Upcoming Royal Enfield Bikes: ద్విచక్ర వాహన విభాగంలో భారతీయ మార్కెట్లో 'రాయల్ ఎన్‌ఫీల్డ్' (Royal Enfield) బైకులకున్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పటి నుంచి కూడా ఈ బైకులకు డిమాండ్ భారీగా ఉంది. ఇప్పటికే క్లాసిక్ 350, మీటియోర్ 350, ఇంటర్సెప్టర్ 650, హిమాలయన్ విక్రయాలతో శరవేగంగా ముందుకు దూసుకెళ్తున్న సంస్థ త్వరలో మరో నాలుగు బైకులు విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. కంపెనీ ఈ ఏడాది విడుదల చేయనున్న ఈ నాలుగు బైకుల గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450
గత కొన్ని రోజులుగా సంస్థ హిమాలయన్ 450 విడుదల చేయనున్నట్లు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కంపెనీ కూడా ఈ మోడల్ మీద పనిచేస్తున్నట్లు సమాచారం. ఇందులో 450 సీసీ ఇంజిన్ ఉండే అవకాశం ఉండండి నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ ఏడాది దీపావళి నాటికి రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు.
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350
రాయల్ ఎన్‌ఫీల్డ్ అనగానే చాలామందికి మొదట గుర్తొచ్చే బైక్ బుల్లెట్. బైక్ రైడర్ల మనసులో అంతగా ఈ పేరు పాతుకుపోయింది. అయితే ఈ బైక్ త్వరలోనే కొత్త వెర్షన్‌గా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ న్యూ జనరేషన్ బుల్లెట్ 350 క్లాసిక్ మాదిరిగా కాకుండా కొంత లేటెస్ట్ డిజైన్ పొందుతుందని సమాచారం.
(ఇదీ చదవండి: 1986లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ధర ఇంత తక్కువా? వైరల్ అవుతున్న బిల్!)
రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650
ప్రస్తుతం 350 సీసీ విభాగంలో మాదిరిగానే 650 విభాగంలో కూడా విడుదలయ్యే వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇప్పటికే ఈ విభాగంలో ఇంటర్సెప్టర్ 650, కాంటినెంటల్ జిటి 650 వంటివి ఉన్నాయి. కాగా ఈ విభాగంలో కంపెనీ షాట్‌గన్ 650 విడుదలకానున్నట్లు సమాచారం.
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ బాబర్ 350
జావా కంపెనీ మార్కెట్లో విక్రయిస్తున్న బాబర్ బైక్ గురించి వినే ఉంటారు. అయితే ఇప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ క్లాసిక్ బాబర్ 350 పేరుతో ఒక కొత్త బికా విడుదల చేయడానికి సన్నద్ధమైపోయింది. ఈ బైక్ గురించి ప్రస్తుతానికి అధికారిక వివరాలు వెల్లడి కాలేదు, కానీ ఈ ఏడాది మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment