ఇక మిగిలింది తనూ, మనుమరాలు యుక్తి. ఆ పాపకి నానమ్మలోనే అందరూ. ఇప్పటికీ నానమ్మ అని చెప్పాల్సినప్పుడు యుక్తి ‘అమ్మ’ అనే సంబోధిస్తుంది. అంతటి అనుబంధం వాళ్లది. నానమ్మ కథ వినకుండా ఏ రోజూ నిద్రపోయేది కాదు యుక్తి. ఆ కథలన్నింటిలోనూ ఒకటే నీతి ఉండేది. కష్టం అనేది ఉండదు, పరిస్థితులు మాత్రమే ఉంటాయి. ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడమే మనం చేయాల్సింది, చేయగలిగింది. ఈ నీతిని వింటూ పెరిగింది యుక్తి. నానమ్మ చెప్పిన కథలన్నింటికంటే ఆమె జీవిత కథే తనకు అత్యంత స్ఫూర్తివంతం అంటుంది యుక్తి. కాలం తన సమయాన్ని తాను పాటిస్తూ ముందుకు సాగిపోయింది. యుక్తి చదువుకుని, ఉద్యోగంలో చేరింది. షీలా బజాజ్ లో ఒంటరితనం మొదలైంది. ఇంతలో కరోనా వచ్చింది. ‘‘అమ్మ రోజంతా ఎంత ఒంటరితనానికి లోనవుతుందనేది నేను వర్క్ ఫ్రమ్ హోమ్ సమయంలో గమనించాను. ఆమెకు తెలియకుండానే ఆమెను తనకిష్టమైన పనిలో నిమగ్నం అయ్యేలా చేయగలిగాను. నాకు చిన్నప్పుడు అల్లినట్లే స్కార్ఫ్‌లు, స్వెటర్లు అల్లిపెట్టమ్మా... అని అడిగాను. ఊలు చేతిలోకి తీసుకున్న తర్వాత ఆమె ఇక చాలన్నా వినలేదు. ‘ఇలా అల్లుతూ ఉంటే.... నీ చిన్ననాటి రోజులే కాదు, నా చిన్ననాటి రోజులు కూడా గుర్తుకు వస్తున్నాయి’ అంటూ తనకు తోచినవన్నీ అల్లుతూ ఉండేది. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. అవి కావాలని అడిగిన వాళ్లకు అమ్మేసి, ఆ డబ్బు ఇచ్చాను. తాను సంపాదనపరురాలినయ్యానని తెలిసిన ఆ క్షణం చూడాలి అమ్మ సంతోషం. నా బాల్యంలో నా ఒంటరితనాన్ని పోగొట్టడానికి ఎంత భరోసానిచ్చిందో నాకిప్పటికీ గుర్తే. ఇప్పుడు నా పెంపకంలో ఉన్న అమ్మకు అంతటి భరోసా కల్పించడం నా బాధ్యత కదా’’ అంటోంది యుక్తి. మెదడు చురుకుదనం వేళ్లలో ఇక షీలా బజాజ్ అయితే... తన సృజనాత్మకతకు పదును పెట్టి ఊలుతో దిండు కవర్లు, కుషన్ కవర్లు, బాటిల్ కవర్, మగ్ వార్మర్ వంటి వినూత్నమైన అల్లికలను రూపొందిస్తోంది. ఇంత శ్రమ వద్దంటే వినదు కూడా. ‘ఈ వయసులో ఇంత వేగంగా అల్లగలగడం అంటే నాకెంతో గర్వం కదా. వేగం ఎందుకు తగ్గించుకోవాలి’ అని ప్రశ్నిస్తోంది. ‘డిజైన్‌కి అనుగుణంగా వేళ్లు వేగంగా కదులుతున్నాయంటే నా మెదడు కూడా అంతే చురుగ్గా ఉందని అర్థం’ అంటున్నప్పుడు ఆత్మవిశ్వాసంతో కూడిన నవ్వు ఆమె పెదవుల మీద విరుస్తుంది. నిజమే... మనోధైర్యం ఉంటే పెరిగే వయసు ఉత్సాహానికి అడ్డంకిగా మారదు. చదవండి: International Day of Older Persons: అమ్మానాన్నలకు ఏం చేస్తున్నాం? -
హైదరాబాద్‌లో బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు.. డెలివరీ మాత్రం ఇక్కడే
పెరుగుతున్న పెట్రోలు ధరల నుంచి ఉపశమనం కలిగించేలా హమారా బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ని మార్కెట్లోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా ఒక్కో నగరంలో అమ్మకాలు ప్రారంభిస్తూ వస్తోన్న బజాజ్ సంస్థ.. తాజాగా హైదరాబాద్‌లో అమ్మకాలు మొదలుపెట్టింది. ఆన్లైన్ బుకింగ్ బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సొంతం చేసుకోవాలంటే ముందుగా ఆన్లైన్ రూ.2000 చెల్లించి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. చేతక్ డాట్‌కామ్ వెబ్‌సైట్‌కి వెళ్లి అక్కడ అవసరమైన వివరాలు పొందు పరిచి నచ్చిన స్కూటర్ని ఎంపిక చేసుకోవచ్చు. ప్రీ బుకింగ్‌ని రద్దు చేసుకుంటే వెయ్యి రూపాయలు రీఫండ్ వస్తుంది. నాలుగో రాష్ట్రం బజాజ్ సంస్థ తన ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలను తొలుత తమిళనాడుతో మొదలుపెట్టి కర్నాటక, మహారాష్ట్ర మీదుగా ప్రస్తుతం తెలంగాణాలో అమ్మకాలు ప్రారంభించింది. మిగిలిన కంపెనీల తరహాలో కాకుండా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో నగరంలో తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను అందుబాటులోకి తెస్తోంది. మూడు చోట్ల ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కూకట్పల్లి, బేగంపేట, కాచిగూడలలో ఉన్న బజాజ్ చేతక్ షోరూమ్‌లలో ఈ స్కూటర్లను అందుబాటులో ఉంచింది. ఆన్లైన్లో రిజిస్ట్రర్ చేసుకున్న వారి ఈ షోరూమ్‌లకు వెళ్లి స్కూటర్ డెలివరీని తీసుకోవాల్సి ఉంటుంది. రెండు వేరియంట్లు బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కి సంబంధించి ప్రీమియం, ఆర్బన్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రీమియం నాలుగు రంగుల్లో లభిస్తుండగా అర్బన్ రెండు రంగుల్లో లభిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రీమియం వేరియంట్ ఒక్కటే అమ్మకానికి సిద్ధంగా ఉంది. ధర ఎంతంటే బజాజ్ చేతక్ ప్రీమియం హైదరాబాద్ ఎక్స్‌షోరూం ధర రూ.1,50,461 ఉండగా ఆన్‌రోడ్ ధర రూ. 1,89,175లుగా ఉంది. బజాజ్ అర్బన్ ఎక్స్‌షోరూం ధర రూ. 1,00,000గా ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్స్‌కి రిజిస్ట్రేషన్ ఛార్జీలను మాఫీ చేసింది. ఫీచర్లు ఫుల్‌గా ఛార్జ్ చేసిన బ్యాటరీతో ఎకానమీ మోడ్‌లో 90 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేసేందుకు 5 గంటల సమయం పడుతుంది. క్విక్ ఛార్జింగ్ ఆప్షన్లో గంట సేపు ఛార్జ్ చేస్తే 25 శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. దీంతో కనీసం 20 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవచ్చు. వారంటీ మూడేళ్లు లేదా 50,000 కిలోమీటర్ల ప్రయాణం వరకు స్కూటర్, లిథియం ఐయాన్ బ్యాటరీపై బజాజ్ సంస్థ వారంటీ అందిస్తోంది. టైర్లపై వన్ ఇయర్ వారంటీ ఇస్తోంది. ఈ స్కూటర్‌కి డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా బజాజ్ పేర్కొంది. దీనికి సంబంధించి ఐపీఎస్ 67 సర్టిఫికేట్ ఉన్నట్టు చెబుతోంది. స్కూటర్ కొనే ఆసక్తి ఉన్న వారు చేతక్ డాట్‌కామ్ వెబ్సైట్లో టెస్ట్ రైట్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు. చదవండి: బజాజ్ పల్సర్ 150 కంటే ఖరీదైనదిగా పల్సర్ ఎన్ఎస్ 125 బైక్ -
ఎలక్ట్రిక్ వాహన ప్రయాణం భళా!
ఓలా అంటే స్పానిష్ భాషలో ‘హలో’ అని అర్థం. క్యాబ్ సర్వీస్ సంస్థ ఓలా ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్లకు హలో చెబుతోంది. ఒక దశాబ్దం కంటే స్వల్పకాల వ్యవధిలోనే ఓలా తన వ్యాపారాన్ని వినూత్న రీతిలో విస్తరించింది. (అద్దంలో నా ముఖం చూసుకోవడం మానేశాను..) ఓలాను 2010లో నెలకొల్పారు. 2012లో దాని క్రియాశీల క్యాబ్ సేవలు ప్రారంభమైనాయి. మార్కెట్లోకి ప్రవేశించే సమయంలో, ప్రయాణీకులకు మూడు ఉచిత రైడ్లను అందించింది. ఈ తరహా ఉచిత వ్యూహం భారతీయ మధ్యతరగతిని టాక్సీల వైపు ఆకర్షించింది. రవాణాలో సౌలభ్యం, ప్రయాణీకులకు భద్రత, సకాలంలో గమ్యానికి చేర్చడం, ధర అంచనాలను సులభతరం చేసే సాంకేతిక పరిజ్ఞానంతో అతి స్వల్పకాలంలోనే ప్రయాణీకుల నమ్మ కాన్ని గెలుచుకుంది. ఓలా యాప్‌పై ట్రావెల్ సర్వీస్ ప్రొవైడర్‌గా అద్భుతమైన నిబద్ధతను చూపి, కారు ఎక్కాలనే అనేకమంది భారతీయుల వాంఛను నెరవేర్చింది. అలాగే దేశవ్యాప్తంగా ఉపాధిని సృష్టిం చింది. 2018 నాటికి, సంస్థకు పది లక్షల మంది డ్రైవర్లు ఉన్నారు. వారి ప్రోత్సాహకాలు వినియోగ దారుల రేటింగ్, ఫీడ్‌బ్యాక్‌పై నిర్ణయమయ్యేవి. ఇంతేకాకుండా కొంత డిపాజిట్ మొత్తాన్ని డ్రైవర్ల నుండి సేకరించి, వారికి క్యాబ్స్‌ని ఫైనాన్స్ రూపంలో కట్టబెట్టింది. ఈ తరహా మోడల్లో డ్రైవర్లకు వాహనాలను ఏర్పాటు చేయడం రిస్క్‌తో కూడుకున్నది. అయినప్పటికీ, సాహసం చేసి బీమాలో తన ఉనికిని చాటుకుంది. మరో వైపు ప్రారంభ ఫిన్‌టెక్ సంస్థగా ఓలా మనీని ఉపయోగించి, వివిధ ఆర్థికసేవలను నిర్వహించింది. కృత్రిమ మేధస్సు సాయంతో విని యోగదారుల అసాధారణమైన ప్రవర్తనా మార్పులను గమనిస్తూ, మెరుగైన సేవలు అందిస్తోంది. అయితే తదుపరి ఊబర్‌తో పోటీ మూలంగా ధరల యుద్ధం, క్యాబ్ వాహనాల పెరుగుదల, ప్రోత్సాహ కాలలో కోత, ఇంకా డ్రైవర్లకు సంబంధించిన సమస్య లతో కష్టాలను మూటగట్టుకుంది. కరోనా మహ మ్మారి, లాక్డౌన్లు సంస్థను మరింత సంక్షోభంలోకి నెట్టాయి. గత్యంతరం లేక కొంతమంది పూర్తికాల ఉద్యోగులను తొలగించింది. మహమ్మారి కారణంగా భద్రత కోసం వ్యక్తిగత వాహనాల వినియోగం పెరిగి, క్యాబ్‌లు, ఆటోలవైపు వినియోగదారులు ముఖం చాటేయడంతో మరింత నష్టం వాటిల్లింది. (చదవండి: ఈ విద్యావిధానం దేశానికే ఆదర్శం) అయితే తన తదుపరి ఎత్తుగడగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరిస్తూ ఆటోమోటివ్ రంగంలోకి ప్రవేశించింది. తద్వారా పర్యావరణ పరిరక్షణ, సమర్థత, ఉపాధి కల్పనకు పూనుకుంటోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రిజర్వ్ చేసుకోవడానికి ప్రారంభ ధరను రూ. 499గా నిర్ణయించింది. ఈ బుకింగ్ ధర ఒక సాధారణ మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌కు సమానం. ఇది ఆటోమోటివ్ రంగంలో ఓలా తెచ్చిన విప్లవాత్మక మార్పు. సగటున నెలవారీగా కోటి మంది వినియోగదారులు గనుక 499 చెల్లిస్తే, అడ్వాన్సుల రూపంలో వడ్డీ లేని డబ్బు అందుతుంది. దీనివలన భారీగా రుణభారం తగ్గుతుంది. ముఖ్యంగా ఆటోమొబైల్ పరిశ్రమలో సింహభాగం రుణాలుగా ఉంటుంది. కస్టమర్ డిపాజిట్ల రూపంలో ఓలా దీనికి స్వస్తి పలుకుతోంది. ఒక్క కారు కూడా సొంతంగా లేకుండానే ఓలా క్యాబ్స్ విజయవంతమైంది. దీనికి విరుద్ధంగా, ఎలక్ట్రిక్ స్కూటర్లను ఓలా తయారు చేస్తుండటం మూలాన వాటిని సరుకుగా చూపాల్సి ఉంటుంది. ఇది ఓలా వ్యాపార నిర్వహణ మోడల్లో చాలా పెద్ద మార్పు. ఇంకా, టెక్నాలజీ రంగం నుండి తయారీ రంగానికి మారుతుండటం దేశంలో మొదటిసారిగా ఓలా చేస్తున్న సాహసం. ట్యాక్సీ వ్యాపారంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు లేరు. కానీ ఇప్పుడు వారు ఈ కొత్త నమూనాలో పెద్ద శ్రామిక శక్తిని కలిగి ఉంటారు. ఓలా ట్యాక్సీ ప్రారంభంలో పెద్దగా పోటీ ఎదుర్కో లేదు. దానివల్ల ఫస్ట్–మూవర్ ప్రయోజనాన్ని పొందింది. కానీ ఇప్పుడు హీరో, బజాజ్, హోండా, ఇంక అనేక అభివృద్ధి చెందుతున్న సంస్థలతో పోటీ పడాలి. ఏదేమైనా, భారత ప్రజలు ఇంధనం కోసం తక్కువ ఖర్చు చేయాలని అనుకుంటున్న తరుణంలో వస్తున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. అనేక భారతీయ కంపెనీలు తయారీ రంగం నుండి టెక్నాలజీ వైపునకు మారాయి. దీనికి భిన్నంగా ఓలా తన బ్రాండ్‌ని, టెక్నాలజీని పణంగా పెట్టి ధైర్యంగా ఆటోమోబైల్ దిగ్గజ సంస్థలకు సవాల్ విసురుతోంది. ఒక దశాబ్దం క్రితం టాటా నానో ఫలితాన్ని దేశం చవిచూసింది. ఇప్పుడు ఓలా తన హైటెక్ ఫీచర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో ఆటోమోటివ్ పరిశ్రమకు అఘాతం కలిగించే సాహసం చేస్తోంది. ఈ స్కూటర్ విజయవంతమైతే గనుక భారీ ఉపాధి సృష్టి జరుగుతుంది, ఎగుమతులు పెరుగుతాయి, పర్యావరణ పరిరక్షణలో సాయపడుతుంది, ఇంధనం ఆదా అవుతుంది. అంతేకాకుండా భారతీయ సిలికాన్ వ్యాలీని నిర్మించడానికి దేశంలోని యువ పారిశ్రామికవేత్తలలో కావాల్సిన ఉత్సాహాన్ని నింపుతుంది. 75వ భారత స్వాతంత్య్ర అమృతోత్సవాలు ప్రత్యేకమైనవి. ఒలింపిక్స్‌లో బంగారు, వెండి, కాంస్య పతకాలతో మువ్వన్నెల జెండాను క్రీడాకారులు రెప రెపలాడించిన రోజే, ఓలా తన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించింది. మున్ముందు బ్రాండ్ విలువ పరంగా ఓలా తదుపరి కోలాగా మారే అవకాశం ఉందని చెప్పడం అతిశయోక్తి కాదు. - డాక్టర్ మైలవరం చంద్రశేఖర్ గౌడ్ వ్యాసకర్త సహాయ ఆచార్యులు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, హైదరాబాద్ -
టూవీలర్స్‌కు ‘ఎలక్ట్రిక్’ కిక్..!
న్యూఢిల్లీ: దేశీయ ద్విచక్ర వాహన మార్కెట్ (బైక్‌లు, స్కూటర్లు, మోపెడ్లు) ఇప్పుడు క్రాస్‌రోడ్స్‌లో ఉంది. సంప్రదాయ ఇంధన ఆధారిత వాహనాలతో పోలిస్తే.. పర్యావరణానికి అనుకూలమైన ఎలక్ట్రిక్ వాహన విక్రయాలు ఇటీవలి కాలంలో వేగాన్ని అందుకుంటున్నాయి. పరిణామక్రమాన్ని కొన్ని కంపెనీలు ముందుగానే పసిగట్టి పెద్ద అడుగులు వేయడానికి వెనుకాడడం లేదు. ఓలా కంపెనీ భారీ పెట్టుబడులతో, ఆధునిక ఫీచర్లతో రెండు స్కూటర్లను ఆవిష్కరించింది. ఇప్పటికే ఈ విభాగంలో బెంగళూరు స్టార్టప్ ఏథెర్ బలంగా ఉంది. ఇంకా పదుల సంఖ్యలో చిన్న కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయిస్తున్నాయి. కానీ, సంప్రదాయ (కంబస్టన్ ఇంజన్) విభాగంలోని దిగ్గజ కంపెనీలైన హోండా, హీరో మోటోకార్ప్, యమహా, సుజుకీ ఇంత వరకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను దేశీయ మార్కెట్లోకి విడుదల చేయలేదు. టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో పేరుకు ఒక్కో మోడల్‌తో ఎంట్రీ ఇచ్చి వేచి చూసే ధోరణిని అనుసరిస్తున్నాయి. ఈ సంస్థలు కూడా పరిశోధన, అభివృద్ధితో ఆధునిక స్టార్టప్ కంపెనీలకు పోటీనిచ్చేలా మోడళ్లను ప్రవేశపెడితే ఈ మార్కెట్ మరింత వేడెక్కి, వేగాన్ని సంతరించుకోనుంది. కానీ, అదెప్పుడా అన్నదే ప్రశ్న? ‘ఓలా’ విజయం నిర్ణయిస్తుంది.. ‘ఎప్పుడొచ్చామన్నది కాదు.. వినియోగదారుల ఇష్టాన్ని గెలిచామా?’ అన్నదే వాహనాల విషయంలో ప్రామాణికం అవుతుంది. కొత్తగా వచ్చే ఎలక్ట్రిక్ వాహన కంపెనీలతో పోలిస్తే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సంప్రదాయ వాహన కంపెనీలకు నెట్వర్క్ చాలా పటిష్టమైనది. విక్రయాలు, విక్రయానంతర సేవల విషయంలో భారీ పెట్టుబడుల అవసరం వీటికి ఉండదు. అయినా కానీ, ఈ కంపెనీల ధోరణి తొందరపాటు వద్దన్నట్టుగా ఉంది. స్కూటర్ల మార్కెట్‌ను 50 శాతం వాటాతో జపాన్‌కు చెందిన హోండా శాసిస్తోంది. ఈ సంస్థ ఇంతవరకు ఎలక్ట్రిక్ వాహనాలపై తన ప్రణాళికల గురించి నోరు మెదపలేదు. మరోవైపు ఓలా ఈ విభాగంలో బలంగా పాతుకుపోయే ప్రణాళికలతో వచ్చింది. ఏడాదికి 10 లక్షల యూనిట్ల తయారీ సామర్థ్యంతో తమిళనాడులో భారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన ఈ సంస్థ.. ఎస్1, ఎస్1 ప్రో పేరుతో రెండు మోడళ్లను ఆవిష్కరించింది. అక్టోబర్ నుంచి డెలివరీ చేయనున్నట్టు ప్రకటించింది. మొదటి ఏడాదే 5 లక్షల వాహనాలను విక్రయించాలన్న లక్ష్యంతో దూకుడుగా వెళుతోంది. ఓలా ఎలక్ట్రిక్ ప్రణాళికల అమలు విజయం ఈ మార్కెట్‌కు కీలకం అవుతుందని జెఫరీస్ రీసెర్చ్ అనలిస్ట్ నీరజ్ మంగల్ అభిప్రాయపడ్డారు. ద్విచక్ర ఈవీ మార్కెట్లో ఓలా అడుగులు ఇప్పటికే ఉన్న కంపెనీల్లో విశ్వాసాన్ని పెంచడమే కాకుండా.. కొత్త సంస్థల ప్రవేశానికి సానుకూలతలను తీసుకురావచ్చని నిపుణుల అంచనాగా ఉంది. మార్పుకు సమయం పడుతుంది.. టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ‘ఐక్యూబ్’ ప్రతీ నెలా 1,000 యూనిట్ల విక్రయాలే నమోదవుతున్నాయి. బజాజ్ ఆటో ఈ–స్కూటర్ ‘చేతక్’ అయితే కేవలం 250–300 యూనిట్లే అమ్ముడుపోతున్నాయి. కానీ, ఈవీలకు సంబంధించి ఈ సంస్థలు ఇప్పటికీ భారీ ప్రణాళికలను ప్రకటించలేదు. ఏథెర్ తన విక్రయాల గణాంకాలను విడుదల చేయడం లేదు. ఈ సంస్థకు వార్షికంగా లక్ష వాహనాల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. ‘‘కొత్తగా ఒక సంస్థ వచ్చిందన్న కారణంతో ప్రస్తుత మా ప్రణాళికలను సమీప కాలంలో మార్చుకునే ఉద్దేశం అయితే లేదు. మా ప్రణాళికలు యథావిధిగా కొనసాగుతాయి’’ అని బజాజ్ ఆటో ఈడీ రాకేశ్ శర్మ తెలిపారు. అచ్చమైన ఎలక్ట్రిక్ వాహన కంపెనీలతో పోలిస్తే సంప్రదాయ ద్విచక్ర వాహన కంపెనీలు నిదానంగా అడుగులు వేస్తుండడం అర్థం చేసుకోతగినదేనని నోమురా ఆటో రీసెర్చ్ హెడ్ హర‡్షవర్ధన్ శర్మ అన్నారు. ప్రభుత్వాల మద్దతు..! ఫేమ్–2 పథకం (ఎలక్ట్రిక్ వాహనాలకు రాయితీలు) విషయమై అనిశ్చితి కొనసాగుతూ ఉండడం, కరోనా కారణంగా ఏర్పడిన ప్రతికూలతలు, చిప్‌లకు కొరత నెలకొనడం ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌పై ప్రభావం చూపిస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఫేమ్ పథకం కింద కేంద్ర సర్కారు ఎప్పటి నుంచో సబ్సిడీలు అందిస్తోంది. కాకపోతే ఈ సబ్సిడీలను ఇటీవలే మరింత పెంచింది. అదే విధంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు ఈవీ రాయితీలతో విధానాలను తీసుకొస్తున్నాయి. గుజరాత్, మహారాష్ట్ర ఈ విషయంలో ముందున్నాయి. -
ఐటీ కంపెనీలకు కలిసొచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్.. కోట్లలో డబ్బు ఆదా
ముంబై: వర్క్ ఫ్రమ్ హోమ్ (ఇంటి నుంచే కార్యాలయ పని) విధానం కార్పొరేట్లకు బాగానే కలిసొచ్చింది. ముఖ్యంగా ఐటీ కంపెనీలకు రూ.వేలాది కోట్లను ఆదా చేసింది. ఎలా అనుకుంటున్నారా..? ఉద్యోగులు ఇంటి నుంచి కార్యాలయానికి వచ్చి వెళ్లేందుకు కంపెనీలు రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేస్తుంటాయి. లేదా రవాణా భత్యాలను ఇస్తుంటాయి. వ్యాపార అవసరాల రీత్యా ఉద్యోగులు, ఉన్నతాధికారులు చేసే ప్రయాణాలు కూడా ఉంటాయి. కానీ, 2020లో కరోనా దేశంలోకి ప్రవేశించిన తర్వాత ఇంటి నుంచే పని విధానాన్ని కంపెనీలు తప్పనిసరిగా ఆచరణలోకి తీసుకొచ్చాయి. ప్రయాణాలపై ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఫలితంగా రవాణాపై చేసే వ్యయాలు కంపెనీలకు గణనీయంగా తగ్గిపోయాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా కంపెనీలకు రవాణా వ్యయాలు 70 శాతం వరకు తగ్గాయి. ఈటీఐజీ డేటాబేస్‌లో అందుబాటులోని సమాచారం ఆధారంగా.. 180 కంపెనీలకు సంబంధించిన వివరాలతో ఈ మేరకు ఓ నివేదిక విడుదలైంది. గతేడాది మార్చి చివరి నుంచి మే వరకు కఠిన లాక్డౌన్లు, ప్రయాణాలపై ఆంక్షలు దేశవ్యాప్తంగా అమలైన విషయం తెలిసిందే. ఆ సమయంలో సేవల రంగంలోని చాలా కంపెనీలు తమ కార్యకలాపాలను సజావుగా సాగించేందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం ఎంతో తోడ్పడిందని చెప్పుకోవాలి. ఐటీ కంపెనీలకే ఎక్కువ లబ్ధి ఐటీ దిగ్గజం టీసీఎస్ 2019-20 ఆర్థిక సంవత్సరంలో రవాణాపై రూ.3,296 కోట్లను వ్యయం చేసింది. కానీ, 2020-21లో రవాణా వ్యయాలు రూ.1,081 కోట్లకు పరిమితమయ్యాయి. అంటే ఏకంగా రూ.2,215 కోట్లు రవాణా రూపంలో కంపెనీకి మిగిలినట్టయింది. అంటే 67 శాతం ఆదా అయ్యింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు కూడా గత ఆర్థిక సంవత్సరంలో రవాణా వ్యయాలు 70 తగ్గిపోయాయి. 2019-20లో రవాణా కోసం రిలయన్స్ రూ.788 కోట్లు ఖర్చు చేయగా.. 2020-21లో రూ.236 కోట్లకు తగ్గిపోయింది. ముఖ్యంగా బజాజ్ ఆటో సంస్థ అయితే రవాణా వ్యయాల్లో 93 శాతాన్ని ఆదా చేసుకుంది. 2019-20లో ఈ సంస్థ రవాణాపై రూ.77 కోట్లు వ్యయం చేయగా.. 2020-21లో ఈ వ్యయాలు రూ.6 కోట్లకు పరిమితమయ్యాయి. ‘‘కీలకమైన పనులు డిజిటల్ రూపంలోనే కొనసాగుతున్నాయి. ఒప్పందాలపై సంతకాలు లేదా పెద్ద కాంట్రాక్టులు ఏవైనా డిజిటల్ రూపంలో నమోదవుతున్నాయి. కనుక ‘ఎందుకు ప్రయాణించడం’ అనే నినాదం గ్రూపు కంపెనీల పని విధానాన్నే మార్చేసింది. అవసరమైన ప్రయాణాలకే పరిమితమవుతున్నాం. గతంలోని పనివిధానానికి తిరిగి వెళ్లే అవకాశం లేదు’’ అని టాటా గ్రూపు అధికారి తెలిపారు. ఫార్మాకు ఆ వెసులుబాటు లేదు.. ‘‘ఫార్మా వంటి పరిశ్రమలు ప్రయాణాలను ప్రారంభించక తప్పదు. మా తరహా వ్యాపారాలకు ప్రయాణాలు ముఖ్యమవుతాయి. తనిఖీలు చేయాల్సి ఉంటుంది. ఆడిట్ వెండర్లు, కస్టమర్లను కలవాల్సిన అవసరం ఉంటుంది’’అని బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్‌షా తెలిపారు. రానున్న కాలంలో రవాణా, మార్కెటింగ్ వ్యయాల్లో పెద్ద ఎత్తున ఆదా ఉండకపోవచ్చని ఆమె స్పష్టం చేశారు. -
బజాజ్ నుంచి మరో ఎలక్ట్రిక్ వెహికల్
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో పోటీ పెరిగిపోతుంది. రోజుకో కంపెనీ సరికొత్త మోడల్ని ప్రవేశపెడుతూ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే ఈవీ సెగ్మెంట్లో హీరో, ఈథర్, ఒకినావాలు సందండి చేస్తుండగా తాజాగా ఈ జాబితాలో బజాజ్ కూడా చేరనుంది. ఫ్రీ రైడర్ పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ట్రేడ్‌మార్క్ రిజిస్టర్ చేయించింది. బజాజ్నుంచి.. ఇండియా టూ వీలర్ మార్కెట్లో బజాజ్‌ది ప్రత్యేక స్థానం. ఒకప్పుడు దేశం మొత్తాన్ని చేతక్ స్కూటర్ ఒక ఊపు ఊపింది. ఆ తర్వాత యూత్‌లో మంచి క్రేజ్‌ని పల్సర్ సాధించింది. ఇప్పటికే యూత్‌లో ఎక్కువ డిమాండ్ ఉన్న బైక్‌గా పల్సర్‌కి పేరుంది. మిగిలిన బజాజ్ మోడల్స్‌కి రూరల్ ఇండియాలో మంచి కస్టమర్ బేస్ ఉంది. తాజాగా ఈవీ సెగ్మెంట్‌పైనా బజాజ్ దృష్టి సారించింది. ఇప్పటికే బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో ఉండగా మరో కొత్త మోడల్‌ను తీసుకు వస్తుంది. ఫ్రీ రైడర్ పేరుతో కొత్త స్కూటర్ని తేనుంది. దీనికి సంబంధించిన ట్రేడ్ మార్క్ కోసం మార్చి 1న అప్లయ్ చేస్తే.. జూన్ 1న ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. చదవండి: తగ్గిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ధరలు..మోడల్ని బట్టి డిస్కౌంట్ -
మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్!
దేశంలో చమురు ధరలు రోజు రోజుకి పెరుగుతున్న తరుణంలో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లవైపు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ప్రజల ఆసక్తికి అనుగుణంగా మార్కెట్లోకి కంపెనీలు కొత్త కొత్త ఎలక్ట్రిక్ బైక్స్, స్కూటర్లను తీసుకొస్తున్నాయి. ఈ జాబితాలోకి తాజాగా స్వీడిష్ కి చెందిన ఆస్ట్రియన్ కంపెనీ హుస్క్వర్నా మోటార్ సైకిల్స్ కూడా వచ్చి చేరింది. ఈ సంస్థ 2018 సంవత్సరంలో 6.7-హెచ్‌పీ మినీబైక్‌ను ఆవిష్కరించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఈ-పీలెన్ అనే బైక్‌తో ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్ల విభాగంలోకి అడుగు పెడుతున్నట్టు ప్రకటించింది. తాజాగా ఆస్ట్రియా ప్రధాన కార్యాలయ సంస్థ వెక్టోర్ అనే పేరుతో వెక్టార్ మోడల్‌తో కొత్త బ్యాటరీ స్కూటర్‌ను సంస్థ ఆవిష్కరించింది. ఈ సంస్థ తన బ్రాండ్ పేరుతో ఆవిష్కరించిన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌గా ఇది వస్తుంది. పట్టణ ప్రాంతాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ స్కూటర్‌ను రూపొందించారు. మెట్రో నగరాల్లో ట్రాఫిక్ కష్టాలకు, పెరుగుతున్న ఇంధన ధరలకు ఈ బైక్ చెక్ పెట్టనుందని కంపెనీ భావిస్తోంది. అయితే ఈ వెక్టార్ స్కూటర్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే.. సుమారు 95 కిలోమీటర్ల వరకు ప్రయాణించనుందని కంపెనీ చెబుతోంది. కంపెనీ తన విస్తరణ ప్రణాళికలలో భాగంగా మొదట జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ దేశాలలో తీసుకురావాలని యోచిస్తుంది. అయితే, హుస్క్వర్నా తన ఎలక్ట్రిక్ స్కూటర్ వెక్టర్ ను ఎప్పుడు తీసుకొస్తారు అనే దానిపై స్పష్టత లేదు. కానీ వినిపిస్తున్న ఊహాగనాల ప్రకారం, వచ్చే ఏడాది మార్కెట్లోకి తీసుకొని రావచ్చు అని అంచనా. వెక్టోర్ ఒక ప్రత్యేకమైన వృత్తాకార హెడ్‌లైట్‌ను కలిగి ఉంది, రెండు వైపులా ఫెయిరింగ్ మరియు పసుపు రంగు స్ట్రోక్‌లతో రెండు-టోన్ పెయింట్ స్కీమ్‌ను కలిగి ఉంది. వెక్టార్ స్కూటర్‌పై అత్యధికంగా 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. చదవండి: Petrol Price: సెంచరీ కొట్టేసిన పెట్రోలు ధరలు -
ఈవీ జర్నీ.. రయ్!
దేశీయ ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) డిమాండ్‌ను సొమ్ము చేసుకునే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్‌తో పోలిస్తే పర్యావరణ అనుకూల ప్రయోజనాలకు తోడు, చమురు దిగుమతుల బిల్లును తగ్గించుకోవడం లక్ష్యాలుగా.. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహక విధానాలతో ముందుకు వస్తుండడాన్ని చూస్తూనే ఉన్నాము. దీంతో సంప్రదాయ ఆటోమొబైల్ కంపెనీలు సైతం ఎలక్ట్రిక్ మోడళ్లతో కస్టమర్ల ముందుకు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అనుకూల వ్యవస్థల (ఎకోసిస్టమ్) అభివృద్ధికి గతేడాది కరోనా మహమ్మారి తాత్కాలికంగా బ్రేకులు వేసింది. అయినప్పటికీ లాక్డౌన్, ఆంక్షలను క్రమంగా సడలిస్తూ రావడంతో తిరిగి ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) డిమాండ్ కొన్ని నెలల నుంచి మెరుగుపడుతోంది. కాకపోతే మన దేశంలో ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ ఇంకా ఆరంభ దశలోనే ఉంది. ప్రధానంగా పట్టణాలు, కొన్ని వాహన విభాగాల్లోనే విక్రయాలు నమోదవుతున్నాయి. అయినా సరే భవిష్యత్తుపై అంచనాలతో ద్విచక్ర ఈవీ మార్కెట్లోకి కొత్త సంస్థలు ఉత్సాహంగా ప్రవేశిస్తుంటే.. కార్ల విభాగంలో టాటా మోటార్స్ దూసుకుపోయే వ్యూహాలను అమలు చేస్తోంది. కేంద్ర, రాష్ట్రాల సబ్సిడీ, రాయితీ పథకాలు ఇందుకు కొంత మేర సాయపడుతున్నాయని చెప్పుకోవాలి. రంగంలోకి కొత్త సంస్థలు దేశీయ ఈవీ మార్కెట్లో దూకుడుగా వెళ్లే వ్యూహాలతో కొత్త సంస్థలు అడుగుపెడుతుంటే.. మరోవైపు ఆటోమొబైల్ రంగంలో స్థిరపడిన ప్రముఖ కంపెనీలు కూడా పోటీ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కార్లు, ద్విచక్ర, త్రిచక్ర ఈవీ విభాగంలో అవకాశాలను సొంతం చేసుకుని, వృద్ధి చెందేందుకు వేటికవే భిన్నమైన వ్యూహాలను రూపొందించుకుంటున్నాయి. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో మహీంద్రా లీడర్‌గా ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఆచితూచి అన్నట్టుగా అడుగులు వేస్తోంది. రెవా ఎలక్ట్రిక్ కార్ కంపెనీని మహీంద్రా సొంతం చేసుకుని ఈ విభాగంలో ముందు నుంచి ఉన్న సంస్థగా పేరు సొంతం చేసుకున్నప్పటికీ.. త్రిచక్ర వాహనాలపైనే ప్రస్తుతం ఎక్కువగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అయితే, ‘బోర్న్ ఈవీ’ విధానంతో రానున్న 4–5 ఏళ్ల కాలంలో ఎలక్ట్రిక్ వాహన విభాగంలో మరింతగా చొచ్చుకుపోయే వ్యూహంతో మహీంద్రా ఉంది. ఆకర్షణీయంగా లేని ఫేమ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లో పదుల సంఖ్యలో కంపెనీలు వందకు పైగా మోడళ్లను ఆఫర్ చేస్తుండగా.. ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో ఉన్న మోడళ్లను వేళ్లమీద లెక్క పెట్టొచ్చు. దీనికి కారణం ఫేమ్ (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఈవీ) పథకం ఎలక్ట్రిక్ కార్లకు ఆకర్షణీయంగా లేకపోవడమేనని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. గడిచిన మూడేళ్ల కాలంలో కేవలం 35,000 వాణిజ్య కార్లకే రాయితీలు రావడం పరిస్థితిని తెలియజేస్తోంది. డిమాండ్ తగినంత లేని పరిస్థితుల్లో పెట్టుబడులతో ప్రయోజనం ఉండదని కార్ల తయారీ సంస్థలు భావిస్తున్నాయి. అతి తక్కువ విక్రయాల కారణంగా భారతీయ కార్ల తయారీ సంస్థలు ఈవీలకు అవసరమైన కీలక విడిభాగాలను.. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ నుంచి పొందడం కష్టమవుతుందని ఐహెచ్ఎస్ మార్కిట్‌కు చెందిన దక్షిణాసియా ప్రధాన అనలిస్ట్ సూరజ్ ఘోష్ అన్నారు. మెట్రోలకే పరిమితమైన ఈవీ టూవీలర్లు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విక్రయాలు ప్రధానంగా మెట్రోలు, పట్టణాలకే పరిమితమయ్యాయి. ఎన్నో సంస్థలు డీలర్ల ద్వారా తమ ఉత్పత్తులను పట్టణాల్లో విక్రయిస్తున్నాయి. మరోవైపు సంప్రదాయ కంపెనీలైన టీవీఎస్, బజాజ్‌లు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఇవి ఇప్పటి వరకు ఒక్కొక్క మోడల్‌నే మార్కెట్లోకి తీసుకొచ్చాయి. బెంగళూరులో ఏడాది క్రితం టీవీఎస్ ఐక్యూబ్ పేరుతో ఈవీ స్కూటర్‌ను ప్రవేశపెట్టగా.. ఇటీవలే ఢిల్లీ మార్కెట్లోకి ఈ ఉత్పత్తిని విడుదల చేసింది. రానున్న రోజుల్లో మరిన్ని మార్కెట్లోకి దీన్ని విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది. అంటే ప్రస్తుతానికి ఐ క్యూబ్ బెంగళూరు, ఢిల్లీ మార్కెట్లకే పరిమితం. బజాజ్ చేతక్ ఈవీ స్కూటర్ కూడా ఇంతే. గ్రీవ్స్కాటన్కు చెందిన యాంపియర్ ఎలక్ట్రిక్ మాత్రం ద్విచక్ర, త్రిచక్ర ఈవీ విభాగంలో చాలా మోడళ్లను తీసుకొస్తోంది. నెట్‌వర్క్‌నూ విస్తరిస్తోంది. తన ఈవీ వ్యాపార బాధ్యతలను చూసేందుకు యమహా ఇండియా మాజీ మార్కెటింగ్ హెడ్ రాయ్ కురియన్ను నియమించుకుంది. ఈ సంస్థకు 230 ప్రాంతాల్లో 300 డీలర్‌షిప్‌లు ఉన్నాయి. టాటా మోటార్స్ దూకుడు టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో వేగంగా అడుగులు వేస్తోంది. భిన్నమైన విధానంతో ఈవీ కార్ల మార్కెట్లో ప్రముఖ స్థానాన్ని ఇప్పటికే సొంతం చేసుకుంది. ప్రస్తుతానికి రెండు ఎలక్ట్రిక్ కార్లు టాటా మోటార్స్ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోలో ఉండగా, మరిన్ని కార్లను ప్రవేశపెట్టే ప్రణాళికతో సంస్థ ఉంది. దేశవ్యాప్తంగా ప్రముఖ రహదారుల్లో ఇప్పటికే 300కు పైగా చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ప్రముఖ పట్టణాలు, జాతీయ రహదారులపై 2021 మార్చి నాటికి చార్జింగ్ స్టేషన్ల సంఖ్యను 700కు చేర్చాలన్న లక్ష్యంతో ఉంది. ‘‘భారత్ వైవిధ్యమైన మార్కెట్. ఈవీ విలువ ఆధారిత చైన్‌లో ఉత్పత్తులు, సేవల పరంగా అపారమైన వృద్ధి అవకాశాలున్నాయి. ఓఈఎమ్ (ఎక్విప్మెంట్ తయారీ సంస్థలు) కంపెనీలు ఇప్పటికే ఉత్పత్తుల తయారీ, సదుపాయాలపై పెట్టుబడులను ప్రారంభించాయి. సరైన విధానం, ప్రామాణిక టెక్నాలజీ, నియంత్రణ చర్యలు అన్నవి దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని గణనీయంగా పెంచేందుకు తోడ్పడతాయి’’ అని ఈవై ఇండియా ఆటోమోటివ్ రంగ పార్ట్నర్ వినయ్ రఘునాథ్ తెలిపారు. -
ద్విచక్ర వాహన అమ్మకాలు అదుర్స్
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల విక్రయాలు సెప్టెంబర్‌లో పుంజుకున్నాయి. ప్రధాన కంపెనీల అమ్మకాలు రెండంకెల వృద్ధిని సాధించాయి. ఒక్క టీవీఎస్ మోటార్ విక్రయాలు మాత్రం స్వల్పంగా క్షీణతను చవిచూశాయి. దేశవ్యాప్తంగా అన్‌లాక్ ప్రక్రియ 5.0 ప్రారంభం కావడం, కోవిడ్ వ్యాప్తి భయాలతో పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామాల్లో వ్యక్తిగత రవాణాకు ప్రాధాన్యత పెరగడం తదితర కారణాలు అమ్మకాలను పుంజుకునేలా చేశాయి. ఈ సెప్టెంబర్‌లో హీరో మోటోకార్ప్, హోండా మోటర్‌సైకిల్, టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో, రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీల మొత్తం విక్రయాలు 17,33,777 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో నమోదైన 15,43, 353 యూనిట్లతో పోలిస్తే 1 శాతం ఎక్కువ. ఇదే ఏడాది ఆగస్ట్ నెల విక్రయాల(14,41041)తో పోలిస్తే 20 శాతం అధికమని గణాంకాలు చెబుతున్నాయి. అవుట్‌లుక్: కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు ఆరోగ్య భద్రత దృష్ట్యా వ్యక్తిగత రవాణాకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా వర్షపాతం అంచనాలకు మించి నమోదైంది. ఈ నేపథ్యంలో ద్విచక్ర వాహనాలకు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ కొంత స్తబ్ధుగా ఉంది. పండుగ సీజన్ సందర్భంగా ఆయా కంపెనీలు తమ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇది పట్టణ ప్రాంతంలోని విక్రయాల లోటును భర్తీ చేసే అవకాశం ఉంది. -
బీఎస్ బజాజ్ కన్నుమూత
హైదరాబాద్: బయోటెక్ రంగ ప్రముఖుడు డాక్టర్ బీఎస్ బజాజ్ (93) మంగళవారం కన్నుమూశారు. ఆయన ఫెడరేషన్ ఆఫ్ ఆసియా బయోటెక్ అసోసియేషన్స్ (ఎఫ్ఏబీఏ) వ్యవస్థాపక కార్యదర్శిగా పనిచేశారు. అలాగే హైదరాబాద్‌లో జీనోమ్ వ్యాలీ ఏర్పాటుకు, 2019లో జరిగిన బయో–ఆసియా సదస్సుకు ఆయన తీవ్రంగా కృషి చేశా రు. 1999లో హైదరాబాద్ లో బయోటెక్నాలజీ స్థాపనకు బజాజ్ ఒక ప్రమోటర్‌గా పనిచేశారు. రాష్ట్రం లో ఆయన రూపొందించిన బయోటెక్ పరిశ్రమ పాలసీ ద్వారా జీనోమ్ వ్యాలీ ఏర్పాటుకు, దాని పెరుగుదలకు దోహదపడింది. బయో రంగంలో మందులు, వ్యాక్సిన్ల తయారీలో ఆయన చాలా మంది శాస్త్రవేత్తలకు మార్గనిర్దేశం చేశారు. బజాజ్ మృతిపట్ల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. బయోటెక్నాలజీ రంగంలో ఆయన చేసిన సేవలను కొనియాడారు. -
సుజుకీ అప్.. హీరో డౌన్
న్యూఢిల్లీ: ఈ ఏడాది నవంబర్‌లో కూడా ఆటో రంగ అమ్మకాలు నెమ్మదించాయి.ద్విచక్ర వాహన విభాగంలో సుజుకీ మోటార్‌సైకిల్ విక్రయాలు 14.69 శాతం పెరిగాయి. దిగ్గజ కంపెనీలైన హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో అమ్మకాలు తగ్గాయి. వాణిజ్య వాహన విభాగంలో అశోక్ లేలాండ్ 25 శాతం తగ్గుదలను నమోదుచేసింది. ప్యాసింజర్ వాహన విభాగంలో మారుతీ వంటి దిగ్గజ కంపెనీల అమ్మకాలు తగ్గిన విషయం తెలిసిందే కాగా, తాజాగా వెల్లడైన టయోటా విక్రయాలు సైతం 22 శాతం క్షీణతను నమోదుచేశాయి. -
చేతక్ మళ్లీ వచ్చేసింది!!
న్యూఢిల్లీ: దేశీ ద్విచక్ర వాహన రంగంలో ఒకప్పుడు రారాజుగా వెలిగి, కనుమరుగైన బజాజ్ చేతక్ స్కూటర్ ఈసారి ఎలక్ట్రిక్ వాహనంగా తిరిగొస్తోంది. బజాజ్ ఆటో బుధవారం చేతక్ ఈ–స్కూటర్‌ను ఆవిష్కరించింది. కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దీన్ని ఆవిష్కరించారు. అమ్మకాలు జనవరి నుంచి మొదలవుతాయని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ తెలిపారు. ముందుగా పుణెలో ఆ తర్వాత బెంగళూరులో విక్రయాలు ప్రారంభిస్తామని, స్పందనను బట్టి మిగతా ప్రాంతాలకు విస్తరిస్తామన్నారు. భవిష్యత్‌లో ఉండే అవకాశాలను గుర్తించే.. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో ముందుగా కాలు మోపుతున్నామని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలు, బయో ఇంధనాలు వంటి పర్యావరణ అనుకూల టెక్నాలజీలదేనని గడ్కరీ తెలిపారు. నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 95 కి.మీ. దాకా మైలేజీ.. అధికారికంగా చేతక్ ఈ–స్కూటర్ రేటు ఎంతన్నది వెల్లడించనప్పటికీ, రూ. 1.5 లక్షల లోపే ఉంటుందని కంపెనీ వెల్లడించింది. దీన్ని ఒక్కసారి 5 గంటల పాటు చార్జింగ్ చేస్తే.. ఎకానమీ మోడ్‌లో 95 కి.మీ., స్పోర్ట్స్ మోడ్‌లో 85 కి.మీ. మైలేజీ ఇస్తుందని పేర్కొంది. తమ ప్రొ–బైకింగ్ డీలర్షిప్స్ ద్వారా వీటిని విక్రయించనున్నట్లు రాజీవ్ బజాజ్ చెప్పారు. మహారాష్ట్రలోని చకన్ ప్లాంటులో తయారు చేసే చేతక్ ఈ–స్కూటర్స్‌ను వచ్చే ఏడాది నుంచి యూరప్‌లోని వివిధ దేశాలకు కూడా ఎగుమతి చేయనున్నట్లు తెలిపారు. హమారా బజాజ్...: 1970ల తొలినాళ్లలో ప్రవేశపెట్టిన చేతక్ స్కూటర్ దేశీ ద్విచక్ర వాహన రంగంలో ఓ సంచలనం సృష్టించింది. మహాయోధుడు రాణా ప్రతాప్ సింగ్‌కి చెందిన వేగవంతమైన అశ్వం ’చేతక్’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ స్కూటర్లు.. అప్పట్లోనే కోటి పైగా అమ్ముడయ్యాయి. బుక్ చేసుకుంటే ఏళ్ల తరబడి వెయిటింగ్ లిస్టు ఉండేది. 2005 ప్రాంతంలో స్కూటర్స్ తయారీని బజాజ్ నిలిపివేసి పూర్తిగా మోటార్‌సైకిల్స్‌పై దృష్టిపెట్టింది. ఎలక్ట్రిక్ టూ వీలర్స్‌కు సబ్సిడీ.. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వెహికిల్స్ (ఫేమ్) పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై కస్టమర్లు సబ్సిడీ అందుకోవచ్చు. ద్విచక్ర వాహనాలకు అంతకు ముందు మోటార్‌నుబట్టి ఈ సబ్సిడీ నిర్ణయించేవారు. ప్రస్తుతం టెక్నాలజీని బట్టి సబ్సిడీ ఇస్తున్నారు. ఒక కిలోవాట్ అవర్‌కు రూ.10,000 చొప్పున గరిష్టంగా రూ.30,000 వరకు సబ్సిడీ ఉందని అవేరా న్యూ అండ్ రెనివేబుల్ ఎనర్జీ మోటోకార్ప్ టెక్ ఫౌండర్ వెంకట రమణ తెలిపారు. ఉదాహరణకు 3 కిలోవాట్ అవర్ సామర్థ్యం గల వాహనం ఖరీదు రూ.80,000 ఉందనుకుందాం. వినియోగదారు షోరూంలో రూ.50,000 చెల్లిస్తే చాలు. తయారీదారు ప్రతి 3 నెలలకు డిపార్ట్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీకి వాహనాల అమ్మకాల వివరాలను అందజేయాల్సి ఉంటుంది. మోటారు వాహన చట్టం కింద నమోదయ్యే ఎలక్ట్రిక్ స్కూటర్లకే ఈ సబ్సిడీ లభిస్తుంది. ఇందుకోసం తయారీదారు స్కూటర్ విభాగంలో సంబంధిత ఎలక్ట్రిక్ వాహనానికి ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకోవాల్సి ఉంటుంది. గంటకు 25 కిలోమీటర్లపైగా వేగం, 250 వాట్స్ కంటే అధిక సామర్థ్యం ఉన్న మోటార్ ఉంటేనే స్కూటర్‌గా పరిగణిస్తారు. -
మార్కెట్లోకి ‘పల్సర్ 125 నియాన్’ బైక్
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ బజాజ్ ఆటో తాజాగా ‘పల్సర్ 125 నియాన్’ బైక్‌ను మార్కెట్లోకి విడుదలచేసింది. ఈ మోడల్లో డ్రమ్ బ్రేక్ వెర్షన్ ధర రూ.64,998 (ఎక్స్‌షోరూమ్ – ఢిల్లీ) కాగా, డిస్క్ బ్రేక్ ఆప్షన్ ధర రూ.66,618 ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది. రెండు వేరియంట్లలోనూ 125సీసీ ఇంజిన్ అమర్చింది. గేర్‌లో ఉన్నప్పుడు కూడా స్టార్ట్ అయ్యే విధంగా రూపొందించిన ఈ బైక్‌కు 5–స్పీడ్ గ్రేర్బాక్స్ ఉన్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా బజాజ్ ఆటో మోటార్ సైకిల్ విభాగ ప్రెసిడెంట్ సారంగ్ కనడే మాట్లాడుతూ.. ‘స్పోర్టీ మోడల్‌ను ఇష్టపడే వారికోసం రూపొందించిన అధునాతన బైక్ ఇది. స్టైల్, పనితీరు పరంగా ఇట్టే ఆకట్టుకునే ఈ బైక్‌ను తక్కువ ధరకే అందిస్తున్నాం’ అని అన్నారు. -
ఆధార్ ప్రింట్ చేసినట్టు కాదు..!
న్యూఢిల్లీ: త్రిచక్ర వాహనాలను 2023 నుంచి, ద్విచక్ర వాహనాలను 2025 నుంచి పూర్తిగా ఎలక్ట్రిక్ రూపంలోనే అనుమతించాలన్న నీతి ఆయోగ్ ప్రతిపాదనపై అగ్రశ్రేణి ఆటో కంపెనీలు అభ్యంతరాలు వ్యక్తంచేశాయి. ఇదేమీ ఆధార్ కార్డును ప్రింట్ చేసింత ఈజీ కాదని టీవీఎస్, బజాజ్ ఆటో వ్యాఖ్యానించాయి. ఈ ప్రతిపాదనల వెనక తగినంత అధ్యయనం, సంప్రదింపులు లేవని పేర్కొన్నాయి. ‘‘ఇది ఆధార్ కార్డు కాదు. సాఫ్ట్వేర్, ప్రింట్ కార్డులు కాదు. మొత్తం సరఫరా చెయిన్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ప్రస్తుత వ్యవస్థ నుంచి దానికి మళ్లాల్సి ఉంటుంది’’ అని టీవీఎస్ మోటార్ కంపెనీ చైర్మన్, ఎండీ వేణు శ్రీనివాసన్ పేర్కొన్నారు. తమ ప్రతిపాదనలపై రెండు వారాల్లో ఆటో మొబైల్ పరిశ్రమ స్పందించాలని నీతి ఆయోగ్ కోరిన నేపథ్యంలో వేణు శ్రీనివాసన్ ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. నాలుగు నెలల సమయం కోరాం... ‘‘ఓ ప్రణాళికతో ముందుకు రావడానికి మాకు నాలుగు నెలల సమయం పడుతుందని తెలియజేశాం. ప్రణాళిక ఓ నగరంతో (అత్యధిక ద్విచక్ర వాహనాలు కలిగిన నగరం) మొదలవుతుంది. ఆ తర్వాత బదిలీ అన్నది కొంత కాలానికి జరుగుతుంది’’ అని వేణు శ్రీనివాసన్ తెలిపారు. 2 కోట్ల వాహనాలు, 15 బిలియన్ డాలర్ల అమ్మకాలు, 10 లక్షల మంది ఉపాధితో కూడిన ఈ రంగంలో ఒకేసారి పూర్తిగా మార్పు అన్నది సాధ్యం కాదని చెప్పారాయన. థర్మల్ (బొగ్గు ఆధారిత) విద్యుత్‌తో నడిచే బ్యాటరీలకు మళ్లడం కాలుష్యాన్ని తగ్గించదని స్పష్టంచేశారు. కాలుష్యంలో వాహనాల పాత్ర 20 శాతం అయితే, ఇందులో ద్విచక్ర వాహనాల నుంచి వెలువడే కాలుష్యం 20 శాతమేనని, అంటే కేవలం 4 శాతం కాలుష్యం గురించి ఇదంతా చేస్తున్నట్టుగా ఉందని అభిప్రాయపడ్డారు. దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమ పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులను ఆకర్షించిందని, ఈ విషయంలో చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. కాగా పూర్తిగా 100 శాతం ఎలక్ట్రిక్ వాహనాలకు మళ్లడం అన్నది అవసరం లేదని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ చెప్పారు. కార్లు తదితర వాహనాలను వదిలేసి, కేవలం ద్వి, త్రిచక్ర వాహనాలనే లక్ష్యం చేసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. తీవ్రంగా ఆందోళన చెందుతున్నాం: హీరో మోటోకార్ప్ 150సీసీ సామర్థ్యం వరకు, ఇంటర్నల్ కంబస్టన్ ఇంజిన్లతో కూడిన ద్విచక్ర వాహనాలను పూర్తిగా నిషేధించాలన్న నీతి ఆయోగ్ విధానంతో తలెత్తబోయే పరిణామాలపై తాము తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్టు అగ్రగామి టూవీలర్ కంపెనీ హీరో మోటోకార్ప్ ప్రకటించింది. ఈ విధానంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. 150సీసీ సామర్థ్యంలోపు ముఖ్యంగా 100సీసీ, 110సీసీ, 125సీసీ విభాగంలో విక్రయమయ్యే అత్యధిక వాహనాలు ఈ కంపెనీవే. భాగస్వాములు అందరి ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలని కంపెనీ సూచించింది. ఎలక్ట్రిక్ వాహనాల అమలును బలవంతంగా రుద్దడానికి బదులు, మార్కెట్ పరిస్థితులు, కస్టమర్ల వైపు నుంచి ఆమోదం వంటి అంశాలతో ఎలక్ట్రిక్ వాహనాలకు మళ్లడం అనేది ఆధారపడి ఉండాలని సూచించింది. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ, దేశ జీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ రంగంపై ప్రతిపాదిత నిషేధం తీవ్ర ప్రభావం చూపుతుందని హీరో మోటోకార్ప్ ఆందోళన వ్యక్తం చేసింది. -
బజాజ్ ఆటో లాభం రూ.1,408 కోట్లు
న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లో మోటార్ బైక్‌ల అమ్మకాల జోరుతో బజాజ్ ఆటో కంపెనీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలం(2018–19, క్యూ4) లో 20 శాతం ఎగసింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2017–18) క్యూ4లో రూ.1,175 కోట్లుగా ఉన్న నికర లాభం గత క్యూ4లో రూ.1,408 కోట్లకు పెరిగిందని బజాజ్ ఆటో తెలిపింది. మొత్తం ఆదాయం రూ.6,788 కోట్ల నుంచి రూ.7,395 కోట్లకు ఎగసిందని కంపెనీ ఈడీ రాకేశ్ శర్మ వెల్లడించారు. కంపెనీ మొత్తం అమ్మకాలు 10.45 లక్షల యూనిట్ల నుంచి 14 శాతం వృద్ధితో 11.93 లక్షల యూనిట్లకు చేరాయని వివరించారు దేశీయంగా బైక్‌ల విక్రయాలు 4.97 లక్షల నుంచి 23 శాతం వృద్ధితో 6.10 లక్షలకు పెరిగాయని పేర్కొన్నారు. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.60 డివిడెండ్‌ను(600 శాతం) ఇవ్వనున్నామని చెప్పారు. మోటార్ బైక్‌ల జోరు...: వాణిజ్య వాహనాలకు సంబంధించిన త్రీ వీలర్ సెగ్మెంట్లో సమస్యలున్నప్పటకీ, మోటార్ బైక్‌ల ముఖ్యంగా దేశీయ మోటార్ బైక్ సెగ్మెంట్ మంచి పనితీరు సాధించిందని రాకేశ్ శర్మ చెప్పారు. ఎంట్రీ లెవల్, టాప్ ఎండ్ ప్రీమియమ్ స్పోర్ట్స్ సెగ్మెంట్లలలో మంచి అమ్మకాలు సాధించా మని పేర్కొన్నారు. బైక్‌ల ఎగుమతులు 3.58 లక్షల నుంచి 3.91 లక్షల కు పెరిగాయని వివరించారు. వాణిజ్య వాహనాల అమ్మకాలు 1.22 లక్ష ల నుంచి 16శాతం తగ్గి 1,02 లక్షలకు పరిమితమయ్యాయని ఆయన తెలిపారు. ఏడాది లాభం రూ.4,928 కోట్లు... ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో రూ.4,219 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 17 శాతం వృద్ధితో రూ.4,928 కోట్లకు పెరిగిందని రాకేశ్ శర్మ వివరించారు. మొత్తం ఆదాయం రూ.25,617 కోట్ల నుంచి రూ.30,250 కోట్లకు చేరింది. అమ్మకాలు 40.06 లక్షల నుంచి 25 శాతం వృద్ధితో 50.19 లక్షలకు పెరిగాయి. దేశీయ మార్కెట్లో మోటార్ బైక్‌ల అమ్మకాలు 19.74 లక్షల నుంచి 29 శాతం వృద్ధితో 25.41 లక్షలకు చేరాయని రాకేశ్ శర్మ పేర్కొన్నారు. రానున్న మూడు, నాలుగు నెలల్లో ప్రస్తుత మోడళ్లలో అప్‌గ్రేడ్ వేరియంట్లను అందుబాటులోకి తెస్తామని వివరించారు. అన్ని విభాగాల్లో ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తెచ్చే విషయమై కసరత్తు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతమున్న తమ మోడళ్లన్నింటినీ గడువులోగా బీఎస్–సిక్స్ ప్రమాణాలకు అనుగుణంగా అందించనున్నామని పేర్కొన్నారు.ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో బీఎస్ఈలో బజాజ్ ఆటో షేర్ 3.3 శాతం లాభంతో రూ.3,042 వద్ద ముగిసింది. -
సరికొత్త ప్లాటినా 110
బజాజ్ ఆటో నుంచి నూతన వెర్షన్ ప్లాటినా 110 సీసీ బైక్ సోమవారం మార్కెట్లో విడుదలైంది. యాంటీ–స్కిడ్ బ్రేకింగ్ వ్యవస్థ, ట్యూబ్‌లెస్ టైర్లు వంటి అధునాత ఫీచర్లను కలిగిన ఈ బైక్ ధర రూ.49,197 (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించినట్లు కంపెనీ వెల్లడించింది. రోడ్లపై గతుకుల ఇబ్బంది అంతగా తెలియకుండా ఉండేలా అత్యాధునిక షాక్ అబ్జార్బర్స్‌ను ఏర్పాటుచేసినట్లు తెలిపింది. బైక్ విడుదల సందర్భంగా సంస్థ ప్రెసిడెంట్ (మోటార్ సైకిల్ బిజినెస్) ఎరిక్ వాస్ మాట్లాడుతూ.. ‘విజయవంతంగా ప్రయాణిస్తున్న ప్లాటినా 100 ఈఎస్ ప్రయాణానికి తాజాగా మరో బైక్ తోడయింది. 100 సీసీ విభాగంలో ప్రీమియం మోడల్‌ను కొరుకునే వినియోగదారులకు ఈ బైక్ ఒక మంచి ఆప్షన్‌గా నిలవనుంది.’ అని వ్యాఖ్యానించారు. -
పల్సర్ 150లో కొత్త వేరియంట్
న్యూఢిల్లీ: బజాజ్ ఆటో కంపెనీ పల్సర్ 150 సీసీ కేటగిరీలో కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి తెచ్చింది. పల్సర్ 150 నియాన్ పేరుతో అందిస్తున్న బైక్ ధర రూ.64,998గా (ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ) నిర్ణయించామని బజాజ్ ఆటో తెలిపింది. 100–110 సీసీ బైక్‌లను మించిన పనితీరు కావాలనుకునే వినియోగదారులు లక్ష్యంగా ఈ కొత్త పల్సర్ 150 నియాన్‌ను తెస్తున్నామని కంపెనీ మోటార్ సైకిల్స్ విభాగం ప్రెసిడెండ్ ఎరిక్ వాస్ పేర్కొన్నారు. 100/110 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న బైక్ కొనాలనుకునే వారికి తొలి ఎంపిక ఇదే అవుతుందన్నారు. ఈ బైక్‌ను 4–స్ట్రోక్, 2– వాల్వ్, ట్విన్ స్పార్క్, ఎయిర్ కూల్డ్ డీటీఎస్–ఐ ఇంజిన్‌తో రూపొందించామని, 5 గేర్లు, ముందు భాగంలో 240 ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్, వెనక భాగంలో 130 సీసీ డ్రమ్ బ్రేక్లున్నాయని వివరించారు. ఈ బైక్...హోండా సీబీ యూనికార్న్ 150, హీరో అచీవర్ 150, యమహా ఎస్‌జడ్–ఆర్ఆర్ తదితర బైక్‌లకు గట్టిపోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. -
డిస్కవర్ 100 సీసీ ఘోర తప్పిదం..
ముంబై: మోటార్‌సైకిల్ శ్రేణి డిస్కవర్లో 100 సీసీ వేరియంట్‌ను ప్రవేశపెట్టడం తన కెరియర్లో ఘోర తప్పిదమని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ వ్యాఖ్యానించారు. దీనితో తమ సంస్థ దేశీ ద్విచక్రవాహనాల మార్కెట్లో నంబర్– 2 స్థానానికి పరిమితమైపోయిందని చెప్పారాయన. ఒకవేళ 100 సీసీని ప్రవేశపెట్టకుండా ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవన్నారు. ‘‘డిస్కవర్లో 125సీసీ వేరియంట్‌ను ప్రవేశపెట్టినప్పుడు ఇటు మైలేజీతో పాటు అటు అధిక సామర్థ్యంతో పనిచేసే బైక్‌గా ప్రత్యేకత ఉండేది. గణనీయంగా పెరిగిన అమ్మకాలే ఇందుకు నిదర్శనం. ఆ తర్వాత అత్యాశకు పోయాం. 125 సీసీ డిస్కవర్ బైకులు ఇంత భారీగా అమ్ముడవుతున్నాయంటే.. ఇక 100 సీసీ బైక్‌లు ఇంకా భారీగా అమ్ముడవుతాయంటూ మా మార్కెటింగ్ సిబ్బంది అభిప్రాయపడ్డారు. దీంతో 100 సీసీ వేరియంట్‌ను ప్రవేశపెట్టాం. అంతే... మా ప్రత్యేకత పోయింది. అయిదేళ్ల తర్వాత మా పనితీరు కూడా దెబ్బతింది. విభిన్నంగా ఉండాలనే ప్రయత్నంతో డిస్కవర్ 125 సీసీని తీసుకొచ్చాం. కానీ ఆ తర్వాత మూసధోరణిలోకి పోయాం. ఈ మూసధోరణి అనేది జీవితంలోనైనా, మార్కెటింగ్లోనైనా చాలా చెడ్డది‘ అని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రాజీవ్ బజాజ్ పేర్కొన్నారు. అప్పుడెప్పుడో చేసిన తప్పిదానికి తమ కంపెనీ ఇప్పటికీ రెండో స్థానానికే (బైక్‌ల అమ్మకాల పరిమాణం పరంగా) పరిమితమైపోవాల్సి వస్తోందని ఆయన తెలిపారు. ఆశావహంగా కేటీఎం.. తాము ఇన్వెస్ట్ చేసిన ఆస్ట్రియన్ రేసింగ్ బైక్‌ల తయారీ సంస్థ కేటీఎం అవకాశాలు ఆశావహంగా ఉన్నాయని రాజీవ్ బజాజ్ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. 2007లో తాము ఇన్వెస్ట్ చేసినప్పుడు కేటీఎం ఏటా 65,000 బైక్‌లు మాత్రమే తయారు చేసేదని, అయినప్పటికీ యూరప్‌లో రెండో అతి పెద్ద మోటార్ సైకిల్ బ్రాండ్‌గా ఉండేదని ఆయన తెలియజేశారు. ‘‘అప్పట్లో మరో దిగ్గజ సంస్థ హార్లే డేవిడ్సన్ ఏడాదికి 3.5 లక్షల బైకులు తయారు చేసేది. అయితే, గత కొన్నాళ్లుగా హార్లే ప్రభావం క్రమంగా తగ్గుతోంది. ఈ ఏడాది 2.4 లక్షల వాహనాలే తయారు చేసే అవకాశం కనిపిస్తోంది. కేటీఎం మాత్రం అంతకు మించి 2.7 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేయనుంది’’ అని ఆయన వివరించారు. వచ్చే ఏడాది ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి ప్రవేశించనున్నట్లు రాజీవ్ బజాజ్ చెప్పారు. -
కొత్త రకం వాహనాలు, ఎలా ఉన్నాయో చూడండి
కొత్త రకం చిన్న వాహనాలు-క్వాడ్రిసైకిల్స్‌కు భారత ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. రోడ్డు రవాణా, ప్రధాన రహదారుల మంత్రిత్వ శాఖ వీటిని ఆమోదించింది. నాలుగు చక్రాలు కలిగిన ఈ కొత్త రకం వాహనాలు, పర్సనల్ వెహికిల్స్‌గా, కమర్షియల్ వెహికిల్స్‌గా వాడుకోవచ్చని తెలిపింది. వీటికి సంబంధించిన ఉద్గారాలు, క్రాష్, ఇతర నిబంధనల జాబితాను ప్రభుత్వం, ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా-ఏఆర్ఏఐలు కలిసి నిర్దేశించనున్నాయి. ఈ కేటగిరీలో తొలి వాహనం బజాజ్ లాంచ్ చేయనుంది. బజాజ్ క్యూట్ పేరుతో దీన్ని మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఇప్పటి వరకు భారత్‌లో ఇలాంటి స్పెషల్ కేటగిరీ వాహనాలు లేవు. అయితే ఈ వాహనాలపై ఏ మేర జీఎస్టీ రేటు అమలు చేస్తారో ప్రభుత్వం ఇంకా స్పష్టీకరించలేదు. ఎలక్ట్రిక్ వాహనాలపై ఉన్న గ్రీన్ ప్లేట్ల మాదిరిగా ఈ వాహనాలకు స్పెషల్ రిజిస్ట్రేషన్ ప్లేట్లను అమలు చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ వాహనాలు 475 కేజీల కంటే తక్కువ బరువు ఉన్నాయి. ఇంకా పొడవు, వెడల్పు కొలతల గురించి సరియైన క్లారిటీ లేదు. ఈ కేటగిరీ వాహనాల వివరాలపై త్వరలోనే రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఓ సర్క్యూలర్ జారీచేయనుంది. ఈ క్వాడ్రిసైకిల్ భారత్‌లో అత్యంత కఠినమైన క్రాష్ టెస్ట్ ప్రొగ్రామ్‌ను కూడా పాస్ కావాల్సి ఉంది. అంతేకాక పెట్రోల్, డీజిల్, ఇతర ప్రత్యామ్నాయ ఇంధన వాహన ఉద్గారాల టెస్ట్‌లను కూడా ఈ వాహనాలపై నిర్వహించనున్నారు. ఫుల్ ఎలక్ట్రిక్ లేదా హైబ్రిడ్ క్వాడ్రిసైకిల్స్‌కు ఇప్పటికే ప్రభుత్వం అంగీకారం తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ వాహనాలను భారత రోడ్లపై అనుమతించడంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భారత రోడ్లపై క్వాడ్రిసైకిళ్లు సురక్షితమైనవి కావని, ఇవి లోపపూరితమైన డిజైన్‌ను కలిగి ఉన్నావని పలువురంటున్నారు. -
ట్విన్ డిస్క్ బ్రేక్స్‌తో బజాజ్ ‘పల్సర్ 150’
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘బజాజ్ ఆటో’ తాజాగా తన బెస్ట్ సెల్లింగ్ మోడల్ ‘పల్సర్ 150’లో సరికొత్త వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇందులో ట్విన్ డిస్క్ బ్రేక్స్, షార్పర్ డిజైన్, కొత్త కలర్ స్కీమ్స్, స్లి్పట్ సీట్స్, లాంగర్ వీల్ బేస్ వంటి పలు ప్రత్యేకతలున్నాయి. దీని ధర రూ.78,016 (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ). ప్రస్తుత సింగిల్ డిస్క్ మోడల్‌కు తాజా వెర్షన్ అదనంగా కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని కం పెనీ తెలిపింది. ట్విన్ డిస్క్ బ్రేక్స్ పల్సర్ 150 ప్రధానంగా బ్లాక్ బ్లూ, బ్లాక్ రెడ్, బ్లాక్ క్రోమ్ అనే మూడు డ్యూయెల్ టోన్ రంగుల్లో లభ్యమౌతుందని పేర్కొంది. ఇంజిన్, చాసిస్ టచ్పాయింట్ల ఆప్టిమైజేషన్‌తో నాయిస్, వైబ్రేషన్ అండ్ షార్‡్షనెస్ (ఎన్వీహెచ్)లో మెరుగుదల తీసుకువచ్చామని తెలిపింది. పనితీరు, మైలేజ్ వంటి అంశాలకు ప్రాధాన్యమిచ్చే యువకులు లక్ష్యంగా ఈ బైక్‌ను రూపొందించినట్లు బజాజ్ ఆటో ప్రెసిడెంట్ ఎరిక్ వాస్ తెలిపారు. -
పల్సర్ 135 ఎల్ఎస్ ఇక మనకు లేదు
సాక్షి, ముంబై: పలర్స్ బైక్ లవర్స్‌కు ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో నిరాశను మిగిల్చింది. పల్సర్ 135 ఎల్ఎస్ బైక్‌ను ఇండియా మార్కెట్ నుంచి బజాజ్ ఆటో ఉపసంహరించుకుంది. ప్రముఖ డీలర్లు అందించిన సమాచారం ప్రకారం పల్సర్ సిరీస్‌లో అతి చిన్నదైన ఈ బైక్‌ను మార్కెట్‌నుంచి తొలగించింది. ఇటీవల ఈ బైక్‌కు డిమాండ్ పడిపోవడంతోపాటు. అప్డేటెడ్ వెర్షన్ లాంచింగ్ కారణంగా ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ షాకింగ్ నిర్ణయంపై మార్కెట్ వర్గాలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. మరోవైపు ఈ వార్తలకు బలాన్నిస్తూ బజాజ్ ఆటో తన అధికారిక వెబ్ సైట్ నుంచి పల్సర్ 135 ఎల్ఎస్ ను తొలగించింది. కాగా ఈ ఏడాది జనవరిలో తమ అన్ని ఉత్పత్తులను కాస్మొటిక్ మార్పులు , నూతన రంగుల జోడింపుతో అప్డేటెడ్ వెర్షన్లో పల్సర్ బైక్‌లను లాంచ్ చేసింది. కానీ, పల్సర్ శ్రేణిలోని అతి చిన్న మోడల్ పల్సర్ 135 ఈ 2018 రేంజ్ నుండి మిస్సయినట్టు తెలుస్తోంది. అయితే ఈ చిన్న పల్సర్‌ను విదేశీ మార్కెట్ కోసం యథావిధిగా ఉత్పత్తి చేస్తుందట. బజాజ్ పల్సర్ 135 ఎల్ఎస్ ఇండియన్ మార్కెట్లో 4-వాల్వ్ టెక్నాలజీతో వచ్చిన మొదటి బైకు బజాజ్ పల్సర్ ఎల్ఎస్135. 4-వాల్వ్ టెక్నాలజీ , మెరుగైన మేలేజీ దీని ప్రధాన ఫీచర్లుగా ఉండేవి. కాగా 2017లో అపడేటెడ్ వెర్షన్ పల్సర్ 135 బైక్‌కు కమ్యూటర్ మోటార్ సైకిల్ లుక్ తీసుకొచ్చింది. 135సీసీ కెపాసిటి సింగిల్ సిలిండర్, పెట్రోల్ ఇంజన్ 13బిహెచ్పి పవర్. 11ఎన్ఎమ్ టార్క్, 5స్పీడ్ గేర్‌బాక్స్ లాంటి ఫీచర్లు ఇందులో జోడించింది. అయితే బజాజ్ ఆటో ఇటీవల అన్నిమోడళ్ళ బైక్‌లను ధరలను రూ.500నుంచి 2వేల దాకా ధరలు పెంచిన సంగతి తెలిసిందే. -
బజాజ్ బైక్స్ ధరలు పెరిగాయ్..
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘బజాజ్ ఆటో’ తాజాగా తన బైక్స్ ధరలను రూ.500–రూ.2,000 శ్రేణిలో పెంచింది. 400 సీసీ బైక్ డొమినార్ ధర గరిష్టంగా రూ.2,000 పెరిగింది. దీంతో ప్రస్తుతం 2018 వెర్షన్ డొమినార్‌లోని స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.1.44 లక్షలకు, ఏబీఎస్ వేరియంట్ ధర రూ.1.58 లక్షలకు చేరింది. పల్సర్ ఆర్ఎస్ 200 ధర రూ.1,800 పెరిగింది. దీంతో ఏబీఎస్ వేరియంట్ ధర రూ.1.36 లక్షలుగా, స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.1.24 లక్షలుగా ఉంది. అవెంజర్ మోడళ్లకు వస్తే.. అవెంజర్ 220 స్ట్రీట్, క్రూయిజ్ ధర రూ.1,000 పెరుగుదతో రూ.94,464కు చేరింది. కొత్త అవెంజర్ 180 ధర రూ.1,100 ఎగసింది. దీని ధర ప్రస్తుతం రూ.84,346. పల్సర్ ఎన్ఎస్ 200 ధర రూ.1,700 పెరిగింది. దీంతో ఏబీఎస్ వెర్షన్ ధర రూ.1.1 లక్షలు, స్టాండర్డ్ వెర్షన్ ధర రూ.98,714గా ఉంది. బజాజ్ వీ15 ధర రూ.1,000 పెరిగింది. -
దుకాణంలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
పశ్చిమగోదావరి ,చింతలపూడి : ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ఆదివారం తృటిలో ప్రమాదం తప్పింది. స్థానిక టీటీడీ కల్యాణ మండపం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బ్రేకులు పనిచేయకపోవడంతో పాటు స్టీరింగ్ పట్టేయడంతో బస్సు పక్కనే ఉన్న బజాజ్ షోరూమ్‌లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు డిపోకు చెందిన బస్సు చింతలపూడి మీదుగా అశ్వారావుపేట వెళుతోంది. చింతలపూడిలో ప్రయాణికులను ఎక్కించుకుని బస్టాండ్ నుంచి బయలుదేరింది. టీటీడీ కల్యాణ మండపం సమీపానికి రాగానే బస్సు అదుపుతప్పి బజాజ్ షోరూమ్‌లోకి దూసుకెళ్లడంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. అదృష్టవశాత్తూ ప్రయాణికులకు ఏమీ జరగలేదు. ప్రమాదంలో కొక్కిరగడ్డ రాజశేఖర్, మెకానిక్ తేజ, వేమారెడ్డిలకు బలమైన గాయాలవ్వడంతో చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో వేమారెడ్డిని ఏలూరు తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్సై సీహెచ్ వెంకటేశ్వరరావు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. ప్రయాణికులను ఇతర వాహనాల్లో గమ్యస్థానాలకు తరలించారు. -
బజాజ్ ‘సీటీ 100’ సరికొత్తగా లాంచ్
బజాజ్ ఆటో తన పాపులర్ బైక్ సీటీ 100 లో అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. ఎలక్ట్రిక్ స్టార్ట్ తో ఆధునీకరించిన సీటీ 100 అల్లాయ్ ఈఎస్‌ను బుధవారం ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది.దీని ధరను రూ.38,806 గా నిర్ణయించింది. విశ్వసనీయత, నాణ్యత మరియు సుపీరియర్ ఇంధన సామర్థ్యంతో కస్టమర్లకు 'జాక్‌పాట్' గా ప్రసిద్ధి చెందిన సీటీ 100 న్యూ లుక్‌తో లాంచ్ చేసింది. పరిమితం కాలానికి దేశవ్యాప్తంగా అన్ని అధికారం బజాజ్ ఆటో డీలర్‌షిప్‌ల వద్ద అందుబాటులో ఉంటుందని కంపెనీ ఒక ప్రకనటలో తెలిపింది. ఇక ఫీచర్ల విషయానికి వస్తే..వినూత్నమైన స్ప్రింగ్ సస్పెన్షన్ స్ప్రింగ్ టెక్నాలజీ , విప్లవాత్మకమైన 103 సీసీ సింగిల్ ఇంజీన్, 4-స్ట్రోక్ పెట్రోల్ మోటార్, 7.7 పీఎస్ పవర్, 8.24ఎన్ఎం టార్క్ తదితర ఫీచర్స్‌తో ఒక ఆకర్షణీయమైన కొత్త డెకాల్ డిజైన్‌తో రూపొందించింది. అలాగే ఫ్యూయల్ గేజ్ , ఫెక్సిబుల్ సైడ్ ఇండికేటర్స్‌ను అమర్చింది. మూడు రంగుల ఆప్షన్స్‌లో ఇంది అందుబాటులో ఉంటుంది. ఎలక్ట్రిక్ స్టార్ట్ సౌలభ్యంతో ఇది వినియోగదారులకి గొప్ప మైలేజిని అందిస్తుందని బజాజ్ ఆటో లిమిటెడ్ అధ్యక్షుడు మోటార్ ఎరిక్ వాస్ తెలిపారు. రూ.38,806 ఆరంభ ధరలో సీటీ 100 ఎలెక్ట్రిక్ స్టార్ట్ వెర్షన్, ఎంట్రీ లెవల్ 100 సీసీ కమ్యూటర్ సెగ్మెంట్లో కస్టమర్ల సంఖ్యను పెంచుకోవాలనిచూస్తున్నామన్నారు. -
బజాజ్ పల్సర్ ఎన్ఎస్160
ధర రూ. 80,648 (ముంబై) న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ ఆటో శుక్రవారం 160సీసీ పల్సర్ ఎన్ఎస్160ని ఆవిష్కరించింది. దీని ధర రూ. 80,648 (ముంబై ఎక్స్‌షోరూం)గా ఉంటుంది. ప్రీమియం నాణ్యత, అంతర్జాతీయ ప్రమాణాల స్టైల్, పనితీరు కోరుకునే యువ కస్టమర్ల కోసం దీన్ని తీర్చిదిద్దినట్లు కంపెనీ ప్రెసిడెంట్ (మోటార్‌సైకిల్స్ విభాగం) ఎరిక్ వాస్ తెలిపారు. ప్రస్తుతం స్పోర్ట్స్ బైకింగ్ సెగ్మెంట్లో ఎక్కువగా 150–160 సీసీ మోటార్ సైకిల్సే ఉంటున్నాయని ఆయన తెలియజేశారు. ఇదే సీసీ సామర్ధ్యంలోనే మరింత మెరుగైన టెక్నాలజీ, పనితీరు కోరుకునే వారి కోసం ఎన్ఎస్ 160ని డిజైన్ చేసినట్లు వాస్ పేర్కొన్నారు. ఈ బైక్‌తో స్పోర్ట్స్ మోటార్‌సైకిల్స్ విభాగంలో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోనున్నట్లు ఆయన తెలిపారు. -
పల్సర్ బైక్స్ రేట్లు పెరిగాయ్!
బజాజ్ ఆటో తన ప్రముఖ మోడల్స్ అన్నింటిపైనా రేట్లను పెంచుతోంది. డొమినార్ 400 మోడల్ పై ధరను పెంచిన అనంతరం తన ప్రముఖ మోడల్ పల్సర్ బైకులపై కూడా రేట్లను పెంచింది. పల్సర్ మోడల్స్ పై ధరను 1,001 రూపాయలు పెంచుతున్నట్టు ప్రకటించింది. పెంచిన ధరలు పల్సర్ 135ఎల్ఎస్ నుంచి పల్సర్ ఆర్ఎస్200 వరకున్న అన్ని మోడల్స్ పైనా అమల్లోకి రానున్నాయని బజాజ్ ఆటో పేర్కొంది. ధరల పెంపు తర్వాత ఎంట్రీ-లెవల్ పల్సర్ 135ఎల్ఎస్ బైక్ ప్రారంభ ధర రూ.61,177కాగ, పాపులర్ పల్సర్ 150 బైకు 75,604 రూపాయలు. పల్సర్ 180 కొత్త ధర రూ.80,546. ఈ ఏడాదిలో బజాజ్ రేట్లను పెంచడం ఇది రెండోసారి. గత నెలలోనే డొమినార్ మోడల్ ధరలను పెంచింది. 200సీసీ కేటగిరీలోని బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200 నాన్-ఏబీఎస్ వేరియంట్ ధర రేట్ల పెంపు తర్వాత రూ.1.22 లక్షలు(ఎక్స్ షోరూం, ఢిల్లీ)గా ఉంది. ఏబీఎస్ వేరియంట్ ధర రూ.1.34 లక్షలు. అదేవిధంగా పల్సర్ ఎన్ఎస్ 200 బైక్ ధర రూ.97,452 రూపాయలు. ఈ బైక్ రెండు మోడల్స్ ను కలిగి ఉంది. ఈ రెండు మోడల్స్ 199.5 సీసీ సింగిల్ సిలిండర్, ఫోర్-స్ట్రోక్, ఎస్ఓహెచ్సీ లిక్విడ్ కూలెడ్ ఇంజిన్ ను కలిగి ఉన్నాయి. ప్రస్తుతం బజాజ్ తన మోడల్స్ లో చాలావాటిలో ధరలను పెంచింది. డిస్కవర్, అవెంజర్, ప్లాటినా కంఫోర్డెక్, వీ, సీటీ100లపై కూడా త్వరలోనే రేట్లను పెంచనుంది. 2017 మేలో ఈ టూ-వీలర్ కంపెనీ మొత్తం విక్రయాల్లో 10 శాతం పడిపోయింది. దేశీయంగా ఈ కంపెనీ విక్రయాలు క్షీణించాయి. -
రెండో అతిపెద్ద బైక్స్ తయారీ కంపెనీగా హోండా
బజాజ్ వెనక్కి; టాప్‌లో హీరో ముంబై: హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) ఏప్రిల్ నెలలో బజాజ్ ఆటోను వెనక్కునెట్టి రెండో అతిపెద్ద బైక్స్ తయారీ కంపెనీగా అవతరించింది. అలాగే టూవీలర్ మార్కెట్ లీడర్‌గా కొనసాగుతున్న హీరో మోటొకార్ప్‌కు కూడా సవాల్ విసురుతోంది. ‘తొలిసారిగా రెండో అతిపెద్ద మోటార్‌సైకిల్ కంపెనీగా అవతరించాం. చాలా ఆనందంగా ఉంది. కంపెనీ బైక్స్ అమ్మకాలు 22% వృద్ధితో 1,83,266 యూనిట్లకు ఎగశాయి’ అని హెచ్ఎంఎస్ఐ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) వై.యస్.గులెరియా తెలిపారు. కాగా బజాజ్ దేశీ విక్రయాలు ఏప్రిల్ నెలలో 19% క్షీణతతో 1,61,930 యూనిట్లకు తగ్గాయి. దీంతో హోండా కంపెనీకి బజాజ్ ఆటోకి మధ్య బైక్స్ విక్రయాల అంతరం 21,336 యూనిట్లుగా నమోదయ్యింది. ఇదేసమయంలో మొత్తం విక్రయాల పరంగా చూస్తే హీరోకి , హోండాకి మధ్య అంతరం 12,377 యూనిట్లుగా ఉంది. ఏప్రిల్‌లో హోండా మొత్తం వాహన విక్రయాలు 34% వృద్ధితో 5,78,929 యూనిట్లకు ఎగిస్తే.. హీరో మొత్తం వాహన అమ్మకాలు మాత్రం 3.5% క్షీణతతో 5,91,306 యూనిట్లకు తగ్గాయి. -
ఎనిమిదేళ్ల బంధానికి తెగదెంపులు
కవసాకి, బజాజ్ తమ ఎనిమిదేళ్ల బంధానికి స్వస్తి చెప్పబోతున్నాయి. సేల్స్, మార్కెటింగ్ పొత్తులో ఏడేళ్లుగా సేవలందిస్తున్న కవసాకి, బజాజ్ ల బంధాన్ని 2017 ఏప్రిల్ 1 నుంచి ఆపివేయాలని కీలకనిర్ణయం తీసుకున్నట్టు కంపెనీలు ప్రకటించాయి. ఏప్రిల్ 1 అనంతరం నుంచి కవసాకి మోటార్ సైకిళ్లు విక్రయాలు, సేల్స్ సర్వీసు కూడా ఇండియా కవసాకి మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచే అందిస్తారని తెలిసింది. కవసాకి హెవీ ఇండస్ట్రీస్ జపాన్‌కు ఇది సబ్సిడరీ. 2009లో విక్రయాలు, విక్రయనాంతరం సర్వీసుల కోసం బజాజ్ ఆటో, కవసాకిలు పొత్తు ఏర్పరుచుకున్నాయి. అప్పటి నుంచి పొత్తులో ఇవి సేవలందిస్తున్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా బజాజ్, కవసాకిల సహకార బంధాన్ని అలానే కొనసాగిస్తామని కంపెనీలు చెప్పాయి. ఇండియన్ సిటీల్లో విస్తరిస్తున్న కవసాకి ప్రస్తుతం 12 షోరూంలని కలిగిఉంది. 14 కవసాకి ఉత్పత్తులను విక్రయిస్తోంది. పరస్పర అంగీకారంతోనే తాము ఈ నిర్ణయానికి వచ్చామని బజాజ్ ఆటో తెలిపింది. 2017 ఏప్రిల్ 1కి ముందు, తర్వాత కవసాకి మోటార్ సైకిళ్లను కొన్నవారు ఇక నుంచి సేల్స్ సర్వీసు కూడా కవసాకిలోనే అందించనున్నారు. అయితే కేటీఎం బ్రాండుపై బజాజ్ ఎక్కువగా ఫోకస్ చేస్తుందని తెలిసింది. కేటీఎం బ్రాండులో బజాజ్ కి 48 శాతం స్టాక్ ఉంది. -
బజాజ్ నుంచి 500 సీసీ బైక్..
న్యూఢిల్లీ: పల్సర్, అవేంజర్‌లతో టూవీలర్ మార్కెట్లో దూసుకుపోతున్న బజాజ్ కంపెనీ.. త్వరలో 500సీసీ స్పోర్ట్స్ బైక్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ మధ్యనే న్యూడోమినర్ -400 పేరుతో ఓ బైక్‌ను విడుదల చేసిన బజాజ్ కంపెనీ తాజాగా 500 సీసీ బైక్‌ను విడుదల చేయాలని నిర్ణయించుకుంది. ఇది కూడా డోమినర్ రేంజ్ ధర రూ.1 లక్ష - 2 లక్షల్లోనే అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపింది. బజాజ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ మీడియాతో మాట్లాడుతూ.. డోమినర్ రేంజ్లో మరిన్ని బైక్‌లను విడుదల చేస్తామని, దీనికి సంబంధించిన ప్రణాళికలున్నాయన్నారు. మరో రెండు, మూడు నెలల్లో బజాజ్ నుంచి మంచి ప్రకటన వింటారని.. అది డోమినర్ బ్రాండ్.. కేటీఎం బ్రాండ్.. లేదా ఏదైనా కొత్త బ్రాండ్ కావచ్చని రాజీవ్ తెలిపారు.. పల్సర్, అవేంజర్లను మరిన్ని సరికొత్త రేంజ్‌లతో మార్కెట్లోకి తెస్తామని, ఇవి ఇప్పటికే మార్కెట్లో మంచి ఆదరణ పొందిన బ్రాండ్లన్నారు. బజాజ్ కంపెనీకి ఎంతో ముఖ్యమైన బ్రాండ్లని రాజీవ్ పేర్కొన్నారు. ఈ బ్రాండ్లు కంపెనీ అమ్మకాలు పెంచాయన్నారు. నోట్ల రద్దు ప్రభావంతో గతేడాది అమ్మకాలు తగ్గిన ఫిబ్రవరిలో స్పల్పంగా పెరిగాయని తెలిపారు. ఎస్ఐఏఎం లెక్కల ప్రకారం గత నెల వరకు భారత్‌లో 8,32,697 టూవీలర్ అమ్మకాలు జరిగాయని అంతకు ముందు నెల అమ్మకాలు 8,59,582 గా ఉన్నాయని తెలిపారు. నెల వ్యవధిలో అమ్మకాలు 3.13 శాతం మేర తగ్గయన్నారు. బజాజ్ ప్రభావంతో హీరో కంపేనీ అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 29.97 శాతం తగ్గినట్లు పేర్కొన్నారు. -
అప్పుడు.. మ్యాడ్ ఇన్ ఇండియా అవుతుంది!
కొత్త ఆవిష్కరణలకు అడ్డంకులు సృష్టిస్తే ఎలా • అయిదేళ్లుగా క్వాడ్రిసైకిల్‌కి అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాం • బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ ముంబై: వినూత్నంగా ఆవిష్కరించిన తమ క్వాడ్రిసైకిల్‌కు అనుమతుల కోసం చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ తాజాగా ప్రభుత్వ విధానాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఓవైపు భారత్‌లో తయారు చేయండని పిలుపునిస్తూ.. మరోవైపు నియంత్రణ ఏజెన్సీలు దేశీయంగా తయారయ్యే కొత్త ఆవిష్కరణల గొంతు నొక్కేస్తున్నాయని వ్యాఖ్యానించారు. దీనివల్ల మేడిన్ ఇండియా నినాదం కాస్తా మ్యాడ్ (పిచ్చితనం) ఇన్ ఇండియాగా మారిపోయే ప్రమాదం ఉందని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తమ కంపెనీ రూపొందించిన క్వాడ్రిసైకిల్ ఉదంతాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘దేశీయంగా తయారు చేసే ఏ కొత్త ఆవిష్కరణ భవితవ్యం అయినా.. ప్రభుత్వ అనుమతులపైనో.. న్యాయపరమైన ప్రక్రియలపైనో ఆధారపడి ఉంటే మేడ్ ఇన్ ఇండియా నినాదం కాస్తా.. మ్యాడ్ ఇన్ ఇండియాగా మారిపోయే ప్రమా దం ఉంది. మేం ఫోర్ వీలర్‌ను రూపొందించి అయిదేళ్లవుతోంది. దాన్ని ఇక్కడ అమ్మడానికి అనుమతుల కోసం అయిదేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నాం’ అని బజాజ్ పేర్కొన్నారు. ఇంధనం ఆదా చేసేవిగాను, సురక్షితమైనవిగాను యూరప్, ఆసియా, లాటిన్ అమెరికాల్లోని దేశాల్లో అమ్ముడవుతున్న క్వాడ్రి–సైకిల్‌ను భారత్‌లో విక్రయించడానికి మాత్రం అడ్డంకులు ఎదురవుతున్నాయన్నారు. తమ సంస్థ కార్లకు వ్యతిరేకమని బజాజ్ మరోసారి స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనాలు ప్రమాదకరమైనవనేది అపోహేనని, నిర్లక్ష్య డ్రైవింగే టూవీలర్ ప్రమాదాలకు కారణమవుతున్నదని చెప్పారు. మళ్లీ స్కూటర్ల యోచన లేదు .. కంపెనీ మళ్లీ స్కూటర్ల తయారీలోకి ప్రవేశించాలన్న సూచనలను బజాజ్ తోసిపుచ్చారు. దీనివల్ల అంతర్జాతీయంగా మోటార్‌సైకిల్ అమ్మకాల్లోని 10% వాటాను మరింతగా పెంచుకోవాలన్న తమ లక్ష్యం పక్కదారి పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. ‘టూ వీలర్ ఏదైనా టూ వీలరే అనుకుంటారు. మోటార్ సైకిల్ తయారు చేస్తున్నప్పుడు స్కూటర్లు కూడా తయారు చేయొచ్చుగా అంటారు. ఇది.. ఎలాగూ బ్యాట్, బాల్తోనే కదా ఆడేది అలాంటప్పుడు బేస్‌బాల్ ఆడొచ్చుగా అని సచిన్ టెండూల్కర్‌కి చెప్పినట్లుగా ఉంటుంది’ అని బజాజ్ అన్నారు. మోటార్‌సైకిల్ మార్కెట్లో మరికాస్త ఎక్కువ వాటా దక్కించుకోవడానికి ప్రయత్నించడం సబబుగా ఉంటుంది కానీ.. అసలు వాటాయే లేని స్కూటర్ల మార్కెట్లో కొత్తగా ప్రవేశించడం వల్ల ప్రయోజనం ఉండదని చెప్పారు. గడువుకు ముందే ‘బీఎస్–4’ అమలు... 2017 జనవరి నుంచి తమ కంపెనీలో తయారవుతోన్న వాహనాలన్నీ బీఎస్–4 నిబంధనలకు అనువుగా ఉన్నాయని బజాజ్ తెలిపారు. బజాజ్ ఆటో పేర్కొంది. నిర్దేశిత గడువు(2017, ఏప్రిల్)కు ముందుగానే బీఎస్–4 అమలుకు సిద్ధంగా ఉన్న తొలి కంపెనీగా తాము అవతరించామని చెప్పారు. -
బజాజ్ ఆటో.. బీఎస్–ఫోర్ పల్సర్
ధర రూ.1.33 లక్షల వరకూ న్యూఢిల్లీ: బజాజ్ ఆటో కంపెనీ బీఎస్–ఫోర్(భారత్ స్టేజ్ ఫోర్) పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా ఉండే రెండు పల్సర్ బైక్ మోడళ్లను సోమవారం మార్కెట్లోకి తెచ్చింది. ఆర్ఎస్ 200, ఎన్ఎస్200 పేర్లతో అందిస్తున్న ఈ మోడళ్ల ధరలు రూ.1.33 లక్షల వరకూ (ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయని బజాజ్ ఆటో తెలిపింది. పల్సర్ ఆర్ఎస్200 మోడల్ ఏబీఎస్(యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్) ఫీచర్‌తో, ఏబీఎస్ ఫీచర్ లేకుండానూ లభిస్తుందని బజాజ్ ఆటో ప్రెసిడెంట్ మోటార్ సైకిల్ బిజినెస్ ఎరిక్ వాస్ తెలిపారు. ఏబీఎస్ ఫీచర్ ఉన్న బైక్ ధర రూ.1.33 లక్షలని, ఏబీఎస్ ఫీచర్ లేని బైక్ ధర రూ.1.22 లక్షలని పేర్కొన్నారు. ఇక పల్సర్ ఎన్ఎస్200 మోడల్ ధరలు రూ.96,453 నుంచి మొదలవుతాయని తెలిపారు. ఆర్ఎస్200 బైక్‌లో ఏబీఎస్, ఫ్యూయల్ ఇంజెక్షన్, లిక్విడ్ కూలింగ్, పెరిమీటర్ ఫ్రేమ్, ట్విన్ ప్రాజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ తదితర అత్యున్నత సాంకేతిక ఫీచర్లున్నాయని వివరించారు. -
మార్కెట్లోకి ‘బజాజ్మాగ్జిమ–సీ’ త్రీ
డాబాగార్డెన్స్: బజాజ్ ఆటో కంపెనీ సరికొత్తగా మార్కెట్లోకి ‘బజాజ్ మాగ్జిమ–సీ’ త్రీ వీలర్ కార్గో ఆటోని సోమవారం విడుదల చేసింది. సంస్థ రీజనల్ మేనేజర్ బి.రాఘవరావు నగరంలోని ఓ హోటల్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటువంటి ఇబ్బందుల్లేకుండా మంచి త్రీవీలర్ కార్గోను అందివ్వడమే సంస్థ ధ్యేయంగా అధునాతనంగా రూపొందించినట్టు చెప్పారు. గూడ్స్‌ను సురక్షితంగా, వేగంగా డెలివరీ చేయడం ఈ కార్గో ఆటో విశేషమన్నారు. 447 సీసీ పవర్ ఇంజన్, 35 వేల కిలోమీటర్ల వరకు పవర్క్లబ్ లైఫ్ ఉంటుందని, పవర్ కప్లింగ్తో మెయింట్‌నెన్స్, డ్రై వింగ్ చేసేటప్పుడు ఎటువంటి హానీ, నష్టం లేకుండా పవర్ సస్పెన్సన్ గల కార్గో వెహికలని చెప్పారు. ఏజెన్సీ, ఎత్తు పల్లాల రోడ్డులో సునాయాసంగా వెళ్లే వాహనమని పేర్కొన్నారు. షోరూం ధర లక్షా 88 వేల 500గా నిర్ణయించినట్టు చెప్పారు.. కార్యక్రమంలో వరుణ్ బజాన్ జనరల్ మేనేజర్ వంశీ తదితరులు పాల్గొన్నారు. -
ఏ బైక్ కొందాం?
ఏ బైక్ కొందాం? బైక్ కొనాలనుకున్న ప్రతి ఒక్కరి మనసులోనూ మొదట మెదిలే ప్రశ్న ఇదే. కొందరైతే తమ స్నేహితుల్ని అడుగుతారు. ఇంకొందరైతే బంధువుల్ని అడుగుతారు. మరికొందరు ఆన్లైన్లో సెర్చ్ చేస్తారు. సమీక్షలు చదువుతారు... వివిధ బైక్‌ల ప్రకటనలు చూస్తారు. కాకపోతే విచిత్రమేంటంటే ఎంత ఎక్కువ చూస్తే అంత ఎక్కువగా అయోమయంలో పడతారు. ఎందుకంటే అన్ని బైక్‌లూ బాగానే ఉంటాయి. ఒకదానితో ఒకటి పోటీ పడతాయి. మరేం చెయ్యాలి? బైక్ కొనేటపుడు చూడాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి. ధర... మైలేజీ... ఫీచర్స్... లుక్. వీటిలో కూడా ఎవరి అవసరాలు వారివి. బడ్జెట్లో కొనాలనుకున్న వారు ధర చూస్తారు. ఎక్కువ తిరిగేవారు మైలేజీ చూస్తారు. కాస్త స్టైల్ కోరుకునే కుర్రకారు లుక్, ఫీచర్లు చూస్తారు. ఇక్కడ ఎవరి చాయిస్ వారిదే. అందుకే ఇపుడు దేశంలో అత్యధిక మైలేజీతో జనాదరణ పొందిన బైక్‌లపై ఈ ప్రత్యేక కథనం... ♦ మైలేజీయే ప్రధానాస్త్రంగా మార్కెట్లోకి కొత్త బైక్‌లు ♦ హీరో, బజాజ్, టీవీఎస్... అన్ని కంపెనీలదీ ఇదే రూటు ♦ స్ల్పెండర్ ఐస్మార్ట్ నుంచి ప్యాషన్ ప్రొ వరకూ అన్నీ దీన్లో కింగ్లే ♦ తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ బైక్‌లతో బజాజ్ పోటీ ♦ డిజైన్, ధరతో కూడా ఆకట్టుకుంటున్న టీవీఎస్ ♦ మైలేజీ, ధర, ఫీచర్లు, లుక్‌లో దేనికదే సాటి... హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్ ఇంజిన్ - 97.2 సీసీ మైలేజ్ - 102.5 కిలోమీటర్లు/లీటర్ ధర - 52,008 దేశంలో అత్యధిక మైలేజ్‌ను ఇచ్చే బైక్ ఇది. లీటరుకు 102.5 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తున్న ఈ బైక్... దేశీ టూవీలర్ మార్కెట్ దిగ్గజం ‘హీరో మోటోకార్ప్’ ఉత్పాదన. కంపెనీ ఈ బైక్‌లో వినూత్న ఐ3ఎస్ టెక్నాలజీని ఉపయోగించింది. అంతేకాదు!! క్లచ్ పట్టుకుంటే చాలు. బైక్ ఆటోమేటిక్‌గా స్టార్ట్ అవుతుంది. సెల్ఫ్ బటన్, కిక్రాడ్తో పని లేదు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సిటీ ప్రాంతాలకిది అనువుగా ఉంటుంది. ఎయిర్‌కూల్డ్ 4-స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్సీ ఇంజిన్ వాడటం వల్ల ఈ మైలేజీ ఇస్తోంది. గరిష్ట వేగం గంటకు 87 కిలోమీటర్లు. ట్యాంక్‌లో 8.7 లీటర్ల పెట్రోల్ పడుతుంది. ఇంజిన్ పవర్-8.36 పీఎస్-8000 ఆర్పీఎం. టార్క్-8.05 ఎన్ఎం-5000 ఆర్పీఎం. బజాజ్ సీటీ 100 ఇంజిన్ - 99.27 సీసీ మైలేజ్ - 99.1 కిలోమీటర్లు/లీటర్ ధర - 39,389 తక్కువ ధరలోనే దేశీ దిగ్గజ టూవీలర్ కంపెనీ ‘బజాజ్ ఆటో’ అందిస్తున్న మైలేజ్ బైక్ ఇది. ఐస్మార్ట్ రాక ముందువరకూ దేశంలో అత్యధిక మైలేజీ బైక్ ట్యాగ్ దీనిదే. ఇపుడు మైలేజీలో రెండో స్థానానికి చేరింది. ఇందులో 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఎయిర్‌కూల్డ్ ఇంజిన్‌ను అమర్చారు. గరిష్ఠంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ బైక్... ఫ్యూయెల్ ట్యాంక్‌లో 10.5 లీటర్ల పెట్రోల్ పడుతుంది. ఇంజిన్ పవర్ 8.2 పీఎస్-7,500 ఆర్పీఎం. టార్క్ 8.05 ఎన్ఎం-4,500 ఆర్పీఎం. బజాజ్ ప్లాటినా ఈఎస్ ఇంజిన్ - 102 సీసీ మైలేజ్ - 96.9 కిలోమీటర్లు/లీటర్ ధర - 46,230 బజాజ్ ఆటో బైక్‌ల శ్రేణిలో మైలేజీలో రెండో స్థానంలో ఉన్న బైక్ ఇది. లీటరుకు 96.9 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇచ్చే ఈ బైక్‌లో అడ్వాన్స్డ్ సింగిల్ సిలిండర్ 2 వాల్వ్ డీటీఎస్ -ఐ ఇంజిన్‌ను అమర్చారు. గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లు. ప్లాటినా ఫ్యూయెల్ ట్యాంక్‌లో 11 లీటర్ల పెట్రోల్ పడుతుంది. ఇంజిన్ పవర్ 8.2 పీఎస్-7,500 ఆర్పీఎం. టార్క్ 8.6 ఎన్ఎం-5,000 ఆర్పీఎం. టీవీఎస్ స్పోర్ట్ ఇంజిన్ - 99.77 సీసీ మైలేజ్ - 95 కిలోమీటర్లు/లీటర్ ధర - 44,140 ‘టీవీఎస్ మోటార్’ కంపెనీ అందిస్తున్న బైకుల్లో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్ ఇదే. లీటరుకు 95 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. కంపెనీ ఈ బైక్‌లో 4 స్ట్రోక్ డ్యూరాలైఫ్ ఇంజిన్‌ను పొందుపరిచింది. ఇంజిన్ పవర్ 7.8 పీఎస్-7,500 ఆర్పీఎం. టార్క్ 7.8 ఎన్ఎం-5,500 ఆర్పీఎం. ఆకట్టుకునే డిజైన్ ఈ బైక్ సొంతం. స్పోర్ట్ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్‌లో 12 లీటర్ల పెట్రోల్ పడుతుంది. హీరో స్ల్పెండర్ ప్రొ ఇంజిన్ - 97.2 సీసీ మైలేజ్ - 93.21 కిలోమీటర్లు/లీటర్ ధర - 50,500 హీరో మోటొకార్ప్ తయారీ ఇది. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది దగ్గర ఈ బైక్‌ను మనం గమనిస్తూనే ఉంటాం. అధిక సంఖ్యాక ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న బైక్... బహుశా ఇదే అనొచ్చేమో. లీటరుకు 93.21 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. ఇంజిన్ పవర్-8.36 పీఎస్-8000 ఆర్పీఎం. టార్క్-8.05 ఎన్ఎం-5000 ఆర్పీఎం. ఇందులో ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్సీ ఇంజిన్‌ను పొందుపరిచారు. గరిష్ట వేగం గంటకు 87 కిలోమీటర్లు. బైక్ ఫ్యూయెల్ ట్యాంక్‌లో 11 లీటర్ల పెట్రోల్ పడుతుంది. హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఎకో ఇంజిన్ - 97.2 సీసీ మైలేజ్ - 88.56 కిలోమీటర్లు/లీటర్ ధర - 48,336 హీరో మోటోకార్ప్ ఉత్పాదన ఇది. లీటరుకు 88.56 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. ఇందులో ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్సీ ఇంజిన్‌ను వాడారు. ఇంజిన్ పవర్-8.36 పీఎస్-8000 ఆర్పీఎం. టార్క్-8.05 ఎన్ఎం-5000 ఆర్పీఎం. దీని గరిష్ట వేగం గంటకు 87 కిలోమీటర్లు. బైక్ ఫ్యూయెల్ ట్యాంక్‌లో 10.5 లీటర్ల పెట్రోల్ పడుతుంది. హీరో స్ల్పెండర్ ప్రొ క్లాసిక్ ఇంజిన్ - 97.2 సీసీ మైలేజ్ - 93.21 కిలోమీటర్లు/లీటర్ ధర - 51,300 హీరో మోటోకార్ప్ అందిస్తోన్న మరో మైలేజీ బైక్ స్ల్పెండర్ ప్రొ క్లాసిక్. ఇది లీటరుకు 93.21 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. ఇంజిన్ పవర్-8.36 పీఎస్-8000 ఆర్పీఎం. టార్క్-8.05 ఎన్ఎం-5000 ఆర్పీఎం. ఇందులో ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్సీ ఇంజిన్‌ను పొందుపరిచారు. దీని గరిష్ట వేగం గంటకు 87 కిలోమీటర్లు. బైక్ ఫ్యూయెల్ ట్యాంక్‌లో 11లీటర్ల పెట్రోల్ పడుతుంది. ప్రత్యేకమైన డిజైన్ ఈ బైక్ సొంతం. హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఇంజిన్ - 97.2 సీసీ మైలేజ్ - 88.56 కిలోమీటర్లు/లీటర్ ధర - 46,318 హీరో మోటొకార్ప్ ఉత్పాదన ఇది. లీటరుకు 88.56 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. ఇందులో ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్సీ ఇంజిన్‌ను పొందుపరిచారు. ఇంజిన్ పవర్-8.36 పీఎస్-8000 ఆర్పీఎం. టార్క్యూ-8.05 ఎన్ఎం-5000 ఆర్పీఎం. దీని గరిష్ట వేగం గంటకు 87 కిలోమీటర్లు. బైక్ ఫ్యూయెల్ ట్యాంక్‌లో 10.5 లీటర్ల పెట్రోల్ పడుతుంది. హీరో ప్యాషన్ ప్రొ ఇంజిన్ - 97.2 సీసీ మైలేజ్ - 87.37 కిలోమీటర్లు/లీటర్ ధర - 52,400 హీరో మోటొకార్ప్ నుంచి వచ్చిన మరో బైక్ ఇది. లీటరుకు 87.37 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. ఇందులో ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్సీ ఇంజిన్‌ను పొందుపరిచారు. ఇంజిన్ పవర్-8.36 పీఎస్-8000 ఆర్పీఎం. టార్క్-8.05 ఎన్ఎం-5000 ఆర్పీఎం. దీని గరిష్ట వేగం గంటకు 87 కిలోమీటర్లు. బైక్ ఫ్యూయెల్ ట్యాంక్‌లో 12.5 లీటర్ల పెట్రోల్ పడుతుంది. హీరో హెచ్ఎఫ్ డాన్ ఇంజిన్ - 97.2 సీసీ మైలేజ్ - 88.56 కిలోమీటర్లు/లీటర్ ధర - 40,070 ఇది కూడా దేశీ దిగ్గజం హీరో మోటొకార్ప్ ఉత్పాదనే. ఇది లీటరుకు 88.56 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. ఇందులో ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్సీ ఇంజిన్‌ను పొందుపరిచారు. ఇంజిన్ పవర్-8.36 పీఎస్-8000 ఆర్పీఎం. టార్క్-8.05 ఎన్ఎం-5000 ఆర్పీఎం. దీని గరిష్ట వేగం గంటకు 87 కిలోమీటర్లు. బైక్ ఫ్యూయెల్ ట్యాంక్‌లో 10.5 లీటర్ల పెట్రోల్ పడుతుంది. గమనిక పైన పేర్కొన్న మైలేజీలు... సెంట్రల్ మోటార్ వె హికల్ రూల్స్(సీఎంవీఆర్)ను అనుసరించి ప్రత్యేక పరీక్షల్లో నిర్ధారించినవి. రోడ్డుపై వాస్తవంగా వచ్చే మైలేజీకి కొంత తేడా ఉంటుంది. ఈ తేడా మామూలు ట్రాఫిక్‌లో 20% వరకూ తక్కువ ఉండే అవకాశము ఉంటుంది.అమ్మకాల్లో టాప్-10 స్కూటర్లు... నిజానికి దేశవ్యాప్తంగా అమ్ముడవుతున్న ద్విచక్ర వాహనాల్లో బైక్‌ల వాటాయే ఎక్కువ. కాకపోతే ఐదేళ్లుగా స్కూటర్ల వాటా మెల్లగా పెరుగుతూ వస్తోంది. 2015-16లో స్కూటర్ల విక్రయాలు కనీవినీ ఎరుగని రీతిలో తొలిసారిగా 50 లక్షల యూనిట్ల మార్కును దాటి 50,31,675 యూనిట్లు అమ్ముడయ్యాయి. వీటిలో 24.66 లక్షల యూనిట్ల విక్రయాలతో హోండా యాక్టివా టాప్‌లో నిలిచింది. ఇక టీవీఎస్ జూపిటర్ అనూహ్యంగా హీరో మాస్ట్రోను ఓవర్ టేక్ చేసి 5.37 లక్షల యూనిట్లతో రెండో స్థానానికి చేరింది. మాస్ట్రో 4.98 లక్షల యూనిట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో హోండా డియో, హీరో ప్లెజర్, సుజుకి యాక్సెస్, యమహా ఫాసినో, హీరో డ్యూయట్, హోండా ఏవియేటర్, యమహా రే టాప్-10 జాబితాలో చోటు సంపాదించాయి. 2015 మే నెలలో ఆవిష్కరించిన ఫాసినో నాలుగు నెలల్లోనే 1 లక్ష యూనిట్ల మార్కును దాటి.. యమహాకు బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచింది. భారత్‌లో కార్ల మార్కెట్ అంతకంతకూ పుంజుకుంటోంది. ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని కార్ల కంపెనీలూ కొత్తకొత్త మోడల్స్‌ను విడుదల చేసేందుకు పోటీపడుతున్నాయి. మరి ఇన్నిరకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. భారతీయ కస్టమర్లు కారు కొనే ముందు మైలేజీ, డిజైన్, కంపెనీ బ్రాండ్ ఇలా దేనికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అసలు దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ కార్లు.. వాటి ప్రత్యేకతలు ఏంటి? అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా కార్ల ప్రియులను కట్టిపడేస్తున్న లగ్జరీ కార్ల విశేషాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? వచ్చే వారం ప్రాఫిట్ ప్లస్‌లో ఇవన్నీ మీ కోసం ప్రత్యేకం. సో.. గెట్ సెట్.. వెయిట్! -
ఆ 25 కంపెనీల్లో 10 మనవే
ఆసియా ఖండంలో ఉద్యోగానికి అనువైన 25 పెద్ద కంపెనీల జాబితాలో భారత్ నుంచి 10 సంస్థలు స్థానం పొందాయి. వీటిల్లో లుపిన్, ఎం అండ్ ఎం, ఇంటర్‌గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ వంటి కంపెనీలు ఉన్నాయి. ఆసియా-పసిఫిక్ ప్రాంతపు ఉద్యోగానికి అనువైన ఉత్తమ కంపెనీల జాబితా ప్రకారం.. ఆసియాలో ఉద్యోగానికి అనువైన ఉత్తమ బహుళజాతి కంపెనీల కార్యాలయాల విభాగంలో డీహెచ్ఎల్ అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాతి స్థానంలో ఓమ్నికామ్, గూగుల్, ఈఎంసీ, మారియట్, నెట్‌యాప్, హయత్, మార్స్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, శాప్ సంస్థలు ఉన్నాయి. వీటిల్లో 8 కంపెనీల కార్యాలయాలు భారత్‌లోనివే. చిన్న, మధ్యతరహా కంపెనీల విభాగంలో సేల్స్‌ఫోర్స్, పెద్ద కంపెనీల విభాగంలో అట్లాసియన్ సంస్థలు టాప్‌లో ఉన్నాయి. ఇక పెద్ద కంపెనీల విభాగంలో భారత్ నుంచి 10 కంపెనీలు స్థానం పొందాయి. వీటిల్లో గోద్రేజ్ కన్సూమర్ ప్రొడక్ట్స్, లుపిన్, ఇంటర్‌గ్లోబ్ ఎంటర్ప్రైజెస్, ఆర్ఎంఎస్ఐ ప్రైవేట్ లిమిటెడ్, ఫోర్బ్స్ మార్షల్, లైఫ్‌స్టైల్ ఇంటర్నేషనల్, బజాజ్ ఫైనాన్స్, సిల్వర్ స్పార్క్ అప్పరెల్, ఉజ్జివన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎం అండ్ ఎం ఆటోమోటివ్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ సెక్టార్స్ ఉన్నాయి. -
బజాజ్... మూడు కొత్త అవెంజర్ మోడళ్లు
హైదరాబాద్: ప్రముఖ వాహన తయారీ కంపెనీ బజాజ్ ఆటో.. ఇటీవల మూడు కొత్త అవెంజర్ మోడళ్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. వాహన రైడర్లకు అనువుగా ఉండే విధంగా స్ట్రీట్ 150, క్రూయిజ్ 220, స్ట్రీట్ 220 అనే అవెంజర్ మోడళ్లను రూపొం దించామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. క్రూయిజ్ 220, స్ట్రీట్ 220 బైకుల్లో 20 సీసీ డీటీఎస్ఐ ఇంజిన్, స్ట్రీట్ 150 బైక్‌లో 150 సీసీ డీటీఎస్ఐ ఇంజిన్‌ను పొందుపరిచామని పేర్కొంది. స్ట్రీట్ బైక్స్ గంటకు 90-100 కిలోమీటర్ల వేగాన్ని, క్రూయిజ్ బైక్ 110 కిలోమీటర్ల వేగాన్ని అందిస్తుందని వివరించింది. స్ట్రీట్ 150 బైక్ ధర రూ. 74,000 (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ)గా, క్రూయిస్ 220, స్ట్రీట్ 220 ధర రూ.84,000 (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ)గా ఉంది. పొడవైన వీల్‌బేస్, తక్కువ ఎత్తులో డిజైన్ చేసిన సీటింగ్ సౌకర్యాలు రైడర్లకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని, లాంగ్ రైడ్‌కు క్రూయిస్ 220, వారంతంలో రైడ్ చేయడానికి స్ట్రీట్ 150, స్ట్రీట్ 220 బైకులు అనువుగా ఉంటాయని కంపెనీ పేర్కొంది. -
బజాజ్ అడ్వెంచ ర్ స్పోర్ట్... కొత్త వేరియంట్లు
హైదరాబాద్: ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ తన పల్సర్ అడ్వెంచర్ స్పోర్ట్ సిరీస్‌లో రెండు కొత్త వేరియంట్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రధానంగా యువతను టార్గెట్ చేస్తూ, సరికొత్త డిజైన్‌తో ‘పల్సర్ ఏఎస్ 200’, ‘పల్సర్ ఏఎస్ 150’ అనే వేరియంట్లను రూపొందించింది. ‘ఏఎస్ 200’ వేరియంట్లో 4 వాల్వ్ 200సీసీ డీటీఎస్-ఐ ఇంజిన్, లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, 6-స్పీడ్ ట్రాన్స్మిషన్ గేర్‌బాక్స్, ట్రిపుల్ స్పార్క్ టెక్నాలజీ, సుపీరియర్ బ్రేకింగ్, నైట్రక్స్ మోనో సస్పెన్షన్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. దీని ధర రూ.92,500 (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ). అలాగే ‘ఏఎస్ 150’ వేరియంట్లో 4 వాల్వ్ 149.5సీసీ డీటీఎస్-ఐ ఇంజిన్, ట్విన్ స్పార్క్ టెక్నాలజీ, 5-స్పీడ్ ట్రాన్స్మిషన్ గేర్‌బాక్స్, ఎయిర్ కూలింగ్ సిస్టమ్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. దీని ధర రూ.79,000 (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ). -
బజాజ్ సూపర్ స్పోర్ట్స్ ‘పల్సర్ ఆర్ఎస్ 200’ బైక్
ధర రూ. 1,18,500-1,30,268 ముంబై: ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ బజాజ్, స్పోర్ట్స్ బైక్స్ ప్రియుల కోసం ‘పల్సర్ ఆర్ఎస్ 200’ అనే సూపర్ స్పోర్ట్స్ బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. లిక్విడ్ కూలింగ్, ఫ్యూయల్ ఇంజెక్షన్‌తో కూడిన 4 వాల్వ్స్ స్పార్క్ డీటీఎస్ఐ ఇంజన్ దీని సొంతం. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 141 కిలోమీటర్లు. దీనిలోని నాన్-ఏబీఎస్ వెర్షన్ ధర రూ.1,18,500గా, ఏబీఎస్ (యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్) వెర్షన్ ధర రూ.1,30,268గా (అన్ని ధరలు మహారాష్ట్ర ఎక్స్ షోరూం) ఉంది. ఎలాంటి వేగంలోనైనా, రోడ్లపైనైనా బైక్‌ను బాగా కంట్రోల్ చే యటానికి ఏబీఎస్ ఉపయోగపడుతుంది. ఈ బైక్ ద్వారా తమ కంపెనీ లక్ష రూపాయలకు పైగా ధరున్న బైక్‌ను తొలిసారి మార్కెట్లోకి విడుదల చేసిందని బజాబ్ ఆటో మోటార్‌సైకిల్ ప్రెసిడెంట్ ఎరిక్ వాస్ చెప్పారు. నెలకు 2,500 యూనిట్ల పల్సర్ ఆర్ఎస్ 200 బైకుల విక్రయాలను లక్ష్యంగా నిర్దేశించుకున్నామని ఆయన తెలిపారు. -
2% పెరిగిన బజాజ్ అమ్మకాలు
న్యూఢిల్లీ: బజాజ్ ఆటో మోటార్‌సైకిళ్ల అమ్మకాలు సెప్టెంబర్‌లో 3 శాతం వృద్ధి చెంది 3,23,879 కు పెరిగాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో 3,15,314 మోటార్ సైకిళ్లు విక్రయించామని బజాజ్ ఆటో బుధవారం పేర్కొంది. ఎగుమతులు 1,33,222 నుంచి 10 శాతం వృద్ధితో 1,46,847కు పెరిగాయని వివరించింది. మొత్తం మీద గత ఏడాది సెప్టెంబర్‌లో 3,60,152 వాహనాలు విక్రయించగా... ఈ ఏడాది సెప్టెంబర్‌లో 2 శాతం వృద్ధితో 3,67,815 వాహనాలు విక్రయించామని బజాజ్ ఆటో పేర్కొంది. 32% తగ్గిన అశోక్ లేలాండ్ అమ్మకాలు ఈ ఏడాది సెప్టెంబర్‌లో 7,232 వాహనాలు విక్రయించామని అశోక్ లేలాండ్ తెలిపింది. గత సెప్టెంబర్ అమ్మకాలతో(10,620)పోల్చితే 32 శాతం క్షీణించాయని పేర్కొంది. వాణిజ్య వాహనాల విక్రయాలు (దోస్త్ మోడల్ మినహా) 7,593 నుంచి 38 శాతం క్షీణించి 4,715కు తగ్గాయని వివరించింది. ఇక దోస్త్ విక్రయాలు 3,027 నుంచి 17 శాతం తగ్గి 2,517కు క్షీణించాయని పేర్కొంది.