Nutritionist
-
ట్రెండ్ మారింది.. ఫుడ్ మారాలి
ఫ్యాషన్ ట్రెండ్స్లాగానే ఆహారంలో కూడా కొంతకాలం పాటు ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది. ప్రతి సందర్భంలోనూ ఆ ట్రెండ్ ఎవరికి మంచిది, ఎవరికి హానికరం అనే వివరాలను తన బ్లాగ్‌లో రాస్తూ సమాజాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు బెంగళూరుకు చెందిన న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి. హెల్త్ ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న షీలా కృష్ణస్వామి ఈ వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యసంరక్షణ గురించి ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.న్యూట్రిషన్, వెల్నెస్ రంగంలో నలభై ఏళ్ల అనుభవం ఉన్న షీలా కృష్ణస్వామి రోజూ 30 గ్రాముల నట్స్, సీడ్స్ తీసుకోవాలని చెప్పారు. ముప్ఫై గ్రాములంటే ఎన్ని అని తూకం వేసుకోవాల్సిన అవసరం లేదు, ఓ గుప్పెడు చాలు. రోజూ గ్లాసు నీరు, గుప్పెడు బాదం పప్పులతో తన రోజు మొదలవుతుందన్నారు. ఉదయం ఇలాంటి శక్తినిచ్చే సహజాహారం తీసుకుంటే రోజంతా నీరసం రాదు. విటమిన్లు, ప్రొటీన్లతో కూడిన ఆహారం కోసం మన డైట్లో పప్పులు, ధాన్యాలు, పీచు, పాలు, పండ్లను తీసుకుంటున్నాం. బాదం, గుమ్మడి విత్తనాలను కూడా తప్పనిసరిగా చేర్చుకోవాలి. సమయానికి భోజనం చేయడం కుదరనప్పుడు కూడా బాదం తింటే దేహానికి దాదాపుగా సంపూర్ణ ఆహారం అందినట్లే. జంక్ బదులు గింజలు! వందేళ్ల కిందట ఇప్పుడున్న అనారోగ్యాలు లేవు. గడచిన తరాలు ఆహారం విషయంలో ఇంత ప్రత్యేకంగా దృష్టి పెట్టలేదు. ఏం తినాలనిపిస్తే అది తిన్నారు. ఏం పండితే వాటినే తిన్నారు. ఊబకాయం, గుండె వ్యాధులు, డయాబెటిస్ వంటి అనారోగ్యాల్లేవు. అందుకు కారణం వారికి ఆహారం ద్వారా అందిన శక్తిని కరిగించేటంతటి వ్యాయామం ఉండేది. తగినంత వ్యాయామం ఉండడంతో మంచి నిద్ర ఉండేది. ఈ రెండింటి వల్ల దేహక్రియలు చక్కగా జరిగేవి. గట్ హెల్త్ అంటే అదే. ఆ గట్ హెల్త్ కోసం ఇప్పుడు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సి వస్తోంది. ‘బెంగళూరులో నా కళ్లారా చూస్తుంటాను. ఉద్యోగం నుంచి ఇంటికి వెళ్లడానికి పదుల కిలోమీటర్లు ప్రయాణిస్తుంటారు. ఇంటికి వెళ్లేలోపు ఆకలి వేస్తుంటుంది. కారులో వెళ్తూ చిప్స్, ఫ్రెంచ్ ఫ్రై, సమోసాలు, బేకరీ ఫుడ్ వంటి జంక్ తింటూ ఉంటారు. నేనేం చె΄్తానంటే జంక్ స్థానంలో సహజ ఆహారాన్ని తీసుకోండి. ఆఫీసుకెళ్లేటప్పుడు పండ్లను బ్యాగ్‌లో తీసుకెళ్లడం కొన్నిసార్లు సాధ్యంకాకపోవచ్చు. బాదం వంటి నట్స్ ఒక చిన్న బాక్సులో పెట్టుకుంటే మధ్యలో ఆకలి అనిపించినప్పుడు పది గింజలు తింటే చాలు’ అన్నారు షీలా కృష్ణస్వామి. అరవై నాలుగేళ్ల వయసులో ఇంత చురుగ్గా ఉండడానికి సరైన ఆహారమే కారణమన్నారు. ‘అందంగా ఉండడానికి రహస్యం ఏమీ లేదు, ఆరోగ్యంగా ఉండడమే’నని నవ్వారామె. ఎలాగైనా తినండి!పరిపూర్ణ ఆరోగ్యానికి, దీర్ఘకాలం యవ్వనంగా ఉండడానికి దోహదం చేసే బాదం పప్పులను ఇలాగే తినాలనే నియమం ఏదీ అవసరం లేదు. పచ్చిగా లేదా నానబెట్టి తినవచ్చు. డ్రై రోస్ట్, నానిన వాటిని వేయించి,పోపు పెట్టి చాట్ మసాలా చల్లి తినవచ్చు. బాదం పప్పులను రాత్రి నానబెట్టి ఉదయం తినేటప్పుడు పొట్టు వలిచేస్తుంటారు. కానీ పొట్టు తీయాల్సిన అవసరం లేదు. ఆ ఫైబర్ కూడా దేహానికి అవసరమే. వృద్ధులకు పొట్టుతోపాటు తినడం ఇబ్బందవుతుంది. పొట్టు తీసి తినాల్సింది దంతాలు సరిగా లేని వాళ్లు మాత్రమే. – షీలా కృష్ణస్వామి, న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ కన్సల్టెంట్, బెంగళూరు – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటో : టి.దయాకర్ -
చచ్చు గింజలు తింటే.. ఎంత ప్రమాదమో మీకు తెలుసా?
వేరుశనగపప్పులు బూజు పట్టి, చర్మం ముడుచుకుని పోయి ఉన్నాయంటే అవి తెగుళ్ల కారణంగా విషపూరితమయ్యాయని అర్థం. ఫంగస్ సోకిన, ముడుచుకుని పోయిన వేరుశనగ పప్పులను తినడం ఆరోగ్యానికి హానికరం. ఈ విషాల బారిన పడకుండా దేహాన్ని సంరక్షించే ప్రక్రియలో మొదటగా దెబ్బతినేది కాలేయం, వ్యాధినిరోధక వ్యవస్థ.బూజు పట్టిన పప్పులు లివర్ డ్యామేజ్‌కి కారణమవుతాయి. కాలేయం వాపు, మచ్చలతోపాటు పనితీరు లోపించడం, లివర్ క్యాన్సర్ వంటి అనారోగ్యాలు సంభవిస్తాయి. వీటితోపాటు తక్షణం బయటపడే అనేక ఇతర అనారోగ్యాలు, అలర్జీలు, కడుపు నొప్పి, డయేరియా, తల తిరగడం, వాంతులవడం వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. దీర్ఘకాలంలో ఎదురయ్యే సమస్యల్లో బ్రాంకైటిస్, ఆస్త్మాతోపాటు ఇతర శ్వాసకోశ సంబంధ సమస్యలు, కిడ్నీ ఫెయిల్యూర్, పెద్ద పేగు క్యాన్సర్లకు దారితీస్తుంది. సంవత్సరాలపాటు ఆహారంలో ఇవి కొనసాగినట్లయితే నర్వస్ సిస్టమ్ కూడా బలహీనపడుతుంది. తరచూ తలనొప్పి, దేహంలో ప్రకంపనలు, జ్ఞాపకశక్తి లోపించడం జరుగుతుంది. మనం ఊహించని మరో సమస్య పునరుత్పత్తి వ్యవస్థ అపసవ్యతలకు లోనుకావడం కూడా.అందుకే వేరుశనగపప్పులనాణ్యతను పరిశీలించుకున్న తర్వాత మాత్రమే వంటల్లో వాడాలి. పప్పులను కొన్న వెంటనే పేపర్ మీద పోసి బూజుపట్టిన, ముడుచుకు పోయిన పప్పులను తొలగించి మంచి పప్పులను డబ్బాల్లో నిల్వ చేసుకోవాలి. పప్పులు సేకరించి నూనె పట్టించుకునే వాళ్లు కూడా బూజు పట్టిన పప్పులను, డొల్లగా ఉన్న పప్పులను జాగ్రత్తగా ఏరి పారేసి మంచి పప్పులతో నూనె పట్టించుకోవాలి.– సుజాత స్టీఫెన్ ఆర్.డి, న్యూట్రిషనిస్ట్ఇవి చదవండి: వంధ్యత్వం కాదు.. అంధత్వం! -
కత్రినా ఫిట్నెస్ సీక్రెట్ తెలిసిపోయింది ఆమెది షట్పావళి డైట్ ప్లాన్
-
వర్షాకాలంలో ఆకుకూరలు తినవచ్చా..?
ఆకుకూరలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు చెబుతుంటారు. ముఖ్యంగా కళ్లకు చాలా మంచిదని అంటారు. అలాంటి ఆకుకూరలను వర్షాకాలంలో మాత్రం తీసుకోవద్దని సూచిస్తుంటారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుండే ఈ ఆకుకూరలను వర్షాకాలంలో ఎందుకు తీసుకోకూడదు..?. నిపుణులు ఏమంటున్నారంటే..ఈ వర్షాకాలంలో ఆకుకూరలు బురద బురదగా ఉంటాయి. పైగా గాల్లో ఉండే తేమ కారణంగా వైరస్, బ్యాక్టీరియా ఆకులను ఆశ్రయించి ఉంటుంది. చెప్పాలంటే ఈ టైంలో వాటి సంతానోత్పత్తిని అభివృద్ధి చేసే ప్రదేశంగా ఆకుకూరలను మారుస్తుంది. మనం ఈ కాలంలో వీటిని గనుక సరిగా క్లీనింగ్ చేయకుండా తీసుకుంటే ఫుడ్ పాయిజనింగ్ అవ్వడం, డయేరియా, ఇతర ప్రేగు సంబంధిత సమస్యలను ఎదుర్కొనవల్సి ఉంటుందని పోషకాహార నిపుణురాలు అమిత గాద్రే చెబుతున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అలా అని ఈ సీజన్లో ఆకుకూరలకు దూరంగా ఉండాల్సిన పనికూడా లేదని అంటున్నారు పోషకాహార నిపుణురాలు అమిత. హాయిగా ఈ కాలంలో కూడా ఆకుకూరలు తినొచ్చుని చెబుతున్నారు. అయితే ఈ క్రింది జాగ్రత్తలు పాటించినట్లియితే బేషుగ్గా తినవచ్చని అంటున్నారు పోషకాహార నిపుణులు. ఈ వర్షాకాలంలో ఆకుకూరలను సరిగ్గా కడగడం ఎలా అంటే..ఆకుకూరలు కొనుగోలు చేసిన వెంటనే తాజా ఆకులను వేరు చేయాలి. తర్వాత నిస్తేజంగా ఉన్న వాటిని శుభ్రం చేసి, బాగానే ఉన్నాయనిపిస్తే వినియోగించాలి. ఆ తర్వాత ఆకులన్నింటిని ఒక్కోక్కటిగా ఓపికతో క్లీన్ చేయాలి. వాటిని పొడి క్లాత్‌పై వేసి చక్కగా ఆరబెట్టండి.వండటానికి ముందు ఆకుకూరలను చక్కగా ఉప్పు వేసిన వేడినీటిలో 30 సెకన్లపాటు ఉంచి వడకట్టండి. ఆ తర్వాత వెంటనే ఐస్ వాటర్‌లో వేసి చక్కగా వండుకోండి. ఇలా చేస్తే ఎలాంటి సమస్య ఉండదు. ఈ జాగ్రత్తలు తీసుకోకుండా వండినట్లయితే పలు అనారోగ్య సమస్యలు ఫేస్ చేయాల్సిందేనని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.(చదవండి: డెంటిస్ట్‌పై ఏకంగా రూ. 11 కోట్లు దావా! సర్జరీ టైంలో..) -
బరువు తగ్గాలనుకుంటే..ఆ ఆహారాలకు దూరంగా ఉండాలంటున్న నిపుణులు!
బరువు తగ్గే ప్రయాణంలో చాలా మంది పలు రకాల వర్కౌట్లు, డైట్‌పై దృష్టిపెడతారు. కానీ ఎలాంటి ఆహారం తీసుకుంటే బరువు తగ్గుతున్నాం అనేదాన్ని గమనించరని పోషకాహార నిపుణురాలు ఖ్యాతి రూపాని అంటున్నారు. మన తీసుకునే ఆహారంలో ఆరోగ్యకరంగా ఉండే ఆహారాలు మన బరువు తగ్గేందుకు ఆటంకం కలిగిస్తాయని చెబుతున్నారు. అలాంటి వాటిని ఎంత మేర వరకు తీసుకుంటే బెటర్ అనేది అంచనా వేసి తీసుకోవాలని తెలిపారు. అలాగే ఎక్కువ కేలరీల ఆహారం తీసుకున్న రోజు కచ్చితంగా బాగా హెల్తీగా ఉండే ఆహారాలను తీసుకోకుండా ఉండటం వంటి జాగ్రత్తలు పాటిస్తే బరువు ఈజీగా తగ్గుతారని చెబుతున్నారు. ఈ సందర్భంగా తన వెయిట్ లాస్ జర్నీలో తాను ఎలాంటి ఆరోగ్యకరమైన ఆహారాలను దూరం పెట్టడం వల్ల ఎంత తొందరగా బరువు తగ్గగలిగానే అనే విషయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తీసుకోవడం, బరువు తగ్గడానికి తినడం అనేవి రెండు వేర్వేరు పరిస్థితులని నొక్కి చెప్పారు. వాటితో సరిగా వ్యవహరించాలని, అన్ని ఆరోగ్యకరమైన ఆహారాలు తక్కువ కేలరీలు లేదా కొవ్వు రహిత పదార్థాలుగా భావించడం బరువు తగ్గే ప్రయత్నాలకు ప్రధాన ఆటంకాలని అన్నారు. అంతేగాదు క్యాలరీలు మనల్ని ఎలా తికమకకు గురిచేస్తాయో కూడా వివరించారు. మన ఆహారంలో కొవ్వులు కీలకమైనవే కానీ ఇవి కార్బోహైడ్రేట్లు లేదా ప్రోటీన్‌తో పోలిస్తే గ్రాముకు రెట్టింపు క్యాలరీలను ప్యాక్ చేస్తాయి. ఉదాహరణకు ఒక గ్రాము కొవ్వు 9 కేలరీలను ఇస్తుంది. అయితే ఒక గ్రాము కార్బోహైడ్రేట్లు లేదా ప్రోటీన్ 4 కేలరీలను మాత్రమే ఇస్తుంది. ఇలాంటప్పుడు విజయవంతంగా బరువు తగ్గాలనుకుంటే సముతుల్యత పాటిస్తూ..తక్కువ కేలరీలు, ఫైబర్లు, ప్రోటీన్లు అధికంగా ఉండేలా, కొవ్వు లేకుండా చేసుకోవాలని చెబుతున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే ఒక టేబుల్ స్పూన్ వెన్నలో 50 కేలరీల కంటెంట మొత్తం మీకు ఒక యాపిల్‌తో విభేదిస్తుంది. ఎందుకుంటే..? ఇందులో ఏకంగా 90 కేలరీలు ఉంటాయి, పైగా కొవ్వు ఉండదు, ఫైబర్ పుష్కలంగా ఉండి ఎక్కువ సేపే ఆకలి లేకుండా చేస్తుంది. అందువల్ల వెయిట్ లాస్ జర్నీలో బరువుని ఆటంకపరిచే ఐదు ఆరోగ్యకరమైన ఆహారాల గురించి సవివరంగా వెల్లడించారు పోషకాహార నిపుణులు ఖ్యాతి రూపానీ. అవేంటంటే..అవోకాడో: ఆరోగ్యకరమైన కొవ్వులు కోసం తరుచుగా సూపర్‌ఫుడ్‌గా పేర్కొన్నప్పటికీ..కేలరీల పంచ్ ప్యాక్‌ని అందిస్తుంది. ఇవి 100 గ్రాముల అవోకాడోకి సుమారు 200 కేలరీలు, 19 గ్రాముల కొవ్వులు ఉంటాయి. అందువల్ల దీన్ని డైట్లో చేర్చుకునేటప్పుడూ మితంగా ఉండేలా చూసుకోవటం ముఖ్యం.స్మూతీస్: ఈ స్మూతీస్‌లో మంచి తృణధాన్యాలు, వెన్న, పాలతో లోడ్ చేసే కేలరీల లోడ్. దీన్ని ఆస్వాదించేటప్పుడూ కూడా జాగురుకతతో వ్యవహరించాలి. సమతుల్యంగా తీసుకోవాలి. నట్ బట్టర్: ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉన్నప్పటికీ నట్ బట్టర్ శరీరానికి అదనపు కేలరీలను అందించేస్తుంది. చెప్పాలంటే వంద గ్రాములకు సుమారు 600 కేలరీలను పొందుతాం కాబట్టి తీసుకునేటప్పుడూ ఆ రోజు వర్కౌట్ల రీత్యా ఎంతమేర బెటర్ అనేది అంచనా వేసి మితంగా తీసుకుంటే మంచిది.వేయించిన స్నాక్స్: వేయించిన అల్పాహారం అంటే అరటిపండు చిప్స్ వంటి రకరకాల ఐటెమ్స్ విషయంలో కేలరీల కంటెంట్‌పై దృష్టిపెట్టాలని చెబుతున్నారు. ఇవి బాగా రుచిగా ఉండటంతో ఒకేసారి ఎక్కువ మోతాదులో శరీరం కేలరీను ఈజీగా పొందుతుంది.షుగర్ ఫ్రీ స్వీట్స్: షుగర్-ఫ్రీ స్వీట్స్ కదా పెద్ద క్యాలరీలు ఉండవని చాలామంద పొరపడతారు. ఇవి కొవ్వు రహితం మాత్రం కాదు. వంద గ్రాముల షుగర్ ఫ్రీ స్వీట్స్‌లో దాదాపు 317 కేలరీలు ఉంటాయని చెబుతున్నారు పోషాకాహార నిపుణురాలు ఖ్యాతి రూపానీ. అందువల్ల ఇలాంటి హెల్తీ ఆహారాలను తీసుకునే విషయంలో కాస్త జాగురకతతో వ్యవహరిస్తూ మితంగా తీసుకుంటే తక్కువ సమయంలోనే ఈజీగా బరువు తగ్గుతారని అంటున్నారు. View this post on Instagram A post shared by Diet Plans by Nutritionist Khyati Rupani (@balancenutrition.in) (చదవండి: బరువు తగ్గాలని రైస్‌కి దూరంగా ఉంటున్నారా? ఫిట్నెస్ కోచ్ ఏమంటున్నారంటే..) -
Kamana Gautam: ప్రతి ఇంటి నుంచి పచ్చటి అడుగు
ఒక మంచి పని చేసినప్పుడు అభినందించే వారే కాదు అనుసరించే వారు కూడా ఉంటారు. సోషల్ మీడియాలో పాపులర్ అయిన కామ్నా గౌతమ్ విషయంలోనూ ఇలాగే జరిగింది. ‘పర్యావరణహిత మార్గం వైపు ప్రయాణం మన ఇంటి నుంచే మొదలు కావాలి’ అంటుంది కామ్నా గౌతమ్... ‘పర్యావరణ సంరక్షణకు మన వంతుగా ఉడతాభక్తిగా చేయడానికి ఎంతో ఉంది. అందుకు మన ఇంటి నుంచే శ్రీకారం చుట్టాలి’ అంటుంది కామ్నా గౌతమ్. తన ఇన్స్పైరింగ్ మాటలతో సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందిన కామ్నా నూట్రీషనిస్ట్. వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్‌లు, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం... మొదలైన వాటి గురించి విస్తృతంగా ప్రచారం చేస్తోంది కామ్నా గౌతమ్. బేబీ–వియరింగ్, బ్రేస్ట్ఫీడింగ్లాంటి అంశాలకు సంబంధించి ఉపయోగకరమైన సమాచారం అందించడంతో కామ్న సోషల్ మీడియా జర్నీ మొదలైంది. ‘నేను ఒక బిడ్డకు తల్లిని. బిడ్డ భవిష్యత్ బాగుండాలని ప్రతి తల్లీ కోరుకుంటుంది. అందుకే బిడ్డల బంగారుభవిష్యత్ కోసం పర్యావరణహిత మార్గాన్ని ఎంచుకున్నాను’ అంటుంది కామ్న. పర్యావరణ హిత మార్గంలో తన ఇంటి నుంచే తొలి అడుగు వేసింది. ఇంట్లో ప్లాస్టిక్ వస్తువులు కనిపించకుండా చేసింది. కుటుంబ సభ్యులను ఒప్పించింది. ‘మన ఇంట్లో ప్లాస్టిక్ బాటిల్స్‌ను ఎందుకు ఉపయోగించడం లేదో తెలుసా?’ అని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పింది. ‘నేను ఇలా చేస్తున్నప్పుడు ఇతరులు కూడా చేయవచ్చు కదా. వారిలో ఎందుకు స్పందన కనిపించడం లేదు?’ అంటూ బాధ పడేది కామ్నా. అయితే ఆ తరువాత మాత్రం ఒక్కరొక్కరుగా ఆమెను అనుసరించడం ప్రారంభించారు. ఇంటిని ఎన్విరాన్మెంట్–ఫ్రెండ్లీగా తీర్చిదిద్దడం మొదలు పెట్టారు. ప్లాస్టిక్ బ్యాగులు కనిపించకుండా ఉండాలంటే ప్రతి ఇంట్లో క్లాత్‌బ్యాగులు ఉండాలి, డిస్పోజబుల్ వాటర్ బాటిల్ కాదు మీదైన సొంత వాటర్ బాటిల్ ఉండాలి, ట్రెండ్లను అనుసరిస్తూ పర్యావరణానికి హాని కలిగించే వస్త్రాలు లేదా వస్తువులకు ప్రాధాన్యత ఇవ్వకూడదు, ఇంట్లోని వ్యర్థాలను తడి, పొడి విభాగాలుగా వేరు చేయండి...ఇలాంటి విషయాలెన్నో చుట్టుపక్కల వారికి చెబుతున్నప్పుడు మొదట్లో వారి స్పందన ఎలా ఉండేదో తెలియదుగానీ ఆ తరువాత మాత్రం మార్పు కనిపించింది. -
తగ్గేదేలే.. ప్రతీ నెలా నాన్‌వెజ్ కోసం రూ.240కోట్లు ఖర్చు చేస్తున్న జనాలు
ప్రపంచం మారుతోంది. ఆర్థికంగా ప్రతీ కుటుంబం బలపడుతోంది. జీవన విధానంలో కూడా భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సంపాదనలో దాచుకునే కాలం నుంచి సంపాదించిన సొమ్ములో సంతోషంగా జీవించడానికి సరిపడా ఖర్చు చేసి మిగిలిందే దాచుకుందాం అనే ధోరణి కనిపిస్తోంది. సంపాదనలో అత్యధిక శాతం విద్య, ఆహారం, ఆరోగ్యానికి మాత్రమే ఖర్చు చేస్తున్నారు. పిల్లలకు మంచి చదువు ఇస్తే చాలు అదే వాళ్లకు ఆస్తి అనే భావనతో చాలామంది విద్య విషయంలో రాజీ పడటం లేదు. ఆ తర్వాత మంచి పోషకాహారం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కోవిడ్ తర్వాత వీటిపై ప్రజల్లో మరింత చైతన్యం పెరగడం విశేషం. సాక్షి ప్రతినిధి కర్నూలు: పోషకాహార లోపంతో బాధపడే ప్రాంతాల్లో మనది కూడా ఒకటి. ముఖ్యంగా పేదరికం అత్యధికంగా ఉండే పశ్చిమ ప్రాంతంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువ. బతకడం కోసం మరో ప్రాంతానికి వెళ్లి ఒళ్లు హూనమయ్యేలా శ్రమించి తినీతినక ప్రతి రూపాయి దాచుకొని బతుకీడ్చేవారు.ప్రస్తుతం పరిస్థితి మారింది. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రతీ ఇంటికి ఆర్థిక భరోసా లభిస్తోంది. వారి కష్టానికి ప్రభుత్వ సాయం దన్నుగా నిలుస్తోంది. దీంతో పిల్లలకు మంచి చదువులు చదివిస్తున్నారు. అక్షరాస్యత పెరగడంతో ప్రజల్లో చైతన్యం కూడా అధికమైంది. జీవన విధానంలో ప్రాధాన్యతలు గ్రహిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలనే భావనకు వచ్చారు. ఆరోగ్యానికీ ప్రాధాన్యత ప్రతి వందమందిలో 63శాతం మంది జీవనశైలి వ్యాధులతోనే మృతి చెందుతున్నారని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. 2030కి ప్రతి ముగ్గురిలో ఒకరు జీవనశైలి వ్యాధులతో చనిపోతారని స్పష్టం చేసింది. ఎన్సీడీ(నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్) వ్యాధుల బారిన పడుతున్నారు. 35 ఏళ్లుదాటితే హైపర్‌టెన్షన్, జీర్ణ సమస్యలు, షుగర్, బీపీ వస్తున్నాయి. ఆశ్చర్యమేంటంటే 18 ఏళ్లు దాటిన వారు కూడా ఎన్సీడీ బారిన పడుతున్నారు. దీంతో అందరిలోనూ ఆరోగ్యంపై జాగ్రత్త పెరిగింది. మంచి ఆహారం, వ్యాయామంపై దృష్టి సారిస్తున్నారు. అందుకే జిమ్‌లు, ఫిట్నెస్, జుంబా సెంటర్లకు వెళ్తున్నారు. పిల్లలను ఏదో ఒక స్పోర్ట్‌లో చేర్పిస్తే శారీరంగా, మానసింగా ఆరోగ్యంగా ఉంటారని స్పోర్ట్స్‌వైపు పంపుతున్నారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖ లెక్కల ప్రకారం వయస్సుకు తగ్గట్లు బరువు ఉన్నవారు 2019కి ముందు 90 శాతంలోపు ఉంటే 2022లో 93.82 శాతం ఉన్నారు.2023లో 94.15 శాతంఉన్నారు. దీన్నిబట్టే పోషకాహారలోపంతో బాధపడేవారి సంఖ్య తగ్గుతోందని స్పష్టమవుతోంది. పోషకాహారం కోసం ఖర్చులో తగ్గేదేలే.. 10–15ఏళ్ల కిందట కిరాణా మినహా ఏదైనా పండ్లు, ఇతర ఆహార పదార్థాలు కొనాలంటే జేబులో డబ్బులు చూసేవారు. సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు ఆహారం మినహా ప్రత్యేకంగా పండ్లు, మాంసంపై దృష్టి సారించేవారు కాదు. పండుగలు, బంధువులు ఇంటికి వచ్చిన సందర్భాల్లోనే నాన్‌వెజ్ ఉండేది. ఇప్పుడు ప్రతీవారం కచ్చితంగా, కొందరు వారంలో 2, 3 సార్లు నాన్‌వెజ్ తీసుకుంటున్నారు. అలాగే డ్రైప్రూట్స్ వాడకం గణనీయంగా పెరిగింది. చాలామంది బాదం, పిస్తా, ఖర్జూర, కాజు, ఆఫ్రికాట్స్తో పాటు పలు రకాల డ్రైప్రూట్స్ కొంటున్నారు. పిల్లలకు రోజూ డ్రైప్రూట్స్ ఇస్తే పటిష్టంగా ఉంటారనే భావనకు వచ్చారు. ఏదైనా బేకరీ, డ్రైప్రూట్స్ లేదా మరో దుకాణానికి వెళితే ధరలు అడగకుండా కావల్సింది తీసుకుని బిల్లు చూసి ఫోన్‌పే చేసి వస్తున్నారు. దీంతో పాటు మిల్లెట్స్ వినియోగం కూడా పెరిగింది. కొర్రలు, అరికెలు, కినోవాతో పాటు మిల్లెట్స్ తినేవారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ఇవన్నీ పోషకాహారం తీసుకోవడంలో భాగమే. వీటన్నిటి కంటే ప్రధానమైంది మాంసాహారం. వారంలో ఒకరోజు.. కనీసం నెలలో ఒక రోజు ఫ్యామిలీతో రెస్టారెంట్లకు వెళ్లే సంస్కృతి పెరిగింది. ప్రతీ నెలా నాన్‌వెజ్ ఖర్చు రూ.240కోట్లు దేశంలోని 29 రాష్ట్రాల్లో మాంసాహార వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 98.4శాతం పురుషులు, 98.1శాతం సీ్త్రలు మాంసాహారం తీసుకుంటారు. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్, మూడోస్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. చివరిస్థానంలో రాజస్తాన్ ఉంది. అయితే ఎన్ఎఫ్హెచ్ఎస్–5(నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే) ప్రాంతాల వారీగా 33,755 మంది సీ్త్రలు, 5,048 మంది పురుషులతో 2019–20లో సర్వే నిర్వహించింది. ఇందులో మహిళలు 71.8శాతం, పురుషులు 83.2శాతం మాంసాహారం తీసుకుంటున్నట్లు తేలింది. కోవిడ్ తర్వాత ప్రతీ జిల్లాలో మాంసాహార వినియోగం అధికమైంది. రోగనిరోధకశక్తి పెరుగుతుందనే భావనతో మాంసాహారాన్ని అధికంగా తీసుకుంటున్నారు. పశుసంవర్ధకశాఖ అధికారుల గణాంకాల ప్రకారం ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రతి నెలా 5వేల మెట్రిక్ టన్నుల మాంసాహారం వినియోగిస్తున్నారు. ఇందులో 2,400 టన్నులు చికెన్, 1600 టన్నులు చేపలు, 1400 టన్నుల మటన్ ఉంటోంది. దీనికి నెలకు రూ.209కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇవి కాకుండా కోడిగుడ్లు, బీఫ్, ఫోర్క్, కంజు ఇతర మాంసాహార ఖర్చులు లెక్కిస్తే నెలకు రూ.240కోట్లు మాంసాహారానికి ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వడంలో పోషకాహారలోపంతో బాధపడేవారి సంఖ్య కూడా క్రమేణా తగ్గుతోంది. -
మీకు స్మోకింగ్ అలవాటుందా?.. అయితే, ఈ సమస్యలు ఎక్కువే..
ప్రస్తుత డిజిటల్ యుగంలో ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ లేకుండా రోజు గడవటం కష్టమంటే అతిశయోక్తి కాదేమో! మన జీవన విధానంలో అవి అంతగా కలిసిపోయాయి మరి! అయితే దాని వెన్నంటే కంటి సమస్యలు కూడా మరింతగా పెరుగుతూనే ఉన్నాయి. కళ్లు పొడిబారడం, శుక్లాలు, దృష్టిలోపం తలెత్తడం వంటి సమస్యలెన్నో మనలో చాలామంది ఎదుర్కొంటున్నారు. యేటా దాదాపుగా 1 బిలియన్ మంది తాత్కాలిక లేదా దీర్ఘకాలిక కంటి సమస్యలతో బాధపడుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తాజా నివేధికలో వెల్లడించింది. అయితే పోషకాహారం ద్వారా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునేందుకు నూట్రీషనిస్ట్ రూపాలి దత్త సూచించిన కొన్ని చిట్కాలు మీకోసం.. విటమిన్లు అధికంగా ఉండే అహారాన్ని తినాలి శరీరానికి అవసరమైన ముఖ్యమైన విటమన్లు అందించే ఆహారాన్ని తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని మీకు తెలుసా? అమెరికన్ ఆప్టోమెట్రిక్ అసోసియేషన్ ప్రకారం ‘ఎ, సి, ఇ’ విటమిన్లు శుక్లాలు, మాక్యులర్ డీజెనరేషన్ సహా కొన్ని కంటిసంబంధింత సమస్యలు నివారించడంలో కీలకంగా వ్యవహరిస్తాయని పేర్కొంది. అందువల్లనే నిపుణులు ఈ విటమిన్లు అధికంగ ఉండే సిట్రిక్ ఫలాలు, డ్రై నట్స్, విత్తనాలు, చేపలు.. వంటి పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోమని సూచిస్తున్నారు. ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు ఆకుకూరల్లో, కూరగాయల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు నిండుగా ఉంటాయి. అకాడమీ ఆఫ్ నూట్రీషన్ అండ్ డైటిటిక్స్ అధ్యయనాల ప్రకారం మన ఆహారంలో భాగంగా ఆకుకూరలు తీసుకున్నట్లయితే యూవీ రేస్, రేడియేషన్ నుంచి కంటిచూపును కాపాడటంలో కీలకంగా వ్యవహరిస్తుందని తేలింది. మరింత నీరు తాగాలి నీటి ప్రాధాన్యాన్ని ప్రత్యేకంగా గుర్తుచేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే శరీరానికి సరిపడినంత నీరు తాగడం వల్ల కలిగే లాభాలు మనందరికీ తెలుసు. డీహైడ్రేషన్ నుంచి కాపాడటమేకాకుండా, కంటికి హానిచేసే ఇతర కారకాల నుంచి కూడా మనల్ని కాపాడుతుంది. నియంత్రణలో శరీర బరువు యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ చెందిన ఆప్తాల్మాలజీ విభాగంలో జరిపిన బీవర్ డ్యామ్ ఐ అధ్యయనాల ప్రకారం కంటి ఆరోగ్యంపై మాడిసన్, స్థూలకాయం ప్రభావం కూడా ఉంటుందని వెల్లడించింది. అధిక బరువు కారణంగా కంటిలోపలి భాగం నుంచి ఒత్తిడి పెరుగుతుందని తెల్పింది. కాబట్టి శరీర బరువును అదుపులో ఉంచే ఆహారపు అలవాట్లవల్ల ఆరోగ్యంగా జీవించవచ్చు. ధూమపానానికి దూరంగా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అధ్యయనాల ప్రకారం స్మోకింగ్ అలవాటు కంటి చూపులో మార్పులకు కారణం అవుతుందని వెల్లడించింది. పొగతాగని వారితో పోల్చితే స్మోకింగ్ చేసేవారిలో కాంటరాక్ట్ వంటి కంటి సమస్యలు రెండు, మూడు రెట్లు అధికంగా ఉన్నట్లు అధ్యయనాలు పేర్కొన్నాయి. ఈ సూచలను పాటిస్తే మీ కంటి చూపు జీవితకాలంపాటు పదిలంగా ఉంచుకోవచ్చని ప్రముఖ నూట్రీషనిస్ట్ రూపాలి దత్త సూచిస్తున్నారు. చదవండి: Dry Throat: నోటి దుర్వాసన, దగ్గు, పుండ్ల సమస్యా.. ఇలా చేస్తే.. -
Chinta Chiguru: చింతలు తీర్చే చిగురు
చింత చిగురు.. ఇప్పుడంటే అంతా కమర్షియల్ అయింది కానీ గతంలో పల్లెటూర్లలో అలా నడుచుకుంటూ వెళ్లి కోసుకొచ్చుకొనేవాళ్లు. పప్పులో, పచ్చడిలో, పులుసులో ఇలా పలు వంటకాల్లో చింతచిగురు చేరిస్తే దాని రుచే వేరంటారు భోజన ప్రియులు. కేవలం రుచి కోసమే కాదని, చింత చిగురు వల్ల మనకు ఆరోగ్యకర ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. ప్రధానంగా ఏప్రిల్– జూలై మాసాల్లో దొరికే చింత చిగురుతో ఎన్నో లాభాలున్నాయి, అవేంటో చూద్దాం.. ఇందులోనే ఫైబర్ కంటెంట్ కారణంగా మలబద్దకం సమస్య తొలగిపోతుంది. విరేచనం సులభంగా అయ్యేలా చూస్తుంది. పైల్స్ ఉన్న వారికి, జీర్ణాశయ సంబంధ సమస్యలు ఉన్నవారికి చింతచిగురు బాగా పనిచేస్తుంది. చింతచిగురులో ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటంతో శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. టడయాబెటీస్ ఉన్న వారు చింత చిగురును ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయి క్రమంగా తగ్గుతుంది. ఇందులోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, టార్టారిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్ తదితరాలు రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు ఎముకల ధృఢత్వానికి తోడ్పడతాయి. చింత చిగురును మెత్తగా నూరి కీళ్లపై ఉంచితే నొప్పులు, వాపులు తగ్గుతాయి. చింత చిగురును ఉడికించిన నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి, మంట, వాపు, పగుళ్లు వంటి నోటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. స్కర్వీ, మలేరియా వ్యాధులకు కూడా ఈ చిగురు చక్కగా పనిచేస్తుంది. కడుపులోని నులి పురుగులకు కూడా చింతచిగురు మంచి ఔషధం. చింతచిగురు టీ కానీ, చింతచిగురును వేణ్ణీళ్లలో మరిగించి కొంచెం తేనె కలుపుకుని తాగినా కానీ సాధారణ జలుబు, దగ్గులాంటివి మాయం అవుతాయి. చింతచిగురు జ్యూస్ ఆడవాళ్ల నెలసరి సమయంలో వచ్చే నొప్పులు తగ్గిస్తుంది. నేత్ర సంబంధ సమస్యలను కూడా చింత చిగురు దూరం చేస్తుంది. కళ్లు దురదగా ఉన్నప్పుడు కొంత చింత చిగురు తింటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. థైరాయిడ్ సమస్య కూడా దీనివల్ల తగ్గుముఖం పడుతుంది. కేవలం చిన్న చిన్న రోగాలకే కాదు.. పలు రకాల కాన్సర్లు రాకుండా చూసే ఔషధ గుణాలు చింత చిగురులో ఉన్నాయి. వందగ్రాముల చింత చిగురులో దాదాపుగా 239 కాలరీల శక్తి, ఒక్కగ్రాము ఫ్యాట్, 3 గ్రాముల ప్రోటీన్, 26 ఎంజీ సోడియం, 63 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. దాదాపు 16 శాతం ఐరన్, 6 శాతం విటమిన్ సీ, 1 శాతం విటమిన్ ఏ ఉంటాయి. సో... ఈసారి చింతచిగురు కనిపిస్తే వదలకండి! (చదవండి: నవ్వు మాత్రమే కాదు.. ఏడుపూ మంచిదే.. !) -
పచ్చ సొన.. సుగుణాల సోనా: డాక్టర్ ప్రత్యూషారెడ్డి
‘కోడిగుడ్డు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం కలిగిస్తుందని అందరికీ తెలుసు. అయితే కొంతమంది కొవ్వు చేరుతుందని అందులోని పచ్చసొనను పక్కనపెట్టి తెల్లసొన మాత్రమే తింటుంటారు. ఇది ఏమాత్రం సమంజసం కాదు. డీ విటమిన్ కొరత రాకుండా ఉండాలంటే రోజూ కోడిగుడ్డు తినాలి. గుడ్డులో ఉండే పచ్చసొనలో లభించే డీ విటమిన్ మరెక్కడా లభించదు’ అంటున్నారు డాక్టర్ ప్రత్యూషారెడ్డి. హైదరాబాద్‌లో ఎంబీబీఎస్ చదివి, అమెరికాలో క్లినికల్ న్యూట్రిషన్లో ఎంఎస్ చదివిన ప్రత్యూష ప్రస్తుతం హైదరాబాద్‌లో పోషకాహార నిపుణులుగా రాణిస్తున్నారు. మళ్లీ కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఎలాంటి పోషకాహారం తీసుకోవాలన్న దానిపై ‘సాక్షి’కి ప్రత్యూషారెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. –సాక్షి, హైదరాబాద్ రోగనిరోధక శక్తి అంటే ఏంటి? ఎర్ర రక్తకణాలను పెంచుకోవడం లేదా వాటిని బలోపేతం చేసుకోవడమే రోగ నిరోధక శక్తి. ఏదైనా వైరస్ వస్తే, దానిపై పోరాడేతత్వం ఈ ఎర్రరక్త కణాలకు ఉంటుంది. ఏడు రకాల పద్ధతులు పాటిస్తే రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చని ప్రపంచ వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. సమతుల్యమైన ఆహారం అవసరం... ఆరోగ్యానికి, బరువు నియంత్రణలో ఉంచుకోవడానికి సమతుల్యమైన ఆహారం అవసరం. సమతు ల్యమైన ఆహారం అంటే ఏంటనే ప్రశ్న అందరిలో వస్తుంది. కార్బోహైడ్రేట్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్ సరిగ్గా తీసుకోవడమే సమతుల్యమైన ఆహారం. ఇడ్లీ, దోశ, అన్నం, చపాతీలతో కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి. అదే సమయంలో పీచుపదార్థం తీసుకోవడం చాలా ముఖ్యం. వివిధ రంగుల్లో లభించే కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవడం వల్ల మనకు యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. వీటివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రొటీన్లు ఉండే గుడ్లు, పప్పు, చికెన్, మటన్ వంటివి కొద్దిగా తీసుకోవాలి. ఇలా మన ఆహారంలో ఇవి మూడూ ఉండాలి. పసుపు, వెల్లుల్లి, అల్లం, కొత్తిమీర వంటివి ప్రతిరోజూ ఆహారంలో భాగంగా చేసుకుంటే కరోనా సమయంలో ఏ కషాయాలు తాగాల్సిన అవసరంలేదు. రోజులో అప్పుడప్పుడు పళ్లు, డ్రైప్రూట్స్ తీసుకుంటూ ఉండాలి. వ్యాయామం.. నిద్ర.. నీరు ఇక ప్రతిరోజూ 30 నుంచి 45 నిమిషాలు ఆగకుండా వాకింగ్ చేయ డం ఆరోగ్యానికి మంచిది. లేదా ప్రాణాయామంతో కూడిన యోగా చేసుకోవచ్చు. కరోనా సమయంలో ప్రాణాయామం ముఖ్యం. వ్యాయామంతోపాటు ప్రతి ఒక్కరూ ఆరు నుంచి ఏడు గంటలపాటు నిద్ర పోవాలి. నిద్ర లేకపోవడం వల్ల హార్మోన్లు దెబ్బతిని అవయవాల పనితీరు తగ్గిపోతుంది. ఇది ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. అలాగే రోజుకు 10–12 గ్లాసుల నీరు తాగితే మంచిది. దీనివల్ల డీహైడ్రేషన్ ప్రమాదం ఉండదు. మానసికంగా లేదా శారీరకంగా తీవ్రమైన ఒత్తిడి, అలసట ఏర్పడితే మనలో ఉన్న హార్మోన్లు తగ్గడం లేదా పెరగడం జరుగుతాయి. అందువల్ల ఒత్తిడిని తగ్గించుకో వడానికి వ్యాయామం, సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా అవసరం. పెద్దలకు ప్రతిరోజూ మల్టీ విటమిన్... తినే ఆహారంలో అన్ని విటమిన్లు ఉంటాయి. రకరకాల కారణాల వల్ల ఒక్కోసారి అవసరమైన విటమిన్లు శరీరానికి సరిగా అందవు. కాబట్టి పెద్దవాళ్లు రోజూ ఒక మల్టీ విటమిన్ మాత్ర వేసుకోవాలి. కడుపునిండా తిన్న తర్వాతే మాత్ర వేసుకోవాలి. మల్టీ విటమిన్లో విటమిన్–సీ, యాంటి ఆక్సి డెంట్స్ ఉంటాయి. శరీరంలో ఇన్ఫెక్షన్, ఊపిరితి త్తుల్లో సమస్య రాకుండా చూసుకుంటాయి. ఒకవేళ కరోనా వచ్చినా ఇబ్బంది ఉండదు. పండ్లను జ్యూస్ చేసుకోకూడదు.. అన్ని రకాల పండ్లను జ్యూస్ చేసుకొని తాగకూడదు. పండ్లను నేరుగా తినడమే మేలు. జ్యూస్ చేయడం వల్ల వాటిలో షుగర్ చేరుతుంటుంది. ఇది ఏమాత్రం మంచిది కాదు. నేల లోపల పండే క్యారె ట్, బీట్రూట్ లాంటి వాటిని ఉడికించే తినాలి. లేకుంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇక చాలామంది సకాలంలో ఆహారం తినకపోవడం వల్లనే బరు వు పెరుగుతూ ఉంటారు. ఉదయం అల్పా హారం సరిగా తినకపోవడం వల్ల మధ్యాహ్నం ఎక్కువగా తింటాం. ఉదయం ఏదైనా కొద్ది మోతాదులో టిఫిన్‌తోపాటు ఒక ఎగ్ లేదా కూరగాయలు తింటే సరిపోతుంది. అన్నం పరిమాణం తగ్గించుకోవాలి. సాయంత్రం తక్కువ తినాలి. తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారి లక్షణాలు.. తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారికి తరచుగా జలుబు చేస్తుంది. ఒత్తిడికి గురవుతుంటారు. ప్రతి చిన్నదానికీ భయపడుతుంటారు. గ్యాస్ట్రిక్ సమస్యలు, మలబద్దకం, విరేచనాలు వస్తుంటాయి. తరచుగా ఇన్ఫెక్షన్లు వస్తాయి. శారీరకంగా పెద్దగా శ్రమ చేయకుండానే అలసిపోతుంటారు. -
కరోనానీ, క్రిముల్నీ కడిగి పారేద్దాం!
కరోనా వైరస్ విజృంభించాక జనం మనసులో అనేక అనుమానాలు. దేనిపై వైరస్ ఉందో అంటూ ఎన్నెన్నో సంశయాలు. ఏ పేస్టో, బ్రష్షో... లేదా అట్ట పెట్టెలో ప్యాక్ అయి ఉండేదో కొన్నారనుకోండి రేపర్నూ పారేసి... చేతులు శానిటైజ్ చేసుకుని నిశ్చింతగా వాడుకోవచ్చు. మరి అలా ప్యాక్‌లలో రానివైతేనో? కరోనా వైరస్ అట్టపెట్టెలూ, ఇతరత్రా వాటిపై కొద్దిగంటల పాటే ఉన్నా... ప్లాస్టిక్ మీద గరిష్ఠంగా 72 గంటల పాటు ఉంటుందని మనకు తెలుసు కాబట్టి ఏ వస్తువునైనా గరిష్టంగా మూడు రోజులు ముట్టుకోకుండా నాలుగో రోజు నుంచి వాడుకుంటే సేఫ్. కానీ కూరగాయలూ, ఆకుకూరలూ, పండ్లు నిల్వ ఉండవు. కూరగాయలూ, ఆకుకూరలంటే మంట మీద వండుతాం. కాబట్టి దాదాపు సురక్షితమే. కానీ పండ్లను వండలేం. కొన్నింటిని పొట్టు వలిచి తిన్నా... చాలావాటిని అలాగే తినేస్తాం. కాబట్టి కూరగాయలూ, ఆకుకూరలూ, పండ్లు మొదలైన తినే పదార్థాలనూ ఎలా శుభ్రపరచుకోవాలో తెలుసుకుందాం. మనం తినే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను శుభ్రం చేసుకోవాల్సిందే. అయితే అన్నిరకాల వెజిటబుల్స్‌ను ఒకేలా శుభ్రం చేయడం సరికాదు. వేర్వేరు వెజిటబుల్స్‌ను, పండ్లను ఎలా శుభ్రపరచుకోవాలో చూద్దాం. ముందుగా చేతులు శుభ్రపరచుకోండి... కూరగాయలూ, ఆకుకూరలూ శుభ్రపరచడానికి ముందుగా మన చేతుల్ని శుభ్రపరచుకోవాలి. సాధారణంగా ఇతర పరిస్థితుల్లో మనం శానిటైజర్‌తో శుభ్రం చేసుకున్నా... కూరగాయలూ, ఆకుకూరలూ, పండ్లు కడిగే ముందర మాత్రం శానిటైజర్‌ను వాడటం సరికాదు. ఇందుకోసం కేవలం యాంటీబ్యాక్టీరియల్ సబ్బుతో చేతుల్ని కడుక్కోవాలి. ఆహారాన్ని ఎలా శుభ్రం చేయాలంటే... ముందుగా ఒక గిన్నెలో తగినన్ని నీళ్లు పోసుకోవాలి, ఆ నీళ్లకు కాస్తంత వెనిగర్ కలుపుకుని నీటి సొల్యూషన్‌ను సిద్ధం చేసుకోవాలి. ఈ సొల్యూషన్ తయారు చేయడానికి... నాల్గింట మూడొంతుల నీళ్లు తీసుకొని అందులో ఒక వంతు వెనిగర్ కలపడం ద్వారా ఈ సొల్యూషన్‌ను తయారు చేయాలి. ఒకవేళ వెనిగర్ లేనివారు కేవలం కిచెన్‌లోని నీళ్లతోనే శుభ్రం చేస్తుంటే... కడగబోయే కూరగాయలపైనా, పండ్లపైనుంచి నీరు కాసేపు పైనుంచి ధారగా పడుతూ ప్రవహించేలా చేయాలి. మట్టి కింద ఉండే దుంపల్ని శుభ్రం చేయడమిలా... మట్టి కింద ఉండే బంగాళదుంప, క్యారట్ వంటి వాటిని వెంటనే శుభ్రపరచకుండా, ముందుగా కొద్దినిమిషాలు నీళ్లలో నాననివ్వాలి. ఎలాగూ చెక్కుతీసి వాడినప్పటికీ, నానాక కోసే ముందు ఇంకోసారి ధారగా పడే నీళ్లలో కడగాలి. కాలిఫ్లవర్, బ్రకోలీ లాగా ముడుతలు ముడుతలుగా ఉండి, ఆ ముడుతల్లో మట్టి చేరే అవకాశమున్న పువ్వుకూరలను కాసేపు నీళ్లలో నాననివ్వాలి. ఆ తర్వాత నీళ్లు కారిపోయేలా రంధ్రాలుండే పాత్ర (కొలాండర్)లోకి వాటిని తీసుకోవాలి. కాయగూరల పైపొర చెక్కు తీసేలా ఉండే పొట్లకాయ, బీరకాయ, సొరకాయ వంటివాటిని పైనుంచి ధారగా పడుతున్న నీటిలో ఒకటికి రెండుసార్లు కడిగిన తర్వాతే కోయాలి. పుట్టగొడుగులను వాడేవారు మష్రూమ్ బ్రష్‌తో వాటిని చల్లటి నీటిలో కడిగి, టిష్యూతో శుభ్రం చేయాలి. కూరగాయలలో వంకాయలను కోసే పద్ధతి కాస్త వేరుగా ఉంటుంది. ముందుగా వంకాయలను ధారగా పడుతున్న నీటిలో కడగాలి. ఆ తర్వాత కాస్తంత నిమ్మనీరు, కాస్తంత ( 2 శాతం) చింతపండు నానేసిన నీరు, కాస్తంత ఉప్పు, 4 శాతం అసిటిక్ ఆసిడ్ ద్రవాలను ఒక పెద్ద పాత్రలోని నీళ్లలో కలిపి, ఆ ద్రవంలో ఒక్కొక్క వంకాయను విడివిడిగా కడగాలి. దీనివల్ల వంకాయల మీద ఉన్న క్రిమిసంహారకాలు పోతాయి. పండ్లను ఇలా కడగాలి... పుచ్చకాయ, కర్బూజకాయ లాంటి వాటిని ధారగా పడుతున్న నీటికింద కడుగుతూ మెత్తటి కుచ్చులున్న వెజిటబుల్ బ్రష్‌తో శుభ్రంగా కడిగాకే, ముక్కలుగా కోయాలి. ఇక నేరేడు, బెర్రీపండ్ల వంటి వాటిని వెనిగర్ సొల్యూషన్‌లో కడగాలి. మనం షాపింగ్ చేస్తున్నప్పుడే పండుపై దెబ్బలేని వాటిని ఎంపిక చేయాలి. మొత్తం ఒకే కట్టగా ఉండేవాటిని కడగడం ఇలా... కొత్తిమీర, కర్వేపాకులను సాధారణంగా మొత్తం కట్టకట్టనంతా ఒకేసారి కడుగుతుంటారు. వీటిని నీరు నిండి ఉన్న బౌల్లో రెండు మూడుసార్లు రౌండ్ రౌండ్‌గా తిప్పుతూ కడగాలి. అలా కడిగిన ప్రతిసారీ ఆ నీటిని పారబోసి మరోసారి రౌండ్‌గా తిప్పుతూ కడగాలి. ఆ తర్వాత పేపర్ టవల్‌తో తుడవాలి. కొలరాడో స్టేట్ యూనివర్సిటీ చెప్పేదేమంటే... ఇలాంటి వాటిని కడగడానికి ఉపయోగించే నీటిలో కాస్తంత నిమ్మరసం, కొంత వెనిగర్ వేయడం వల్ల కట్ట మీది బ్యాక్టీరియా, ఈ–కొలై శుభ్రంగా కడుక్కుపోవడంతో పాటు కాస్తంత మంచిదీ కొత్తదీ అయిన రుచి (ఫ్లేవర్) కూడా వస్తుంది. ఇవి మాత్రమే కాదు... ఇవేగాక... మనం రోజూ వాడుకునే వంట ప్లాట్‌ఫామ్‌ను ఏదైనా డిజ్ఇన్ఫెక్టెంట్ కలిపిన నీళ్లతో శుభ్రంగా కడిగి పొడిగా తుడవాలి. అలాగే మనం వాడే స్టౌను రోజూ డిజ్ ఇన్ఫెక్టెంట్తో శుభ్రపరచుకోవాలి. ఇక కూరగాయలు తరిగే చాకులు, కత్తిపీటలు, స్పూన్లు, ఫోర్క్‌లు, గిన్నెలు దించడానికి వాడే పట్టకార్లూ వంటి వాటిని కూడా. అయితే వీటికి డిజ్ఇన్ఫెక్టెంట్ వాడకుండా... సబ్బు/డిటర్జెంట్‌తో కడుక్కుని, తర్వాత మరోసారి మంచినీళ్లతోనూ కడుక్కోవాలి. హై టచ్ పాయింట్స్... మనం కిచెన్‌లో రోజులో తరచూ ముట్టుకునే ప్రదేశాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకు కిచెన్ వాష్‌బేసిన్ నాబ్స్, నల్లా/కొళాయి (ట్యాప్) నాబ్స్, చేతులు తుడుచుకునే న్యాప్కిన్స్, ఫ్రిజ్ హ్యాండ్లింగ్, గ్రైండర్లు, రైస్ కుక్కర్లూ, డోర్ హ్యాండ్లర్స్ (నాబ్స్) వీటిని తరచూ (ఒక్కోసారి మనకు తెలియకుండానే) ముట్టుకుంటూ ఉంటాం. కాబట్టి వీటిని హై టచ్ పాయింట్స్ అనుకోవచ్చు. వీటిని తరచూ లేదా రోజులో రెండుమూడుసార్లు డిజ్ఇన్ఫెక్టెంట్స్తో శుభ్రపరచుకుంటూ ఉండాలి. గిన్నెలు కడగడమిలా... గిన్నెలు, బౌల్స్‌ను డిటెర్జెంట్ కలిపిన వేణ్ణీళ్లతో మొదట కడగాలి. ఆ డిటర్జెంట్ తాలూకు సబ్బు పూర్తిగా కడుక్కుపోయేలా మళ్లీ ఓసారి మంచినీళ్లతో కడగాలి. ఆ తర్వాతే మనం శుభ్రం చేసుకున్న కూరగాయలను ఆ గిన్నెలలో పెట్టుకోవాలి. సాధ్యమైనంత వరకు గిన్నెలు లోహంతో చేసినవి కాకుండా, పింగాణీవి అయితే అవి చాలా శుభ్రంగా ఉండే అవకాశాలు ఎక్కువ. ఇక గ్రైండర్స్ లాంటివి శుభ్రపరచుకోవడం మామూలే. అయితే గ్రైండర్స్ను డిటెర్జెంట్తోనూ, ఆ తర్వాత మంచినీళ్లతో శుభ్రపరచుకున్నప్పటికీ... వాటి హ్యాండ్లింగ్స్ను మాత్రం డిజ్ఇన్ఫెక్టెంట్తో శుభ్రం చేసుకుని, ఆ తర్వాత తుడుచుకోవాలి. వేర్వేరు వెజిటబుల్స్ శుభ్రపరిచే పద్ధతులివి... చిన్న కాడకు అంటి ఉండే పండ్లను మొదట బాగా శుభ్రం చేశాక... తర్వాత కాడ వద్ద మరోసారి శుభ్రపరచాలి. ఎందుకంటే మురికి పేరుకునే అవకాశాలు కాడ వద్దే ఎక్కువ. ఇలా కాడ ఉన్న పండ్లను శుభ్రం చేశాక తినేముందర అటు కాడ వైపు, ఇటు రెండో చివరివైపు చెక్కు తీసినట్లుగా కత్తితో కోయడం మంచిది. ఆపిల్, పియర్, పీచ్ పండ్ల విషయంలో ఇలా చేయవచ్చు ∙మందంగా తోలు ఉండే పండ్లు (ఉదాహరణకు నారింజ, కమలాలు) తెచ్చినరోజే కడుక్కుని పెట్టుకుంటే మనకు నిశ్చింతగా ఉంటుంది. దాన్ని ఎన్నిసార్లు ముట్టుకున్నా మనకు వైరస్‌గానీ... లేదా ఇతర సూక్ష్మజీవుల భయంగాని ఉండదు. ఇక ఎలాగూ తినబోయే ముందు తొక్క వలుచుకుని తింటాం కదా. మరీ అనుమానంగా ఉంటే ఓసారి కాస్తంత తేలిగ్గా కడగడం మేలు ∙ఇక పాలకూర, లెట్యూజ్, కొత్తిమీర, కరివేపాకు, క్యాబేజీ లాంటి వాటిని శుభ్రం చేసే ముందర వాటిని నల్లా/కొళాయి కింద ప్రవహించే నీళ్ల కింద కాసేపు ఉంచి, శుభ్రం చేయడం మంచిది. క్యాబేజీ పైన ఉన్న ఆకులు ఒకటి రెండు పొరలను తీసేస్తే చాలు. మిగతాదంతా శుభ్రంగా ఉంటుంది ∙ఆకుకూరల్ని శుభ్రంగా కడిగాక వాటిపై నీళ్లు ఆరేలా కాసేపు ఆగాలి. ఆ తర్వాత శుభ్రమైన టవల్‌తో వాటిని తుడవాలి. అప్పుడే వాటిని కోయాలి. అంతేగానీ ఆకుకూరల్ని కోశాక వాటిని కడగడం సరికాదు. అలా చేస్తే పోషకాలు కోల్పోతాం. అంతేకాదు... తరిగాక కడిగితే... వాటిపైనున్న మురికి... కోసిన ప్రాంతంలో అతుక్కునే ప్రమాదముంది ∙సలాడ్స్ కోసం... ఆకుకూరలను, కాయగూరలను తాజాగా ఉండగానే కడిగి సలాడ్స్ చేసుకోవాలి. ఆహారం శుభ్ర పరచడంలో చేయ కూడనివి... ఆహారాన్ని ఎప్పుడైనా సబ్బుతోగాని, డిటెర్జెంట్‌తో గాని, బ్లీచింగ్ పదార్థాలతో గాని, రసాయన పదార్థాలతోగాని శుభ్రం చేయకూడదని గుర్తుంచుకోండి. కేవలం పరిశుభ్రమైన నీటితో మాత్రమే శుభ్రం చేయాలని తెలుసుకోండి. కడగటం అవసరం లేకున్నా ఒకసారి కడిగితే మేలు.. వాస్తవానికి ఈ కింద పేర్కొన్న ఆహారపదార్థాలను కడగాల్సిన అవసరం లేదు. కడగకున్నా పర్లేదు. అయినా ఒకసారి కడగడం వల్ల నష్టం లేదు. అవి... ∙ఉల్లిగడ్డ ∙అవకాడో ∙మొక్కజొన్న పైనాపిల్ ∙మామిడిపండ్లు ∙కివీ క్యాబేజీ ∙బొప్పాయి ∙పుచ్చకాయ ∙బ్రాకోలీ ∙టొమాటో ∙చిలగడదుంప (మోరంగడ్డ). వీటిలో ఉల్లిగడ్డ విషయానికి వస్తే కడగటం కుదరకపోతే... ఒకటి రెండు పొరలను తీసి వాడటం మంచిది. - సుజాతా స్టీఫెన్, సీనియర్ న్యూట్రీషనిస్ట్ -
‘నచ్చకపోతే నిరభ్యంతరంగా వెళ్లి పోవచ్చు’
బాలీవుడ్ హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా సోషల్ మీడియాలో ఎంత చురుకుగా ఉంటారో అందరికి తెలిసిన విషయమే. ఏ విషయం గురించైనా ఎలాంటి మొహమాటం లేకుండా తన అభిప్రాయాలను వెల్లడిస్తారు ట్వింకిల్ ఖన్నా. ఈ క్రమంలో సోషల్‌మీడియా వేదికగా ఓ న్యూట్రిషియనిస్ట్కు గట్టి కౌంటరే ఇచ్చారు ట్వింకిల్ ఖన్నా. ఇంతకు విషయం ఏంటంటే.. కొన్ని రోజుల క్రితం ట్వింకిల్ ఖన్నా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. దానిలో ‘నా ఇన్‌బాక్స్‌లో ఒక విషయానికి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయి. ఐరన్ లేవల్స్ని ఎలా పెంచుకోవాలనే దాని గురించి జనాలు నన్ను ఎక్కువగా ప్రశ్నిస్తున్నారు. వారికోసం ఇక్కడ కొన్ని సూచనలు చేస్తున్నాను. ఒకటి ప్రతిరోజు నీటితో కలిపిన ఓట్స్ లేదా బాదంపాలు.. రెండు క్వినోవా.. మూడు తరిగిన గింజలు.. నాలుగు గుమ్మడి గింజలు. వీటిని ఓ మూడు నెలల పాటు తీసుకోండి. ఆ తర్వాత మీరే చూడండి’ అంటూ ట్వింకిల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. అయితే దీనిపై ఓ న్యూట్రిషియనిస్ట్ ట్వింకిల్‌ని ట్రోల్ చేశారు. ‘ప్రతి ఒక్కరు ఆహారం గురించి సలహాలిచ్చేవారే’ అంటూ కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by Twinkle Khanna (@twinklerkhanna) on May 2, 2019 at 9:38am PDT అయితే సదరు న్యూట్రిషియనిస్ట్ వ్యాఖ్యలపై కాస్త ఘాటుగానే స్పందించారు ట్వింకిల్. ‘మీరు పోషాకాహార నిపుణులు.. కానీ జనాలకు పనికివచ్చే ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి కూడా చెప్పరు. నా జీవితమంతా ఎనిమియా(రక్తహీనత)తో బాధపడ్డాను. ఈ చిన్న చిన్న విషయాలను పాటించడం ద్వారా చాలా మార్పు చూశాను. చాలా తక్కువ సమయంలోనే నేను రక్తహీనత నుంచి బయటపడ్డాను. మరి జనాలకు మేలు చేసే ఇలాంటి అంశాల గురించి చెప్తే తప్పేంటి. నేను చెప్పిన విషయం మీకు నచ్చకపోతే వదిలేయండి.. తప్పైతే నిరూపించడం. అంతేకానీ ద్వేషాన్ని మాత్రం పెంచకండి. ఒకవేళ అలాంటిది చేయాలనుకుంటే నా పేజ్ నుంచి వెళ్లిపొండి’ అని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ట్వింకిల్ ఖన్నా. -
జీవామృతంతో నిశ్చింత!
పోషకాహార నిపుణురాలి ‘ఇంటిపంట’ల అనుభూతులు హుద్‌హుద్ తుపాను తూర్పు తీరంలో సృష్టించిన విధ్వంసం ఏపాటితో తెలియనిది కాదు. విశాఖపట్నంలో.. మేడ మీద సేంద్రియ ఆకుకూరలు పెరుగుతున్న కుండీలు తుపాను గాలికి కొట్టుకుపోయాయి. అయినా, ఆమె నిరుత్సాహపడలేదు. మరింత పట్టుదలతో కిచెన్ గార్డెన్‌ను పునర్నిర్మించారు. పూలు, ఆకుకూరలతోపాటు ఇప్పుడు కూరగాయలు కూడా రెట్టించిన ఉత్సాహంతో సాగు చేస్తున్నారు. ఆమె వృత్తిరీత్యా పోషకాహార నిపుణురాలు, ప్రవృత్తి రీత్యా సేంద్రియ ఇంటిపంటల సాగుదారు.. ఆమె పేరు పిన్నమరాజు ఉషా గజపతిరాజు (99492 11022). జీవామృతంతో నిశ్చింతగా‘ఇంటిపంట’లు పండిస్తున్నానంటున్న ఆమె అనుభూతులు .. ఆమె మాటల్లోనే.. విశాఖపట్నం ఈస్ట్ పాయింట్ కాలనీలోని సొంత అపార్ట్మెంట్(గ్రూప్‌హౌస్)లో నివాసం ఉంటున్నాం. పోషకాహార నిపుణురాలిగా సేంద్రియ ఆకుకూరల ప్రాధాన్యత గుర్తెరిగి మేడపైన కుండీల్లో పూల మొక్కలతో పాటు ఆకుకూరలు పండిస్తున్నా. హుద్‌హుద్ తుపాను గాలికి కుండీలన్నీ కొట్టుకుపోయాయి. ఆకుకూరలు, కూరగాయలను తాజాగా తింటేనే పోషకాలు పుష్కలంగా పొందగలం. బజారులో సేంద్రియ ఆకుకూరలు ఎప్పుడో గానీ దొరకవు. దొరికినా.. వాటిని నిజంగా సేంద్రియంగా పండించారో లేదో తెలీదు. అందుకే కొన్ని ఏళ్ల నుంచి పూలతోపాటు అనేక ఆకుకూరలను కుండీల్లో మక్కువతో పండిస్తున్నా. తుపాను తర్వాత 100-120 వరకు పనికిరాని థర్మకోల్ బాక్సులు, ప్లాస్టిక్ డబ్బాలు, సంచుల్లో ఇంటి పంటలు పెంచుతున్నా. ప్రస్తుతం మెంతికూర సహా ఐదారు రకాల ఆకుకూరలతో పాటు టమాటా, ముల్లంగి, బీన్స్, ఆనప, దోస, బీర, కాకర, మిర్చి, బెండ, ఉల్లికాడలను పెంచుతున్నా. వంటింటి వ్యర్థాలను కంపోస్టుగా మార్చి ఇంటిపంటలకు వాడుతున్నా. ఇంటిపంటల వల్ల కలిగే ప్రయోజనాలు అపరిమితం. ఇవి మన కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడటంతోపాటు మానసికోల్లాసంతోపాటు శారీరక వ్యాయామానికి కూడా తోడ్పడతాయి. సామాజిక మాధ్యమంలో ఇంటిపంట గ్రూప్, రైతుమిత్ర గ్రూప్, బెంగళూరు టై గార్డెన్ గ్రూపులు పరిచయమయ్యాక ఎంతో నేర్చుకున్నాను. జీవామృతం పరిచయం అయిన తర్వాత కిచెన్ గార్డెన్ చాలా బాగుంది. చీడపీడలను నియంత్రించడం సులువుగా మారింది. అంతకుముందు రసాయనాలు పిచికారీ చేసినా ఫలితం ఉండేది కాదు. జీవామృతాన్ని నెలకు రెండుసార్లు స్వయంగా తయారు చేసుకుంటున్నా. దీన్ని 1:10 పాళ్లలో నీటిలో కలిపి రోజు మార్చి రోజు మొక్కలకు పోస్తున్నా.. చల్లుతున్నా. మా అమ్మాయి పైచదువులకు అమెరికా వెళ్లిన తర్వాత ఇంటిపంటలకు మరింత దగ్గరయ్యా. నా పేషెంట్లక్కూడా ఇంటిపంటల సాగు వ్యాపకాన్ని పరిచయం చేస్తున్నా. ఇద్దరు, ముగ్గురు ఇప్పటికే మొదలుపెట్టారు కూడా.. మా కుటుంబానికి కావాల్సిన ఆకుకూరలు 100%, కూరగాయలు 50% టై గార్డెన్ ద్వారా సమకూర్చుకోవటం నాకు చాలా సంతృప్తిగా ఉంది. -
నో అనకుండా తినేయండి!
ఫుడ్ n బ్యూటీ ‘కోడిపులుసు-గారెలు’ కాంబినేషన్‌ను ఆరగించాలంటే చాలా మందికి భయం. లావవుతామని, చికెన్ రూపంలో శరీరంలోకి కొవ్వు నిల్వలు చేరిపోతాయేమోనని వీటి కి దూరంగా ఉంటారు. అలాంటి భయాలేమీ పెట్టుకోనక్కర్లేదు. తెలుగువారి సంప్రదాయబద్ధమైన ఈ ఆహారాన్ని కొన్ని టిప్స్ పాటించి వండుకుంటే చాలు, నో అనకుండా తినేయొచ్చు! - డా॥జానకి,న్యూట్రిషనిస్ట్ కోడిపులుసు తయారీకి... కావాల్సినవి: చికెన్ స్కిన్లెస్-250 గ్రాములు ఉల్లిపాయలు- 2; పచ్చిమిర్చి- 4 యాలకులు- 3; లవంగాలు- 4 ధనియాల పొడి- రెండు టీ చెంచాలు కారం- ఒకటి లేదా రెండు చెంచాలు పసుపు- 1/2 చెంచా నూనె - 3 చెంచాలు చింతపండు రసం- పావు కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్- రెండు చెంచాలు దాల్చిన చెక్క; ఉప్పు- తగినంత విధానం: పాత్రలో ముందుగా నూనెను వేడి చేయాలి. యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేయాలి. తర్వాత ఉల్లిపాయలు, ఉప్పు వేసి ఫ్రై చేశాక, అల్లం వెల్లుల్లి పేస్టు జోడించాలి. ఫ్రై అయ్యాక తరిగిన పచ్చిమిర్చి వేయాలి. తర్వాత పసుపు, ధనియాలపొడి, కారంపొడి వేయాలి. ఇప్పుడు చికెన్ వేసి అంతటినీ కలపాలి. తగినన్ని నీళ్లు పోసి మూతపెట్టి ఉడికించాలి. చివర్లో చింతపండు రసం పోసి 5 నిమిషాల్లో దించాలి. గారెల తయారీకి... కావాల్సినవి: మినప్పప్పు- పావు కిలో ఉల్లిపాయలు- 2; పచ్చిమిర్చి- 4 జీరా- 2 చెంచాలు; అల్లం- 1 చెంచా కరివేపాకు - ఒక రెమ్మ; నూనె, ఉప్పు. విధానం: మినప్పప్పును రెండు గంటల పాటు నానబెట్టి, రుబ్బు కోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీరా, అల్లం, ఉప్పు... పప్పుతో పాటు గ్రైండ్ చేసుకోవాలి. పిండిని గారెలుగా చేసుకుని, నూనెలో వేయించాలి. చలికాలంలో మంచివి చికెన్ పులుసు, గారెలు శీతాకాలంలో తగిన శక్తినీ, శరీరానికి వేడినీ ఇస్తాయి. మాంసంలోని ప్రొటీన్లు విలువైనవి. మినప్పప్పులో ఫైబర్(పీచు) ఎక్కువుంటుంది కాబట్టి, చికెన్‌తో కలిపి తినడం జీర్ణానికి మంచిది. టిప్: మినప్పప్పు గ్రైండింగ్‌లో తక్కువ నీటిని ఉపయోగిస్తే, వేయించేప్పుడు, ఒక వాయి గారెలు ఐదు గ్రాముల కన్నా తక్కువ నూనెను పీల్చుకుంటాయి! పోషక విలువలు: 100 గ్రాముల చికెన్‌లో 26 గ్రా. ప్రోటీన్స్, 6 గ్రా. ఫ్యాట్, 190 కిలో క్యాలరీల శక్తి; గారెల్లో వంద గ్రాములకు 24 గ్రా. ప్రోటీన్స్, 5 గ్రా. ఫ్యాట్, 350 కిలో క్యాలరీల శక్తి ఉంటాయి. రిపోర్టింగ్: బీదాల జీవన్‌రెడ్డి ఫొటో: జి.రాజేష్ -
నేనిప్పుడు పూర్తి శాకాహారిని!
మన శరీరానికి ఏ ఆహారం నప్పుతుందో తెలుసుకోవడం ఓ ఆర్ట్. కొన్నేళ్ల క్రితం వరకు శ్రుతీ హాసన్‌కి ఆ కళలో పెద్దగా నేర్పు లేదు. కానీ, ఒక న్యూట్రిషనిస్ట్ ఇచ్చిన సలహా వల్ల ఏం తినాలో? ఏం తినకూడదో శ్రుతి తెలుసుకున్నారు. ఇటీవల ఈ బ్యూటీ శాకాహారిగా మారిపోయారు. దాని గురించి చెబుతూ - ‘‘మా బాపూజీ (తండ్రి కమల్‌హాసన్ గురించి) ఇచ్చిన సలహాని అనుసరిస్తూ, శాకాహారిగా మారిపోయా. అందుకు, ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా’’ అన్నారు శ్రుతి. ఇదిలా ఉంటే.. ఇటీవల తన ట్విట్టర్లో.. ‘జీవితంలో మార్పులు సహజం. ఏం జరిగినా దానికో కారణం ఉంటుంది. నో బిగ్గీ’ అని ెపెట్టారామె. నో బిగ్గీ.. అంటే పెద్ద సినిమా అవకాశాన్ని వదులుకున్నారని ఎవరికివాళ్లు ఊహిస్తారు. శ్రుతి వదులుకున్న ఆ సినిమా తమిళ హీరో విజయ్‌దని కూడా చెప్పుకుంటున్నారు. శింబుదేవన్ దర్శకత్వం వహించనున్న అత్యంత భారీ చిత్రం ఇది. ఆ మధ్య ఈ చిత్రంలో నటించే అవకాశం వచ్చినందుకు ఆనందం కూడా వ్యక్తం చేశారు శ్రుతి. కానీ, ఇప్పుడందరూ ఈ సినిమాలో తను నటించడంలేదని ఊహించడంతో మళ్లీ ట్వీట్‌తో స్పష్టత ఇచ్చారు. ‘‘నా ట్వీట్‌ని తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను ఇప్పటివరకు ఏయే చిత్రాలనైతే ప్రకటించానో వాటిలో ఉన్నాను. ఏదీ మిస్ చేసుకోలేదు’’ అని శ్రుతిహాసన్ చెప్పారు.