
'తన విజయం నాకు ఆనందాన్నిచ్చింది'
ముంబయి: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తాను చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. విషయం ఏంటంటే.. అక్షయ్ భార్య బాలీవుడ్ నటి ట్వింకిల్ ఖన్నా ఇటీవలే విడుదల చేసిన ఓ పుస్తకం మార్కెట్లో అమ్మకాలు జరిగిన నంబర్ వన్ బుక్ అయింది. దీంతో తన సంతోషాన్ని ట్విట్టర్ పోస్ట్ ద్వారా తెలిపారు. 'సింగ్ ఈజ్ బ్లింగ్' సినిమా పనులతో ప్రస్తుతం బిజీబిజీగా ఉన్న అక్షయ్ తన భార్య విజయం తనకు గర్వకారణమని తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.
తన భార్య రాసిన తొలి పుస్తకం 'మిసెస్ ఫన్నీబోన్స్: షీ ఈజ్ జస్ట్ లైక్ యు అండ్ ఏ లాట్ లైక్ మి' వారం రోజుల్లో అత్యధిక కాపీలు అమ్ముడవడంతో ఇది తనకు చాలా గర్వకారణమన్నారు. ఈ నెల 18న ట్వింకిల్ ఆ పుస్తకాన్ని మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్షయ్, లారా దత్తా, మీనన్ ముఖ్యపాత్రలు పోషించిన 'సింగ్ ఈజ్ బ్లింగ్' అక్టోబర్ 2న విడుదల కానుంది.
So proud of @mrsfunnybones & her Book!She has brought so much love & laughter 2 my life & now she brings it to urs ;) pic.twitter.com/luUeD3Orlp
Happiness is...seeing ur wife's book at no.1 within a week :) @mrsfunnybones has arrived! #MrsFunnyBonesBook #proud pic.twitter.com/IE8IMEobEz
— Akshay Kumar (@akshaykumar) August 26, 2015
— Akshay Kumar (@akshaykumar) August 18, 2015