ప్రకృతి ప్రసాదించిన, తాజాదనాన్ని ఇచ్చే ఎన్నో ఆరోగ్య సుగుణాలు ఉన్న ఆకు పుదీనా. దీనిని నిత్యం ఆహారంలో తీసుకోవడం వల్ల అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వేసవిలో పుదీనా వాడకం మరింత ప్రయోజనకరం.
పుదీనా ఆకులలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి–6 లతోపాటు, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం వంటి మినరల్స్, ్రపోటీన్లు, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉండడంతో ఇది మన జీవక్రియను మెరుగుపరుస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజూ పుదీనా వాటర్ తీసుకుంటే చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. బరువు తగ్గడానికి, ముసలితనం త్వరగా రాకుండా ఉండడానికి పుదీనా ఎంతో ఉపయోగపడుతుంది.
పుదీనా నీటిని తాగితే శరీరానికి శక్తి లభించడమే కాకుండా చర్మ సమస్య లు తగ్గుతాయి. కళ్ళ కింద నలుపు తగ్గటానికి పుదీనాతో తయారు చేసిన లేపనం ఎంతో ఉపయోగపడుతుంది. శరీరంలోని మలినాలను తొలగించి జీర్ణక్రియను సాఫీగా చేయడానికి, జీర్ణ వ్యవస్థను సక్రమంగా పనిచేసేలా చేయడానికి ఉపయోగపడుతుంది. çపుదీనాను మజ్జిగతో కలిపి తీసుకుంటే మన శరీరంలో వేడి తగ్గుతుంది.
అందానికి కూడా!
పుదీనా ఆకులను మెత్తగా నూరి ముఖానికి రాసుకుంటే ముఖం కాంతివంతంగా ప్రకాశవంతంగా మారుతుంది. మన అందాన్ని పెంచటంలో కూడా పుదీనాది ప్రత్యేక స్థానం. చర్మ సమస్యలను నివారిస్తుంది. మొటిమలను, మచ్చలను తగ్గించడంలో పుదీనా ఎంతగానో ఉపయోగపడుతుంది. దంత సమస్యలను, చిగుళ్ల సమస్యలను తగ్గిస్తుంది. నోటి దుర్వాసనకు చెక్ పెట్టి, దంతాలను తెల్లగా మెరిసేలా చేస్తుంది. ఉదయాన్నే నిమ్మరసం, తేనె, పుదీనా కలిపి తీసుకుంటే ఆరోగ్యాన్ని అది బాగు చేస్తుంది.
పుదీనాతో ఉత్సాహం..
వేసవిలో అధిక దాహం, అలసట సర్వ సాధారణం. అధిక దాహం సమస్యకు చెక్ పెట్టడానికి పుదీనా వాటర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు, అలసటగా ఉన్నప్పుడు పుదీనా వాటర్‌లో కాస్తంత నిమ్మరసం, పటికబెల్లం లేదా చిటికడు బ్లాక్ సాల్ట్ కలుపుకుని తాగితే అలసట ఇట్టే తీరుతుంది.
ఇవి చదవండి: ఆరోగ్యం విషయంలో.. ఇలా ప్రవర్తిస్తున్నారా? జాగ్రత్త!
Comments
Please login to add a commentAdd a comment