‘నచ్చకపోతే నిరభ్యంతరంగా వెళ్లి పోవచ్చు’ | Twinkle Khanna Blasts Nutritionist For Trolling Her | Sakshi
Sakshi News home page

న్యూట్రిషియనిస్ట్‌కి గట్టి కౌంటర్‌ ఇచ్చిన ట్వింకిల్‌ ఖన్నా

May 3 2019 4:02 PM | Updated on May 3 2019 4:06 PM

Twinkle Khanna Blasts Nutritionist For Trolling Her - Sakshi

బాలీవుడ్‌ హీరోయిన్‌ ట్వింకిల్‌ ఖన్నా సోషల్‌ మీడియాలో ఎంత చురుకుగా ఉంటారో అందరికి తెలిసిన విషయమే. ఏ విషయం గురించైనా ఎలాంటి మొహమాటం లేకుండా తన అభిప్రాయాలను వెల్లడిస్తారు ట్వింకిల్‌ ఖన్నా. ఈ క్రమంలో సోషల్‌మీడియా వేదికగా ఓ న్యూట్రిషియనిస్ట్‌కు గట్టి కౌంటరే ఇచ్చారు ట్వింకిల్‌ ఖన్నా. ఇంతకు విషయం ఏంటంటే.. కొన్ని రోజుల క్రితం ట్వింకిల్‌ ఖన్నా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేశారు.

దానిలో ‘నా ఇన్‌బాక్స్‌లో ఒక విషయానికి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయి. ఐరన్‌ లేవల్స్‌ని ఎలా పెంచుకోవాలనే దాని గురించి జనాలు నన్ను ఎక్కువగా ప్రశ్నిస్తున్నారు. వారికోసం ఇక్కడ కొన్ని సూచనలు చేస్తున్నాను. ఒకటి ప్రతిరోజు నీటితో కలిపిన ఓట్స్‌ లేదా బాదంపాలు.. రెండు క్వినోవా.. మూడు తరిగిన గింజలు.. నాలుగు గుమ్మడి గింజలు. వీటిని ఓ మూడు నెలల పాటు తీసుకోండి. ఆ తర్వాత మీరే చూడండి’ అంటూ ట్వింకిల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేశారు. అయితే దీనిపై ఓ న్యూట్రిషియనిస్ట్‌ ట్వింకిల్‌ని ట్రోల్‌ చేశారు. ‘ప్రతి ఒక్కరు ఆహారం గురించి సలహాలిచ్చేవారే’ అంటూ కామెంట్‌ చేశారు.

అయితే సదరు న్యూట్రిషియనిస్ట్‌ వ్యాఖ్యలపై కాస్త ఘాటుగానే స్పందించారు ట్వింకిల్‌. ‘మీరు పోషాకాహార నిపుణులు.. కానీ జనాలకు పనికివచ్చే ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి కూడా చెప్పరు. నా జీవితమంతా ఎనిమియా(రక్తహీనత)తో బాధపడ్డాను. ఈ చిన్న చిన్న విషయాలను పాటించడం ద్వారా చాలా మార్పు చూశాను. చాలా తక్కువ సమయంలోనే నేను రక్తహీనత నుంచి బయటపడ్డాను. మరి జనాలకు మేలు చేసే ఇలాంటి అంశాల గురించి చెప్తే తప్పేంటి. నేను చెప్పిన విషయం మీకు నచ్చకపోతే వదిలేయండి.. తప్పైతే నిరూపించడం. అంతేకానీ ద్వేషాన్ని మాత్రం పెంచకండి. ఒకవేళ అలాంటిది చేయాలనుకుంటే నా పేజ్‌ నుంచి వెళ్లిపొండి’ అని సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు ట్వింకిల్‌ ఖన్నా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement