భారతీయ మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులకున్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. గత కొన్ని రోజులుగా కంపెనీ అమ్మకాలు తారా స్థాయిలో చేరుకుంటున్నాయి. 2023 ఫిబ్రవరిలో 71,544 యూనిట్లను విక్రయించి 2022 ఫిబ్రవరి కంటే 20.93 శాతం ఎక్కువ అమ్మకాలను నమోదు చేసింది.
అమ్మకాల్లో దూసుకెళ్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ రానున్న రోజుల్లో మరిన్ని కొత్త ఉత్పత్తులను తీసుకురావడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే కంపెనీ లైనప్‌లో హంటర్ 350సీసీ, బుల్లెట్ 350సీసీ, క్లాసిక్ 350సీసీ, మీటియోర్ 350సీసీ, హిమాలయన్, స్క్రామ్ 411, ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ GT 650, మరియు సూపర్ మెటోర్ 650 వంటి తొమ్మిది మోడళ్లు ఉన్నాయి.
కంపెనీ కొత్త ప్రణాళికలో భాగంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి మరో రెండు 350సీసీ బైకులు విడుదలయ్యే అవకాశం ఉందని నివేదికల ద్వారా తెలుస్తోంది. అవి బుల్లెట్ 350, షాట్‌గన్ 350 బాబర్ బైకులు. అంతే కాకుండా 450 సీసీ విభాగంలో, 650 సీసీ విభాగంలో కొత్త బైకులు విడుదలయ్యే అవకాశం ఉంది.
కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350:
రాయల్ ఎన్‌ఫీల్డ్ విడుదల చేయనున్న కొత్త బైక్ ఈ బుల్లెట్ 350. ఇది దాని మునుపటి మోడల్ కంటే అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. మీటియోర్ 350 మాదిరిగానే ఇది కూడా 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో 346 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ పొందనుంది.
(ఇదీ చదవండి: బజాజ్ నుంచి అప్డేటెడ్ బైక్స్ విడుదల)
రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 350 బాబర్:
ఇక కంపెనీ విడుదలచేయనున్న మరో కొత్త బైక్ 'రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 350 బాబర్'. ఇది కూడా మీటియోర్ 350 మాదిరిగానే అదే ఇంజిన్, పర్ఫామెన్స్ పొందే అవకాశం ఉంది. డిజైన్, ఫీచర్స్ అన్నీ కూడా మునుపటి మోడల్స్ కంటే ఉత్తమంగా ఉంటుంది. దీని ధర రూ. 2 లక్షల వరకు ఉంటుందని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment