Twinkle Khanna
-
Twinkle Khanna: చచ్చిపోతాననే అనుకున్నా!
బహిరంగ ప్రదేశాలలో ఉన్నప్పుడు ప్రకృతి కల్పించిన అత్యవసరతను తీర్చుకోటానికి మహిళలకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవటం అన్నది ఇప్పటికీ ఉంది. ఏ చోటా వారికి ‘చాటు‘ దొరకదు. ప్రతిచోటా మగవాళ్లు.. మగవాళ్లు... మగవాళ్లు. ఎంతసేపని ఆపుకుని ఉండగలరు? చచ్చేంత పనౌతుంది.1990 లలో ‘జాన్‘ షూటింగ్ అప్పుడు ట్వింకిల్ ఖన్నాకు ఇలాంటి గడ్డు కాలమే దాపురించింది. చీకటితోనే కాలకృత్యాలు ముగిసినా, వెలుగొచ్చాక మళ్లీ ఒకసారి ‘ఒకటికి‘ వెళ్లాల్సి వచ్చింది. షూటింగ్ జరుగుతూ ఉన్నది ఒక కొండ పైన. చుట్టూ అంతా మగవాళ్లు. తను, ఒక హెయిర్ డ్రెసర్ మాత్రమే అక్కడున్న అమ్మాయి. వ్యానిటీ వ్యాన్ కూడా లేని రోజులు అవి! అసహాయంగా అలా ప్రాణాలు ఉగ్గబట్టుకునే ఉన్నారు ట్వింకిల్. మధ్యాహ్నం 3 గంటలు అయింది. ‘ఇక చచ్చిపోతాననే అనుకున్నాను. చివరికి భరించలేక నేనే క్రాలర్ నడుపుకుంటూ ఆ కొండ ప్రాంతంలో వెళ్లగలిగినంత దూరం వెళ్లి, తేలికపడ్డాను ‘ అని.. తనకెదురైన అనుభవాన్ని తన ‘ట్వీక్ ఇండియా‘ ఛానల్లో తాజాగా షేర్ చేసుకున్నారు ట్వింకిల్ ఖన్నా.మునుపు జయా బచ్చన్ కూడా ఇలాంటి భయానక పరిస్థితి గురించే తన మనవరాలు నవ్య నవేలీ నందా పాడ్ కాస్ట్లో బయటికి చెప్పుకున్నారు. ‘ఔట్ డోర్ షూటింగ్ లకు వెళ్ళినప్పుడు మాకు వ్యాన్ లు ఉండేవి కావు. పొదల చాటునే దుస్తులు మార్చుకోవలసి వచ్చేది. ప్రతిదీ పొదల వెనకే! కనీసం టాయ్‌లెట్స్ కూడా ఉండేవి కావు. చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉండేది. కొన్నిసార్లు 3–4 సార్లు ప్యాడ్స్ మార్చుకోవలసి వచ్చేది. వాటిని ఒక ప్లాస్టిక్ కవర్ లో కట్టి ఉంచి, ఇంటికి వెళ్లాక పడేయవలసి వచ్చేది‘ అని చెప్పారు జయాబచ్చన్. పిల్లలు ఎక్కడ కావలిస్తే అక్కడ పని కానిచ్చేస్తారు. ఈ విషయంలో మగవాళ్లు పిల్లలుగా ఉండగలరు. కానీ స్త్రీలకు ప్రకృతి కొన్ని స్వభావసిద్ధమైన పరిమితులను విధించింది. సగటు మహిళ అయినా, స్టార్ సెలబ్రిటీ అయినా.. వారి దేహధర్మాలు, సంకోచాలు, బిడియాలలో తేడాలేమీ ఉండవు. వాళ్లకు ఆ ‘స్పేస్‘ కల్పించటం, చూపించటం, లేదా ముందుగా ఏర్పాటు చేసి ఉంచటం పురుష ధర్మం. పురుష లక్షణం కూడా! -
ట్వింకిల్... ట్వింకిల్... లిటిల్ స్టార్స్ జాగ్రత్త!
‘ఒంటరిగా వెళ్లవద్దు.. పార్కుకు, పాఠశాలకు, బీచ్‌కి, మరెక్కడికైనా... మేనమామ, బంధువు లేదా స్నేహితుడైనప్పటికీ.. ఏ వ్యక్తితోనూ ఒంటరిగా వెళ్లవద్దు. ఉదయం, సాయంత్రం మరీ ముఖ్యంగా రాత్రిపూట అస్సలు ఒంటరిగా వెళ్లవద్దు’ అంటూ... నలభై ఏళ్ల క్రితం తల్లి తన చిన్నతనంలో నేర్పించిన భద్రతా పాఠాలనే ఇన్నేళ్ల తర్వాత తన కూతురు నితారాకు కూడా బోధిస్తున్నట్లు గుర్తించానని ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా నాటి బాలీవుడ్ నటి ట్వింకిల్ ఖన్నా చెప్పింది.కోల్‌కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో యువ ట్రైనీ డాక్టర్‌పై జరిగిన దారుణ ఘటన అనంతరం తన కుమార్తెతో తాను ఈ విధంగా సంభాషణ జరిపినట్టు తెలిపింది. అమ్మాయిల భద్రతకు సంబంధించి ఆఫ్‌లైన్‌లో ఇలాంటి ప్రమాదకర స్థితి ఉంటే ఆన్లైన్ ముప్పు మరో విధమైన సమస్యలకు లోను చేస్తుంది. డిజిటల్లో ఆడపిల్లల భద్రతకు సంబంధించి పెద్దలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణులేం చెబుతున్నారో తెలుసుకుందాం.నేటి డిజిటల్ యుగంలో అమ్మాయిల భద్రత బయటి ప్రదేశాలకు మించి విస్తరించింది. గతంలో అపరిచితుల నుంచి ప్రమాదం, రహదారి భద్రత, ఆట స్థలం ప్రమాదాలు.. ఈ ఆందోళనలు ఉండేవి. ఇప్పుడు ఇవి ఇలాగే కొనసాగుతుండగా డిజిటల్ యుగం మరో క్లిష్టమైన లేయర్‌ని ప్రవేశపెట్టింది.ఆన్ లైన్ ముప్పు..ఈ రోజుల్లో పిల్లలు ఆన్ లైన్ ప్రపంచంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇక్కడ పిల్లలను కబళించేందుకు మోసగాళ్లు.. చాట్ రూమ్‌లు, సోషల్ మీడియా ల్యాట్ఫారమ్లు, గేమింగ్ కమ్యూనిటీలలో దాగి ఉంటున్నారు. ఆన్ లైన్ వస్త్రధారణ, దోపిడీ నుంచి వారిని రక్షించడానికి అప్రమత్తత, డిజిటల్ అక్షరాస్యత ప్రతి ఒక్కరికీ అవసరం.సైబర్ బెదిరింపులు..ఇంటర్నెట్ అనేది అపరిచితుల నుంచి బెదిరింపులను ్రపోత్సహిస్తుంది. సైబర్ బెదిరింపు పిల్లల మానసిక ఆరోగ్యానికి, ఆత్మగౌరవానికి ముప్పుగా మారుతుంది.అనుచితమైన కంటెంట్..కేవలం కొన్ని క్లిక్‌లతో, పిల్లలు వారి వయస్సుకు మించి అనుచితమైన కంటెంట్‌ను యాక్సెస్ చేయగలరు, ఇది వారి అభివృద్ధికి ఆటంకమే కాదు హాని కూడా కలిగించవచ్చు. రోడ్డు ప్రమాదాలు, గాయాలు, ప్రకృతి వైపరీత్యాలు పిల్లల భద్రతకు ముప్పును కలిగిస్తూనే ఉన్నాయి. అందువల్ల, ఆఫ్‌లైన్– ఆన్లైన్ నష్టాలను పరిష్కరించే భద్రతా విద్యకు సమతుల్య విధానం అవసరం.అవగాహన తప్పనిసరి..– భయాన్ని పెంచడం కంటే తెలివైన ఎంపికలు చేయడానికి వారిని శక్తిమంతం చేయడంపై దృష్టి పెట్టాలి.– తగిన పర్యవేక్షణ, మార్గదర్శకత్వాన్ని అందిస్తూనే పిల్లలు పరిపక్వం చెందుతున్నప్పుడు క్రమంగా మరింత స్వాతంత్య్రం పొందేందుకు అనుమతించాలి. – పిల్లలకు సమస్య పరిష్కార నైపుణ్యాలను నేర్పించాలి. నమ్మకం, పరస్పర గౌరవం ఉండే వాతావరణాన్ని సృష్టించాలి.– అధిక రక్షణ వారి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. ఆందోళనను సృష్టిస్తుంది. వారు వారి తప్పుల నుండి నేర్చుకునేలా వయసుకి తగిన స్వేచ్ఛను, అవకాశాలను ఇవ్వాలి.– ఆన్ లైన్ బెదిరింపులను విస్మరించవద్దు. ప్రస్తుత ఆన్ లైన్ ట్రెండ్స్, ప్రమాదాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ఇంటర్నెట్ భద్రత గురించి మీ చుట్టూ ఉన్నవారితో మాట్లాడుతూ ఉండండి.– డిజిటల్ భద్రత అనేది కేవలం శారీరక శ్రేయస్సు కంటే ఎక్కువ. హద్దుల్లో ఉండటం, ఆరోగ్యకరమైన సంబంధాలు, అనుచితమైన ప్రవర్తనను ఎలా గుర్తించాలి, ప్రతిస్పందించాలనే దాని గురించి పిల్లలకు బోధించడం ద్వారా భావోద్వేగ భద్రతను పరిష్కరించాలి.డిజిటల్ పేరెంటింగ్ తప్పనిసరి..ఇంట్లో పిల్లలు సేఫ్‌గా ఉన్నారు అనుకుంటారు కానీ, నేటి రోజుల్లో బయట కన్నా డిజిటల్లోనే మరిన్ని ప్రమాదాల బారినపడుతున్నారు. నేరుగా కన్నా ఆన్లైన్లోనే చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ ఎక్కువ జరుగుతుంది. డిజిటల్ మోసగాళ్లు టీనేజ్ అమ్మాయిలను ఆకర్షించి సరోగసి, ఆర్గాన్ ట్రేడింగ్ చేస్తున్నారు. కొత్తదనాన్ని ఆస్వాదించాలి అంటూ పిల్లలను హిప్నోటైజ్ చేస్తుంటారు. వారిని తప్పుదారి పట్టించి, వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు తీసుకోవడం.. ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడటం... ఫలితంగా పిల్లలు భయాందోళనకు లోనవడం, ఆత్మహత్యలు చేసుకోవడం వంటివి జరుగుతున్నాయి.ఫోన్ లేదా ట్యాబ్ లేదా ఇతర గ్యాడ్జెట్స్‌లో పేరెంటల్ కంట్రోల్ ఉండేలా చూసుకోవాలి. ఫ్యామిలీ ఇ–మెయిల్ తప్పనిసరి. ఏ వయసువారికి ఎలాంటి ఆన్లైన్ గేమ్స్ బెటర్ అనేవి తెలుసుకోవాలి. ప్రమాదాల వంక పెట్టి పిల్లలను డిజిటల్ నుంచి దూరం చేయకుండా అవగాహన కల్పించడం అవసరం. సమస్య తలెత్తితే చైల్డ్ హెల్ప్‌లైన్: 1098, నేషనల్ కమిషన్ ఫర్ ్ర΄÷టెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్సిపిసిఆర్), ఓసిఎస్ఎఇ (ఆన్లైన్ చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ అండ్ ఎక్స్ల్యాయిటేషన్), పోక్సో, మినిస్ట్రీ ఆఫ్ ఉమన్ అండ్ చైల్డ్ రైట్స్ (ఎమ్డబ్ల్యూసీడీ),..లోనూ కేస్ ఫైల్ చేయచ్చు. – అనీల్ రాచమల్ల, సైబర్ సేఫ్టీ నిపుణులు, ఎండ్ నౌ ఫౌండేషన్ -
ఆ మాట అనడంతో చిన్నబుచ్చుకుంది.. అన్నయ్యలా తెల్లగా అవుతానమ్మా..
చిన్నపిల్లలు ఎంతో సున్నిత మనస్కులు. కాస్త కోపంగా చూస్తేనే చిన్నబుచ్చుకుంటారు. అలాంటిది ఎవరైనా ఏమైనా అంటే అస్సలు తట్టుకోలేరు. కానీ కొందరు నోటికి ఎంతొస్తే అంత అనేస్తుంటారు. అలా బంధువు అన్న మాటలకు తన కూతురు నొచ్చుకుందని చెప్తోంది స్టార్ హీరో అక్షయ్ కుమార్ సతీమణి, నటి, రచయిత్రి ట్వింకిల్ ఖన్నా.శరీరం ట్యాన్ అవుతోందని..నా కూతురు నితార స్విమ్మింగ్ క్లాసులకు వెళ్లేది. కానీ ఓసారి సడన్‌గా క్లాసులకు వెళ్లడం మానేస్తానంది. ఎండలో ట్యాన్ అయిపోయి శరీరం నల్లగా అవుతోందని చెప్పింది. అన్నయ్య (ఆరవ్) ఎంత తెల్లగా ఉన్నాడో నేనూ అలాగే అవుతానని చెప్పింది. తనకలాంటి ఆలోచన రావడానికి కారణం.. మా బంధువే! నీ పాప చాలా క్యూట్‌గా ఉంది కానీ ఆమె ఆరవ్ అంత తెల్లగా లేదు అని తెలివితక్కువగా మాట్లాడింది. ఆ మాటలు నా కూతురు విని బాధపడింది.అది చదివాకే మార్పురంగు ముఖ్యం కాదని తనకెలా చెప్పాలా? అనుకున్నాను. ఫ్రిదా ఖలో బయోగ్రఫీని ఆమె చేతికిచ్చాను. ఖలో ఒక మెక్సికన్ పెయింటర్. మనిషి శరీరం, ఐడెంటిటీ, మరణం, వ్యక్తిత్వం.. ఇలా ఎన్నింటినో అందులో చర్చించింది. ఆ పుస్తకం చదివాక నితార ఆలోచనలో మార్పు వచ్చింది. తెలుపు అనేది లైట్ కలర్.. నా టీషర్ట్లాగా త్వరగా మురికిపడుతుంది. అదే బ్రౌన్.. కాస్త డార్క్ కలర్.. అంత ఈజీగా మురికిపడదు అని నితార ఫీలైంది అని ట్వింకిల్ ఖన్నా చెప్పుకొచ్చింది.చదవండి: నిన్ను టీవీలోనే చాలామంది చూశారు.. ఇంకా ఓటీటీలో కష్టమే అన్నారు -
స్టార్ హీరో కొడుకు సెకండ్ హ్యాండ్ బట్టలు వాడతాడు!
సినిమా హీరోలు అనగానే కాస్ట్ లీ బట్టలు, ఖరీదైన కార్లు, లగ్జరీ లైఫ్.. చాలామందికి ఇవే గుర్తొస్తాయి. కానీ వీళ్లలో చాలా తక్కువ మంది మీడియా కంటికి కనిపించకుండా చాలా సాధారణంగా జీవిస్తుంటాడు. ఇప్పుడు చెప్పబోయేది కూడా అలాంటి ఓ స్టార్ హీరో కొడుకు గురించి. ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసే స్టార్ హీరో తండ్రిగా ఉన్నాడు. కోట్లు సంపాదిస్తున్నాడు. కానీ కొడుకు మాత్రం సెకండ్ హ్యాండ్ బట్టలే వాడుతున్నాడట.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)బాలీవుడ్ స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకడు. హిట్ ఫ్లాప్‌తో వరస మూవీస్ చేస్తూనే ఉంటాడు. రీసెంట్‌గానే 'బడే మియా చోటే మియా' సినిమాతో వచ్చాడు. కానీ ఘోరమైన ఫెయిల్యూర్ అందుకున్నాడు. తాజాగా టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ హోస్టింగ్ చేస్తున్న 'ధావన్ కరేంగే' అనే టాక్ షోకు అక్షయ్.. గెస్ట్‌గా వచ్చాడు. తన కొడుకు ఆరవ్ గురించి ఎవరికీ తెలియని విషయాల్ని బయటపెట్టాడు.'నేను, ట్వింకిల్ (అక్షయ్ భార్య).. ఆరవ్‌ని పెంచిన విధానంపై నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే అతడు చాలా సాధారణమైన అబ్బాయి. ఇది చెయ్ అది చెయ్ అని అతడిని ఎప్పుడూ బలవంత పెట్టలేదు. వాడికి సినిమాలపై ఇంట్రెస్ట్ లేదు. కానీ ఫ్యాషన్‌పై ఆసక్తి ఉంది. ఆరవ్.. 15 ఏళ్లకే లండన్ యూనివర్సిటీలో చదువుకోవడానికి వెళ్లాడు. అయితే అతడి వెళ్లాలని మేం కోరుకోలేదు. కానీ వెళ్తుంటే ఆపలేదు. ఎందుకంటే నేను కూడా 14 ఏళ్లప్పుడే ఇంటి నుంచి బయటకొచ్చాను. ఆరవ్.. ఇంటి పనులన్నీ స్వయంగా చేసుకుంటాడు. మంచి డబ్బున్న ఫ్యామిలీ నుంచి వచ్చాడు కానీ ఖరీదైన బట్టలు కొనడు. సెకండ్ హ్యాండ్ బట్టలమ్మే థ్రిప్టీ అనే షాప్‌కి వెళ్తాడు. అతడికి డబ్బు వేస్ట్ చేయడం ఇష్టం లేదు. అందుకే ఇలా చేస్తున్నాడు' అని అక్షయ్, తన కొడుకు గురించి సీక్రెట్స్ అన్నీ చెప్పేశాడు.(ఇదీ చదవండి: నటి, యాంకర్ శ్యామలపై తప్పుడు కథనాలు.. చట్టపరంగానే ముందుకెళ్తానన్న వార్నింగ్) -
16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. ఇప్పుడు స్టార్ హీరోకు అత్తగా..
డింపుల్ కపాడియా… బాలీవుడ్లో ఒకప్పుడు తన అందచందాలతో భారీగా ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్న బ్యూటీగా పేరుగాంచింది. డింపుల్ అంటేనే అందం అనేంతగా యూత్ పరవశించిపోయేవారెందరో ఉన్నారు. బాలీవుడ్ షో మ్యాన్ రాజ్ కపూర్ దర్శకత్వంలో రిషీ కపూర్‌ను హీరోగా తెరకెక్కించిన ‘బాబీ’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయం అయిన డింపుల్. తొలి మూవీతోనే హిట్ కొట్టి ఓవర్ నైట్ బాలీవుడ్ స్టార్ అయిపోయింది. ఆ సినిమా నాటికి ఆమె వయసు 16 ఏళ్లు మాత్రమే. డింపుల్ కపాడియా 'రుడాలి'లో తన నటవిశ్వరూపం చూపించి, జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగానూ నిలచింది.16 ఏళ్ల వయసులోనే గర్భండింపుల్ కపాడియా 1957లో బొంబాయిలో ఒక సంపన్న గుజరాతీ వ్యాపారవేత్త కుటుంబంలో జన్మించింది. చిన్నతనంలో ఆమెను అమీనా అని పిలిచేవారు కానీ డింపుల్గానే ఆమె పేరు స్థిరపడింది. బాలీవుడ్ హిట్ చిత్రం బాబీలో నటించిన డింపుల్ తన కంటే 15 ఏళ్లు సీనియర్ అయిన సూపర్ స్టార్ రాజేష్ ఖన్నాతో డేటింగ్ చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలో ఆమె ప్రెగ్నెంట్ అయినట్లు కూడా ఆప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో 1973లో డింపుల్ తనకంటే 15 ఏళ్లు పెద్దవాడు అయిన రాజేష్ ఖన్నాను పెళ్లిచేసుకుని వార్తల్లో నిలిచింది. బాబీ సినిమాతోనే ఆమె సినిమా కెరియర్‌కు ఫుల్స్టాప్ పడిపోయింది. తన భర్త కోరిక మేరకు సినిమాలను వదిలేసింది. ఈ సంఘటనలతో ఆమె స్టార్డమ్ ఒక్కసారిగా కోల్పోయింది.స్టార్ హీరోకు అత్తగా..1974లో ట్వింకిల్ ఖన్నాకు ఆమె జన్మనిచ్చింది. అంటే ఆమె 16 ఏళ్ల వయసులోనే గర్భం దాల్చారు. ట్వింకిల్ ఖన్నాను అక్షయ్ కుమార్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం స్టార్ హీరో అక్షయ్ కుమార్‌కు పిల్లనిచ్చిన అత్తగానే కాకుండా ప్రత్యేకమైన పాత్రలతో పలు సినిమాల్లో డింపుల్ కపాడియా బిజీగా ఉంది.పిల్లల కోసం విడాకులకు దూరం1982లో రాజేశ్ ఖన్నా, డింపుల్ కపాడియా విభేదించి విడిపోయారు. 1985లో ఇచ్చిన ఇంటర్వ్యూలో, 'నేను, రాజేశ్ ఖన్నా వివాహం చేసుకున్న రోజుతోనే నా జీవితం ముగిసిపోయింది. ఆపై సంతోషం కూడా ముగిసింది.' అని చెప్పింది. రాజేశ్ ఖన్నా తనను మోసం చేశారని డింపుల్ రోపించింది. ఆ ఆరోపణలను రాజేశ్ ఎప్పుడూ ఖండించలేదు. పిల్లల కోసం ఈ దంపతులు విడాకులు కూడా తీసుకోలేదు. రాజేశ్ ఖన్నా ఢిల్లీ లోక్ సభ నియోజకవర్గం నుండి పోటీ చేయగా, ఆయన తరపున ప్రచారం కూడా చేసింది డింపుల్. వీరిద్దరూ విడిపోయిన తర్వాత 1984లో, డింపుల్, రిషి కపూర్ జంటగా సాగర్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకుంది. తరువాతి 10 సంవత్సరాలలో వరుస హిట్లు అందుకున్న డింపుల్ కపాడియా బాలీవుడ్లో అగ్ర కథానాయికలలో ఒకరిగా స్థిరపడింది.సన్నీ డియోల్‌తో ప్రేమకథరాజేశ్ ఖన్నాతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న డింపుల్‌కూ సన్నీ డియోల్ మంచి సోల్‌మేట్ అయ్యాడు. కష్టకాలంలోఆమెకు అండగా నిలబడ్డాడు.వారిద్దరి ప్రేమకథ చిత్రసీమలో భలేగా చక్కర్లు కొట్టింది. 1998లో సినిమా ఛాన్స్‌లు తగ్గిపోవడంతో కొవ్వొత్తుల వ్యాపారం ప్రారంభించింది. సన్నీతో సన్నిహితంగా ఉన్నప్పటికీ.. చివరి దాకా భార్యగా రాజేశ్ కు సపర్యలు చేసింది డింపుల్. 2012 జూలై 18న రాజేశ్ ఖన్నా మరణించారు.ఇప్పుడేం చేస్తుందిదిల్ చాహ్తా హై, లక్ బై ఛాన్స్, కాక్టెయిల్, దబాంగ్, బ్రహ్మాస్త్ర, పఠాన్ వంటి చిత్రాలలో డింపుల్ కనిపించింది. 2020లో, ఆమె 62 సంవత్సరాల వయసులో క్రిస్టోఫర్ నోలన్ హిట్ సినిమా 'టెనెట్'లో సహాయక పాత్ర ద్వారా హాలీవుడ్ అరంగేట్రం చేసింది. 2024లో, ఆమె రెండు చిత్రాలలో కనిపించింది. -
నా కూతుర్ని కుక్కపిల్ల కరిచింది: హీరోయిన్
ఒకప్పుడు బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణించింది ట్వింకిల్ ఖన్నా. తెలుగులోనూ ఓ సినిమా చేసింది. వెంకటేశ్ హీరోగా నటించిన శీను మూవీలో యాక్ట్ చేసింది. ఎప్పుడైతే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌ను పెళ్లాడిందో అప్పుడే సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది. నటిగా మళ్లీ పూర్తిస్థాయిలో వెండితెరపై కనిపించలేదు. 2010లో వచ్చిన తీస్మార్ ఖాన్‌లో మాత్రం అతిథి పాత్రలో మెరిసింది. నటనకు దూరమైనా నిర్మాతగా కొన్ని చిత్రాలు తెరకెక్కించింది. అనంతరం రచయిత్రిగానూ మారి పుస్తకాలు రాసింది. కుక్క కరిచింది.. ఇక అక్షయ్-ట్వింకిల్ దంపతులకు కుమారుడు ఆరవ్(21), కూతురు నితార(11) సంతానం. ఈ మధ్య తన కూతురికి కుక్క కరిచిందని చెప్పుకొచ్చింది ట్వింకిల్. 'క్రిస్మస్ రోజు ఎవరో అనుకోకుండా మా కుక్కపిల్ల ఫ్రెడ్డీ కోసం ప్లేటులో చికెన్ పెట్టి అది మా పిల్లల ముందు పెట్టారు. అది చూసిన ఫ్రెడ్డీ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ముక్కల్ని కొరకడం ప్రారంభించింది. అయితే ఆ చికెన్ ముక్కలు వెదురు పుల్లలకు తగిలించి ఉన్నాయి. అవి ఎక్కడ కుక్క గొంతులో ఇరుక్కుపోతాయో, అలాగే మింగేస్తే దానికి హాని కలుగుతుందేమోనన్న భయంతో నా కూతురు వాటిని దాని నోటిలో నుంచి తీయడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో కుక్క తన చేతుల్ని కొరికింది. ఏం కాదులే అని శునకాన్ని వెనకేసుకొచ్చింది వెంటనే తనకు రేబిస్, టెటానస్ ఇంజక్షన్స్ వేయించాను. అయినా తనేమాత్రం భయపడలేదు, బాధపడలేదు. పైగా ఫ్రెడ్డీని వెనకేసుకొచ్చింది. ఇది అనుకోకుండా జరిగిపోయిందిలే.. అదేం కావాలని కరవలేదు.. ఫ్రెడ్డీకి బాగుంటే అంతే చాలని చెప్పింది. ఒకవేళ నేను పొరపాటున తన వేళ్లను కట్ చేసినా, అనుకోకుండా గాయపర్చినా నామీద ఎన్ని నిందారోపణలు వచ్చేవో! ఇప్పుడే కాదు ఇంకో 20 ఏళ్ల తర్వాత కూడా దాని గురించి సీరియస్‌గా మాట్లాడుకునేవారు' అని అభిప్రాయపడింది. View this post on Instagram A post shared by Nitara bhatia (@nitara_kumar) చదవండి: స్టార్ హీరో సినిమాలో గూండాగా.. ఎందుకు చేశానా? అని బాధపడ్డా.. -
సూపర్ విమెన్‌ను పెళ్లి చేసుకున్నా..భర్తగా గర్వంగా ఉంది: అక్షయ్ కుమార్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సతీమణి ట్వింకిల్ ఖన్నా తాజాగా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది. 50 ఏళ్ల వయసులో లండన్ యూనివర్సీటీ((గోల్డ్స్మిత్స్) నుంచి మాస్టర్స్ గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అక్షయ్ తన సోషల్ మీడియా ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. (చదవండి: నేనే పాపం చేశాను.. నాపై ఎందుకింత పగ?: నటి) ‘చదువుకోవాలని ఉందని రెండేళ్ల క్రితం నువ్వు నాతో చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను. కానీ చాలా కష్టపడి అనుకున్నది సాధించావు. ఇల్లు, కెరీర్, పిల్లలను అన్నింటిని చూసుకుంటూ చదువు ప్రయాణాన్ని కొనసాగించి, విజయం సాధించావు. నేను సూపర్ విమెన్‌ను పెళ్లి చేసుకున్నా. భర్తగా ఎంత గర్వపడుతున్నానో చెప్పేందుకు నేనూ ఇంకా చదువుకోవాలనుకుంటున్నా. కంగ్రాట్స్ మై లవ్’ అని ఇన్‌స్టాలో రాసుకొస్తూ.. ట్వింకిల్ పట్టా అందుకున్న సందర్భంగా ఆమెతో దిగిన ఫోటోని షేర్ చేశాడు. అక్షయ్ పోస్ట్‌పై ట్వింకిల్ ఖన్నా స్పందిస్తూ.. ‘ప్రొత్సహించిన భర్త దొరకడం నా అదృష్టం’అని అన్నారు. (చదవండి: అరెరె... ఇది తెలీక వేరే కథతో సినిమా తీస్తున్నానే..: మారుతి) ఇక ట్వింకిల్ ఖన్నా విషయానికొస్తే.. తల్లిదండ్రులు డింపుల్ కపాడియా, రాజేశ్ ఖన్నా వారసురాలిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ‘బర్సాత్’(1995) ఆమె తొలి చిత్రం. ఆ తర్వాత ‘జాన్’, ‘దిల్ తేరా దీవానా’, ‘ఇంటర్నేషనల్ ఖిలాడి’ తదితర చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి మెప్పించింది.వెంకటేష్ హీరోగా నటించిన ‘శీను’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో చాలా ఆఫర్స్ వచ్చినప్పటికీ.. ట్వింకిల్ నటించలేదు. అక్షయ్‌తో పెళ్లి తర్వాత నటనతో గుడ్‌బై చెప్పింది. వీరిద్దరికి వీరికి కుమారుడు ఆరవ్ (21), కుమార్తె నితారా (11) ఉన్నారు. View this post on Instagram A post shared by Akshay Kumar (@akshaykumar) -
వస్తువు కొనుక్కునే ముందు టెస్ట్ చేస్తాం.. పెళ్లికి ముందు ఇదీ అంతే!
ఎవరూ ఎప్పుడూ ఒకేలా ఉండరు. ఎప్పటికప్పుడు పరిస్థితుల వల్లో, మరే ఇతర కారణాల వల్లో మారుతూ ఉంటారు. ఒకప్పుడు సింగిల్‌గా ఉండాలనుకుంది స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె. జీవితంలో పెళ్లి జోలికే వెళ్లకూడదనుకుంది. కానీ హీరోయిన్గా కెరీర్ మొదలుపెట్టిన తర్వాత పలువురితో ప్రేమాయణం సాగించి చివరకు హీరో రణ్వీర్ సింగ్‌ను పెళ్లాడింది. ఇతడే అసలైన జీవిత భాగస్వామి అనిపించడంతో సింగిల్‌గా ఉండాలనుకున్న నిర్ణయాన్ని పక్కన పెట్టేసింది. ఆ మధ్య కాఫీ విత్ కరణ్ షోకి భర్తతో కలిసి హాజరైంది దీపిక. చివరకు అతడితోనే పెళ్లి ఈ సందర్భంగా భర్త కంటే ముందు పలువురితోనూ ప్రేమలో పడ్డ విషయాన్ని బయటపెట్టింది. అంతేకాకుండా రణ్వీర్ సింగ్ పరిచయమయ్యాక కూడా చాలామందిని కలిశాను, కానీ ఎవరూ తనకంత కనెక్ట్ అవలేదని, మనసులో ఎక్కడో రణ్వీర్ సరైన జోడీ అనిపించిందని చెప్పుకొచ్చింది. ఇతరులతో డేట్‌కు వెళ్లినప్పటికీ చివరకు రణ్‌వీర్‌నే పెళ్లి చేసుకున్నానని చెప్పింది. చాలామంది దీపికా వ్యాఖ్యలను విమర్శించారు. ఎవరి దగ్గరా మోకరిల్లలేదు తాజాగా నటి ట్వింకిల్ ఖన్నా.. దీపికా వ్యాఖ్యలకు మద్దతుగా నిలిచింది. 'అంకుల్ అండ్ ఆంటీస్.. దీపిక కాబోయే భర్తతో డేటింగ్లో ఉన్నప్పుడు ఏ పురుషుడి చుట్టూ తిరగలేదు. ఎవరి దగ్గరా మోకరిల్లలేదు. ఉన్నది ఉన్నట్లు చెప్పినందుకు ఎందుకంత విమర్శిస్తున్నారు? అంతలా తిడుతున్నారు.. ఈ ట్రోలింగ్ ఏ రేంజ్‌కు వెళ్లిందంటే.. బనారస్ యూనివర్సిటీలో ఓ అమ్మాయి దీపికగా, కొందరు అబ్బాయిలు ఆమె మాజీ ప్రియులుగా యాక్ట్ చేసి నటిపై సెటైర్స్ వేస్తున్నారు. అది తప్పు కాదు నిజానికి దీపిక అన్నదాంట్లో తప్పేంటి? మనం ఒక సోఫా కొనేముందు దుకాణానికి వెళ్లి ఏది మృదువుగా ఉంది? ఏది సౌకర్యవంతంగా ఉంది? దాని నాణ్యత ఎలా ఉంది? ఇవన్నీ టెస్ట్ చేస్తాం కదా! మరి పెళ్లి విషయంలో ఆ మాత్రం ఆలోచిస్తే తప్పేంటట? మనకు ఎవరు కరెక్ట్ అనేది ఆలోచించి సెలక్ట్ చేసుకోవడం తప్పేం కాదు' అని చెప్పుకొచ్చింది ట్వింకిల్ ఖన్నా. చదవండి: సినిమా సూపర్ హిట్.. హీరోయిన్ అందంగా లేదట.. డైరెక్టర్ రెస్పాన్స్ చూశారా? -
Welcome to Paradise: స్వాగతం.. సుస్వాగతం
రచయిత్రిగా కూడా మంచి మార్కులు కొట్టేసింది నటి ట్వింకిల్ ఖన్నా.‘మిసెస్ ఫన్నీబోన్స్: ‘పైజామాస్ ఆర్ ఫర్ గివింగ్’ ‘ది లెజెండ్ ఆఫ్ లక్ష్మీప్రసాద్’ పుస్తకాలతో పాఠకులను అలరించింది. తాజాగా తన కొత్త పుస్తకం ‘వెల్కమ్ టూ ప్యారడైజ్’ను ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. ట్వింకిల్ ఖన్నా లండన్‌లో ఫిక్షన్ రైటింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన తరువాత వస్తున్న పుస్తకం ఇది. ‘ఈ పుస్తకంలోని క్యారెక్టర్లు గత అయిదు సంవత్సరాలుగా నా మనసులో తిరుగుతున్నాయి. నాకు మాత్రమే పరిచయమైన ఈ క్యారెక్టర్లు ఇప్పుడు మీకు కూడా పరిచయం కాబోతున్నాయి’ అంటూ రాసింది ఖన్నా. మానవ సంబంధాలు, ఎడబాట్లు, అనుబంధాలు, ఆప్యాయతలను ఆధారంగా చేసుకొని రాసిన ఈ పుస్తకం వచ్చే నెలలో విడుదల కానుంది. సామాన్య పాఠకుల నుంచి బాలీవుడ్ సెలబ్రిటీల వరకు సోషల్ మీడియాలో ఈ పుస్తకంపై కామెంట్స్ పెడుతున్నారు. -
అదర్ సైడ్: స్టూడెంట్ నంబర్‌వన్
‘టైమెక్కడ ఉంది’ అని చీటికిమాటికి అంటే టైమ్ చిన్నబుచ్చుకుంటుందట. ‘టైమ్ నాతోనే ఉంటుంది’ అనుకుంటే బలాన్ని ఇస్తుందట. సినీ నిర్మాత, ఇంటీరియర్ డిజైనర్, కాలమిస్ట్, పుస్తక రచయిత్రి, గృహిణిగా రకరకాల బాధ్యతలు నిర్వహిస్తున్న ట్వింకిల్ ఖన్నా మరోసారి స్టూడెంట్‌గా మారబోతోంది. ‘యూనివర్శిటీ ఆఫ్ లండన్’లో ఫిక్షన్ రైటింగ్‌లో మాస్టర్స్ చేయడానికి రెడీ అవుతోంది... ‘అమ్మా, నీకు ట్వింకిల్ అని ఎందుకు పేరు పెట్టారు?’ అని అడిగింది నాలుగేళ్ల కూతురు. ‘నేను లిటిల్స్టార్ని కాబట్టి’ అని జవాబు చెప్పింది ట్వింకిల్. ఇది విని కూతురు నవ్వేసింది. ఇంట్లోనే కాదు పుస్తక ప్రపంచంలో కూడా నవ్వుల వెన్నెల కురిపిస్తుంది ట్వింకిల్‌ఖన్నా. కథానాయికగా మాత్రమే కాదు కాలమిస్ట్, పుస్తక రచయిత్రిగా కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ట్వింకిల్ రాసిన ‘మిసెస్ ఫన్నీబోన్స్’ పుస్తకం బెస్ట్ సెల్లర్ చార్ట్‌లో నెంబర్‌వన్‌గా నిలిచింది. ‘అన్ని వయసుల వారిని, అన్ని వర్గాల వారిని ఆకట్టుకున్న పుస్తకం ఇది’ అని ప్రశంసించారు పెంగ్విన్ ర్యాండమ్ హౌజ్ ఎడిటర్ ఇన్ చీఫ్ మిలీ ఐశ్వర్య. మరో పుస్తకం ‘పైజామాస్ ఆర్ ఫర్గివింగ్’ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ‘హైయెస్ట్–సెల్లింగ్ ఫిమేల్ ఆథర్’ సింహాసనంలో తనను కూర్చోబెట్టింది. నవ్వించడం ఎంత కష్టమో, నవ్వించడం ద్వారా వచ్చే కష్టాలు కూడా అంతే కష్టమని అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది ట్వింకిల్‌కు. ‘నన్ను ఉద్దేశించే రాసింది’ అని ఎంతోమంది భుజాలు తడుముకునేవారు! వినోదమాధ్యమాలు ఎన్ని పెరిగినప్పటికీ, ఇప్పటికీ పుస్తకాలు అంటేనే ఆమెకు ఎక్కువ ఇష్టం. మనసు బాగలేనప్పుడు, ఉత్సాహం కావాలనుకున్నప్పుడు ట్వింకిల్ పుస్తకప్రపంచంలోకి వెళుతుంది. ప్రతి పుస్తకం ఒక నేస్తం అవుతుంది. తనలో కొత్త ఎనర్జీ, ఉత్సాహం వస్తాయి. ‘మహిళా రచయితలకు ఎదురయ్యే సవాలు ఏమిటి?’ అనే ప్రశ్నకు– ‘రచన గురించి ఆలోచించే క్రమంలో తనదైన ఊహాప్రపంచంలో, రకరకాల క్యారెక్టర్ల మధ్య ఉండాల్సి వస్తుంది. ఇదే సమయంలో వాస్తవ ప్రపంచంలోకి వచ్చి ఇంటిపనులు, పిల్లల బాధ్యత చూసుకోవాల్సి ఉంటుంది. రెండిటినీ సమన్వయం చేసుకోవడమే అసలైన సవాలు’ అంటుంది ట్వింకిల్. రచయిత్రిగా ట్వింకిల్ ఖన్నాకు బోలెడు పేరు వచ్చింది. ఈ దశలో ‘నాకు రాయడం వచ్చేసింది. ఏమీ నేర్చుకోనక్కర్లేదు’ అనుకుంటారు చాలామంది. అయితే ట్వింకిల్ అలా అనుకోవడం లేదు. ‘నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది’ అని మాత్రమే అనుకుంటుంది. అందుకే క్రియేటివ్ రైటింగ్‌లో శిక్షణ పొందడానికి ‘యూనివర్శిటీ ఆఫ్ లండన్’లోకి స్టూడెంట్‌గా అడుగుపెట్టబోతుంది. ‘మరోసారి స్టూడెంట్‌గా మారుతున్నందుకు సంతోషంగా ఉంది. కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాను. చిన్నప్పటిలాగే శ్రద్ధగా క్లాసులు వినబోతున్నాను. నోట్స్ రాసుకోబోతున్నాను’ అంటూ అభిమానులతో తన సంతోషాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది ట్వింకిల్. దీంతోపాటు హుషారెత్తించే, ఉత్సాహంతో జంప్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. నిజానికి ఆ వీడియోలో ట్వింకిల్‌ఖన్నా కనిపించడం లేదు. చదువు దాహంతో ఉన్న ఒక సిన్సియర్ స్టూడెంట్ కనిపిస్తుంది. ‘నేర్చుకోవాలనే తపన మనల్ని ముందుకు తీసుకువెళుతుంది’ అనే మాట కాస్త గట్టిగానే వినిపిస్తుంది! -
3 సార్లు పెళ్లి వరకు.. దేవుడు దయతో బయటపడ్డ: స్టార్ హీరోయిన్
Sushmita Sen Says Why She Never Get Married Till Now: మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిందీ చిత్రసీమలో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన సుస్మితా 'ఆర్య' వెబ్ సిరీస్‌తో మరోసారి తన మార్క్ చూపించింది. అంతకుముంచి ఇటీవల కాలంలో తన బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ వార్తలతో మరింత పాపులర్ అయింది. తాజాగా ట్వింకిల్ ఖన్నా హోస్ట్ చేస్తున్న 'ట్వీక్ ఇండియా: ది ఐకాన్స్' కార్యక్రమంలో వివాహ బంధం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది సుస్మితా సేన్. 'అదృష్టవశాత్తు నేను చాలా ఆసక్తికరమైన వ్యక్తులను కలుసుకున్నాను. కానీ నేను ఎప్పుడూ పెళ్లి చేసుకోకపోవడానికి ఏకైక కారణం వారు నిరాశ చెందటమే. దీనికి నా పిల్లలకు ఎలాంటి సంబంధం లేదు. నా పిల్లలతో నాకు ఎప్పుడు మంచి సాన్నిహిత్యమే ఉండేది. నా జీవితంలో వచ్చిన ప్రతి ఒక్కరిని ముక్తకంఠంతో అంగీకరించారు. ప్రతి ఒక్కరికీ సమానమైన ప్రేమ, గౌరవాన్ని ఇచ్చారు. ఇది చాలా సంతోషమైన విషయం. నిజానికి నేను సుమారు మూడు సార్లు పెళ్లి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. మూడు సార్లు వివాహ బంధానికి అతి దగ్గరగా వెళ్లాను. కానీ ఆ దేవుడు నన్ను రక్షించాడు. వారి జీవితంలో జరిగిన విషయాలను నేను మీకు చెప్పలేను. కానీ దేవుడు నన్ను, నా పిల్లలను కాపాడుతున్నాడు. అతను ఎలాంటి చెడు బంధంలోకి వెళ్లనివ్వడు' అని సుస్మితా సేన్ తెలిపింది. చదవండి: ఫ్రెండ్‌తో బెడ్ షేర్.. అబార్షన్.. ఎలాంటి పశ్చాత్తాపం లేదు: నటి నగ్నంగా విజయ్ దేవరకొండ.. ఫొటో వైరల్ సుస్మితా సేన్ గతేడాది మోడలైన బాయ్‌ఫ్రెండ్ రోహ్మాన్తో బ్రేకప్ చేసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా సుస్మితా సేన్‌కు ఇద్దరు కుమార్తెలు. 2000 సంవత్సరంలో రెనీని, 2010లో అలీసాను దత్తత తీసుకుంది. 1994లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని కైవసం చేసుకున్న సుస్మితా సేన్ 1996లో వచ్చిన 'దస్తక్' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. తర్వాత బీవీ నెంబర్ 1, డు నాట్ డిస్టర్బ్, మై హూ నా, మైనే ప్యార్ క్యూ కియా, తుమ్కో నా భూల్ పాయేంగే, నో ప్రాబ్లమ్ వంటి చిత్రాలతో పాటు ఆర్య, ఆర్య 2 వెబ్ సిరీస్‌లో నటించి మెప్పించింది. చదవండి: నా రిలేషన్ గురించి దాచాలనుకోవట్లేదు: శ్రుతి హాసన్ తొలిసారిగా మోహన్ బాబు, మంచు లక్ష్మీల కాంబినేషన్.. View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) -
‘ది కశ్మీర్ ఫైల్స్’ పై అక్షయ్ భార్య ట్వింకిల్ ఖన్నా సంచలన వ్యాఖ్యలు
Twinkle Khanna Shocking Comments On The Kashmir Files: చిన్న సినిమాగా వచ్చి పెను సంచలన విజయం సాధించింది ది కశ్మీర్ ఫైల్స్. మార్చి 11న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కేవలం రూ. 10 కోట్ల నుంచి రూ. 12 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ప్రపంచ్యాప్తంగా రూ. 301 కోట్ల గ్రాస్ అందుకుంది. అంతగా ప్రజాదారణ పొందిన కశ్మీర్ ఫైల్స్ ఎందరో సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఏకంగా ప్రధానీ సైతం స్పందిస్తూ కశ్మీర్ ఫైల్స్‌ను కొడియాడారు. అలాంటి సినిమాపై బాలీవుడ్ నటి, రైటర్ ట్వింకిల్ ఖన్నా సంచలన వ్యాఖ్యలు చేసింది. కాగా ట్వింకిల్ ఖన్నా బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ భార్య అనే విషయం తెలిసిందే. ఆమె వార్త పత్రికలకు స్పెషల్ కాలమ్ అర్టికల్స్ రాస్తుంటుంది. చదవండి: వైరల్ అవుతున్న రామ్ చరణ్ షాకింగ్ లుక్, పంచెకట్టుతో సైకిల్‌పై ఇలా ఈ నేపథ్యంలో ఇటీవల తను రాసిన ఓ ఆర్టికల్‌లో కశ్మీర్ ఫైల్స్ గురించి ప్రస్తావించింది. ‘ఓ నిర్మాత ఆఫీసులో సమావేశం సందర్భంగా కశ్మీర్ ఫైల్స్ గురించి, ఈ మూవీ క్రేజ్ గురించి మాట్లాడారు. కశ్మీర్ ఫైల్స్ స్ఫూర్తితో చాలా మంది ‘అంధేరీ ఫైల్స్’, ‘ఖర్ దందా ఫైల్స్’, ‘సౌత్ బాంబే ఫైల్స్’ వంటి పేర్లను నిర్మాతలు నమోదు చేసుకుంటున్నారని ఆయన చెప్పినట్లు పేర్కొంది. ఇలాంటి వాళ్లందరు దర్శక-నిర్మాతలని చెప్పుకుంటున్నారు. వీరిని కూడా దర్శక-నిర్మాతలు అనాలా? అంటూ మండిపడింది. అలా అయితే తాను కూడా మానిక్యూర్(చేతి గోళ్లు, వేళ్లు శుభ్రం చేయడం)పై ఓ సినిమా తీస్తానని, దీనికి ‘నెయిల్ ఫైల్స్’ అనే టైటిల్ పెడతానంటూ అనుచిత వ్యాఖ్యలు చేసింది. అనంతరం తాను ఓ నేషనలిస్ట్ అని చెప్పుకునే మనోజ్ కుమార్ లాగే అందరూ క్లర్కులుగా మారుతారా? అంటూ ఎద్దేవా చేసింది. చదవండి: ఈ కమర్షియల్ యాడ్‌కు చిరు పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా? కశ్మీర్ ఫైల్స్‌పై ఆమె చేసిన వ్యాఖ్యల పంట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రకారకాల కామెంట్స్ చేస్తూ ట్వింకిల్ ఖన్నాను ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే కశ్మీర్ ఫైల్స్‌పై ఆమె భర్త, హీరో అక్షయ్ కుమార్ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. 'వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన కశ్మీర్ ఫైల్స్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. విచిత్రమేంటంటే దీని ఎఫెక్ట్ నా సినిమాపై కూడా పడింది. నేను నటించిన బచ్చన్ పాండే కలెక్షన్లను కశ్మీర్ ఫైల్స్ దెబ్బకొట్టింది' అని చెప్పుకొచ్చాడు. వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ మూవీలో 1990లో కశ్మీర్ పండిట్లపై జరిగిన ఆకృత్యాలను తెరపై చూపించారు. ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటులు అనుపమ ఖేర్, మిథున్ చక్రవర్తి, నటి పల్లవి జోషిలు ప్రధాన పాత్రలు పోషించారు. -
అప్పటి ఈ హీరో, హీరోయిన్లు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా?
చేస్తున్న పని నచ్చకపోతే అదెంత పేరు తెచ్చేదైనా పక్కన పెట్టేస్తాం. నచ్చిన పని మన పాపులారిటీని పెంచకపోయినా పర్ష్యూ చేస్తాం. ఈ పుటలో ప్రస్తావించబోయే వ్యక్తులూ అంతే. నటులుగా వాళ్లు పాపులర్. కాని ఇప్పుడు అడుగుపెట్టిన రంగానికి వాళ్లు కొత్తే. అందుకే ఇక్కడ ఆ పరిచయం. కిమ్ శర్మ తెలుగువాళ్లకూ పరిచయమే. ముసుగు వెయ్యొద్దు మనసు మీద (ఖడ్గం) అంటూ యువత మనసుల మీది ముసుగు లాగేసిందీ బోల్డ్ యాక్ట్రెస్. పెళ్లయ్యాక సిల్వర్ స్క్రీన్కు గుడ్‌బై చెప్పి కెన్యా వెళ్లిపోయింది. అక్కడ ఖాళీగా కూర్చోలేదు. బ్రైడల్ గ్రూమింగ్ సర్వీస్ సెంటర్‌ను స్టార్ట్ చేసింది. బ్రహ్మాండంగా సాగుతోందట. ట్వింకిల్ ఖన్నా పేరు వింటేనే మనిషి గుర్తొచ్చేంత ఫేమస్ ఈ నటి. తల్లిదండ్రులు డింపుల్ కపాడియా, రాజేశ్ ఖన్నా వారసురాలిగానే అడుగు పెట్టినా తనకంటూ ప్రత్యేకతను నిలుపుకుంది. నటనతో కాదు ఇంటీరియర్ డిజైనర్, రచయిత్రిగా. ఆమె భర్త అక్షయ్ కుమార్ టాప్ హీరో అన్న విషయమూ తెలిసిందే. భర్త పేరుతోనూ ఆమెను పోల్చుకోరు ప్రేక్షకులు. అదీ ట్వింకిల్ అస్తిత్వం. మల్టీటాలెంటెడ్ ఉమన్‌గా ఆమె సాధిస్తున్న విజయం. డినో మోరియా ఆరడగులు కండలవీరుడిగా బాలీవుడ్లో డినో మోరియాకు విపరీతమైన క్రేజ్.. మోజు కూడా. అయినా అతను నటించిన కొన్ని సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో ఇంకా అట్టే ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించక నటనకు ప్యాకప్ చెప్పేసుకున్నాడు. ‘క్రీప్ స్టేషన్ కేఫ్’ అని రెస్టారెంట్ తెరిచాడు. అతని యాక్టింగ్ కెరీర్ కన్నా అద్భుతంగా రన్ అవుతోంది ఆ రెస్టారెంట్. అప్పుడప్పుడు ఓటీటీ సిరీస్‌లోనూ అప్పియర్ అవుతున్నాడు డినో. దీపాన్నిత శర్మ టీవీ సీరియల్స్, సినిమా ప్రియులకు బాగా తెలిసిన నటి. నటించడం ఆపేసి జీవిత కలను నెరవేర్చుకొమ్మని మెదడు చేసిన సూచనను ఫాలో అయింది. ‘షాజ్మా’ అనే పడవను కొనుక్కొని ముంబై సముద్రంలో తిప్పుతూ అందులో లగ్జరీ పార్టీలను అరెంజ్ చేస్తోంది. కుమార్ గౌరవ్ నాటి బాలీవుడ్ నటుడు రాజేంద్రకుమార్ వారసుడిగా (కొడుకు) బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. నెగ్గాడు కూడా. ప్రేక్షకుల్లో తనకు డిమాండ్ తగ్గిపోతుందని గ్రహించిన వెంటనే బిజినెస్ రంగంలోకి దిగాడు. మాల్దీవ్స్‌లో ట్రావెల్ బిజినెస్ ప్రారంభించాడు. అన్నేళ్ల నటనారంగంలోని సంపాదన కన్నా రెట్టింపు రాబడి, రెట్టింపు ఉత్సాహంతో వ్యాపారంలో రాణిస్తున్నాడు కుమార్ గౌరవ్. మయూరీ కాంగో ‘ఘర్ సే నికల్తే హీ కుఛ్ దూర్ చల్తే హీ రస్తే మే హై ఉస్కా ఘర్ ’ 1990ల మధ్యకాలంలోని యువను ఉర్రూతలూగించిన పాట. 1996లో వచ్చిన ‘పాపా కహెతే హై’ సినిమాలోనిది. ఆ పాటను కథానాయిక మయూరీ కాంగో, నాయకుడు జుగల్ హంస్రాజ్ మీద చిత్రీకరించారు. ఆ సినిమాతో మయూరీ కాంగో ఫేమస్ అయిపోయింది. తర్వాత కొన్ని చిత్రాల్లోనూ కనిపించింది. కానీ ఎందుకో ఉన్నట్టుండి ఆ పాపులారిటీ అంటే విరక్తి పుట్టింది.. నటన అంటే ఆసక్తి తగ్గింది ఆమెకు. అమెరికా వెళ్లిపోయింది. న్యూయార్క్ యూనివర్శిటీలో చేరి మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్‌లో ఎంబీఏ చేసింది. ఢిల్లీ వచ్చేసి గుర్గావ్లోని ఒక మల్టీనేషనల్ కంపెనీలో మార్కెటింగ్ హెడ్‌గా పనిచేస్తోంది. -
అక్షయ్ కుమార్ క్షేమంగా ఉన్నారు : ట్వింకిల్ ఖన్నా
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అక్షయ్ భార్య, హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా ఈ విషయాన్ని కన్ఫార్మ్ చేశారు. ‘‘ఆల్ ఈజ్ వెల్.. అక్షయ్ బాగా కోలుకుంటున్నారు’’ అని పేర్కొన్నారు ట్వింకిల్. ఈ నెల 4న తాను కోవిడ్ బారినపడ్డట్లు వెల్లడించారు అక్షయ్. ఆ మరుసటి రోజే వైద్యుల సలహా మేరకు అక్షయ్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. సోమవారం అక్షయ్‌కు కరోనా నెగటివ్ రావడంతో డిశ్చార్జ్ అయ్యారు. త్వరలో ఆయన షూటింగ్లో పాల్గొంటారని ఊహించవచ్చు. ‘బచ్చన్ పాండే, బెల్ బాటమ్, అత్రంగి రే’ సినిమాల షూటింగ్‌లను పూర్తి చేసిన అక్షయ్ ప్రస్తుతం ‘రామసేతు’, ‘పృథ్వీరాజ్’, ‘రక్షాబంధన్ ’ సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘రామసేతు’ షూటింగ్ సమయంలోనే అక్షయ్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇక ఈ నెలలో విడుదల కావాల్సిన అక్షయ్ కుమార్ ‘సూర్యవన్షీ’ వాయిదా పడిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Twinkle Khanna (@twinklerkhanna) చదవండి: దీపికా రాజీనామా! -
ముద్దు పెట్టలేదని రిజెక్ట్ చేసింది: అక్షయ్
బాలీవుడ్లో సక్సెస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు ఖిలాడి హీరో అక్షయ్ కుమార్. ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చేస్తూ.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తారు. పూర్తిగా కమర్షియల్ చిత్రాలనే కాక.. తనలోని నటుడిని సంతృప్తి పరిచే సినిమాలు కూడా చేస్తూ.. విజయవంతంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. తాజాగా హౌస్‌ఫుల్ 4 ప్రమోషన్లో భాగంగా అక్షయ్, కపిల్ శర్మ షోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన ఫస్ట్ లవ్, రిజెక్షన్ల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు అక్షయ్. ఈ సందర్భంగా అక్షయ్ మాట్లాడుతూ.. ‘ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. తనతో కలిసి మూడు నాలుగు సార్లు డేట్‌కు వెళ్లాను. అంటే తనతో కలిసి సినిమాకు వెళ్లి అట్నుంచి అటే రెస్టారెంట్‌కి వెళ్లి భోంచేసే వాళ్లం. అయితే నాలో ఉన్న సమస్య ఏంటంటే నాకు చాలా సిగ్గు. తనతో బయటకు వెళ్లినప్పుడు ఆమె భుజం మీద చేతులు వేయడం.. తన చేతిని పట్టుకోవడం.. కిస్ చేయడం లాంటివి చేయలేదు. దాంతో ఆమె నన్ను రిజెక్ట్ చేసింది’’ అన్నారు. అయితే దీనిపై నెటిజనులు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘‘మీరు ప్రపోజ్ చేయాలని ఆ అమ్మాయి భావించి ఉటుంది. కానీ మీరేమో ముద్దు పెట్టలేదు అందుకే వదిలేసింది అంటున్నారు.. బహుశా మీరే తప్పులో కాలేసిట్లున్నారు. అయినా మీకు ట్వింకిల్ లాంటి అందమైన భార్య లభించాలని రాసి పెట్టి ఉంది. అందుకే ఆమె మిమ్మల్ని రిజెక్ట్ చేసింది’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. (చదవండి: అనుకోని అతిథి.. షాక్ అయిన సూపర్ స్టార్) ఇక అక్షయ్-ట్వింకిల్ ఖన్నాల వివాహ బంధానికి ఈ ఏడాదితో 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా భార్య ట్వింకిల్ ఖన్నాతో కలిసి ఉన్న ఫోటో షేర్ చేస్తూ.. ‘‘నేను నీతో భాగస్వామ్యంలో ఉన్నాను... మనం ఇరవై సంవత్సరాల సమైక్యతకు చిహ్నంగా నిలిచాము. నువ్వు ఇప్పటికీ నా హృదయాన్ని కదిలిస్తావు.. నన్ను నడిపిస్తావు. నువ్వు నాకు దూరంగా ఉన్నా నీ నవ్వు నన్ను సేదదీరుస్తుంది. వార్షికోత్సవ శుభాకాంక్షలు టీనా’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు అక్షయ్ కుమార్. ఇక ప్రస్తుతం ఆయన బచ్చన్ పాండే చిత్రంలో నటిస్తున్నారు. -
అత్తకు ప్రశంసలు.. అల్లుడి ఆనందం
ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన యాక్షన్ డ్రామా ‘టెనెట్’ శుక్రవారం(డిసెబంర్ 4) భారత్‌లో విడుదలైంది. జూన్‌లోనే విడుదల కావాల్సిన ఈ సినిమా లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. హిందీ, తెలుగు, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా కరోనా పరిస్థితుల్లో కూడా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన అందుకుంటోంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటి డింపుల్ కపాడియా కీలక పాత్రలో నటించారు. ఆమె పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. ఈ క్రమంలో డైరెక్టర్ క్రిస్టఫర్ నంచి డింపుడ్ కపాడియా ఓ లెటర్ అందుకున్నారు. సినిమాలో ముఖ్య పాత్ర పోషించింనందుకు కృతజ్ఞతలు తెలుపుతూ లేఖలో రాశారు. చదవండి: యూపీ సీఎంతో అక్షయ్ భేటీ ఈ లెటర్‌ను బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన ట్విటర్ అకౌంట్లో షేర్ చేశారు. అల్లుడిగా గర్వించే క్షణం అంటూ ఉప్పొంగిపోయారు.‘ క్రిస్టోఫర్ నోలస్ నుంచి డింపుల్ కపాడియాకు కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ వచ్చింది. నేను ఆమె స్థానంలో ఉంటే ఆశ్యర్చంతో ఉండిపోయేవాడిని. టెనెట్‌లో ఆమె నటన చూసి సంతోషంగా అనిపించింది. ఆమె అల్లుడిగా గర్వంగా ఫీల్ అవుతున్నాను’. అని ట్వీట్ చేశారు. కాగా డింపుల్ కపాడియా కూతురు ట్వింకిల్ ఖన్నాని అక్షయ్ కుమార్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. చదవండి: అల్లు అర్జున్‌కు నో చెప్పిన అనసూయ Here’s my proud son-in-law moment! #ChristopherNolan pens a heartfelt note to #DimpleKapadia on the eve of their release.Had I been in her place,I wouldn’t have been able to move in awe but having watched her working her magic in #Tenet,I couldn’t be more happy and proud of Ma ♥️ pic.twitter.com/EgSehxio1I — Akshay Kumar (@akshaykumar) December 5, 2020 -
ట్వింకిల్ బాంబ్: ట్రోలింగ్‌కు కౌంటర్
తెలుగు. తమిళ బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రం 'కాంచన' హిందీలో రీమేక్ అవుతున్న విషయం మీకు తెలిసిందేగా.. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు తొలుత 'లక్ష్మీ బాంబ్ అని టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే ట్రైలర్‌లోని కొన్ని సన్నివేశాలు మా మనోభావాలను దెబ్బ తీస్తున్నాయంటూ కొందరు హిందూ పెద్దలు నిరసన వ్యక్తం చేశారు. టైటిల్ కూడా లక్ష్మీ దేవిని అవమానించేలా ఉందని ఆరోపించారు. దీంతో అనవసర వివాదాలను నెత్తినెక్కించుకోవడం ఎందుకని తలచిన చిత్రయూనిట్ తమ సినిమా పేరును సవరించి "లక్ష్మీ"గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. అయినా సరే లక్ష్మీ సినిమాపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఆగడం లేదు. ఇందులోకి అక్షయ్ భార్య ట్వింకిల్ ఖన్నాను సైతం లాగుతున్నారు. (చదవండి: ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం లేదు: ఆర్జీవీ) ఆమె ఫొటోను మార్ఫింగ్ చేసి దానిపై ట్వింకిల్ బాంబ్ అని రాసుకొచ్చారు. ఇందులో ట్వింకిల్ శరీరాన్ని నీలి రంగులోకి మార్చి నుదుటిన ఎర్రటి బొట్టు పెట్టారు. ఈ ఫొటో కాస్త ట్వింకిల్ కంట పడగా, తనపై జరుగుతున్న ట్రోలింగ్‌కు దిమ్మతిరిగే కౌంటరిచ్చారు. తనే స్వయంగా ట్వింకిల్ బాంబ్ అని ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. "ఒకరు ఈ ఫొటోకు నన్ను ట్యాగ్ చేసి థర్డ్ క్లాస్ పర్సన్. దేవుడి మీద జోకులేసి ఎగతాళి చేస్తారా?.. అంటూ కామెంట్ చేశారు. అవును, దేవుళ్లకు జోకులంటే చాలా ఇష్టం.. లేకపోతే నిన్నెందుకు భూమి మీదకు పంపిస్తాడు? పోనీలే.. ఈ ఫొటో సాయంతో నేను దీపావళికి పటాసులా రెడీ అవుతాను" అని రాసుకొచ్చారు. కాగా లక్ష్మీ సినిమా డిస్నీ హాట్‌స్టార్‌లో రేపు(నవంబర్ 9న) రిలీజ్ కానుంది. ఈ సినిమాకు రాఘవ లారెన్స్ దర్శకత్వం వచించారు. (చదవండి: ‘కొత్త పంథాకు తెరలేపాను.. అందుకే ఇలా!’) View this post on Instagram The trolls are so helpful just when I was looking for the supporting image, here it is:) Crop rather than repost-you will see why in my column today. One tagged this picture with a comment, ‘Third class person. You make joke about God.’ I am almost tempted to reply, ‘God clearly likes a good joke, otherwise she would not have made you.’ By the way, I think I am going with the new skin tone and bindi look this Diwali like a true-blue bombshell :) click on link in bio to read more #DiwaliBombshell A post shared by Twinkle Khanna (@twinklerkhanna) on Nov 8, 2020 at 1:42am PST -
ట్వింకల్ కన్నాను ఆకట్టుకున్న పుస్తకాలివే..
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ భార్య, నటి ట్వింకిల్ కన్నా తన అభిరుచులను సోషల్ మీడియాలో పంచుకుంటూ నెటిజన్లను అలరిస్తుంటారు. పుస్తకాలు చదవడం అంటే ట్వింకల్ కన్నాకు ఎంతో ఇష్టం. తాజాగా టీనేజ్ ప్రేమికుల ఇతివృత్తంతో ‘ఫ్రెంచ్ ఎగ్జిట్’ అనే పుస్తకాన్ని ట్వింకల్ కన్నా సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. అయితే ఈ పుస్తకంలో టీనేజ్ యువత మైండ్‌సెట్, వ్యక్తిత్వం తదితర అంశాలను రచయిత చక్కగా వివరించినట్లు తెలిపింది. కేవలం ఫ్రెంచ్ ఎగ్జిట్ పుస్తకం మాత్రమే కాకుండా ‘ది వార్ నెక్స్ట్ డోర్’ అనే పుస్తకాన్ని కూడా ట్వింకల్ కన్నా నెటిజన్లకు సూచించారు. కాగా తన కూతురుతో కలిసి పుస్తకాలను చదవుతానని, పిల్లలకు సంబంధించిన పుస్తకాలను చదవడం వల్ల పిల్లల వ్యక్తిత్వం తెలుసుకోవచ్చని తెలిపారు. కాగా టాలీవుడ్లో వెంకటేశ్ హీరోగా ‘శ్రీను’ సినిమాలో ట్వింకల్ కన్నా హీరోయిన్గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అనేక బాలీవుడ్ సీనిమాలలో ట్వింకల్ కన్నా హీరోయిన్గా నటించారు. చదవండి: నా భార్య బాగా రాస్తుంది.. కానీ చదవను! -
నా భర్త వంట చేస్తాడు... తప్పేంటి?
లాక్డౌన్ సమయంలో ఇళ్లల్లో ఉండి గమనిస్తున్న మగవాళ్లకు ఇంటి పని ఎంత ఉంటుందో ఈ సరికే అర్థమై ఉంటుంది. గృహిణిగా ఇంట్లో ఉండే స్త్రీ విరామంతో ఉండలేదని ఆమెకు నిరంతరం పని ఉంటుందని అర్థం చేసుకుని ఉంటారు. అయినా సరే ఆ పనిని షేర్ చేసుకోవడానికి చాలామంది ముందుకు రారు. మరీ ముఖ్యంగా అది ‘స్త్రీల పని’ అని అనుకుంటూ ఉంటారు. ఇది పురుష భావజాలపు అవశేషం. ‘ఇలా అనుకోవడం తప్పు’ అంటోంది ట్వింకిల్ ఖన్నా. తాజాగా ఆమె లాక్డౌన్ కాలంలో గృహజీవనం గురించి ఏ.ఎన్.ఐకి ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ‘ఇంటి పనికి స్త్రీ, పురుష అనే భేదం లేదు. ఇంటి పనికి జెండర్‌ను ఆపాదించి ఫలానా పని స్త్రీది ఫలానా పని పురుషుడిది అని నిర్థారించడం తప్పు. ఎవరు ఏ పని చేయగలరో ఎవరికి ఏ పని చేతనవునో దానిని పంచుకోవాలి. అదే గృహశాంతిని ఇస్తుంది. పంతాలకు పట్టింపులకు పోతే చికాకులు పెరుగుతాయి. నాకు వంట రానేరాదు. నా పరిమితి అది. నన్ను బలవంతంగా వంటగదిలో పడేస్తే నేను చాలా ఉత్పాతాలు సృష్టిస్తాను. కాని నా భర్తకు వంట వచ్చు. ఆశ్చర్యకరంగా నా కుమారుడు ఆరవ్‌కు కూడా వంట అంటే ఆసక్తి ఉంది. వారిద్దరూ కలిసి రోజూ వంట ఎంజాయ్ చేస్తూ చేస్తారు. ఆరవ్ అన్ని పదార్థాలను వండ గలడని నేను కలలో కూడా ఊహించలేదు. వాళ్లిద్దరూ బాగా వంట చేస్తారు. నేను ఇంట్లో ఏమేమి కావాలో అవి తెప్పించడం, అంట్లు కడగడం చేస్తున్నాను’ అందామె. ఒకప్పటి నటి, ఇప్పటి రచయిత్రి, సోషల్ కామెంటేటర్ అయిన ట్వింకిల్ ఖన్నా ఏరియల్ వారి ‘షేర్ ది లోడ్’ కాంపెయిన్కు ప్రచార కర్తగా ఉంది. ‘నేను నా కూతురి ఆన్లైన్ క్లాసుల గురించి శ్రద్ధ పెడతాను. ఇంకా ఇల్లు నడవడానికి అవసరమైనవన్నీ గమనించుకుంటాను. ఇవీ పనులే. భార్యాభర్తలు గమనించుకుంటే ఇంటి పని గుదిబండగా మారబోదు’ అంటోంది ట్వింకిల్. -
అంత పెద్ద మొత్తం ఇస్తానన్నపుడు.. : ట్వింకిల్
కరోనా వైరస్‌పై పోరాటం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు రూ. 25 కోట్లు భారీ విరాళం ప్రకటించి అక్షయ్ కుమార్ అందరి మనసులు గెలుచుకున్నారు. భర్త అంత పెద్ద మొత్తం విరాళం ఇవ్వటంపై ట్వింకిల్ ఖన్నా స్పందించారు. శనివారం ట్విటర్ వేదికగా.. ‘‘అతడు అంతపెద్ద మొత్తం విరాళం ఇస్తానన్నపుడు ‘ ఆ మొత్తాన్ని సమకూర్చుకోవాలంటే మనం ఏదైనా అమ్మాల్సి వస్తుంద’ని అన్నా. అప్పుడు తను ‘ నా సినీ జీవితాన్ని ప్రారంభించే సమయానికి నావద్ద ఏమీ లేదు. ఇప్పుడు నేనీ పొజిషన్లో ఉన్నాను, లేని వాళ్లకోసం నేను అనుకున్నది చేసినపుడే కొంతైనా తిరిగివ్వగలన’ని అన్నాడు. నా భర్త నేను గర్వపడేలా చేశాడు’ అంటూ ట్వింకిల్ ఆనందం వ్యక్తం చేశారు. The man makes me proud. When I asked him if he was sure as it was such a massive amount and we needed to liquidate funds, he just said, ‘ I had nothing when I started and now that I am in this position, how can I hold back from doing whatever I can for those who have nothing.’ https://t.co/R9hEin8KF1 — Twinkle Khanna (@mrsfunnybones) March 28, 2020 చదవండి : కరోనాపై పోరాటం: అక్షయ్ రూ.25 కోట్ల విరాళం -
మొహం చాటేసిన స్టార్ హీరో భార్య.. అసలేమైంది!
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ భార్య, నటి ట్వింకిల్ కన్నా మీడియాకు మొహం చాటేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత శుక్రవారం బంద్రాలో జరిగిన ఓ యాడ్ షూట్లో పాల్గొన్న ఆమె.. తిరిగి వెళుతుండగా మీడియాకు తన మొహం కనిపించకుండా తెల్లని టిష్యూ పేపర్‌ను అడ్డుపెట్టుకున్నారు. అలా పేపర్‌తో ముఖాన్ని కప్పేసుకున్న ట్వింకిల్ వైపే కెమెరాలను ఫోకస్ చేయడంతో.. ఇంకా జాగ్రత్తగా తన ఫేస్‌ను కప్పేసుకుంటూ కారెక్కి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్వింకిల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘నేను ఇలా ప్రవర్తించిన తర్వాత ఇక మీడియా తన దైన శైలిలో స్పందిస్తుంది. అయితే నేను ఇలా చేయడం వెనక గల కారణం తెలిస్తే మీరంతా షాక్ అవుతారు. అదేంటో త్వరలోనే ప్రకటిస్తా. ఓ కొత్త పంథాకు తెరలేపాను. అదేంటో తెలియాలంటే కాస్త వేచి ఉండండి’ అని ట్వింకిల్ పేర్కొన్నారు. ఇక ట్వింకిల్ తీరును చూసిన నెటిజన్లు ఆమె అలా ఎందుకు ప్రవర్తించి ఉంటారనే ఆలోచనలో పడ్డారు. నా భార్య బాగా రాస్తుంది.. కానీ చదవను! View this post on Instagram The next thing people will do after we run out of masks:) Me? I am rocking a unibrow for something new- Wait for the big reveal 😂 A post shared by Twinkle Khanna (@twinklerkhanna) on Mar 12, 2020 at 2:51am PDT కాగా, ట్వింకిల్ తన న్యూలుక్‌ను దాచుకోవడం కోసమే ఇలా చేసుంటారని.. మీడియా కెమెరాలను తప్పించుకోవడం కోసం కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే తన చుట్టు ఉన్న వారంతా నవ్వుతుండడమే కాక ట్వింకిల్ కూడా మొదటి నుంచి నవ్వుతూ కనిపించారు’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇది కరోనా వైరస్ నుంచి సంరక్షించుకోవడానికి మాస్క్‌లు ధరించాలనే సంకేతాన్ని సూచిస్తూ సరదగా చేసుంటారని నెటిజన్లు తమ దైన శైలిలో స్పందిస్తున్నారు. ఇక అసలు విషయం తెలియాలంటే కొద్ది కాలం వేచి చూడాల్సిందే. -
కళ్లబడ్డాడు
ట్వింకిల్ ఖన్నా కొడుకు పెద్దయ్యాడు! మరీ పదిహేడేళ్లకే పెద్దవాడు కాకున్నా.. తను పెద్దవాడిని అయ్యాననే అతడు అనుకుంటున్నాడు కాబట్టి, అతడి ఫీలింగ్‌ని గౌరవించాల్సిందే. అతడికున్న ఒక ఫీలింగ్.. మమ్మీ ఎప్పుడూ తనపై ఒక కన్నేసి ఉంచుతుందని! ఆ ఫీలింగ్‌ని కూడా ట్వింకిల్ గౌరవిస్తున్నారు. ట్వింకిల్ కొడుకు పేరు ఆరవ్. అతడి ఫోన్ కాంటాక్ట్స్‌లో ‘మమ్మీ’ అని ఉండాల్సిన చోట ‘పోలీస్’ అని ఉండటాన్ని ఎలాగో ఆమె ఈ మధ్య గమనించారు. తనపై కొడుక్కి ఉన్న అభిప్రాయం ఆమెకు నవ్వు తెప్పించినట్లే ఉంది. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు ట్వింకిల్. అలాగే ఓ పోలీస్ వ్యాన్ ముందు నిలబడి రెండు చేతులు ఎత్తి బలం చూపిస్తున్నట్లున్న తన ఫొటోని ఆ పోస్ట్‌కి జత చేశారు ట్వింకిల్. ‘ఆరవ్ ఫోన్లో నా కాంటాక్ట్‌కి ఈ ఫొటోను డిస్ప్లే పిక్‌గా పెట్టుకుంటే ఇంకా కరెక్టుగా ఉంటుంది’’ అని కామెంట్ కూడా రాశారు. ఇదీ ఒక రకమైన పుత్రోత్సాహమే. -
ట్వింకిల్ చెవులకు.. అక్షయ్ అరుదైన గిఫ్ట్
సాక్షి, ముంబై : భర్త ఇచ్చిన ప్రియమైన కానుకను ఆమె ధరించింది. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తన భార్య ట్వింకిల్ ఖన్నాకు ప్రేమతో ఉల్లిపాయలతో చేసిన ఇయర్ రింగ్స్ బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ట్వింకిల్ ఖన్నా ఆ ఇయర్ రింగ్స్‌ను పెట్టుకున్నారు. అంతేకాకుండా తన చెవులకు ఆ ఆనియన్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని ఉన్న ఫోటోను ఆమె షేర్ చేశారు. ఇయర్ రింగ్స్ ఒక షూట్ నుంచి మరొక షూట్ వరకూ ఎలా ప్రయాణించాయో కదా అని ట్వింకిల్ వ్యాఖ్యానించారు. అయితే కొంతమంది నెటిజన్లు వావ్ అంటూ అభినందించగా, మరికొందరు అబ్బే బాగోలేదంటూ వ్యాఖ్యలు చేశారు. కాగా అక్షయ్ కుమార్, కరీనా కపూర్, కియార అద్వానీలతో తెరకెక్కిన గుడ్‌న్యూస్ మూవీ ప్రమోషన్ కోసం అక్షయ్ ఇటీవల కపిల్ శర్మ షోకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆ షో నుంచి అక్షయ్ ఉల్లిపాయలతో చేసిన చెవి రింగులను తెచ్చి ట్వింకిల్‌కు అందించగా ...ఆమె వాటిని సంతోషంగా స్వీకరించారు. తనకు అక్షయ్ నుంచి మంచి బహుమతి లభించిందని.... కొన్ని సార్లు చిన్నవిషయాలు సైతం మన మనసుల్ని తాకుతాయి అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లో వ్యాఖ్యానించారు. -
అబ్బాయిలను అలా పెంచాలి..
మగపిల్లల పెంపకంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వారికి జీవితంలో ఎత్తుపల్లాలు చూపించాలని బాలీవుడ్ నటి ట్వింకిల్ ఖన్నా అన్నారు. పిల్లల జీవితాన్ని కఠినతరం చేయాలని, పడిలేచిన తర్వాత వారి భవిష్యత్ బలంగా ఉంటుందన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు ఆదర్శవంతంగా ఉంటే వారు బాధ్యతగా ఉంటారన్నారు. గురువారం ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మరెన్నోవిషయాలను పంచుకున్నారు. ‘‘మహిళా సాధికారతను ప్రోత్సహిస్తూ, సామర్థ్యాన్ని పెంచేందుకు వర్క్‌షాప్‌లు, వివిధ కార్యక్రమాలను ఎఫ్ఎల్ఓ సభ్యుల కోసం నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే అనేక రంగాల్లో ప్రతిభ గల ట్వింకిల్ ఖన్నాను ఆహ్వానించామని ఎఫ్ఎల్ఓ హైదరాబాద్ చైర్పర్సన్ సోనా చత్వాని తెలిపారు.’’ సాక్షి, హైదరాబాద్: మహిళలు పురుషులతో పోటీ పడగలరా? అని ఎవరన్నా అంటే.. ఆమెను చూపించి ‘మగవారికంటే ఇంకా ఎక్కువే చేయగలరు’ అని తల ఎగరేసి చెప్పొచ్చు. ఒకటీ.. రెండూ కాదు.. దాదాపు తొమ్మిది రంగాల్లో ఆమె ‘స్టార్’గా వెలుగొందుతున్నారు. ఓ పక్క ఇల్లాలిగా ఇంటిని చక్కదిద్దుకుంటూనే తనకు నచ్చిన రంగాల్లో దూసుకెళుతున్నారు. ఆమే ‘ట్వింకిల్ ఖన్నా’. ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి అలనాటి బాలీవుడ్ తారలు డింపుల్ కపాడియా, రాజేష్ ఖన్నాల కుమార్తె. హిందీ చిత్ర హీరో అక్షయ్ కుమార్ భార్య. ముక్కు సూటిగా మాట్లాడ్డం ఆమె స్వభావం, అందులో చమత్కారం జోడించటం ఆమె శైలి. నటి, ఇంటీరియర్ డిజైనర్, కాలమిస్ట్, పుస్తకాలు, కథల రచయిత, చిత్ర నిర్మాత.. ఇలా ఆమె జాబితాలో ఎన్నో విజయవంతమైన కెరీర్లు ఉన్నాయి. గురువారం సోమాజిగూడలోని పార్క్ హోటల్లో ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్వింకిల్ ఖన్నా ‘ది ఫన్నీ సైడ్ ఆఫ్ లైఫ్’ అంశంపై ప్రత్యేకంగా మాట్లాడారు. తన జీవిత కథను ఫిక్కీ లేడిస్‌తో పంచుకున్నారు. వారు అడిగిన అనేక ప్రశ్నలకు బదులిచ్చారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. ‘నేను నా అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తం చేస్తాను. నేను లౌకికవాదిని అని చెప్పడమే కాదు, అదే తీరులో మాట్లాడతాను. చెట్ల చుట్టూ పరుగెత్తడం విసుగొచ్చి చిత్రాల్లో నటించటం మానేశాను. మొదట అమ్మమ్మ ఇంటి దగ్గర చేపలు, రొయ్యలు అమ్మాను. కానీ అది రెండు వారాలు మాత్రమే. తర్వాత నేను ఇంటీరియర్ డిజైనర్‌గా మారి నటినయ్యాను. నేను తొమ్మిది రకాల కెరీర్లు మారాను. అసలైతే సీఏ కావలనుకున్నాను. కానీ అది జరగలేదు. నేను రచయితను అవుతానని చిన్నప్పుడే నాన్న అనేవారు. నాన్న ఇంటి నుంచి బయటికి వచ్చేశాక నేను, నా సోదరి కటిక నేలపై పడుకోవాల్సిన పరిస్థితి. మా నాన్న చిన్నప్పుడు పడి లేచిన అనుభవాలను మాతో పంచుకునేవారు. పిల్లలకు అలా చెప్పడమే సరైంది. మహిళలు కూడా ఎక్కువ పుస్తకాలు చదవాలి. వీలైనంత వైవిధ్యంగా చదవండి. తద్వారా వారు జీవితంలో అనేక విషయాలను, అవకాశాలను అందిపుచ్చుకోగలరు. అబ్బాయిలను అలా పెంచాలి.. తల్లిదండ్రులు తమ కుమారులకు స్ఫూర్తివంతంగా నిలవాలి. పిల్లలు అన్ని పుస్తకాలను చదివేలా చేయాలి. వారి అవగాహన మరింత విçస్తృతం చేయడానికి విభిన్నమైన పుస్తకాలను ఇవ్వాలి. తల్లిదండ్రులు తమ కొడుకులతో ఇబ్బందికరమైన విషయాలతో సహా అన్ని విషయాలపై స్నేహపూర్వకంగా మాట్లాడాలి. తరువాతి తరంలో మగపిల్లలు ప్రాధమిక సంరక్షణ ఇచ్చేవారు అవుతారు. పిల్లల జీవితాన్ని కఠినతరం చేయాలి. ఎత్తుపల్లాలు చూశాక, పడిలేచిన తర్వాత వారి భవిష్యత్ బలంగా ఉంటుంది. వారు పడకపోతే, వారిని తన్నడం తప్పు కాదు. పడి లేచినప్పుడే వారు ధృడంగా మారతారు’ అంటూ పేర్కొన్నారు. -
నా భార్య బాగా రాస్తుంది.. కానీ చదవను!
ముంబై: బాలీవుడ్లో అత్యంత బిజీగా ఉండే నటుడు అక్షయ్‌కుమార్. 52 ఏళ్ల వయస్సులోనే ఫిట్‌గా ఉంటూ.. క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతూ.. నిత్యం సినిమాలు చేస్తూ.. తన సినిమాలను ప్రమోట్ చేసుకుంటూ.. క్షణం తీరిక లేకుండా అక్షయ్ గడుపుతారు. బాలీవుడ్ ఖిలాడీ, సెల్ఫ్ మేడ్ సూపర్‌స్టార్‌గా పేరొందిన అక్షయ్ వ్యక్తిగత జీవితంలో ఎంతో నిబద్ధతతో ఉంటారు. పిల్లలను ప్రేమగా చూసుకునే తండ్రిగా, మంచి భర్తగా అతనికి పేరుంది. ఈ క్రమంలో అజెండా ఆజ్‌తక్ 2019 సదస్సులో సబ్సే బడా ఖిలాడీ సెషన్లో అక్షయ్ మాట్లాడారు. తన సినిమాలు, సెన్సార్ నిబంధనలు, ప్రధాని మోదీతో చేసిన ఇంటర్వ్యూ, లేడీస్ మ్యాన్‌గా తనకున్న పేరు ఇలా చాలా అంశాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. తన భార్య ట్వింకిల్ ఖన్నాతో అనుబంధం గురించి చెప్తూ.. ‘ట్వింకిల్ తరహాలో నాకు రాయడం రాదు. తను చాలా బాగా రాస్తుంది. కానీ ఆమె రాసింది నేను చదవను’ అంటూ సరదాగా పేర్కొన్నారు. తమ ఆలోచనావిధానాలు వేరుగా ఉన్నా తమ మధ్య చక్కని సమన్వయం ఉందని తెలిపారు. మొదట ఓ మ్యాగజీన్ షూటింగ్లో అక్షయ్-ట్వింకిల్ కలిసి పనిచేశారు. మొదటిసారి చూడగానే ట్వింకిల్‌తో అక్షయ్ ప్రేమలో పడ్డాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఇంటర్నేషనల్ ఖిలాడీ సినిమా చేశారు. ఈ సినిమాతో వీరి ప్రేమ చిగురించి.. మొగ్గులు తొడిగి పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలో ఆనందంగా గడుపుతున్నారు. స్టార్ కిడ్, స్టార్ వైఫ్‌గా పేరొందిన ట్వింకిల్ అందమైన నటిగానే కాదు.. మంచి రచయితగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. -
ట్వింకిల్‌కు అక్షయ్ అరుదైన గిఫ్ట్
ముంబై : బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ తన భార్యకు అరుదైన గిఫ్ట్ ఇచ్చారు. కపిల్ శర్మ షో నుంచి ఆయన ఉల్లిపాయలతో చేసిన ఇయర్ రింగ్స్‌ను ఆమెకు అందించగా ఆమె ఎలాంటి ఆశ్చర్యానికీ లోనవకుండా వాటిని స్వీకరించారు. తన భర్త తనకు మంచి బహుమతి ఇచ్చారంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. కొన్ని సార్లు చిన్నవిషయాలు సైతం మన మనసుల్ని తాకుతాయి అంటూ ఆమె ఈ పోస్ట్‌లో వ్యాఖ్యానించారు. ఖిలాడీతో పాటు కరీనా కపూర్, కియార అద్వానీలతో తెరకెక్కిన గుడ్‌న్యూస్ మూవీ ప్రమోషన్ కోసం అక్షయ్ కుమార్ ఇటీవల కపిల్ శర్మ షోకు వెళ్లారు. ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై రాజ్ మెహతా నిర్ధేశకత్వంలో కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మించారు. ఉల్లి ధరలు ఎగబాకిన క్రమంలో ఈ గిఫ్ట్ కూడా ఖరీదైనదేనని నెటిజన్లు భావిస్తున్నారు. -
‘నేను బతికే ఉన్నాను.. బాగున్నాను’
తన ఆరోగ్యం గురించి వస్తున్న రూమర్లపై అలనాటి బాలీవుడ్ హీరోయిన్ డింపుల్ కపాడియా(62) స్పందించారు. ‘నేనింకా బతికే ఉన్నాను. బాగున్నాను. దయచేసి ఇష్టం వచ్చినట్లు ఊహించుకోకండి’ అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత నకిలీ వార్తలు జోరుగా ప్రచారమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డింపుల్ పెద్ద కుమార్తె, నటి-రచయిత్రి ట్వింకిల్ ఖన్నా ముంబైలోని ఆస్పత్రి బయట కనిపించడంతో.. డింపుల్ అనారోగ్యం బారిన పడ్డారంటూ వదంతులు వ్యాపించాయి. ఆస్పత్రి వద్ద నిల్చుని ఉన్న ట్వింకిల్ ఫొటోలు చూసి ప్రతీ ఒక్కరు తమకు ఇష్టారీతిన డింపుల్ ఆరోగ్యంపై కథనాలు అల్లేశారు. ఈ నేపథ్యంలో ముంబైలో విలేకరులతో మాట్లాడిన డింపుల్.. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టం చేశారు. తన తల్లి బెట్టీ కపాడియా అనారోగ్యం పాలయ్యారని, ఆమె కోసమే ఆస్పత్రికి వచ్చామని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను కోలుకుంటున్నారని.. ఆమెకు దీర్ఘాయిష్షు ప్రసాదించేలా దేవుడిని కోరుకోవాలంటూ అభిమానులకు విఙ్ఞప్తి చేశారు. కాగా పదహారేళ్ల వయస్సులోనే బాబీ(1973) సినిమాతో డింపుల్ కపాడియా బాలీవుడ్లో తెరంగేట్రం చేశారు. అదే ఏడాది సహ నటుడు, బాలీవుడ్ సూపర్‌స్టార్ రాజేశ్ ఖన్నాను వివాహమాడారు. ఈ జంటకు ట్వింకిల్ ఖన్నా(హీరో అక్షయ్ కుమార్ భార్య), రింకీ ఖన్నా అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇక సాగర్, రామ్ లఖణ్, దిల్ చాహ్తా హై, ద్రిష్టి, రుడాలి, ఫైండింగ్ నానీ తదితర చిత్రాల్లో నటించి గుర్తింపు పొందిన డింపుల్... రుడాలి సినిమాకు గానూ ఉత్తమ నటిగా జాతీయ అవార్డు సైతం సొంతం చేసుకున్నారు. కాగా డింపుల్ కపాడియా ప్రస్తుతం టెనెట్ అనే హాలీవుడ్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఫోర్బ్స్ లిస్ట్‌లో చేరినా సరే.. 100 పౌండ్ల కోసం
బాలీవుడ్ ‘ఖిలాడీ’ అక్షయ్ కుమార్ ఫిట్నెస్ ప్రీక్ అన్న సంగతి తెలిసిందే. వయసు పైబడుతున్న కొద్ది మరింత సామర్థ్యాన్ని పెంచుకుంటున్నారు అక్షయ్. సెలవు రోజుల్లో కూడా వ్యాయామాన్ని పక్కన పెట్టరు అక్షయ్. ఇంత ఫిట్‌గా ఉంటారు కాబట్టే నేటికి కూడా తన సినిమాల్లో యాక్షన్ సీన్లను డూప్ లేకుండా తానే చేస్తుంటారు అక్షయ్. ప్రస్తుతం కుటుంబంతో కలిసి విహారయాత్రలో ఉన్నారు అక్షయ్. ఈ సందర్భంగా అక్షయ్ పాల్గొన్న ఓ చాలెంజ్ ఫోటోను ట్విటర్లో షేర్ చేశారు ట్వింకిల్ ఖాన్న. ఈ టూర్లో అక్షయ్ తన కండ బలాన్ని పరీక్షించుకోవడమే కాక.. త్వరగా డబ్బు సంపాదించడం కోసం ఓ చాలెంజ్‌లో పాల్గొన్నారు అంటున్నారు ట్వింకిల్ ఖన్నా. ఫోటోతో పాటు.. ‘ఫోర్బ్స్ జాబితాలో స్థానం సంపాదించినా సంతృప్తి లేదు. త్వరగా డబ్బు సంపాదించే ఏ అవకాశాన్ని విడిచిపెట్టడు. 100 పౌండ్లు ఇస్తామనే సరికి ఇలాంటి స్టంట్లు చేస్తున్నాడు’ అంటూ కామెంట్ చేశారు ట్వింకిల్ ఖన్నా. View this post on Instagram Just hanging in there! Not happy with hitting the Forbes list- he wants to make a quick 100 pounds here as well :) #GoofingAround A post shared by Twinkle Khanna (@twinklerkhanna) on Jul 16, 2019 at 7:40am PDT ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రతి ఏడాది విడుదల చేసే అత్యధికంగా సంపాదించే సెలబ్రిటీల జాబితాలో అక్షయ్ స్థానం సంపాదించిన సంగతి తెలిసిందే. మన దేశం నుండి అక్షయ్‌కు మాత్రమే ఈ జాబితాలో చోటు దక్కడం విశేషం. ఈ లిస్టులో అక్షయ్‌కు 33వ స్థానం దక్కింది. ఒక సినిమా కోసం అక్షయ్ రూ.35-70 కోట్ల వరకు తీసుకుంటాడని ఫోర్బ్స్ వెల్లడించింది. కేవలం సినిమాల పరంగానే కాకుండా.. బ్రాండ్ అంబాసిడర్‌గానూ అక్షయ్ భారీ మొత్తం అర్జిస్తున్నారని ఫోర్బ్స్ తెలిపింది. 2018 జూన్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు అక్షయ్ కుమార్ రూ.444 కోట్ల సంపాదనతో ఇంటర్నేషనల్ స్టార్స్ రిహానా, జాకీచాన్, బ్రాడ్లీ కూపర్ వంటి వారిని అధిగమించారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అక్షయ్ నటించిన `మిషన్ మంగళ్` విడుదలకు సిద్ధమవుతుండగా.. `హౌస్‌ఫుల్ 4`, `గుడ్‌న్యూస్`, `లక్ష్మీబాంబ్`, `సూర్యవంశీ` చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. -
‘ఈ ఫంక్షన్‌కి ఆమె రాకుడదనుకున్నాను’
తాజాగా జరిగిన ఓ అవార్డుల ఫంక్షన్లో బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్వింకిల్ ఖన్నా అంటే తనకు చాలా భయమన్నారు కత్రినా. కొద్ది రోజుల క్రితం జరిగిన ఈ ఫంక్షన్లో ‘మోస్ట్ స్టైలీష్ పర్సన్’ అవార్డు అందుకున్నారు కత్రినా. అనంతరం ఆమె ప్రసంగిస్తూ.. ‘ఈ అవార్డు నాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఇక్కడకు వచ్చేటప్పుడు నేను ఒక విషయం గురించి ఆలోచిస్తు ఉన్నాను. ఈ ఫంక్షన్‌కి ట్వింకిల్ ఖన్నా రాకుండా ఉంటే బాగుంటుంది అనుకున్నాను. ఎందుకంటే ఆమె చాలా చక్కగా, గొప్పగానే కాక చమత్కారంగా మాట్లాడతారు. ఆమె ప్రత్యేకత ముందు నా అవార్డు పెద్ద విషయం కాద’న్నారు. ‘నేను ఈ వేదిక మీదుగా ట్వింకిల్ ఖన్నాకు ఓ విషయం చెప్పదల్చుకున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు చాలా బాగా మాట్లాడతారు.. అవన్నీ కూడా వాస్తవాలే’ అంటూ ట్వింకల్ ఖన్నా మీద ప్రశంసల వర్షం కురిపించారు కత్రినా. అక్షయ్ కుమార్, కత్రినా కలిసి తీస్ మార్ ఖాన్, సింగ్ ఇజ్ కింగ్, నమస్తే లండన్ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు. -
దేశం మీద ప్రేమను నిరూపించుకోవాలా?
కొంతకాలంగా నటుడు అక్షయ్‌కుమార్ పౌరసత్వం గురించి బీటౌన్‌లో వివాదం వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. అక్షయ్ కెనడా పౌరసత్వం కలిగి ఉన్నాడన్నది ఆ వివాదాల సారాంశం. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అక్షయ్ ఓటు వేయకపోవడం విమర్శకు దారి తీసింది. అతని భార్య, నటి, నిర్మాత ట్వింకిల్ ఖన్నా ఓటు హక్కును వినియోగించుకున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అక్షయ్ ఎందుకు లేడనే విషయంపై సోషల్ మీడియాలో భిన్నరకాలుగా చర్చలు సాగాయి. ఆ చర్చ అక్షయ్ కెనడా పౌరసత్వమే ప్రధానాంశంగా సాగింది. ఈ విషయంపై అక్షయ్ కుమార్ ట్వీటర్లో వివరణ ఇచ్చారు. ‘‘నా పౌరసత్వం గురించి ఎందుకింత చర్చ, వ్యతిరేక భావనలు వినిపిస్తున్నాయో అర్థం కావడం లేదు. కెనడా పాస్‌పోర్ట్ లేదని నేనెప్పుడూ చెప్పలేదు, దాచలేదన్నది ఎంత నిజమో.. గత ఏడేళ్లగా ఒక్కసారి కూడా కెనడా వెళ్లలేదన్నది అంతే నిజం. నేను ఇండియాలో పని చేస్తున్నాను. ఇండియాలోనే పన్నులు కడుతున్నాను. ఇన్నేళ్లుగా దేశం పట్ల నాకు ఉన్న ప్రేమను ఇప్పుడు ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం రాలేదు. కానీ ఇప్పుడు అనవసరంగా నా పౌరసత్వం గురించి వివాదాలు సృష్టించడం సరైంది కాదు. ఏదీ ఏమైనా ఇండియా ప్రగతి పథంలో ముందుకు వెళ్లడానికి నా వంతు ప్రయత్నాన్ని మానుకోను’’ అన్నారు అక్షయ్ కుమార్. -
‘నచ్చకపోతే నిరభ్యంతరంగా వెళ్లి పోవచ్చు’
బాలీవుడ్ హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా సోషల్ మీడియాలో ఎంత చురుకుగా ఉంటారో అందరికి తెలిసిన విషయమే. ఏ విషయం గురించైనా ఎలాంటి మొహమాటం లేకుండా తన అభిప్రాయాలను వెల్లడిస్తారు ట్వింకిల్ ఖన్నా. ఈ క్రమంలో సోషల్‌మీడియా వేదికగా ఓ న్యూట్రిషియనిస్ట్కు గట్టి కౌంటరే ఇచ్చారు ట్వింకిల్ ఖన్నా. ఇంతకు విషయం ఏంటంటే.. కొన్ని రోజుల క్రితం ట్వింకిల్ ఖన్నా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. దానిలో ‘నా ఇన్‌బాక్స్‌లో ఒక విషయానికి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయి. ఐరన్ లేవల్స్ని ఎలా పెంచుకోవాలనే దాని గురించి జనాలు నన్ను ఎక్కువగా ప్రశ్నిస్తున్నారు. వారికోసం ఇక్కడ కొన్ని సూచనలు చేస్తున్నాను. ఒకటి ప్రతిరోజు నీటితో కలిపిన ఓట్స్ లేదా బాదంపాలు.. రెండు క్వినోవా.. మూడు తరిగిన గింజలు.. నాలుగు గుమ్మడి గింజలు. వీటిని ఓ మూడు నెలల పాటు తీసుకోండి. ఆ తర్వాత మీరే చూడండి’ అంటూ ట్వింకిల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. అయితే దీనిపై ఓ న్యూట్రిషియనిస్ట్ ట్వింకిల్‌ని ట్రోల్ చేశారు. ‘ప్రతి ఒక్కరు ఆహారం గురించి సలహాలిచ్చేవారే’ అంటూ కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by Twinkle Khanna (@twinklerkhanna) on May 2, 2019 at 9:38am PDT అయితే సదరు న్యూట్రిషియనిస్ట్ వ్యాఖ్యలపై కాస్త ఘాటుగానే స్పందించారు ట్వింకిల్. ‘మీరు పోషాకాహార నిపుణులు.. కానీ జనాలకు పనికివచ్చే ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి కూడా చెప్పరు. నా జీవితమంతా ఎనిమియా(రక్తహీనత)తో బాధపడ్డాను. ఈ చిన్న చిన్న విషయాలను పాటించడం ద్వారా చాలా మార్పు చూశాను. చాలా తక్కువ సమయంలోనే నేను రక్తహీనత నుంచి బయటపడ్డాను. మరి జనాలకు మేలు చేసే ఇలాంటి అంశాల గురించి చెప్తే తప్పేంటి. నేను చెప్పిన విషయం మీకు నచ్చకపోతే వదిలేయండి.. తప్పైతే నిరూపించడం. అంతేకానీ ద్వేషాన్ని మాత్రం పెంచకండి. ఒకవేళ అలాంటిది చేయాలనుకుంటే నా పేజ్ నుంచి వెళ్లిపొండి’ అని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ట్వింకిల్ ఖన్నా. -
అక్షయ్ అవి వేసుకుంటే నచ్చవు : ట్వింకిల్
ట్వింకిల్ ఖన్నా తన భర్త అక్షయ్ కుమార్ గురించి ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారు. ఇటీవలె మీడియా సంధించిన ప్రశ్నలకు ఈ జంట ఇచ్చిన సమాధానాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తన భర్త రెడీ అవ్వడానికి తక్కువ సమయం తీసుకుంటాడని, తన వద్ద కంటే భర్త వద్దే ఎక్కువ షూస్, బట్టలు ఉంటాయని ట్వింకిల్ పేర్కొన్నారు. ఇంతకీ మీడియాతో జరిగిన సంభాషణ ఏంటంటే.. ‘మీ దుస్తుల ఎంపికపై ట్వింకిల్ ప్రభావమేమైనా ఉంటుందా?’ అని అక్షయ్‌ను ప్రశ్నించగా..నూరుశాతం ఉంటుందని! చెప్పారు. దానికి ఏకీభవించని ట్వింకిల్ ‘ఎట్టి పరిస్థితిల్లోనూ కాదు’’ అని జవాబిచ్చారు. దానికి కొనసాగింపుగా.. తన వద్దే ఎక్కువ షూలు ఉంటాయని, అన్ని రంగుల (పింక్, గ్రీన్, లైలాక్, ఊదా) ప్యాంట్లు ఉంటాయని చెప్పారు. దానికి అక్షయ్.. ‘అవన్నీ నువ్వు చెబితేనే కొన్నాను కదా?’ అని అన్నారు. ‘‘హా.. కొనమన్నాను కానీ ఇంద్రధనస్సులో ఉండే రంగులన్నీ కొనమనలేదు’ అని బదులిచ్చారు. ‘మీ ఇద్దరిలో రెడీ కావడానికి ఎవరెక్కువ సమయం తీసుకుంటార’ని ప్రశ్నించగా.. దానికి ట్వింకిల్ సమాధానమిస్తూ.. ‘నేనే ఎక్కువ సమయం తీసుకుంటాను, అతని బట్టలకు ఓ ప్రత్యేకమైన గది ఉంటుంది. అతని ఫ్యాషన్ తగ్గట్టుగా ఆ రూమ్ ఉంటుంది. తను రెడీ అవ్వడానికి సహయకులు 11మంది ఉంటారు. నాకు ఎవరూ ఉండరు. అందుకే నాకు కొంచెం ఎక్కువ సమయం పడుతుంది’ అని అన్నారు. అక్షయ్ వేసుకునే ట్రాక్ ప్యాంట్లు, హుడీస్ తనకే మాత్రం నచ్చవనే విషయాన్ని బయటపెట్టారు. దీనికి అక్షయ్.. ‘నేను వేసుకునే ట్రాక్ ప్యాంట్లు, హుడీస్ తనకు ఏమాత్రం నచ్చవని, కానీ తనకు నేను అర్థమయ్యేలా చెబుతూనే ఉంటాను. ప్రతీరోజు నాది ఉరుకులు పరుగులతో కూడిన జీవితం కనుక అవి నాకు ఇంట్లో సౌకర్యవంతంగా ఉంటాయి. అందుకే నేను ఆ దుస్తులు వేసుకొవటానికే ఇష్టపడతాను’ అని చెప్పగా.. ట్వింకిల్ మాట్లాడుతూ.. ‘నేను చెప్పాల్సినవి ఇంకా చాలానే ఉన్నాయి కానీ నేను కంట్రోల్ చేసుకుంటున్నాను’ అని అన్నారు. -
‘ఇంటికి రా నీ పని చెప్తా’
‘ఇంటికి వెళ్లాలంటే భయమేస్తుంది’ అంటున్నారు బాలీవుడ్ ఖిలాడి హీరో అక్షయ్ కుమార్. ‘ఇంటికి రా చంపేస్తా’ అంటున్నారు ట్వింకిల్ ఖన్నా. అరే ఏమైంది వీళ్లిద్దరికి అని కంగారు పడకండి. అక్షయ్ చేసిన ఓ సాహసోపేతమైన స్టంట్ మూలానా వచ్చినవే ఈ వార్నింగ్‌లు, రియాక్షన్లు. యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న అక్షయ్.. తొలిసారి ‘ది ఎండ్’ అనే వెబ్ సిరిస్ల్ నటిస్తున్నారు. ఈ విషయం గురించి చెప్పడం కోసం అక్షయ్ ఏకంగా తన ఒంటికి నిప్పంటించుకుని స్టేజ్ మీదకు వచ్చారు. ఈ స్టంట్ చూసిన అక్షయ్ భార్య ట్వింకిల్ ఖన్నా.. ‘నీ ఒంటికి నువ్వే నిప్పంటించుకున్నావా.. ఇంటికి రా.. నిన్ను చంపేస్తాను. ఒకవేళ నువ్వు బతికి ఉంటే దేవుడా నాకు సాయం చెయ్యి’ అంటూ ట్వీట్ చేశారు. Now that’s something I’d actually be afraid of 😬 https://t.co/cqCqXDrbSs — Akshay Kumar (@akshaykumar) March 5, 2019 దీనికి బదులుగా అక్షయ్ ‘ఇంటికి వెళ్లాలంటే భయంగా ఉంది. ట్వింకిల్ నాకు ఎలాంటి శిక్ష వేస్తుందో’ అంటూ రీట్వీట్ చేశారు. ప్రస్తుతం వీరిద్దరి ట్విటర్ సంభాషణ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ సాహసోపేతమైన స్టంట్ గురించి అక్షయ్ మాట్లాడుతూ.. ‘యాక్షన్ నా రక్తంలోనే ఉంది. ముందు నేను స్టంట్‌మ్యాన్‌ని. ఆ తర్వాతే యాక్టర్‌ని’ అని తెలిపారు. అయితే తాను చేయబోయే వెబ్‌సిరీస్ షో గురించి మాత్రం ఎక్కువ వివరాలను వెల్లడించలేదు అక్షయ్. తన కుమారుడు ఆరవ్ సూచన మేరకు ఈ వెబ్‌సిరీస్‌లో నటించడానికి ఒప్పుకొన్నట్లు పేర్కొన్నారు. ఈ వెబ్ సిరీస్‌తో పాటు అక్షయ్ ‘కేసరి’, ‘సూర్యవంశి’ చిత్రాలతోనూ బిజీగా ఉన్నారు. మార్చి 21న ‘కేసరి’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. -
‘ఆయన కూతురిని పెళ్లిచేసుకుంటా అనుకోలేదు’
‘ఆయన సూపర్స్టార్డమ్ గురించి చెప్పుకొనే కథలు వింటూ పెరిగాను. అలాంటి వ్యక్తి ముద్దుల కూతురిని పెళ్లి చేసుకుంటానని కలలో కూడా ఊహించలేదు. ఇంత గొప్ప కానుక ఇచ్చినందుకు ఆయనకు రుణపడి ఉంటాను. మీ ఇద్దరికీ జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ బాలీవుడ్ ‘ఖిలాడీ’ అక్షయ్ కుమార్ తన మామగారైన సూపర్‌స్టార్ రాజేశ్ ఖన్నా, తన భార్య ట్వంకిల్ ఖన్నాకు విషెస్ తెలియజేశారు. ఇక ట్వింకిల్ ఖన్నా పుట్టిన రోజు కూడా ఈరోజే కావడం విశేషం. ఈ క్రమంలో తన తండ్రి ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ట్వింకిల్...‘ నా పుట్టినరోజు మా ఇంటికి ట్రక్కుల కొద్దీ పూల బొకేలు వచ్చేవి. నిజానికి అవి మా నాన్న కోసం వచ్చినవి. చిన్నపిల్లగా ఉన్నపుడు అవన్నీ నాకోసం వచ్చినవే అని మురిసిపోయేదాన్ని’ అంటూ క్యాప్షన్ జతచేశారు. కాగా భారతీయ సినీ రంగంలో తొలి సూపర్‌స్టార్‌గా గుర్తింపు పొందిన నటుడు రాజేశ్‌ఖన్నా జయంతి నేడు. సినీ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసిన ఆయన క్యాన్సర్ బారిన పడి 2012లో కన్నుమూశారు. బాలీవుడ్ నటి డింపుల్ కపాడియాను పెళ్లాడిన రాజేశ్ ఖన్నాకు ట్వింకిల్ ఖన్నా, రింకీ ఖన్నా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఆయన పెద్ద కూతురు ట్వింకిల్ ఖన్నా హీరో అక్షయ్‌కుమార్‌ను పెళ్లి చేసుకుని ప్రస్తుతం రచయిత్రిగా, నిర్మాతగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. View this post on Instagram While growing up I’d heard fascinating tales of his superstardom, never imagining one day I’ll marry his fascinating daughter...thank you for giving me this precious one❤️ Happy birthday to both of you 😘😘 A post shared by Akshay Kumar (@akshaykumar) on Dec 28, 2018 at 9:15pm PST View this post on Instagram As a toddler, I was convinced that all the truckloads of flowers that would arrive for his birthday were actually for me... #nowandforever A post shared by Twinkle Khanna (@twinklerkhanna) on Dec 28, 2018 at 4:57pm PST -
థాంక్యూ ట్వింకిల్.. మరి అక్షయ్ సంగతేంటి : తనుశ్రీ
పదేళ్ల క్రితం ‘హార్న్ ఓకే ప్లీజ్’ చిత్ర సమయంలో మొదలైన నానా పటేకర్ వేధింపులు ఇప్పటికీ కొనసాగుతున్నాయని తనుశ్రీ దత్తా టీమ్ ఆరోపించింది. తనుశ్రీకి మద్దతుగా మాట్లాడుతున్న వ్యక్తులను, మీడియా హౌజ్ ప్రతినిధులను మచ్చిక చేసుకునేందుకు పటేకర్ లాయర్ ప్రయత్నిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది. అదే విధంగా లీగల్ నోటీసులు ఇచ్చి, తనుశ్రీని కోర్టు కీడుస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఓ స్టేట్మెంట్లో పేర్కొంది. కాగా నానా పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని తనుశ్రీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్ ప్రముఖులు ట్వింకిల్ ఖన్నా, సోనమ్ కపూర్, అర్జున్ కపూర్, ఫర్హాన్ అక్తర్, ప్రియాంక చోప్రా తదితరులు తనుశ్రీకి మద్దతుగా నిలిచారు. (చదవండి : 'నానా'గొడవ) థ్యాంక్యూ ట్వింకిల్.. కానీ ‘పని చేసే చోట వేధింపులు, బెదిరింపులు లేకుండా ఉండాలని కోరుకోవడం అందరి హక్కు. అలాంటివాటి గురించి ఇలాంటి (తనుశ్రీ) ధైర్యవంతులు బహిరంగంగా మాట్లాడటం ఇతరులకూ ఆదర్శం’ అంటూ ట్వింకిల్ ఖన్నా ట్వీట్ చేశారు. తనకు మద్దతుగా నిలిచిన ట్వింకిల్‌కు కృతఙ్ఞతలు చెప్పిన తనుశ్రీ... ‘మీరు నా పక్షాన నిలిచినందుకు సంతోషం. కానీ మీ భర్త అక్షయ్ కుమార్ సంగతేంటి. ఆయన ఎన్నో ఏళ్లుగా నానా పటేకర్‌తో కలిసి నటిస్తున్నారు. అంతెందుకు ప్రస్తుతం హౌజ్‌ఫుల్ 4 సినిమాలో కూడా నానాతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు కదా. దీనికి మీ సమాధానం ఏమిటంటూ’ ప్రశ్నించారు. అదేవిధంగా కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ తీరు కూడా తనని బాధించిందని తనుశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఒక స్త్రీగా తను(ఫరాఖాన్) నా బాధ అర్థం చేసుకుంటుంది అనుకున్నా కానీ.. ఈ సమయంలో నానా పటేకర్‌తో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ఆమె ఏం చెప్పాలనుకుంటున్నారు అంటూ తనుశ్రీ ప్రశ్నించారు. (తనుశ్రీ ఆరోపణలపై స్పందించిన నానా పటేకర్) Please read this thread before judging or shaming #TanushreeDutta a working environment without harassment and intimidation is a fundamental right and by speaking up this brave woman helps pave the way towards that very goal for all of us! https://t.co/f8Nj9YWRvE — Twinkle Khanna (@mrsfunnybones) September 28, 2018 -
‘నా చిట్టితల్లి.. ఎప్పుడూ ఇలాగే ఉండాలి’
బాలీవుడ్ యాక్షన్ ఖిలాడి అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నాల గారాల పట్టి నితారా ఆరవ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా కూతురికి విషెస్ చెబుతూ అక్కీ చేసిన పోస్టు నెటిజన్ల మనసుల్ని దోచుకుంటోంది. కూతురితో పాటు స్విమ్మింగ్ ఫూల్లో ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన అక్షయ్... ‘ నా చిట్టితల్లి.. నాపై ఎంతో ప్రేమను కురిపిస్తున్నావు. నీవల్ల ఎంత సంతోషంగా ఉన్నానో నాకే తెలుసు. ప్లీజ్ నువ్విలాగే ఉండు. నా సాయం లేకుండా నీకు నీవుగా స్విమ్మింగ్ ఫూల్లో అడుగుపెట్టేంత పెద్దదానివి కావొద్దు. హ్యాపీ బర్త్‌డే మై ప్రిన్సెస్’ అంటూ క్యాప్షన్ జతచేశాడు. అంతే ఇక పది లక్షలకు పైగా లైకులతో అక్కీ పోస్టు వైరల్‌గా మారింది. దీంతో నితారాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ అక్కీ అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. View this post on Instagram My Baby Girl, you have given me Love I didn’t know existed ❤ Please don’t grow up just yet, I’m not ready for you to swim without Me. Happy 6th Birthday Princess 👸🏻 A post shared by Akshay Kumar (@akshaykumar) on Sep 25, 2018 at 4:02am PDT -
‘నా సినిమాలన్నింటిని బ్యాన్ చేయండి’
‘నా సినిమాలన్నింటిని బ్యాన్ చేయండి.. అప్పుడు ఎవరూ వాటిని చూడలేరు.. దాంతో వాటిని రీమేడ్ చేయాలనే ఆలోచన కూడా ఎవరికి రాదు’ అంటూ చమత్కరించారు నటి, నిర్మాత, రచయిత ట్వింకిల్ ఖన్నా. తన పుస్తకం ‘పైజమాస్ ఆర్ ఫర్గివింగ్’ పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా ట్వింకిల్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరులు ‘మీరు నటించిన ఏ చిత్రాన్ని రీమేడ్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు’ అని అడగ్గా ట్వింకిల్ కాస్తా భిన్నంగా స్పందించారు. ‘నేను ఒక్క హిట్ కూడా ఇవ్వలేదు. అందువల్ల నేను నటించిన సినిమాలన్నింటిని బ్యాన్ చేస్తే మంచిది. అప్పుడు ఎవరూ వాటిని చూడలేరు.. రీమేడ్ చేయాలనే ఆలోచన కూడా రాదం’టూ ట్వికిల్ జోక్ చేశారు. ‘బర్సాత్’ చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ట్వింకిల్ ఖన్నా.. ఆపై వరుసగా ‘ఇతిహాస్’, ‘జుల్మి’, ‘మేలా’ వంటి చిత్రాల్లో నటించారు. తెలుగులో వెంకటేష్ సరసన ‘శీను’ చిత్రంలో నటించారు. ఆపై వరుస వైఫల్యాలు రావడంతో సినిమాలకు స్వస్తి చెప్పి 2001లో బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్‌ని వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ట్వింకిల్ ఖన్నా రచయిత్రిగా బిజీ అయ్యారు. గతంలో ట్వింకిల్ షార్ట్ స్టోరీస్ సమాహారంగా రచించిన ‘ద లెజెండ్ ఆఫ్ లక్ష్మీ ప్రసాద్’ పుస్తకంలోని ఓ కథ ఆధారంగా అక్షయ్ కుమార్ ‘ప్యాడ్ మాన్’ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ట్వింకిల్ నిర్మాతగా వ్యవహరించడం విశేషం. -
సోషల్ మీడియా
నవభారత్ ఆవిష్కరణ ‘‘దేశ స్థూలజాతీయోత్పత్తి శరవేగంగా పెరుగుతోంది. వ్యవసాయం నుంచి తయారీ రంగం వరకు అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి కనిపి స్తోంది. భారత్ బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. సామాన్యులు తాము కన్న కలలు తీర్చుకునే అవకాశాలు వస్తాయి. ప్రధాన మంత్రి మోదీ ఆధ్వర్యంలో గతంలో ఎప్పుడూ చూడని నవ భారతం ఆవిష్కృతమవుతోంది. ప్రధానికి అభినందనలు’’ – అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు ఉద్యోగ ఆశలకూ పరిమితి ‘‘ఇవాళ రేపు అందరూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం తాపత్రయపడు తున్నారు. అందరూ తమ జీవితం సాఫీగా సాగిపోవాలని అను కుంటున్నారు. ఒక్క పోస్టుకి లక్షల్లో దర ఖాస్తులు వస్తున్నాయి. కానీ, జీవితం ఎల్ల వేళలా నిశ్చింతగా ఉండదు. అధిక ఆశలు మనకి సమస్యలనే మిగులుస్తాయి’’ – అభిషేక్ మిశ్రా, వీహెచ్‌పి కార్యకర్త వ్యక్తి స్వాతంత్య్ర హరణం ‘‘స్వాతంత్య్రం అనేది ఉన్నట్టుండి కోల్పోయే అంశంగా ఉండదు. అంతి మంగా మనలో ప్రతి ఒక్కరి స్వాతంత్య్రం హరించుకు పోయేం తవరకు.. ఒక వ్యక్తి, ఒక కార్యకర్త, ఒక లాయర్, ఒక రచయిత, ఒక మేధావి నిత్యం తమ స్వాతంత్య్రాన్ని విడివిడిగా కోల్పోతూనే ఉంటారు’’ – ట్వింకిల్ ఖన్నాబాలీవుడ్ నటి ఉపాధి కల్పన హరీ ‘#rupee@71.. మన దేశ ఆర్థిక వ్యవస్థ సర్వనాశనమై పోయింది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, తదితర తప్పుడు విధానపరమైన నిర్ణయాలు ఒకవైపు... ఆకాశాన్నంటే పెట్రోల్, డీజీల్ ధరలు మరోవైపు దేశ ప్రజల్ని నిత్య కష్టాల్లోకి నెట్టేశాయి. కేవలం 10–15 టాప్ కంపెనీలకు మాత్రమే దేశంలో పని ఉంది. మిగిలిన వారికి ఉద్యోగాల్లేవు. చిన్నా చితకా వ్యాపారాలు ప్రస్తుతం నడవట్లేదు. కేంద్రం తీసుకున్న అనేక తప్పుడు నిర్ణయాలతో రైతులే కాదు సమాజంలోని అన్ని వర్గాల వారు చాలా బాధలు పడుతున్నారు.’’ – శరద్ యాదవ్మాజీ కేంద్ర మంత్రి రాఫెల్ బాంబులు ‘‘రాఫెల్ విమానాలు చాలా వేగంగా, సుదూరంగా ప్రయాణిస్తు న్నాయి. త్వరలోనే ఈ విమానాలు అతి పెద్ద బాంబుల్ని పేల్చబోతు న్నాయి. మోదీజీ కాస్త అనిల్‌కు చెప్పండి. ఫ్రాన్స్‌లో చాలా పెద్ద సమస్య ఉంది’’ – రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు -
ఆక్షన్ హీరో
స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్.. వీళ్లంతా సూపర్ హీరోలు. కానీ హాలీవుడ్ సూపర్ హీరోలు. మన ఇండియన్ సూపర్ హీరో అంటే మనకు గుర్తొచ్చేది ‘క్రిష్’. హృతిక్ రోషన్ బ్లాక్ జాకెట్, బ్లాక్ మాస్క్ వేసుకొని చేసిన సాహసాలు, యాక్షన్ చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఎంజాయ్ చేశారు. సూపర్ హీరో ‘క్రిష్’ సూపర్ సక్సెస్ అయ్యాడు. ‘క్రిష్’ సిరీస్‌లో మూడు సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. నాలుగో సినిమా కూడా త్వరలో రానుంది. ఇప్పుడీ యాక్షన్ హీరోను.. ఆక్షన్ హీరో చేశారు. ‘క్రిష్’ సినిమాలో హృతిక్ ధరించిన బ్లాక్ జాకెట్‌ను ఇప్పుడు ఆక్షన్ (వేలానికి) పెట్టారు. అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా ‘సాల్ట్ స్కౌట్’ అనే సంస్థ ద్వారా సెలబ్రిటీలు సినిమాల్లో వేసుకున్న కాస్ట్యూమ్స్‌ను వేలం వేసి వచ్చిన డబ్బును చారిటీకి ఉపయోగించనున్నారు. అందులో భాగంగా ‘క్రిష్’ సినిమాలో హృతిక్ ధరించిన బ్లాక్ కోట్‌ను వేలంలో ఉంచారు. -
లీగల్ చర్యలకు సిద్ధం: ట్వింకిల్ ఖన్నా
సాక్షి, ముంబై: నటి, బాలీవుడ్ అగ్రహీరో అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా లీగల్ చర్యలకు సిద్ధమైపోయింది. రుస్తుం సినిమాలో అక్షయ్ ధరించిన దుస్తులను వేలానికి ఉంచిన విషయం తెలిసిందే. ఈ సంగతి తెలిసిన ఓ అధికారి ట్వింకిల్ ఖన్నాకు ట్వీటర్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. ‘నీ భర్త సినిమాలో ధరించిన కాస్టూమ్ మాత్రమే. అది యూనిఫామ్ కాదు. సైనికాధికారుల భార్యలు తమ భర్తల దుస్తులను వేలం వేయాలని చూడరు. అది చాలా గౌరవంతో కూడుకున్నది... ఒకవేళ యూనిఫామ్ పేరిట నువ్వు పిచ్చి వేషాలేస్తే నిన్ను కోర్టుకి లాగుతా. మా యూనిఫామ్‌ను తాకాలని చూస్తే నీ ముఖం పగలకొడతా’ అంటూ సందేశం పెట్టాడు. ఆయన లెఫ్టినెంట్ కల్నల్ సందీప్ అహ్లావట్గా తర్వాత నిర్ధారణ అయ్యింది. ఇక ఈ విషయాన్ని ట్వింకిల్ ఖన్నా ట్విటర్లో ప్రస్తావించారు. బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని.. భౌతిక దాడులకు పాల్పడతామన్నందుకు ఆయనపై లీగల్ చర్యలు తీసుకుంటానని ఆమె తెలిపారు. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్‌కుమార్ కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘రుస్తుం’.. ఫ్రైడేస్ ఫిలిం వర్క్ పతాకంపై టీనూ సురేష్ దేశాయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నౌకాదళ అధికారి ‘రుస్తుం పావరి’ దేశం కోసం పోరాడిన అంశం నేపథ్యంతో చిత్రం రూపొందింది. రెండేళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద రూ. 124 కోట్లు సాధించి విజయం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రంలో అక్షయ్ ధరించిన దుస్తులని వేలం వేశారు. 20 వేల నుండి ప్రారంభమైన ఈ వేలం శుక్రవారం సాయంత్రానికి 3 కోట్లకి చేరింది. మే 26 సాయంత్రం 9.30ని.లకి వేలం ముగియనుంది. వచ్చిన మొత్తాన్ని జంతువుల సంరక్షణ కోసం పనిచేసే ఓ ఎన్జీవోకు అక్షయ్ విరాళంగా ఇవ్వనున్నాడు. And this response to @mrsfunnybones ill advised idea to auction the Rustom costume comes from one of the finest men in uniform I know- Lt Col Sandeep Ahlawat. pic.twitter.com/lwDXuG0CLm — Sandeep (@SandeepUnnithan) 28 April 2018 As a society do we really think it’s all right to threaten a woman with bodily harm for trying to raise funds for a charity by auctioning a uniform used in a movie,a piece of film memorabilia ? I will not retaliate with violent threats but by taking legal action! #JaiHind https://t.co/OF7e5lTHel — Twinkle Khanna (@mrsfunnybones) 29 April 2018 -
ట్వింకిల్ ఖన్నాకు ఫిక్కి అవార్డు
ముంబై : రచయిత్రిగా దూసుకుపోతున్న బాలీవుడ్ మాజీ హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా ఫిక్కి మహిళా సమాఖ్య ఐకాన్ అవార్డు అందుకున్నారు. సామాజిక స్పృహ కలిగి ఉన్న ట్వింకిల్ ఖన్నా సినిమా రంగానికి చేస్తున్న కృషికి గానూ ఆమెకు అవార్డు ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. విఙ్ఞాన్ భవన్లో గురువారం జరిగిన ఈ అవార్డుల కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ట్వింకిల్‌తో పాటు వివిధ రంగాలలో కృషి చేసిన పది మంది మహిళామణులు అవార్డులు అందుకున్నారు. రుతుక్రమం గురించి మహిళల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు, పాటించాల్సిన శుభ్రత గురించి అవగాహన కల్పించేందుకు తెరకెక్కించిన ‘పాడ్‌మాన్’ సినిమాకు ట్వింకిల్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ‘మిసెస్ ఫన్నీ బోన్స్’, ‘ద లెజెండ్ ఆఫ్ లక్ష్మీ’ అనే పుస్తకాలు రచించారు. ఈ సందర్భంగా ట్వింకిల్ మాట్లాడుతూ.. ‘మహిళలు ముందుకు వెళ్లడానికి ప్రయత్నించడం కంటే ఎవరో ఒకరి వెనుక ఉండటానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇదే అసలు సమస్య. ఇప్పటికైనా ఇలాంటి దృక్పథాన్ని వదిలి మన జీవితాల్ని చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉందంటూ’ పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ట్వింకిల్.. ‘ఒక్కోసారి నేను సరైన మార్గంలోనే ప్రయాణిస్తున్నానా అనే అనుమానం కలుగుతుంది. ఒత్తిడి కారణంగానే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలని’ అన్నారు. -
వేలెత్తిచూపి ఊరుకోలేదు
నిరుడు ఆగస్ట్‌లో బాలీవుడ్ నటి ట్వింకిల్ ఖన్నా.. ఉదయం పూట జుహూ బీచ్‌లో వాకింగ్ చేస్తుంటే ఆరుబయటే మూత్ర విసర్జన చేస్తున్న ఒక వ్యక్తిని ఫొటో ఫోటో తీసి, దానిని ట్విట్టర్లో పెట్టింది గుర్తుందా.. ‘‘గుడ్ మార్నింగ్... టాయ్‌లెట్ ఏక్ ప్రేమ్ కథ–2 సినిమా ఫస్ట్ సీన్ ఇదే కావచ్చు’’ అని! ఈ ట్వీట్‌ను ఆమె ఫాలోవర్స్ రీట్వీట్ చేయడం, ఇంకా చాలామంది దానికి కౌంటర్ ట్వీట్ ఇవ్వడంతో అది WhenYourWalk GoesDown TheToilet పేరుతో ఓ హ్యాష్‌ట్యాగ్ ఉద్యమంగా మారింది. అయితే ఆమె అప్పుడు చేసిన ట్వీట్‌ను తప్పుపట్టిన వాళ్లే ఎక్కువ మంది. ‘ముంబై స్లమ్స్‌లో ఉండే వాళ్ల పరిస్థితి ఆ నటీమణికి తెలియనట్టుంది అందుకే అంత ముతకగా ఆలోచించి ట్వీట్ చేసింది’ అని, ముంబై మురికి వాడల్లో జనాలకు సరిపడా పబ్లిక్ టాయ్‌లెట్స్ లేకపోవడం వల్లే ఆ.. కాలకృత్యాలను, అకాలకృత్యాలను ఆరుబయట కానించేస్తున్నారనే ఇంగితం మరిచినట్టుంది సదరు యాక్ట్రెస్’ అనీ.. ఘాటుగా విమర్శించారు ఆమెను. ఇప్పుడీ ప్రస్తావనంతా ఎందుకూ అంటే... దాదాపు ఏడు నెలల కిందటి ఆ ట్వీట్ వర్కవుట్ అయి ఇప్పుడు జుహూ బీచ్ ప్రాంతంలో బయో టాయ్లెట్లు వెలిశాయి! ఈ పని చేసింది ఎవరో కాదు.. సాక్షాత్తూ ట్వింకిల్ ఖన్నా భర్త, ‘టాయ్‌లెట్ ఏక్ ప్రేమ్ కథ’ నటుడు, సహ నిర్మాత అక్షయ్ కుమార్. అందుకోసం శివసేన నేత ఆదిత్య థాకరేతో కలిసి పది లక్షల రూపాయలు వెచ్చించి, బయో టాయ్లెట్లు కట్టించాడు అక్షయ్. జుహూ బీచ్‌లో వీటిని పెట్టడం వల్ల ఆ దగ్గరల్లోని స్లమ్స్ వాళ్లకే కాదు.. విజిటర్స్కూ చాలా ఉపయుక్తంగా ఉందని ముంబై, కే వెస్ట్ వార్డ్ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ ప్రశాంత్ గైక్వాడ్ అన్నారు. ముంబైలో దాదాపు 63 శాతం మంది స్లమ్స్‌లో నివసిస్తున్నారు. 30 మందికి ఒక్క టాయ్‌లెట్ లెక్క చూసుకున్నా ఇంకా 60 వేల టాయ్‌లెట్స్ అవసరం ఉందట ముంబై మురికివాడలకు. ట్వింకిల్ ట్విట్టర్, అక్షయ్ కార్యాచరణతోనైనా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తే బాగుంటుంది. -
చిరాకేస్తే చింపెయ్.. కొత్తది రెడీ..!!
సాక్షి, ముంబై: కొత్తక వింత...పాతొక రోత అన్నట్లు పాశ్చాత్య సంస్కృతి విస్తరించడంతో మార్కెట్లో వచ్చే కొత్త ఫ్యాషన్లపై యువతలో మోజు పెరుగుతోంది. జుట్టు చెదిరిపోయి, చినిగిన దుస్తులను ధరించడం ఇప్పుడో వింత ఫ్యాషన్. చిరిగిన జీన్స్ ఇపుడు విభిన్న శ్రేణుల్లో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. యువతలో క్రేజ్ పెరగడంతో ఫ్యాషన్ డిజైనర్లు వీటిని వెరైటీగా రూపొందిస్తున్నారు. నచ్చిన మోడల్ ఏదైనా ఎంత డబ్బు పోసి కొనేందుకైనా యువత సిద్ధమైపోతున్నారు. అలా కొనుకున్న జీన్స్‌లో ఏదైనా అసౌకర్యం అనిపిస్తే బాధపడాల్సిన పనిలేదు. వాటికి పెద్ద బొక్కలు పెడితే చాలు. కంఫర్ట్‌గా మారుతుంది. అదేంటి అనుకుంటున్నారా? ట్రెండ్ మారింది. ఇప్పుడిక టోర్న్ జీన్స్ కథ ముగిసి రిప్డ్ జీన్స్ ట్రెండ్ మొదలవుతోంది. జీన్స్ ప్యాంట్‌కు తొడ, మోకాళ్లపై పెద్ద బొక్కలు పెట్టుకుంటే చాలు రిప్డ్ జీన్స్ రెడీ..! అటు కంఫర్ట్‌గా ఉంటుంది. ఇటు ట్రెండీగాను ఉంటుంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు. సమ్మర్ స్పెషల్‌గా పేర్కొంటున్న ఈ జీన్స్‌ను ముంబై నగరంలో బాలీవుడ్ హీరోయిన్లు అమీషా పటేల్, ట్వింకిల్ ఖన్నాలు ధరించి చూపరులను ఆకర్శించారు. ఎప్పుడూ మమూలు ట్రెండీ దుస్తుల్లో కనిపించే ట్వింకిల్ ఖన్నా పూర్తి భిన్నంగా మారిపోయారు. పులి బొమ్మతో కూడిన టీషర్ట్‌ని ధరించి, తొడలు, మోకాళ్ల వద్ద పెద్దపెద్ద బొక్కలు గల రిప్డ్ జీన్స్ ప్యాంట్‌తో ట్రెండ్ సెట్ చేస్తా అనేలా జుహు ప్రాంతంలో దర్శనమిచ్చారు. తరచూ డిజైనర్ దుస్తుల్లో కనిపించే అమీషా పటేల్ కూడా ఇదే తరహా బొక్కల ప్యాంటుతో చూపరులకు కొత్త ఆలోచన కల్పించారు. అప్పటికే మనం వాడుతున్న జీన్స్‌ను పడేయాల్సిన పనిలేకుండా వాటికి గాట్లు, పెద్ద బొక్కలు పెడితే చాలు ట్రెండీ రిప్డ్ జీన్స్‌ను తయారు చేసుకోవచ్చనే ఐడియాను అందించారు. సమ్మర్లో కూడా జీన్స్‌ను వదులుకోవాల్సిన అవసరం లేదనే విషయాన్ని అమీషా, ట్వింకిల్‌లు జీన్స్ ప్రియులకు తమ ట్రెండీ లుక్‌తో తెలియజెప్పారు. -
ట్వింకిల్, అక్షయ్... ఓ ఆటో
బాలీవుడ్ : సెలబ్రిటీలకు, అభిమానులకు మధ్య వారధిగా నిలుస్తోంది సోషల్ మీడియా. సినిమా, క్రీడా ప్రముఖలు చాలామంది తమ భావాలను, అనుభూతులను సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బాలీవుడ్ నటి, రైటర్ ట్వింకిల్ ఖన్నా ఆదివారం ఉదయం తన దినచర్యకు సంబంధించిన వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. తన భర్త అక్షయ్ కుమార్ ఆటో డ్రైవ్ చేస్తుండగా, ట్వింకిల్ వెనకాల కూర్చోన్న ఫొటోను షేర్ చేశారు. ఇది నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ‘ఉదయం పూట నాలుగు గంటలకు లేచి, రెండున్నర గంటల పాటు ప్రశాంతంగా పుస్తక రచన చేశాను. ఆ తర్వాత నా డాగ్‌ని తీసుకుని వాకింగ్‌కి వెళ్లాను, ఆ తర్వాత ఇలా నా క్యూట్ డ్రైవర్‌తో, ఆటో రిక్షాలో సరదాగా విహరించాను. ఇవన్నీ తొమ్మిది గంటల్లోపే పూర్తయ్యాయి. తొందరగా నిద్రపోవడం వల్లే ఇది సాధ్యమైంది. మీరు కూడా ట్రై చేయండి’ అని ఈ ఫొటోను ఉద్దేశించి పేర్కొన్నారు. ఈ పోస్ట్‌పై అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇది ఒక అక్షయ్‌కి మాత్రమే సాధ్యపడుతుందని ఒకరు, క్యూట్ కపుల్ అని మరొకరు.. కామెంట్లు చేస్తున్నారు. -
మనుషులు ఎందుకు కలిసుండకూడదు?
న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బాలీవుడ్ నటి, రచయిత ట్వింకిల్ ఖన్నా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్స్ ఫొటోలు షేర్ చేసి జంతువుల పట్ల ప్రేమను చాటుకుంటున్నారు. అంతేకాదు వాటి నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందంటున్నారు ట్వింకిల్. తన పెంపుడు కుక్క, పిల్లుల ఫొటోను షేర్ చేసి.. వేర్వేరు జాతులకు చెందిన కుక్క, పిల్లులే కలిసి ఉన్నపుడు మనుషులు మాత్రం ఎందుకు కలిసి ఉండకూడదంటూ ప్రశ్నిస్తున్నారు. నిజమే కదా చిన్న చిన్న విషయాలకే గొడవ పడే భార్యాభర్తలు ఈ పోస్ట్‌ను చూసి ట్వింకిల్ సలహాను పాటిస్తే ఏ గొడవా ఉండదు. తనకు, పిల్లులకు మధ్య ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్లు భావిస్తారట ట్వింకిల్. ఎక్కడికి వెళ్లినా ఆమెకు పిల్లులు ఎదురవటంతో తాను ‘మురకామి పుస్తకం’లో ఉన్నానా అన్పిస్తుందటూ.. క్యాట్ పర్సన్ అనే హాష్ ట్యాగ్‌తో మరో పోస్ట్ చేశారు. అంతేకాకుండా తన ఫామ్ హౌజ్‌కు విచ్చేసిన అనుకోని అతిథుల ఫొటోలు కూడా షేర్ చేశారు. ‘నన్ను, నా ఇద్దరు పిల్లల్ని చూడటానికి తన ఇద్దరు పిల్లలతో నెమలి వచ్చింది.. కానీ వారి గురించి జడ్జ్ శర్మ చేసిన వ్యాఖ్యల గురించి అడగటం మరచిపోయా’నంటూ సరదాగా చెప్పుకొచ్చారు రచయితగా దూసుకెళ్తున్న ట్వింకిల్. వైవిధ్యమైన ఫొటోలు షేర్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ అవార్డు పొందాలనుకుంటే ఆలస్యం చేయకుండా ట్వింకిల్ వద్ద ఇంటర్న్‌షిప్ చేసేయండి మరి. A potential Archies card right there with the slogan ‘If cats and dogs can kiss and makeup why can’t we?’ #home A post shared by Twinkle Khanna (@twinklerkhanna) on Mar 22, 2018 at 5:20am PDT Surprise visitors-A peahen and her two peachicks come to visit me and my two little ones - Forgot to ask them if our judge Sharma was right when he claimed that peacocks reproduced through their tears! #Jeez #springbreak #monodeal A post shared by Twinkle Khanna (@twinklerkhanna) on Mar 19, 2018 at 2:58am PDT Sometimes I think I live inside a Murakami book because cats seem to appear wherever I go #catperson A post shared by Twinkle Khanna (@twinklerkhanna) on Mar 13, 2018 at 7:55am PDT -
రియల్ ‘ప్యాడ్‌మేన్’ ఎమోషనల్ లెటర్
సాక్షి, ముంబై: తన జీవిత చరిత్ర ఆధారంగా బాలీవుడ్లో సినిమా తెరకెక్కించినందుకు రియల్ ‘ప్యాడ్‌మేన్’ అరుణాచలం మురుగనాథమ్ ధన్యవాదాలు తెలిపారు. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘ప్యాడ్‌మేన్’ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కు మురుగనాథమ్ భావోద్వేగపూరిత లేఖ రాశారు. తన జీవితంగా ఆధారంగా సినిమా వస్తుందని తాను ఊహించలేదని పేర్కొన్నారు. ఈ చిత్రం అందరినీ అలరిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తన భార్య సహకారంతోనే చౌక ధర శానిటరీ న్యాప్కిన్ తయారీ సాధ్యమైందని పేర్కొంటూ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. భారీ విడుదల శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా 3350 స్క్రీన్లపై ‘ప్యాడ్‌మేన్’ విడుదలైంది. రష్యాలో విడుదలైన తొలి బాలీవుడ్ సినిమాగా నిలిచింది. ఒడిశాలో ఈ సినిమా ప్రదర్శించబడుతున్న ధియేటర్ వెలుపల శానిటరీ న్యాప్కిన్ పంపిణీ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ సినిమా బాగుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. సామాజిక సమస్యను ప్రజలను చైతన్యవంతం చేసేలా ఈ చిత్రం ఉందని, అందరూ చూడాల్సిన సినిమా అంటున్నారు. అసాధారణ కృషీవలుడు.. తమిళనాడుకు చెందిన అరుణాచలం మురుగనాథమ్ తన అసాధారణ కృషితో మూడున్నర కోట్ల శానిటరీ న్యాప్కిన్ మెషిన్‌ను కేవలం రూ. 65 వేలకే తయారు చేశాడు. దాని సహాయంతో స్వయం సేవా సంఘాల ద్వారా 29 రాష్ట్రాలు ఉన్న మన దేశంలోని 23 రాష్ట్రాలలో ప్యాడ్స్‌ను చాలా చవకగా అమ్ముతున్నాడు. ఆయన సేవలకుగాను 2016లో ఆయనను కేంద్రప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. It’s going to be an emotional day! @akshaykumar @mrsfunnybones @sonamakapoor @radhika_apte @pcsreeram @ItsAmitTrivedi @PadManTheFilm #PadMan pic.twitter.com/TZUQTXQCcT — A Muruganantham (@murugaofficial) 8 February 2018 -
ఇరాక్‌లో తొలిసారి బాలీవుడ్ సినిమా
ముంబై: ఇరాక్, రష్యా, ఐవరీకోస్ట్ దేశాల్లో ఇండియాతో పాటు విడుదల కానున్న తొలి సినిమాగా పాడ్ మాన్ చరిత్రకెక్కనుందని సినిమా నిర్మాత ట్వింకిల్ ఖన్నా ట్విటర్లో తెలిపారు. దాదాపు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా దేశాల్లో ఫిబ్రవరి 9(శుక్రవారం)న విడుదల కానుంది. ఆడవారి రుతుస్రావ సమస్య ప్రధానంగా చేసుకుని ఈ సినిమా రూపొందించారు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, సోనం కపూర్, రాధికా ఆప్టేలు హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు ఆర్. బాల్కి దర్శకత్వం వహించారు. -
భర్తకు అండగా భార్య
న్యూఢిల్లీ : ఓ కామెడీ షోలో సహ న్యాయనిర్ణేతను ఉద్దేశించి హీరో అక్షయ్ కుమార్ చేసిన వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని ఆయన భార్య ట్వింకిల్ ఖన్నా ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. షోలో భాగంగా కంటస్టెంట్స్ అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్‌ను న్యాయనిర్ణేతలు మోగించొచ్చు. షోకు అక్షయ్ కుమార్‌తో పాటు కమెడియన్ మల్లికా దువా న్యాయనిర్ణేతలుగా హాజరయ్యారు. ఓ కంటెస్టంట్ అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేయడంతో మల్లికా బెల్‌ను మోగించబోయారు. ఆమెను వారించబోతూ.. మల్లికా జీ మీరు బెల్ మోగిస్తే.. నేను మీ బాండ్ మోగిస్తాను అంటూ అక్షయ్ వ్యాఖ్యానించారు. దీంతో అక్షయ్ మల్లికను ఉద్దేశించి అభ్యంతరకరంగా కామెంట్ చేశారంటూ సోషల్‌మీడియాలో దుమారం రేగింది. ఈ విషయంపై స్పందించాలంటూ పలువురు ట్వింకిల్ ఖన్నాను ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేశారు. దీనిపై స్పందించిన ట్వింకిల్.. కామెడీ షోలలో ఇలాంటి కామెంట్లు సహజమని ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. ఫ్లోలో అలాంటి మాటలు వస్తాయే తప్ప మరే దురుద్దేశం దాని వెనుక ఉండదని అన్నారు. మల్లికా తండ్రి వినోద్ దువా హీరో అక్షయ్‌ను ఉద్దేశించి అతనో స్టూపిడ్ అని వ్యాఖ్యానించిన దానిపై స్పందిస్తూ.. అక్షయ్ ఉద్దేశాన్ని తెలుసుకుని మాట్లాడివుంటే బావుండేదని అన్నారు. -
కోతుల్లాగ ప్రవర్తిస్తే ఇలాగే అవుతుంది: నటి
ముంబై: డేరా సచ్ఛా సౌదా చీఫ్, బాబా గుర్మీత్ రాంరహీం సింగ్ దోషీగా తేలడంపై బాలీవుడ్ నటి, రచయిత ట్వింకిల్ ఖన్నా భిన్న శైలిని అనుకరిస్తున్నారు. అసలు మనం కోతుల్లాగా మెదడు వాడితే ఇలాగే ఉంటుందని, బాబాలు ఇలాగే మోసాలకు పాల్పడతారని నటి అభిప్రాయపడ్డారు. ఎంతో తెలివైన వాళ్లు సైతం తమను రక్షిస్తాడంటూ నమ్మి గుర్మిత్ వద్దకు వెళ్లి ఉంటారని, ఇలాంటి పనులు తనను కొన్నిసార్లు ఆందోళనకు గురిచేస్తుంటాయని ఆమె చెప్పారు. పంచకుల సీబీఐ కోర్టు గుర్మీత్ ను ఇటీవల దోషీగా ప్రకటించిన అనంతరం డేరాలు చెలరేగి చేసిన దాడులలో 36 మంది ప్రాణాలు కోల్పోవడం తనను కలచి వేసిందన్నారు ట్వింకిల్. జనాలు నమ్ముతున్న కొద్దీ ఇలాంటి బాబాలు మంచి కంటే చెడును వ్యాప్తి చేస్తారన్నారు. ఇంకా చెప్పాలంటే.. సూర్యుడి వైపు పొద్దుతిరుగుడు పువ్వు ఎలాగైతే మళ్లి ఉంటుందో, అదే తీరుగా జనాలు దొంగ ప్రజల చుట్టూ తిరుగుతుంటారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇకనైనా మనలో మార్పు వస్తే చెడు పనులు చేసే వారిని, దొంగ స్వామీజీలను కొంతకాలానికే గుర్తుపట్టే అవకాశం ఉందని పిలుపునిచ్చారు. -
ఆ సినిమా సీక్వెల్లో తొలి సీన్ ఇదే!
ముంబై : యాక్షన్ సూపర్‌స్టార్ అక్షయ్‌కుమార్ తాజా సినిమా 'టాయ్‌లెట్: ఏక్ ప్రేమ్‌కథ' మంచి టాక్‌తో దూసుకుపోతోంది. 'భార్య ఇంట్లో ఉండాలంటే.. ఇంట్లో టాయ్‌లెట్ ఉండాల్సిందే' అన్న సామాజిక అంశంతో ఈ సినిమా తెరకెక్కింది. సినిమా సక్సెస్ టాక్‌తో దూసుకుపోవడంతో అప్పడే రెండో పార్ట్‌పై అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ కన్నా ఓ ఆసక్తికర కామెంట్ చేసింది. దీనికి రెండో పార్ట్‌లో తొలి సీన్ ఇదే అయ్యి ఉంటుందని బీచ్ పక్కనే బహిర్భూమి వెళ్తున్న ఓ వ్యక్తి ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. మార్నింగ్ వాక్ వెళ్లినప్పడు తాను తీసిన ఈ ఫోటోను పోస్ట్ చేసిన కొద్ది వ్యవధిలోనే వైరల్ అయింది. సినిమా ప్రమోషన్ కోసం మరీ ఇలాంటి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టాలా అంటూ కొందరూ విమర్శిస్తుంటే, కనీసం ఈ సినిమా చూసిన తర్వాత అయినా ప్రతి ఒక్కరూ టాయిలెట్లు నిర్మించుకోవాలని ట్వింకిల్ కన్నాకు బాసటగా నిలుస్తూ.. నెటిజన్లు కామెంట్లు చేశారు. అందరికీ టాయిలెట్లు అందుబాటులో ఉండవు కదా..అని ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కు ట్వింకిల్ కన్నా బదులిచ్చారు.. సరిగ్గా అక్కడి నుంచి 7 నుంచి 8 నిమిషాలు నడిస్తే ఓ పబ్లిక్ టాయిలెట్ ఉందని తెలిపారు. ఈ ఏడాది బాలీవుడ్‌కు అంతగా కలిసిరాలేదు. సూపర్స్టార్లు సల్మాన్‌ఖాన్ 'ట్యూబ్‌లైట్', షారుఖ్ ఖాన్ 'జబ్ హ్యారీ మెట్ సెజెల్' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. కనీసం యావరేజ్ కలెక్షన్లు కూడా రాబట్టలేక.. డిజాస్టర్లుగా మిగిలాయి. 'బాహుబలి-2' తర్వాత బాలీవుడ్ సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ కావడం ఇండస్ట్రీ వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ నేపథ్యంలో ఎన్నో అంచనాల నడుమ వచ్చిన యాక్షన్ సూపర్‌స్టార్ అక్షయ్‌కుమార్ తాజా సినిమా 'టాయ్‌లెట్: ఏక్ ప్రేమ్‌కథ' బాలీవుడ్ ఆశలను నిలబెట్టింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మానస పథకమైన 'స్వచ్ఛభారత్' మద్దతుగా కేవలం రూ. 18 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఇటు ప్రేక్షకులు, అటు విమర్శకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్‌కు కొత్త ఊపిరినిచ్చింది. ఆగస్టు 11న (గత శుక్రవరం) విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే 96 కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తానికి ఎయిర్‌లిప్ట్, రుస్తుం, హౌస్‌ఫుల్-3, జాలీ ఎల్ఎల్బీ-2 చిత్రాలతో వరుసగా వందకోట్ల క్లబ్బును అందుకున్న ఈ సూపర్ స్టార్ మరోసారి సూపర్ హిట్‌ను అందుకొని తన స్టామినా ఏంటో చాటాడు. ‘స్వచ్ఛ్ భారత్ అభియాన్’ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఆధారంగా తీసిన ఈ చిత్రానికి శ్రీ నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించారు. ఇందులో భూమి పడ్నేకర్, అనుపమ్ ఖేర్, సనాఖాన్ తదితరులు నటించారు. -
కట్టప్పకు బాలీవుడ్ హీరో భార్య ఫిదా
ముంబై: బాహుబలి2 విడుదలైన తర్వాత మొత్తం ప్రేక్షకులు సినీలోకమంతా ప్రభాస్, రాజమౌళి, కట్టప్ప, శివగామిలాంటి పాత్రలను తెగ పొగిడేస్తుండగా ప్రముఖ బాలీవుడ్ నటి, నటుడు అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా మాత్రం కట్టప్పపై మనసు పారేసుకుంది. బాహుబలి సినిమాలో మహిష్మతి సామ్రాజ్యంలో బానిస సేన నాయకుడిగా సత్యరాజ్ పోషించిన కట్టప్ప పాత్రను తెగ ఇష్టపడుతోంది. అందులో భాగంగా సోషల్ మీడియా ఖాతా ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసింది. తాను కట్టప్పకు ఎలా అభిమానిగా మారిపోయాననే విషయాన్ని వివరించింది. ‘నేను బాహుబలి 2 చూశాను. నా కూతురు కోపంతో తన తండ్రిని కట్టప్ప అని పిలుస్తోంది. ఎంతలా అంటే ఒక వ్యసనంలాగా.. కట్టప్ప అని తను మూడుసార్లు అరిచేంత వరకు కూడా మేం అస్సలు అపలేకపోతున్నాం’ అంటూ ట్వింకిల్ ఖన్నా చెప్పుకొచ్చింది. -
నాన్న చెప్పినట్టే మారాను: నటి
ముంబై: ఒకప్పటి బాలీవుడ్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా, నటి డింపుల్ కపాడియాల ముద్దుల కూతురు ట్వింకిల్ ఖన్నా. తల్లిదండ్రుల బాటలో ట్వింకిల్ కూడా నటనను కెరీర్‌గా ఎంచుకున్నా.. ఆమెను రచయిత్రిగా చూడాలన్నది రాజేష్ ఖన్నా కోరికట. ట్వింకిల్ ఈ విషయాన్ని చెప్పింది. 'నేను రచయిత్రి కావాలన్నది నాన్న కోరిక. నేను రచయిత్రిగా ఉండాలని నాన్న ఎప్పుడూ చెబుతుండేవారు. నాన్న కోరికను నెరవేర్చినందుకు గర్వంగా ఉంది' అని ట్వింకిల్ వెల్లడించింది. 1995లో ఆమె బర్సాత్ సినిమా ద్వారా బాలీవుడ్లో తెరంగేట్రం చేసింది. ఈ సినిమాకు ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకుంది. 2001లో హీరో అక్షయ్ కుమార్‌ను ప్రేమ వివాహం చేసుకుని సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత ఇంటీరియర్ డిజైనర్‌గా, కాలమిస్ట్‌గా మారింది. -
అవార్డు కొనలేదు
‘‘ఈ అవార్డును నేను నిజాయితీతో సంపాదించుకున్నాను. నేనిప్పటివరకూ మోసం చేయలేదు. అవార్డు కోసం ఎవరికైనా ఫోన్ చేయడం గాని, నాకు ఫేవర్ చేయమని డబ్బులు ఇవ్వడం గానీ చేయలేదు’’ అన్నారు హిందీ హీరో అక్షయ్ కుమార్. జాతీయ ఉత్తమ నటుడిగా అక్షయ్‌కు అవార్డు ఇవ్వడంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అంతకు ముందు అవార్డు పట్ల అక్షయ్ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘ఈ అవార్డును నా పేరెంట్స్, ఫ్యామిలీ, నా వైఫ్ (ట్వింకిల్ ఖన్నా)కు అంకితం చేస్తున్నాను. ‘మీరు అవార్డు ఫంక్షన్లకు వెళ్లడం మానేశారా? మీకెప్పుడైనా అవార్డు వస్తుందా?’ అని ట్వింకిల్ అన్నప్పుడు బాధగా అనిపించేది. ఇప్పుడు హ్యాపీ. అవార్డ్స్ కమిటీ జ్యూరీ, ఫ్యాన్స్, అందరికీ థ్యాంక్స్’’ అన్నారు అక్షయ్. అన్నట్టు... జాతీయ ఉత్తమ హిందీ చిత్రం ‘నీర్జా’లోని నటనకు స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్న సోనమ్‌కపూర్‌తో కలసి అక్షయ్ ‘పాడ్‌మ్యాన్’ అనే సినిమా చేస్తున్నారు. జాతీయ అవార్డులు ప్రకటించినప్పుడు వీరిద్దరూ ఆ సినిమా లొకేషన్లోనే ఉన్నారు. -
స్లమ్ కిడ్స్ చదువుకోసం ట్వింకిల్ ఖన్నా సాయం
ముంబై: రచయితగా మారిన బాలీవుడ్ నటి ట్వింకిల్ ఖన్నా మురికివాడల్లోని పిల్లల చదువుకు తనవంతు సాయం చేయాలని నిర్ణయించుకుంది. ముంబైలోని ఓ మురికివాడలో ఆదివారం పర్యటించిన ట్వింకిల్.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ పిల్లల చదువుకోసం తనవంతుగా ఎంతటి సాయమైనా చేస్తానని ప్రకటించింది. ‘ఇక్కడికి వచ్చాక పిల్లలు ప్రదర్శించిన ఓ సినిమా సన్నివేశం చూశాను. ఉదయం పేపర్ చూడగానే కనిపించే భయంకర వార్తలు, టీవీ పెట్టగానే వినిపించే రోధనలే కాదు.. అందమైన, ఆహ్లాదమైన ప్రపంచం ఎంతో ఉందనిపించింది. ఈ పిల్లలను చూస్తుంటే నన్ను నేను మర్చిపోయాను. అయితే వీరంతా చదువుకోలేకపోతున్నారని తెలిసి బాధగా అనిపించింది. అందుకే వీరి చదువు కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నా. ఇతరుల జీవితాల్లోకి తొంగి చూడనంత వరకు, వారి బాధలను మనతో పంచుకోనంత వరకు మన జీవితంలో ఎటువంటి మార్పు రాదు. ఆ జీవితం కూడా నిస్సారంగా ఉంటుంది. అందుకే ఈ పిల్లల జీవితాలు మార్చడానికి ఏదైనా చేయాలని భావించే ఈ నిర్ణయం తీసుకున్నాన’ని చెప్పింది. -
చంపుకోవాలని యత్నిస్తున్నాం.. కానీ: హీరో భార్య
’గత 16 ఏళ్లుగా ఒకరినొకరు చంపుకొనేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాం. కానీ మేం ఇప్పటివరకు విజయవంతం కాలేదు. 16వ వివాహ దినోత్సవం వచ్చేసింది. నేరంలో మేం భాగస్వాములం’ అంటూ ప్రముఖ నటి ట్వింకిల్ ఖన్నా ట్వీట్ చేసింది. బాలీవుడ్ యాక్షన్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్-ట్వింకిల్ ఖన్నా వైవాహిక జీవితంలో అడుగుపెట్టి నేటికి 16 ఏళ్లు. బాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ కపుల్ గా పేరొందిన ఈ జంట వివాహ వార్షికోత్సవం సందర్భంగా ట్వింకిల్ ఖన్నా ఇలా సరదా కామెంట్ పెట్టి.. అక్షయ్, తాను కరాటే ఫైటింగ్ చేస్తున్న చిన్న వీడియో బిట్ ను పోస్టు చేసింది. ’జుల్మీ’, ’ఇంటర్నేషనల్ ఖిలాడీ’ వంటి సినిమాల్లో కలిసి నటించిన అక్షయ్, ట్వింకిల్ 2001లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు 2002లో కొడుకు ఆరవ్, 2012లో కూతురు నిటారా జన్మించారు. ప్రస్తుతం వరుస సూపర్ హిట్లతో దూసుకుపోతున్న అక్షయ్ త్వరలోనే ’జాలీ ఎల్ఎల్బీ-2’ ప్రేక్షకుల ముందుకురానునన్నాడు. అలాగే ’టాయ్‌లెట్: ఏక్ ప్రేమకథ’ చిత్రంలో నటిస్తున్నాడు. 16 years of trying to kill each other and we still haven't succeeded:) #16thanniversary #partnersincrime pic.twitter.com/XqGWQ2BQAI — Twinkle Khanna (@mrsfunnybones) January 17, 2017 -
ఆయన ముసలోడే గానీ..
మనసులో ఉన్న మాటను ఉన్నది ఉన్నట్టుగానే చెప్పడంలో ట్వింకిల్ ఖన్నాను మించినవాళ్లు లేరు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన పెద్దనోట్ల రద్దు మీద జోకులు వేసి ఒక్కసారిగా హెడ్లైన్లలోకి ఎక్కిన ఆమె.. ఇప్పుడు బాలీవుడ్ ముదురు బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ మీదే సెటైర్ వేసేసింది. నరేంద్రమోదీ నుంచి అర్ణబ్ గోస్వామి వరకు ఎవరినీ వదిలిపెట్టకుండా అందరినీ తన తాజా కాలమ్‌లో ఉతికి ఆరేసిన ట్వింకిల్.. అందులో భాగంగానే సల్లూభాయ్ మీద కూడా ఓ పెద్ద సెటైర్ వేసింది. ''భారతదేశంలోనే అత్యంత ముసలోడు.. కానీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌కు సంబంధం కావాలి. అతడు డాషింగ్, నాన్ వెజిటేరియన్, విజయవంతమైన, కండలు తిరిగిన, మంచి కుటుంబానికి చెందిన అబ్బాయి. డాన్సు బాగా చేస్తాడు, డ్రామా, కళలు కూడా ఉన్నాయి. అమ్మాయి అందంగా, సన్నగా ఉండాలి, లాంగ్‌డ్రైవ్‌లు ఎంజాయ్ చేసేలా ఉండాలి. పెళ్లికూతురు బాగా మాటకారి కూడా అయి ఉండాలి. ఎందుకంటే మూకీలా ఉంటే అబ్బాయికి ఏమాత్రం నచ్చదు. కులం ఏదైనా పర్వాలేదు.. సుల్తాన్ @ భాయీజాన్.కామ్ ను సంప్రదించండి'' అని అందులో రాసింది. ఇందులో కొసమెరుపు ఏంటంటే.. సల్మాన్ సమకాలీకుడే అయిన అక్షయ్ కుమార్‌నే ట్వింకిల్ పెళ్లి చేసుకుంది. -
మా ఆవిడ మంచి జీతమే ఇస్తుంది: హీరో
దాదాపు దశాబ్దం కిందట ట్వింకిల్ ఖన్నా సినిమాలకు గుడ్‌బై చెప్పింది. పత్రికల్లో వ్యాసాలు రాస్తూ.. ట్విట్టర్లో ఫన్నీ కామెంట్లు పెడుతూ, సొంతంగా వ్యాపారం చేస్తూ బిజీగా గడుపుతున్న ట్వింకిల్ ఖన్నా తాజాగా చేసిన ఓ ప్రకటన చాలామందిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. త్వరలోనే తాను సినీ నిర్మాణ రంగంలో అడుగుపెట్టనున్నట్టు ఆమె తెలిపింది. బాలీవుడ్ సూపర్ స్టార్, భర్త అక్షయ్‌కుమార్‌తోనే ఆమె తొలి సినిమా నిర్మించబోతున్నది. తన భార్య నిర్మాత కాబోతుండటంతో గర్వంగా ఉందని చెప్పిన అక్షయ్ తనదైన స్టైల్లో కామెంట్ చేశాడు. ట్వింకిల్ నిర్మాత అయితే, ఆమె తనకు మంచి శాలరీ (జీతం) ఇస్తుందని ఆశిస్తున్నట్టు చమత్కరించాడు. ఇటీవల ఓ పత్రికతో మాట్లాడిన అక్షయ్ తన భార్య స్వతంత్ర వ్యక్తిత్వం గల వ్యక్తి అని, తన కాళ్లపై తాను నిలబడటానికే ఆమె ప్రాధాన్యమిస్తుందని, ఆమె సామర్థ్యంపై తనకు నమ్మకముందని చెప్పాడు. సినిమాలకు దూరమైనా టీనా (ట్వింకిల్) సొంతంగా కుటుంబ కంపెనీ 'ద ఫార్ అవే ట్రీ'ని, తన కంపెనీ 'ద వైట్ విండో'ని, ఇంటిని ఏకకాలంలో సమర్థంగా నడుపుకొంటు వచ్చిందని ప్రశంసించాడు. రచయితగా, ట్విట్టర్ 'మిసెస్ ఫన్నీబోన్స్'గా పేరొందిన ట్వింకిల్ నిర్మాతగానూ సక్సెస్ అవుతుందని అక్షయ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. -
హీరో భార్యకు వెన్నులో వణుకు..
నిప్పుకణికల్లా రగిలే కళ్లు, పెద్దపెద్ద గోర్లు, భయానికే భయం పుట్టించే ఆకారంతో (రోబో)2.0లో విలన్ గా కనిపిస్తోన్న అక్షయ్ కుమార్ గెటప్ చూసి ఆయన భార్య ట్వింకిల్ ఖన్నా బెదిరిపోయిందట! సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొంతుతోన్న రోబో 2.0కు సంబంధించిన ఫస్ట్‌లుక్ ఆదివారం విడుదలైంది. రజనీ వశీకర్ పాత్రలో కొనసాగుతుండగా, అక్షయ్ ‘క్రౌమ్యాన్’గా తలపడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఫస్ట్ లుక్‌తో రెట్టింపయ్యాయి. 2.0లో రజనీ, అక్షయ్ ల గెటప్ లపై సోషల్ మీడియాలో ఎడతెగని చర్చలు జరుగుతుండగానే అక్షయ్ భార్య ట్వింకిల్ ‘15 ఏళ్ల తర్వాత కూడా మా ఆయన నా వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు’ అని ట్విట్టర్ కామెంట్ పోస్ట్ చేశారు. ఈ సినిమాలో అక్షయ్ పాత్ర పురాణాల్లోని రాక్షసుడిలా ఉందని ఆమె పేర్కొన్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాను 2017 దీపావళికి (త్రీడీలో) విడుదల చేయనున్నట్లు నిర్మాతలు చెప్పారు. ఆదివారం అట్టహాసంగా జరిగిన ఫస్ట్ లుక్ వేడుకల్లో (ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) దర్శక-నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహ రించారు. సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్, హీరోయిన్ అమీ జాక్సన్లతో పాటు చిత్ర బృందం ఈ వేడుకలో పాల్గొన్నారు. (అక్షయ్‌కుమారే ‘2.0’ హీరో - రజనీకాంత్) Mr K after 15 years you still manage to send shivers down my spine :) #savage https://t.co/UuiHJOS2Jc — Twinkle Khanna (@mrsfunnybones) 21 November 2016 -
బాలీవుడ్ నటి ట్వింకిల్ ఖన్నా బుక్ లాంచ్
-
ఆ హీరోను గే అనుకున్న హీరోయిన్ తల్లి
ముంబై: బాలీవుడ్ జంట అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా పెళ్లి చేసుకుని 15 ఏళ్లు అవుతోంది. వివాహానికి ముందు ఆ తర్వాత అక్షయ్ పలువురు హీరోయిన్లతో ఎఫైర్ నడిపినట్టు పుకార్లు వచ్చినా వీరి బంధం సవ్యంగా సాగుతోంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లయిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న ట్వింకిల్ అలనాటి మేటి నటులు రాజేష్ ఖన్నా, డింపుల్ కంపాడియాల ముద్దుల కూతురు. అక్షయ్, ట్వింకిల్ దంపతులు తమ ప్రేమ, వివాహ బంధం గురించి ఓ టీవీలో షోలో ఆసక్తికర విషయాలు చెప్పారు. 15 ఏళ్ల క్రితం అమీర్ ఖాన్ సరసన ట్వింకిల్ నటించిన మేలా సినిమా షూటింగ్ సమయంలో అక్షయ్ ఆమెకు పెళ్లి ప్రపోజల్ చేశాడు. ఆ తర్వాత ట్వింకిల్ కెరీర్ గురించి ఇద్దరూ ఆలోచించారు. మేలా సినిమా ఫ్లాప్ అయితే పెళ్లి చేసుకుంటానని ఆమె అక్షయ్‌కు షరతు పెట్టింది. కాగా ఈ సినిమా విడుదలైన మూడు రోజుల తర్వాత ట్వింకిల్ అక్షయ్‌కు ఫోన్ చేసి వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్షయ్.. ట్వింకిల్ ఇంటికి వెళ్లి ఆమె తల్లి డింపుల్ కపాడియాను కలిశాడు. ట్వింకిల్‌ను పెళ్లి చేసుకుంటానని అడిగాడు. కాగా ట్వింకిల్‌ను అక్షయ్‌కు ఇచ్చి పెళ్లి చేసేందుకు మొదట్లో డింపుల్ సంశయించింది. అతను గే అని డింపుల్ భావించడమే దీనికి కారణం. అక్షయ్ గే అని డింపుల్ స్నేహితురాలు ఒకరు చెప్పినట్టు ట్వింకిల్ వెల్లడించింది. ఆ తర్వాత నిజం తెలుసుకున్న డింపుల్ కూతురి పెళ్లికి అనుమతిచ్చింది. పెళ్లికి ముందు తన కుటుంబ సభ్యులు, వారి ఆరోగ్య వివరాల గురించి ట్వింకిల్ అడిగిందని, అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత పెళ్లాడిందని అక్షయ్ చెప్పాడు. -
అందరికీ థాంక్స్ అంటున్న అక్షయ్
-
అందరికీ థాంక్స్ అంటున్న అక్షయ్
బాలీవుడ్ రుస్తుం అక్షయ్ తన డాన్స్‌తో అందరికీ థాంక్స్ చెబుతున్నాడు. ఇటీవల రిలీజైన 'రుస్తుం' టాక్ మాట ఎలా ఉన్నా, వసూళ్ల పరంగా మాత్రం దూసుకెళుతోంది. రుస్తుం రిలీజ్‌కు ముందు బీ-టౌన్ సెలబ్రిటీలు సల్మాన్ ఖాన్, రణ్ వీర్ సింగ్, సోనమ్ కపూర్, సోనాక్షి సిన్హా, అలియా భట్ తదితరులు షార్ట్ వీడియోలు రూపొందించి రుస్తుం సినిమాను ప్రమోట్ చేస్తూ అక్షయ్ మీదున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇక ఇప్పుడు తన వంతు అంటున్నాడు అక్షయ్. మీరు చూపించిన ప్రేమకు థాంక్స్ మాత్రమే చెబితే సరిపోదంటూ.. చిన్న డ్యాన్స్ వీడియోను రూపొందించి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అలాగే 'రుస్తుం'ను ఇంత పెద్ద హిట్ చేసినందుకు తన అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపాడు. అలాగే తన భార్య ట్వింకిల్ ఖన్నాకు శుభాకాంక్షలు తెలిపారు. 'మిసెస్.ఫన్నీ బోన్స్' పేరుతో తొలిసారి రచయిత్రిగా మారి రాసిన పుస్తకం ఇప్పటికి లక్ష కాపీలు అమ్ముడయిన సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. ఇక తను ఇంట్లో సైలెంట్‌గా ఉండాల్సిన సమయం వచ్చేసిందంటూ చమత్కరించారు అక్షయ్. Congrats 2 d highest selling debut author & highest selling female author of 2015!Time 4 me 2 keep quiet at home now https://t.co/gJvCHOk38I — Akshay Kumar (@akshaykumar) August 18, 2016 Now it's my turn,cant Thank You'll enough 4 all the Love 4 Rustom!There's a lot of Love inside this Hoop! #Shukriya -
మమ్మీ నీకు డ్రైవింగ్ రాదుగా!
బాలీవుడ్ నటి-రచయిత ట్వింకిల్ ఖన్నా తన జోక్స్‌తో నెటిజన్లకు కితకితలు పెట్టడంలో ఎప్పుడూ ముందుంటారు. 'ఫన్నీబోన్స్' పేరిట ట్విట్టర్లో ఆమె పెట్టే జోక్స్, ఛలోక్తులు బాగా నవ్విస్తుంటాయి. తాజాగా ట్వింకిల్ తన తనయుడు ఆరావ్తో వాట్సాప్‌లో చేసిన సరదా సంభాషణను ట్వీట్ చేశారు. ఈ చాటింగ్‌లో 'డ్రైవర్ ఇప్పుడే వచ్చాడు. ఒక్క నిమిషంలో వస్తున్నాను సర్' అంటూ ఆరావ్ తన మాథ్స్ టీచర్‌కు చెప్పాడు. ట్వింకిల్ స్పందిస్తూ.. 'నువ్వు నాకు చెప్పాల్సింది. నువ్వు వెళ్లిపోయావు అనుకున్నాను. నేను డ్రాప్ చేసేదానిని కదా' అంటూ పేర్కొంది. 'మమ్మీ నీకు డ్రైవింగ్ రాదు'గా అని ఆరావ్ రిప్లై ఇచ్చాడు. దానికి 'నాకు డ్రైవింగ్ వచ్చు. కానీ హరన్, బ్రేకులు నచ్చావు' అంటూ ట్వింకిల్ పేర్కొంది. హారన్, బ్రేకులు వాడకుండా ముంబై బిజీ రోడ్డుమీద డ్రైవింగ్ చేయడం సాధ్యమా? కాదు.. అందుకే ఇలా తనదైన శైలిలో రోజూ జోకులు పేలుస్తానని ట్వింకిల్ సెలవిచ్చింది. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్‌కుమార్-ట్వింకిల్ దంపతులకు ఇద్దరు పిల్లలు. కొడుకు ఆరావ్, కూతురు నిటారా ఉన్నారు. అక్షయ్ తాజా సినిమా 'రుస్తుం' ఈ నెల 12న విడుదలకానుంది. -
ఇక చాలు.. ఆపండి: అక్షయ్ కుమార్ భార్య
ముంబై: రాజేశ్ ఖన్నా మంచి నటుడు కాదంటూ నసీరుద్దీన్ షా చేసిన వ్యాఖ్యలపై వివాదం ముగిసిందని రాజేశ్ ఖన్నా కూతురు, అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా పేర్కొన్నారు. ఈ వివాదాన్ని ఇక్కడితో ఆపేయాలని తన మద్దతుదారులకు సూచించింది. 'ఇక చాలు. ఈ వివాదం ఇక్కడితో ఆపేయండి. అభిప్రాయాలు వెల్లడించే స్వేచ్ఛ మనకు ఉంది. ఇక అందరం పోకెమాన్ ఆట ఆడుకుందాం' అంటూ ట్వింకిల్ ఖన్నా ట్వీట్ చేసింది. 'ఈ ఆర్టికల్ పోస్ట్ చేసిన తర్వాత నేను కూడా పోకెమాన్ ఆడడానికి వెళతా'నని పేర్కొంది. రాజేశ్ ఖన్నా గొప్ప నటుడు కాదని, అతడి నటన సాధారణ స్థాయికంటే తక్కువగా ఉండేదని ఓ ఇంటర్య్వూలో నసీరుద్దీన్ షా వ్యాఖ్యానించడంతో ట్వింకిల్ ఖన్నా స్పందించారు. ఈ లోకంలోని తన తండ్రిని విమర్శించడం తగదని ఆమె పేర్కొన్నారు. అయితే తాను కావాలని రాజేశ్ ఖన్నాను విమర్శించలేదని వివరణ ఇచ్చిన నసీరుద్దీ షా క్షమాపణ కూడాచెప్పారు. తనకు మద్దతు నిలిచిన వారికి ట్వింకిల్ ఖన్నా ధన్యవాదాలు తెలిపారు. -
సారీ.. కావాలని మీ నాన్నను తిట్టలేదు!
అలనాటి నటుడు రాజేశ్ ఖన్నాపై బాలీవుడ్ విలక్షణ నటుడు నసీరుద్దీన్ షా చేసిన విమర్శలు బాలీవుడ్లో చిన్నపాటి దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఈ విమర్శలపై రాజేశ్ ఖన్నా కూతురు, అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా ఘాటుగా స్పందించింది. ‘మీరు బతికున్న వారిని గౌరవించకున్నా పర్వాలేదు.. కానీ, చనిపోయినవారికైనా గౌరవమివ్వండి. బదులు ఇవ్వలేని వ్యక్తిని గురించి విమర్శలు చేయడం' దారుణమంటూ ఆమె మండిపడింది. దీంతో ఈ వివాదంపై నసీరుద్దీన్ షా తాజాగా వివరణ ఇచ్చారు. ఎవరినీ వ్యక్తిగతంగా గాయపరిచే ఉద్దేశంతో తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని, ఎవరినైనా తన వ్యాఖ్యల వల్ల బాధపడితే క్షమించాలని కోరారు. తాను ప్రత్యేకంగా ఎవరినీ ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదని, 70 దశకంలోని పరిస్థితి గురించి వ్యాఖ్యానించానని ఆయన చెప్పుకొచ్చారు. ఓ ఇంటర్వ్యూలో రాజేశ్ ఖన్నా గురించి మాట్లాడుతూ.. 'ఆయనో మామూలు నాసిరకం అథమ నటుడు. ఆయన నటన కూడా చాలా పరిమితంగా ఉంటుంది. మేధోపరంగానూ ఆయన గొప్ప వ్యక్తేమీ కాదు. ఆయనకు బొత్తిగా అభిరుచి కూడా లేదు. అందువల్లే 70వ దశకంలో సగటు సినిమాలు వచ్చాయి' అని విమర్శించారు. -
మా నాన్నను చెత్త నటుడంటావా!
1970 దశకంలో బాలీవుడ్‌ను ఏలిన దిగ్గజ నటుల్లో రాజేశ్ ఖన్నా ఒకరు. ఆరాధన (1969), హాథీ మేరే సాథీ (1971), ఆనంద్ (1971) వంటి సినిమాలతో గొప్ప నటుడిగా తనకంటూ ఓ ఇమేజ్ను ఏర్పరుచుకున్న నటుడు ఆయన. ఖన్నా గురించి బాలీవుడ్ విలక్షణ నటుడు నసీరుద్దీన్ షా తాజాగా విస్మయపరిచే విమర్శలు చేశారు. ఆయనో మామూలు నాసిరకం నటుడని, ఆయన నటన కూడా చాలా పరిమితంగా ఉంటుందంటూ విమర్శించాడు. మేధోపరంగా ఆయన గొప్ప వ్యక్తేమీ కాదని, ఆయనకు బొత్తిగా అభిరుచి కూడా లేదని, ఆయన వల్ల 70వ దశకంలో సగటు సినిమాలే వచ్చాయంటూ షా చెప్పుకొచ్చాడు. సాధారణంగానే సోషల్ మీడియాలో తన గళాన్ని గట్టిగా వినిపించే రాజేశ్ ఖన్నా కూతురు, అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా.. ఈ విషయంలో ఘాటుగా స్పందించింది. షా వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన ట్వింకిల్.. ‘మీరు బతికున్న వారిని గౌరవించకున్నా పర్వాలేదు.. కానీ, చనిపోయినవారికైనా గౌరవమివ్వండి. బదులు ఇవ్వలేని వ్యక్తి గురించి విమర్శలు చేయడం నిజమైన సంకుచితత్వం’ అని బదులిచ్చింది. -
శ్రీశ్రీ రవిశంకర్‌పై హీరో భార్య ట్వీట్‌తో రచ్చ!
ముంబై: బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్‌కుమార్ భార్య, ఒకప్పటి హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. ప్రస్తుతం రచయితగా, కాలమిస్ట్‌గా ముందుకుసాగుతున్న ట్వింకిల్ సోషల్ మీడియాలో చురుకైన ఛలోక్తులు విసరడంలో దిట్టగా పేరు తెచ్చుకుంది. ఆమె చేసే వ్యంగ్య వ్యాఖ్యలు కొన్నిసార్లు ఆనందాన్ని పంచితే.. కొన్నిసార్లు వివాదాలు రేపాయి. తాజాగా 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' వ్యవస్థాపకుడు, శ్రీశ్రీ రవిశంకర్‌ను ఉద్దేశించి ఆమె చేసిన ట్వీట్ దుమారం రేపింది. 'శ్రీశ్రీవి ఉదాత్తమైన ఆలోచనలు. కానీ యోగా చేసేటప్పుడు ఆయన సగం గడ్డం నోటిలోకే వెళుతుంది. ఈ విషయంలో రాందేవ్ బాబా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు' అంటూ ట్వింకిల్ ఖన్నా ట్విట్టర్లో కామెంట్ చేసింది. దీనికి 'హోలీ మెన్ అండ్ హెయిరీ టేల్స్' (పవిత్ర పురుషుల వెంట్రుకల కథలు) అనే హ్యాష్‌ట్యాగ్ జోడించింది. ట్వింకిల్ ట్వీట్ రవిశంకర్ అభిమానుల్ని గాయపర్చింది. దురుద్దేశంతో చేసిన ఈ వ్యాఖ్యలు లక్షలాది మంది రవిశంకర్ అనుచరులను గాయపర్చాయని, కాబట్టి అక్షయ్ తాజా సినిమా 'హౌస్‌ఫుల్-3' తాము బహిష్కరిస్తారని హెచ్చరిస్తూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ డైరెక్టర్ దర్శక్ హథీ ట్వీట్ చేశారు. తన ట్వీట్‌పై వివాదం రేగడంతో ఆమె వెంటనే దానిని తొలగించారు. 'ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం నాకు లేదు. అది కేవలం జోక్ మాత్రమే. పొరపాటు ఏదైనా జరిగితే నేను సరిదిద్దుకోగలను' అంటూ ట్వింకిల్ వివరణ ఇచ్చారు. అదే సమయంలో అక్షయ్ సినిమాను బహిష్కరిస్తామని దర్శక్ హథీ చేసిన బెదిరింపులపై ఆమె తీవ్రంగా స్పందించారు. 'ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉపాధ్యాయుడు ఆర్ట్ ఆఫ్ బెదిరింపులను అనుసరిస్తున్నారా? నేనే ఏమైనా అంటే నన్ను అడగండి. అంతేకానీ నా భర్తను లాగి.. సినిమాను బహిష్కరిస్తామని హెచ్చరించడం సిగ్గుచేటు' అంటూ ఆమె తీవ్రంగా స్పందించారు. దీంతో తమ మనోభావాలు దెబ్బతినడం వల్లే తాను అలా స్పందించానని, నా వ్యాఖ్యలు ఏమైనా మిమ్మల్ని బాధిస్తే క్షమించండని దర్శక్ హాథీ మరో ట్వీట్లో వివరణ ఇచ్చారు. -
తండ్రిగా అక్షయ్ గర్వపడ్డవేళ..
విశాఖపట్నం: అంతర్జాతీయ నౌకాదళాల ప్రదర్శన(ఐఎఫ్ఆర్)లో చోటు చేసుకున్న ఓ సంఘటన ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌ను గర్వ పడేలా చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సరదాగా తన కుమారుడు ఆర్నవ్ చెవి పట్టుకొని మంచి బాలుడు అని అనడం తండ్రిగా గర్వపడే విషయమని నటుడు అక్షయ్ కుమార్ పేర్కొన్నారు. మోదీ, ఆర్నవ్ చెవిని పట్టుకొన్న ఫోటోను తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. తనకు కూడా ఇది మరచిపోలేని సంఘటన అని, వేల పదాలకుండే విలువ నిజంగా ఈ దృశ్యానికుందని తల్లి ట్వింకిల్ కన్నా ట్విట్ చేశారు. ఐఎఫ్ఆర్-2016 బ్రాండ్ అంబాసిడర్‌గా అక్షయ్ కుమార్ ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు, ఐఎఫ్ఆర్-2016లో అత్యంత ముఖ్య ఘట్టం.. నౌకాదళ పాటవాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శనివారం సమీక్షించారు. త్రివిధ దళాల అధిపతి హోదాలో రాష్ట్రపతి ఈ సమీక్ష చేశారు. సంప్రదాయబద్ధమైన 21 తుపాకులతో గౌరవ వందనం స్వీకరించిన తరువాత రాష్ట్రపతి యుద్ధనౌక ఐఎన్ఎస్ సుమిత్రను అధిరోహించారు. అందులో పయనిస్తూ సముద్రజలాల్లో లంగరు వేసి ఉన్న 100 యుద్ధ నౌకల సామర్థ్యాన్ని సమీక్షించారు. వాటిలో భారత యుద్ధ నౌకలు 71 కాగా మిగిలినవి విదేశీ యుద్ధ నౌక లు. ఐఎన్ఎస్ సుమిత్ర తమ చెంతకు రాగానే యుద్ధ నౌకల్లో ఉన్న నౌకాదళాల అధికారులు, సిబ్బంది రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించారు. Proud moment in a father's life, when the Prime Minister pulls your son's ear in jest & calls him a good boy ;) pic.twitter.com/0NWRyDtWh6 — Ranjit Katiyal (@akshaykumar) February 6, 2016 When a picture is truly worth a thousand words.. #BigMoment https://t.co/WCXzdlaK52 — Twinkle Khanna (@mrsfunnybones) February 6, 2016 -
'అమ్మా.. నాన్న ఎక్కువ కష్టపడుతున్నాడు'
శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన అక్షయ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ ఎయిర్ లిఫ్ట్‌కు మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా ఇలాంటి కథను ఎంచుకోవటంతో పాటు, తన నటనతో సినిమా స్థాయిని పెంచిన అక్షయ్ కుమార్‌కు ప్రత్యేక ప్రశంసలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్షయ్ కుమార్ తనయుడు ఆరవ్ మాత్రం భిన్నంగా స్పందించాడు. సినిమా చూసిన తరువాత ఆరవ్ అన్న మాటలను అక్షయ్ భార్య, ప్రముఖ నటి ట్వింకిల్ ఖన్నా ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ' అమ్మా.. నాన్న తీరుతో బాధనిపిస్తోంది. ఆయన చాలా ఎక్కువగా కష్టపడుతున్నాడు' అని ఎయిర్ లిఫ్ట్ సినిమా చూశాకా తన కొడుకు కామెంట్ చేశాడు, అంటూ ట్వింకిల్ ఖన్నా ట్విట్టర్ లో పేర్కొంది. అక్షయ్ కుమార్ సరసన నిమ్రత్ ఖౌర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు రాజా కృష్ణ మీనన్ దర్శకుడు. ఈ శుక్రవారం రిలీజ్ అయిన ఎయిర్‌లిఫ్ట్‌కు ప్రేక్షకుల నుంచి, విశ్లేషకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. -
మంచి భార్య దొరికినవాడే అదృష్టవంతుడు...
బెటర్‌హాఫ్ ఈ ప్రపంచంలో అదృష్టవంతుడైన మగాడు ఎవడు? ఇంకెవడు... మంచి భార్య దొరికినవాడే. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఈ విషయంలో చాలా అదృష్టవంతుడిలానే కనిపిస్తున్నాడు. తన భార్య ట్వింకిల్ ఖన్నా (రాజేష్ ఖన్నా, డింపుల్‌ల కుమార్తె) తన జీవితానికి ఎంతో చేసిందని అంటున్నాడు. ఏమంటాడంటే... జీవితంలో చాలా కష్టాలు పడ్డాను. ఇబ్బందులు అనుభవించాను. ఢిల్లీ చాందినీ చౌక్‌లో సాధారణ సగటు జీవితాన్ని చవి చూశాను. చదువు వంటబట్టలేదు. ముంబైలో కాలేజ్ డ్రాపవుట్ని. మార్షల్ ఆర్ట్స్ టీచర్‌గా పని చేశాను. థాయ్‌లాండ్ వెళ్లి బ్యాంకాక్‌లో షెఫ్‌గా పని చేశాను. ముంబై తిరిగి వచ్చి కొంతకాలం గ్రూప్ డాన్సర్‌గా నటించాను. చివరకు హీరో అయ్యాను. మార్షల్ ఆర్ట్స్ నన్ను ఒక అర్థంలో మగాణ్ణి చేశాయి. కాని ట్వింకిల్ నన్ను ఇంకో అర్థంలో మగాణ్ణి చేసింది. నిజమైన మగాడు భార్యకు పిల్లలకు కుటుంబానికి అంకితమవుతాడు. వృత్తి పట్ల నిబద్ధత లక్ష్యం పట్ల ఏకాగ్రత ఇవన్నీ ఏర్పడాలంటే భార్య సహకారం అవసరం. ట్వింకిల్ అలాంటి భార్య. పెళ్లికి ముందు అల్లరి చిల్లరిగా తిరడం అందరూ చేసేదే. నాకు ప్లేబాయ్ ఇమేజ్ ఉంది. అది మంచిదో చెడ్డతో కూడా తెలియకుండా కొన్నాళ్లు ఆ ఇమేజ్ను క్యారీ చేశాను. కాని ట్వింకిల్ చాలా త్వరగా ఆ అలంకారాన్ని తీసి పారేసింది. నను కడిగిన పలకలా చేయగలిగింది. పెళ్లి తర్వాత ఏ మగాడైనా భర్తగా తండ్రిగానే ఎక్కువ సంతృప్తి పొందుతాడు. థాయ్‌లాండ్ నాకు ఏమి నేర్పించినా నేర్పించకపోయినా ఆ దేశపు రుచికరమైన వంటకం గ్రీన్ చికెన్ కర్రీని వండటం మాత్రం నేర్పించింది. అది చేసిన ప్రతిసారీ నా భార్య మనసును గెలుచుకుంటూనే ఉంటాను. -
'పెళ్లిరోజున ఆయన ఇచ్చినదేమిటో తెలుసా'
ముంబై: 'పెళ్లిరోజున మీ ఆయన మీకేం ఇచ్చారు? హా..! ఇచ్చారు ఓ బిత్తరచూపు'.. 'పెళ్లిరోజున మీ ఆయన ఏమైనా ఇచ్చారా? ఔను! తలనొప్పి ఇచ్చారు'.. ఇవీ ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్, ప్రస్తుత వ్యాపారవేత్త, యాక్షన్ స్టార్ అక్షయ్‌కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా సంధించిన జోక్స్. ఈ బాలీవుడ్ దంపతులు ఆదివారం 15వ పెళ్లిరోజు వేడుకను జరుపుకొన్నారు. తమ పెళ్లిరోజు గురించి భావోద్వేగానికి గురవుతూ.. ఇప్పటికీ ట్వింకిల్ ఖన్నా నుంచి చూపు మరల్చుకోలేకపోతున్నట్టు వెల్లడిస్తూ.. అక్షయ్‌కుమార్ ఓ పాత ఫొటోను ట్విట్టర్లో పంచుకోగా..ట్వింకిల్ ఖన్నా మాత్రం కాస్తా సరదాగా స్పందించారు. పెళ్లిరోజు గురించి సరదా జోక్స్ ట్వీట్ చేశారు. ఆ తర్వాత తాము ఆనందంగా ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. తమ 15 ఏళ్ల వైవాహిక జీవితంలో అక్షయ్ ఇలాంటి సంతోషకరమైన క్షణాలెన్నింటినో అందించారని పేర్కొన్నారు. Your husband gave you anything for your anniversary ? He gave me 15 years of moments like these... pic.twitter.com/MYLjZwj7R9 — Twinkle Khanna (@mrsfunnybones) January 17, 2016 Found this old pic & nothing's changed,couldn't & still can't take my eyes off her😊Happy anniversary @mrsfunnybones pic.twitter.com/utmkRrnsUV — Akshay Kumar (@akshaykumar) January 17, 2016 -
అక్షయ్ నివాసంలో తారల సందడి
ముంబై: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని బాలీవుడ్ దంపతులు అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా ముంబైలోని తమ నివాసంలో మంగళవారం పార్టీ ఇచ్చారు. ఈ విందుకు బాలీవుడ్ లోని ప్రముఖ నటీనటులు హాజరయ్యారు. అక్షయ్, ట్వింకిల్ దంపతులకు శుభాకంక్షలు తెలిపారు. దీంతో అక్షయ్ నివాసంలో సందడి వాతావరణం నెలకొంది. అమితాబ్, జయా బచ్చన్, అనుమమ్ ఖేర్, కిరణ్ ఖేర్, జాకీష్రాఫ్, జితేంద్ర, రిషి కపూర్, సునీల్ షెట్టి, మాధవన్, కరణ్ జోహార్, అభిషేక్, ఐశ్వర్య, ఏక్తా కపూర్, కరిష్మా కపూర్, రితేశ్ దేశ్ ముఖ్, జెలీనియా, లారా దత్తా, తదితర సెలబ్రిటీలు పార్టీకి హజరయ్యారు. -
'తన విజయం నాకు ఆనందాన్నిచ్చింది'
ముంబయి: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తాను చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. విషయం ఏంటంటే.. అక్షయ్ భార్య బాలీవుడ్ నటి ట్వింకిల్ ఖన్నా ఇటీవలే విడుదల చేసిన ఓ పుస్తకం మార్కెట్లో అమ్మకాలు జరిగిన నంబర్ వన్ బుక్ అయింది. దీంతో తన సంతోషాన్ని ట్విట్టర్ పోస్ట్ ద్వారా తెలిపారు. 'సింగ్ ఈజ్ బ్లింగ్' సినిమా పనులతో ప్రస్తుతం బిజీబిజీగా ఉన్న అక్షయ్ తన భార్య విజయం తనకు గర్వకారణమని తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. తన భార్య రాసిన తొలి పుస్తకం 'మిసెస్ ఫన్నీబోన్స్: షీ ఈజ్ జస్ట్ లైక్ యు అండ్ ఏ లాట్ లైక్ మి' వారం రోజుల్లో అత్యధిక కాపీలు అమ్ముడవడంతో ఇది తనకు చాలా గర్వకారణమన్నారు. ఈ నెల 18న ట్వింకిల్ ఆ పుస్తకాన్ని మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్షయ్, లారా దత్తా, మీనన్ ముఖ్యపాత్రలు పోషించిన 'సింగ్ ఈజ్ బ్లింగ్' అక్టోబర్ 2న విడుదల కానుంది. So proud of @mrsfunnybones & her Book!She has brought so much love & laughter 2 my life & now she brings it to urs ;) pic.twitter.com/luUeD3Orlp Happiness is...seeing ur wife's book at no.1 within a week :) @mrsfunnybones has arrived! #MrsFunnyBonesBook #proud pic.twitter.com/IE8IMEobEz — Akshay Kumar (@akshaykumar) August 26, 2015 — Akshay Kumar (@akshaykumar) August 18, 2015 -
'మా ఆయన సరసన హీరోయిన్ గా జయలలిత'
ముంబై: తన భర్త అక్షయ్ కుమార్ సరసన హీరోయిన్ గా జయలలిత నటించాలని కోరుకుంటున్నట్టు రచయిత్రిగా మారిన నటి ట్వింకిల్ ఖన్నా సరదాగా వ్యాఖ్యానించింది. తన మొదటి పుస్తకం 'మిసెస్ ఫన్నీబోన్స్: షీజ్ జస్ట్ లైక్ యూ అండ్ ఏ లాట్ లైక్ మీ హియర్'ను మంగళవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు కరణ్ జోహర్ అడిగిన ప్రశ్నలకు ఆమె తనదైన శైలిలో జవాబిచ్చారు. సినిమా నటులు, రాజకీయ నాయకులతో పాటు వివిధ అంశాలపై వంగ్యాస్త్రాలు సంధించారు. వారిద్దరి సంభాషణ సాగిందిలా... కరణ్: అక్షయ్ తర్వాతి సినిమాలో హీరోయిన్ ఎవరు నటిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. ట్వింకిల్: జయలలిత. ఆమె గొప్ప పోరాటయోధురాలు. కరణ్: మీరు ఎవరితో రియారిటీ షో చేయాలనుకుంటున్నారు ట్వింకిల్: వివాదస్పద సన్యాసిని రాధే మాతో... కరణ్: రణబీర్ కపూర్ గురించి ఏం చెబుతారు ట్వింకిల్: కత్రినా కైఫ్ నా నాలుకపై ఉంది కాబట్టి రణబీర్ గురించి మాట్లాడలేను. కరణ్: దీపికా పదుకునే గురించి చెప్పండి ట్వింకిల్: ఆమె ఏమైనా చేయగలదు. కరణ్: ప్రధాని నరేంద్ర మోదీని కలిస్తే ఏం అడుగుతారు ట్వింకిల్: మా ఆయనకు క్రీడా శాఖ మంత్రి పదవి ఇవ్వమంటా కరణ్: ఆమిర్ ఖాన్ ఫోన్ లో ఏమున్నాయి ట్వింకిల్: గ్రహాంతర వాసుల నగ్న చిత్రాలు కరణ్: అక్షయ్ గురించి ఎవరికీ తెలియని సంగతులు చెప్పండి ట్వింకిల్: సినిమాల్లో ట్రాజెడీ సీన్లు చూసినప్పుడు ఏడుస్తుంటాడు. ప్రతి రాత్రి గళ్ల పైజామా ధరిస్తారు. ఎప్పుడో ఒకసారి డ్రింక్ చేస్తాడు. కరణ్: పోర్న్ వెబ్ సైట్ల నిషేధంపై మీ అభిప్రాయం ట్వింకిల్: తల్లిగా సంతోషిస్తున్నా. కానీ పౌరురాలిగా విబేధిస్తున్నా కరణ్: స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే 377 సెక్షన్ గురించి మీ కామెంట్ ట్వింకిల్: చెట్టును పెళ్లి చేసుకునేందుకు అభ్యంతరం చెప్పరు కానీ స్వలింగ సంపర్కుల వివాహానికి ససేమీరా అంటారు -
ట్వింకిల్ ఖన్నా పుస్తకం ఆవిష్కరణ
-
'ఆయనే నా ఎడిటర్'
ముంబై: తన రచనలకు తన భర్త అక్షయ్ కుమారే ఎడిటర్ అని రచయిత్రిగా మారిన నటి ట్వింకిల్ ఖన్నా తెలిపారు. తన మొదటి పుస్తకం 'మిసెస్ ఫన్నీబోన్స్: షీజ్ జస్ట్ లైక్ యూ అండ్ ఏ లాట్ లైక్ మీ హియర్'ను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ట్వింకిల్ విలేకరులతో ముచ్చటించారు. చిన్నప్పటి నుంచి రాయడం తనకు అలవాటు అని చెప్పారు. గత రెండేళ్లు కాలమ్స్ రాస్తున్నానని తెలిపారు. మీ రచనల్లో అక్షయ్ జోక్యం చేసుకుంటారా అని విలేకరుల ప్రశ్నించగా... 'ఆయనే నా ఎడిటర్' అంటూ సమాధానం ఇచ్చారు. పుస్తకావిష్కరణ కార్యక్రమానికి డింపుల్ కపాడియా, ఆమిర్ ఖాన్, కరణ్ జోహార్, జయా బచ్చన్, సుసానె రోషన్, సొనాలి బింద్రే హాజరయ్యారు. సమాజంలో జరుగుతున్న తాజా పరిణామాలపై తన శైలిలో 'మిసెస్ ఫన్నీబోన్స్' కాలమ్ లో ట్వింకిల్ ఖన్నా రాస్తున్నారు. ఆమె రాస్తున్న కాలమ్ ముంబైలో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. -
కోర్టులో నటి ట్వింకిల్ ఖన్నాకు ఊరట
ముంబై: బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ భార్య, నటి ట్వింకిల్ ఖన్నాకు ముంబై హైకోర్టులో ఊరట లభించింది. ట్వింకిల్ తండ్రి, దివంగత సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా రాయించిన వీలునామా కాపీని ఆయన సహచరి అనితా అద్వానీకి ఇవ్వాలన్న సింగిల్ జడ్జి తీర్పుపై స్టే విధించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు కొట్టివేయాలని కోరుతూ ట్వింకిల్ చేసిన అప్పీలును హైకోర్టు విచారణకు స్వీకరించింది. చీఫ్ జస్టిస్ మోహిత్ షా సారథ్యంలోని ధర్మాసనం.. కేసు విచారణ ముగిసే వరకు గత తీర్పుపై స్టే విధిస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది. అనిత రాజేష్ ఖన్నా కుటుంబ సభ్యురాలు లేదా వారసురాలు కాదని, ఆమెకు వీలు కాపీ ఇవ్వాల్సిన అవసరం ట్వింకిల్‌కు లేదని ఆమె తరపు న్యాయవాదులు వాదించారు. రాజేష్ ఖన్నా తన వారసురాళ్లుగా కుమార్తెలు ట్వింకిల్, రింకీ పేర్లను వీలులో రాశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇదిలావుండగా, ఆయన నివసించిన బంగ్లాను ఇటీవల ఓ వ్యాపారవేత్తకు అమ్మేశారు. 2012లో రాజేష్ ఖన్నా మరణించారు. రాజేష్ ఖన్నాతో విభేదాల కారణంగా ఆయన భార్య, బాలీవుడ్ నటి డింపుల్ కపాడియా తన పిల్లలతో కలసి వేరుగా ఉండేవారు. అప్పట్లో రాజేష్ అనితతో సన్నిహితంగా ఉండేవారు. దీంతో అనితకు, రాజేష్ ఖన్నా కుమార్తెలకు మధ్య ఆస్తి వివాదాలు ఏర్పడ్డాయి. -
ట్వింకిల్ ఖన్నా.. నా 'సూపర్ వుమెన్'
ముంబై: బాలీవుడ్ దంపతులు అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా ఒకరిపై మరొకరు ప్రశంసలు కురిపిస్తున్నారు. మా ఆయన బంగారం అంటూ ట్వింకిల్ కితాబిస్తే.. నా భార్య నాకు సూపర్ వుమెన్ అంటూ అక్షయ్ మెచ్చుకున్నాడు. ట్వింకిల్‌తో ఉన్న ఫొటోను అక్షయ్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. నిన్నటి తరం బాలీవుడ్ తారలు రాజేష్ ఖన్నా, డింపుల్ కపాడియాల గారాటపట్టి ట్వింకిల్ సినిమాలకు గుడ్ బై చెప్పి 2001లో అక్షయ్‌ను పెళ్లి చేసుకుంది. అక్షయ్, ట్వింకిల్ దంపతులకు ఒక కొడుకు, ఒక కుమార్తె. -
ఇక అక్షయ్‌కుమార్‌తో సినిమాలు చేయడం కష్టమే!
‘ఆ జంట సూపర్ హిట్.. ఆ ఇద్దరి కెమిస్ట్రీ అదుర్స్’ అని అక్షయ్‌కుమార్, సోనాక్షీ సిన్హా గురించి హిందీ చిత్రసీమలో చెప్పుకుంటుంటారు. ఈ ఇద్దరూ కలిసి దాదాపు అరడజను సినిమాల్లో నటిస్తే, వాటిల్లో విజయం సాధించినవే ఎక్కువ. అందుకే అక్షయ్, సోనాక్షీ జంటగా సినిమాలు చేయడానికి బాలీవుడ్ దర్శక, నిర్మాతలు ఇష్టపడతారు. కానీ, అక్షయ్ భార్య ట్వింకిల్ ఖన్నా మాత్రం ఈ విషయంలో అంత సుముఖంగా లేరట. గతంలో అక్షయ్, ప్రియాంక చోప్రా జంటకు మంచి పేరొచ్చినప్పుడు ట్వింకిల్ చాలా కంగారుపడ్డారనే వార్త హల్చల్ చేసింది. ‘ఇక ప్రియాంకతో సినిమాలు చేయకూడదు’ అని తన భర్తకు నిబంధన విధించారనే వార్త కూడా వచ్చింది. ఆ తర్వాత ఈ జోడీ తెరపై కనిపించకపోవడంతో ఆ వార్త నిజం అని నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం సోనాక్షీ విషయంలో కూడా భర్తకు అదే నిబంధన విధించారట. విడిగా కూడా అక్షయ్‌తో సోనాక్షీ స్నేహంగా ఉండటంపట్ల ట్వింకిల్ అభద్రతాభావానికి గురై ఉంటారన్నది కొంతమంది ఊహ. ఏదేమైనా ఇక అక్షయ్, సోనాక్షీ జోడీ తెరపై కనిపించడం కష్టమేనని బాలీవుడ్‌వారు అంటున్నారు. అక్షయ్, సోనాక్షీ నటించిన ‘హాలిడే’ ఇటీవల విడుదలై, విజయ విహారం చేస్తోంది. బహుశా ఈ కాంబినేషన్లో ఇదే చివరి సినిమాయేమో అనే ఊహాగానాలున్నాయి. మరి.. ఈ ఊహ ఎంతవరకు నిజమో కాలమే చెప్పాలి. -
ఆమే నా అదృష్ట దేవత
తన వృత్తిపరమైన తన జీవితానికి భార్య ట్వింకిల్ ఖన్నా వల్లనే వెలుగొచ్చిందని బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ గర్వంగా చెప్పాడు. 46 ఏళ్ల ఈ నటుడు ఎ.ఆర్.మురుగదాస్ యాక్షన్ థ్రిల్లర్ ‘హాలిడే’ సినిమాలో కనిపించనున్నాడు. తన నిర్ణయాలకు నిరంతరం మద్దతు పలికిందన్నాడు. ‘ఆమె అదృష్టం నాకు ఎల్లప్పుడూ కలిసి వచ్చింది. తన ప్రతి నిర్ణయానికీ మద్దతు పలికింది. ఎప్పుడూ నాకు తోడూనీడగా ఉంది. నాకు వచ్చిన అవకాశాలకు సంబంధించిన స్క్రిప్టులను కూడా చదివేది కాదు’ అని ఆదివారం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనోభావాలను పంచుకున్నాడు. ‘ఆమె వ్యక్తిగత జీవితం ఆమెకు ఉంది. దానితోనే క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. చక్కని కుటుంబం కలిగి ఉందనే ఆనందం ఆమె కళ్లలో కనిపిస్తుంటుంది. అందువల్ల సంతోషంగా ఉంటుంది. కాగా రాజేశ్‌ఖన్నా, డింపుల్ కపాడియా కుమార్తె అయిన ట్వింకిల్‌ను 2001లో అక్షయ్ వివాహమాడాడు. ‘జబ్ ప్యార్ కిసీసే హోతా హై’ తర్వాత సినిమాలకు వీడ్కోలు పలికిన ట్వింకిల్...డిజైనింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అదే సమయంలో మాధురీదీక్షిత్, శ్రీదేవి, కాజోల్, ఐశ్వర్యారాయ్ వంటి తారలు బాలీవుడ్లో అడుగుపెట్టేందుకు ఎంతగానో ఆసక్తి చూపుతున్నప్పటికీ ట్వింకిల్ పట్టించుకోలేదు. ట్వింకిల్ మళ్లీ బాలీవుడ్‌లోకి అడుగు పెట్టే అవకాశముందా అని మీడియా ప్రశ్నించగా అదేమీ లేదన్నాడు. అటువంటి ఆలోచనలేమీ ఆమెకు లేవన్నాడు. మళ్లీ సినిమాల్లోకి రావాల్సిందిగా తాను కూడా ట్వింకిల్‌ను అడిగానని, ఆనందంగా కాలం గడపగలిగితే అదే చాలంటూ జవాబిచ్చిందన్నాడు. ప్రతిరోజూ సినిమా షూటింగ్ ముగిసిన వెంటనే ఇంటికి వెళ్లి కుటంబసభ్యులతో ఆనందంగా కాలం గడపడం తనకు ఎంతో ఇష్టమన్నాడు.