డ్డగ్‌...డ్డగ్‌...డ్ఢగ్‌.....రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌! | New Model Motorbike Special Story | Sakshi
Sakshi News home page

డ్డగ్‌...డ్డగ్‌...డ్ఢగ్‌.....రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌!

Published Wed, Nov 18 2020 9:14 AM | Last Updated on Wed, Nov 18 2020 10:03 AM

New Model Motorbike Special Story - Sakshi

‘దేవుడిని బైక్‌ ఇవ్వమని అడిగాను. ఇవ్వకపోయేసరికి బైక్‌ దొంగిలించి క్షమాపణ అడిగాను’ అన్నాడట ఒక దొంగ. ఆ దొంగగోల మనకెందుకుగానీ, యువ హృదయాలను కామ్‌గా, క్లాసిక్‌గా దోచుకోవడానికి మోటర్‌బైక్‌ కంపెనీలు కాంపిటీషన్‌కు కాలు దువ్వుతున్నాయి స్పోర్టీ, రేసింగ్, టూర్‌ బైక్‌ కావచ్చు. మోడ్రన్, క్లాసిక్‌ బైక్‌ కావచ్చు....ఇప్పుడు మోటర్‌ కంపెనీల ప్రధాన టార్గెట్‌ యూత్‌! రేస్‌ మొదలైంది....

పోటీ గురించి మాట్లాడుకునే ముందు  పోటీ ఎవరితో,  దాని బలం ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం.

మోటర్‌బైక్‌ కంపెనీలు ‘సై’ 
మోటర్‌ సైకిల్స్‌ను ‘లైఫ్‌స్టైల్‌’గా మార్చిన ఘనత రాయల్‌ది. మిడిల్‌వెయిట్‌ మోటర్‌సైకిల్‌ సెగ్మెంట్‌లో  లీడింగ్‌ ప్లేయర్‌ అయిన ‘రాయల్‌’ మెనేజ్‌మెంట్‌ స్కూళ్లలో ‘కేస్‌ స్టడీ’ అయింది. తిరుగులేని విజయానికి ఒక మోడల్‌గా నిలిచింది. ‘రాయల్‌’ ఏకచ్ఛత్రాధిపత్యానికి గండికొట్టడానికి దేశీయ,విదేశీ మోటర్‌బైక్‌ కంపెనీలు ‘సై’ అంటున్నాయి. రకరకాల ఎక్సైటింగ్‌ మోడల్స్‌తో ‘యూత్‌ టార్గెట్‌’గా బరిలోకి దిగాయి. దిగుతున్నాయి రాజకీయాల్లో వినిపించే ‘పొత్తులు’ ‘టై–అప్‌’లు  మోటర్‌సైకిల్‌ సెగ్మెంట్లో కనిపిస్తున్నాయి. ఎడతెగని చర్చల తరువాత ప్రఖ్యాత అమెరికన్‌ మోటర్‌సైకిల్‌ తయారీదారు హార్లే–డెవిడ్‌సన్‌ లార్జెస్ట్‌ టు వీలర్‌ మేకర్‌ ‘హీరో మోటో కోర్ప్‌’తో ఒక అవగాహనకు వచ్చింది.

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బలమైన కోటలోకి ప్రవేశించడానికి అప్రకటిత వ్యూహాలతో ముందుకు వస్తున్నాయి కంపెనీలు. లోకల్‌ పాట్నర్‌షిప్‌లతో బజాజ్‌–ట్రయంప్, హీరో–హార్లే, టీవిఎస్‌–నొర్టన్‌...మొదలైనవి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌కు గట్టి పోటి ఇవ్వనున్నాయి. టాక్టికల్‌ మూవ్‌లో భాగంగా కొన్ని కంపెనీలు ధరలను కాస్తో కూస్తో తగ్గిస్తూ యూత్‌ను ఎట్రాక్ట్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.

రాయల్‌తో పోటీ పడేందుకు హోండా కంపెనీ ‘హైనెస్‌’ను ప్రవేశపెట్టింది. విదేశాల్లో ప్రాచుర్యంలో ఉన్న ‘హోండా రెబెల్‌’ మోడల్‌తో దీన్ని రూపొందించారు. మిడ్‌సైజ్‌ మార్కెట్‌ను టార్గెట్‌గా చేసుకొని డిలక్స్, డిలక్స్‌ ప్రొ వెరియంట్లలో వచ్చిన ‘హైనెస్‌’ సార్మ్‌ఫోన్‌ వాయిస్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ కలిగిన బైక్‌.  ఇక బజాజ్‌–ట్రయంప్‌ జోడి 400 నుండి 800 సీసీ ఇంజన్‌ సామర్థ్యం ఉన్న మిడిల్‌ కెపాసిటీ మోటర్‌ సైకిల్స్‌ను అభివృద్ధి చేస్తుంది. దేశీయ మోటర్‌బైక్‌ తయారీ దిగ్గజం ‘మహీంద్ర అండ్‌ మహీంద్ర’ జావా బ్రాండ్‌ను యుద్దంలో సరికొత్త ఆయుధంగా చేసుకుంది. చెక్‌ రిపబ్లిక్‌ బ్రాండ్‌ ‘జావా’ హవా ఒకప్పుడు మనదేశంలో బాగానే నడిచిందికాని ఆ తరువాత ఆశించిన ఫలితాలు రాకపోడంతో జావగారిపోయి ఇండియన్‌ మార్కెట్‌ నుంచి జారిపోయింది.

సినిమా ఇంటర్యూ్యలలో ఒక సంభాషణ తరచుగా వింటుంటాం...
‘ఇరవై సంవత్సరాల క్రితం మీరు తీసిన సినిమా చూశానండీ. ఇప్పటికీ కొత్తగా ఉందంటే నమ్మండి. మరి కమర్శియల్‌గా ఎందుకు సక్సెస్‌ కాలేదు!’ ‘చాలా అడ్వాన్స్‌డ్‌గా తీసిన సినిమా కావడం వల్లే సక్సెస్‌ కాలేదు. ఈ టైమ్‌లో తీసి ఉంటే కచ్చితంగా హిట్టు కొట్టి ఉండేది’ ఇది కాస్తో కూస్తో ఆనాటి ‘జావా’కు కూడా వర్తిస్తుంది. అందుకే మహీంద్ర ‘జావా’ బ్రాండ్‌ను దేశీయంగా సొంతం చేసుకుంది.

కేటిఎం390 అడ్వెంచర్‌ను దృష్టిలో పెట్టుకొని రంగంలోకి దిగుతున్న బజాజ్‌–హిస్కివర్న మోడల్‌  డిజిటల్‌ ఇన్‌స్ట్ర్‌మెంట్‌ క్లస్టర్, ఆల్‌–లెడ్‌ లైటింగ్‌ సెటప్, వైర్‌–స్పోక్డ్‌ వీల్స్‌తో రోడ్‌ఫ్రెండ్లీ డిజైన్‌తో రూపొందించారు.  ఐకానిక్‌ బీయండబ్ల్యూ ఆర్‌5 నుంచి టెక్నాలజీ, విజువల్‌ మోటర్‌సైకిల్‌ ఎసెన్షియల్స్‌ను స్ఫూర్తి పొంది రూపుదిద్దుకున్న ‘బీయండబ్ల్యూ ఆర్‌18 క్లాసిక్‌’లో రెయిన్, రోల్‌ అండ్‌ రాక్‌...ఎలాంటి రైడింగ్‌ కండిషన్స్‌లోనైనా ధైర్యం ఇచ్చే 3 రైడింగ్‌ మోడ్స్‌ ఉన్నాయి. స్టెప్‌డ్‌–అప్‌ సీట్, రైజ్‌డ్‌ విండ్‌స్క్రీన్, ఆల్‌–లెడ్‌ లైటింగ్‌ సెటప్, బ్లూటూత్‌–ఎనేబుల్డ్‌ టీఎఫ్‌టి ఇన్‌స్ట్ర్‌మెంట్‌ కన్సోల్‌...ఐ క్యాచింగ్‌ బాడీగ్రాఫిక్స్‌తో బరిలోకి దిగింది టీవిఎస్‌–అపాచీ ఆర్‌ఆర్‌ 310. అలయెన్స్‌లు, అవగాహనలు, టై–అప్‌లు, సృజనాత్మక ఆలోచనతో ఏ బండి ‘యూత్‌’ గుండెల్లో స్టాండవుతుందో  వేచిచూద్దాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement