3, 4 రోజులకి పైబడి జ్వరంగా ఉండటం, వాంతులు, విరేచణాలు కావటం, చలిగా ఉండటం ఇవన్నీ మలేరియా వ్యాధికి కారకాలవచ్చు. మలేరియా సోకితే చాలా ప్రాణంతకంగా భావించే గత రోజుల్లో.. ప్రస్తుతం వాటికి తగిన మాత్రలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఎన్నో ఉన్నాయి. ఒకప్పుడు ప్రతి జ్వర పీడితుడిని పరీక్షించి, మలేరియా వ్యాధిగా గుర్తించి నిర్ధారణ పరీక్షల నిమిత్తం జాగ్రత్తలు చెప్పేవారు. కానీ ఇప్పుడు ఇలాంటి విషపూరిత జ్వరాల నుంచి, పీడిత వ‍్యాధుల నుంచి ముందుగానే నివారిత వ్యాక్సిన్లు ప్రతి ఒక్కరికీ ఇస్తున‍్నారు. వ్యాధి సోకాక ఇబ్బంది పడటం కన్నా, ముందుగానే వ్యాధి నివారణకు, కారకాలైన దోమలను నివారించుటలో ప్రతీ ఒక్కరి పాత్ర ఎంతో ముఖ్యమైనది. నేడు 'ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
'చార్లెస్ ఆల్ఫన్సో లావెరన్' 1880లో మనుషుల్లో మలేరియా వ్యాధికారక క్రిమిని కనుగొన్నారు. ఇది 'ప్లాస్మోడియం' జాతికి చెందిన పరాన్నజీవిగా గుర్తించారు. ఇవి 5 రకాలు. అవి.. ప్లాస్మోడియం నాలెస్సి, ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిపారమ్, ప్లాస్మోడియం మలేరియే, ప్లాస్మోడియం ఓవేల్. ఈ పరాన్నజీవులతో మలేరియా సోకే అవకాశం ఉంది.
ఈ క్రిమి మనుషుల్లో ఒకరి నుండి మరొకరికి దోమల ద్వారా వ్యాపిస్తుందని నిర్ధారించడం జరిగింది. ఈ వ్యాధిని అధికంగా అనుభవించిన ఆఫ్రికా ఖండం 2001లో “ఆఫ్రికా మలేరియా డే" ఆచరించిగా. ప్రపంచ దేశాలు ఏప్రిల్ 25ను 'వరల్డ్ మలేరియా డే'గా ఆచరిస్తూ వస్తున్నాయి.
ఇలా వ్యాపిస్తుంది..
- అపరిశుభ్రత వాతావరణం, చెత్తా చెదారంతో కూడిన తడి ప్రదేశాలతో వ్యాధికి అవకాశం
- ఆడ అనాఫిలిస్ దోమకాటుతో ఒకరి నుంచి మరొరికి వ్యాధికారక క్రిమి ప్లాస్మోడియాగా వ్యాప్తి చెందుతుంది.
- ఈ వ్యాధి దోమకుట్టిన 8 నుంచి 12 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి.
- చిన్నపిల్లలకు, గర్భిణులకు త‍్వరగా సోకడమే కాకుండా చాలా ప్రమాదకరంగా మారుతుంది.
వ్యాధి లక్షణాలు..
- చలి, వణుకుతో కూడిన జ్వరం రావడం. వాంతులు విరేచణాలు కావడం.
- ప్లాస్మోడియా జాతికి చెందిన రెండు క్రిముల వల్ల పరసర ప్రాంతాలలో మలేరియా సోకే అవకాశం.
- ఇందులో వైవాక్స్ మలేరియా తక్కువగా బాధిస్తే, పాల్సిఫారమ్ మలేరియా ఎక్కువ బాధిస్తుంది. కొన్ని పరిస్థితుల్లో ప్రాణాపాయం కూడా ఉండవచ్చు.
- మురికి, నీటి నిలువ, రద్దీ ప్రాంతాల్లో పాల్సిఫారమ్ మలేరియా ఎక్కువగా సోకుతుంది.
- మైదాన, పట్టణ ప్రాంతాల్లో వైవాక్స్ మలేరియా ఎక్కువగా ప్రబలుతోంది.
మలేరియా రాకుండా జాగ్రత్తలు..
- వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించడం తప్పనిసరి.
- ఇళ్లలో, చుట్టూర పరిసర ప్రాంతాల్లో దోమల దోమలపొగగానీ, మందుగానీ చల్లించాలి.
- నివసిస్తున్న ప్రదేశాల చుట్టూ నీటి నిల్వలు లేకుండా చూడాలి.
- అనాఫిలిస్ దోమలు మంచినీటి నిల్వల్లో గుడ్లు పెట్టి.. లార్వా, ప్యూపాగా పెరిగి పెద్ద దోమలుగా మారే అవకాశం.. కనుక వాటి నుంచి ముందు జాగ్రత్తలు తీసువకోవాలి.
- ఖాళీ కడుపుతో మలేరియా చికిత్స మాత్రలు మింగరాదు. డాక్టర్ సూచనల మేరకు వాటిని ఉపయోగించాలి.
- వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో సత్వర విధానాలు, చికిత్సలో సంయుక్త ఔషధ పద్దతులు, దోమల నియంత్రణకు వినియోగించే నూతన కీటక సంహారిణీలచే.. వ్యధిని అరికట్టవచ్చు.
- దీర్ఘకాలం వినియోగించగలిగిన దోమతెరలు, ఆరోగ్యసేవల అందుబాటు మొదలైన నూతన విధానాలతో మలేరియా వ్యాధి నివారణ సాధ్యపడుతుంది.
ఇవి చదవండి: Parenting Tips: పిల్లలో చురుకుదనాన్ని పెంచే ఆటలివే..!
Comments
Please login to add a commentAdd a comment