హెల్దీ డైట్‌.. క్యారమెల్‌ బార్స్‌! | Healthy Diet Caramel Bars Making Process | Sakshi
Sakshi News home page

హెల్దీ డైట్‌.. క్యారమెల్‌ బార్స్‌!

Published Fri, Sep 27 2024 1:32 PM | Last Updated on Fri, Sep 27 2024 1:32 PM

Healthy Diet Caramel Bars Making Process

మన ఆరోగ్యానికి కావలసిన ప్రోటీన్‌లు, కార్బొహైడ్రేట్‌లు, ఇతర పోషకాలు లభించే ఈ క్యారమెల్‌ బార్స్‌ని ఎప్పుడైనా ట్రై చేశారా! ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ప్రయత్నించండి...

కావలసినవి..
కోకో పౌడర్‌ – అరకప్పు;
మొక్కజొన్న పిండి– 1 1/4 కప్పు; చక్కెర పొడి– కప్పు;
క్రీమ్‌– 4 టేబుల్‌ స్పూన్‌లు;
వేరుశనగ పప్పు పలుకులు– పావు కప్పు;
వాల్‌ నట్‌ పలుకులు – పావు కప్పు;
క్యారమెల్‌ చిప్స్‌ – కప్పు;
కండెన్స్‌డ్‌ మిల్క్‌ – ఒక టిన్‌ (14 ఓజెడ్‌);
వెనిలా ఎసెన్స్‌ – 2 టీ స్పూన్‌లు;
ఉప్పు – టీ స్పూన్‌;
బటర్‌ – 3 టేబుల్‌ స్పూన్‌లు (ఉప్పు లేనిది)

తయారీ..
– ఒక పాత్రలో 2 టీ స్పూన్‌ల బటర్, చక్కెర వేసి బీటర్‌తో చిలకాలి. అందులో కోకో, మొక్కజొన్న పిండి కలిపి మళ్లీ చిలకాలి 
– ఒవెన్‌ను 350 డిగ్రీ ఫారన్‌హీట్‌లో వేడి చేయాలి. బేకింగ్‌ ట్రేలో మందపాటి పేపర్‌ను పరిచి అంచులకు సరిగ్గా సర్దాలి. 
– పైన సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని పోసి సమంగా సర్ది ఒవెన్‌లో పెట్టి 15 నిమిషాల సేపు బేక్‌ చేసి ట్రేని బయటకు తీయాలి. 
– పాత్రలో 2 టేబుల్‌ స్పూన్‌ల బటర్, కండెన్స్‌డ్‌ మిల్క్, వెనిల్లా ఎసెన్స్‌ వేసి కలపాలి.
– బేకింగ్‌ ట్రేలో బేక్‌ అయిన కోకో మిశ్రమం మీద కండెన్స్‌డ్‌ మిల్క్‌ మిశ్రమాన్ని పోయాలి.
– ఇప్పుడు ఆ ట్రేని మళ్లీ ఒవెన్‌లో పెట్టి పదినిమిషాల సేపు బేక్‌ చేయాలి.
– ఇది వేడి తగ్గే లోపు వేరుశనగపప్పు పలుకులు, వాల్‌నట్‌ పలుకులను ఒక మోస్తరుగా వేయించి పక్కన పెట్టాలి.
– క్యారమెల్‌ చిప్స్, క్రీమ్‌తో కలిపి కరిగించి అందులో ఉప్పు, వేయించిన గింజలను కలపాలి.
– బేక్‌ చేసిన మిశ్రమం మీద క్యారమెల్, నట్స్‌ మిశ్రమాన్ని పై నుంచి పోసి చల్లారేలోపు స్లయిస్‌లుగా కట్‌ చేయాలి.
– ఇవి గోరు వెచ్చగా తినవచ్చు, పూర్తిగా చల్లారిన తర్వాత కూడా తినవచ్చు.

పోషకాలు: క్యాలరీలు – 285; ప్రోటీన్‌ – 4 గ్రాములు; కార్బొహైడ్రేట్‌లు – 40 గ్రాములు; చక్కెర – 28 గ్రాములు; ఫ్యాట్‌ – 14 గ్రాములు; సాచురేటెడ్‌ ఫ్యాట్‌ – 7 గ్రాములు; ఫైబర్‌ – 1.5 గ్రాములు; సోడియం – 180 మిల్లీగ్రాములు. – డాక్టర్‌ కరుణ, న్యూట్రిషనిస్ట్‌ అండ్‌ వెల్‌నెస్‌ కోచ్‌

ఇవి చదవండి: తప్పును సరిదిద్దుకునే మార్గాలు..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement