
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘బజాజ్ ఆటో’ తాజాగా తన బైక్స్ ధరలను రూ.500–రూ.2,000 శ్రేణిలో పెంచింది. 400 సీసీ బైక్ డొమినార్ ధర గరిష్టంగా రూ.2,000 పెరిగింది. దీంతో ప్రస్తుతం 2018 వెర్షన్ డొమినార్‌లోని స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.1.44 లక్షలకు, ఏబీఎస్ వేరియంట్ ధర రూ.1.58 లక్షలకు చేరింది. పల్సర్ ఆర్‌ఎస్ 200 ధర రూ.1,800 పెరిగింది. దీంతో ఏబీఎస్ వేరియంట్ ధర రూ.1.36 లక్షలుగా, స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.1.24 లక్షలుగా ఉంది.
అవెంజర్ మోడళ్లకు వస్తే.. అవెంజర్ 220 స్ట్రీట్, క్రూయిజ్ ధర రూ.1,000 పెరుగుదతో రూ.94,464కు చేరింది. కొత్త అవెంజర్ 180 ధర రూ.1,100 ఎగసింది. దీని ధర ప్రస్తుతం రూ.84,346. పల్సర్ ఎన్‌ఎస్ 200 ధర రూ.1,700 పెరిగింది. దీంతో ఏబీఎస్ వెర్షన్ ధర రూ.1.1 లక్షలు, స్టాండర్డ్ వెర్షన్ ధర రూ.98,714గా ఉంది. బజాజ్ వీ15 ధర రూ.1,000 పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment