వాహన ప్రేమికులు రోజురోజుకి ఆధునిక ఉత్పత్తులను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ తరుణంలో వాహన తయారీ సంస్థలు కూడా ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను మార్కెట్లో విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 & కాంటినెంటల్ GT 650 బైకులను లేటెస్ట్ అప్‌డేట్స్‌తో లాంచ్ చేసింది.
ధరలు:
దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ ఆధునిక బైకుల ధరలు కలర్ ఆప్సన్స్ మీద ఆధారపడి ఉంటాయి. కాంటినెంటల్ జిటి 650 బైక్ ప్రారంభ ధర రూ. 3.19 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 3.39 లక్షల వరకు ఉంటుంది. ఇక ఇంటర్‌సెప్టర్ 650 ప్రారంభ ధర రూ. 3.03 లక్షలు కాగా, టాప్ ఎండ్ మోడల్ ధర రూ. 3.21 లక్షలు. ధరలు వీటి మునుపటి మోడల్స్ కంటే కొంత ఎక్కువగా ఉంటాయి.
కలర్ ఆప్సన్స్:
కాంటినెంటల్ జిటి 650 బైక్ రాకర్ రెడ్/బ్రిటీష్ రేసింగ్ గ్రీన్, డక్స్ డీలక్స్, అపెక్స్ గ్రే/స్లిప్‌స్ట్రీమ్ బ్లూ అనే మూడు కలర్ ఆప్సన్స్‌లో లభిస్తుంది. అదే సమయంలో ఇంటర్‌సెప్టర్ 650 విషయానికి వస్తే క్యాన్యన్ రెడ్/కాలి గ్రీన్, బ్లాక్ పెర్ల్/సన్సెట్ స్ట్రిప్, బార్సిలోనా బ్లూ/బ్లాక్ రే కలర్స్‌లో లభిస్తుంది.
(ఇదీ చదవండి: కియా నుంచి నాలుగు కొత్త కార్లు: సిఎన్‌జి, 5 సీటర్ ఇంకా..)
అప్డేటెడ్ డిజైన్ & ఫీచర్స్:
ఆధునిక హంగులతో విడుదలైన రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 బైక్స్ ఇంజిన్, అల్లాయ్ వీల్స్, ఎగ్జాస్ట్, సైడ్ ప్యానెల్ వంటివి బ్లాక్-అవుట్ థీమ్ పొందుతాయి. ఇందులో ఇప్పుడు అల్లాయ్ వీల్స్ చూడవచ్చు. అంతే కాకుండా కొత్త అల్యూమినియం స్విచ్ క్యూబ్స్, ఎల్ఈడీ హెడ్‌లైట్స్ వంటివి ఇందులో కనిపిస్తాయి. యుఎస్‌బి ఛార్జింగ్ ఆప్సన్ కూడా ఇప్పుడు అప్డేటెడ్ ఫీచర్‌గా వస్తోంది. ట్యూబ్‌లెస్ టైర్స్ ఈ బైకులలో అమర్చారు.
ఇంజిన్:
అప్డేటెడ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 డిజైన్, ఫీచర్స్ అప్డేట్ పొందినప్పటికీ ఇంజిన్ మాత్రం మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. కాంటినెంటల్ జిటి, ఇంటర్‌సెప్టర్ బైక్ రెండూ 648 సీసీ ప్యారలల్ ఎయిర్/ఆయిల్-కూల్డ్ ఇంజిన్ కలిగి 47.5 హెచ్‌పి పవర్, 52 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. కావున పనితీరులో కూడా ఎటువంటి మార్పులు ఉండే అవకాశం లేదు.
(ఇదీ చదవండి: వెహికల్ స్క్రాపింగ్‌పై క్లారిటీ వచ్చేసింది.. చూశారా!)
బ్రేకింగ్ & సస్పెన్షన్ సెటప్:
భారతీయ మార్కెట్లో 650 సిసి విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ బైకులు బోల్ట్ ట్రస్సింగ్‌తో ట్యూబులర్ స్టీల్ ఫ్రేమ్‌ను కలిగి 41 మిమీ ఫ్రంట్ ఫోర్క్, వెనుకవైపు డ్యూయల్ కాయిల్-ఓవర్ షాక్‌లు పొందుతుంది. అదే సమయంలో ఈ బైక్స్ ముందు భాగంలో 320 మిమీ డిస్క్ బ్రేక్స్, వెనుక 240 మిమీ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి, డ్యూయెల్ ఛానల్ స్టాండర్డ్‌గా అందుబాటులో ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment