BMW Motorrad
-
కొత్త సంవత్సరం వాహన ధరలు పెంపు.. ఎంతంటే..
లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి అన్ని మోడళ్ల ధరలను 2025 జనవరి 1 నుంచి 3 శాతం వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. పెరుగుతున్న ముడిసరుకు వ్యయాలు, రవాణా ఖర్చుల ప్రభావాన్ని భర్తీ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది.‘స్థిరమైన వృద్ధిని నిర్ధారించడానికి కంపెనీతోపాటు డీలర్ భాగస్వాములకు ఈ దిద్దుబాటు అవసరం. మా విలువైన కస్టమర్లపై ధరల పెంపు ప్రభావాన్ని తగ్గించడానికి కట్టుబడి ఉన్నాం’ అని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ అన్నారు. ఏ4, ఏ6, క్యూ3, క్యూ5, క్యూ7 వంటి మోడళ్లను భారత్‌లో ఆడి విక్రయిస్తోంది. ఇప్పటికే బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ కంపెనీలు తమ కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ కంపెనీలు కూడా జనవరి నుంచి రేట్లు పెంచనున్నాయి.ఇదీ చదవండి: యాపిల్‌లో ఉద్యోగం జైలు జీవితం లాంటిది!బీఎండబ్ల్యూ మోటోరాడ్ ధరలు ప్రియంవాహన తయారీలో ఉన్న జర్మనీ సంస్థ బీఎండబ్ల్యూకు చెందిన ద్విచక్ర వాహన విభాగం బీఎండబ్ల్యూ మోటోరాడ్ 2025 జనవరి 1 నుండి అన్ని మోడళ్ల ధరలను 2.5 శాతం వరకు పెంచనున్నట్లు తెలిపింది. ముడిసరుకు ఖర్చులు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగా ధరలను సవరిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. -
అసలే ఖరీదైన బైకులు.. మరింత పెరగనున్న ధరలు
ప్రముఖ బైక్ తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మోటోరాడ్.. తన బైకుల ధరలను 2.5 శాతం పెంచనున్నట్లు ప్రకటించింది. ఈ ధరలు 2024 జనవరి 1నుంచే అమలులోకి రానున్నట్లు సమాచారం. ఇన్పుట్ ఖర్చులు పెరగడం వల్ల ధరలను పెంచినట్లు కంపెనీ వెల్లడించింది.ఏప్రిల్ 2017లో బీఎండబ్ల్యూ ఇండియా అనుబంధ సంస్థగా, తన కార్యకలాపాలను ప్రారంభించిన బీఎండబ్ల్యూ మోటోరాడ్.. ఖరీదైన బైకులను, స్కూటర్లను మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ జాబితాలో బీఎండబ్ల్యూ జీ310 ఆర్ఆర్, బీఎండబ్ల్యూ జీ310 ఆర్, బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్, బీఎండబ్ల్యూ జీ 310 జీఎస్, బీఎండబ్ల్యూ ఎం 1000 ఆర్ఆర్, బీఎండబ్ల్యూ సీఈ 02, బీఎండబ్ల్యూ సీఈ 04 మొదలైనవి ఉన్నాయి.ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో అత్యంత ఖరీదైన స్కూటర్‌గా బీఎండబ్ల్యూ సీఈ 04 (రూ. 14.90 లక్షలు). ప్రస్తుతం, దేశంలో విక్రయించే అన్ని బీఎండబ్ల్యూ బైక్‌లు, స్కూటర్లు ప్రామాణికంగా 3 సంవత్సరాల, అపరిమిత మైలేజ్ వారంటీతో వస్తున్నాయి. బీఎండబ్ల్యూ ఇండియన్ పోర్ట్‌ఫోలియోలో మొత్తం 27 మోడల్స్ ఉన్నట్లు సమాచారం. వీటి ధరలన్నీ జనవరి 1నుంచి గణనీయంగా పెరుగుతాయి. -
లక్షల ఖరీదైన బైకులు: మరింత కొత్తగా..
మారుతున్న ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా.. చాలా వాహన తయారీ సంస్థలు బైక్‌లను అప్డేట్ చేయడానికి సిద్ధమయ్యాయి. ఈ జాబితాలో బీఎండబ్ల్యూ మోటోరాడ్ కూడా చేరింది. ఇది ఒకేసారి నాలుగు బైకులను (ఎస్ 1000 ఆర్, ఎం 1000 ఆర్, ఎస్ 1000 ఆర్ఆర్, ఎం 1000 ఆర్ఆర్) అప్డేట్ చేయనుంది. ఇందులో నేకెడ్ ఆర్ మోడల్స్ కొత్త స్టైలింగ్ పొందుతాయి. పుల్ ఫెయిర్డ్ ఆర్ఆర్ బైకులు రీడిజైన్ పొందుతాయి.బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్, ఎం 1000 ఆర్ వంటి నేకెడ్ బైక్స్ ట్విన్ పాడ్ ఎల్ఈడీ హెడ్‌లైట్ పొందుతాయి. పవర్, టార్క్ కూడా దాని మునుపటి మోడల్స్ కంటే కూడా కొంత ఎక్కువగా ఉంటుంది. బైక్ ఇంజిన్ డ్రాగ్ టార్క్ కంట్రోల్ పొందుతుంది. సీటు కింద యూఎస్బీ-సీ ఛార్జర్ ఉంటుంది. ఈ అప్డేటెడ్ బైకులు యాంత్రికంగా మునుపటి మోడల్స్ మాదిరిగానే ఉంటాయి. ఈ బైకులలో ఎక్కువ భాగం నలుపు రంగు ఉండటం చూడవచ్చు.ఇక బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్, ఎం 1000 ఆర్ బైకుల విషయానికి వస్తే.. ఎం 1000 ఆర్ఆర్ కొంత ఎక్కువ హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. వింగ్లెట్లు కొంత పెద్దవిగా ఉంటాయి. కాస్మొటిక్ అప్డేట్స్ కూడా ఎక్కువగా ఉండటం గమనించవచ్చు. బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్ స్పోర్ట్‌బైక్ కూడా రీడిజైన్ పొందుతుంది. అయితే యాంత్రికంగా ఎటువంటి మార్పు పొందదు.బీఎండబ్ల్యూ మోటోరాడ్ కంపెనీ ఈ నాలుగు బైకులను భారతదేశంలో లాంచ్ చేస్తుందా? లేదా అనే విషయంపై ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టత లేదు. గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కానున్న ఈ బైకుల ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి.➤బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్: రూ. 19 లక్షల నుంచి రూ. 23.30 లక్షలు➤బీఎండబ్ల్యూ ఎం 1000 ఆర్: రూ. 33 లక్షల నుంచి రూ. 38 లక్షలు➤బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్: రూ. 20.75 లక్షల నుంచి రూ. 25.25 లక్షలు➤బీఎండబ్ల్యూ ఎం 1000 ఆర్ఆర్: రూ. 49 లక్షల నుంచి రూ. 55 లక్షలు -
బీఎండబ్ల్యూ మరో ఈ-స్కూటర్.. ప్రీలాంచ్ బుకింగ్స్ రేపే..
అంతర్జాతీయ ప్రీమియం మోటర్‌సైకిల్స్ కంపెనీ బీఎండబ్ల్యూ మోటరాడ్ (BMW Motorrad) మరో ఎలక్ట్రిక్ టూవీలర్‌ను భారత్ మార్కెట్లోకి తీసుకొస్తోంది. సీఈ 02 (CE 02) పేరుతో వచ్చే ఈ ఈ-స్కూటర్ రానున్న పండుగ సీజన్లో లాంచ్ కానుందని భావిస్తున్నారు. బీఎండబ్ల్యూ మోటరాడ్ సీఈ 02 ప్రీ-లాంచ్ బుకింగ్ శనివారం ప్రారంభమవుతున్నాయి.బీఎండబ్ల్యూ మోటరాడ్ సీఈ 02 ఈ-స్కూటర్‌ను స్థానికంగా భారత్‌లోనే అసెంబుల్ చేస్తారు. దీని ధర సుమారు రూ. 4.5 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చు. ఈ ఏడాది ప్రారంభంలో బీఎండబ్ల్యూ భారత్‌లో తన ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ టూ-వీలర్ సీఈ 04ని విడుదల చేసింది. దీని ధర 14.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 31 kW మోటార్‌ను పొందుతుంది మరియు 130 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.బీఎండబ్ల్యూ సీఈ 02లో గరిష్టంగా 55 ఎన్ఎం శక్తిని ఉత్పత్తి చేసే 11 కిలోవాట్ల (15 హార్స్ పవర్) మోటర్ ఉంటుంది. దీని రేంజ్ 90 కి.మీ, గరిష్ట వేగం గంటకు 95 కి.మీ. సీటు ఎత్తు 750 మి.మీ. ఉంటుంది. ఇక టీనేజర్ల కోసం 4 కిలోవాట్ల వెర్షన్ కూడా ఉంటుంది. "ఫ్లో", "సర్ఫ్" అనే స్టాండర్డ్ రైడింగ్ మోడ్లతో వస్తుంది. వీటితోపాటు "ఫ్లాష్" డ్రైవింగ్ మోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. -
లాంచ్‌కు సిద్దమవుతున్న మరో బీఎండబ్ల్యూ బైక్
ప్రముఖ అడ్వెంచర్ బైక్స్ తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మోటోరాడ్ రెండు నెలల క్రితం దేశీయ విఫణిలో ఆర్ 1300 జీఎస్ లాంచ్ చేసిన తరువాత మరో బైక్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇది అప్డేటెడ్ మిడ్ వెయిట్ 2024 ఎఫ్ 900 జీఎస్. ఈ బైక్ టీజర్లను సంస్థ ఇప్పటికే విడుడల చేసింది. దీన్ని బట్టి చూస్తే బీఎండబ్ల్యూ ఎఫ్ 900 జీఎస్ బైక్ త్వరలోనే లాంచ్ అవుతుందని తెలుస్తోంది.చూడటానికి కొత్తగా కనిపించే బీఎండబ్ల్యూ ఎఫ్ 900 జీఎస్ బైక్ ముందు భాగం సైడ్ ఫెయిరింగ్లను పొందుతుంది. ఇందులో మల్టిపుల్ రైడింగ్ మోడ్లు, ట్రాక్షన్ కంట్రోల్, పెద్ద TFT డాష్ బోర్డు, కీలెస్ ఇగ్నిషన్, ఎల్ఈడీ లైటింగ్ వంటివి ఉన్నాయి. ఈ బైక్ బరువు దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా తక్కువ.ఇదీ చదవండి: నిమిషానికి 693 రాఖీలు.. ఒక్కరోజులో సరికొత్త రికార్డ్!బీఎండబ్ల్యూ ఎఫ్ 900 జీఎస్ బైక్ 895 సీసీ ఇంజిన్ కలిగి 105 బ్రేక్ హార్స్ పవర్, 93 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్ పొందుతుంది. ఈ బైక్ ఆగస్టు చివరి నాటికి అధికారికంగా విడుదలవుతుందని సమాచారం. దీని ధర రూ. 13 లక్షల నుంచి రూ. 14.5 లక్షల మధ్య ఉంటుందని సమాచారం. ధరలు అధికారికంగా లాంచ్ సమయంలో వెల్లడవుతాయి. -
రూ.20.95 లక్షల బైక్‌కు రీకాల్ - కారణం ఇదే..
బీఎండబ్ల్యూ మోటోరాడ్ ఇటీవలే దేశీయ మార్కెట్లో రూ. 20.95 లక్షల (ఎక్స్ షోరూమ్) ఆర్ 1300 జీఎస్ బైక్ లాంచ్ చేసింది. అయితే కంపెనీ ఇప్పుడు ఈ బైకులకు రీకాల్ ప్రకటించింది.బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ బైకులో రిలే సరిగా పనిచేయడం లేదనే సమస్య కారణంగా కంపెనీ ఈ రీకాల్ ప్రకటించింది. ఈ సమస్య బైక్ నిలిచిపోవడానికి కారణమవుతుంది. 18 మార్చి 2024కి ముందు తయారు చేసిన బైకులలో మాత్రమే ఈ సమస్య ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. కాబట్టి వీటికి రీకాల్ ప్రకటించింది.రీకాల్ ప్రకటించిన బైకులలో సమస్యను పరిష్కారించడానికి కంపెనీ కొత్త ఎలక్ట్రోమెకానికల్ స్టార్టర్ రిలేను అమర్చనుంది. కంపెనీ 2024 మార్చి 18 ముందు సుమారు 25000 బైకులను తయారు చేసినట్లు.. వీటన్నంటికీ సంస్థ రీకాల్ ప్రకటించింది.ఇప్పటి వరకు బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ బైకులలో ఎలాంటి సమస్య తలెత్తలేదు. కానీ కంపెనీ ముందుగానే స్వచ్చందంగా రీకాల్ ప్రకటించింది. ఈ ప్రకటన ద్వారా ఈ బైకులలోని సమస్యను సంస్థ ఉచితంగా పరిష్కరించనుంది. -
మరో స్కూటర్ లాంచ్‌కు సిద్దమవుతున్న జర్మన్ కంపెనీ
బీఎండబ్ల్యూ మోటోరాడ్ దేశీయ విఫణిలో తన ఉనికిని విస్తరించడంతో బిజీ అయిపోయింది. ఇటీవల సీఈ04 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. ఇప్పుడు సీఈ 02ను లాంచ్ చేయడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. రూ. 14.90 లక్షలు ఖరీదైన సీఈ04 ప్రస్తుతం దేశంలో ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్‌గా అవతరించింది.బీఎండబ్ల్యూ సీఈ 02 అనేది సీఈ04 కంటే సరసమైనదిగా ఉండనున్నట్లు సమాచారం. ఇది ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇది ఎలక్ట్రిక్ కారు స్కూటర్ కాదని కంపెనీ వెల్లడించింది. అయితే 310 సీసీ విభాగంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.సీఈ02 స్కూటర్ మంచి డిజైన్, ఫీచర్స్ పొందనున్నట్లు సమాచారం. అయితే కంపెనీ లాంచ్ చేయనున్న ఈ వెహికల్స్ ధరలు, ఇంజిన్ వంటి మరిన్ని వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది. అయితే ఇది సీబీయూ మార్గం ద్వారా దేశానికి దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. -
రూ.20.95 లక్షల బీఎండబ్ల్యూ బైక్ లాంచ్ - పూర్తి వివరాలు
భారతీయ విఫణిలో బీఎండబ్ల్యూ మోటోరాడ్ తన 'ఆర్ 1300 జీఎస్' బైకును లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ ధర రూ. 20.95 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఇది ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న బీఎండబ్ల్యూ ఆర్ 1250 జీఎస్ కంటే రూ. 40000 ఎక్కువ.కొత్త బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ బైక్ 1300 సీసీ లిక్విడ్ కూల్డ్ బాక్సర్ ట్విన్ ఇంజన్ పొందుతుంది. ఇది 7750 rpm వద్ద 143.5 Bhp పవర్, 6500 rpm వద్ద 149 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. పవర్, టార్క్ అనేవి దాని మునుపటి మోడల్ కంటే ఎక్కువ.బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ బైక్ చూడటానికి దాని ఆర్ 1300 జీఎస్ మాదిరిగానే ఉంటుంది. కానీ కొన్ని అప్డేటెడ్ మార్పులను చూడవచ్చు. ఇందులో రీడిజైన్ ఫ్రంట్, ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, స్టీల్ షీట్-మెటల్ ఫ్రేమ్ వంటివి ఉన్నాయి. వీటితో పాటు ఈ బైకులో 6.5 ఇంచెస్ ఫుల్ కలర్ TFT స్క్రీన్, మల్టిపుల్ రైడింగ్ మోడ్స్ పొందుతుంది.సుమారు 237 కేజీల బరువున్న ఈ ఆర్ 1300 జీఎస్.. తక్కువ హైట్ ఉన్న సీటును పొందుతుంది. పొట్టిగా ఉన్న రైడర్లకు కూడా ఇది ఉత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇది ట్రయంఫ్ టైగర్ 1200 జిటి ప్రో, హార్లీ-డేవిడ్సన్ పాన్ అమెరికా 1250 వంటి బైకులకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.Let's set the pace together. The all-new BMW R 1300 GS starts at an introductory price of INR 20.95 Lakhs*.Have you booked yours? ⬇️https://t.co/NIhvPAPFXK#r1300gs #1300gs #bmw1300gs #pricelaunch #adventurebike #kingofadventure #bmwmotorradlndia #makelifearide pic.twitter.com/Pl9KOODGs0— BMWMotorrad_IN (@BMWMotorrad_IN) June 13, 2024 -
జూన్ 13న లాంచ్ అయ్యే బీఎండబ్ల్యూ బైక్ ఇదే - వివరాలు
ఖరీదైన బైకులను లాంచ్ చేసే బీఎండబ్ల్యూ మోటోరాడ్ సరికొత్త 'ఆర్ 1300 జీఎస్'ను జూన్ 13న లాంచ్ చేయడానికి సిద్ధమైంది. కంపెనీ లాంచ్ చేయనున్న ఈ బైక్ ఆధునిక హంగులతో, అద్భుతమైన పనితీరును అందించడానికి కావాల్సిన ఇంజిన్ ఆప్షన్ పొందనున్నట్లు తెలుస్తోంది.బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ బైక్ మంచి డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ట్విన్ పాడ్ హెడ్‌లైట్, ఎల్ఈడీ డీఆర్ఎల్ వంటివి ఉంటాయి. ఈ బైక్ దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే స్టాండర్డ్ రైడింగ్ మోడ్లు, ఎలక్ట్రానిక్ సస్పెన్షన్, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ పొందుతుంది.బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ 1300 సీసీ ట్విన్ సిలిండర్ ఇంజన్ పొందుతుంది. ఇది 7750 rpm వద్ద 145 Bhp పవర్, 6500 rpm వద్ద 149 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.త్వరలో లాంచ్ కానున్న కొత్త బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ బైక్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, BMW రాడార్ అసిస్టెడ్ క్రూయిజ్ కంట్రోల్, మల్టిపుల్ రైడ్ మోడ్లు, ట్రాక్షన్ కంట్రోల్, స్విచ్ చేయగల ఏబీఎస్ వంటి అనేక ఫీచర్స్ ఉన్నాయి. ఈ బైక్ ధర రూ. 20 లక్షల కంటే ఎక్కువ ధర వద్ద లాంచ్ అవుతుందని సమాచారం. ఖచ్చితమైన ధరలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి. -
ఒక్క చూపుకే ఫిదా చేస్తున్న 'బీఎండబ్ల్యూ ఆర్20' - వివరాలు
ప్రముఖ బైక్ తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మోటొరాడ్ (BMW Motorrad) సరికొత్త కాన్సెప్ట్ మోటార్‌సైకిల్ 'బీఎండబ్ల్యూ ఆర్20' ఆవిష్కరించింది. చూడటానికి చాలా అద్భుతంగా ఉన్న ఈ బైక్ ఓ ప్రత్యేకమైన డిజైన్ కలిగి.. చూడగానే ఆకర్శించే విధంగా ఉంది.కొత్త బీఎండబ్ల్యూ ఆర్20 బైక్ 2000 సీసీ ఎయిర్ ఆయిల్ కూల్డ్ బాక్సర్ ఇంజన్‌ను పొందుతుంది. అయితే ఈ ఇంజిన్ పనితీరు గణాంకాలను కంపెనీ వెల్లడించలేదు. ఇంజన్ కొత్త సిలిండర్ హెడ్ కవర్లు, కొత్త బెల్ట్ కవర్, కొత్త ఆయిల్-కూలర్ కూడా ఉన్నాయి.మోడ్రన్ క్లాసిక్ మోటార్‌సైకిల్ డిజైన్ కలిగిన ఈ బైక్ సరికొత్త గులాబీ రంగులో ఉంటుంది. సింగిల్ సీటును క్విల్టెడ్ బ్లాక్ ఆల్కాంటారా అండ్ ఫైన్-గ్రెయిన్ లెదర్‌లో అప్హోల్స్టర్ చేసారు. ఇందులో కొత్త ఎల్ఈడీ హెడ్‌లైట్, 3డీ ప్రింటెడ్ అల్యూమినియం రింగ్‌లో ఇంటిగ్రేటెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్ వంటివి ఉన్నాయి.బీఎండబ్ల్యూ ఆర్20 బైక్ 17 ఇంచెస్ ఫ్రంట్ స్పోక్ వీల్.. 17 ఇంచెస్ రియర్ బ్లాక్ డిస్క్ వీల్ పొందుతుంది. వెనుక టైర్ 200/55, ముందు టైరు 120/70 పరిమాణం పొందుతుంది. బీఎండబ్ల్యూ పారాలెవర్ సిస్టమ్ క్రోమ్-మాలిబ్డినం స్టీల్ స్వింగార్మ్, అల్యూమినియం పారాలెవర్ స్ట్రట్ ఇందులో ఉపయోగించారు. కాబట్టి రైడర్ మంచి రైడింగ్ అనుభూతిని పొందవచ్చు. -
రూ.45 లక్షల బీఎండబ్ల్యూ బైక్ - పూర్తి వివరాలు
'బీఎండబ్ల్యూ మోటొరాడ్' దేశీయ మార్కెట్లో సరికొత్త 'ఎమ్ 1000 ఎక్స్ఆర్' బైక్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 45 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇప్పటికే భారతీయ విఫణిలో అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన బైకుల జాబితాలో ఇది కూడా ఒకటిగా చేరింది. ఇది సీబియూ మార్గం ద్వారా ఇండియాకు దిగుమతి అవుతాయి. ఈ బైక్ బుక్ చేసుకుంటే డెలివరీలు జూన్ నుంచి ప్రారంభమవుతాయి.మంచి డిజైన్ కలిగిన ఈ బైక్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 6.5 ఇంచెస్ టీఎఫ్టీ డిస్ప్లే ఉంటుంది. అంతే కాకుండా ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, వీలీ కంట్రోల్, బ్రేక్ స్లైడ్ అసిస్ట్ ఫంక్షన్, లాంచ్ కంట్రోల్ మరియు పిట్ లేన్ లిమిటర్ ఫంక్షన్లు వంటి అనేక ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.బీఎండబ్ల్యూ ఎమ్ 1000 ఎక్స్ఆర్ బైక్ 999సీసీ ఇన్లైన్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 199 Bhp పవర్ మరియు 113 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది కేవలం 3.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం వాడుతుంది. ఈ బైక్ టాప్ స్పీడ్ గంటకు 278 కిమీ కావడం గమనార్హం. ఇందులో రెయిన్, రోడ్, డైనమిక్, డైనమిక్ ప్రో మరియు రేస్ ప్రో మోడ్ అనే ఐదు రైడింగ్ మోడ్లు ఉన్నాయి.