అందరికీ తెలుసు బరువు తగ్గడం అంత ఈజీకాదు అని. కానీ ఆచరించడంలో విఫలమవుతూంటారు. అనుకున్నది సాధించాలంటే తగిన కృషి ఉండాలి. ఆ కృషిని కష్టంగా కన్నా ఇష్టంగా, పట్టుదలగా చేయడం ముఖ్యం. అలా దీక్షగా ప్రయత్నించిన పోషకాహార నిపుణురాలు దీక్ష బరువు తగ్గింది. నమ్మలేక పోతున్నారా.. అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.
వృత్తిపరంగా పోషకాహార నిపుణురాలు అయిన దీక్షఏకంగా 28 కిలోల బరువు తగ్గి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ సందర్బంగా తీసుకున్న జాగ్రత్తలు, ఆహార నియమాలతో తన వెయిట్‌లాస్ జర్నీని ప్రభావితం చేసిన అంశాలను సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసింది.
“మీరు ఇంటర్నెట్‌లో చూసే ప్రతిదాన్ని నమ్మొద్దు; మీరు ఈ దినచర్యను అనుసరించడం ప్రారంభిస్తే బరువు తగ్గడం మొదలవుతుంది. నేను 28 కిలోల బరువు తగ్గాను, నేను మళ్ళీ చేయాల్సి వస్తే, నేను ఇలాగే చేస్తాను,” అంటూ ఒక రీల్‌లో వివరాలను తెలిపింది. తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో తన జర్నీని స్నిప్పెట్‌లను పంచుకోవడం దీక్షకు అలవాటు.
ఇదీ చదవండి: కుమారుడి ఒకే ఒక్క మాటకోసం : ఏకంగా 22 కిలోలు తగ్గాడు!
అయిదు సూత్రాలు
వేగంగా బరువు తగ్గాలని ప్రయత్నించకండి. నెమ్మదిగా, స్థిరంగా తగ్గితేనే ఆ బరువు మెయింటైన్ అవుతుంది. లేదంటే ఎంత తొందరగా తగ్గితే.. అంత వేగంగా మళ్లీ బరువు పెరుగుతారు.
బ్యాలెన్స్ డైట్ ముఖ్యం. మధ్య మధ్యలో ఇష్టమైనవి తింటూనే, సుగర్‌ని దూరం పెట్టండి. రాత్రి పూట తొందరగా భోజనం ముగించండి.
కచ్చితంగా ఉండాలి. బరువు తగ్గడం, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించేటప్పుడు ఇది అవసరం. ఆహారం, వాకింగ్, వ్యాయామం, నీరు తీసుకోవడం, నిద్ర అన్ని పర్‌ఫెక్ట్‌గా ఉండాలి.
ఒక వేళ కొంచెం ఎక్కువ ఫుడ్ తింటే ఎక్కువ వ్యాయామం చేయాలని నిబంధనను మనకు మనం విధించుకోవాలి.
దీక్ష -ఆహారం
ఉదయం పానీయం: ధనియాలు, సెలెరీ గింజలు ,అల్లం, జీరాతో చేసిన వాటర్అల్పాహారం: 2 గుడ్లు , కొన్ని ఉడికించిన పుట్టగొడుగులు, కూరగాయలు , పుదీనా చట్నీతో పెసరట్టు
టిఫిన్‌కి, భోజనానికి మధ్య : బాదం పాలు కాఫీ. కొబ్బరి నీళ్లు ఇది కూడా ఆప్షనల్.
లంచ్: చికెన్ , హమ్మస్ (ఉడికించిన బఠానీవెల్లుల్లి, ఆలివ్ ఆయిల్, నిమ్మరసం , ఉప్పు కలిపిన మిశ్రమంపై కొద్దిగా ఆలివ్ ఆయిల్ చల్లాలి) సలాడ్.సాయంత్రం స్నాక్: అవసరం అనుకుండే గుప్పెడు వేయించిన శనగలు, ఏదైనా పండు, అయిదారు నట్స్
డిన్నర్ : బాగా ఉడికిన చికెన్ . పాలకూర సూప్, 1/2 కప్పు ఉడికించిన మొలకలుబరువు తగ్గడాన్ని ప్రభావితం చేసే విషయాల్లో ఆహారం ఒక్కటేకాదు. ఇతర అంశాలు కూడా ఉన్నాయంటూ దీక్ష చెప్పుకొచ్చింది. బరువు తగ్గే క్రమంలో ఆహారం ఒక భాగం. ఆరోగ్యకరమైన జీవనశైలి, వ్యాయామం, సరైన నిద్ర చాలా అవసరం. వారానికి 4-5 రోజులు కనీసం 45 నిమిషాలు వ్యాయామం చేయండి.రోజుకు 10 వేల అడుగులు నడవాలి. ప్రతిరోజూ 3 లీటర్ల దాకా కు నీరు త్రాగాలి. ఇది జీవక్రియకు సహాయపడుతుంది. ముఖ్యమైనవి, పెద్దగా పట్టించుకోనివి నిద్ర ,ఒత్తిడి. నిజానికి ఇవి గేమ్ ఛేంజర్‌లు అంటుంది దీక్ష.
Comments
Please login to add a commentAdd a comment