ఆఫ్‌లైన్‌లో బాలికలు/మహిళలపై జరుగుతున్న దారుణాలను మించి ఆన్‌లైన్‌లో చోటుచేసుకుంటున్నాయి అంటున్నారు సైబర్ నిపుణులు. ప్రతి పది మంది బాలికల్లో ఒకరు సైబర్ బెదిరింపులకు గురవుతున్నారని, మహిళలను లక్ష్యంగా చేసుకొని నేరాలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. తల్లిదండ్రులే ఆన్‌లైన్ గురువులుగా మారి బాలికలకు అవగాహన కల్పించాల్సిన అవసరం నేటి రోజుల్లో ఎంతో ఉంది.
సైబర్ నేరస్థులు ప్రధానంగా బాలికలు, మహిళలనే లక్ష్యంగా చేసుకుంటున్నారని నివేదికలు సూచిస్తున్నాయి. నేరస్థులు బాలికలు, మహిళల చిరునామాలు, ఆర్థిక వివరాలు, వ్యక్తిగత సంభాషణల వంటి సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తుంటారు. బాధితులు తమ డిమాండ్లను ఒప్పుకోకపోతే బాలికలు/మహిళల వ్యక్తిగత డేటాను బయటపెడతామని, అందరిలో పరువు పోతుందని నేరస్థులు బెదిరిస్తుంటారు. దీంతో ఎవరికీ చెప్పుకోలేక బాలికలు/మహిళలు నేరస్థులకు డబ్బులు పంపడం లేదా ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయాలకు రావడం జరుగుతుంటుంది. చాలా మంది బాధిత మహిళలు ఇలాంటి విషయాలు బయటకు చెప్పుకోవడానికి, పోలీసులకు కంపై్టంట్ చేయడానికి ఇష్టపడరు. ఇలాంటప్పుడు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించేందుకు పెద్దలు కృషి చేయాల్సిన అవసరం ఉంది.
టెక్నాలజీని పేరెంట్స్ నేర్చుకోవాలి...
– పిల్లలను టెక్నాలజీ వాడకుండా అడ్డుపడకూడదు. పాజిటివ్ కోణంలోనే పిల్లలకు టెక్నాలజీని నేర్పాలి. పిల్లలతో పాటు పెద్దలూ టెక్నాలజీ జర్నీ చేయాలి.
– పిల్లలకు ఫోన్ ఇవ్వడంతో పాటు ఒక హద్దును సృష్టించాలి. అదే సమయంలో వయసును బట్టి ఫిల్టరింగ్ సాఫ్ట్‌వేర్స్‌ను వాడాలి.
– క్రీడల్లో కొన్ని బౌండరీస్ ఎలా ఉంటాయో టెక్నాలజీ బౌండరీస్‌ను పెద్దలే గీయాలి.
– టెక్‌ఫోన్ ఫ్రీ జోన్స్ నిబంధనలను అమలు చేయాలి. (బెడ్‌రూమ్, డైనింగ్ ప్లేస్.. వంటి చోట్ల ఫోన్ వాడకూడదు..)
– YAPPY (యువర్ అడ్రస్, యువర్ ఫుల్‌నేమ్, యువర్ పాస్‌పోర్ట్...ఇలా పూర్తి వివరాలు) ఆన్‌లైన్‌లో ఎవరికీ ఇవ్వకూడదని చెప్పాలి.
– ఫొటోలు/డాక్యుమెంట్స్ డౌన్‌లోడ్ చేసుకునే ముందు నిజనిర్ధారణ చేసుకోవాలి. డౌన్‌లోడ్స్‌కి వెళ్లకూడదు ∙పనిష్మెంట్‌గా లేదా రివార్డ్‌గానూ ఫోన్/ట్యాబ్.. వంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పిల్లలకు ఇవ్వకూడదు.
– స్క్రీన్ టైమ్– గ్రీన్ టైమ్‌కి తేడా తెలియాలి. వర్చువల్ గేమ్స్, గ్రౌండ్ గేమ్స్‌కి కండిషన్స్ పెట్టాలి ∙వయసుకు తగ్గట్టుగా ఆడే ఆన్‌లైన్ గేమ్స్‌కి కొన్ని కంట్రోల్స్ ఉంటాయి. వాటిని పాటించేలా జాగ్రత్తపడాలి.
మనో ధైర్యాన్ని పెంచుకోవాలి..
ఏవరైనా వ్యక్తితో ఇబ్బంది ఉంటే ఆ వ్యక్తి అకౌంట్‌ని బ్లాక్ చేయాలి ∙మనోధైర్యాన్ని పోగొట్టుకోకుండా ఏవైనా వీడియోలు, ఫొటోలు, చాటింగ్ సంభాషణ ... వంటివి ఉంటే డిలీట్ చేయకుండా బ్యాకప్ స్టోరీజే చేసుకోవాలి. పెద్దలతో మాట్లాడి https://cybercrime.gov.inలో కంప్లైంట్ చేయాలి.
బొట్టు బిళ్లతో కవర్ చేయాలి...
∙ఏదైనా వెబ్‌సైట్ https:// (ప్యాడ్‌లాక్ సింబల్ ఉన్న సైట్‌నే ఓపెన్ చేయాలి. పాస్‌వర్డ్ ఎప్పుడూ (క్యాపిటల్, స్మాల్ లెటర్స్, నంబర్స్) ఉండే విధంగా సెట్ చేసుకోవాలి ∙ఫోన్ ఇతర గ్యాడ్జెట్స్ లొకేషన్ ఎప్పుడూ ఆఫ్ చేసుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆన్ చేసి, మళ్లీ ఆఫ్ మోడ్‌లో ఉంచాలి ∙వెబ్ కెమరాను బొట్టు బిళ్లతో కవర్ చేసుకోవడం మేలు. ఫోన్‌లోనూ వెబ్ క్యామ్ అనేబుల్ క్యాప్షన్‌లో ఉంచాలి ∙తెలిసిన పరిచయాలు కాంటాక్ట్స్‌లో ఉండాలి. పరిచయస్తులతో మాత్రమే సంభాషణ జరపాలి ∙యాప్స్ కూడా ప్లే స్టోర్ నుంచే డౌన్‌లోడ్ చేయాలి. ఆసక్తిగా కనిపించిన లింక్స్ అన్నీ ఓపెన్ చేయద్దు.
భయపడకూడదు..
మోసగాళ్లు అందుబాటులో ఉన్న మీ డేటాను, గత సోషల్‌మీడియా పోస్టింగ్‌లను, సోషల్ ఇంజనీరింగ్ నుండి సమాచారాన్ని ΄÷ంది, ఆన్‌లైన్ షేమింగ్ లేదా దోపిడీకి దారి తీస్తుంటారు. వాయిస్ మెసేజ్‌లు, ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ ద్వారా సంభాషణ జరిపి ఆ సమాచారంతో బెదిరింపులకు పాల్పడేవారి సంఖ్య పెరిగింది. మోసగాళ్లు మీలా నటిస్తూ నకిలీ ఖాతాను సృష్టిస్తారు. మీ పరిచయాల నుండి డబ్బు అడగడం, ద్వేషపూరిత మెసేజ్‌లు చేయచ్చు. ఆన్‌లైన్‌లో ఎవరి నుంచైనా అనైతిక ప్రవర్తనతో ఇబ్బంది పడితే భయపడకుండా కుటుంబ సభ్యులతో, టెక్నాలజీ మిత్రులతో పంచుకొని సరైన నిర్ణయం తీసుకోవాలి. స్కూళ్లలోనూ టీచర్లు టెక్నాలజీ విషయాల్లో అమ్మాయిలకు అవగాహన కల్పించడం తప్పనిసరి.
– అనీల్ రాచమల్ల, సైబర్ సేఫ్టీ నిపుణులు, ఎండ్ నౌ ఫౌండేషన్
Comments
Please login to add a commentAdd a comment