ఈ రోజుల్లో.. పిల్లలు చేత పుస్తకం పట్టి, పదినిమిషాలు చదవాలంటే.. ఓపికతో కూడుకున్న పనిగా, ఇబ్బందిగా భావిస్తున్నారు. అందులో వారికి ఇష్టంలేని సబ్జెక్ట్ గురించైతే చెప్పనవసరం లేదు. పుస్తకం ఇలాగ తెరిచి వామ్మో.. ఈ సబ్జెక్టా అంటూ పక్కనెట్టుస్తున్నారు. ప్రస్తుతం జనరేషన్ కి పుస్తక పఠనంపై దృష్టి పెట్టడమనేది చాలా పెద్ద సమస్యగా మారింది.
దీనికి చాలా కారణాలు ఉండవచ్చు. ఆరోగ్య సమస్యలు, ఓపిక లేకపోవడం, ఇతర చిన్న చిన్న కారణాలు, మరెన్నో.. మరి ఇటువంటి కారణాలకు సహజంగా చదువుపై ఏకాగ్రత పొందాలంటే కొన్ని పర్యావసనాలు ఎంచుకోవాల్సిందే. తదుపరి విద్యార్థులకు చదువుపై శ్రద్ధ కలగడం, అంకితభావంతో తమ చదువుల్లో నిమగ్నమై ఉండటం, చదువులో పురోగతి సాధించడంవంటి ఫలితాలు కనిపిస్తాయి. అలాగే, శ్రద్ధతో చదవడంతో విద్యార్థులు ఎక్కువ సబ్జెక్టులను అర్థం చేసుకోగలుగుతారు, దీంతో వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతంది.
పాటించాల్సిన చర్యలు..
పర్యావరణం..
చదువుకోవడానికి ఎప్పుడూ ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి. చుట్టూ ఉన్న స్థలం శుభ్రంగా ఉండటం మరీ ఉత్తమం. వీలైతే, సహజ కాంతి, సౌకర్యవంతమైన కుర్చీ, పొందిగ్గా కూర్చునే విధానం ఎంతో అవసరం. చదివేంతవరకైనా మన ఫోన్, ల్యాప్‌టాప్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలనుంచి ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలి.
సమయం..
మనకున్న రోజుకి 24 గంటల సమయంలో ఇతర అవసరాలకి చాలా సమయం పోగా, చదువుకై కొంత సమయాన్ని కెటాయంచుకోవడం అవసరం. అలా వీలు పడలేదంటే వెంటనే షెడ్యూల్‌ని తయారుచేసుకుని దానిని అనుసరించడం ఎంతో కీలకం. ప్రతిరోజూ చిన్న లక్ష్యాలను నిర్దేశించుకుని.. పెద్ద లక్ష్యాల వైపుగా కొనసాగడం సులభమైన మార్గం. ప్రతీ 45-60 నిమిషాలకు.. 5-10 నిమిషాల విరామం తీసుకోవడం అవసరం. ప్రస్తుత జనరేషన్ లో 7-8 గంటల నిద్ర మరీ ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామంతో దృష్టి, ఏకాగ్రత మెరుగుపడుతుంది.
సాంకేతికత..
ఓపిక, సహనానికై పోమోడోరో వంటి టెక్నిక్స్ సహాయంగా మారుతుంది. పోమోడోరో టెక్నిక్‌లో.. 25 నిమిషాల పనికి 5 నిమిషాల విరామంగా విడమర్చి ఉంటుంది. సంక్లిష్ట భావనలను అర్థం చేసుకోవడానికి, గుర్తుంచుకోవడానికి మైండ్ మ్యాపింగ్‌ని ఉపయోగించండి. పదజాలం, వాస్తవాలను గుర్తుంచుకోవడానికి ఫ్లాష్‌కార్డ్‌లను ఉపయోగించండి. మీ చదువులో మీకు సహాయపడే ఆన్‌లైన్ ట్యుటోరియల్‌లు, వీడియోలు, కథనాలతో కూడిన ఆన్‌లైన్ మాద్యమాలను ఉపయోగించడం సులభమైన మార్గం.
మనస్తత్వం..
ప్రతీనిమిషం సానుకూలంగా ఉండడానికే ప్రయత్నించాలి. ఎల్లప్పుడూ మన శక్తి సామర్థ్యాలపై విశ్వాసం వీడొద్దు. ధ్యానం మీ దృష్టిని, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. ఎవరైనా సహాయం కోరితే సానుకూలంగా స్పందించండి. ఇతరులనుంచి సాయంకోరడంలో ఇబ్బంది పడటం, చివరికి చిక్కుల్లో పడటం చేయకండి. సజావుగానే, తేలికగా అడగడానికి ప్రయత్నించండి.
ప్రతీ వ్యక్తి భిన్నంగా ఉండాలనే నియమం ఎక్కడా కూడా లేదు. అది కొందరికి సాధ్యం అవచ్చు. మరికొందరికి కాకపోవచ్చు. అలా ఉండకపోవడానికి గల లోపాలను గుర్తించి, అవసరమైన జాగ్రత్తలు పాటించడం మేలు. శ్వాస విషయంలో గట్టిగా గాలి తీసుకోవడం, నెమ్మదిగా వదలడం ఇలా 5 నిమిషాల శ్వాసవ్యాయామంతో అలోచనా శక్తి మెరుగుపరుచుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment