awareness
-
‘సజ్జనార్ సార్.. ఇలాంటి వారిని ఏం చేయలేమా?’
తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్ ఆర్టీసీ ఎండీగానే కాదు.. పోలీస్ అధికారికానూ సోషల్ మీడియాలో తన వంతు బాధ్యతను నిర్వహిస్తుంటారు. ఆలోచింపజేసే కంటెంట్‌ను పోస్ట్ చేస్తూ.. అదే సమయంలో కొన్ని విషయాలపై జనాల్ని అప్రమత్తం చేస్తుంటారు కూడా. తాజాగా.. ఆయన పోస్ట్ చేసిన ఓ వీడియోపై నెటిజన్లు ఆయన కామెంట్ సెక్షన్లోనే చర్చ జరుపుతున్నారు.సజ్జనార్ ఓ వీడియోను పోస్ట్ చేసి ఓ సందేశం ఉంచారు. అందులో.. ఓ యువకుడు ఆన్లైన్ బెట్టింగ్ ప్రమోషన్ చెబుతూ.. అరచేతిలో వైకుంఠం చూపించాడు. ఆ వీడియోను పోస్ట్ చేసిన సజ్జనార్.. బెట్టింగ్ కు బానిసై బంగారు భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకోకండి అని మెసేజ్ ఇచ్చారు. అయితే.. ఆ వీడియోపై పలువురు ఒక్కటే ప్రశ్న అడుగుతున్నారు. ఇలాంటి వాళ్లను అరెస్ట్ చేయలేమా? అని..చూశారా.. ఎంతకు తెగిస్తున్నారో...!! అమాయకులను బెట్టింగ్ కూపంలోకి లాగేందుకు ఇలాంటి చిత్ర విచిత్ర వేషాలు వేస్తున్నారు. తమ వ్యక్తిగత స్వార్థం కోసం ఎంతో మందిని అన్ లైన్ జూదానికి వ్యసనపరులను చేస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు. యువకుల్లారా!! అరచేతిలో వైకుంఠం చూపించే ఇలాంటి… pic.twitter.com/ziiiYKZqkc— V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 19, 2024ఈ వీడియోలో కుర్రాడు మాత్రమే కాదని.. ఇలాంటి వాళ్లు బోలెడు మంది ఉన్నారని.. అలాంటి వారిని అరెస్ట్ చేయలేమా? అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. అలాగే.. ఇలాంటి వారిని స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఆపేయాలని, గట్టి చర్యలు తీసుకోవాలని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. మరో వ్యక్తి.. ముందు ఆ వీడియోలోని వ్యక్తిని అరెస్ట్ చేయాలంటూ పోలీసులను ట్యాగ్ చేశాడు. అయితే ఆ కామెంట్లకు సజ్జనార్ నుంచి ఏదైనా బదులు వస్తే బాగుండు అని ఇంకో వ్యక్తి కామెంట్ చేశాడు. తెలంగాణ, ఆ మాటకొస్తే.. దేశంలో ఆన్లైన్ జూదాలకు బలైపోతున్నవాళ్లు ఎందరో. అలాంటి ముఠాలను చట్టాలు సైతం కట్టడి చేయలేకపోతున్నాయి. మరోవైపు వాటిని ప్రమోట్ చేస్తూ పబ్బం గడుపుకునేవాళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్ల పేరిట సోషల్ మీడియా ఫిగర్లు, యూట్యూబర్లు, కొందరు సెలబ్రిటీలు కూడా వీటిని బహిరంగంగానే ప్రమోట్ చేస్తున్నారు. అందుకే బెట్టింగ్ యాప్స్‌ను బ్యాన్ చేయాలని, వాటని ప్రమోట్ చేసేవాళ్లపైనా కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు బలంగా కోరుకుంటున్నారు.ఇదీ చదవండి: పస్రా పట్టింపు లేదా? నగరంలో కొత్త సంస్కృతి! -
సెలబ్రిటీలు మెచ్చిన స్టార్
అమెరికాలో చేస్తున్న కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి స్వదేశానికి తిరిగి వచ్చిన రేవంత్ హిమంత్సింగ్కా ఫుడ్ లేబుల్స్ చదవడం ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కలిగించడానికి, ఆరోగ్య అక్షరాస్యతను మెరుగుపరచడానికి నడుం కట్టాడు. సర్టిఫైడ్ హెల్త్‌కోచ్ అయిన రేవంత్ జంక్ ఫుడ్ వల్ల కలిగే అనర్థాల గురించి ప్రచారం చేయాలనే లక్ష్యంతో అమెరికా నుంచి ఇండియాకు తిరిగివచ్చాడు. ఒకప్పుడు ఫైనాన్స్, హెల్త్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్...మొదలైన వాటికి సంబంధించి సెల్ఫ్–హెల్ఫ్ బుక్ ప్రచురించాడు. ఇందులో ప్యాకేజ్డ్ గూడ్స్ లేబుల్స్‌పై కూడా ఒక చాప్టర్ ఉంది. సోషల్ మీడియాలో రేవంత్ ఎలా పాపులర్ అయ్యాడు అనే విషయానికి వస్తే...పిల్లల హెల్త్–డ్రింక్ బోర్న్‌విటాపై ఒక వీడియో విడుదల చేశాడు. డ్రింక్‌లో చక్కెర మొత్తాన్ని ఈ వీడియో హైలైట్ చేస్తుంది ఇది సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో వైరల్‌గా మారింది. ఈ వీడియో పుణ్యమా అని రేవంత్ రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయ్యాడు. ఆ తరువాత ‘ఫుడ్‌ఫార్మర్’ ట్యాగ్‌లైన్‌తో మ్యాగీ, మ్యాంగో జ్యూసెస్లాంటి ప్యాకేజ్డ్ కంటెంట్‌పై అవగాహన కలిగించడానికి మరిన్ని వీడియోలు చేశాడు. సెలబ్రిటీలు కూడా ఈ వీడియోలను షేర్ చేసేవారు.వివిధ వేదికలపై మాట్లాడే ఆహ్వానాలు రావడం, తరచూ పర్యటనలు చేయడం ఇబ్బందిగా మారడంతో కోల్కత్తా నుంచి ముంబైకి మకాం మార్చాడు హిమంత్సింగ్కా. పాఠశాలలో హెల్త్‌పై సబ్జెక్ట్ లేదు. వైద్యులతో కలిసి డయాబెటిస్, పీసీఓఎస్లాంటి సబ్జెక్ట్లపై కోర్సులు రూపొందించాలనుకుంటున్నాను. కోర్సుల ఫీజులను స్వచ్ఛంద కార్యక్రమాలకు వినియోగించాలనుకుంటున్నాను. ప్రజలను ఆరోగ్య అక్షరాస్యులుగా మార్చాల్సిన అవసరం ఉంది’ అంటున్నాడు. ‘ఫుడ్‌ఫార్మర్’గా పాపులర్ అయిన రేవంత్ తాజాగా ‘ఫోర్బ్స్ ఇండియా టాప్ డిజిటల్ స్టార్స్–2024’ జాబితాలో చోటు సంపాదించాడు. View this post on Instagram A post shared by Revant Himatsingka (@foodpharmer)(చదవండి: -
సోల్‌మేట్స్‌తో సోషల్‌గా...మనసుకు మేలే..!
సోషల్ మీడియా చేసే చెరుపు గురించి చర్చ ఉన్నప్పటికీదానిని సరిగా ఉపయోగిస్తే మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుందని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు.స్నేహాలు, సమూహాలు మనకంటూ కొందరున్నారన్న భరోసా ఇస్తేసలహాలు సూచనలు కూడా ఇక్కడి నుంచి అందడం వల్లఆందోళన దూరం అవుతుందంటున్నారు.సోషల్ మీడియాను మెరుగ్గా ఎలా అర్థం చేసుకొని ఉపయోగించాలి?సోషల్ మీడియా అంటే అదొక అవాస్తవిక ప్రపంచం, అక్కడున్న వారికి ఇబ్బందులు తప్పవు, మహిళల మీద ట్రోలింగ్ ఉంటుంది అనే అభి్ర΄ాయాలు చాలామందిలో ఉన్నాయి. అయితే నాణేనికి మరోవైపు కూడా ఉంది. సోషల్ మీడియాను సరిగ్గా వాడితే మానసిక సమస్యలు దూరమవుతాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఒంటరితనం, డిప్రెషన్, నిరాశ వంటివాటితో ఇబ్బంది పడేవారికి సోషల్ మీడియా ధైర్యాన్ని, మద్దతును, అర్థం చేసుకునే స్నేహితులను అందిస్తుందని అంటున్నారు.ఆత్మీయ బంధాలను అల్లుకోవచ్చుసోషల్ మీడియాలోని స్నేహాలన్నీ వ్యర్థమని, అక్కడ పరిచయమైన వారిలో నిజాయితీ ఉండదనే అ΄ోహ చాలామందిలో ఉంది. కానీ మనం నిజాయితీగా ఉంటే ఎదుటివారిలోని నిజాయితీని గుర్తించొచ్చని అంటున్నారు మానసిక నిపుణులు. అనేక ్ర΄ాంతాల్లో నివసిస్తున్న వారు, అనేక సామాజిక, ఆర్థిక నేపథ్యాలున్నవారు సోషల్‌మీడియాలో తారసపడుతుంటారు. అందులో మన భావాలకు, అభి్ర΄ాయాలకు తగ్గవారిని ఎంచుకునే అవకాశం ఉంటుంది. వారితో స్నేహం చేయడం ద్వారా మనలోని ఒంటరితనం దూరమవుతుంది. సోషల్‌మీడియాలో పరిచయమై ఆ తర్వాత అత్యంత ఆత్మీయ మిత్రులుగా మారినవారు బోలెడంత మంది ఉన్నారు. ఇవి మనసుకు బలం ఇస్తాయి.అభిరుచులకు తగ్గ స్నేహాలు మన చుట్టూ ఉన్నవారు మన అభిరుచులకు తగ్గట్టే ఉంటారని అనుకోలేం. కానీ సోషల్‌మీడియాలో ఒకే అభిరుచి, ఇష్టాయిష్టాలు కలిగిన వారు ఒకచోట చేరే అవకాశం ఉంటుంది. పుస్తక ప్రియులైతే ఒకచోట, చిత్రలేఖనం ఇష్టమైనవారంతా ఒకచోట, సినిమాలపై ఆసక్తి ఉంటే ఒక గ్రూప్, ప్రయాణాలు ఇష్టపడేవారు మరో గ్రూప్.. ఇలా మన ఇష్టాలకు తగ్గట్టు మెలిగే వారు కనిపిస్తారు. ఆ అంశాల గురించి చర్చిస్తారు. వారి అనుభవాలు వినొచ్చు. మన అభి్ర΄ాయాలు పంచుకోవచ్చు.. ఈ గ్రూపులు మన అవగాహన పరిమితిని విస్తృతం చేస్తాయి. తద్వారా మనసును విశాలం చేస్తాయి.అభిప్రాయాలు సరి చేసుకోవచ్చుసోషల్ మీడియా భిన్నాభిప్రాయాలు వినిపించే వేదిక. మన చుట్టూ ఉన్నవారి అభిప్రాయాలే కాక, ఎక్కడో ఉన్నవారి అభిప్రాయాలు మనం తెలుసుకోవచ్చు. అయితే భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచేటప్పుడు, సంయమనం చాలా ముఖ్యం. మన మాటే చెల్లాలి, మనం చెప్పిందే వినాలి అనే ఆధిపత్య ధోరణి ఉండకూడదు. కొన్ని అభిప్రాయాలు మన మీద లైట్ వేస్తాయి. మన మూస అభిప్రాయాలను మారుస్తాయి. నెగెటివ్ అభిప్రాయాలను దూరం చేసుకునేందుకు సాయం చేస్తాయి. ఇదంతా ఎందుకు అనంటే ఖాళీగా ఉండే మైండ్‌ను అర్థవంతమైన వ్యాపకంలో పెట్టడానికే. దీనివల్ల డిప్రెషన్ దూరమవుతుంది. అయితే సోషల్ మీడియాలో వచ్చే వార్తలన్నీ నిజాలు కావనేది గుర్తించాలి. అలాంటి ఫేక్ వార్తలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు ప్రచారం చేసేవారిని దూరంగా ఉంచాలి.నూతన అంశాలపై ఆసక్తి గాజులు ఎలా తయారు చేస్తారో తెలుసా? అద్దం ఎలా తయారవుతుంది? ఇంట్లో ఖాళీ డబ్బాలతో ఏదైనా అలంకరణ వస్తువులు చేయొచ్చా? చార్ధామ్ యాత్ర అంటే ఏమిటి? ఇలా మనకు తెలియని అంశాలను సోషల్ మీడియా ద్వారా తెలుసుకోవచ్చు. వీడియోల ద్వారా నేరుగా పరిశీలించొచ్చు. ఆసక్తి ఉంటే ప్రయత్నించవచ్చు. నూతన అంశాలపై ఆసక్తి ఉన్నవారికి సోషల్ మీడియా ఉపయోగకారి. తద్వారా మనమూ కంటెంట్ క్రియేటర్లుగా మారొచ్చు. ఇదంతా మనసును ఉత్సాహ పరిచే అంశమే.నిపుణుల సలహాలకు వేదికవేసవిలో ఏ ప్రాంతాలకు విహారయాత్రకు వెళ్లొచ్చు? బైక్ ఎక్కువ మైలేజ్ రావాలంటే ఏం చేయాలి? ఇంటీరియర్ డిజైనింగ్ కోసం ఏ రంగులు మేలు? ఇలా అనేక ప్రశ్నలు మనకుంటాయి. కానీ సమాధానాలు ఇచ్చేందుకు అన్నిసార్లూ నిపుణులు మనకు అందుబాటులో ఉండరు. ఆ లోటును సోషల్‌మీడియా తీరుస్తుంది. ఇక్కడ అనేకమంది నిపుణులు అందుబాటులో ఉంటారు. కొందరు నిపుణులు కాకపోయినా, తమ అనుభవంతో మన సందేహాలను నివృత్తి చేయగలరు. దీనివల్ల మనకు శ్రమ తగ్గుతుంది. అయితే ఆరోగ్యం, ఆర్థిక విషయాల్లో సోషల్‌మీడియా సలహాలు పాటించకపోవడం మేలని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఆ జాగ్రత్త పాటించడం తప్పనిసరి.సృజనాత్మకతకు వేదిక ఒక చక్కని కవిత రాశారా? పదిమందితో పంచుకోవాలని ఉందా? ఒక చిత్రం గీశారా? దాన్ని అందరికీ చూపించాలని ఉందా? సోషల్ మీడియా మన సృజనాత్మకతకు చక్కటి వేదిక. ఎంతోమంది అక్కడ పాపులర్ అయ్యారు, అవుతున్నారు. వారికంటూ అభిమానులను సంపాదించుకున్నారు. ఉన్నచోటే ఆగి΄ోకుండా సృజనకు వేదిక అందించి, సృజనకారుల్లో ఉత్సాహం నింపడం సోషల్ మీడియాలో సాధ్యం. మానసిక ఉల్లాసానికి సృజనాత్మక ప్రదర్శనలు చాలా మేలు చేస్తాయి.ఈ జాగ్రత్తలు తప్పనిసరి!సోషల్ మీడియాలో సంయమనం టించాలి. వ్యక్తిగతంగా దూషించడం, టార్గెట్ చేయడం, వేధించడం వంటివి చేయకూడదు.సోషల్ మీడియాను పరిమితంగానే వాడాలి. దానికి అడిక్ట్ అయి΄ోకూడదు.పూర్తి వ్యక్తిగత వివరాలు, ఇబ్బందికరమైన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పంచుకోకూడదు.సోషల్ మీడియాలో నెగిటివిటీకి దూరంగా ఉండాలి. సోషల్ మీడియాలో ఏవైనా వేధింపులు, మోసం, ట్రోలింగ్ వంటివి ఎదురైతే ధైర్యంగా ఎదుర్కోవాలి. వెంటనే సైబర్ నేరాల విభాగానికి ఫిర్యాదు చేయాలి. -
కాలేజీ అడ్మిషన్ల సంసిద్ధతపై నాట్స్ అవగాహన సదస్సు
అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా అయోవాలో కాలేజీ అడ్మిషన్ల సంసిద్ధతపై అవగాహన సదస్సు నిర్వహించింది. విద్యార్ధులు అత్యుత్తమ కాలేజీల్లో ఎలా సీట్లు పొందాలి.? దానికి ముందుస్తుగా ఎలాంటి కసరత్తు చేయాలి.? ఎలాంటి పరీక్షలకు సిద్ధం కావాలి.? మిడిల్ స్కూల్, హైస్కూల్ స్థాయిలోనే దానిని ఎలా సన్నద్దమవ్వాలనే కీలక విషయాలపై ఈ సదస్సు ద్వారా నాట్స్ అవగాహన కల్పించింది. సెడార్ రాపిడ్స్, మారియన్, రాబిన్స్, హియావత నగరాల నుండి పలువురు భారతీయ తల్లిదండ్రులు, విద్యార్ధులు ఈ అవగాహన సదస్సుకు హాజరయ్యారు. అయోవా నాట్స్ చాప్టర్ సమన్వయకర్త శివ రామ కృష్ణారావు గోపాళం ఈ సదస్సుకు అనుసంధానకర్త వ్యవహారించారు. కృష్ణ ఆకురాతి, సాగర్ పురాణం, జగదీష్ బాబు బొగ్గరపులు ఈ సదస్సులో ఎన్నో విలువైన సూచనలు చేశారు. తల్లిదండ్రుల, విద్యార్ధుల సందేహాలను నివృత్తి చేశారు.. విద్యార్ధుల చక్కటి భవిష్యత్తుకు బాటలు వేసే ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని శివ రామకృష్ణారావు గోపాళం తెలిపారు. తల్లిదండ్రులకు, విద్యార్ధులకు కాలేజీ ప్రవేశాలపై చక్కటి అవగాహన ఇలాంటి సదస్సుల వల్ల లభిస్తుందన్నారు. నాట్స్ తెలుగువారి కోసం కోసం ఇంత చక్కటి సదస్సును ఏర్పాటు చేసినందుకు తల్లిదండ్రులు నాట్స్ నాయకత్వాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలకు గిరీష్ కంచర్ల, నవీన్ ఇంటూరి అవసరమైన ఆహార ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో తమ వ్యక్తిగత అనుభవాలను వివరించిన హిమాన్షు భూషణ్, రవి కొంపెల్లాలకు నాట్స్ ధన్యవాదాలు తెలిపింది. సుమన్ ఒంటేరు ఫోటోగ్రాఫింగ్, ఆడియో విజువల్ సిస్టమ్‌లలో సహాయం చేసినందుకు నాట్స్ అభినందించింది. అయోవాలో కాలేజీ ప్రిపరేషన్ అవగాహన సదస్సు విజయవంతం చేయడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.(చదవండి: లండన్‌లో ఘనంగా దసరా అలాయి బలాయి) -
భారత సైన్యం చేస్తున్న మేలు..!
ప్రపంచం 21వ శతాబ్దంలో ఉంది. విశ్వమంతా అరచేతిలో ఇమిడిపోయినంత టెక్నాలజీతో స్మార్ట్‌గా జీవిస్తోంది ప్రపంచం. మదిలో మెదిలిన సందేహానికి సమాధానాన్ని నిమిషంలో తెలుసుకోగలిగినంత టెక్నాలజీ అందుబాటులో ఉంది. అయినప్పటికీ గర్భిణి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియని జీవితాలు ఇంకా ఉన్నాయి. భారతీయ సైన్యంలో మహిళల బృందం ఇటీవల వారిని సమావేశపరిచి ప్రెగ్నెన్సీ అవేర్నెస్ సెషన్ నిర్వహించింది. అత్యంత ఆసక్తిగా వినడంతోపాటు ఇంత వరకు తమకు ఈ సంగతులు చెప్పిన వాళ్లు లేరని, మొదటిసారి వింటున్నామని ఆనందం వ్యక్తం చేశారా మహిళలు. ఇంతకీ ఇంతటి వెనుకబాటులో మగ్గిపోతున్న వాళ్లెవరంటే ఆఫ్రికా ఖండంలోని అబేయీ వాసులు. ఆల్ ఉమెన్ ప్లాటూన్ చొరవ సూడాన్, సౌత్ సూడాన్ల మధ్య తలెత్తిన వివాదంలో అబేయీ నలిగిపోతోంది. అబేయీలో శాంతి స్థాపన కోసం యునైటెడ్ నేషన్స్ చేస్తున్న ప్రయత్నంలో భాగంగా మనదేశం నుంచి గత ఏడాది ఆల్ ఉమెన్ ప్లాటూన్ అబేయీలో అడుగుపెట్టింది. ఆ బృందం పేరు ‘యునైటెడ్ నేషన్స్ ఇంటిరిమ్ సెక్యూరిటీ ఫోర్స్ ఫర్ అబేయీ (యూనిస్ఫా)’. మన మహిళా సైనికులు అబేయీలో శాంతి స్థాపనతోపాటు ప్రజారోగ్యం కోసం కూడా పని చేస్తోంది. అందులో భాగంగా కెప్టెన్ జస్ప్రీత్ కౌర్, ఇండియన్ బెటాలియన్ మెడికల్ ఆఫీసర్ మేజర్ అభిజిత్ ఎస్‌లు అబేయీలోని రుమాజక్ గ్రామంలో స్థానిక మహిళలను సమావేశపరిచి వారికి గర్భధారణ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. గర్భిణి తీసుకోవాల్సిన పోషకాహారం, ఈ సమయంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు, క్రమం తప్పకుండా చేయించుకోవాల్సిన హెల్త్ చెకప్‌లు, ప్రసవం తర్వాత బిడ్డ సంరక్షణలో తీసుకోవాల్సిన శ్రద్ధ మొదలైన విషయాలను వివరించారు. సేఫ్ అండ్ హెల్దీ ప్రెగ్నెన్సీ గురించి బొమ్మలతో వివరిస్తూ ప్రచురించిన చిన్న పుస్తకాలను కూడా పంచారు. భారతీయ సైనిక మహిళల బృందం చొరవను, స్థానిక మహిళల ఆనందాన్ని యూఎన్ మిషన్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. (చదవండి: తండ్రి హత్యను ఛేదించేందుకు పోలీసుగా మారిన కూతురు..! చివరికి 25 ఏళ్ల తర్వాత..) -
సంసారం.. ఆర్ధిక చదరంగం!
హైదరాబాద్‌కు చెందిన మనీషా (30) పెళ్లయి ఏడాది కూడా కాలేదు. అప్పుడే భర్తతో ఆమెకు వాదోపవాదాలు నిత్య కృత్యంగా మారాయి. అది కూడా ఆర్ధిక అంశాలపైనే. పెళ్లికి రెండేళ్ల ముందు నుంచే మనీషా దంపతులు ఒకరికొకరు పరిచయస్థులు. ఎన్నో అంశాలపై గంటల తరబడి మాట్లాడుకున్న వారే. ‘‘అతడి గురించి నాకు అంతా తెలుసనుకున్నా. కానీ, ఆర్థిక అంశాల నిర్వహణ గురించి ఎప్పుడూ మాట్లాడుకున్నది లేదు. అక్కడే మేము తప్పటడుగు వేశామని అనిపిస్తోంది’’ అన్నది మనీషా అంతరంగం. వైవాహిక బంధం చిరకాలం వర్ధిల్లాలంటే దంపతుల మధ్య చక్కని అవగాహన, పరస్పర గౌరవం, అభిమానం ఉంటే సరిపోతుందని అనుకుంటాం. కానీ, ఆర్థిక అవగాహన కూడా ఉండాలన్నది నిపుణుల సూచన. తమకు ఏ ఆహారం అంటే ఇష్టం, తమకు నచ్చే సినిమాలు, మెచ్చే పర్యాటక ప్రాంతాలు.. ఇలా మూడు ముళ్లకు ముందే ముచ్చట్లు ఎన్నో చెప్పుకోవడం, పరస్పర ఇష్టాలు పంచుకోవడం చేస్తుంటారు. కానీ, ఆర్థిక అంశాలు, భవిష్యత్ ఆర్ధిక లక్ష్యాల గురించి చర్చించుకునే వారు బహుశా చాలా తక్కువగా ఉంటారు. ఇలా చేయకపోవడం వల్ల ఎలాంటి ప్రతికూలతలు ఎదురవుతాయో మనీషా ఉదంతం చెబుతోంది. అందుకే వైవాహిక బంధంలోకి అడుగు పెట్టడానికి ముందే భవిష్యత్ ఆర్ధిక పథంపై మనసు విప్పి చర్చించుకోవడం ఎంతో అవసరం. దీని ప్రాధాన్యతను తెలియజెప్పే కథనమే ఇది... మారుతున్న పరిస్థితులు.. ఆర్ధిక విభేదాలు వైవాహిక బంధంలో చిచ్చుపెట్టే ప్రమాదం లేకపోలేదు. ఆర్థికంగా అప్పుల పాలై, బయట పడే మార్గం తోచక సామూహిక ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అమెరికాకు చెందిన ‘జిమెనెజ్ లా ఫర్మ్’ చేసిన అధ్యయనంలో.. ఆ దేశంలో 29% విడాకులకు ఆర్ధిక విభేదాలే కారణం అవుతున్నట్టు తెలిసింది. అమెరికా స్థాయిలో ప్రస్తుతం మన దేశంలో బంధాల విచ్ఛిన్నానికి ఆర్ధిక అంశాలు కారణం కాకపోవచ్చు. కానీ, ఇటీవలి కాలంలో మనదేశంలోనూ మహిళల ఆర్ధిక సాధికారత మెరుగుపడుతూ వస్తోంది. పెళ్లయిన తర్వాత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొనసాగేందుకు యువతరం మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు. ఆర్థిక అంశాల్లో వారు పురుషులకు ఏ మాత్రం తక్కువ కాదు. కనుక ఆర్ధిక అంశాలపైనా దంపతుల మధ్య ఏకాభిప్రాయం, పరస్పర అంగీకారాలు ముఖ్యమే. చర్చించుకోవడమే మెరుగైన మార్గం వివాహం తర్వాత ఆర్ధిక విభేదాలు పొడచూపకూడదని అనుకుంటే, అందుకు ఎలాంటి జంకు లేకుండా ‘మనీ’ గురించి సౌకర్యంగా మాట్లాడుకోవడమే మంచి పరిష్కారం. ‘‘దంపతుల్లో చాలా మంది ఆర్ధిక అంశాల గురించి మాట్లాడుకోవడానికి సంకోచిస్తుంటారు. డబ్బు మనిషనో లేదా ఆధిపత్యం చెలాయిస్తున్నారనో పొరపడతారన్నది వారి ఆందోళన. కానీ విడాకులకు ఆర్ధిక అంశాలు ప్రధాన కారణంగా ఉంటున్నాయి. కనుక ఈ అంశాలపై చర్చించుకోవడం ఎంతో ముఖ్యం’’ అని ఫిన్‌సేఫ్ ఎండీ మృణ్ అగర్వాల్ పేర్కొన్నారు. ఒక వ్యక్తి ఆర్ధిక నిర్ణయాలను అప్పటి వరకు కలిగి ఉన్న ఆర్ధిక అవగాహనే నిర్ణయిస్తుంది. తమ నిర్ణయాలను గౌరవించే, ఏకీభవించే భాగస్వామిని గుర్తించడం వైవాహిక బంధం విజయవంతానికి కీలకమని నిపుణుల సూచన. విల్లా, కారు తదితర ఆకాంక్షలు ఏవైనా ఉన్నాయా? ఎప్పటిలోపు వాటిని సాధించాలని అనుకుంటున్నారు? వివాహం తర్వాత తొలి ప్రాధాన్యం ఏ లక్ష్యానికి? వినోదం, విహారానికి ఎక్కువ ఖర్చు చేయాలని అనుకుంటున్నారా? డబ్బు విషయంలో బాధ్యతగా ఆలోచిస్తున్నారా? చక్కదిద్దుకోవాల్సిన ఆర్ధిక ప్రతికూలతలు ఏవైనా ఉన్నాయా? ఇలాంటి అంశాలన్నింటిపై స్పష్టత అవసరం. ‘‘ఆర్థిక అలవాట్లలో ఎంతో వ్యత్యాసం కనిపిస్తుంటుంది. ఒకరు ఎంతో పొదుపరి అయి ఉంటారు. మరొకరు ఖర్చు చేయడంలో ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు. ఇది వివాదానికి దారితీస్తుంది. కొన్ని విభేదాలను సులభంగానే పరిష్కరించుకోవచ్చు. కానీ, కొన్ని ఓ పట్టాన పరిష్కారం కావు. అందుకని ఒకరినొకరు ఆర్థిక అంశాలపై చర్చించుకొని, నిర్ణయాలను ఉమ్మడిగా తీసుకోవాలి’’ అని ఆనంద్ రాఠి వెల్త్ డిప్యూటీ సీఈవో ఫెరోజ్ అజీజ్ సూచించారు.ప్రణాళిక ప్రకారం దంపతుల మధ్య వచ్చే కలతలకు ఎవరో ఒకరు అధికంగా ఖర్చు చేయడం ప్రధాన కారణం. ఒకరు ఎంతో పొదుపుగా రూపాయి, రూపాయి కూడబెడుతుంటే, మరొకరు ఖర్చు చేయడాన్ని ఆనందిస్తుంటే వారి మధ్య ప్రశాంతత కష్టం. విభేదాలు రాక మానవు. ఖర్చు చేసే అలవాట్లు అన్నవి ఒకరి మానసిక తీరుపైనే ఆధారపడి ఉంటాయి. కొందరు షాపింగ్‌లో ఆనందాన్ని వెతుక్కుంటారు. సంపదతో గౌరవం వస్తుందని భావిస్తుంటారు. బ్యాంక్ ఖాతాలో సరిపడా నిధులు లేకపోయినా గొప్ప కోసం ఖరీదైన ఉత్పత్తులు కొనుగోలుకు మొగ్గు చూపిస్తుంటారు. ఒక భాగస్వామి పొదుపు, మదుపు (పెట్టుబడి)కు ప్రాధాన్యం ఇస్తుండొచ్చు. ఆర్ధిక వెసులుబాటు పరిమితంగా ఉండడం ఇందుకు నేపథ్యం కావొచ్చు. అందుకే ఆర్ధిక భద్రత దృష్ట్యా పొదుపు చేస్తుండొచ్చు. దీనికి విరుద్ధమైన ధోరణి కలిగిన భాగస్వామి తోడైనప్పుడు అది స్పర్థకు దారితీస్తుంది. ‘‘భాగస్వాములు ఇద్దరూ స్వేచ్ఛను గౌరవించుకోవాలి. అదే సమయంలో చర్చించుకుని, పరస్పర అంగీకారానికి వచ్చే పరిణతి కూడా అవసరం’’ అనేది జీవైఆర్ ఫైనాన్షియల్ ప్లానర్స్ సీఈవో రోహిత్ షా సూచన. ఏ తరహా ఆర్ధిక వ్యక్తిత్వాన్ని మీరు నచ్చుతారన్న స్పష్టత ఉండాలి. అప్పుడు కాబోయే జీవిత భాగస్వామితో ఈ అంశాలపై విస్తృతంగా చర్చించుకోవాలి. ఆర్ధిక అంశాల నిర్వహణపై మాట్లాడుకోవాలి. బడ్జెట్ ఏర్పాటు, ఆర్ధిక లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని, వాటికి కట్టుబడి ఉండేలా అంగీకారానికి రావాలి. కేవలం పొదుపు అనే కాదు, జీవనశైలి అలవాట్లు, ఆనందాల కోసం భాగస్వాములు ఇద్దరూ ఆదాయంలో 10% బడ్జెట్ కేటాయించుకోవడంలో తప్పు లేదన్నది నిపుణుల సూచన. కేటాయింపులు అన్నీ పోను మిగులు ఉంటే, ఆ మొత్తాన్ని తమ అభిరుచుల కోసం ఖర్చు చేసుకోవచ్చు. ఆధిపత్యం పనికిరాదు.. మనీ విషయాల్లో ఆధిపత్య ధోరణి పనికిరాదు. డబ్బుకు సంబంధించి నిర్ణయాలు అన్నింటినీ తానే తీసుకోవాలన్న ధోరణి సరికాదు. ఈ విషయాల్లో జీవిత భాగస్వామి అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి. ‘‘ఆర్ధిక అంశాల నిర్వహణ గురించి తనకు ఎంత మాత్రం తెలియదన్నది నా భర్త సమాధానం. కానీ, ఖర్చుల గురించి నేను ఎప్పుడు చెప్పాలనుకున్నా.. ఆయన కొట్టిపారేస్తుంటారు’’ అని ఢిల్లీకి చెందిన మార్కెటింగ్ నిపుణురాలు అంజలి వర్మ వాపోయారు. కేవలం పురుషులే ఆర్జనా పరులుగా ఉన్న కుటుంబాల్లో ఈ తరహా ధోరణి మరింత ఎక్కువగా కనిపిస్తుంది. భార్య విద్యావంతురాలై, గృహిణిగా కొనసాగుతున్నా, ఆమెకు ఆర్ధిక అంశాలపై అవగాహన ఉన్నా కానీ, కుటుంబ నిర్ణయాల్లో సమాన భాగస్వామ్యం కలి్పంచే తీరు అన్ని చోట్లా కనిపించదు. రాణించే మహిళలు ఉన్న చోట పురుషులు అభద్రతా భావానికి లోనవుతుంటారని, అది కలహాలకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. కనుక ఆర్ధిక అంశాల్లో తమ భాగస్వామ్యం ఏ మేరకు అన్న దానిపై పెళ్లికి ముందే యువతీ, యువకులు తప్పకుండా ప్రశి్నంచుకోవాలని సూచిస్తున్నారు. ఆర్ధిక బాధ్యతలను ఎలా పంచుకుంటారని కూడా ప్రశ్నించుకోవాలి. ఇరువురి మధ్య సరైన అవగాహన కుదిరినప్పుడే ఏడడుగులు వేయడం సరైన నిర్ణయం అవుతుంది. పెట్టుబడుల ఎంపికలు పెట్టుబడుల విషయంలోనూ దంపతుల మధ్య అవగాహన, పరస్పర అంగీకారం అవసరమే. ఒకరు అధికంగా రిస్క్ తీసుకుంటే, మరొకరు పరిమిత రిస్క్ ఉన్న పెట్టుబడులకే పరిమితం కావొచ్చు. ఇందులో ఎలాంటి తప్పులేదు. ఇద్దరూ భిన్న మార్గాలను అనుసరించడం మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది. దీనివల్ల మెరుగైన రాబడులకు, రక్షణ తోడవుతుంది. ఒక విధంగా ఇది ఈక్విటీ, డెట్ కలయికగా భావించొచ్చు. అయితే ఆయా అంశాలపై కాబోయే దంపతులు ఇద్దరూ చర్చించుకోవాలి. ఏఏ సాధనాలు ఎలా పనిచేస్తాయి, అందులో ఉండే రిస్‌్కలు, వచ్చే రాబడుల గురించి పూ ర్తి అవగాహన తెచ్చుకోవాలి. అప్పుడు సమష్టి నిర్ణయాలు తీసుకోవాలి. సరైన నిర్ణయాలు తీసుకోకపోతే దీర్ఘకాల ఆర్ధిక లక్ష్యాలకు అవరోధాలు ఏర్పడొచ్చు. అవసరం అనుకుంటే ఈ విషయంలో ఆర్ధిక సలహాదారుల సాయం తీసుకోవాలి.గోప్యత ప్రమాదకరం రుణాలు తీసుకోవడం, అప్పులతో కొనుగోళ్లు చేసే విషయాలను జీవిత భాగస్వామికి తెలియకుండా కొన్ని సందర్భాల్లో దాచి పెడుతుంటారు. ఇది విశ్వాసలేమికి దారితీస్తుంది. ఇదే మాదిరి ఎన్నో విషయాలు తనకు తెలియకుండా చేస్తుండొచ్చని భాగస్వామి సందేహించడానికి అవకాశం కలి్పస్తుంది. అందుకే ఇలాంటివి భాగస్వామికి చెప్పి చేయాలి.ధన సాయం తమ బంధువులు, స్నేహితులు, సహచర ఉద్యోగుల్లో ఎవరికైనా ఆర్ధిక సాయం చేసే ముందు, తమ ఆర్థిక అవసరాలకే మొదట ప్రాధాన్యం ఇవ్వాలి. ఇతరులకు సాయం చేయడానికి ముందు తమ ఆర్ధిక భవిష్యత్‌కు భరోసా కలి్పంచుకోవడం అవసరమని జీవైఆర్ ఫైనాన్షియల్ ప్లానర్స్ సీఈవో రోహిత్ షా పేర్కొన్నారు. డబ్బు సాయం తీసుకున్న వారు తిరిగి చెల్లించడంలో విఫలమైతే? పరిస్థితి ఏంటన్నది ప్రశి్నంచుకోవాలి. మరీ ముఖ్యంగా భాగస్వామికి తెలియకుండా ఇలాంటి ధన సాయాలు చేస్తే, అవి కాపురంలో కలహాలకు దారితీసే ప్రమాదం కచ్చితంగా ఉంటుంది. రుణ భారం తమకు కావాల్సిన ప్రతిదీ ఈఎంఐపై సమకూర్చుకోవడం కొందరికి అలవాటు. ఇందుకోసం క్రెడిట్‌కార్డు రుణాలనూ వాడేస్తుంటారు. అధిక వడ్డీలతో కూడిన రుణాలు ఊబిలోకి నెట్టేస్తాయి. ఆర్ధిక సమస్యలు ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయి. ఈ తరహా అలవాట్ల గురించి పెళ్లికి ముందే కాబోయే భాగస్వామికి చెప్పడం ఎంతో అవసరం. ఆదాయం, వ్యయాలు, పెట్టుబడుల ప్రణాళికలు, ఖర్చు చేసే అలవాట్లు, రుణాలు తదితర అంశాల గురించి సమగ్రంగా చర్చించుకోవడం, ఆర్ధిక సలహాదారుల సాయం తీసుకోవడం, పరస్పర అంగీకారం, గౌరవం, పారదర్శకత ఇవన్నీ.. వైవాహిక బంధంలో ఆర్ధిక సంక్షోభాలు రాకుండా నివారిస్తాయి. – సాక్షి, బిజినెస్‌డెస్క్ -
తస్మాత్ జాగ్రత్త..! కనిపించని కన్ను చూస్తోంది..!
వరంగల్: టెక్నాలజీ.. మానవాళికి ఎంత మంచి చేస్తోందో.. ఆకతాయిలు, సంఘ విద్రోహుల చేతిలో పడి అంతే చెడు చేస్తోంది. ఫేస్బుక్, వాట్సాప్, యూ ట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలను అనుసరించి వ్యాపార అభివృద్ధి, స్నేహం, నాలెడ్జి పెంచుకుంటున్న వారు కొందరైతే.. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల సరఫరా, ఉద్యోగాల పేరుతో మోసానికి పాల్పడుతున్న వారు మరికొందరు. కాగా, ఇటీవల ట్రయల్ రూమ్, హాస్టల్ గదుల్లో స్పై కెమెరాలు (సీక్రెట్ కెమెరా) అమర్చిన ఘటనలు వింటున్నాం. విస్తరిస్తున్న టెక్నాలజీని ఇలా అడ్డదిడ్డంగా వినియోగిస్తే తర్వాత జైలుకెళ్లడం ఖాయం.స్వల్ప పరిమాణంలో ఉండే ఈ స్పై కెమెరాలతో ఆకృత్యాలకు ఒడిగడుతున్న వారు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. షాపింగ్ మాళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, లాడి్జలు..ఇలా పబ్లిక్ ప్రదేశాల్లో ఎక్కడ ఏ కెమెరా కన్ను మనపై ఉందో తెలియని పరిస్థితి ఎదురవుతోంది. ముఖ్యంగా మహిళలు ఇలాంటి కెమెరాలకు బలవుతున్న ఘటనలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి. అయితే కాస్త అప్రమత్తంగా ఉండి టెక్నాలజీని ఎలా వినియోగించాలో తెలిస్తే స్పై కెమెరాలను ఇట్టే గుర్తించే వీలుంది. అలా గుర్తించి పోలీసుల దృష్టికి తీసుకెళ్తే ఆకతాయిల పని పట్టేందుకూ అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో స్పై కెమెరా పని విధానం, ఆ కెమెరాను గుర్తించే వివిధ మార్గాల గురించి ‘సాక్షి’ ప్రత్యేక కథనం..మోషన్ డిటెక్షన్, సౌండ్ టెక్నాలజీ..కొన్ని శక్తివంతమైన స్పై కెమెరాల్లో బ్యాటరీని ఆదా చేయడం కోసం సౌండ్, మోషన్ డిటెక్షన్ టెక్నాలజీ పొందుపరుస్తారు. గతంలో హాస్టళ్లలో జరిగిన ఘటనలు పరిశీలిస్తే ఒక్కొక్కటి సుమారు రూ.3వేల లోపు విలువైన స్పై కెమెరా సౌండ్ యాక్టివేటెడ్ ఫీచర్స్ కలిగి ఉన్నాయి. మహిళలు బాత్రూం రావడానికి ముందు డోర్ తీయగానే ఆ శబ్దానికి ఆటోమేటిక్‌గా కెమెరా యాక్టివేట్ అయి వీడియో రికార్డ్ చేస్తుంది. వ్యక్తుల కదలికలను బట్టి దానంతట అదే రికారి్డంగ్ అవుతుంది. ఒకసారి చార్్జచేస్తే రెజల్యూషన్ బట్టి నాలుగైదు గంటల పాటు నిరంతరాయంగా ఈ కెమెరాలు వీడియో రికార్డ్ చేస్తాయి.స్పై కెమెరాలతో ప్రమాదాలు..స్పై కెమెరాల ద్వారా మహిళల నగ్న దృశ్యాలను రికార్డ్ చేసి వాటిని పోర్న్ సైట్లలో అప్లోడ్ చేస్తున్న వారు ఇటీవల అధికమవుతున్నారు. మరికొంత మంది ఆ వీడియోలను సంబంధిత మహిళలకు పంపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఎక్కడైనా ఇలా అనుమానాస్పదంగా ఉన్న స్పై కెమెరాలను గుర్తిస్తే వాటికి సంబంధించిన ఆధారాలను స్టార్ట్ఫోన్లో వీడియో, ఫొటోల రూపంలో రికార్డు చేయాలి. సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. షాపింగ్ మాల్స్ వంటి వాటిలో ఫ్లోర్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లాలి. వీడియో ఫుటేజీ రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తుంటే, వెంటనే కుటుంబ సభ్యులతో చర్చించి పోలీసుల దృష్టికి తీసుకెళ్లడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో భాగంగా చాలా మంది మహిళలు నగరాల్లో హాస్టల్స్‌లో ఉంటున్నారు. వారు ఉండే గదులు, బాత్రూమ్లను నిశితంగా పరిశీలించాలి. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ స్పై కెమెరాలకు చెక్ పెట్టాలి.మొబైల్స్‌తోనూ..స్పై కెమెరాలు మాత్రమే కాదు, నిరంతరం మొబైల్ ద్వారా కూడా పబ్లిక్ ప్లేస్ల్లో మహిళల కదలికలు రికార్డు చేస్తున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఎవరికీ అనుమానం రాకుండా ప్రివ్యూ కూడా కనిపించకుండా బ్యాక్ గ్రౌండ్లో వీడియోని రికార్డ్ చేసే యాప్స్‌ని వాడుతున్నారు.ఎన్నో రకాలు..చాలా మంది అనుకుంటున్నట్లు చూడటానికి కెమెరా మాదిరి ఉండదు. మనకు ఏ మాత్రం అనుమానం రాకుండా రకరకాల వస్తువుల రూపంలో రూపొందిస్తారు. అనేక స్పై కెమెరాలను గమనిస్తే జేబులో పెన్, షర్టు బటన్స్, టేబుల్ మీద పెట్టే చిన్న క్లాక్‌లు, రిస్ట్ వాచీలు, ఫ్లవర్ వాజ్‌లు, కీచైన్లు, హ్యాంగర్స్, ఇంట్లో ఉండే ఫొటో ఫ్రేమ్‌లు, మొక్కలు, స్విచ్‌బోర్డులు, బల్బులు ఇలా అనేక విధాలా స్పై కెమెరాలు దొరుకుతున్నాయి.అనేక రకాల పరీక్షలు..స్పై కెమెరాలను గుర్తించేందుకు టెక్నిక్స్ ఉన్నాయి. కొన్ని రకాల కెమెరాలున్న ప్రదేశాల్లో ఫోన్ కాల్ చేసేందుకు ప్రయత్నిస్తే ఆది కాల్ డ్రాప్ అవుతుంది. ఆయా కెమెరాల్లో ఉండే మ్యాగ్నటిక్ తరంగాల వల్ల ఇలా జరుగుతుంది. ఇటీవల కాల్ డ్రాప్ అనేది తరచూ ఎదుర్కొనే సమస్య కావడంతో స్పై కెమెరా ఉందని అనుమానించలేని పరిస్థితి. ఇక ట్రయల్ రూమ్స్‌లో అమర్చే అద్దాలు రెండు రకాలుంటాయి. సహజంగా అద్దం ఒకవైపు మన రూపాన్ని చూపిస్తూ, దాని వెనుక భాగంలో వేరే రంగుతో కోటింగ్ చేయబడి ఉంటుంది. కానీ కొన్ని అద్దాలు పారదర్శకంగా ఉండి, ఇవతలి దృశ్యాలను అవతలికి చూపిస్తుంటాయి. మీకు అలాంటి అనుమానం వస్తే అద్దంలో కొద్దిగా ఖాళీ స్థలం ఉండాలి. అలా కాకుండా రెండు టచ్ అయినట్లు ఉంటే ఆ అద్దం అవతలి వైపు మీ దృశ్యాలను చూపిస్తుందని గ్రహించాలి. లైట్లన్నీ ఆఫ్ చేసి, ఫ్లాష్ లైట్‌ని అద్దం మీద వేసినప్పుడు అవతలి వైపు ఏదైనా ఉందేమో తెలుస్తుంది.గుర్తించడం ఎలా?స్మార్ట్ఫోన్లు వాడేవారికి గూగుల్ ఫ్లే స్టోర్‌లో హిడెన్ కెమెరా డిటెక్టర్ అనే యాప్ చాలా సందర్భాల్లో పనిచేస్తుంది. ఐ ఫోన్లు వినియోగించే వారికి స్పై హిడెన్ కెమెరా డిటెక్టర్ యాప్ ఉపయోగపడుతుంది. స్పై కెమెరాలు వెలువరించే ఇన్ఫ్రారెడ్ కిరణాలను గుర్తించడం ద్వారా గదిని పూర్తిగా డార్క్ చేసినప్పుడు నిర్దిష్ట స్థలంలో కెమెరా ఉందా లేదా అనే విషయం గమనించి మొబైల్ అప్లికేషన్లో వాటిని చూపిస్తాయి. స్పై కెమెరాలను గుర్తించడానికి బగ్ డిటెక్టర్ అనే ప్రత్యేక పరికరాలుంటాయి.ఇవి చదవండి: అమెరికాను వణికిస్తున్న హరికేన్ హెలెన్ -
Health: రిలీఫ్.. మెనోపాజ్ ఎక్సర్సైజ్!
మెనోపాజ్ అనేది మహిళల జీవితంలో ఒక సహజమైన దశ. ఇది సాధారణంగా 45 నుంచి 55 సంవత్సరాల మధ్య కాలంలో సంభవించే రుతుక్రమ ముగింపును సూచిస్తుంది. హార్మోన్లు.. ప్రధానంగా ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ ఉత్పత్తి తగ్గుదల వల్ల ఒంట్లో వేడి, మానసిక అలజడి, నిద్ర పట్టకపోవడం, బరువు పెరగడం వంటివి సంభవిస్తాయి. ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు చాలామంది ‘ఇది ఈ సమయంలో సహజమే, భరించాలి మరి’ అని చెబుతుంటారు. అయితే, మెనోపాజ్ దశనూ ఆహ్లాదంగా గడిపేయాలంటే నిపుణులు సూచనలను పాటించడం మేలు.ప్రధానంగా శారీరక శ్రమ వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. ఎండార్ఫిన్ విడుదల ద్వారా మానసిక స్థితి బాగవుతుంది. ఎముకలను బలోపేతం చేయడం ద్వారా బోలు ఎముకల వ్యాధి (ఆస్టియో΄÷రోసిస్) ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వ్యాయామం, ఏరోబిక్స్ వంటివి హాయినిచ్చే నిద్రను, పనిచేయగలిగే సామర్థ్యాన్నీ పెంచుతాయి. మెనోపాజ్ సమయం లో ఉపశమనం కలిగించే ఈ 8 వ్యాయామాలను ఒక అలవాటుగా మార్చుకోవాలి.1. వాకింగ్..నడక గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడే ప్రభావ వంతమైన వ్యాయామం ఇది. జీవక్రియలు మందగించినప్పుడు ఇది కీలకంగా పనిచేస్తుంది. ఒత్తిడిని నివారిస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.2. యోగా..ఆందోళనను తగ్గించడంలో యోగా ఔషధంగా పనిచేస్తుంది. కొన్ని యోగ భంగిమలు కీళ్ల దృఢత్వాన్ని మెరుగుపరుస్తాయి. విశ్రాంతిని, మంచి నిద్రను ΄÷ందడంలో సహాయపడతాయి.3. పవర్ ట్రెయినింగ్..మెనోపాజ్ వల్ల కలిగే కండరాల క్షీణతను ఎదుర్కోవడానికి పవర్ ట్రెయినింగ్ సహాయపడుతుంది. ఎముక సాంద్రత మెరుగవుతుంది. ఆస్టియో΄÷రోసిస్ వంటి ఎముకల వ్యాధి వల్ల కలిగే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బరువులు ఎత్తడం వల్ల కండరాల శక్తి పెరుగుతుంది. జీవక్రియ మెరుగవుతుంది.4. ఈత..మెనోపాజ్ దశలో స్విమ్మింగ్ అనేది శరీరమంతటికీ పనికి వచ్చే వ్యాయామంగా చెప్పుకోవచ్చు. ఇది కీళ్లపై సున్నితంగా పనిచేస్తుంది. దీనివల్ల కీళ్ల నొప్పులు ఉండి, రుతుక్రమం ఆగిన మహిళలకు చాలా ఉపశమనంగా ఉంటుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కండరాల బలాన్ని పెంచుతుంది. శరీరంలో వేడి ఆవిర్లు వచ్చినట్లు అనిపించే భావనను తగ్గించి, శరీరాన్ని చల్లబరచడంలో ప్రత్యేకంగా సహాయపడుతుంది.5. పిలాటిస్..శరీర భంగిమలను సరిచేయడానికి ఉపకరించే ఆధునిక వ్యాయామ పద్ధతులను పిలాటిస్ అంటారు. ప్రత్యేక సాధనాల తో ఈ వ్యాయామాలు చేస్తారు. కండరాల బలాన్ని పెంచడానికి, నొప్పులను తగ్గించడానికి సున్నితమైన కదలికల ద్వారా శరీరంపై ఎక్కువ ఒత్తిడిని కలిగించకుండా ఈ వ్యాయామాలు చేస్తారు.6. నృత్యం..చురుకుగా ఉండటానికి, ఒత్తిడిని తగ్గించడానికి డ్యాన్స్ ఒక ఆహ్లాదకరమైన మార్గం. డ్యాన్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కేలరీలను బర్న్ చేస్తుంది. సామాజికంగానూ నలుగురిని కలిసేలా చేస్తుంది. ఒంటరితనం భావాలను తగ్గిస్తుంది.7. తాయ్ – చి..తాయ్– చి వ్యాయామంలో కదలికలు నెమ్మదిగా ఉన్నా శారీరక ఆరోగ్యానికి ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ వ్యాయామం రుతుక్రమం ఆగిన మహిళలకు ప్రత్యేకంగా ఉపయోగకరంగా ఉంటుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది, మానసిక స్థితిని, నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.8. సైక్లింగ్..హిప్ కింది భాగానికి బలం చేకూరుతుంది. ఎండార్ఫిన్ల విడుదల ద్వారా మానసిక స్థితి మెరుగవుతుంది. ఈ వ్యాయామాలు మెనోపాజ్ లక్షణాలను తగ్గించడానికి, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి.ఇవి చదవండి: ఇంటి రూఫ్.. మొక్కలు సేఫ్..! -
Health: సొ'షై'టీ తెచ్చే.. యూరి'నారీ' ప్రాబ్లెమ్స్!
సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళల్లో మూత్రసంబంధమైన సమస్యలు, యూరినరీ ఇన్ఫెక్షన్లు ఎక్కువ. దీనికి తోడు బయటకు వెళ్లి పనిచేసే మహిళల్లో అంటే వర్కింగ్ ఉమెన్‌లో ఈ సమస్యలు మరింత ఎక్కువ. అంతేకాదు... ఈ సమస్యలు కేవలం వర్కింగ్ ఉమెన్లోనే కాకుండా స్కూళ్లు కాలేజీలకు వెళ్లే బాలికలు, యువతుల్లోనూ అలాగే ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సిన వృత్తుల్లో ఉన్న మహిళల్లోనూ కనిపించవచ్చు. అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం.గృహిణుల (హోమ్ మేకర్స్)తో పోలిస్తే బయటికి వెళ్లి పనిచేసే మహిళలు (వర్కింగ్ ఉమెన్) తమకు ఉన్న కొన్ని రకాల పరిమితుల కారణంగా నీళ్లు తక్కువగా తాగుతుండటంతోపాటు మూత్రానికి వెళ్లాల్సి వచ్చినా బయట వాళ్లకు వసతిలేని కారణంగా ఎక్కువసేపు ఆపుకుంటుంటారు. దాంతో వారిలో కొన్ని సమస్యలు వస్తుంటాయి. అవి...1. మూత్రంలో ఇన్ఫెక్షన్ (యూరినరీ ఇన్ఫెక్షన్స్), 2. మూత్ర విసర్జనలో సమస్యలు.... మళ్లీ ఈ మూత్ర విసర్జన సమస్యలు రెండు రకాలుగా ఉంటాయి. మొదటిది బ్లాడర్ సామర్థ్యం తగ్గి త్వరత్వరగా మూత్రానికి వెళ్లాల్సి రావడం. రెండోది మూత్రం వస్తున్నట్లు అనిపిస్తున్నా విసర్జన సాఫీగా జరగక తీవ్రమైన నొప్పి రావడం. ఇవిగాక తక్కువగా నీళ్లు తాగడం వల్ల మూడో సమస్యగా కిడ్నీల్లో రాళ్లు వచ్చే ముప్పు కూడా ఉంటుంది.ఎందుకీ సమస్యలు..సాధారణంగా వర్కింగ్ ఉమెన్ మూత్రవిసర్జన చేసే పరిస్థితి రాకుండా ఉండటం కోసం నీళ్లు చాలా తక్కువగా తాగుతుంటారు. సౌకర్యాలు బాగుండే కొన్ని పెద్ద / కార్పొరేట్ ఆఫీసులు మినహాయిస్తే చాలా చోట్ల రెస్ట్‌రూమ్స్ అపరిశుభ్రంగా ఉండటం, శుభ్రం చేసుకోడానికి నీళ్లు అందుబాటులోకి లేకపోవడం, ఉన్నా అవి పరిశుభ్రంగా లేకపోవడం వంటి అనేక కారణాలతో నీళ్లు తక్కువగా తాగుతుంటారు.ఇక మూత్రవిసర్జన చేయాల్సివచ్చినప్పుడు బయటి రెస్ట్రూమ్/బాత్రూమ్లు బాగుండవనే అభిప్రాయంతో మూత్రవిసర్జనకు వెళ్లకుండా ఆపుకుంటారు. ఇలా ఎక్కువ సేపు బిగబట్టడం వల్ల బ్లాడర్ సామర్థ్యం తగ్గుతుంది. ఇలా బిగబట్టడం చాలాకాలం పాటు కొనసాగితే మహిళల్లో మూత్రసంబంధమైన సమస్యలొస్తాయి. ఆ సమస్యలేమిటో చూద్దాం.మూత్ర సంబంధమైన ఇన్ఫెక్షన్లు (యూటీఐ) : మూత్రమార్గంలో వచ్చే ఇన్ఫెక్షన్ను ‘యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్’ అంటారు. ఈ సమస్య ఎందుకు వస్తుందంటే... మూత్రపిండాలు దేహంలోని వ్యర్థాలను వడపోశాక, వ్యర్థాలను మూత్రం రూపంలో ఓ కండరనిర్మితమైన బెలూన్ లాంటి బ్లాడర్‌లో నిల్వ ఉంచుతాయి. ఈ బ్లాడర్ చివర స్ఫింక్టర్ అనే కండరాలు ఎప్పుడు బడితే అప్పుడు మూత్రస్రావం కాకుండా ఆపుతుంటాయి.మూత్రాన్ని చాలాసేపటి వరకు (దాదాపు నాలుగ్గంటలకు పైబడి) ఆపుతుంటే అక్కడ బ్యాక్టీరియా వృద్ధిచెందుతుంది. ఆ బ్యాక్టీరియా కారణంగానే మూత్రంలో ఇన్ఫెక్షన్లు (యూటీఐ) వస్తుంటాయి. కొన్నిసార్లు ఈ ఇన్ఫెక్షన్లు మూత్రపిండాలకీ పాకవచ్చు. ఇది కాస్త ప్రమాదకరమైన పరిణామం. మొదటిసారి ఇన్ఫెక్షన్ రావడాన్ని ‘ప్రైమరీ ఇన్ఫెక్షన్’ అంటారు. అవే ఇన్ఫెక్షన్లు మళ్లీ మళ్లీ వస్తుంటే వాటిని ‘రికరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్స్’ అని అంటారు. మూత్రపిండాల్లో వచ్చే ఇన్ఫెక్షన్ను పైలోనెఫ్రైటిస్ అని అంటారు. ఇది కొంచెం సీరియస్ సమస్య.లక్షణాలు..మూత్ర విసర్జన సమయంలో మంట, తరచూ మూత్రవిసర్జనకు వెళ్లాలని అనిపిస్తుండటం, చలిజ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి.నిర్ధారణ పరీక్షలు..సాధారణ మూత్ర సమస్యలకు పెద్దగా పరీక్షలేమీ అవసరం ఉండవు. కానీ సమస్య మాటిమాటికీ వస్తుంటే అందుకు కారణాలు తెలుసుకునేందుకు కొన్ని అడ్వాన్స్డ్ పరీక్షలు అవసరమవుతాయి. సాధారణంగా ∙సీయూఈ ∙యూరిన్ కల్చర్ ∙అల్ట్రాసౌండ్ స్కానింగ్ ∙సీటీ, ఎమ్మారై, ఎక్స్‌రే (ఐవీయూ, ఎంజీయూజీ లాంటివి) ∙సిస్టోస్కోప్ (యూటీఐ) ∙అవసరాన్ని బట్టి కొన్ని రక్తపరీక్షలు చేస్తుంటారు. చికిత్స..యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లకు డాక్టర్లు సాధారణంగా నోటి ద్వారా తీసుకునే యాంటీబయాటిక్ మందులతో చికిత్స చేస్తుంటారు. అవసరాన్నిబట్టి ఒక్కోసారి అడ్వాన్స్డ్ యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి రావచ్చు. సమస్య ఇంకా ముదిరితే ఆసుపత్రిలో అడ్మిట్ చేసి, సమస్యకు అనుగుణంగా చికిత్స ఇస్తుంటారు.బ్లాడర్ సంబంధమైన సమస్యలు..యూరినరీ బ్లాడర్ దాదాపు 500 ఎమ్ఎల్ మూత్రం నిల్వ ఉండే సామర్థ్యంతో ఉంటుంది. మూత్రం చాలాసేపు ఆపుకునేవారికి రెండు రకాల సమస్యలొస్తుంటాయి. మొదటిది... అదేపనిగా ఆపుకుంటూ ఉంటే బ్లాడర్ కండరాలు క్రమంగా నిల్వ చేసే సామర్థ్యాన్ని కోల్పోతాయి. అలాంటప్పుడు 200 ఎమ్ఎల్ మూత్రం నిల్వకాగానే మూత్రవిసర్జన ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎంతగా ఆపుకుందామన్నా ఆగక... మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంటుంది. ఇక రెండో రకం సమస్యలో... తరచూ మూత్రాన్ని ఆపుకోవడం అలవాటైపోవడంతో మూత్రాన్ని ఆపేందుకు ఉపయోగపడే స్ఫింక్టర్ కండరాలు గట్టిగా బిగుసుకుపోతాయి. ఈ రెండు రకాల సమస్యల్లో బ్లాడర్ పనితీరు (బ్లాడర్ ఫంక్షన్) తగ్గుతుంది. కొన్నాళ్ల తర్వాత అర్జెంట్‌గా వెళ్లాల్సి రావడం... లేదా కొంతమందిలో పాస్ చేసిన తర్వాత కూడా బ్లాడర్‌లో కొంత మిగిలిపోయుంటుంది. ఈ రకమైన సమస్యను ‘డిస్ఫంక్షనల్ వాయిడింగ్’ అంటారు.లక్షణాలు..మూత్రం వస్తున్న ఫీలింగ్ కలిగినప్పుడు మూత్రానికి వెళ్తే... స్ఫింక్టర్ కండరాలు బిగుసుకుపోయి, ఎంతకీ రిలాక్స్ కాకపోవడంతో మూత్ర విసర్జన ఓ సమస్యగా మారుతుంది. మూత్రం సాఫీగా తేలిగ్గా రాదు, మూత్రవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, బాధ కలుగుతుంది.నిర్ధారణ / చికిత్స..బ్లాడర్ ఫంక్షన్ పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేసి, దానికి అనుగుణంగా నొప్పిని నివారించే మందులతోనూ, కండరాలను రిలాక్స్ చేసే ఔషధాలతో చికిత్స అందిస్తారు.మూత్రపిండాల్లో రాళ్లు..ఇవి అనేక కారణాలతో వచ్చినప్పటికీ వర్కింగ్ ఉమన్‌లో మాత్రం నీళ్లు తక్కువగా తాగడం వల్ల ఇవి వస్తుంటాయి. ఎక్కువగా నీరు తాగని వారిలో వ్యర్థాలు స్ఫటికంలా మారడంతో ఇవి వస్తుంటాయి. ఇవి చాలా బాధాకరంగా పరిణమిస్తాయి. ఏర్పడ్డ స్ఫటికం సైజును బట్టి రకరకాల చికిత్సలు అవసరమవుతాయి.నివారణ / పరిష్కారాలు..ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ వంటి చికిత్సలు తీసుకోవడం కంటే ఈ సమస్యల నివారణ కోసం జాగ్రత్తలు అవసరం. బయటకు వెళ్లిన మహిళల మూత్రవిసర్జనకు మనదగ్గర పెద్దగా వసతులు ఉండవు. కాబట్టి ఇది ఒక సామాజిక సమస్య కూడా. ఈ సమస్యతో వచ్చే మహిళలకు డాక్టర్లు కొంత కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా నివారణ చర్యలను తెలుపుతారు. అవి...– మహిళలకు బయటి బాత్రూమ్లకు వెళ్లాల్సి వస్తుందన్న బెరుకువీడి దేహ జీవక్రియలను అవసరమైనన్ని నీళ్లు తాగుతుండాలి. – మరీ తప్పనప్పుడు ఎప్పుడో ఒకసారి మినహా... వస్తున్నట్లు అనిపించగానే మూత్రవిసర్జనకు వెళ్లాలి.– మూత్రపిండాల్లో రాళ్లను నివారించడానికి కొన్ని రకాల ఫాస్ట్‌ఫుడ్, యానిమల్ ్రపోటీన్, చీజ్, చాక్లెట్ల వంటివి వీలైనంత తక్కువగా తీసుకోవాలి. కొన్ని ఆహారాల కారణంగా కొందరిలో స్ఫటికాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ. అలాంటివారు తమకు సరిపడనివాటిని వాటికి దూరంగా ఉండాలి.ఇవి చదవండి: సకాలంలో స్పందిస్తే ఆత్మహత్యలను నివారించవచ్చు -
తల్లిదండ్రులే.. టెక్ గురువులు!
ఆఫ్‌లైన్‌లో బాలికలు/మహిళలపై జరుగుతున్న దారుణాలను మించి ఆన్లైన్లో చోటుచేసుకుంటున్నాయి అంటున్నారు సైబర్ నిపుణులు. ప్రతి పది మంది బాలికల్లో ఒకరు సైబర్ బెదిరింపులకు గురవుతున్నారని, మహిళలను లక్ష్యంగా చేసుకొని నేరాలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. తల్లిదండ్రులే ఆన్లైన్ గురువులుగా మారి బాలికలకు అవగాహన కల్పించాల్సిన అవసరం నేటి రోజుల్లో ఎంతో ఉంది.సైబర్ నేరస్థులు ప్రధానంగా బాలికలు, మహిళలనే లక్ష్యంగా చేసుకుంటున్నారని నివేదికలు సూచిస్తున్నాయి. నేరస్థులు బాలికలు, మహిళల చిరునామాలు, ఆర్థిక వివరాలు, వ్యక్తిగత సంభాషణల వంటి సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తుంటారు. బాధితులు తమ డిమాండ్లను ఒప్పుకోకపోతే బాలికలు/మహిళల వ్యక్తిగత డేటాను బయటపెడతామని, అందరిలో పరువు పోతుందని నేరస్థులు బెదిరిస్తుంటారు. దీంతో ఎవరికీ చెప్పుకోలేక బాలికలు/మహిళలు నేరస్థులకు డబ్బులు పంపడం లేదా ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయాలకు రావడం జరుగుతుంటుంది. చాలా మంది బాధిత మహిళలు ఇలాంటి విషయాలు బయటకు చెప్పుకోవడానికి, పోలీసులకు కంపై్టంట్ చేయడానికి ఇష్టపడరు. ఇలాంటప్పుడు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించేందుకు పెద్దలు కృషి చేయాల్సిన అవసరం ఉంది.టెక్నాలజీని పేరెంట్స్ నేర్చుకోవాలి... – పిల్లలను టెక్నాలజీ వాడకుండా అడ్డుపడకూడదు. పాజిటివ్ కోణంలోనే పిల్లలకు టెక్నాలజీని నేర్పాలి. పిల్లలతో పాటు పెద్దలూ టెక్నాలజీ జర్నీ చేయాలి. – పిల్లలకు ఫోన్ ఇవ్వడంతో పాటు ఒక హద్దును సృష్టించాలి. అదే సమయంలో వయసును బట్టి ఫిల్టరింగ్ సాఫ్ట్‌వేర్స్‌ను వాడాలి.– క్రీడల్లో కొన్ని బౌండరీస్ ఎలా ఉంటాయో టెక్నాలజీ బౌండరీస్‌ను పెద్దలే గీయాలి.– టెక్ఫోన్ ఫ్రీ జోన్స్ నిబంధనలను అమలు చేయాలి. (బెడ్రూమ్, డైనింగ్ ప్లేస్.. వంటి చోట్ల ఫోన్ వాడకూడదు..)– YAPPY (యువర్ అడ్రస్, యువర్ ఫుల్‌నేమ్, యువర్ పాస్‌పోర్ట్...ఇలా పూర్తి వివరాలు) ఆన్లైన్లో ఎవరికీ ఇవ్వకూడదని చెప్పాలి.– ఫొటోలు/డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసుకునే ముందు నిజనిర్ధారణ చేసుకోవాలి. డౌన్‌లోడ్స్‌కి వెళ్లకూడదు ∙పనిష్మెంట్గా లేదా రివార్డ్గానూ ఫోన్/ట్యాబ్.. వంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పిల్లలకు ఇవ్వకూడదు.– స్క్రీన్ టైమ్– గ్రీన్ టైమ్‌కి తేడా తెలియాలి. వర్చువల్ గేమ్స్, గ్రౌండ్ గేమ్స్‌కి కండిషన్స్ పెట్టాలి ∙వయసుకు తగ్గట్టుగా ఆడే ఆన్లైన్ గేమ్స్‌కి కొన్ని కంట్రోల్స్ ఉంటాయి. వాటిని పాటించేలా జాగ్రత్తపడాలి.మనో ధైర్యాన్ని పెంచుకోవాలి..ఏవరైనా వ్యక్తితో ఇబ్బంది ఉంటే ఆ వ్యక్తి అకౌంట్‌ని బ్లాక్ చేయాలి ∙మనోధైర్యాన్ని పోగొట్టుకోకుండా ఏవైనా వీడియోలు, ఫొటోలు, చాటింగ్ సంభాషణ ... వంటివి ఉంటే డిలీట్ చేయకుండా బ్యాకప్ స్టోరీజే చేసుకోవాలి. పెద్దలతో మాట్లాడి https://cybercrime.gov.inలో కంప్లైంట్ చేయాలి.బొట్టు బిళ్లతో కవర్ చేయాలి...∙ఏదైనా వెబ్సైట్ https:// (ప్యాడ్‌లాక్ సింబల్ ఉన్న సైట్‌నే ఓపెన్ చేయాలి. పాస్వర్డ్ ఎప్పుడూ (క్యాపిటల్, స్మాల్ లెటర్స్, నంబర్స్) ఉండే విధంగా సెట్ చేసుకోవాలి ∙ఫోన్ ఇతర గ్యాడ్జెట్స్ లొకేషన్ ఎప్పుడూ ఆఫ్ చేసుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆన్ చేసి, మళ్లీ ఆఫ్ మోడ్‌లో ఉంచాలి ∙వెబ్ కెమరాను బొట్టు బిళ్లతో కవర్ చేసుకోవడం మేలు. ఫోన్లోనూ వెబ్ క్యామ్ అనేబుల్ క్యాప్షన్‌లో ఉంచాలి ∙తెలిసిన పరిచయాలు కాంటాక్ట్స్‌లో ఉండాలి. పరిచయస్తులతో మాత్రమే సంభాషణ జరపాలి ∙యాప్స్ కూడా ప్లే స్టోర్ నుంచే డౌన్లోడ్ చేయాలి. ఆసక్తిగా కనిపించిన లింక్స్ అన్నీ ఓపెన్ చేయద్దు.భయపడకూడదు..మోసగాళ్లు అందుబాటులో ఉన్న మీ డేటాను, గత సోషల్‌మీడియా పోస్టింగ్‌లను, సోషల్ ఇంజనీరింగ్ నుండి సమాచారాన్ని ΄÷ంది, ఆన్లైన్ షేమింగ్ లేదా దోపిడీకి దారి తీస్తుంటారు. వాయిస్ మెసేజ్‌లు, ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ ద్వారా సంభాషణ జరిపి ఆ సమాచారంతో బెదిరింపులకు పాల్పడేవారి సంఖ్య పెరిగింది. మోసగాళ్లు మీలా నటిస్తూ నకిలీ ఖాతాను సృష్టిస్తారు. మీ పరిచయాల నుండి డబ్బు అడగడం, ద్వేషపూరిత మెసేజ్‌లు చేయచ్చు. ఆన్లైన్లో ఎవరి నుంచైనా అనైతిక ప్రవర్తనతో ఇబ్బంది పడితే భయపడకుండా కుటుంబ సభ్యులతో, టెక్నాలజీ మిత్రులతో పంచుకొని సరైన నిర్ణయం తీసుకోవాలి. స్కూళ్లలోనూ టీచర్లు టెక్నాలజీ విషయాల్లో అమ్మాయిలకు అవగాహన కల్పించడం తప్పనిసరి.– అనీల్ రాచమల్ల, సైబర్ సేఫ్టీ నిపుణులు, ఎండ్ నౌ ఫౌండేషన్ -
ట్వింకిల్... ట్వింకిల్... లిటిల్ స్టార్స్ జాగ్రత్త!
‘ఒంటరిగా వెళ్లవద్దు.. పార్కుకు, పాఠశాలకు, బీచ్‌కి, మరెక్కడికైనా... మేనమామ, బంధువు లేదా స్నేహితుడైనప్పటికీ.. ఏ వ్యక్తితోనూ ఒంటరిగా వెళ్లవద్దు. ఉదయం, సాయంత్రం మరీ ముఖ్యంగా రాత్రిపూట అస్సలు ఒంటరిగా వెళ్లవద్దు’ అంటూ... నలభై ఏళ్ల క్రితం తల్లి తన చిన్నతనంలో నేర్పించిన భద్రతా పాఠాలనే ఇన్నేళ్ల తర్వాత తన కూతురు నితారాకు కూడా బోధిస్తున్నట్లు గుర్తించానని ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా నాటి బాలీవుడ్ నటి ట్వింకిల్ ఖన్నా చెప్పింది.కోల్‌కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో యువ ట్రైనీ డాక్టర్‌పై జరిగిన దారుణ ఘటన అనంతరం తన కుమార్తెతో తాను ఈ విధంగా సంభాషణ జరిపినట్టు తెలిపింది. అమ్మాయిల భద్రతకు సంబంధించి ఆఫ్‌లైన్‌లో ఇలాంటి ప్రమాదకర స్థితి ఉంటే ఆన్లైన్ ముప్పు మరో విధమైన సమస్యలకు లోను చేస్తుంది. డిజిటల్లో ఆడపిల్లల భద్రతకు సంబంధించి పెద్దలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణులేం చెబుతున్నారో తెలుసుకుందాం.నేటి డిజిటల్ యుగంలో అమ్మాయిల భద్రత బయటి ప్రదేశాలకు మించి విస్తరించింది. గతంలో అపరిచితుల నుంచి ప్రమాదం, రహదారి భద్రత, ఆట స్థలం ప్రమాదాలు.. ఈ ఆందోళనలు ఉండేవి. ఇప్పుడు ఇవి ఇలాగే కొనసాగుతుండగా డిజిటల్ యుగం మరో క్లిష్టమైన లేయర్‌ని ప్రవేశపెట్టింది.ఆన్ లైన్ ముప్పు..ఈ రోజుల్లో పిల్లలు ఆన్ లైన్ ప్రపంచంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇక్కడ పిల్లలను కబళించేందుకు మోసగాళ్లు.. చాట్ రూమ్‌లు, సోషల్ మీడియా ల్యాట్ఫారమ్లు, గేమింగ్ కమ్యూనిటీలలో దాగి ఉంటున్నారు. ఆన్ లైన్ వస్త్రధారణ, దోపిడీ నుంచి వారిని రక్షించడానికి అప్రమత్తత, డిజిటల్ అక్షరాస్యత ప్రతి ఒక్కరికీ అవసరం.సైబర్ బెదిరింపులు..ఇంటర్నెట్ అనేది అపరిచితుల నుంచి బెదిరింపులను ్రపోత్సహిస్తుంది. సైబర్ బెదిరింపు పిల్లల మానసిక ఆరోగ్యానికి, ఆత్మగౌరవానికి ముప్పుగా మారుతుంది.అనుచితమైన కంటెంట్..కేవలం కొన్ని క్లిక్‌లతో, పిల్లలు వారి వయస్సుకు మించి అనుచితమైన కంటెంట్‌ను యాక్సెస్ చేయగలరు, ఇది వారి అభివృద్ధికి ఆటంకమే కాదు హాని కూడా కలిగించవచ్చు. రోడ్డు ప్రమాదాలు, గాయాలు, ప్రకృతి వైపరీత్యాలు పిల్లల భద్రతకు ముప్పును కలిగిస్తూనే ఉన్నాయి. అందువల్ల, ఆఫ్‌లైన్– ఆన్లైన్ నష్టాలను పరిష్కరించే భద్రతా విద్యకు సమతుల్య విధానం అవసరం.అవగాహన తప్పనిసరి..– భయాన్ని పెంచడం కంటే తెలివైన ఎంపికలు చేయడానికి వారిని శక్తిమంతం చేయడంపై దృష్టి పెట్టాలి.– తగిన పర్యవేక్షణ, మార్గదర్శకత్వాన్ని అందిస్తూనే పిల్లలు పరిపక్వం చెందుతున్నప్పుడు క్రమంగా మరింత స్వాతంత్య్రం పొందేందుకు అనుమతించాలి. – పిల్లలకు సమస్య పరిష్కార నైపుణ్యాలను నేర్పించాలి. నమ్మకం, పరస్పర గౌరవం ఉండే వాతావరణాన్ని సృష్టించాలి.– అధిక రక్షణ వారి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. ఆందోళనను సృష్టిస్తుంది. వారు వారి తప్పుల నుండి నేర్చుకునేలా వయసుకి తగిన స్వేచ్ఛను, అవకాశాలను ఇవ్వాలి.– ఆన్ లైన్ బెదిరింపులను విస్మరించవద్దు. ప్రస్తుత ఆన్ లైన్ ట్రెండ్స్, ప్రమాదాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ఇంటర్నెట్ భద్రత గురించి మీ చుట్టూ ఉన్నవారితో మాట్లాడుతూ ఉండండి.– డిజిటల్ భద్రత అనేది కేవలం శారీరక శ్రేయస్సు కంటే ఎక్కువ. హద్దుల్లో ఉండటం, ఆరోగ్యకరమైన సంబంధాలు, అనుచితమైన ప్రవర్తనను ఎలా గుర్తించాలి, ప్రతిస్పందించాలనే దాని గురించి పిల్లలకు బోధించడం ద్వారా భావోద్వేగ భద్రతను పరిష్కరించాలి.డిజిటల్ పేరెంటింగ్ తప్పనిసరి..ఇంట్లో పిల్లలు సేఫ్‌గా ఉన్నారు అనుకుంటారు కానీ, నేటి రోజుల్లో బయట కన్నా డిజిటల్లోనే మరిన్ని ప్రమాదాల బారినపడుతున్నారు. నేరుగా కన్నా ఆన్లైన్లోనే చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ ఎక్కువ జరుగుతుంది. డిజిటల్ మోసగాళ్లు టీనేజ్ అమ్మాయిలను ఆకర్షించి సరోగసి, ఆర్గాన్ ట్రేడింగ్ చేస్తున్నారు. కొత్తదనాన్ని ఆస్వాదించాలి అంటూ పిల్లలను హిప్నోటైజ్ చేస్తుంటారు. వారిని తప్పుదారి పట్టించి, వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు తీసుకోవడం.. ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడటం... ఫలితంగా పిల్లలు భయాందోళనకు లోనవడం, ఆత్మహత్యలు చేసుకోవడం వంటివి జరుగుతున్నాయి.ఫోన్ లేదా ట్యాబ్ లేదా ఇతర గ్యాడ్జెట్స్‌లో పేరెంటల్ కంట్రోల్ ఉండేలా చూసుకోవాలి. ఫ్యామిలీ ఇ–మెయిల్ తప్పనిసరి. ఏ వయసువారికి ఎలాంటి ఆన్లైన్ గేమ్స్ బెటర్ అనేవి తెలుసుకోవాలి. ప్రమాదాల వంక పెట్టి పిల్లలను డిజిటల్ నుంచి దూరం చేయకుండా అవగాహన కల్పించడం అవసరం. సమస్య తలెత్తితే చైల్డ్ హెల్ప్‌లైన్: 1098, నేషనల్ కమిషన్ ఫర్ ్ర΄÷టెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్సిపిసిఆర్), ఓసిఎస్ఎఇ (ఆన్లైన్ చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ అండ్ ఎక్స్ల్యాయిటేషన్), పోక్సో, మినిస్ట్రీ ఆఫ్ ఉమన్ అండ్ చైల్డ్ రైట్స్ (ఎమ్డబ్ల్యూసీడీ),..లోనూ కేస్ ఫైల్ చేయచ్చు. – అనీల్ రాచమల్ల, సైబర్ సేఫ్టీ నిపుణులు, ఎండ్ నౌ ఫౌండేషన్ -
వామ్మో..! మనిషిపై మశక సైన్యం!!
దోమలు చూడటానికి చిన్నగా ఉంటాయి గాని, ఇవి అత్యంత ప్రమాదకరమైన జీవులు. ప్రపంచంలో ఏటా పాముకాటుతో మరణిస్తున్న వారి కంటే దోమకాటుతో మరణిస్తున్న వారే ఎక్కువ. పాముకాటు వల్ల ఏటా దాదాపు 1.37 లక్షల మంది మరణిస్తుంటే, దోమకాటు వల్ల వ్యాధులకు లోనై మరణించే వారి సంఖ్య 10 లక్షలకు పైగానే ఉంటోంది. దోమలు ఎంత ప్రమాదకరమైనవో అర్థమవడానికి ఈ లెక్క చాలు. ఈ భూమ్మీద 3,600 జాతులకు పైగా దోమలు ఉన్నాయి. అత్యంత శీతల ప్రాంతమైన అంటార్కిటికాలో తప్ప మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ దోమల బెడద ఉండనే ఉంది. దోమలు మనుషుల కంటే చాలా ముందు నుంచే భూమ్మీద మనుగడ సాగిస్తున్నాయి. ఇవి దాదాపు డైనోసార్ల కాలం నుంచే అంటే, 25.1 కోట్ల సంవత్సరాల నుంచి భూమ్మీద ఉన్నాయి.భూమ్మీద మిగిలిన ప్రదేశాలతో పోల్చుకుంటే, ఉష్ణమండల ప్రదేశాల్లో, నీరు ఎక్కువగా నిల్వ ఉండే చోట దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. అసలు నీరులేని చోట, నీరు ప్రవహించే చోట దోమలు మనుగడ సాగించలేవు. నిల్వ నీరు ఉన్న ప్రదేశాలే దోమలకు సురక్షిత స్థావరాలు. మన దేశంలో ఎక్కువ రాష్ట్రాలు ఉష్ణమండల ప్రదేశాలే! ఇక్కడి వాతావరణం దోమల విజృంభణకు చాలా అనుకూలంగా ఉంటుంది. దోమలు భూమ్మీద కోట్లాది ఏళ్లుగా మనుగడ సాగిస్తున్నా, దోమల సగటు ఆయుఃప్రమాణం మాత్రం తక్కువే! ఒక దోమ బతికేది 10 నుంచి 56 రోజుల లోపే! ఇంత అల్పాయుర్దాయంలోనే దోమలు సృష్టించాల్సిన విధ్వంసమంతా సృష్టిస్తాయి.దోమల్లో ఆడదోమలు మాత్రమే మనుషుల రక్తాన్ని పీలుస్తాయి. ఒక ఆడ దోమ రోజు విడిచి రోజు 150–200 వరకు గుడ్లు పెడుతుంది. దోమ గుడ్లు పెట్టడానికి 50 మిల్లీలీటర్ల నిల్వనీరు చాలు. దారి పక్కన పడి ఉండే చిన్న చిన్న కొబ్బరిచిప్పలు, పాత టైర్లు, వాడటం మానేసి మూలపడేసిన ఎయిర్ కూలర్లు వంటివి దోమలకు ప్రశస్థమైన ఆవాసాలు. ఇలాంటి చోట్ల దోమలు గుడ్లు పెట్టి, వంశాభివృద్ధి చేసుకుంటాయి. దోమలను నిర్మూలించడానికి మనం ఎన్ని రకాల మందులను వాడుతున్నా, దోమలు వాటిని తట్టుకునేలా తమ నిరోధకతను నిరంతరం పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తుంటాయి. దోమలు మందులను తట్టుకునే శక్తి పెంచుకునే కొద్ది వాటి వల్ల మనుషులకు ముప్పు మరింతగా పెరుగుతుంది. ఆడదోమలు మనుషుల రక్తాన్ని పీల్చే క్రమంలో వాటి నుంచి ప్రమాదకరమైన సూక్ష్మజీవులు మనుషుల రక్తంలోకి చేరి, వ్యాధులను కలిగిస్తాయి.దోమలు కలిగించే వ్యాధులు..దోమల వల్ల మలేరియా, డెంగీ, చికున్‌గున్యా, లింఫాటిక్ ఫైలేరియాసిస్, రిఫ్ట్వ్యాలీ ఫీవర్, యెల్లో ఫీవర్, జికా, జపానీస్ ఎన్సెఫలిటిస్, వెస్ట్ నైల్ ఫీవర్ వ్యాధులు వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫెక్షన్లను కలిగించే వ్యాధుల్లో 17 శాతం వ్యాధులు దోమల వల్లనే వ్యాపిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 9.6 కోట్ల మంది దోమకాటు వ్యాధులకు లోనవుతున్నారు. వారిలో అత్యధికంగా దాదాపు 4 లక్షల మంది మలేరియా వల్ల, 40 వేల మంది డెంగీ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. వీటి వల్ల మరణాల బారిన పడిన వారిలో ఐదేళ్ల లోపు చిన్నారులే ఎక్కువగా ఉంటుండటం విచారకరం. దోమల కారణంగా తలెత్తే తీవ్ర వ్యాధులు, వాటి లక్షణాలను తెలుసుకుందాం.మలేరియా..ఈ వ్యాధి అనాఫలిస్ దోమ వల్ల వ్యాపిస్తుంది. ఈ దోమ రాత్రివేళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ దోమలో వృద్ధి చెందే ప్లాస్మోడియం అనే ప్రోటోజోవా రకానికి చెందిన సూక్ష్మజీవి కారణంగా మలేరియా వస్తుంది. వీటిలో ఒకరకం జాతికి చెందిన సూక్ష్మజీవి కారణంగా సెరిబ్రల్ మలేరియా వస్తుంది. దీని వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, స్పృహ కోల్పోవడం, అపస్మారక స్థితికి చేరడం, మూత్రపిండాలు విఫలం కావడం వంటి లక్షణాలు ఉంటాయి.చికెన్ గున్యా..ఎడిస్ ఈజిపై్ట అనే దోమ వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ దోమ ద్వారా వ్యాపించే ఒకరకం వైరస్ కారణంగా ఈ వ్యాధి వస్తుంది. ఎడిస్ ఈజిపై్ట దోమ ఎక్కువగా పగటివేళ కనిపిస్తుంది. చికున్ గున్యా సోకిన వారికి జ్వరం, విపరీతమైన తలనొప్పి, తీవ్రమైన కీళ్లనొప్పులు వస్తాయి.డెంగీ..డెంగీకి కూడా ఎడిస్ ఈజిపై్ట దోమలే కారణం. జ్వరం, తలనొప్పితో పాటు ఎముకలు విరిచేసినంతగా తీవ్రమైన నొప్పి వస్తుంది. అందుకే దీన్ని ‘బ్రేక్ బోన్ ఫీవర్’ అని కూడా అంటారు. వ్యాధి ముదిరినప్పుడు అంతర్గత అవయవాల్లో రక్తస్రావమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.డెంగీని నిరోధించే వొబాకియా..వొబాకియా అనే బ్యాక్టీరియా డెంగీ వ్యాప్తిని అరికట్టగలదని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మలేసియా, వియత్నాం, ఆస్ట్రేలియా తదితర ప్రాంతాల్లోని పరిశోధక సంస్థల్లో పరిశోధనలు నిర్వహించిన శాస్త్రవేత్తలు వొబాకియా బ్యాక్టీరియాను ప్రయోగించి, డెంగీ వ్యాప్తిని నిరోధించడంలో సఫలీకృతులయ్యారు. డెంగీ వ్యాప్తికి కారణమయ్యే ఏడిస్ ఈజిపై్ట దోమల శరీరంలోకి వొబాకియా బ్యాక్టీరియాను ఇంజెక్ట్ చేసి, వాటిని బయటి వాతావరణంలోకి విడిచిపెట్టాక, వాటి ద్వారా డెంగీ వ్యాప్తి పెద్దగా జరగలేదు. వొబాకియా బ్యాక్టీరియా ఎక్కించిన తర్వాత దోమలకు పుట్టిన తర్వాతి తరాల దోమల్లో కూడా డెంగీని వ్యాప్తి చేసే శక్తి గణనీయంగా తగ్గిపోయినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.దోమల నివారణ మార్గాలు..దోమలను సమర్థంగా నివారించుకోవడం ద్వారా మాత్రమే దోమకాటు వ్యాధుల బారి నుంచి మనం తప్పించుకోగలం.– మనం ఉండే ఇళ్లలోకి, గదుల్లోకి దోమలు రాకుండా దోమతెరలు, మస్కిటో రిపెల్లెంట్లు వాడాలి.– దోమలు కుట్టకుండా ఉండటానికి శరీరంపై పూత మందులు వాడటం కూడా ఒక మార్గం.– దోమలు కుట్టకుండా ఉండాలంటే, శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచేలా నిండుగా దుస్తులు ధరించాలి.– దోమలు మురికి దుస్తులపై ఆకర్షితమవుతాయి. అందువల్ల శుభ్రమైన దుస్తులు ధరించాలి.– ఇళ్ల పరిసరాల్లో మురుగునీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. నీరు నిత్యం ప్రవహించేలా కాల్వలను శుభ్రం చేసుకోవాలి.అపోహలు, వాస్తవాలు..అపోహ: దోమలన్నీ మనుషులను కుడతాయి.వాస్తవం: ఆడ దోమలు మాత్రమే మనుషులను, జంతువులను కుడతాయి. ఆడ దోమల్లో పునరుత్పత్తి శక్తి కోసం మనుషులు, జంతువుల రక్తం అవసరం.అపోహ: కొన్ని రకాల రక్తమంటేనే దోమలకు ఇష్టంవాస్తవం: ముఖ్యంగా ‘ఓ–పాజిటివ్’ రక్తమంటే దోమలకు ఇష్టమని, అందుకే ఆ రక్తం ఉన్నవారిని ఎక్కువగా కుడతాయనే ప్రచారం ఉంది. నిజానికి దోమలను ఆకర్షించేది రక్తం కాదు, చర్మంపై ఉండే బ్యాక్టీరియా. చర్మంపై కొన్నిరకాల బ్యాక్టీరియా ఉన్నవారిని దోమలు ఎక్కువగా కుడతాయి.అపోహ: తెల్లచర్మం ఉన్నవారిని దోమలు ఎక్కువగా కుడతాయి.వాస్తవం: దోమలు కుట్టినప్పుడు తెల్లచర్మం ఉండేవారి శరీరంపై దద్దుర్లు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. దోమల లాలాజలంలో ఉండే ఎంజైమ్ వల్ల దురద పుట్టి దద్దుర్లు ఏర్పడతాయి. దోమలు కుట్టడానికి మనుషుల రంగుతో సంబంధం లేదు.అపోహ: దోమలన్నీ వ్యాధులను కలిగిస్తాయి.వాస్తవం: ప్రపంచంలో 3,600 జాతులకు పైగా దోమలు ఉన్నా, వీటిలో చాలా జాతులకు చెందిన దోమలు అసలు మనుషుల జోలికి రావు. అయితే, మనుషులను కుట్టే జాతులకు చెందిన దోమల్లో ఎక్కువ జాతులు వ్యాధులను మోసుకొస్తాయి.అపోహ: గబ్బిలాలను ఆకట్టుకుంటే దోమలు పరారవుతాయి.వాస్తవం: దోమలను పారదోలాలంటే, పెరట్లోకి గబ్బిలాలను రప్పించాలనే ప్రచారం ఉంది. దోమలు, ఈగల వంటి కీటకాలను గబ్బిలాలు తినడం నిజమే గాని, అవి దోమలను పూర్తిగా నిర్మూలించలేవు.అపోహ: మనుషుల పరిమాణంతో సంబంధం లేకుండా దోమలు వారిని కుడతాయి.వాస్తవం: చిన్నగా కనిపించే వారి కంటే పెద్దగా కనిపించే మనుషులనే దోమలు ఎక్కువగా కుడతాయి. చిన్న పిల్లల కంటే దోమలు పెద్దలనే ఎక్కువగా కుడతాయి. పిల్లల కంటే పెద్దలు తమ ఊపిరిలో కార్బన్ డయాక్సైడ్ను ఎక్కువగా విడిచిపెడతారు. చాలా దూరం నుంచి కార్బన్ డయాక్సైడ్ను పసిగట్టగల దోమలు త్వరగా పెద్దల వైపు ఆకర్షితమవుతాయి.మరిన్ని మశక విశేషాలు..గుడ్డు దశ నుంచి పూర్తిగా ఎదిగిన దశకు చేరుకోవడానికి దోమకు వారం నుంచి పదిరోజులు పడుతుంది.చెమట కారణంగా చర్మంపై పెరిగే బ్యాక్టీరియా విడుదల చేసే వాసనలు దోమలను ఇట్టే ఆకట్టుకుంటాయి. చెమట చిందిన పాదాలను శుభ్రం చేసుకోకుండా కాసేపు అలాగే వదిలేస్తే, వాటిపై దోమలు దాడి చేస్తాయి.కొన్ని రకాల వాసనలు దోమలను గందరగోళానికి గురిచేస్తాయి. ఉల్లి, వెల్లుల్లి వాసనల వైపు దోమలు రావు. వెల్లుల్లి తిన్నట్లయితే, చెమట వాసనలో మార్పు వస్తుంది. వెనిగర్‌లో ముంచిన ఉల్లిపాయ ముక్కలను ఒంటికి రుద్దుకున్నట్లయితే, దోమలు దరిదాపులకు రావు.దోమలు అతి నెమ్మదిగా ఎగురుతాయి. దోమల వేగం గంటకు ఒకటి నుంచి ఒకటిన్నర మైళ్లు. తేనెటీగలు ఎగిరే వేగంతో పోల్చుకుంటే, ఇది పదోవంతు మాత్రమే!దోమలు ఎగురుతున్నప్పుడు బాగా రొదగా ఉంటుంది. దోమలు ఎగిరేటప్పుడు వాటి రెక్కలు సెకనుకు 300–600 సార్లు రెపరెపలాడతాయి. వాటి కారణంగానే ఈ మశక సంగీతం వినిపిస్తుంది.దోమ బరువు 2 మిల్లీగ్రాములు. ఆడదోమ చిన్నిపొట్ట నిండటానికి లీటరులో 50 లక్షలవంతు రక్తం సరిపోతుంది. ఒక్కోసారి ఆడదోమలు తమ శరీరం బరువుకు సమానమైన నెత్తురు తాగేస్తాయి. వెన్నెల రాత్రులలో దోమలు మరింతగా విజృంభిస్తాయి. వెన్నెలలో దోమలకు తమ లక్ష్యం మరింత స్పష్టంగా కనిపించడమే దీనికి కారణం. చీకటి రాత్రుల కంటే వెన్నెల రాత్రులలో దోమలు ఐదురెట్లు ఎక్కువగా మనుషులను కుడతాయి.దోమలను ముదురు రంగులు ఇట్టే ఆకట్టుకుంటాయి. రక్తం తాగే ఆడ దోమలు ఎక్కువగా చీకటి ప్రదేశాలను స్థావరంగా చేసుకుంటాయి. అందుకే అవి ముదురు రంగు దుస్తులు వేసుకునే వారి వైపు ఆకర్షితమవుతాయి. -
మా బాబు.. ఒకచోట కుదురుగా ఉండటం లేదు..!?
మా బాబు వసు 5 సంవత్సరాలు. ఒకచోట నిలకడగా ఉండMýంండా, ఎప్పుడూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. ఇంట్లో, స్కూల్లో బయటా కూడా ఇలాగే చస్తుంటాడు. బయట ఫంక్షన్లకు తీసుకెళితే తనను పట్టుకోవడం, తన చుట్టూ తిరగడంతోటే సరిపోతుంది. అందువల్ల ఈ మధ్య బయటకు వెళ్లడం కూడా తగ్గించేశాం. వాళ్ల నానమ్మేమో, ఇది పిల్లల్లో మామూలే అంటుంది. ఈ మధ్య వాళ్ల స్కూల్ టీచర్ మమ్మల్ని పిలిచి, మా బాబు మీద అనేక కంప్లయింట్లు చెప్పింది. మాకు చాలా ఆందోళనగా ఉంది. – కె. మాధవి, సికింద్రాబాద్పిల్లల మెదడులో ఉండే సెల్ఫ్ కంట్రోల్ విభాగం లోని లోపాల వల్ల, వారసత్వ లక్షణాల రీత్యా, కొందరు పిల్లలకు మీరు చెప్పిన లక్షణాలు రావచ్చు. దీనిని హైపర్ యాక్టివిటీ లేదా ఏడీహెచ్‌డీ అంటారు. నిలకడ లేకపోవడం, చదువు మీద ఏకాగ్రత లేకపోవడం, వస్తువులు విసిరేయడం, సహనం లేకపోవడం, ఎప్పుడూ అటూ ఇటూ తిరుగుతూ ఉండటం, స్కూల్లో వస్తువులు మరచిపోవడం, ఈ సమస్య ముఖ్య లక్షణాలు. వీరికి తెలివితేటలు బాగానే ఉన్నప్పటికీ, ఏకాగ్రత లోపించడం వల్ల చదువులో వెనకబడతారు.ఇలాంటి వారిని ఎంత చిన్నవయసులో గుర్తించి, సరిౖయెన చికిత్స చేయిస్తే అంత తొందరగా దీంట్లోంచి బయట పడతారు. ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియర్ థెరపీ, అవసరమైతే కొద్ది మోతాదులో కొన్ని మందులు వాడటం ద్వారా వీరిని పూర్తిగా బాగు చెయ్యచ్చు. పేరెంట్స్, టీచర్లు ఇలాంటి వారిని త్వరగా గుర్తించగలిగితే తొందరగా బాగుపడతారు. మైకేల్ ఫిలిప్స్ అనే స్విమ్మర్ ఈ సమస్యతో బాధపడుతూ చికిత్స తీసుకుని బాగుపడి, ఒలింపిక్స్‌లో 20కి పైగా స్వర్ణ పతకాలు సాధించాడు. చైల్డ్ సైకియాట్రిస్ట్‌ల సూచనలు తీసుకోవడం, పాటించడం మేలు చేస్తుంది.– డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్, సైకియాట్రిస్ట్, విజయవాడ -
ఊపిరి తీస్తున్న వాయు కాలుష్యం!
మనిషి బ్రతకడానికి ఊపిరి తీసుకుంటాడు. అలాంటిది ఈ మధ్య కాలంలో ఊపిరి తీసుకోవడమే ప్రాణాలకు ప్రమాదకరంగా పరిణమించింది. వాతావరణంలో కర్బన ఉద్గారాలు విపరీతంగా పెరిగి పోవడం వలన స్వచ్ఛమైన ప్రాణవాయువు శాతం తగ్గిపోతోంది. దీనివలన చిన్నారుల నుంచి సీని యర్ సిటిజన్స్ వరకు అనేక ఆరోగ్య సమస్యలు అనుభవించాల్సి వస్తోంది.మనం పీల్చే గాలిలో ప్రాణాంతకమైన కాలుష్య కారకాలు కలుస్తున్నాయి. ఊపిరి తీసుకున్న తరువాత శరీరంలోకి చేరిపోయి అవయవాలను నిర్వీర్యం చేస్తున్నాయి. మనదేశంలో అతిపెద్ద నగ రాలలో సంభవిస్తున్న మరణాల్లో సగటున 7.2 శాతం మరణాలకు వాయు కాలుష్యమే కారణమని తాజా అధ్యయనంలో తెలిసింది. ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ వంటి మహానగరాలలోని గాలిలో అత్యంత సూక్ష్మమైన ‘పి.ఎం 2.5’ ధూళి కణాలు అధికంగా ఉన్నట్లు ఒక నివేదిక తెలిపింది. మనదేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో చాలా మరణాలకు వాయు కాలుష్యమే కారణమవుతున్నట్లు తెలిపింది. పి.ఎం అంటే పార్టిక్యులేట్ మ్యాటర్. 2.5 అంటే... గాలిలో ఉండే సూక్ష్మ కణాల వ్యాసం 2.5 మైక్రోమీటర్లు లేదా అంతకంటే తక్కువ ఉన్నవని అర్థం. ఈ కణాలు ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయి. ఇవి ముఖ్యంగా గుండె, ఊపిరితిత్తులు, శ్వాసనాళాల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. ఈ గాలిలోకి చేరే సల్ఫేట్లు, బొగ్గు సంబంధమైన కలుషితాల వంటివి ఊపిరితిత్తులకు పట్టేస్తున్నాయి. గుండెకు వెళ్లే రక్తపునాళాల్లో పేరుకుపోతున్నాయి.మనదేశంలోని పెద్ద పెద్ద నగరాలలో నిత్యం వెలువడుతున్న పి.ఎం 2.5 ధూళికణాల వలన మరణాలు రేటు నానాటికీ పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఒక క్యూబిక్ మీటర్ గాలిలో 2.5 ధూళి కణాలు 10 మైక్రోగ్రాములు పెరిగితే రోజువారీ మరణాల సంఖ్య 1.4 శాతం పెరుగు తున్నట్లు ఒక పరిశోధనలో గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమాల ప్రకారం ఒక రోజు అనగా 24 గంటల వ్యవధిలో క్యూబిక్ మీటర్ గాలిలో పి.ఎం 2.5 కణాలు 15 మైక్రోగ్రాముల లోపు ఉంటే ప్రమాదం వుండదు, అంతకంటే పెరిగితే ముప్పు తప్పదు.భారతదేశ వాయు నాణ్యతా ప్రమాణాల ప్రకారం 24 గంటల వ్యవధిలో క్యూబిక్ మీటర్ గాలిలో పి.ఎం 2.5 కణాలు 60 మైక్రోగ్రాముల లోపు ఉంటే ప్రమాదం అంతగా ఉండదు. కానీ మనదేశంలో ప్రస్తుతం 75 మైక్రోగ్రాముల కంటే అధికంగానే ఉంటున్నట్లు తెలిసింది. క్యూబిక్ మీటర్ గాలిలో పి.ఎం 2.5 కణాలు 10 మైక్రోగ్రాములు పెరిగితే మరణాల రేటు సగటున 3 శాతం దాకా పెరుగుతున్నట్లు గుర్తించారు. వాయు కాలుష్యం వలన బ్రెయిన్ స్ట్రోక్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మొనరీ వ్యాధులు, న్యూమోనియా, శ్వాసకోశ ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది.కళ్లు, ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల్లో చీకాకుతో పాటు దగ్గు, తుమ్ములు పెరుగుతాయి. దీనితో పాటు ఆస్తమా లాంటి సమస్యలు వస్తాయని డాక్టర్లు హెచ్చరి స్తున్నారు. ఈ వాయుకాలుష్యం ఇలానే పెరిగితే భూమికి రక్షణ కవచం అయిన ఓజోన్ పొర క్షీణించడం ఎక్కువవుతుంది. ఓజోన్ పొర దెబ్బతింటే యూవీ కిరణాలు నేరుగా భూమిపైన పడడం వలన చర్మ, నేత్ర సమస్యలు వస్తాయి. వ్యవసాయంపైన కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి వాయుకాలుష్యం తగ్గించడానికి ప్రభుత్వాలు సాధ్యమైనంత సత్వర చర్యలు తీసుకోవాలి. – మోతె రవికాంత్, సేఫ్ ఎర్త్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, హైదరాబాద్ -
ఒక్క నెత్తుటి చుక్కతో.. అరవైకి పైగా పరీక్షలు!
రక్తంలో చక్కెర ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలంటే, వేలిమొనపై సూదితో గుచ్చుతారు. అప్పుడు వచ్చే నెత్తుటి చుక్కను గ్లూకోమీటర్ మీద పెట్టి పరీక్షిస్తారు. గ్లూకోమీటర్ ద్వారా నెత్తుటి చుక్కను పరీక్షిస్తే, కేవలం రక్తంలో చక్కెర స్థాయి మాత్రమే తెలుస్తుంది. దానివల్ల శరీరంలోని ఇతరేతర లోపాలేవీ బయటపడవు. అయితే, ఒకే నెత్తుటి చుక్కతో అరవైకి పైగా అంశాలను తెలుసుకునే పరీక్షను లండన్ శాస్త్రవేత్తలు ఇటీవల కనుగొన్నారు.వేలిమొన నుంచి సేకరించిన ఒకే ఒక్క నెత్తుటి చుక్కతో శరీరంలోని అరవైకి పైగా లోపాలను తెలుసుకోగల పరీక్షను లండన్‌లోని క్వీన్ మేరీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ క్లాడియా లాంజెన్బర్గ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ పరీక్ష ద్వారా పందొమ్మిది రకాల క్యాన్సర్, నరాలకు సంబంధించిన మోటార్ న్యూరాన్ డిసీజ్, గుండెజబ్బులు సహా అరవైఏడు రకాల వ్యాధులను ముందుగానే గుర్తించడానికి వీలవుతుంది. బ్రిటన్‌లోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన 40 వేల మంది రోగులపై ఈ పరీక్ష నిర్వహించి శాస్త్రవేత్తలు విజయవంతమైన ఫలితాలను సాధించారు. ఈ వివరాలను ‘నేచర్ మెడిసిన్’ తాజా సంచికలో ప్రచురించారు. -
Health: ఒత్తిడి, ఆందోళనను తగ్గించే.. 5–4–3–2–1 టెక్నిక్!
అరుణ్ ఒక ఐటీ ప్రొఫెషనల్. 28 ఏళ్లుంటాయి అతనికి. ఈ మధ్య కాలంలో విపరీతంగా ఆందోళన పడుతున్నాడు. దాంతో పని మీద దృష్టి నిలపడం కష్టంగా మారింది అతనికి. కంప్యూటర్ ముందు కూర్చుంటే ఏవేవో ఆలోచనలు చికాకు పెడుతున్నాయి. ఆపాలని ప్రయత్నించినా ఆగడంలేదు. దానివల్ల గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఊపిరి ఆడటం లేదు. చేతులు చెమటలు పడుతున్నాయి. ఒళ్లంతా బిగుసుకుపోయినట్లు అనిపిస్తోంది. ఈ సంకేతాలన్నీ తనకు ఏదైనా ఐపోతుందేమోనన్న భయాన్ని, ఆందోళనను మరింత పెంచుతున్నాయి. ఈ పరిస్థితి పని మీదా ప్రభావం చూపి మేనేజర్ నుంచి వార్నింగ్స్ అందుకునేలా చేస్తోంది. నలుగురితో కలవలేకపోతున్నాడు. ఫ్రెండ్స్‌కు, పార్టీలకు దూరమయ్యాడు. నిద్ర పట్టడం లేదు. పట్టినా తరచూ మెలకువ వస్తోంది.అరుణ్ ఆందోళనకు గల కారణాలను లోతుగా పరిశీలించినప్పుడు.. అతనికి ఇటీవల ప్రమోషన్ వచ్చింది. దాంతో పని, బాధ్యతలు పెరిగాయి. అన్నిటిలో పర్ఫెక్ట్గా ఉండాలని, అన్ని పనులూ పర్ఫెక్ట్గా చేయాలనే అతని తీరు ఒత్తిడిని పెంచింది. ఫలితంగా అతని జీవితంలోకి ఆందోళన ప్రవేశించి అతలాకుతలం చేస్తోంది. అరుణ్ యాంగ్జయిటీ డిజార్డర్‌తో బాధపడుతున్నాడని పరీక్షల ద్వారా నిర్ధారణ అయింది. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ మొదలైంది. తాత్కాలిక ఉపశమనం కోసం 5–4–3–2–1 టెక్నిక్‌నీ ఫాలో అయ్యాడు. దాంతో అతను కొంత ఊరట పొందాడు. థెరపీ ద్వారా కొన్ని సెషన్లలోనే తన ఆందోళనను అధిగమించి హాయిగా పనిచేసుకోగలుగుతున్నాడు.5–4–3–2–1 గ్రౌండింగ్ టెక్నిక్..ఒత్తిడి, ఆందోళనను మేనేజ్ చేసేందుకు 5–4–3–2–1 గ్రౌండింగ్ ఒక పవర్ఫుల్ టెక్నిక్. మీరు ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా దీన్ని ప్రాక్టీస్ చేయవచ్చు. మీ పంచేంద్రియాలను నిమగ్నం చేయడం ద్వారా, ప్రస్తుత క్షణంపై దృష్టి పెట్టి.. మీకు బాధ కలిగించే ఆలోచనల నుంచి మీ దృష్టిని మళ్లించుకోవచ్చు. మీ ఆలోచనలపై కంట్రోల్, ఎమోషనల్ బ్యాలె¯Œ ్సను సాధించి ప్రశాంతతను పొందవచ్చు.మీరు చూడగలిగే 5 విషయాలను గుర్తించండి..మీ చుట్టూ ఒకసారి పరికించి ఐదు విభిన్న విషయాలను గమనించండి. అవి వస్తువులు, రంగులు, ఆకారాలు లాంటివి ఏవైనా కావచ్చు. వాటిని గమనించడానికి కొంత సమయం కేటాయించండి. ఇది మిమ్మల్ని బాధపెట్టే ఆలోచనల నుంచి మీ దృష్టిని బాహ్యప్రపంచంవైపు మళ్లించడానికి సహాయపడుతుంది.మీరు తాకగల 4 విషయాలను గుర్తించండి..మీ దుస్తులు, కుర్చీ, కంప్యూటర్ మౌస్ లాంటి మీరు తాకగల నాలుగు వస్తువులను గుర్తించండి. వాటిని తాకడం ద్వారా మీరు పొందుతున్న అనుభూతులపై దృష్టి పెట్టండి. ఇది మిమ్మల్ని మీ తక్షణ శారీరక అనుభూతులతో మళ్లీ కనెక్ట్ అవ్వడంలో సహాయపడుతుంది.మీరు వినగలిగే 3 విషయాలను గుర్తించండి..మీ చుట్టూ ఉన్న శబ్దాలను జాగ్రత్తగా వినండి. మీ కంప్యూటర్ శబ్దం, ట్రాఫిక్ ధ్వని, మీ శ్వాస శబ్దం లాంటివి ఏవైనా కావచ్చు. వాటిపై శ్రద్ధ చూపడం వల్ల మీ దృష్టిని అంతర్గత ఒత్తిళ్ల నుంచి∙దూరం చేసుకోవచ్చు.మీరు వాసన చూడగల 2 విషయాలను గుర్తించండి..మీ చుట్టూ ఉన్న వాతావరణంలో రెండు భిన్నమైన వాసనలను గుర్తించడంపై దృష్టి పెట్టండి. ఏవీ లేకుంటే అగర్బత్తి, కర్పూరం, డియోడరెంట్, పెర్ఫ్యూమ్ లాంటివి ఉపయోగించండి. ఆ పరిమళాలు మీ చుట్టూ ఉన్న వాతావరణంతో మీరు కనెక్ట్ అవ్వడానికి దోహదపడతాయి.మీరు రుచి చూడగలిగే ఒక విషయాన్ని గుర్తించండి..చివరగా, ఒక రుచిపై దృష్టి పెట్టండి. అది అంతకు ముందు మీరు తాగిన పానీయం లేదా తిన్న చాక్లెట్ లాంటిది ఏదైనా కావచ్చు. లేదంటే మీ నోటిలో ప్రస్తుతం ఎలాంటి రుచి ఉందో గమనించండి. ఇది మీ దృష్టిని రుచి ద్వారా ప్రస్తుత క్షణానికి తీసుకువస్తుంది.. ఇంద్రియ అనుభవాన్ని పూర్తి చేస్తుంది. -
హెయిర్.. కేర్..! బట్టతలను దాటి విస్తరించిన హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్!
సాక్షి, సిటీబ్యూరో: చిన్న వయస్సులోనే జుట్టు రాలడం, బట్టతల మాత్రమే కాదు.. ఇప్పుడు శరీరంలో పలు అవసరమైన చోట్ల కేశాలను కోల్పోవడం/లేకపోవడం కూడా సమస్యలుగానే భావిస్తున్నారు. ఆధునికుల్లో సౌందర్య పోషణ పట్ల పెరిగిన ప్రాముఖ్యత నేపథ్యంలో అవసరమైన చోట కేశాల లేమి సమస్యలకు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను అనేకమంది పరిష్కారంగా ఎంచుకుంటున్నారు.ప్రస్తుతం హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సేవలను పొందుతున్న వినియోగదారుల్లో 25–45 ఏళ్ల మధ్య వయస్కులే ఎక్కువ. ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాల్లో ఈ మార్కెట్ 25–30శాతం వార్షిక వృద్ధి నమోదు చేస్తోంది. బట్టతలకు మాత్రమే కాకుండా కను»ొమలు, మీసాలు, గెడ్డం కోసం కూడా మగవారు అలాగే నుదుటి భాగంలో జుట్టు పలచబడటం (ఫిమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్) వంటి కారణాలతో మహిళలు ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను ఆశ్రయిస్తుండటంతో ఈ మార్కెట్ రోజురోజుకూ విస్తరిస్తోంది.యూనిట్ వారీగా వ్యయం..ఒకచోట నుంచి హెయిర్ స్ట్రిప్ కట్ చేసి చేసే ఎఫ్యుటి, స్ట్రిప్‌తో సంబంధం లేకుండా చేసేది ఎఫ్యుఇ పేరిట రెండు రకాల ట్రాన్స్‌ప్లాంటేషన్ పద్ధతులున్నాయి. కేశాలనేవి ఒకటిగా కాకుండా 3, 4 చొప్పున మొలుస్తాయి కాబట్టి వాటిని ఫాలిక్యులర్ యూనిట్‌గా పిలుస్తారు. ఒక్కో యూనిట్‌ను పర్మనెంట్ హెయిర్ ఉన్న చోట నుంచి తీసి అవసరమైన చోట అమర్చడానికి యూనిట్‌కు రూ.50 నుంచి రూ70 వరకూ వ్యయం అవుతుంది. ఈ లెక్కన చూసుకుంటే బట్టతల సమస్య పరిష్కారానికి కనీసం రూ.70వేల నుంచి రూ.లక్ష వరకూ ఖర్చుపెట్టాలి. కను»ొమలు తదితర చిన్నచిన్న ట్రాన్స్‌ప్లాంటేషన్ తక్కువ వ్యయంతో రూ.10, రూ.15వేల వ్యయంతో గంట, రెండు గంటల్లోనే పూర్తవుతుంది. అయితే తలభాగం మీద పూర్తిస్థాయిలో చేయాలంటే ఒక పూట నుంచి ఒక రోజు మొత్తం క్లినిక్‌లో ఉండాల్సి రావొచ్చు. ట్రాన్స్‌ప్లాంటేషన్ అనంతరం కొంత కాలం అధిక టెంపరేచర్‌కు గురికాకుండా జాగ్రత్తపడటం వంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అర్హత లేమితో అనర్థాలు...తక్కువ రెమ్యునరేషన్‌తో సరిపుచ్చడానికి.. పలు క్లినిక్‌లు అర్హత లేని వ్యక్తుల ఆధ్వర్యంలో శస్త్రచికిత్సలు చేస్తున్నాయి. దీంతో శరీరంపై మచ్చలు పడటం, బేసి వెంట్రుకలు, జుట్టు అపసవ్యంగా పెరగడం దగ్గర నుంచీ తీవ్రమైన ఇన్ఫెక్షన్, జుట్టురాలడం వరకు ఏ పరిస్థితినైనా ఎదుర్కోవాల్సి రావొచ్చు. పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో డెర్మటాలజిస్ట్లకు సైతం అత్యవసరంగా శిక్షణ ఇస్తున్నారు. వీటన్నింటినీ పరిశీలించిన అనంతరం సరైన నిపుణుల పర్యవేక్షణలో జరిగే చికిత్సలు ఖచి్చతంగా సురక్షితమే.అరకొర శిక్షణతో.. నో..హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి క్లిష్టమైన సౌందర్య ప్రక్రియలను నిర్వహించడానికి యూట్యూబ్ లేదా ఇతర ప్లాట్ ఫారమ్‌లలో శిక్షణ వీడియోలను చూస్తే సరిపోదని జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) తేల్చి చెప్పింది. సర్జికల్ అసిస్టెంట్/టెక్నీíÙయన్లు (రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్) పర్యవేక్షణలో ఇవి చేయాలని సూచించింది. సౌందర్య ప్రక్రియలేవీ అత్యవసర శస్త్రచికిత్స కిందకురావు. శిక్షణ లేని వ్యక్తి చేయడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది.వైద్యంతో పరిష్కారం కాకపోతేనే..వంశపారంపర్యంగా వచ్చే బట్టతల విషయంలో ఎలా ఉన్నా మిగిలిన చోట్ల ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు వెళ్లే ముందు తప్పకుండా వైద్య పరమైన పరిష్కారం అన్వేíÙంచాలి. ఉదాహరణకు కను»ొమ్మలు కోల్పోతే.. అల్ట్రా వయెలెంట్ లైట్ వినియోగించి మాగి్నఫైయింగ్ లెన్స్‌లను వినియోగించి దానికి కారణాన్ని గుర్తించాలి. చికిత్సకు అవకాశం ఉంటే చేయాలి. లేని పక్షంలోనే ట్రాన్స్‌ప్లాంటేషన్ ఎంచుకోవాలి. అవకాశం ఉంటే కొన్ని మందులు అప్లై చేసి చూస్తాం. స్టిరాయిడ్ క్రీమ్స్ కూడా వినియోగిస్తాం.. ఎల్ఎల్ ఎల్టి, లో లెవల్ లోజర్ థెరపీతో కూడా వెంట్రుకలు పెరిగే అవకాశం ఉంటుంది. ఏదేమైనా.. సమస్యను సరైన విధంగా నిర్ధారించి అవసరం మేరకు చికిత్స చేసే అర్హత కలిగిన వైద్యుడి దగ్గరే చేయించుకోవాలి. లేకపోతే ఇతరత్రా ఆరోగ్య సమస్యలకూ కారణం కావొచ్చు.– డా.జాన్ వాట్స్, డెర్మటాలజిస్ట్, సీనియర్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ -
కాలు బెణికితే RICE! చేయాల్సిన ప్రథమచికిత్స ఇదే!
కాలు బెణికినప్పుడు పైకి ఎలాంటి గాయం కనిపించకపోయినా లోపల సలుపుతుంటుంది. ఇలాంటప్పుడు చేయాల్సిన ప్రథమచికిత్స కోసం ఇంగ్లిష్‌లో ‘రైస్’ అనే మాటను గుర్తుపెట్టుకోవాలి.– R అంటే రెస్ట్. అంటే కాలికి విశ్రాంతి ఇవ్వాలి. (24 నుంచి 48 గంటలపాటు).– I అంటే ఐస్‌ప్యాక్ పెట్టడం. ఐస్‌క్యూబ్స్‌ను నేరుగా గాయమైన చోట అద్దకూడదు. ఐస్ నీళ్లలో గుడ్డ ముంచి బెణికిన చోట అద్దాలి.– C అంటే కంప్రెషన్. అంటే బెణికిన ప్రాంతాన్ని క్రాప్ బ్యాండేజ్‌తో కాస్తంత బిగుతుగా ఒత్తుకుపోయేలా (కంప్రెస్ అయ్యేలా) కట్టు కట్టవచ్చు. అది అందుబాటులో లేకపోతే మామూలు గుడ్డతోనైనా కట్టు కట్టవచ్చు.– E అంటే ఎలివేషన్. అంటే బెణికిన కాలు... గుండెకంటే కాస్త పైకి ఉండేలా పడుకోవడం. అంటే కాలికింద దిండు పెట్టుకోవడం మేలు.బ్యూటిప్స్..ఫేషియల్ మసాజ్..– ముఖ చర్మం అందంగా కనిపించాలంటే ఫేస్ మసాజ్ చేసుకోవాలి, దీని వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. చర్మం ముడతలు పడటం తగ్గుతుంది.– ముఖ చర్మం అందంగా కనిపించాలంటే ఫేస్ మసాజ్ చేసుకోవాలి, దీని వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. చర్మం ముడతలు పడటం తగ్గుతుంది. -
ఎవరో చేసిన తప్పుకి.. తనను తాను శిక్షించుకోవటం!
కోపం తెచ్చుకోవటం అంటే ఎవరో చేసిన తప్పుకి తనను తాను శిక్షించుకోవటం అని ఒక ఆంగ్ల సామెత ఉంది. దీనికి సమానార్థకంగా తెలుగులో కూడా ఒక సామెత ఉంది. ‘‘ఏ కట్టెకి నిప్పు ఉంటే ఆ కట్టే కాలుతుంది’’ అని. ఆలోచిస్తే రెండు ఎంత నిజమో కదా అనిపించక తప్పదు. సుమతీ శతకకారుడు కూడా అదే విషయాన్ని నిర్ధారించాడు – ‘‘తన కోపమె తన శత్రువు’’ అని. గొప్ప గొప్ప శాస్త్రీయమైన సత్యాలని సామాన్యమైన మాటల్లో అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పటం అన్ని సమాజాలలో ఉన్న పెద్దలు చేసిన పని. వారికి రాబోయే తరాల మీద ఉన్న ప్రేమకి అది నిదర్శనం. గమనించండి! కోపం తెప్పించిన వారిని కానీ, పరిస్థితులని కానీ ఎవరైనా మార్చ గలరా? కోపానికి కారణమైన వారు బాగానే ఉంటారు. సమస్య కోపం తెచ్చుకున్న వారిదే.ఎవరికైనా కోపం ఎందుకు వస్తుంది? తనని ఎవరయినా తప్పు పట్టినా, నిందించినా, దెబ్బకొట్టినా (శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, భావోద్వేగాలపరంగా, సామాజికంగా), తాను అనుకున్నది సాధించలేక పోయినా ఇలా ఎన్నో కారణాలు. ఒక్క క్షణం ఆలోచించండి! వీటిలో ఏ ఒక్కటి అయినా మన అధీనంలో ఉన్నదా? లేనప్పుడు అనవసరంగా ఆయాస పడటం ఎందుకు? కోపపడి, ఆవేశ పడితే ఎడ్రినల్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. దానివల్ల ముందుగా శరీరంలో ఉన్న శక్తి అంతా ఖర్చు అయిపోతుంది.కోపంతో ఊగిపోయినవారు తగ్గగానే నీరసపడటం గమనించ వచ్చు. ఇది పైకి కనపడినా లోపల జరిగేది జీవప్రక్రియ అస్తవ్యస్తం కావటం. దానికి సూచనగా కళ్ళు ఎర్ర బడతాయి. కాళ్ళు చేతులు వణుకుతాయి, మాట తడబడుతుంది. ఆయాసం వస్తుంది. రక్త ప్రసరణలో మార్పు తెలుస్తూనే ఉంటుంది. పరీక్ష చేసి చూస్తే రక్త పోటు విపరీతంగా పెరిగి ఉంటుంది. ఇది తరచుగా జరిగితే ఎన్నో ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తక తప్పదు. కోపం తెప్పించిన వారు మాత్రం హాయిగా ప్రశాంతంగా ఉంటారు. కోపాన్ని వ్యక్త పరిస్తే వచ్చే వాటిలో ఇవి కొన్ని. లోపలే అణుచుకుంటే వచ్చేవి మరెన్నో! ఎసిడిటీ, విరేచనాలు, మలబద్ధకం నుండి మధుమేహం, గుండె పోటు వరకు.తాను చేయని తప్పుకి ఈ శిక్ష ఎందుకు? మరేం చేయాలి? ఆలోచించి, కోపకారణాన్ని తెలుసుకోవాలి. మనని ఎవరైనా తప్పు పడితే – అది నిజంగా తప్పా? కాదా? అని తెలుసుకోవాలి. తప్పు అయితే సరిదిద్దుకోవాలి. (ఎత్తి చూపినవారికి మనసులోనైనా కృతజ్ఞతలు తెలుపుకుంటూ) తప్పు కాకపోతే, మనకి అనవసరం. అనుకున్నది సాధించ లేక తన మీద తనకే కోపం వస్తే, చేయలేక పోవటానికి ఉన్న కారణాలు తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేయాలి. ఈ రకమైన విశ్లేషణ చేయటానికి మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవటం అవసరం. అందుకే అంటారు ఆవేశంలో నిర్ణయాలు తీసుకో కూడదు అని.మానవ మాత్రులం కనక కోపం రావటం సహజం. కానీ దానిని అదుపులో ఉంచుకుని, దానినే ఆయుధంగా ఉపయోగించుకుంటే అదే ఉపకరణంగా మారి లక్ష్యసాధనకి సహకరిస్తుంది. శ్రీరామచంద్రుడు కోపాన్ని అదుపులో ఉంచుకున్నాడు. అది ఆయన చెప్పు చేతల్లో ఉంది. రమ్మంటే వస్తుంది. ΄÷మ్మంటే పోతుంది. అందుకే ఆయనని ‘జితక్రోధుడు’ అన్నాడు వాల్మీకి. అవసరానికి కోపం వచ్చినట్టు కనపడాలి. దాని ప్రయోజనం దానికీ ఉంది.పిల్లలు అల్లరి చేస్తుంటే తల్లి కేకలు వేస్తుంది. అమ్మకి కోపం వచ్చింది అనుకుంటారు. నిజానికి అది కోపమా? ఇంతలో అత్తగారో, భర్తో పిలిస్తే మామూలుగానే మాట్లాడుతుంది. అమ్మవారి చేతిలో క్రోధము అనే అంకుశం ఉంది అని లలితారహస్యనామసాహస్రంలో ఉంది. అంటే తన అశక్తత మీద కోపం తెచ్చుకుని అనుకున్నది సాధించాలి అని అర్థం. ఇది కోపాన్ని ఆయుధంగా వాడటం. శత్రువుని సాధనంగా మలచుకుని ముల్లుని ముల్లుతోనే తీయటం. – డా.ఎన్. అనంతలక్ష్మి -
ప్రెగ్నెన్సీలో.. సరిగ్గా నీళ్లు తీసుకోకపోవడం వల్లే ఈ సమస్య!
నాకు ఐదవ నెల ప్రెగ్నెన్సీ. ప్రతిరోజు మోషన్ ఫ్రీగా రాక ఇబ్బంది పడుతున్నాను. ఏ మందులూ పని చెయ్యడం లేదు.ప్రెగ్నెన్సీలో ఇది చాలా సాధారణ సమస్య. హార్డ్ మోషన్‌తో పాటు పెయిన్‌ఫుల్‌గా కూడా ఉండొచ్చు. దీని వల్ల పొట్టలో నొప్పి, ఉబ్బరం, క్రాంప్స్ వస్తాయి. ప్రెగ్నెన్సీలో సరిగ్గా నీళ్లు తీసుకోకపోవడం అసలు కారణం. హార్మోనల్ చేంజెస్‌తో బొవల్ మూవ్మెంట్ కూడా బాగా తగ్గుతుంది. నీళ్లు సరిగ్గా తాగక బొవల్ మూవ్మెంట్ స్పీడ్ తగ్గి మోషన్ గట్టిపడటంతో మలబద్ధ్దకం మొదలవుతుంది.తినే ఆహారంలో ఫైబర్ తక్కువ ఉన్నా, ద్రవ పదార్థాలు తక్కువ తీసుకున్నా, స్టూల్ బల్క్ తగ్గి కూడా మోషన్ హార్డ్ అవుతుంది. ఎక్సర్సైజెస్, యోగా చేసిన వారిలో టమ్మీ మజిల్స్ స్టిములేట్ అవుతాయి. దానితో మలబద్ధకం లాంటి ఇబ్బందులు రావు. మీరు రోజుకు నాలుగైదు లీటర్ల నీరు తాగండి. ఫైబర్ ఎక్కువ ఉండే ఆహారం.. బీన్స్, ఫ్రూట్స్, మొలకెత్తిన గింజలు తీసుకోవాలి. మోషన్ ఫ్రీగా అయ్యే లాక్సాటివ్ సిరప్స్ తీసుకోవాలి. వీటిలో స్టిములేటింగ్ లాక్సాటివ్స్ అంటే బొవల్ ఫాస్ట్‌గా మూవ్ అయ్యేటట్టు చేసేవి వాడాలి. కొన్ని మెడిసిన్స్, యాంటీబయాటిక్స్ వల్ల కూడా మలబద్ధకం సమస్య వస్తుంది.మీరు అవి గుర్తించి డాక్టర్‌కి చెప్పాలి. అప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులను ఇస్తారు. వారంలో కనీసం మూడుసార్లు కూడా మోషన్‌కి వెళ్ళకపోతే మలబద్ధకంగా పరిగణించాలి. థైరాయిడ్ డిసీజ్, ఇరిటబుల్ బొవల్ సిండ్రోమ్‌లాంటి కండిషన్స్ ఉన్న వారిలో ఇంకా ఎక్కవ అవుతుంది. ప్రెగ్నెన్సీలో ఐదుగురిలో ఒక్కరికి ఈ ప్రాబ్లమ్ వస్తుంది. అన్నీ కరెక్ట్‌గా ఉన్నా కొంతమందిలో ఎందుకు మలబద్ధకం వస్తుందో చెప్పలేము. అలాంటప్పుడు హెల్దీ డైట్, ఎక్సర్సైజ్, లాక్సాటివ్స్తో ట్రీట్మెంట్ ఇస్తాము.– డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
ఈ సమస్యను.. పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారు! ఇదీ..
నా వయసు 24 సంవత్సరాలు. నాకు ఆరు నెలలుగా వెజైనల్ దురద, పెయిన్, అప్పుడప్పుడు ఫీవర్ వస్తున్నాయి. నాకు ప్రెగ్నెన్సీ కూడా రావట్లేదు. ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా కంప్లీట్ రిలీఫ్ రావడం లేదు. – అమృత, విజయవాడమీరు చెప్పిన లక్షణాలను బట్టి దాన్ని పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారు. దీనికి చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్. అది వెజైనల్ / యూరిన్‌లో ఉండవచ్చు. భర్త నుంచి వ్యాపించవచ్చు. అందుకే మీరు గైనకాలజిస్ట్‌ను కలసి వెజైనల్, యూరిన్ శాంపిల్స్ తీసుకుని, బ్యాక్టీరియల్ లేదా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందా అని నిర్ధారణ చేసి దానికి తగిన యాంటీబయాటిక్స్ ఇస్తారు. మీ భర్తని కూడా యూరాలజిస్ట్‌ని కలసి యురేటరల్ స్వాబ్ తీసుకోమని చెబుతారు.ఇద్దరికీ ట్రీట్మెంట్ చేసిన తరువాతనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చెయ్యమని చెప్తారు. ఇన్ఫెక్షన్స్ సరిగ్గా ట్రీట్ చెయ్యనప్పుడు ఫాలోపియన్ ట్యూబ్‌కి ఏ ఇన్ఫెక్షన్ వ్యాపించినా ట్యూబ్స్ బ్లాక్ కావచ్చు. అప్పుడు ప్రెగ్నెన్సీ రావడం కష్టమవుతుంది. వచ్చినా ట్యూబ్‌లోనే ప్రెగ్నెన్సీ రావడం.. అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అవుతుంది. ఇది ప్రమాదం. గర్భసంచికి కూడా ఇన్ఫెక్షన్ వ్యాపించే అవకాశాలు ఉంటాయి. లక్షణాలు మొదలైన రెండుమూడు రోజుల్లో వెంటనే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్‌కి ట్రీట్మెంట్ మొదలుపెడితే ఈ లాంగ్‌టర్మ్ రిస్క్స్ ఏమీ ఉండవు.డాక్టర్ చెప్పిన యాంటీబయాటిక్స్ కూడా సరైన టైమ్‌కి సరైన డోస్, చెప్పినన్ని రోజులు కరెక్ట్‌గా తీసుకోవాలి. వాళ్లకి ఫ్యూచర్లో ఇన్ఫెక్షన్ రాకుండా ఏడాదికి చెకప్‌కి వెళ్లమని చెప్తారు. ప్రెగ్నెన్సీ ఆలస్యం అవుతుంటే అల్ట్రాసౌండ్ ద్వారా ట్యూబ్స్‌లో బ్లాక్ ఉందా అని చెక్ చేస్తారు. కొన్ని బ్లడ్ టెస్ట్‌ల ద్వారా కూడా ప్రెగ్నెన్సీ ఆలస్యం అవ్వడానికి కారణాలను కనిపెడతారు. సరైన సమయానికి ట్రీట్మెంట్ ఇస్తే, మళ్లీ వెజైనల్∙ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.– డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
నైట్ బ్రషింగ్ తప్పనిసరి.. లేదంటే ఈ సమస్యలు రావచ్చు!
రాత్రివేళల్లో నిద్రపోయేముందు బ్రష్ చేసుకోడాన్ని అందరూ తప్పనిసరిగా అలవరచుకోవాలి. ఎందుకంటే మెలకువతో ఉన్నప్పుడు అందరూ తినడానికీ, మాట్లాడటానికీ... ఇలా అనేక పనుల కోసం నోటిని అనేక మార్లు తెరుస్తుంటారు. కానీ నిద్రలో కనీసం ఏడెనిమిది గంటలు నోరు మూసుకుపోయే ఉండటంతో నోట్లో సూక్ష్మజీవుల సంఖ్య చాలా ఎక్కువగా వృద్ధిచెందుతాయి.రాత్రిపూట నోటిలో ఊరే లాలాజలం కూడా చాలా తక్కువే. ఫలితంగా నోట్లో సూక్ష్మజీవులు విపరీతంగా పెరిగిపోయి, అవి దంతాలకు హానికరమైన యాసిడ్నూ ఉత్పత్తి చేస్తుంటాయి. అందువల్ల నోటి ఆరోగ్యం దెబ్బతినడంతో పళ్లూ తీవ్రంగా దెబ్బతినే అవకాశం పగటి కంటే రాత్రి పూటే ఎక్కువ. అందుకే రాత్రి పడుకునేముందు బ్రష్ చేసుకునే అలవాటు పళ్లకు జరిగే హానిని గణనీయంగా తగ్గించడంతోపాటు నోటి ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడుతుంది.ఇవి చదవండి: చచ్చు గింజలు తింటే.. ఎంత ప్రమాదమో మీకు తెలుసా? -
అందంగా లేననే అనుమానం..!?
అంజలి సింగ్.. ఢిల్లీకి చెందిన విద్యార్థి. 21 ఏళ్లు. ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ చదువుతోంది. ఆమె తల్లి తెలుగు, తండ్రి పంజాబీ. ఆమెకు తన బాడీ ఇమేజ్ గురించి అసంతృప్తి. అదెంతవరకు వెళ్లిందంటే.. 24 గంటలూ దాని గురించే ఆలోచించేంతగా. తను అట్రాక్టివ్‌గా లేననే మాట మనసులో తిరుగుతూనే ఉంటుంది. దాంతో ఒకటికి పదిసార్లు అద్దంలో చూసుకోవడం, కనిపించిన లోపాలను సరిచేసుకోవడానికి గంటలు గంటలు వెచ్చించడం ఆమెకు అలవాటుగా మారిపోయింది.సోషల్ మీడియా ప్రభావం..తన డిజైనర్ పనికోసం ప్రేరణ పొందేందుకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను స్క్రోల్ చేయడం ఆమె ఆందోళనకు మూలంగా మారింది. పూర్తిగా మేకప్ వేసుకున్న, భారీగా ఎడిట్ చేసిన మోడల్స్, ఇన్ఫ్లుయెన్సర్ల పిక్స్ చూసి, వాళ్లతో పోల్చుకుంటుంది. తను వాళ్లలా స్లిమ్‌గా లేనని, అందుకే తాను ఆకర్షణీయంగా లేనని బాధపడుతుంది.కేలరీల కొలత..స్లిమ్ అవ్వడం కోసం కేలరీలను నిశితంగా ట్రాక్ చేస్తుంది. ఏది తిన్నా, తాగినా కేలరీలు లెక్కేసుకుంటుంది. త్వరగా బరువు తగ్గుతారని ట్రెండ్ అయిన కీటో డైట్ కూడా పాటించింది. యాంగ్జయిటీ ఎక్కువైనప్పుడు విపరీతంగా తినేసి, ఆ వెంటనే గిల్టీగా ఫీలై కొన్ని రోజులపాటు భోజనం పూర్తిగా మానేస్తోంది. ఇవన్నీ కలసి తనకు మరిన్ని ఆరోగ్య సమస్యలను తెచ్చిపెట్టాయి.సామాజిక ఒత్తిడి..అంజలి నాన్న తరఫు బంధువులందరూ తెల్లగా, ఫిట్‌గా ఉంటారు. దాంతో వాళ్లు అంజలిని కలసినప్పుడల్లా ‘కొంచెం స్లిమ్‌గా, కాస్త ఛాయ మెరుగ్గా ఉంటే అందంగా ఉండేదానివి’ అని కామెంట్ చేస్తుంటారట. వాస్తవానికి అంజలి అందంగానే ఉంటుంది. కానీ బంధువుల మాటలు, సోషల్ మీడియాలో కనిపించే జీరోసైజ్ మోడల్స్, ఇన్‌ఫ్లూయెన్సర్లతో పోల్చుకోవడం ఆమె అభద్రతాభావానికి కారణమయ్యాయి. వాటికి తోడు ఫ్రెండ్స్ కూడా బరువు తగ్గడం గురించి, డైటింగ్ గురించి తరచూ మాట్లాడటం తన ఆందోళనను మరింత తీవ్రం చేసింది. తాను అట్రాక్టివ్‌గా లేననే ఆలోచనతో పార్టీలకు, ఫంక్షన్లకు వెళ్లడం మానేసింది. ఎలాగైనా స్లిమ్‌గా, ఫిట్‌గా కావాలనే కోరిక తనపై ఒత్తిడిని పెంచుతోంది. అన్నీ కలసి ఫ్యాషన్ డిజైనింగ్‌లో ఉన్నతస్థాయికి చేరాలనే కోరికను అడ్డుకుంటున్నాయి.థెరపీతో పరిష్కారం..అంజలిలాగే చాలామంది యువతులు జీరోసైజ్ కోసం కష్టపడుతుంటే, యువకులు సిక్స్ ప్యాక్ బాడీ కోసం జిమ్‌లలో చెమటోడుస్తున్నారు. ఇలాంటివారు ముందుగా చేయాల్సింది అమితాభ్బచ్చన్, రజనీకాంత్లకు సిక్స్ ప్యాక్‌లు లేవని.. అందరూ ఐశ్వర్యారాయ్‌లా ఉండలేరని గుర్తించాలి. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, న్యూరో లింగ్విస్టిక్ సైకోథెరపీ ద్వారా బాడీ ఇమేజ్ పట్ల అంజలి.. తనకున్న నెగెటివ్ భావనలను, వాటికి మూలకారణాలను అర్థం చేసుకుంది. ఐదు సెషన్లలోనే తన సమస్యను అధిగమించింది.పాజిటివ్ బాడీ ఇమేజ్ కోసం..మీ బాడీ ఇమేజ్ పట్ల మీకున్న ప్రతికూల, విమర్శనాత్మక ఆలోచనలను గుర్తించండి. అవి వాస్తవికతపై ఆధారపడి ఉన్నాయా లేక సోషల్ స్టాండర్డ్స్ ద్వారా వక్రీకరించబడ్డాయా? అనేది గమనించండి.– మీ ప్రతికూల ఆలోచనలను గుర్తించాక, ‘నా ఫ్రెండ్‌తో నేనిలాగే మాట్లాడతానా? ఇలాగే విమర్శిస్తానా?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.– అవాస్తవికమైన బాడీ ఇమేజ్ ప్రమాణాలను ప్రోత్సహించే సోషల్ మీడియా అకౌంట్స్‌కు దూరంగా ఉండండి.– ఆకారం కంటే ఆరోగ్యం ముఖ్యమని గ్రహించండి. డా¯Œ ్స, యోగా లేదా ఈత వంటి వాటిని రోజూ ప్రాక్టీస్ చేయండి.– అద్దం ముందు నిలబడి మీ సానుకూల లక్షణాలపై దృష్టి పెట్టండి. ‘ఎవరి అందం వారిదే’, ‘నేను ప్రత్యేకం’, ‘నేను అందంగా, ఆకర్షణీయంగా ఉన్నాను’ అని చెప్పుకోండి.– బాడీ ఇమేజ్‌తో కాకుండా టాలెంట్‌తో స్ఫూర్తి పంచే కళాకారులు, డిజైనర్లు, క్రియేటర్లను అనుసరించండి. మీరు ఎలా ఉన్నారనేది కాకుండా, మిమ్మల్ని మీరుగా అంగీకరించే స్నేహితులతో కనెక్ట్ అవ్వండి.– ఈ సెల్ఫ్–హెల్ప్ టిప్స్ సరిపోవనిపిస్తే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. – డా. సైకాలజిస్ట్ విశేష్ -
నగరవాసుల్లో 'నోమో ఫోబియా'
ప్రపంచాన్ని మన గుప్పిట్లోకి అదే మరో చేత్తో మనల్ని తన గుప్పిట్లోకి తెచ్చేసింది స్మార్ట్‌ఫోన్. అయితే సరికొత్త ధైర్యాలతో పాటు భయాలను కూడా మనకు చేరువ చేస్తోంది. సరదాలను తీర్చడంతో పాటు సమస్యలనూ పేర్చేస్తోంది. రోజంతా ఫోన్‌తోనే గడిపే స్మార్ట్ ఫోన్ ప్రియుల్లో నోమో ఫోబియా అనే సరికొత్త అభద్రతా భావం పెరుగుతోందని ఒప్పో కౌంటర్‌పాయింట్ చేసిన అధ్యయనం వెల్లడించింది.ఈ ఫోబియా తీవ్రతను సమగ్రంగా అర్థం చేసుకోవడానికి ప్రథమ, ద్వితీయ శ్రేణి నగరాల్లోని 1,500 మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులపై ఈ అధ్యయనం జరిగింది. అదే విధంగా నోమోఫోబియా అంటే నో మొబైల్ ఫోన్ ఫోబియా అంటే... మొబైల్ ఫోన్ నుంచి దూరం అవుతానేమో అనే భయంతో పుట్టే మానసిక స్థితి అని జర్నల్ ఆఫ్ ఫ్యామిలీ మెడిసిన్ అండ్ ప్రైమరీ కేర్‌లో ప్రచురించబడిన అధ్యయనం పేర్కొంది. మొబైల్ ఫోన్ ల మితిమీరిన వినియోగం వల్ల సంభవించే మానసిక రుగ్మతల్లో ఇది ఒకటిగా తేలి్చంది. – సాక్షి, సిటీబ్యూరోఅప్పటిదాకా చేతిలోనే ఉన్న పోన్ కాసేపు కనబడకపోతే లేదా దూరంగా ఉంటే చాలు.. నా ఫోన్ ఏది? ఎక్కడ ఉంది? ఇప్పటిదాకా ఇక్కడే ఉండాలిగా... అంటూ ఆందోళనగా, అసహనంగా, గాభరాపడిపోవడం అలాగే ఫోన్ ఛార్జింగ్ అయిపోతే ఆగిపోతుందేమో అనే కంగారుపడేవాళ్లని చాలా మందినే మనం చూస్తున్నాం. అయితే వారిలో ఇది చూడడానికి సాధారణ సమస్యగా కనిపిస్తున్నా.. అది సాధారణం కానే కాదని, ఆ సమయంలో కలిగే భయాందోళనలు తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యగా మారే ప్రమాదం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.కారణం ఏదైనా సరే.. మన ఫోన్‌కు కొద్దిసేపైనా సరే దూరంగా ఉండాలనే ఆలోచన ఎవరికైతే ఆందోళన కలిగిస్తుందో.. తరచుగా తమ ఫోన్‌ను తరచి చూసుకోవడం వంటి లక్షణాలతో నోమో ఫోబియా బాధితులుగా మారే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం ఇది ప్రతీ నలుగురు స్మార్ట్ ఫోన్ ప్రియుల్లో ముగ్గురిని ప్రభావితం చేస్తోందని, నగరాలు/ గ్రామాలు తేడా లేకుండా ఇది దాదాపు 75 శాతం జనాభాపై దాడి చేస్తోందని అధ్యయన నిర్వాహకులు అంటున్నారు. మితమే హితం..డిజిటల్ అక్షరాస్యత అందరికీ అలవడాలి. బాధ్యతాయుతమైన స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని ప్రోత్సహించడం అవసరం. సమస్య ముదిరితే అంతర్లీన ఆందోళన లేదా డిపెండెన్సీ సమస్యలను పరిష్కరించడానికి కాగ్నిటివ్–బిహేవియరల్ థెరపీ, కౌన్సెలింగ్ అవసరం కావచ్చు. స్మార్ట్‌ఫోన్ వినియోగంపై పరిమితులను సెట్ చేయాలి. అంటే ‘టెక్–ఫ్రీ’ సమయాలు లేదా ప్రాంతాలు వంటివి. శారీరక శ్రమ మానసికోల్లాసం కలిగించే ఆఫ్‌లైన్ కార్యకలాపాలు వంటి హాబీల్లో పాల్గొనడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.ఆరోగ్యంపై దు్రష్పభావం.. నోమోఫోబియాతో ఆందోళన, శ్వాసకోశ మార్పులు, వణుకు, చెమట, ఆందోళన, అయోమయ స్థితి వగైరాలు కలుగుతున్నాయి. అలాగే నిద్రలేమి, ఏకాగ్రత లేమి, నిర్లక్ష్యాన్ని ప్రేరేపించి వ్యక్తిగత సంబంధాలను విస్మరించేలా చేస్తుంది. కారణం ఏదైనా సరే.. స్మార్ట్ఫోన్లపై అతిగా ఆధారపడటం వల్ల ముఖ్యమైన అప్డేట్లు, సందేశాలు లేదా సమచారాన్ని కోల్పోతారనే భయంతో వ్యక్తులు ఈ ఫోబియాకు గురవుతున్నారు.అధ్యయన విశేషాలివీ..– నో మొబైల్ ఫోబియానే షార్ట్ కట్లో ‘నోమో ఫోబియా‘గా పేర్కొంటున్నారు. ఇది వర్కింగ్ కండిషన్లో ఉన్న మొబైల్ ఫోన్ దగ్గర లేకపోవడం వల్ల కలిగే భయం లేదా ఆందోళనను సూచిస్తుంది.– అధ్యయనంలో పాల్గొన్న స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల్లో 65 శాతం మంది తమ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతున్నప్పుడు రకరకాల మానసిక అసౌకర్యాలకి గురవుతున్నారని అధ్యయనం తేలి్చంది. ఆ సయమంలో వీరిలో ఆందోళన, ఆత్రుత, డిస్కనెక్ట్, నిస్సహాయత, అభధ్రత భావాలు ఏకకాలంలో ముప్పిరిగొంటున్నాయని వెల్లడించింది. అంతేకాకుండా బ్యాటరీ పనితీరు సరిగా లేదనే ఏకైక కారణంతో 60 శాతం మంది తమ స్మార్ట్ఫోన్లను రీప్లేస్ చేయబోతున్నారని అధ్యయనం వెల్లడించింది.– ఈ విషయంలో మహిళా వినియోగదారుల (74 శాతం మంది)తో పోలిస్తే పురుష వినియోగదారులు (82 శాతం మంది) ఎక్కవ సంఖ్యలో ఆందోళన చెందుతున్నారని అధ్యయనంలో తేలింది.– ఫోన్ ఆగకూడదనే ఆలోచనతో 92.5 శాతం మంది పవర్–సేవింగ్ మోడ్‌ను ఉపయోగిస్తున్నారని, 87 శాతం మంది తమ ఫోన్లను ఛార్జింగ్ చేస్తున్నప్పుడు సైతం ఉపయోగిస్తున్నారని తేలి్చంది.– ‘ముఖ్యంగా 31 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల వారిలో బ్యాటరీ గురించిన ఆందోళన ఎక్కువగా ఉంది. తర్వాత స్థానంలో 25 నుంచి 30 సంవత్సరాల వయస్సు గల వారు ఉన్నారు’ అని రీసెర్చ్ డైరెక్టర్, తరుణ్ పాఠక్ చెప్పారు.సాంకేతికత రోజువారీ జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నందున, నోమోఫోబియా, దాని అనుబంధ సవాళ్లను పరిష్కరించడం ఒక క్లిష్టమైన అంశం కాబోతోంది. ఆరోగ్యకరమైన సాంకేతికత అలవాట్లను పెంపొందించడం స్మార్ట్ఫోన్లతో కాకుండా వ్యక్తుల మ«ధ్య సంబంధాలను శక్తివంతం చేయడం వంటివి నోమోఫోబియా ప్రతికూల ప్రభావాన్ని తగ్గిస్తాయి. -
ఐవీఎఫ్‌తో.. సంతనాలేమికి చెక్!
సంతానలేమితో బాధపడుతున్న వారికి ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) అనేది ఒక వరం లాంటిదని వైద్యురాలు అర్చన అన్నారు. జిల్లా కేంద్రంలో ‘పినాకిల్ ఫెర్టిలిటీ’ సెంటర్ ద్వారా సేవలందిస్తున్న వైద్యురాలు అర్చన.. అంతర్జాతీయ ఐవీఎఫ్ దినోత్సవం సందర్భంగా పలు అంశాలపై మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో ఒకరు ఇన్ఫెర్టిలిటీ సమస్యతో సతమతమవుతున్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్‌వో) రిపోర్టులు వెల్లడించడం గమనార్హమని అన్నారు. అడ్వాన్స్డ్, ఎక్కువ సక్సెస్ రేట్ కలిగిన ఐవీఎఫ్ విధానం సంతానలేమితో బాధపడుతున్న వారికి మంచి అవకాశమని తెలిపారు. గ్రామీణప్రాంతాల వారికి సైతం తక్కువ ఖర్చుతో ఆధునిక సౌకర్యాల ద్వారా చికిత్స అందించడం పినాకిల్ ఫెర్టిలిటీ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఐవీఎఫ్‌కు సంబంధించి పలు అంశాలపై అవగాహన కల్పించడంతోపాటు సందేహాలను డాక్టర్ అర్చన నివృత్తి చేశారు.ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లల ఆరోగ్యంపై..1978 జూలై 25న ఐవీఎఫ్ ద్వారా మొదటి బేబి లూయీస్ బ్రౌన్ జన్మించారు. నాలుగు దశాబ్దాలు నాటికి 8 మిలియన్ల పిల్లలు ఐవీఎఫ్ పద్ధతి ద్వారా జన్మించారు. ఇప్పటి వరకు చేసిన రిసెర్చ్, ఆర్టికల్స్ ఆధారంగా సహజంగా గర్భం ద్వారా పుట్టిన పిల్లలకి ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లలకి ఎటువంటి తేడా లేదని తేలింది.ఐవీఎఫ్ ద్వారా కవలలు పుట్టే అవకాశం..ఐవీఎఫ్ పద్ధతిలో అంటే ఆడవారి అండాలను మగవారి వీర్యకణాలు కలిపితే వచ్చే పిండాలను గర్భసంచిలో ప్రవేశపెడతాం. ఈ పద్ధతిలో మునుపు రెండు లేక మూడు పిండాలను ప్రవేశపెట్టేవారు. అందువల్ల ఐవీఎఫ్‌లో కవలలు పుట్టే అవకాశం పెరుగుతుంది. కానీ ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీతో గర్భం దాల్చే అవకాశాలు మెరుగయ్యాయి.నొప్పి ఉంటుందంటారు..ఆడవారు 10–12 రోజులపాటు ఐవీఎఫ్‌లో రోజూ కొన్ని ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. తరువాతే ఆడవారి శరీరంలో ఉండే అండాలను బయటకు తీసి మగవారి వీర్యకణాలతో కలపడం జరుగుతుంది. అలా పెరిగిన దాన్ని ఆడవారి గర్భసంచిలో ప్రవేశ పెడతాం. ఈ ప్రక్రియలు ఎగ్ పికప్ (ఎమ్బ్య్రో ట్రాన్స్ఫర్) అంటాం. ఇవన్నీ కూడా డే కేర్ ప్రొసీజర్స్ అంటే అదే రోజు ఇంటికి వెళ్లొచ్చు. ఐవీఎఫ్‌లో నొప్పి అనేది చాలా తక్కువతొమ్మిది నెలలు రెస్ట్ అవసరమా..ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చిన తర్వాత ఒక రెండు నెలలు జాగ్రత్త చెబుతాం. ఆ తరువాత సహజ ప్రెగ్నెన్సీ లాగే అన్ని పనులు చేసుకోవచ్చు. ఆఫీస్‌కి వెళ్ళేవాళ్లు, ఇంటి పనులు చేసుకునేవారు ఎప్పటిలాగే వారి పనులను చేసుకోవచ్చు.సిజేరియన్ అవసరం లేదు..ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చిన వాళ్లు నార్మల్ డెలివరీ ఖచ్చితంగా చేయించుకోవచ్చు. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ సహజ ప్రెగ్నెన్సీ లాగే ఉంటుంది. వేరే ఇతర కారణాల వల్ల సిజేరియన్ చేయించాల్సిన పరిస్థితి వస్తే తప్ప కేవలం ఐవీఎఫ్ వల్ల సిజేరియన్ చేయించాల్సిన అవసరం అసలు లేదు.– డాక్టర్ అర్చన, పినాకిల్ ఐవీఎఫ్, ఫెర్టిలిటీ సెంటర్