కొంతమంది ఎప్పుడూ ఉసూరుమంటూ ఉంటారు. టార్చి లైటు వేసి చూసినా, వారి ముఖంలో ఉత్సాహం కనిపించదు. ఇంకొందరేమో ఉత్సాహానికి మారుపేరులా... ఎప్పుడూ నవ్వుతూ తుళ్లుతూ ఉంటారు. మనం తీసుకునే ఆహారం మన ప్రవర్తనపైన, పనితీరుపైనా ప్రభావం చూపుతుందనడానికి అదొక తార్కాణం. కొన్ని రకాల ఆహార పదార్థాలను నిత్యం తింటుండటం వల్ల ఉత్సాహంగా... ఉల్లాసంగా ఉండడంతోపాటు మెరుపులీనే చర్మం, మంచి ఆరోగ్యం మన సొంతం అవుతాయి. అవేమిటో చూద్దామా... ఉత్సాహంగా ఉంచే ఆహారం అనగానే అదేదో ఖరీదైన తిండేమో అని అనుకోనక్కరలేదు. ఇంకా చె΄్పాలంటే మిగిలిన వాటితో పోల్చితే అవి కాస్తంత చవగ్గానే దొరుకుతాయి.
టొమాటో: దీనిలోని లైకోపిన్ కాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది. గుండె, రక్తనాళాలకి సంబంధించిన అనారోగ్యాన్ని కూడా నిరోధిస్తుంది. మన చర్మానికి ఎండ తాలూకు ప్రభావాలనుండి రక్షించడంలో మిగతా పోషకాలతో పాటు టమాటోల పాత్ర చెప్పుకోదగినదే.
నట్స్: ముఖ్యంగా వాల్‌నట్స్‌లో ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్, ΄్లాంట్ స్టెరోల్స్ సమృద్ధిగా ఉంటాయి. కొలెస్టరాల్ లెవల్ తగ్గించడంలో వీటి పాత్ర అమోఘం. వాల్నట్స్‌లో పీచుపదార్థం అధికం. మెగ్నీషియం, కాపర్, ఫోలేట్, విటమిన్–ఇ, ఉండి శక్తిమంతమైన యాంటి ఆక్సిడెంట్స్‌ని అందిస్తాయి. బ్లడ్ ప్రెషర్‌ను తగ్గిస్తుంది. ఆస్టియోపొరోసిస్ రాకుండా ఆపుతుంది. గుండె ఆరోగ్యాన్ని, చర్మానికి ఎండనుండి కలిగే హానినుండి కాపాడుతుంది. ఆల్మండ్స్ చర్మకాంతికి తోడ్పడతాయి. రోజూ గుప్పెడు నట్స్ తింటూ ఉంటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది.
గ్రీన్‌టీ: ఇది ఓ సూపర్ డ్రింక్. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. చర్మాన్ని అంత త్వరగా ముడతలు పడనివ్వదు. కళ్ళకు మెరుపు అందిస్తుంది. కేటరాక్ట్ ముదరటాన్నీ నెమ్మదింపచేస్తుంది. కప్పు గ్రీన్ టీ తీసుకోగానే కొత్త ఉత్సాహం పరవళ్లు తొక్కుతున్నట్లనిపిస్తుంది.
యోగర్ట్ లేదా పెరుగు: మనం కర్డ్ లేదా పెరుగు అంటాం కానీ, విదేశాలలో దీనినే యోగర్ట్ అంటారు. అయితే మన పెరుగుకూ దానికీ ఉన్న తేడా ఏమిటంటే... పెరుగు కాస్త పలచగా ఉంటుంది. యోగర్ట్ గట్టిగా ఉంటుంది. పెరుగు కాస్తంత పుల్లదనాన్ని కలిగి ఉంటుంది. యోగర్ట్‌లో ఏమాత్రం పులుపు ఉండదు. కస్టర్డ్ ΄ûడర్ కలిపినట్టుగా గడ్డగా... కొద్దిపాటి తియ్యగా ఉంటుంది. ఈ రెండూ కూడాప్రోటీన్, కాల్షియం, విటమిన్–బి లను కలిగి ఉంటాయి. ఇవన్నీ కలిసి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇన్ఫెక్షన్ కలగకుండా పోరాడతాయి. యోగర్ట్ మన శరీర ఆరోగ్యానికి, జీర్ణ వ్యవస్థకు, నాడీవ్యవస్థకు మేలుచేస్తుంది. క్యాన్సర్, ఎలర్జీలు, అధిక రక్తపోటు, హై–కొలెస్టరాల్ బారిన పడకుండా కాపాడుతుంది.
బీన్స్: ప్రోటీన్స్, పీచుపదార్థం, విటమిన్లు, మినరల్స్, ఫైటోన్యూట్రియెంట్స్. ఇవన్నీ బీన్స్‌లో సమృద్ధిగా ఉంటాయి. అలాగే కొవ్వుకు సంబంధించిన చెడు లక్షణాలు ఉండవు. బీన్స్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. షుగర్ లెవల్స్ సమతుల్యంగా ఉండేటట్లు చూస్తూనే సురక్షితమైన, నిలకడ అయిన నెమ్మదిగా ఖర్చయ్యే శక్తిని అందిస్తుంది. కొలెస్టరాల్ లెవెల్స్‌ని కొంతమేరకు తగ్గిస్తాయి. బీన్స్‌తో చేసిన కూరలు తిన్నప్పుడు కడుపు నిండినట్లు అనిపిస్తుంది. అయితే ఇందులో అధిక క్యాలరీలు లేకపోవడం వలన బరువు పెరిగే సమస్యే ఉందదు.
బెర్రీస్: ముఖ్యంగా నేరేడుపండ్లు-వృద్ధాప్యం త్వరగా రాకుండా చేస్తాయి. వృద్ధులవుతున్న కొద్దీ మెదడు నెమ్మదించే అవకాశం ఉంది. అలాంటి అనారోగ్యలనుంచి బెర్రీస్ కాపాడుతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, క్యాన్సర్ నిరోధకాలు ఉంటాయి.
ఆకుకూరలు: ఆకుకూరలు చాలా రకాల క్యాన్సర్‌ల నుండి కాపాడుతాయి. వీటిలో విటమిన్ బీ, సీ, ఇ, ఫోలేట్, పొటాషియం, పీచుపదార్ధం సమృద్ధిగా ఉంటాయి.
ఎముకల ఆరోగ్యానికి మంచిది. కాల్షియంని శరీరం ఇముడ్చుకోవటానికి తోడ్పతాయి. కేటరాక్ట్‌ను నిరోధించడంలో పాలకూర తోడ్పడుతుంది. వీలయినంత వరకూ వీటిలో కొన్నింటిని అయినా రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే ఉత్సాహంగా ఉండవచ్చు.
ఇవి చదవండి: కిచెన్ టిప్స్: మనకిష్టమైన పదార్థాలను ఇలా కాపాడుకుందాం..!
Comments
Please login to add a commentAdd a comment