Lifestyle
-
75 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా నటుడు నానా పటేకర్...ఇప్పటికీ ఆ అలవాటు..!
మరాఠీ నటుడు, నిర్మాత, మాజీ ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీ అధికారి నానా పటేకర్ చలనచిత్ర రంగంలో అత్యంత విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన నటనా ప్రతిభకు జాతీయ చలన చిత్ర అవార్డు, ఫిల్మ్‌ఫేర్ వంటి ఎన్నో అవార్డులు వరించాయి. ప్రస్తుతం ఆయనకు 75 ఏళ్లు. ఇప్పటికీ ఎంతో ఫిట్‌గా కుర్రాళ్ల మాదిరిగా చలాకీగా కనిపిస్తారు. ఆ ఫిట్నెస్ మంత్ర ఏంటో ఇన్‌స్టా థియోబ్లిక్స్లో షేర్ చేసుకున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలితోపాటు ఎలాంటి వ్యాయమాలు చేస్తారో కూడా చెప్పారు. అవేంటంటే..నానా పటేకర్ తన ఫిట్నెస్ మంత్ర గురించి చెబుతూ..తాను రోజూ గంటన్నర లేదా రెండు గంటల పాటు వ్యాయామాలు చేస్తానని అన్నారు. తన శరీరాన్ని ఆయుధంగా భావిస్తానని చెప్పారు. అందువల్లే ఈ వయసులో కూడా తానెంతో స్ట్రాంగ్‌గా ఉంటానని, కనీసం ఇద్దరి నుంచి నలుగురిని పడగొట్టగలనని ధీమాగా చెప్పారు. ఫిట్నెస్ కంటే ముఖ్యం మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం, గౌరవించుకోవడం వంటివి చేయాలని చెప్పారు. ఈ దృక్పథమే మనల్ని ఆయురారోగ్యాలతో ఉండేలా చేస్తుందన్నారు. అద్దం ముందు నుంచొని రకరకాల ఫోజులిచ్చే అలవాటుని ఇప్పటికీ మానుకోలేదని అన్నారు. దీనివల్ల తాను చాలా బాగున్నాను అనే నమ్మకం కలుగుతుందని చెబుతున్నారు. అలాగే శారీరక ఆరోగ్యం కోసం జిమ్‌లో బెంచ్ ప్రెస్‌లు, బైసెప్ కర్ల్స్ లేదా స్క్వాట్లు చేయడమం మంచిదన్నారు. ఒకవేళ ఈ వయసులో జిమ్ చేయలేం అనుకుంటే..సింపుల్‌గా సూర్యనమస్కారాలు వేయండి చాలు అంటున్నారు నానా. ఇది శరీరాన్ని ఫిట్‌గా ఉంచుతుందన్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నానాపటేకర్ ఇచ్చిన సలహాలు, సూచనలకు మద్దతిచ్చారు హైదరాబాద్‌లోని అపోలా ఆస్పత్రికి చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్. మలి వయసులో అవి తప్పనిసరి..ఆ నటుడు చెప్పినట్లుగా 70 ఏళ్లు పైబడిన వారు ఏరోబిక్, స్ట్రెంగ్త్, ఫ్లెక్సిబిలిటీ వ్యాయామాలతో సహా రెగ్యులర్ వ్యాయామాలు చేయాలన్నారు. వారంలో 150 నిమిషాలు సాధారణ వర్కౌట్లు, 75 నిమిషాలు శక్తిమంతమైన వ్యాయామాలు చేసేలా లక్ష్యంగా పెట్టుకోవాలని చెప్పారు. ఇదే ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహ కూడా అని అన్నారు. పోనీ ఇవి కాకుండా 30 నిమిషాల పాటు నడక, సైక్లింగ్, ఈత వంటివి చెయ్యొచ్చన్నారు. అయితే ఈ ఏజ్ ఎక్కు దూరం జాగింగ్ లేదా పరిగెత్తకపోవడమే మంచిదన్నారు. శక్తి శిక్షణ కోసం పుష్ అప్స్, స్క్వాట్లు, చిన్న మొత్తంలో బరువులు ఎత్తడం వంటివి చేయొచ్చన్నారు. అలాగే ఈ వయసులో ఎక్కువగా కీళ్లు పట్టేస్తుంటాయి కాబట్టి..యోగాపై దృష్టి పెట్టాలి. ఒంటి కాలిపై నిలబడే తాడాసనం వంటివి చేయాలన్నారు. ఇదీ వృద్ధాప్యంలోసాధారణంగా వచ్చే వణుకు లేదా పడిపోవటాన్ని నివారిస్తుందన్నారు. View this post on Instagram A post shared by Obliques24 (@obliques24_) (చదవండి: అలాంటి వ్యక్తులకి మళ్ళీ పెళ్ళి చేయడం పొరపాటేనా!) -
‘సౌత్ ఇండియన్ డైట్ ప్లాన్'తో అంతలా బరువు తగ్గొచ్చా..!
వెయిట్ లాస్ జర్నీలకు సంబంధించి ఎన్నో స్టోరీలు చూశాం. వాళ్లంతా ఆయా ఫిట్నెస్ కోచ్‌ల సూచనల మేరకు రకరకాల డైట్లు ఫాలో అయ్యారు. కానీ ఈ వ్యక్తి మాత్రం మన సౌత్ ఇండియన్ డైట్‌తో అలా ఇలా కాదు ఏకంగా 35 కేజీల వరకు బరువు తగ్గి శెభాష్ అనిపించుకున్నారు. ఈ డైట్ వల్లే తన శరీరంలోని అధిక కొలెస్ట్రాల్‌ని తగ్గించుకోగలిగారట. అంతలా బరువు తగ్గిపోయేలా చేసిన ఈ డైట్ ప్రత్యేకతలేంటీ? ఎలాంటి ఆహారాలు తీసుకుంటారు తదితరాల గురించి చూద్దామా..!.జితిన్ అనే వ్యక్తి ఇన్స్టాగ్రాం వేదికగా తన వెయిట్ లాస్ జర్నీ గురించి షేర్ చేశారు. ఒక్కసారిగా ఈ పోస్ట్ హాట్‌టాపిక్‌గా మారింది. ఎందుకంటే ఆయన ఆ పోస్ట్‌లో సౌత్ ఇండియన్ డైట్ ప్లాన్‌తోనే బరువు తగ్గినట్లు చెప్పడమే కారణం. అది కూడా 105 కేజీల ఉన్న వ్యక్తి జస్ట్ ఈ డైట్‌తో ఏకంగా 70 కిలోల వరకు తగ్గడంతో ఒక్కసారిగా ఈ పోస్ట్ చర్చనీయాంశమైంది. జితిన్ తన పోస్ట్‌లో ఆ డైట్ ప్లాన్‌కి సంబంధించి ఎలాంటి ఫుడ్ తీసుకునేవారో కూడా సవివరంగా వెల్లడించారు. డైట్ ప్లాన్:జిత్న దినచర్య ఉదయం 6.30తో గోరువెచ్చని నిమ్మకాయ నీళ్లతో మొదలయ్యింది. బ్రేక్‌ఫాస్ట్‌లో రెండు గుడ్లు, రెండు సాంబార్ ఇడ్లీలు లేదా మొలకెత్తిన పెసలు, ఒక దోసె తీసుకునేవాడు. మధ్యమధ్యలో అంతగా తినాలనిపిస్తే.. కప్పు మజ్జిగ, వేరుశెనగప్ప్పలు తినేవాడినని చెప్పారు జితిన్. ఇక భోజనంలో బ్రౌన్ రైస్ లేదా మిల్లెట్. దానిలోకి పప్పు, కొబ్బరి వేసిన కూరగాయలు. వందగ్రాముల చికెన్ లేదా చేపలు తీసుకునేవానని అన్నారు. ఇక సాయంత్రం స్నాక్స్‌గా గ్రీన్ టీ, ఉడికించి గుడ్డులోని తెల్లసొన లేదా కాల్చిన చిక్పీస్(బఠానీలు) తినేవాడినని చెప్పుకొచ్చారు. ఇక డిన్నర్లో మిల్లెట్ దోస లేదా గోధుమ దోస, బచ్చలి కూర లేదా మునగ సూప్. అది కాకుంటే.. కాల్చిన చేప లేదా చికెన్ లేదా రాజ్మ కూర విత్ రోటీలతో పూర్తి చేసేవాడినని తెలిపారు. అలాగే నిద్రకు ఉపక్రమించే ముందు గోరువెచ్చిన పసుపు పాలల్లో ఒక టేబుల్ స్పూన్ ప్రోటీన్ పౌడర్ కలిపి తీసుకునే వాడనని తన వెయిట్ లాస్ జర్నీ గురించి సవివరంగా ఇన్‌స్టాలో వెల్లడించారు.గుర్తించుకోవాల్సినవి:ఈ డైట్ ఫాలో అవుతున్నప్పుడూ డీప్ ఫ్రై లేదా హై క్యాలరీ ఫుడ్ ఐటెమ్స్‌ని ఏ మాత్రం దరిచేరనీయకూడదు. అలాగే కూరల్లో వంటనూనెని కూడా తగ్గించాలి. రోజంతా హైడ్రేటెడ్‌గా ఉండటానికి, మంచి జీర్ణక్రియ కోసం ప్రతి పది నుంచి 15 నిమిషాలు నడవాలని చెప్పారు జితిన్. దీనివల్ల బరువు కూడా అదుపులో ఉంటుందన్నారు. (చదవండి: భారతీయ రెస్టారెంట్‌కు ప్రతిష్టాత్మక మిచెలిన్ స్టార్ పురస్కారం!) -
కేవలం ఇంటి ఫుడ్‌తో 40 కిలోలు బరువు తగ్గి, అందాల రాశిగా!
స్లిమ్‌గా, అందంగా ఉండాలని అన్ని వయసుల వారు కోరుకుంటారు. అందుకు డైటింగ్ నుంచి జిమ్‌లో కసరత్తులు చేయడం వరకు రకరకాల పాట్లు పడుతుంటారు. ముఖ్యంగా తల్లి అయిన స్త్రీలు ఎదుర్కొనే ఈ సమస్యను చాందినీ సాధించి చూపింది. 39 ఏళ్ల వయసులో ఏకంగా 40 కిలోల బరువు తగ్గి అందాల కిరీటమూ సొంతం చేసుకుంది. ఎవరీ చాందినీ.. ఏమా కథ అనేవారికి బరువు తగ్గించే ఉపాయాలను మూటగట్టి మరీ మనముందుంచుతోంది.అధిక బరువు తగ్గడం కంటే ఈ క్రమంలో చేసే ప్రయాణం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. ఆరోగ్య సమస్యలను జయించేలా చేస్తుంది, ప్రసవానంతర ఇబ్బందులను దూరం చేస్తుంది. ఇందుకోసం చేసిన కృషి పట్టుదలను, అంతులేని స్ఫూర్తిని కలిగిస్తుంది. అమెరికాలో ఉంటున్న చాందినీ సింగ్‌కు 39 ఏళ్లు. పిల్లల పాదరక్షల కంపెనీకి కో ఫౌండర్. అంతేకాదు భార్య, తల్లి అయిన చాందినీ ఇటీవలే మిసెస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ యుఎస్ఎ– 2024 అందాల ΄ోటీని గెలుచుకుంది. 5 అడుగుల 8 అంగుళాల పొడవుండే చాందినీ 118 కిలోల బరువుండేది. గర్భవతిగా ఉన్నప్పుడు పెరిగిన బరువు ప్రసవానంతరమూ అలాగే ఉండిపోయింది. డబుల్ ఎక్సెల్ నుంచి ట్రిపుల్ ఎక్సెల్ దుస్తులు ధరించడం వరకు శరీరం పరిమాణం పెరిగింది. ఇంట్లో వండిన ఆహారం, రోజూ చేసే వాకింగ్ అందాల కిరీటం దక్కేలా చేశాయని చాందినీ చెప్పిన విషయాలు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాయి.భయాన్ని జయిస్తూ...‘‘విపరీతమైన బరువుతో ఆరోగ్య సమస్యలు వచ్చాయి. దీంతో తీవ్రమైన ఆరోగ్య భయాన్ని ఎదుర్కొన్నాను. గర్భవతిగా ఉన్నప్పుడు ఆరు నెలల పాటు వైద్యుల సలహా మేరకు బెడ్‌రెస్ట్‌లో ఉండక తప్పలేదు. దీంతో విపరీతంగా బరువు పెరిగిపోయాను. ఫలితంగా అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌తో పాటు ప్రీ–డయాబెటిక్ నిర్ధారణ అయ్యింది. దీంతో నియంత్రణ చర్యలు తీసుకపోతే భవిష్యత్తులో మరిన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని గ్రహించాను. ఈ వ్యాధి నిర్ధారణ నా ఆరోగ్యంపై దృష్టి పెట్టేలా చేసింది.బరువుతో పాటు అందానికీ ప్రాధాన్యతబరువు తగ్గడమే కాదు, అందంగానూ కనిపించాలి. దీంతో నా దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి సారించడం మొదలపెట్టాను. ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలను నియంత్రణలో ఉంచేందుకు తోడ్పడింది. ఆరోగ్యంగా ఉండటం నా కుటుంబంపై కూడా మంచి ప్రభావం చూపింది. ముఖ్యంగా నా కూతురిని ఆరోగ్యంగా పెంచాలనుకున్నాను. అందుకు నన్ను నేను సెట్ చేసుకోవాలనుకున్నాను. నా కూతురిని జాగ్రత్తగా చూసుకుంటూ, నా ప్రాముఖ్యతను ఆమెకు చూపించాలని కోరుకున్నాను. నా ఆరోగ్యంలో ప్రతి చిన్న మెరుగుదల ఫిట్‌గా, చురుకుగా ఉండాలనే నా అభిరుచిని పెంచింది. పోషకాహారంపై విస్తృతమైన పరిశోధన చేశాక, నా జీవనశైలి, ఆహారపు అలవాట్లలో స్థిరమైన, దీర్ఘకాలిక మార్పులు చేయడంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాను.ఫలితంపై కన్నా ప్రక్రియపైనే దృష్టి పొత్తికడుపు కొవ్వును తగ్గించడానికి వ్యాయామాన్ని దినచర్యగా చేసుకున్నాను. ఇందుకు తక్కువ–తీవ్రత, అధిక తీవ్రత గల వ్యాయామాల మిశ్రమాన్ని పాటించాను. వ్యాయామానికి వారంలో 3–4 సార్లు కేటాయించాను. కార్డియో కోసం వాకింగ్, జాగింగ్‌ని కలిపి వెయిట్ ట్రైనింగ్ తీసుకున్నాను. సెలవులు, గాయం, అనారోగ్యం కారణాలతో ఒక వారం, రెండు వారాల పాటు వర్కవుట్లకు దూరమైన సందర్భాలు ఉన్నాయి. కానీ అది నా కృషిపై ప్రభావం చూపకుండా చూసుకున్నాను. వీలైనంత త్వరగా తిరిగి ట్రాక్‌లోకి వచ్చాను. ఫలితాల కంటే ప్రక్రియపై ఎక్కువ దృష్టి పెట్టాను, ఇది నాకు స్ఫూర్తిగా మారింది. స్థిరంగా ఉండటానికి సహాయపడింది. మొదటి రెండు నెలలు బరువు తగ్గక పోయినప్పటికీ, నా పనిని ఎప్పుడూ వదులుకోలేదు. వెయిటింగ్ స్కేల్లోని నంబర్లు నన్ను డిమోటివేట్ చేయడానికి ఒప్పుకోలేదు. ఫలితం మీద కాకుండా రెగ్యులర్‌గా చేసే నా పనిపైనే దృష్టిపెట్టాను. సవాళ్లను ఎంచుకున్నానుబరువు తగ్గిన తర్వాత శారీరకంగా, బలంగా, మరింత శక్తిమంతంగా బలోపేతమైనట్లు భావించాను. రక్త΄ోటు, కొలెస్ట్రాల్, డయాబెటిస్ స్థాయులు బ్యాలెన్స్‌లో ఉన్నాయి. మిసెస్ గ్రాండ్ ఇండియా యుఎస్ఎ– 2024 గురించి తెలిసి, అప్లై చేసుకున్నాను. ఈ అందాల ΄ోటీలో ΄ాల్గొనడం, గెలవడం వంటి కొత్త సవాళ్లను స్వీకరించేలా నన్ను నేను మార్చుకున్నాను. బరువు తగ్గడం నా జీవితంలోని ప్రతి అంశాన్ని – నా ఆరోగ్యం, విశ్వాసం, మనస్తత్వాన్ని మార్చింది. బరువు తగ్గడంలో చేసే ప్రక్రియలు, ఫలితాలు వ్యక్తికీ వ్యక్తికీ మారుతుంటాయి. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే ముందు తమ శరీరాన్ని అర్థం చేసుకోవాలి. దానికి అనుగుణంగా కృషి మొదలుపెట్టాలి. ఫలితం రాలేదని ఎక్కడా వెనకడుగు వేయద్దు. ప్రయత్నాన్ని వదలద్దు’ అని చాందినీ సింగ్ టైటిల్ గెలుచుకున్న సందర్భంగా తన వెయిట్‌లాస్ జర్నీ విశేషాలు పంచుకున్నారు.ఇంటి భోజనమే ఔషధంక్రాష్ డైట్లను అనుసరించడం ద్వారా వేగంగా బరువు తగ్గగలనని తెలుసు. కానీ, దానిని ఎంచుకోలేదు. ఎందుకంటే ఈ డైట్ ద్వారా ఎంత వేగంగా బరువు తగ్గుతున్నానో, అంత త్వరగా తిరిగి బరువు పెరుగుతున్నాను. ఆ అనుభవం నాకు పెద్ద పాఠం. అందుకే క్రాష్ డైటింగ్‌కు బదులుగా ఆరోగ్యకరమైన, ఇంట్లో వండిన ఆహారానికి ప్రాధాన్యత ఇచ్చాను, అన్నం, రోటీ, పనీర్, చికెన్ కర్రీ వంటి నాకు ఇష్టమైన భారతీయ వంటకాలన్నీ తినడం కొనసాగించాను. ఆహార నియంత్రణ పాటించాను. నా భోజనంలో ఎక్కువ ప్రోటీన్, ఫైబర్‌ని చేర్చడం ద్వారా క్యాలరీ లోటును కొనసాగించాను. రెస్టారెంట్లలో ప్రత్యేక సందర్భాలలో తినడానికి మాత్రమే పరిమితం చేశాను. వీలైనంత వరకు జంక్, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని కట్ చేశాను. దీని వల్ల ఆహార ఎంపికల గురించి. బ్యాలెచేసుకోవడం.. బాగా అబ్బింది. (చదవండి: కంటి ఉప్పెనను నవ్వుతో కప్పేసి...) -
'సోలో ట్రిప్సే సో బెటర్'..! అంటున్న నిపుణులు..
సోలో లైఫే సో బెటరూ.. అన్నట్లుగా సోలో ట్రిప్పే సో బెటర్ అంటున్నారు మానసిక నిపుణులు. ఇది మన వ్యక్తిగత వృద్ధికి, మంచి సంబంధాలను నెరపడానికి తోడ్పడుతుందని చెబుతున్నారు. పెళ్లైనా..అప్పుడప్పుడూ సోలోగా ట్రావెల్ చేస్తే..మనస్సుకు ఒక విధమైన రిఫ్రెష్నెస్ వస్తుందట. అంతేగాదు మరింత ఉల్లాసంగా, ఉత్సాహంగా జీవితాన్ని లీడ్ చేయగలుగుతారని నిపుణులు చెబుతున్నారు. అదేంటి కుటుంబంతో వెళ్తేనే కదా ఆనందం! మరి ఇలా ఎలా? అనే కదా..!నిజానికి పెళ్లయ్యాక ఒంటరిగా జర్నీ అంటే..సమాజం ఒక విధమైన అనుమానాలను రేకెత్తిస్తుంది. ముఖ్యంగా మహిళలు ఇలా సోలో ట్రిప్ చేసే అవకాశం కాదు కదా..ఆ ఆలోచనకే తిట్టిపోస్తారు పెద్దవాళ్లు. కానీ ప్రస్తుత యూత్‌లో ఆ ధోరణి మారింది. పెళ్లైనా..మహిళలు/ పురుషులు సోలోగా ట్రిప్‌లకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మానసికి నిపుణులు కూడా దీనికే మద్దతిస్తున్నారు. ఇదే మంచిదని నొక్కి చెబుతున్నారు. ఎందుకు మంచిదంటే..కుటుంబ సమేతంగానే ఇంట్లో ట్రావెల్‌ని ప్లాన్ చేస్తాం. అలా కాకుండా వ్యక్తిగతంగా సోలోగా మీకు నచ్చిన ప్రదేశానికి వెళ్లేలా ట్రిప్ ప్లాన్ చేసుకుంటే మరింత జోష్‌ఫుల్‌గా ఉంటామని మాననసిక నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడూ.. కుటుంబం, పిల్లలు బాధ్యతలతో తలామునకలైపోయి ఉంటాం. మన వ్యక్తిగత అభిరుచిలు, ఇష్టాలు తెలిసి తెలియకుండానే పక్కన పెట్టేస్తాం. ఇలా చిన్నపాటి జర్నీ మనకు నచ్చినట్లుగా ఉండేలా ట్రావెల్ చేయడం మంచిదట. కుటుంబ సమేతంగా వెళ్లినప్పుడు బడ్జెట్ అనుసారం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఆయా పర్యాటక ప్రదేశాలను చుట్టివస్తాం. వాళ్ల రక్షణ బాధ్యత కూమా మీదే అవుతుంది. ఈ టెన్షన్ల నడుమ పూర్తిగా ఎంజాయ్ చేయడం కష్టమైనా..అది కూడా ఓ ఆనందం అనే చెప్పొచ్చు. ఎందుకంటే నా కుటుంబాన్ని ఫలానా ట్రిప్‌కి తీసుకెళ్లి ఈ మంచి ఫీల్ ఇచ్చాననే ఆనందం మాటలకందనిది. అయితే వ్యక్తిగతంగా అప్పడప్పుడూ సోలోగా టూర్‌కి వెళ్లడం చాలా మంచిదట. దీనివల్ల తమను తాము అనుభవించగలుగుతారు, ఎంజాయ్ చేయగలుగుతారు. స్వీయ ఆనందం పొందేందుకు వీలుపడుతుంది. అలాగే ఒక విధమైన స్వేచ్ఛ లభించనట్లుగా ఉంటుంది. దీంతోపాటు స్వీయ సంరక్షణ గురించి కూడా తెలుస్తుంది. కలిగే ప్రయోజనాలు..సోలో పర్యటన వల్ల మానసిక ఆరోగ్య మెరుగ్గా ఉంటుంది. అదికూడా వ్యక్తిగతంగా ఒక మంచి స్పేస్ దొరికనట్లు అనిపిస్తుంది. అలాగే భాగస్వామి నమ్మకాన్ని బలపరుస్తుంది. వ్యక్తిగత ఆనందాలను, అభిరుచులను గౌరవించుకోవడం వల్ల భద్రతగా ఉన్నామనే ఫీల్ భార్యభర్తలిరువురికి కలుగుతుంది. మహిళలకైతే సాధికారత భావాన్ని అందిస్తుంది. కానీ ఇలా సోలోగా పర్యటనలు చేసేవాళ్లు సురక్షితంగా తిరిగొచ్చేలా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవడం ముఖ్యం.(చదవండి: ప్రపంచంలోనే ది బెస్ట్ టేస్టీ వంటకాలను అందించే దేశాలివే..భారత స్థానం ఇది..!) -
ప్రసవానంతర చర్మ సంరక్షణ కోసం..!
డిజైనర్, నటి మసాబా గుప్తా ఎప్పటికప్పుడు ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలను నెటిజన్లతో షేర్ చేసుకుంటుంటారు. అలానే తాజాగా ప్రసవానంతర చర్మ సంరక్షణకు సంబంధించి.. కొన్ని ఆసక్తికర చిట్కాలను షేర్ చేశారు. నిజానికి ప్రసవానతరం చర్మం వదులుగా అయిపోయి..అందవిహీనంగా ఉంటుంది. మెడ వంటి బాగాల్లో ట్యాన్ పేరుకుపోయి ఒకవిధమైన గరుకుదనంతో ఉంటుంది. అలాంటప్పుడు నటి మసాబా చెప్పే ఈ చిట్కాలను పాటిస్తే సులభంగా కాంతివంతమైన మెరిసే చర్మాన్ని పొందొచ్చు. అదెలాగో చూద్దామా..!.ప్రసవానంతరం జీవితం అందంగా సాగిపోవాలంటే ఈ బ్యూటీఫుట్ చిట్కాలను తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నారు మసాబా. అవిసె గింజలు ఆరోగ్యానికే కాదు అందానికి కూడా మంచిదని చెబుతోంది. ముఖ్యంగా ఈ అవిసె గింజలు, పెరుగు, తేనెతో కూడిన ఫేస్ ప్యాక్‌తో కాంతివంతమైన చర్మాన్ని ఈజీగా పొందొచ్చని అంటోంది. ఈ మూడే ఎందుకు..?అవిసె గింజల పొడి: దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ సమృద్ధిగా ఉంటుంది. ఇది ముఖంపై ఉండే ఎరుపు ర్యాష్‌లను తగ్గించడం తోపాటు ఫ్రీ రాడికల్స్‌తో కూడా పోరాడుతోంది. ఇందులో ఉండే ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్ కంటెంట్ చర్మాన్ని హైడ్రేటెడ్‌గా చేసి, బొద్దుగా ఉండేలా చేస్తుంది. అలాగే మలినాలను తొలగించి చర్మా ఆకృతిని మెరుగుపరుస్తుంది. అందువల్లే దీన్ని ఎక్స్‌ఫోలియేటింగ్ ఏజెంట్ అని కూడా పిలుస్తారు. తేనె: ఇది తేమను లాక్ చేస్తుంది. చర్మం మృదువుగా చేసి, మొటిమలను నివారిస్తుంది. ముఖంపై ఉండే ఒక విధమైన చికాకుని తగ్గించేలా యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ముఖ్యంగా నిస్తేజమైన చర్మానికి పోషణనిచ్చి పునురుజ్జీవంప చేసి సహజమైన కాంతిని అందిస్తుంది. పెరుగు: ఇది లాక్టిక్ యాసిడ్‌తో నిండి ఉంటుంది. ముఖంపై ఉండే సున్నితమైన ఎక్స్ఫోలియంట్, మృతకణాలను తొలగించి చర్మానికి అద్భుతమైన మెరుపుని అందిస్తుంది. దీని ప్రోబయోటిక్స్ చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. పోడి లేదా సున్నితమైన చర్మానికి ఇది బెస్ట్. ఈ ఫేస్ ప్యాక్ తయారీ..అవిసె గింజల పొడి: 1 టేబుల్ స్పూన్పెరుగు: 1 టేబుల్ స్పూన్ తేనె : 1 టేబుల్ స్పూన్ఈ మూడింటిని ఒక బౌల్లోకి తీసుకుని చక్కగా కలిపి ముఖం, మెడ భాగాల్లో సమానంగా అప్లై చేయాలి. ఇలా సుమారు 15 నుంచి 20 నిమషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో కడగండి. ఇక్కడ అవిసెగింజల పొడిని తాజాదనం కోల్పోకుండా మంచి డబ్బాలో నిల్వ చేసుకోవడం మంచిది. View this post on Instagram A post shared by Masaba 🤎 (@masabagupta)(చదవండి: శిఖర్ ధావన్ ఫిట్నెస్ సీక్రెట్ తెలిస్తే కంగుతినాల్సిందే..!) -
డబ్బు కోసం కాదు, మోక్షం కోసం : నృత్యం బాధ నుంచి పుడుతుంది!
‘నృత్యశాస్త్రం నుంచి నృత్యం పుట్టదు. హృదయంలో కలిగే భాధ నుండి ఉద్భవిస్తుంది’ అంటారు కూచిపూడి నృత్యకారిణి, దేవదాసి నృత్యంలో ప్రావీణ్యత గల యశోదా ఠాకోర్. ఇటీవల ఆమె విదేశాల్లో దేవదాసీ నృత్యాన్ని ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కళావంతుల సంఘంచే స్వరపరిచి రూపొందించిన దానిని యశోద మరింత అందంగా ఆవిష్కరిస్తారు. ఒక ప్రేమికురాలు కృష్ణుడిని కోల్పోవడంపై కలిగిన ఆందోళనను అద్భుతంగా వర్ణిస్తుంది. కథానాయిక తనవాడైన వ్యక్తిని పొడవాటి వస్త్రాలతో కట్టివేయాలనే కోరికను అణుచు కుంటూ ఎటూ వెళ్లొద్దని వేడుకోవడాన్ని కళ్లకు కడుతుంది. యు.కెలోని గ్లెన్బర్గ్లో జరిగిన వేడుకలో ప్రదర్శన అనంతరం....ఈ నృత్యం వేరొకరి జీవితంపై రూపొందించిందిదేవదాసీ నృత్యం భారతదేశ చరిత్ర, రాజకీయాలలో ఎలా ప్రధానంగా ఉంటూ వచ్చిందో ఠాకోర్ వివరించారు. ‘భారత శాస్త్రీయ కళలు క్లిష్టమైన పరిస్థితులలో కొన్నిసార్లు అట్టడుగుకు చేరుకున్నాయి. కొన్ని హింసాత్మక చరిత్రలనూ పరిచయం చేశాయి. దక్షిణాదిన వ్యాపించి ఉన్న దేవదాసి సంఘాలు తమ కళతో తరతరాలుగా దేవాలయాలు, జమీందార్లను ఆశ్రయించాయి. దేవదాసీ కళాకారులు తమ కుటుంబ సభ్యులతో వాయిద్యాలతో ప్రదర్శనలను నిర్వహించారు. వారు భూమి, ఆస్తి, ఆభరణాలకు యజమానులు కాకపోయినా సంరక్షకులుగా ఉండేవారు. ఒక కళారూపానికి బాధ్యత వహించే శక్తిమంతమైన ప్రదర్శనకారులు ఇప్పటికీ ఉన్నారు. కానీ సామ్రాజ్యపాలన, కొత్త జాతీయవాద ఎజెండా ఈ ప్రదర్శనకారులకు కఠినమైన రోజులను తెచ్చిపెట్టింది. జాతీయవాద – వలసవాద పితృస్వామ్యాల మధ్య ప్రదర్శన కళలు సంప్రదాయాలలోని లైంగికశక్తితో అణగదొక్కడానికి వ్యవస్థ మొగ్గు చూపింది. మధ్యతరగతి డ్రాయింగ్ రూమ్‌లలో ’సంస్కృతి’ని కొత్తగా చూపడానికి దేశీయ రూపాలను ప్రభావవంతంగా శుద్ధి చేసింది. కోల్‌కతాలోని ఝుమూర్ నృత్య కథలో, కథక్ వంటి నృత్య రూపాల ప్రసిద్ధ చరిత్రలలో కూడా ఇది గమనించవచ్చు. దీంతో దేవదాసీ అవమానకరమైన, బలహీనమైన వ్యక్తిగా ఎదిగింది.హృదయాన్ని కదిలించేలా!లోతుగా చీలి΄ోయిన కుల సమాజంలో బ్రిటీషర్ల కాలంలో ఈ కళలు అక్షర రూపంలోకి వచ్చాయి. 1947లో దేవదాసీ నిర్మూలన చట్టం రావడంతో ఈ కళాకారులు ప్రదర్శన చేసే హక్కును కోల్పోయారు. ప్రదర్శకులుగా వారి శ్రమ, నైపుణ్యం పూర్తిగా కనిపించకుండా పోవడంతో దేవదాసీలు వ్యభిచారంలోకి నెట్టబడ్డారు. పెత్తందార్లు, ΄ోలీసుల నుండి వేధింపులకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. ఒంటరి మహిళలు కావడంతో వారి కుటుంబాలు అనిశ్చిత పరిస్థితుల్లోకి నెట్టబడ్డాయి. ఒకప్పుడు గౌరవనీయమైన మాతృకగా, అన్నదాతగా ఉన్న దేవదాసీలు ఇప్పుడు లేమితో జీవన ΄ోరాటం చేస్తున్నారు. కడుపులోని కేన్సర్ మెలిపెడుతుంటే ఆకలిని చంపుకోవడానికి బీడీలు కాల్చే మహిళలు నాకు తెలుసు. డబ్బు కోసం కాదు, మోక్షం కోసం నృత్యం చేయాలి... దేవదాసీ నిర్మూలన చట్టం వల్ల కొంతమంది మహిళలు తమ కళను కోల్పోతే, మరికొందరు సిగ్గుతో కుటుంబాలను, సంబంధాలను విచ్ఛిన్నం చేసే మార్గాల్లో తమను తాము దూరం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఒక చట్టాన్ని ఆమోదించినప్పుడు ఆ కళ పై ఆధారపడి జీవించే వారికి ఏం జరుగుతుందో ఎవరికీ పట్టదు. దేవదాసీలు ప్రజా జీవితం నుండి తొలగించిన తర్వాత వారి కళ మాత్రం ‘గౌరవనీయమైన’ శరీరాలపై నాటబడింది. మీరు వెళ్లిపొండి, మీ కళను మాత్రం తీసుకుంటాము అన్నట్టుగా చేశారు. ఉన్నత–కులాల పురుషులు ఈ నృత్య రూపాలను స్వీకరించి, ఆధిపత్యం చెలాయించారు. వాటి మూలాలను మాత్రం చెరిపివేశారు. దేవదాసీల ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టి, నృత్యాన్ని మాత్రం ’క్లాసికల్’ నిబంధనలలో ఉంచారు. కళ‘డబ్బు కోసం కాదు, మోక్షం కోసం జీవిస్తుంది. నాట్యం నాట్యశాస్త్రం నుండి రాదు, హృదయం లోని భాధ నుండి ఉత్పన్నం అవుతుంది’ అంటారు యశోదా ఠాకూర్. ఇదీ చదవండి: రంభా ప్యాలెస్ గురించి తెలిస్తే.. ఇప్పుడే టికెట్ బుక్ చేసుకుంటారు! -
చెదురుతున్న గుండెకు అండగా...!
గుండె తన పూర్తి సామర్థ్యాన్ని కనబరచకుండా అది విఫలమయ్యే కండిషన్‌ను ‘హార్ట్ ఫెయిల్యూర్’గా చెబుతారు. హార్ట్ ఫెయిల్యూర్‌తో బాధపడేవారు... తాము కొద్దిగా నడవగానే వారికి ఊపిరి సరిగా అందకపోవడం, తీవ్రంగా ఆయాసం రావడం వంటి సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతారు. హార్ట్‌ఫెయిల్యూర్ బాధితులు ఈ కింద సూచించిన జీవనశైలి మార్పులు చేసుకోవడం చాలా మంచిది. ద్రవాహారానికి దూరంగా ఉండటం: హార్ట్ ఫెయిల్యూర్ బాధితుల్లో ఒంట్లోకి నీరు చేరుతుంటే వాళ్లు ద్రవాహారం తీసుకోవడం తగ్గించాలి. ఒంట్లోకి నీరు చేరనివాళ్లు మాత్రం రోజు లీటరున్నర వరకు ద్రవాహారాలు తీసుకోవచ్చు. ఉప్పు బాగా తగ్గించడం : ఒంట్లో నీరు చేరడం, ఆయాస పడటం, ఊపిరి అందక΄ోవడం వంటి లక్షణాలు కనబడితే ఉప్పు వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి. రోజుకు 2.5 గ్రాములు (అరచెంచా) కంటే తక్కువే తీసుకోవాలి. వీళ్లు తినే వంటల్లో ఉప్పు వేయకపోవడం మేలు. పచ్చళ్లు, బేకరీ ఐటమ్స్, బయటి చిరుతిండ్లను పూర్తిగా మానేయాలి. డ్రైఫ్రూట్స్, పండ్లు, పాలు : బాదాం, జీడిపప్పు, ఆక్రోటు వంట్ నట్స్, పాలు, పండ్ల వంటివి తీసుకోవచ్చు. వీటిల్లో ఆరోగ్యానికి చేటు చేసే లవణాలు తక్కువ. విశ్రాంతి : హార్ట్ ఫెయిల్యూర్‌తో బాధపడేవారు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని చాలామందిలో ఓ అపోహ. అయితే ఇది సరికాదు. వైఫల్యం తీవ్రంగా ఉంటే తప్ప... శరీరం సహకరించినంత మేరకు, ఆయాసం రానంత వరకు శరీరాన్ని మరీ కష్టపెట్టకుండా శ్రమ చేయవచ్చు. తేలికపాటి నడక, మెట్లు ఎక్కడం వంటి వ్యాయామాలూ చేయవచ్చు. మానసికంగా ప్రశాంతంగా ఉండటం: హార్ట్ ఫెయిల్యూర్‌తో బాధపడేవారు తమ సమస్య కారణంగా చాలా మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశాలెక్కువ. ఒక్కోసారి తీవ్రమైన భావోద్వేగాలకూ లోనుకావచ్చు. వారు ఒత్తిళ్లకు దూరంగా ఉంటూ మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఇందుకు యోగా, ధ్యానం వంటివి చేయడం మంచిది. ఈ మందులు వద్దు : హార్ట్ఫెయిల్యూర్తో బాధపడేవారు కొన్ని మందులకు... ముఖ్యంగా నొప్పి నివారణ కోసం వాడే... ఇబూప్రొఫేన్, డైక్లోఫెనాక్ వంటి ఎన్ఎస్ఏఐడీ రకం మందులకు దూరంగా ఉండాలి. స్టెరాయిడ్స్ కూడా వాడకూడదు. ఇవి ఒంట్లోకి నీరు చేరేందుకు దోహదం చేస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి.నాటు మందుల్లో ఏ పదార్థాలు ఉంటాయో, అవి గుండె మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలియదు. కాబట్టి వాటికి దూరంగా ఉండటం మేలు. ఇంకా చెప్పాలంటే కార్డియాలజిస్ట్‌కు చెప్పకుండా ఎలాంటి మందులూ వాడకపోడమే మంచిది. ఇక నొప్పులు మరీ భరించలేనంతగా ఉన్నప్పుడు అవి తగ్గేందుకు డాక్టర్‌ను ఒకసారి సంప్రదించి పారాసిటమాల్ వంటి సురక్షిత మందుల్ని వాడుకోవచ్చు. ∙వైద్యపరమైన జాగ్రత్తలు బాధితులు తమ గుండె వైఫల్యానికి వాడుతున్న మందులతోనూ అప్పుడప్పుడు కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తే అవకాశముంది. అందుకే ఎప్పటికప్పుడు డాక్టర్ ఫాలో అప్‌లో ఉంటూ, అవసరాన్ని బట్టి వాటి మోతాదుల్లో మార్పులు చేసుకోవడం లేదా మందులను మార్చడం వంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అందుకే తరచూ గుండెవైద్య నిపుణులను సంప్రదిస్తూ, వారు చెప్పే సూచనలు, జాగ్రత్తలు అనుసరించాలి. (చదవండి: మై లిటిల్ మార్ఫీ..! చిన్నారులు హాయిగా నిద్రపోయేలా..!) -
ఒత్తయిన జుట్టు.. ఒత్తిడితో ఫట్టు
కాఫీ నుంచి కాలుష్యం దాకా.. కాదేదీ కాటుకు అనర్హంకొన్ని ప్రాంతాల్లో దొరికే నీళ్లు సైతం కారణమేఅవగాహన పెంచుకొని అలవాట్లు మార్చుకోవాలి జుట్టు రక్షణకు పలు సూచనలు చేస్తున్న వైద్యులుఆధునిక సాంకేతిక మార్పులతో పాటు నగరవాసుల జీవనశైలి మార్పులు కూడా హెయిర్‌కి టెర్రర్‌గా మారుతున్నాయి. బిజీ లైఫ్‌లో పట్టించుకోని, మార్చుకోలేని అలవాట్లు సిటిజనుల కేశ సంపదను కొల్లగొడుతున్నాయి. సమయానికి తినడం తప్ప సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం తగ్గిపోతోంది. జంక్ ఫుడ్ వినియోగంతో కేశాల ఆరోగ్యానికి అత్యవసరమైన ఐరన్, జింక్, బయోటిన్ అందడం లేదు. కాబట్టి ఆహారంలో తప్పనిసరిగా గుడ్లు, చేపలు, పాలకూర వంటి ఆకుకూరలు, గింజలు, లీన్ ప్రోటీన్లు ఉండేలా చూసుకోవాలి. మంచినీళ్లు 2 నుంచి 3 లీటర్లు తాగాలి. ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ లభించే డ్రైఫ్రూట్స్, నట్స్ తీసుకోవాలి. స్టైలింగ్.. కిల్లింగ్.. జుట్టు పొడిబారడానికి హెయిర్ డ్రైయర్లు, స్ట్రెయిట్‌నెర్‌లు ఉపయోగించడం వల్ల జుట్టు విరిగిపోతోంది. పోనీటెయిల్స్ లేదా బ్రెయిడ్స్ వంటి బిగుతు హెయిర్ స్టైల్స్‌తో ట్రాక్షన్ అలోపేసియా అనే పరిస్థితికి గురై జుట్టు రాలిపోతుంది. కాబట్టి హీట్–ఫ్రీ స్టైలింగ్ పద్ధతులను, స్టైలింగ్ చేసేటప్పుడు హీట్ ప్రొటెక్షన్ ఉత్పత్తులను ఉపయోగించాలి. జుట్టు షాఫ్ట్లపై ఒత్తిడి తగ్గించడానికి వదులుగా ఉండే కేశాలంకరణను ఎంచుకోవాలి. ఫ్యాషన్ కోసం పెరమ్స్, రిలాక్సర్ల మితిమీరిన రంగుల వినియోగం, రసాయన చికిత్సలతో జుట్టు నిర్మాణం బలహీనపడుతోంది. అలవాట్లు.. జుట్టుకు పోట్లు.. నగర యువతలో పెరిగిన ధూమపానం, ఆల్కహాల్ వినియోగం రెండూ కేశాలకు నష్టం కలుగజేస్తున్నాయి. ఈ అలవాట్లతో రక్తనాళాలు కుంచించుకుపోవడం వల్ల చక్కని హెయిర్ కోసం ఖచి్చతంగా ధూమపానం మానేయడంతో పాటు మద్యపానాన్ని బాగా తగ్గించడం అవసరం. ఉపరితలం.. ఇలా క్షేమం.. తల ఉపరితలం(స్కాల్ప్) తరచుగా నగరవాసులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇది జుట్టుకు హాని చేస్తోంది కాబట్టి స్కాల్ప్‌ను శుభ్రంగా తేమగా ఉంచుకోవడం అవసరం. అవసరాన్ని బట్టి హెయిర్ ఫోలికల్స్‌ను పోషించడానికి ఉత్తేజపరిచేందుకు అందుబాటులో ఉన్న ఉత్పత్తులను ఉపయోగించవచ్చు. కదలికతో కేశాలకు మేలెంతో.. కూర్చుని పనిచేయడం, ఎక్కడకు వెళ్లాలన్నా వాహనాల వినియోగం.. ఇలా కదలికలు తగ్గిపోతున్న నగరవాసుల నిశ్చల జీవనశైలి రక్తప్రసరణ లోపానికి దారి తీస్తోంది. తలపై భాగానికి రక్త ప్రసరణ లేకపోవడం కేశాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోంది. రక్త ప్రసరణను మెరుగుపరచడానికి శారీరక శ్రమ అవసరం. నీళ్లూ.. నష్టమే.. సిటీలో కొన్ని ప్రాంతాల్లో సాల్ట్స్ ఎక్కువగా ఉండే హార్డ్ వాటర్‌తో స్నానం చేస్తున్నారు. దీంతో తలలో ఉండే సహజమైన నూనెలు ఆవిరై తల ఉపరితలం పొడిబారి కేశాలు దెబ్బతింటాయి.నిద్రలేమీ.. ఓ సమస్యే..దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల విషయంలో నిర్లక్ష్యం హెయిర్‌పై దు్రష్పభావం చూపిస్తోంది. గుర్తించిన థైరాయిడ్ వంటి వ్యాధులు లేదా గుర్తించలేని హార్మోన్ల అసమతుల్యత వంటివి.. జుట్టుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఆరోగ్య సమస్యలను గుర్తించడం తగిన చికిత్స పొందడం అవసరం. అలాగే నిద్రలేమి సిటీలో సర్వసాధారణమైపోయింది. ఇది జుట్టు పెరుగుదల వంటి శరీరపు సహజ ప్రక్రియలను నిరోధిస్తోంది. ప్రతి రాత్రి 7–9 గంటల నాణ్యమైన నిద్ర తప్పనిసరి. వ్యాధులుంటే.. నష్టమే.. థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక రుగ్మతలు మాత్రమే కాకుండా హార్మోన్ల అసమతుల్యత వంటివి కేశాలకు హాని చేస్తాయి. కాబట్టి అంతర్లీన ఆరోగ్య సమస్యలను గుర్తించి, ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించాలి. లక్ష్యసాధన కోసం పరుగుతో దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి జుట్టు ఆరోగ్యంపై పడుతోంది. ఒత్తిడికి విరుగుడుగా ధ్యానం, యోగా బ్రీతింగ్ వ్యాయామాలు చేయాలి. కారణాలెన్నో.. జాగ్రత్తలు తప్పనిసరి.. మన జుట్టులో 80శాతం ఎదిగే దశలో ఉంటే 12 నుంచి 13శాతం విశ్రాంతి దశ, మరో 7 నుంచి 8శాతం మృత దశలో ఉంటుంది. అనారోగ్యపు అలవాట్ల వల్ల గ్రోత్ దశలో ఉండాల్సిన 80శాతం 50 శాతానికి అంతకంటే తక్కువకు పడిపోయి డీలోజన్ ఫేజ్ అనే దశకు చేరి హెయిర్ ఫాల్ జరుగుతుంది. రోజుకు 60 నుంచి అత్యధికంగా 100దాకా వెంట్రుకలు ఊడటం సాధారణం కాగా.. ఈ సంఖ్య 200కి చేరితే తీవ్రమైన హెయిర్ఫాల్గా గుర్తిస్తాం. నివారణ కోసం సల్ఫేట్ ఫ్రీ షాంపూల వాడకం, వారానికి ఒక్కసారైనా హెయిర్ కండిషనర్ గానీ హెయిర్ మాస్క్ గానీ వాడటం అవసరం. అలాగే కాలుష్యం బారిన పడకుండా అవుట్డోర్ వెళ్లినప్పుడు మహిళలు చున్నీ, స్కార్ఫ్ మగవాళ్లైతే హెల్మెట్ వంటివి తప్పనిసరి. జాగ్రత్తలు తీసుకున్నా కేశాల ఆరోగ్యం సరిగా లేదంటే తప్పనిసరిగా వైద్యుల్ని సంప్రదించాలి. :::డా.జాన్వాట్స్, డెర్మటాలజిస్ట్, సీనియర్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ -
స్పాండిలోసిస్ అంటే..?
స్పాండిలోసిస్ అనేది వెన్నెముకకు సంబంధించిన సమస్య. వాస్తవానికి ఇది ఒక రకమైన ఆర్థరైటిస్ (అంటే ఎముకల అరుగుదల వల్ల వచ్చే రుగ్మత) అని చెప్పవచ్చు. ఈ సమస్య మెడ భాగంలో వస్తే దాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అని, నడుము భాగంలో వస్తే లంబార్ స్పాండిలోసిస్ అంటారు. స్పాండిలోసిస్‌కు కారణాలు: వెన్నులో కూడా అనేక జాయింట్స్ ఉంటాయి. అవి అరిగాక ఒక ఎముక మరో ఎముకతో రాసుకుపోయే సమయంలో వాటి మధ్యన ఉండే నరాలు నలిగిపోయి నొప్పి రావచ్చు. స్పైన్ దెబ్బతిని కూడా నొప్పి రావచ్చు. సర్వైకల్ స్పాండిలోసిస్‌లో మెడనొప్పితోపాటు తలనొప్పి తల అటు–ఇటు తిప్పడం కష్టమవుతుంది. మెడ బిగుసుకుపోయినట్టుగా ఉంటుంది. నొప్పి మెడ నుంచి భుజాలు, చేతుల వరకు పాకుతున్నట్టుగా వస్తుంది లంబార్ స్పాండిలోసిస్‌లో నడుమునొప్పి, కొన్నిసార్లు నడుము నొప్పితోపాటు మెడ నొప్పి కూడా ఉంటుంది. నొప్పి నడుము నుంచి ఒకవైపు కాలు, పాదం వరకు వ్యాపిస్తుంది. దీనినే సయాటికా నొప్పిగా చెబుతారు. ఈ సమస్య నివారణ కోసం ఫిజియోథెరపిస్టులను సంప్రదించి వెన్నెముకకు సంబంధించిన వ్యాయామాలు చేయాలి. అలాగే మంచి పోషకాహారం తీసుకోవడం, క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం వంటి ఆహారపరమైన జాగ్రత్తలు పాటించాలి. కూర్చోవడం లేదా నిల్చోవడంలో సరైన భంగిమలు (పోష్పర్స్) ΄పాటించాలి. డాక్టర్లను సంప్రదించి అవసరాన్ని బట్టి కొన్ని మందులు వాడాల్సి ఉంటుంది.(చదవండి: ఒంటికి మంచిదే..మరి పంటికి?) -
ఊరకరారు మహాత్ములు...
గృహస్థాశ్రమంలో నిత్యం జరిగే పంచ మహా యజ్ఞాలలో ఐదవది – ‘....నృయజ్ఞోతిథిపూజనమ్’. అతిథిని పూజించేవాడు ఒక్క గృహస్థు మాత్రమే. నేను ఆహ్వానిస్తే నా ఇంటికి వచ్చినవాడు అతిథి. నేను ఆహ్వానించకుండా వచ్చినవాడు– అభ్యాగతుడు. అతిథి పూజనమ్...పూజించడం అంటే గౌరవించడం. ఇంటికి వచ్చినవారిపట్ల మర్యాదగా మెలుగుతూ గౌరవించి పంపడం నేర్చుకో... తన ఇంటికి వచ్చినవాడు గొప్పవాడా, నిరక్షరాస్యుడా, సామాన్యుడా అన్న వివక్ష గృహస్థుకు ఉండదు. భోజనం వేళకు వచ్చాడు. భోజనం పెట్టు. లేదా ఏ పండో కాయో లేదా కాసిని మంచినీళ్లయినా ఇవ్వు.. అన్ని వేళలా అన్ని పెట్టాలనేం లేదు. వచ్చిన వారిని ప్రేమగా పలకరించు. నీకూ పరిమితులు ఉండవచ్చు. వాటికి లోబడే ఎంత సమయాన్ని కేటాయించగలవో అంతే కేటాయించు. కానీ ఒట్టి చేతులతో పంపకు. పండో ఫలమో ఇవ్వు. లేదా కనీసం గుక్కెడు చల్లటి నీళ్ళయినా ఇవ్వు. నీకు సమయం లేక΄ోతే ఆ బాధ్యతలను కుటుంబ సభ్యులకు అప్పగించు. అతిథి సేవతో గృహస్థు పాపాలు దహించుకు ΄ోతున్నాయి. కారణం – ఆయన ఏది పెడుతున్నాడో దానిని ‘నేను పెడుతున్నాను’ అన్న భావనతో పెట్టడు. వచ్చిన అతిథి నీ దగ్గరకు వచ్చి గుక్కెడు నీళ్ళు తాగాడు, ఫలహారం చేసాడు, భోజనం చేసాడు...అంటే అవి అతనికి లేక దొరకక రాలేదు నీదగ్గరికి. ఆయన హాయిగా అవన్నీ అనుభవిస్తున్న స్తోమత ఉన్నవాడే. కానీ ఆయన ఏదో కార్యం మీద వచ్చాడు. భగవంతుడు శంఖ చక్ర గదా పద్మాలు పట్టుకుని రాడు నీ ఇంటికి. అతిథి రూపంలో వస్తాడు. ఆ సమయంలో నీవిచ్చిన నీళ్ళు తాగవచ్చు, పట్టెడన్నం తినవచ్చు, బట్టలు కూడా పుచ్చుకోవచ్చు. కానీ ఆయన పుచ్చుకున్న వాడిగా ఉంటాడు. అలా ఉండి నీ ఉద్ధరణకు కారణమవుతాడు. అందునా నీవు పిలవకుండానే వచ్చాడు. అభ్యాగతీ స్వయం విష్ణుః– విష్ణుమూర్తే నీ ఇంటికి వచ్చాడని గుర్తించు. మహితాత్ములైనవారు, భాగవతోత్తములు, భగవద్భక్తి కలవారు నీ ఇంటికి వస్తే.. గృహదేవతలు కూడా సంతోషిస్తారు.అంటే దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి సులువైన మార్గం అతిథి పూజనమే. అతిథికి నీవు పెట్టలేదు. భగవంతుడే అతిథి రూపంలోవచ్చి నీదగ్గర తీసుకున్నాడు. అతిథిని మీరు విష్ణు స్వరూపంగా భావించి పెట్టినప్పుడు మీ అభ్యున్నతికి కారణమవుతుంది. మహాత్ములయినవారు మనింటికి వస్తూండడమే దానికి సంకేతం. శ్రీ కృష్ణుడి క్షేమ సమాచారం తెలుసుకురమ్మని వసుదేవుడు పంపిన పురోహితుడితో నందుడు ‘‘ఊరకరారు మహాత్ములు/ వారథముల యిండ్ల కడకు వచ్చుట లెల్లం/గారణము మంగళములకు/ నీ రాక శుభంబు మాకు, నిజము మహాత్మా !’’ అంటాడు. అతిథి ఇంట అడుగు పెట్టడం అంత గొప్పగా భావిస్తుంది మన సమాజం.రామకార్యంమీద పోతున్న హనుమకు మైనాకుడు ఆతిథ్యం స్వీకరించమని అర్ధిస్తాడు. ఇప్పుడు వీలుపడదంటే...కనీసం ఒక్క పండయినా తిని కాసేపు విశ్రాంతయినా తీసుకువెళ్ళమంటాడు. ఇంటి ముందు నిలిచిన బ్రహ్మచారి ‘భవతీ భిక్షాందేహి’ అంటే... ఇంట్లో ఏవీ లేవంటూ ఇల్లంతా వెతికి ఒక ఎండి΄ోయిన ఉసిరికాయ తెచ్చి శంకరుడి భిక్షా΄ాత్రలో వేస్తుంది ఒక పేదరాలు. ఆ మాత్రం అతిథి పూజకే ఆమె ఇంట బంగారు ఉసిరికకాయలు వర్షంలా కురిసాయి. -
కోహ్లి-అనుష్క తాగే నీరు ఎక్కడ నుంచి దిగుమతి అవుతుందో తెలుసా..!
విరాట్ కోహ్లి-అనుష్క జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందమైన సెలబ్రిటీ జంటగా పేరుగాంచిన ఈ ఇద్దరు ఏ వేడుకకైన జంటగానే హాజరవ్వుతారు. ఫ్యాషన్ పరంగా కూడా ఇద్దరూ స్టైలిష్ ఐకాన్లుగా ట్రెండ్‌కి తగ్గట్టు ఉంటారు. అలాగే ఇద్దరు కూడా ఫిట్నెస్ విషయంలో చాలా కేర్‌గా ఉంటారు. వ్యాయామ సెషన్ నుంచి నిద్ర వరకు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడంలో ఈ జంట చాలా ప్రత్యేకం. మాములుగా ఏజ్‌ని బట్టి, పరిస్థితుల రీత్యా డైట్‌ని మారుస్తు కాస్త హెల్తీగా మార్పులు చేసకోవడం సహజం. కానీ వీళ్లు ఏకంగా తాగే నీళ్ల విషయంలో కూడా మార్పులు చేశారు. అదికూడా వేరే దేశం నుంచి దిగుమతి చేసుకున్న నీళ్లను తాగుతారట. వీళ్లు ఎవియన్ అనే సరస్సు నుంచి వచ్చే నేచురల్ స్ప్రింగ్ వాటర్ (భూమి నుంచి సహజసిద్ధంగా వచ్చేది) తాగుతారట. అంతేగాదు నివేదికల ప్రకారం ఎవియన్-లెస్-బెయిన్స్ సరస్సులోని నీరు ఎటువంటి రసాయనాలతో కలుషితం కాలేదని వెల్లడయ్యింది. ముఖ్యంగా ఈ వాటర్ ఫ్రాన్స్ నుంచి దిగుమతి అవుతుందట. ఎవియన్-లెస్-బెయిన్స్ జెనీవా సరస్సు దక్షిణ భాగంలో ఉంటుంది. ఇది పశ్చిమ ఐరోపాలోని అతి పెద్ద సరస్సులలో ఒకటి. దీన్ని స్విట్జర్లాండ్, ఫ్రాన్స్‌లు పంచుకుంటున్నాయి. అంతేగాదు ఒక లీటరు ఎవియన్ బాటిల్ ధర దాదాపు రూ. 600ల దాక ఉంటుంది. అంటే ప్రతిరోజు రెండు లీటర్ల నీటిని తీసుకుంటే రూ. 1200 ఖర్చు అవుతుంది. ప్రస్తుతం అమెజాన్ ఇండియాలో ఒక లీటర్ ఎవియాన్ బాటిళ్లు డజను వచ్చేటప్పటికీ ఏకంగా రూ. 4200/ పలుకుతుంది.(చదవండి: వర్కౌట్ సెషన్లో రకుల్‌కి వెన్ను గాయం..అలా జరగకూడదంటే..!) -
ఈ జంట 150 ఏళ్లు జీవించాలని ఏం చేస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఇటీవల కాలంలో సుదీర్ఘకాలం జీవించాలనే ధోరణి ఎక్కువయ్యింది. కొందరూ సాధారణ వయసు కంటే తక్కువ వయసు వారిలా యవ్వనంగా ఉండాలని చూస్తున్నారు. కొందరూ యవ్వనంగా ఉండటం తోపాటు ఆరోగ్యంగా ఉండాలని భావిస్తున్నారు. అందుకోసం కఠినమైన జీవనశైలిని పాటిస్తున్నారు. వారి జీవసంబంధ వయసు ఎవ్వరూ ఊహించనంత తక్కువగా ఉండేలా ముమ్మరమైన ప్రయత్నాలు చేస్తున్నారు. అదే బాటలో పయనిస్తోంది యూఎస్‌కి చెందిన ఓ జంట. ఇటీవలే కొత్తగా పెళ్లి చేసుకున్న ఈ జంట ఏకంగా 150 ఏళ్లు పాటు జీవించాలనే సంకల్పంతో ఏం చేస్తున్నారో వింటే నోరెళ్లబెడతారు. అమెరికాలోని మిడ్వెస్ట్కు చెందిన 33 ఏళ్ల కైలా బర్న్స్ లెంట్జ్, ఆమె భర్త వారెన్ లెంట్జ్(36) వందేళ్లకు మించి జీవించి చూపాలనుకుంటున్నారు. అందుకోసమని ఈ ఇరువురు బయోహాకింగ్ రొటీన్‌ను స్వీకరించారు. ఇక్కడ బయోహాకింగ్ అంటే..సైబర్నెటిక్ పరికరాలు లేదా బయోకెమికల్స్‌ను వంటి సాంకేతిక మార్గాల ద్వారా శరీరం విధులను మెరుగుపరచడం లేదా మార్చడాన్ని బయోహాకింగ్ అని అంటారు. ఇక్కడ ఈ బయోహ్యికింగ్ను అనుసరిస్తున్న జంటలో కైలా క్లీవ్‌ల్యాండ్‌లోని దీర్ఘాయువు క్లినిక్ ఎల్వైవీ ది వెల్నెస్ స్పేస్ సహ యజమాని కాగా, ఆమె భర్త వారెన్ మార్కెటింగ్ ఏజెన్సీలో చీఫ్ రెవెన్యూ ఆఫీసర్. వీరిద్దరు ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకునేలా మంచి జీవనశైలిని అనుసరిస్తున్నారు.ఎలాంటి జీవన విధానం అంటే.. వారి రోజు దినచర్య ఆప్టిమైజింగ్ పద్ధుతులతో నిండి ఉంటుంది. ఆ జంట ప్రతి ఉదయం పల్సెడ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ థెరపీతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వర్కౌట్లు, ఉదయపు సూర్యకాంతిని ఆస్వాదిస్తూ సాగే వాకింగ్ తదితరాలు ఉంటారు. ఆ తర్వాత క్లినిక్ గ్రేడ్ పరికరాలతో ఆరోగ్య మెరుగదలను పరీక్షించడం తదరితరాలన్నింటిని ఓ పద్ధతిలో అనుసరిస్తారు. చెప్పాలంటే అత్యంత మెరుగైన ఆర్యోగ్యకరమైన జీవిన విధానాన్ని అవలంభిస్తోంది ఈ జంట. దీంతోపాటు సెల్ రిపేర్‌కు సంబంధించి..రోజంతా హైపర్బారిక్ ఆక్సిజన్ ఛాంబర్, నానోవి వంటి ఆరోగ్య సాంకేతికతను ఉపయోగిసస్తారు. అలాగే సాయంత్రం పూర్తి విశ్రాంతికి కేటాయిస్తారు. సేంద్రీయ భోజనమే తీసుకుంటారు. సూర్యాస్తమయ సమయానికల్లా ఆవిరి సెషన్లో పాల్గొంటారు. అలాగే అందుకు తగ్గట్లు ఇంటి వాతావరణాన్నికూడా సెట్ చేస్తారు. ఇంట్లో రెడ్‌లైట్లు వంటి సహజ సిర్కాడియన్ రిథమ్లతో ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తారు. రాత్రి తొమ్మిందింటి కల్లా నిద్రపోవడం వంటి మంచి నియమాలను పాటిస్తున్నారు. అంతేగాదు పిల్లలను కనాలనే ఆశతో కొన్నేళ్లుగా శరీరాన్ని ఆప్టిమైజ్(సాంకేతికతో పరిశీలించడం) చేస్తున్నట్లు తెలిపారు. పేరెంటింగ్ అనుభూతిని ఎంజాయ్ చేయాలనే ఉద్దేశ్యంతో ఇరువురి ఆరోగ్యం మెరుగ్గా ఉండేలా కేర్ తీసుకుంటున్నారు. అంతేగాదు వారి జీవనశైలికి అనుగుణంగా పిల్లలను పెంచేలా ప్లాన్ చేసుకుంటున్నారు కూడా. ఈ జంట స్క్రీన్ సమయాన్ని తగ్గించి ఆరుబయట గడపడం, ప్రకృతితో సేద తీరడం వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. సాధ్యమేనా..?వృద్ధాప్యాన్ని నెమ్మదించేలా లేదా రివర్స్ చేసేలా మంచి ఆరోగ్యకరమైన బయోహ్యాకింగ్ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఇంతకముందు ఇలాంటి వాటికి సంబంధించి..వెంచర్ క్యాపిటలిస్ట్ బ్రయాన్ జాన్సన్ వార్తల్లో నిలవగా ఇప్పుడూ ఈ జంట హాట్‌టాపిక్‌గా మారింది. ప్రకృతి ధర్మంగా వచ్చే మార్పులను అంగీకరించాలే గానీ అందుకు విరుద్ధంగా బతికే ప్రయత్నం చేస్తే కొన్ని రకాల పరిణామాలను ఎదుర్కొనక తప్పదనేది కఠిన సత్యం. మరీ వీరంతా ఆ కఠిన సత్యాన్ని తిరగరాసేలా అనుకున్నది సాధించి చూపగలుగుతారా..? లేదా అనేది తెలియాల్సి ఉంది.(చదవండి: ఎత్తుకు తగ్గా బరువు ఉంటున్నారా..? -
భార్య నుంచి వ్యతిరేకత ఎదురైనా.. బాపూజీ తగ్గలేదు!
స్వతంత్ర సమరయోధుడు, మహాత్మా గాంధీ జీవన విధానం క్రమ శిక్షణతో కూడిన విధంగా ఉంటుంది. ఆయన స్వాతంత్ర్య ఉద్యమం కోసం పాటుపడే క్రమంలో ఆయన అనుసరించిన విధానాలే ఖండాతరాలకు విస్తరించి విలక్షణమైన వ్యక్తిగా వేన్నోళ్ల కీర్తించాయి. మనిషి గాలి, నీరు లేకుండా ఎలా అయితే జీవించలేడో అలాగే ఆహారం కూడా అంతే ముఖ్యమని తన 'కీ టు హెల్త్ పుస్తకంలో' చెప్పాki. ఇవాళ గాంధీ జయంతి(అక్టోబర్ 02) సందర్భంగా ఆయన జీవనశైలి ఎలా ఉండేది? ఎలాంటి ఆహారం ఇష్టపడే వారు తదితరాల గురించి సవివరంగా చూద్దాం..!. గాంధీ గుజరాత్‌కి చెందిన శాకాహార కుటుంబంలో జన్మించాడు. అయితే శాకాహారం పట్ల ఆయన నిబద్ధత గురించి వింటే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే..? న్యాయవాది విద్యార్థిగా ఇంగ్లాండ్‌లో ఉన్న సమయంలో శాకాహారం దొరక్క నానా ఇబ్బందులు పడ్డారు. అంతేగాదు శాకాహార రెస్టారెంట్ ఎక్కడ ఉంటుందో కనుక్కుని మరీ అక్కడే భోజనం చేశారు. అలాగే హెన్నీ స్టీఫెన్స్ రాసిన 'సాల్ట్ ఎ ఫ్లీ ఫర్ వెజిటేరియనిజం' పుస్తకం గాంధీని ఎంతగానో ప్రభావితం చేసింది. ఆయన ఉపవాసానికి ప్రాముఖ్యత ఇచ్చేవారు. అదే నిరసనలకు ఆయుధంగా దీన్ని ఉపయోగించే వారు. ఆ సమయంలో ఆయన దినచర్యలోని ఉపవాసం ఆయనకు ఎంతగానో ఉకరించేది. ఆయన కఠిన ఆహార నియమాలు అతిథులకు ఇబ్బంది కలిగిస్తోందని కాస్త మార్పులు చేర్పులు కూడా చేశారు. అహింసవాది అయిన గాంధీ శాకాహారానికి ఇవ్వడానిక ప్రాధాన్యత ఇవ్వడానికి మరో కారణం హింసకు వ్యతిరేకి కావడం కూడా అని చెబుతుంటారు కొందరూ. అలాగే సూర్యాస్తయానికి ముందు తన చివరి భోజనాన్ని ఐదింటితో పరిమితం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఉప్పు తక్కువగా ఉన్న ఆహారాన్ని ఇష్టపడేవారు. అలాగే పప్పులకు దూరంగా ఉండేవారు. బలహీనమైన రాజ్యంగ ఉన్నవారికి పప్పులు సరిపడవని విశ్వసిస్తూ వాటిని దూరంగా ఉంచేవారట. తన భార్య కస్తూర్బా నుంచి వ్యతిరేకత ఎదురైనా కూడా తన నియమాన్ని ఆయన కచ్చితంగా అనుసరించేవారట గాంధీ. మానవులు మాంసాహారులుగా పుట్టలేదని, ప్రకృతి ప్రసాదంగానే జీవించాలని ఆయన వాదించేవారట. మొదట్లో పాలను కూడా తాగేవారు కాదట. పాలు అంటే అంతగా ఇష్టం లేని గాంధీ మొదటి ప్రపంచ యుద్ధంలో అనారోగ్యం బారిన పడటంతో వైద్యుని సలహా మేరకు మేకపాలు తీసుకోవడం ప్రారంభించారట.ఆయన తన భోజనంలో బ్రౌన్రౌస్, వివిధ పప్పులు, స్థానిక కూరగాయాలు, మేకపాలు, బెల్లం తదితరాలను తీసుకునేవారు. తినడం అనేది శరీరాన్ని పోషించడం మాత్రమే కాదు, ఆత్మను పోషించడం అని చెప్పేవారట గాంధీ. సాత్వికమైన భోజనం తీసుకుని సక్రమమైన ఆలోచనలతో న్యాయం వైపు అడుగులు వేయమని కోరేవారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఏదీఏమైన గొప్ప వ్యక్తులు ఆలోచనలే కాదు వారి వ్యక్తిగత జీవన విధానం కూడా అందర్నీ ప్రభావితం చేసేలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది కదూ..!(చదవండి: 'ఖాదీ'.. గాంధీ చూపిన దారే! అది నేడు ఫ్యాషన్ ఐకానిక్ ఫ్యాబ్రిక్‌గా..!) -
నటి నీతూ కపూర్ ఆరుపదుల వయసులో కూడా యంగ్‌గా..ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
నటి నీతూ కపూర్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా, హీరోయిన్గా మెప్పించి ప్రేక్షకుల మన్నలను పొందిన బాలీవుడ్ సీనియర్ నటి. 70లలో ఆమె హావా మాములుగా ఉండేది కాదు. అయితే కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే రిషికపూర్‌ని వివాహ మాడి సినిమాలకు గుడ్ బై చెప్పింది. ప్రస్తుతం ఆమెకు 66 ఏళ్లు. అయినా ఈ ఏజ్‌లో కూడా యువ హీరోయిన్ల మాదిరి ఫిట్‌గా భలే కనిపిస్తుంది. ఇటీవల ఇంటర్వ్యూలో కూడా తన ఫిట్నెస్ రహస్యం గురించి బయటపెట్టింది. ప్రోబయోటిక్ రెసిపీ గేమ్ ఛేంజర్‌ని ఫాలో అవుతానని తెలిపింది. అసలేంటి గేమ్ ఛేంజర్ అంటే..!.నీతూ కపూర్ సీక్రెట్ ప్రోబయోటిక్ రెసిపీ 'కంజి రైస్'. ఇది దక్షిణ భారత వంటకం. చాలా పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాల గల వంటకం. ప్రేగులలో ఉండే గూఫ్ బ్యాక్టీరియా పరిమాణాన్ని పెంచి జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుందట. ఇది ఎలా చేస్తారంటే..ఓ మట్టి పాత్రలో వండి అన్నం, చెంచా నువ్వులు వండిన అన్నం నీళ్లు లేదా గంజి వేసి రాత్రంతా పులియనివ్వండి. దీన్ని ఉదయమే భోజనంగా తీసుకోండి. ఇందులో పచ్చడి లాంటిది వేసుకుని తింటే ఆ రుచే వేరు అంటుంది నీతూ. మన ఆంధ్రలో అనే 'గంజి అన్నమే' ఈ 'కంజి రైస్'. ఇది బెస్ట్ ప్రోబయోటిక్ ఆహారం. అందువల్లే తాను అనారోగ్యంగా లేదా కడుపునొప్పి వచ్చినప్పుడూ దీన్ని ఇష్టంగా తింటానని చెప్పుకొచ్చింది నీతూ. ప్రయోజనాలు..తేలికగా జీర్ణమవుతుంది. కడుపుని శాంతపరుస్తుంది. ఇందులో వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి హైడ్రేట్‌గా ఉంచడంలో ఉపకరిస్తుంది.అలాగే ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ నిర్వహించడంలో సహాయపడుతుంది. మంచి ఎనర్జీ బూస్ట్. రోజంతా స్థిరమైన తక్షణ శక్తిని ఇస్తుంది. ప్రోబయోటిక్ రిచ్ ఫుడ్స్..పెరుగు: అత్యంత ప్రసిద్ధ ప్రోబయోటిక్ ఆహారం. ఇది గట్ ఆరోగ్యాన్ని పెంపొందించే లాక్టోబాసిల్లస్, బిఫిడోబాక్టీరియం వంటి మంచి బ్యాక్టీరియా ఉంటుంది. సౌర్‌క్రాట్: పులియబెట్టిన క్యాబేజీతో తయారు చేయబడిన సౌర్‌క్రాట్ అనేది మరో ప్రోబయోటిక్ పవర్‌హౌస్. ఇందులో ఫైబర్, విటమిన్లు, లాక్టోబాసిల్లస్ వంటి ప్రయోజనకరమైన బ్యాక్టీరియా అధికంగా ఉంటుంది.కిమ్చి: కొరియన్ వంటకాలలో ప్రధానమైనది, కిమ్చి అనేది మసాలా పులియబెట్టిన కూరగాయల వంటకం. సాధారణంగా క్యాబేజీ, ముల్లంగితో తయారు చేస్తారు.(చదవండి: ముప్పైలో హృదయం పదిలంగా ఉండాలంటే..!) -
హెల్దీ డైట్.. క్యారమెల్ బార్స్!
మన ఆరోగ్యానికి కావలసిన ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్లు, ఇతర పోషకాలు లభించే ఈ క్యారమెల్ బార్స్‌ని ఎప్పుడైనా ట్రై చేశారా! ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ప్రయత్నించండి...కావలసినవి..కోకో పౌడర్ – అరకప్పు;మొక్కజొన్న పిండి– 1 1/4 కప్పు; చక్కెర పొడి– కప్పు;క్రీమ్– 4 టేబుల్ స్పూన్లు;వేరుశనగ పప్పు పలుకులు– పావు కప్పు;వాల్ నట్ పలుకులు – పావు కప్పు;క్యారమెల్ చిప్స్ – కప్పు;కండెన్స్డ్ మిల్క్ – ఒక టిన్ (14 ఓజెడ్);వెనిలా ఎసెన్స్ – 2 టీ స్పూన్లు;ఉప్పు – టీ స్పూన్;బటర్ – 3 టేబుల్ స్పూన్లు (ఉప్పు లేనిది)తయారీ..– ఒక పాత్రలో 2 టీ స్పూన్ల బటర్, చక్కెర వేసి బీటర్‌తో చిలకాలి. అందులో కోకో, మొక్కజొన్న పిండి కలిపి మళ్లీ చిలకాలి – ఒవెన్‌ను 350 డిగ్రీ ఫారన్‌హీట్‌లో వేడి చేయాలి. బేకింగ్ ట్రేలో మందపాటి పేపర్‌ను పరిచి అంచులకు సరిగ్గా సర్దాలి. – పైన సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని పోసి సమంగా సర్ది ఒవెన్‌లో పెట్టి 15 నిమిషాల సేపు బేక్ చేసి ట్రేని బయటకు తీయాలి. – పాత్రలో 2 టేబుల్ స్పూన్ల బటర్, కండెన్స్డ్ మిల్క్, వెనిల్లా ఎసెన్స్ వేసి కలపాలి.– బేకింగ్ ట్రేలో బేక్ అయిన కోకో మిశ్రమం మీద కండెన్స్డ్ మిల్క్ మిశ్రమాన్ని పోయాలి.– ఇప్పుడు ఆ ట్రేని మళ్లీ ఒవెన్‌లో పెట్టి పదినిమిషాల సేపు బేక్ చేయాలి.– ఇది వేడి తగ్గే లోపు వేరుశనగపప్పు పలుకులు, వాల్నట్ పలుకులను ఒక మోస్తరుగా వేయించి పక్కన పెట్టాలి.– క్యారమెల్ చిప్స్, క్రీమ్‌తో కలిపి కరిగించి అందులో ఉప్పు, వేయించిన గింజలను కలపాలి.– బేక్ చేసిన మిశ్రమం మీద క్యారమెల్, నట్స్ మిశ్రమాన్ని పై నుంచి పోసి చల్లారేలోపు స్లయిస్లుగా కట్ చేయాలి.– ఇవి గోరు వెచ్చగా తినవచ్చు, పూర్తిగా చల్లారిన తర్వాత కూడా తినవచ్చు.పోషకాలు: క్యాలరీలు – 285; ప్రోటీన్ – 4 గ్రాములు; కార్బొహైడ్రేట్లు – 40 గ్రాములు; చక్కెర – 28 గ్రాములు; ఫ్యాట్ – 14 గ్రాములు; సాచురేటెడ్ ఫ్యాట్ – 7 గ్రాములు; ఫైబర్ – 1.5 గ్రాములు; సోడియం – 180 మిల్లీగ్రాములు. – డాక్టర్ కరుణ, న్యూట్రిషనిస్ట్ అండ్ వెల్నెస్ కోచ్ఇవి చదవండి: తప్పును సరిదిద్దుకునే మార్గాలు..! -
Nagalakshmi: సైక్లింగ్ ఫిఫ్టీస్!
సాక్షి, సిటీబ్యూరో: ఓ వయసు దాటాక సాధారణంగా ఇంట్లో ఉండి.. మనవలు, మనవరాళ్లతో కాలక్షేపం చేస్తుంటారు.. లేదంటే పుణ్యక్షేత్రాలు చుట్టొస్తారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే తమలోని చిన్ననాటి అభిలాషను నెరవేర్చుకుంటారు. ఆ కోవకే చెందుతారు.. డాక్టర్ నాగలక్ష్మి. నిమ్స్ నేచురోపతి విభాగాధిపతిగా పనిచేసిన ఆమె.. 50 ఏళ్ల వయసులో సైక్లింగ్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. సాధారణంగా ఆ వయసులో కిలోమీటర్ దూరం నడిస్తేనే అలసిపోతుంటారు. కానీ డాక్టర్ నాగలక్ష్మి మాత్రం అలవోకగా కిలోమీటర్ల మేర సైకిల్‌పై ఎంచక్కా షికారు చేస్తూ, యూత్‌కు ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు.ఉదయం నాలుగు గంటలకే..సైక్లిల్ అనగానే ఉదయం నాలుగు గంటలకే మెలకువ వస్తుందని, ఆ వెంటనే రెడీ అయి సైక్లింగ్ చేస్తుంటామని పేర్కొన్నారు. ఆ తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల గ్రామాల్లో సైక్లింగ్ చేస్తామని వివరించారు. మంత్లీ చాలెంజ్లా పెట్టుకుని, 30 రోజులు 30 ప్రదేశాలు వెళ్లాలనే టార్గెట్ పెట్టుకుని మరీ సైక్లింగ్ చేశామని చెప్పారు.శారీరక, మానసిక ఆరోగ్యం..సైక్లింగ్‌తో ఎన్నో లాభాలు ఉంటాయని, శారీరకంగా ఎంతో ఆరోగ్యంగా, రోజంతా యాక్టివ్‌గా ఉంటామని నాగలక్ష్మి వివరించారు. అంతేకాకుండా హ్యాపీ హార్మోన్లు విడుదల అవుతాయని, దీంతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని పేర్కొన్నారు.సైకిల్ అంటే ఎమోషన్..చిన్నప్పటి నుంచి తనకు సైకిల్ అంటే ఒక భావోద్వేగమని డా.నాగలక్ష్మి చెబుతున్నారు. చిన్నతనంలో తన తండ్రిని అడిగితే సైకిల్ కొనివ్వలేదని, అప్పటినుంచి ఆ కోరిక అలానే ఉండేదని చెప్పారు. చివరకు తన భర్త, పిల్లలు 50వ పుట్టిన రోజున సైకిల్ కొనిచ్చారని, అప్పటి నుంచి సైక్లింగ్ అలవాటుగా మారిందని వివరించారు. ఒక్కరోజు తాను 7 కిలోమీటర్లు సైకిల్‌పై వెళ్లిన విషయాన్ని స్టేటస్ పెట్టుకోవడంతో తన స్నేహితులు ఆశ్యర్యపోయి.. ఆ తర్వాత చాలామంది తమ గ్యాంగ్‌లో కలిసిపోయి చాలా దూరం వెళ్తుండేవారని చెప్పారు. అనంతరం హ్యాపీ హైదరాబాద్ అనే సైక్లింగ్ గ్రూప్‌లో చేరామని వివరించారు. ఆ తర్వాత పైరేట్స్ ఆఫ్ హైదరాబాద్ పేరుతో 14 మంది స్నేహితులతో గ్రూప్ ఏర్పాటు చేశామని, అప్పటినుంచి కొత్త వారిని కలుస్తూ.. వారితో ఐడియాలు పంచుకుంటూ సైక్లింగ్ చేస్తూ సరదాగా గడుపుతుండేవారిమని పేర్కొన్నారు.ఇవి చదవండి: డాలస్‌లో ఘనంగా అక్కినేని శతజయంతి వేడుకలు..! -
స్మార్ట్‌ఫోన్ అధిక వాడకాన్ని.. 'స్మార్ట్'గా తప్పించుకుందాం!
మొబైల్ ఫోన్ల వాడకానికి– క్యాన్సర్‌కు మధ్య ఏమైనా సంబంధం ఉందా? ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచవ్యాప్తంగా 5వేలకు పైగా అధ్యయనాలను సమీక్షించింది. ఆస్ట్రేలియన్ రేడియేషన్ ప్రొటెక్షన్ అండ్ న్యూక్లియర్ సేఫ్టీ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఈ సమీక్ష జరిపింది. 1994 నుంచి 2022 సంవత్సరాల మధ్య ఉన్న అధ్యయనాలను తీసుకొని చేసిన సమీక్ష లో ఆసక్తికరమైన అంశాలెన్నో వెలుగులోకి వచ్చాయి.ప్రపంచంలో 70 శాతం మంది స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. మొబైల్ ఫోన్ల వాడకం వల్ల క్యాన్సర్ రాదు కానీ, అనేక నష్టాలు ఉన్నాయని స్పష్టం చేసింది. వాటిలో..– రీల్స్ విజృంభణ వల్ల ప్రతి 30 సెకన్లకు రీల్ చొప్పున మారుతూ ఫోన్‌ని అదేపనిగా చూస్తూనే ఉంటారు. దీంతో చూపు తగ్గుతోంది. – అర్ధరాత్రి దాటుతున్నా మొబైల్ నుంచి వెలువడే కాంతి వల్ల మన శరీరం నిద్రకు అవసరం అయ్యే హార్మోన్‌ను విడుదల చేయదు. దాంతో గాఢ నిద్ర పట్టక పనితీరు మందగిస్తుంది. రోగనిరోధక శక్తి తగ్గి, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. – మొబైల్ స్క్రీన్‌ను చూసే క్రమంలో కళ్లు ΄÷డిబారడం, చూపు మందగించడం, తలనొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇవన్నీ కంటిచూపుపై ప్రభావం చూపుతాయి. – అదేపనిగా స్క్రీన్ చూడటం వల్ల కళ్లు, మెడ కండరాలపై ఒత్తిడి పెరిగి, మానసిక ఆందోళన పెరుగుతుంది. – కొంతమంది టాయిలెట్‌కు వెళ్లినా, మంచం మీద పడుకున్నా ఫోన్ చూస్తూనే ఉంటారు. ప్రతి దానికీ మొబైల్‌పైనే ఆధారపడే వ్యసనాన్ని ‘నోమోఫోబియా’ అంటారు. అంటే, మొబైల్ లేకుండా ఉండలేకపోవడం. – అతిగా మొబైల్ వాడటం వల్ల పరధ్యానం వస్తుంది. చేస్తున్న పనిపై ఏకాగ్రత ఉండదు. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, ఇర్విన్ అధ్యయనం గడిచిన 20 ఏళ్లలో మానవుల సగటు ఏకాగ్రత 2.5 నిమిషాల నుండి 47 సెకన్లకు తగ్గిందని తేల్చింది. – ఎక్కువ స్క్రీన్ సమయం వల్ల పిల్లలలో భావోద్వేగాలు తగ్గిపోతున్నాయి. ఆరుబయట ఆటలు తగ్గిపోతున్నాయి. నిద్ర, ఆకలి మందగించడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. మానసిక, శారీరక ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతుంది.కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ సెల్ డేటా ప్రకారం కొన్నాళ్లుగా స్మార్ట్ ఫోన్ అమ్మకాలు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తతరం మళ్లీ బేసిక్ ఫోన్లను కొనడం ప్రారంభించిందనడానికి ఇదో ఉదాహరణ. మెదడును ఉపయోగించకుండా ఫోన్లపై ఆధారపడినట్లయితే మెదడు పనితీరు బలహీనంగా మారి, పరిణామంలో కూడా చిన్నదైపోతుందని చాలామంది శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ కంటే మన మెదడు చాలా వేగం, శక్తిమంతమైనది. అందుకే స్మార్ట్‌ఫోన్ అధిక వాడకాన్ని స్మార్ట్‌గా తప్పించేద్దాం.ఇవి చదవండి: Health: మీకు తెలుసా.. అతి తిండీ కూడా అడిక్షనే! -
Fashion: మై వార్డ్రోబ్: క్రియేటివ్‌గా.. హుందాగా..!
మైండ్, బాడీ ఫిట్‌గా ఉంటే డ్రెస్సింగ్ కూడా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తుంది. ‘జిమ్‌లో వర్కవుట్స్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అయితే, మన వార్డ్రోబ్ మైండ్ ఎక్సర్సైజ్’ అంటున్నారు హైదరాబాద్ వాసి ఫిట్నెస్ ట్రైనర్ అనుప్రసాద్. జిమ్వేర్తో పాటు రెగ్యులర్, పార్టీవేర్ విషయంలో తీసుకునే స్పెషల్ కేర్ గురించి అనుప్రసాద్ మాటల్లో...‘‘ఉదయం ఏ డ్రెస్ వేసుకోవాలనేది ప్రతిరోజూ ఆలోచించేలా చేస్తుంది. అందుకే, క్యాజువల్ వేర్‌గా కొన్ని, సందర్భానుసారంగా వార్డ్రోబ్ను సెట్ చేసుకుంటాను. సాధారణంగా తక్కువ డబ్బులతో డ్రెస్ ఎంపిక చేసుకొని, రిచ్‌గా ఉండేలా కనిపించడానికి ప్లాన్ చేస్తుంటాను. ఇండోవెస్ట్రన్ డ్రెస్‌తోనూ హుందాతనాన్ని, మన సంస్కృతిని ప్రతిబింబిస్తూ స్టైల్‌గా కనిపించవచ్చు. పెయింటింగ్స్ వేస్తుంటాను కాబట్టి కలర్ కాంబినేషన్స్ విషయంలో అవగాహన ఉంది. చాలా వరకు మ్యాచింగ్ గురించి ఆలోచన చేయను. శారీస్ మీదకు కాంట్రాస్ట్, క్రాప్‌టాప్స్, ష్రగ్స్ కూడా సెట్ చేస్తాను. కాటన్స్కి ఎక్కువ ్రపాధాన్యత ఇస్తాను. బెస్ట్ డ్రెస్డ్ అవార్డ్..మిసెస్ ఇండియా తెలంగాణ బెస్ట్ డ్రెస్డ్ ఈవెంట్ (2019)కి క్రియేటివ్‌గా ఆలోచించాలనుకున్నాను. శారీ, బ్లౌజ్‌కి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా బతుకమ్మ, బోనాలు.. మొదలైనవాటితో నేనే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేశాను. ఆ శారీనే కట్టుకున్నాను. రెండు వేల రూపాయల్లో ఆ శారీని తయారుచేసి, ప్రదర్శించి, అవార్డు దక్కించుకున్నాను.పూసలు గుచ్చి..లంగా ఓణీ, పట్టు చీరలు సంప్రదాయ వేడుకల సందర్భాలలో కట్టుకుంటాను. దీంట్లోనే ప్రత్యేకంగా కనిపించాలంటే బ్లౌజ్ సింగిల్ హ్యాండ్‌కి పూసల హారాలు లేయర్లు గుచ్చి, నాట్ చేస్తాను. దాదాపు నెలకు మూడు, నాలుగు ఈవెంట్లకు హాజరవుతుంటాను. అందుకు కొత్తదనం, నిండుదనం ఉండేలా ప్లాన్ చేసుకుంటాను.జిమ్ టీ షర్ట్స్..శారీస్‌కు సాధారణ బ్లౌజులే కాదు జిమ్‌కు వేసుకునే టీ షర్ట్స్ కూడా వాడతాను. బ్లాక్ క్రాప్‌టాప్ కాటన్ శారీకి వాడతాను. మంచి కలర్ కాంబినేషన్స్ ఉండేలా, సింపుల్ లుక్‌ని క్రియేట్ చేస్తాను. జిమ్‌లో మన కదలికలకు తగ్గినట్టు ఫ్లెక్సిబుల్ డ్రెస్ ఉండాలి. క్వాలిటీ కూడా చూడాలి. క్యాజువల్ వేర్‌గా జీన్స్, టీషర్ట్స్ మాత్రమే కాదు లాంగ్ స్కర్ట్స్ కూడా ఉపయోగిస్తాను.టై అండ్ డై చేస్తాను..వైట్ కాటన్ మెటీరియల్ తెప్పించుకొని, టై అండ్ డై టెక్నిక్‌తో కొత్త డిజైన్స్ సృష్టిస్తుంటాను. ఒక శారీకైతే వేరుశనగ గింజలను ముడివేసి, పెయింట్ చేశాను. త్రీడీ పెయింటింగ్స్ చేస్తుంటాను. ఏ వేస్ట్ మెటీరియల్ ఉన్నా దానిని అందంగా క్రియేట్ చేస్తాను. ఇండిపెండెంట్స్ డే వంటి అకేషన్స్‌కి ఎంచుకున్న శారీకి క్రాప్‌టాప్‌తో మ్యాచ్ చేశాను.జ్యువెలరీ తయారీ..తక్కువ ధరలో జ్యువెలరీ ఇప్పుడు మార్కెట్లో దొరుకుతుంది. కొంచెం సమయం కేటాయిస్తే చాలు అలాంటి ఫ్యాషన్ జ్యువెలరీని మనమే ఇంకా తక్కువ ధరలో తయారుచేసుకోవచ్చు. బెల్ట్‌తో మరో స్టైలిష్ లుక్ వచ్చేలా చూసుకుంటాను. అలా.. క్లే జ్యువెలరీ, థ్రెడ్ జ్యువెలరీ నేనే తయారు చేసుకుంటాను’’ అని వివరించారు ఈ ఫిట్నెస్ ట్రైనర్.ఇవి చదవండి: 'శ్రుతి' తప్పిన ప్రకృతి.. కనురెప్పనూ కాటేసింది! -
సుగుణ భూషణుడు... విభీషణుడు!
విభీషణుడు విశ్రవసు, కైకసిల సంతానమే విభీషణుడు, రావణాసురుని చిన్న తమ్ముడు. అందరికంటే పెద్దవాడు రావణాసురుడు, కుంభకర్ణుడు రెండవవాడు. విభీషనుడు వీరిద్దరికంటే పూర్తి భిన్నమైన వాడు. సంస్కారవంతుడు, ఉత్తమోత్తమగుణాలు కలవాడు. సోదరులంటే అభిమానం కలవాడు. అందులో రావణాసురుడు అంటే భయభక్తులున్నవాడు. సీతమ్మ వారిని రావణాసురుడు చెర పట్టినప్పుడు‘అన్నా నీకు ఇది తగదు’ అని మొదట హెచ్చరించింది విభీషణుడే. తదుపరి ఎన్నడూ రావణుని మందిరానికి వెళ్ళింది లేదు.హనుమ లంకాదహనం చేసినప్పుడు మరోసారి రావణునికి హితబోధ చేయాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు. రావణుడు, సీతమ్మ దగ్గరకు వెళ్ళి గడువు పెట్టి వస్తున్నప్పుడు, రావణుని ఏకాంతంగా కలసి చెప్పాలనుకుని భయంతో విరమించుకున్నాడు. ఈ దిశలో రామలక్ష్మణులు, వానర సైన్యంతో సముద్రాన్ని దాటి రావడం, రావణునితో సమర భేరి మోగించడం జరిగింది ఆ సమయంలో రాచకొలువులో కోపోద్రిక్తుడై యుద్ధంలో ఆ రోజు విధులను కొంతమంది రాక్షస వీరులను నియమించాడు. అప్పుడు కూడా విభీషనుడు, రావణునికి చెప్పలేకపోయాడు. అన్న అంటే అంత భయం అతనికి. యుద్ధంలో రాక్షస వీరులు మరణిస్తుంటే తట్టుకోలేక పోయాడు విభీషణుడు. అప్పుడే పూజ ముగించి దైర్యంతో నేరుగా రావణుని దగ్గరకు వెళ్ళాడు.. అప్పుడు రావణుడు ‘‘రా విభీషణా!రేపు యుద్ధంలో నీవే నాయకత్వం వహించాలి’’ అని చెబుతుండగా, విభీషణుడు చేతులు జోడించి ‘అగ్రజా! యుద్ధం మనకు వద్దు.సీతమ్మ పరమ సాధ్వి. ఆ రామలక్ష్మణులు దైవాంశ సంభూతులు... అందువల్ల... ’’ అంటుండగా రావణుని తీక్షణ చూపులు చూడలేక తల దించుకున్నాడు. మళ్ళీ ధైర్యంతో ‘ఒక్కసారి ఆలోచించు ఒక రాజుగా మీకు ఇది శ్రేయస్కరం కాదు. రాజు ప్రజల బాగోగులు చూడాలి. స్త్రీలకు రక్షణగా ఉండాలి. నా మాట విను, ఆ సీతమ్మ వారిని రాముల వారికి అప్పగించు. సమయం మించి పోలేదు. చేసిన తప్పు ఒప్పుకుని ఆ శ్రీరాముల వారిని శరణు వేడు. నీకు జయం కలుగుతుంది. శరణుజొచ్చిన వారిని అక్కున చేర్చుకునే మంచి గుణాలు అయనకు ఉన్నాయి, మీ మేలు కోరి ఈ లంక ప్రజల తరపున చివరిసారిగా చెబుతున్నాను. సీతమ్మ వారిని అప్పగించు, చేసిన తప్పు ఒప్పుకో! నిన్ను శ్రీ రాములు వారు కరుణిస్తారు’’ అని పరి పరి విధాలుగా చెప్పాడు.ఆ మాటలు విని రావణుడు ‘‘అయ్యిందా నీ ఉపన్యాసం? నాకే నీతులు చెబుతావా! ముల్లోకాలలోనూ నాకు ఎదురు లేదు అనే విషయం నీకు తెలియదా! ఆ రాముని వధించి, సీతను వివాహం చేసుకొనుటకే నేను నిశ్చయించుకున్నా, నీ హితబోధ నాకు కాదు. ఇదే నిన్ను శాసిస్తున్నాను. రేపు యుద్ధ భూమిలో నీవే ప్రధాన బాధ్యత వహించాలి ఇది నా ఆజ్ఞ’’ అని చర చర వెళ్ళిపోయాడు రావణుడు. విభీషణుడు అన్నీ ఆలోచించి శ్రీరాముల వారి దగ్గరకు ‘శరణు, శరణు’ అని వెళ్ళాడు.శ్రీ రాముడు అతన్ని చూశాడు. వినమ్రంగా, చేతులు జోడించి ఉన్న విభీషణుని చూడగానే ఆసనంపై నుంచి లేచి తన హృదయానికి హత్తుకున్నాడు.‘నా జన్మ ధన్యమైంది ప్రభూ’’ అంటూ శ్రీ రాముల వారి పాదాలు తాకి తన భక్తి, వినయం నిరూపించుకున్నాడు. ఆ విధంగా శ్రీరాముడితో విభీషణునికి స్నేహం కుదిరింది. రాముడికి యుద్ధంలో చేదోడుగా ఉన్నాడు. రావణుని మరణానంతరం లంకకు విభీషణుడు రాజైనాడు. ఇది శ్రీ రాముల వారు, విభీషణునికి ఇచ్చిన కానుక. లంకకు రాజైన విభీషణుడు సుపరిపాలన చేసి, ప్రజలకు ఉత్తమ పాలన అదించాడు. విభీషణుని చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. – కనుమ ఎల్లారెడ్డి, పౌరశాస్త్ర అధ్యాపకులు -
గృహస్థాశ్రమ వైశిష్ట్యం: అది... క్షీరసాగరమథనం!
మనిషి జీవితంలో సంస్కారానికి ఆలంబన గృహస్థాశ్రమంలోనే. దానిలోకి వెడితే భార్య వస్తుంది, పిల్లలు వస్తారు...అలా చెప్పలేదు శాస్త్రం. అక్కడ ఆటు ఉంటుంది, పోటు ఉంటుంది. దెబ్బలు తగిలినా, సుఖాలు వచ్చినా... అవన్నీ అనుభవంలోకి రావల్సిందే. వాటిలో నీవు తరించాల్సిందే. కుంతీ దేవి చరిత్రే చూడండి. ఎప్పుడో సూర్య భగవానుడిని పిలిచి నీవంటి కొడుకు కావాలంది. కర్ణుడిని కనింది. అయ్యో! కన్యా గర్భం.. అపఖ్యాతి ఎక్కడ వస్తుందో అని విడిచిపెట్టలేక విడిచిపుచ్చలేక... మాతృత్వాన్ని కప్పిపుచ్చి నీళ్ళల్లో వదిలేసింది. తరువాత బాధపడింది. కొన్నాళ్ళకు పాండురాజు భార్యయింది. సుఖంగా ఉన్నాననుకుంటున్న తరుణంలో సవతి మాద్రి వచ్చింది. పిల్లలు లేరంటే మంత్రంతో సంతానాన్ని ధర్మరాజు, భీముడు, అర్జునుడిని ΄÷ందింది. ఆ మంత్రం మాద్రికి కూడా చెప్పమన్నాడు పాండురాజు. చెప్పింది. మాద్రికి నకులుడు, సహదేవుడు పుట్టారు.శాపం వచ్చింది. పాండురాజు చచ్చిపోయాడు. మాద్రి సహగమనం చేసింది. ఈ పిల్లలు నీ పిల్లలేనని ఏం నమ్మకం? అని... పాండురాజు పిల్లలకు రాజ్యంలో భాగం ఇవ్వరేమోనని... ఇది ధార్మిక సంతానం అని చెప్పించడానికి మహర్షుల్ని వెంటబెట్టుకుని పిల్లల్ని తీసుకుని హస్తినాపురానికి వెళ్లింది. అంత కష్టపడి వెడితే లక్క ఇంట్లో పెట్టి కాల్చారు. పిల్లల్ని తీసుకెళ్ళి నదిలో పారేసారు, విషం పెట్టారు. .. అయినా చలించకుండా ఇన్ని కష్టాలు పడుతూ పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. ఆఖరికి ధర్మరాజు ఆడిన జూదంతో అన్నీ పోగొట్టుకుని అరణ్యవాసానికి వెళ్ళాల్సి వచ్చింది.అజ్ఞాతవాసం కూడా అయింది. తిరిగొచ్చారు. కురుక్షేత్రం జరిగింది. హమ్మయ్య గెలిచాం, పట్టాభిషేకం కూడా అయిందనుకున్నది. కంటికి కట్టుకున్న కట్టు కొంచెం జారి... కోపంతో ఉన్న గాంధారి చూపులు ప్రసరిస్తే ధర్మరాజుకు కాళ్ళు బొబ్బలెక్కిపోయాయి. అటువంటి గాంధారీ ధృతరాష్ట్రులు అరణ్యవాసానికి వెడుతుంటే... తన పిల్లలు గుర్తొచ్చి గాంధారి మళ్ళీ ఎక్కడ శపిస్తుందోనని, మీకు సేవ చేస్తానని చెప్పి... సుఖపడాల్సిన తరుణంలో వారి వెంట వెళ్ళిపోయింది. ఆమె పడిన కష్టాలు లోకంలో ఎవరు పడ్డారు కనుక !!!గంగ ప్రవహిస్తూ పోయి పోయి చివరకు సముద్రంలో కలిసినట్లు ఈ ఆట్లు, పోట్లు కష్టాలు, సుఖాలతో సంసార సాగరంలో చేరి తరించాలి. చివరలో తిలోదకాలు ఇచ్చేటప్పడు ఒక్కొక్కరి పేరు చెబుతున్నారు.. కొంత మంది పేరు చెప్పగానే ధృతరాష్ట్రుడు ‘నావాడు’ అంటున్నాడు... కొంత మందికి ధర్మరాజు ‘నావాడు’ అంటున్నాడు. కర్ణుడి పేరు చెప్పగానే ధృతరాష్ట్రుడు ‘నావాడు’ కాదన్నాడు. ధర్మరాజు కూడా ‘నావాడు’ కాదన్నాడు... తట్టుకోలేకపోయింది తల్లిగా. ‘‘వరంవల్ల పుట్టాడ్రా.. వాడు నీ అన్నరా, నీ సహోదరుడు... నా బిడ్డ...’’ అంది.మరి ధర్మరాజేమన్నాడు... తల్లిని శపించాడు..‘‘ఆడవారి నోట్లో నువ్వుగింజ నానకుండుగాక..’’ అని. దీనికోసమా ఇంత కష్టపడ్డది. అప్పుడొచ్చింది ఆమెకు వైరాగ్యం. కృష్ణభగవానుడిని స్తోత్రం చేసింది. గృహస్థాశ్రమం అంటే క్షీరసాగర మథనం. అక్కడ అమృతం పుట్టాలి. జీవితం అన్న తరువాత ఆటుపోటులుండాలి. రుషిరుణం, పితృరుణం, దేవరుణం... ఈ మూడు రుణాలు తీరాలన్నా, మనిషి తరించి పండాలన్నా గృహస్థాశ్రమంలోనే... అంతే తప్ప భార్యాబిడ్డలకోసం మాత్రమే కాదు.. కర్తవ్యదీక్షతో అన్నీ అనుభవంలోకి వచ్చిన నాడు ఈశ్వర కృప దానంతటదే వస్తుంది. – బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
అసిడిటీ ఆమడ దూరంలో ఉండాలంటే..!
అసిడిటీ నివారించాలంటే ఈ జాగ్రత్తలు బెటర్ బాగా మసాలాలతోనూ, కారంతో కూడిన ఆహారాలు అసిడిటీని ప్రేరేపిస్తాయి. అంతేకాదు టీ, కాఫీలు లెక్కకుమించి తాగుతున్నా కూడా అసిడిటీ రావచ్చు. ఇలా అసిడిటీని కలిగించే పదార్థాలకు దూరంగా ఉండటం, అలాగే దాన్ని నివారించే పదార్థాలను తీసుకోవడం మేలు. అలాంటి ఆహారాలేమిటో చూద్దాం.ఒకేసారి ఎక్కువగా తినేయడం సరికాదు. కొద్దికొద్దిమోతాదుల్లో ఎక్కువసార్లు తినాలి. రాత్రి ఆలస్యంగా భోజనం చేయకూడదు. నిద్రకు ఉపక్రమించడానికి 2–3 గంటల ముందే తినాలి.తీసుకోవాల్సినవి: స్ట్రాంగ్ కాఫీలుచాక్లెట్లు, కూల్‌డ్రిండ్, ఆల్కహాల్మసాలాలతో కూడిన ఆహారంపుల్లటి సిట్రస్ పండ్లు, టోమాటో, కొవ్వుతో ఉండే ఆహారాలు, వేటమాంసం తదితరాలు..తీసుకోవాల్సినవి:కాస్త వీక్‌గా అనిపిస్తే హెర్బల్ టీ వంటివి తీసుకోవాలి. తాజా పండ్లు, పరిశుభ్రమైన మంచినీళ్లు, నాన్ ఆల్కహాలిక్ తాజా పండ్ల రసాలుఅన్నం, ఉడికించిన మొక్కజొన్న గింజలుపియర్ పండ్లు, అరటి పండ్లు, ఆపిల్స్, పుచ్చపండ్లు, ఉడికించిన ఆలు, బ్రోకలీ, క్యాబేజ్, గ్రీన్ పీస్, కొవ్వు తక్కువగా ఉండే ఆహారాలు చేపలు, కోడి మాంసం తదితరాలు..(చదవండి: హృదయాన్ని కదిలించే ఘటన: 19 ఏళ్ల తర్వాత భారత్‌లో తండ్రిని..!) -
యోగం: విల్లులా వంచుదాం!
వెన్నెముక కండరాలను బలోపేతం చేయడంలోనూ, శరీర సమతుల్యతను మెరుగుపరచడంలోనూ.. ఎన్నో ప్రయోజనాలను అర్ధచక్రాసన ద్వారా పొందవచ్చు. ఈ ఆసనం విల్లు భంగిమను పోలిఉంటుంది. అర్ధ చక్రం (హాఫ్ వీల్ ఆసన) అంటే సగం చక్రం అన్నమాట.చురుకైన కండరాలు..దీనిని సాధన చేయడానికి మ్యాట్‌పైన నిటారుగా నిల్చోవాలి. చేతులను, తలను భుజాల నుంచి వెనక్కి తీసుకుంటూ నడుమును వంచాలి. దీని వల్ల వెన్ను భాగం సాగుతుంది. ఎంత వీలైతే అంతగా నడుము భాగాన్ని ముందుకు, తల భాగాన్ని వెనక్కి వంచుతూ కాళ్లను నిటారుగా ఉంచాలి. దీంతో కండరాలన్నీ పూర్తి చురుగ్గా అవుతాయి. వెనుకకు వంగేటప్పుడు దీర్ఘ శ్వాస పీల్చుకొని, నెమ్మదిగా వదలాలి. అదే విధంగా యధాస్థితికి చేరుకున్నప్పుడు దీర్ఘశ్వాస తీసుకుంటూ, వదలాలి. మూడు నుంచి ఐదు సార్లు..సాధారణంగా శ్వాస తీసుకునేటప్పుడు సమతుల్యతను కోల్పోకుండా ఉండేలా చూసుకోవాలి. మూడు నుంచి ఐదు సార్లు ఈ భంగిమను తిరిగి చేయాలి. తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి కొంత సమయం కేటాయించాలి. ఈ ఆసనం వల్ల వెన్నెముక నొప్పి తీవ్రత తగ్గుతుంది. కడుపుపై ఒత్తిడి పెరిగి, అదనపు కొవ్వు తగ్గిపోతుంది. ఊబకాయంపై ప్రభావంతంగా పనిచేస్తుంది. హృదయ స్పందన రేటును సమర్థంగా నిర్వహిస్తుంది. ఫలితంగా గుండె పనితీరు మెరుగుపడుతుంది.– జి. అనూషా రాకేష్, యోగా ట్రైనర్ -
గృహస్థాశ్రమ వైశిష్ట్యం: అల్లుడు కోడలు ఆయుర్దాయం..!
కోడలు.... ఆమె నాకు పుట్టిన పిల్ల కాదు. ఎక్కడో పుట్టినపిల్ల. ఎక్కడో చదువుకుంది.. ఎవరి ఇంటినుండో వచ్చింది. అయితే నాకు కోడలిగా వచ్చింది. నా కొడుకును సంతోష పెట్టింది. నా వంశాన్ని పెంచింది. నాకు మనవడిని, మనవరాలిని ఇచ్చింది. నాకు, నా భార్యకు ఊతకర్ర.. చేతికర్ర అయింది. ముప్పూటలా ప్రేమను పంచిపెడుతున్నది. అటువంటి కోడలును చూసుకుని అత్తామామలు మురిసిపోతారు. అందుకే శాస్త్రం కోడలికి పెద్దపీట వేసింది. మామగారు కాలం చేస్తే... తద్దినం పెట్టేటప్పుడు కొడుకు అక్కడే ఉన్నా దీపం పెట్టే అధికారం మాత్రం కోడలికే ఇచ్చింది. ఏ కారణంచేతనయినా ఆమెకు అవాంతరం ఏదయినా వస్తే... ఆమె మళ్ళీ యోగ్యత పొందినప్పుడే తద్దినం పెట్టాలని చెప్పింది. అంత గొప్ప ఉపకారం చేస్తున్న కోడలిని... మా కిచ్చిన కన్యాదాతకు ప్రతిఫలంగా ఏమిచ్చి గౌరవించగలం!!నా కూతురిని వేరొకరి ఇంటి కోడలిగా పంపితే.. నేను ఒక మహోపకారం చేసినట్లు. నా కూతురు వేరొకరికి ధర్మపత్ని అయింది. ఆయన తరిస్తున్నాడు. ఆయన సంతోషంగా ఉన్నాడు. ఆయన సంతానాన్ని పొందాడు. నేను తాతయినట్టుగానే ఆయన తల్లిదండ్రులు తాత, నాయనమ్మలయి వారు సంతోషిస్తున్నారు. భగవంతుడు నాకేమి ఇచ్చాడో వేరొకరికి కూడా ఇచ్చాడు. అది నాకు గొప్ప సంతృప్తి. ఎవరంటారు శాస్త్రం ఆమెకు తక్కువ చేసిందని!!! తండ్రికి ఆమె 21 తరాలు తరించే అవకాశం ఇచ్చింది.పిల్లను ఇస్తున్నాం... కన్యాదానం చేస్తున్నామంటే... ఏదో పంచలచాపు ఇస్తున్నట్లు కాదు... ఆ పిల్ల మీద అధికారం తల్లిదండ్రులకు ఎప్పుడూ ఉంటుంది. పరమ మర్యాద, గౌరవం అల్లుడి దగ్గరే మొదలవుతుంది. మంచి అల్లుడిని పొందడం అంటే మరో కొడుకును కన్నంత ఆనందం. కొడుకు చూపే అభిమానంకన్నా కోడలి అభిమానం పొందిన వారు మరో పదేళ్ళు ఎక్కువగా బతుకుతారు. మా అల్లుడు బంగారం. మా అమ్మాయిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడన్న ఆనందం వారి ఆయుర్దాయాన్ని పెంచుతుంది.కాంచీపురంలో ఒక వృద్ధ వేదపండితుడు తటస్థపడి మాటల సందర్భంలో ఇలా అన్నాడు.. ‘‘అల్లుడు మంచివాడయితే మీకు మరో కొడుకున్నట్టే. మంచివాడు కాకపోతే మీరు నిత్యం చచ్చిపోయినట్లే. కారణం కూతురి బాధను చూడలేక, చూసి.. మింగలేక.. కక్కలేక మీకు ఆ స్థితి ఏర్పడుతుంది.’’ అని.మనిషిని మనిషి బాధపెట్టుకోవడమయినా, బతికించుకోవడమయినా మన అనుబంధాలనుబట్టి ఉంటుంది. గృహస్థాశ్రమ వైశిష్ట్యాన్ని అర్థం చేసుకుంటే... ఓహ్... ఇంత గొప్పగా మాట్లాడి ఇస్తున్నారా పిల్లను... అనిపిస్తుంది. అందుకనే ‘ధర్మేచ అర్థేచ కామేచ....ఏషా నాతి చరితవ్యా... ధర్మప్రజాసంపత్తి అర్థం స్త్రీయం ఉద్వహే’ .. నేను ఈమెను దేనికోసం స్వీకరిస్తున్నాను..ధార్మికమైన సంతానం కోసం... జీవితంలో మొదట భార్య ఊరట, తరువాత కొడుకు ఊరట, తదుపరి కోడలు ఊరట, పిదప మనవడు, మనవరాలు ఊరట...అదీ గృహస్థాశ్రమ వైభవం... తాత పక్కన ఉంటే మనుమలకు ఒక విశ్వవిద్యాలయం పక్కన ఉన్నట్టే.– బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
సారా అలీఖాన్ వెయిట్ లాస్ జర్నీ..96 కిలోల నుంచి..!
అమృతా సింగ్, సైఫ్ అలీ ఖాన్ల కుమార్తె సారా అలీ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం, అభినయం పరంగా సారాకి నూటికి నూరు మార్కులు పడతాయి. ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకుంది. అలాగే ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ జాబితాలో చోటు కూడా దక్కించుకుంది. అలాంటి సారా సినీ ఇండస్ట్రీలోకి రాక మునుపు ఏకంగా 96 కిలోలు ఉండేది. ఆ తర్వాత సముతుల్య ఆహారం, వ్యాయామ దినచర్యలతో దాదాపు 40కి పైగా కిలోలు తగ్గిం 45 కిలోల బరువుకి చేరుకుంది. అంతేగాదు తాను యుక్తవయసులో ఊబకాయం, పీసీఓడీ సమస్యలతో పోరాడనని కూడా పేర్కొంది. అయితే పీసీఓడికి ఎలాంటి నివారణ లేదు. కేవలం ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామ దినచర్య ద్వారానే సాధ్యం. అందుకోసం అని సారా సమతుల్య జీవనశైలికి కట్టుబడి ఉండటంతో బరువు తగ్గడమే గాక పీసీఓడీని నిర్వహించడంలో సహాయపడింది. ఇక్కడ సారా ఎలాంటి డైట్, వ్యాయామాలు ఫాలో అయ్యింది. అవి తనకు ఏవిధంగా సహాయపడ్డాయో చూద్దామా..!సారా అలీ ఖాన్ బరువు తగ్గించే ప్రయాణంలో తక్కువ కార్బ్, అధిక ప్రోటీన్ ప్లాన్‌పై దృష్టి సారించి విజయవంతమయ్యింది. ఆమె రోజులో కార్బోహైడ్రేట్లు తీసుకోవడం ఒక భోజనానికే పరిమితం చేసింది. శరీరానికి శక్తినిచ్చేలా కొత్తిమీర, జీలకర్ర లేదా పండ్లు, కూరగాయాలతో చేసే స్మూతీ వంటి వాటిని, అలాగే ఇంట్లో తయారు చేసే పానీయాలను తీసుకునేది. రోజుని గ్రీన్ లేదా నిమ్మ తేనెతో ప్రారంభించేది. ఇక్కడ సారా శరీర బరువుని తగ్గించడంలో సహాయపడింది కేవలం ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే కాదు, టోన్డ్ బాడీని పొందేలా వర్కౌట్లు చేసేది. ప్రారంభంలో తనకు ఇవన్నీ కష్టంగా అనిపించేవని తెలిపింది కూడా. ఐతే ఎంత ఇబ్బందిగా ఉన్నా..క్రమతప్పకుండా చేయడమే గాక కార్డియో వ్యాయామాలు చేసినట్లు తెలిపింది. అంతేగాదు అదనపు కిలోలు తగ్గించుకునేలా యోగా, పైలేట్స్, వంటివి కూడా చేసింది. ఆరోగ్యకరమైన అలవాట్లు, వ్యాయామాలతో బరువుని అదుపులో ఉంచడమే గాక ఆరోగ్య సమస్య నుంచి ఉపశమనం పొందింది. జీవనశైలిని మార్చుకుని, నిబద్దతతో వర్కౌట్లు చేస్తే ఎవ్వరైన బరవు తగ్గించొచ్చని చాటి చెప్పింది. చాలామంది స్ఫూర్తిగా నిలిచింది సారా.(చదవండి: సౌందర్యం సాధనంగా వెదురు..బోలెడన్ని లాభాలు..!) -
వాడేసిన టీ పొడితో అందాన్ని పెంచుకోవచ్చు! ఎలాగో తెలుసా..!
టీ తయారు చేశాక సాధారణంగా టీ పొడిని వడకట్టి బయటపడేస్తారు. అలాగే టీ బ్యాగులను కూడా పడేస్తారు. అందులో మిగిలిన టీ పొడితో అందాన్ని పెంచుకోవడమే కాదు, ఇంటిని మెరిపించుకోవచ్చు. చాలామందికి టీతోనే రోజు ప్రారంభమవుతుంది. చెప్పాలంటే.. దాదాపు ప్రతి ఇంట్లో ఉదయం, సాయంత్రం టీ తాగాల్సిందే. టీ తయారు చేసిన తర్వాత, టీ పొడి మిగిలిపోతుంది. దీనిని తరచూ చెత్తగా భావించి చెత్తబుట్టలో వేస్తాం. ఈ పనికిరాని టీ పొడితో ఇంటి శుభ్రతను నుంచి అందం వరకు పలు రకాలుగా ఉపయోగించొచ్చు. అదెలాగో సవివరంగా చూద్దాం. !అద్దాలు శుభ్రం చేసేందుకు..టీ పొడితో ఇంటి అద్దాలను పాలిష్ చేయవచ్చు. దీని కోసం, మిగిలిన టీ ఆకులను నీటిలో మరిగించండి. ఈ నీటిని స్ప్రే బాటిల్ లో నింపి దాని సహాయంతో అద్దాలను శుభ్రం చేస్తే అద్దాలు తళతళ ప్రకాశిస్తాయి. దీనితో పాటు, గ్యాస్ బర్నర్లు ఎంత నల్లగా మారినా, మీరు వాటిని నిమిషాల్లో శుభ్రం చేయవచ్చు. టీ నీటిలో కొద్దిగా డిష్ వాష్ మిక్స్ చేసి బ్రష్ సహాయంతో క్లిన్ చేస్తే గ్యాస్ బర్నర్లను తళతళ మెరిసిపోతాయి..పాదాల దుర్వాసనరోజంతా బూట్లు ధరించడం వల్ల పాదాల్లో తరచూ దుర్వాసన వస్తుంటుంది. అలాంటప్పుడు మిగిలిపోయిన టీ పొడిని నీటిలో బాగా మరిగించి చల్లారాక ఆ నీటిలో మీ పాదాలను 10 నుండి 15 నిమిషాలు ఉంచండి. ఇలా రోజూ చేస్తే పాదాల నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది.నేచురల్ షైనింగ్..మిగిలిపోయిన టీ పొడి జుట్టుకు ఒక వరం. ఇది శిరోజాలకు నేచురల్ షైన్ జోడించడానికి పనిచేస్తుంది. అలాగే జుట్టు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. దీని కోసం, టీ పొడిని శుభ్రమైన నీటిలో మరిగించాలి. మరిగిన తర్వాత నీళ్లు చల్లారనివ్వాలి. షాంపూతో తలస్నానం చేసిన తర్వాత చివరగా ఈ నీటితో తలస్నానం చేయాలి. కొద్ది రోజుల్లోనే జుట్టు సిల్కీగా మెరుస్తూ ఉంటుంది. మొక్కలకు ఎరువుగా..ఇంట్లో పెంచుకునే మొక్కలకు సహజ ఎరువుగా టీ పొడి ఉపయోగపడుతుంది. ఇంట్లో చెట్లు, మొక్కలు ఉంటే ఈ టీ పొడివాటి ఎదుగుదల రెట్టింపు అయ్యేలా చూసుకోవచ్చు. మిగిలిపోయిన టీ పొడిని కంపోస్టులా మొక్కల కుండీల్లో వేసేయండి. ఇది మొక్కల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అయితే పంచదార కలిపిన టీ పొడిని మాత్రం బాగా కడిగి అప్పుడు వినియోగించండి.(చదవండి: క్రీడా నైపుణ్యం, మాతృత్వం రెండింటిని ప్రదర్శించిన ఆర్చర్ !)