Royal Enfield
-
క్లాసిక్ లుక్‌లో రాయల్ ఎన్ఫీల్డ్ న్యూ మోడల్ (ఫొటోలు)
-
థాయ్‌లాండ్‌లో రాయల్ ఎన్ఫీల్డ్ ప్లాంట్
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన రంగంలో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ తాజాగా థాయ్‌లాండ్‌లో అసెంబ్లీ ప్లాంటును ప్రారంభించినట్లు ఐషర్ మోటార్స్ బుధవారం తెలిపింది. విడిభాగాలను దిగుమతి చేసుకుని ఈ కేంద్రంలో వాహనాల అసెంబుల్ చేస్తారు.‘అపారమైన వృద్ధికి అవకాశం ఉన్న మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే అంతర్జాతీయ విస్తరణ వ్యూహాన్ని కలిగి ఉండటమే మా వ్యూహాత్మక ఉద్దేశం. థాయ్‌లాండ్ అసెంబ్లీ ప్లాంట్ ఈ విజన్‌ను అందిస్తుంది’ అని రాయల్ ఎన్ఫీల్డ్ సీఈవో బి.గోవిందరాజన్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్జెంటీనా, కొలంబియా, బ్రెజిల్, బంగ్లాదేశ్, నేపాల్‌లో ఇప్పటికే రాయల్ ఎన్ఫీల్డ్కు ఇటువంటి అసెంబ్లింగ్ కేంద్రాలు ఉన్నాయి. నూతన ఫెసిలిటీ థాయ్‌లాండ్‌లో మిడ్–సెగ్మెంట్ మార్కెట్‌ను వృద్ధి చేయడంలో సహాయపడుతుందని విశ్వసిస్తున్నామని రాయల్ ఎన్ఫీల్డ్ సీసీవో యద్వీందర్ సింగ్ గులేరియా తెలిపారు.అలాగే ఈ ప్రాంతంలో పెరుగుతున్న డిమాండ్‌ను సమర్ధవంతంగా తీర్చడానికి వీలు కల్పిస్తుందని అన్నారు. కొత్త ప్లాంట్ సంవత్సరానికి 30,000 కంటే ఎక్కువ యూనిట్లను అసెంబుల్ చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంది. థాయ్‌లాండ్ మార్కెట్‌తో ప్రారంభించి దశలవారీగా ఈ ప్రాంతంలో విస్తరిస్తామని కంపెనీ తెలిపింది. -
క్లాసిక్ లుక్‌లో కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ 650 (ఫొటోలు)
-
అదిరిపోయే లుక్‌తో రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త బండి
అదిరిపోయే లుక్‌తో రాయల్ ఎన్ఫీల్డ్ మరో కొత్త బైక్ ‘రాయల్ ఎన్ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350’ను ను లాంచ్ చేసింది. అలనాటి బాబర్ మోటార్‌సైకిల్ శైలిలో ప్రముఖ క్లాసిక్ 350 మోడల్‌కు అప్డేట్ ఫీచర్లతో గోవాలో జరిగిన మోటోవెర్స్ 2024 ఈవెంట్లో ఈ బైక్‌ను కంపెనీ ఆవిష్కరించింది.రాయల్ ఎన్ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350 మోటార్‌సైకిల్ సింగిల్-టోన్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.35 లక్షలు కాగా డ్యూయల్-టోన్ మోడల్ ధర రూ. 2.38 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. ఈ మోటార్‌సైకిల్ రేవ్ రెడ్, ట్రిప్ టీల్, పర్పుల్ హేజ్, షాక్ బ్లాక్ అనే నాలుగు కలర్ స్కీమ్‌లలో లభిస్తుంది.కొత్త గోవాన్ క్లాసిక్ 350 ఇప్పటికే ఉన్న క్లాసిక్ 350 మోడల్‌కు సరికొత్త రూపంగా ఉంటుంది. బాబర్ తరహాలో విలక్షణంగా దీన్ని లుక్‌ను తీర్చిదిద్దారు. దీంట్లో చేసిన ముఖ్యమైన అప్గ్రేడ్ల విషయానికి వస్తే ఏప్ హ్యాంగర్ హ్యాండిల్బార్లు, ఫార్వర్డ్-సెట్ ఫుట్‌పెగ్‌లు, స్లాష్-కట్ ఎగ్జాస్ట్ పైపు వంటివి ఉన్నాయి.క్లాసిక్ 350 లాగే గోవాన్ క్లాసిక్ 350 కూడా అదే 349సీసీ జె-సిరీస్ ఇంజన్‌తో వస్తుంది. ఫైవ్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వచ్చే సింగిల్-సిలిండర్, ఎయిర్-ఆయిల్ కూల్డ్ ఇంజిన్ 20.2 బీహెచ్పీ, 27 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. -
మరో కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఇదే: లాంచ్ ఎప్పుడంటే..
రాయల్ ఎన్ఫీల్డ్ తన లైనప్‌కు మరో బైక్ యాడ్ చేసింది. అదే స్క్రామ్ 440. ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా పెద్ద ఇంజిన్ పొందుతుంది. కాస్మొటిక్ అప్డేట్స్ కొన్ని గమనించవచ్చు. ఇది మార్కెట్లో 2025 జనవరి లాంచ్ అయ్యే అవకాశం ఉంది.కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440.. చూడటానికి స్క్రామ్ 411 మాదిరిగా ఉంటుంది. ఇది 443 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ద్వారా.. 25.4 Bhp పవర్, 34 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్ పొందుతుంది. ఈ బైకులో ఎస్ఓహెచ్సీ వాల్వెట్రెయిన్ సిస్టమ్ ఉండటం వల్ల సౌండ్ కూడా తగ్గుతుంది.రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440 రౌండ్ హెడ్‌లైట్ కలిగి.. సింగిల్ డయల్ సెటప్ కూడా పొందుతుంది. ఇది స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్‌మీటర్ వంటి వాటిని చూపిస్తుంది. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుకవైపు మోనోషాక్ కలిగిన ఈ బైక్ డిస్క్ బ్రేక్స్ పొందుతుంది.15 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కలిగిన ఈ బైక్ బరువు 196 కేజీలు. రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440 కూడా రెండు వేరియంట్లలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీని ధర అధికారికంగా వెల్లడి కాలేదు, కానీ స్టాండర్డ్ స్క్రామ్ 411 ధర (రూ. 2.06 లక్షల నుంచి రూ. 2.12 లక్షలు) కంటే కొంత ఎక్కువ ఉండొచ్చని సమాచారం. -
నమ్మండి ఇది 'రాయల్ ఎన్ఫీల్డ్' బైకే.. (ఫోటోలు)
-
మార్కెట్లో మరో పవర్ఫుల్ బైక్ లాంచ్: ధర ఎంతో తెలుసా?
రాయల్ ఎన్ఫీల్డ్ తన మొదటి ఎలక్ట్రిక్ బైక్ ఆవిష్కరించిన తరువాత.. 650 సీసీ విభాగంలో మరో బైక్ లాంచ్ చేసింది. 'ఇంటర్‌సెప్టర్ బేర్ 650' పేరుతో మార్కెట్లో లాంచ్ అయిన ఈ బైక్ ధర రూ. 3.39 లక్షలు (ఎక్స్ షోరూమ్).రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 ఆధారంగా నిర్మితమైన ఈ బైక్ స్క్రాంబ్లర్ బైక్ డిజైన్ పొందుతుంది. కాబట్టి ఆ రెండు బైకుల ఫీచర్స్ ఈ ఒక్క బైకులోనే గమనించవచ్చు. కొత్త కలర్ ఆప్షన్స్, సైడ్ ప్యానెల్స్‌పై నంబర్ బోర్డ్, ఆల్ ఎల్ఈడీ లైటింగ్ సెటప్ అన్నీ కూడా ఈ బైకును చాలా హుందాగా కనిపించేలా చేస్తాయి.రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ బేర్ 650 బైక్ 130 మిమీ ట్రావెల్‌తో 43 మిమీ షోవా యుఎస్డి ఫ్రంట్ ఫోర్క్, వెనుకవైపు 115 మిమీ ట్రావెల్‌తో కొత్త ట్విన్ షాక్ అబ్జార్బర్ వంటివి పొందుతుంది. ఈ హిమాలయన్ బైకులో కనిపించే ఫుల్ కలర్డ్ TFT స్క్రీన్ కూడా ఇందులో చూడవచ్చు.ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ బైంక్ లాంచ్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్648 సీసీ ఇంజిన్ కలిగిన ఇంటర్‌సెప్టర్ బేర్ 650.. 47 Bhp పవర్, 57 Nm టార్క్ అందిస్తుంది. 216 కేజీల బరువున్న ఈ బైక్ అత్యుత్తమ పనితీరును అందిస్తుందని భావిస్తున్నాము. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ ఇప్పుడు డీలర్‌షిప్‌ల వద్ద అందుబాటులో ఉంది. కాబట్టి డెలివరీలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. -
ఎలక్ట్రిక్ బైంక్ లాంచ్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్
టూవీలర్ వాహన మార్కెట్లో దిగ్గజ కంపెనీగా ఉన్న ‘రాయల్ ఎన్ఫీల్డ్’ కొత్తగా ఎలక్ట్రిక్ బైక్‌ను లాంచ్ చేసినట్లు ప్రకటించింది. కంపెనీ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను ఇటీవల ఆవిష్కరించింది. ‘ఫ్లైయింగ్ ఫ్లీ’ పేరుతో దీన్ని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. విభిన్న వేరియంట్ల ద్వారా 250-750 సీసీ సామర్థ్యం కలిగిన బైక్‌లకు ధీటుగా ఈవీను అందించాలనే లక్ష్యంతో ఉన్నట్లు కంపెనీ పేర్కొంది.రాయల్ ఎన్ఫీల్డ్ మాతృసంస్థ ఐషర్ మోటార్స్ ఎండీ సిద్ధార్థ్ లాల్ మాట్లాడుతూ..‘రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ స్టైల్ ఫ్లైయింగ్ ఫ్లీ సీ6, స్క్రాంబ్లర్-స్టైల్ ఫ్లైయింగ్ ఫ్లీ ఎస్6 పేరుతో ఎలక్ట్రిక్ బైక్‌లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. ఈవీ టెక్నాలజీకి కస్టమర్లలో ఆదరణ పెరుగుతోంది. అందుకు అనుగుణంగా కంపెనీ ఉత్పత్తులను అందిస్తుంది. కంపెనీ ఆవిష్కరించిన ఈవీ బైక్ ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు’ అని అన్నారు.రెండో ప్రపంచ యుద్ధం నాటి బైక్అక్టోబర్ చివరి వారంలో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. పారాచూట్ ద్వారా ఎయిర్‌లిఫ్ట్ చేసినట్లు ఈ వీడియోలో చూపించారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో శత్రువులపై దండెత్తడానికి బైక్‌లను పారాచూట్ ద్వారా ల్యాండ్ చేశారు. అందుకు తగ్గట్లుగా రాయల్ ఎన్ఫీల్డ్ తేలికపాటి బైక్‌లు తయారు చేసింది. అదే మాదిరి ఈ బైక్ టీజర్ విడుదల సమయంలో పారాచూట్ ద్వారా ల్యాండ్ చేసినట్లు చూపించారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అభివృద్ధి చేసిన తేలికపాటి మోటార్‌సైకిళ్లను యుద్ధం తర్వాత విక్రయించారు.ఇదీ చదవండి: హైదరాబాద్ గోదామును డీలిస్ట్ చేసిన జొమాటోఫ్రేమ్: అల్లైడ్ అల్యూమీనియ్ ఫ్రేమ్బ్యాటరీ: బరువు తక్కువగా ఉండేందకు వీలుగా మెగ్నీషియమ్ బ్యాటరీ వాడారు.డిజైన్: రౌండ్ హెడ్‌లైట్, ఫాక్స్ ఫ్యుయెల్ ట్యాంక్ మాదిరిగా కనిపించే డిజైన్, ఎల్ఈడీ లైటింగ్ ఉంటుంది.డిస్ప్లే: టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ డిస్ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ.సేఫ్టీ: ట్రాక్షన్ కంట్రోల్, కార్నింగ్ ఏబీఎస్, ముందు, వెనక డిస్క్ బ్రేకులుంటాయి.రేంజ్: ఒకసారి ఛార్జీ చేస్తే 150-200 కి.మీ ప్రయాణం చేసేందుకు వీలుంది. -
రాయల్ ఎన్ఫీల్డ్ మొదటి ఈవీ బైక్ చూశారా? (ఫొటోలు)
-
వచ్చేస్తోంది రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ చూశారా
-
వచ్చేస్తోంది రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ - వీడియో చూశారా?
మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ బైక్ తయారీదారు 'రాయల్ ఎన్ఫీల్డ్' ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. కంపెనీ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను 2024 నవంబర్ 4న మార్కెట్లో ఆవిష్కరించనున్నట్లు వెల్లడించింది.కంపెనీ లాంచ్ చేయనున్న ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను సంబంధించిన ఓ టీజర్ విడుదల చేసింది. అయితే నవంబర్ 4న రాయల్ ఎన్ఫీల్డ్ ఆవిష్కరించే ఎలక్ట్రిక్ బైక్ కేవలం కాన్సెప్ట్ అయి ఉండొచ్చని, రాబోయే రోజుల్లో మార్కెట్లో ఈ బైక్ లాంచ్ అవుతుందని సమాచారం.ఇప్పటికి లీకైన సమాచారం ప్రకారం రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ లేటెస్ట్ క్లాసిక్ డిజైన్ పొందుతుందని తెలుస్తోంది. ఫ్యూయెల్ ట్యాంక్ స్థలంలో బహుశా స్టోరేజ్ స్పేస్ ఉండొచ్చని సమాచారం. పేటెంట్ ఇమేజ్ సింగిల్-సీట్ లేఅవుట్‌ను కలిగి ఉండనున్నట్లు వెల్లడిస్తున్నప్పటికీ.. పిలియన్ సీటును కూడా ఏర్పాటు చేసుకోవచ్చని తెలుస్తోంది.ఇదీ చదవండి: బంగారం ధరలు పెరగడానికి కారణం ఇదే..రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ సాధారణ డిజైన్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. వెనుక భాగం అల్యూమినియం స్వింగ్ఆర్మ్, మోనోషాక్ వంటివి పొందనున్నట్లు సమాచారం. ఈ బైక్ ఎలక్ట్రిక్01 అనే కోడ్ నేమ్ కలిగి ఉండొచ్చని తెలుస్తోంది. ఇంకా చాలా వివరాలు అధికారికంఘా వెల్లడి కావాల్సి ఉంది. అనుకున్న విధంగా ఈ బైక్ మార్కెట్లో లాంచ్ అయితే ప్రత్యర్ధ కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. View this post on Instagram A post shared by Royal Enfield (@royalenfield) -
నెలలో 11 శాతం పెరిగిన విక్రయాలు
మోటార్‌సైకిల్ తయారీదారు రాయల్ ఎన్ఫీల్డ్ సెప్టెంబర్‌లో విక్రయాలు పెరిగినట్లు కంపెనీ సీఈఓ బి.గోవిందరాజన్ తెలిపారు. గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది విక్రయాలు 11 శాతం పెరిగి 86,978 యూనిట్లకు చేరినట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా గోవిందరాజన్ మాట్లాడుతూ..‘కంపెనీ మోటార్ సైకిల్ విభాగంలో విక్రయాలు క్రమంగా పెరుగుతున్నాయి. 2023 సెప్టెంబర్‌లో 78,580 యూనిట్ల విక్రయం జరిగింది. ఈసారి అదే సమయంలో 11 శాతం విక్రయాలు పెరిగి 86,978కు చేరాయి. 2024 ప్రారంభంలో క్లాసిక్ 350 మోడల్‌ను లాంచ్ చేయడం సంస్థ విక్రయాలు పెరిగేందుకు తోడ్పడింది. గతేడాది సెప్టెంబర్‌లో ఎగుమతులు 4,319 యూనిట్లుగా ఉండేది. అది గత నెలలో 7,652 యూనిట్లకు పెరిగింది’ అన్నారు.ఇదీ చదవండి: పాలసీను సరెండర్ చేస్తే ఎంత వస్తుందంటే..? -
రాయల్ ఎన్ఫీల్డ్ బైకులకు రీకాల్.. కారణం ఇదే
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్.. నవంబర్ 2022 - మార్చి 2023 మధ్య తయారు చేసిన బైకులకు రీకాల్ ప్రకటించింది. రొటీన్ టెస్టింగ్ సమయంలో వెనుక, సైడ్ రిఫ్లెక్టర్లతో సమస్యను గుర్తించిన కంపెనీ, దీనిని పరిష్కరించడానికి రీకాల్ ప్రకటించింది.నిర్దేశించిన సమయంలో తయారైన మోటార్‌సైకిళ్లలోని రిఫ్లెక్టర్లు.. రిఫ్లెక్టివ్ పనితీరు సరిగ్గా ఉండకపోవచ్చు. దీని వల్ల కాంతి తక్కువగా ఉండటం వల్ల దృశ్యమానత దెబ్బతింటుంది. ఇది రోడ్డుపైన ప్రమాదాలు జరగడానికి కారణమవుతుంది. అయితే ఈ సమస్యపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు, కానీ కంపెనీ ముందు జాగ్రత్తగానే రీకాల్ ప్రకటించింది.ఇదీ చదవండి: చెట్టుకింద వచ్చిన ఆలోచన.. వేలకోట్లు సంపాదించేలా..కంపెనీ ఈ సమస్యను ఉచితంగా పరిష్కరిస్తుంది. బైకులో ఈ సమస్యను పరిష్కరించడానికి కేవలం 15 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. కాబట్టి భర్తీ ప్రక్రియ త్వరగా, సమర్ధవంతంగా ఉంటుందని రాయల్ ఎన్ఫీల్డ్ పేర్కొంది. బ్రాండ్ సర్వీస్ టీమ్‌లు వారి సమీప సర్వీస్ సెంటర్లో రీప్లేస్మెంట్ షెడ్యూల్ చేయడానికి ప్రభావిత మోటార్‌సైకిళ్ల యజమానులను నేరుగా సంప్రదించనున్నట్లు సమాచారం. -
అక్కడ డొక్కు డొక్కు.. ఇక్కడ డుగ్గు డుగ్గు
రాయల్ ఎన్ఫీల్డ్.. యెజ్డీ.. జావా.. నార్టన్... బీఎస్ఏ.. విశ్వ విఖ్యాత బైక్ బ్రాండ్లు ఇవి. విదేశాల్లో మనుగడ సాధించలేక చేతులెత్తేసిన ఈ బ్రాండ్లన్నీ భారతీయుల చేతిలో మళ్లీ ప్రాణం పోసుకున్నాయి. అమ్మకాల్లో దుమ్మురేడమే కాదు.. మళ్లీ వాటిని గ్లోబల్ బ్రాండ్లుగా నిలబెట్టి మనోళ్లు సత్తా చాటుతున్నారు!మహీంద్రా కంపెనీ క్లాసిక్ లెజెండ్స్ తాజాగా ప్రఖ్యాత బ్రిటిష్ మోటార్‌సైకిల్ బ్రాండ్ బీఎస్ఏను భారత్‌లో ప్రవేశపెట్టడం తెలిసిందే. అక్కడ మూసేసిన ఈ కంపెనీని కొనుగోలు చేసి, మన మార్కెట్లో లాంచ్ చేసింది. విదేశీ బ్రాండ్లకు మన దగ్గర తిరిగి జీవం పోస్తూ... 1994లో ప్రారంభమైన ఈ ట్రెండ్ ఇప్పటికీ నాన్‌స్టాప్‌గా కొనసాగుతూనే ఉంది. ఇంగ్లాండ్‌లో కార్యకలాపాలను నిలిపేసిన బ్రిటిష్ మోటార్ సైకిల్ కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్ను ఐషర్ గ్రూప్ 1994లో చేజిక్కించుకుంది. అయితే, మన దగ్గర ఈ బ్రాండ్‌ను మళ్లీ జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఆ కంపెనీకి 15 ఏళ్లు పట్టింది. 2009లో క్లాసిక్ 350, క్లాసిక్ 500 మోటార్ సైకిళ్లు డుగ్గు డుగ్గు మంటూ మళ్లీ మన రోడ్లపై పరుగులు తీయడం మొదలైంది. ఇప్పుడు యువతకు ఈ మోటార్ సైకిల్స్ అంటే ఎంత క్రేజో చెప్పాల్సిన పని లేదు! ‘2009లో విడుదల చేసిన క్లాసిక్‌తో రాయల్ ఎన్ఫీల్డ్ గ్లోబల్ కంపెనీగా అపూర్వ విజయం సొంతం చేసుకుంది. మొదట్లో ఏడాదికి 50,000 బుల్లెట్లను అమ్మడమే గగనంగా ఉన్న స్థాయి నుంచి ప్రస్తుతం అనేక మోడల్స్ దన్నుతో వార్షిక సేల్స్ 8.5 లక్షలకు ఎగబాకాయి’ అని కంపెనీ సీఈఓ గోవిందరాజన్ పేర్కొన్నారు. 2009 నుంచి ఇప్పటిదాకా రాయల్ ఎన్ఫీల్డ్ 75 లక్షల మోటార్ సైకిళ్లను విక్రయించగా అందులో 40 లక్షలు క్లాసిక్ మోడల్ కావడం మరో విశేషం. ఈ నెల 12న కూడా కంపెనీ కొత్త క్లాసిక్‌ను ప్రవేశపెట్టింది.యెజ్డీ.. కుర్రకారు హార్ట్ ‘బీట్’ అనుపమ్ తరేజా సారథ్యంలోని క్లాసిక్ లెజెండ్.. గ్లోబల్ బైక్ బ్రాండ్స్ జావా, యెజ్డీ, బీఎస్ఏలను భారతీయులకు మళ్లీ పరిచయం చేసింది. 1970లో మార్కెట్ నుంచి వైదొలగిన చెక్ కంపెనీ జావా.. 2018లో మనోళ్ల చేతికి చిక్కింది. అప్పటి నుంచి 1.4 లక్షల జావాలు రోడ్డెక్కాయి. గత నెల 13న జావా 42 మోడల్‌ను సైతం రంగంలోకి దించింది. ఇక అప్పట్లో అదిరిపోయే బీట్తో కుర్రోళ్ల మనను కొల్లగొట్టిన యెజ్డీ కూడా 1996లో అస్తమించి.. 2022లో లెజెండ్స్ ద్వారా తిరిగి ప్రాణం పోసుకుంది. 60 వేల బైక్‌లు ఇప్పటిదాకా అమ్ముడవ్వడం విశేషం. బీఎస్ఏ అయితే, 1973లోనే మూతబడింది. దాన్ని ఆనంద్ మహీంద్రా పోటాపోటీగా దక్కించుకుని యూకేతో పాటు భారత్‌లోనూ మళ్లీ ప్రవేశ పెట్టారు.అదే బాటలో టీవీఎస్, హీరో... ఇక దేశీ దిగ్గజం టీవీఎస్ కూడా మరో విఖ్యాత బ్రిటిష్ బైక్ బ్రాండ్ నార్టన్‌ను కేవలం రూ.153 కోట్లకు కొనుగోలు చేసింది. 2025 నాటికి తొలి మోడల్‌ను ప్రవేశపెట్టడంతో పాటు మూడేళ్లలో ఆరు కొత్త నార్టన్ బైక్‌లను తీసుకొచ్చే సన్నాహాల్లో ఉంది. ఈ ప్రఖ్యాత బ్రాండ్లను దక్కించుకోవడంతో పాటు వాటి చారిత్రక నేపథ్యాన్ని అలాగే కొనసాగించడం ద్వారా ఒరిజినాలిటీని కాపాడుతున్నామని తరేజా వ్యాఖ్యానించారు. బీఎస్ఏను భారత్‌లోనే తయారు చేస్తున్నా, దాని బ్రిటిష్ బ్రాండ్ ప్రాచుర్యం పదిలంగా ఉందన్నారు. ఇక భారత్‌లో నేరుగా ప్లాంట్ పెట్టి, చేతులెత్తేసిన హార్లీ డేవిడ్సన్కు హీరో మోటోకార్ప్ దన్నుగా నిలిచింది. ఆ కంపెనీతో జట్టుకట్టి మళ్లీ హార్లీ బైక్‌లను భారతీయులకు అందిస్తోంది. ఎక్స్440 బైక్‌ను ఇక్కడే అభివృద్ధి చేయడం విశేషం. దీన్ని దేశీయంగా హీరో ఉత్పత్తి చేస్తున్పప్పటికీ, ప్రామాణిక హార్లీ బైక్ బ్రాండ్ విలులో ఎలాంటి మార్పులు చేయలేదని కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ జోషెన్ జీట్స్ పేర్కొన్నారు. భారత్‌లో నేరుగా విక్రయాల్లో వెనుకబడ్డ బీఎండబ్ల్యూ మోటోరాడ్, టీవీఎస్‌తో జట్టుకట్టింది. టీవీఎస్ రూపొందించిన 500 సీసీ లోపు బైక్‌లు 60 వేలకు పైగా అమ్ముడవ్వడం మనోళ్ల సత్తాకు నిదర్శనం! → 2015లో మహీంద్రా మెజారిటీ పెట్టుబడితో ఫై క్యాపిటల్ ఓనర్ అనుపమ్ తరేజా క్లాసిక్ లెజెండ్స్ అనే కంపెనీని నెలకొల్పారు. జావా, యెజ్డీ, బీఎస్ఏ వంటి గ్లోబల్ ఐకాన్లను దక్కించుకుని, పునరుద్ధరించారు.→ 2013లో టీవీఎస్ బీఎండబ్ల్యూ మోటోరాడ్‌తో డీల్ కుదుర్చుకుంది, తద్వారా ప్రపంచ మార్కెట్ కోసం 500 సీసీ లోపు బైక్‌లను అభివృద్ధి చేసి, ఇంటా బయటా విక్రయిస్తోంది. 2020లో టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రఖ్యాత బ్రిటిష్ మోటార్‌సైకిల్ బ్రాండ్ నార్టన్‌ను కొనుగోలు చేసింది; వచ్చే మూడేళ్లలో ఆరు కొత్త మోడల్స్‌ను ప్రవేశపెట్టే పనిలో ఉంది.→ 1994లో ఐషర్ గ్రూప్ ఇంగ్లాండ్‌లో పూర్తిగా అమ్మకాలను నిలిపేసిన బ్రిటిష్ బైక్ దిగ్గజం రాయల్ ఎన్ఫీల్డ్ను చేజిక్కించుకుంది. 2009లో ‘క్లాసిక్’ బ్రాండ్‌కు తిరిగి జీవం పోయడంమే కాదు.. గ్లోబల్ కంపెనీగా దీన్ని మళ్లీ నిలబెట్టింది.→ 2023లో హీరో మోటోకార్ప్ భారత్‌లో విఫలమై షట్టర్ మూసేసిన హార్లే డేవిడ్సన్కు మళ్లీ ఇక్కడ ప్రాణం పోసింది. ఎక్స్440 మోడల్‌ను విడుదల చేసి సక్సెస్ కొట్టింది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
‘బుల్లెట్’ బండ్లపై మోజు తగ్గిందా?
రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాల అమ్మకాలు పడిపోయాయి. ఈ ఏడాది ఆగస్టులో కంపెనీ మొత్తం అమ్మకాలలో 5 శాతం తగ్గుదలని నివేదించింది. కంపెనీ గతేడాది ఆగస్టులో విక్రయించిన 77,583 యూనిట్లతో పోలిస్తే గత నెలలో 73,630 యూనిట్లను విక్రయించింది.గత ఆగస్టులో కంపెనీ దేశీయ విక్రయాలు 65,624 యూనిట్లుగా ఉన్నాయి. గతేడాది ఆగస్టులో అమ్ముడుపోయిన 69,393 యూనిట్లతో పోలిస్తే ఇవి కూడా 5 శాతం క్షీణించాయి. ఇక ఎగుమతుల విషయానికి వస్తే.. రెండు శాతం పడిపోయాయి. గత నెలలో ప్రపంచవ్యాప్తంగా 8,006 యూనిట్లు ఎగుమతి కాగా గత ఏడాది ఆగస్టులో ఎగుమతి చేసిన వాహనాలు 8,190.కస్టమర్లను ఆకర్షించి సేల్స్ పెంచుకునేందుకు కంపెనీ వివిధ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో అత్యంత ఆదరణ ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మోడల్‌కు వివిధ ఫీచర్లు జోడించి 2024 వెర్షన్‌ను ఇటీవలే విడుదల చేసింది. మోటార్‌సైకిల్ పోర్ట్‌ఫోలియో విస్తరణతో పాటు, రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త రైడింగ్ గేర్లను కూడా వేగంగా విడుదల చేస్తోంది. ఇటీవల క్రాస్రోడర్స్ రైడింగ్ జాకెట్‌ను లాంచ్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్స్ రివిట్ ఆల్-వెదర్ రైడింగ్ గేర్‌ను విడుదల చేసింది. -
‘రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350’ లేటెస్ట్ ఎడిషన్ వచ్చేసింది..
రాయల్ ఎన్ఫీల్డ్ ద్విచక్ర వాహనాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాహనప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 లేటెస్ట్ ఎడిషన్ ఎట్లకేలకు వచ్చేసింది. రూ. 1.99 లక్షల ప్రారంభ ధరతో ఈ బైక్ 2024 ఎడిషన్ భారత మార్కెట్లో విడుదలైంది.2024 క్లాసిక్ 350 టాప్ వేరియంట్ ధర రూ.2.30 లక్షలు. ఈ బైక్ బుకింగ్‌లు, టెస్ట్ రైడ్లు సెప్టెంబర్ 1 నుండి ప్రారంభమయ్యాయి. 2024 మోడల్ కోసం క్లాసిక్ 350ని కొత్త కలర్ ఆప్షన్లతో సరికొత్తగా, అదనపు ఫీచర్లతో మెరుగుపరిచారు. క్లాసిక్ 350 మొత్తం శ్రేణిలో లేనివిధంగా ఎల్ఈడీ పైలట్ లైట్లు, హెడ్‌లైట్, టెయిల్ లైట్ అప్డేటెడ్ ఎడిషన్‌లో ఉన్నాయి. అంతేకాకుండా ప్రీమియం మోడల్స్‌లో అయితే ఎల్ఈడీ ఇండికేటర్లు సైతం ఉన్నాయి.క్లాసిక్ 350 లేటెస్ట్ ఎడిషన్‌లో అడ్జస్టబుల్ క్లచ్, బ్రేక్ లివర్, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉన్నాయి. అలాగే ఇందులో యూఎస్బీ టైప్-సీ ఛార్జర్ కూడా ఉంది.ఈ బైక్ లో ఇచ్చిన 349cc సింగిల్-సిలిండర్ ఇంజన్‌ను ఐదు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. ఇది 6,100rpm వద్ద 20.2bhp, 4,000rpm వద్ద 27Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.ఇక కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే హెరిటేజ్ (మద్రాస్ రెడ్, జోధ్‌పూర్ బ్లూ), హెరిటేజ్ ప్రీమియం (మెడాలియన్ బ్రాంజ్), సిగ్నల్స్ (కమాండో శాండ్), డార్క్ (గన్ గ్రే, స్టెల్త్ బ్లాక్), క్రోమ్ (ఎమరాల్డ్) అనే ఐదు వేరియంట్లలో ఏడు కొత్త రంగులను ప్రవేశపెట్టింది. వీటిలో స్టెల్త్ బ్లాక్ వేరియంట్ మాత్రమే స్టైలిష్ అల్లాయ్ వీల్స్‌తో రావడం విశేషం. -
‘రాయల్’ దొంగ అరెస్టు
మోతీనగర్: జల్సాలకు అలవాటు పడి రాయల్ ఎన్ఫీల్డ్ ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసి అమ్ముతున్న ఓ దొంగను అల్లాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ సామల వెంకటరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..అల్లాపూర్‌లో ఓ రాయల్ ఎన్ఫీల్డ్ వాహనం దొంగతనం జరిగింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం అల్లాపూర్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా..గోల్కొండకు చెందిన సయ్యద్ సాహిల్ ఎన్ఫీల్డ్ వాహనానికి సంబంధించిన పేపర్లు పరిశీలించారు. అనుమానాస్పదంగా వ్యవహరించడంతో విచారించగా తాను రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాలను దొంగతనం చేసినట్లు ఒప్పుకుకున్నాడు. జగద్గిరిగుట్ట, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, జంజారాహిల్స్, మధురానగర్, అల్లాపూర్, పటాన్చెరు పోలీస్స్టేషన్ల పరిధిలో పలు రాయల్æఎన్ఫీల్డ్ వాహనాలను దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు దొంగ నుంచి 5 రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాలు, ఒక సెల్‌ఫోన్‌ను రికవరీ చేశారు. ఈ మేరకు సయ్యద్ సాహిల్‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు. -
రాయల్ ఎన్ఫీల్డ్ గెరిల్లా 450.. కొత్త బండి గురూ!! (ఫోటోలు)
-
ఈ వారం భారత్‌లో విడుదలైన కొత్త బైకులు ఇవే!
పండుగ సీజన్ తరువాత కూడా భారతీయ మార్కెట్లో కొత్త బైకులు విడుదలవుతూనే ఉన్నాయి. బెంగళూరుకు చెందిన కంపెనీ ఓ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేయగా, చెన్నైకు చెందిన రాయల్ ఎన్ఫీల్డ్ రెండు కొత్త బైకులను లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ బైక్స్ ధరలు, ఇతర వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రాయల్ ఎన్ఫీల్డ్ షాట్‌గన్ 650 దేశీయ బైక్ తయారీ దిగ్గజం రాయల్ ఎన్ఫీల్డ్ ఇటీవల 650 సీసీ విభాగంలో ఓ స్టైలిష్ బైక్ లాంచ్ చేసింది. రూ. 4.25 లక్షల ధర వద్ద లభించే ఈ బైక్ కేవలం 25 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. 648 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ కలిగిన ఈ బైక్ మంచి మీటియోర్ లాంటి డిజైన్ కలిగి 47 హార్స్ పవర్, 52.3 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుందని తెలుస్తోంది. 2024 హిమాలయన్ భారతదేశంలో ప్రారంభం నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఇప్పుడు సరోకొత్త మోడల్‌గా మార్కెట్లో విడుదలైంది. ఈ లేటెస్ట్ బైక్ ధరలు రూ.2.69 లక్షల నుంచి రూ.2.79 లక్షల మధ్య ఉంటాయి. ఈ ధరలు 2023 డిసెంబర్ 31 వరకు మాత్రమే చెల్లిబాటు అవుతాయి. ఆ తరువాత ధరలు పెరిగే అవకాశం ఉంది. 2024 హిమాలయన్ లిక్విడ్ కూల్డ్, 452 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ కలిగి 40 హార్స్ పవర్ మరియు 40 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్‌తో 6 స్పీడ్ గేర్‌బాక్స్ పొందుతుంది. కాబట్టి అద్భుతమైన పర్ఫామెన్స్ చూడవచ్చు. ఇదీ చదవండి: నెలకు రూ.9 లక్షలు సంపాదిస్తున్న అందగత్తె.. కానీ ఈమె.. ఓర్క్సా మాంటిస్ ఎలక్ట్రిక్ బైక్ బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ బైక్ తయారీ సంస్థ 'ఓర్క్సా ఎనర్జీ' (Orxa Energy).. దేశీయ విఫణిలో 'మాంటీస్ ఎలక్ట్రిక్' (Mantis Electric) బైక్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 3.6 లక్షలు (ఎక్స్-షోరూమ్, బెంగళూరు). కేవలం ఒకే వేరియంట్లో లభించే ఈ బైక్ 1.3 కిలోవాట్ ఛార్జర్ పొందుతుంది. కేవలం 8.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమయ్యే ఈ బైక్ ఒక ఫుల్ ఛార్జ్‌తో 221 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. అల్ట్రావయోలెట్ ఎలక్ట్రిక్ బైకులకు ప్రధాన ప్రత్యర్థిగా ఉండే 'మాంటీస్ ఎలక్ట్రిక్' 182 కేజీల బరువును కలిగి అద్భుతమైన పనితీరుని అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. చూడగానే ఆకర్శించే డిజైన్ కలిగిన ఈ బైక్ లేటెస్ట్ ఫీచర్స్ కలిగి వినియోగదారులకు ఉత్తమ రైడింగ్ అనుభవాన్ని అందిస్తుందని సంస్థ తెలిపింది. -
బుల్లెట్ నడిపిన సీఎం ఖట్టర్
చంఢీగర్: ఎలాంటి భద్రత లేకుండా బైక్ రైడ్ చేశారు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌పై సీఎం ముందు వెళుతుండగా.. భద్రతా సిబ్బంది, అధికారులు ఆయనను అనుసరించారు. కర్నాల్ ఎయిర్‌పోర్టు వరకు బైక్ ప్రయాణం చేశారు. హరియాణాలో 'కార్ ఫ్రీ డే' సందర్భంగా సీఎం బైక్ ర్యాలీ నిర్వహించారు. ట్రాఫిక్‌ను తగ్గించే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు. వారంలో ఓ రోజు కార్లను ఉపయోగించకుండా ప్రజలను ప్రోత్సహించే సంకల్పంతో బైక్ రైడ్ నిర్వహించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్(ఎక్స్) ఖాతాలో తెలిపారు. తన సొంత నియోజకవర్గమైన కర్నాల్‌లో ఈ ర్యాలీ చేపట్టారు. "कार फ्री डे" हो या "नशामुक्त हरियाणा" बनाने का संकल्प हो बिना जनसहयोग के पूरा नहीं हो सकता! “कार फ्री डे” पर करनाल एयरपोर्ट तक की यात्रा बाइक द्वारा करके, आज के दिन कार ट्रैफिक कम करने का एक छोटा सा प्रयास मेरा भी रहा। मुझे आशा है कि प्रदेश के जागरूक लोग इस सन्देश को आगे… pic.twitter.com/a5DQeDn1ky — Manohar Lal (@mlkhattar) September 26, 2023 ఇదీ చదవండి: బీజేపీ నేతపై లుక్అవుట్ నోటీసులు -
మీరెప్పుడూ చూడని గ్రేట్ ఖలీ రైడింగ్ వీడియో.. ఓ లుక్కేసుకోండి!
Khali Royal Enfield Riding: బాక్సింగ్ గురించి తెలిసినవారికి ప్రత్యేకంగా 'గ్రేట్ ఖలీ' (Great Khali) గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రెజ్లింగ్ అరేనాలో పాల్గొన్న భారతీయ ప్రముఖులలో ఒకరిగా నిలిచిన ఈయన రిటైర్ అయిన తరువాత ఇండియాకి తిరిగి వచ్చేసాడు. అప్పటి నుంచి కొన్ని టీవీ యాడ్స్‌లో నటించడం, 2015లో పంజాబ్‌లో కాంటినెంటల్ రెజ్లింగ్ స్కూల్ ప్రారంభించడం వంటివి చేసి కాలం గడుపుతున్నారు. ఇటీవల ఖలీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇన్స్టాగ్రామ్ వేదికగా విడుదలైన ఒక వీడియోలో ఖలీ 'రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్' నడపడం చూడవచ్చు. ఈ సంఘటన చూడటానికి బొమ్మ బైకుపై ఆజానుబాహుడున్నట్లు అనిపిస్తుంది. ఈ వీడియోకు ఎలాంటి క్యాప్షన్ ఇవ్వలేదు. అత్యంత బరువైన బైకుల్లో ఒకటైన బుల్లెట్ ఖలీ ముందు చిన్న బైకుగా మారిపోయింది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇప్పటికే లక్షల మంది దీనిని లైక్ చేశారు. కొంత మంది నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఖలీ బైకుని రైడ్ చేస్తూ కనిపించడం ఇదే మొదటిసారి కాదు, గతంలో ఇంటర్‌సెప్టర్ 650, బుల్లెట్, హీరో స్ప్లెండర్, బజాజ్ పల్సర్ వంటి వాటిని రైడ్ చేస్తూ కూడా కనిపించాడు. ఇదీ చదవండి: ఏం ఐడియా గురూ! డ్రైవర్ క్రియేటివిటీకి ఫిదా అవుతున్న ప్యాసింజర్లు.. నిజానికి ఖలీ ఎత్తు 7 అడుగుల కంటే ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఏ బైకైనా అతని పరిణామంతో పోలిస్తే మరగుజ్జు మాదిరిగా కనిపిస్తుంది. బైకులు మాత్రమే కాకుండా ఆయన వద్ద టయోటా ఫార్చ్యూనర్, టయోటా గ్లాంజా వంటి కార్లను కలిగి ఉన్నప్పటికీ.. అతని పరిమాణానికి అనుకూలంగా కస్టమైజ్ చేసినట్లు సమాచారం. View this post on Instagram A post shared by The Great Khali (@thegreatkhali) -
ర్యాపిడో డ్రైవర్ రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై రావడమేంటి?.. బుక్ చేసిన టెకీకి వింత అనుభవం!
బెంగళూరుకు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ ర్యాపిడోలో రైడ్ బుక్ చేశాడు. కొంతసేపటికి ర్యాపిడో డ్రైవర్ రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ మోటార్‌సైకిల్‌పై రావడంతో ఆ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఎంతో ఆనందపడిపోయాడు. అయితే అతని ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఆ ర్యాపిడో డ్రైవర్ గురించి తెలుసుకున్న అతను కంగుతిన్నాడు. నిషిత్ పటేల్ తన ర్యాపిడో రైడ్ అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కుబెర్నెట్స్ మీట్అప్కు వెళ్లేందుకు అతను ర్యాపిడో రైడ్ బుక్ చేశాడు. ఆ సమయంలో తనకు ఎదురైన అనుభవం ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆయన పేర్కొన్నాడు. ఆ ర్యాపిడో డ్రైవర్ హై ఎండ్ మోటార్ సైకిల్‌పై రావడంతోపాటు, అతనొక నూతన టెక్నాలజీని రూపొందించే ఇంజినీర్ అని తెలిసేరికి అతను కంగుతిన్నాడు. పైగా అతను తాను పనిచేస్తున్న కుబెర్నెట్స్ క్లస్టర్ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించే కంపెనీలో పనిచేస్తుంటాడని తెలిసే సరికి నిషిత్ పటేల్ షాకయ్యాడు. ఈ పోస్టుకు 6 వేలకు పైగా వ్యూస్ దక్కడంతో పాటు యూజర్స్ నుంచి లెక్కకుమించిన కామెంట్స్ వస్తున్నాయి. ఒక యూజర్ ‘మీరు అతని సైడ్ బిజినెస్ టర్నోవర్ ఎంతో అడగాల్సింది’ అని నిషిత్‌ను అడగగా, ‘అవును ఆ తరువాత నా మదిలో అదే ప్రశ్న వచ్చిందని’ నిషిత్ తెలిపారు. మరో యూజర్ ‘అయితే ఏమైంది? అహ్మదాబాద్‌లో ఉన్నత విద్యాధికులు ఎన్నో ఏళ్లుగా ఓలా, ఉబర్, ర్యాపిడోలను నడుపుతున్నారు’ అని కామెంట్ చేశారు. ఇది కూడా చదవండి: పురావస్తు తవ్వకాల్లో విచిత్ర అద్దం.. అది అట్టాంటి ఇట్టాంటిది కాదట! You won't believe the crazy @peakbengaluru moment I had today! On my way to a Kubernetes meetup, my Rapido captain pulled up on a Royal Enfield Hunter. Turns out he's a DevOps engineer at a company managing enterprise Kubernetes clusters. Just another day in India's tech capital — Nishit Patel (@nishit130) August 5, 2023 -
‘థాంక్యూ మోదీజీ’.. కశ్మీర్ యువతి బైక్ రైడ్ వీడియో వైరల్
శ్రీనగర్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ కశ్మీర్ అంశాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆర్టికల్ 370ను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కశ్మీర్లో శాంతి నెలకొల్పడమే తమ లక్ష్యమని మోదీ సర్కార్ స్పష్టం చేస్తూ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక, ఆర్టికల్ రద్దు అనంతరం, జమ్మూ కశ్మీర్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇక, కశ్మీర్లో ఆర్టికల్ 370, 35A రద్దు తర్వాత శ్రీనగర్‌లో తమకు ఎంతటి ఆహ్లాదకర పరిస్థితులు ఉన్నాయో ఓ యువతి ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చింది. దీంతో, ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాల ప్రకారం.. శ్రీనగర్‌లో ఓ యువతి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నడుపుతూ రోడ్లపై ఎంజాయ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ క్రమంలోనే ఆమె ‘ఈరోజు నేను గర్వంగా చెప్పాలనుకుంటున్నాను.. నా కశ్మీర్ అబ్బాయిలకే కాదు.. మనలో కూడా చాలా మారిపోయింది. 370, 35A రద్దుకు ముందు ఇది సాధ్యం కాలేదు. భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు’ అంటూ కామెంట్స్ చేసింది. ఇక, ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. Today I proudly wanna to say that my #Kashmir has changed a lot not only for the boys but also for Us. It was not possible before abrogation of 370 & 35A. Thank you GOI. pic.twitter.com/5zU9vgUAoL — Nusrat Fatima (@knusrata) August 4, 2023 మరోవైపు.. ఈ వీడియోపై కశ్మీర్ యువకులు స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వీడియోను పోలీసులకు షేర్ చేస్తూ అబ్బాయిలకే ట్రాఫిక్ రూల్స్ వర్తిస్తాయా? అమ్మాయిలకు వర్తించవా? అని ప్రశ్నించారు. దీంతో, పోలీసులు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించనందుకు జరిమానా విధించినట్టు స్పష్టం చేశారు. Action taken under relevant sections of MV Act. Violator also counseled not to repeat such acts. pic.twitter.com/To30U8FaiB — Traffic City Srinagar. (@SSPTFCSGR) August 4, 2023 ఇది కూడా చదవండి: నోర్మూయ్, ఎక్కువ మాట్లాడితే మర్యాదగా ఉండదు.. మెట్రోలో లేడీస్ లొళ్లి -
ఇక ఎలక్ట్రిక్ బుల్లెట్ బండి.. ప్రకటించిన రాయల్‌ఎన్‌ఫీల్డ్
రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్‌సైకిళ్ల తయారీ సంస్థ ఐషర్ మోటార్స్ రాబోయే రెండేళ్లలో భారతదేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేయాలని చూస్తోంది. ఇందుకోసం కోసం 1,50,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో సిద్ధార్థ లాల్ తెలిపారు. ఉత్పత్తి మాడ్యులర్ పద్ధతిలో క్రమంగా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. గుర్గావ్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ భారతదేశంలో ప్రీమియం మోటార్‌సైకిల్ విభాగంలో 90 శాతం వాటాతో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల విభాగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైన రాయల్ ఎన్ఫీల్డ్ తమ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ మార్కెట్ అవసరాలను అంచనా వేయడానికి ఒక వాణిజ్య బృందాన్ని నియమించినట్లు తెలిపింది. ప్రస్తుతం ప్రోటోటైప్‌ను పరీక్షిస్తున్నామని, రెండేళ్లలో సరికొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేస్తామని సిద్ధార్థ లాల్ వెల్లడించారు. భారతదేశంలో మిడ్-వెయిట్ మోటార్‌సైకిళ్ల మార్కెట్ వేగంగా పెరుగుతోందని చెప్పారు. కంపెనీ గత త్రైమాసికంలో 225,368 రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్‌సైకిళ్లను విక్రయించిందని, ఇది ఏడాది క్రితంతో పోలిస్తే 21 శాతం పెరిగిందని ఆయన వివరించారు. ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ కంపెనీలు హీరో మోటోకార్ప్, హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా), బజాజ్ ఆటో రాబోయే నెలల్లో దాదాపు డజను మిడ్-వెయిట్ మోటార్‌సైకిళ్లను రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీగా తీసుకొస్తున్నాయి. గత నెలలో బజాజ్-ట్రయంఫ్ భారతదేశంలో రెండు 400సీసీ మోడళ్లను విడుదల చేసింది. అలాగే హార్లే డేవిడ్సన్తో కలిసి హీరో మోటర్ కార్ప్ అభివృద్ధి చేసిన X440 బైక్ డెలివరీలను త్వరలో ప్రారంభించాలని భావిస్తోంది. -
బైక్‌కు గుడి కట్టించి పూజలు - సినిమాను తలపించే ఇంట్రెస్టింగ్ స్టోరీ!
ఎక్కడైనా దేవునికి గుడి కట్టి పూజలు చేయడం ఆనవాయితీ.. హిందూ సంప్రదాయం ప్రకారం పంచ్ భూతాలను కూడా పూజిస్తారు. అయితే వీటన్నింటికి భిన్నంగా రాజస్థాన్‌లో ఒక 'బైకు'కి గుడి కట్టి పూజలు చేస్తున్నారు. ఇంతకీ ఆ బైకుకి ఎందుకు గుడి కట్టారు. దీని వెనుక ఉన్న అసలు కథ ఏమిటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, 1980 చివరలో 'ఓం సింగ్ రాథోడ్' అనే యువకుడు తనకు ఎంతగానో ఇష్టమైన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మోటార్‌సైకిల్‌పై ప్రయాణించేటప్పుడు ఒక చెట్టుకు ఢీ కొట్టి ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన పాలీ జిల్లాలోని చోటిలా గ్రామ సమీపంలో జరిగింది. బుల్లెట్ బాబా.. ప్రమాదం జరిగిన తరువాత పోలీసులు ఆ బైకుని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. అయితే ఆశ్చర్యకరంగా ఆ బుల్లెట్ బైక్ మరుసటి రోజు వెళ్లి ప్రమాదం జరిగిన చోటుకే చేరినట్లు తెలిసింది. ఇది ఎవరో ఆకతాయిల పని అని భావించి పోలీసులు మళ్ళీ ఆ బైకుని స్టేషన్‌కి తీసుకెళ్లారు. మళ్ళీ మునుపటి మాదిరిగానే ప్రమాదం జరిగిన చోటుకే చేరింది. ఈ సంఘటన మొదట్లో అందరిని భయానికి గురిచేసింది. ఆ తరువాత ఇందులో ఏదో దైవత్వం ఉందని గ్రహించి స్థానికులు ఓం సింగ్ రాథోడ్‌కు నివాళులర్పించాలని నిర్ణయించుకున్నారు. ఓం సింగ్ రాథోడ్ ఆత్మ బుల్లెట్ బైకు మీద తిరుగుతుందని భావించి స్థానికులు ప్రమాదం జరిగిన స్థలాన్నే స్థానికులు దేవాలయంగా మార్చారు. ఆ ప్రదేశంలో బుల్లెట్ బైకుకి పూజలు చేయడం ప్రారంభించారు. బుల్లెట్ మోటార్‌సైకిల్‌కు ఓం సింగ్ రాథోడ్ గౌరవార్థం 'బుల్లెట్ బాబా' అని పేరు పెట్టారు. ప్రతి రోజూ ఎంతో మంది భక్తులు ఈ మందిరాన్ని దర్శించి ప్రార్థనలు చేస్తుంటారు. (ఇదీ చదవండి: ఒకప్పుడు రూ. 10 వేల జీతానికి ఉద్యోగం.. ఇప్పుడు కోట్ల సామ్రాజ్యం - ఒక టీచర్ కొడుకు సక్సెస్ స్టోరీ..) ఈ బుల్లెట్ బాబా ఆలయంలో అగరవత్తులు వెలిగించడం, మోటార్ సైకిల్ చుట్టూ ప్రదక్షిణలు చేయడం, మద్యం పోయటం వంటివి అక్కడి ఆచారం. ఈ విధంగా చేస్తే భక్తులకు ప్రయాణ సమయంలో ఎటువంటి ప్రమాదాలు జరగవని ఘాడంగా విశ్వసిస్తారు. ఈ గుడికి కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి కూడా భక్తులు, సందర్శకులు వస్తుంటారు. కొంతమంది మోటార్‌సైకిల్‌దారులు, సాహస యాత్రికులు మరియు ఆధ్యాత్మిక ఔత్సాహికులు తమ ప్రయాణ ప్రయాణంలో భాగంగా ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తుంటారు. (ఇదీ చదవండి: ఆ రెండు యాప్స్ ఉంటే మీ వివరాలు చైనాకే.. వెంటనే డిలీట్ చేయండి!) View this post on Instagram A post shared by Royalenfieldholic® 𝟮𝟬𝟬𝗸🎯 (@royalenfieldholic) -
రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మరో బైక్ - లాంచ్ ఎప్పుడంటే?
Royal Enfield Scram 440: దేశీయ టూ వీలర్ దిగ్గజం 'రాయల్ ఎన్ఫీల్డ్' (Royal Enfield) మార్కెట్లో మరో సరికొత్త మోడల్ విడుదల చేయడానికి సన్నద్ధమైంది. ఈ బైక్ వచ్చే సంవత్సరానికి భారతీయ విఫణిలో విడుదలయ్యే అవకాశం ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, రాయల్ ఎన్ఫీల్డ్ విడుదల చేయనున్న కొత్త బైక్ స్క్రామ్ 440 మోడల్ అవుతుందని సమాచారం. అంటే ఇది ఇప్పటికే మార్కెట్లో స్క్రామ్ ఆధారంగా తయారయ్యే అవకాశం ఉంది. ఇది 411 సీసీ ఇంజిన్ కలిగి ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ ఇంజిన్ ఇప్పటికే స్క్రామ్ 411లో ఉంది. (ఇదీ చదవండి: రైతుగా మారిన బ్యాంక్ ఎంప్లాయ్.. వేలమందికి ఉపాధి - రూ. కోట్లలో టర్నోవర్!) ఈ బైక్ డిజైన్, ఫీచర్స్ వంటివి అధికారికంగా విడుదలకాలేదు, త్వరలో అందుబాటులో ఉండే అవకాశం ఉందని భావిస్తున్నాము. ఈ బైక్ స్క్రామ్ సబ్-బ్రాండ్ క్రింద ఉంటుంది. అయితే హిమాలయన్ బైక్ కంటే కూడా తక్కువ ధర వద్ద ఉంటుందని తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఇండియన్ మార్కెట్లో విడుదలకానున్న బైకుల జాబితాలో రాయల్ ఎన్ఫీల్డ్ మాత్రమే కాకుండా యమహా, హోండా వంటి కంపెనీలు కూడా ఉన్నాయి. ఇవన్నీ వారి పరిధిని విస్తరిస్తూ దేశంలో ఉనికిని మరింత చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. -
బంగారు బుల్లెట్.. ఆఖరికి సైలెన్సర్ కూడా..
Gold Colour Royal Enfield: భారతదేశంలో రాయల్ ఎన్ఫీల్డ్ బైకులకున్న క్రేజు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ కంపెనీ బైకులను యువకుల దగ్గర నుంచి పెద్ద వారి వరకు చాలా మంది ఇష్టపడతారన్నది అందరికి తెలిసిన వాస్తవం. అయితే కొంత మంది ఈ బైక్ ప్రేమికులు వారికి కావలసిన రీతిలో మోడిఫైడ్ చేసుకుంటారు. ఇలాంటి నేపథ్యంలో భాగంగా ఒక వ్యక్తి తన బైకుని గోల్డెన్ బుల్లెట్ మాదిరిగా రూపొందించుకున్నాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రాయల్ బుల్లెట్ 5577 అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెలువడిన వీడియోలో మీరు గమనిస్తే ఈ గోల్డ్ బుల్లెట్ ఎలా ఉందో స్పష్టంగా తెలుస్తుంది. పేరుకి గోల్డ్ బుల్లెట్ అయినా ఇది బంగారంతో తయారు కాలేదు. గోల్డ్ పెయింట్ స్కీమ్ మాత్రమే పొందింది. అందులో కూడా బైక్ కలర్ అలాగే ఉంది, అక్కడక్కడా గోల్డ్ షేడ్స్ చూడవచ్చు. ఇది బుల్లెట్ 350సీసీ బైక్ కావడం గమనార్హం. నిజానికి గోల్డ్ కలర్ స్కీమ్ పొందే వాహనాలు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కనిపించే గోల్డ్ కలర్ బుల్లెట్.. టర్న్ ఇండికేటర్స్, హెడ్‌ల్యాంప్ కవర్, నంబర్ ప్లేట్, ఫ్రంట్ ఫోర్క్ కవర్ ఎగువ భాగంలో చూడవచ్చు. అంతే కాకుండా ఫుట్‌రెస్ట్‌లు, క్లచ్, లివర్, ఓడోమీటర్ అన్నీ గోల్డెన్ షేడ్‌లో ఉన్నాయి. ఇక ఈ బైక్ హ్యాండిల్‌బార్‌పై ఛత్రపతి శివాజీ మహారాజ్ చిన్న బొమ్మ లాంటిది చూడవచ్చు. ఇది కూడా గోల్డెన్ షేడ్‌లోనే ఉంది. (ఇదీ చదవండి: వయసు 11.. సంపాదన వందల కోట్లు - చిన్నారి సక్సెస్ స్టోరీ!) గోల్డెన్ బుల్లెట్ రైడ్ చేసే వ్యక్తి కూడా బైకుకి తగిన విధంగా బంగారు ఉంగరాలు, బ్రాస్లెట్, వాచ్ వంటివి ధరించాడు. ఈ బైక్ సైలెన్సర్ కూడా బంగారు రంగులోనే ఉంది. ఈ మోటార్‌సైకిల్‌కి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియావైలో వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: 750సీసీ విభాగంలో రాయల్ బండి.. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకపై ఇంకో లెక్క!) ఈ గోల్డెన్ బైక్ గోల్డెన్ మ్యాన్ అని పిలువబడే మహారాష్ట్ర పూణే సమీపంలోని పింప్రి-చించ్వాడ్ ప్రాంతానికి చెందిన 'సన్నీ వాఘురే' అనే వ్యక్తికి సంబంధించినదని తెలుస్తోంది. గతంలో కేరళకు చెందిన వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్ అనే వ్యక్తి ఏకంగా గోల్డ్ కలర్ రోల్స్ రాయిస్ టాక్సీగా ఉపయోగిస్తున్నాడు. View this post on Instagram A post shared by Amit Raviraj Shinde (@royal_bullet_5577) -
750సీసీ విభాగంలో రాయల్ బండి.. ప్రత్యర్థులకు గట్టి షాక్!
Royal Enfield 750cc Bike: కుర్రకారుని ఉర్రూతలూగిస్తున్న 'రాయల్ ఎన్ఫీల్డ్' (Royal Enfield) ఇప్పటికే 350సీసీ, 650 సీసీ విభాగంలో తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. అయితే ఇప్పుడు 750సీసీ విభాగంలో తన హవా నిరూపించుకోవడం కోసం సన్నాహాలు సిద్ధం చేస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ఆధునిక కాలంలో వాహన వినియోగదారులు అధిక పనితీరు కలిగిన బైకులను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ 750 సీసీ విభాగంలో తన సత్తా చాటుకోవడమే కాకుండా, వినియోగదారులకు మరింత చేరువ కావడానికి దేశీయ దిగ్గజం ప్రయత్నిస్తోంది. కంపెనీ ఈ లేటెస్ట్ బైకుని 2025 నాటికి భారతీయ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. కొత్త బైక్ కోడ్‌నేమ్ ట్విన్-సిలిండర్ ఇంటర్‌సెప్టర్ 650తో ఎంతోమందికి బైక్ ప్రేమికులను ఆకర్శించిన రాయల్ ఎన్ఫీల్డ్ 750సీసీ స్పేస్‌లోకి ప్రవేశించాలని యోచిస్తూ 'ఆర్' (R) కోడ్‌నేమ్‌తో ప్లాట్‌ఫామ్ అభివృద్ధి చేయనుంది. భారతదేశంలో మాత్రమే కాకుండా.. ఉత్తర అమెరికా, యూరప్, యునైటెడ్ కింగ్డమ్తో సహా వివిధ మార్కెట్లలో ప్రవేశించడానికి ఆసక్తి చూపుతోంది. ఇందులో R2G - 750cc బాబర్ మోటార్‌సైకిల్ అనే సంకేతనామం కలిగిన ప్రాజెక్ట్ మొదటిది. UKలోని లీసెస్టర్‌లోని టెక్ సెంటర్లో లీడ్ డెవలప్మెంట్ జరుగుతోంది. ఇది దశాబ్దాలుగా రాయల్ ఎన్ఫీల్డ్ పోర్ట్‌ఫోలియోలో అతిపెద్ద మోటార్‌సైకిల్‌గా అవతరించే అవకాశం ఉంది. (ఇదీ చదవండి: విడుదలకు ముందే అంచనాలు దాటేస్తున్న హోండా ఎలివేట్ - బుకింగ్స్) నిజానికి రాబోయే 750 సీసీ బైక్ ఇప్పటికే మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తున్న ట్విన్-సిలిండర్ 650 సీసీ ఇంజన్ పునరావృతం. అయితే ఇప్పుడు ఈ ఇంజిన్‌తో ఏ బైక్ వస్తుంది, దాని వివరాలు ఏమిటి అనే మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కానీ బహుశా 750 సీసీ విభాగంలో విడుదలయ్యే రాయల్ ఎన్ఫీల్డ్ 'బాబర్' అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
అమ్మకాల్లో దూసుకెళ్తున్న రాయల్ ఎన్ఫీల్డ్!
ప్రముఖ లగ్జరీ ద్విచక్రవాహనాల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ దేశీయ మార్కెట్లో అమ్మకాల్లో దూసుకెళ్తుంది. జూన్ నెలలో 26శాతం వృద్దిని సాధించి 77,109 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది జూన్‌లో 61,407 బైక్స్ అమ్మింది. భారత్‌లో రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలు ఏడాది క్రితం 50,265 యూనిట్లు అమ్ముడు పోగా..ఈ ఏడాది 34 శాతం పెరిగి 67,495 అమ్మినట్లు రాయల్ ఎన్ఫీల్డ్ ప్రతినిధులు తెలిపారు. అయితే ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. 2022 జూన్ లో 11,142 యూనిట్లను ఎగుమతి చేయగా.. గత నెలలో వాటి సంఖ్య 9,614 యూనిట్లతో సరిపెట్టుకుంది. ఈ సందర్భంగా రాయల్ ఎన్ ఫీల్డ్ సీఈఓ బీ గోవింద రాజన్ మాట్లాడుతూ.. ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన మోటారు సైకిళ్లతో తాము దేశీయంగా, గ్లోబల్ మార్కెట్లలో మంచి సేల్స్ నమోదు చేశామని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ బైక్ లవర్స్‌ను ఆకట్టుకుంటాయని భావిస్తున్నట్లు తెలిపారు. -
Evolution Of Royal Enfield Bikes: రాయల్ ఎన్ఫీల్డ్ సుదీర్ఘ చరిత్ర - ఆసక్తికరమైన ఫోటోలు
-
ఫాక్స్‌కాన్ రంగంలోకి: రాయిల్ ఎన్ఫీల్డ్, ఓలా ఏమైపోవాలి?
ప్రపంచంలోనే అతిపెద్ద యాపిల్ ఐఫోన్ తయారీ ఫాక్స్‌కాన్ భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోందట. ఈమేరకు ప్రస్తుతం పలు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. దీంతో ఈ-బైక్ మార్కెట్లో రానున్నకాలంలో కొత్త ఎలక్ట్రిక్ బైక్‌లను రిలీజ్ చేయాలని భావిస్తున్న ఓలా ఎలక్ట్రిక్, రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థలకు గట్టి పోటీ ఇవ్వనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, యాపిల్ ఐఫోన్ తయారీదారు తన వార్షిక నివేదికలో ఆగ్నేయాసియాలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ప్లాంట్‌ను స్థాపించడానికి కంపెనీకి సహాయం చేస్తుందని పేర్కొంది. దీనిపై ఫాక్స్‌కాన్ ఎగ్జిక్యూటివ్‌లతో చర్చించడానికి భారతీయ ప్రతినిధి బృందం త్వరలో తైవాన్ను సందర్శించాలని యోచిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. అయితే పలు బ్రాండ్ ఎలక్ట్రిక్ టూవీలర్స్‌ను తయారు చేస్తుందా లేదా జాయింట్ వెంచర్ ద్వారా ఒకే బ్రాండ్‌కు పరిమితమవుతుందా అనేది స్పష్టత లేదు. (టీసీఎస్‌కు భారీ ఎదురుదెబ్బ: బిగ్ డీల్ నుంచి ట్రాన్సామెరికా ఔట్!) కాగా ఇప్పటికే తమిళనాడులో పెద్ద ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్న ఫాక్స్‌కాన్ మహారాష్ట్రలో కూడా ఈవీ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి ఆసక్తిగా ఉంది. అటు తెలంగాణపై కూడా దృష్టి సారిస్తోన్న సంగతి తెలిసిందే. (అమెరికా గుడ్ న్యూస్: వీలైనన్ని ఎక్కువ వీసాలిచ్చేందుకు తీవ్ర కృషి!) -
రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మరో నాలుగు బైకులు - ప్రత్యర్థుల పని అయిపోయినట్టేనా?
Upcoming Royal Enfield Bikes: ద్విచక్ర వాహన విభాగంలో భారతీయ మార్కెట్లో 'రాయల్ ఎన్ఫీల్డ్' (Royal Enfield) బైకులకున్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పటి నుంచి కూడా ఈ బైకులకు డిమాండ్ భారీగా ఉంది. ఇప్పటికే క్లాసిక్ 350, మీటియోర్ 350, ఇంటర్‌సెప్టర్ 650, హిమాలయన్ విక్రయాలతో శరవేగంగా ముందుకు దూసుకెళ్తున్న సంస్థ త్వరలో మరో నాలుగు బైకులు విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. కంపెనీ ఈ ఏడాది విడుదల చేయనున్న ఈ నాలుగు బైకుల గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 గత కొన్ని రోజులుగా సంస్థ హిమాలయన్ 450 విడుదల చేయనున్నట్లు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కంపెనీ కూడా ఈ మోడల్ మీద పనిచేస్తున్నట్లు సమాచారం. ఇందులో 450 సీసీ ఇంజిన్ ఉండే అవకాశం ఉండండి నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ ఏడాది దీపావళి నాటికి రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 రాయల్ ఎన్ఫీల్డ్ అనగానే చాలామందికి మొదట గుర్తొచ్చే బైక్ బుల్లెట్. బైక్ రైడర్ల మనసులో అంతగా ఈ పేరు పాతుకుపోయింది. అయితే ఈ బైక్ త్వరలోనే కొత్త వెర్షన్‌గా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ న్యూ జనరేషన్ బుల్లెట్ 350 క్లాసిక్ మాదిరిగా కాకుండా కొంత లేటెస్ట్ డిజైన్ పొందుతుందని సమాచారం. (ఇదీ చదవండి: 1986లో రాయల్ ఎన్ఫీల్డ్ ధర ఇంత తక్కువా? వైరల్ అవుతున్న బిల్!) రాయల్ ఎన్ఫీల్డ్ షాట్‌గన్ 650 ప్రస్తుతం 350 సీసీ విభాగంలో మాదిరిగానే 650 విభాగంలో కూడా విడుదలయ్యే వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇప్పటికే ఈ విభాగంలో ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ జిటి 650 వంటివి ఉన్నాయి. కాగా ఈ విభాగంలో కంపెనీ షాట్‌గన్ 650 విడుదలకానున్నట్లు సమాచారం. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ బాబర్ 350 జావా కంపెనీ మార్కెట్లో విక్రయిస్తున్న బాబర్ బైక్ గురించి వినే ఉంటారు. అయితే ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ క్లాసిక్ బాబర్ 350 పేరుతో ఒక కొత్త బికా విడుదల చేయడానికి సన్నద్ధమైపోయింది. ఈ బైక్ గురించి ప్రస్తుతానికి అధికారిక వివరాలు వెల్లడి కాలేదు, కానీ ఈ ఏడాది మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. -
మా ఎలక్ట్రిక్ బైక్‌లు మామూలుగా ఉండవు: రాయల్ ఎన్ఫీల్డ్ సీఈవో
రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) ప్రత్యేకమైన, విభిన్నమైన ఎలక్ట్రిక్ బైక్‌లను అభివృద్ధి చేస్తోందని ఆ కంపెనీ సీఈవో గోవిందరాజన్ తెలిపారు. వీటిని అభివృద్ధి చేయడానికి ఇప్పటికే పెట్టుబడి పెట్టడం ప్రారంభించామని, చెన్నై ప్లాంట్ పరిధిలో సప్లయర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ‘ఈవీ ప్రయాణంలో, మేము స్థిరమైన పురోగతిని సాధిస్తున్నాం. రాయల్ ఎన్ఫీల్డ్ ఈవీ ప్రయాణం ఇప్పుడు టాప్ గేర్‌లో ఉందని నేను చెప్పగలను. బలమైన రాయల్ ఎన్ఫీల్డ్ డీఎన్ఏతో ప్రత్యేకంగా విభిన్నమైన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను రూపొందించడమే మా లక్ష్యం’ అని విశ్లేషకులతో సమావేశంలో గోవిందరాజన్ పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలపై బలమైన దీర్ఘకాలిక ఉత్పత్తి, సాంకేతికత రోడ్‌మ్యాప్‌ను రూపొందించామని, సప్లయర్ వ్యవస్థను అభివృద్ధి చేయడంపై ప్రస్తుతం దృష్టి పెడుతున్నామని వెల్లడించారు. దేశీయ మార్కెట్లో నెట్వర్క్ విస్తరణ గురించి మాట్లాడుతూ కంపెనీ ప్రస్తుతం దేశమంతటా దాదాపు 2,100 రిటైల్ అవుట్లెట్లను కలిగి ఉందని వివరించారు. రూ.1000 కోట్ల పెట్టుబడి ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఇతర అంశాలపై దృష్టి సారించిన రాయల్ ఎన్ఫీల్డ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.1,000 కోట్ల క్యాపెక్స్‌ను ప్రకటించింది. ఇందులో కొంత భాగం ప్రస్తుత పెట్రోల్ బైక్‌ల తయారీ, కొత్త వాటి అభివృద్ధికి వినియోగించనున్నట్లు పేర్కొంది. ఇదీ చదవండి: FAME 2 SUBSIDY: ఎలక్ట్రిక్ బైక్‌లు కొనేవారికి బ్యాడ్ న్యూస్.. సబ్బిడీకి కోత పెట్టే యోచనలో ప్రభుత్వం! -
సూపర్ మీటియోర్ 650 ధరలు పెంచిన రాయల్ ఎన్ఫీల్డ్ - వివరాలు
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'రాయల్ ఎన్ఫీల్డ్' (Royal Enfield) ఇప్పటికే తన 'సూపర్ మీటియోర్ 650' బైకుని లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే కంపెనీ ఈ బైక్ ధరలను ఇప్పుడు ఒక్క సారిగా రూ. 5000 వరకు పెంచింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కంపెనీ ఈ సూపర్ మీటియోర్ 650 ధరలను పెంచిన తరువాత ఈ బైక్ ప్రారంభ ధర రూ. 3.54 లక్షలు. ఇది ఆస్ట్రల్, ఇంటర్స్టెల్లార్, సెలెస్టియన్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు కూడా రూ. 5వేలు పెరిగాయి. కావున ఈ బైక్స్ కొనాలనుకునే కస్టమర్లు కొత్త ధరలకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. బేస్ వేరియంట్ అయిన ఆస్ట్రల్ మూడు సింగిల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి బ్లాక్, బ్లూ అండ్ గ్రీన్ కలర్స్. ఇక మిడ్ స్పెక్ వేరియంట్ ఇంటర్స్టెల్లార్ రెండు వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది. అవి గ్రే, గ్రీన్ అనే డ్యూయెల్ కలర్స్. డిజైన్ విషయానికి వస్తే మొదటి రెండు వేరియంట్లు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. అయితే టాప్ వేరియంట్లో మాత్రం పెద్ద ఫ్రంట్ స్క్రీన్, టూరింగ్ సీట్, పిలియన్ బ్యాక్ రెస్ట్ వంటి అదనపు యాక్ససరీస్ లభిస్తాయి. రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మీటియోర్ 650 బైకులో 648 సిసి ప్యారలల్ ట్విన్ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 47 bhp పవర్, 52.3 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్ పొందుతుంది. కావున పనితీరుపరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది. (ఇదీ చదవండి: కొంప ముంచిన గూగుల్ మ్యాప్.. నేరుగా సముద్రంలోకి - వీడియో) ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో ట్రిప్పర్ నావిగేషన్, బ్లూ టూత్ కనెక్టివిటీ, USB ఛార్జింగ్ పోర్ట్ వంటివి ఉంటాయి. ఈ బైక్ ముందు భాగంలో 320 మిమీ డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో 300 మిమీ డిస్క్ బ్రేక్ ఉంటాయి. ఈ బైక్ సీటు ఎత్తు భూమి నుంచి 650 మిమీ. 241 కేజీల బరువు కలిగిన ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 15.7 లీటర్లు. కావున లాంగ్ రైడ్ చేయడానికి ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది. -
1986లో రాయల్ ఎన్ఫీల్డ్ ధర ఇంత తక్కువా? వైరల్ అవుతున్న బిల్!
ఆధునిక కాలంలో ఎక్కువ మంది యువకులు ఇష్టపడే బైకులలో 'రాయల్ ఎన్ఫీల్డ్' ప్రధానంలో చెప్పుకోదగ్గవి. రాయల్ ఎన్ఫీల్డ్ బైకులకు ఉన్న చరిత్ర అంతా.. ఇంతా కాదు. గతంలో తక్కువ తక్కువ సంఖ్యలో వినియోగంలో ఉన్నప్పటికీ.. ఇప్పుడు రోడ్డుపై విరివిగా కనిపిస్తున్నాయి. భారతీయ మార్కెట్లో రాయల్ ఎన్ఫీల్డ్ ధరలు ఇప్పుడు రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల కంటే ఎక్కువ ధర వద్ద లభిస్తున్నాయి. అయితే 1986లో రాయల్ ఎన్ఫీల్డ్ ధర కేవలం రూ. 18,700 మాత్రమే కావడం గమనార్హం. దీనికి సంబంధించిన బిల్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాయల్ ఎన్ఫీల్డ్ 4567k ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడైన పోస్ట్ చూస్తే 1986లో రాయల్ ఎన్ఫీల్డ్ ధర ఎలా ఉందొ తెలిసిపోతుంది. ఈ బిల్ కూడా M/s R S ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ పేరు మీద ఉంది. ఇందులో ఈ బైక్ ధర రూ. 18,800 అని, రూ. 250 డిస్కౌంట్ లేదా ఇతరత్రా కారణాల వల్ల తగ్గించడం వల్ల దీని ధర రూ. 18,700 అని స్పష్టమవుతోంది. అప్పటి ధరలతో పోల్చుకుంటే ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ ధరలు సుమారు పది రెట్లు ఎక్కువని తెలుస్తోంది. ప్రస్తుతం స్టాండర్డ్ బుల్లెట్ 350 ఆన్-రోడ్ ధర సుమారు రూ .1.7 లక్షల వరకు ఉంది. 1901లో 'ఇంగ్లాండ్'లోని వోర్సెస్టర్ షైర్, రెడ్దిచ్ కు చెందిన కంపెనీ తమ మొదటి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ తయారు చేసింది. ఆ తరువాత భారతీయ కార్ల తయారీ సంస్థ ఐషర్ మోటార్స్ లిమిటెడ్ లో భాగమైన భారత సంతతికి చెందిన మద్రాస్ మోటార్స్ రాయల్ ఎన్ఫీల్డ్ నుండి లైసెన్స్ పొందింది. రాయల్ ఎన్ఫీల్డ్ గత కొన్ని సంవత్సరాలుగా నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన మొదట్లో ఎక్కువగా రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను వాడేవారు. 1954లోనే ప్రభుత్వం 800 యూనిట్ల 350 సిసి బైకులను కొనుగోలు చేసింది. దీన్ని బట్టి చూస్తే అప్పట్లోనే ఈ బైక్ ఎంత ఆదరణ పొందిందో అర్థమవుతుంది. రెడ్డిచ్ బిజినెస్ భారతదేశంలోని 'మద్రాస్ మోటార్స్'తో కలిసి 1955లో "ఎన్ఫీల్డ్ ఇండియా" ను సృష్టించింది, తద్వారా మద్రాసు లైసెన్స్ కింద 350 సిసి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మోటార్ బైక్ ఉత్పత్తి చేసింది. దాదాపు 70 సంవత్సరాలు తరువాత ఏకంగా భారతీయ మార్కెట్లో తిరుగులేని బైకుగా చెలామణి అవుతోంది. ఏడు దశాబ్దాల తరువాత కంపెనీ ఇప్పుడు దేశంలో అత్యంత విజయవంతమైన ద్విచక్ర వాహన బ్రాండ్లలో ఒకటిగా మారింది. View this post on Instagram A post shared by Being Royal (@royalenfield_4567k) -
పవర్ ఫుల్ బైక్ కొనాలనుకుంటున్నారా? ఇదిగో టాప్ 5 బెస్ట్ బైక్స్!
భారతీయ మార్కెట్లో ప్రస్తుతం లక్ష కంటే తక్కువ ధర వద్ద లభించే బైకులు నుంచి అత్యంత ఖరీదైన బైకుల వరకు అందుబాటులో ఉన్నాయి. అయితే మనం ఈ కథనంలో రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల మధ్య లభించే టాప్ 5 బైకుల గురించి తెలుసుకుందాం. కెటిఎమ్ 390 డ్యూక్: ఎక్కువ మంది యువతకు ఇష్టమైన బైకులలో కెటిఎమ్ 390 డ్యూక్ ఒకటి. దీని ధర రూ. 2.96 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ బైక్ 2017 నుంచి చిన్న చిన్న అప్డేట్లను పొందుతూనే ఉంది. కావున అప్పటి నుంచి ఇప్పటి వరకు దీనికున్న ఆదరణ ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ 373సీసీ ఇంజిన్ కలిగి 9000 ఆర్‌పిఎమ్ వద్ద 43.5 పిఎస్ పవర్, 7000 ఆర్‌పిఎమ్ వద్ద 37 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310: ప్రముఖ టూ వీలర్ బ్రాండ్ టీవీఎస్ కంపెనీకి చెందిన అపాచీ ఆర్ఆర్ 310 కూడా ఎక్కువమంది ఇష్టపడే బైకుల జాబితాలో ఒకటి. దీని ధర రూ. 2.72 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ స్పోర్ట్‌బైక్ అద్భుతమైన డిజైన్ కలిగి, ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇందులోని 312.2 సీసీ ఇంజిన్ 33.5 బిహెచ్పి పవర్, 27.3 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. హోండా సిబి300ఆర్: హోండా కంపెనీకి చెందిన సిబి300ఆర్ బైక్ ధర రూ. 2.77 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇందులో 286 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 30.7 బిహెచ్పి పవర్, 27.5 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంతే కాకుండా రైడర్ కు సులువైన క్లచ్ ఆపరేటింగ్ కోసం అసిస్ట్ అండ్ స్లిప్లర్ క్లచ్ వంటివి కూడా ఇందులో లభిస్తాయి. సుజుకీ వీ-స్ట్రోమ్ ఎస్ఎక్స్: మన జాబితాలో మూడు లక్షలకంటే తక్కువ ధర వద్ద లభించే బైకుల జాబితాలో ఒకటి సుజుకీ వీ స్ట్రోమ్ ఎస్ఎక్స్. దీని ధర రూ. 2.12 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ బైక్ 249 సీసీ, 4 స్ట్రోక్,సింగిల్ సిలిండర్, ఆయిల్ కూల్డ్ ఎస్ఓహెచ్సీ ఇంజిన్ పొందుతుంది, కావున మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350: భారతదేశంలో ఎక్కువ ప్రజాదరణ పొందిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ క్లాసిక్ 350. ఈ బైక్ ధర రూ. 1.90 లక్షల నుంచి రూ. 2.21 లక్షల వరకు ఉంటుంది (ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది 349 సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి 6,100 ఆర్‌పిఎమ్ వద్ద 20.3 బిహెచ్పి పవర్, 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది. -
2023 Royal Enfield 650 Twins: రాయల్ ఎన్ఫీల్డ్ 650 బైక్స్ ఇప్పుడు మరింత కొత్తగా
వాహన ప్రేమికులు రోజురోజుకి ఆధునిక ఉత్పత్తులను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ తరుణంలో వాహన తయారీ సంస్థలు కూడా ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను మార్కెట్లో విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 & కాంటినెంటల్ GT 650 బైకులను లేటెస్ట్ అప్డేట్స్తో లాంచ్ చేసింది. ధరలు: దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ ఆధునిక బైకుల ధరలు కలర్ ఆప్సన్స్ మీద ఆధారపడి ఉంటాయి. కాంటినెంటల్ జిటి 650 బైక్ ప్రారంభ ధర రూ. 3.19 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 3.39 లక్షల వరకు ఉంటుంది. ఇక ఇంటర్‌సెప్టర్ 650 ప్రారంభ ధర రూ. 3.03 లక్షలు కాగా, టాప్ ఎండ్ మోడల్ ధర రూ. 3.21 లక్షలు. ధరలు వీటి మునుపటి మోడల్స్ కంటే కొంత ఎక్కువగా ఉంటాయి. కలర్ ఆప్సన్స్: కాంటినెంటల్ జిటి 650 బైక్ రాకర్ రెడ్/బ్రిటీష్ రేసింగ్ గ్రీన్, డక్స్ డీలక్స్, అపెక్స్ గ్రే/స్లిప్‌స్ట్రీమ్ బ్లూ అనే మూడు కలర్ ఆప్సన్స్‌లో లభిస్తుంది. అదే సమయంలో ఇంటర్‌సెప్టర్ 650 విషయానికి వస్తే క్యాన్యన్ రెడ్/కాలి గ్రీన్, బ్లాక్ పెర్ల్/సన్‌సెట్ స్ట్రిప్, బార్సిలోనా బ్లూ/బ్లాక్ రే కలర్స్‌లో లభిస్తుంది. (ఇదీ చదవండి: కియా నుంచి నాలుగు కొత్త కార్లు: సిఎన్జి, 5 సీటర్ ఇంకా..) అప్డేటెడ్ డిజైన్ & ఫీచర్స్: ఆధునిక హంగులతో విడుదలైన రాయల్ ఎన్ఫీల్డ్ 650 బైక్స్ ఇంజిన్, అల్లాయ్ వీల్స్, ఎగ్జాస్ట్, సైడ్ ప్యానెల్ వంటివి బ్లాక్-అవుట్ థీమ్ పొందుతాయి. ఇందులో ఇప్పుడు అల్లాయ్ వీల్స్ చూడవచ్చు. అంతే కాకుండా కొత్త అల్యూమినియం స్విచ్ క్యూబ్స్, ఎల్ఈడీ హెడ్‌లైట్స్ వంటివి ఇందులో కనిపిస్తాయి. యుఎస్బి ఛార్జింగ్ ఆప్సన్ కూడా ఇప్పుడు అప్డేటెడ్ ఫీచర్‌గా వస్తోంది. ట్యూబ్‌లెస్ టైర్స్ ఈ బైకులలో అమర్చారు. ఇంజిన్: అప్డేటెడ్ రాయల్ ఎన్ఫీల్డ్ 650 డిజైన్, ఫీచర్స్ అప్డేట్ పొందినప్పటికీ ఇంజిన్ మాత్రం మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. కాంటినెంటల్ జిటి, ఇంటర్‌సెప్టర్ బైక్ రెండూ 648 సీసీ ప్యారలల్ ఎయిర్/ఆయిల్-కూల్డ్ ఇంజిన్ కలిగి 47.5 హెచ్‌పి పవర్, 52 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. కావున పనితీరులో కూడా ఎటువంటి మార్పులు ఉండే అవకాశం లేదు. (ఇదీ చదవండి: వెహికల్ స్క్రాపింగ్‌పై క్లారిటీ వచ్చేసింది.. చూశారా!) బ్రేకింగ్ & సస్పెన్షన్ సెటప్: భారతీయ మార్కెట్లో 650 సిసి విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ బైకులు బోల్ట్ ట్రస్సింగ్తో ట్యూబులర్ స్టీల్ ఫ్రేమ్‌ను కలిగి 41 మిమీ ఫ్రంట్ ఫోర్క్, వెనుకవైపు డ్యూయల్ కాయిల్-ఓవర్ షాక్‌లు పొందుతుంది. అదే సమయంలో ఈ బైక్స్ ముందు భాగంలో 320 మిమీ డిస్క్ బ్రేక్స్, వెనుక 240 మిమీ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి, డ్యూయెల్ ఛానల్ స్టాండర్డ్‌గా అందుబాటులో ఉంటుంది. -
రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి కొత్త బైక్స్.. వచ్చేస్తున్నాయ్
భారతీయ మార్కెట్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైకులకున్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. గత కొన్ని రోజులుగా కంపెనీ అమ్మకాలు తారా స్థాయిలో చేరుకుంటున్నాయి. 2023 ఫిబ్రవరిలో 71,544 యూనిట్లను విక్రయించి 2022 ఫిబ్రవరి కంటే 20.93 శాతం ఎక్కువ అమ్మకాలను నమోదు చేసింది. అమ్మకాల్లో దూసుకెళ్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ రానున్న రోజుల్లో మరిన్ని కొత్త ఉత్పత్తులను తీసుకురావడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే కంపెనీ లైనప్‌లో హంటర్ 350సీసీ, బుల్లెట్ 350సీసీ, క్లాసిక్ 350సీసీ, మీటియోర్ 350సీసీ, హిమాలయన్, స్క్రామ్ 411, ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ GT 650, మరియు సూపర్ మెటోర్ 650 వంటి తొమ్మిది మోడళ్లు ఉన్నాయి. కంపెనీ కొత్త ప్రణాళికలో భాగంగా రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మరో రెండు 350సీసీ బైకులు విడుదలయ్యే అవకాశం ఉందని నివేదికల ద్వారా తెలుస్తోంది. అవి బుల్లెట్ 350, షాట్‌గన్ 350 బాబర్ బైకులు. అంతే కాకుండా 450 సీసీ విభాగంలో, 650 సీసీ విభాగంలో కొత్త బైకులు విడుదలయ్యే అవకాశం ఉంది. కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350: రాయల్ ఎన్ఫీల్డ్ విడుదల చేయనున్న కొత్త బైక్ ఈ బుల్లెట్ 350. ఇది దాని మునుపటి మోడల్ కంటే అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. మీటియోర్ 350 మాదిరిగానే ఇది కూడా 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో 346 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ పొందనుంది. (ఇదీ చదవండి: బజాజ్ నుంచి అప్డేటెడ్ బైక్స్ విడుదల) రాయల్ ఎన్ఫీల్డ్ షాట్‌గన్ 350 బాబర్: ఇక కంపెనీ విడుదలచేయనున్న మరో కొత్త బైక్ 'రాయల్ ఎన్ఫీల్డ్ షాట్‌గన్ 350 బాబర్'. ఇది కూడా మీటియోర్ 350 మాదిరిగానే అదే ఇంజిన్, పర్ఫామెన్స్ పొందే అవకాశం ఉంది. డిజైన్, ఫీచర్స్ అన్నీ కూడా మునుపటి మోడల్స్ కంటే ఉత్తమంగా ఉంటుంది. దీని ధర రూ. 2 లక్షల వరకు ఉంటుందని అంచనా. -
పాపులర్ హిమాలయన్ బైకులు వెనక్కి: కారణం ఏంటంటే?
అతి తక్కువ కాలంలోనే యువ రైడర్ల మనసు దోచిన రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పుడు సుమారు 5,000 యూనిట్ల హిమాలయన్ బైకులకు రీకాల్ ప్రకటించింది. యుఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (NHTSA) ప్రకారం, శీతాకాలంలో రోడ్లను ట్రీట్ చేయడానికి ఉపయోగించే ఉప్పు బైక్ బ్రేక్ పనితీరు తగ్గిస్తుంది, లేదా మొత్తం నష్టానికి కారణమవుతుందని నివేదించింది. కంపెనీ 2017 - 2021 మధ్య తయారు చేసిన 4,891 యూనిట్ల హిమాలయన్ బైకులు దీనికి ప్రభావయుతమయ్యే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ముందుగానే రీకాల్ ప్రకటించింది. ఇందులో భాగంగానే డీలర్లు ప్రభావిత వాహనాల ముందు, వెనుక బ్రేక్ కాలిపర్లను రీప్లేస్ చేస్తారు. 2021 తర్వాత విడుదలైన బైకులు ఈ సమస్యకు ప్రభవితమయ్యే అవకాశం లేదు. గతంలో కూడా హిమాలయన్కు రీకాల్ ప్రకటించారు. అప్పుడు యుకె, యూరప్, దక్షిణ కొరియా దేశాలలో రీకాల్ ప్రకటించారు. ఇప్పుడు అదే సమస్యకు గాను అమెరికాలో రీకాల్ ప్రకటించడం జరిగింది. అయితే భారతదేశంలో ఈ మోడల్ బైకులకు రీకాల్ ప్రకటించడంపై కంపెనీ ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఇప్పటివరకు భారతదేశంలోని బైకులలో ఎటువంటి సమస్య నమోదు కాకపోవడం గమనార్హం. -
2023 ఫిబ్రవరిలో టూవీలర్ సేల్స్: టీవీఎస్ నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ వరకు
ఫిబ్రవరి 2023 ముగియడంతో దాదాపు అన్ని కంపెనీలు తమ అమ్మకాల గణాంకాలను వెల్లడించాయి. గత నెలలో దేశీయ మార్కెట్లో వాహనాల అమ్మకాలు కొంత పురోగతి చెందినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. మంచి అమ్మకాలు పొందిన టాప్ 5 టూవీలర్ బ్రాండ్స్ లో హీరో మోటోకార్ప్ మొదటి స్థానంలో చేరింది. గత నెలలో హీరో మోటోకార్ప్ మొత్తం 382317 యూనిట్లను విక్రయించి 2022 ఫిబ్రవరి కంటే 15.34 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఇదే నెల గతేడాది కంపెనీ అమ్మకాలు 3,31,462 యూనిట్లు. ఎగుమతుల విషయంలో మాత్రం -54.68 శాతం తగ్గుదలను నమోదు చేసింది. కంపెనీ మొత్తం అమ్మకాలు 3,94,460 యూనిట్లు (ఎగుమతులు + దేశీయ అమ్మకాలు). హోండా మోటార్‌సైకిల్ ఈ జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది. కంపెనీ దేశీయ అమ్మకాలు 2,27,064 యూనిట్లు కాగా, ఎగుమతులు 20,111 యూనిట్లు. 2023 ఫిబ్రవరిలో మొత్తం అమ్మకాలు 2,47,175 యూనిట్లు. దేశీయ అమ్మకాల్లో కంపెనీ -20.25 శాతం, ఎగుమతుల్లో -25.36 శాతం, మొత్తం అమ్మకాల పరంగా -20.93 శాతం తగ్గుదలను నమోదు చేసింది. టీవీఎస్ మోటార్ విషయానికి వస్తే 2023 ఫిబ్రవరిలో 2,21,402 యూనిట్లను దేశీయ మార్కెట్లో 27.83 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఎగుమతుల పరంగా 45,624 యూనిట్లను విక్రయించి 2022 ఫిబ్రవరి కంటే -51.68 శాతం తగ్గుదలను నమోదు చేసింది. మొత్తం అమ్మకాల పరంగా -0.22 శాతం తగ్గుదలతో 2,67,026 యూనిట్ల వద్ద ఆగిపోయింది. 2023 ఫిబ్రవరిలో బజాజ్ ఆటో మొత్తం అమ్మకాలు దేశీయ అమ్మకాలు + ఎగుమతులు 2,35,356 యూనిట్లతో 2022 ఫిబ్రవరి కంటే -15.74 శాతం అతగ్గుదలను నమోదు చేసింది. ఎగుమతులు 1,15,021 యూనిట్లు కాగా, దేశీయ అమ్మకాలు 1,20,335 యూనిట్ల వద్ద ఉన్నాయి. దేశీయ అమ్మకాల్లో కంపెనీ పురోగతిని కనపరిచినప్పటికీ, ఎగుమతుల్లో -37.08 శాతం తగ్గుదలను నమోదు చేసింది. రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాల విషయానికి వస్తే, మొత్తం అమ్మకాలు 71,544 యూనిట్లు (ఎగుమతులు + దేశీయ అమ్మకాలు) కాగా, కేవలం దేశీయ అమ్మకాలు 64,436 యూనిట్లు, ఎగుమతులు 7,108 యూనిట్లు. కంపెనీ ఎగుమతుల్లో 1.18 శాతం వృద్ధిని, దేశీయ అమ్మకాల్లో 23.59 శాతం వృద్ధిని కనపరిచింది. -
జోరు తగ్గని రాయల్ ఎన్ఫీల్డ్: 2023 ఫిబ్రవరి అమ్మకాలు ఇలా..
ఫిబ్రవరి 2023 ముగియడంతో రాయల్ ఎన్ఫీల్డ్ తమ అమ్మకాల నివేదికలను విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన ఈ గణాంకాల ప్రకారం గత నెల 71,544 యూనిట్లు (దేశీయ అమ్మకాలు, ఎగుమతులు) విక్రయించినట్లు తెలిసింది. నివేదికల ప్రకారం రాయల్ ఎన్ఫీల్డ్ గత నెలలో 350సీసీ విభాగంలో హంటర్, బుల్లెట్, క్లాసిక్, మీటియోర్ వంటి మోడల్స్ మాత్రమే కాకుండా హిమాలయన్, స్క్రామ్ 411, ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ జిటి 650 వంటి మోడల్స్‌ని కూడా విరివిగా విక్రయించింది. 2022 ఫిబ్రవరితో పోలిస్తే కంపెనీ అమ్మకాలు 20.93 శాతం పెరిగాయి. కంపెనీ అమ్మకాలు భారీగా పెరగటానికి రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 చాలా సహకరించింది. ఈ మోడల్ కేవలం ఆరు నెలల్లో ఏకంగా లక్ష యూనిట్లు అమ్ముడైంది. దీన్ని బట్టి చూస్తే మార్కెట్లో దీనికున్న డిమాండ్ స్పష్టంగా అర్థమవుతుంది. ఈ మోడల్ తరువాత క్లాసిక్ 350 ఎక్కువ అమ్మకాలు పొందింది. రాయల్ ఎన్ఫీల్డ్ మొత్తం అమ్మకాలలో దేశీయ అమమకాలు 64,436 యూనిట్లు కాగా. ఫిబ్రవరి 2022తో పోలిస్తే దేశీయ అమ్మకాలు కూడా 23.59 శాతం పెరిగాయి. ఎగుమతుల విషయానికి వస్తే, కంపెనీ గత నెలలో 7,044 యూనిట్లను ఎగుమతి చేసింది. గత సంవత్సరం ఇదే నెలలో కంపెనీ 7,025 యూనిట్లను విక్రయించింది. ఎగుమతుల్లో కూడా 0.91 శాతం పెరుగుదల ఉంది. -
Royal Enfield Hunter 350: అమ్మకాల్లో ఇది రాయల్ బండి
భారతీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం 'రాయల్ ఎన్ఫీల్డ్' గత సంవత్సరం 'హంటర్ 350' బైక్ లాంచ్ చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి కంపెనీ ఇప్పటికి లక్ష యూనిట్లను విక్రయించింది. దీనికి సంబంధించిన సమాచారం కంపెనీ ప్రకటించింది. రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 రెట్రో, మెట్రో అనే రెండు వేరియంట్స్‌లో విక్రయించబడుతోంది. వీటి ధరలు వరుసగా రూ. 1.50 లక్షలు, రూ. 1.64 లక్షలు (ఎక్స్-షోరూమ్). కంపెనీ మొదటి 50,000 యూనిట్లను విక్రయించడానికి నాలుగు నెలల సమయం పట్టింది, ఆ తరువాత కేవలం రెండు నెలల్లో మరో 50,000 యూనిట్లను విక్రయించింది. హంటర్ 350 బైక్ 349 సీసీ సింగిల్ సిలిండర్ టూ-వాల్వ్, SOHC, ఎయిర్/ఆయిల్-కూల్డ్ ఇంజన్ కలిగి 20.2 బిహెచ్పి పవర్, 27 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ బైక్ టాప్ స్పీడ్ గంటకు 114 కిమీ, కాగా మైలేజ్ 36.2 కిమీ/లీ వరకు ఉంటుంది. రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 ముందు భాగంలో 41 మిమీ టెలిస్కోపిక్ ఫోర్క్‌లతో కూడిన ట్విన్ డౌన్‌ట్యూబ్ స్పైన్ ఫ్రేమ్ సెటప్ వెనుకవైపు ట్విన్ షాక్‌లను కలిగి పొందుతుంది. అదే సమయంలో ఈ బైక్ 110/70-17 54P ఫ్రంట్, 140/70-17 66P రియర్ ట్యూబ్‌లెస్ టైర్లను కలిగి ఉండి, 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. హంటర్ 350 బైక్ ఫ్యాక్టరీ బ్లాక్, ఫ్యాక్టరీ సిల్వర్, డాపర్ వైట్, డాపర్ యాష్, డాపర్ గ్రే, రెబెల్ బ్లాక్, రెబెల్ బ్లూ, రెబెల్ రెడ్ అనే ఎనిమిది కలర్ ఆప్సన్స్‌లో లభిస్తుంది. ఇది 2,055 మిమీ పొడవు, 800 మిమీ వెడల్పు, 1,055 మిమీ ఎత్తు, 1,370 మిమీ వీల్‌బేస్ కలిగి 13 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ పొందుతుంది. రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 ఇండోనేషియా, జపాన్, కొరియా, థాయ్‌లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యునైటెడ్ కింగ్డమ్, అర్జెంటీనా, కొలంబియా, మెక్సికో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో అందుబాటులో ఉంది. ఈ బైక్ మోటార్‌సైకిల్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు కూడా సొంతం చేసుకుంది. కంపెనీ అమ్మకాలలో ఇప్పటికే ఇది మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది. -
రాయల్‌ఎన్‌ఫీల్డ్ సూపర్ బైక్ వచ్చేసింది..సూపర్ ఫీచర్లతో
సాక్షి,ముంబై: స్టయిలిష్ అండ్ లగ్జరీ బైక్ మేకర్ రాయిల్ ఎన్ఫీల్డ్ మరో కొత్త బైక్‌ను లాంచ్ చేసింది. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న బైక్ ప్రియులను ఆకట్టుకునేలా అద్భుత ఫీచర్లతో 650 సీసీ క్రూయిజర్ ‘సూపర్ మెటోర్ 650’ బైక్‌ను తీసుకొచ్చింది. అతి త్వరలో భారతీయ మార్కెట్లలో కూడా సందడి చేయనుంది. రాయల్ ఎన్ఫీల్డ్ 350 సిరీస్‌లో భాగంగా ఇటలీలోని మిలన్లో జరుగుతున్న 2022 EICMA షోలో ఈకొత్త బైక్‌ను అధికారికంగా ఆవిష్కరించింది. క్లాసికల్ క్రూయిజర్ డిజైన్‌తో రెండు వేరియంట్లలో (స్టాండర్డ్ ,టూరర్) మొదటిది ఐదు రంగులలో, రెండోది రెండు రంగుల్లో ఆకర్షణీయ లుక్‌లో అదరగొడుతోంది. ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650 ఆధారంగా, 6 స్పీడ్ ట్రాన్స్మిషన్, 648 సీసీ ట్విన్ ఇంజీన్‌ను ఇందులో అమర్చింది. 7,250 ఆర్ఎంపీ వద్ద 47 హెచ్‌పీ పవర్‌ను, 5650 ఆర్ఎంపీ వద్ద 52 గరిష్క టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టియర్ డ్రాప్ ఆకారంలో 15.7 లీటర్ల ఫ్యూయల్ ట్యాంకును అమర్చింది. 19 ఇంచెస్ ఫ్రంట్ వీల్, 16 అంగుళాల అల్లాయ్ వీల్ కాంబినేషన్, ఫ్రంట్ 320 మిమీ డిస్క్ బ్రేక్, రియర్‌లో 300 డిస్క్ తో డ్యూయల్ -ఛానల్ ఏబిసి ఉంది. రౌండ్ LED హెడ్‌ల్యాంప్, ట్రిప్పర్ నావిగేషన్‌తో కూడిన డ్యూయల్-పాడ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ , డ్యూయల్ ఎగ్జాస్ట్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.భారతదేశంలో దాదాపు రూ. 3.4 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర ఉంటుందని అంచనా. -
ప్రతి పల్లెలోనూ రాయల్ ఎన్ఫీల్డ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాయల్ ఎన్ఫీల్డ్.. పేరుకు తగ్గట్టే హుందా ఉట్టిపడే ఈ మిడ్ సెగ్మెంట్ బైక్స్‌కు ఇప్పుడు దేశంలో ప్రతీ పల్లెలోనూ కస్టమర్ ఉన్నారు. భారత్‌లో ఏటా కంపెనీ సుమారు 6,00,000 వాహనాలను విక్రయిస్తోంది. ఇందులో 60 శాతం యూనిట్లు ప్రధాన నగరాల్లో అమ్ముడవుతుండగా మిగిలిన 40 శాతం చిన్న నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోని వినియోగదార్లకు చేరుతున్నాయని రాయల్ ఎన్ఫీల్డ్ ఇండియా, సార్క్ బిజినెస్ హెడ్ వి.జయప్రదీప్ తెలిపారు. 75 శాతం విక్రయ కేంద్రాలు మెట్రోయేతర ప్రాంతాల్లో అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు. సంస్థ మొత్తం అమ్మకాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాటా 10 శాతం ఉందని వివరించారు. హైదరాబాద్ మార్కెట్లో హంటర్ 350 బైక్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా సాక్షి బిజినెస్ బ్యూరోతో ఆయన మాట్లాడారు. స్టూడియో ఫార్మాట్లో.. సంస్థకు దేశంలో 2,150 విక్రయశాలలు ఉన్నాయని జయప్రదీప్ వెల్లడించారు. ‘ఇందులో పట్టణాలు, గ్రామీణ ప్రాంత వినియోగదార్లను దృష్టిలో పెట్టుకుని స్టూడియో ఫార్మాట్లో సగం స్టోర్లను తెరిచాం. 600 చదరపు అడుగుల లోపు విస్తీర్ణంలో ఇవి ఉంటాయి. మూడేళ్లలోనే స్టూడియోల సంఖ్య 1,075కు చేరుకుందంటే మెట్రోయేతర ప్రాంతాల్లో బ్రాండ్‌కు ఉన్న ఇమేజ్ అర్థం చేసుకోవచ్చు. అమ్మకాల వృద్ధి 50 శాతం ఉంటే, గ్రామీణ ప్రాంతంలో ఇది ఏకంగా 60 శాతం ఉంది. ఎనిమిది మోడళ్లలో నాలుగు 350 సీసీ సామర్థ్యం గలవి. విక్రయాల్లో 350 సీసీ మోడళ్ల వాటా అత్యధికంగా 80 శాతం ఉంది. 250–750 సీసీ మిడ్ సెగ్మెంట్లో దేశంలో అన్ని కంపెనీలవి కలిపి నెలకు 60,000 బైక్స్ అమ్ముడవుతున్నాయి. ఇందులో రాయల్ ఎన్ఫీల్డ్కు 85 శాతం వాటా ఉంది’ అని ఆయన వివరించారు. నెలకు రూ.4,999లతో.. హంటర్‌ను 349 సీసీ ఎయిర్ ఆయిల్ కూల్డ్ సింగిల్ సిలిండర్ జె-సిరీస్ ఇంజన్‌తో రూపొందించారు. 5 స్పీడ్ గేర్ బాక్స్, డిస్క్ బ్రేక్స్, డ్యూయల్ చానెల్ ఏబీఎస్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, ప్రీమియం డిజిటల్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పొందుపరిచారు. బరువు 181 కిలోలు. వేరియంట్‌నుబట్టి హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో ధర రూ.1,49,900 నుంచి ప్రారంభం. 8రంగుల్లో లభిస్తుంది. నెల వాయిదా రూ.4,999లతో హంటర్‌ను సొంతం చేసుకోవచ్చు. వాయిదా పద్ధతిలో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్‌ను కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య 55% ఉంది. -
రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి ఎలక్ట్రిక్ బైక్.. కొత్త లుక్ ఇలా ఉంటుందా?
ఒకప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ రోడ్డుపై వెళ్తుంటే..అందరి చూపు దానిపైనే ఉండేది. అందుకే ఆ బండి సైలెన్సర్‌కు సపరైట్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా యూత్ అందరికి లైఫ్‌లో ఒక్కసారైన ఈ బైక్‌ను కొనుక్కోవాలనే డ్రీం ఉంటుంది. అలాంటి ఇండియన్ మోస్ట్ బైక్ బ్రాండ్ అయిన రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్స్‌ను విడుదల చేయనుంది. భారత్‌లో రాయల్ ఎన్ ఫీల్డ్ హంటర్ 350ని విడుదల చేసింది. ఈ తరుణంలో ఆటోమొబైల్ మార్కెట్లో ఎదురవుతున్న ఆటుపోట్లను తట్టుకొని, కాంపిటీషన్లో పై చేయి సాధించాలంటే ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను తయారు చేయడం తప్పని సరని ఆ సంస్థ యాజమాన్యం భావిస్తోంది. అందుకే 2026 నాటికి రాయల్ ఎన్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్‌ను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. యూకేకి చెందిన 'ఎలక్ట్రిక్ క్లాసిక్ కార్స్' సంస్థ 2020లో ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్‌ను ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చేసింది. 125 సీసీ రేంజ్ బైక్స్ సైతం వినియోగదారుల్ని ఆకట్టుకున్నాయి. భారత్‌లో సైతం ఇదే తరహాలో రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్స్‌ను ఎలక్ట్రిక్ బైక్స్‌గా మార్చేసి మార్కెట్‌కు పరిచయం చేస్తుందా? అనే సందేశాలు వ్యక్త మవుతున్నాయి. అవును, నాణ్యత, పనితీరు, బ్రాండ్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఎలక్ట్రిక్ బైక్స్‌ను అందించడం తొందరపాటులో లేదని రాయల్ ఎన్ఫీల్డ్ స్పష్టం చేసింది. ఎలక్ట్రిక్ బైక్స్‌కు డిమాండ్ ఉన్నప్పటికీ ..భవిష్యత్‌లో తయారు చేయనున్న ఎలక్ట్రిక్ బైక్ మోడళ్లు ఫీల్, సపరైట్ ఐకానిక్ లుక్ ఉండేలా ఆ సంస్థ శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి👉 డుగ్గుడుగ్గు మంటూ..రాయల్ ఎన్ ఫీల్డ్ కొత్త బైక్ వచ్చేస్తోంది! -
డుగ్గుడుగ్గు మంటూ..రాయల్ ఎన్ ఫీల్డ్ కొత్త బైక్ వచ్చేస్తోంది!
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం రాయల్ ఎన్ఫీల్డ్ మరో బైక్‌ను విడుదల చేయనుంది. హంటర్ 350 పేరుతో ఆదివారం ఈ బైక్‌ను మార్కెట్‌కు పరిచయం చేయనుంది. ఈ బైక్ ధర రూ.1,30,000 నుంచి రూ.1,40,000 ధర మధ్యలో ఉండనుంది. ప్రస్తుతం ఈ బైక్ తరహాలో టీవీఎస్ రోనిన్, ట్రయంఫ్ బోన్నెవిల్లే టీ120, రాయిల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 ఉండనున్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. హంటర్ 350 స్పెసిఫికేషన్స్ రాయిల్ ఎన్ ఫీల్డ్ సంస్థ హంటర్ 350ని నేటి తరం ట్రెండ్‌కు తగ్గట్లుగా డిజైన్ చేయాలని భావించింది. అనుకున్నట్లుగానే బైక్‌ను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వెహికల్ చాసిస్(బైక్ బాడీ)ను పలు మార్లు డిజైన్ చేయడం అవి నచ్చకపోవడం చివరకు ఈ తరహాలో తయారు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. మిగిలిన బైక్స్‌తో పోలిస్తే రాయిల్ ఎన్ఫీల్డ్ 350సీసీ రేంజ్,ట్విన్ డౌన్ ట్యూబ్ స్పైన్ ఫ్రేమ్‌ను అమర్చారు. హంటర్లో రౌండ్ లైట్ క్లస్టర్లు,స్పీడ్‌ను కంట్రోల్ చేసే ట్విన్ రియర్ షాక్‌లు వంటి అనేక క్లాసిక్ రాయల్ ఎన్ఫీల్డ్ డిజైన్ ఎలిమెంట్స్‌ను కలిగి ఉంది. అయితే మొత్తం డిజైన్ 350 సీసీ శ్రేణిలో క్రూయిజర్ కంటే రోడ్‌స్టర్‌గా ఉంది. సీసీ ఒకేలా ఉన్నా బైక్ డిజైన్ ప్రత్యేకంగా ఉందని రాయల్ ఎన్ఫీల్డ్ చెబుతోంది. ఈ బైక్‌లో స్పీడ్‌ను కంట్రోల్ చేయడం లేదంటే పెంచేందుకు ఉపయోగపడే ఫ్రంట్ పోర్క్‌ను 41ఎంఎం(మిల్లీ మీటర్స్) నుండి 130ఎంఎం వరకు అందించింది. అయితే వెనుక భాగంలో 6 దశల ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్,102ఎంఎం వీల్ ట్రావెల్‌తో ట్విన్ ట్యూబ్ ఎమల్షన్ షాక్ అబ్జార్బర్లతో డిజైన్ చేసింది. 17అంగుళాల టైర్లను అమర్చింది. టియర్ డ్రాప్ ఆకారంలో ఉన్న ఫ్యూయల్ ట్యాంక్, రైడర్‌కు మోకాళ్లపై స్ట్రెస్ తగ్గించింది. ఫ్రీగా ఉండేలా డ్రైవింగ్ సీటు వెనుక బాగా ఫ్లాట్‌గా ఉండేలా రూపొందించింది. అయితే ఫుట్ పెగ్‌లు మరింత వెనక్కి జరిపి స్పోర్టియర్ రైడింగ్ పొజిషన్‌ను అందిస్తుంది. ఈ బైక్‌లో టెయిల్ ల్యాంప్ ఎల్ఈడీ యూనిట్ అయితే హెడ్‌ల్యాంప్ హాలోజన్ బల్బ్‌తో వస్తుంది. -
బైక్‌లో సరిపడా పెట్రోల్ లేదని ఫైన్.. చలాన్ ఫోటో వైరల్
తిరువనంతపురం: బైక్‌పై వెళ్తున్నప్పుడు హెల్మెట్ ధరించకపోయినా, ట్రాఫిక్ నిబంధనలు పాటించకున్నా ఫైన్ వేయడం సాధారణంగా జరుగుతుంటుంది. కానీ కేరళలోని ఓ ట్రాఫిక్ పోలీస్ మాత్రం బైక్‌లో సరిపడా పెట్రోల్ లేదని రూ.250 ఫైన్ వేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోను బసిల్ శ్యామ్ అనే వ్యక్తి తన ఫేస్బుక్లో షేర్ చేశాడు. అది కాస్తా వైరల్‌గా మారింది. బైక్‌లో పెట్రోల్ లేకపోతే కూడా ఫైన్ వేస్తారా? ఇలాంటి రూల్ కూడా ఉందా? అని నెటిజన్లు కేరళ ట్రాఫిక్ పోలీసులపై సెటైర్లు వేస్తున్నారు. బసిల్ శ్యామ్ తన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌పై ఆఫీస్‌కు వెళ్లే క్రమంలో వన్ వే స్ట్రీట్‌లో అపసవ్యదిశగా బండి నడిపాడు. అది చూసి ట్రాఫిక్ పోలీస్ బైక్ ఆపాడు. రూ.250 ఫైన్ కట్టమన్నాడు. అందుకు ఒప్పుకుని అతను చెల్లించాడు. అయితే తీరా ఆఫీస్‌కు వెళ్లాక చలాన్ చూస్తే.. బైక్‌లో సరిపడా పెట్రోల్ లేనందుకు ఫైన్ వేసినట్టుంది. దీంతో అతడు షాక్ అయి చలాన్ ఫోటో తీసి ఫేస్బుక్లో పోస్టు చేశాడు. అది కాస్తా వైరల్ అయ్యింది. భారత మోటారు వాహన చట్టం, కేరళ చట్టంలో బైక్‌లో పెట్రోల్ సరిపడా లేకపోతే ఫైన్ వేయాలనే నిబంధన ఎక్కడా లేదు. అయితే బస్సు, కారు, వ్యాను, ఆటో వంటి కమర్షియల్ వాహనాలు పెట్రోల్,డీజిల్ సరిపడా లేకుండా ప్రయాణించి ప్రయాణికులకు ఇబ్బంది కల్గిస్తే రూ.250 ఫైన్ కట్టాలనే నిబంధన కేరళ రవాణా చట్టంలో ఉంది. కానీ ఇది బైక్‌లకు వర్తించదు. దీంతో ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని మాజీ అధికారులు రవాణా శాఖకు సూచించారు. చదవండి: త్వరలో శివసేన నుంచి మరో సీఎం.. ఉద్ధవ్ థాక్రే కీలక వ్యాఖ్యలు -
Bullet Bikes: నీ బుల్లెట్టు బండెక్కి చెక్కెత్తపా డుగ్గుడుగ్గుడుగ్గుడుగ్గుడుగ్గని..
సాక్షి, హైదరాబాద్: నగరంలో బైక్ దొంగలు రెచ్చిపోతున్నారు. ఒక వైపు చోరీలు చేస్తూనే పోలీసులకు చిక్కకుండా చాకచక్కంగా తప్పించుకుంటున్నారు. కొండాపూర్, మాదాపూర్ ఐటీ కారిడార్ ప్రాంతాల్లో చోటు చేసుకున్న చోరీలు పోలీసులను నివ్వెర పరుస్తున్నాయి. తాజాగా వెలుగుచూసిన కొన్ని కేసులు దొంగల తెలివితేటలకు అద్దం పడుతున్నాయి. మణిప్రసాద్ అనే వ్యక్తి గురువారం ఉదయం కొండాపూర్‌లో స్టైయిల్ హెయిర్ సెలూన్‌కు వెళ్లాడు. తరువాత బయటకు వచ్చి చూస్తే తన బుల్లెట్ బైక్ కనిపించలేదు. సీసీ పుటేజీ పనిశీలించగా గుర్తు తెలియని వ్యక్తి బైక్‌పై హెల్మెట్ పెట్టుకొని రెండు సార్లు రెక్కీ నిర్వహించి ఓ అపార్ట్మెంట్ వద్ద తన ప్యాషన్ బైక్ పెట్టి నడుచుకుంటూ సెలూన్ దగ్గరకు వచ్చాడు. హ్యాండిల్ లాక్ చేయకపోవడంతో కొద్ది దూరం తోసుకుంటూ వెళ్లి స్క్రూ డ్రైవర్‌తో హెడ్‌లైట్ తీసి వైర్ల సహయయంతో స్టార్ట్ చేసి బుల్లెతో ఉడాయించాడు. 30 నిమిషాల తరువాత వచ్చి అపార్ట్మమెంట్ వద్ద ఉన్న తన ప్యాషన్ బైక్‌ను తీసుకొని పరారయ్యాడు. బుల్లెట్ దొంగ కోసం గచ్చిబౌలి పోలీసులు రెండు బృందులుగా దర్యాప్తు చేపట్టారు. చదవండి👉వైరాలో వింత చేపల వర్షం.. మునుపెన్నడూ చూడలేదే! బుల్లెట్‌ని తోసుకుంటూ వెళుతున్న గుర్తు తెలియని వ్యక్తి పార్క్ చేసిన బుల్లెట్లు మాయం... మాదాపూర్ పీఎస్ పరిధిలోని పర్వత్‌నగర్‌లో నివాసముండే అఖిల్ రెడ్డి మే 26న అర్థరాత్రి ఇంటి ముందు బుల్లెట్ పార్క్ చేశాడు. తెల్లవారు జామున చూడగా బుల్లెట్ కనిపించలేదు. బాధి తుడు మాదాపూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. నార్సింగి పీఎస్ పరిధిలోని పుప్పాల గూడలో ఓ ఇంటి ముందు పార్క్చేసిన బుల్లెట్‌ను నాలుగు రోజుల క్రితం చోరీ చేశారు. బాధితుడు నార్సింగి పీఎస్‌లో ఫిర్యాదు చేయగా సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. ఐటీ కారిడార్‌లో వరుసగా బుల్లెట్లు చోరీకి గురికావడం పోలీసులకు సవాల్‌గా మారింది. చదవండి👉వర్కర్‌పై కర్కశత్వం.. ఒళ్లంతా బెల్టు వాతలు -
రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లవర్స్‌కు శుభవార్త!
డుగ్..డుగ్ బండి రాయల్ ఎన్ఫీల్డ్ లవర్స్‌కు శుభవార్త. రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఎలక్ట్రిక్ బైక్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీవీఎస్, హీరో, అథేర్, బీఎండబ్ల్యూ వంటి ప్రధాన ఆటోమొబైల్ కంపెనీలు మే నెలలో ఎలక్ట్రిక్ బైక్స్‌ను విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. ఆ కంపెనీల వెహికల్స్‌తో పోటీపడుతూ రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైందని రాయల్ ఎన్ఫీల్డ్ మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ లాల్ తెలిపారు. రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ విడుదలపై కొన్ని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆ రిపోర్ట్‌ల ప్రకారం..చెన్నై కేంద్రంగా రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ద్విచక్రవాహన ఆటోమొబైల్ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్‌ల కోసం ప్రోటోటైప్లను సిద్ధం చేస్తుందని, త్వరలో ఈవీ బైక్స్ తయారీని ప్రారంభించనుందని రిపోర్ట్లు హైలెట్ చేస్తున్నాయి. స్పెసిఫికేషన్ల విషయానికొస్తే! ఇండియా కార్ న్యూస్ నివేదికల ప్రకారం బైక్ 8కేడ్ల్యూహెచ్ నుండి 10కేడబ్ల్యూహెచ్ వరకు బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించవచ్చు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్లో ప్రస్తుతం ఉన్న ట్రెండ్ల ప్రకారం బైక్‌ల శక్తి, గరిష్ట టార్క్ 40బీహెచ్పీ, 100ఎన్ఎం ఉందని అంచనా. ఇక ఈబైక్ ప్రస్తుతం ఈ బైక్ ప్రోటోటైప్‌లు యూకేలో డిజైన్ చేస్తుండగా వచ్చే ఏడాది మార్కెట్లో విడుదల కానుంది. -
దూసుకొచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 411
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ నూతన మోడల్ స్క్రామ్ 411ను భారత్‌లో ప్రవేశపెట్టింది. పరిచయ ఆఫర్లో భాగంగా చెన్నై ఎక్స్‌షోరూంలో ధర రూ.2.03 లక్షల నుంచి ప్రారంభం. రాయల్ ఎన్ఫీల్డ్ ఎల్ఎస్–410 ఇంజన్ ప్లాట్‌ఫామ్‌పై ఇది రూపుదిద్దుకుంది. 411 సీసీ ఇంజన్, 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఇంజన్, 6,500 ఆర్పీఎంతో 24.3 బీహెచ్పీ పవర్, 32 ఎన్ఎం టార్క్‌తో 4,000–4,500 ఆర్పీఎం ఉంది. ఇక ఈ బైక్‌లో ఫీచర్ల విషయానికి వస్తే డిజిటల్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ చానెల్ యాంటీ బ్రేకింగ్ సిస్టమ్‌తో డిస్క్ బ్రేక్స్ పొందుపరిచారు. యూరప్, ఆసియా పసిఫిక్ దేశాల్లోనూ కొన్ని నెలల్లో ఈ మోడల్‌ను పరిచయం చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. -
రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మరో కొత్త బైక్..! ఆ సెగ్మెంట్లో చవకైన బైక్‌గా..!
ప్రముఖ టూవీలర్ ఆటోమొబైల్ దిగ్గజం రాయల్ ఎన్ఫీల్డ్ భారత మార్కెట్లలోకి మరో కొత్త బైక్‌ను లాంచ్ చేయనుంది. ఈ బైక్ ఆఫ్ రోడ్ సెగ్మెంట్లో చవకైన బైక్‌గా నిలుస్తోందని కంపెనీ పేర్కొంది. రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 411 ఆఫ్ రోడ్ సెగ్మెంట్లో రాయల్ ఎన్ఫీల్డ్కు చెందిన హిమాలయన్ మోడల్ అత్యంత ప్రచుర్యాన్ని పొందింది. హిమాలయన్ బైక్ కంటే తక్కువ ధరలో కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 411ను మార్చి 15 న లాంచ్ చేయనుంది. రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 411 సంబంధించిన పలు వివరాలు ఈ ఏడాది ప్రారంభంలోనే లీక్ అయ్యాయి. ఈ బైక్ యోజ్దీ స్క్రాంబ్లర్‌తో పోటీ పడనుంది. డిజైన్ విషయానికి వస్తే..! న్యూ రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రాంబ్లర్ ఆఫ్‌రోడ్ బైక్ హిమాలయన్ ఆధారంగా రూపొందించబడింది. రాబోయే రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 411 డ్యూయల్-పర్పస్ టైర్స్‌తో 19-అంగుళాల ఫ్రంట్ వీల్‌ను పొందనుంది. ఈ బైక్‌లో జెర్రీ క్యాన్ హోల్డర్స్, పొడవైన విండ్‌స్క్రీన్ తొలగించబడ్డాయి. ఇతర అప్గ్రేడ్లలో ట్రిప్డ్ నావిగేషన్ పాడ్‌తో కూడిన రివైజ్డ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, కాస్ట్ మెటల్-ఫినిష్డ్ హెడ్‌ల్యాంప్ కౌల్, స్ప్లిట్ సీట్లు, రివైజ్డ్ సైడ్ ప్యానెల్స్‌తో రానుంది. అల్యూమినియం సంప్ గార్డ్, అర్బన్ బ్యాడ్జ్ ప్లేట్ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రాంబ్లర్‌లో ఉన్నాయి. గ్రౌండ్ క్లియరెన్స్ 200 మిమీ వరకు తగ్గింది. ఇంజన్ విషయానికి వస్తే..! రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 411 బైక్ 24.3 bhp సామర్థ్యంతో , 32 Nm గరిష్ట టార్క్‌ను 411 cc సింగిల్-సిలిండర్ ఇంజన్ అందించనుంది. ఈ బైక్‌లో 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. బైక్ సస్పెన్షన్ , బ్రేకింగ్ హార్డ్‌వేర్‌ను కూడా కలిగి ఉండనుంది. రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 411 హిమాలయన్ బైక్ కంటే కొంత తక్కువ ధరలో వచ్చే అవకాశం ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 411 బైక్ ధర రూ.2 లక్షల (ఎక్స్-షోరూమ్) కంటే తక్కువగా ఉంటుందని కంపెనీ హామీ ఇచ్చింది. ఇక రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బైక్ ధర రూ. 2.14 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం కానుంది. చదవండి: అత్యధిక మైలేజ్ ఇచ్చే కారును లాంచ్ చేసిన మారుతి సుజుకీ..! -
రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్‌లో సంచలనం..! ఏకంగా లక్ష మోడల్స్..!
టూవీలర్ వాహనాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్‌కు ఉండే క్రేజే వేరు. ధరతో పట్టింపు లేకుండా బుల్లెట్ బండిని సొంతం చేసుకోవడానికి బైక్ లవర్స్ ఎగబడతారు. తాజాగా రాయల్ ఎన్ఫీల్డ్ కు చెందిన న్యూ జనరేషన్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఉత్పత్తిలో సరికొత్త రికార్డును సృష్టించింది. లక్ష యూనిట్ల ఉత్పత్తి..! రాయల్ ఎన్ఫీల్డ్ టూవీలర్స్ బైక్‌లలో బేసిక్ మోడల్‌గా రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 నిలుస్తోంది. దీనికి కొత్త హంగులను జోడించి భారత మార్కెట్లలోకి న్యూ జనరేషన్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఇక లాంచ్ చేసిన ఏడాది కంటే తక్కువ సమయంలోనే ఒక లక్ష యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని దాటిన మోడల్‌గా న్యూ జనరేషన్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 నిలిచింది. భారత్‌లోనే కాకుండా న్యూ క్లాసిక్ 350 థాయిలాండ్, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో కూడా క్లాసిక్ 350 డుగ్గు డుగ్గు మంటూ సౌండ్ చేస్తోంది. న్యూ జనరేషన్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 యూకేలో ఇంకా లాంచ్ కాకపోవడం విశేషం. అత్యధికంగా అమ్ముడైన మోడల్..! రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్‌లో 350 సీసీ కేటాగిరిలో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా నిలుస్తోంది. ఇది కంపెనీలో 70 నుంచి 80 శాతం వాటాను కలిగి ఉంది. న్యూ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్‌ను సెప్టెంబర్ 2021లో భారత్‌లో ప్రారంభించారు. అప్డేటెడ్ ఫీచర్స్‌తో..! కొత్త ఇంజన్, కొత్త ఛాసిస్, అప్డేటెడ్ సస్పెన్షన్, కొత్త వీల్స్, బ్రేక్‌తో మరింత ఆకర్షణీయంగా తయారైంది. సరికొత్త క్లాసిక్ 350 అనేది మెటోర్ 350 మోడల్ బైక్ లాగే 350 cc సింగిల్-సిలిండర్ ఇంజన్‌తో వచ్చింది. 349 cc, సింగిల్-సిలిండర్ ఇంజన్ 6,100 rpm వద్ద 20.2 bhp శక్తిని ఉత్పత్తి చేస్తోంది. 4,000 rpm వద్ద 27 Nm టార్క్‌ను రిలీజ్ చేస్తోంది. చదవండి: భారత్‌లో అమ్మేది కేవలం 20 బైక్స్ మాత్రమే..! ఈ బైక్ ఎందుకంత స్పెషల్ అంటే..! -
టూవీలర్ కొనుగోలు దారులకు బంపర్ ఆఫర్!
టూవీలర్ కొనుగోలు దారులకు ఎల్ అండ్ టీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. 'వెల్కమ్ 2022' లో భాగంగా కొనుగోలు దారులకు భారీ ఎత్తున లోన్ ఆఫర్ ఇస్తున్నట్లు తెలిపింది. హైపోథికేట్ చేయాల్సిన అవసరం లేకుండా కేవలం 3నిమిషాల్లో 7.99 శాతం నుంచి వడ్డీతో అందిస్తున్నట్లు వెల్లడించింది. రాయల్ ఎన్ఫీల్డ్ కొనుగోలు చేసిన కొనుగోలు దారులు తీసుకున్న లోన్‌ను 4ఏళ్లలో చెల్లించవచ్చని రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్జిగ్యూటీవ్ డైరక్టెర్ బి. గోవిందరాజన్ చెప్పారు. కంపెనీ డీలర్ల దగ్గర లేదా ఎల్ అండ్ టీ ఫైనాన్స్ బ్రాంచ్ ఆఫీస్‌ల దగ్గర ఈ స్కీమ్‌ను పొందవచ్చు. లేదా కంపెనీ వెబ్సైట్ www.ltfs.com లోకి వెళ్లి ఈ స్కీమ్ కింద లోన్‌కు అప్లై చేసుకోవచ్చు. క్లాసిక్ 350, ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650 ట్విన్స్, హిమాలయన్ వంటి బైక్‌లను రాయల్ ఎన్ఫీల్డ్ అమ్ముతుంది. ఎల్ అండ్ టీ ఫైనాన్స్ ప్రకారం బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ టర్నరౌండ్ టైమ్ (టీఏటీ) లో భాగంగా..ఎల్ అండ్ టీ ఫైనాన్స్, రాయల్ ఎన్ఫీల్డ్ మధ్య ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా టైర్ 1, టైర్ 2, టైర్ 3 నగరాలు,పట్టణాల్లోని కస్టమర్లకు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్‌పై లోన్ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. చదవండి: అదిరిపోయిన యమహా ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఎంతో తెలుసా? -
రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ బైక్‌ల రీకాల్
న్యూఢిల్లీ: బ్రేక్ భాగంలో సమస్యలను పరిష్కరించేందుకు క్లాసిక్ 350 మోడల్‌కు సంబంధించి 26,300 బైక్‌లను రీకాల్ చేస్తున్నట్లు మోటర్‌సైకిల్ తయారీ దిగ్గజం రాయల్ ఎన్ఫీల్డ్ వెల్లడించింది. వీటిల్లో సమస్యలు తలెత్తే అవకాశాలను తమ సాంకేతిక బృందం గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. వెనుక బ్రేకు పెడల్పై భారీ స్థాయిలో ఒత్తిడి పడినప్పుడు, అసాధారణంగా బ్రేకింగ్ సామర్థ్యం దెబ్బతినే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 5 మధ్య తయారైన సింగిల్ చానెల్, ఏబీఎస్, రియర్ డ్రమ్ బ్రేక్ క్లాసిక్ 350 మోడల్స్‌కు ఈ సమస్య పరిమితమని వివరించింది. కస్టమర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ముందు జాగ్రత్త చర్యగా వీటిని వెనక్కి రప్పిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. నిర్దిష్ట కాల వ్యవధిలో తయారైన మోటర్‌సైకిళ్ల గుర్తింపు నంబరు (వీఐఎన్) ఆధారంగా రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ బృందాలు లేదా స్థానిక డీలర్లు.. వాటి వినియోగదారులను సంప్రదిస్తారని పేర్కొంది. అలాగే ఈ సమస్య గురించి వినియోగదారులు స్వయంగా కంపెనీ వెబ్సైట్ ద్వారా తెలియజేయవచ్చని లేదా స్థానిక వర్క్‌షాపులను సంప్రదించవచ్చని తెలిపింది. -
ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొన్నారా.. అయితే, వెంటనే షోరూమ్ తీసుకెళ్లండి!
ప్రముఖ బైక్ తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ తన క్లాసిక్ 350 బైక్‌లో బ్రేకింగ్ సమస్య ఉన్న కారణంగా 26,300 యూనిట్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్‌లో విడుదల చేసిన ఈ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మోడల్ బైక్‌లో పలు సమస్యలు ఉన్న కారణంగా విక్రయించిన బైక్‌లను వెంటనే వెనక్కి తీసుకోవాలని రాయల్ ఎన్ఫీల్డ్ నిర్ణయించింది. ఈ బైక్‌లో బ్రేకింగ్ సమస్య ఉన్నట్లు గుర్తించిన రాయల్ ఎన్ఫీల్డ్ ఈ మోడల్స్‌కు చెందిన అన్ని బైక్‌లను వెనక్కి తీసుకొని రావాలని కోరుతుంది. ఈ సమస్య సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 5 మధ్య తయారు చేసిన క్లాసిక్ 350 మోడల్స్ బైక్‌లలో ఉన్నట్లు తెలిపింది. వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అన్ని యూనిట్ల స్వింగ్ ఆర్మ్ బ్రేక్ రియాక్షన్ బ్రాకెట్'ను బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నట్లు రాయల్ ఎన్ఫీల్డ్ పేర్కొంది. సర్వీస్ టీమ్ లేదా మీ దగ్గరలోని స్థానిక డీలర్ షిప్ కేంద్రాలకు సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 5 మధ్య ఈ బైక్ కొనుగోలు చేసిన వినియోగదారులు కొనుగోలు పత్రాలతో చేరుకోవాలని సూచించింది. వాటిని వెనక్కి తీసుకున్న తర్వాత లోపాలను సరిచేసి తిరిగి ఇవ్వనునట్లు పేర్కొంది. (చదవండి: 2021లో నాకు సాయం చేసినవి ఇవే!: ముకేష్ అంబానీ) మీ దగ్గరలోని సర్విస్ కేంద్రాల గురుంచి తెలుసుకోవడం కోసం వినియోగదారులు రాయల్ ఎన్ఫీల్డ్ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. అలాగే, వినియోగదారులకు ఏమైనా సందేహాలు ఉంటే 1800-210-007కు కాల్ చేయవచ్చు అని కూడా పేర్కొంది. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది. ఫైర్ బాల్ వేరియంట్ ధర - రూ.1.85 లక్షలు, సూపర్ నోవా వేరియంట్ ధర - రూ. 1.86 లక్షలు, స్టెల్లార్ వేరియంట్ ధర -1.90 లక్షలుగా ఉన్నాయి. ఈ బైక్ యుఎస్బి ఛార్జర్, కొత్తగా డిజైన్ చేసిన టెయిల్ లైట్, అప్డేట్ చేసిన ఎగ్జాస్ట్ పైప్, 13-లీటర్ కెపాసిటీ ఫ్యూయల్ ట్యాంక్, మరింత సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవం కోసం అప్డేట్ చేసిన సీట్లతో వస్తుంది. (చదవండి: Telangana: మాస్క్ ధరలు.. తగ్గేదే లే!) -
120 సెకండ్లలో హాట్‌కేకుల్లా అమ్ముడైన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ఇవే...!
Royal Enfield 650 Twins Anniversary Edition: రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌లకు ఉండే క్రేజే వేరు. కొద్దిరోజుల క్రితం రాయల్ ఎన్ఫీల్డ్ 120 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా రెండు ఫ్లాగ్షిప్ ఎడిషన్ 650 సీసీ బైక్‌లను లాంచ్ చేసింది. రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650, రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ 650 బైక్‌లను కొనుగోలుదారులకు డిసెంబర్ 6న ఆన్లైన్ వెబ్సైట్లో అమ్మకానికి రాగా..బుల్లెట్ బైక్ లవర్స్ లిమిటెడ్ ఎడిషన్ బైక్‌లపై ఎగబడ్డారు. యానివర్సరీ ఎడిషన్ 120 బైక్‌లను భారత్‌లో కేవలం 120 సెకన్లలో విక్రయించి సరికొత్త రికార్డును నమోదుచేసినట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. 120 యూనిట్లు మాత్రమే..! రాయల్ ఎన్ఫీల్డ్ 120 వార్షికోత్సవం సందర్భంగా భారత్‌లో కేవలం 120 యూనిట్లను మాత్రమే కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచింది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 480 యూనిట్లను మాత్రమే తయారు చేయనుంది. ఒక్కో ప్రాంతానికి 60 కాంటినెంటల్ GT 650 బైక్స్, 60 ఇంటర్‌సెప్టర్ 650 బైక్‌లను కంపెనీ సప్లై చేసింది. దీంతో భారత్‌లో 120 యూనిట్ల లిమిటెడ్ ఎడిషన్ రాయల్ ఎన్ఫీల్డ్ 650 బైక్స్ కొనుగోలుదారులకు అందుబాటులోకి వచ్చాయి. అదిరిపోయే ఫీచర్స్..! 120 వార్షికోత్సవ ఎడిషన్ ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650 బైక్‌లను యూకే, భారత్‌కు చెందిన బృందాలు రూపొందించాయి. బ్లాక్ క్రోమ్ ట్యాంక్‌ను ఈ రెండు బైక్స్ కల్గి ఉన్నాయి. ఇంజిన్, సైలెన్సర్ ఇతర భాగాలు పూర్తిగా బ్లాక్ కలర్‌తో రానున్నాయి. ఫ్లైస్క్రీన్, ఇంజన్ గార్డ్, హీల్ గార్డ్, టూరింగ్ , బార్ ఎండ్ మిర్రర్స్ వంటి అనేక రకాల ఉపకరణాలు కూడా వస్తాయి. ప్రత్యేక ఆకర్షణగా 120 ఇయర్స్ బ్యాడ్జ్..! ఈ బైక్‌లకు 120 ఇయర్స్ డై-కాస్ట్ బ్రాస్ ట్యాంక్ బ్యాడ్జ్ మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వీటిని భారత్‌కు చెందిన సిర్పి సెంథిల్ కళాకారులు బ్రాస్ బ్యాడ్జ్‌లను చేతితో తయారుచేశారు. చదవండి: Bounce Infinity E1 vs Ola S1: ఈ రెండింటిలో ఏది బెటర్..? -
Royal Enfield : ఈ వీడియో చూస్తే ఆహా అనాల్సిందే
Royal Enfield 650 Twins 120 Years Anniversary Special Edition Teaser: రాయల్ ఎన్ఫీల్డ్ మార్కెట్లోకి వచ్చి 120 ఏళ్లూ పూర్తైన సందర్భంగా 650 సీసీ ఇంజన్లతో రెండు లిమిటెడ్ ఎడిషన్ బైకులను రిలీజ్ చేస్తోంది. ఈ బైకులకు ఇప్పటికే ఈఐసీఎంఏ - 2021 షోలో ప్రదర్శించారు. కాగా ఇప్పుడు ఈ బైకులకు సంబంధించిన తొలి టీజర్‌ని రాయల్ ఎన్ఫీల్డ్ ట్విట్టర్లో రిలీజ్ చేసింది. మేడ్ లైక్ ఏ గన్ 120 ఇయర్స్ స్పెషల్ ఎడిషన్ బైక్ తయారీలో రాయల్ ఎన్ఫీల్డ్ అనేక జాగ్రత్తలు తీసుకుంది. ముఖ్యంగా ఆర్ఈ అక్షరాలతో ఉండే రాయల్ ఎన్ఫీల్డ్ లోగోను ఎంతో జాగ్రత్తగా ప్రత్యేకంగా డిజైన్ చేయించింది. లోగో తయారీకి సంబంధించిన అంశాలతో కూడిన టీజర్‌కి మేడ లైక్ ఏ గన్ అంటూ క్యాప్షన్ జోడించి ఆర్ఈ లవర్స్‌కి కిక్ ఇచ్చారు. This November, 120 years to the same month when Royal Enfield introduced its first-ever motorcycle, we are proud to present the 120th Year Anniversary Edition Continental GT and Interceptor 650 to mark this momentous milestone. #LimitedEditionTwins #120YearsOfRoyalEnfield pic.twitter.com/PSpp7tsP3R — Royal Enfield (@royalenfield) November 25, 2021 చదవండి : రాయల్ ఎన్ఫీల్డ్ స్పెషల్ ఎడిషన్ ఫీచర్స్ -
రాయల్ ఎన్ఫీల్డ్ 650 లిమిటెడ్ ఎడిషన్ ..! ఈ బుల్లెట్ బండ్లను చూస్తే ఫిదా అవాల్సిందే..!
Royal Enfield 650 Twins Anniversary Edition Model Unveiled At EICMA 2021: టూవీలర్ వాహనాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్‌కు ఉండే క్రేజే వేరు. ధరతో పట్టింపు లేకుండా బుల్లెట్ బండిని సొంతం చేసుకోవడానికి బైక్ లవర్స్ ఎగబడతారు. తాజాగా రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ 120 వసంతాలను పూర్తి చేసుకుంది. 120 ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా రాయల్ ఎన్ఫీల్డ్ రెండు ఫ్లాగ్షిప్ లిమిటెడ్ ఎడిషన్ 650సీసీ మోటర్‌సైకిళ్లను కంపెనీ మిలాన్‌లో జరగుతున్న ఈఐసీఎమ్ఏ-2021 షోలో ఆవిష్కరించింది. రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650, రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ 650 బైక్‌లను కంపెనీ ప్రదర్శించింది. ఈ రెండు స్పెషల్ ఎడిషన్ బైక్స్ పరిమిత సంఖ్యలోనే కంపెనీ ఉత్పత్తి చేస్తోందని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 480 యూనిట్లను మాత్రమే కంపెనీ విక్రయించనుంది. ఒక్కో ప్రాంతానికి 60 కాంటినెంటల్ GT 650 బైక్స్, 60 ఇంటర్‌సెప్టర్ 650 బైక్‌లను కంపెనీ సప్లై చేయనుంది. దీంతో భారత్‌లో 120 యూనిట్ల లిమిటెడ్ ఎడిషన్ రాయల్ ఎన్ఫీల్డ్ 650 బైక్స్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటాయి. 120 వార్షికోత్సవ ఎడిషన్ ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650 బైక్‌లను యూకే, భారత్‌కు చెందిన బృందాలు రూపొందించాయి. బ్లాక్ క్రోమ్ ట్యాంక్‌ను ఈ రెండు బైక్స్ కల్గి ఉన్నాయి. ఇంజిన్, సైలెన్సర్ ఇతర భాగాలు పూర్తిగా బ్లాక్ కలర్‌తో రానున్నాయి. ఫ్లైస్క్రీన్, ఇంజన్ గార్డ్, హీల్ గార్డ్, టూరింగ్ , బార్ ఎండ్ మిర్రర్స్ వంటి అనేక రకాల ఉపకరణాలు కూడా వస్తాయి. బుకింగ్స్ ఎప్పుడంటే..! భారత్‌లో కేవలం 120 యూనిట్లు మాత్రమే కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నాయి. ఆసక్తికల్గిన బుల్లెట్ లవర్స్, లిమిటెడ్ ఎడిషన్ బైక్‌లను నవంబర్ 24 నుంచి వెబ్సైట్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 120 యానివర్సరీ ఎడిషన్ బైక్‌లను డిసెంబర్ 6న ఆన్లైన్ విక్రయించనున్నట్లు కంపెనీ పేర్కొంది. 120 ఇయర్స్ బ్యాడ్జ్..! ఈ బైక్‌లకు 120 ఇయర్స్ డై-కాస్ట్ బ్రాస్ ట్యాంక్ బ్యాడ్జ్ మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వీటిని భారత్‌కు చెందిన సిర్పి సెంథిల్ కళాకారులు బ్రాస్ బ్యాడ్జ్‌లను చేతితో తయారుచేశారు. -
2022లో విడుదలయ్యే సూపర్ బైక్స్ ఇవే..!
Top Upcoming Bikes To Rock The Indian Two Wheeler Market In 2022: టూవీలర్స్‌లో రాయల్‌ఎన్‌ఫీల్డ్, యెజ్దీ, కేటీఎమ్ బైక్స్ అంటే యువతకు ఎక్కువగా మోజు. యువతను లక్ష్యంగా చేసుకొని పలు టూవీలర్ ఆటోమొబైల్ కంపెనీలు వచ్చే ఏడాది పలు సూపర్ బైక్స్‌తో ముందుకురానున్నాయి. రాబోయే సంవత్సరంలో రాయల్ ఎన్ఫీల్డ్, యెజ్దీ, కేటీఎమ్ బ్రాండ్స్ సరికొత్త బైక్స్‌ను విడుదల చేయనున్నాయి. 2022లో విడుదలయ్యే సూపర్ బైక్స్ పై ఓ లూక్కేద్దాం..! న్యూ-జెన్ కేటీఎమ్ ఆర్సీ390: కేటీఎమ్ బైక్స్ కుర్రకారును ఇట్టే కట్టిపడేసింది. కేటీఎమ్ ఆర్సీ 390 మోడల్‌కు అప్డేట్ వెర్షన్‌గా న్యూజెన్ కేటీఎమ్ ఆర్సీ 390 ముందుకురానుంది. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో ఈ బైక్‌ను కంపెనీ లాంచ్ చేయనున్నుట్లుగా తెలుస్తోంది. యెజ్డీ రోడ్కింగ్ ఏడీవీ: రెట్రో బైక్స్‌లో రాయల్‌ఎన్‌ఫీల్డ్ బైక్స్ తరువాత యెజ్డీ బైక్స్‌కు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు. త్వరలోనే యెజ్డీ బైక్‌లను రిలీజ్ చేయనున్నుట్లు జావా ఆటోమొబైల్స్ తన సోషల్‌మీడియా ఖాతాలో వెల్లడించింది. రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350: బుల్లెట్ బైక్స్‌కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. వచ్చే ఏడాది రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 బైక్‌ను లాంచ్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. మెటియోర్ 350తో దగ్గరి పోలికలు ఉన్న విభిన్న స్టైలింగ్, డిజైన్, సెటప్‌లను హంటర్ 350లో రానుంది. ట్రిప్పర్ నావిగేషన్ ఫీచర్ కూడా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. రోడ్-బేస్డ్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్: ఆఫ్ రోడ్ ప్రయాణాలకు రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బైక్‌కు ఏ బైక్ సరిలేదు. రోడ్ బేస్డ్ హిమాలయన్ బైక్‌ను వచ్చే ఏడాది రాయల్ ఎన్ఫీల్డ్ రిలీజ్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. రాయల్ ఎన్ఫీల్డ్ షాట్ గన్ లేదా క్లాసిక్ 650: రాయల్ ఎన్ఫీల్డ్ లాంచ్ చేస్తున్న బైక్స్‌లో షాట్‌గన్650 మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 650సీసీ ఇంజిన్ సామర్థ్యంతో వచ్చే క్యూయిజర్ మోడల్‌గా ఈ బైక్ నిలవనుంది. చదవండి: షాకిచ్చిన ఫోక్స్‌వ్యాగన్! సైలెంట్‌గా ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత? -
రాయల్ ఎన్‌ఫీల్డ్‌కి షాక్ ! గతేడాదితో పోల్చితే ...
ప్రీమియం బైక్ సెగ్మెంట్లో మార్కెట్ నంబర్ వన్‌గా కొనసాగుతున్న రాయల్ ఎన్‌ఫీల్డ్‌కి షాక్ తగిలింది. కరోనా ఫస్ట్ వేవ్ కంటే కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై బాగా పడింది. ఇటీవల ఆ సంస్థ ప్రకటించిన ఫలితాలు ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. భారీగా తగ్గిన అమ్మకాలు యూత్‌లో విపరీతమైన పాపులారిటీ సాధించిన రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలు ఒక్కసారిగా పడిపోయాయి. సెప్టెంబరుకి సంబంధించిన అమ్మకాల వివరాలను రాయల్‌ఎన్‌ఫీల్డ్ ప్రకటించింది. ఇందులో 2020 సెప్టెంబరుతో పోల్చితే ఏకంగా 44 శాతం అమ్మకాలు పడిపోయాయి. గతేడాది ఒక్క సెప్టెంబరులో ప్రపంచ వ్యాప్తంగా 60,331 బైకులు అమ్ముడవగా ఈ ఏడు కేవలం 33,529 బైకులే అమ్ముడయ్యాయి. ఇక దేశీయంగా అమ్మకాలను పరిశీలిస్తే గతేడాది 56,200 బైకులు సేల్ అవగా ఈ సారి 27,233 సేల్ అయ్యాయి. దేశీయంగా రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల అమ్మకాలు 52 శాతం పడిపోయాయి. మూడో ఏడు ఇలా రాయల్ఎన్ఫీల్డ్కి ప్రీమియం సెగ్మెంట్లో గత రెండేళ్లుగా ఎదురే లేకుండా పోయింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా రాయల్‌ఎన్‌ఫీల్డ్ 1,96,635 బైకులు అమ్మగలిగింది. ఆ తర్వాత సంవత్సరం కరోనా ఫస్ట్ వేవ్ ఎఫెక్ట్ ఉన్నా 2,10,270 బైకులు అమ్మింది. దాదాపు 7 శాతం వృద్ధిని అమ్మకాల్లో సాధించింది. ఈసారి అదే జోరు కొనసాగితే పదిశాతాన్ని మించి వృద్ధి రేటు ఉండవచ్చని అంచనాలు ఉండగా సెప్టెంబరులో ఒక్కసారిగా అమ్మకాలు 52 శాతం మేర పడిపోయాయి. అదే కారణమా ? కోవిడ్ ఫస్ట్‌వేవ్ తర్వాత కూడా ఆర్ఈ బైకుల అమ్మకాలు జోరు తగ్గలేదు. ఈసారి కూడా సెకండ్ వేవ్ ప్రభావం తమ అమ్మకాలపై పడలేదని ఆ సంస్థ ప్రతినిధులు అంటున్నారు. అయితే సెమికండక్టర్ల కొరత కారణంగా తయారీ తగ్గిందని చెబుతున్నారు. మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్‌కి ఉన్న క్రేజ్ అలాగే ఉందని చెబుతున్నారు. అందుకే సెప్టెంబరులో క్లాసిక్ 350 ఫేస్ లిఫ్ట్ మోడల్ రిలీజ్ చేశామంటున్నారు. చదవండి : బాపు చూపిన బాటలో జెఫ్‌బేజోస్, బిల్‌గేట్స్.... -
Electric Bike: ఆ పిల్లాడు చెప్పిన అబద్ధం.. అద్భుతాన్ని ఆవిష్కరించింది
అగ్గిపుల్ల.. సబ్బుబిళ్ళ.. కాదేది ప్రయోగానికి అనర్హం అనే చందాన, ఓ కుర్రాడు పాత బైక్ స్క్రాప్‌తో ఏకంగా ఎలక్ట్రిక్ బైక్ తయారీ చేసి ఔరా అనిపించాడు. లాక్డౌన్ సమయాన్ని వృథా చేయకూడదనే అతని ఆలోచన.. ఇలా అద్భుతాన్ని ఆవిష్కరించింది. అయితే ఈ ఆవిష్కరణ కోసం ఆ కుర్రాడు.. తన తండ్రికి చెప్పిన ఒక్క అబద్ధం ఏమిటి? ఆ అబద్ధం అతని జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది? ఇందుకోసం రాజన్ ఎలా కష్టపడ్డాడో ఇప్పుడు చూద్దాం.. ఢిల్లీ సుభాష్ నగర్‌కు చెందిన రాజన్.. ఒక్కడే పాత రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌ను ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చాడు. అయితే ఈ బైక్ తయారీ వెనుక పెద్ద స్టోరీయే ఉందని కుర్రాడి తండ్రి దశరథ్ శర్మ చెబుతున్నారు. కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఆటపాటలతో కాకుండా.. రాజన్ ఏదో ఒక ప్రయోగం చేయాలని అనుకున్నాడు. ప్రయోగంలో భాగంగా ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ మీద అతని దృష్టి పడింది. ముందు ఎలక్ట్రిక్ సైకిల్ తయారీకి పూనుకోగా.. అదికాస్త విఫలం అయ్యింది. ఆ ప్రయోగంలో రాజన్ గాయపడ్డాడు కూడా. దీంతో రాజన్‌ను తండ్రి అడ్డుకున్నారు. అయితే ఆ కుర్రాడికి ప్రయోగాలంటే చాలా ఇష్టం. అందుకే ఓ ప్లాన్ వేశాడు. స్కూల్ ప్రాజెక్టు వంకతో.. స్కూల్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఎలక్ట్రిక్ బైక్ తయారు చేయాలని టీచర్లు చెప్పినట్లు తండ్రికి అబద్ధం చెప్పాడు రాజన్. అది నిజమని భావించి.. స్నేహితులు, ఆఫీస్ కొలీగ్స్ సాయంతో ఆ ‘అబద్ధపు’ ప్రాజెక్టు డబ్బులు సమకూర్చాడు దశరథ్. అటుపై మాయాపురి జంక్ మార్కెట్ నుంచి ఓ పాత రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తెచ్చి ఇచ్చాడు. ఇక రాజన్ ఆ పాత బండిని ఎలక్ట్రికల్ బైక్‌గా మార్చే పనిలో పడ్డాడు. మూడు నెలల పాటు శ్రమించి ఎలక్ట్రిక్ బైక్‌కు ఒక రూపం తీసుకొచ్చాడు. ఈ ప్రయత్నంలో తండ్రి దశరథ్ రోజూ కొడుకును ప్రొత్సహించడం విశేషం. చివరికి తండ్రికి రాజన్ అసలు విషయం చెప్పడం.. కొడుకు సాధించిన ఘనత చూసి ఆ తండ్రి ఉప్పొంగిపోవడం ఒకదాని వెంట ఒకటి జరిగాయి. ‘‘రాజన్ వయసు పదిహేనేళ్లు. టీచర్లు ఇలాంటి ప్రాజెక్టు ఇవ్వడం ఏంటి? వీడేం ఎలక్ట్రిక్ బైక్ తయారు చేస్తాడని నవ్వుకున్నా. కానీ, తీరా బైక్‌ను చూశాక నా కళ్లారా నేనే నమ్మలేకపోయా’ అంటున్నాడు దశరథ్. విశేషం ఏంటంటే.. గూగుల్, యూట్యూబ్‌లో చూసి ఈ ఈ-బైక్‌ను తయారు చేశాడు రాజన్. గంటకు యాభై కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలిగే ఈ ఈ-బైక్‌ను పరిశీలన పంపనున్నట్లు జిల్లా అధికారి సంత్ రామ్ చెప్తున్నారు. ఈ బైక్ తయారీ సఫలం కావడంతో రాజన్ ఇప్పుడు ఎలక్ట్రిక్ కారును తయారీపై ఫోకస్ పెట్టాడు. చదవండి: Tesla: వారెవ్వా టెస్లా.. ‘లేజర్’తో అద్దాలు శుభ్రం! -
ఈ బైక్ ధరలను మరోసారి పెంచిన రాయల్ ఎన్ఫీల్డ్..!
Royal Enfield Meteor 350: రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లవర్స్‌కు కంపెనీ మరోసారి షాక్‌ను ఇచ్చింది. మిటీయోర్ 350 సిరీస్ మోడల్ బైక్‌ల ధరలను మరోసారి పెంచింది. 2021 జులైలో ఈ బైక్ మోడల్ ధరలను సుమారు రూ. 10,048 మేర పెంచింది. కేవలం రెండు నెలల వ్యవధిలోనే మరోసారి బైక్ ధరలను రాయల్‌ఎన్‌ఫీల్డ్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఫైర్‌బాల్, స్టెల్లార్, సూపర్నోవా అనే మూడు వేరియంట్లపై సుమారు రూ. 6,428 మేర పెంచింది. చదవండి: Apple: మాకు ఎవరీ సహాయం అక్కర్లేదు..! మిటీయోర్ 350 ఫైర్‌బాల్ వేరింయట్ కొత్త ధర రూ.198,537 గాను, స్టెల్లార్ వేరియంట్ కొత్త ధర రూ. 204,527గాను, సూపర్నోవా 350 వేరియంట్ ధర రూ. 214,513 గా నిర్ణయించింది.ఈ ధరలు ఢిల్లీ ఎక్స్-షోరూమ్ కు చెందినవి. ఆయా ప్రాంతాలను బట్టి బైక్ ధరల్లో మార్పులు ఉండవచ్చును. రాయల్ ఎన్ఫీల్డ్ మిటీయోర్ 350 బైక్‌లను గత ఏడాది నవంబర్ నుంచి కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచింది. థండర్బర్డ్ స్థానంలో మిటీయోర్ 350ను రాయల్ ఎన్ఫీల్డ్ ప్రవేశపెట్టింది. చదవండి: బడాబడా కంపెనీలు భారత్ వీడిపోవడానికి కారణం ఇదేనా..! -
మార్కెట్లోకి సరికొత్త డుగ్ డుగ్ బండి వచ్చేసింది!
డుగ్.. డుగ్..డుగ్.. అనే శబ్దం వింటే చాలు ఆ గల్లీ ఉన్న చిన్న పిల్లవాడు కూడా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ వస్తుందని ఇట్టే గుర్తు పట్టేస్తాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ బైక్ కంపెనీకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. గతంలో ఈ ద్విచక్ర వాహనాన్ని ఎక్కువగా ధనిక వర్గం కొనేవారు. కానీ, ప్రస్తుతం మద్య తరగతి ప్రజలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా రాయల్ ఎన్ఫీల్డ్ తన కొత్త తరం క్లాసిక్ 350 మోటార్ సైకిల్ ను భారతదేశంలో ప్రారంభించింది. కంపెనీ అత్యధికంగా అమ్ముడైన ఈ రెట్రో క్రూయిజర్ అప్డేట్ చేసిన వెర్షన్ తో వచ్చింది.(చదవండి: నిరుద్యోగులకు అమెజాన్ తీపికబురు!) సరికొత్త రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 గతంలో ప్రకటించిన మెటియోర్(Meteor) 350 మోటార్ సైకిల్ ఆధారంగా రూపొందించారు. ఈ మోడల్లో కూడా మెటియోర్ 350 లాంటి ఇంజిన్నే అందించారు. అయితే, దీని పవర్ మాత్రం 349సీసీ ఉండడం వల్ల 20పీఎస్ పీక్ పవర్‌ని 27ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మెటియోర్లోని జె ప్లాట్ ఫామ్‌ని ఇందులోకూడా అందించింది. ఇది 11 విభిన్న రంగులలో లభ్యం అవుతుంది. బ్లూటూత్ సహాయంతో స్మార్ట్ ఫోన్కికనెక్ట్ అయ్యి నావిగేషన్‌ని చూపించే ట్రిప్పర్ టర్న్ టు టర్న్ నావిగేషన్‌ని కలిగి ఉన్న రెండవ బైక్ ఇది. అయితే ఇందులో ముందు మోడల్స్‌లో ఉన్న విధంగా కిక్ స్టార్టర్ లేకపోవడం విశేషం. ఈ మోటార్ సైకిల్ పైలట్ ల్యాంపులతో కొత్త హెడ్ ల్యాంప్, ఫ్యూయల్ గేజ్, ఎల్ సీడి ఇన్ఫర్మేషన్ ప్యానెల్ గల ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ కలిగి ఉంది. పాత తరం మోడల్స్ లాగా కాకుండా మెరుగైన ఎర్గోనమిక్స్ కొరకు హ్యాండిల్ బార్ అప్డేట్ చేశారు. ఇది యుఎస్ బి ఛార్జర్, కొత్తగా డిజైన్ చేసిన టెయిల్ లైట్, అప్డేట్ చేసిన ఎగ్జాస్ట్ పైప్, 13-లీటర్ కెపాసిటీ ఫ్యూయల్ ట్యాంక్, మరింత సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవం కొరకు అప్డేట్ చేసిన సీట్లతో వస్తుంది. ఈ బైక్ హోండా హెచ్'నెస్ సీబీ 350, బెనెల్లీ ఇంపీరియల్, జావా మోటార్ సైకిల్స్ వంటి మోడల్స్ తో పోటీ పడనుంది. రాయల్ ఎన్ ఫీల్డ్ 350 మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది. ఫైర్ బాల్ వేరియంట్ ధర - రూ.1.85 లక్షలు, సూపర్ నోవా వేరియంట్ ధర - రూ. 1.86 లక్షలు, స్టెల్లార్ వేరియంట్ ధర -1.90 లక్షలుగా ఉన్నాయి. -
స్టైలిష్ లుక్ తో డుగ్ డుగ్ బండి వచ్చేస్తోంది
డుగ్... డుగ్.. డుగ్... శబ్దంతో రాజసం ఉట్టిపడే బైక్‌పై...అంతే రాయల్‌గా కూర్చుని రయ్యిన వెళుతుంటే... ఆ హుందానే వేరు! 'కొంత'మందికే పరిమితైన వెహికల్‌ను ధనికులు ఎక్కువగా ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు కుర్రకారుకు హాట్ ఫేవరెట్ అయిన ఈ బండి పల్లెటూళ్లలోనే కాదు... మహానగరాల్లోనూ క్రేజీ బైక్‌గా మారింది. అందుకే ఈ బైక్ కు మరిన్ని హంగులు యాడ్ చేసి ఆటో మొబైల్ సంస్థలు విడుదల చేస్తున్నాయి. తాజాగా '2021 న్యూ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350’ను మార్పులు చేసి అందుబాటులోకి తేనున్నాయి. ‘రాయల్’ సిరీస్ గురించి సీరియస్‌గా ఫాలో అయ్యేవారికి ‘2021 న్యూ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350’ గురించి ఆసక్తి ఉంటుంది. ఈ బండి రకరకాల మార్పులతో వస్తున్నట్లు వినికిడి. ‘ఇంజన్’ ‘పవర్ట్రైన్’...మొదలైన ఫీచర్లను ‘మీటిమోర్ 350’ నుండి అరువు తెచ్చుకుంటుంది. కొత్త మోడల్స్‌ను తీసుకురావడంలో పేరున్న రాయల్ కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకొంది. రాబోయే నెలల్లో మాత్రం కొత్త మోడల్స్‌ను చూడవచ్చు అంటున్నారు. చదవండి : ఐఫోన్ లవర్స్‌కు శుభవార్త -
హీరో కొత్త వ్యూహం, రాయల్ ఎన్ఫీల్డ్కు టఫ్ ఫైట్!
మిడిల్ వెయిట్ బైక్ సెగ్మెంట్లో మార్కెట్ రారాజుగా ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీగా సరికొత్త వ్యూహంతో రంగంలోకి దిగుతోంది హీరో మోటర్ కార్ప్. దీని కోసం విదేశీ కంపెనీలతో జట్టు కట్టింది. రాయల్ ఎన్‌ఫీల్డ్‌ని మరిపించేలా కొత్త బైక్‌ను డిజైన్ చేసే పనిలో తలామునకలై ఉన్నారు హీరో టీం మెంబర్స్. సాక్షి, వెబ్‌డెస్క్: ఇండియాలో బైక్ మార్కెట్లో హీరోదే అగ్ర స్థానం. హీరో గ్రూపు నుంచి వచ్చిన స్ల్పెండర్, ప్యాషన్ బైకులదే మార్కెట్లో హవా. అయితే దేశంలో నంబర్ వన్ మోటార్ బైక్ బ్రాండ్‌గా ఉన్నప్పటికీ హీరో బలమంతా ఎంట్రీ లెవల్, 100 సీసీ నుంచి 120 సీసీ బైకుల వరకే ఉంటోంది. అంతకు మించి స్పోర్ట్స్, మిడిల్ వెయిట్ సెగ్మెంట్లో హీరోకు పట్టు చిక్కడం లేదు. దశాబ్ధాల తరబడి ప్రయత్నాలు చేస్తోన్నా నిలదొక్కుకోలేక పోతుంది. రాయల్ ఎన్ఫీల్డ్ మరోవైపు రీలాంచ్‌లో రాయల్ ఎన్ఫీల్డ్ ఇరగదీస్తోంది. 350 సీసీ సెగ్మెంట్లో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్, థండర్ బర్డ్ మోడళ్ల అమ్మకాలు జోరు మీదున్నాయి. 350 సీసీ మిడిల్ వెయిట్ విభాగంలో 90 శాతం మార్కెట్ రాయల్ ఎన్ఫీల్డ్దే. దీంతో 350 సెగ్మెంట్లో వాటా కోసం హీరో కొత్త ప్రయత్నాలు చేస్తోంది. హార్లే డేవిడ్సన్ అమెరికాకు చెందిన ప్రీమియం బైకుల తయారీ కంపెనీ హర్లే డేవిడ్సన్తో జట్టు కట్టింది హీరో మోటర్ కార్ప్. గతంలో హర్లే డేవిడ్సన్ ఇండియా మార్కెట్లోకి వచ్చినా గట్టిగా నిలదొక్కుకోలేక పోయింది. దేశంలో అక్కడక్కడ తప్ప పెద్దగా అమ్మకాలు లేవు. పనులు మొదలయ్యాయి రాయల్ ఎన్‌ఫీల్డ్‌కి పోటీగా మిడిల్‌వెయిట్ విభాగంలో 350 సీసీ ఇంజన్ సామర్థ్యంతో కొత్త బైకును మార్కెట్లోకి తెచ్చేందుకు హార్లే డేవిడ్సన్, హీరో కంపెనీలు చేతులు కలిపాయి. ‘ 350 సెగ్మెంట్లో బైకు తయారీ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే బైకు ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందో ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమని హీరో మోటర్ కార్ప్ ఫైనాన్షియల్ ఛీఫ్ ఆఫీసర్ నిరంజన్ గుప్తా ‘మనీ కంట్రోల్’కి వెల్లడించారు. ధరపై ఆసక్తి ఎంట్రీలెవల్ బైక్ మార్కెట్లో హీరో మోటర్ కార్ప్ది అగ్రస్థానమైతే, ప్రీమియం బైకులు మాత్రమే తయారు చేయడం హార్లే డేవిడ్సన్ ప్రత్యేకత. మరీ ఈ రెండు కంపెనీల కలయికలో వస్తోన్న మిడిల్ వెయిట్ సెగ్మెంట్ బైక్ ధర ఎంత ఉండవచ్చనేది మార్కెట్ వర్గాలు ఆసక్తిగా ఉన్నాయి. -
పది వేలకే బజాజ్ చేతక్ ... ఎప్పుడంటే ..
హెడ్డింగ్ చూసి నమ్మలేకపోతున్నారా ? కానీ ఇది నిజం ! ఒక్క బజాజే కాదు రాయల్ ఎన్ఫీల్డ్, రాజ్‌దూత్, షెవర్లెట్, అంబాసిడర్ అన్ని కార్ల ధరలు అగ్గువే !?. బైకులైతే పది వేలకు అటు ఇటు కార్లయితే ఇరవై నుంచి ముప్పే వేల రూపాయలు. అయితే ఈ ధరలన్నీ ఇప్పటి కావు. ఆర్థిక సంస్కరణలు దేశంలో అడుగు పెట్టడానికి ముందు స్వాతంత్రం తర్వాత కాలానికి చెందినవి. ఆ రోజుల్లో వాహనాల ధరలు ఎలా ఉన్నాయి. వాటిని ఆయా కంపెనీలు ఎలా ప్రమోట్ చేశాయి, అప్పటి పన్నుల వివరాలు సరదాగా ఓ సారి చూద్దాం. సాక్షి, వెబ్‌డెస్క్: ఆటోమొబైల్ ఇండస్ట్రీలో బజాజ్‌ది ప్రత్యేక స్థానం. నైన్టీస్లో బజాజ్ అమ్మకాల్లో చేతక్ స్కూటరే నంబర్ వన్. అయితే బైక్‌ల క్రేజ్ పెరగడంతో క్రమంగా స్కూటర్ల మార్కెట్ డౌన్ అయ్యింది. చేతక్ కూడా వెనుకపడి పోయింది. అయితే ఇప్పుడు కొంగొత్తగా బజాల్ చేతక్ ఈవీ అంటూ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి వస్తోంది. అయితే 1987లో బజాజ్ చేతక్ మార్కెటోకి వచ్చినప్పుడు దాని ధర రూ. 10,652 మాత్రమే. స్కూటర్ ధర తక్కువగా చూపించేందుకు పన్ను తక్కువగా ఉండే పాండిచ్చేరి ఎక్స్‌షోరూం ధరను పేర్కొంది బజాజ్. బజాజ్ వెస్పా స్కూటర్ అన్ని పన్నులతో కలుపుకుని కేవలం 2,129 మనకు వచ్చేది. ఆ ధరకు కొనాలంటే మనం టైం మిషన్‌లో 1961కి వెళ్లాలి. ఇక ఇదే స్కూటర్‌కి వెనుక సీటు, స్పేర్ వీల్ , ట్యూబ్ కావాలంటే అదనంగా మరో రూ. 114 చెల్లిస్తే సరి. ఇప్పుడంటే డౌన్‌పేమెంట్ కట్టి ఈఎంఐలకి వెళ్లడం సాధారణ విషయంగా మారింది. కానీ 80ల్లో అదేంతో కష్టమైన పని. 80వ దశకంలో రాయల్ ఎన్‌ఫీల్డ్‌కి పోటీగా వచ్చిన రాజ్‌దూత్ తన అమ్మకాలు పెంచుకునేందుకు ఈఎంఐని ప్రవేశపెట్టింది. కేవలం రూ. 3,500 కడితే చాలు బండి మీ సొంతం అంటూ ప్రకటనలు గుప్పించింది. మైలేజీ రావాలంటే 100 సీసీ నుంచి 125 సీసీ, పవర్ కావాలంటే 150 సీసీ నుంచి 350 సీసీ బైకులు ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి. కానీ 1963లోనే ఏకంగా 750 సీసీ ఇంజన్‌తో బైకును మార్కెట్లోకి రాయల్ ఎన్ఫీల్డ్ తెచ్చింది. రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్ సెప్టార్ పేరుతో వచ్చిన బైక్ ఆ రోజుల్లో ఓ సంచలనం. దేశీ వాహన తయారీ కంపెనీల్లో మహీంద్రా అండ్ మహీంద్రాని ప్రత్యేక స్థానం. పదిహేనేళ్ల కిందటి వరకు కూడా రూరల్ ఇండియా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టులో మహీంద్రా జీపులది ప్రత్యేక స్థానం. అయితే 1960 మహీంద్రా జీపు ధర కేవలం రూ. 12,421 మాత్రమే. అంతేకాదు ఆ రోజుల్లో అమ్మకాలు పెంచేందుకు రూ. 200 డిస్కౌంట్ కూడా ప్రకటించింది. జనరల్ మోటార్స్ వారి షెవర్లేట్ కారుకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. అందరికీ సుపరిచితమైన బ్రాండ్. స్వాతంత్రానికి పూర్వం షెవర్లెట్ కారును కలిగి ఉండటం స్టేటస్ సింబల్‌గా ఉండేది. ఈ రోజుల్లో రచయితలు తమ కథనాయకుడు, నాయికల ఎంత ధనవంతులో వర్ణించేందుకు షెవర్లెట్ పేరును తరచుగా ఉపయోగించేవారు. 1936లో షెవర్లెట్ కారు ధర రూ.3,675. ఈ ధరకు ఇప్పుడు కారు టైరు కూడా రావడం లేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు అత్యధికంగా ఉపయోగించిన కారు అంబాసిడర్. ఆ తర్వాత పద్మినీ ప్రీమియర్, స్టాండర్డ్ హెరాల్డ్‌లు. ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్థాన్ మోటార్స్ తయారు చేసిన ఈ కార్లు ఇంచుమించు 2000 వరకు ఇండియా రోడ్లపై తమ ఆధిపత్యం చూపించాయి. 1972లో ఆ కార్ల ధరలు ఎలా ఉన్నాయో ఈ లుక్కేయ్యండి. కార్లకు ఇప్పుడైతే ఎక్సైజ్ డ్యూటీ కారు ఇంజన్ కెపాసిటీని బట్టి 12.50 శాతం నుంచి 30 శాతం వరకు వసూలు చేస్తున్నారు. 1963లో స్టాండర్డ్ కంపానియన్ కారు ధర రూ. 12,635 అయితే ఎక్సైజ్ డ్యూటీ కేవలం రూ. 333 మాత్రమే. ఇప్పుడీ పాత జ్ఙాపకాలన్నీ ఎందుకు తెరపైకి వచ్చాయంటే.... ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఫియట్ కారుకు సంబంధించిన పేపర్ యాడ్‌ను ట్విట్టర్లో షేర్ చేశారు. ఆ యాడ్‌లో ఫియట్ కారు ధర రూ.9,800లుగా ఉంది. ఆహ్ ! ద గుడ్ ఓల్డ్ డేస్ అంటూ కామెంట్ పెట్టారు. ఆనంద్ మహీంద్రా ట్వీట్‌కు చాలా మంది నెటిజన్లు స్పందించారు. తమ అనుభవాలను కూడా షేర్ చేసుకున్నారు. Ah the good old days… pic.twitter.com/SNH3Cwirki — anand mahindra (@anandmahindra) July 14, 2021 -
‘రాయల్’ మరింత ఖరీదు
న్యూఢిల్లీ: రాయల్ ఎన్ఫీల్డ్ తన బైకుల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తయారీ ఖర్చు పెరిగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాయల్ ఎన్ఫీల్డ్ ప్రకటించింది. రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి వస్తోన్న క్లాసిక్ 350, బెల్లెట్ 350, మీటియర్ 350, హిమాలయన్, ఇంటర్సెప్టార్ 650, కాంటినెంటల్ జీటీ 650 మోడల్స్‌పై ధరలు పెంచింది. జులై 1 నుంచి పెరిగిన ధరలు వర్తిస్తున్నాయి. 4.25 శాతం రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మార్కెట్లో ఉన్న వెహికల్స్‌లో క్లాసిక్ 350 మోడల్ అమ్మకాలు ఎక్కువ. దీంతో పాటు ఇటీవల మార్కెట్లోకి వచ్చిన మోడల్ మీటియర్ 350. ఈ రెండు మోడల్స్‌కి సంబంధించిన ధరలే అధికంగా పెరిగాయి. క్లాసిక్ 350పై 4.24 శాతం, మీటియర్ 350పై 4.25 శాతం ధరలు అధికం అయ్యాయి. పెరిగిన ధరలు జులై నుంచి అమ్మలోకి రానున్నాయి. పెరిగిన ధరలు ఇలా ఉన్నాయి (రూపాయల్లో) మీటియర్ వేరియంట్స్ కొత్తధర పాతధర ఫైర్‌బాల్ 1,92,109 1,84,319 స్టెల్లార్ 1,98,099 1,90,079 సూపర్నోవా 2,08,084 1,99,679 బుల్లెట్ 350 కొత్తధర పాతధర సిల్వర్ ఓనిక్స్బ్లాక్ 1,58,485 1,53,718 బ్లాక్ 1,65,754 1,60,775 350 ఈఎస్ 1,82,190 1,76,731 -
రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ కొన్న వారికి గుడ్ న్యూస్!
రాయల్ ఎన్ఫీల్డ్ (ఆర్ఈ) కంపెనీకి చెందిన కొత్త బైక్ ఈ మధ్య కొన్నారా? అయితే, మీకు ఒక తీపికబురు. కంపెనీ తాజాగా సర్వీస్ కేర్ 24 అనే కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఉన్న వారు ఒకసారి ఉచితంగానే ఫ్రీ సర్వీస్ పొందొచ్చు. ఈ సర్వీస్ కేర్ 24లో నాలుగు జనరల్ సర్వీసులు, రెండు సార్లు ఇంజిన్ ఆయిల్ మార్చుకోవచ్చు. అయితే, బైక్ ఛాసిస్ నెంబరు వెరిఫికేషన్ తర్వాతనే ఈ సర్వీస్ అందించనున్నట్లు తెలిపింది. సర్వీస్ కేర్ 24లో భాగంగా ఒకసారి ఫుల్ సర్విస్ చేస్తే అన్ని పన్నులతో కలిపి రూ.2,499 ఖర్చు అవుతుంది. ఈ ప్యాకేజ్ తీసుకున్న వారికి అదనపు రిపేర్ అవసరం అయితే విడిభాగాలపై, లూబ్రికేషన్పై 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే లేబర్ చార్జీల్లో 20 శాతం తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఈ సర్వీస్ ప్యాకేజ్ కొనుగోలు చేయాలని భావించే వారు రాయల్ ఎన్ఫీల్డ్ వెబ్‌సైట్‌కు వెళ్లి రిజిస్టర్ చేసుకోవచ్చు. ప్యాకేజీని కొనుగోలు చేయొచ్చు. ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసిన తర్వాత ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. రాయల్ ఎన్ ఫీల్డ్ నిపుణులు ఈ సర్విస్ అందించనున్నట్లు పేర్కొంది. మా వాహనాల పట్ల అదనపు సంరక్షణ, శ్రద్ధ అవసరం అని మాకు ఎల్లప్పుడూ తెలుసనని కంపెనీ పేర్కొంది. చదవండి: గంటకు 70 కి.మీ వేగం.. రూ.80కే.. 800 కిలోమీటర్ల ప్రయాణం -
రాయల్ ఎన్ఫీల్డ్ మీటియర్ 350 వచ్చేసింది
సాక్షి,ముంబై: కరోనా వైరస్ సంక్షోభంతో ఆటోపరిశ్రమ కుదేలైన తరుణంలో విలాసవంతమైన బైకులకు పేరుగాంచిన రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త బైక్‌ను లాంచ్ చేసింది. 350 సీసీ సెగ్మెంట్లో క్రూయిజర్ బైక్ మీటీయర్ 350ని శుక్రవారం ఆవిష్కరించింది. రూ.1.76-1.91 (ఎక్స్-షోరూమ్ చెన్నై) లక్షల ధరతో విడుదల చేసింది. ఐషర్ మోటార్స్‌లో భాగమైన మిడ్-సైజ్ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ తన సరికొత్త మీటీయర్ను తీసుకొచ్చింది. రాయల్ ఎన్ఫీల్డ్ మీటియర్ 350 ఫైర్‌బాల్, స్టెల్లార్, సూపర్నోవా అనే మూడు ఎడిషన్లలో లభిస్తుంది. లాంగ్ జర్నీలకు అనుగుణంగా ఈ అన్ని ఎడిషన్లలో అల్లాయ్ వీల్స్, ట్యూబ్ లెస్ టైర్లను స్టాండర్డ్ గా అమర్చారు. మీటియర్ 350 ఫైర్‌బాల్ ప్రారంభ ధర రూ .1,75,817 వద్ద లభిస్తుండగా, స్టెల్లార్ ధర 1,81,326 రూపాయలు, సూపర్నోవా ధర రూ .1,90,536 (అన్ని ఎక్స్-షోరూమ్ చెన్నై ధరలు) గా ఉండనున్నాయి. ఇంజన్: బీఎస్-6 349 సీసీ ఎయిర్-ఆయిల్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది, ఇది 4,000 ఆర్పీఎమ్ వద్ద 20.2 బిహెచ్పీ , 27 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 3డీ ట్రిమ్ రింగ్, ఫ్లోటింగ్ ఎల్సీడీ సెమీ అనలాగ్ స్పీడోమీటర్, హాలోజెన్ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, రైజ్డ్ హ్యాండిల్ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. కొత్త, అనుభవజ్ఞులైన రైడర్లకు గొప్ప క్రూయిజింగ్ అనుభవాన్ని తమకొత్త 350 మీటియర్ అందిస్తుందని ఐషర్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ లాల్ చెప్పారు. ఈ బైక్‌ను కొనుగోలు చేసినపుడు వినియోగదారులు కస్టమైజ్డ్ ఆఫ్లన్లను ఎంచుకోవచ్చని రాయల్ ఎన్ఫీల్డ్ సీఈఓ వినోద్ కె దాసరి తెలిపారు. రెండు అత్యాధునిక సాంకేతిక కేంద్రాలైన చెన్నై, యూకేలోని బ్రంటింగ్థోర్ప్లోని డిజైనర్లు, ఇంజనీర్లు ఈ కొత్త మోడల్ బైక్‌ను రూపొందించారని వెల్లడించారు. Cruise through the open road on a motorcycle that’s truly a reflection of you. Personalise your Royal Enfield Meteor with the Make It Yours 3D configurator, available on the Royal Enfield App and https://t.co/Ey6r4V1IzN Visit: https://t.co/6mrtuuF2s1 #Meteor350#CruiseEasy pic.twitter.com/3OAv51zdHJ — Royal Enfield (@royalenfield) November 6, 2020 -
కీలక నిర్ణయం దిశగా రాయల్ ఎన్ఫీల్డ్
ముంబై: దిగ్గజ ఐకానిక్ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ కీలక నిర్ణయం తీసుకోనుంది. వ్యాపారాన్ని పుంజుకునేందుకు అనేక చర్యలు చేపట్టబోతుంది. దేశంలోని డజన్‌కుపైగా ప్రాంతీయ కార్యాలయాలను మూసివేస్తున్నట్లు సంస్థ ఉద్యోగులు తెలిపారు. నష్టాలను పూడ్చుకునేందుకు గుర్గావ్, చెన్నై, బెంగుళూరు, ముంబై, జార్ఖండ్, హైదరాబాద్, భువనేశ్వర్ తదితర రాష్ట్రాలలో ప్రాంతీయ కార్యాలయాలను వేంటనే మూసివేయనున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. ఉద్యోగుల తొలగింపు ఉండకపోవచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కార్యాలయాల మూసివేతపై పరిపాలన విభాగం కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. కార్యాలయ మూసివేత నిర్ణయంపై సీసీఓ(చీఫ్ కమర్షియల్ ఆఫీసర్) లలిత్ మాలిక్ దృవీకరించారు. ఆయన విలేకర్ల సమావేశంలో స్పందిస్తు.. కొన్ని ప్రాంతీయ కార్యాలయాలను మూసివేత నిర్ణయం తీసుకున్నామని అన్నారు. దీని ద్వారా తమ ఉద్యోగులకు ప్రయాణ సమయం ఆదా అవుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుతం లాక్‌డౌన్‌ను సడలించడం ద్వారా తమ అమ్మకాలు పుంజుకున్నాయని రాయల్ ఎన్ఫీల్డ్ ప్రకటించింది. దేశంలో సంస్థ డీలర్‌షిప్‌లను పెంచబోతున్నట్లు ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 100కుపైగా నూతన రిటైల్ స్టోర్స్‌ను తెరవబోతున్నట్లు ప్రకటించింది. అత్యాధునిక బైక్‌ల రూపకల్పనలో రాయల్ ఎన్ఫీల్డ్ ప్రత్యేక స్థానం సాధించిన విషయం తెలిసిందే. (చదవండి: రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త బైక్ : తక్కువ ధరలో) -
ఐషర్- యూఫ్లెక్స్ షేర్లు భల్లేభల్లే
విదేశీ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 554 పాయింట్లు జంప్‌చేసి 32,160ను తాకగా.. నిఫ్టీ 156 పాయింట్లు ఎగసి 9,471 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల కారణంగా ఆటో రంగ దిగ్గజం ఐషర్ మోటార్స్, ఫ్లెక్సిబుల్ ప్యాకేజింగ్ దిగ్గజం యూఫ్లెక్స్ లిమిటెడ్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. ఐషర్ మోటార్స్ చిన్న ఇన్వెస్టర్లకు అందుబాటు, లిక్విడిటీ పెంపునకు వీలుగా షేరు ముఖ విలువను విభజించే యోచనలో ఉన్నట్లు ఆటో రంగ దిగ్గజం ఐషర్ మోటార్స్ పేర్కొంది. కంపెనీ ఐషర్ బ్రాండుతో వాణిజ్య వాహనాలు, బస్సులపాటు రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ మోటార్ సైకిళ్లను సైతం రూపొందించే సంగతి తెలిసిందే. కాగా.. రూ. 10 ముఖ విలువగల షేరు విభజన ప్రతిపాదనపై జూన్ 12న నిర్వహించనున్న కంపెనీ బోర్డు సమావేశంలో నిర్ణయించనున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా గత ఆర్థిక సంవత్సర(2019-20) చివరి త్రైమాసిక ఫలితాలను సైతం విడుదల చేయనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఐషర్ మోటార్స్ షేరు 9 శాతం దూసుకెళ్లి రూ. 16,320 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 16,430 వరకూ ఎగసింది. ఇది రెండు నెలల గరిష్టంకాగా.. గత మూడు రోజుల్లో ఈ కౌంటర్ 12 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో రాయల్ ఎన్ఫీల్డ్ వాహన విక్రయాలు 17 శాతం క్షీణించి 1.63 లక్షలకు పరిమితమైనట్లు తెలుస్తోంది. యూఫ్లెక్స్ లిమిటెడ్ ఫ్లెక్స్ ప్రొటెక్ట్ పేరుతో వ్యక్తిగత రక్షణ కల్పించగల కవరాల్ ప్రొడక్టును రూపొందించినట్లు ప్యాకేజింగ్ సొల్యూషన్ల కంపెనీ యూఫ్లెక్స్ లిమిటెడ్ తాజాగా వెల్లడించింది. ఐఐటీ, ఐఎన్ఎంఏఎస్, డీఆర్డీవో ఢిల్లీతో కలసి సంయుక్తంగా ఈ ప్రొడక్టును అభివృద్ఢి చేసినట్లు తెలియజేసింది. నాలుగు లేయర్ల రక్షణతోపాటు.. యాంటీమైక్రోబయల్ కోటింగ్‌తో ఫ్లెక్స్ ప్రొటెక్ట్‌ను తయారు చేసినట్లు వివరించింది. ఈ ప్రొడక్టుకు డీఆర్డీవో అనుమతి లభించినట్లు తెలియజేసింది. కోవిడ్-19 సోకినవారికి వైద్య సేవలు అందించే ఆరోగ్య కార్యకర్తలకు ఈ ప్రొడక్ట్ ప్రయోజనకరంగా నిలుస్తుందని తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో యూఫ్లెక్స్ షేరు 8.5 శాతం జంప్‌చేసి రూ. 188 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 204 వరకూ ఎగసింది. ఈ ప్రొడక్టును కెమిస్టులు, ఈకామర్స్ ద్వారా విక్రయించే సన్నాహాలు చేస్తున్నట్లు యూఫ్లెక్స్ పేర్కొంది. -
చల్ వాహన రంగ!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడిపరమైన లాక్డౌన్ సహా పలు కారణాలతో కుదేలైన ఆటోమొబైల్ రంగం మళ్లీ పుంజుకునే ప్రయత్నాల్లో పడింది. వేసవి సీజన్ అమ్మకాలకు సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా క్రమంగా ఆంక్షలు సడలిస్తుండటంతో ఇప్పటిదాకా మూతబడిన షోరూమ్‌లను, నిల్చిపోయిన ఉత్పత్తిని కంపెనీలు పునఃప్రారంభిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 600 డీలర్‌షిప్‌లను తిరిగి ప్రారంభించినట్లు కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) బుధవారం వెల్లడించింది. వాహనాల డెలివరీలు కూడా మొదలుపెట్టినట్లు వివరించింది. అలాగే, వాహన కొనుగోలు ప్రక్రియను సులభతరం చేసేలా అవుట్‌లెట్స్ కొత్త ప్రమాణాలు అమలు చేస్తున్నట్లు, డిజిటల్ సౌలభ్యాన్ని సైతం అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ ఈడీ (మార్కెటింగ్, సేల్స్ విభాగం) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ‘గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా సుమారు 600 డీలర్‌షిప్‌లను తెరవగలిగాం. మిగతా ప్రాంతాల్లోనూ అవసరమైన అనుమతుల కోసం డీలర్లు దరఖాస్తు చేసుకున్నారు‘ అని వివరించారు. ఇప్పటికే 55 వాహనాలు డెలివరీ కూడా చేసినట్లు చెప్పారు. కంపెనీకి దేశవ్యాప్తంగా 1,960 నగరాలు, పట్టణాల్లో 3,080 డీలర్‌షిప్‌లు ఉన్నాయి. తాజాగా తెరిచిన వాటిల్లో 474 ఏరీనా అవుట్‌లెట్స్, 80 నెక్సా డీలర్‌షిప్‌లు, 45 వాణిజ్య వాహనాల అవుట్‌లెట్స్ ఉన్నాయని శ్రీవాస్తవ చెప్పారు. కార్లకు డోర్ స్టెప్ డెలివరీ సేవలు కూడా అందిస్తున్నట్లు చెప్పారు. ఉత్పత్తి మొదలు.. దేశవ్యాప్తంగా తమ ఫ్యాక్టరీలన్నింటిలోనూ కార్యకలాపాలు ప్రారంభించినట్లు ద్విచక్ర, త్రిచక్ర వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ వెల్లడించింది. హోసూరు, మైసూరు, నాలాగఢ్‌లోని ఫ్యాక్టరీల్లో కార్యకలాపాలు మొదలుపెట్టినట్లు ఒక ప్రకటనలో వివరించింది. అటు, మారుతీ సుజుకీ తమ మానెసర్ ప్లాంటులో ఉత్పత్తిని మే 12 నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఇక లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్–బెంజ్ సైతం పుణేలోని చకన్ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభించినట్లు వెల్లడించింది. మహారాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు పరిమిత సంఖ్యలో సిబ్బందితో మొదలుపెట్టినట్లు వివరించింది. కొన్ని ప్రాంతాల్లో డీలర్‌షిప్‌లు కూడా కార్యకలాపాలు పునఃప్రారంభించినట్లు పేర్కొంది. ఇక యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ ఇసుజు మోటార్స్ ఇండియా సైతం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీ ప్లాంటులో కార్యకలాపాల పునఃప్రారంభానికి ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చినట్లు వెల్లడించింది. తయారీకి సంబంధించిన సన్నాహాలు మొదలుపెట్టినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్ఫీల్డ్ ప్లాంట్ ప్రారంభం చెన్నై: ఐచర్ మోటార్స్‌కు చెందిన రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ.. తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలో ఉన్న ఒరగాడమ్ తయారీ యూనిట్లో కార్యకలాపాలను బుధవారం ప్రారంభించింది. ఈ సంస్థకు చెన్నైలోని ఒరగాడమ్‌తోపాటు, తిరువొత్తియార్, వల్లమ్ వడగల్ వద్ద కూడా ప్లాంట్లు ఉన్నాయి. తొలుత ఒరగాడమ్ ప్లాంట్‌లో కొద్ది మంది సిబ్బందితో ఒకే షిఫ్ట్‌గా పనులు ప్రారంభించినట్టు సంస్థ ప్రకటించింది. తిరువొత్తియార్, వడగల్ ప్లాంట్లలో క్రమంగా కార్యకలాపాలను ప్రారంభిస్తామని తెలిపింది. షోరూ ములు పాక్షికంగా కార్యకలా పాలు మొదలయ్యా యని, 10 రోజుల్లో దాదాపు 300 షోరూమ్‌లు షురూ అవుతాయని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. అదే బాటలో హ్యుందాయ్.. వివిధ రాష్ట్రాల్లో 250 దాకా కంపెనీ డీలర్‌షిప్‌లు కార్యకలాపాలు పునఃప్రారంభించినట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా వెల్లడించింది. ఈశాన్య రాష్ట్రాలు, కేరళ, కర్ణాటక, ఉత్తరాఖండ్ తదితర ప్రాంతాల్లో ఇవి ఉన్నాయని పేర్కొంది. కంపెనీకి దేశవ్యాప్తంగా సుమారు 500 పైచిలుకు డీలర్‌షిప్‌లు ఉన్నాయి. ‘రెండు రోజులుగా వాహనాల డెలివరీలు కూడా మొదలుపెట్టాం. పెండింగ్ బుకింగ్స్ చాలా ఉన్నాయి. డీలర్ల దగ్గరున్న నిల్వలు వీటికి సరిపోతాయి‘ అని సంస్థ డైరెక్టర్ (సేల్స్, మార్కెటింగ్) తరుణ్ గర్గ్ తెలిపారు. మిగతా ప్రాంతాల్లోని డీలర్లు కూడా అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నారని, రాగానే కార్యకలాపాలు ప్రారంభిస్తారని వివరించారు. కరోనా కష్టకాలంలో కొనుగోలుదారులు ఈఎంఐల గురించి ఆందోళన చెందకుండా కొన్ని కార్ల మోడల్స్‌పై ఈఎంఐ అష్యూరెన్స్ పేరిట ప్రత్యేక ఆఫర్ ఇస్తున్నామని గర్గ్ చెప్పారు. హోండాకు సిబ్బంది సమస్యలు.. తయారీ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిబ్బంది కొరత సమస్యగా మారిందని హోండా కార్స్ ఇండియా (హెచ్‌సీఐఎల్) తెలిపింది. రాజస్థాన్‌లోని తపుకరా ప్లాంట్‌కి అనుమతులు గతవారమే వచ్చినా ప్రయాణాలపై ఆంక్షలతో కార్మికులు రావడానికి ఇబ్బందులు ఉన్నాయని వివరించింది. వచ్చే వారం కార్యకలాపాలు మొదలుపెట్టే ప్రణాళికల్లో ఉన్నట్లు పేర్కొంది. అలాగే అనుమతులు, సిబ్బంది కొరత సమస్యలను అధిగమించాకా గ్రేటర్ నోయిడా ప్లాంటులోనూ ఉత్పత్తి ప్రారంభించగలమని హెచ్‌సీఐఎల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజేశ్ గోయల్ తెలిపారు. అటు, డీలర్‌షిప్‌ల్లో కొన్ని తిరిగి తెరుచుకున్నట్లు వివరించారు. -
రాయల్ ఎన్ఫీల్డ్ రూ.75 వేలకే..
తాడేపల్లిరూరల్: పట్టణ పరిధిలో నివాసం ఉండే ఓ యువకుడు ఓఎల్ఎక్స్ యాప్‌ను నమ్ముకొని నిండా మునిగి లబోదిబోమంటూ ఆదివారం తాడేపల్లి పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి కథనం మేరకు... మహానాడులో నివాసం ఉండే నాగం వెంకటేశ్వరరావు అనే యువకుడు ఓఎల్ఎక్స్లో రాయల్ ఎన్ఫీల్డ్ ద్విచక్రవాహనం అమ్మకానికి రావడంతో దాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధపడ్డాడు. ఓఎల్ఎక్స్లో రాయల్ ఎన్ఫీల్డ్ ఫొటోతో పాటు అమ్మకందారుని ఫోన్ నెంబర్ 8168232398 కలిగి ఉంది. ఆ వ్యక్తికి ఫోన్ చేయగా తాను ఆర్మీలో విశాఖపట్నంలో పనిచేస్తానని చెప్పాడు. ఇక్కడ నుంచి జమ్మూకాశ్మీర్‌కు బదిలీ అయిందని, అందుకే రూ.2 లక్షల వాహనాన్ని రూ.75 వేలకే అమ్ముతున్నానని నమ్మబలికాడు. మొదట గూగుల్‌పే ద్వారా రూ.5 వేలు నగదు చెల్లించి, విశాఖ వచ్చి వాహనాన్ని చూసుకోవచ్చని చెప్పాడు. నగదు చెల్లించిన తర్వాత ద్విచక్రవాహనం విలువ రూ.89 వేలు ఇస్తే ఇస్తానంటూ చెప్పడంతో, వెంకటేశ్వరరావు నమ్మి మిగతా నగదును కూడా నాలుగు సార్లు గూగుల్‌పేలో చెల్లించాడు. ద్విచక్ర వాహనాన్ని ట్రాన్స్‌పోర్ట్‌లో పంపిస్తానని చెప్పి వారం అవుతున్నా పంపించలేదని, ఆర్మీ అతను ఓఎల్ఎక్స్లో ఇచ్చిన ఫోన్ నెంబర్‌కు ఫోన్ చేస్తే ఎటువంటి స్పందన లేదని వాపోయాడు. జరిగిన ఘటనపై తాడేపల్లి ఎస్సై శ్రీనివాసరావు కేసు నమోదు చేసి, సైబర్‌క్రైమ్ విభాగానికి కేసు అప్పగించారు. -
రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయ కొత్త మోడల్
సాక్షి, న్యూఢిల్లీ : రాయల్ ఎన్ఫీల్డ్ రానున్న కొత్త ఉద్గార నిబంధనలకనుగుణంగా పాపులర్ మోడల్ హిమాలయను బైక్‌ను అప్డేట్ చేసింది. బీఎస్-6 ఇంజిన్‌తో సోమవారం లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ .1.86 లక్షల (ఎక్స్‌షోరూమ్, న్యూఢిల్లీ) గా ఉంచినట్లు కంపనీ తెలిపింది. ఏబీఎస్ ఫీచర్‌తో మూడు రంగుల్లో వీటిని తీసుకొచ్చింది. 411 సీసీ ఇంజీన్, 24.3 బీహెచ్పీ పవర్, 32 ఎన్ఎం టార్క్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. బుకింగ్స్‌ను ఇప్పటికే ప్రారంభించగా, మూడేళ్ల వారంటీ ప్యాకేజీని అందిస్తోంది. విలక్షణమైన అడ్వెంచర్ టూరర్ గా 2016 నుండి, హిమాలయ బైక్స్ జాతీయంగా అంతర్జాతీయంగా ఆదరణ పొందిందని రాయల్ ఎన్ఫీల్డ్ సీఈవో వినోద్ దాసరి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేకమైన ఫీచర్స్, డిజైన్ ఫంక్షన్లతో కొత్త బిఎస్-6 హిమాలయన్ లాంచ్ చేయడం దేశంలో అడ్వెంచర్ మోటార్ సైక్లింగ్ కొత్త ప్రమాణాలను ఏర్పరచడంతోపాటు, రైడర్లను ఆకట్టుకుంటుందనే విశ్వాసాన్ని కంపెనీకి కలిగిస్తోందన్నారు. తమ కొత్త బైక్స్ భారతదేశంలోని రాయల్ ఎన్ఫీల్డ్ డీలర్‌షిప్‌లలో లభిస్తాయని అన్నారు. అలాగే హెల్మెట్లు, జెర్సీలు, టీ-షర్టులు, స్వెర్ట్‌షర్ట్స్, హెడ్‌గేర్ తదితరాలను సరికొత్త గా తీసుకొస్తున్నట్టు చెప్పారు. స్నో వైట్, గ్రానైట్ కలర్ ఆప్షన్ బైక్ ధర రూ .1,86,811 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం స్లీట్ గ్రే , గ్రావెల్ గ్రే మోడల్ ధర రూ .1,89,565 (ఎక్స్-షోరూమ్) కొత్తగా వచ్చిన డ్యూయల్ టోన్ కలర్స్ - రాక్ రెడ్ , లేక్ బ్లూ - రూ .1,91,401 (ఎక్స్-షోరూమ్) వద్ద లభిస్తాయి. -
ఎన్ఫీల్డ్ క్లాసిక్‌కు పోటీగా నయా బైక్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రీమియం బైక్‌ల బ్రాండ్ బెనెల్లి కొత్త బైక్ ‘ఇంపీరియల్ 400’ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ధర రూ.1.69 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించింది. ఎరుపు, వెండి, నలుపు రంగుల్లో లభిస్తుంది. రూ. 4 వేలు టోకెన్ ధర చెల్లించి బెనెల్లి ఇండియా, కంపెనీ వెబ్సైట్ ద్వారా ఈ బైక్‌ను బుక్ చేసుకోవచ్చు. 374 సీసీ సామర్థ్యం కలిగిన ఇంపీరియల్ 400 బైక్ బీఎస్-4 ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేశారు. సింగిల్ సిలెండర్, 4-స్ట్రోక్, ఎయిర్ కూల్డ్, 21 పీఎస్, 29 ఎన్ఎం పీక్ టార్క్యూ ఎఫ్ ఇంజిన్, 5 స్పీడ్ గేర్‌బాక్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. స్టీల్ డబుల్ క్రాడిల్ ఫ్రేమ్‌తో పాటు ముందు భాగంలో 41 మిల్లిమీటర్ల టెలిస్కోపిక్ ఫోర్క్ అమర్చారు. ముందు 19 అంగులాల టైరు, వెనుక 18 అంగులాల టైరుతో పాటు పీనట్ షేప్ ఫ్యూయల్ ట్యాంకు, స్ప్లిట్ సీట్ సెటప్‌లతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. బైకు తిరిగిన కిలోమీటర్లతో సంబంధం లేకుండా మూడేళ్ల పాటు వారెంటీ ఇవ్వనున్నట్టు బెనెల్లి ఇండియా తెలిపింది. మొదటి రెండేళ్లు కాంప్లిమెంటరీ సర్వీసు అందిస్తామని పేర్కొంది. వీటితో పాటు రెండేళ్లు పూర్తైన తర్వాత వార్షిక నిర్వహణ కాంట్రాక్టు కింద సేవలు అందించనున్నట్టు వెల్లడించింది. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350, జవా స్టాండర్డ్ బైక్‌లకు ‘ఇంపీరియల్ 400’ గట్టి పోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త బైక్ : తక్కువ ధరలో
సాక్షి, ముంబై: రాయల్ ఎన్ఫీల్డ్ తన క్లాసిక్ 350 మోడల్ బైక్‌లో బడ్జెట్ ధరలో ఒక కొత్త వెర్షన్‌ను లాంచ్ చేసింది. క్లాసిక్ 350 ఎస్ పేరుతో తీసుకొచ్చిన ఈ బైక్ ధరను రూ .1.45 లక్షలు (ఎక్స్-షోరూమ్,న్యూఢిల్లీ) గా నిర్ణయించింది. క్లాసిక్ 350 లా డ్యూయల్-ఛానల్ ఏబీస్ మాదిరిగా కాకుండా క్లాసిక్ 350 ఎస్ లోని 'ఎస్' సింగిల్-ఛానల్ ఏబీఎస్ను సూచిస్తుంది. ధర: ఈ క్లాసిక్ బైక్ 350 ధర రూ .1.54 లక్షల ధరతో పోలిస్తే కొత్త క్లాసిక్ 350 ఎస్ వెర్షన్ రూ.9 వేలు తక్కువ. ఇంజిన్ వివరాలు: డిజైన్లోమార్పులు చేసినప్పటికీ, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఎస్ అదే 346 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో వస్తుంది. 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో ఇది 5,250 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 19.8 బిహెచ్పి, 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 28 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అలాగే, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఎస్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్‌ను అమర్చగా, వెనుక భాగంలో ట్విన్ గ్యాస్ చార్జ్డ్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి. క్లాసిక్ 350 ఎస్ ముందు భాగంలో డిస్క్ బ్రేక్ , వెనుక భాగంలో ఇప్పుడు డ్రమ్ బ్రేక్ సెటప్ ఉంది. ఇది ప్యూర్ బ్లాక్, మెర్క్యురీ సిల్వర్ అనే రెండు రంగులలో అందుబాటులో ఉంది. -
రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై పేటెంట్ ఉల్లంఘన కేసు
న్యూఢిల్లీ: ఆటో విడిభాగాల తయారీ సంస్థ ఫ్లాష్ ఎలక్ట్రానిక్స్ ఇండియా, ఐచర్ మోటార్స్‌కు చెందిన రాయల్‌ఎన్‌ఫీల్డ్‌కు వ్యతిరేకంగా అమెరికా న్యాయ స్థానంలో పేటెంట్ ఉల్లంఘన కేసు దాఖలు చేసింది. ద్విచక్ర వాహనంలో వినియోగించే ఓ ఉపకరణం పేటెంట్‌ను రాయల్ ఎన్ఫీల్డ్ ఉల్లంఘించినట్టు ఆరోపించింది. ఫ్లాష్ ఎలక్ట్రానిక్స్‌కు రెగ్యులేటర్ రెక్టిఫయర్ డివైజ్, అవుట్‌పుట్ ఓల్టేజ్ రెగ్యులేటింగ్ విధానానికి అమెరికా పేటెంట్, ట్రేడ్ మార్క్ ఆఫీసు జారీ చేసిన పేటెంట్ ఉంది. దీన్ని రాయల్ ఎన్ఫీల్డ్ ఉల్లంఘించినట్టు ఫ్లాష్ ఎలక్ట్రానిక్స్ తన వ్యాజ్యంలో పేర్కొంది. యూరోప్‌లోని జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, బ్రిటన్, నెదర్లాండ్స్, స్వీడన్, స్పెయిన్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, టర్కీలోనూ ఈ ఉపకరణంపై తమకు పేటెంట్ ఉన్నందున ఈ దేశాల్లోనూ రాయల్ ఎన్ఫీల్డ్కు వ్యతిరేకంగా ఇదే తరహా వ్యాజ్యాలను దాఖలు చేయనున్నట్టు ఫ్లాష్ ఎలక్ట్రానిక్స్ ఇండియా తెలిపింది. ఆటోమొబైల్ రంగంలో ప్రతిష్టాత్మక సంస్థ అయిన రాయల్ ఎన్ఫీల్డ్ ఈ తరహా అనూహ్యమైన, అసాధారణ చర్యకు పాల్పడడం, దానిపై తాము పోరడాల్సి రావడం దురదృష్టకరంగా ఫ్లాష్ ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ఎండీ సంజీవ్ వాసుదేవ్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని స్నేహపూర్వకంగా పరిష్కరించుకుందామని 2018 అక్టోబర్ 12న రాయల్ ఎన్ఫీల్డ్కు చెందిన ముగ్గురు ఉద్యోగులను సంప్రదించినప్పటికీ పరిష్కారం లభించలేదన్నారు. పేటెంట్ ఉల్లంఘనకు ముగింపు పలికి, తమకు పరిహారం చెల్లించే వరకు ప్రపంచవ్యాప్తంగా దీనిపై పోరాడతామన్నారు. -
ఎన్ఫీల్డ్.. బుల్లెట్ ట్రయల్స్
న్యూఢిల్లీ: లగ్జరీ బైక్‌ల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్.. బుల్లెట్ ట్రయల్స్ 350, 500 వెర్షన్లను బుధవారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. 1948–1965 మధ్యకాలంలో 50కి మించి ఛాంపియన్‌షిప్‌లు గెలుచుకున్న జానీ బ్రిటెన్ ట్రయల్స్ మోటార్‌సైకిల్ ప్రేరణతో ఈ బైక్‌లను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. 350 వెర్షన్ ధర రూ.1.62 లక్షలు కాగా, 500 వెర్షన్ ధర రూ.2.07 లక్షలు. డ్యుయల్ ఛానల్ యాంటీ–లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్), లగేజ్ M -
బైక్ నంబర్ 96
హీరోలకు కెరీర్లో మరచిపోలేని హిట్స్ అందించినప్పుడు హీరోలు ఆ దర్శకులకు ఏదో గిఫ్ట్ ఇవ్వడం చాలా సందర్భాల్లో చూశాం. తాజాగా దర్శకుడు సి. ప్రేమ్‌కుమార్‌కు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌ను గిఫ్ట్‌గా అందించారు విజయ్ సేతుపతి. వీళ్లిద్దరి కాంబినేషన్లో ‘96’ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పెద్ద హిట్‌గా నిలిచింది. విజయ్ సేతుపతికి బైక్స్ అంటే ఇష్టమట. అందుకే తన దర్శకుడికి బైక్‌ను గిఫ్ట్‌గా ఇస్తే బావుంటుందని భావించి ఎన్ఫీల్డ్ను గిఫ్ట్‌గా ఇచ్చారు. సుమారు 3 లక్షలు ఖరీదైన ఈ బైక్ స్పెషాలిటీ ఏంటంటే ఈ బైక్ రిజిస్ట్రేషన్ నంబర్ ‘0096’. సినిమా టైటిల్ కూడా కలిసేలా ప్లాన్ చేసి, ఇలా ప్రెజెంట్ చేయడంతో ప్రేమ్‌కుమార్ ఆశ్చర్యపోయింటారు. ఈ సినిమా తెలుగులో ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలోనే శర్వానంద్, సమంత జంటగా రూపొందనున్న సంగతి తెలిసిందే. -
రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి 2 సరికొత్త బైక్‌లు
న్యూఢిల్లీ: ఐషర్ మోటార్స్‌కు చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మరో రెండు సరికొత్త బైక్‌లు విడుదలకానున్నా యి. ట్విన్ సిలిండర్లు కలిగిన ఈ బైక్‌లు త్వరలోనే భారత మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్ లోనూ లభ్యమవుతాయని కంపెనీ ప్రకటించింది. కాంటినెంటల్ జీటీ 650 పేరిట విడుదలకానున్న బైక్ ధర రూ.4,21,558 కాగా, ఇంటర్‌సెప్టర్ ఐఎన్టీ 650 పేరిట అందుబాటులోకి రానున్న మరో బైక్ ధర రూ.4,90,618 వద్ద నిర్ణయించి నట్లు సంస్థ సీఈఓ సిద్ధార్థ లాల్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘చెన్నై ప్లాంట్‌లో ఉత్పత్తికానున్న ఈ రెండు బైక్‌లు భారత్ నుంచే అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతికాను న్నాయి. అమెరికా, లండన్, యూరప్ మార్కెట్లతో పాటుగానే ఇక్కడి మార్కెట్లో కూడా ఒకేసారి అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ ఏడాది చివరినాటికి బైక్‌లను అందుబాటులో ఉంచాలని భావిస్తున్నాం.’ అని వ్యాఖ్యానించారు.