
ప్రముఖ బైక్స్ తయారీ సంస్థ.. 'బీఎండబ్ల్యూ మోటోరాడ్' కంపెనీ దేశీయ మార్కెట్లో 'ఎఫ్ 450 జీఎస్'ను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. 2024 ఈఐసీఎమ్ఏ ఎడిషన్‌లో కనిపించిన ఈ బైక్ 2025 చివరి నాటికి రోడ్డు మీదకి రానుంది.
బీఎండబ్ల్యూ ఎఫ్ 450 జీఎస్.. బైక్ 450 సీసీ ట్విన్ సిలిండర్ ఇంజిన్ కలిగి ఉంటుంది. కాబట్టి ఇది మంచి పనితీరును అందిస్తుందని తెలుస్తోంది. ఈ బైక్ ముందు భాగంలో ఫుల్లీ అడ్జస్టబుల్ అప్‌సైడ్-డౌన్ ఫోర్క్, వెనుక భాగంలో మోనో-షాక్ అబ్జార్బర్ వంటివి ఉన్నాయి. రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి.
సింగిల్ పీస్ సీటు కలిగిన ఈ బైక్.. డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ సెటప్ కలిగి ఉండి, మధ్యలో GS బ్యాడ్జింగ్ పొందుతుంది. 6.5 ఇంచెస్ TFT డిస్ప్లే, క్రాస్-స్పోక్ వీల్స్ కూడా ఇందులో ఉన్నాయి. 175 కేజీల బరువున్న బీఎండబ్ల్యూ ఎఫ్ 450 జీఎస్ ఆఫ్ రోడింగ్ చేయడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.
ఇదీ చదవండి: రోజుకు రూ.27 కోట్లు విరాళం ఇచ్చిన వ్యక్తి.. ఈయన గురించి తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment