Royal Enfield bikes
-
నమ్మండి ఇది 'రాయల్ ఎన్ఫీల్డ్' బైకే.. (ఫోటోలు)
-
ఎలక్ట్రిక్ బైంక్ లాంచ్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్
టూవీలర్ వాహన మార్కెట్లో దిగ్గజ కంపెనీగా ఉన్న ‘రాయల్ ఎన్ఫీల్డ్’ కొత్తగా ఎలక్ట్రిక్ బైక్‌ను లాంచ్ చేసినట్లు ప్రకటించింది. కంపెనీ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను ఇటీవల ఆవిష్కరించింది. ‘ఫ్లైయింగ్ ఫ్లీ’ పేరుతో దీన్ని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. విభిన్న వేరియంట్ల ద్వారా 250-750 సీసీ సామర్థ్యం కలిగిన బైక్‌లకు ధీటుగా ఈవీను అందించాలనే లక్ష్యంతో ఉన్నట్లు కంపెనీ పేర్కొంది.రాయల్ ఎన్ఫీల్డ్ మాతృసంస్థ ఐషర్ మోటార్స్ ఎండీ సిద్ధార్థ్ లాల్ మాట్లాడుతూ..‘రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ స్టైల్ ఫ్లైయింగ్ ఫ్లీ సీ6, స్క్రాంబ్లర్-స్టైల్ ఫ్లైయింగ్ ఫ్లీ ఎస్6 పేరుతో ఎలక్ట్రిక్ బైక్‌లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. ఈవీ టెక్నాలజీకి కస్టమర్లలో ఆదరణ పెరుగుతోంది. అందుకు అనుగుణంగా కంపెనీ ఉత్పత్తులను అందిస్తుంది. కంపెనీ ఆవిష్కరించిన ఈవీ బైక్ ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు’ అని అన్నారు.రెండో ప్రపంచ యుద్ధం నాటి బైక్అక్టోబర్ చివరి వారంలో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. పారాచూట్ ద్వారా ఎయిర్‌లిఫ్ట్ చేసినట్లు ఈ వీడియోలో చూపించారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో శత్రువులపై దండెత్తడానికి బైక్‌లను పారాచూట్ ద్వారా ల్యాండ్ చేశారు. అందుకు తగ్గట్లుగా రాయల్ ఎన్ఫీల్డ్ తేలికపాటి బైక్‌లు తయారు చేసింది. అదే మాదిరి ఈ బైక్ టీజర్ విడుదల సమయంలో పారాచూట్ ద్వారా ల్యాండ్ చేసినట్లు చూపించారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అభివృద్ధి చేసిన తేలికపాటి మోటార్‌సైకిళ్లను యుద్ధం తర్వాత విక్రయించారు.ఇదీ చదవండి: హైదరాబాద్ గోదామును డీలిస్ట్ చేసిన జొమాటోఫ్రేమ్: అల్లైడ్ అల్యూమీనియ్ ఫ్రేమ్బ్యాటరీ: బరువు తక్కువగా ఉండేందకు వీలుగా మెగ్నీషియమ్ బ్యాటరీ వాడారు.డిజైన్: రౌండ్ హెడ్‌లైట్, ఫాక్స్ ఫ్యుయెల్ ట్యాంక్ మాదిరిగా కనిపించే డిజైన్, ఎల్ఈడీ లైటింగ్ ఉంటుంది.డిస్ప్లే: టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ డిస్ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ.సేఫ్టీ: ట్రాక్షన్ కంట్రోల్, కార్నింగ్ ఏబీఎస్, ముందు, వెనక డిస్క్ బ్రేకులుంటాయి.రేంజ్: ఒకసారి ఛార్జీ చేస్తే 150-200 కి.మీ ప్రయాణం చేసేందుకు వీలుంది. -
వచ్చేస్తోంది రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ చూశారా
-
నెలలో 11 శాతం పెరిగిన విక్రయాలు
మోటార్‌సైకిల్ తయారీదారు రాయల్ ఎన్ఫీల్డ్ సెప్టెంబర్‌లో విక్రయాలు పెరిగినట్లు కంపెనీ సీఈఓ బి.గోవిందరాజన్ తెలిపారు. గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది విక్రయాలు 11 శాతం పెరిగి 86,978 యూనిట్లకు చేరినట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా గోవిందరాజన్ మాట్లాడుతూ..‘కంపెనీ మోటార్ సైకిల్ విభాగంలో విక్రయాలు క్రమంగా పెరుగుతున్నాయి. 2023 సెప్టెంబర్‌లో 78,580 యూనిట్ల విక్రయం జరిగింది. ఈసారి అదే సమయంలో 11 శాతం విక్రయాలు పెరిగి 86,978కు చేరాయి. 2024 ప్రారంభంలో క్లాసిక్ 350 మోడల్‌ను లాంచ్ చేయడం సంస్థ విక్రయాలు పెరిగేందుకు తోడ్పడింది. గతేడాది సెప్టెంబర్‌లో ఎగుమతులు 4,319 యూనిట్లుగా ఉండేది. అది గత నెలలో 7,652 యూనిట్లకు పెరిగింది’ అన్నారు.ఇదీ చదవండి: పాలసీను సరెండర్ చేస్తే ఎంత వస్తుందంటే..? -
Om Singh Rathore: బుల్లెట్ బాబా టెంపుల్
మన దేశంలో జాతీయ రహదారుల పక్కన ఆలయాలు కనిపిస్తుంటాయి. అయితే జోద్పూర్–అహ్మదాబాద్ జాతీయ రహదారి పక్కన ఉన్న ఆలయం మాత్రం ఆసక్తికరం. ఆదిత్య కొంద్వార్ అనే రచయిత ఈ ఆలయానికి సంబంధించి విషయాలను ‘ఎక్స్’లో షేర్ చేశాడు. చాలా సంవత్సరాల క్రితం...‘బుల్లెట్ బాబా’ గా పిలుచుకొనే ఓమ్ సింగ్ రాథోడ్ నడుపుతున్న రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. బైక్‌ను పోలీస్‌స్టేషన్‌లో పెట్టారు. అయితే మరుసటి రోజు ఈ బైక్ కనిపించలేదు. అందరూ ఆశ్చర్యపోయేలా ప్రమాదం జరిగిన స్థలంలో కనిపించింది. దీంతో స్థానికులు ఈ ‘బుల్లెట్ బైక్’కు పూజలు చేయడం మొదలుపెట్టారు. తరువాత ఒక ఆలయాన్ని కట్టి ఈ బుల్లెట్ బైక్‌ను విగ్రహంలా ప్రతిష్ఠించారు. కాలక్రమంలో ఇది ‘బుల్లెట్ బాబా టెంపుల్’గా ప్రసిద్ధి పొందింది. రోడ్డుపై ప్రయాణం చేసేవారు ఈ ఆలయం దగ్గర ఆగి ‘ఎలాంటి ప్రమాదం జరగకూడదు’ అని మొక్కుకుంటూ వెళుతుంటారు. -
రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మరో బైక్ - లాంచ్ ఎప్పుడంటే?
Royal Enfield Scram 440: దేశీయ టూ వీలర్ దిగ్గజం 'రాయల్ ఎన్ఫీల్డ్' (Royal Enfield) మార్కెట్లో మరో సరికొత్త మోడల్ విడుదల చేయడానికి సన్నద్ధమైంది. ఈ బైక్ వచ్చే సంవత్సరానికి భారతీయ విఫణిలో విడుదలయ్యే అవకాశం ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, రాయల్ ఎన్ఫీల్డ్ విడుదల చేయనున్న కొత్త బైక్ స్క్రామ్ 440 మోడల్ అవుతుందని సమాచారం. అంటే ఇది ఇప్పటికే మార్కెట్లో స్క్రామ్ ఆధారంగా తయారయ్యే అవకాశం ఉంది. ఇది 411 సీసీ ఇంజిన్ కలిగి ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ ఇంజిన్ ఇప్పటికే స్క్రామ్ 411లో ఉంది. (ఇదీ చదవండి: రైతుగా మారిన బ్యాంక్ ఎంప్లాయ్.. వేలమందికి ఉపాధి - రూ. కోట్లలో టర్నోవర్!) ఈ బైక్ డిజైన్, ఫీచర్స్ వంటివి అధికారికంగా విడుదలకాలేదు, త్వరలో అందుబాటులో ఉండే అవకాశం ఉందని భావిస్తున్నాము. ఈ బైక్ స్క్రామ్ సబ్-బ్రాండ్ క్రింద ఉంటుంది. అయితే హిమాలయన్ బైక్ కంటే కూడా తక్కువ ధర వద్ద ఉంటుందని తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఇండియన్ మార్కెట్లో విడుదలకానున్న బైకుల జాబితాలో రాయల్ ఎన్ఫీల్డ్ మాత్రమే కాకుండా యమహా, హోండా వంటి కంపెనీలు కూడా ఉన్నాయి. ఇవన్నీ వారి పరిధిని విస్తరిస్తూ దేశంలో ఉనికిని మరింత చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. -
రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మరో నాలుగు బైకులు - ప్రత్యర్థుల పని అయిపోయినట్టేనా?
Upcoming Royal Enfield Bikes: ద్విచక్ర వాహన విభాగంలో భారతీయ మార్కెట్లో 'రాయల్ ఎన్ఫీల్డ్' (Royal Enfield) బైకులకున్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పటి నుంచి కూడా ఈ బైకులకు డిమాండ్ భారీగా ఉంది. ఇప్పటికే క్లాసిక్ 350, మీటియోర్ 350, ఇంటర్‌సెప్టర్ 650, హిమాలయన్ విక్రయాలతో శరవేగంగా ముందుకు దూసుకెళ్తున్న సంస్థ త్వరలో మరో నాలుగు బైకులు విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. కంపెనీ ఈ ఏడాది విడుదల చేయనున్న ఈ నాలుగు బైకుల గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 గత కొన్ని రోజులుగా సంస్థ హిమాలయన్ 450 విడుదల చేయనున్నట్లు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కంపెనీ కూడా ఈ మోడల్ మీద పనిచేస్తున్నట్లు సమాచారం. ఇందులో 450 సీసీ ఇంజిన్ ఉండే అవకాశం ఉండండి నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ ఏడాది దీపావళి నాటికి రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 రాయల్ ఎన్ఫీల్డ్ అనగానే చాలామందికి మొదట గుర్తొచ్చే బైక్ బుల్లెట్. బైక్ రైడర్ల మనసులో అంతగా ఈ పేరు పాతుకుపోయింది. అయితే ఈ బైక్ త్వరలోనే కొత్త వెర్షన్‌గా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ న్యూ జనరేషన్ బుల్లెట్ 350 క్లాసిక్ మాదిరిగా కాకుండా కొంత లేటెస్ట్ డిజైన్ పొందుతుందని సమాచారం. (ఇదీ చదవండి: 1986లో రాయల్ ఎన్ఫీల్డ్ ధర ఇంత తక్కువా? వైరల్ అవుతున్న బిల్!) రాయల్ ఎన్ఫీల్డ్ షాట్‌గన్ 650 ప్రస్తుతం 350 సీసీ విభాగంలో మాదిరిగానే 650 విభాగంలో కూడా విడుదలయ్యే వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇప్పటికే ఈ విభాగంలో ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ జిటి 650 వంటివి ఉన్నాయి. కాగా ఈ విభాగంలో కంపెనీ షాట్‌గన్ 650 విడుదలకానున్నట్లు సమాచారం. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ బాబర్ 350 జావా కంపెనీ మార్కెట్లో విక్రయిస్తున్న బాబర్ బైక్ గురించి వినే ఉంటారు. అయితే ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ క్లాసిక్ బాబర్ 350 పేరుతో ఒక కొత్త బికా విడుదల చేయడానికి సన్నద్ధమైపోయింది. ఈ బైక్ గురించి ప్రస్తుతానికి అధికారిక వివరాలు వెల్లడి కాలేదు, కానీ ఈ ఏడాది మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. -
సూపర్ మీటియోర్ 650 ధరలు పెంచిన రాయల్ ఎన్ఫీల్డ్ - వివరాలు
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'రాయల్ ఎన్ఫీల్డ్' (Royal Enfield) ఇప్పటికే తన 'సూపర్ మీటియోర్ 650' బైకుని లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే కంపెనీ ఈ బైక్ ధరలను ఇప్పుడు ఒక్క సారిగా రూ. 5000 వరకు పెంచింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కంపెనీ ఈ సూపర్ మీటియోర్ 650 ధరలను పెంచిన తరువాత ఈ బైక్ ప్రారంభ ధర రూ. 3.54 లక్షలు. ఇది ఆస్ట్రల్, ఇంటర్స్టెల్లార్, సెలెస్టియన్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు కూడా రూ. 5వేలు పెరిగాయి. కావున ఈ బైక్స్ కొనాలనుకునే కస్టమర్లు కొత్త ధరలకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. బేస్ వేరియంట్ అయిన ఆస్ట్రల్ మూడు సింగిల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి బ్లాక్, బ్లూ అండ్ గ్రీన్ కలర్స్. ఇక మిడ్ స్పెక్ వేరియంట్ ఇంటర్స్టెల్లార్ రెండు వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది. అవి గ్రే, గ్రీన్ అనే డ్యూయెల్ కలర్స్. డిజైన్ విషయానికి వస్తే మొదటి రెండు వేరియంట్లు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. అయితే టాప్ వేరియంట్లో మాత్రం పెద్ద ఫ్రంట్ స్క్రీన్, టూరింగ్ సీట్, పిలియన్ బ్యాక్ రెస్ట్ వంటి అదనపు యాక్ససరీస్ లభిస్తాయి. రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మీటియోర్ 650 బైకులో 648 సిసి ప్యారలల్ ట్విన్ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 47 bhp పవర్, 52.3 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్ పొందుతుంది. కావున పనితీరుపరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది. (ఇదీ చదవండి: కొంప ముంచిన గూగుల్ మ్యాప్.. నేరుగా సముద్రంలోకి - వీడియో) ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో ట్రిప్పర్ నావిగేషన్, బ్లూ టూత్ కనెక్టివిటీ, USB ఛార్జింగ్ పోర్ట్ వంటివి ఉంటాయి. ఈ బైక్ ముందు భాగంలో 320 మిమీ డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో 300 మిమీ డిస్క్ బ్రేక్ ఉంటాయి. ఈ బైక్ సీటు ఎత్తు భూమి నుంచి 650 మిమీ. 241 కేజీల బరువు కలిగిన ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 15.7 లీటర్లు. కావున లాంగ్ రైడ్ చేయడానికి ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది. -
2023 Royal Enfield 650 Twins: రాయల్ ఎన్ఫీల్డ్ 650 బైక్స్ ఇప్పుడు మరింత కొత్తగా
వాహన ప్రేమికులు రోజురోజుకి ఆధునిక ఉత్పత్తులను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ తరుణంలో వాహన తయారీ సంస్థలు కూడా ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను మార్కెట్లో విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 & కాంటినెంటల్ GT 650 బైకులను లేటెస్ట్ అప్డేట్స్తో లాంచ్ చేసింది. ధరలు: దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ ఆధునిక బైకుల ధరలు కలర్ ఆప్సన్స్ మీద ఆధారపడి ఉంటాయి. కాంటినెంటల్ జిటి 650 బైక్ ప్రారంభ ధర రూ. 3.19 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 3.39 లక్షల వరకు ఉంటుంది. ఇక ఇంటర్‌సెప్టర్ 650 ప్రారంభ ధర రూ. 3.03 లక్షలు కాగా, టాప్ ఎండ్ మోడల్ ధర రూ. 3.21 లక్షలు. ధరలు వీటి మునుపటి మోడల్స్ కంటే కొంత ఎక్కువగా ఉంటాయి. కలర్ ఆప్సన్స్: కాంటినెంటల్ జిటి 650 బైక్ రాకర్ రెడ్/బ్రిటీష్ రేసింగ్ గ్రీన్, డక్స్ డీలక్స్, అపెక్స్ గ్రే/స్లిప్‌స్ట్రీమ్ బ్లూ అనే మూడు కలర్ ఆప్సన్స్‌లో లభిస్తుంది. అదే సమయంలో ఇంటర్‌సెప్టర్ 650 విషయానికి వస్తే క్యాన్యన్ రెడ్/కాలి గ్రీన్, బ్లాక్ పెర్ల్/సన్‌సెట్ స్ట్రిప్, బార్సిలోనా బ్లూ/బ్లాక్ రే కలర్స్‌లో లభిస్తుంది. (ఇదీ చదవండి: కియా నుంచి నాలుగు కొత్త కార్లు: సిఎన్జి, 5 సీటర్ ఇంకా..) అప్డేటెడ్ డిజైన్ & ఫీచర్స్: ఆధునిక హంగులతో విడుదలైన రాయల్ ఎన్ఫీల్డ్ 650 బైక్స్ ఇంజిన్, అల్లాయ్ వీల్స్, ఎగ్జాస్ట్, సైడ్ ప్యానెల్ వంటివి బ్లాక్-అవుట్ థీమ్ పొందుతాయి. ఇందులో ఇప్పుడు అల్లాయ్ వీల్స్ చూడవచ్చు. అంతే కాకుండా కొత్త అల్యూమినియం స్విచ్ క్యూబ్స్, ఎల్ఈడీ హెడ్‌లైట్స్ వంటివి ఇందులో కనిపిస్తాయి. యుఎస్బి ఛార్జింగ్ ఆప్సన్ కూడా ఇప్పుడు అప్డేటెడ్ ఫీచర్‌గా వస్తోంది. ట్యూబ్‌లెస్ టైర్స్ ఈ బైకులలో అమర్చారు. ఇంజిన్: అప్డేటెడ్ రాయల్ ఎన్ఫీల్డ్ 650 డిజైన్, ఫీచర్స్ అప్డేట్ పొందినప్పటికీ ఇంజిన్ మాత్రం మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. కాంటినెంటల్ జిటి, ఇంటర్‌సెప్టర్ బైక్ రెండూ 648 సీసీ ప్యారలల్ ఎయిర్/ఆయిల్-కూల్డ్ ఇంజిన్ కలిగి 47.5 హెచ్‌పి పవర్, 52 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. కావున పనితీరులో కూడా ఎటువంటి మార్పులు ఉండే అవకాశం లేదు. (ఇదీ చదవండి: వెహికల్ స్క్రాపింగ్‌పై క్లారిటీ వచ్చేసింది.. చూశారా!) బ్రేకింగ్ & సస్పెన్షన్ సెటప్: భారతీయ మార్కెట్లో 650 సిసి విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ బైకులు బోల్ట్ ట్రస్సింగ్తో ట్యూబులర్ స్టీల్ ఫ్రేమ్‌ను కలిగి 41 మిమీ ఫ్రంట్ ఫోర్క్, వెనుకవైపు డ్యూయల్ కాయిల్-ఓవర్ షాక్‌లు పొందుతుంది. అదే సమయంలో ఈ బైక్స్ ముందు భాగంలో 320 మిమీ డిస్క్ బ్రేక్స్, వెనుక 240 మిమీ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి, డ్యూయెల్ ఛానల్ స్టాండర్డ్‌గా అందుబాటులో ఉంటుంది. -
Royal Enfield Hunter 350: అమ్మకాల్లో ఇది రాయల్ బండి
భారతీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం 'రాయల్ ఎన్ఫీల్డ్' గత సంవత్సరం 'హంటర్ 350' బైక్ లాంచ్ చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి కంపెనీ ఇప్పటికి లక్ష యూనిట్లను విక్రయించింది. దీనికి సంబంధించిన సమాచారం కంపెనీ ప్రకటించింది. రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 రెట్రో, మెట్రో అనే రెండు వేరియంట్స్‌లో విక్రయించబడుతోంది. వీటి ధరలు వరుసగా రూ. 1.50 లక్షలు, రూ. 1.64 లక్షలు (ఎక్స్-షోరూమ్). కంపెనీ మొదటి 50,000 యూనిట్లను విక్రయించడానికి నాలుగు నెలల సమయం పట్టింది, ఆ తరువాత కేవలం రెండు నెలల్లో మరో 50,000 యూనిట్లను విక్రయించింది. హంటర్ 350 బైక్ 349 సీసీ సింగిల్ సిలిండర్ టూ-వాల్వ్, SOHC, ఎయిర్/ఆయిల్-కూల్డ్ ఇంజన్ కలిగి 20.2 బిహెచ్పి పవర్, 27 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ బైక్ టాప్ స్పీడ్ గంటకు 114 కిమీ, కాగా మైలేజ్ 36.2 కిమీ/లీ వరకు ఉంటుంది. రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 ముందు భాగంలో 41 మిమీ టెలిస్కోపిక్ ఫోర్క్‌లతో కూడిన ట్విన్ డౌన్‌ట్యూబ్ స్పైన్ ఫ్రేమ్ సెటప్ వెనుకవైపు ట్విన్ షాక్‌లను కలిగి పొందుతుంది. అదే సమయంలో ఈ బైక్ 110/70-17 54P ఫ్రంట్, 140/70-17 66P రియర్ ట్యూబ్‌లెస్ టైర్లను కలిగి ఉండి, 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. హంటర్ 350 బైక్ ఫ్యాక్టరీ బ్లాక్, ఫ్యాక్టరీ సిల్వర్, డాపర్ వైట్, డాపర్ యాష్, డాపర్ గ్రే, రెబెల్ బ్లాక్, రెబెల్ బ్లూ, రెబెల్ రెడ్ అనే ఎనిమిది కలర్ ఆప్సన్స్‌లో లభిస్తుంది. ఇది 2,055 మిమీ పొడవు, 800 మిమీ వెడల్పు, 1,055 మిమీ ఎత్తు, 1,370 మిమీ వీల్‌బేస్ కలిగి 13 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ పొందుతుంది. రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 ఇండోనేషియా, జపాన్, కొరియా, థాయ్‌లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యునైటెడ్ కింగ్డమ్, అర్జెంటీనా, కొలంబియా, మెక్సికో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో అందుబాటులో ఉంది. ఈ బైక్ మోటార్‌సైకిల్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు కూడా సొంతం చేసుకుంది. కంపెనీ అమ్మకాలలో ఇప్పటికే ఇది మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది. -
ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొన్నారా.. అయితే, వెంటనే షోరూమ్ తీసుకెళ్లండి!
ప్రముఖ బైక్ తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ తన క్లాసిక్ 350 బైక్‌లో బ్రేకింగ్ సమస్య ఉన్న కారణంగా 26,300 యూనిట్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్‌లో విడుదల చేసిన ఈ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మోడల్ బైక్‌లో పలు సమస్యలు ఉన్న కారణంగా విక్రయించిన బైక్‌లను వెంటనే వెనక్కి తీసుకోవాలని రాయల్ ఎన్ఫీల్డ్ నిర్ణయించింది. ఈ బైక్‌లో బ్రేకింగ్ సమస్య ఉన్నట్లు గుర్తించిన రాయల్ ఎన్ఫీల్డ్ ఈ మోడల్స్‌కు చెందిన అన్ని బైక్‌లను వెనక్కి తీసుకొని రావాలని కోరుతుంది. ఈ సమస్య సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 5 మధ్య తయారు చేసిన క్లాసిక్ 350 మోడల్స్ బైక్‌లలో ఉన్నట్లు తెలిపింది. వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అన్ని యూనిట్ల స్వింగ్ ఆర్మ్ బ్రేక్ రియాక్షన్ బ్రాకెట్'ను బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నట్లు రాయల్ ఎన్ఫీల్డ్ పేర్కొంది. సర్వీస్ టీమ్ లేదా మీ దగ్గరలోని స్థానిక డీలర్ షిప్ కేంద్రాలకు సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 5 మధ్య ఈ బైక్ కొనుగోలు చేసిన వినియోగదారులు కొనుగోలు పత్రాలతో చేరుకోవాలని సూచించింది. వాటిని వెనక్కి తీసుకున్న తర్వాత లోపాలను సరిచేసి తిరిగి ఇవ్వనునట్లు పేర్కొంది. (చదవండి: 2021లో నాకు సాయం చేసినవి ఇవే!: ముకేష్ అంబానీ) మీ దగ్గరలోని సర్విస్ కేంద్రాల గురుంచి తెలుసుకోవడం కోసం వినియోగదారులు రాయల్ ఎన్ఫీల్డ్ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. అలాగే, వినియోగదారులకు ఏమైనా సందేహాలు ఉంటే 1800-210-007కు కాల్ చేయవచ్చు అని కూడా పేర్కొంది. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది. ఫైర్ బాల్ వేరియంట్ ధర - రూ.1.85 లక్షలు, సూపర్ నోవా వేరియంట్ ధర - రూ. 1.86 లక్షలు, స్టెల్లార్ వేరియంట్ ధర -1.90 లక్షలుగా ఉన్నాయి. ఈ బైక్ యుఎస్బి ఛార్జర్, కొత్తగా డిజైన్ చేసిన టెయిల్ లైట్, అప్డేట్ చేసిన ఎగ్జాస్ట్ పైప్, 13-లీటర్ కెపాసిటీ ఫ్యూయల్ ట్యాంక్, మరింత సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవం కోసం అప్డేట్ చేసిన సీట్లతో వస్తుంది. (చదవండి: Telangana: మాస్క్ ధరలు.. తగ్గేదే లే!) -
Electric Bike: ఆ పిల్లాడు చెప్పిన అబద్ధం.. అద్భుతాన్ని ఆవిష్కరించింది
అగ్గిపుల్ల.. సబ్బుబిళ్ళ.. కాదేది ప్రయోగానికి అనర్హం అనే చందాన, ఓ కుర్రాడు పాత బైక్ స్క్రాప్‌తో ఏకంగా ఎలక్ట్రిక్ బైక్ తయారీ చేసి ఔరా అనిపించాడు. లాక్డౌన్ సమయాన్ని వృథా చేయకూడదనే అతని ఆలోచన.. ఇలా అద్భుతాన్ని ఆవిష్కరించింది. అయితే ఈ ఆవిష్కరణ కోసం ఆ కుర్రాడు.. తన తండ్రికి చెప్పిన ఒక్క అబద్ధం ఏమిటి? ఆ అబద్ధం అతని జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది? ఇందుకోసం రాజన్ ఎలా కష్టపడ్డాడో ఇప్పుడు చూద్దాం.. ఢిల్లీ సుభాష్ నగర్‌కు చెందిన రాజన్.. ఒక్కడే పాత రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌ను ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చాడు. అయితే ఈ బైక్ తయారీ వెనుక పెద్ద స్టోరీయే ఉందని కుర్రాడి తండ్రి దశరథ్ శర్మ చెబుతున్నారు. కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఆటపాటలతో కాకుండా.. రాజన్ ఏదో ఒక ప్రయోగం చేయాలని అనుకున్నాడు. ప్రయోగంలో భాగంగా ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ మీద అతని దృష్టి పడింది. ముందు ఎలక్ట్రిక్ సైకిల్ తయారీకి పూనుకోగా.. అదికాస్త విఫలం అయ్యింది. ఆ ప్రయోగంలో రాజన్ గాయపడ్డాడు కూడా. దీంతో రాజన్‌ను తండ్రి అడ్డుకున్నారు. అయితే ఆ కుర్రాడికి ప్రయోగాలంటే చాలా ఇష్టం. అందుకే ఓ ప్లాన్ వేశాడు. స్కూల్ ప్రాజెక్టు వంకతో.. స్కూల్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఎలక్ట్రిక్ బైక్ తయారు చేయాలని టీచర్లు చెప్పినట్లు తండ్రికి అబద్ధం చెప్పాడు రాజన్. అది నిజమని భావించి.. స్నేహితులు, ఆఫీస్ కొలీగ్స్ సాయంతో ఆ ‘అబద్ధపు’ ప్రాజెక్టు డబ్బులు సమకూర్చాడు దశరథ్. అటుపై మాయాపురి జంక్ మార్కెట్ నుంచి ఓ పాత రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తెచ్చి ఇచ్చాడు. ఇక రాజన్ ఆ పాత బండిని ఎలక్ట్రికల్ బైక్‌గా మార్చే పనిలో పడ్డాడు. మూడు నెలల పాటు శ్రమించి ఎలక్ట్రిక్ బైక్‌కు ఒక రూపం తీసుకొచ్చాడు. ఈ ప్రయత్నంలో తండ్రి దశరథ్ రోజూ కొడుకును ప్రొత్సహించడం విశేషం. చివరికి తండ్రికి రాజన్ అసలు విషయం చెప్పడం.. కొడుకు సాధించిన ఘనత చూసి ఆ తండ్రి ఉప్పొంగిపోవడం ఒకదాని వెంట ఒకటి జరిగాయి. ‘‘రాజన్ వయసు పదిహేనేళ్లు. టీచర్లు ఇలాంటి ప్రాజెక్టు ఇవ్వడం ఏంటి? వీడేం ఎలక్ట్రిక్ బైక్ తయారు చేస్తాడని నవ్వుకున్నా. కానీ, తీరా బైక్‌ను చూశాక నా కళ్లారా నేనే నమ్మలేకపోయా’ అంటున్నాడు దశరథ్. విశేషం ఏంటంటే.. గూగుల్, యూట్యూబ్‌లో చూసి ఈ ఈ-బైక్‌ను తయారు చేశాడు రాజన్. గంటకు యాభై కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలిగే ఈ ఈ-బైక్‌ను పరిశీలన పంపనున్నట్లు జిల్లా అధికారి సంత్ రామ్ చెప్తున్నారు. ఈ బైక్ తయారీ సఫలం కావడంతో రాజన్ ఇప్పుడు ఎలక్ట్రిక్ కారును తయారీపై ఫోకస్ పెట్టాడు. చదవండి: Tesla: వారెవ్వా టెస్లా.. ‘లేజర్’తో అద్దాలు శుభ్రం! -
మార్కెట్లోకి సరికొత్త డుగ్ డుగ్ బండి వచ్చేసింది!
డుగ్.. డుగ్..డుగ్.. అనే శబ్దం వింటే చాలు ఆ గల్లీ ఉన్న చిన్న పిల్లవాడు కూడా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ వస్తుందని ఇట్టే గుర్తు పట్టేస్తాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ బైక్ కంపెనీకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. గతంలో ఈ ద్విచక్ర వాహనాన్ని ఎక్కువగా ధనిక వర్గం కొనేవారు. కానీ, ప్రస్తుతం మద్య తరగతి ప్రజలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా రాయల్ ఎన్ఫీల్డ్ తన కొత్త తరం క్లాసిక్ 350 మోటార్ సైకిల్ ను భారతదేశంలో ప్రారంభించింది. కంపెనీ అత్యధికంగా అమ్ముడైన ఈ రెట్రో క్రూయిజర్ అప్డేట్ చేసిన వెర్షన్ తో వచ్చింది.(చదవండి: నిరుద్యోగులకు అమెజాన్ తీపికబురు!) సరికొత్త రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 గతంలో ప్రకటించిన మెటియోర్(Meteor) 350 మోటార్ సైకిల్ ఆధారంగా రూపొందించారు. ఈ మోడల్లో కూడా మెటియోర్ 350 లాంటి ఇంజిన్నే అందించారు. అయితే, దీని పవర్ మాత్రం 349సీసీ ఉండడం వల్ల 20పీఎస్ పీక్ పవర్‌ని 27ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మెటియోర్లోని జె ప్లాట్ ఫామ్‌ని ఇందులోకూడా అందించింది. ఇది 11 విభిన్న రంగులలో లభ్యం అవుతుంది. బ్లూటూత్ సహాయంతో స్మార్ట్ ఫోన్కికనెక్ట్ అయ్యి నావిగేషన్‌ని చూపించే ట్రిప్పర్ టర్న్ టు టర్న్ నావిగేషన్‌ని కలిగి ఉన్న రెండవ బైక్ ఇది. అయితే ఇందులో ముందు మోడల్స్‌లో ఉన్న విధంగా కిక్ స్టార్టర్ లేకపోవడం విశేషం. ఈ మోటార్ సైకిల్ పైలట్ ల్యాంపులతో కొత్త హెడ్ ల్యాంప్, ఫ్యూయల్ గేజ్, ఎల్ సీడి ఇన్ఫర్మేషన్ ప్యానెల్ గల ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ కలిగి ఉంది. పాత తరం మోడల్స్ లాగా కాకుండా మెరుగైన ఎర్గోనమిక్స్ కొరకు హ్యాండిల్ బార్ అప్డేట్ చేశారు. ఇది యుఎస్ బి ఛార్జర్, కొత్తగా డిజైన్ చేసిన టెయిల్ లైట్, అప్డేట్ చేసిన ఎగ్జాస్ట్ పైప్, 13-లీటర్ కెపాసిటీ ఫ్యూయల్ ట్యాంక్, మరింత సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవం కొరకు అప్డేట్ చేసిన సీట్లతో వస్తుంది. ఈ బైక్ హోండా హెచ్'నెస్ సీబీ 350, బెనెల్లీ ఇంపీరియల్, జావా మోటార్ సైకిల్స్ వంటి మోడల్స్ తో పోటీ పడనుంది. రాయల్ ఎన్ ఫీల్డ్ 350 మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది. ఫైర్ బాల్ వేరియంట్ ధర - రూ.1.85 లక్షలు, సూపర్ నోవా వేరియంట్ ధర - రూ. 1.86 లక్షలు, స్టెల్లార్ వేరియంట్ ధర -1.90 లక్షలుగా ఉన్నాయి. -
స్టైలిష్ లుక్ తో డుగ్ డుగ్ బండి వచ్చేస్తోంది
డుగ్... డుగ్.. డుగ్... శబ్దంతో రాజసం ఉట్టిపడే బైక్‌పై...అంతే రాయల్‌గా కూర్చుని రయ్యిన వెళుతుంటే... ఆ హుందానే వేరు! 'కొంత'మందికే పరిమితైన వెహికల్‌ను ధనికులు ఎక్కువగా ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు కుర్రకారుకు హాట్ ఫేవరెట్ అయిన ఈ బండి పల్లెటూళ్లలోనే కాదు... మహానగరాల్లోనూ క్రేజీ బైక్‌గా మారింది. అందుకే ఈ బైక్ కు మరిన్ని హంగులు యాడ్ చేసి ఆటో మొబైల్ సంస్థలు విడుదల చేస్తున్నాయి. తాజాగా '2021 న్యూ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350’ను మార్పులు చేసి అందుబాటులోకి తేనున్నాయి. ‘రాయల్’ సిరీస్ గురించి సీరియస్‌గా ఫాలో అయ్యేవారికి ‘2021 న్యూ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350’ గురించి ఆసక్తి ఉంటుంది. ఈ బండి రకరకాల మార్పులతో వస్తున్నట్లు వినికిడి. ‘ఇంజన్’ ‘పవర్ట్రైన్’...మొదలైన ఫీచర్లను ‘మీటిమోర్ 350’ నుండి అరువు తెచ్చుకుంటుంది. కొత్త మోడల్స్‌ను తీసుకురావడంలో పేరున్న రాయల్ కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకొంది. రాబోయే నెలల్లో మాత్రం కొత్త మోడల్స్‌ను చూడవచ్చు అంటున్నారు. చదవండి : ఐఫోన్ లవర్స్‌కు శుభవార్త -
బైక్ కొనేవారికి భారీ షాక్ ఇచ్చిన కంపెనీలు
న్యూఢిల్లీ: బజాజ్, టీవీఎస్, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనేవారికి భారీ షాక్ ఇచ్చాయి కంపెనీలు. టీవీఎస్ మోటార్ కంపెనీ, బజాజ్ ఆటో, రాయల్ ఎన్ఫీల్డ్ దేశంలో తమ మోటార్‌సైకిళ్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. టీవీఎస్ తన ఫ్లాగ్షిప్ బ్రాండ్ అపాచీ ధరలను పెంచగా, బజాజ్ ఆటో, రాయల్ ఎన్ఫీల్డ్ వారి మొత్తం మోటార్‌సైకిల్ శ్రేణి ధరలను పెంచాయి. ఈ కొత్త ధరలు జనవరి 2021 నుంచి తయారు చేయబడిన, విక్రయించే బైక్‌లు, స్కూటర్లపై పెంపు ధరలు వర్తిస్తాయని పేర్కొంది. టీవీఎస్ సంస్థ తన ప్రధాన మోటారుసైకిల్ అపాచీ ఆర్ఆర్ 310 ధరలను రూ.3 వేలకు పెంచింది. ఈ మోటారుసైకిల్ ఇప్పుడు 2.48 లక్షల రూపాయల ధర వద్ద లభిస్తుంది.(చదవండి: బీఎండబ్ల్యూ కొత్త కారు అదిరిందిగా) మరోవైపు, అపాచీ ఆర్టీఆర్ 200 4వీ ధరను రూ.2,000 పెరిగి 1.33 లక్షలకు (ఎక్స్-షోరూమ్, ముంబై) లభిస్తుంది. అపాచీ ఆర్టీఆర్ 160 4వీ ధర రూ.1,770, ఆర్టీఆర్ 180, ఆర్టీఆర్ 160 ధరలు వరుసగా రూ.1770, రూ.1520 పెరిగాయి. బజాజ్ సంస్థ తన అవెంజర్ క్రూయిజర్ 220 ధరలను 3,521 రూపాయలు పెంచింది, ఇప్పుడు దీని ధర రూ .1.24 లక్షలు. మరోవైపు, డొమినార్ 400, డొమినార్ 250 ధరలను వరుసగా 3,480 మరియు 3,500 రూపాయలు వరకు పెంచారు. పల్సర్ 220ఎఫ్ ధరను రూ.3,500 పెంచడంతో అది రూ.1.25 లక్షలకు చేరుకుంది. ఎన్ఎస్160, ఎన్ఎస్ 200 ధరలను వరుసగా రూ.3,000, రూ.3,500 పెంచినట్లు కంపెనీ ప్రకటించింది. రాయల్ ఎన్ఫీల్డ్ తన ఆర్ఈ క్లాసిక్ 350 ధరలను సుమారు రూ.2,000 పెంచారు. ఈ శ్రేణి ఇప్పుడు రూ.1.63 లక్షలు నుంచి రూ.1.85 లక్షల ధరలలో లభిస్తుంది. బుల్లెట్ సిరీస్ ధరలు కూడా పెరగడంతో అవి ఇప్పుడు రూ.1.27 లక్షల నుంచి 1.43 లక్షల ధరలలో లభిస్తున్నాయి. క్లాసిక్, బుల్లెట్ బైక్స్ వంటి బైక్స్ ధర రూ.2 వేల వరకు పైకి చేరింది. అదే మెటిరో 350 ధర మాత్రం రూ.3 వేలు పెరిగింది. దీంతో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ కొనే వారికి ఝలక్ తగిలిందని చెప్పుకోవచ్చు. -
డ్డగ్...డ్డగ్...డ్ఢగ్.....రాయల్ ఎన్ఫీల్డ్!
‘దేవుడిని బైక్ ఇవ్వమని అడిగాను. ఇవ్వకపోయేసరికి బైక్ దొంగిలించి క్షమాపణ అడిగాను’ అన్నాడట ఒక దొంగ. ఆ దొంగగోల మనకెందుకుగానీ, యువ హృదయాలను కామ్‌గా, క్లాసిక్‌గా దోచుకోవడానికి మోటర్‌బైక్ కంపెనీలు కాంపిటీషన్‌కు కాలు దువ్వుతున్నాయి స్పోర్టీ, రేసింగ్, టూర్ బైక్ కావచ్చు. మోడ్రన్, క్లాసిక్ బైక్ కావచ్చు....ఇప్పుడు మోటర్ కంపెనీల ప్రధాన టార్గెట్ యూత్! రేస్ మొదలైంది.... పోటీ గురించి మాట్లాడుకునే ముందు పోటీ ఎవరితో, దాని బలం ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం. మోటర్‌బైక్ కంపెనీలు ‘సై’ మోటర్ సైకిల్స్‌ను ‘లైఫ్‌స్టైల్’గా మార్చిన ఘనత రాయల్ది. మిడిల్‌వెయిట్ మోటర్‌సైకిల్ సెగ్మెంట్లో లీడింగ్ ప్లేయర్ అయిన ‘రాయల్’ మెనేజ్మెంట్ స్కూళ్లలో ‘కేస్ స్టడీ’ అయింది. తిరుగులేని విజయానికి ఒక మోడల్‌గా నిలిచింది. ‘రాయల్’ ఏకచ్ఛత్రాధిపత్యానికి గండికొట్టడానికి దేశీయ,విదేశీ మోటర్‌బైక్ కంపెనీలు ‘సై’ అంటున్నాయి. రకరకాల ఎక్సైటింగ్ మోడల్స్‌తో ‘యూత్ టార్గెట్’గా బరిలోకి దిగాయి. దిగుతున్నాయి రాజకీయాల్లో వినిపించే ‘పొత్తులు’ ‘టై–అప్’లు మోటర్‌సైకిల్ సెగ్మెంట్లో కనిపిస్తున్నాయి. ఎడతెగని చర్చల తరువాత ప్రఖ్యాత అమెరికన్ మోటర్‌సైకిల్ తయారీదారు హార్లే–డెవిడ్సన్ లార్జెస్ట్ టు వీలర్ మేకర్ ‘హీరో మోటో కోర్ప్’తో ఒక అవగాహనకు వచ్చింది. రాయల్ ఎన్ఫీల్డ్ బలమైన కోటలోకి ప్రవేశించడానికి అప్రకటిత వ్యూహాలతో ముందుకు వస్తున్నాయి కంపెనీలు. లోకల్ పాట్నర్షిప్లతో బజాజ్–ట్రయంప్, హీరో–హార్లే, టీవిఎస్–నొర్టన్...మొదలైనవి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌కు గట్టి పోటి ఇవ్వనున్నాయి. టాక్టికల్ మూవ్లో భాగంగా కొన్ని కంపెనీలు ధరలను కాస్తో కూస్తో తగ్గిస్తూ యూత్‌ను ఎట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. రాయల్‌తో పోటీ పడేందుకు హోండా కంపెనీ ‘హైనెస్’ను ప్రవేశపెట్టింది. విదేశాల్లో ప్రాచుర్యంలో ఉన్న ‘హోండా రెబెల్’ మోడల్‌తో దీన్ని రూపొందించారు. మిడ్‌సైజ్ మార్కెట్‌ను టార్గెట్‌గా చేసుకొని డిలక్స్, డిలక్స్ ప్రొ వెరియంట్లలో వచ్చిన ‘హైనెస్’ సార్మ్‌ఫోన్ వాయిస్ కంట్రోల్ సిస్టమ్ కలిగిన బైక్. ఇక బజాజ్–ట్రయంప్ జోడి 400 నుండి 800 సీసీ ఇంజన్ సామర్థ్యం ఉన్న మిడిల్ కెపాసిటీ మోటర్ సైకిల్స్‌ను అభివృద్ధి చేస్తుంది. దేశీయ మోటర్‌బైక్ తయారీ దిగ్గజం ‘మహీంద్ర అండ్ మహీంద్ర’ జావా బ్రాండ్‌ను యుద్దంలో సరికొత్త ఆయుధంగా చేసుకుంది. చెక్ రిపబ్లిక్ బ్రాండ్ ‘జావా’ హవా ఒకప్పుడు మనదేశంలో బాగానే నడిచిందికాని ఆ తరువాత ఆశించిన ఫలితాలు రాకపోడంతో జావగారిపోయి ఇండియన్ మార్కెట్ నుంచి జారిపోయింది. సినిమా ఇంటర్యూ్యలలో ఒక సంభాషణ తరచుగా వింటుంటాం... ‘ఇరవై సంవత్సరాల క్రితం మీరు తీసిన సినిమా చూశానండీ. ఇప్పటికీ కొత్తగా ఉందంటే నమ్మండి. మరి కమర్శియల్‌గా ఎందుకు సక్సెస్ కాలేదు!’ ‘చాలా అడ్వాన్స్డ్గా తీసిన సినిమా కావడం వల్లే సక్సెస్ కాలేదు. ఈ టైమ్‌లో తీసి ఉంటే కచ్చితంగా హిట్టు కొట్టి ఉండేది’ ఇది కాస్తో కూస్తో ఆనాటి ‘జావా’కు కూడా వర్తిస్తుంది. అందుకే మహీంద్ర ‘జావా’ బ్రాండ్‌ను దేశీయంగా సొంతం చేసుకుంది. కేటిఎం390 అడ్వెంచర్‌ను దృష్టిలో పెట్టుకొని రంగంలోకి దిగుతున్న బజాజ్–హిస్కివర్న మోడల్ డిజిటల్ ఇన్స్ట్ర్మెంట్ క్లస్టర్, ఆల్–లెడ్ లైటింగ్ సెటప్, వైర్–స్పోక్డ్ వీల్స్‌తో రోడ్ఫ్రెండ్లీ డిజైన్‌తో రూపొందించారు. ఐకానిక్ బీయండబ్ల్యూ ఆర్5 నుంచి టెక్నాలజీ, విజువల్ మోటర్‌సైకిల్ ఎసెన్షియల్స్‌ను స్ఫూర్తి పొంది రూపుదిద్దుకున్న ‘బీయండబ్ల్యూ ఆర్18 క్లాసిక్’లో రెయిన్, రోల్ అండ్ రాక్...ఎలాంటి రైడింగ్ కండిషన్స్‌లోనైనా ధైర్యం ఇచ్చే 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. స్టెప్డ్–అప్ సీట్, రైజ్డ్ విండ్‌స్క్రీన్, ఆల్–లెడ్ లైటింగ్ సెటప్, బ్లూటూత్–ఎనేబుల్డ్ టీఎఫ్టి ఇన్స్ట్ర్మెంట్ కన్సోల్...ఐ క్యాచింగ్ బాడీగ్రాఫిక్స్తో బరిలోకి దిగింది టీవిఎస్–అపాచీ ఆర్ఆర్ 310. అలయెన్స్‌లు, అవగాహనలు, టై–అప్లు, సృజనాత్మక ఆలోచనతో ఏ బండి ‘యూత్’ గుండెల్లో స్టాండవుతుందో వేచిచూద్దాం. -
రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు వేలం
ప్రముఖ మోటార్ సైకిల్ తయారీదారు రాయల్ ఎన్ఫీల్డ్ తన పాపులర్ బైక్స్‌ను వేలం వేస్తోంది. ముఖ్యంగా సెప్టెంబర్‌లో ప్రారంభించిన 'ఫైట్ ఎగైనెస్ట్ టెర్రర్' లో భాగంగా తన పాపులర్ మోడల్ స్టీల్త్ బ్లాక్ క్లాసిక్ 500 వాహనాలకు ఆన్లైన్ లో వేలం నిర్వహిస్తోంది. కొన్ని వారాల క్రితం, టెర్రరిజంపై అవగాహన కల్పిస్తూ పదిహేనుమంది ఎన్ఎస్జీ కమాండోలు 13 రాష్ట్రాల్లో 8వేల కి.మీటర్ల రోడ్ ట్రిప్ నిర్వహించిన ఈ 15 బైకులను వేలం ద్వారా విక్రయించనుంది. ఇలా వచ్చిన నిధును ఒక స్వచ్ఛంద సంస్థకు విరాళమివ్వనుంది. రాయల్ ఎన్ఫీల్డ్ వెబ్సైట్ అందించిన వివరాల ప్రకారం నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ) ముఖ్య కమాండోలు ఉపయోగించిన 15 కంపెనీల వాహనాలను ఆన్లైన్ వేలం నేటి ప్రారంభం కానుందని రాయల్ ఎన్ఫీల్డ్ ప్రకటించింది. ట్రిబ్యూట్ టు బ్రేవ్‌హార్ట్ పేరుతో ఈ సేల్ నిర్వహిస్తోంది. వేలం తేదీకి ముందే కంపెనీ అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ నమోదు చేసుకున్నవారు మాత్రమే వేలంలో పాల్గొనడానికి అర్హులు. నమోదు చేసుకున్న అభ్యర్థులకు కేటాయించిన స్పెషల్ కోడ్ ద్వారా వేలంలో పాల్గొనాల్సి ఉంటుంది. ఒక్కో బైకు ధరను రూ.1.9 లక్షలుగా నిర్ణయించింది. ఈ వేలం ద్వారా వచ్చిన సొమ్మును స్వచ్చంద సంస్థకు ఇవ్వనున్నట్టు సంస్థ తెలిపింది. ఎన్ఎస్జీ మద్దతు ఇస్తున్న వికలాంగ బాలల కోసం పాటుపడుతున్న స్వచ్ఛంద సంస్థ ప్రేరణకు ఈ మొత్తాన్ని విరాళంగా ఇస్తామని చెప్పింది. -
వీకెండ్ ఎంజాయ్!
చౌటుప్పల్: రాష్ట్ర రాజధానిలోని సాఫ్ట్వేర్ కంపెనీల్లో, ఉన్నతస్థాయి కొలువుల్లో పని చేస్తున్న ఉద్యోగులు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు వారాంతంలో విశ్రాంతి కోసం పల్లెలకు వస్తున్నారు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సేద తీరుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన విండ్ ఛేజర్స్ గ్రూపు, వివిధ రంగాల ఉద్యోగులు రాయల్ ఎన్ఫీల్డ్ బైకులపై ఆదివారం రాచకొండకు వచ్చారు. అక్కడి ప్రకృతి రమణీయతను చూసి ముగ్ధులయ్యూరు. గుట్టలను ఎక్కి, పచ్చని లొకేషన్లలో తిరుగుతూ ఎంజాయ్ చేశారు. వారాంతపు విశ్రాం తికొచ్చే ఉద్యోగులు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడమే కాకుండా సమాజ శ్రేయస్సు కోసం పాటు పడుతున్నారు. బైకును నడిపే ప్రతి వ్యక్తి హెల్మెట్ ధరిస్తున్నారు. వెనకాల కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించడం తప్పనిసరిగా పాటిస్తున్నారు. హెల్మెట్ ఆవశ్యకత, రోడ్డు భద్రతను గురించి ప్రజలకు తెలియజేస్తున్నారు. అనాథాశ్రమాల్లో గడుపుతున్నారు. వారికి అవసరమైన వస్తువులను బహూకరిస్తున్నారు. హైదరాబాద్‌లో 2వేల గ్రూపులు హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ కంపెనీల్లో, వివిధ రంగాల్లో వారం రోజులపాటు పని ఒత్తిడిలో ఉండి, వారాంతపు విశ్రాంతి కోసం ఇలా ఆదివారం టూర్లకు వెళ్లే గ్రూపులు 2వేల వరకు ఉన్నాయి. ఒక్కో గ్రూపులో 20 మంది ఉంటారు. ఒక్కో ఆది వారం ఒక్కో ప్రాంతానికి వెళ్తుంటారు. వారమంతా బిజీ సినీ పరిశ్రమలో అసోసియేట్ డెరైక్టర్‌గా పనిచేస్తున్నా. వారంలో ఐదు రోజులు బిజీగా ఉంటా. ఆదివారం వచ్చిందంటే విశ్రాంతి కోసం, ఒత్తిడి నుంచి బయటపడేందుకు జాలీగా ఇలా వస్తాం. పర్యాటక ప్రాంతాల్లో పర్యటించడం ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన వస్తుంది. - పి.రామారావు, అసోసియేట్ డెరైక్టర్