
ఖరీదైన బైకులను లాంచ్ చేసే బీఎండబ్ల్యూ మోటోరాడ్ సరికొత్త 'ఆర్ 1300 జీఎస్'ను జూన్ 13న లాంచ్ చేయడానికి సిద్ధమైంది. కంపెనీ లాంచ్ చేయనున్న ఈ బైక్ ఆధునిక హంగులతో, అద్భుతమైన పనితీరును అందించడానికి కావాల్సిన ఇంజిన్ ఆప్షన్ పొందనున్నట్లు తెలుస్తోంది.
బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ బైక్ మంచి డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ట్విన్ పాడ్ హెడ్‌లైట్, ఎల్ఈడీ డీఆర్ఎల్ వంటివి ఉంటాయి. ఈ బైక్ దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే స్టాండర్డ్ రైడింగ్ మోడ్‌లు, ఎలక్ట్రానిక్ సస్పెన్షన్, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ పొందుతుంది.
బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ 1300 సీసీ ట్విన్ సిలిండర్ ఇంజన్ పొందుతుంది. ఇది 7750 rpm వద్ద 145 Bhp పవర్, 6500 rpm వద్ద 149 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.
త్వరలో లాంచ్ కానున్న కొత్త బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ బైక్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, BMW రాడార్ అసిస్టెడ్ క్రూయిజ్ కంట్రోల్, మల్టిపుల్ రైడ్ మోడ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, స్విచ్ చేయగల ఏబీఎస్ వంటి అనేక ఫీచర్స్ ఉన్నాయి. ఈ బైక్ ధర రూ. 20 లక్షల కంటే ఎక్కువ ధర వద్ద లాంచ్ అవుతుందని సమాచారం. ఖచ్చితమైన ధరలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment