bikes
-
తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులు
భారతదేశంలో లెక్కకు మించిన బైకులు అమ్మకానికి ఉన్నాయి. అయితే చాలామంది సరసమైన, ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ కథనంలో ఇండియన్ మార్కెట్లోని టాప్ 5 చీప్ అండ్ బెస్ట్ బైకులు గురించి తెలుసుకుందాం.హీరో హెచ్ఎఫ్ 100 (Hero HF 100)ఇండియన్ మార్కెట్లో అత్యంత సరసమైన బైకుల జాబితాలో చెప్పుకోదగ్గ మోడల్ 'హీరో హెచ్ఎఫ్ 100'. దీని ధర రూ. 59,018 (ఎక్స్ షోరూమ్). సింపుల్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ బైక్ 65 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. మల్టిపుల్ వేరియంట్లలో లభించే ఈ బైక్.. 97.2 సీసీ ఇంజిన్ ద్వారా.. అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.టీవీఎస్ స్పోర్ట్ (TVS Sport)తక్కువ ధరలో లభించే బైకుల జాబితాలో మరో మోడల్.. టీవీఎస్ స్పోర్ట్. దీని ధర రూ. 59,881 (ఎక్స్ షోరూమ్). 109.7 సీసీ ఇంజిన్ కలిగిన ఈ బైక్ 80 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్లు కాగా.. దీని బరువు 112 కేజీలు మాత్రమే.హీరో హెచ్ఎఫ్ డీలక్స్ (Hero HF Deluxe)రూ. 59,998 (ఎక్స్ షోరూమ్) వద్ద లభించే హీరో హెచ్ఎఫ్ డీలక్స్ కూడా సరసమైన బైకుల జాబితాలో ఒకటి. ఇది 65 కిమీ మైలేజ్ అందిస్తుంది. 4 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ కలిగిన ఈ బైక్ 97.2 సీసీ ఇంజిన్ పొందుతుంది. కాబట్టి మంచి పనితీరును అందిస్తుంది.హోండా షైన్ (Honda Shine)ఇండియన్ మార్కెట్లో ఎక్కువమంది కొనుగోలు చేసిన బైక్ ఈ హోండా షైన్. దీని ప్రారంభ ధర రూ. 66,900 మాత్రమే. ఇందులో 123.94 సీసీ ఇంజిన్ 55 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. దీని ఫ్యూయెక్ ట్యాంక్ కెపాసిటీ 10.5 లీటర్లు. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది.ఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్ కార్ల కథ ముగిసినట్టే?.. ఈవీ పాలసీ 2.0 గురించి తెలుసాటీవీఎస్ రేడియన్ (TVS Radeon)మన జాబితాలో చివరి బైక్.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే.. సరసమైన బైక్ టీవీఎస్ రేడియన్. దీని ప్రారంభ ధర రూ. 70720 (ఎక్స్ షోరూమ్). ఇది 62 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్లు మాత్రమే. ఇంజిన్ 4 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. -
బీఎండబ్ల్యూ స్టైలిష్ బైక్.. లాంచ్ ఎప్పుడంటే?
ప్రముఖ బైక్స్ తయారీ సంస్థ.. 'బీఎండబ్ల్యూ మోటోరాడ్' కంపెనీ దేశీయ మార్కెట్లో 'ఎఫ్ 450 జీఎస్'ను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. 2024 ఈఐసీఎమ్ఏ ఎడిషన్‌లో కనిపించిన ఈ బైక్ 2025 చివరి నాటికి రోడ్డు మీదకి రానుంది.బీఎండబ్ల్యూ ఎఫ్ 450 జీఎస్.. బైక్ 450 సీసీ ట్విన్ సిలిండర్ ఇంజిన్ కలిగి ఉంటుంది. కాబట్టి ఇది మంచి పనితీరును అందిస్తుందని తెలుస్తోంది. ఈ బైక్ ముందు భాగంలో ఫుల్లీ అడ్జస్టబుల్ అప్‌సైడ్-డౌన్ ఫోర్క్, వెనుక భాగంలో మోనో-షాక్ అబ్జార్బర్ వంటివి ఉన్నాయి. రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి.సింగిల్ పీస్ సీటు కలిగిన ఈ బైక్.. డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ సెటప్ కలిగి ఉండి, మధ్యలో GS బ్యాడ్జింగ్ పొందుతుంది. 6.5 ఇంచెస్ TFT డిస్ప్లే, క్రాస్-స్పోక్ వీల్స్ కూడా ఇందులో ఉన్నాయి. 175 కేజీల బరువున్న బీఎండబ్ల్యూ ఎఫ్ 450 జీఎస్ ఆఫ్ రోడింగ్ చేయడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.ఇదీ చదవండి: రోజుకు రూ.27 కోట్లు విరాళం ఇచ్చిన వ్యక్తి.. ఈయన గురించి తెలుసా? -
భారత్‌లోని బెస్ట్ అడ్వెంచర్ బైకులు ఇవే!.. ధరలు ఎలా ఉన్నాయంటే?
ఇండియన్ మార్కెట్లో రోజువారీ వినియోగానికి ఉపయోగపడే బైకులకు మాత్రమే కాకుండా.. అడ్వెంచర్ బైకులకు కూడా మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు సంస్థలు దేశీయ విఫణిలో సరికొత్త అలాంటి బైకులను లాంచ్ చేస్తున్నాయి. ఈ కథనంలో రూ. 3 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే ఐదు బెస్ట్ అడ్వెంచర్ మోటార్ సైకిళ్ళ గురించి తెలుసుకుందాం.సుజుకి వీ-స్ట్రోమ్ ఎస్ఎక్స్ (Suzuki V-Strom SX)సుజుకి వీ-స్ట్రోమ్ ఎస్ఎక్స్ దేశీయ విఫణిలో ఎక్కువ మందిని ఆకర్శించిన బైక్. దీని ధర రూ. 2.16 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ కొనుగోలుపై కంపెనీ ఇప్పుడు (ఫిబ్రవరి) రూ. 15,000 తగ్గింపును అందిస్తోంది. ఈ బైక్ 249 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ద్వారా 9300 rpm వద్ద, 26.1 Bhp పవర్, 7300 rpm వద్ద 22.2 Nm టార్క్ అందిస్తుంది. ఈ బైక్ పొడవైన విండ్‌స్క్రీన్, బీక్ స్టైల్ ఫ్రంట్ ఫెండర్, మస్క్యులర్ ఫ్యూయెల్ ట్యాంక్‌తో మంచి డిజైన్ పొందుతుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌లైట్, బ్లూటూత్ ఎనేబుల్డ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, USB ఛార్జింగ్ స్లాట్ వంటివన్నీ ఉన్నాయి.హీరో ఎక్స్‌పల్స్ 210 (Hero XPulse 210)ఈఐసీఎంఏ 2024లో కనిపించిన హీరో ఎక్స్‌పల్స్ 210 అనేది.. అడ్వెంచర్ లైనప్‌లో తాజా వెర్షన్. ఇది ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో లాంచ్ అయింది. దీని ధర రూ. 1.75 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైకులోని 210 సీసీ ఇంజిన్ 9250 rpm వద్ద, 24.2 Bhp పవర్, 7250 rpm వద్ద 20.7 Nm టార్క్ అందిస్తుంది. కొత్త డిజైన్ కలిగిన ఈ బైక్.. మంచి ఆఫ్ రోడ్ అనుభూతిని కూడా అందిస్తుంది.కేటీఎమ్ 250 అడ్వెంచర్ (KTM 250 Adventure)అడ్వెంచర్ బైక్ అంటే.. అందరికీ ముందుగా గుర్తొచ్చేది కేటీఎమ్ బైకులే. కాబట్టి రూ. 3 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బైకుల జాబితాలో 'కేటీఎమ్ 250 అడ్వెంచర్' ఉంది. దీని ధర రూ. 2.59 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). ఇందులోని 249 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్.. 9250 rpm వద్ద 30.5 Bhp పవర్, 7250 rpm వద్ద 24 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.యెజ్డీ అడ్వెంచర్ (Yezdi Adventure)రూ. 2.09 లక్షల ప్రారంభ ధర వద్ద లభించే.. యెజ్డీ అడ్వెంచర్ కూడా మన జాబితాలో చెప్పుకోదగ్గ బైక్. ఇది 334 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ద్వారా 8000 rpm వద్ద 29.1 Bhp పవర్, 6500 rpm వద్ద 29.8 Nm టార్క్ అందిస్తుంది. ఇది రౌండ్ ఎల్ఈడీ హెడ్‌లైట్, పొడవైన విండ్‌స్క్రీన్, స్ప్లిట్ సీట్లు, వైర్-స్పోక్ వీల్స్ వంటివి పొందుతుంది. కాబట్టి మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.ఇదీ చదవండి: ఫాస్ట్‌ట్యాగ్ కొత్త రూల్స్: ఆ టోల్ ప్లాజాలకు వర్తించదురాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ (Royal Enfield Himalayan)అడ్వెంచర్ చేసేవారికి ఇష్టమైన బైకులలో చెప్పుకోదగ్గ మోడల్ ''రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్''. ఇది 452 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ద్వారా.. 8000 rpm వద్ద 39.4 Bhp పవర్, 5500 rpm వద్ద 40 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైకులో రౌండ్ TFT డిస్ప్లే, ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్, రైడ్-బై-వైర్, మల్టిపుల్ రైడింగ్ మోడ్లు, లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. దీని ధర రూ. 2.85 లక్షలు (ఎక్స్ షోరూమ్). -
రైతు మెచ్చిన ‘మెకానిక్’
కందుకూరు రూరల్: మెకానిక్ షేక్ హజరత్ వలి.. చదివింది తక్కువే.. అయినా తన నైపుణ్యంతో వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాడు. పాత బైకులు, సైకిళ్లతో విభిన్న వ్యవసాయ పరికరాలు తయారు చేస్తూ.. రైతుల మన్ననలు పొందుతున్నాడు. వాటిని అతి తక్కువ ధరకే అన్నదాతలకు అందజేసి.. అందరి అభిమానం చూరగొంటున్నాడు. బైక్ మెకానిక్‌గా మొదలుపెట్టి..శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు సమీపంలోని ఎడ్లూరుపాడుకు చెందిన షేక్ హజరత్ వలి ఎనిమిదో తరగతి వరకే చదువుకున్నాడు. ఆ తర్వాత బైక్ మెకానిక్ పని నేర్చుకొని.. ఇంటి వద్దే చిన్న షాపు ఏర్పాటు చేసుకున్నాడు. అనంతరం లేత్ మిషన్ కొనుగోలు చేసుకొని.. వెల్డింగ్ పనులు చేస్తూ మల్టీపర్పస్ షాపుగా మార్చుకున్నాడు. రైతుల కష్టాన్ని కళ్లారా చూసిన హజరత్‌వలి.. ఖాళీ సమయంలో చిన్నచిన్న వ్యవసాయ పరికరాలు తయారు చేసి వారికి అందిస్తుండేవాడు. ఈక్రమంలో పాత బైక్ ఇంజన్‌తో మల్టీపర్పస్ వ్యవసాయ యంత్రాన్ని తయారు చేశాడు. దానికి సరిగ్గా సరిపోయేలా గొర్రును కూడా తయారుచేసి.. రైతులకు మరింత చేరువయ్యాడు. మెకానిక్ షాపును కాస్తా ‘అగ్రికల్చర్ ఫార్మింగ్ టూల్స్’గా మార్చేశాడు. పాత బైక్‌తో నూతన యంత్రం..ఎవరైనా పాత బైక్‌ను తీసుకెళ్లి హజరత్ వలికి ఇస్తే.. దానికి ఆరు చెక్కల గొర్రు అమర్చి.. నాలుగు చక్రాలు, మూడు చక్రాలు ఏర్పాటు చేసుకునే విధంగా తయారు చేసి ఇస్తున్నాడు. పొగాకు, మిరప, బొబ్బాయి, అరటి, పత్తి తదితర పంటల్లో దున్నేందుకు వీలుగా ఉంటుంది. గొర్రు, గుంటక, నాగలి వంటివి ఆ బైక్‌కు అమర్చుకోవచ్చు. ఒక లీటర్ పెట్రోల్‌తో ఒకటిన్నర ఎకరా పొలం దున్నుకోవచ్చని హజరత్ వలి చెబుతున్నాడు. ఈ యంత్రం తయారీకి రూ.15 వేలు మాత్రమే తీసుకుంటున్నట్లు తెలిపాడు. ఇలా ఇప్పటికే 20 యంత్రాలు తయారు చేసి రైతులకు అందజేసినట్లు వెల్లడించాడు.పారిశుధ్య కార్మికులకుసాయంగా..పారిశుధ్య కార్మికులకు సాయంగా ఓ పరికరాన్ని కూడా హజరత్ వలి తయారు చేశాడు. చెత్తాచెదారంతో పాటు దుర్వాసన వెదజల్లే ఏ వ్యర్థాన్ని అయినా పారిశుధ్య కార్మికులు చేతితో పట్టుకోకుండా.. తాను తయారు చేసిన పరికరం ద్వారా చెత్తబుట్టలో వేయొచ్చని వలి చెప్పాడు. పది కిలోల బరువును సులభంగా తీసి చెత్తబుట్టలో వేయొచ్చని తెలిపాడు. తన వద్ద కొనుగోలు చేసిన యంత్రాలు ఏవైనా మరమ్మతులకు గురైతే.. వాటిని బాగు చేసి ఇస్తానని తెలిపాడు.ప్రభుత్వం సహకారం అందిస్తే మరింతగా రాణిస్తారైతులకు తక్కువ ఖర్చుతో వ్యవసాయ పరికరాలను అందుబాటులోకి తేవడమే నా లక్ష్యం. అయితే నా దగ్గర చాలా ఆలోచనలు ఉన్నా.. తగినంత డబ్బు లేదు. అందుకే కేవలం పాత సామగ్రితో అతి తక్కువ ఖర్చుతో రైతులకు యంత్రాలు, పరికరాలు తయారు చేసి ఇస్తున్నా. ప్రభుత్వం నుంచి సహకారం అందితే మరిన్ని యంత్రాలు తయారు చేస్తా. రైతులు ఎవరైనా అతి తక్కువ ధరకు పరికరాలు కావాలంటే 75699 72889 నంబర్‌ను సంప్రదించవచ్చు. – షేక్.హజరత్‌వలి, మెకానిక్ -
దిగ్గజ కంపెనీలన్నీ ఒకేచోట: అబ్బురపరుస్తున్న కొత్త వెహికల్స్ (ఫోటోలు)
-
భారత్‌లోని బెస్ట్ క్రూయిజర్ బైకులు ఇవే!
మార్కెట్లో సాధారణ బైకులకు మాత్రమే కాకుండా.. క్రూయిజర్ మోటార్‌సైకిళ్లకు కూడా జనాదరణ లభిస్తోంది. దీంతో చాలామంది ఈ బైకులను కొనొగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కథనంలో భారతదేశంలో అమ్మకానికి ఉన్న టాప్ 5 బెస్ట్ క్రూయిజర్ బైకుల గురించి వివరంగా తెలుసుకుందాం.కవాసకి డబ్ల్యు175 (Kawasaki W175)భారతదేశంలో అత్యంత సరసమైన క్రూయిజర్ బైకులలో కవాసకి డబ్ల్యు175 ఒకటి. దీని ప్రారంభ ధర రూ. 1.22 లక్షలు. ఈ బైకులోని 177 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 12.8 హార్స్ పవర్, 12.2 ఏంఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 45 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. మంచి డిజైన్, స్పోక్డ్ రిమ్స్.. అల్లాయ్ వీల్స్ కలిగిన ఈ బైక్ సస్పెన్షన్, బ్రేకింగ్ సిస్టమ్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి.టీవీఎస్ రోనిన్ (TVS Ronin)చూడగానే ఆకర్శించే డిజైన్ కలిగిన టీవీఎస్ రోనిన్ ధరలు రూ. 1.35 లక్షల నుంచి రూ. 1.72 లక్షల మధ్య ఉన్నాయి. ఇందులోని 225.9 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 20.1 హార్స్ పవర్, 19.93 Nm టార్క్ అందిస్తుంది. ఇది 42.95 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. ఈ బైకులో లేటెస్ట్ ఫీచర్స్.. సస్పెన్షన్ సిస్టమ్ వంటివన్నీ ఉన్నాయి. ఇది నగరంలో, హైవేపై రైడింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.బజాజ్ అవెంజర్ 220 (Bajaj Avenger 220)మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ క్రూయిజర్ బైకులలో బజాజ్ అవెంజర్ 220 కూడా ఒకటి. దీని ధర రూ. 1.45 లక్షలు. ఇందులో 18.76 హార్స్ పవర్, 17.55 న్యూటన్ మీటర్ టార్క్ అందించే 220 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. 40 కిమీ / లీ మైలేజ్ అందించే ఈ బైక్ రెట్రో డిజైన్ కలిగి ట్విన్ షాక్ రియర్ సస్పెన్షన్ సెటప్ పొందుతుంది. కాబట్టి ఇది లాంగ్ రైడ్ చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.క్యూజే ఎస్ఆర్సీ 250 (QJ SRC 250)మార్కెట్లో అందుబాటులో ఉన్న క్యూజే ఎస్ఆర్సీ 250 బైక్ ప్రారంభ ధర రూ. 1.49 లక్షలు. 50 కిమీ / లీ మైలేజ్ అందించే ఈ బైక్ 249 సీసీ ట్విన్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 17.4 హార్స్ పవర్, 17 Nm టార్క్ అందిస్తుంది. ఈ బైక్ రోజు వారీ వినియోగానికి మాత్రమే కాకుండా లాంగ్ రైడ్ చేయడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ఇదీ చదవండి: ఆరు నెలల్లో 40000 మంది కొన్న బైక్ ఇదిరాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 (Royal Enfield Hunter 350)రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీకి చెందిన సరసమైన బైక్ ఈ హంటర్ 350. దీని ప్రారంభ ధర రూ. 1.49 లక్షలు. ఇందులో 349 సీసీ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ 20.2 హార్స్ పవర్, 27 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 36 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. అత్యంత ఆకర్షణీయమైన క్రూయిజర్ బైకులలో ఒకటైన హంటర్ 350 మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. -
హార్లే - హీరో సరికొత్త బైక్: త్వరలో..
మార్కెట్లో అప్డేటెడ్ బైకులు పెరుగుతున్న తరుణంలో.. కొత్త వెర్షన్స్‌ను పరిచయం చేసేందుకు అమెరికన్ బ్రాండ్ 'హార్లే డేవిడ్సన్'తో సహకారాన్ని విస్తరించినట్టు హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) తెలిపింది.హీరో మోటోకార్ప్ & హార్లే డేవిడ్సన్ మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగానే.. కొత్త వెర్షన్ హార్లే డేవిడ్సన్ ఎక్స్440 (Harley Davidson X440) బైక్ రానుంది. ఈ రెండు కంపెనీల సహకారంతో తయారైన తొలి మోడల్ 'ఎక్స్ 440'. ఇది గతేడాది మార్కెట్లో అడుగుపెట్టింది. మంచి అమ్మకాలను కూడా పొందుతోంది.హీరో మోటోకార్ప్.. హార్లే డేవిడ్సన్ మధ్య భాగస్వామ్యం 2020 అక్టోబరులో జరిగింది. ఆ తరువాత దేశంలో హార్లే డేవిడ్సన్ బ్రాండ్ ప్రీమియం మోటార్‌సైకిళ్లను అభివృద్ధి చేసి హీరో మోటోకార్ప్ విక్రయిస్తుంది. సర్వీస్, విడిభాగాల సరఫరా బాధ్యత కూడా హీరో మోటోకార్ప్ చేపట్టింది. -
ఎక్కువమంది కొనుగోలు చేస్తున్న బైకులు ఇవే!
భారతదేశంలోని అత్యంత సరసమైన బైకుల జాబితాలో హీరో హెచ్ఎఫ్ డీలక్స్, హోండా షైన్, టీవీఎస్ స్పోర్ట్, బజాజ్ ప్లాటినా, యమహా ఎఫ్‌జెడ్ ఎఫ్ఐ వంటివి ఉన్నాయి. ఈ బైక్స్ ధరలు ఎలా ఉన్నాయి? ఇతర వివరాలు ఏంటి అనేది ఇక్కడ చూసేద్దాం.హీరో హెచ్ఎఫ్ డీలక్స్ (Hero HF Deluxe)భారతదేశంలో తక్కువ ధర వద్ద లభిస్తున్న ఉత్తమ బైకులలో 'హీరో హెచ్ఎఫ్ డీలక్స్' ఒకటి. దీని ధర రూ.56,674 (ఎక్స్ షోరూమ్). ఇది మొత్తం ఐదు వేరియంట్లలో, ఏడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ బైకులోని 97 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 7.91 Bhp పవర్, 8.05 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.హోండా షైన్ (Honda Shine)రూ.62,990 (ఎక్స్ షోరూమ్) వద్ద లభిస్తున్న హోండా షైన్ 124 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభించే ఈ బైక్ 10.59 Bhp పవర్, 11 Nm టార్క్ అందిస్తుంది. ఇది రెండు వేరియంట్లలో, ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది కూడా భారతదేశంలో అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన బైకుల జాబితాలో ఒకటి.టీవీఎస్ స్పోర్ట్ (TVS Sport)భారతదేశంలో ఎక్కువమంది కొనుగోలు చేస్తున్న.. సరసమైన బైకుల జాబితాలో ఒకటిగా ఉన్న మోడల్ టీవీఎస్ స్పోర్ట్. దీని ధర రూ.64,410 (ఎక్స్ షోరూమ్). ఈ బైకులోని 190 సీసీ ఇంజిన్ 8.18 Bhp పవర్, 8.7 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండు వేరియంట్లలో లభించే ఈ బైక్.. మొత్తం ఎనిమిది రంగులలో లభిస్తుంది.బజాజ్ ప్లాటినా (Bajaj Platina)సరసమైన బైకుల జాబితాలో ఒకటి బజాజ్ ప్లాటినా. దీని ధర రూ.66,840 (ఎక్స్ షోరూమ్). ఈ బైకులో 7.79 Bhp పవర్, 8.34 Nm టార్క్ అందించే 102 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 4 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఇది కేవలం ఒకే వేరియంట్.. నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.ఇదీ చదవండి: గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన హ్యుందాయ్ కారు ఇదేయమహా ఎఫ్‌జెడ్ ఎఫ్ఐ (Yamaha FZ Fi)యమహా కంపెనీకి చెందిన ఎఫ్‌జెడ్ ఎఫ్ఐ.. సరసమైన బైకుల జాబితాలో ఒకటిగా ఉన్నప్పటికీ, మన జాబితాలో కొంత ఎక్కువ ఖరీదైన బైక్ అనే చెప్పాలి. దీని ధర రూ.1.16 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైకులో 149 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 12.2 Bhp పవర్, 13.3 Nm టార్క్ అందిస్తుంది. ఇది రెండు వేరియంట్లు, రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. -
ఉద్యోగులకు కార్లు, బైకులు గిఫ్ట్.. ఎక్కడో తెలుసా?
కొన్ని కంపెనీలు దసరాకు బోనస్‌లు ఇవ్వడం, దీపావళికి గిఫ్ట్స్ ఇవ్వడం వంటివి చేస్తుంటాయి. మరికొన్ని సంస్థలు బోనస్‌లు, బహుమతుల ఊసేలేకుండా మిన్నకుండిపోతాయి. అయితే ఇటీవల చెన్నైకి చెందిన సుర్‌మౌంట్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తమ ఉద్యోగులకు బైకులు, కార్లను గిఫ్ట్ ఇచ్చింది. ప్రస్తుతం నెట్టింట్లో ఇదే హాట్ టాపిక్‌గా మారిపోయింది.సుర్‌మౌంట్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తమ ఉద్యోగులను ప్రోత్సహించడంలో భాగంగా 20 మందికి టాటా కార్లు, యాక్టివా స్కూటర్లు, రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను అందించింది.చెన్నైలో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న సుర్‌మౌంట్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లాజిస్టిక్స్ రంగంలో సరుకుల రవాణా, పారదర్శకత, సరఫరాలలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరిస్తుంది. అన్ని వ్యాపారాల్లో లాజిస్టిక్స్‌ను మరింత సరళీకృతం చేయడమే కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు దాని వ్యవస్థాపకుడు, ఎండీ డెంజిల్ రాయన్ పేర్కొన్నారు. -
టాప్ 5 బెస్ట్ 400సీసీ బైకులు: తక్కువ ధర.. ఎక్కువ పర్ఫామెన్స్
భారతదేశంలో 400సీసీ బైకులకు కూడా డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీ ఈ విభాగంలో కూడా బైకులు లాంచ్ చేశాయి. ఈ బైకులు ధరలు సాధారణ బైక్ ధరల కంటే కొంత ఎక్కువగానే ఉంటాయి. అయితే ఈ కథనంలో కొంత తక్కువ ధర వద్ద లభించే టాప్ 5 బెస్ట్ 400సీసీ బైకుల గురించి తెలుసుకుందాం.బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 400జెడ్400 సీసీ విభాగంలోని సరసమైన బైకుల జాబితాలో బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 400జెడ్ ఒకటి. దీని ధర రూ. 1.84 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైకులో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, డీఆర్ఎల్, బ్లూటూత్ కనెక్టివిటీ, రైడింగ్ మోడ్స్ వంటి అనేక ఫీచర్స్ ఉన్నాయి. ఇందులోని 373 సీసీ ఇంజిన్ 39 Bhp పవర్, 35 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ స్లిప్పర్ అండ్ అసిస్ట్ క్లచ్‌తో 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.ట్రయంఫ్ స్పీడ్ టీ4మార్కెట్లో అందుబాటులో ఉన్న ట్రయంఫ్ స్పీడ్ టీ4 ధర రూ. 1.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది ట్రయంఫ్ లైనప్‌లో అత్యంత సరసమైన 400సీసీ బైక్. ఇందులో హజార్డ్ ల్యాంప్స్, ఎల్ఈడీ హెడ్‌లైట్స్, టెయిల్‌లైట్స్ వంటివి ఉన్నాయి. ఈ బైకులోని 398 సీసీ ఇంజిన్ 30 Bhp పవర్, 36 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 411400 సీసీ విభాగంలో ఎక్కువమంది ఇష్టపడే బైకులలో ఒకటి 'రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 411'. దీని ధర రూ.2.05 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ బైకులో అనలాగ్ స్పీడోమీటర్లు, హజార్డ్ ల్యాంప్ వంటివన్నీ ఉన్నాయి. ఇందులోని 411 సీసీ ఇంజిన్ 24 Bhp పవర్, 32 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.బజాజ్ డామినార్ 400బజాజ్ డామినార్ 400 కూడా 400 సీసీ విభాగంలో లభిస్తున్న ఓ సరసమైన బైక్. దీని ధర రూ. 2.26 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులోని 373 సీసీ ఇంజిన్ 39 Bhp పవర్, 35 Nm టార్క్ అందిస్తుంది. 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభించే ఈ బైక్ డ్యూయల్ డిస్ప్లేలు, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ వంటివన్నీ పొందుతుంది.ఇదీ చదవండి: అప్పు కంటే ఎక్కువ రికవరీ చేశారు: విజయ్ మాల్యా ట్వీట్ వైరల్హార్లే డేవిడ్సన్ ఎక్స్440హార్లే డేవిడ్సన్ అంటే ధరల భారీగా ఉంటాయని అందరికీ తెలుసు. కానీ ఈ బ్రాండ్ అంటే ఇష్టపడే కస్టమర్ల కోసం కంపెనీ ఎక్స్440 బైక్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 2.39 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులోని 440 సీసీ ఇంజిన్ 27 Bhp పవర్, 38 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఈ బైక్ మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. -
సూపర్ స్టైలిష్ బైకులు.. కాలేజ్ స్టూడెంట్స్ కోసం!
భారతదేశంలో లాంగ్ రైడ్ చేయడానికి, రోజువారీ ప్రయాణానికి, మహిళలు కోసం, కాలేజ్ స్టూడెంట్స్ కోసం.. ఇలా వివిధ రకాల టూ-వీలర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ కథనంలో ప్రత్యేకించి కాలేజ్ స్టూడెంట్లకు అనువైన ఐదు బెస్ట్ బైకుల గురించి తెలుసుకుందాం.యమహా ఎంటీ-15యమహా అంటే ముందగా గుర్తొచ్చేది స్టైల్. కాబట్టి ఇవి యువతను ఒక్క చూపుతోనే ఆకట్టుకుంటాయి. కాలేజ్ స్టూడెంట్లు బాగా ఇష్టపడే యమహా బైకులలో ఒకటి.. ఏంటీ-15. రూ.1.78 లక్షల ప్రారంభ ధర వద్ద లభించే ఈ బైక్ మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులోని 155 సీసీ ఇంజిన్ ఉత్తమ పర్ఫామెన్స్ అందిస్తుంది.కేటీఎం 125 డ్యూక్యువత ఎక్కువగా ఇష్టపడి కొనుగోలు చేసే బైకులతో ప్రధానంగా చెప్పుకోదగ్గ బైక్ బ్రాండ్ కేటీఎం. ఈ కంపెనీకి చెందిన 125 డ్యూక్ కాలేజ్ విద్యార్థులకు కూడా మొదటి ఎంపిక. దీని ధర రూ.1.78 లక్షలు. ఈ బైకులో 124.7 సీసీ ఇంజిన్ ఉంటుంది. రోజువారీ వినియోగానికి, లాంగ్ రైడ్ చేయడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.బజాజ్ పల్సర్ ఎన్ఎస్200రూ.1.40 లక్షల ప్రారంభ ధర వద్ద లభించే 'బజాజ్ పల్సర్ ఎన్ఎస్200' బైక్ కూడా కాలేజ్ స్టూడెంట్లకు నచ్చిన బైకులలో ఒకటి. మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ బైక్ 199.5 సీసీ ఇంజిన్ పొందుతుంది. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉత్తమ రైడింగ్ అందించే ఈ బైకును స్టూడెంట్స్ మాత్రమే కాకుండా.. సాధారణ ప్రజలు కూడా ఇష్టంగా కొనుగోలు చేస్తారు.రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీకి చెందిన హంటర్ 350 మంచి డిజైన్ కలిగి ఉండటం వల్ల.. సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా, కాలేజ్ స్టూడెంట్స్ కూడా విరివిగా కొనుగోలు చేస్తున్నారు. దీని ప్రారంభ ధర రూ. 1.49 లక్షలు మాత్రమే. ఇది స్టైలిష్ స్ట్రీట్ బైక్. ఇందులో 349.34 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 20.2 Bhp, 27 Nm టార్క్ అందిస్తుంది.ఇదీ చదవండి: రూ.2 లక్షల కంటే తక్కువ ధర.. ఇవిగో బెస్ట్ బైకులు!హీరో ఎక్స్ట్రీమ్ 125ఆర్రూ. 96,781 ప్రారంభ ధర వద్ద లభించే బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్ హీరో మోటోకార్ప్ కంపెనీకి చెందిన 'ఎక్స్ట్రీమ్ 125ఆర్'. ఇందులోని 124.7 సీసీ ఇంజిన్ ఉత్తమ పనితీరును అందిస్తుంది. చూడటానికి స్టైలిష్‌గా కనిపించే ఈ బైక్ 124.7 సీసీ ఇంజిన్ పొందుతుంది. తద్వారా బెస్ట్ పర్ఫామెన్స్ అందిస్తుంది. -
రూ.2 లక్షల కంటే తక్కువ ధర.. ఇవిగో బెస్ట్ బైకులు!
మంచి స్టైల్, అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కోరుకునేవారు.. కొంత ఎక్కువ డబ్బు వెచ్చించి బైక్ కొనాలని చూస్తారు. అలాంటి వారి కోసం ఈ కథనంలో రూ.2 లక్షల కంటే తక్కువ ధరలో లభించే బైకుల గురించి తెలుసుకుందాం.హీరో కరిజ్మా ఎక్స్ఎమ్ఆర్ప్రముఖ బైక్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ దేశీయ మార్కెట్లో 'కరిజ్మా ఎక్స్ఎమ్ఆర్' విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బైక్ ధర రూ. 1.79 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇందులోని 210 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ 9250 rpm వద్ద 25.1 Bhp పవర్, 7250 rpm వద్ద 20.4 Nm టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.హీరో కరిజ్మా ఎక్స్ఎమ్ఆర్ బైక్.. స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, గ్యాస్-ఛార్జ్డ్ మోనోషాక్ వంటి వాటితో పాటు టర్న్-బై-టర్న్ న్యావిగేషన్, ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యూఎస్బీ పోర్ట్ వంటి ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇవన్నీ రైడర్లకు ఉత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.యమహా ఆర్15 వీ4రూ.1.82 లక్షల నుంచి రూ.1.87 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ధర వద్ద లభించే 'యమహా ఆర్15 వీ4' మన జాబితాలో చెప్పుకోడదగ్గ బైక్. ఈ బైకులోని 155 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 10,000 rpm వద్ద 18.1 Bhp పవర్, 7500 rpm వద్ద 14.2 Nm టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది.యమహా ఆర్15 వీ4 బైక్ 282 మిమీ ఫ్రంట్ డిస్క్, 220 మిమీ రియర్ డిస్క్ వంటివి పొందుతుంది. అంతే కాకుండా ఇది మంచి రైడింగ్ అనుభూతిని అందించడానికి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రెండు రైడింగ్ మోడ్లు, ట్రాక్షన్ కంట్రోల్ వంటివి కూడా కలిగి ఉంది.బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200బజాజ్ అంటే అందరికీ గుర్తొచ్చేది పల్సర్. ఈ బైక్ మార్కెట్లో అధిక అమ్మకాలను పొందుతోంది. బజాజ్ ఆర్ఎస్ 200 ధర రూ. 1.74 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ 200 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఈ ఇంజిన్ 24.1 Bhp పవర్, 18.7 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎల్ఈడీ లైటింగ్ వంటివి పొందుతుంది.కేటీఎమ్ ఆర్సీ 125రూ.2 లక్షల కంటే తక్కువ ధర వద్ద కేటీఎమ్ బైక్ కావాలనుకునేవారికి.. ఆర్సీ 125 బెస్ట్ ఆప్షన్. ఈ బైకులోని 124.7 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ద్వారా 9250 rpm వద్ద 14.34 Bhp పవర్, 8000 rpm వద్ద 12 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్, అడ్జస్టబుల్ హ్యాండిల్‌బార్, ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్స్ కలిగిన ఈ బైక్ ఎక్కువమందికి ఇష్టమైన మోడల్. -
తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్: ఇదిగో టాప్ 5 బైకులు
మార్కెట్లో లక్ష రూపాయల నుంచి రూ.70 లక్షల వరకు బైకులు అందుబాటులో ఉన్నాయి. అయితే.. చాలామంది ధరను మాత్రమే కాకుండా మైలేజ్‌ను దృష్టిలో ఉంచుకుని టూ వీలర్స్ కొనుగోలు చేస్తున్నారు. ఈ కథనంలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ 5 బైకులు గురించి వివరంగా తెలుసుకుందాం.బజాజ్ ఫ్రీడమ్ 125'బజాజ్ ఫ్రీడమ్ 125' అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్జీ బైక్. దీని ధర రూ.89,997 నుంచి రూ. 1.09 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఈ బైకులోని 125 సీసీ ఇంజిన్ 9.3 బిహెచ్పీ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే ఇందులో సీఎన్జీ, పెట్రోల్ కోసం రెండు ఫ్యూయల్ ట్యాంకులు ఉంటాయి. ఈ బైక్ 65 కిమీ/లీ మైలేజ్ ఇస్తుందని సమాచారం.టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకుల జాబితాలో 'టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్' ఒకటి. ఈ బైక్ ధరలు రూ. 75541 నుంచి రూ. 78541 (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ బైకులో ఎకోథ్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ (ETFi) టెక్నాలజీ ఉంది. కాబట్టి ఇది సాధారణ మోడల్ కంటే కూడా ఎక్కువ పనితీరును అందిస్తుంది. ఈ బైకులోని 110 సీసీ ఇంజిన్ 8 బీహెచ్పీ పవర్, 8.7 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 86 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.బజాజ్ ప్లాటినా 110రూ. 71,354 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లభిస్తున్న బజాజ్ ప్లాటినా 110 బైక్ 70 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఇందులోని 115 సీసీ ఇంజిన్ 8.4 బీహెచ్పీ పవర్, 9.8 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైకులో ఎల్ఈడీ డీఆర్ఎల్, హ్యాండ్ గార్డ్లు, వైడ్ ఫుట్‌పెగ్‌లు, 5 స్పీడ్ గేర్‌బాక్స్ వంటివి ఉన్నాయి.హోండా సీడీ 110 డ్రీమ్ డీలక్స్హోండా సీడీ 110 డ్రీమ్ డీలక్స్ కూడా ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకుల జాబితాలో ఒకటి. రూ. 74401 (ఎక్స్ షోరూమ్) వద్ద లభిస్తున్న ఈ బైక్ 110 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది జపనీస్ ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్ (ESP) టెక్నాలజీ పొందుతుంది. కాబట్టి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఈ బైక్ మైలేజ్ 65 కిమీ/లీ అని తెలుస్తోంది.ఇదీ చదవండి: 10 రోజుల్లో 10000 మంది కొన్న కారు ఇదే..హీరో స్ప్లెండర్ ప్లస్భారతదేశంలో ఎక్కువమంది కొనుగోలు చేస్తున్న బైకుల జాబితాలో ప్రధానంగా చెప్పుకోదగ్గ బైక్ హీరో స్ప్లెండర్ ప్లస్. ఈ బైక్ ధరలు రూ. 75441 నుంచి రూ. 78286 మధ్య ఉన్నాయి. 100 సీసీ ఇంజిన్, ఐ3ఎస్ టెక్నాలజీ కలిగిన ఈ బైక్ 80.6 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. కాబట్టి దీనిని మైలేజ్ రాజు అని కూడా పిలుస్తారు. -
2025లో లాంచ్.. ఇప్పుడే సిద్దమైన డుకాటీ
ప్రముఖ బైక్ తయారీ సంస్థ 'డుకాటీ' సరికొత్త మల్టిస్ట్రాడా వీ2, వీ2 ఎస్ బైకులను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. కంపెనీ ఈ బైకులను వచ్చే ఏడాది (2025) లాంచ్ చేయనున్నట్లు సమాచారం.2025లో లాంచ్ కానున్న కొత్త డుకాటీ మల్టీస్ట్రాడా వీ2 బైక్.. దాని మునుపటి మోడల్స్ కంటే కూడా 18 కేజీల తక్కువ బరువుతో ఉంటుంది. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 19 లీటర్లు. ఇందులోని 890 సీసీ ఇంజిన్ 115.6 హార్స్ పవర్, 92.1 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ స్లిప్పర్ క్లచ్ అండ్ బైడైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌తో 6 స్పీడ్ గేర్‌బాక్స్ పొందుతుంది.కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ కాకుండా డిజైన్, ఫీచర్స్ వంటివన్నీ రెండింటిలోనూ ఒకే విధంగా ఉన్నప్పటికీ.. ఎస్ వేరియంట్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ యూనిట్. ఈ బైక్ ముందు భాగంలో 120/70-ఆర్19 టైర్, వెనుక 170/60-ఆర్19 టైర్లు ఉన్నాయి. ఇందులో 320 మిమీ ఫ్రంట్ డిస్క్‌లు, వెనుక 265 మిమీ రియర్ డిస్క్ ఉన్నాయి.మల్టీస్ట్రాడా వీ2 ట్రాక్షన్ కంట్రోల్, రైడింగ్ మోడ్లు, స్విచబుల్ డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, పవర్ మోడ్లు, ఇంజిన్ బ్రేకింగ్ కంట్రోల్‌తో కూడిన సరికొత్త ఎలక్ట్రానిక్స్ వంటివన్నీ ఉన్నాయి. ఈ ఎలక్ట్రానిక్స్ అన్నీ 5 ఇంచెస్ టీఎఫ్టీ డిస్ప్లేలో కనిపిస్తాయి. ప్రస్తుతం కంపెనీ ఈ బైక్ ధరలను వెల్లడించలేదు. అయితే ధరలు రూ. 16 లక్షల కంటే ఎక్కువ ఉండొచ్చని సమాచారం. -
క్లాసిక్ లుక్‌లో కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ 650 (ఫొటోలు)
-
కేటీఎమ్ బ్రాండ్ మొదటిసారి అలా..
-
హోండా మోటార్‌సైకిల్ కీలక ప్రకటన: ఆ బైకులకు రీకాల్
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా తన 'సీఆర్ఎఫ్1100 ఆఫ్రికా ట్విన్' బైకులకు రీకాల్ ప్రకటించింది. త్రాటల్ ఆపరేషన్ సమస్య కారణంగా కంపెనీ రీకాల్ ప్రకటించినట్లు సమాచారం. 2022 ఫిబ్రవరి - 2022 అక్టోబర్ మధ్య తయారైన బైకులలో సమస్య ఉన్నట్లు కంపెనీ గుర్తించింది.ఎన్ని బైకులు ఈ రీకాల్ ప్రభావానికి గురయ్యాయో.. కంపెనీ వెల్లడించలేదు. త్రాటల్ ఆపరేషన్ సమస్య వల్ల రైడర్.. రైడింగ్ సమయంలో బ్యాలెన్స్ కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమస్యని పరిష్కరించడానికి కంపెనీ ఎలక్ట్రానిక్ కంట్రోల్డ్ యూనిట్ సాఫ్ట్వేర్ అప్డేట్ రూపొందించనుంది.వారంటీతో సంబంధం లేకుండా ప్రభావిత బైక్‌లలో సమస్యను ఉచితంగా పరిష్కరిస్తుంది. హోండా బిగ్‌వింగ్ వెబ్సైట్లో VINని నమోదు చేయడం ద్వారా కస్టమర్లు.. తమ బైక్ జాబితాలో ఉందో.. లేదో తెలుసుకోవచ్చు. ఈ బైక్ ధరలు మార్కెట్లో రూ. 16.01 లక్షల నుంచి రూ. 17.55 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. -
నమ్మండి ఇది 'రాయల్ ఎన్ఫీల్డ్' బైకే.. (ఫోటోలు)
-
బాక్స్ అనుకుంటున్నారా? ఇది ఎలక్ట్రిక్ స్కూటర్ - రేటెంతో తెలుసా?
-
భారత్‌లో అత్యంత ఖరీదైన బైకులు ఇవే! (ఫోటోలు)
-
హ్యాండిల్, సీటు లేని హోండా ఇంజిన్!
-
EICMA 2024 : కళ్ళు చెదిరే సరికొత్త బైకులు.. చూస్తే మతిపోవాల్సిందే! (ఫోటోలు)
-
లక్షల ఖరీదైన బైకులు: మరింత కొత్తగా..
మారుతున్న ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా.. చాలా వాహన తయారీ సంస్థలు బైక్‌లను అప్డేట్ చేయడానికి సిద్ధమయ్యాయి. ఈ జాబితాలో బీఎండబ్ల్యూ మోటోరాడ్ కూడా చేరింది. ఇది ఒకేసారి నాలుగు బైకులను (ఎస్ 1000 ఆర్, ఎం 1000 ఆర్, ఎస్ 1000 ఆర్ఆర్, ఎం 1000 ఆర్ఆర్) అప్డేట్ చేయనుంది. ఇందులో నేకెడ్ ఆర్ మోడల్స్ కొత్త స్టైలింగ్ పొందుతాయి. పుల్ ఫెయిర్డ్ ఆర్ఆర్ బైకులు రీడిజైన్ పొందుతాయి.బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్, ఎం 1000 ఆర్ వంటి నేకెడ్ బైక్స్ ట్విన్ పాడ్ ఎల్ఈడీ హెడ్‌లైట్ పొందుతాయి. పవర్, టార్క్ కూడా దాని మునుపటి మోడల్స్ కంటే కూడా కొంత ఎక్కువగా ఉంటుంది. బైక్ ఇంజిన్ డ్రాగ్ టార్క్ కంట్రోల్ పొందుతుంది. సీటు కింద యూఎస్బీ-సీ ఛార్జర్ ఉంటుంది. ఈ అప్డేటెడ్ బైకులు యాంత్రికంగా మునుపటి మోడల్స్ మాదిరిగానే ఉంటాయి. ఈ బైకులలో ఎక్కువ భాగం నలుపు రంగు ఉండటం చూడవచ్చు.ఇక బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్, ఎం 1000 ఆర్ బైకుల విషయానికి వస్తే.. ఎం 1000 ఆర్ఆర్ కొంత ఎక్కువ హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. వింగ్లెట్లు కొంత పెద్దవిగా ఉంటాయి. కాస్మొటిక్ అప్డేట్స్ కూడా ఎక్కువగా ఉండటం గమనించవచ్చు. బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్ స్పోర్ట్‌బైక్ కూడా రీడిజైన్ పొందుతుంది. అయితే యాంత్రికంగా ఎటువంటి మార్పు పొందదు.బీఎండబ్ల్యూ మోటోరాడ్ కంపెనీ ఈ నాలుగు బైకులను భారతదేశంలో లాంచ్ చేస్తుందా? లేదా అనే విషయంపై ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టత లేదు. గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కానున్న ఈ బైకుల ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి.➤బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్: రూ. 19 లక్షల నుంచి రూ. 23.30 లక్షలు➤బీఎండబ్ల్యూ ఎం 1000 ఆర్: రూ. 33 లక్షల నుంచి రూ. 38 లక్షలు➤బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్: రూ. 20.75 లక్షల నుంచి రూ. 25.25 లక్షలు➤బీఎండబ్ల్యూ ఎం 1000 ఆర్ఆర్: రూ. 49 లక్షల నుంచి రూ. 55 లక్షలు -
ఎక్కువ మైలేజ్ ఇచ్చే 5 బెస్ట్ బైకులు: ధర లక్ష కంటే తక్కువే..
ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో మంచి మైలేజ్ ఇచ్చే బైకులకు కొదువే లేదు. అయితే రూ.1 లక్ష కంటే తక్కువ ధర వద్ద అందుబాటులో ఉన్న ఐదు ఉత్తమ బైకులు గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.టీవీఎస్ స్పోర్ట్టీవీఎస్ కంపెనీకి చెందిన స్పోర్ట్ బైక్ అత్యధిక మైలేజ్ ఇచ్చే టూ వీలర్స్ జాబితాలో ఒకటిగా ఉంది. దీని ప్రారంభ ధర రూ. 59,881 కాగా.. టాప్ వేరియంట్ ధర రూ. 71,383 (ఎక్స్ షోరూమ్). ఇది 109.7 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ముందు, వెనుక డ్రమ్ బ్రేక్స్ కలిగిన ఈ బైక్ 80 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది.బజాజ్ సీటీ 110ఎక్స్రూ. 70,176 ప్రారంభ ధర (ఎక్స్ షోరూమ్) వద్ద లభించే బజాజ్ సీటీ 110ఎక్స్ కూడా మంచి మైలేజ్ అందించే బెస్ట్ బైక్. ఇది 70 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఇందులోని 115 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 8.48 హార్స్ పవర్, 9.81 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ బైక్ ఫోర్ స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది.హీరో హెచ్ఎఫ్ డీలక్స్హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ప్రారంభ ధర రూ. 59,998. సెల్ఫ్-స్టార్ట్ ఆప్షన్ కలిగిన టాప్ వేరియంట్ ధరలు రూ. 69,018 (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్). ఈ బైక్ 97.2 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ద్వారా 7.91 హార్స్ పవర్, 8.05 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఫోర్ స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఇది 70 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.టీవీఎస్ రేడియన్రూ. 59,880 నుంచి రూ. 81,394 మధ్య (ఎక్స్ షోరూమ్) లభించే టీవీఎస్ రేడియన్ బైక్ 109.7 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8.08 హార్స్ పవర్, 8.7 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది ఫోర్ స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఈ బైక్ 68.6 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.ఇదీ చదవండి: 90వేల కార్లు వెనక్కి: హోండా కీలక ప్రకటనహోండా ఎస్పీ 125హోండా ఎస్పీ 125 ధరలు రూ. 87,468 నుంచి రూ. 91,468 (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ బైక్ 124 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి 10.72 Hp, 10.9 Nm టార్క్ అందిస్తుంది. 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ కలిగిన ఈ బైక్ రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్స్ పొందుతుంది. ఈ బైక్ 60 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. -
వచ్చేస్తోంది రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ చూశారా
-
కార్లు, బైక్‌లు అబ్బో.. అదృష్టమంటే ఈ ఐటీ కంపెనీ ఉద్యోగులదే!
చెన్నైకి చెందిన టీమ్ డిటైలింగ్ సొల్యూషన్స్ అద్భుతమైన బహుమతులతో తమ ఉద్యోగులను ఆశ్చర్యపరిచింది. 28 కార్లు, 29 బైక్‌లను బహుమతిగా ఇచ్చింది. ఉద్యోగుల్లో మరింత ప్రేరణ కల్పించడానికి, ఉత్పాదకతను పెంచడానికి కంపెనీ ఈ చర్య చేపట్టినట్లు తెలుస్తోంది.2005లో ప్రారంభమైన టీమ్ డిటైలింగ్ సొల్యూషన్స్ స్ట్రక్చరల్ స్టీల్ డిజైన్, డిటైలింగ్ సేవలను అందిస్తోంది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ కణ్ణన్ మీడియాతో మాట్లాడుతూ, ఉద్యోగుల కష్టాన్ని గుర్తించి, అభినందించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ గుర్తింపు ఉద్యోగులను తమ పాత్రల్లో రాణించేలా మరింత ప్రేరేపిస్తుందని కంపెనీ అభిప్రాయపడింది.ఉద్యోగులకు బహుమతిగా ఇచ్చిన కార్లలో మారుతీ సుజుకీ, హ్యుందాయ్ వంటి కంపెనీలతోపాటు మెర్సిడెస్ బెంజ్ కార్లు కూడా ఉండటం విశేషం. కార్లు, బైక్‌లతో పాటు, టీమ్ డిటైలింగ్ సొల్యూషన్స్ తమ ఉద్యోగులకు వివాహ కానుకను కూడా అందిస్తోంది. గతంలో రూ.50,000గా ఉన్న ఈ కానుకను ఈ ఏడాది రూ.లక్షకు కంపెనీ పెంచింది. -
రాయల్ ఎన్ఫీల్డ్ బైకులకు రీకాల్.. కారణం ఇదే
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్.. నవంబర్ 2022 - మార్చి 2023 మధ్య తయారు చేసిన బైకులకు రీకాల్ ప్రకటించింది. రొటీన్ టెస్టింగ్ సమయంలో వెనుక, సైడ్ రిఫ్లెక్టర్లతో సమస్యను గుర్తించిన కంపెనీ, దీనిని పరిష్కరించడానికి రీకాల్ ప్రకటించింది.నిర్దేశించిన సమయంలో తయారైన మోటార్‌సైకిళ్లలోని రిఫ్లెక్టర్లు.. రిఫ్లెక్టివ్ పనితీరు సరిగ్గా ఉండకపోవచ్చు. దీని వల్ల కాంతి తక్కువగా ఉండటం వల్ల దృశ్యమానత దెబ్బతింటుంది. ఇది రోడ్డుపైన ప్రమాదాలు జరగడానికి కారణమవుతుంది. అయితే ఈ సమస్యపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు, కానీ కంపెనీ ముందు జాగ్రత్తగానే రీకాల్ ప్రకటించింది.ఇదీ చదవండి: చెట్టుకింద వచ్చిన ఆలోచన.. వేలకోట్లు సంపాదించేలా..కంపెనీ ఈ సమస్యను ఉచితంగా పరిష్కరిస్తుంది. బైకులో ఈ సమస్యను పరిష్కరించడానికి కేవలం 15 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. కాబట్టి భర్తీ ప్రక్రియ త్వరగా, సమర్ధవంతంగా ఉంటుందని రాయల్ ఎన్ఫీల్డ్ పేర్కొంది. బ్రాండ్ సర్వీస్ టీమ్‌లు వారి సమీప సర్వీస్ సెంటర్లో రీప్లేస్మెంట్ షెడ్యూల్ చేయడానికి ప్రభావిత మోటార్‌సైకిళ్ల యజమానులను నేరుగా సంప్రదించనున్నట్లు సమాచారం. -
రూ.1.5 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బైకులు.. ఇవే!
భారతదేశంలో టూ వీలర్ మార్కెట్ గణనీయంగా అభివృద్ధి చెందుతోంది. గతంలో ఇండియన్ మార్కెట్లో 110 సీసీ బైకులు ఆధిపత్యం చెలాయించాయి. ఇప్పుడు ఈ స్థానంలో 125 సీసీ.. 200 సీసీ బైకులు ఉన్నాయి. ప్రస్తుతం దేశీయ విఫణిలో రూ. 1.5 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బెస్ట్ కమ్యూటర్ బైకుల గురించి వివరంగా ఇక్కడ చూసేద్దాం.హీరో ఎక్స్ట్రీమ్ 125ఆర్రూ. 95000 (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభించే 'హీరో ఎక్స్ట్రీమ్ 125ఆర్' అనేది ప్రస్తుతం మార్కెట్లో మంచి అమ్మకాలు పొందుతున్న బైక్. 125 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగిన ఈ బైక్ 11.4 Bhp పవర్, 10.5 Nm టార్క్ అందిస్తుంది. ఇది ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, షార్ప్ ఎల్ఈడీ ఇండికేటర్స్, లేటెస్ట్ టెయిల్ లాంప్ వంటివి పొందుతుంది.టీవీఎస్ రైడర్ 125టీవీఎస్ మోటార్ కంపెనీకి చెందిన 'రైడర్ 125' బైక్ కేవలం రెండున్నర సంవత్సరాల్లో 7,00,000 యూనిట్ల అమ్మకాలను పొందగలిగింది. దీన్ని బట్టి చూస్తే మార్కెట్లో ఈ బైకుకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది 124.8 సీసీ సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ ద్వారా ఉత్తమ పనితీరును అందిస్తుంది.బజాజ్ ఫ్రీడమ్ 125సీఎన్జీ బైక్ విభాగంలో అడుగుపెట్టిన మొట్ట మొదటి బైక్.. ఈ బజాజ్ ఫ్రీడమ్ 125. ఇది పెట్రోల్ అండ్ సీఎన్జీ ట్యాంక్స్ కలిగి 330 కిమీ మైలేజ్ అందిస్తుంది. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 95000 (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ 125 సీసీ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో 8000 rpm వద్ద 9.37 Bhp పవర్, 5000 rpm వద్ద 9.7 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.హోండా హార్నెట్ 2.0రూ. 1.40 లక్షల (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లభించే ఈ బైక్ మంచి డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. 184.4 సీసీ ఇంజిన్ కలిగిన హార్నెట్ 2.0 బైక్ 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఇది 17 బ్రేక్ హార్స్ పవర్, 15.9 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.ఇదీ చదవండి: కోటి మంది కొన్న హోండా స్కూటర్ ఇదే..బజాజ్ పల్సర్ ఎన్160అతి తక్కువ కాలంలో ఎంతోమంది బైక్ ప్రేమికులను ఆకర్శించిన బైకులలో ఒకటి బజాజ్ పల్సర్. ఇది ప్రస్తుతం మల్టిపుల్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. అయితే మన జాబితాలో చెప్పుకోదగ్గ బైక్ పల్సర్ ఎన్160. దీని ప్రారంభ ధర రూ. 1.34 లక్షలు (ఎక్స్ షోరూమ్). 164.82 సీసీ సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కలిగిన ఈ బైక్ 17.7 Bhp పవర్, 14.65 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. -
హోండా బైకులకు రీకాల్: జాబితాలోని మోడల్స్ ఇవే..
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ 'హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా' తన సీబీ350, హైనెస్ సీబీ350 బైకులకు రీకాల్ ప్రకటించింది. వీల్ స్పీడ్ సెన్సార్, క్యామ్‌షాఫ్ట్ సమస్యల కారణంగానే ఈ రీకాల్ ప్రకటించినట్లు కంపెనీ వెల్లడించింది.2020 అక్టోబర్ నుంచి 2024 ఏప్రిల్ మధ్య తయారైన సీబీ300ఎఫ్, సీబీ300ఆర్, సీబీ350, హైనెస్ సీబీ350, సీబీ350ఆర్ఎస్ బైకులకు కంపెనీ రీకాల్ ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ బైకులలో ఎలాంటి సమస్య తలెత్తలేదు, కానీ కంపెనీ ముందుగానే ఈ నిర్ణయం తీసుకుంది.వీల్ స్పీడ్ సెన్సార్‌లో ఉన్న సమస్య వల్ల అందులోని నీరు ప్రవేశించే అవకాశం ఉంది. ఇది స్పీడోమీటర్, ట్రాక్షన్ కంట్రోల్, ఏబీఎస్ వంటి వాటిమీద ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమస్యను రీకాల్ ద్వారా పరిష్కరించడానికి కంపెనీ సిద్ధమైంది.ఇదీ చదవండి: 809కిమీ రేంజ్ అందించే బెంజ్ కారు లాంచ్: ధర ఎంతంటే? ఇక క్యామ్‌షాఫ్ట్ కాంపోనెంట్‌తో వచ్చే సమస్యలు.. వెహికల్ పనితీరు మీద ప్రభావితం చూపుతాయి. కాబట్టి 2020 అక్టోబర్ నుంచి 2024 ఏప్రిల్ మధ్య తయారైన.. కంపెనీ వెల్లడించిన బైకులకు సంస్థ ఉచితంగానే సమస్యను పరిష్కరిస్తుంది. వాహనం వారంటీతో సంబంధం లేకుండా సమస్యకు కారణమైన భాగాలను కంపెనీ ఉచితంగానే రీప్లేస్ చేస్తుంది. -
షో రూమ్ కే నిప్పు పెట్టిన యువకుడు
-
మరమ్మతుల ఖర్చూ ముంచుతోంది
బుడమేరు వరద ధాటికి విజయవాడ నగరంలో పలు ప్రాంతాలు వారం రోజులకు పైగా నీటిలోనే ఉన్నాయి. భారీ వర్షాలు, కృష్ణా నదిలో భారీ ప్రవాహం, బుడమేరు వరద.. ఇలా అన్ని వైపులా నీరు చుట్టుముట్టడంతో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇళ్లల్లో విలువైన వస్తువులతోపాటు ద్విచక్రవాహనాలు, కార్లు సైతం నీట మునిగాయి. దీంతో అవి పూర్తిగా పాడయ్యాయి. –లబ్బీపేట (విజయవాడ తూర్పు)/మధురానగర్ (విజయవాడ సెంట్రల్)ఒక్కో వాహనానికి రూ.వేలల్లో ఖర్చుఇప్పటికే వరదలతో తమ సర్వస్వాన్ని కోల్పోయి రోడ్డున పడ్డ బాధితులు ఇప్పుడు తమ వాహనాల మరమ్మతులకు కూడా భారీగా వెచ్చించాల్సి రావడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఒక్కో ద్విచక్ర వాహనం మరమ్మతులకు మెకానిక్‌లు రూ.5 వేలు నుంచి రూ.10 వేలు వసూలు చేస్తున్నారు. చేతిలో వాహనం లేకపోతే అనేక పనులు ఆగిపోతాయి కాబట్టి అప్పోసొప్పో చేసి బాగు చేయించక తప్పడంలేదని వాహనదారులు వాపోతున్నారు. విజయవాడ సింగ్ నగర్ డాబా కొట్లు సెంటర్, పైపుల రోడ్డు, ఆంధ్రప్రభ కాలనీ రోడ్డుల్లోని మెకానిక్‌ల వద్ద రిపేర్లు కోసం పెద్ద సంఖ్యలో బైక్‌లు స్కూటర్లు బారులు తీరాయి.కొన్ని వాహనాల ఇంజన్లు పాడైపోవడంతో పూర్తిగా స్తంభించిపోయి కనీసం నడపడానికి కూడా వీలు కావడం లేదు. ఒక్క సింగ్‌నగర్‌లోనే 25 నుంచి 30 వేలకు పైగా ద్విచక్రవాహనాలు పాడయ్యాయని అంచనా. మరోవైపు కార్లను కూడా రిపేర్లు కోసం రికవరీ వెహికల్స్‌తో షెడ్లకు తరలిస్తున్నారు. సింగ్‌నగర్ ప్రాంతంలో సోమవారం ఎక్కడ చూసినా కార్లు తరలించే దృశ్యాలే కనిపించాయి. మా వాహనాలన్నీ మునిగిపోయాయి..నాకు, మా పిల్లలకు మూడు ద్విచక్రవాహనాలు, రెండు ఆటోలు ఉన్నాయి. అన్నీ వరద నీటిలో మునిగిపోయాయి. రిపేరు కోసం తీసుకెళ్తే రూ.7 వేలు నుంచి రూ.10 వేలు అవుతుందని మెకానిక్‌లు చెబుతున్నారు. ఆటోలకు ఎంత అవుతుందో తెలియడం లేదు. అంత ఖర్చు ఎలా భరించాలో అర్థం కావడం లేదు. – ఎస్కే కరీముల్లా, సింగ్నగర్జీవనోపాధి పోయింది.. బుడమేరు వరద ఉధృతికి నా టాటా ఏస్ నీట మునిగింది. దీంతో జీవనోపాధి కోల్పోయాను. వాహనం ఇప్పుడు పనిచేయని స్థితిలో ఉంది. మరమ్మతులు చేయించాలంటే కనీసం రూ. 70 వేలు అవుతుందని అంటున్నారు. వరద వల్ల అన్నీ కోల్పోయిన నేను ఇప్పుడు అంత డబ్బులు ఎలా తీసుకురావాలో అర్థం కావడం లేదు. – గౌస్, బాధితుడు -
అప్డేటెడ్ జావా 42 బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
ప్రముఖ బైక్ తయారీ సంస్థ జావా మోటార్‌సైకిల్ అప్డేటెడ్ బైక్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త జావా 42 బైక్ ధరలు రూ. 1.73 లక్షల నుంచి రూ. 1.98 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా రూ. 16000 తక్కువ ధరకే లభిస్తుంది.2024 జావా 42 బైక్ 294 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 27.32 హార్స్ పవర్ మరియు 26.84 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ పొందుతుంది. రీడిజైన్ పొందిన ఈ బైక్ సింగిల్ ఛానల్ ఏబీఎస్ పొందుతుంది. అనలాగ్ ఎల్సీడీ సెటప్ కూడా ఇందులో గమనించవచ్చు.మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్ కలిగిన ఈ బైక్ సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. అప్డేటెడ్ జావా 42 సీటు ఎత్తు 788 మిమీ వరకు ఉంటుంది. ఈ అప్డేటెడ్ బైక్ దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.The 2024 Jawa 42 is here! This is the answer you’ve been waiting for. With the perfect trinity of Performance, Neo-Classic Design and Engineering - you are in for a ride like no other!#Jawa42TheAnswer #Jawa42 #JPanther #JawaMotorcycles pic.twitter.com/AA4qFLCT3g— Jawa Motorcycles (@jawamotorcycles) August 13, 2024 -
గుద్దుకుంటూ పోయిన బస్సు..
-
జూన్ 13న లాంచ్ అయ్యే బీఎండబ్ల్యూ బైక్ ఇదే - వివరాలు
ఖరీదైన బైకులను లాంచ్ చేసే బీఎండబ్ల్యూ మోటోరాడ్ సరికొత్త 'ఆర్ 1300 జీఎస్'ను జూన్ 13న లాంచ్ చేయడానికి సిద్ధమైంది. కంపెనీ లాంచ్ చేయనున్న ఈ బైక్ ఆధునిక హంగులతో, అద్భుతమైన పనితీరును అందించడానికి కావాల్సిన ఇంజిన్ ఆప్షన్ పొందనున్నట్లు తెలుస్తోంది.బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ బైక్ మంచి డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ట్విన్ పాడ్ హెడ్‌లైట్, ఎల్ఈడీ డీఆర్ఎల్ వంటివి ఉంటాయి. ఈ బైక్ దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే స్టాండర్డ్ రైడింగ్ మోడ్లు, ఎలక్ట్రానిక్ సస్పెన్షన్, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ పొందుతుంది.బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ 1300 సీసీ ట్విన్ సిలిండర్ ఇంజన్ పొందుతుంది. ఇది 7750 rpm వద్ద 145 Bhp పవర్, 6500 rpm వద్ద 149 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.త్వరలో లాంచ్ కానున్న కొత్త బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ బైక్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, BMW రాడార్ అసిస్టెడ్ క్రూయిజ్ కంట్రోల్, మల్టిపుల్ రైడ్ మోడ్లు, ట్రాక్షన్ కంట్రోల్, స్విచ్ చేయగల ఏబీఎస్ వంటి అనేక ఫీచర్స్ ఉన్నాయి. ఈ బైక్ ధర రూ. 20 లక్షల కంటే ఎక్కువ ధర వద్ద లాంచ్ అవుతుందని సమాచారం. ఖచ్చితమైన ధరలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి. -
ఒక్క చూపుకే ఫిదా చేస్తున్న 'బీఎండబ్ల్యూ ఆర్20' - వివరాలు
ప్రముఖ బైక్ తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మోటొరాడ్ (BMW Motorrad) సరికొత్త కాన్సెప్ట్ మోటార్‌సైకిల్ 'బీఎండబ్ల్యూ ఆర్20' ఆవిష్కరించింది. చూడటానికి చాలా అద్భుతంగా ఉన్న ఈ బైక్ ఓ ప్రత్యేకమైన డిజైన్ కలిగి.. చూడగానే ఆకర్శించే విధంగా ఉంది.కొత్త బీఎండబ్ల్యూ ఆర్20 బైక్ 2000 సీసీ ఎయిర్ ఆయిల్ కూల్డ్ బాక్సర్ ఇంజన్‌ను పొందుతుంది. అయితే ఈ ఇంజిన్ పనితీరు గణాంకాలను కంపెనీ వెల్లడించలేదు. ఇంజన్ కొత్త సిలిండర్ హెడ్ కవర్లు, కొత్త బెల్ట్ కవర్, కొత్త ఆయిల్-కూలర్ కూడా ఉన్నాయి.మోడ్రన్ క్లాసిక్ మోటార్‌సైకిల్ డిజైన్ కలిగిన ఈ బైక్ సరికొత్త గులాబీ రంగులో ఉంటుంది. సింగిల్ సీటును క్విల్టెడ్ బ్లాక్ ఆల్కాంటారా అండ్ ఫైన్-గ్రెయిన్ లెదర్‌లో అప్హోల్స్టర్ చేసారు. ఇందులో కొత్త ఎల్ఈడీ హెడ్‌లైట్, 3డీ ప్రింటెడ్ అల్యూమినియం రింగ్‌లో ఇంటిగ్రేటెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్ వంటివి ఉన్నాయి.బీఎండబ్ల్యూ ఆర్20 బైక్ 17 ఇంచెస్ ఫ్రంట్ స్పోక్ వీల్.. 17 ఇంచెస్ రియర్ బ్లాక్ డిస్క్ వీల్ పొందుతుంది. వెనుక టైర్ 200/55, ముందు టైరు 120/70 పరిమాణం పొందుతుంది. బీఎండబ్ల్యూ పారాలెవర్ సిస్టమ్ క్రోమ్-మాలిబ్డినం స్టీల్ స్వింగార్మ్, అల్యూమినియం పారాలెవర్ స్ట్రట్ ఇందులో ఉపయోగించారు. కాబట్టి రైడర్ మంచి రైడింగ్ అనుభూతిని పొందవచ్చు. -
ఇటలీలో అడుగెట్టిన టీవీఎస్.. విక్రయాలకు ఈ బైకులు
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ 'టీవీఎస్ మోటార్' గ్లోబల్ మార్కెట్లో తన ఉనికిని నిరంతరం విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ తన కార్యకలాపాలను ఇటలీలో కూడా ప్రారంభించింది. ఇప్పటికే 80 దేశాల్లో విస్తరించిన టీవీఎస్ కంపెనీ మరిన్ని దేశాలకు విస్తరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.టీవీఎస్ మోటార్ ఇటాలియా ద్వారా ఇటలీలో తన కార్యకలాపాలను విస్తరిస్తుంది. దీనికి జియోవన్నీ నోటార్బార్టోలో డి ఫర్నారీ నేతృత్వం వహిస్తారు. దీని ద్వారా టీవీఎస్ అపాచీ RTR, అపాచీ RTR 310, టీవీఎస్ రైడర్, టీవీఎస్ NTorq, జుపీటర్ 125 వంటి మోడల్స్ విక్రయించాలని కంపెనీ యోచిస్తోంది.టీవీఎస్ కంపెనీ ఇటలీ మార్కెట్లో ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా విక్రయించే అవకాశం ఉంది. టీవీఎస్ మోటార్ కంపెనీ హెడ్ గ్రూప్ స్ట్రాటజీ ప్రెసిడెంట్, శరద్ మోహన్ మిశ్రా, కంపెనీ ఇటాలియన్ లాంచ్‌పై మాట్లాడుతూ.. మా వాహనాలకు ఇటాలియన్ వినియోగదారులను పరిచయం చేయడానికి చాలా ఆసక్తిగా ఉన్నాము. ఇక్కడ కూడా కంపెనీ ఉత్తమ ఆదరణ పొందుతుందని భావిస్తున్నామని అన్నారు. -
న్యూ ఇయర్లో లాంచ్ అయిన కొత్త వెహికల్స్ - వివరాలు
గత ఏడాది భారతీయ మార్కెట్లో లెక్కకు మించిన వాహనాలు లాంచ్ అయ్యాయి, ఈ ఏడాది కూడా కొన్ని లాంచ్ అయ్యాయి.. లాంచ్ అవ్వడానికి సిద్దమవుతున్నాయి. ఈ కథనంలో న్యూ ఇయర్లో విడుదలైన బైకుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కవాసకి జెడ్ఎక్స్-6ఆర్ కవాసకి కంపెనీ 2024 ప్రారంభంలో రూ. 11.09 లక్షల 'జెడ్ఎక్స్-6ఆర్' బైక్ లాంచ్ చేసింది. బిఎస్6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్స్ పొందిన ఈ బైక్ డిజైన్, ఫీచర్స్ పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది. ఇందులోని 636 సీసీ ఇంజిన్ 129 హార్స్ పవర్, 69 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. కవాసకి ఎలిమినేటర్ 500 ఈ ఏడాది ప్రారంభంలోనే కవాసకి 'ఎలిమినేటర్ 500' అనే మరో బైక్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 5.62 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇందులోని 451 సీసీ ఇంజిన్ 45 హార్స్ పవర్, 42.6 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. స్లిప్/అసిస్ట్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్ ద్వారా పవర్ వెనుక చక్రానికి డెలివరీ చేస్తుంది. ఇదీ చదవండి: టిప్స్ అక్షరాలా రూ.97 లక్షలు - సీఈఓ రియాక్షన్ ఏంటంటే? బజాజ్ చేతక్ ప్రీమియం ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బజాజ్ చేతక్.. సరికొత్త అప్డేట్లతో ప్రీమియం అనే పేరుతో లాంచ్ అయింది. రూ. 1.35 లక్షల ధర వద్ద విడుదలైన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ చార్జితో 157 కిమీ రేంజ్ అందిస్తుంది. డిజైన్ పరంగా దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. నావిగేషన్ అప్డేట్లు, నోటిఫికేషన్ అలర్ట్ వంటి కొన్ని అప్డేటెడ్ ఫీచర్స్ ఇందులో గమనించవచ్చు. ఏథర్ 450 అపెక్స్ బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఏథర్ ఇటీవల 450 అపెక్స్ అనే పేరుతో మరో ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 1.89 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులోని 3.7 కిలోవాట్ బ్యాటరీ దాని మునుపటి మోడల్ కంటే కూడా ఎక్కువ రేంజ్ అందించేలా తయారైంది. ఈ స్కూటర్ రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్స్‌తో పాటు వేణు భాగం పనారదర్శకంగా ఉంటుంది. -
ఇండియా బైక్ వీక్‌లో కనిపించే బైకులు ఇలాగే ఉంటాయి - మైండ్ బ్లోయింగ్ (ఫొటోలు)
-
హైదరాబాద్ రోడ్లపై కొట్టుకుపోతున్న బైకులు..!
-
ఎటూకాని తోవలో బండి చక్రాల్లో గాలి అయిపోతే?
చిన్నవైనా, పెద్దవైనా వాహనాలకు చక్రాలు, వాటికి టైర్లు ఉంటాయి. టైర్లలో గాలి నింపడం పెద్ద పని. సైకిల్ టైర్లలోకి గాలి కొట్టడం కొద్దిపాటి శ్రమతో కూడుకున్న పని అయితే, భారీ వాహనాల టైర్లకు గాలి కొట్టడం అంత తేలిక పనికాదు. వాటిలో గాలి నింపుకోవడానికి పెట్రోల్ బంకులకో, మెకానిక్ షెడ్‌లకో వెళ్లక తప్పదు. ఎటూకాని తోవలో బండి చక్రాల్లో గాలి అయిపోతే ఎదురయ్యే తిప్పలు వర్ణనాతీతం. అలాంటి తిప్పలను తప్పించడానికే అమెరికన్ కంపెనీ ‘థామస్ పంప్స్’ ఇంచక్కా చేతిలో ఇమిడిపోయే ‘మినీ పంప్’ను అందుబాటులోకి తెచ్చింది. దీన్ని చక్కగా జేబులో వేసి తీసుకుపోవచ్చు. దీని బరువు 115 గ్రాములు మాత్రమే! ఎలాంటి తోవలోనైనా వాహనం చక్రాల్లోని గాలి అయిపోతే, అక్కడికక్కడే దీంతో క్షణాల్లో గాలి నింపుకోవచ్చు. ఇది రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. దీని బ్యాటరీ 25 నిమిషాల్లోనే పూర్తిగా చార్జ్ అవుతుంది. దీని సాయంతో సైకిల్ టైర్లలో 70 సెకన్లలోనే గాలి నింపుకోవచ్చు. మోటార్ సైకిళ్లు మొదలుకొని భారీ వాహనాలకు కూడా దీనిని ఉపయోగించవచ్చు. కాకుంటే, టైరు పరిమాణాన్ని బట్టి కొంత ఎక్కువ సమయం పడుతుంది. దీంతో ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్ బంతుల్లో కూడా క్షణాల్లో గాలి నింపుకోవచ్చు. దీని ధర 119 డాలర్లు (రూ.9898). -
వరల్డ్ ఛాంపియన్ 'నీరజ్ చోప్రా' అద్భుతమైన కార్లు, బైకులు - ఓ లుక్కేసుకోండి!
టోక్యో ఒలంపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించి సరికొత్త చరిత్రను సృష్టించిన 'నీరజ్ చోప్రా' (Neeraj Chopra) తాజాగా వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో కూడా స్వర్ణ పతకం గెలిచి యావత్ భారతదేశం మొత్తం గర్వపడేలా మరో రికార్డ్ నెలకొల్పాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న మొదటి భారతీయుడిగా ప్రసిద్ధి చెందిన నీరజ్ ఎలాంటి కార్లు & బైకులు వినియోగిస్తారనేది ఈ కథనంలో తెలుసుకుందాం. ఫోర్డ్ మస్టాంగ్ జీటీ (Ford Mustang GT).. నీరజ్ చోప్రా గ్యారేజిలోని మొదటి కారు ఈ ఫోర్డ్ మస్టాంగ్ జీటీ. దీని ధర రూ. 75 లక్షల వరకు ఉంటుందని సమాచారం. చాలామంది సెలబ్రిటీలకు కూడా ఈ అమెరికన్ బ్రాండ్ కారంటే చాలా ఇష్టం. ఇది 5.0 లీటర్ ఇంజన్ కలిగి 396 హార్స్ పవర్, 515 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మస్టాంగ్ టాప్ స్పీడ్ గంటకు 180 మైల్స్/గం. రేంజ్ రోవర్ స్పోర్ట్స్ (Range Rover Sport).. రేంజ్ రోవర్ కంపెనీకి చెందిన 'స్పోర్ట్స్' కారు కూడా నీరజ్ చోప్రా వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. రూ. 2.20 కోట్లు ధర కలిగిన ఈ లగ్జరీ కారు అద్భుతమైన డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది 5.0 లీటర్ V8 ఇంజన్ కలిగి 567 హార్స్ పవర్ & 700 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ SUV టాప్ స్పీడ్ గంటకు 260 కిమీ. మహీంద్రా థార్ & XUV700.. దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన 'థార్' నీరజ్ గ్యారేజిలో ఉంది. సుమారు రూ. 17 లక్షలు విలువైన ఈ కారు అద్భుతమైన ఆఫ్ రోడింగ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. ఇది 2.2 లీటర్ డీజిల్ & 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి మంచి పనితీరుని అందిస్తుంది. ఇక మహీంద్రా ఎక్స్‌యూవీ700 విషయానికి వస్తే, ఇది నీరజ్ కోసం ప్రత్యేకంగా రూపోంచిన కారు. ఇందులో చాలా వరకు కస్టమైజ్ చేసిన డిజైన్స్ చూడవచ్చు. ఈ SUV మిగిలిన కార్ల కంటే భిన్నంగా ఉంటుంది. ఇది కూడా పెట్రోల్ & డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. టయోటా ఫార్చ్యూనర్ (Toyota Fortuner).. భారతదేశంలో ఎక్కువమంది వినియోగించే టయోటా కంపెనీకి చెందిన ఫార్చ్యూనర్ నీరజ్ చోప్రా గ్యారేజిలో ఉంది0 దీని ధర రూ. 51 లక్షలు అని తెలుస్తోంది. 7 సీటర్ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ మోడల్ 2.7-లీటర్ పెట్రోల్ అండ్ 2.8-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్లతో వస్తుంది. ఇదీ చదవండి: కోట్లు సంపాదించేలా చేసిన భారత పర్యటన - ఇండియాలో అమెరికన్ హవా! హార్లే డేవిడ్సన్ 1200 రోడ్‌స్టర్ (Harley-Davidson 1200 Roadster).. బైక్ విభాగంలో ఖరీదైనవిగా భావించే హార్లే డేవిడ్సన్ 1200 రోడ్‌స్టర్ నీరజ్ చోప్రా వద్ద ఉంది. దీనిని 2019లో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ బైక్ మంచి డిజైన్ కలిగి రైడింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. దీని ధర రూ. 10 లక్షల కంటే ఎక్కువ. ఇదీ చదవండి: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 'ఏఐ'పై ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కీలక ప్రకటన బజాజ్ పల్సర్ 200ఎఫ్ (Bajaj Pulsar 200F).. ఎక్కువమంది యువ రైడర్లకు ఇష్టమైన బజాజ్ పల్సర్ 200ఎఫ్ కూడా నీరజ్ గ్యారేజిలో ఉంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. కార్లు, బైకులు మాత్రమే కాకుండా ఒక ట్రాక్టర్ కూడా నీరజ్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Neeraj Chopra (@neeraj____chopra) -
Ola Electric Bike Concept: మునుపెన్నడూ చూడని ఓలా కొత్త ఎలక్ట్రిక్ బైకులు (ఫొటోలు)
-
10 Best KTM Bikes: టాప్ 10 బెస్ట్ కేటీఎమ్ మోటార్ సైకిల్స్
-
ధోని బైక్స్ కలెక్షన్ చూస్తె మతిపోతుంది
-
Dhoni Cars, Bikes Collection: ధోనీ అంటేనే సెన్సేషన్ అదో..వైబ్రేషన్ చూడండి ఆయన క్లాసిక్ కలెక్షన్ (ఫోటోలు)
-
అమ్మకాల్లో దూసుకెళ్తున్న రాయల్ ఎన్ఫీల్డ్!
ప్రముఖ లగ్జరీ ద్విచక్రవాహనాల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ దేశీయ మార్కెట్లో అమ్మకాల్లో దూసుకెళ్తుంది. జూన్ నెలలో 26శాతం వృద్దిని సాధించి 77,109 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది జూన్‌లో 61,407 బైక్స్ అమ్మింది. భారత్‌లో రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలు ఏడాది క్రితం 50,265 యూనిట్లు అమ్ముడు పోగా..ఈ ఏడాది 34 శాతం పెరిగి 67,495 అమ్మినట్లు రాయల్ ఎన్ఫీల్డ్ ప్రతినిధులు తెలిపారు. అయితే ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. 2022 జూన్ లో 11,142 యూనిట్లను ఎగుమతి చేయగా.. గత నెలలో వాటి సంఖ్య 9,614 యూనిట్లతో సరిపెట్టుకుంది. ఈ సందర్భంగా రాయల్ ఎన్ ఫీల్డ్ సీఈఓ బీ గోవింద రాజన్ మాట్లాడుతూ.. ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన మోటారు సైకిళ్లతో తాము దేశీయంగా, గ్లోబల్ మార్కెట్లలో మంచి సేల్స్ నమోదు చేశామని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ బైక్ లవర్స్‌ను ఆకట్టుకుంటాయని భావిస్తున్నట్లు తెలిపారు. -
ఆర్ఎక్స్100 మళ్ళీ రానుందా? ఇదిగో క్లారిటీ!
Yamaha RX: గత కొన్ని సంవత్సరాల క్రితం బైక్ ప్రేమికులకు బాగా ఇష్టమైన మోడల్ 'యమహా' (Yamaha) కంపెనీకి చెందిన 'ఆర్ఎక్స్100' (RX100). ఒకప్పుడు కుర్రకారుని ఉర్రుతలూగించిన ఈ బైక్ కోసం ఎదురు చూసే కస్టమర్లు ఇంకా భారత్‌లో ఉన్నారు అనటంలో ఏ మాత్రమే సందేహం లేదు. అయితే దీనిని దృష్టిలో ఉంచుకుని సంస్థ మళ్ళీ ఈ బైకుని లాంచ్ చేయడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనల్లో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, యమహా ఆర్ఎక్స్100 భారతీయుల గుండెల్లో నిలిచిపోయిన బైక్ మోడల్. కావున ఆ పేరుకి ఏ మాత్రం భంగం కలగకుండా 'ఆర్ఎక్స్' (RX) అనే పేరుతో మళ్ళీ మార్కెట్లో బైకుని విడుదల చేయనున్నట్లు యమహా మోటార్ ఇండియా ఛైర్మన్ 'ఈషిన్ చిహానా' ఇటీవల ధృవీకరించినట్లు తెలుస్తోంది. భారతదేశపు ఐకానిక్ మోడల్ అయిన ఆర్ఎక్స్100 మంచి స్టైలింగ్, లైట్ వెయిట్, ప్రత్యేకమైన సౌండ్ సిస్టం కలిగి ఉండేది. ఇది అప్పటి వినియోగదారులను మాత్రమే కాకుండా ఆధునిక కాలంలో బైక్ కొనుగోలు చేస్తున్న వారిని మంత్రముగ్దుల్ని చేసింది. (ఇదీ చదవండి: ప్రత్యర్థుల పని పట్టడానికి వస్తున్న టీవీఎస్ కొత్త బైక్ - వివరాలు) ఈ బైకుని మళ్ళీ పునఃరూపకల్పన చేయాలంటే కనీసం 200సీసీ ఇంజిన్ అయినా అమర్చాలి. అయినప్పటికీ ఒకప్పటి సౌండ్ మళ్ళీ వస్తుందా? అనేది ప్రశ్నగానే ఉంటుంది. కావున ఆర్ఎక్స్100 బైకుకి ఉన్న పేరును నాశనం చేయదలచుకోలేదు. ప్రస్తుత లైనప్‌తో 155 సీసీ సరిపోదు. కానీ భవిష్యత్తులో యమహా ఆర్ఎక్స్ పేరుతో తీసుకురావడానికి తప్పకుండా కృషి చేస్తామని ఆయన తెలిపారు. మొత్తానికి ఆర్ఎక్స్ మళ్ళీ ఇండియాలో అడుగుపెట్టనున్నట్లు తెలిసింది. అయితే లాంచ్ ఎప్పుడనేది తెలియాల్సి ఉంది. -
మొదటి 5 మందికి 100 శాతం క్యాష్ బ్యాక్.. డెలివరీలు షురూ!
Keeway SR250 Delivery: 2023 ప్రారంభంలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో హంగేరియన్ టూ వీలర్ తయారీ సంస్థ 'కీవే' (Keeway) దేశీయ మార్కెట్లో తన SR250 నియో రెట్రో మోటార్‌సైకిల్ విడుదల చేసింది. ఈ బైక్ ధర రూ. 1.49 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). డెలివరీలు జూన్ 17 నుంచి మొదలయ్యాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కంపెనీ వెల్లడించిన సమాచారం ప్రకారం, ఎస్ఆర్250 మొదటి 500 మంది కస్టమర్లకు లక్కీ డ్రాతో పాటు అనేక కార్యక్రమాలను నిర్వహించనుంది. అంతే కాకుండా మొదటి 5 మంది కస్టమర్లకు 100 శాతం పూర్తి క్యాష్ బ్యాక్ అందించే అవకాశం కూడా ఉంది. కంపెనీ ఇప్పుడు 'My SR My Way' అనే ఒక కొత్త కస్టమైజేషన్ ప్లాట్‌ఫామ్‌ని పరిచయం చేసింది. దీని ద్వారా కీవే బైకులను కస్టమైజ్ చేసుకోవచ్చు. కస్టమర్లకు మరింత సౌకర్యాన్ని అందించడానికి కీవే త్వరలో యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ (AMC) కూడా ప్రవేశపెట్టడానికి యోచిస్తోంది. దీని కింద లేబర్ ఛార్జ్, ఇంజిన్ ఆయిల్, విడిభాగాలు, యాక్ససరీలపైన తగ్గింపు అందించే అవకాశం ఉంటుంది. ఈ బైకులు భారతదేశంలోని బెనెల్లీ అవుట్లెట్ల ద్వారా అమ్ముడవుతాయి. కావున దేశవ్యాప్తంగా ఉన్న బెనెల్లీ డీలర్‌షిప్‌లలో కీవే బైకులు కొనుగోలు చేయవచ్చు. (ఇది చదవండి: 12 ఏళ్ల నిర్మాణం.. 700 ఎకరాల విస్తీర్ణం.. ప్రపంచంలోనే ఇలాంటి ప్యాలెస్ మరొకటి లేదు!) డిజైన్, ఫీచర్స్ విషయానికి వస్తే.. రౌండ్ హెడ్‌ల్యాంప్, టర్న్ ఇండికేటర్లు, క్రోమ్ సరౌండ్‌లతో కూడిన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, టెయిల్ ల్యాంప్స్, క్రోమ్ ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్, సిలిండర్ బ్రేక్ ఫ్లూయిడ్ రిజర్వాయర్, నాబ్డ్ టైర్లు, స్పోక్డ్ వీల్స్ వంటి వాటిని పొందుతుంది. ఇందులో సింగిల్ పీస్ సీటు లభిస్తుంది. ఫీచర్స్ పరంగా కలర్డ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్, LED DRL లు, హజార్డ్ స్విచ్, అడ్జస్టబుల్ రియర్ సస్పెన్షన్ ఉన్నాయి. (ఇది చదవండి: మహీంద్రా థార్ Vs మారుతి జిమ్నీ - ఏది బెస్ట్ అంటే?) కీవే ఎస్ఆర్250 బైకులో 223 సిసి, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 7,500 rpm వద్ద 16 bhp పవర్ 6,500 rpm వద్ద 16 Nm గరిష్ట టార్క్ అందిస్తుంది. ఈ బైక్ బరువు 120 కేజీల వరకు ఉంటుంది, కావున రైడింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. -
ప్రపంచంలో అత్యంత ఖరీదైన బైకులు - అన్నీ రూ. కోట్లలోనే (ఫోటోలు)
-
ఈ బైక్స్ కొనుగోలుపై కనీవినీ ఎరుగని బెనిఫిట్స్ - రూ. 4 లక్షల వరకు..
Ducati Benefits: భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన లగ్జరీ బైక్ బ్రాండ్స్‌లో ఒకటైన 'డుకాటి' (Ducati) తన 10వ వార్షికోత్సవం జరుపుకోనున్న సందర్భంగా కంపెనీకి చెందిన కొన్ని ఎంపిక చేసిన మోడల్స్ మీద రూ. 4 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తుంది. కంపెనీ అందించనున్న ఈ బెనిఫీట్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బెనిఫీట్స్.. నివేదికల ప్రకారం, డుకాటి ఇండియా ఇప్పుడు తన స్ట్రీట్‌ఫైటర్ వి4, మల్టీస్ట్రాడా వి4 మోడల్స్ మీద ఏకంగా రూ. 4 లక్షల ప్రయోజనాలను అందిస్తుంది. ఈ బైక్స్ అసలు ధరలు దేశీయ మార్కెట్లో రూ. రూ. 22.15 లక్షలు, రూ. 21.48 లక్షలు కావడం గమనార్హం. అదే సమయంలో స్ట్రీట్‌ఫైటర్ వి2, మల్టీస్ట్రాడా వి2, మాన్స్టర్ మోడల్స్ మీద రూ. 2 లక్షల ప్రయోజనాలను అందిస్తుంది. ఈ మోడల్ బైకుల అసలు ధరలు రూ. 18.10 లక్షలు, రూ. 16.05 లక్షలు, రూ. 12.95 లక్షలు. (ఇదీ చదవండి: హ్యుందాయ్ ఎక్స్టర్ లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది.. డెలివరీలు కూడా..) కంపెనీ అందిస్తున్న ఈ బెనిఫిట్స్ క్యాష్ డిస్కౌంట్స్ కాదు, అయితే డుకాటి బ్రాండ్ దుస్తులు, యాక్ససరీస్ వంటివి పొందవచ్చు. ఈ బెనిఫీట్స్ కూడా స్టాక్ ఉన్నత వరకు మాత్రమే లభిస్తాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను కొనుగోలుదారులు సమీపంలో ఉన్న డీలర్‌షిప్‌లను సందర్శించి ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
బైక్‌లే ఉన్నాయ్.. జనాలేరీ?.. బీజేపీ శ్రేణులపై అమిత్‌షా సీరియస్
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెళగావిలో అమిత్ షా రోడ్ షో నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో కార్యకర్తల కంటే ఎక్కువగా బైక్‌లే దర్శనమిచ్చాయి. దీంతో అమిత్‌షా బీజేపీ శ్రేణులపై అసహనం వ్యక్తం చేశారు. జనాల కంటే బైక్‌లే ఎక్కువగా కన్పిస్తున్నాయి.. ఏంటిది? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కాగా.. బెంగళూరులో ప్రధాని నరేంద్రమోదీ రెండో రోజు(ఆదివారం) నిర్వహించిన రోడ్‌షోకు విశేష స్పందన లభించింది. అభిమానులు బీజేపీ శ్రేణులు భారీగా తరిలివచ్చారు. మోదీపై పూలవర్షం కురిపించారు. ఈలలు, కేరింతలతో హోరెత్తించారు. 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న ఒకే విడతలో జరగనున్నాయి. మే 13న కౌంటింగ్, ఫలితాలు ప్రకటిస్తారు. కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే పోటాపోటీగా ప్రచారాలు నిర్వహించాయి. చదవండి: బీజేపీది చీకటి పాలన: సోనియా -
ఖరీదైన బైకు.. కంట పడిందో మాయం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జల్సాలకు అలవాటు పడిన ఆ యువకులు సులువుగా డబ్బులు సంపాదించేందుకు చోరీలే మార్గంగా ఎంచుకున్నారు. గతంలో ఆటో మొబైల్ రంగంలో పనిచేసి ఉండటంతో, ద్విచక్ర వాహనాల చోరీలు మొదలుపెట్టారు. చివరకు పోలీసులకు పట్టుబడ్డారు. స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దక్షిణ మండలం డీఎస్పీ ఎం.శ్రీలత, టూటౌన్ సీఐ టి.గణేష్ ఈ వివరాలు తెలిపారు. వారి కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరానికి చెందిన గుడి పవన్‌కుమార్, నగరంలో తాడితోట వీరభద్రనగర్కు చెందిన ఎర్రారపు సత్యనారాయణ, గుత్తాల నవీన్ కుమార్ స్నేహితులు. వీరికి గతంలో ఆటోమొబైల్ మెకానిక్‌లుగా పనిచేసిన అనుభవం ఉంది. జల్సాలకు, చెడు అలవాట్లకు బానిసలైన వీరు సులువుగా డబ్బులు సంపాదించేందుకు బైకుల చోరీలు మొదలు పెట్టారు. కురక్రారు ఎక్కువగా మక్కువ పడే ఖరీదైన స్పోర్ట్స్ బైకులను లక్ష్యంగా ఎంచుకుని చోరీలు చేసేవారు. తాళం వేసి ఉన్న బైకులను చిటికెలో దొంగిలించేవారు. పలుమార్లు పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లి వచ్చినా నేరాల బాట వీడలేదు. ఇటీవల నగరంలో ద్విచక్ర వాహన చోరీలు ఎక్కువగా జరుగుతూండటంతో ఎస్పీ సీహెచ్.సుధీర్ కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు క్రైమ్ అదనపు ఎస్పీ జి.వెంకటేశ్వరరావు, డీఎస్పీ శ్రీలత పర్యవేక్షణలో సీఐ గణేష్ దర్యాప్తు చేశారు. పాత నేరస్తుల కదలికలపై నిఘా పెట్టి, నిందితులు ముగ్గురినీ అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో వారి నేరాల చిట్టా బయటపడింది. ఇటీవల రాజమహేంద్రవరం, కాకినాడ, మండపేట, అనపర్తి, అమలాపురం ప్రాంతాల్లోనే కాకుండా భీమవరం, గుంటూరు నగరాల్లో కూడా వారు దొంగిలించిన 31 బైకులను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.25 లక్షల వరకూ ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు, వాహనాల రికవరీలో ప్రతిభ చూపిన ఎస్సైలు జీవీవీ సత్యనారాయణ, కేఎం జోషీ, హెడ్ కానిస్టేబుళ్లు సీహెచ్ శ్రీనివాసరావు, ఎస్.రాజశేఖర్, కానిస్టేబుళ్లు కె.ప్రదీప్ కుమార్, వీరబాబు, బీఎస్కే నాయక్, ఎస్‌వీవీఎస్‌ఎన్ మూర్తి, కె.కామేశ్వరరావు, కరీమ్ బాషా, కె.సత్యనారాయణ, డి.శ్రీనివాస్‌లను డీఎస్పీ అభినందించారు. వేసవి చోరీలపై జాగ్రత్త ప్రస్తుతం వేసవి కాలం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ శ్రీలత ప్రజలకు సూచించారు. పాఠశాలలకు సెలవుల నేపథ్యంలో ఇళ్లకు తాళాలు వేసి, కుటుంబ సమేతంగా బంధువుల ఇళ్లకు, విహార యాత్రలకు వెళ్తూంతుంటారని, అటువంటి సమయంలో చోరీలు జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇలా ఇల్లు విడిచి వెళ్లేవారు సమీప పోలీసు స్టేషన్లో సమాచారం ఇస్తే గస్తీ పోలీసులు ఆయా ఇళ్లపై నిఘా పెడతారని చెప్పారు. -
ఉత్పత్తిలో కనివిని ఎరుగని రికార్డ్ - 70 లక్షల యూనిట్‌గా ఆ బైక్
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన 'సుజుకి మోటార్‌సైకిల్' (Suzuki Motorcycle) ఇటీవల ఉత్పత్తిలో గొప్ప మైలురాయిని చేరుకుంది. ఇందులో భాగంగానే గురుగ్రామ్‌లోని ఖేర్కి ధౌలా ప్లాంట్ నుండి 7 మిలియన్ల యూనిట్ బైకుని అధికారికంగా విడుదల చేసింది. కంపెనీ 7 మిలియన్ యూనిట్‌గా ఎల్లో కలర్ ఫినిషింగ్ పొందిన 'సుజుకి వి-స్ట్రామ్ ఎస్ఎక్స్' విడుదల చేసింది. ఇది నిజంగానే కంపెనీ సాధించిన అపూర్వమైన విజయం అనే చెప్పాలి. ఫిబ్రవరి 2006లో ఇండియన్ మార్కెట్లో కార్యకలాలను ప్రారంభించిన సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా మార్చి 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరం నాటికి ఏకంగా 9.38 లక్షల యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కెనిచి ఉమెడ తెలిపారు. (ఇదీ చదవండి: కంప్యూటర్ వద్దనుకున్నారు.. వంకాయ సాగు మొదలెట్టాడు - ఇప్పుడు సంపాదన చూస్తే..) సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా వి-స్ట్రామ్ ఎస్ఎక్స్, జిక్సర్ ఎస్ఎఫ్ 250, జిక్సర్ 250, జిక్సర్ ఎస్ఎఫ్, జిక్సర్, యాక్సెస్ 125, అవెనిస్, బర్గ్మాన్ స్ట్రీట్, బర్గ్మాన్ స్ట్రీట్ ఈఎక్స్ వంటి ద్విచక్ర వాహనాలను దేశీయ విఫణిలో తయారు చేస్తోంది. అంతే కాకుండా పెద్ద-బైక్ పోర్ట్‌ఫోలియోలో వి- స్ట్రామ్ 650XT, కటన, హయబుసా మోడల్స్ ఉత్పత్తి చేస్తోంది. రానున్న రోజుల్లో కంపెనీ మరిన్ని కొత్త ఉత్పత్తులను దేశీయ మార్కెట్లో విడుదల చేసేందుకు తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. -
లక్ష కంటే తక్కువ ధరతో విడుదలైన టీవీఎస్ కొత్త బైక్ - మరిన్ని వివరాలు
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ దేశీయ మార్కెట్లో ఎట్టకేలకు 'రైడర్ సింగిల్-పీస్ సీట్' బైక్ లాంచ్ చేసింది. ఇది ఇప్పటికే మార్కెట్లో లభిస్తుంది రైడర్ స్ప్లిట్ సీట్, స్మార్ట్-ఎక్స్‌నెక్ట్ (SmartXonnect) వేరియంట్‌కి దిగువన ఉంటుంది. ఇది కంపెనీ ఎంట్రీ లెవెల్ మోడల్ అవుతుంది. ఈ బైక్ ధర, వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. ధర: దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త టీవీఎస్ రైడర్ సింగిల్ పీస్ సీట్ మోడల్ ధర రూ. 94,719 కాగా, స్మార్ట్-ఎక్స్‌నెక్ట్ వేరియంట్ ధర లక్ష వరకు ఉంటుంది. అయితే కంపెనీ ఈ కొత్త వేరియంట్ లాంచ్ చేయడంతో, రైడర్ డ్రమ్ బ్రేక్ వేరియంట్ నిలిపివేసింది. డిజైన్ & ఫీచర్స్: టీవీఎస్ కొత్త రైడర్ బైక్ ఎల్ఈడీ లైట్స్ వంటి వాటితో మంచి డిజైన్ పొందుతుంది. కాగా ఇందులోని LCD డిస్ప్లే స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, ఫ్యూయెల్ లెవెల్ ఇండికేటర్, టాకోమీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్ వంటి వాటిని ప్రదర్శిస్తుంది. అంతే కాకుండా ఈ బైకులో USB ఛార్జింగ్ పోర్ట్, సీటు కింద చిన్న స్టోరేజ్ యూనిట్ కూడా ఉన్నాయి. (ఇదీ చదవండి: పోయిందనుకున్న స్కూటర్ పట్టించింది - ఓలా ఫీచర్.. అదిరిపోలా!) ఇంజిన్ & పర్ఫామెన్స్: టీవీఎస్ రైడర్ ఇంజిన్ ముందుపతి మాదిరిగానే ఉంటుంది. కావున ఇందులో 124.8 సిసి సింగిల్-సిలిండర్ ఇంజన్ కలిగి 11.4 హెచ్‌పి పవర్, 11.2 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడుతుంది. ఈ బైక్ కేవలం 5.9 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది. టీవీఎస్ రైడర్ సింగిల్-సీట్ వెర్షన్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, మోనోషాక్ కలిగి ఉంటుంది. అదే సమయంలో బ్రేకింగ్ విషయానికి వస్తే ఈ బైక్ ఒకే ఫ్రంట్ డిస్క్ వెనుక డ్రమ్ సెటప్ పొందుతుంది. ఇందులో 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి, ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్ల వరకు ఉంటుంది. -
బైక్ కొనాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్: కీవే బైక్స్‌పై భారీ ఆఫర్
సాక్షి, ముంబై: కొత్త బైక్ కొనుగోలు చేయాలనుకుంటున్నారు. అయితే మీకో చక్కటి అవకాశం. కీవే ఇండియా కంపెనీ తన లేటెస్ట్ 300 సీసీ బై బైక్స్ ధరలను భారీగా తగ్గించింది. కే300 ఎన్, కే 300 ఆర్ మోడళ్లపై భారీ తగ్గింపు ఆఫర్ ప్రకటించింది. (మహీంద్రా అండ్ మహీంద్రా మాజీ చైర్మన్ కేషుబ్ మహీంద్రా కన్నుమూత) కంపెనీ తాజా నిర్ణయంతో నేక్డ్ స్ట్రీట్ వెర్షన్ బైక్ కే 300 ఎన్ ధర రూ. 2.65 లక్షల -రూ. 2.85 లక్షల దాకా ఉంది. ఈ మోడల్‌పై ఇపుడు 33వేల రూపాయల దాకా తగ్గింపు లభిస్తోంది. అలాగే రూ. 2.99 లక్షల నుంచి రూ. 3.2 లక్షల ధర పలికే కే 300 ఆర్ ధర ఇపుడు రూ. 55 వేలు దిగి వచ్చింది. అంటే దీన్ని రూ. 2.65 లక్షలకే కొనుగోలు చేయవచ్చు. కే 300 ఎన్, కే 300 ఆర్ అనే బైక్స్ రెండూ కూడా ఒక ప్లాట్‌ఫామ్‌పై తయారైనవే. వీటిల్లో 292 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది హెచ్‌పీ 27.5. అలాగే టార్క్ 25 ఎన్ఎం ను అందిస్తాయి. బైక్ ముందు, వెనుక డిస్క్ బ్రేకులు, అలాగే డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్,డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, LED లైట్లు , 2 రైడింగ్ మోడ్లు(ఎకో & స్పోర్ట్)హైలైట్ ఫీచర్లుగా చెప్పుకోవచ్చు. ఈ ధరలు 6 ఏప్రిల్ 2023 నుండి అమల్లోకి రాగా రెండు మోడల్‌లలోని మొత్తం 3 కలర్ ఆఫర్లలో ప్రామాణికంగా ఉంటాయి. -
‘AI’తో పనిచేసే అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్.. ధర ఎంతంటే?
చూడటానికి మామూలు సైకిలు మాదిరిగా ఉన్న ఈ–బైక్ ఇది. ఇప్పటివరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ–బైక్స్ కంటే చాలా తేలికైనది. దీని బరువు దాదాపు 15 కిలోలు మాత్రమే! దీని బ్యాటరీ పూర్తిగా చార్జ్ కావడానికి రెండున్నర గంటల సమయం పడుతుంది. పూర్తిగా చార్జ్ అయ్యాక ఇది నిరాటంకంగా 113 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు. రోడ్డుపైన ఇది గంటకు 32 కిలోమీటర్ల గరిష్ఠవేగంతో పయనిస్తుంది.ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీ సంస్థ ‘ఏసెర్’ ఈ తేలికపాటి ఈ–బైక్‌ను ‘ఈబీ’ పేరిట రూపొందించింది. ఇందులో ఇంకో విశేషం కూడా ఉంది. ఇది కృత్రిమ మేధ సాయంతో పనిచేస్తుంది. ప్రయాణించే దారిలోని రోడ్ల పరిస్థితిని బట్టి తనంతట తానే గేర్లు మార్చుకుంటుంది. డ్రైవర్ సౌకర్యానికి, వాహనం నడిపే తీరుకు అనుగుణంగా సర్దుకుంటుంది. దీని ధర 999 డాలర్లు (సుమారు రూ.82 వేలు) మాత్రమే! -
పవర్ ఫుల్ బైక్ కొనాలనుకుంటున్నారా? ఇదిగో టాప్ 5 బెస్ట్ బైక్స్!
భారతీయ మార్కెట్లో ప్రస్తుతం లక్ష కంటే తక్కువ ధర వద్ద లభించే బైకులు నుంచి అత్యంత ఖరీదైన బైకుల వరకు అందుబాటులో ఉన్నాయి. అయితే మనం ఈ కథనంలో రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల మధ్య లభించే టాప్ 5 బైకుల గురించి తెలుసుకుందాం. కెటిఎమ్ 390 డ్యూక్: ఎక్కువ మంది యువతకు ఇష్టమైన బైకులలో కెటిఎమ్ 390 డ్యూక్ ఒకటి. దీని ధర రూ. 2.96 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ బైక్ 2017 నుంచి చిన్న చిన్న అప్డేట్లను పొందుతూనే ఉంది. కావున అప్పటి నుంచి ఇప్పటి వరకు దీనికున్న ఆదరణ ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ 373సీసీ ఇంజిన్ కలిగి 9000 ఆర్‌పిఎమ్ వద్ద 43.5 పిఎస్ పవర్, 7000 ఆర్‌పిఎమ్ వద్ద 37 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310: ప్రముఖ టూ వీలర్ బ్రాండ్ టీవీఎస్ కంపెనీకి చెందిన అపాచీ ఆర్ఆర్ 310 కూడా ఎక్కువమంది ఇష్టపడే బైకుల జాబితాలో ఒకటి. దీని ధర రూ. 2.72 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ స్పోర్ట్‌బైక్ అద్భుతమైన డిజైన్ కలిగి, ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇందులోని 312.2 సీసీ ఇంజిన్ 33.5 బిహెచ్పి పవర్, 27.3 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. హోండా సిబి300ఆర్: హోండా కంపెనీకి చెందిన సిబి300ఆర్ బైక్ ధర రూ. 2.77 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇందులో 286 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 30.7 బిహెచ్పి పవర్, 27.5 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంతే కాకుండా రైడర్ కు సులువైన క్లచ్ ఆపరేటింగ్ కోసం అసిస్ట్ అండ్ స్లిప్లర్ క్లచ్ వంటివి కూడా ఇందులో లభిస్తాయి. సుజుకీ వీ-స్ట్రోమ్ ఎస్ఎక్స్: మన జాబితాలో మూడు లక్షలకంటే తక్కువ ధర వద్ద లభించే బైకుల జాబితాలో ఒకటి సుజుకీ వీ స్ట్రోమ్ ఎస్ఎక్స్. దీని ధర రూ. 2.12 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ బైక్ 249 సీసీ, 4 స్ట్రోక్,సింగిల్ సిలిండర్, ఆయిల్ కూల్డ్ ఎస్ఓహెచ్సీ ఇంజిన్ పొందుతుంది, కావున మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350: భారతదేశంలో ఎక్కువ ప్రజాదరణ పొందిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ క్లాసిక్ 350. ఈ బైక్ ధర రూ. 1.90 లక్షల నుంచి రూ. 2.21 లక్షల వరకు ఉంటుంది (ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది 349 సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి 6,100 ఆర్‌పిఎమ్ వద్ద 20.3 బిహెచ్పి పవర్, 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది. -
వచ్చే నెలలో విడుదలకానున్న టూ వీలర్స్, ఇవే!
భారతీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను వినియోగించాలనే ఆసక్తికలిగిన కస్టమర్ల కోసం కంపెనీలు కూడా ఆధునిక వెహికల్స్ విడుదల చేస్తూనే ఉన్నాయి. ఎప్పటిలాగే వచ్చే నెలలో కూడా కొన్ని లేటెస్ట్ కార్లు, బైకులు దేశీయ విఫణిలో అడుగుపెట్టనున్నాయి. వచ్చే నెల నుంచి బీఎస్6 పేస్-2 ఎమిషన్ నిబంధనలు అమలులోకి రానున్నాయి. కొత్తగా విడుదలయ్యే వాహనాలు తప్పకుండా దానికి లోబడి ఉండాలి. సింపుల్ వన్: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లతో పాటు విడుదలైన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పటికీ విక్రయానికి రాలేదు, ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో గొప్ప ఆదరణ పొందిన ఈ టూ వీలర్ బుకింగ్స్ పరంగా కూడా ఉత్తమ వృద్ధిని కనపరిచింది. కాగా ఈ స్కూటర్ వచ్చే నెల ప్రారంభం నుంచి విక్రయానికి రానున్న సమాచారం. డుకాటీ మాన్స్టర్ ఎస్పీ: ద్విచక్ర వాహన ప్రియులకు ఎంతగానో ఇష్టమైన బైకులతో ఒకటైన డుకాటీ 2023 ఏప్రిల్ చివరి నాటికి తన మాన్స్టర్ ఎస్పీ బైక్ విడుదల చేయాలని ఆలోచిస్తోంది. కంపెనీ గతంలోనే 9 బైకులను విడుదల చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఇందులో భాగంగానే దేశీయ మార్కెట్లో మరిన్ని డుకాటీ బైకులు విడుదలయ్యే అవకాశం ఉంది. హోండా యాక్టివా 125 హెచ్- స్మార్ట్: హోండా మోటార్‌సైకిల్ దేశీయ మార్కెట్లో వచ్చే నెలలో ఇప్పటికే విక్రయానికి ఉన్న యాక్టివా స్కూటర్లో కొత్త వెర్షన్ విడుదల చేయనుంది. దీని పేరు 'హోండా యాక్టివా 125 హెచ్-స్మార్ట్'. దీనికి సంబంధించిన చాలా వివరాలు ఇప్పటికే వెల్లడయ్యాయి. కావున డిజైన్ పరంగా పెద్ద తేడా లేనప్పటికీ.. రిమోట్ ఇంజిన్ స్టార్ట్, కీలెస్ ఇగ్నీషన్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ ఉంటాయని తెలిసింది. 2023 ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ & ఆర్ఎస్: ఇప్పటికే భారతదేశంలో విడుదల కావాల్సిన 2023 ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ & ఆర్ఎస్ బైకులు కొన్ని అనివార్య కారణాల వల్ల లాంచ్ కాలేదు. అయితే ఇవి రెండూ వచ్చే నెలలో విడుదలకానున్నట్లు సమాచారం. డిజైన్, ఫీచర్స్ పరంగా ఉత్తమంగా ఉండే ఈ బైకులకు సంబంధిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. -
‘హీరో’ లవర్స్‌కు షాక్: ఏప్రిల్ 1 నుంచి షురూ!
సాక్షి, ముంబై: ప్రముఖ టూ వీలర్ మేకర్ హీరో మోటో తన కస్టమర్లకు షాకిచ్చింది. ఏప్రిల్ నుంచి అన్ని వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎంపిక చేసిన ఉత్పత్తులపై వచ్చే నెల నుండి 2 శాతం వరకు ధరలు పెరగనున్నాయి. ఈ పెరుగుదల మోడల్స్ , మార్కెట్లను బట్టి మారుతూ ఉంటుందని హీరో మోటోకార్ప్ ప్రకటించింది. (ఓలా ఎలక్ట్రిక్ దూకుడు: రూ. 2,475 కోట్ల సమీకరణ !) OBD-2 నిబంధనలకు అనుగుణంగా మారడం, ఉద్గార ప్రమాణాల అమలుతో ఉత్పత్తి వ్యయం పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మరోవైపు కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీనికి అనుగుణంగా కంపెనీలు సైతం కొత్త ఉద్గార ప్రమాణాల అమలుకోసం తమ తమ వాహనాల్లో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. (ఇది నమ్మక ద్రోహమే..తక్షణమే రాజీనామా చెయ్యండి! జుకర్‌బర్గ్ ఆగ్రహం) హీరో మోటోకార్ప్ తాజా లాంచ్‌లు: హీరో మోటోకార్ప్ ఇటీవల భారతదేశంలో రూ. 68,599 (ఎక్స్-షోరూమ్) వద్ద సరికొత్త జూమ్ 110ని విడుదల చేసింది. అలాగే రూ. 83,368, ఎక్స్-షోరూమ్ ధరతో సూపర్ స్ప్లెండర్ కొత్త హైటెక్ XTEC వేరియంట్‌ను కూడా పరిచయం చేసింది. కాగా ఇలీవలి కాలంలో హీరో కంపెనీ ధరల పెంపు ఇదిరెండోసారి. అటు టాటా మోటార్స్ సైతం తాజాగా తన కమర్షియల్ వాహన ధరలను 5 శాతం మేర పెంచింది. -
భారత్‌లో తక్కువ ధర వద్ద లభించే టాప్ 5 బైకులు - వివరాలు
సాధారణంగా చాలామంది వాహన వినియోగదారులు మంచి మైలేజ్ అందించి సరసమైన ధర వద్ద లభించే వాహనాలను (బైకులు, కార్లు) కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. దేశీయ విఫణిలో ద్విచక్ర వాహన విభాగంలో సరసమైన ధర వద్ద లభించే ఐదు బైకులు గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు. హీరో హెచ్ఎఫ్ 100: భారతదేశంలో అమ్ముడవుతున్న అత్యంత సరసమైన బైకుల జాబితాలో చెప్పుకోదగ్గ బైక్ హీరో హెచ్ఎఫ్ 100. ఈ బైక్ ధర రూ. 54,962 (ఎక్స్-షోరూమ్). ఇది 97 సీసీ ఇంజిన్ కలిగి 8 హెచ్‌పి పవర్ 8.05 ఎన్ఎమ్ టార్క్ అందిస్తూ కేవలం ఒకే వేరియంట్లో అందుబాటులో ఉంది. హీరో హెచ్ఎఫ్ డీలక్స్: హీరో మోటోకార్ప్ కంపెనీకి చెందిన హెచ్ఎఫ్ డీలక్స్ మన జాబితాలో సరసమైన ధర వద్ద లభించే పాపులర్ బైక్. దీని ధర రూ. 61,232 నుంచి రూ. 68,382 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. 100 సిసి విభాగంలో తిరుగులేని అమ్మకాలు పొందుతూ ఇప్పటికీ ఎక్కువ మంది కస్టమర్ల మనసు దోచేస్తున్న బైక్ హీరో హెచ్ఎఫ్ డీలక్స్ కావడం విశేషం. టీవీఎస్ స్పోర్ట్: టీవీఎస్ కంపెనీకి చెందిన ద్విచక్ర వాహనాలు మార్కెట్లో ఒకప్పటి నుంచి మంచి సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. ఇందులో ఒకటి 'టీవీఎస్ స్పోర్ట్' బైక్. దీని ధర రూ. 61,500 నుంచి రూ. 69,873 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. కిక్ స్టార్ట్, సెల్ఫ్ స్టార్ట్ వెర్షన్లలో అందుబాటులో ఉన్న ఈ బైక్ 109.7 సీసీ ఇంజిన్ కలిగి 8.3 హెచ్‌పి పవర్ 8.7 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. హోండా షైన్ 100: మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన, ఎక్కువ అమ్ముడవుతున్న బైకులలో హోండా షైన్ 100 కూడా ఒకటి. దీని ధర రూ. 64,900 (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ 99.7 సీసీ ఇంజిన్ కలిగి 7.61 హెచ్‌పి పవర్, 8.05 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ ఎలక్ట్రిక్ స్టార్టర్ పొందుతుంది. ఇది దేశీయ మార్కెట్లో లభించే అత్యంత సరసమైన సెల్ఫ్-స్టార్ట్ మోటార్‌సైకిల్‌గా నిలిచింది. బజాజ్ ప్లాటినా 100: భారతీయ మార్కెట్లో లభించే సరసమైన బైకుల జాబితాలో ఒకటి బజాజ్ కంపెనీకి చెందిన ప్లాటినా 100. ఈ బైక్ ధర రూ.67,475 (ఎక్స్-షోరూమ్). ఇది సిగ్నేచర్ DTS-i టెక్నాలజీ 102 సిసి ఇంజిన్ ద్వారా 7.9 హెచ్‌పి పవర్ మరియు 8.3 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఆకర్షణీయంగా ఉంటుంది. -
రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి కొత్త బైక్స్.. వచ్చేస్తున్నాయ్
భారతీయ మార్కెట్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైకులకున్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. గత కొన్ని రోజులుగా కంపెనీ అమ్మకాలు తారా స్థాయిలో చేరుకుంటున్నాయి. 2023 ఫిబ్రవరిలో 71,544 యూనిట్లను విక్రయించి 2022 ఫిబ్రవరి కంటే 20.93 శాతం ఎక్కువ అమ్మకాలను నమోదు చేసింది. అమ్మకాల్లో దూసుకెళ్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ రానున్న రోజుల్లో మరిన్ని కొత్త ఉత్పత్తులను తీసుకురావడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే కంపెనీ లైనప్‌లో హంటర్ 350సీసీ, బుల్లెట్ 350సీసీ, క్లాసిక్ 350సీసీ, మీటియోర్ 350సీసీ, హిమాలయన్, స్క్రామ్ 411, ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ GT 650, మరియు సూపర్ మెటోర్ 650 వంటి తొమ్మిది మోడళ్లు ఉన్నాయి. కంపెనీ కొత్త ప్రణాళికలో భాగంగా రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మరో రెండు 350సీసీ బైకులు విడుదలయ్యే అవకాశం ఉందని నివేదికల ద్వారా తెలుస్తోంది. అవి బుల్లెట్ 350, షాట్‌గన్ 350 బాబర్ బైకులు. అంతే కాకుండా 450 సీసీ విభాగంలో, 650 సీసీ విభాగంలో కొత్త బైకులు విడుదలయ్యే అవకాశం ఉంది. కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350: రాయల్ ఎన్ఫీల్డ్ విడుదల చేయనున్న కొత్త బైక్ ఈ బుల్లెట్ 350. ఇది దాని మునుపటి మోడల్ కంటే అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. మీటియోర్ 350 మాదిరిగానే ఇది కూడా 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో 346 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ పొందనుంది. (ఇదీ చదవండి: బజాజ్ నుంచి అప్డేటెడ్ బైక్స్ విడుదల) రాయల్ ఎన్ఫీల్డ్ షాట్‌గన్ 350 బాబర్: ఇక కంపెనీ విడుదలచేయనున్న మరో కొత్త బైక్ 'రాయల్ ఎన్ఫీల్డ్ షాట్‌గన్ 350 బాబర్'. ఇది కూడా మీటియోర్ 350 మాదిరిగానే అదే ఇంజిన్, పర్ఫామెన్స్ పొందే అవకాశం ఉంది. డిజైన్, ఫీచర్స్ అన్నీ కూడా మునుపటి మోడల్స్ కంటే ఉత్తమంగా ఉంటుంది. దీని ధర రూ. 2 లక్షల వరకు ఉంటుందని అంచనా. -
60కిపైగా దేశాల్లో రయ్.. రయ్, అపాచీ సరికొత్త రికార్డులు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ మరో రికార్డు నమోదు చేసింది. భారత్‌తోపాటు అంతర్జాతీయంగా 50 లక్షల యూనిట్ల అపాచీ ప్రీమియం మోటార్ సైకిళ్లను విక్రయించి కొత్త మైలురాయిని అధిగమించింది. 2005లో అపాచీ మోటార్ సైకిల్ తొలిసారిగా రోడ్డెక్కింది. 60కిపైగా దేశాల్లో ఈ బైక్స్ పరుగెడుతున్నాయి. అంతర్జాతీయంగా వేగంగా వృద్ధి చెందుతున్న బ్రాండ్లలో అపాచీ ఒకటిగా నిలివడం విశేషం. సెగ్మెంట్లో తొలిసారిగా, అలాగే వినూత్న ఫీచర్లతో ఈ బైక్ అప్‌గ్రేడ్ అవుతూ వస్తోందని కంపెనీ తెలిపింది. రేస్ ట్యూన్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్, రైడ్ మోడ్స్, డ్యూయల్ చానెల్ఏబీఎస్, రేస్ ట్యూన్డ్ స్లిప్పర్ క్లచ్ వంటివి వీటిలో ఉన్నాయి. అపాచీ సిరీస్‌లో ఆర్టీఆర్ 160, 160 4వీ, 180, 200 4వీ, ఆర్ఆర్ 310 మోడళ్లు ఉన్నాయి. అత్యుత్తమ పనితీరు, సాంకేతికత, శైలితో ప్రీమియం మోటార్‌సైకిల్స్ విభాగంలో అపాచీ కొత్త ప్రమాణాలను సృష్టిస్తోందని టీవీఎస్ మోటార్ తెలిపింది. -
గర్ల్‌ఫ్రెండ్ కోసం దొంగగా మారిన యువకుడు.. 13 ఖరీదైన బైక్‌లు చోరీ
ముంబై: గర్ల్‌ఫ్రెండ్‌ను ఇంప్రెస్ చేయాలని ఓ యువకుడు దొంగగా మారాడు. ఖరీదైన బైకులు దొంగతనం చేశాడు. మొత్తం 13 ద్విచక్ర వహనాలకు తస్కరించి కటకటాలపాలయ్యాడు. మహారాష్ట్ర థానె జిల్లా కల్యాణ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఈ యువకుడి పేరు శుభం భాస్కర్ పవార్. ఓ బైక్‌ను దొంగిలించిన ఇతడ్ని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అయితే అతడ్ని విచారించగా అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు. తాను మొత్తం 13 బైక్‌లు దొంగిలించినట్లు శుభం విచారణలో ఒప్పుకున్నాడు. కేవలం తన ప్రేయసిని సంతోష పెట్టేందుకే ఈ చోరీలకు పాల్పడినట్లు చెప్పాడు. ఈ బైక్‌ల విలువ రూ.16లక్షలకు పైనే ఉంటుందని పోలీసులు చెప్పారు. చదవండి: లఖీంపూర్ ఖేరీ కేసులో మిశ్రాకు బెయిల్ -
వావ్! ఎలక్ట్రిక్ వెహికల్‌గా..లూనా మళ్లీ వచ్చేస్తోంది!
న్యూఢిల్లీ: చిన్న బండి లూనా గుర్తుంది కదూ. ఒకప్పుడు ప్రాచుర్యంలో ఉన్న ఈ మోపెడ్ కొద్ది రోజుల్లో ఎలక్ట్రిక్ లూనా రూపంలో వస్తోంది. కినెటిక్ గ్రీన్ ఎనర్జీ, పవర్ సొల్యూషన్స్ దీనిని ప్రవేశపెట్టనుంది. చాసిస్, ఇతర విడిభాగాల తయారీ ఇప్పటికే మొదలైందని కినెటిక్ గ్రూప్ ప్రకటించింది. నెలకు 5,000 యూనిట్ల తయారీ సామర్థ్యంతో ప్రత్యేక యూనిట్ సైతం అహ్మద్‌నగర్ ప్లాంటులో ఏర్పాటైంది. లూనా అమ్మకాల ద్వారా వచ్చే 2–3 ఏళ్లలో ఏటా రూ.30 కోట్ల ఆదాయం సమకూరుతుందని కినెటిక్ ఇంజనీరింగ్ ఎండీ ఆజింక్యా ఫిరోదియా తెలిపారు. -
కొత్త ప్రపంచం @ 16 October 2022
-
యమహా గుడ్‌న్యూస్ చెప్పిందిగా!
సాక్షి, ముంబై: పెరుగుతున్న ఇంధన ధరలు, కర్బన ఉద్గారాల కాలుష్యం, ఇథనాల్లాంటి ప్రత్యామ్నాయ ఇంధనాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో తన వినియోగ దారులకు మంచి వార్త చెప్పింది.ఎలక్ట్రిక్ వాహనాలు ధరలను చూసి బెంబేలెత్తిపోతున్న రైడర్లకు ఊరట కలిగేలా పెట్రోలు, ఇథనాల్ లేదా రెండిటితో కలిసి పనిచేసి అద్భుతమైన ఇంజీన్‌తో కొత్త బైక్‌ను తీసుకొచ్చింది. 2023 యమహా ఎఫ్‌జెడ్-15ను బ్రెజిల్లో లాంచ్ చే సింది. కంపెనీ ఈ బైక్‌ను దక్షిణ అమెరికా దేశంలో Fazer FZ-15 పేరుతో విక్రయిస్తోంది. అయితే ఇదే ఇంజీన్‌తో అప్డేట్ చేసి ఇండియాలో ఇథనాల్ ఆధారిత Yamaha FZ V3 బైక్‌ను త్వరలోనే తీసుకురావచ్చని భావిస్తున్నారు. యమహా ఎఫ్‌జెడ్-15ను బ్లూఫ్లెక్స్ సిస్టమ్‌తో కూడిన 150సీసీ ఇంజిన్‌తో వచ్చింది. ఇది పెట్రోల్, ఇథనాల్ లేదా రెండింటిలో ఏది ఎక్కువ పొదుపుగా ఉంటుందో దాన్ని ఎంచుకునేలా సపోర్ట్ చేస్తుంది. ఫీచర్ల విషయానికి వస్తే, కొత్త యమహా బైక్‌లు ప్రొజెక్టర్, ఎల్ఈడీ హెడ్‌లైట్, ముందు భాగంలో ABS బ్రేక్‌లు, రెండు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు, మోనోక్రాస్ సస్పెన్షన్, వైడ్ టైర్లు, క్లాక్, గేర్ ఇండికేటర్, టాకోమీటర్,ఈకో ఫంక్షన్‌గా విడదుల చేసింది.రేసింగ్ బ్లూ, మిడ్నైట్ బ్లాక్ మరియు మాగ్మా రెడ్ అనే మూడు రంగుల ఎంపికలో లభ్యం. ధర సుమారు రూ. 2.69 లక్షలుగా ఉంటుంది. -
విజయవాడ కేంద్రంగా..అవేరా నుంచి రెండు ఎలక్ట్రిక్ బైక్స్ విడుదల
సాక్షి, అమరావతి: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రెండు సరికొత్త ఎలక్ట్రికల్ స్కూటర్లను అవేరా సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది. విజయవాడ సమీపంలోని తయారీ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో విన్సిరో పేరుతో ప్రీమియం, రెట్రోసా లైట్ పేరుతో ఎకానమీ స్కూటర్‌ను విడుదల చేసింది. పూర్తి భద్రతా ప్రమాణాలతో ఉండే ఎల్ఎఫ్పీ బ్యాటరీతో రూపొందించిన ‘విన్సిరో’ గరిష్టంగా గంటకు 120 కి.మీ వేగంతో ప్రయాణించడమే కాకుండా ఒకసారి చార్జింగ్ చేస్తే 236 కి.మీ. ప్రయాణం చేస్తుందని అవేరా ఫౌండర్ సీఈవో వెంకట రమణ పేర్కొన్నారు. సబ్సిడీలు పోను ఈ స్కూటర్ ధరను రూ. 1.40 లక్షలుగా నిర్ణయించారు. అలాగే విన్సిరో లైట్ గంటకు 60 కి.మీ. వేగంతో ఒకసారి చార్జింగ్‌చేస్తే 100 కి.మీ. ప్రయాణం చేయనుంది. విన్సిరో లైట్ ధరను రూ.99,000 గా నిర్ణయించారు. -
తగ్గిన ద్విచక్ర వాహనాల అమ్మకాలు!
దేశవ్యాప్తంగా రిటైల్‌లో వాహన అమ్మకాలు జూలైలో 14,36,927 యూనిట్లు నమోదయ్యాయి.2021 జూలైతో పోలిస్తే ఇది 8 శాతం తగ్గుదల. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) ప్రకారం.. క్రితం ఏడాదితో పోలిస్తే గత నెలలో ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 5 శాతం తగ్గి 2,50,972 యూనిట్లకు వచ్చి చేరాయి. ద్విచక్ర వాహనాలు 11 శాతం తగ్గి 10,09,574 యూనిట్లుగా ఉంది. ట్రాక్టర్ల అమ్మకాలు 28 శాతం పడిపోయి 59,573 యూనిట్లకు వచ్చి చేరాయి. త్రిచక్ర వాహనాలు 80 శాతం అధికమై 50,349 యూనిట్లకు, వాణిజ్య వాహనాలు 27 శాతం దూసుకెళ్లి 66,459 యూనిట్లకు పెరిగాయి. -
ఎన్ని ఉన్నా ఈ బైక్ క్రేజ్ వేరబ్బా.. యమహా నుంచి ఆ మోడల్ మళ్లీ వస్తోంది!
యూత్‌లో బైక్‌లకు ఉన్న క్రేజ్ వేరు. ప్రస్తుతం ఇంటర్నెట్ యుగంలో బోలెడన్ని బైకులు దర్శనమిస్తున్నాయి. అయితే ఎన్ని ఉన్నా మార్కెట్లో యమహా ఆర్ఎక్స్ 100కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. 90 దశకంలో యువతని ఉర్రూతలూగించిన సంగతి తెలిసిందే. ఈ బైక్‌లను నిలిపేసి 25 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ అవి రోడ్లపై దర్శనమిస్తున్నాయి. అయితే ఆ మోడల్ బైక్ కోసం కలలు కనే వారి కోసం తాజాగా యమహా కంపెనీ ఓ శుభవార్త తీసుకువచ్చింది. ఆర్ఎక్స్ 100 బైక్‌ను ఆధునిక హంగులతో మళ్లీ మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. యువత కలల బైక్ రానుంది యమహా ఇండియా చైర్మన్ ఐషిన్ చిహానా మాట్లాడుతూ.. కొత్తగా రాబోతున్న యమహా RX100 ఆధునిక డిజైన్ , స్టైలిష్ లుక్‌తో మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ బైక్ పాత మోడల్‌కి మార్కెట్లో ఇప్పటికీ డిమాండ్ ఉంది, వాటిని దృష్టిలో పెట్టుకుని బైక్ లవర్స్‌ని ఆకట్టుకునేలా డిజైన్, తయారీ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 2026 తర్వాత మార్కెట్లోకి కొత్త వెర్షన్ ఆర్ఎక్స్100 బైక్‌ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. ఎందుకంటే వచ్చే మూడేళ్లలో యమహా కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలోకి అడుగుపెట్టాలని యోచిస్తోందని చిహానా పేర్కొన్నారు. ప్రస్తుతానికి, రాబోయే యమహా ఎలక్ట్రిక్ స్కూటర్లు టెస్టింగ్ దశలో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం యమహాకు భారత్‌లో గ్రేటర్ నోయిడా, చెన్నైలో ప్రొడక్షన్ యూనిట్లు ఉన్నాయి. ఇక్కడ తయారయ్యే వాటితో 30 దేశాలకు ఎగుమతులు చేస్తున్నారు. కాగా యమహా కంపెనీ 1985 నుంచి ఉత్పత్తి ప్రారంభించి ఆర్ఎక్స్100బైక్‌ను 1996 వరకు కొనసాగించారు. చదవండి: 2022 ఆల్టో: ఎక్సైటింగ్ సర్ప్రైజ్ అంటున్న మారుతి -
విచిత్ర వ్రతం.. చెప్పులు తొడగరు.. బండ్లు నడపరు.. ఎందుకంటే?
యశవంతపుర(కర్ణాటక): ఆ గ్రామస్తులు చెప్పులు తొడగరు..బైక్‌లు నడపరు..ఎక్కడికెళ్లినా కాలి నడకనే ప్రయాణం సాగిస్తున్నారు. ఇది వారు ఆచరిస్తున్న విచిత్ర వ్రతం. ఈ ఊరు పేరు కాలేబాగ్. విజయపుర పట్టణంలోని 30వ వార్డు పరిధిలోకి వస్తుంది. ఈ గ్రామంలో కొద్ది రోజులుగా వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. బైక్‌లపై నుంచి పడి కొందరు మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. చదవండి: ట్యాక్సీ డ్రైవర్‌తో మహిళా టెక్కీ ప్రేమ పెళ్లి.. తప్పటడుగులు వేశానంటూ.. దీంతో గ్రామస్తులు రోజూ ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. గ్రామానికి అరిష్టం పట్టుకుందని భావించిన గ్రామస్తులు పురోహితుడిని కలిసి తమను కాపాడాలని కోరారు. గ్రామ దేవతలైన జట్టింగేశ్వర, దుర్గాదేవిల పేరుతో వ్రతం ఆచారించాలని, ఈక్రమంలో ఐదు వారాల పాటు గ్రామస్తులు ఎవరూ పాదరక్షలు ధరించరాదని, ఎలాంటి వాహనాలు నడపరాదని సూచించారు. నిబంధనలు కనీసం రెండు నెలలపాటు పాటిస్తే గ్రామానికి పట్టిన పీడ విరగడ అవుతుందని పేర్కొన్నారు. పూజారి తెలిపిన మేరకు కఠిన నిబంధనలు పాటిస్తున్నట్లు కాలేబాగ్ గ్రామస్థుడు పరశురామ పూజారి తెలిపారు. -
మోస్ట్ ఎవైటెడ్ బైక్ వచ్చేసింది, ధర ఎంతంటే..
సాక్షి, ముంబై: ప్రీమియం ద్విచక్ర వాహనాల సంస్థ కేటీఎం సోమవారం 2022 కేటీఎం ఆర్సీ 390 మోటర్‌సైకిల్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 3,13,922 (ఎక్స్ షోరూం ఢిల్లీ). వీటి తమ షోరూమ్‌లలో బుకింగ్స్ ప్రారంభించినట్లు సంస్థ వివరించింది. 2014 నుంచి ఆర్సీ 390 అత్యంత ప్రాచుర్యం పొందిన సూపర్ స్పోర్ట్స్ మోడల్స్‌లో ఒకటి. అవుట్గోయింగ్ మోడల్లో పోలిస్తే ఈ కొత్త-తరం ఆర్సీ 390 బైక్‌లో ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ ABS, సూపర్మోటో మోడ్‌తో కూడిన డ్యూయల్-ఛానల్ ABS ,పవర్-అసిస్టెడ్ యాంటీ-హాపింగ్ స్లిప్పర్ క్లచ్, టీఎఫ్టీ మల్టీకలర్ డిస్ప్లే సహా ఇతర ఎలక్ట్రానిక్ అప్గ్రేడ్లతో వస్తుంది. అలాగే క్విక్‌షిఫ్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. లేటెస్ట్ మోడల్లో అధునాతన 373 సీసీ ఇంజిన్, 13.7 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ మొదలైన ఫీచర్లు ఉంటాయి. 4వాల్వ్, లిక్విడ్-కూల్డ్, DOHC ఇంజిన్‌తో వస్తుంది. ఇది 42.9బీహెచ్పీ గరిష్ట శక్తిని, 37ఎన్ఎం వద్దగరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ ఇంజన్ స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను పొందుపర్చారు. రేసింగ్ బ్లూ , ఆరెంజ్ రెండు రంగుల్లో లభ్యం. -
ఇటలీ సంస్థతో ఒకినావా ఆటోటెక్ జట్టు!
ముంబై: ఇటలీకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టేసిటాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఒకినావా ఆటోటెక్ వెల్లడించింది. దీని ప్రకారం స్కూటర్లు, మోటర్‌సైకిళ్లతో పాటు దేశ, విదేశీ మార్కెట్లకు పవర్ట్రెయిన్ల తయారీ కోసం జాయింట్ వెంచర్ (జేవీ) ఏర్పాటు చేయనున్నారు. భారత్ కేంద్రంగా జేవీ ఏర్పాటవుతుందని, రాజస్థాన్‌లోని తమ రెండో ప్లాంటులో 2023 నుంచి ఉత్పత్తి ప్రారంభం కాగలదని ఒకినావా ఆటోటెక్ వ్యవస్థాపకుడు, ఎండీ జితేందర్ శర్మ తెలిపారు. వచ్చే ఏడాది తయారు చేసే వాటిలో ఒక స్కూటర్, హై–ఎండ్ మోటర్‌సైకిల్ మోడల్ ఉంటాయని ఆయన వివరించారు. ప్రథమార్ధంలో డిజైనింగ్, అభివృద్ధి మొదలైన పనులు చేపట్టనున్నట్లు శర్మ చెప్పారు. టేసిటా సొంతంగా పవర్‌ట్రెయిన్, కంట్రోలర్, మోటర్, బ్యాటరీ ప్యాక్‌లు మొదలైన వాటిని డిజైన్ చేసుకుని, ఉత్పత్తి చేస్తుంది. జేవీలో భాగంగా టేసిట్ పవర్‌ట్రెయిన్ మొదలైనవి అందించనుండగా స్థానికంగా ఉత్పత్తి అభివృద్ది, తయారీని ఒకినావా చేపడుతుంది. మార్కెట్‌పై గట్టి పట్టు ఉన్న ఒకినావాతో జట్టు కట్టడంపై టేసిటా ఎండీ పీర్పాలో రిగో సంతోషం వ్యక్తం చేశారు. -
ఎంట్రి లెవల్ కార్ల అమ్మకాలు ఢమాల్..కొనేవారు కరువయ్యారు..! కానీ..!
ముంబై: ఆటోమొబైల్ పరిశ్రమపై కోవిడ్–19 ప్రభావాలు ఇంకా కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ పరిణామాలతో సామాన్యుల ఆదాయాల సెంటిమెంటు గణనీయంగా దెబ్బతింది. దీంతో ఎంట్రీ స్థాయి కార్లు కొనుక్కోవాలనుకునే వారు లేదా అప్‌గ్రేడ్ అవ్వాలనుకునేవారు తమ నిర్ణయాలను వాయిదా వేసుకుంటున్నారు. రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. సంపన్న వర్గాల ఆదాయాలకేమీ ఢోకా లేకపోవడంతో ప్రీమియం కార్ల (రూ. 10 లక్షలు పైబడినవి) అమ్మకాలు మాత్రం గణనీయంగా వృద్ధి చెందనున్నట్లు నివేదిక పేర్కొంది. ద్విచక్ర వాహనాల విభాగంలో అధిక రేటు ఉండే (రూ. 70,000 పైగా) టూ–వీలర్ల వాటా 40 శాతం స్థాయిలో ఉండనున్నట్లు వివరించింది. దేశీయంగా సాధారణంగా తొలిసారి కొనుగోలు చేసేవారు, లేదా సెకండ్ హ్యాండ్ వాహనాల నుంచి అప్‌గ్రేడ్ అవ్వాలనుకుంటున్న వారు ఎంట్రీ స్థాయి కార్లపై దృష్టి పెడుతుంటారు. సరఫరాపరమైన సమస్యలు వాహనాల తయారీ సంస్థలన్నింటిపైనా ప్రభావం చూపుతున్నప్పటికీ, ఎంట్రీ లెవెల్ కన్నా ఎక్కువ రేటు ఉండే మోడల్స్‌పై కొనుగోలుదారుల ఆసక్తి కొనసాగుతోందని క్రిసిల్ నివేదిక వివరించింది. ప్రీమియం.. అయిదు రెట్లు అధికం.. గత ఆర్థిక సంవత్సరం చౌక ధరల కార్లతో పోలిస్తే ప్రీమియం సెగ్మెంట్ వాహనాలు అయిదు రెట్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి. ఎంట్రీ కార్ల విభాగం 7 శాతం పెరగ్గా ప్రీమియం విభాగం విక్రయాలు 38 శాతం వృద్ధి నమోదు చేశాయి. దీంతో ప్రీమియం కార్ల మార్కెట్ వాటా 500 బేసిస్ పాయింట్లు పెరిగి సుమారు 30 శాతానికి చేరింది. సంపన్నుల ఆదాయాలపై పెద్దగా ప్రతికూల ప్రభావాలు లేకపోవడం, ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ మార్కెట్లోకి వస్తుండటం వంటి పరిస్థితుల నేపథ్యంలో రాబోయే రోజుల్లోనూ ఇదే ధోరణి కొనసాగవచ్చని అంచనా వేస్తున్నట్లు క్రిసిల్ వివరించింది. అలాగే అధిక రేటు ఉండే టూ–వీలర్లవైపు కొనుగోలుదారులు మొగ్గు చూపుతుండటం, మరిన్ని మోడల్స్ అందుబాటులో ఉండటం తదితర అంశాల కారణంగా మొత్తం ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో వీటి వాటా 40 శాతం స్థాయిలో కొన్నాళ్లు కొనసాగవచ్చని పేర్కొంది. రేటు ఎక్కువ .. చాయిస్ తక్కువ.. కఠిన భద్రతా ప్రమాణాలు (యాంటీ–లాక్ బ్రేకింగ్ సిస్టమ్, రియర్ పార్కింగ్ సెన్సర్లు మొదలైనవి) అమలు చేయాల్సి రావడం వల్ల గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో చౌక కార్ల రేట్లు 15–20 శాతం మేర పెరిగాయి. ఎంట్రీ లెవెల్ కార్ల ధరలు గణనీయంగా పెరగడం, మోడల్స్ లభ్యత తక్కువగా ఉండటం (కొన్ని సంస్థలు ఈ విభాగం నుంచి పూర్తిగా నిష్క్రమించాయి) వంటి అంశాలు ఒక మోస్తరు ఆదాయాలుండే కొనుగోలుదారుల నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నాయి. క్రిసిల్ నివేదిక ప్రకారం .. పెద్ద, మధ్య స్థాయి కంపెనీల్లో ఉద్యోగులపై వెచ్చించే వ్యయాలు, చిన్న స్థాయి సంస్థల్లో కన్నా ఎక్కువగా పెరిగాయి. తదనుగుణంగానే అధికాదాయం ఆర్జించే పెద్ద సంస్థల ఉద్యోగులు ఎక్కువ వెచ్చించి ప్రీమియం కార్లను కొనుగోలు చేస్తున్నారు. తక్కువ ధరల్లో కార్లను కొనుగోలు చేసే కస్టమర్ల సంఖ్య ఎక్కువగా చిన్న స్థాయి సంస్థల్లోనే ఉంటుంది. ఇలాంటి సంస్థల్లో ఉద్యోగులపై వ్యయాలు పెద్దగా పెరగని నేపథ్యంలో ఆదాయాల సెంటిమెంటు ఆశావహంగా లేకపోవడం వల్ల వారు కొనుగోలు నిర్ణయాలు వాయిదా వేసుకుంటున్నట్లు క్రిసిల్ తెలిపింది. ఆదాయాల సెంటిమెంట్‌ను మదింపు చేసేందుకు ఈ విధానాన్ని ప్రామాణికంగా తీసుకున్నట్లు వివరించింది. ప్రీమియంలో సెకండ్ హ్యాండ్ అయినా ఓకే.. రేట్లు పెరిగిపోయిన కొత్త ఎంట్రీ లెవెల్ కారుకు బదులు అదే ధరకు వస్తున్న ఖరీదైన సెకండ్ హ్యాండ్ కారునయినా కొనుగోలు చేసేందుకు కస్టమర్లు మొగ్గు చూపుతున్నారని క్రిసిల్ తెలిపింది. 2019 ఆర్థిక సంవత్సరంలో మారుతీ ఆల్టో, స్విఫ్ట్, డిజైర్ వంటివి, హ్యుందాయ్ ఐ10, ఐ20 మొదలైన ప్రాథమిక స్థాయి వాహనాల అమ్మకాల వాటా మొత్తం కార్ల విక్రయాల్లో 56 శాతం పైగా నమోదైంది. కానీ గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఇది క్రమంగా తగ్గుతోంది. 2016 ఆర్థిక సంవత్సరంలో ఈ తరహా కార్ల విభాగంలో 54 పైచిలుకు మోడల్స్ ఉండగా ప్రస్తుతం 39 స్థాయికి పడిపోయింది. 2020 ఆర్థిక సంవత్సరం నుంచి తక్కువ ధర కార్ల సెగ్మెంట్లో కొత్త మోడల్స్ ఆవిష్కరణ కూడా పెద్దగా లేదు. ఖరీదైన కార్ల విభాగంలో బెస్ట్ సెల్లింగ్ మోడల్స్ అయిన హ్యుందాయ్ క్రెటా, మారుతీ ఎర్టిగా, హోండా సిటీ మొదలైన వాటి వాటా 2019లో దాదాపు 68 శాతం ఉండేది. వాటి విక్రయాలు తర్వాత కాస్త తగ్గినా కొత్త అప్‌గ్రేడ్స్ ఆ ఖాళీని భర్తీ చేస్తున్నాయి. కియా సెల్టోస్, మారుతి ఎక్స్ఎల్6, ఎంజీ హెక్టర్, మహీంద్రా ఎక్స్‌యూవీ 700, హ్యుందాయ్ అల్కజర్ మొదలైన మోడల్స్ అమ్మకాలు గణనీయ స్థాయిలో ఉన్నాయి. ఇక గడిచిన 5–6 ఆర్థిక సంవత్సరాల్లో రూ. 70,000 పైగా ధర ఉన్న టూ–వీలర్ల విక్రయాలు నిలకడగా అధిక స్థాయిలో నమోదవుతున్నట్లు క్రిసిల్ తెలిపింది. కొనుగోలుదారుల ప్రాధాన్యతలు మారుతుండటంతో దానికి అనుగుణంగా తయారీ సంస్థలు కూడా అధిక రేట్ల వాహనాలపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు వివరించింది. 2015 ఆర్థిక సంవత్సరంలో తక్కువ రేట్ల విభాగంలో 29 మోడల్స్ ఉండగా ప్రస్తుతం 12 మాత్రమే ఉన్నాయని తెలిపింది. దానికి విరుద్ధంగా అధిక ధర సెగ్మెంట్లో మోడల్స్ సంఖ్య 71 నుంచి 93కి పెరిగినట్లు వివరించింది. చదవండి👉 పాప్ స్టార్ జస్టిన్ బీబర్‌కు భారీ షాక్! -
కాలిపోతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్..కేంద్రం సంచలన నిర్ణయం!
ఇటీవల దేశంలో పలు ప్రాంతాల్లో వరుసగా ఎలక్ట్రిక్ వాహనాలు అగ్నికి ఆహుతవుతున్నాయి. దీంతో వాహనదారులు ఎలక్ట్రిక్ వెహికల్స్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ బైక్స్‌లో ఉండే బ్యాటరీల నిబంధనల్ని సవరిస్తూ కేంద్రం సంచలనం నిర్ణయం తీసుకోనుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. “మేం సెల్ ప్రమాణాలు, బ్యాటరీల పరీక్షా ప్రమాణాలు, నిర్వహణ పద్దతుల్ని సవరిస్తాం. నిర్దిష్ట టెంపరేచర్ దాటిన తర్వాత బ్యాటరీలలోని ద్రావణంలో రాపిడి జరిగి (ఉదాహరణకు లిథియం అయాన్ బ్యాటరీలోని ఎలక్ట్రోలేడ్ ద్రావణం) ప్రమాదాలు జరుతున్నాయని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి” అని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారంటూ వెలుగులోకి వచ్చిన ఓ నివేదిక పేర్కొంది. మరోవైపు కేంద్రం తీసుకోనున్న ఈ కొత్త నిర్ణయం ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ దారులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే..ప్రస్తుతం ఆయా ఆటోమొబైల్ సంస్థలు మార్కెట్లో ఈవీ వెహికల్స్ ఉన్న డిమాండ్‌ను బట్టి విపరీతంగా తయారీని పెంచుతున్నాయి. ఒకవేళ కేంద్రం బ్యాటరీల నిబంధనల్ని సవరిస్తే..కంపెనీలు తయారీ కాకుండా.. భద్రతపై దృష్టిసారించి..ఉత్పత్తి అనుకున్నంతగా చేయలేవని నిపుణులు అంటున్నారు. 30 రోజుల్లో ఆరు వెహికల్స్ దగ్ధం దేశ వ్యాప్తంగా గత ముప్పై రోజుల్లో దాదాపు అర డజను ఎలక్ట్రిక్ బైక్స్ అగ్నికి ఆహుతైనట్లు రిపోర్ట్లు హైలెట్ చేస్తున్నాయి. ఏప్రిల్ 9న మహారాష్ట్రలోని నాసిక్‌లో కంటైనర్‌లో లోడ్ చేసిన జితేంద్ర న్యూ ఈవీ టెక్కు చెందిన 20 వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. వీటితో పాటు ఓలా ఎలక్ట్రిక్, ప్యూర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి. నో రీకాల్..కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ దగ్ధమవ్వడంపై..ప్రభుత్వం ఈ సమయంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను రీకాల్ చేయాలని ఆదేశించడంపై కేంద్రం ఆలోచించడం లేదని, బదులుగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, డీఆర్డీఓ ల్యాబ్‌లో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదాలపై నిజ నిర్ధారణ పరిశోధనల రిపోర్ట్‌ల కోసం ఎదురు చూస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. గిరిధర్ అరమనే ఏం చెప్పారు అంతకుముందు, ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రమాదాలపై..కేంద్రం వినియోగదారుల భద్రతకు కట్టుబడి ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమనే చెప్పారు. చదవండి: టపా టప్: వరుసగా పేలుతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్! కారణం అదేనా! -
టపా టప్: వరుసగా పేలుతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్! కారణం అదేనా!
దేశంలో రోజురోజుకీ పెరిగిపోతున్న పెట్రోల్,డీజిల్ ధరలతో వాహనదారుల ఆలోచన మారుతుంది. నిత్యం పెట్రోల్, డీజిల్‌ను కొనేకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు చేస్తే సరిపోతుందని భావిస్తున్నారు. అందుకే ఎలక్ట్రిక్ వెహికల్స్ కావాలని ఎగబడుతున్నారు. కానీ వరుస ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రమాదాలు వాహనదారుల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడు, మహరాష్ట్ర, పూణేలలో ఈవీబైక్‌లు దగ్ధమవ్వగా..ఇవ్వాళ వరంగల్‌లో మరో ఎలక్ట్రిక్ బైక్ అగ్నికి ఆహుతైంది. వరంగల్‌లో ఎలక్ట్రిక్ బైక్ దగ్ధమైంది. ఉదయం 6గంటలకు వరంగల్ చౌరస్తాలోని అప్నా పాన్ షాప్ సెంటర్ వద్ద ఈ ఘటన చోటు చేసింది. పార్కు చేసిన ఎలక్ట్రికల్ బైక్ నుంచి మంటలు చెలరేగాయి. ఎలక్ట్రిక్ బైక్ పూర్తిగా కాలిపోయింది. మనం వాడే అన్నీ ఎలక్ట్రిక్ గాడ్జెట్స్‌లో మనం ఉపయోగిస్తున్న ల్యాప్‌ట్యాప్‌లు, స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇలా అన్నింటిలోనూ లిథియం ఆయాన్ బ్యాటరీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. తేలికైన బ్యాటరీ సామర్ధ్యం. అత్యధిక నిలువ సామర్ధ్యం. ఫాస్ట్ ఛార్జింగ్. ఇవి ఈ రకం బ్యాటరీలో ఉన్న ప్లస్ పాయింట్స్. లిడ్ యాసిడ్లతో పోల్చితే..లిథియం ఆయాన్ బ్యాటరీల సామర్ధ్యం సుమారు 6రెట్లు ఎక్కువ. లిథియం అయాన్ బ్యాటరీల్లో ఎలక్ట్రోలేడ్ ద్రావణం రోజుల వ్యవధిలో వరుసగా ఎలక్ట్రిక్ బైక్‌లు తగలబడిపోవడం..ఎలక్ట్రిక్ వాహనాల వాడకంపై భయాల్ని రేకెత్తిస్తుంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్ వాహనదారులు ఈ లిథియం అయాన్ బ్యాటరీలను వాడాలంటే జంకుతున్నారు. ఎందుకంటే సరైన పద్దతిలో వినియోగించుకోకపోతే లిథియం అయాన్ బ్యాటరీలో పేలే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. లిథియం అయాన్ బ్యాటరీల్లో రెండు ఎలక్ట్రిక్ టెర్మినళ్లు ఉంటాయి. ఈ రెండు ఎలక్ట్రిక్ టెర్మినళ్ల వద్ద ఎలక్ట్రోలేడ్ ద్రావణం ఉంటుంది. ఈ ద్రావణమే ఎలక్ట్రిక్ బైక్‌లు ప్రమాదానికి కారణమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బ్యాటరీ ఛార్జింగ్ పెట్టినప్పుడు దీనిలో ఉన్న ఆయాన్లు ఒక ఎలక్ట్రోడ్ నుంచి మరో ఎలక్ట్రోడ్‌కు ప్రయాణిస్తుంటాయి. ఆ సమయంలో ఎలక్ట్రిక్ ద్రావణం అగ్ని ప్రమాదం జరిగేలా ప్రేరేపిస్తుంది. కాబట్టే ఎలక్ట్రోడ్లు ఉండే బ్యాటరీలను విమానాల్లోకి అనుమతించరు. ఏథర్ ఏం చెబుతుందంటే ఏ బ్యాటరీలు ఎంత ఫాస్ట్‌గా ఛార్జింగ్ ఎక్కుతాయో అంతే ప్రమాదకరమైనవని ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ సంస్థ ఏథర్ తన బ్లాగ్‌లో పేర్కొంది. ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో ఉండే బ్యాటరీలను సురక్షితమైన విధానంలో వినియోగించినప్పుడే బాగా పని చేస్తాయి. లేదంటే.. ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టం లిథియం అయాన్ బ్యాటరీకి వర్తిస్తుంది. అంటే బ్యాటరీ ఛార్జింగ్ డిస్చార్జింగ్ రేటు. సామర్థ్యం, లైఫ్ సైకిల్, ఛార్జింగ్ అయ్యే సమయంలో ఏ స్థాయిలో వేడెక్కుతుంది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ను వినియోగించుకోవచ్చని, అప్పుడే పేలుడు ప్రమాదాల నుంచి కాపాడుకునే అవకాశం ఉంటుందని ఎథర్ తన బ్లాగ్‌లో స్పష్టం చేసింది. చదవండి: ఓలా..! ఎందుకిలా..! నెలకూడా కాలేదు..అప్పుడే షేపులు ఇలా మారిపోయాయేంటీ? -
రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లవర్స్‌కు శుభవార్త!
డుగ్..డుగ్ బండి రాయల్ ఎన్ఫీల్డ్ లవర్స్‌కు శుభవార్త. రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఎలక్ట్రిక్ బైక్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీవీఎస్, హీరో, అథేర్, బీఎండబ్ల్యూ వంటి ప్రధాన ఆటోమొబైల్ కంపెనీలు మే నెలలో ఎలక్ట్రిక్ బైక్స్‌ను విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. ఆ కంపెనీల వెహికల్స్‌తో పోటీపడుతూ రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైందని రాయల్ ఎన్ఫీల్డ్ మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ లాల్ తెలిపారు. రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ విడుదలపై కొన్ని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆ రిపోర్ట్‌ల ప్రకారం..చెన్నై కేంద్రంగా రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ద్విచక్రవాహన ఆటోమొబైల్ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్‌ల కోసం ప్రోటోటైప్లను సిద్ధం చేస్తుందని, త్వరలో ఈవీ బైక్స్ తయారీని ప్రారంభించనుందని రిపోర్ట్లు హైలెట్ చేస్తున్నాయి. స్పెసిఫికేషన్ల విషయానికొస్తే! ఇండియా కార్ న్యూస్ నివేదికల ప్రకారం బైక్ 8కేడ్ల్యూహెచ్ నుండి 10కేడబ్ల్యూహెచ్ వరకు బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించవచ్చు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్లో ప్రస్తుతం ఉన్న ట్రెండ్ల ప్రకారం బైక్‌ల శక్తి, గరిష్ట టార్క్ 40బీహెచ్పీ, 100ఎన్ఎం ఉందని అంచనా. ఇక ఈబైక్ ప్రస్తుతం ఈ బైక్ ప్రోటోటైప్‌లు యూకేలో డిజైన్ చేస్తుండగా వచ్చే ఏడాది మార్కెట్లో విడుదల కానుంది. -
ఈ–వాహనాల వృద్ధి.. పవర్ ఫుల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో క్రమంగా విద్యుత్ (ఈ) వాహనాల సంఖ్య పెరుగుతోంది. వీటి సంఖ్య నాలుగేళ్లలో నాలుగురెట్లు పెరిగింది. 2017లో ద్విచక్రవాహనాలు, త్రిచక్ర వాహనాలు (ఆటోలు), కార్లు కలిపి విద్యుత్ వాహనాల సంఖ్య 5,653 ఉంటే గత ఏడాది డిసెంబర్ చివరి నాటికి ఈ సంఖ్య 21,565కు పెరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో ఎలక్ట్రికల్ ఆటోల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 2017తో పాటు 2018 సంవత్సరంలో ఎలక్ట్రికల్ ఆటోలు కేవలం ఆరు మాత్రమే ఉన్నాయి. వీటి సంఖ్య గత ఏడాది డిసెంబర్ నెలాఖరు నాటికి 2,587కు పెరిగింది. విద్యుత్ స్కూటర్ల సంఖ్య కూడా నాలుగేళ్ల నుంచి భారీగానే పెరుగుతోంది. 2017లో 3,195 ఎలక్ట్రికల్ స్కూటర్లున్నాయి. వీటి సంఖ్య గత డిసెంబర్ చివరి నాటికి 14,441. విద్యుత్ కార్ల వినియోగం మాత్రం ఇప్పుడే పెరుగుతోంది. 2017లో 2,452 విద్యుత్ కార్లు ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్ నాటికి వీటి సంఖ్య 4,537కు చేరింది. చార్జింగ్ స్టేషన్లు వస్తే ఈ–వాహనాలు మరింత పెరుగుతాయి పెట్రోల్, డీజిల్ బంక్‌లు తరహాలో విరివిగా బ్యాటరీ చార్జింగ్ స్టేషన్లతోపాటు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో ఎలక్ట్రికల్ వాహనాల సంఖ్య మరింత పెరుగుతుందని రవాణాశాఖ అదనపు కమిషనర్ ప్రసాదరావు తెలిపారు. ఇప్పుడిప్పుడే ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం పెరుగుతోందని చెప్పారు. చార్జింగ్ స్టేషన్లు వస్తే వీటి వినియోగం పెరుగుతుందన్నారు. ఎలక్ట్రికల్ వాహనాలపై పన్ను లేకపోవడం వల్ల కూడా ఇటీవల వాటి వినియోగం పెరుగుతోందని చెప్పారు. విద్యుత్ కార్ల వినియోగం పుంజుకుంటోందన్నారు. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. -
పెండింగ్ చలాన్ వాహనదారులకు హైదరాబాద్ పోలీసులు బంపర్ ఆఫర్
-
ధోనీ గ్యారేజీలోకి మరో అరుదైన కారు.. కారు స్పెషల్ ఇదే!
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి బైక్, కార్లు అంటే ఇష్టం అనే సంగతి మన అందరికీ తెలిసిందే. తన గ్యారేజీలోకి అడుగుపెడితే ఎన్నో రక రకాల వాహనాలు దర్శమిస్తాయి. తాజాగా ధోనీ గ్యారేజీలోకి మరో కారు వచ్చి చేరింది. ఎంఎస్ ధోని తన కోసం వింటేజ్ క్లాసిక్ ల్యాండ్ రోవర్ 3 కారును కొనుగోలు చేశాడు. బిగ్ బాయ్ టాయ్జ్ అనే సంస్థ నిర్వహించిన ఆన్లైన్ వేలంలో పాల్గొని ఇతరులతో పోటీ పడీ మరీ ఈ కారును ధోనీ దక్కించుకున్నాడు. ఆ కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ వేలంలో భారతదేశం నలుమూలల నుంచి అనేక మంది ప్రముఖులు ఈ వేలంలో పాల్గొన్నారు. బిగ్ బాయ్ టాయ్జ్ అనే సంస్థ రోల్స్ రాయిస్, కాడిలాక్, బ్యూక్, చేవ్రొలెట్, ల్యాండ్ రోవర్, ఆస్టిన్, మెర్సిడెస్ బెంజ్ వంటి 19 రకాల కార్లను వేలంలో ఉంచింది. ఇందులో ధోనీ 1970 మోడల్ ల్యాండ్ రోవర్ 3 కారును రూ.25 లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నాడు. ఈ ల్యాండ్ రోవర్ కారుకు ఆటోమొబైల్ రంగంలో ప్రత్యేక స్థానం ఉంది. 1970 దశకం నుంచి 1980 మధ్య కాలం వరకు దీన్ని తయారు చేసేవారు. 2.25 లీటర్ల ఇంజిన్ సామర్థ్యం గల ఈ కారు మ్యానువల్ ట్రాన్స్‌మిషన్‌తో నడుస్తుంది. ఆన్లైన్ వేలంలో వేలానికి ఉంచిన వాహనాల్లో 50 శాతం విక్రయించినట్లు బీబీటీ పేర్కొంది. (చదవండి: కోహ్లితో బవుమా గొడవ.. ఏం జరిగింది?) -
రికార్డు స్థాయిలో విదేశాలకు హీరో ద్విచక్ర వాహనాల ఎగుమతులు
ద్విచక్ర వాహనాల ఎగుమతుల పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ 2021లో కొత్త రికార్డు సృష్టించింది. 2021 ఏడాది కాలంలో భారతీయ, ప్రపంచ ఆటోమోటివ్ పరిశ్రమకు సవాళ్లు ఎదురైనప్పటికి హీరో మోటోకార్ప్ అత్యధిక సంఖ్యలో 2.89 లక్షల యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేసింది. ఏ సంవత్సరంలో నమోదు చేయని విధంగా భారత్‌తో సహా, ఇతర దేశాల్లో అత్యధిక విక్రయాలను నమోదు చేసింది. హీరో మోటోకార్ప్ గత సంవత్సరంలో ఆసియా, ఆఫ్రికా, దక్షిణ & మధ్య అమెరికా, కరేబియన్ ప్రాంతంలో తన మార్కెట్ విస్తరించింది. ఈ మార్కెట్ విస్తరణ వల్ల భారతదేశం వెలుపల మార్కెట్లలో అమ్మకాల పరంగా 71 శాతం పెరుగుదలను నమోదు చేసింది. 2020లో విదేశీ మార్కెట్లలో 1.69 లక్షల యూనిట్లతో పోలిస్తే ఈ సంఖ్య (2.89 లక్షల యూనిట్లు) చాలా ఎక్కువ. కానీ, హీరో మోటోకార్ప్ తన పనితీరుతో సంతృప్తిగా లేదు. "ప్రస్తుతం ఉన్న కోవిడ్-19 మహమ్మారి కారణంగా గ్లోబల్ లాజిస్టిక్స్, సప్లై ఛైయిన్ లో ఉన్న అడ్డంకులను దృష్టిలో ఉంచుకొని ఈ క్యాలెండర్ సంవత్సరంలో ప్రపంచ మార్కెట్లలో విక్రయాలు ప్రణాళికలకు అనుగుణంగా ఉన్నాయి" అని సంజయ్ భాన్, హెడ్ - గ్లోబల్ బిజినెస్, హీరో మోటోకార్ప్ అన్నారు. "2025 నాటికి గ్లోబల్ బిజినెస్ అమ్మకాల వాటా కంపెనీ మొత్తం వాటాలో 15% చేరుకోవడానికి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు" తెలిపారు. హీరో మోటోకార్ప్ ప్రస్తుతం 42 దేశాలకు ద్విచక్ర వాహనాలను ఎగుమతి చేస్తుంది. భారత్‌తో సహా గ్లోబల్ మార్కెట్లలో ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేసేందుకు హీరో మోటోకార్ప్ ప్రణాళికలను రచిస్తోందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ ఏడాది మార్చి నెలలో తన మొదటి ఎలక్ట్రిక్ వెహికల్ (EV)ని ఆవిష్కరించడానికి సిద్ధమవుతోంది. ఈ వాహనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరులోని కంపెనీ తయారీ కేంద్రంలో ఉత్పత్తి కానున్నట్లు తెలుస్తోంది. డిసెంబరులో, హీరో మోటోకార్ప్ దేశీయ మార్కెట్లో 3,94,773 యూనిట్లను విక్రయించింది. (చదవండి: భారత మార్కెట్లలో కియా మోటార్స్ ప్రభంజనం..!) -
రయ్..రయ్..డుగ్ డుగ్ మంటూ వచ్చేస్తున్నాయ్!
చిరు ఉద్యోగికి జీవితంలో సొంతిల్లు కట్టుకోవాలనేది ఒక అందమైన కల. అదే కుర్ర కారుకి స్పోర్ట్స్ బైక్ కొనాలనేది కల. కొన్న కొత్త బైక్‌తో రయ్..రయ్ అంటూ లేదంటే డుగ్ డుగ్ మంటూ చక్కెర్లు కొట్టడం అంటే మహా పిచ్చి. అందుకే బైక్ రైడ్లతో కిర్రాకు పుట్టించే కుర్రకారు కోసం బైక్స్ కంపెనీలు కొత్త మోడళ్లు, సరికొత్త హంగులతో కొత్త బైక్స్‌ను మార్కెట్‌కు పరిచయం చేస్తున్నాయి.యువతను అట్రాక్ట్ చేయనున్నాయి. అయితే ఎప్పటిలాగే ప్రతి ఏడాది విడుదలయ్యే కొత్త బైక్స్ ఈ ఏడాది విడుదల కానున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రాయల్ ఎన్ ఫీల్డ్ స్క్రామ్ 411 రాయల్ ఎన్ ఫీల్డ్ స్క్రామ్ 411. ఈ బైక్ ను రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బైక్ ఇన్స్పిరేషన్తో డిజైన్ చేశారు. 19 అంగుళాలతో చిన్నగా ఫ్రంట్ వీల్ ఉండనుంది. ఈ నెలలో మార్కెట్లో విడుదల కావాల్సి ఉండగా..బైక్ ధర రూ.1.9లక్షలుగా ఉంది. కేటీఎం ఆర్సీ 390 కేటీఎం ఆర్సీ 390 స్పోర్ట్స్ బైక్. బైక్ విండ్‌స్క్రీన్ బ్లాస్ట్‌ను తగ్గిస్తుంది. బైక్ రైడింగ్ సమయంలో అలసట లేకుండా చేస్తుంది. మరో ఆరు నెలలో ఈ బైక్ మార్కెట్లో విడుదల కానుండగా.. ఈ బైక్ ధర రూ.2.5లక్షలుగా ఉంది. కవాసకీ డబ్ల్యూ 175 కవాసకీ డబ్ల్యూ 175 ఈ ఏడాదిలోనే విడుదల కానున్న ఈ బైక్ అత్యంత సరసమైన బైక్‌గా నిలవనుంది. ఇక ఈ బైక్ ధర రూ.1.75లక్షలుగా ఉంది. 2022 హోండా సీబీ300ఆర్ మరో వారంలో 2022 హోండా సీబీ300ఆర్ బైక్ దేశీయ మార్కెట్లో విడుదల కానుంది. బీఎస్ వీఐ ఇంజిన్‌తో వస్తున్న ఈ బైక్ ధర రూ.2.5లక్షలుగా ఉంది. ట్రయంప్ టైగర్ స్పోర్ట్స్ 660 ట్రయంప్ టైగర్ స్పోర్ట్స్ 660 ప్రీమియం బైక్. ట్రిడెంట్ 660 మోడల్‌తో ఆరు నెలల్లో విడుదల కానున్న బైక్ ధర రూ. 12లక్షలుగా ఉంది. husqvarna svartpilen 125 బైక్ husqvarna svartpilen 125 బైక్ 125సీసీ కేటీఎం డ్యూక్ 125బైక్ తరహాలో ఈ బైక్‌లో సైతం సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో మార్కెట్లో విడుదల కానుంది. ఈ బైక్ ధర రూ.1.3లక్షలుగా ఉంది. హీరో ఎక్స్ ట్రీమ్ 160ఎస్ హీరో ఎక్స్ ట్రీమ్ 160ఎస్ స్పోర్ట్స్ బైక్. 163 సీసీ ఇంజిన్‌తో ఈ ఏడాదిలో విడుదల కానున్న బైక్ ధర రూ. 1.1లక్షలుగా ఉంది. టీవీఎస్ జెప్పిలిన్ ఆర్ టీవీఎస్ జెప్పిలిన్ ఆర్ క్రూజర్ బైక్ 2018 ఆటోఎక్స్పోలో కనిపించింది. అయితే ఇన్ని సంవత్సరాల తరువాత ఏడాదిలో ఈ బైక్ విడుదల కానుంది. ఈ బైక్ ధర రూ.1.5లక్షలుగా ఉంది. ఏజిద్ రోడ్ కింగ్ ఏజిద్ రోడ్ కింగ్ బైక్ ఈ ఏడాది మార్కెట్లో విడుదల కానుండగా ఈ బైక్ ధర రూ.1.75లక్షలుగా ఉంది. కవాసకీ నింజా 400 కవాసకీ నింజా 400 బైక్ మరో ఆరు నెలలో విడుదల కానుంది. 399సీసీ తో రెండు ఇంజిన్లతో రానున్న ఈ బైక్ ధర రూ.5లక్షలు చదవండి: సింగిల్ ఛార్జ్‌తో 200 కి.మీ దూసుకెళ్లనున్న ఒకాయా 'ఫాస్ట్' ఎలక్ట్రిక్ స్కూటర్..! -
రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ బైక్‌ల రీకాల్
న్యూఢిల్లీ: బ్రేక్ భాగంలో సమస్యలను పరిష్కరించేందుకు క్లాసిక్ 350 మోడల్‌కు సంబంధించి 26,300 బైక్‌లను రీకాల్ చేస్తున్నట్లు మోటర్‌సైకిల్ తయారీ దిగ్గజం రాయల్ ఎన్ఫీల్డ్ వెల్లడించింది. వీటిల్లో సమస్యలు తలెత్తే అవకాశాలను తమ సాంకేతిక బృందం గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. వెనుక బ్రేకు పెడల్పై భారీ స్థాయిలో ఒత్తిడి పడినప్పుడు, అసాధారణంగా బ్రేకింగ్ సామర్థ్యం దెబ్బతినే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 5 మధ్య తయారైన సింగిల్ చానెల్, ఏబీఎస్, రియర్ డ్రమ్ బ్రేక్ క్లాసిక్ 350 మోడల్స్‌కు ఈ సమస్య పరిమితమని వివరించింది. కస్టమర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ముందు జాగ్రత్త చర్యగా వీటిని వెనక్కి రప్పిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. నిర్దిష్ట కాల వ్యవధిలో తయారైన మోటర్‌సైకిళ్ల గుర్తింపు నంబరు (వీఐఎన్) ఆధారంగా రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ బృందాలు లేదా స్థానిక డీలర్లు.. వాటి వినియోగదారులను సంప్రదిస్తారని పేర్కొంది. అలాగే ఈ సమస్య గురించి వినియోగదారులు స్వయంగా కంపెనీ వెబ్సైట్ ద్వారా తెలియజేయవచ్చని లేదా స్థానిక వర్క్‌షాపులను సంప్రదించవచ్చని తెలిపింది. -
కష్టపడి చదివాడు .. ఎన్నో కలలు.. కానీ కాలం అతన్ని దొంగగా మార్చింది
బనశంకరి(బెంగళూరు): కష్టపడి చదివిన చదువుకు సరైన ఉద్యోగం లభించక ఒక డిప్లొమా హోల్డర్ చోరీల బాట పడ్డాడు. ఏపీలో బైక్‌లను చోరీ చేసి కర్ణాటకలో విక్రయిస్తూ బండెపాళ్య పోలీసులకు పట్టుబడ్డాడు. డిప్లొమా సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఈ నిందితుడు ఎలాంటి ఉద్యోగం లభించకపోవడంతో బైక్ చోరీలను వృత్తిగా పెట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. కూడ్లుగేట్ వద్ద బైక్ విక్రయిస్తుండగా నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్దనుంచి రూ. 15 లక్షల విలువచేసే 5 రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు, 4 యమహా, బజాజ్ పల్సర్ బైకుతో పాటు మొత్తం 10 బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇతనిపై బెంగళూరు నగరంలో 5 కేసులు, విజయవాడలో 1, బద్వేలు 2, తిరుపతి టౌన్ 2 కేసులతో కలిపి మొత్తం 10 కేసులు వెలుగు చూశాయి. చదవండి: కలిసికట్టుగా కొట్టేశారు.. సినిమాలోనూ ఇలాంటి దొంగతనం చూసుండరు ! -
అడ్వాన్స్డ్ ఫైర్ బైక్స్ వచ్చేస్తున్నాయ్.. ఒక్కో బైక్ విలువెంతో తెలుసా?
సాక్షి, ముంబై: ముంబై అగ్నిమాపక విభాగంలోకి త్వరలో ఆధునిక ఫైర్ బైక్స్ రానున్నాయి. ఈ బైక్స్ అందుబాటులోకి వస్తే అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి మంటలు విస్తరించకుండా నిలువరించే ప్రయత్నం చేయవచ్చు. దీంతో ప్రాణ, ఆస్తి నష్టం ఎక్కువ వాటిల్లదని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పరిపాలనా విభాగం భావిస్తోంది. ఈ మేరకు వార్డుకు ఒకటి చొప్పున ముంబై పరిధిలో ఉన్న మొత్తం 24 వార్డుల కోసం 24 ఫైర్ బైక్స్ కొనుగోలు చేయనున్నట్లు బీఎంసీ డిప్యూటీ చీఫ్ ఫైర్ బ్రిగేడ్ అధికారి రాజేంద్ర చౌదరి తెలిపారు. ఒక్కో బైక్ ధర రూ. 13 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. గత కొంతకాలంగా ముంబై నగరం వేగంగా విస్తరిస్తోంది. నగరంలో ఎక్కడ పడితే అక్కడ టవర్లు, ఆకాశ హర్మ్యాలు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. అయితే, పెరిగిన వాహనాల సంఖ్యకు తగినట్లు రోడ్ల విస్తరణ జరగలేదు. ఫలితంగా నిత్యం నగర రహదారులపై ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తుతోంది. దీంతో నగరంలో ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగితే ఫైరింజన్లు సకాలంలో చేరుకోలేకపోతున్నాయి. ఫైరింజన్లే కాదు అంబులెన్స్‌ల పరిస్థితి కూడా దాదాపుగా ఇలానే ఉంటోంది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలు, టవర్ల వద్దకు వెళ్లేందుకు విశాలమైన దారి లేకపోవడంతో భారీ ఫైరింజన్లు సంఘటనా స్థలం దగ్గరి వరకు వెళ్లలేకపోతున్నాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది మినీ ఫైరింజన్లతోనే మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. అయితే, అప్పటికే మంటలు ఉగ్రరూపం దాల్చి జరగాల్సిన ప్రాణ, ఆస్తి నష్టం జరిగిపోతోంది. దీంతో ఈ సమస్యకు పరిష్కారం కోసం ఆలోచించిన బీఎంసీ, ఫైర్ బైక్స్ అయితే ఇలాంటి సందర్భాల్లో బాగా పనికొస్తాయని భావించింది. చదవండి: (పదోన్నతుల్లో రిజర్వేషన్లకు దారి చూపండి.. సుప్రీంకోర్టుకు కేంద్రం విజ్ఞప్తి) ఈ ఫైర్ బైక్స్ ట్రాఫిక్ జామ్‌లో కూడా సునాయాసంగా ముందుకు దూసుకుపోవడంతో పాటు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంటాయి. ఇవి మంటలను పూర్తిగా అదుపు చేయకపోయినప్పటికీ కనీసం విస్తరించకుండానైనా నిలువరిస్తాయి. ఆ లోపు పెద్ద ఫైరింజన్లు వచ్చేస్తాయి. దీంతో ఆస్తి, ప్రాణ నష్టం ఎక్కువ జరగదని రాజేంద్ర చౌదరి పేర్కొన్నారు. కాగా, ఇలాంటి ఫైర్ బైక్‌లను కొనుగోలు చేయాలని బీఎంసీ రెండేళ్ల కిందటే భావించింది. ఆ మేరకు పరిపాలనా విభాగం మంజూరునిచ్చింది. టెండర్లను ఆహ్వనించే ప్రక్రియ కూడా ప్రారంభించారు. కానీ, కరోనా వైరస్ వ్యాప్తితో ఆ కొనుగోలు ప్రక్రియ వాయిదా పడింది. ప్రస్తుతం కరోనా వైరస్ అదుపులోకి రావడంతో ఫైర్ బైక్స్ కొనుగోలు అంశం మళ్లీ తెరమీదకు వచ్చింది. ఫైర్ బైక్స్ ప్రత్యేకతలు ►ఆధునిక సౌకర్యాలుండే ఈ ఫైర్ బైక్స్‌కు 20 లీటర్ల చొప్పున సామర్థ్యం ఉండే రెండు వాటర్ ట్యాంకులు ఉంటాయి. ►నేరుగా సమీప ఫైర్ స్టేషన్‌తో సంప్రదించేలా కమ్యూనికేషన్ సౌకర్యముంటుంది. ►శిక్షణ పొందిన అగ్నిమాపక శాఖ సిబ్బంది బైక్ రైడర్స్‌గా ఉంటారు. ►పోర్టబుల్ ఫైర్ సిస్టం, 30 మీటర్ల హోజరిల్ పైపు, ఫైర్ పంపు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంటాయి. చదవండి: (గుడ్ న్యూస్: విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా) -
దేశంలో ఖరీదైన స్పోర్ట్స్ బైక్స్: ధోని ఫేవరెట్ ఏంటో తెలుసా?
యువతకు స్పోర్ట్స్ బైక్స్ అంటే యమా క్రేజ్. రోడ్లపై రయ్.. రయ్ దూసుకుపోవడం అంటే వారికి భలే సరదా. బైక్స్ కంపెనీలు కూడా కొత్త మోడల్స్‌ను మార్కెట్లో దించుతూ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. భారతదేశంలో అందుబాటులో ఉన్న ఖరీదైన కొన్ని స్పోర్ట్స్ బైక్స్ వివరాలు ఇక్కడ చూద్దాం.. బ్రాండ్ ధోని మన దేశంలో స్పోర్ట్స్ బైక్స్ లవర్స్ పేర్లు చెప్పాల్సి వస్తే మొదటి గుర్తొచ్చేది టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనినే. ఖాళీ సమయాల్లో రాంచీ వీధుల్లో బైక్స్పైన చక్కర్లు కొట్టడం ధోనికి ఇష్టం. ఖరీదైన కార్లకు తోడు ఖరీదైన బైక్స్ కూడా అతని గారేజీలో కొలువై ఉంటాయి. కవాసకి నింజా హెచ్2, కాన్ఫిడరేట్ ఎక్స్ 132 హెల్‌క్యాట్, హార్లీ డేవిడ్సన్ ఫ్యాట్‌బాయ్, డుకాటి 1098, సుజుకి హయబుస తదితర బైక్‌లు ధోని కలెక్షన్లో ఉన్నాయి. (చదవండి: బైక్ కొనుగోలుదారులకు హీరో మోటోకార్ప్ షాక్!) ఇక బాలీవుడ్ విషయానికి వస్తే జాన్ అబ్రహం పెద్ద బైక్ లవర్ అని చెప్పవచ్చు. అతని వద్ద ఉన్న బైక్స్ విలువ కోటిన్నర రూపాయల వరకూ ఉంటుందని చెబుతారు. కవాసకి నింజా జెడ్ఎక్స్-14 ఆర్, అప్రిల్లా ఆర్ఎస్వీ 4 తదితర బైక్‌లు అతని వద్ద ఉన్నాయి. షాహిద్ కపూర్ కూడా బైక్స్ లవరే. షూటింగ్ లేని సమయాల్లో అతను బైక్స్‌పైనే లాంగ్ డ్రైవ్స్‌కు వెళతాడు. షాహిద్ వద్ద బీఎండబ్ల్యూ 310 ఆర్, హార్లీ డేవిడ్సన్ ఫ్యాట్ బాయ్ లాంటి ఖరీదైన మోటార్‌సైకిల్స్ ఉన్నాయి. ఇక బైక్స్ లవర్స్ లిస్ట్‌లో మాధవన్, సల్మాన్‌ఖాన్, అక్షయ్‌కుమార్, సైఫ్ అలీఖాన్ తదితరులు ఉన్నారు. కవాసకి నింజా హెచ్2ఆర్ ఇంజిన్ కెపాసిటి : 998 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 216 కిలోలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 17 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 305.75 బీహెచ్పీ, 14,000 ఆర్పీఎం మన దేశంలో ధర (సుమారు) : రూ. 79,90,000 బీఎండబ్ల్యూ ఎం 1000 ఆర్ఆర్ ఇంజిన్ కెపాసిటీ : 999 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 192 కిలోలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 16.5 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 209.19 బీహెచ్పీ, 14,500 ఆర్పీఎం మన దేశంలో ధర (సుమారు) : రూ. 42,00,000 హోండా గోల్డ్‌వింగ్ ఇంజిన్ కెపాసిటి : 1,833 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 385 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 21.1 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 124.7 బీహెచ్పీ, 5,500 ఆర్పీఎం మన దేశంలో ధర (సుమారు) : రూ. 37,75,000 హార్లీడేవిడ్సన్ రోడ్ కింగ్ ఇంజిన్ కెపాసిటి : 1,746 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 375 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 22.7 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : - మన దేశంలో ధర (సుమారు) : రూ. 30,00,000 అప్రిల్లా ఆర్ఎస్వీ4 1100 ఫ్యాక్టరీ ఇంజిన్ కెపాసిటి : 1099 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 202 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 17.9 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 213.89 బీహెచ్పీ, 13,000ఆర్పీఎం మన దేశంలో ధర (సుమారు) : రూ. 26,50,000 డుకాటీ పనిగేల్ వీ4 ఇంజిన్ కెపాసిటి : 1,103 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 198 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 16 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 211.21 బీహెచ్పీ, 13,000 ఆర్పీఎం మన దేశంలో ధర (సుమారు) : రూ. 26,27,000 బీఎండబ్ల్యూ ఆర్ 1250 అడ్వెంచర్ ఇంజిన్ కెపాసిటి : 1,254 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 268 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 30 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 134.1 బీహెచ్పీ, 7,700 ఆర్పీఎం మన దేశంలో ధర (సుమారు) : రూ. 25,00,000 ట్రయంప్ రాకెట్ 3 ఇంజిన్ కెపాసిటి : 2,458 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 304 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 18 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 165 బీహెచ్పీ మన దేశంలో ధర (సుమారు) : రూ. 22,27,000 ఇండియన్ చీఫ్ బాబెర్ డార్క్‌హార్స్ ఇంజిన్ కెపాసిటి : 1890 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 352 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 15.1 లీటర్లు మన దేశంలో ధర (సుమారు) : రూ. 21,40,000 సుజుకి హయబుస ఇంజిన్ కెపాసిటి : 1,340 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 266 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 20 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 187.3 బీహెచ్పీ మన దేశంలో ధర (సుమారు) : రూ. 18,47,000 -
మార్కెట్లోకి మరో కొత్త టీవీఎస్ బైక్
టీవీఎస్ మోటార్ కంపెనీ 2021 అపాచీ ఆర్ఆర్ 310ని భారతదేశంలో రూ.2.60 లక్షల ప్రారంభ ధరతో లాంఛ్ చేసింది. ఆర్ఆర్ 310లో కొత్త ఫీచర్స్, కొత్త డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్ వంటివి ఉన్నాయి. టీవీఎస్ మోటార్ ఇప్పటికే కొత్త అపాచీ ఆర్ఆర్ 310 బుకింగ్స్ ప్రారంభించింది. ఆర్ఆర్ 310లో ముందు, వెనుక సస్పెన్షన్లను ట్వీక్ చేసింది. ఈ కొత్త బైక్ మునుపటి బైక్ కంటే అదనపు ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ బైక్‌లో ఆర్టీ-స్లిప్పర్ క్లచ్, బై-ఎల్ఈడీ ట్విన్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, ఆర్టీ-ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఉన్నాయి. అపాచీ ఆర్ఆర్ 310నిలోని డిజిటల్ క్లస్టర్ యూనిట్ లో ముఖ్యమైన డాక్యుమెంట్లు, డే ట్రిప్ మీటర్, డైనమిక్ రెవ్ లిమిట్ ఇండికేటర్, ఓవర్ స్పీడ్ ఇండికేటర్ లను చూపిస్తుంది. బీఎమ్‌డబ్ల్యూ జీ 310 ఆర్ ఇంజిన్ ఆధారంగా 310 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ తో కొత్త అపాచీ ఆర్ఆర్ 310 వస్తుంది. 34 బిహెచ్పి శక్తి, 27.3 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ ఆరు-స్పీడ్ మాన్యువల్ గేర్ ఆప్షన్ కలిగి ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ లో 2021 అపాచీ ఆర్ఆర్ 310 ప్రారంభించాలని టీవీఎస్ కంపెనీ ఇంతకు ముందు యోచించింది. అయితే, కోవిడ్-19 మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా లాంచ్ ఆలస్యమైంది. 2021 అపాచీ ఆర్ఆర్ 310 కెటిఎమ్ ఆర్ సీ 390, కావాసాకీ నింజా 300, బెనెల్లీ 302ఆర్ వంటి ప్రత్యర్థులతో తలపడనుంది.(చదవండి: సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే!) -
కంగారులో ఇంజిన్ ఆఫ్ చేయకుండానే దుకాణంలోకి.. ఇంకేముంది..
సాక్షి, మెదక్ : జిల్లాలోని నర్సాపూర్ పట్టణంలో డ్రైవర్ లేకుండానే ఓ ట్రాక్టర్ బీభత్సం సృష్టించింది. పార్కింగ్లోని ద్విచక్ర వాహనాలపైకి ట్రాక్టర్ దుసుకెళ్లడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ప్రమాదంలో పార్క్ చేసి ఉన్న 12 బైకులు ధ్వంసమయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. ఖాజీపేట్ గ్రామానికి చెందిన రమేష్ తన ట్రాక్టర్‌ను సర్వీసింగ్ చేయించి మెదక్ మార్గంలో గల ఓ వైన్స్ షాప్ సమీపంలో పార్క్ చేశాడు. కంగారులో డ్రైవర్ ట్రాక్టర్ ఇంజిన్ ఆఫ్ చేయకుండానే పక్కనున్న దుకాణంలోకి వెళ్లాడు. ఇంతలో ట్రాక్టర్ ఉన్నట్టుండి ముందుకు కదలడం ప్రారంభించింది. ఈ క్రమంలో రోడ్డు పక్కన ఉన్న బైకులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో రెండు బైకులు పూర్తిగా ధ్వంసమవ్వగా మరో పది బైకులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వెంటనే అక్కడ ఉన్న ప్రయాణికులు స్పందించి బ్రేకులు వేసి ట్రాక్టర్‌ను ఆపారు. ఆ సమయంలో అక్కడ జనం ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
1971 వార్ విజయానికి గుర్తుగా జావా స్పెషల్ ఎడిషన్ బైక్స్
ప్రముఖ వాహన తయారీ కంపెనీ జావా మోటార్ సైకిల్స్ 1971లో పాకిస్తాన్ తో జరిగిన యుద్దంలో భారత్ సాధించిన విజయానికి గుర్తుగా జావా బ్రాండ్‌లో ఖాకీ, మిడ్నైట్ గ్రే రంగులను పరిచయం చేసింది. భారత్‌లో సైనిక చిహ్నంతో మోటార్ సైకిల్స్ అందుబాటులోకి రావడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని కంపెనీ తెలిపింది. "50 సంవత్సరాల క్రితం భారత సాయుధ దళాలు దురాక్రమణకు అడ్డుగా నిలిచాయి. చరిత్రలో జరిగిన అతి తక్కువ గొప్ప యుద్ధాలలో అద్భుతమైన విజయాన్ని సాధించాయి. 1971 వార్ విక్టరీ 50 సంవత్సరాలను పురస్కరించుకొని #SwarnimVijayVarsh జరుపుకోవడం మాకు గర్వంగా ఉంది" అని జావా మోటార్ సైకిల్స్ ట్విట్టర్ లో తెలిపింది. మాతృ భూమిని రక్షించడానికి సైనికులు చూపిన ధైర్యం, త్యాగాలను ఈ బైక్ పై ఉన్న భారత సైనిక చిహ్నం గుర్తు చేస్తుందని వివరించింది. మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా జావా బృందాన్ని అభినందించారు ఈ స్పెషల్ ఎడిషన్ బైక్ ధర హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో రూ.1.96 లక్షలుగా ఉంది. కస్టమర్లు కంపెనీ వెబ్ సైట్ ద్వారా స్పెషల్ ఎడిషన్ మోటార్ సైకిల్ ని ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు. -
ఆ నిరసన బాధ్యతారాహిత్యం.. మంత్రి కేటీఆర్ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: చెరువుల్లో బైక్స్, సిలిండర్లు వేసి నిరసన తెలపడంపై రాష్ట్ర, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువుల్లో ఇలాంటి వేయకుండా చర్యలు తీసుకోవాలని హోంమంత్రి, డీజీపీకి కేటీఆర్ సూచించారు. చెరువుల్లో బైక్స్, సిలిండర్లు వేయటం బాధ్యతారాహిత్యం అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. Protest is an important part of democracy to attract the attention of Govts & people But irresponsible behaviour such as these👇, throwing bikes & cylinders into lakes is reprehensible Request HM @mahmoodalitrs Garu and @TelanganaDGP Garu to issue instructions for stern action pic.twitter.com/TRTSGAWQLr — KTR (@KTRTRS) July 6, 2021 -
స్టైలిష్ లుక్‌తో కట్టిపడేస్తున్న 'యమహా'
సాక్షి,వెబ్‌డెస్క్: యమహా ఇండియా నియో రెట్రో కమ్యూటర్ కు చెందిన 149సీసీ యమహా ఎఫ్‌జెడ్ సిరీస్ బైక్ విడుదలైంది. స్టైలిష్ లుక్‌తో ‘యమహా ఎఫ్-ఎక్స్’ ఈ బైక్ రెండు వేరియంట్లతో బైక్ లవర్స్‌ను అలరించనుంది. ధర : రెండు వేరియంట్లలోఇది లభ్యం. ప్రారంభ ధర రూ.1,16,800గా ఉండగా, స్మార్ట్‌ఫోన్ సాయంతో కనెక్ట్ చేయగలిగే ఫీచర్ బైక్ ధర రూ.1,19,800గా కంపెనీ నిర్ణయించింది. 'వై కనెక్ట్' యాప్ ద్వారా ఇన్ కమింగ్ కాల్ నోటిఫికేషన్లు, ఎస్ఎంస్ అలెర్ట్, బ్యాటరీ ఛార్జింగ్, ఇంధన వినియోగం, పనిచేయని పక్షంలో అలర్ట్స్ అలాగే పనితీరు, ఆయిల్ మార్చేలా సలహాలతో పాటు మరెన్నో ఫీచర్స్ ఈ బైక్ సొంతం. ఈ కొత్త యమహా ఎఫ్‌జెడ్ -ఎక్స్ అమ్మకాలు జూన్ నుండి ప్రారంభం కానున్నాయి. ఫీచర్ల విషయానికొస్తే ఇంజిన్ బాష్ ప్లేట్‌తో నిటారుగా రైడింగ్ పొజిషన్, ఎల్ఈడీ హెడ్‌లైట్, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్, ఎల్ఈడి టైలైట్లు,149 సీసీ ఇంజిన్, 7,250 ఆర్పీఎం వద్ద 12.4 పవర్‌ను అందిస్తుంది 500 ఆర్‌పిఎమ్ 13.3 ఎన్ఎమ్. ఫ్రేమ్ యమహా ఎఫ్ జెడ్ డిజైన్ లాగే ఉంది. ఇక దీని బరువు 139 కిలోలుగా ఉంది. చదవండి: Tesla: భారత్‌లో రయ్..రయ్ : వైరల్ వీడియో -
Vijay Devarakonda: ప్రతీ సినిమాలో కొత్త రకం బైక్
వెబ్‌డెస్క్ : రౌడీ హీరో విజయ్ దేవరకొండ యాట్యిట్యూడ్కు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పెళ్లి చూపుల్లో అమాయకంగా కనిపించిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత వచ్చిన అర్జున్‌రెడ్డిలో నట విశ్వరూపమే చూపించాడు. ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. గీతగోవిందంలో భయస్తుడిలా కనిపించినా.. డియర్ కామ్రేడ్లో ఆవేశపరుడిగా మెప్పించాడు విజయ్. వింటేజ్ టూ విదేశీ పాత్ర ఏదైనా సరే తన ప్రతీ సినిమాలో యూత్‌ని ఎట్రాక్ట్ చేసే బైక్స్ వాడేస్తుంటాడు విజయ్ దేవరకొండ. వింటేజ్ నుంచి విదేశీ భైకుల వరకు తన సినిమాలో బైక్‌లకు ప్రత్యేక స్థానాన్ని కేటాయిస్తాడు. నెక్ట్స్ సినిమాలో విజయ్ ఏ బైక్ యూజ్ చేస్తాడా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తుంటారు. తాజాగా బాలీవుడ్ ఏస్ వన్ ఫోటోగ్రాఫర్ దబు రత్నానీ ఫోటోషూట్‌లో ట్రంఫ్ బైక్‌తో కనిపించారు విజయ్ దేవరకొండ. ఇప్పటి వరకు విజయ్ చిత్రాల్లో రైడ్ చేసిన బైకులు.. వాటి ధరల ఎంతో చూద్దాం (ఎక్స్‌షోరూం) Yezdi 300, ధర రూ. 1.6 లక్షలు సుజికీ యాక్సెస్, ధర రూ. 74 వేలు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ ధర రూ. 1.6 లక్షలు సీబీజెడ్ ఎక్స్ట్రీం ధర రూ. 81 వేలు రాయల్‌ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ రూ. 2.5 లక్షలు బొనవిల్లే స్పీడ్‌మాస్టర్ ట్రయంఫ్ రూ. 11.75 లక్షలు యమహా వైజెడ్ డర్ట్ బైక్ ధర రూ. 4 లక్షలు బీఎస్ఏ గోల్డ్‌స్టార్ ధర 2,000 యూరోలు బీఎండబ్ల్యూ జీ 310 ధర రూ. 2.90 లక్షలు బజాజ్ చేతక్ ధర రూ. 23,000 చదవండి : ఆడి నుంచి ఈ - ట్రోన్ ఎస్యూవీ -
చైతూ దగ్గర ఖరీదైన బైకులు, కార్లు, వాటి ధరెంతో తెలుసా?
యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్యకు బైకులంటే ఆసక్తి ఎక్కువ. చైతో పాటు అఖిల్‌కు కూడా స్పోర్ట్స్ బైకులు, స్పోర్ట్స్ కార్లన్నా బాగా ఇష్టం. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన బైకు వీరి మనసు దోచిందంటే చాలు ఆ వెంటనే ఇంటి ముందుండేలా చూసుకుంటారు. ఈ క్రమంలో చై దగ్గర లగ్జరీ బైకులు, కార్ల కలెక్షన్ బాగానే ఉంది. మరి అతడి దగ్గరున్న ఆ ఖరీదైన వాహనాలేంటో? వాటి ఖరీదెంతో చూసేద్దాం.. 1. BMWR9T: నాగచైతన్య దగ్గరున్న ఖరీదైన బైకుల్లో ఇది ఒకటి. 2014లో లాంచ్ అయిన ఈ బైక్‌ను చై రూ.19 లక్షలు గుమ్మరించి మరీ తన సొంతం చేసుకున్నాడు. దీని మీద భార్య సమంతను ఎక్కించుకుని మరీ రోడ్ల మీద చక్కర్లు కొట్టాడు. View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni) 2. Triumph Thruxton R bike: ఈ రేసర్ బైక్ అంటే కూడా చైకు చాలా ఇష్టం. ఇంతకీ దీని ధరెంతనుకుంటున్నారు. మార్కెట్లో దీని వాల్యూ ఇంచుమించు రూ.13 లక్షలుగా ఉందట. View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni) 3. Ferrari F 430: ఈ కారుకు చై మాత్రమే కాదు జాన్సేన నుంచి మొదలు పెడితే బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ వరకు ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు. ఈ కారు ధర రూ.1.75 కోట్లుగా ఉంది. View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni) 4. Mercedes Benz G-Class G63: రణ్‌బీర్ కపూర్, హార్దిక్ పాండ్యాల, రామ్ చరణ్‌లతో పాటు చైతన్య కూడా ఈ మెర్సిడిస్ బెంజ్ కారుకు ఓనరే. దీని ఖరీదు సుమారు కోటి రూపాయలు ఉంటుందట. View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni) 5. MV Agusta F4: చైతూ ఫేవరెట్ కార్లలో అగస్ట కారుది ప్రత్యేక స్థానం. రూ.26 నుంచి రూ.35 లక్షల మధ్య ఉండే ఈ కారులో ఈ అక్కినేని హీరో చాలా సార్లు షికార్లు చేస్తూ మీడియా కంట పడ్డాడు. ఈ లగ్జరీ వాహనాలతో పాటు యమహా వైజెడ్ఎఫ్ ఆర్1 స్పోర్ట్స్ బైక్, హోండా స్పోర్ట్స్ బైక్ సహా మరిన్ని చై గ్యారేజీలో ఉన్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni) చదవండి: నాగచైతన్య 'వార్' వాయిదా! చైతూతో గొడవలు.. సీక్రెట్స్ రివీల్ చేసిన సామ్! -
Expensive Bikes: వారెవ్వా..ఒక్కసారి నడిపితే
వెబ్‌డెస్క్: ఇండియాలో బైకులకు క్రేజ్ రోజురోజుకి పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. ముఖ్యంగా తన రీ ఎంట్రీతో మార్కెట్‌ని షేక్ చేసింది రాయల్ ఎన్ఫీల్డ్. ఖరీదైన బైకులకు మంచి మార్కెట్‌ను సిద్ధం చేసింది. ఆ తర్వాత లక్షల రూపాయల విలువ చేసే బైకులు మార్కెట్లోకి వచ్చాయి.. వస్తున్నాయి. కుర్రకారు అయితే క్యాష్ కంటే బైక్ డిజైన్, పవర్‌కే ప్రిఫరెన్స్ ఇస్తూ హై ఎండ్ బైకులు కొనేందుకు సై అంటున్నారు. ధర అధికంగా ఉన్నా ఇండియా మార్కెట్లో క్రమంగా విస్తరిస్తున్న ఐదు ఖరీదైన బైకులపై ఓ లుక్కేద్దాం. కవాసాకి నింజా H2R కవాసాకి నింజా H2R బైక్‌ని 2019లో ఇండియా మార్కెట్లోకి తెచ్చారు. 998 సీసీ సామర్థ్యం కలిగిన ఈ బైక్ వేగానికి, పవర్‌కి మరో పేరు. 326 హార్స్పవర్ సామర్థంతో ఈ బైకుపై రివ్వున దూసుకు పోవచ్చు. అయితే బైకును రోడ్లపై నడిపేందుకు మన ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. రేసింగ్ రోడ్లపై నడిపేందుకే అనుమతి ఉంది. ఈ బైక్ ధర రూ.79.90 లక్షలుగా ఉంది. బీఎండబ్ల్యూ M 1000 RR లగ్జరీ కార్లు, హై ఎండ్కార్లలో స్పెషల్ స్టేటస్ బీఎండబ్ల్యూ సొంతం. అదే స్థాయిని కాపుడుకుంటూ టూ వీలర్ సెగ్మెంట్లో బీఎండబ్ల్యూ M 1000 RR మోడల్ని మార్కెట్లోకి తెచ్చింది. క్షణాల్లో గంటకు 300 కి.మీ వేగానికి చేరుకోవడం దీని ప్రత్యేకత. ఈ బైకు ధర రూ. 42 లక్షల నుంచి రూ. 45 లక్షల వరకు ఉంది. ఇండియన్ రోడ్ మాస్టర్ వింటేజ్ లుక్‌తో పవర్ఫుల్ ఇంజన్‌తో రైడర్లిద్దరికి లగ్జరీ అందించే బైకుగా రోడ్మాస్టర్కి ప్రత్యేక స్థానం ఉంది. ఇండియన్ మోటార్ సైకిల్ ఈ బైకును మార్కెట్లోకి తెచ్చింది. సాధారణంగా అన్ని బైకులు రైడర్ కంఫర్ట్‌కి ప్రాధాన్యత ఇస్తాయి. కానీ రోడ్ మాస్టర్‌లో వెనక కూర్చునే వ్యక్తి కోసం ప్రత్యేక డిజైన్ చేసింది ఇండియన్ మోటర్ సైకిల్ సంస్థ. ఈ బైకు ధర 43 లక్షల నుంచి మొదలవుతుంది. హార్లే - డేవిడ్సన్ రోడ్ గ్లైడ్ స్పెషల్ హర్లే డేవిడ్సన్ నుంచి వచ్చిన రోడ్ గ్లైడ్ స్పెషల్ బైక్‌ని నడుపుతుంటే... గాల్లో తేలినట్టుందే.. గుండే జారినట్టుందే అనే ఫీలింగ్ రాకమానదు. ఇండియన్ వింటేజ్ స్టైల్లోనే క్లాసిక్ ప్లస్ మోడ్రన్ లుక్ విత్ ఇన్ఫోంటైన్మెంట్ ఫెసిలిటీతో వచ్చింది గ్లైడ్ స్పెషల్ బైక్. ఈ బైకులు మార్కెట్లో రూ. 35 లక్షలు నుంచి లభిస్తున్నాయి. చీఫ్స్టైయిన్ లిమిటెడ్ ఎడిషన్ క్లాసిక్, ఎథ్నిక్ లుక్‌తో మోడ్రన్ బైకులు తయారు చేస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్న ఇండియన్ మోటర్ సైకిల్ సంస్థ నుంచి వచ్చిన మరో బైక్ చీఫ్స్టైయిన్ లిమిటెడ్ ఎడిషన్. ఎల్ఈడీ లైటింగ్, బ్లూటూత్, ఆపిల్ కార్ ప్లే వంటి అధునాతన సదుపాయలు ఈ బైక్ సొంతం. ఈ బైకు సొంతం చేసుకోవాలంటే రూ. 33 లక్షలకు పైగానే సొమ్ములు రెడీ చేసుకోవాలి. -
Ducati: డుకాటీ నుంచి రెండు కొత్త బైకులు
న్యూఢిల్లీ: ఇటాలియన్ సూపర్ బైకుల తయారీ సంస్థ డుకాటీ గురువారం స్ట్రీట్‌ఫైటర్ వీ4, వీ4 ఎస్ మోడళ్ల కొత్త వెర్షన్ బైకులను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. వీటి ధరలు ఢిల్లీ ఎక్స్ షోరూం వద్ద వరుసగా రూ.19.99 లక్షలు, రూ.22.99 లక్షలుగా ఉన్నాయి. ఈ రెండింటిలోనూ బీఎస్ 6 ప్రమాణాలను కలిగిన ఇంజిన్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 208 హెచ్‌పీ సామర్థ్యాన్ని ఉత్పత్తి చేయగలదు. ఆరు స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కలిగి ఉన్నాయి. వీటిలో వీ4 మోడల్ బైక్ రెడ్ కలర్ ఆప్షన్లో లభిస్తుంది. అదే వీ4ఎస్ మాత్రం రెడ్‌తో పాటు డార్క్ స్టీల్త్ కలర్ ఆప్షన్లతో వస్తుంది. దేశవ్యాప్తంగా అన్ని డుకాటీ డీలర్‌షిప్‌ల వద్ద బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. లాక్డౌన్ ఆంక్షల ఎత్తివేత తర్వాత డెలివరీలు మొదలుకానున్నాయి. కొత్త వెర్షన్ బైకులు... లగ్జరీ మోటార్ సైకిళ్ల పట్ల ఆసక్తి కలిగిన వారి మన్ననలను పొందుతాయని డుకాటీ భారత విభాగపు ఎండీ బిపుల్ చంద్ర ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి: గూగుల్ క్రోమ్ యాప్‌తో జర జాగ్రత్త! -
వాహనాల తయారీ నిలిపివేసిన హీరో మోటాకార్ప్
-
వాహనాల తయారీ నిలిపివేసిన హీరో మోటాకార్ప్
ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారు సంస్థ హీరో మోటోకార్ప్ కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న తరుణంలో ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కంపెనీకి చెందిన గ్లోబల్ పార్ట్స్ సెంటర్(జీపీసీ)తో సహా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని తయారీ ప్లాంట్లలో తాత్కాలికంగా కార్యకలాపాలను నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించినట్లు హీరో మోటోకార్ప్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. రేపటి(ఏప్రిల్ 22) నుంచి మే 1 వరకు కంపెనీకి సంబంధించిన అన్ని ప్లాంట్లను మూసివేస్తున్నట్లు తెలిపింది. అయితే, ప్లాంట్లను మూసివేయడం కారణంగా వాహనాల తయారీ నిలిచిపోవడంతో ఆ ప్రభావం డిమాండ్ పై పడే ప్రమాదం ఉందన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. కంపెనీ మాత్రం వాహనాల తయారీని నిలిపివేయడం ద్వారా డిమాండ్ పై ఎలాంటి ప్రభావం ఉండకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ఈ మూసివేత ద్వారా ఏర్పడే ప్రొడక్షన్ లాస్ ను భర్తీ చేస్తామన్నారు. తయారీ కర్మాగారాల్లో అవసరమైన నిర్వహణ పనులను చేపట్టడానికి కంపెనీ ఈ షట్-డౌన్ రోజులను ఉపయోగించుకొనున్నట్లు పేర్కొంది. అలాగే, కంపెనీకి చెందిన అన్ని కార్పొరేట్ కార్యాలయాలు సైతం మూసి వేసే ఉన్నాయి. ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం విధానంలో విధులు నిర్వహిస్తున్నారు. మళ్లీ మే 1 అనంతరం ప్రతీ ప్లాంటులోని వాహనాల తయారీ ఎప్పటిలాగే కొనసాగుతుందని కంపెనీ స్పష్టం చేసింది. చదవండి: దేశంలో బంగారం దిగుమతుల జోరు -
హోండా ప్రీమియం బైక్స్ : ధర ఎంతంటే
సాక్షి, ముంబై: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా మంగళవారం రెండు ప్రీమియం బైకులను భారత మార్కెట్లో విడుల చేసింది. ఇందులో ఒకటి సీబీఆర్650ఆర్ కాగా, మరోకటి సీబీ650ఆర్ బైక్. ఇది 649 సీసీ మోటర్ సైకిల్ అప్డేట్ ఎడిషన్‌గా వస్తుంది. ఈ బైకుల ధరలు వరుసగా రూ.8.88 లక్షలు, రూ.8.67 లక్షలుగా ఉన్నాయి. వీటిని విదేశాల నుంచి కంప్లీట్లీ నాక్డ్ డౌన్ యూనిట్ (సీకేబీ) రూపంలో దిగుమతి చేసుకుంటామని కంపెనీ తెలిపింది. భారత మార్కెట్లో ప్రీమియం మోటర్‌సైకిళ్ల విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఈ బైకులను విడుదల చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. హైదరాబాద్ సహా, గురుగ్రామ్ (హర్యానా), ముంబై (మహారాష్ట్ర), బెంగళూరు (కర్ణాటక), ఇండోర్ (మధ్యప్రదేశ్), కొచ్చి (కేరళ)లోని బిగ్ వింగ్ టాప్ లైన్ డీలర్‌షిప్‌లలో బుకింగ్స్ప్రారంభం. -
భారత్ లో విడుదలైన లగ్జరీ బీఎండబ్ల్యూ బైక్
ముంబై: జర్మనీ విలాస కార్ల తయారీ సంస్థ బీఎండబ్యూ మంగళవారం ఆర్ 18 క్లాసిక్ బైక్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూం ధరను రూ.24 లక్షలు. ఈ బైక్ ఇంజిన్ సామర్థ్యం 1902 సీసీగా ఉంది. ఇందులో 6 గేర్లు ఉన్నాయి. రెయిన్, రోల్, రాక్ మోడ్స్ అనే మూడు రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంది. పొడవైన విండ్ స్కీన్ ప్యాసింజర్ సీట్, ఎల్ఈడీ అదనపు హెడ్ లైట్లు, స్యాడిల్ బ్యాగ్స్ 16-ఇంచ్ ఫ్రంట్ వీల్ తో పాటు ఇంటిగ్రేటెడ్ డిజిటల్ డిస్ప్లే వంటి అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ట్రాక్షన్ కంట్రోల్, ఇంజిన్ ట్రక్ కంట్రోల్, హిల్ స్వార్డ్ కంట్రోల్. కీలెస్ రైడ్ సిస్టం, ఎలక్రానిక్ క్రూయిజ్ కంట్రోల్ లాంటి అదనపు ఫీచర్లను కలిగి ఉంది. ఈ మోటార్ సైకిల్ సీబీయూ(కంప్లీట్లే బిల్డ్ యూనిట్) మార్గం ద్వారా భారత్‌లకి దిగుమతి అవుతుందని, డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయని బీఎండబ్య్యూ తెలిపింది. చదవండి: క్వాల్‌కామ్‌తో ఎయిర్టెల్ జట్టు కొత్తగా ముస్తాబైన మారుతి స్విఫ్ట్ -
సెకండ్ హ్యాండ్ వాహనాల అమ్మకాల్లో ఇవే టాప్
న్యూఢిల్లీ: 2020లో భారతదేశంలో మారుతి సుజుకి డిజైర్, బజాజ్ పల్సర్ సరోకొత్త రికార్డు సృష్టించాయి. గత ఏడాది సెకండ్ హ్యాండ్ వాహనాల అమ్మకాల్లో అత్యధికంగా అమ్ముడైన కారుగా మారుతి సుజుకి డిజైర్, అత్యధికంగా అమ్ముడైన ద్విచక్ర వాహనంగా బజాజ్ పల్సర్ నిలిచినట్లు "ఆటోమొబైల్ ఇండస్ట్రీ ట్రెండ్ రిపోర్ట్ 2020" ప్రకారం ఆన్ లైన్ ప్రీ ఓన్డ్ ఆటోమొబైల్ సంస్థ డ్రూమ్ వెల్లడించింది. 2020లో సెకండ్ హ్యాండ్ కార్ల సగటు అమ్మకపు ధర రూ.8,38,827గా ఉంది. అలాగే మోటార్ సైకిళ్ల సగటు ధర రూ.47,869గా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. 2020లో విక్రయించిన వాడిన కార్లు, మోటార్ సైకిళ్ల సగటు యాజమాన్యం వ్యవధి 5ఏళ్ల నుంచి 7ఏళ్లగా ఉంది. 2020లో విక్రయించిన మొత్తం సెకండ్ హ్యాండ్ కార్లలో 34 శాతం పెట్రోల్ మోడల్స్, 65 శాతం డీజిల్ మోడల్స్, 1 శాతం పెట్రోల్ + సిఎన్జి మోడల్స్ ఉన్నాయి. అలాగే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉన్న కార్లు మొత్తం కార్ల అమ్మకాల్లో 63 శాతం ఉండగా, మిగిలిన కార్లు మాన్యువల్ ట్రాన్స్మిషన్ కలిగి ఉన్నాయి. నివేదిక ప్రకారం.. తెలుపు, సిల్వర్, బూడిద రంగు గల వాటిని ఎక్కువగా కొనుగోలుదారులు ఇష్ట్టపడ్డారు. 2020లో విక్రయించిన మొత్తం సెకండ్ హ్యాండ్ కార్లలో 36 శాతం భారతీయ కంపెనీలకు, 22 శాతం జపాన్ కంపెనీలకు, 18 శాతం జర్మన్ కంపెనీలకు, 12 శాతం దక్షిణ కొరియా కంపెనీలకు చెందినవని నివేదిక పేర్కొంది. చదవండి: బంగారం రుణాలపై తాజా వడ్డీ రేట్లు ఇవే! -
డ్డగ్...డ్డగ్...డ్ఢగ్.....రాయల్ ఎన్ఫీల్డ్!
‘దేవుడిని బైక్ ఇవ్వమని అడిగాను. ఇవ్వకపోయేసరికి బైక్ దొంగిలించి క్షమాపణ అడిగాను’ అన్నాడట ఒక దొంగ. ఆ దొంగగోల మనకెందుకుగానీ, యువ హృదయాలను కామ్‌గా, క్లాసిక్‌గా దోచుకోవడానికి మోటర్‌బైక్ కంపెనీలు కాంపిటీషన్‌కు కాలు దువ్వుతున్నాయి స్పోర్టీ, రేసింగ్, టూర్ బైక్ కావచ్చు. మోడ్రన్, క్లాసిక్ బైక్ కావచ్చు....ఇప్పుడు మోటర్ కంపెనీల ప్రధాన టార్గెట్ యూత్! రేస్ మొదలైంది.... పోటీ గురించి మాట్లాడుకునే ముందు పోటీ ఎవరితో, దాని బలం ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం. మోటర్‌బైక్ కంపెనీలు ‘సై’ మోటర్ సైకిల్స్‌ను ‘లైఫ్‌స్టైల్’గా మార్చిన ఘనత రాయల్ది. మిడిల్‌వెయిట్ మోటర్‌సైకిల్ సెగ్మెంట్లో లీడింగ్ ప్లేయర్ అయిన ‘రాయల్’ మెనేజ్మెంట్ స్కూళ్లలో ‘కేస్ స్టడీ’ అయింది. తిరుగులేని విజయానికి ఒక మోడల్‌గా నిలిచింది. ‘రాయల్’ ఏకచ్ఛత్రాధిపత్యానికి గండికొట్టడానికి దేశీయ,విదేశీ మోటర్‌బైక్ కంపెనీలు ‘సై’ అంటున్నాయి. రకరకాల ఎక్సైటింగ్ మోడల్స్‌తో ‘యూత్ టార్గెట్’గా బరిలోకి దిగాయి. దిగుతున్నాయి రాజకీయాల్లో వినిపించే ‘పొత్తులు’ ‘టై–అప్’లు మోటర్‌సైకిల్ సెగ్మెంట్లో కనిపిస్తున్నాయి. ఎడతెగని చర్చల తరువాత ప్రఖ్యాత అమెరికన్ మోటర్‌సైకిల్ తయారీదారు హార్లే–డెవిడ్సన్ లార్జెస్ట్ టు వీలర్ మేకర్ ‘హీరో మోటో కోర్ప్’తో ఒక అవగాహనకు వచ్చింది. రాయల్ ఎన్ఫీల్డ్ బలమైన కోటలోకి ప్రవేశించడానికి అప్రకటిత వ్యూహాలతో ముందుకు వస్తున్నాయి కంపెనీలు. లోకల్ పాట్నర్షిప్లతో బజాజ్–ట్రయంప్, హీరో–హార్లే, టీవిఎస్–నొర్టన్...మొదలైనవి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌కు గట్టి పోటి ఇవ్వనున్నాయి. టాక్టికల్ మూవ్లో భాగంగా కొన్ని కంపెనీలు ధరలను కాస్తో కూస్తో తగ్గిస్తూ యూత్‌ను ఎట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. రాయల్‌తో పోటీ పడేందుకు హోండా కంపెనీ ‘హైనెస్’ను ప్రవేశపెట్టింది. విదేశాల్లో ప్రాచుర్యంలో ఉన్న ‘హోండా రెబెల్’ మోడల్‌తో దీన్ని రూపొందించారు. మిడ్‌సైజ్ మార్కెట్‌ను టార్గెట్‌గా చేసుకొని డిలక్స్, డిలక్స్ ప్రొ వెరియంట్లలో వచ్చిన ‘హైనెస్’ సార్మ్‌ఫోన్ వాయిస్ కంట్రోల్ సిస్టమ్ కలిగిన బైక్. ఇక బజాజ్–ట్రయంప్ జోడి 400 నుండి 800 సీసీ ఇంజన్ సామర్థ్యం ఉన్న మిడిల్ కెపాసిటీ మోటర్ సైకిల్స్‌ను అభివృద్ధి చేస్తుంది. దేశీయ మోటర్‌బైక్ తయారీ దిగ్గజం ‘మహీంద్ర అండ్ మహీంద్ర’ జావా బ్రాండ్‌ను యుద్దంలో సరికొత్త ఆయుధంగా చేసుకుంది. చెక్ రిపబ్లిక్ బ్రాండ్ ‘జావా’ హవా ఒకప్పుడు మనదేశంలో బాగానే నడిచిందికాని ఆ తరువాత ఆశించిన ఫలితాలు రాకపోడంతో జావగారిపోయి ఇండియన్ మార్కెట్ నుంచి జారిపోయింది. సినిమా ఇంటర్యూ్యలలో ఒక సంభాషణ తరచుగా వింటుంటాం... ‘ఇరవై సంవత్సరాల క్రితం మీరు తీసిన సినిమా చూశానండీ. ఇప్పటికీ కొత్తగా ఉందంటే నమ్మండి. మరి కమర్శియల్‌గా ఎందుకు సక్సెస్ కాలేదు!’ ‘చాలా అడ్వాన్స్డ్గా తీసిన సినిమా కావడం వల్లే సక్సెస్ కాలేదు. ఈ టైమ్‌లో తీసి ఉంటే కచ్చితంగా హిట్టు కొట్టి ఉండేది’ ఇది కాస్తో కూస్తో ఆనాటి ‘జావా’కు కూడా వర్తిస్తుంది. అందుకే మహీంద్ర ‘జావా’ బ్రాండ్‌ను దేశీయంగా సొంతం చేసుకుంది. కేటిఎం390 అడ్వెంచర్‌ను దృష్టిలో పెట్టుకొని రంగంలోకి దిగుతున్న బజాజ్–హిస్కివర్న మోడల్ డిజిటల్ ఇన్స్ట్ర్మెంట్ క్లస్టర్, ఆల్–లెడ్ లైటింగ్ సెటప్, వైర్–స్పోక్డ్ వీల్స్‌తో రోడ్ఫ్రెండ్లీ డిజైన్‌తో రూపొందించారు. ఐకానిక్ బీయండబ్ల్యూ ఆర్5 నుంచి టెక్నాలజీ, విజువల్ మోటర్‌సైకిల్ ఎసెన్షియల్స్‌ను స్ఫూర్తి పొంది రూపుదిద్దుకున్న ‘బీయండబ్ల్యూ ఆర్18 క్లాసిక్’లో రెయిన్, రోల్ అండ్ రాక్...ఎలాంటి రైడింగ్ కండిషన్స్‌లోనైనా ధైర్యం ఇచ్చే 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. స్టెప్డ్–అప్ సీట్, రైజ్డ్ విండ్‌స్క్రీన్, ఆల్–లెడ్ లైటింగ్ సెటప్, బ్లూటూత్–ఎనేబుల్డ్ టీఎఫ్టి ఇన్స్ట్ర్మెంట్ కన్సోల్...ఐ క్యాచింగ్ బాడీగ్రాఫిక్స్తో బరిలోకి దిగింది టీవిఎస్–అపాచీ ఆర్ఆర్ 310. అలయెన్స్‌లు, అవగాహనలు, టై–అప్లు, సృజనాత్మక ఆలోచనతో ఏ బండి ‘యూత్’ గుండెల్లో స్టాండవుతుందో వేచిచూద్దాం. -
భారత్‌కు ‘హార్లే’ గుడ్‌బై!
న్యూఢిల్లీ: భారత ఆటోమొబైల్ మార్కెట్ విషయమై అమెరికన్ కంపెనీ హార్లే డేవిడ్సన్ అంచనాలు తలకిందులయ్యాయి. ప్రీమియం బైక్‌ల విభాగంలో మంచి వాటాను సొంతం చేసుకోవాలన్న ఆకాంక్షలతో భారత్‌లోకి అడుగు పెట్టిన ఈ సంస్థ.. నష్టాల కారణంగా దశాబ్ద కాలం తర్వాత ప్రస్తుత వ్యాపార నమూనా నుంచి వైదొలగాలని అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా హరియాణాలోని బావల్లో ఉన్న తయారీ కేంద్రాన్ని మూసివేయనుంది. దీనివల్ల 70 మంది ఉపాధి కోల్పోనున్నారు. అమెరికా వెలుపల కంపెనీకి ఉన్న ఏకైక తయారీ కేంద్రం ఇది కావడం గమనార్హం. అదే విధంగా గురుగ్రామ్‌లో ఉన్న విక్రయాల కార్యాలయం పరిమాణాన్ని కూడా తగ్గించనున్నట్టు కంపెనీ గురువారం ప్రకటించింది. భారత్‌లోని తన కస్టమర్లకు ఈ విషయాన్ని తెలియజేయడంతోపాటు, భవిష్యత్తులోనూ ఉత్పత్తి పరంగా సహకారం అందుతుందని ఈ సంస్థ భరోసా ఇచ్చింది. కాంట్రాక్టు కాలం వరకు ప్రస్తుత డీలర్ల నెట్వర్క్ కొనసాగుతుందని కంపెనీ తెలిపింది. అంటే పరిమిత కాలం వరకు కంపెనీ వాహన విక్రయాలు, విక్రయానంతర సేవలు కొనసాగనున్నాయి. ప్రస్తుత వ్యాపార విధానాన్ని మార్చుకోవడంతోపాటు.. భారత్‌లోని కస్టమర్లకు ఇక ముందూ సేవలు అందించే ఆప్షన్లను పరిశీలిస్తున్నట్టు హార్లే డేవిడ్సన్ వివరణ ఇచ్చింది. అయితే, భారత్‌లో తన వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే భాగస్వామి కోసం హార్లే డేవిడ్సన్ చూస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయంగా కంపెనీ వ్యాపార పునర్నిర్మాణ ప్రణాళికల్లో భాగమే ఈ నిర్ణయాలు. పునర్ నిర్మాణంలో భాగమే ‘‘2020 చివరి నాటికి అమలు చేయాలనుకున్న ‘రీవైర్’ ప్రణాళికలో భాగమే ఈ చర్యలు. అదే విధంగా హార్లే డేవిడ్సన్ బ్రాండ్, ఉత్పత్తుల ఆదరణ కోసం 2021–25 కాలానికి రూపొందించిన ‘హార్డ్‌వైర్’కు మారడంలో భాగమే’’ అంటూ హార్లే డేవిడ్సన్ తన ప్రకటనలో వివరించింది. భారత్ లో విక్రయాలు, తయారీ కార్యకలాపాలు నిలిపివేయనున్నట్టు అమెరికా స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థకు కం పెనీ తెలిపింది. ట్రంప్ ఒత్తిడి.. హార్లే డేవిడ్సన్ బైకులపై భారత్ భారీ పన్నులు వడ్డిస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నోసార్లు నిరసన స్వరం వినిపించారు. పన్నులు తగ్గించకపోతే తాము కూడా అదే విధమైన చర్యను తీసుకోవాల్సి వస్తుందంటూ పరోక్షంగా హెచ్చరికలు కూడా చేశారు. దాంతో అప్పటి వరకు 100 శాతంగా ఉన్న పన్నును భారత్ సగానికి తగ్గించింది. అయినా ట్రంప్ శాంతించలేదు. భారత వాహనాలపై అమెరికాలో సున్నా పన్ను విధానాన్ని అమలు చేస్తున్నామని గుర్తు చేస్తూ మరింత తగ్గించాలని పలు పర్యాయాలు డిమాండ్ కూడా చేశారు. ఎంట్రీ.. ఎగ్జిట్ ► 2007 ఏప్రిల్‌లో కాలుష్య ఉద్గార, పరీక్షా నియమాల్లో భారత ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది. దీంతో హార్లే డేవిడ్సన్ బైక్‌లు భారత మార్కెట్‌కు ఎగుమతి చేయడానికి మార్గం సుగమం అయింది. ► 2009 ఆగస్ట్‌లో హార్లే డేవిడ్సన్ ఇండియా కార్యకలాపాలు మొదలు ► 2010 జూలైలో మొదటి డీలర్షిప్ నియామకం, విక్రయాలు మొదలు ► 2011లో హరియాణాలోని ప్లాంట్‌లో బైక్‌ల అసెంబ్లింగ్ మొదలు ► విక్రయిస్తున్న మోడళ్లు: 11 ► ప్లాట్‌ఫామ్‌లు: 6 (స్పోర్ట్‌స్టర్, డైనా, సాఫ్టెయిల్, వీ రాడ్, టూరింగ్, స్ట్రీట్) ► 2020 సెప్టెంబర్‌లో వైదొలగాలని నిర్ణయం -
హెల్మెట్ మస్ట్
సాక్షి, సిటీబ్యూరో: హెల్మెట్ లేకుండా బైకులు నడుపుతున్న వారిపై సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ పోలీసులు దృష్టిసారించారు. నగర శివారు ప్రాంతాల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 60శాతం మంది హెల్మెట్ లేకపోవడంతోనే గాయపడుతున్నారని గణాంకాలు చెబుతుండడంతో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఈ ఏడాదిలో జూలై వరకు 12,96,580 మంది వాహనదారులకు చలాన్లు వేశారు. మొత్తం రూ.12,92,09,600 జరిమానా విధించారు. తనిఖీలు చేస్తున్నా, ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నా హెల్మెట్ ధరించకుండా వెళ్లేవారు పెద్ద సంఖ్యలోనే కనిపిస్తుండడంతో రెండు కమిషనరేట్ల ట్రాఫిక్ ఉన్నతాధికారులు ఫోకస్ పెట్టారు. ప్రత్యేక బృందాల్లోని పోలీసులు విద్యాసంస్థలు, ట్రాఫిక్ జంక్షన్లు, ప్రధాన మార్గాల్లో ఉండి హెల్మెట్ ధరించని ఫొటోలు కెమెరాల్లో బంధించి ఈ–చలాన్లు ఇంటికి పంపుతున్నారు. కొన్నిసార్లు స్పాట్లోనే పట్టుకొని జరిమానాలు విధించడంతో పాటు రెండుసార్లు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఒక్కో ఉల్లంఘన ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనే విషయాలను వీడియో ప్రజంటేషన్ ద్వారా చూపిస్తున్నారు. రెండోసారి కౌన్సెలింగ్‌కు హాజరైనట్లు శిక్షణ కేంద్రం ఎస్సై ధ్రువీకరించాకే వారి వాహనాలను తిరిగి ఇస్తున్నారు. హెల్మెట్ ధరించకుండా బైకులు నడుపుతూ మైనర్లు చిక్కితే వాహనాలను స్వాధీనం చేసుకొని తల్లిదండ్రులకూ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. మరోసారి ద్విచక్ర వాహనాన్ని నడపనివ్వమంటూ లిఖిత పూర్వకంగా రాయించుకుంటున్నారు. నేరమని తెలిసీ... ద్విచక్ర వాహనదారుల్లో కొందరు హెల్మెట్లు ధరించకుండా నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతున్నారు. బైక్ నడుపుతూ సెల్ఫోన్లో మాట్లాడుతున్నారు. ఇవన్నీ మోటార్ వాహన చట్టం ప్రకారం నేరం. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం వీటన్నింటిపై ట్రాఫిక్ పోలీస్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఉల్లంఘనకు జరిమానాతో పాటు పాయింట్లు ఖాతాలోకి వెళ్తాయని, వీటి ద్వారా జైలు శిక్షలు పడతాయంటూ హెచ్చరిస్తున్నారు. ఉల్లంఘనులకు సంబంధించి తాము పట్టుకున్న ప్రతి వాహనం వివరాలను రవాణా శాఖ సర్వర్‌లోని రికార్డులకు అనుసంధానిస్తున్నామని వివరిస్తున్నారు. ఇప్పటికే 10 పాయింట్లు దాటేసిన వారి వివరాలు పోలీసుల దగ్గర ఉన్నాయి. 12 పాయింట్లు చేరుకున్నాక వారి డ్రైవింగ్ లైసెన్స్ తాత్కాలికంగా రద్దవుతుందని, అలాగే జైలు శిక్ష పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వారిని ట్రాఫిక్ పోలీసుల దగ్గరున్న ట్యాబ్ ద్వారా గుర్తిస్తున్నారు. లైసెన్స్ నంబర్ నమోదు చేస్తే వాహన చోదకుల చరిత్ర తెరపై కనిపిస్తుందని ట్రాఫిక్ పోలీసులు వివరించారు. తద్వారా తదుపరి చర్యలు తీసుకుంటున్నామని ఇరు కమిషనరేట్ల ట్రాఫిక్ ఉన్నతాధికారులు విజయ్‌కుమార్, దివ్యచరణ్ తెలిపారు. చలాన్లు ఇలా... (జనవరి–జూలై) కమిషనరేట్ చలాన్లు జరిమానా(రూ.ల్లో) సైబరాబాద్ 8,42,653 8,38,35,600 రాచకొండ 4,53,927 4,53,74,000 -
హీరో బైక్స్ లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ అతి పెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ బుధవారం మూడు కొత్త బైక్‌లను ఆవిష్కరించింది. ప్రీమియం బైక్స్ సెగ్మెంట్లో వీటిని లాంచ్ చేసింది. ప్లస్ 200,ప్లస్ 200టీ, ఎక్స్ట్రీం 200ఎస్ పేరుతో వీటిని భారత మార్కెట్లో ప్రవేశ పెట్టింది. దీంతో ఎక్స్ సిరీస్‌లో ఇప్పటివరకూ నాలుగు మోడల్స్ విడుదల చేసినట్లయింది. వీటి ధరలు రూ.94 వేల నుంచి రూ.1.05 లక్షల (న్యూఢిల్లీ ఎక్స్ షోరూం ధరలు) మధ్య ఉండనున్నాయి. 200సీసీ ఎక్స్ పల్స్ 200టీ ధర రూ.94 వేలు. ఎక్స్ ప్లస్ 200 ధర రూ.97 వేలు ఫ్యుయల్ ఇంజెక్షన్ బైక్ మోడల్ ధర రూ.1.05 లక్షలు ఎక్స్ట్రీమ్ 200ఎస్ ధర రూ.98,500గా నిర్ణయించింది. ప్రీ బుకింగ్, రీటైల్ తదితర వివరాలను మరికొన్ని వారాల్లో వెల్లడిస్తామని హీరో తెలిపింది. ఈ సందర్భంగా హీరో మోటోకార్ప్ సేల్స్ చీఫ్ సంజయ్ భాన్ మాట్లాడుతూ.. ప్రీమియం బైక్ సెగ్మెంట్లో తమ ఉనికిని నెమ్మదిగా పెంచుతున్నామనీ, ఇది దీర్ఘకాలిక ప్రణాళిక. రాబోయే మూడు లేదా నాలుగేళ్లలో ప్రీమియం బైక్‌ల సెగ్మెంట్లో టాప్ ప్లేస్‌లో ఉండే లక్ష్యంతో పని చేస్తున్నామని తెలిపారు. త్వరలో 400 - 450 సీసీ బైక్‌ల సెగ్మెంట్లోనూ ప్రవేశించనున్నామని భాన్ వెల్లడించారు. కాగా 150 సీసీ బైక్‌ల సెగ్మెంట్లో మొదటి స్థానంలో ఉన్న హీరో మోటో2017, 2018 ఈఐసీఎంఏషోలో 200 సీసీ విభాగంలో ఎక్స్‌పల్స్ 200, ఎక్స్‌పల్స్ 200టీ బైక్స్‌ను పరిచేయం చేసిన సంగతి తెలిసిందే. -
డుకాటీ షోరూమ్ ప్రారంభోత్సవంలో మామా అల్లుళ్లు
-
ఆ ఏడుగురు యువకులు జల్సాల కోసం..
మోర్తాడ్: తమ జల్సాల కోసం అవసరమైన సొమ్మును సులభంగా కూడబెట్టుకోవడానికి బైకులను అపహరించడం ఎంచుకున్నారు ఏడుగురు యువకులు. చదువుకోవాల్సిన వయస్సులో గంజాయి, మద్యం, ఇతర మత్తుపదార్థాలకు అలవాటుపడిన యువకులకు పార్కింగ్ చేసిన వాహనాలను చోరీ చేసి తక్కువ ధరకు విక్రయించారు. వచ్చిన సొమ్ముతో ఎంజాయ్ చేస్తూ వాహనాల చోరీయే వృత్తిగా మలచుకున్నారు. చివరకు ముప్కాల్ పోలీసులకు పట్టుబడి కటకటాలపాలయ్యారు. ముప్కాల్ ఎస్ఐ రాజ్‌భరత్ రెడ్డి ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుల్ రాజేశ్వర్, ఐడీ పార్టీ కానిస్టేబుల్ గంగాప్రసాద్, కానిస్టేబుల్లు భూమేష్, శ్రీకాంత్, రాజా సాగర్, సాగర్ చాకచాక్యంగా వ్యవహరించి అంతర్ జిల్లాల బైకుల దుండగుల ముఠాను పట్టుకున్నారు. అంకాపూర్‌కు చెందిన ప్రశాంత్ ముప్కాల్‌లోని తన అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ ఒక పల్సర్‌ను తక్కువ ధరకు విక్రయించాడు. అప్పటికే ముప్కాల్‌లో రెండు వాహనాలు చోరీకి గురయ్యాయి. ప్రశాంత్ వ్యవహారశైలిపై సందేహం వ్యక్తం చేసిన పోలీసులు అతడిపై కన్నేసి ఉంచారు. తక్కువ ధరకే బైకుని ప్రశాంత్ విక్రయించిన విషయంపై ఆరా తీసిన పోలీసులు సదరు యువకుడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. దీంతో ఆరు జిల్లాల్లో తమ ముఠా చోరీ చేసిన బైకుల వివరాలను, ముఠా సభ్యుల పేర్లను వెల్లడించాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి కమ్మర్పల్లి మండలం కోనాసముందర్‌కు చెందిన సందీప్, మెట్‌పల్లికి చెందిన రాము, రఘు, అంకాపూర్‌కు చెందిన నషీద్, భీమ్‌గల్‌కు చెందిన అజయ్, చరణ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. వీరు చోరీ చేసి విక్రయించిన వాహనాలతో పాటు దాచిన కొన్ని వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా సభ్యుల నుం చి మొత్తం 24 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఒకే రకం వాహనాలే ఎక్కువ.. అంతర్ జిల్లా దొంగల ముఠా చోరీ చేసిన వాహనాల్లో ఎక్కువగా బజాజ్ పల్సర్ వాహనాలే ఉన్నాయి. పల్సర్ వాహనాలకు హ్యాండిల్ లాక్ వేసినా సులభంగా తొలగించి స్టార్ట్ చేసే అవకాశం ఉండటంతో పార్కింగ్ చేసి ఉంచిన వాహనాల్లో ఈ ముఠా పల్సర్ వాహనాలనే చోరీ చేశారు. బుల్లెట్ వాహనానికి కూడా సులభంగా లాక్ తీయడం స్టార్ట్ చేయడం రావడంతో ఈ వాహనాలనే ముఠా సభ్యులు ఎంచుకున్నారు. నిజామాబాద్, సిద్దిపేట్, కామారెడ్డి, మెట్పల్లి, నిర్మల్, కరీంనగర్, హైదరాబాద్‌లలో పల్సర్, బుల్లెట్ వాహనాలను చోరీ చేశారు. వాటన్నింటిని చోరీ చేసిన చోట కాకుండా వేరే ప్రాంతానికి తీసుకువచ్చి రూ.10వేల నుంచి రూ.25వేలకే విక్రయించారు. అయితే ఒరిజినల్ కాగితాలు మళ్లీ తెచ్చి ఇస్తామని చెప్పి వాహనాలు కొనుగోలు చేసినవారు ఎంత సొమ్ము ఇస్తే అంత తీసుకుని జల్సాలు చేయడం ఈ ముఠా సభ్యుల ప్రవృత్తిగా మారింది. వాహనం నడుపరాకున్నా టెక్నిక్‌లో దిట్ట.. బైకుల చోరీలో ప్రధాన పాత్ర పోషించిన కోనాసముందర్‌కు చెందిన సందీప్‌కు వాహనం నడుపరాదు. అయితే టెక్నిక్తోని వాహనాల లాక్‌లను తొలగించడం, ఆ వాహనాలను స్టార్ట్ అయ్యే విధంగా చేయడం సందీప్ పని అని పో లీసుల విచారణలో తేలినట్లు తెలిసింది. సందీప్ తన స్నేహితుల ద్వారానే ఈ ముఠాలో ఉన్న సభ్యులతో స్నేహం చేసి గడచిన ఏడాది కాలం గా వాహనాల చోరీకి పాల్పడుతున్నట్లు కూడా పోలీసుల విచారణలో వెల్లడైంది. వాహనాలను చోరీ చేశాక మళ్లీ ఎప్పటిలాగే ఎవరి ఇండ్లకు వా రు వెళ్లిపోయి వారం రోజుల తరువాతనే వాహ నాలను విక్రయించి సొమ్ము చేసుకుంటారని పోలీసుల పరిశోధనలో తేలింది. బైకుల చోరీతో పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ముఠాను ముప్కాల్ పోలీసులు పట్టుకోవడంతో వారిని సీపీ కార్తికేయ అభినందించారు. -
పోలీసుల సోదాలతో కలకలం
పలమనేరు: పట్టణంలోని గంటావూరు ఇందిరమ్మ కాలనీ మంగళవారం వేకువజామున పోలీసుల సోదాలతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వందమంది పోలీసులు, పోలీసు వాహనాలు, హంగామా చూసి ఒక్కసారిగా నిద్రమత్తులోంచి జనం తేరుకున్నారు. వేకువజాము నుంచి ఉదయం 10 గంటలదాకా ఇంటింటా పోలీసులు సోదాలు చేశారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో స్థానిక డీఎస్పీ యుగంధర్‌బాబు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్‌లో భాగంగా ఈ సోదాలు నిర్వహించారు. పలమనేరు సబ్ డివిజన్ పోలీసు పరిధిలోని నలుగురు సీఐలు, 12మంది ఎస్ఐలు, 90మంది సిబ్బంది పాల్గొన్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు పోలీసులు తెలిపారు. గంటావూరు ఇందిరమ్మ కాలనీలో 4వేలదాకా నివాసాలున్నాయి. బయటి ప్రాంతాలకు చెందినవారు ఎక్కువగా కాలనీలోకి చేరారు. దీంతో ఈ ప్రాంతంలో ఉన్నవారి వివరాలు పెద్దగా ఎవరికీ తెలియదు. అందుకే ఈ ప్రాంతాన్ని ఎంచుకున్న పోలీసులు ప్రతి ఇంటికీ వెళ్లి వారి ఆధార్, రేషన్ కార్డు మొదలైన వాటి వివరాలు సేకరించారు. వారు వినియోగిస్తున్న మోటార్ సైకిళ్ల లైసెన్సు రికార్డులను పరిశీలించారు. 77 బైకులకు రికార్డులు లేకపోవడంతో వాటిని స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం పట్టణంలో ఇది హాట్ టాపిక్‌గా మారింది. -
విభిన్న బైక్‌లు.. విశిష్ట హంగులు
మాదాపూర్: యూత్ అంటేనే దూకుడు. ఆపై బైక్ ఉంటే దానికి కళ్లెమే ఉండదు. కిక్ కొడితే చాలు కిక్కెక్కించే సూపర్ మోడళ్లు ఇటీవల హైదరాబాద్ నగర విపణిలోకిఆధునిక హంగులతో అందుబాటులోకి వచ్చాయి. పలు ఇంటర్నేషనల్ సూపర్ బైక్‌లు అదరగొడుతున్నాయి. లెజెండరీ ఎంవీ అగస్టా నుంచి సూపర్ స్పోర్ట్స్, స్ట్రీట్ నెకెడ్, నార్టన్ మోటార్ సైకిల్స్, క్లాసిక్స్ బెస్ట్ ఇన్ క్లాస్ ఎస్డబ్ల్యూఎం నుంచి ఆన్ రోడ్, ఆఫ్ రోడ్ చార్మింగ్ ఎఫ్బీ మోండియల్ నుంచి హిప్స్టార్స్, హ్యోసంగ్ నుంచి క్రూయిజర్లు, స్పోర్ట్స్ బైక్‌లు యూత్నుఆకట్టుకుంటున్నాయి. బైక్‌లను ఇష్టపడే ఔత్సాహికులకు కావాల్సిన అన్ని రకాల వాహనాలు రూ.3 లక్షల నుంచి రూ.60 లక్షల ధరల శ్రేణిలో అందుబాటులో ఉన్నాయి. భారతదేశపు అతిపెద్ద మల్టీబ్రాండ్ సూపర్ బైక్‌ల తయారీదారు కైనటిక్ తన మోటో రాయల్‌ను తీసుకొచ్చింది. దీంతో నగరంలోని యువతరయ్రయ్మంటూ దూసుకెళ్తున్నారు. కాగా..అతి వేగం, ప్రమాదకర విన్యాసాలు ముప్పు అనేవిషయాన్ని యువత గుర్తించాల్సిన అవసరముంది. కేవలం లగ్జరీ, అందం కోసమే వీటిని ఆస్వాదించాలని నిపుణులు సూచిస్తున్నారు. హెచ్‌పీఎస్ 300.. ♦ శక్తిమంతమైన సింగిల్ సిలిండర్ 250 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ♦ 147 కిలోల బరువుతో, గాలితో పోటీ పడుతూ ప్రయాణించే వీలు ♦ బాస్, ఏబీఎస్ మాడ్యులర్తో ఫ్రంట్ ఫ్లోటింగ్ డిస్క్ బ్రేక్ ♦ త్రోటరీ ఎగ్జాస్ట్ నోట్‌తో పూర్తిగా స్టెయిన్లెస్ స్టీల్ డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ ♦ డ్యూయల్ టోన్ ఫ్యూయల్ ట్యాంక్‌తో విలక్షణ, అందమైన హిప్స్టర్ డిజైన్ నార్టన్ డామినేటర్.. ♦ నార్టన్ డామినేటర్ రెండు సిలిండర్ల సూపర్ బైక్. ♦ 961 సీసీ ఇంజిన్ పరిమాణం, గరిష్ట టార్కు 67ఎన్ఎం, 70.94బీహెచ్పీ. హ్యోసంగ్.. ♦ కొరియాకు చెందిన అతి పెద్ద మోటార్ సైకిల్ బ్రాండ్. ♦ క్రూయిజర్లు, 250సీసీ స్పోర్ట్స్ బైక్‌ల తయారీలో ప్రత్యేకత ♦ హ్యోసంగ్‌కు దేశంలో దీనిని 7 వేల మంది వినియోగిస్తున్నారు ♦ మరింత విస్తరించేందుకు మోటో రాయల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది ఎక్విలా ప్రో 650.. ఎక్విలా ప్రో 650 ఎక్విలా సిరీస్‌లో అతిపెద్ద, అత్యంత శక్తిమంతమైంది ♦ ఇది 647 సీసీ, 8 వాల్వుల ఇంజిన్ 73 బీహెచ్‌సీ, 62 ఎన్ఎమ్ టార్కు ♦ ఇది బెల్డ్‌తో నడుస్తుంది. ఫై స్పీడ్ గేర్ బాక్స్ కలిగి ఉంటుంది. ♦ క్రూయిజర్‌ను పెరిమీటర్ ట్యూబ్యులార్ స్టీల్ క్రాడెల్పై నిర్మించారు. ఆఫ్ సైడ్ డౌన్స్ టెలిస్కోపిక్ ఫ్రండ్ సస్పెస్షన్, హైడ్రాలిక్ డబుల్ షాక్ అబ్జర్వర్లు వెనక వైపు ఉండేలా రూపొందించారు ఎస్డబ్ల్యూఎం.. ఎస్డబ్ల్యూఎం సిరోని వెర్గానీ వెర్మకేట్ మిలానోకి సంక్షిప్త రూపం. ఇటాలియన్ బ్రాండ్‌కు చెందిన స్పీడీ వర్కింగ్ మోటార్స్‌ను 1970లో ఆప్ రోడ్ విభాగం కోసం ప్రత్యేక ఉత్పత్తిని ప్రారంభించారు. ఎస్డబ్ల్యూఎం ప్రస్తుతం మిలాన్కో సమీపంలోని వెర్షేలో ఉండగా బీఎండబ్ల్యూ హుస్కురానా పరిశ్రమను సొంతం చేసుకుంది. ఆఫ్ రోడ్ మోటార్ సైకిల్స్ విభాగంలో ఇది అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న పరిశ్రమగా గుర్తింపు పొందింది. అతివేగం.. ప్రమాదకరం.. మార్కెట్లోకి వివిధ రకాల సూపర్ బైక్స్, స్పోర్ట్స్ బైక్స్ ఎక్కువ సీసీతో కలిగిన బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. యువత సరదా కోసం బైక్ రైడ్ చేయాలే తప్ప రోడ్లపై మితిమీరిన వేగంతో, విచిత్ర విన్యాసాలు చేయకూడదు. – మధుసూదన్‌రావు,ఐటీ ఉద్యోగి, బైక్ రైడర్ -
కార్లు, బైక్ ధరలకు రెక్కలు!
న్యూఢిల్లీ: కార్లు, ద్విచక్ర వాహనదారులు థర్డ్ పార్టీ బీమా రూపంలో శనివారం నుంచి అదనపు భారం మోయాల్సిన పరిస్థితి. ఇకపై కార్ల కొనుగోలు సమయంలో ఏడాది బీమా కాకుండా మూడేళ్ల కాలానికి బీమా పాలసీని తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అదే ద్విచక్ర వాహనాలు అయితే కొనుగోలు సమయంలోనే ఐదేళ్ల బీమా పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో వాహనాల కొనుగోలు వ్యయం ఒక్కసారిగా పెరిగిపోనుంది. ఇది వాహనదారులకు కాస్తంత రుచించనిదే. అయితే, ఏటా రెన్యువల్ చేసుకోవాల్సిన ఇబ్బంది అయితే తప్పనుంది. ఈ భారం ఏ స్థాయిలో ఉంటుందంటే... 1500సీసీ సామర్థ్యంపైన ఉన్న కార్లకు ఏడాది బీమా పాలసీ ప్రీమియం ప్రస్తుతం రూ.7,890 స్థాయిలో ఉండగా, మూడేళ్లకు తీసుకోవాలంటే ఇక మీదట ఒకేసారి రూ.24,305ను జేబు నుంచి పెట్టుకోవాల్సి వస్తుంది. అదే 350సీసీ సామర్థ్యంపైన ఉన్న బైకులకు ఏడాది ప్రీమియం రూ.2,323గా ఉంటే, ఇక మీదట ఐదేళ్ల పాలసీ కోసం రూ.13,034 ఖర్చు చేయాల్సి వస్తుంది. వివిధ సామర్థ్యం కలిగిన మోడళ్ల ఆధారంగా ఈ ప్రీమియంలో మార్పులు ఉంటాయి. ఇదంతా సుప్రీంకోర్టు ఆదేశాల పర్యవసానమే. కొత్త కార్లకు మూడేళ్లు, ద్విచక్ర వాహనాలకు ఐదేళ్ల థర్డ్ పార్టీ బీమా తప్పనిసరిగా సెప్టెంబర్ 1 నుంచి అమలు చేయాలంటూ ఈ ఏడాది జూలై 20న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. థర్డ్ పార్టీ కవరేజీ తీసుకునే వారి సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో, దీర్ఘకాల పాలసీలను వాహనాలను కొన్నప్పుడే తీసుకునే విధంగా సుప్రీం ఆదేశించింది. నిబంధనల ప్రకారం మన దేశంలో వాహనాలకు బీమా తప్పనిసరి. థర్డ్ పార్టీ బీమా అనేది, వాహనదారుడు, అతని వాహనం కారణంగా మూడో పార్టీకి కలిగిన నష్టానికి పరిహారం చెల్లించేది. దీన్ని వాహనదారులు అందరూ తీసుకుంటే రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు కలిగే నష్టానికి పరిహారం లభిస్తుంది. ప్రాణ నష్టానికి బాధిత కుటుంబాలు పెద్ద మొత్తంలో పరిహారం అందుకోగలవు. ఆస్తి నష్టానికి కూడా పరిహారం లభిస్తుంది. బీమా విస్తరణకు దోహదం వాహనం వయసు పెరుగుతున్న కొద్దీ దానికి బీమా కవరేజీ విలువ తగ్గుతూ వెళుతుంది. పైగా ప్రీమియం పెరుగుతూ వెళుతుండడం గమనించొచ్చు. ముఖ్యంగా థర్డ్ పార్టీ బీమా విషయంలో పరిహార చెల్లింపులు పెరుగుతుండటంతో, ప్రీమియంలను బీమా కంపెనీలు ఏటా సవరిస్తుండటం వల్ల భారం అధికం అవుతోంది. దీంతో చాలా మంది వాహనదారులు బీమా పాలసీని రెన్యువల్ చేయించుకోకుండా వదిలిపెట్డడం, రిస్క్‌ను పూర్తిగా కవర్ చేయని పాలసీలను కొనుగోలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ‘‘దీర్ఘకాలిక పాలసీల కారణంగా బీమా ఉత్పత్తుల విస్తరణ పెరుగుతుంది. మరిన్ని వాహనాలు కవరేజీ పరిధిలోకి వస్తాయి’’ అని ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ అండర్‌రైటింగ్ హెడ్ సంజయ్ దత్తా వివరించారు. బీమా పరిధిలో ఉన్నవి, పరిధిలో లేనివి అన్న ప్రశ్నకు తావుండదని, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవరేజీ పెద్ద మొత్తంలో, మెరుగ్గా ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం 2015లో ప్రతిరోజూ 1,374 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 400 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన తర్వాత బాధితులు క్లెయిమ్ దాఖలకు సమయ పరిమితి కూడా లేదు. ప్రమాదం జరిగిన ప్రాంత పరిధిలో లేదా తన నివాస ప్రాంత పరిధిలోనూ క్లెయిమ్ దాఖలకు అవకాశం ఉంటుంది. టూవీలర్ల డిమాండ్‌కు దెబ్బ! నూతన నిబంధనలు ద్విచక్ర వాహన కొనుగోళ్ల డిమాండ్‌పై ప్రభావం చూపిస్తుందంటున్నారు ఈ రంగానికి చెందిన నిపుణులు. ఇప్పటి వరకు బీమా కోసం వెచ్చించిన మొత్తానికి ఇకపై నాలుగు రెట్లు అదనంగా (ఐదేళ్ల పాలసీ) ప్రీమియంను భరించాల్సి రావడమే ఇందుకు కారణం. కానీ, కార్లపై పెద్దగా ప్రభావం ఉండదన్న అభిప్రాయం వినిపిస్తోంది. 100సీసీ ఇంజిన్ల విభాగంపై ఎక్కువ ప్రభావం పడనుంది. ఎందుకంటే తక్కువ ధర కారణంగానే వీటిని ఎక్కువ మంది కొనుగోలు చేస్తుంటారు. కానీ, ఇప్పుడు ఈ విభాగంలోని బైక్‌లపై రూ.720గా ఉన్న ప్రీమియం కాస్తా ఇకపై రూ.3,285 అవుతోంది. అంటే మూడున్నరరెట్లు పెరిగినట్టు. ప్రతీ5 మోటారుసైకిళ్ల అమ్మకాల్లో మూడు 100సీసీ విభాగంలోనివే. ఇక 150సీసీ ఆపైన 350సీసీ సామర్థ్యంలోపు బైకులకు నాలుగున్నర రెట్లు పెరిగి రూ.5,453 కానుంది. ఇక ఈ పెరిగే మొత్తంపై జీఎస్టీ భారం అదనం. రెండు రకాల పాలసీలు సుప్రీం ఆదేశాలతో కొత్త కార్లకు మూడేళ్లు, ్జకొత్త ద్విచక్ర వాహనాలకు ఐదేళ్ల థర్డ్ పార్టీ బీమా ప్రీమియంను కొనుగోలు సమయంలోనే వాహనదారుల నుంచి వసూలు చేయాలని బీమా కంపెనీల ను బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ఆదేశించింది. దీంతో బీమా సంస్థలు ఓన్ డ్యామేజ్, థర్డ్ పార్టీ కవరేజ్‌ను దీర్ఘకాలానికి లేదా ఏడాది కాలానికి ఓన్ డ్యామేజీ కవర్, దీర్ఘకాలానికి థర్డ్ పార్టీ బీమాతోనూ పాలసీలను ఆఫర్ చేసే అవకాశం ఉంది. థర్డ్ పార్టీ బీమానే దీర్ఘకాలానికి తీసుకోవడం తప్పనిసరి. చోరీ, ఇతర నష్టాలకు కూడా కవరేజీ ఇచ్చే పాలసీని ఏడాది లేదా ఐదేళ్ల కోసం ఎంచుకునే స్వేచ్ఛ వాహనదారులకు ఉంటుంది. బిల్లులో మాత్రం ఒక్కో ఏడాదికి విడిగా కవరేజీని పేర్కొనడం జరుగుతుంది. రెండో ఏడాది, ఆ తర్వాత కాలానికి ప్రీమియంను ‘ముందస్తు ప్రీమియం’గా పేర్కొటాయి. పాలసీ కాల వ్యవధి మధ్యలో సాధారణంగా థర్డ్ పార్టీ కవర్‌ను రద్దు చేసుకునేందుకు అవకాశం ఉండదు. వాహనం ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకపోవడం, అమ్మేయడం, బదిలీ వంటి సందర్భాల్లో మినహాయింపు ఉంటుంది. -
వావ్.. వాట్ ఏ క్రేజ్!
న్యూఢిల్లీ : కొత్త కొత్త హంగులతో ఎన్నో బైకులు మార్కెట్లోకి వచ్చినా.. రాయల్ ఎన్ఫీల్డ్కు ఉన్న క్రేజే వేరు. అది ఎంతలా ఉందంటే.. తాజాగా మార్కెట్లోకి వచ్చిన ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 పెగాసస్ ఎడిషన్ బైకులు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయట. ఈ లిమిటెడ్ ఎడిషన్ బైక్‌లను ప్రపంచవ్యాప్తంగా కేవలం వెయ్యి మాత్రమే తయారుచేశారు. అందులో 250 యూనిట్లను ఇండియా కోసం కేటాయించారు. దీనికోసం బుధవారం సాయంత్రం 4 గంటలకు సేల్ ప్రారంభించగా.. కేవలం మూడు నిమిషాల్లోపే అంటే 178 సెకన్లలోనే అన్ని బైకులూ అమ్ముడయ్యాయి. ఇదో కొత్త రికార్డుగా ఆ సంస్థ వెల్లడించింది. ఈ పెగాసస్ ధర రూ.2.4 లక్షలు. ఎన్ఫీల్డ్ నుంచి వస్తున్న అత్యంత ఖరీదైన బైక్ ఇదే కావడం విశేషం. -
మెట్రో జర్నీ విత్ బైక్.. కార్
గచ్చిబౌలి: ఉప్పల్‌లో ఉండే సందీప్ మార్కెటింగ్‌ఎగ్జిక్యూటివ్. మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో పనిచేస్తుంటాడు. సొంత బైక్‌పై వెళ్లాలంటే రెండు గంటల సమయం పడుతుంది. ట్రాఫిక్‌లో అలసిపోయి విధులు నిర్వహించాలంటే భారంగా మారుతోంది. దీంతో అతను ఇప్పుడు తన బైక్‌పై రావడం లేదు. మెట్రో రైలులోమియాపూర్ వరకు వెళ్లి, అక్కడి స్టేషన్‌లోని బైక్ తీసుకొని విధులు నిర్వహిస్తున్నాడు. సాయంత్రం బైక్ స్టేషన్లోఅప్పగించేసి, తిరిగి మెట్రోలోనే ఇంటికి వెళ్తున్నాడు. ఇక కూకట్పల్లి, మాదాపూర్‌లలో షాపింగ్ చేయాలనుకుంటే ఎంచక్కా మెట్రోలో వచ్చి, మియాపూర్ స్టేషన్లో జూమ్ కారు అద్దెకు తీసుకుంటున్నారు. చక్కగా కారులో వెళ్లి, షాపింగ్ చేసేసి తిరిగి మెట్రోలో ఇంటికి వెళ్తున్నారు. మెట్రో స్టేషన్లకు అనుసంధానంగా ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో బైక్‌లు, జూమ్ కార్లను అందుబాటులోకి తీసుకురావడంతో జర్నీ ఈజీగా మారింది. వీటికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోంది. అయితే మియాపూర్‌తో పాటు మరికొన్ని స్టేషన్లలో బైక్‌లు అందుబాటులో ఉండగా...కార్లు మాత్రం ఇక్కడే ఉన్నాయి. వీటి సంఖ్యను మరింత పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. బైక్‌లకు భలే డిమాండ్... మియాపూర్ మెట్రో స్టేషన్లో వివిధ కంపెనీలకు చెందిన 24 స్కూటీలు, హర్నెట్ బైక్ అందుబాటులో ఉన్నాయి. ఉదయం 7:30 గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ఇవి అందుబాటులో ఉంటాయి. ఏదైనా కారణంగా బైక్ తిరిగి ఇవ్వకపోతే సమాచారం అందించాలి. లేని పక్షంలో యాప్‌లో సమయం పొడిగించుకోవాలి. ప్రతి గంటకు రూ.15 చెల్లించడంతో కిలోమీటర్‌కు రూ.4 చార్జీ ఉంటుంది. పెట్రోల్ చార్జీలు ఉండవు. ఇక హెల్మెట్ ఉచింతంగా ఇస్తారు. దీంతో బైక్‌లకు మంచి డిమాండ్ ఉంటోంది. ఉదయం 11 గంటల వరకే బైక్‌లన్నీ బుక్ అయిపోతున్నాయి. వీకెండ్లో బైక్‌ల కోసం ఎక్కువగా స్టూడెంట్స్ వస్తుంటారు. గంటల ప్రాతిపదికన కాకుండా రోజంతా బైక్ తీసుకోవాలని అనుకుంటే... రోజుకు రూ.470 చెల్లించి, పెట్రోల్ పోయించుకోవాలి. మియాపూర్‌తో పాటు నాగోల్, పరేడ్‌గ్రౌండ్, బేగంపేట్ మెట్రో స్టేషన్లలో ఈ బైక్స్ అందుబాటులో ఉన్నాయి. బుకింగ్ ఇలా... గూగుల్ ప్లేస్టోర్‌లో మెట్రో బైక్స్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేసి గుర్తింపు కార్డును అప్లోడ్ చేయాలి. ఎన్ని బైక్‌లు అందుబాటులో ఉన్నాయి? వాటి అద్దె ఎలా? తదితర వివరాలు ఉంటాయి. బైక్ ఏ సమయానికి కావాలి? ఎక్కడి నుంచి వస్తున్నారో? లోకేషన్ షేర్ చేయాలి. పేటీఎం ద్వారా చార్జీలు చెల్లించాలి. మెట్రో స్టేషన్‌కు వెళ్లాక బుకింగ్‌ను, ఒరిజినల్ ఐడీ కార్డు చూపిస్తే బైక్ ఇస్తారు. ఎలక్ట్రికల్ కార్లు... ఒక్క మియాపూర్ మెట్రో స్టేషన్లోనే ఎలక్ట్రికల్ కార్లు అందుబాటులో ఉన్నాయి. జూమ్ సంస్థ గత నెల 24న ఈ సేవలు ప్రారంభించింది. 10 మహీంద్రా ఈటుఓ కార్లు ఇక్కడున్నాయి. ఇవి బ్యాటరీతో పనిచేస్తాయి. గంటన్నర చార్జింగ్ చేస్తే 100 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. వీటికి గంటకు రూ.40 చెల్లించాలి. ఒకవేళ మీ ప్రయాణం మొత్తం 4కిలోమీటర్లు మాత్రమే అయితే పూర్తిగా ఉచితం. అంతకంటే ఎక్కవ దూరమైతే గంటల చార్జీలతో పాటు కిలోమీటర్‌కు రూ.9 చెల్లించాలి. డీజిల్ కార్లు 14 అందుబాటులో ఉన్నాయి. వీటికి గంటకు రూ.120 చెల్లించాలి. ఒకవేళ మీ ప్రయాణం మొత్తం 10 కిలోమీటర్లు మాత్రమే అయితే పూర్తిగా ఉచితం. అంతకంటే ఎక్కవ దూరమైతే గంటల చార్జీలతో పాటు కిలోమీటర్‌కు రూ.12 చెల్లించాలి. ఇలా బుకింగ్... ప్లేస్టోర్‌లో జూమ్ కారు యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. 20 ఏళ్లకు పైబడిన తమ ఫోర్ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ అప్లోడ్ చేయాలి. యాప్‌లో ఎన్ని కార్లు అందుబాటులో ఉన్నాయో చూపిస్తుంది. అవసరమైన కారును బుక్ చేసుకొని ఆన్లైన్లో లేదా పేటీఎం ద్వారా చార్జీలు చెల్లించాలి. స్టేషన్‌కు వెళ్లి బుకింగ్‌ను చూపిస్తే కారు ఇస్తారు. మరిన్ని అవసరం.. నేను బీహెచ్ఈఎల్లో ఇంటర్న్‌షిప్ చేస్తున్నాను. మెట్రోలో వచ్చి మియాపూర్ స్టేషన్లో దిగాను. బైక్‌పై వెళ్దామనుకుంటే, బైక్‌లు లేవని చెప్పారు. బైక్‌ల సంఖ్య పెంచితే బాగుంటుంది.– సరిత, బీటెక్ విద్యార్థిని -
వాహనాల కొనుగోలులో జాగ్రత్త
ఖిలా వరంగల్ : సెకండ్ హ్యాండ్, కొత్త వాహనాల కొనుగోలు చేసేటపుడు వినియోగదారులు అత్యంత జాగ్రత్తలు పాటించకుంటే ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. సెకండ్ హ్యాండ్ వాహనాలు కొన్నప్పుడు ఆర్‌సీబుక్, ఇన్సూరెన్స్, రోడ్డు టాక్స్ వంటి వాటిని సరి చూసుకోకుంటే వినియోగదారుడికి ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. కొత్తవి కొన్నప్పుడు చాసీస్ నెంబర్, తయారీ తేది ఇతర వివరాలు సరిచూసుకోవాలి. పాత వాహనాలైతే ఏ జిల్లాకు చెందినవి, ఎవరిపేరుపై ఉన్నాయి. ఎన్ని కిలో మీటర్లు తిరిగాయి, తయారీ తేది, ఇతర వివరాలు తెలుసుకోవాలని అధికారులు చెబుతున్నారు. కొంత మంది నేరగాళ్లు హత్యలు, దోపీడీలకు వినియోగించిన వాహనాలను గుట్టు చప్పుడు కాకుండా ఇతర జిల్లాల్లోకి తీసుకెళ్లి ఆమ్మేయడం ఇటీవలి కాలంలో సాధారణంగా మారింది. వాటిని కొనుగోలు చేసిన ఆమాయకులు చిక్కుల్లో పడే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇలా సెకండ్ వాహనాలు కొనుగోలు చేసేటపుడు ఆర్టీఏ, ట్రాఫిక్ ఆధికారులను సంప్రదించి కేసుల వివరాలు సేకరించి సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనుగోలు చేయాలని ఆధికారులు హెచ్చరిస్తున్నారు. వాహనాల వివరాల కోసం తెలంగాణ ట్రాన్స్‌ఫోర్ట్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి వాహనం నంబర్ ఎంటర్ చేయగానే పేరు, అడ్రస్ ఇతర వివరాలు వస్తాయి. వాటి ఆధారంగా బైక్ లేదా కారు ఎక్కడైనా దొంగతనం కాగానే వాహనదారుడి పేరు, ధృవీకరణ పత్రం, ఇన్సూరెన్స్ పత్రాల పరిశీలనతోనే తెలిసిపోతుంది. కానీ ధృవీకరణ పత్రాలు ఏక్కడైనా మార్పింగ్ జరిగినట్లు అనిపిస్తే వెంటనే ఆర్టీఏను సంప్రదిస్తే వాహన వివరాలు తెలుసుకోవచ్చు. అతివేగంగా వాహనాలు నడిపిన వారికి, ప్రమాదం చేసి తప్పించుకొని తిరుగుతున్నా వాహనాల వివరాలు కేసు నమోదును బట్టి తెలిసిపోతుంది. సెకండ్ హ్యాండ్ వాహనం కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులు జాగ్రత్తలు పాటించకుంటే కష్టాలు తప్పవని రవాణాశాఖ ఆధికారులు హెచ్చరిస్తున్నారు. వాహన కొనుగోలు చేసే ముందు ఆర్టీఏ, ట్రాఫిక్ ఆధికారులను సంప్రదించి వాహనం కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. పత్రాలు సరిచూసుకోవాలి కంచి వేణు డీటీఓ వరంగల్ సెకండ్ హ్యాండ్ వాహనం కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ధృవీకరణ పత్రాలు సరిచూసిన వెంటనే ఆర్టీఏ కార్యాలయాన్ని సంప్రదించి వాహన వివరాలను తెలుసుకోవాలి. వాహన రిజిస్ట్రేషన్‌తో పేరు మార్పిడి జరుగుతుంది. వాహనం అమ్మేవారు సైతం వెంటనే కొనుగోలుదారుడి పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగేలా ఒత్తిడి చేయాలి. వాహనం కొనాలన్నా, విక్రయించాలన్నా ఆర్టీఏ నిబంధనాలు పాటించాలి. -
నేరాల నియంత్రణకే కార్డన్ సెర్చ్
ఆలేరు : నేరాల నియంత్రణకే కార్డన్ సెర్చ్ చేపడుతున్నామని యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్చార్జ్ డీసీపీ కె.నాగరాజు తెలిపారు. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆలేరు పట్టణంలోని సుభాష్‌నగర్, ఆదర్శనగర్‌లలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సోదాల్లో సరైన పత్రాలు లేని 29 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలతో పాటు ఒక రౌడీషీటర్‌ను, ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్ముతున్న ఇరువురిపై ఎక్సైజ్ కేసు నమోదు చేశామని, 3 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అంతే కాకుండా ద్విచక్ర వాహనాలను నడిపే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. వాహనాలు నడిపే వారు విధిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, వాహనాలకు ఇన్సూరెన్స్ చేయించాలని కోరారు. రాత్రి 2గంటల నుంచి ఉదయం 6గంటల వరకు సోదాలు కొనసాగాయి. ఏసీపీ శ్రీనివాసాచార్యులు, 8 మంది సీఐలు, 10మంది ఎస్ఐలు, 17 మంది ఏఎస్ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 51 మంది సివిల్ పోలీసులు, 13 మంది మహిళ పోలీసులు, హోంగార్డులు, 34 మంది ఎఆర్, సీసీఎస్, క్లూస్‌టీం, ఎస్‌ఓటీలు పాల్గొన్నారు. -
బజాజ్ బైక్స్ ధరలు పెరిగాయ్..
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘బజాజ్ ఆటో’ తాజాగా తన బైక్స్ ధరలను రూ.500–రూ.2,000 శ్రేణిలో పెంచింది. 400 సీసీ బైక్ డొమినార్ ధర గరిష్టంగా రూ.2,000 పెరిగింది. దీంతో ప్రస్తుతం 2018 వెర్షన్ డొమినార్‌లోని స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.1.44 లక్షలకు, ఏబీఎస్ వేరియంట్ ధర రూ.1.58 లక్షలకు చేరింది. పల్సర్ ఆర్ఎస్ 200 ధర రూ.1,800 పెరిగింది. దీంతో ఏబీఎస్ వేరియంట్ ధర రూ.1.36 లక్షలుగా, స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.1.24 లక్షలుగా ఉంది. అవెంజర్ మోడళ్లకు వస్తే.. అవెంజర్ 220 స్ట్రీట్, క్రూయిజ్ ధర రూ.1,000 పెరుగుదతో రూ.94,464కు చేరింది. కొత్త అవెంజర్ 180 ధర రూ.1,100 ఎగసింది. దీని ధర ప్రస్తుతం రూ.84,346. పల్సర్ ఎన్ఎస్ 200 ధర రూ.1,700 పెరిగింది. దీంతో ఏబీఎస్ వెర్షన్ ధర రూ.1.1 లక్షలు, స్టాండర్డ్ వెర్షన్ ధర రూ.98,714గా ఉంది. బజాజ్ వీ15 ధర రూ.1,000 పెరిగింది. -
‘షీటీం’కు ద్విచక్రవాహనాలు
కరీంనగర్ క్రైం: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో షీటీంలకు చెందిన పోలీసులు గస్తీ నిర్వహించేందుకు ద్విచక్రవాహనాలు అందుబాటులోకి వచ్చాయి. కరీంనగర్ కమిషనరేట్‌లోని హెడ్ క్వార్టర్లో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హీరో మోటాకార్ప్ కంపెనీ రీజినల్ మేనేజర్ కమల్ కరమ్‌చందాని 20 డుయోట్ వాహనాల తాళాలను సీపీ కమలాసన్‌రెడ్డికి అందజేశారు. ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సీపీ మాట్లాడారు. రేయింబవళ్లు శ్రమిస్తున్న పోలీసులకు ప్రోత్సాహమందిస్తే మనోధైర్యం పెరుగుతుందని తెలిపారు. కమిషనరేట్‌వ్యాప్తంగా 14 షీటీంలు పని చేస్తున్నాయని పేర్కొన్నారు. మానేరు డ్యాం, జింకలు, ఉజ్వల పార్కుల సమీపంలో లేక్ పోలీసు ఏర్పాటు చేసిన తర్వాత అసాంఘిక కార్యకలాపాలు నియంత్రణలోకి వచ్చాయని అన్నారు. కమల్ కరమ్‌చందాని మాట్లాడుతూ పోలీసు శాఖకు తమవంతు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కరీంనగర్ షీటీం సభ్యులకు 20 ద్విచక్రవాహనాలు అందజేస్తున్నామని తెలిపారు. హీరో మోటాకార్స్ అందజేసిన 20 ద్విచక్రవాహనాలతో షీటీం సభ్యులు చేపట్టిన ర్యాలీని సీపీ జెండా ఊపి ప్రారంభించారు. అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, ఏసీపీలు వెంకటరమణ, ఉషారాణి, హీరో ఆటోమోటాకార్స్ ప్రతినిధులు కష్యప్, కిరణ్‌కుమార్, ఇన్స్పెక్టర్లు మహేశ్‌గౌడ్, విజయకుమార్, సదానందం, సీతారెడ్డి, రవి, ఆర్ఐలు జానీమియా, మల్లేశం, శేఖర్, శాంతి సంక్షేమ కమిటీ సభ్యులు మధుసూదన్‌రెడ్డి, వసంత్‌కుమార్ ఓజా, గఫార్ పాల్గొన్నారు. -
రెప్పపాటులో మాయం
తణుకు: సార్.. నేను షాపింగ్‌మాల్‌కు వెళ్లి వచ్చేసరికి నా బైక్ మాయమైంది.. పార్కింగ్ ప్రాంతంలో ఉంచిన మోటారుసైకిల్ లోనికి వెళ్లి వచ్చేంతలోనే కనపడకుండా పోయింది.. బ్యాంకులోకి అలా వెళ్లి వచ్చేసరికి ఎవరో నా మోటారుసైకిల్ ఎత్తుకెళ్లారు.. ఇలాంటి ఫిర్యాదులు ఇటీవల కాలంలో ఆయా పోలీస్స్టేషన్లలో పెరిగిపోయాయి. తణుకు సర్కిల్ పరిధి లో నెలకు 10 నుంచి 15 మోటారు సైకిళ్లు చోరీకు గురవుతున్నట్టు అంచనా. పోలీసు సిబ్బంది సైతం వాహనాల చోరీ ఉదంతాలను తేలిగ్గా తీసుకుంటున్నారు. దీం తో మోటారుసైకిళ్లు చోరీ చేసే అగంతకులు రెచ్చిపోతున్నారు. తణుకు పట్టణ పరిధిలోని సీసీ కెమేరాలు ఏర్పాటు చేసినప్పటికీ ఆయా ప్రాంతాల్లో వాహనాలను అగంతకులు దొంగిలించుకుపోతున్నారు. అసలేమవుతున్నాయ్..? తణుకు సర్కిల్ పరిధిలో అపహరణకు గురవుతున్న వాహనాల్లో 30 శాతం వ రకు పోలీసులు రికవరీ చేస్తున్నారు. మో టారు సైకిళ్లను అపహరించే వ్యక్తులు వా టిని లభించిన ధరకు తెగనమ్మేస్తున్నారు. ఆ డబ్బుతో జల్సాలు చేస్తున్నట్లు తెలు స్తోంది. తక్కువ ధరకు కొనుగోలు చేసిన వాహనాలను పట్టణంలోని కొందరు సెకండ్ హ్యాండ్ వాహనాల వ్యాపారం చేస్తున్న వారు కొనుగోలు చేసి నకిలీ పత్రాలు సృష్టించి జిల్లాలు దాటిస్తున్నట్టు తెలుస్తోంది. మరికొన్ని వాహనాలను పాత సామాన్లు కొనుగోలు చేసే వ్యక్తులు కొనుగోలు చేసి ఆయా భాగాలను విడదీసి మరమ్మతులు చేసే షాపుల్లో విక్రయిస్తున్నట్టు సమాచారం. పార్కింగ్ ప్రదేశాల్లో రక్షణ ఏదీ..? కార్యాలయాలకు, షాపింగ్‌కు వచ్చే వినియోగదారులే తమ వాహనాలపై నిఘా ఉంచాల్సిన పరిస్థితి. పట్టణంలోని రైల్వేస్టేషన్, బస్టాండ్, సినిమా హాళ్లు తదితర ప్రాంతాల్లో పార్కింగ్ ప్రదేశాల్లో రుసుం తీసుకుని వాహనాలకు భద్రత కల్పిస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో అం టే ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక మా ర్కెట్, హోటళ్లు వంటి ప్రాంతాల్లో ఇలాం టి ఏర్పాట్లు లేవు. ముఖ్యంగా కల్యాణ మండపాలు, సినిమా హాళ్లు, బహిరంగ సభలు జరిగే ప్రాంతాల్లో నిఘా లేకపోవడంతో ఇక్కడ మోటారుసైకిళ్లు తరచూ చోరీకు గురవుతున్నాయి. అపార్టుమెం ట్లలో కార్యాలయాల నుంచి రూ.వేలు ని ర్వహణ ఖర్చులను వసూలు చేస్తున్నారు. అయినా కాపలా సిబ్బందిని మాత్రం అన్నిచోట్ల నియమించడం లేదు. ఫలితంగా ఆయా ప్రాంతాల పార్కింగ్ ప్రదేశాల్లో నిలిపి ఉంచిన వాహనాలు చోరీకు గురికావడం, వాటి యాజమానులు పో లీసులకు ఫిర్యాదు చేయడం పరిపాటిగా మారింది. ముఖ్యంగా పెద్ద ఎత్తున వ్యా పారాలు చేసే కొన్ని మద్యం దుకాణాలు, బార్లు ముందు వాహనాల రక్షణకు సిబ్బందిని నియమించకపోవడంతో తర చూ వాహనాల చోరీ ఫిర్యాదులు పోలీసులకు అందుతున్నాయి. చాలా సందర్భాల్లో కేసులు నమోదు చేయడానికి నిరాకరిస్తున్నట్టు బాధితులు చెబుతున్నారు. ఇలా చేయాలి.. అనివార్య పరిస్థితుల్లో ఆరుబయట, రోడ్ల వెంబడి, వ్యాపార ప్రాంతాల్లో వాహనాలను నిలిపి ఉంచడానికి కొన్ని చిట్కాలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. వాహనానికి అందించే తాళాలు కొన్నాళ్లకు అరిగిపోతాయి. ఆటో మొబైల్ షాపుల్లో రూ.150 నుంచి రూ.300 వెచ్చిస్తే వెనుక చక్రానికి తాళం వేయడానికి వీలుగా ప్రత్యేక తాళం ఇస్తారని, వీటిని వేస్తే కొంత మేర భద్రత ఉంటుందని చెబుతున్నారు. ఇళ్ల బయట పార్కింగ్ చేసేవారు కిటికీలకు గట్టి ఇనుప గొలుసుతో వాహనానికి లాక్ చేయడం మంచిదని సూచిస్తున్నారు. వాహనాలకు బీమా ఉండటం వల్ల ఫిర్యాదు చేసిన మూడు నెలల వరకు వాహనం దొరక్కపోతే ఆయా సం స్థల నుంచి బీమాను పొందవచ్చని, ఇందుకు సంబంధిత పోలీసుస్టేషన్ల నుంచి చివరి నివేదిక తీసుకుని దరఖాస్తు చేసుకోవచ్చని పోలీసులు సూచిస్తున్నారు. నిఘా ఉంచాం ఇటీవల కాలంలో మోటారుసైకిళ్లు చోరీకు గురవుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ముఖ్యంగా పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ప్రత్యేక నిఘా ఉంచాం. వాహనదారులు సైతం వాహనంతోపాటు వచ్చే తాళంతోపాటు మరొకటి కూ డా బైకులకు తప్పకుండా వేసుకో వాలి. అపార్టుమెంట్ నిర్వాహకులు విధిగా కాపలా సిబ్బందిని నియమించుకోవాలి. వాహనదారులు సైతం స్వయంగా ప్రత్యేక నిఘా ఉంచుకోవాలి. – కేఏ స్వామి, సీఐ తణుకు -
బైక్‌లు ఢీకొని ఇద్దరి మృతి
శాయంపేట(భూపాలపల్లి): రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందిన సంఘటన మండలంలోని మైలారం గ్రామ శివారులో బుధవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని పెద్దకోడెపాక గ్రామానికి చెందిన ముల్కనూరి శ్రీనివాస్(35), రేణుకుంట్ల సాంబయ్య మండల కేంద్రంలో మేస్త్రీ పనులు చూసుకుని ఒకే ద్విచక్ర వాహనంపై మైలారం మీదుగా పెద్దకోడెపాక గ్రామానికి వెళ్తున్నారు. అదే సమయంలో రేగొండ మండలం కానిపర్తి గ్రామానికి చెందిన శ్రీపతి నరేశ్(25), పాలకుర్తికి చెందిన నల్ల సురేష్ మరో ద్విచక్ర వాహనంపై పెద్దకోడెపాక మీదుగా మైలారం గ్రామానికి వివాహానికి హాజరయ్యేందుకు వస్తున్నారు. ఈ క్రమంలో మైలారం శివారులో మూలమలుపు వద్ద ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. దీంతో ముల్కనూరి శ్రీనివాస్, శ్రీపతి నరేశ్, రేణుకుంట్ల సాంబయ్యకు తీవ్రగాయాలయ్యాయి. వారిని 108లో పరకాల సివిల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ముల్కనూరి శ్రీనివాస్ మృతిచెందాడు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శ్రీపతి నరేశ్ మృతిచెందాడు. సాంబయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. స్వల్పగాయాలైన సురేశ్ హన్మకొండలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
హైఎండ్ బైక్‌ల విక్రయాలు పెరుగుతాయి
కోల్‌కతా: కవాసాకి మోటార్స్ ఇండియా తన హైఎండ్ బైక్స్ విక్రయాలపై పూర్తి ఆశావహంగా ఉంది. భారత్‌లో ప్రీమియం బైక్‌ల విభాగంలో మార్కెట్‌ను మరింత పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. ‘పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు చేసినా కూడా ఇండియాలో ప్రీమియం బైక్స్ అమ్మకాల వృద్ధిపై నమ్మకంగా ఉన్నాం. అలాగే మరొకవైపు ప్రజల ఆదాయం కూడా పెరుగుతోంది. ఇది కూడా మాకు సానుకూలాంశం’ అని కవాసాకి మోటార్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ యుతకా యమాషితా తెలిపారు. ప్రీమియం బైక్ మార్కెట్లో ప్రతి ఏడాది 30 శాతంమేర వృద్ధి నమోదు కావొచ్చని అంచనా వేశారు. కాగా కవాసాకి ప్రస్తుతం తన పుణే ప్లాంటులో 300 సీసీ– 1,400 సీసీ శ్రేణిలో ఇంజిన్ సామర్థ్యం కలిగిన బైక్స్‌ను అసెంబుల్ చేస్తోంది. కంపెనీ 2017 ఏప్రిల్ నుంచి 1,500 యూనిట్ల బైక్స్‌ను భారత్‌లో విక్రయించింది. దీనికి దేశవ్యాప్తంగా 22 డీలర్షిప్స్ ఉన్నాయి. కాగా కవాసాకి గతంలో బజాజ్ ఆటోతో కుదుర్చుకున్న సేల్స్ అండ్ సర్వీసింగ్ ఒప్పందానికి గతేడాది ఏప్రిల్‌లో ముగింపు పలికిన విషయం తెలిసిందే. -
ఇక తగ్గింపు ధరల్లో హైఎండ్ బైక్స్
సాక్షి, న్యూఢిల్లీ: దిగుమతి సుంకం భారీ తగ్గింపుతో అంతర్జాతీయ బైక్‌లు చవకగా భారతీయులకు లభించ నున్నాయి. హర్లే డేవిడ్సన్, ట్రైయింప్ సహా, ఇతర హై ఎండ్ బ్రాండ్ల మోటార్ సైకిళ్లు తక్కువ ధరలకే అందుబాటులోకి రానున్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) ఫిబ్రవరి 12 న జారీ చేసిన నోటిఫికేషన ప్రకారం పూర్తిగా విదేశాల్లో తయారైన బైక్‌లపై బేసిక్ దిగుమతి సుంకాన్ని 50 శాతానికి తగ్గించింది. ఇప్పటివరకూ 800 సీసీ అంతకంటే తక్కువ ఇంజీన్ కెపాసిటీ బైక్‌లపై 60శాతం దిగుమతి సుంకం ఉండగా, 800సీసీ కన్నా ఎక్కువ సామర్థ్యం గల బైక్‌లపై దిగుమతి సుంకం 75శాతంగా ఉండేది. పూర్తిస్థాయిలో దిగుమతి చేసుకున్న మోటార్ సైకిళ్ల దిగుమతులపై ప్రభుత్వం కస్టమ్స్ సుంకం రేటు ఈ రెండు రకాల మోడళ్లపై 50 శాతానికి తగ్గించడంతో దేశంలో వీటి ధరలు తగ్గుముఖం పడతాయని ఈవై పార్టనర్ అభిషేక్ జైన్ చెప్పారు. సీబీఎఫ్సీ నోటిఫికేషన్ ప్రకారం, ప్రీ ఎసంబుల్డ్ ఇంజిన్, గేర్‌బాక్స్ లేదా ట్రాన్స్మిషన్ మెకానిజంపై పూర్తిగా దిగుమతి చేసుకున్న (సీకేడీ) వస్తు సామగ్రిపై, దిగుమతి సుంకం 25 శాతానికి తగ్గించింది. ఇంతకుముందు ఇది 30శాతంగా ఉంది. మరోవైపు మేక్ ఇన్ ఇండియా లో భాగంగా స్థానిక తయరాదారులకు ప్రోత్సహించేందుకు ఎసంబుల్డ్ కాని ఇంజిన్, గేర్ బాక్స్, ట్రాన్స్మిషన్ మెకానిజం దిగుమతిపై 15 శాతం వరకు కస్టమ్స్ సుంకం పెంచివంది. ఇది ఇప్పటివరకు 10 శాతంగా ఉంది. తద్వారా ఆటోమొబైల్ సహాయక పరిశ్రమలను రక్షించే ఒక పెద్ద సందేశాన్ని ప్రభుత్వం పంపిందనీ, గొప్ప తయారీ కేంద్రంగా ఇండియాకు ప్రాధాన్యత నిచ్చేలా విధానాన్ని రూపొందించిందని డెలాయిట్ ఇండియా సీనియర్ డైరెక్టర్ అనూప్ కాల్వాత్ వ్యాఖ్యానించారు. -
అంతర్రాష్ట్ర బైక్ దొంగల అరెస్టు
గుత్తి: గుత్తి పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఇద్దరు అంతర్రాష్ట్ర బైక్ దొంగలను అరెస్టు చేయడంతో పాటు సుమారు రూ. 12 లక్షల విలువ చేసే 24 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని సీఐ కార్యాలయంలో గురువారం దీనికి సంబంధించిన వివరాలను డీఎస్పీ మహబూబ్‌బాషా, సీఐ ప్రభాకర్‌గౌడ్‌లు తెలిపారు. గత యేడాది కాలంగా అనంతపురం, కర్నూల్, కడప జిల్లాల పరిధిలో తరుచూ బైక్ దొంగతనాలు జరుగుతున్నాయి. దీంతో అనంతపురం ఎస్పీ అశోక్ కుమార్ అఫెండర్స్ సర్వ్లైన్స్ సిస్టమ్ (పాత నేరస్తుల నిఘా కార్యక్రమం) ప్రవేశపెట్టారు. ఈ విధానం ద్వారా గతంలో బైక్ చోరీలు ఎక్కడెక్కడ జరిగాయి? వాటి అఫెండర్స్ ఎవరు? అనే విషయాలను ఆరా తీశారు. ఈ క్రమంలో గుత్తిలో గత మూడు మాసాల్లో 8 బైక్‌లు చోరీకి గురయ్యాయి. నిఘా కార్యక్రమం ఆధారంగా గుత్తి సీఐ ప్రభాకర్‌గౌడ్ బైక్ దొంగలను పసిగట్టారు. ఇందులో భాగంగానే గురువారం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా అంతరాష్ట్ర బైక్ దొంగల గుట్టు రట్టైంది. గుత్తి మండలం ఊబిచెర్లకు చెందిన బాచుపల్లి రామకృష్ణ, చండ్రపల్లి సుంకన్నలు పోలీసు విచారణలో నేరాన్ని అంగీకరించారు.గుత్తిలో 8 బైక్‌లు, తాడిపత్రిలో 5, డోన్‌లో 1, పత్తికొండలో 1, వజ్రకరూర్‌లో 1, యాడికిలో 1, అనంతపురంలో 5, కడపలో 2 బైక్‌లో చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు. అయితే రాజు అనే మరోదొంగ పరారైనట్లు చెప్పారు. బైక్ దొంగలను పట్టుకోవడంలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఎస్ఐలు వలిబాషు, యువరాజు, పోలీసు కానిస్టేబుళ్లు మోహన్, గణేష్‌లకు నగదు రివార్డును అందజేశారు. -
రెండు బైక్‌లు ఢీ..ఇద్దరి మృతి
విజయనగరం : దత్తిరాజేరు మండలం వంగర గ్రామం వద్ద రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యంలో మృతి చెందారు. మృతులు దత్తిరాజేరు మండలం వంగర గ్రామానికి చెందిన నాగోలు ప్రసాద్ (30) కాగా మరొకరు గజపతినగరం మండలం మరుపల్లి గ్రామానికి చెందిన గెద్ద ఈశ్వరరావు(20)లుగా గుర్తించారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హీరో.. మూడు కొత్త బైక్‌లు!
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ ‘హీరో మోటోకార్ప్’ తాజాగా మూడు కొత్త బైక్‌లను మార్కెట్లో ఆవిష్కరించింది. 125 సీసీ ఇంజిన్ సామర్థ్యంతో ‘సూపర్ స్లె్పండర్’ను, 110 సీసీ ఇంజిన్ సామర్థ్యంతో ‘ప్యాషన్ ప్రో’ను, 110 సీసీ ఇంజిన్ సామర్థ్యంతో ‘ప్యాషన్ ఎక్స్‌ప్రొ’ను తీసుకువచ్చింది. ఈ బైక్స్‌ను అధునాతన ఫీచర్లతో ఆకట్టుకునే డిజైన్‌తో రూపొందించామని, వీటి సాయంతో దేశీ మోటార్‌సైకిల్ విభాగంలో తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటామని కంపెనీ తెలియజేసింది. కాగా 100–125 సీసీ విభాగంలో హీరో కంపెనీదే హవా. ఇందులో స్లె్పండర్, ప్యాషన్, హెచ్ఎఫ్ డీలక్స్, గ్లామర్, సూపర్ స్లె్పండర్ వంటి బ్రాండ్లతో దూసుకుపోతోంది. కంపెనీ ఈ కొత్త మోడళ్ల ధరలను త్వరలో ప్రకటించనుంది. -
హీరో కొత్త బైక్స్, కొత్త టెక్నాలజీతో
సాక్షి, న్యూఢిల్లీ: హీరో మోటార్ కార్ప్ కొత్త మోటార్ సైకిళ్లను లాంచ్ చేసింది. పాషన్ ప్రో, పాషన్ ఎక్స్ ప్రో, సూపర్ స్ల్పెండర్ పేరుతో మూడు బైక్స్‌ను విడుదల చేసింది. ఐ3ఎస్ టెక్నాలజీతో అప్డేటెడ్ వెర్షన్‌గా వీటిని అందుబాటులోకి తెచ్చింది. అయితే జనవరి 2018లో వీటి ధరను ప్రకటించనున్నట్లు హీరో మోటో వెల్లడించింది. సూపర్ స్ల్పెండర్‌ను 125 సీసీ ఇంజిన్, పాషన్ ప్రో, పాషన్ ఎక్స్ ప్రో మోడల్స్‌లో 110 సీసీ ఇంజిన్‌ను పొందుపర్చింది. దీని ఇంజిన్ 7500 ఆర్పీఎంవద్ద 8.4 పీఎస్ పవర్‌ను, 11ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది. సూపర్ స్ల్పెండర్లో ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్, ఆటోమ్యాటిక్ హెడ్ ల్యాంప్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, వైడర్ రియర్ టైర్, సీటు కింద ఎక్కువ ప్లేస్ ఇతర ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. పాషన్ ప్రో, ఎక్స్ ప్రోలో ఆటోమ్యాటిక్ హెడ్ ల్యాంప్‌తోపాటు ఫ్యూయల్ లెవల్, ట్రిప్ మీటర్, సైడ్ స్టాండ్ ఇండికేటర్ తదితర వివరాలు అందించేలా డిజిటల్ అన్‌లాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందుపర్చింది. అయితే పాషన్ ప్రోతో పోలిస్తే ఎక్స్ ప్రోను స్టయిలిష్‌గా తీర్చిదిద్దింది. స్కల్ప్డ్ ఫ్యూయల్ ఇంధన ట్యాంక్, డబుల్ టోన్ రియర్ మిర్రర్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ అమర్చింది. -
100 సీసీ బండి..ఒక్కరికేనండీ
సాక్షి, బెంగళూరు: ఐటీ సిటీలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు రవాణా పోలీసు, విద్యా శాఖలు ఉమ్మడిగా ముందుకు సాగనున్నాయి. ఈ క్రమంలో తమ పరిధిలో కట్టుదిట్టంగా నియంత్రణ చర్యలు, శిక్షలు వేయాలని నిర్ణయించాయి. రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు రోడ్ల దురవస్థ ప్రధాన కారణం కాగా, ద్విచక్ర వాహనాలు రెండో కారణం. ఈ విషయం గుర్తించిన రవాణా శాఖ వివిధ శాఖల సహకారంతో నివారణ చర్యలు చేపట్టనుంది. కర్ణాటక మోటార్ వెహికల్ రూల్స్ 1989 ప్రకారం 100 సీసీ, అంతకంటే తక్కువ సామర్థ్యం కలిగిన ద్విచక్రవాహనాల్లో వెనక మరొకరు కూర్చొని ప్రయాణం చేయడం నిషిద్ధం. అయినా ఇది అమలు కావడం లేదు. మైసూరులో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం సందర్భంగా కొంతమంది హైకోర్టులో గతంలో ప్రజాహిత వాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ విషయం పై రాష్ట్ర హైకోర్టు ఆదేశాల ప్రకారం 100 సీసీ, అంతకంటే తక్కువ సామర్థ్యం కలిగిన ద్విచక్రవాహనాల పై ఇక పై పిలియన్ రైడర్స్ (వెనక కుర్చొని ప్రయాణం)కు అవకాశం కల్పించబోరు. ఈ విషయమై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. అదే గనుక జరిగితే రాష్ట్రంలో ద్విచక్రవాహనాల్లో దాదాపు 25 శాతం ద్విచక్రవాహనాలు, స్కూటీల్లో ఒక్కరే ప్రయాణించాల్సిందే. ఈ విధానాన్ని మొదట బెంగళూరులో అమలు చేస్తారు. తరువాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తారు. 50 సీసీలకు తగ్గించే ఆలోచన ఉంది: రవాణాశాఖ కమిషనర్ : ఈ విషయమై రవాణాశాఖ కమిషనర్ దయానంద్ మాట్లాడుతూ... న్యాయస్థానం సూచన మేరకు 100 సీసీ, అంత కంటే తక్కువ సామర్థ్యం ఉన్న బైకులపై పిలియన్ రైడ్‌కు అనుమతించబోము. ఈ నిబంధన కొత్త వాహనాలకు మాత్రమే. ఇప్పటికే కొనుగోలు చేసిన వాటికి వర్తించదు. అయితే 100 సీసీ విషయంలో కొంత వెలుసుబాటు కల్పించే ఆలోచన ఉంది. ఆ సామర్థ్యాన్ని 50 సీసీకు తగ్గించే ఆలోచన ఉంది. ఈ విషయమై త్వరలో ప్రభుత్వానికి ప్రతిపాదన కూడా పంపనున్నాం.’ అని పేర్కొన్నారు. విద్యార్థుల బైక్‌లపై నియంత్రణ : నగరంలో ఇటీవల డ్రాగ్రేసులు ఎక్కువవుతున్న విషయం తెలిసిందే. ఈ డ్రాగ్రేసులో ఎక్కువ టీనేజర్లు పాల్గొంటున్నారు. ఈ రేసులు వికటించి యువత ప్రాణాలు తీస్తున్నాయి. ఈ విషయమై దర్యాప్తు చేసిన పోలీసులకు ఈ డ్రాగ్రేసుల్లో పాల్గొనేవారు ఎక్కువగా విద్యార్థులేనని తేలింది. పాఠశాలలకు బైక్‌లు తీసుకువెళ్లి అక్కడి నుంచి రేసింగ్‌కు వెళుతున్నారు. వీరిలో చాలమందికి డ్రైవింగ్ లైసెన్సులు కూడా ఉండటం లేదు. ఈ నేపథ్యంలో డీఎల్లేని వారికి విద్యార్థులకు విద్యాసంస్థల్లో పార్కింగ్‌కు అవకాశం కల్పించకూడదని రవాణాశాఖ విద్యాశాఖను కోరింది. ఇందుకు విరుద్ధంగా జరిగితే సదరు విద్యా సంస్థపై చర్యలు తీసుకోవాలన్న రవాణాశాఖ సూచనను కూడా విద్యాశాఖ అంగీకరించింది. మొదట విద్యా సంస్థల్లో అటు పై మాల్స్, సినీథియోటర్లలో ఈ నిబంధనను అమలు చేయనున్నారు. పిల్లలు నడిపితే పెద్దలపై చర్యలు : ఇక మైనర్లు డీఎల్ లేకుండా బైకులు, కార్లు నడిపితే ఆ వాహనం ఎవరి పైన రిజిస్టర్ అయ్యిందో వారిపై కేసు వేసి అపరాధరుసుం వసూలు చేయాలన్న నిబంధన ఉంది. అయితే ఇందుకు అవసరమైన నిర్థిష్ట చట్టం కర్ణాటక మోటార్ వెహికల్ రూల్స్ 1989లో లేదు. దీంతో పోలీసులు, న్యాయశాఖతో చర్చలు జరిపి మైనర్లు తప్పుచేస్తే వారి తల్లిదండ్రులు లేదా సదరు వాహనం రిజిస్టర్ అయిన వారి పై క్రిమినల్ కేసులు నమోదుచేయనున్నారు. ఈ పరిణామాలతో ద్విచక్రవాహనాల వల్ల కలిగే రోడ్డు ప్రమాదాలను చాలా వరకూ నియంత్రిచవచ్చునని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. గత మూడేళ్లలో బెంగళూరులో రోడ్డు ప్రమాదాలు ఏడాది మొత్తంప్రమాదాలు మృతులు గాయపడినవారు 2015 4828 740 4047 2016 7506 793 4193 2017 3818 499 3182(సెప్టెంబర్ 30) -
ప్రేయసి కోసం ఒకరు.. రేసింగ్ కోసం ఒకరు
సాక్షి, బెంగుళూరు: ప్రేయసి కోసం ఓ యువకుడు సరికొత్త పంధా ఎన్నుకున్నాడు. తాను ప్రేమించిన యువతిని లాంగ్‌రైడ్ తీసుకెళ్లడం కోసం వరుస దొంగతనాలకు పాల్పడ్డాడు. ఇతనికి మరో యువకుడు వ్యక్తి జత అయ్యాడు. ఇంక ఏముంది హైఎండ్ బైకులు కనిపిస్తే చాలు మాటు వేయడం మాయం చేయడం అలవాటు చేసుకున్నారు. బైక్ చోరీల్లో పోలీసులకు చుక్కలు చూపించిన దొంగలు ఎట్టకేలకు చిక్కారు. శరబండేపాల్యకు చెందిన వసీం అక్రం తన ప్రేయసిని తిప్పడానికి ఖరీదైన, హైఎండ్ బైకులను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడేవాడు. గత ఏడాది నుంచి చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే తనకోసమే బైకులు చోరీ చేస్తున్నాడని అతని ప్రియురాలకి మాత్రం తెలియదు. తరచూ వేరు వేరు బైక్‌ల మీద వచ్చే అతను, బైక్ గురించి అడిగితే స్నేహితులది అని చెప్పేవాడు. తరచూ బైకులు పోతున్నాయనే సమాచారం తెలసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వసీం దగ్గర నుంచి 16 హైఎండ్ బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే బెంగుళూరు, రాజిగుడ్డకు చెందిన రంజిత్ ఇలాంగవన్ అలియాస్ వందేళ్ అతని స్నేహితుడు మరిముత్తు మునిస్వామి అలియాస్ బైక్రాజాలు 2015లో డిగ్రీ మానేశారు. గత రెండేళ్ల నుంచి నిందితులు 25 బైకులను చోరీ చేశారు. ఇటీవల జయనగర్‌లోని నాలుగవ బ్లాక్ వద్ద అనుమానాస్సదంగా తిరుగుతున్నారనే సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితులు ఖరీదైన బైకులు చోరీచేసిన అనంతరం రేసింగుల్లో పాల్గొని, తరువాత వాటిని ఎక్కడో చోట వదిలేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కొత్తప్రపంచం 23rd July 2017
-
కొత్తప్రపంచం 16th July 2017
-
కొత్తప్రపంచం 2nd July 2017
-
ఈ కార్ల ధరలన్నీ తగ్గిపోనున్నాయి..
గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ రేపటి నుంచి అమలు కాబోతున్న తరుణంలో కొన్ని కార్లు, టూవీలర్స్ చాలా చౌకగా లభ్యం కాబోతున్నాయి. దీనికి గల ప్రధాన కారణం ముందస్తు ఉన్న పన్ను రేట్ల కంటే జీఎస్టీ అమలు తర్వాత వేయబోయే పన్ను రేట్లు తక్కువగా ఉండటమే. ఆల్టో, స్విఫ్ట్, డిజైర్, ఐ20 ఎలైట్ వంటి కార్లపై కనీసంగా రూ.6,500 నుంచి .. రూ.15వేల వరకు ధరలు తగ్గబోతున్నాయని తెలిసింది. ప్రస్తుతం ఈ కార్లపై 31.4 శాతం పన్ను రేట్లు ఉండగా.. వాటిని జీఎస్టీ రేటు కింద 29 శాతానికే తీసుకొచ్చారు. మిడ్ సైజు కార్లపై పన్ను రేట్లు కూడా 3.6 శాతం కిందకి దిగొచ్చాయి. దీంతో వీటి ధరలు కూడా రేపటి నుంచి తగ్గనున్నాయని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా, మారుతీ సియాజ్, ఫోక్స్‌వాగన్ వెంటో వంటి సెడాన్ల ధరలు కనీసం 30వేల రూపాయల వరకు తగ్గనున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. జీఎస్టీ అమలు తర్వాత లగ్జరీ కార్ల తయారీ సంస్థలు ఎక్కువగా లాభపడతారని కూడా తెలిపారు. మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడీ, జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి కంపెనీలు ఇప్పటికే రూ.1.25 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. జీఎస్టీ రేటు ప్రయోజనాలు ఈ మేరకు వినియోగదారులకు చేరవేస్తున్నామని తెలిపాయి. స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల ధరల్లో ఎక్కువ మొత్తంలో తగ్గింపును చూస్తామని తెలిసింది. జీఎస్టీ కింద వీటి పన్ను రేట్లు 43 శాతంగా నిర్ణయించారు. ప్రస్తుతం వీటి పన్ను రేట్లు 55.3 శాతంగా ఉన్నాయి. అంటే స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల పన్ను రేట్లు భారీగా 12.3 శాతం మేర తగ్గబోతున్నాయి. కార్ల సంస్థలపై వేసే ఐదు రకాల పన్నులు , లెవీలు- ఎక్సైజ్, ఎన్సీసీడీ, ఇన్ఫ్రా సెస్, సీఎస్టీ, వ్యాట్ లను కలిపి జీఎస్టీ కిందకు తీసుకొచ్చారు. దీంతో ఈ కార్ల సంస్థల పన్ను రేట్లు కిందకి దిగి వచ్చాయి. ఇతర ఛార్జీలు రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ధరలు, ఇన్సూరెన్స్ వంటి వాటిని జీఎస్టీలో కలుపలేదు. కానీ ఇవి కార్ల సంస్థలపై అంత పెద్ద మొత్తంలో ప్రభావం చూపవని తెలుస్తోంది. కార్ల ధరలు మాదిరిగానే బైకులు, స్కూటర్ల ధరలు కూడా 1000 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు తగ్గిపోనున్నాయి. 3500సీసీ కంటే తక్కువ ఇంజిన్ కలిగిన అన్ని టూ-వీలర్స్ ధరలు 2.2 శాతం పడిపోనున్నాయని తెలుస్తోంది. అయితే పెద్ద ఇంజిన్ల బైకుల రేట్లు కనీసం 1000 రూపాయల మేర పెరగనున్నాయి. అంతేకాక హైబ్రిడ్ వాహనాల రేట్లు కూడా ఖరీదైనవిగా మారబోతున్నాయని తెలిసింది. -
డుకాటీ సూపర్ బైక్స్..
‘మాన్స్టర్–797’, ‘మల్టీస్ట్రాడ–950’ మోడళ్ల ఆవిష్కరణ న్యూఢిల్లీ: ఇటలీకి చెందిన సూపర్‌బైక్స్ తయారీ కంపెనీ ‘డుకాటీ’ తాజాగా రెండు కొత్త బైక్స్‌ను భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. మాన్స్టర్–797, మల్టీస్ట్రాడ–950 అనే ఈ మోడళ్ల ధరలు వరుసగా రూ.7.77 లక్షలు, రూ.12.6 లక్షలుగా ఉన్నాయి. అన్ని ధరలు ఎక్స్‌షోరూమ్ ఢిల్లీవి. కంపెనీ ఈ ఏడాది మార్కెట్లోకి తీసుకురావాలని భావించిన ఐదు మోడళ్లలోనివే తాజా రెండు బైక్స్. ‘కంపెనీ ప్రొడక్టుల విస్తరణలో తాజా బైక్స్ ఆవిష్కరణ అనేది చాలా కీలకమైన అంశం. భారత మార్కెట్లో వాటా పెరుగుదలకు ఇవి దోహదపడతాయని విశ్వసిస్తున్నాం’ అని డుకాటీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రవి అవలుర్ తెలిపారు. హైదరాబాద్‌లో ఔట్లెట్ ఈ ఏడాది హైదరాబాద్, కోల్‌కతా, చెన్నై నగరాల్లో కొత్తగా ఔట్‌లెట్స్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపింది. -
మోటార్ సైకిళ్ల దొంగ అరెస్ట్
నిడదవోలు : పట్టణంలోని వివిధ కూడళ్లలో మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడిన యువకుడిని నిడదవోలు పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్సై జి.సతీష్ మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. పట్టణంలో వైఎస్సార్ కాలనీకి చెందిన కోయి శివప్రసాద్ పట్టణంలో మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడ్డాడు. పట్టణంలోని బసివిరెడ్డిపేట రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి దగ్గర నిడదవోలు–తాడేపలి్లగూడెం రోడ్డులో వాహనాలను తనిఖీ చేస్తుండగా పాత నేరస్తుడైన కోయి శివప్రసాద్ పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకుని విచారించగా మోటార్ సైకిళ్లు దొంగతనం చేసినట్టు తెలిపాడన్నారు. పట్టణంలోని గణపతి సెంటర్లో ఈ నెల 12న డిస్కవరీ నీలంరంగు మోటార్ సైకిల్, అదే రోజు రాత్రి గాంధీనగర్‌లోని బార్భర్ షాపు తాళం పగులగొట్టి ఎల్ఈడీ టీవీ, షాపు ఎదురుగా ఉన్న హోండా యాక్టివా మోటార్ సైకిల్‌ను దొంగిలించాడు. రూ.1.30 లక్షల విలువ చేసే మోటార్ సైకిళ్లు, టీవీని స్వాధీనపరుచుకున్నామని చెప్పారు. పోలీస్, క్రైమ్ పార్టీ సిబ్బందిని సీఐ ఎం. బాలకృష్ణ అభినందించారు. తాడేపల్లిగూడెంలో.. తాడేపల్లిగూడెం రూరల్ : వేర్వేరు చోట్ల చోరీలకు పాల్పడిన ఘటనల్లో ఇద్దరిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రెండు ఆటోలు, ఏడు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు పట్టణ సీఐ ఎంఆర్‌ఎల్‌ఎస్‌ఎస్.మూర్తి తెలిపారు. మంగళవారం స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. మోదుగగుంట గ్రామానికి చెందిన దండ్రు వెంకన్నబాబు, దండ్రు దుర్గారావులు ఈ చోరీలకు పాల్పడ్డారన్నారు. పట్టణ శివారు కొండాలమ్మ గుడి వద్ద మంగళవారం అనుమానాస్పదంగా సంచరిస్తుండగా అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలు అంగీకరించారన్నారు. వారి వద్ద నుంచి రెండు ఆటోలు, ఏడు మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ రూ.3 లక్షలు ఉంటుందన్నారు. కొవ్వూరు ఇన్ఛార్జ్ డీఎస్పీ జె.వెంకట్రావు సూచనల మేరకు మోటారు సైకిళ్ల దొంగలపై నిఘా ఏర్పాటు చేసి వీరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. సమావేశంలో పట్టణ ఎస్సై చిన్నం ఆంజనేయులు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
కొత్త ప్రపంచం 4th June 2017
-
కొత్త ప్రపంచం 30th April 2017
-
ఐఫోన్ కంటే చీప్ గా దొరుకుతున్న బైకులివే!
బీఎస్-3 వాహనాలపై ఏప్రిల్ 1నుంచి నిషేధం విధిస్తున్నట్టు సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరిచడంతో బైక్ ధరలన్నీ ఒక్క ఉదుడున కిందకి దిగొచ్చాయి. డెడ్ లైన్ ఏప్రిల్ 1కి ఇంకా ఒక్కరోజే ఉండటంతో భారీ డిస్కౌంట్ ఆఫర్లతో స్టాక్ ను సేల్ చేసుకోవడానికి కంపెనీ తహతహలాడుతున్నాయి. ఇదే ఛాన్సుగా భావించిన కస్టమర్లు కొనుగోళ్లకు వెనుకాడటం లేదు. దీంతో మోటార్ షోరూంలన్నీ కొనుగోలదారులతో కళకళలాడుతున్నాయి. అయితే దిగొచ్చిన బైక్ ధరలు ఐఫోన్ కంటే చౌకగా లభ్యమవుతున్నట్టు తెలుస్తోంది. ఆ బైకులేమిటో ఓసారి చూద్దాం.... బీఎస్-3 వాహనాలపై టూ-వీలర్స్ దిగ్గజాలు రూ.22వేల వరకు డిస్కౌంట్ ప్రకటించాయి. దీంతో 150సీసీ బైక్ ఐఫోన్ కంటే తక్కువ ధరకే లభ్యమవుతుందట. నమ్మట్లేదా అయితే ధరలు మీరే ఓసారి చూడండి... ఆపిల్ గతేడాది లాంచ్ చేసిన ఐఫోన్ 7 ప్లస్(128జీబీ) ధర రూ.82వేలు. నేడు సుజుకీ జిక్సర్ ధర షోరూంలో రూ.77,452లకే దొరుకుతోంది. సుజుకీ జిక్సర్ మాత్రమే కాక, యాక్టివా 3జీ కూడా 50,290కు, డ్రీమ్ యుగ 51,741 రూపాయలకు, సీబీ షైన్ 55,799 రూపాయల నుంచి 61,283 రూపాయల వరకు, సీడీ 110డీఎక్స్ 47,202 రూపాయల నుంచి 47,494 రూపాయల ధరల్లో లభ్యమవుతున్నాయి. ఈ బైకులకు హోండా రూ.22వేల వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించడంతో ధరలు కిందకి తగ్గాయి. హీరో బైకులపై ఉన్న ఆఫర్లు... హీరో మోటార్ కార్పొరేషన్ కూడా బీఎస్-3 టూ-వీలర్స్ పై రూ.12,500 వరకు డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో స్కూటర్స్ డ్యూయెట్, ఐఫోన్ కంటే చీప్ గా రూ.49,480కు అందుబాటులోకి వచ్చింది. ఇక మాస్ట్రో ఎడ్జ్ నైతే రూ.51,030కే కొనుకోవచ్చు. ప్రీమియం బైకులపై రూ.7500, ఎంట్రీలెవల్ బైకులపై రూ.5000వేల వరకు హీరో ఆఫర్ ప్రకటించింది. దీంతో గ్లామర్ రూ.59,755కు, స్ప్లెండర్ 125 రూ.55,575కు కొనుకునేలా ఆఫర్ ఉంది. ఒక్క హీరో, హోండా కంపెనీలు మాత్రమే కాక, సుజుకీ బైకులు, బజాజ్ బైకులు కూడా ఐఫోన్ కంటే తక్కువ ధరకే మార్కెట్లోకి వచ్చాయి. -
స్టేషన్ నుంచి అనుమానితులు పరారీ
మొగల్తూరు : మోటార్ సైకిళ్ల దొంగతనం కేసులో విచారించేందుకు తీసుకువచ్చిన ఇద్దరు అనుమానితులు శుక్రవారం వేకువ జామున మొగల్తూరు స్టేషన్ నుంచి పరారయ్యారు. అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు గంటలో వారిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల మొగల్తూరు స్టేషన్ పరిధిలో మోటార్ సైకిళ్ల దొంగతనాలు ఎక్కువ కావడంతో అనుమానితులపై దృష్టి సారించారు. దీనిలో భాగంగా ఈ నెల 8వ తేదీన అత్తిలి మండలం రేలంగికి చెందిన ఆగిశెట్టి నాగేశ్వరరావు, ముంగుల వెంకటకృష్ణలను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై గతంలో పలు స్టేషన్లలో మోటార్ సైకిళ్ల దొంగతనం కేసులు నమోదై ఉన్నాయి. అయితే వీరు శుక్రవారం రాత్రి డ్యూటీలో ఉన్న కానిస్టేబుళ్లను మభ్యపెట్టి వేకువ జామున పరారయ్యారు. దీంతో ఎస్సై కె.గురవయ్య సిబ్బందిని అప్రమత్తం చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అనుమానితులు తణుకులో తచ్చాడుతున్నట్టు సమాచారం అందడంతో ఎస్సై చాకచక్యంగా వారిని అదుపులోకి తీసుకోవడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. -
విహారానికి వెళుతూ మృత్యు ఒడిలోకి..
నిడదవోలు రూరల్ : సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ద్విచక్ర వాహనాలపై గోదావరి అందాలను తిలకించేందుకు బయలుదేరిన స్నేహితులు అనుకోని రీతిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. నిడదవోలు మండలం శెట్టిపేట విద్యుత్ కేంద్రం వద్ద వంతెనపై మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు మిత్రులు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం తాడేపల్లిగూడెం పాతూరుకు చెందిన పరిమి హరికృష్ణ (39), పాలపర్తి పవన్‌కుమార్ (25) ఓ బైక్‌పై, వీరి స్నేహితులు తాడేపల్లి జానీ, ఎస్కే సద్దమ్ మరో బైక్‌పై విజ్జేశ్వరం బ్యారేజీ, గోదావరి అందాలను తిలకించేందుకు బయలుదేరారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ శెట్టిపేటలోని విద్యుత్ కేంద్రం వద్ద వంతెనపై వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైక్‌లు ఒకదానినొకటి ఢీకొనడంతో ఓ బైక్‌పై ఉన్న హరికృష్ణ, పవన్‌కుమార్ తలలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. మరో బైక్‌పై ఉన్న జానీ, సద్దమ్కు గాయాలయ్యాయి. ఘటనా స్థలాన్ని కొవ్వూరు రూరల్ సీఐ ఎం.సుబ్బారావు పరిశీలించారు. పోలీసులు ప్రమాద వివరాలు నమోదు చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. విషాదంలో కుటుంబ సభ్యులు తాడేపల్లిగూడెం పాతూరుకు చెందిన పరిమి హరికృష్ణకు భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు సత్య, ఆది. హరికృష్ణ 17 ఏళ్ల క్రితం లక్షి్మని కులాంతర వివాహం చేసుకున్నాడు. తనను ఆప్యాయంగా చూసుకునేవాడని లక్ష్మి గుండెలవిసేలా రోదిం చడం కంట తడిపెట్టించింది. పెళ్లయిన 17 రోజులకే.. పాతూరుకు చెందిన పాలపర్తి కృష్ణబాలాజీ ఏకైక కుమారుడు పవన్‌కుమార్ హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత నెల 19న తాడేపల్లిగూడెం మండలం ఉప్పరగూడెంకు చెందిన బాతుల మంగరాజు కుమార్తె వెన్నెలతో అతడికి వివాహమైంది. వివాహం జరిగిన 17 రోజులు కాకుండానే ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. భార్య వెన్నెల డిగ్రీ పరీక్షలు రాయడానికి వెళ్లిందని, త్వరగా వచ్చి ఆమెను ఇంటికి తీసుకువెళ్లాలని పవన్‌కుమార్ చెప్పాడని స్నేహితులు జాన్, సద్దమ్ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రమాదం ఎలా జరిగింది..! ఘటనా స్థలంలో మృతదేహాలను చూస్తే ప్రమాదం ఎలా జరిగిందో పోలీసులకు అర్థం కావడం లేదు. ప్రమాదం జరిగిన షాక్‌లో మృతుని స్నేహితులు చెప్పే మాటలకు ప్రమాద వాస్తవ పరిస్థితులకు పొంతన ఉండటం లేదు. ప్రమాదంలో పవన్‌కుమార్, హరికృష్ణకు తీవ్రగాయాలయ్యాయి. మృతుల బైక్ వంతెన గోడను ఢీకొట్టిందా.. లేదా ఏదైనా భారీ వాహనం వీరి బైక్‌ను ఢీకొట్టిందా అనే కోణాల్లో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల బైక్ వచ్చి తమ బైక్‌ను ఢీకొట్టడంతో కిందపడి గాయాలైనట్టు జాన్, సద్దమ్ పోలీసులకు తెలిపారు. -
మార్కెట్లోకి హోండా షైన్ వాహనాలు
అనంతపురం సెంట్రల్ : హోండా షైన్, షైన్ ఎస్పీ బీఎస్ 4 ద్విచక్రవాహనాలను మార్కెట్లోకి విడుదల చేశారు. మంగళవారం రైల్వేఫీడర్ రోడ్డులోని శివసాయి హోండా షోరూంలో హోండా ఏరియా సేల్స్ మేనేజర్ రాజేశ్వర్ చేతులమీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హోండా అధికృత డీలర్ మల్లికార్జున మాట్లాడుతూ షైన్ ద్విచక్ర వాహనం 50 లక్షల అమ్మకాల మైలురాయిని అధిగమించిందని, 125 సీసీ సెగ్మెంట్లో షైన్ అత్యధికంగా అమ్ముడుపోతోందని వివరించారు. ప్రస్తుతం హెచ్ఈటీ టెక్నాలజీతో సరికొత్త వాహనాలను రూపొందించిందని తెలిపారు. కార్యక్రమంలో శివసాయి హోండా సిబ్బంది, టూ వీలర్స్ ఫైనాన్షియర్స్ పాల్గొన్నారు. -
2020 నాటికి బీఎస్–6 వాహనాలు!
హోండా మోటార్‌సైకిల్స్ ప్రెసిడెంట్ అండ్ సీఈఓ కీటా మురమత్సు • ప్రస్తుతానికి మార్కెట్లో బీఎస్–4తో సీబీ హార్నెట్, షైన్ బైక్స్ • ఈ నెలాఖరున మార్కెట్లోకి బీఎస్–4 తొలి స్కూటర్ • పెద్ద నోట్ల ప్రభావం నుంచి పట్టణాల్లో కోలుకున్నాం • గ్రామాల్లో సాధారణ స్థితికి మరో మూడునెలలు పట్టొచ్చు • వంద శాతం ప్లాంట్ల వినియోగం తర్వాతే కొత్త ప్లాంట్ శ్రీనాథ్ అడెపు హోండా మోటర్స్ త్వరలో దేశంలోని తన బైకులన్నిటినీ బీఎస్–4 ప్రమాణాలకు తగ్గట్టుగా మార్చటానికి అన్నీ సిద్ధం చేసింది. అంతేకాక... మరో మూడేళ్లలో బీఎస్–6 ప్రమాణాలతో బైకులు తేవటానికి కూడా సన్నాహాలు చేస్తున్నట్లు హోండా మోటార్స్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్ఎంఎస్ఏ) ప్రెసిడెంట్, సీఈఓ కీటా మురమత్సు చెప్పారు. భారత్ స్టేజ్ –4 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన సీబీ షైన్‌ను రాజస్థాన్‌లోని తపుకర ప్లాంట్‌లో విడుదల చేసిన సందర్భంగా ఆయన ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం నుంచి ఇంకా తేరుకోలేదన్న మురమత్సు... తమ సంస్థ తరఫున కూడా డిజిటల్ లావాదేవీల్ని ప్రోత్సహించే చర్యలు మొదలు పెట్టినట్లు తెలియజేశారు. ఇంటర్వూ్య ముఖ్యాంశాలివీ... అన్ని బైకులూ బీఎస్–4 ప్రమాణాలకు అనుగుణంగా మారుస్తున్నట్లున్నారు? అవును! ఎందుకంటే రోజురోజుకూ కాలుష్యంతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. బైకుల నుంచి కార్బన్, నైట్రోజన్ ఆక్సైడ్ వంటి కాలుష్య ఉద్గారాలు అధికంగా విడుదలవుతాయి కాబట్టే 2017 నాటికి దేశంలోని వాహనాలన్నీ బీఎస్–4కు, 2020 నాటికి బీఎస్–6కు అప్‌గ్రేడ్ కావాలని కేంద్రం నిబంధనలు పెట్టింది. దానికి తగ్గట్టే మేం మార్పులు చేస్తున్నాం. గతంలో బీఎస్–4 హోండా సీబీ హార్నెట్ 160 ఆర్ బైక్‌ను విడుదల చేశాం. ఇపుడు సీబీ షైన్‌ను తపుకర ప్లాంట్‌లో తయారు చేసి విడుదల చేశాం. మరి మిగిలిన బైకుల సంగతో..? బీఎస్–4 ప్రమాణాలతో తొలి స్కూటర్‌ను ఈ నెలాఖరుకు విడుదల చేస్తాం. అంతకుమించి వివరాలు చెప్పలేను. యాక్టివా, ఏవిఏటర్, నవీ బైకుల్ని కూడా మారుస్తున్నాం. దశలవారీగా మార్కెట్లోకి తెస్తాం. ఫిబ్రవరి ముగిసే నాటికి విపణిలో హోండా బైకులన్నీ బీఎస్–4వే ఉంటాయి. 2020 నాటికి బీఎస్–6 వాహనాలను తెస్తాం. దీనికోసం హర్యానాలోని మనేసర్‌లో ఆర్ అండ్ డీ జరుగుతోంది. అయితే బీఎస్ ప్రమాణాలతో బైకుల ధరలు రూ.500–1,000 వరకూ పెరుగుతాయి. కొత్త ప్లాంట్లు గానీ, విస్తరణ గానీ ఏమైనా ఉందా? ప్రస్తుతం మాకిక్కడ 4 ప్లాంట్లున్నాయి. మనేసర్(హర్యానా) సామర్థ్యం ఏటా 16 లక్షలు. తపుకరా (రాజస్థాన్) 12 లక్షలు. నర్సాపూర్ (కర్ణాటక) 12 లక్షలు కాగా విఠల్పూర్ (గుజరాత్) ప్లాంట్ 12 లక్షలు. జులైలో నర్సాపూర్ ప్లాంట్‌లో 4వ లైన్‌ను ప్రారంభిస్తాం. దీంతో మొత్తం సామర్థ్యం 64 లక్షలకు చేరుతుంది. ఇవన్నీ నూరుశాతం వినియోగించుకున్నాకే కొత్త ప్లాంట్ ఏర్పాటు యోచన చేస్తాం. ప్రస్తుతం దేశంలో 4,500 డీలర్షిప్స్ ఉండగా.. ఈ ఏడాది ముగింపు నాటికి 5,300కు చేరుస్తాం. పెద్ద నోట్ల రద్దు ప్రభావం టూవీలర్ పరిశ్రమపై ఎక్కువగానే ఉన్నట్లుంది? 2016–17లో ద్విచక్ర వాహనాల పరిశ్రమ 6 శాతం వృద్ధి సాధిస్తే హోండా మాత్రమే 14 శాతం వృద్ధిని నమోదు చేసింది. పెద్ద నోట్ల రద్దు జరిగిన నవంబర్‌లో మాత్రం అమ్మకాలు గ్రామాల్లో 60 శాతం, పట్టనాల్లో 50 శాతానికి పడిపోయాయి. ఇపుడు పట్టణ మార్కెట్ సాధారణ స్థితికి చేరుకుంది. గ్రామాల్లో ఈ పరిస్థితి రావాలంటే మరో రెండు నెలలు పడుతుంది. గతంలో మా మొత్తం నెట్‌వర్క్‌లో 6–7 శాతమే కార్డులను వాడేవారు. ఇపుడది 25 శాతానికి పెరిగింది. నగదు లావాదేవీల్ని ప్రోత్సహించడానికి మేం డౌన్ పేమెంట్‌ను తగ్గించాం. ఎగుమతులు కూడా పెరుగుతున్నట్లున్నాయి? మీ బైకుల్లో ‘షైన్’ బాగా షైన్ అయినట్లుంది...! నిజమే! మా పోర్టుఫోలియోలో షైన్ది ప్రత్యేక స్థానం. 2006లో మార్కెట్లోకి తెచ్చాక ఇప్పటిదాకా 50 లక్షల షైన్ బైకులు విక్రయించాం. 125 సీసీ బైకుల విక్రయాల్లో 36 శాతం వాటా దీనిదే. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో మొత్తం షైన్ అమ్మకాల్ని 64 లక్షలకు చేర్చాలని లకి‡్ష్యంచాం. 2016 జనవరిలో 3,61,721 బైకులను విక్రయించిన హోండా.. ఈ ఏడాది జనవరిలో 3,68,145 బైకులను విక్రయించింది. అంటే 2% వృద్ధి నమోదయిందన్న మాట. బీఎస్–4 సీబీ షైన్ ప్రత్యేకతలు.. ⇔ 125సీసీ ఆటోమెటిక్ హెడ్‌లైట్ (ఏహెచ్ఓ) బీఎస్–4 సీబీ షైన్ ధర డ్రమ్ బ్రేక్ వర్షన్ రూ.60,675, డిస్క్ బ్రేక్ వర్షన్ రూ.63,000 (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ⇔ సింగిల్ సిలిండర్ ఇంజిన్, హోండా ఎకో టెక్నాలజీ (హె చ్ఈటీ), 10.16 హెచ్‌పీ పవర్, 7,500 ఆర్పీఎం, టర్యూ 10.30 ఎన్ఎం. నీలం, ఎరుపు రంగులు. -
అంతర్జిల్లా దొంగ అరెస్ట్
- రూ.2.80 లక్షల వస్తువులు స్వాధీనం పుట్టపర్తి అర్బన్: పుట్టపర్తి రూరల్ పోలీసులు అంతర్ జిల్లా దొంగను అరెస్ట్ చేశారు. ఇతని వద్ద నుంచి రూ.2.80 లక్షల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ శ్రీధర్, ఎస్ఐ రాఘవరెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ప్రకాశం జిల్లా పొదిలి మండల కేంద్రానికి చెందిన ఇద్దరు మిత్రులు మాలకొండారెడ్డి, తిరుపతిస్వామి అలియాస్ వంశీ చెడు వ్యసనాలకు లోనై, సులభంగా డబ్బు సంపాదించడం కోసం దొంగలుగా మారారు. పలు జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడి, వివిధ కేసుల్లో పట్టుబడి ఒంగోలు జైలుకు కూడా వెళ్లారు. జనవరి 5న బెయిల్‌పై వచ్చిన ఈ ఇద్దరూ గుంటూరు జిల్లా రేపల్లిలో పల్సర్ బైకును అదే నెల 13న చోరీ చేశారు. 16న తెనాలి టౌన్లో రూ.30 వేల నగదు, బంగారు చైను, ఉంగరాలు సెల్‌ఫోన్ దొంగిలించారు. 20న నరసరావు పేట బ్రహ్మంగారి గుడి వద్ద రూ.లక్ష విలువ చేసే యమహా ఎఫ్‌జెడ్ బైకు అపహరించారు. 23న డోన్ ప్రభాకర్‌రెడ్డి నగర్లో హోండాషైన్ బైకు, ఎల్జీ టీవీ, సెల్‌ఫోన్, దొంగిలించారు. అక్కడి నుంచి పుట్టపర్తికి వచ్చి మండల పరిధిలోని పెడపల్లిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. 25న కొత్తచెరువులో ఖైదీ నెంబర్ 150 సినిమా చూసిన ఇద్దరూ మామిళ్లకుంట క్రాస్ లోని పెట్రోలు బంకు వీధిలో రాజశేఖర్ ఇంటి వద్ద ఉన్న రూ.లక్ష విలువ చేసే బైకును దొంగిలించారు. దీన్ని అమ్మే ప్రయత్నంలో ఉన్న మాలకొండారెడ్డిని బుధవారం పెడపల్లిలో అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. ఇతడి వద్ద నుంచి రూ.లక్ష విలువ చేసే బైకు, సెల్ఫోన్లు, ఎల్ఈడీ టీవీ, స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. తిరుపతిస్వామి అలియాస్ వంశీ మరికొన్ని సామాన్లు అమ్ముకొని వచ్చే ప్రయత్నంలో పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. దొంగను పట్టుకోవడంలో సహరించిన హెడ్‌కానిస్టేబుళ్లు ధనుంజయ, శ్రీనివాస్, పీసీలు నాగేంద్ర, మారుతి, నరసింహలను సీఐ అభినందించారు. -
శుభలేఖలిచ్చి వస్తూ.. పెళ్లికొడుకు దుర్మరణం
మార్టేరు, (పెనుమంట్ర) : శుభలేఖలిచ్చి వస్తూ.. ఓ కొత్త పెళ్లికొడుకు దుర్మరణం పాలయ్యాడు. శుక్రవారం రాత్రి మార్టేరు గ్రామ శివారున జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం..మార్టేరుకు చెందిన చీమకుర్తి నూక రత్నకుమారి పెద్ద కుమారుడు పూర్ణ వెంకట రామరాజు(27) పెళ్లి ఫిబ్రవరి 1న జరగనుంది. దీంతో ఆమె రామరాజుతో కలిసి శుభలేఖలు ఇచ్చేందుకు ద్విచక్రవాహనంపై ఆచంట వెళ్లి తిరిగి వస్తుండగా మార్టేరు శివారున ఎదురుగా వస్తున్న మరో మోటారు సైకిల్ బలంగా ఢీకొట్టింది. దీంతో రామరాజు అక్కడికక్కడే మరణించాడు. రత్నకుమారితోపాటు, మరో మోటార్‌సైకిల్‌పై ఉన్న కర్రి ప్రతాప్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రత్నకుమారి పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలంలో రామరాజు తమ్ముడు శివ కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నాడు. రామరాజు మోటార్‌సైకిల్ ఢీకొన్న మరో బైక్‌పై ముగ్గురు యువకులు అతివేగంగా రావడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. వీరిలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడగా, మరో ఇద్దరి యువకుల జాడ తెలియాల్సి ఉంది. ప్రతాప్‌ను కూడా మెరుగైన చికిత్స నిమిత్తం భీమవరం తరలించినట్టు సమాచారం. మృతుడు రాజు కొన్నాళ్లపాటు దుబాయ్‌లో ఉండి వచ్చాడు. అతని తల్లి రత్నకుమారి మార్టేరులో కిరాణాషాపు నడుపుతున్నారు. -
ద్విచక్రవాహనాలు ఢీ : ఒకరి మృతి
ఇరగవరం : ద్విచక్రవాహనాలు రెండు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన ఇరగవరం మండలం రేలంగి శివారు రేలంగి –మండపాక పుంత రోడ్డులో సోమవారం ఉదయం జరిగింది. ఇరగవరం ఏఎస్సై ఐ.నాగేంద్ర కథనం ప్రకారం.. అత్తిలికి చెందిన బొర్రా శ్రీకృష్ణ(43) తణుకులోని వై.జంక్షన్ వద్ద ఉన్న హెయిర్ ఇండస్ట్రీస్‌లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం అతను ద్విచక్రవాహనంపై విధులకు వెళ్తుండగా, అదే సమయంలో ఎదురుగా వస్తున్న దువ్వ గ్రామానికి చెందిన నేకూరి ప్రసాద్ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో శ్రీకృష్ణ అక్కడికక్కడే మరణించాడు. ప్రసాద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతనిని స్థానికులు తణుకులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు చీర్ల రాధయ్య ప్రమాదాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఘటనా స్థలం తణుకు, అత్తిలి, ఇరగవరం మండలాలకు మధ్యలో ఉండడంతో పోలీసుల్లో గందరగోళం నెలకొంది. ఆ ప్రాంతం ఇరగవరం పోలీస్ స్టేషన్ పరిధిలోకే వస్తుందని రాధయ్య చెప్పడంతో ఎట్టకేలకు సుమారు రెండు గంటల తర్వాత ఇరగవరం పోలీసులు ఘటనాస్థలానికి వచ్చారు. మృతుడు బొర్రా శ్రీకృష్ణ కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనాస్థలానికి చేరుకుని బోరున విలపించారు. చీర్ల రాధయ్య వారిని ఓదార్చి సంతాపం తెలిపారు. శ్రీకృష్ణకు భార్య సత్యవతి , కుమారులు వికాస్, వర్ధన్ఉన్నారు. మృతుడు సోదరుడు బొర్రా వీరభద్రరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై తెలిపారు. రోడ్డు పక్కనున్న పొలాల్లో గడ్డికి నిప్పంటించడం వల్ల పొగ మార్గంపై కమ్ముకుందని, ఎదురుగా వస్తున్న వాహనాలు కని పించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. -
ద్విచక్రవాహనాలు ఢీ : ఒకరి మృతి
ఇరగవరం : ద్విచక్రవాహనాలు రెండు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన ఇరగవరం మండలం రేలంగి శివారు రేలంగి –మండపాక పుంత రోడ్డులో సోమవారం ఉదయం జరిగింది. ఇరగవరం ఏఎస్సై ఐ.నాగేంద్ర కథనం ప్రకారం.. అత్తిలికి చెందిన బొర్రా శ్రీకృష్ణ(43) తణుకులోని వై.జంక్షన్ వద్ద ఉన్న హెయిర్ ఇండస్ట్రీస్‌లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం అతను ద్విచక్రవాహనంపై విధులకు వెళ్తుండగా, అదే సమయంలో ఎదురుగా వస్తున్న దువ్వ గ్రామానికి చెందిన నేకూరి ప్రసాద్ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో శ్రీకృష్ణ అక్కడికక్కడే మరణించాడు. ప్రసాద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతనిని స్థానికులు తణుకులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు చీర్ల రాధయ్య ప్రమాదాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఘటనా స్థలం తణుకు, అత్తిలి, ఇరగవరం మండలాలకు మధ్యలో ఉండడంతో పోలీసుల్లో గందరగోళం నెలకొంది. ఆ ప్రాంతం ఇరగవరం పోలీస్ స్టేషన్ పరిధిలోకే వస్తుందని రాధయ్య చెప్పడంతో ఎట్టకేలకు సుమారు రెండు గంటల తర్వాత ఇరగవరం పోలీసులు ఘటనాస్థలానికి వచ్చారు. మృతుడు బొర్రా శ్రీకృష్ణ కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనాస్థలానికి చేరుకుని బోరున విలపించారు. చీర్ల రాధయ్య వారిని ఓదార్చి సంతాపం తెలిపారు. శ్రీకృష్ణకు భార్య సత్యవతి , కుమారులు వికాస్, వర్ధన్ ఉన్నారు. మృతుడు సోదరుడు బొర్రా వీరభద్రరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై తెలిపారు. రోడ్డు పక్కనున్న పొలాల్లో గడ్డికి నిప్పంటించడం వల్ల పొగ మార్గంపై కమ్ముకుందని, ఎదురుగా వస్తున్న వాహనాలు కని పించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. -
న్యూఇయర్‌లో అలరించబోతున్న కార్లు, బైకులివే!
కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. నూతన సంవత్సర కానుకగా బ్యాంకులూ వడ్డీరేట్లు తగ్గించేందుకు మొగ్గుచూపుతున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారుల ముంగింట్లోకి కొత్త కొత్త కార్లను, బైకులను మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు వాహన తయారీ సంస్థలు సన్నద్ధమవుతున్నాయి. 2016లాగా కాకుండా.. న్యూఇయర్‌లో వినియోగదారుల కోసం డజన్ల కొద్దీ కార్లను, బైకులను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నాయి. న్యూఇయర్‌లో వినియోగదారుల ముందుకు రాబోతున్న కొత్త కార్లు, కొత్త బైకులేమిటో ఓ సారి చూద్దామా... న్యూఇయర్‌లో అలరించబోతున్న కార్లు... టాటా హెక్సా... ఆవిష్కరణ తేదీ: జనవరి 18 ధర : ఎక్స్ షోరూం ఢిల్లీలో రూ.12 లక్షల నుంచి రూ.16 వరకు ప్రత్యేకతలు: తర్వాతి జనరేషన్‌తో రూపొందిన కొత్త టాటా హెక్సా, 2.2 లీటర్ల హెరికోర్ 400 డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంటోంది. మాక్సిమమ్ పవర్ అవుట్‌పుట్ 153 బీహెచ్పీ, మాక్సిమమ్ టర్క్ 400 ఎన్ఎమ్. సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్, మాన్యువల్ ట్రాన్సిమిషన్‌ను ఇది కలిగి ఉంటుంది. ఎకానమీ, స్పోర్ట్, ఆటో-సెన్సింగ్లోకి మార్చుకోగలిగే సామర్థ్యమున్న ఈ వాహనం, రేస్ కారు ఫర్ఫార్మెన్స్ ఆప్షన్‌ను అందిస్తోంది. మారుతీ సుజుకీ ఇగ్నిస్... ఆవిష్కరణ తేదీ : జనవరి 13 ధర : ఎక్స్ షోరూం న్యూఢిల్లీలో రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ప్రత్యేకతలు : రిట్జ్‌కు రిప్లేస్గా రాబోతున్న ఈ మోడల్‌ను మొదటిసారి 2016 ఆటో ఎక్స్‌పోలో దీన్ని ప్రదర్శించారు. 1.2 లీటర్ బూస్టర్‌జెట్ ఇంజిన్, 1.3 లీటర్ డీడీఐఎస్ డీజిల్ ఇంజిన్‌తో ఇది రాబోతుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్సిమిషన్, దాంతో పాటు ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ను ఇది కలిగి ఉంటోంది. అయితే ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ను ఇది తర్వాత ప్రవేశపెట్టనుంది. మొదట మాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో ఇది లాంచ్ కాబోతుంది. ఫోక్స్‌వాగన్ టైగూన్ ... ఆవిష్కరణ తేదీ: ఫిబ్రవరి 2017 ధర: ఎక్స్ షోరూం ఢిల్లీలో రూ.25 లక్షల నుంచి రూ.28 లక్షల వరకు 2.0 లీటర్ టీఎస్ఐ టర్బోచార్జ్డ్ ఫోర్-సిలిండర్ పెట్రోల్ మిల్‌తో రూపొందిన ఈ వాహనం, 177 బీహెచ్పీ పవర్, 320 ఎన్ఎమ్ టర్క్‌ను ఇది ఉత్పత్తిచేస్తోంది. డీజిల్ వేరియంట్ అయితే 2.0 లీటర్ టీడీఐ మోటార్‌ను కలిగి 148 బీహెచ్పీ, 340 ఎన్ఎమ్ టర్క్‌ను ఇది ప్రొడ్యూస్ చేస్తోంది. 6 స్పీడ్ మాన్యువల్ లేదా 7 స్పీడ్ డీఎస్జీ గేర్ బాక్స్ ట్రాన్సిమిషన్ ఆప్షన్లగా ఇది రూపొందింది. వినియోగదారుల ముంగింట్లోకి వస్తున్న బైకులు.. కేటీఎం డ్యూక్ 390... ఆవిష్కరణ తేదీ: మే 2017 ధర : ఎక్స్ షోరూం న్యూఢిల్లీలో రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఫీచర్లు: 372 సీసీతో సింగిల్-సిలిండర్ యూరో4 ఇంజిన్‌తో ఈ బైక్ వినియోగదారుల ముందుకు రాబోతుంది. 43 బీహెచ్పీ పవర్, 37ఎన్ఎమ్ టర్క్‌ను ఇది ఉత్పత్తి చేస్తోంది. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 300... ఆవిష్కరణ తేదీ : ఫిబ్రవరి 2017 ధర : రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ప్రత్యేకతలు: టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 300 కంపెనీ టాప్ ప్రొడక్ట్. 313 సీసీ లిక్విడ్-కూలుడ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో ఇది రూపొందింది. 34 బీహెచ్పీ పవర్, 28 ఎన్ఎమ్ టర్క్‌ను ఇది ఉత్పత్తి చేస్తోంది. సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్‌ను ఇది కలిగి ఉంటోంది. బీఎండబ్ల్యూ జీ310 ఆర్.... ఆవిష్కరణ తేదీ : మార్చి 2017 ధర : ఎక్స్ షోరూం ఢిల్లీలో రూ.2 లక్షల నుంచి రూ.3.8 లక్షల వరకు ప్రత్యేకతలు: డిస్ప్లేస్మెంట్ : 313 సీసీ, మాక్సిమమ్ పవర్ : 33.6 బీహెచ్పీ@ 9500 ఆర్పీఎం, మాక్సిమమ్ టర్క్ : 28ఎన్ఎమ్@7500 ఆర్పీఎం, సిలిండర్లు: 1, గేర్లు : 6, టాటా స్పీడ్: 143 కేఎంపీహెచ్. -
రెండు బైకులు ఢీ: యువకుడి మృతి
హైదరాబాద్: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జల్లపల్లి కార్గో రోడ్డుపై ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు ఉప్పుగూడకు చెందిన బాలరాజు(25)గా పోలీసులు గుర్తించారు. -
రోడ్డు ప్రమాదంలో టైలర్ మృతి
ఏలూరు అర్బన్ : పొరుగూరులో చదువుతున్న పిల్లలను పాఠశాల నుంచి తీసుకొచ్చేందుకు ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. దెందులూరు మండలం అలుగులగూడెంకు చెందిన దానే వెంకన్న టైలర్. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన ఇద్దరు కొడుకులను కొవ్వలిలోని ప్రైవేటు పాఠశాలలో చదివిస్తున్నాడు. వారిని రోజూ ఉదయం పాఠశాల వద్ద దించి తిరిగి సాయంత్రం ఇంటికి తీసుకువస్తుంటాడు. ఈ నేప«థ్యంలో సోమవారం సాయంత్రం వెంకన్న యథావి«ధిగా పిల్లలను తీసుకువచ్చేందుకు మోటార్‌సైకిల్‌పై వెళ్తూండగా కొవ్వలి సెంటర్లో ఎదురుగా వచ్చిన మరో ద్విచక్రవాహనం ఢీ కొట్టింది. దీంతో వెంకన్న తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ మృతిచెందాడు. -
కాలేజీలో స్టూడెంట్స్ బైకులు దగ్ధం
-
బైక్ దొంగల అరెస్టు
నరసరావుపేట రూరల్: ద్విచక్రవాహనాల చోరీలు, చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను రూరల్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. పట్టణంలోని ప్రకాష్ నగర్‌కు చెందిన బత్తుల కిరణ్‌సాయి, బరంపేటకు చెందిన షేక్ మహాబూబ్సుభాని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ , రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు ద్విచక్రవాహనాలు చోరీకి పాల్పడ్డారు. దీంతో పాటు నల్లపాడులో మార్నింగ్ వాకింగ్‌కు వెళ్తున్న మహిళ మెడలోని 3 సవర్ల బంగారాన్ని అపహరించారు. వీరి వద్ద నుంచి రెండు ద్విచక్రవాహనాలు, బంగారు గొలుసును స్వా«ధీనం చేసుకున్నారు. శుక్రవారం వీరిని అరెస్ట్‌చేసి కోర్టులో హాజరుపర్చినట్టు రూరల్ ఎస్సై జెసిహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
ఓర్వకల్లు: కాల్వబుగ్గ–రామళ్లకోట రహదారిలో శనివారం రెండు బైకులు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందగా మరొకరు గాయపడ్డారు. బేతంచెర్ల మండలం యంబాయి గ్రామానికి చెందిన శ్రీనివాసులు(42) హుసేనాపురం నుంచి స్వగ్రామానికి బైక్‌పై వెళ్తుండగా మార్గమధ్యంలో కంకర ఫ్యాక్టరీ మలుపు వద్ద అదే గ్రామానికి చెందిన స్వాములు బైకు వస్తుండగా ప్రమాదవశాత్తు ఎదురెదురుగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో శ్రీనివాసులు తలకు తీవ్రంగా రక్తగాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. స్వాములు స్వల్పంగా గాయపడ్డారు. మృతుడికి భార్య చిట్టెమ్మతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు ఎస్ఐ చంద్రబాబు నాయుడు తెలిపారు. -
బైక్‌ల దొంగ అరెస్టు
జనగామ : జనగామ నియోజకవర్గం పరిధిలో వరుస ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్న వ్యక్తిని పట్టుకుని రిమాండ్‌కు పంపించినట్లు డీఎస్పీ పద్మనాభరెడ్డి తెలిపారు. శనివారం పట్టణ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ ముసికె శ్రీనివాస్‌తో కలిసి డీఎస్పీ మాట్లాడారు. బచ్చన్నపేట మండ లం కొన్నె గ్రామానికి చెందిన పాత నేరస్తుడు యాట రమేష్ గత కొంత కాలంగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నాడన్నారు. కోర్టు సమీపంలో సీఐ ముసికె శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా రమేష్ పారి పోయే ప్రయత్నం చేశాడన్నారు. అనుమానం కలిగి పోలీసులు పట్టుకుని స్టేషన్‌కు తరలించి విచారణ చేశామన్నారు. అతడు ఇచ్చిన సమాచారంతో రూ.2లక్షల విలువ చేసే నాలుగు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. రమేష్‌ను రిమాండ్‌కు పంపించినట్లు పేర్కొన్నారు. డీఎస్పీ వెంట ఎస్సై సంతోషం రవిందర్, సిబ్బంది ఉన్నారు. -
బైక్‌ల దొంగ అరెస్టు
జనగామ : జనగామ నియోజకవర్గం పరిధిలో వరుస ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్న వ్యక్తిని పట్టుకుని రిమాండ్‌కు పంపించినట్లు డీఎస్పీ పద్మనాభరెడ్డి తెలిపారు. శనివారం పట్టణ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ ముసికె శ్రీనివాస్‌తో కలిసి డీఎస్పీ మాట్లాడారు. బచ్చన్నపేట మండ లం కొన్నె గ్రామానికి చెందిన పాత నేరస్తుడు యాట రమేష్ గత కొంత కాలంగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నాడన్నారు. కోర్టు సమీపంలో సీఐ ముసికె శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా రమేష్ పారి పోయే ప్రయత్నం చేశాడన్నారు. అనుమానం కలిగి పోలీసులు పట్టుకుని స్టేషన్‌కు తరలించి విచారణ చేశామన్నారు. అతడు ఇచ్చిన సమాచారంతో రూ.2లక్షల విలువ చేసే నాలుగు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. రమేష్‌ను రిమాండ్‌కు పంపించినట్లు పేర్కొన్నారు. డీఎస్పీ వెంట ఎస్సై సంతోషం రవిందర్, సిబ్బంది ఉన్నారు. -
బైక్‌లపై శ్రీశైలానికి యువకుల యాత్ర
దోమ: మండలంలోని పాలేపల్లి నుంచి 40 మంది యువకులు 20 బైక్‌లపై శ్రీశైలం యాత్రకు ఆదివారం బయలుదేరారు. గ్రామం నుంచి గత 20 సంవత్సరాలుగా శ్రావణమాసంలో శ్రీశైలం వెళ్తారు. గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన యువకులు శ్రీశైలానికి బయలు దేరారు.