Akshay Kumar
-
బరువు తగ్గాలంటే..? సింపుల్‌గా ఈ చిట్కాలు పాటించండి: అక్షయ్ కుమార్
ఈమధ్య పదేళ్లలోపు పిల్లలు కూడా ఊబకాయం బారిన పడటం చూస్తున్నాం. ఊబకాయం వల్ల మధుమేహం, అధిక రక్తపోటు, గుండెజబ్బులు వంటి సమస్యలు చుట్టుముట్టేస్తున్నాయి. దీంతో మానసిక, భావోద్వేగ ఆరోగ్యం మీదా అధికబరువు ప్రభావం చూపుతుంది. దేశంలో చాలామంది ఇలాంటి ఆందోళన సమస్యలతోనూ సతమతమవుతుంటారు. ఇదే అంశం గురించి తాజాగా ప్రధాని మోదీ పలు వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఊబకాయంతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోందని ఉత్తరాఖండ్ పర్యటనలో అన్నారు. ఫిట్‌నెస్‌పై అందరూ దృష్టిసారించాలని ఆయన పిలుపునిచ్చారు. ఊబకాయం చాలా వ్యాధులకు మూలం అని ఆయన గుర్తు చేశారు. (ఇదీ చదవండి: నటి శోభన పెళ్లెందుకు చేసుకోలేదంటే..?)స్థూలకాయంతో బాధపడుతున్న వారి సంఖ్య దేశంలో బాగా పెరిగిపోతోందని, ఇది గుండె, మధుమేహం వంటి సమస్యలకు దారి తీయవచ్చని మోదీ అన్నారు. ‘ఫిట్ ఇండియా’ ఉద్యమం ద్వారా దేశంలోని నేటి యువత ఫిట్నెస్, ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి పలు వ్యాఖ్యలు చేశారు. మోదీ (Narendra Modi) చేసిన ప్రసంగాన్ని ‘ఎక్స్’ వేదికగా బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar) రీపోస్టు చేస్తూ.. మోదీపై ప్రశంసలు కురిపించారు. ఆపై బరువు తగ్గుదాం అనుకునే వారికి కొన్ని చిట్కాలను కూడా ఇచ్చారు.'ప్రధాని మోదీ చెబుతున్నట్లుగా ఊబకాయం వల్ల చాలా జబ్బులు వస్తాయి. ప్రధాని మోదీ చెప్పింది ముమ్మాటికి వాస్తవం. ఇదే విషయాన్ని చాలా ఏళ్ల నుంచి నేను కూడా చెబుతూనే ఉన్నాను. ప్రస్తుతం మోదీనే ఇదే విషయం చెప్పడంతో చాలామందికి రీచ్ అవుతుంది. దేశ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఆశిస్తున్నారు. ఊబకాయం నుంచి మనం బయటపడాలంటే సరిపడ నిద్రదో పాటు స్వచ్ఛమైన గాలి తీసుకోవాలి ఉండాలి. సూర్యరశ్మి సమయంలో మనం అడుగులు వేయాలి. మన వంటకాల్లో తక్కువ నూనె వాడకం ఉండేలా చూసుకోవాలి. ఆపై దేశీ నెయ్యి విరివిగా వినియోగించాలి. ఊబకాయంతో పోరాడే దేశ ప్రజలందరికీ ఇవే పెద్ద ఆయుధాలుగా ఉపయోగపడుతాయి. ప్రతి ఒక్కరు మీ జీవితంలో వ్యాయామాన్ని భాగం చేసుకోండి. కచ్చితంగా రోజూ చేసేలా ప్లాన్ చేసుకోండి. ముమ్మాటికి ఈ విషయాన్ని నమ్మండి. ఈ చిట్కాలతో స్థూలకాయం నుంచి బయటపడొచ్చు.' అని అక్షయ్ తెలిపారు.How true!! I’ve been saying this for years now…love it that the PM himself has put it so aptly. Health hai toh sab kuchh hai. Obesity se fight karne ke sabse bade hathiyaar 1. Enough sleep2. Fresh air and Sunlight3. No processed food, less oil. Trust the good old desi ghee… pic.twitter.com/CxnYjb4AHv— Akshay Kumar (@akshaykumar) January 30, 2025 -
నన్ను తప్పించారు!
అక్షయ్ కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘స్కైఫోర్స్’. దర్శకద్వయం సందీప్ కెవ్లానీ, అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించారు. సారా అలీఖాన్, వీర్పహడియా కీలకపాత్రలుపోషించారు. దినేష్ విజన్, జ్యోతి దేశ్‌పాండే, అమర్ కౌశిక్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలోపాల్గొన్న అక్షయ్ కుమార్ విలేకరులు అడిగన ప్రశ్నలకు బదులిస్తూ–‘‘నేను నటించిన ‘భూల్ భులయ్యా’ సినిమా 2007లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఆ మూవీకి సీక్వెల్స్‌గా వచ్చిన ‘భూల్ భులయ్యా 2’(2022), ‘భూల్ భులయ్యా 3’(2024) సినిమాల్లో నేను నటించకపోవడానికి ప్రత్యేక కారణం అంటూ ఏమీ లేదు.. ఆ చిత్రాల నుంచి నేను తప్పుకోనూ లేదు.. వాళ్లే నన్ను తప్పించారు’’ అని పేర్కొన్నారు. అక్షయ్ చెప్పిన ఈ మాటలు బాలీవుడ్లో వైరల్‌గా మారాయి. -
బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్.. అదే ప్రధాన కారణం: అక్షయ్ కుమార్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రస్తుతం స్కై ఫోర్స్ అనే మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనున్నారు. సందీప్ కేవ్లానీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఈ మూవీని జియో స్టూడియోస్, మడాక్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హైజరైన అక్షయ్ బాక్సాఫీస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.ఓటీటీల వల్లే మంచి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవుతున్నాయని అక్షయ్ కుమార్ అన్నారు. ఓటీటీలు వచ్చాక థియేటర్లకు వెళ్లే ప్రేక్షకుల భారీగా తగ్గిందని తెలిపారు. పెద్ద చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద రాణించకపోవడానికి ప్రధాన కారణం ఓటీటీలేనని వెల్లడించారు.అక్షయ్ కుమార్ మాట్లాడుతూ..'ఈ మధ్యకాలంలో నేను చాలామందితో సినిమాల గురించి ఆరా తీశా. ఏ సినిమా అయినా ఓటీటీలో చూస్తామని అంటున్నారు. బాక్సాఫీస్ వద్ద సినిమాలు సరిగ్గా సక్సెస్ అవ్వకపోవడానికి ప్రధాన కారణం ఓటీటీనే అని నాకు అర్థమైంది. కరోనా టైమ్‌లో ఓటీటీ వేదికగా ఇంట్లోనే కుటుంబంతో కలిసి సినిమాలు చూశారు. ఆ తర్వాత పరిస్థితులు మారినప్పటికీ ప్రేక్షకులు ఓటీటీకే మొగ్గు చూపుతున్నారు. అది ఒక అలవాటుగా మారిందని' అన్నారు. కాగా.. తెలుగులోనూ మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న కన్నప్ప చిత్రంలో అక్షయ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. -
‘సల్మాన్ అవమానించాడు’.. స్పందించిన అక్షయ్ కుమార్
'బిగ్ బాస్ 18' గ్రాండ్ ఫినాలే వివాదంపై అక్షయ్ కుమార్(Akshay Kumar) స్పందించాడు. సల్మాన్ ఖాన్ తనను అవమానించారనే వార్తలను కొట్టిపాడేశాడు. తనకున్న కమిట్మెంట్ల కారణంగానే గ్రాండ్ ఫినాలే షూటింగ్ ప్రారంభం కాకముందే షో నుంచి బయటకు వచ్చానని.. అంతకు మించి అక్కడ ఏమి జరగలేదని చెప్పి రెండు రోజులుగా జరుగుతున్న సోషల్ మీడియా వార్కి పుల్‌స్టాఫ్ పెట్టేశాడు.అసలేం జరిగింది?గత ఆదివారం(జనవరి 19) హిందీ బిగ్‌బాస్ 18వ సీజన్ గ్రాండ్ ఫినాలే జరిగిన విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్(Salman Khan) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో గ్రాండ్ ఫినాలేకి అతిథులుగా అక్షయ్ కుమార్, వీర్ సహారియాలను పిలిచారు.షెడ్యూల్ టైం ప్రకారం అక్షయ్ కుమార్ బిగ్ బాస్ సెట్ కు వెళ్లారు. కానీ సల్మాన్ ఖాన్ మాత్రం ఆలస్యంగా సెట్‌కి వచ్చాడు. దాదాపు గంట పాటు సెట్లోనే వేచి చూసిన అక్షయ్.. షూటింగ్ ఇంకా ప్రారంభం కాకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అక్షయ్ వెళ్లిపోయిన కాసేపటికి సల్మాన్ సెట్‌కి వచ్చాడు. దీంతో అక్షయ్ కుమార్‌ను సల్మాన్ ఖాన్ అవమానించాడంటూ సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిచ్చాయి. అంతేకాదు అక్షయ్ అసహనంతో అక్కడ నుంచి వెళ్లిపోయాడని.. బిగ్‌బాస్ నిర్వాహకులు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదంటూ పుకార్లు వచ్చాయి.వాస్తవం ఎంటంటే..?సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై తాజాగా అక్షయ్ స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తనకున్న కమిట్మెంట్ కారణంగా షూటింగ్ ప్రారంభం కాకముందే షో నుంచి వచ్చేసినట్లు చెప్పారు.సల్మాన్ సెట్‌కు ఆలస్యంగా వచ్చిన విషయం వాస్తవమే. కానీ ఆయన ఆలస్యంగా రావడం వల్లే నేను వెళ్లిపోలేదు. నా సినిమా షూటింగ్‌కు టైమ్ కావడంతో ఫినాలే షూట్ నుంచి బయటకు వచ్చేశాను. ఆ తర్వాత సల్మాన్‌తో మాట్లాడాను. నేను వచ్చేసినా మా చిత్రం ‘స్కై ఫోర్స్’ను ప్రచారం చేయడం కోసం వీర్ పహారియా బిగ్‌బాస్ సెట్లోనే ఉన్నారు. అతడు మా సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు’ అని అక్షయ్ అన్నారు.బిగ్ బాస్ 18' విన్నర్ ఎవరు? బిగ్ బాస్ షో తెలుగులోనే కాదు మిగతా భాషల్లో కూడా పాపులర్. హిందీలో 18 సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఇక 18వ సీజన్ విన్నర్((Bigg Boss 18 winner) గా నటుడు కరణ్ వీర్ మోహ్రా నిలిచాడు. ఇతడు ట్రోఫీతో పాటు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ గెలుచుకున్నాడు. నటుడు వివియన్ డిసేన ఫస్ట్ రన్నరప్‌గా, యూట్యూబర్ రజత్ దలాల్ సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. అవినాష్ మిశ్రా, చుమ్ దరాంగ్, ఇషా సింగ్ టాప్ 6లో చోటు సంపాదించుకున్నారు. -
ముల్లోకాలు ఏలే పరమేశ్వరుడు
విష్ణు మంచు హీరోగా నటించిన చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రీతి ముకుందన్ హీరోయిన్ . మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్‌కుమార్, బ్రహ్మానందం, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటివారు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.కాగా ‘కన్నప్ప’ సినిమాలో శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ నటించినట్లు వెల్లడించి, ఆయన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘ముల్లోకాలు ఏలే పరమేశ్వరుడు భక్తికి మాత్రం దాసుడు’ అని ఫస్ట్‌లుక్ పోస్టర్‌పై ఉంది. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ పతాకంపై మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 25న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. -
యుద్ధం మొదలైంది
అక్షయ్ కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘స్కై ఫోర్స్’. వీర్ పహారియా, సారా అలీఖాన్, నిమ్రత్ కౌర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ మూవీని దర్శక ద్వయం సందీప్ కెవ్లానీ– అభిషేక్ అనిల్ కపూర్ తెరకెక్కించారు. 1965లో జరిగిన ఇండియా–పాకిస్తాన్ వార్ నేపథ్యంలో భారతదేశపు మొదటి వైమానిక దాడి సంఘటనల ఆధారంగా ‘స్కై ఫోర్స్’ సినిమాను తీశారని బాలీవుడ్ సమాచారం.ఈ చిత్రంలో కమాండర్ కేవో అహుజా పాత్రలో అక్షయ్ కుమార్, టి. విజయ పాత్రలో వీర్ పహారియా నటించారు. దినేష్ విజయ్, జ్యోతీ దేశ్ పాండే, అమర్ కౌశిక్, సాహిల్ ఖాన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఆదివారం ‘స్కై ఫోర్స్’ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.‘యుద్ధం మొదలైంది’, ‘..అండ్ ది మిషన్ ఈజ్ కాల్డ్ మిషన్ స్కై ఫోర్స్’, ‘కౌన్ జనాబ్... కౌన్ జనాబ్... తేరా బాప్... హిందూస్తాన్’, ‘విజయ రూల్స్‌ని బ్రేక్ చేశాడు...’, ‘సార్... అతడ్ని కనిపెట్టడంలో మనం పాకిస్తాన్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి’, ‘మీరందరూ అతను ఓ పిచ్చివాడిలా ప్రవర్తించాడు అన్నారు. కానీ అతనికి ఉన్న ఆ పిచ్చి దేశభక్తి’ అనే డైలాగ్స్ విడుదలైన ట్రైలర్లో ఉన్నాయి. -
మాజీ ప్రియురాలితో సినిమా.. ప్రశంసలు కురిపించిన హీరో
బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ గురించి పరిచయం అక్కర్లేదు. సైఫ్ అలీఖాన్ ముద్దుల కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 2018లో కేదార్నాథ్ అనే సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో కనిపించింది. గతేడాది ఏ వతన్ మేరే వతన్ మూవీతో మెప్పించిన సారా.. ప్రస్తుతం అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తోన్న స్కై ఫోర్స్ సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.ముంబయిలో జరిగిన ఈవెంట్లో స్కై ఫోర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు. అయితే ఈ మూవీలో సారా మాజీ ప్రియుడు వీర్ పహరియా కూడా నటిస్తున్నారు. ఈ సందర్భంగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు హాజరైన వీర్ పహారియా.. మాజీ ప్రియురాలు సారా అలీఖాన్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. సారా అలీ ఖాన్‌తో పని చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. షూటింగ్లో తనకు మద్దతు అందించినందుకు సారాకు కృతజ్ఞతలు తెలిపాడు.వీర్ పహారియా మాట్లాడుతూ.. "ఆమె చాలా మంచి వ్యక్తి. సారాకు సహాయం చేసే గుణం చాలా ఎక్కువ. తనకు ఇప్పటికే సినీ పరిశ్రమలో చాలా అనుభవం ఉంది. అందువల్లే నాకు చాలా సహాయం చేసింది. ఈ విషయంలో సారాకు రుణపడి ఉన్నా. తన మొదటి సినిమాలో మద్దతుగా నిలిచినందుకు సారాకు ధన్యవాదాలు" అని అన్నారు.కాగా.. 2018లో కేదార్నాథ్ మూవీ ఎంట్రీ ఇచ్చిన సారా అలీ ఖాన్ చిత్ర పరిశ్రమలోకి రాకముందు వీర్ పహారియాతో డేటింగ్ చేసింది. గతేడాది కాఫీ విత్ కరణ్ సీజన్- 7 లో పాల్గొన్న సారా ఈ విషయం బయటకొచ్చింది. ఈ షోలో జాన్వీ కపూర్ వీర్ సోదరుడు శిఖర్ పహారియాతో ప్రేమలో ఉన్న సమయంలోనే వీర్‌తో సారా డేటింగ్ చేస్తున్నారని హోస్ట్ కరణ్ జోహార్ ఆమెను ఆటపట్టించాడు. అయితే ప్రస్తుతం వీరిద్దరు ఎలాంటి రిలేషన్లో లేరు. వీర్ పహారియా, సారా అలీ ఖాన్ స్కై ఫోర్స్‌లో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సందీప్ కెవ్లానీ, అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 24, 2025న విడుదల కానుంది.పొలిటీషియన్ కుమారుడితో డేటింగ్ రూమర్స్..మరోవైపు సైఫ్ అలీఖాన్ ముద్దుల కూతురు, హీరోయిన్ సారా అలీఖాన్‌పై గతంలో మరోసారి డేటింగ్ రూమర్స్ వచ్చాయి. ప్రముఖ మోడల్ అర్జున్ ప్రతాప్ బజ్వాతో సారా గత కొన్నాళ్లుగా సన్నిహితంగా ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. అర్జున్‌కి రాజకీయ నేపథ్యం కూడా ఉంది. పంజాబ్‌కి చెందిన బీజేపీ నేత ఫతే జంగ్ సింగ్ బజ్వా కొడుకు ఈయన. అర్జున్ మినహా ఫ్యామిలీ మొత్తం రాజకీయాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది.కేదార్నాథ్ పర్యటన వల్లే..ఇటీవల సారా కేదార్నాథ్ పర్యటనకు వెళ్లింది.ఈ పర్యటననే డేటింగ్ రూమర్లకి కారణమైంది. సారాతో పాటు అర్జున్ కూడా కేదార్నాథ్ పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తుంది. ఈ పర్యటనలోనే వీరిద్దరు మరింత క్లోజ్ అయినట్లు తెలుస్తోంది.వీరిద్దరు కలిసి దర్శనం చేసుకుంటున్న ఫోటో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. అప్పటి నుంచి అర్జున్-సారా డేటింగ్లో ఉన్నారనే రూమర్స్ మొదలైయ్యాయి. అయితే ఈ డేటింగ్ రూమర్స్‌పై అటు సారా కానీ, ఇటు అర్జున్ కానీ స్పందించలేదు. -
భార్యాభర్తలే కానీ ఒక గదిలో ఉండరట.. ఎంత టార్చర్ పెట్టారో!: సింగర్
పాపులర్ సింగర్ మికా సింగ్.. అదుర్స్ (పిల్లా నా వల్ల కాదు..), బలుపు (పాతికేళ్ల చిన్నది), డార్లింగ్ (యాహు యాహూ..) సినిమా పాటలతో తెలుగువారికీ సుపరిచితుడయ్యాడు. టాప్ సింగర్‌గా, ర్యాపర్‌గా రాణిస్తున్న ఇతడు రెండుమూడు సినిమాల్లోనూ నటించాడు. అంతేకాదు, ఓ సారి చిన్నపాటి సినిమా లేదా వెబ్ సిరీస్ తీయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా 2020వ సంవత్సరంలో డేంజరస్ అనే వెబ్ సిరీస్ తీశాడు.రిస్క్ ఎందుకని?అయితే నిర్మాతగా ఇదే తన తొలి ప్రాజెక్ట్ కావడంతో రాజ్ సినిమా డైరెక్టర్ విక్రమ్ భట్ దగ్గరున్న కథనే సెలక్ట్ చేసుకున్నాడు. పెద్దగా రిస్క్ చేయడం ఇష్టం లేని అతడు రాజ్ సినిమాలోని కొందర్ని తన సిరీస్ కోసం సెలక్ట్ చేసుకున్నాడు. బడ్జెట్ మరీ మితిమీరిపోకూడదని భావించి కరణ్ సింగ్ గ్రోవర్‌ను ఎంపిక చేశాడు. అలాగే కొత్త హీరోయిన్ను పరిచయం చేయాలనుకున్నాడు. కానీ కరణ్ భార్య బిపాసా బసు (Bipasa Basu) తనే కథానాయికగా చేస్తానంది. దీంతో ఒప్పుకోక తప్పలేదు.దంపతులకు వేర్వేరు గదులుఇంకా మికా సింగ్ (Mika Singh) మాట్లాడుతూ.. నెల రోజుల షెడ్యూల్ కోసం 50 మంది కలిసి లండన్‌కు వెళ్లాం. తీరా వెళ్లాక అది రెండు నెలలవరకు కొనసాగింది. కరణ్, బిపాసా చాలా ఓవర్ చేశారు. వీళ్లు దంపతులే కాబట్టి ఒక రూమ్ బుక్ చేశాను. కానీ వాళ్లేమో వేర్వేరు గదులు కావాలన్నారు. నాకసలు అర్థమే కాలేదు. తర్వాత వేరే హోటల్‌కు వెళ్తామంటే అదీ చేశాను. ఒక యాక్షన్ సన్నివేశంలో కరణ్ కాలు ఫ్రాక్చర్ అయింది. అది మనసులో పెట్టుకుని డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా ఇబ్బందులకు గురి చేశారు. గొంతు బాలేదు, బిజీగా ఉన్నామంటూ ఇలా ఎప్పుడూ ఏదో ఒక సాకు చెప్పేవారు. నానా రచ్చవారు చేసిన పనికి డబ్బిస్తున్నప్పుడు ఎందుకింత డ్రామా చేస్తున్నారనేది నాకసలు అంతుపట్టలేదు. ముద్దు సన్నివేశం దగ్గర కూడా నానా రచ్చ చేశారు. అందుకు ససేమీరా ఒప్పుకోమన్నారు. స్క్రిప్ట్‌లో ఈ సీన్ గురించి వివరంగా రాసుంది. అది చదివే అగ్రిమెంట్‌పై సంతకం చేశారు. పైగా ఇద్దరూ భార్యాభర్తలే అయినప్పుడు ముద్దు పెట్టుకోవడానికి అభ్యంతరం ఏముంది? ఇలాంటివాళ్లు ధర్మ ప్రొడక్షన్, యష్ రాజ్ ఫిలింస్ వంటి పెద్ద నిర్మాతలకు భజన చేస్తారు. చిన్న పాత్ర ఇచ్చినా ఆహా ఓహో అని పొంగిపోతారు.యాటిట్యూడ్ చూపించారుకానీ చిన్న నిర్మాతల దగ్గర మాత్రం యాటిట్యూడ్ చూపిస్తారు. మేము కూడా వారిపై డబ్బు ఖర్చు పెడుతున్నాం కదా! ఇదంతా చూశాక ఇంకోసారి నిర్మాణం వైపు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను. ఇతరులకు కూడా అదే సలహా ఇస్తుంటాను. లేదు, కచ్చితంగా సినిమా నిర్మించాలనుకుంటే కొత్తవారికి అవకాశాలు ఇవ్వడం ఉత్తమం. నేను సినిమా తీస్తున్న విషయం తెలిసి అక్షయ్ కుమార్ (Akshay Kumar) హెచ్చరించాడు కూడా! హీరోల సలహా లెక్కచేయలేనీకేమైనా పిచ్చిపట్టిందా? జీవితంలో ఎంతో సాధించావ్.. అలాంటిది ఇప్పుడు నటీనటుల వానిటీ వ్యాన్ దగ్గరకు వెళ్లి మీ షాట్ రెడీ అయింది, రండి అని పిలుచుకుంటూ ఉంటావా? నిర్మాతగా మారితే డబ్బు పోగొట్టుకుంటావ్ అన్నాడు. సల్మాన్ ఖాన్ అయితే.. సినిమా తీయాలనుకుంటే ఓకే, కానీ అందులో నువ్వు కూడా నటించు. ఎందుకంటే నువ్వు ఎంపిక చేసే హీరో కంటే నువ్వే ఎక్కువ ఫేమస్ అన్నాడు. ఇద్దరి మాటల్నీ నేను పట్టించుకోలేదు. నా సిరీస్ కోసం ఎంతో డబ్బు పోగేశాను.. కానీ అది ఫ్లాప్ అయింది. కనీసం అందులో నటించినా బాగుండేదని అప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను అని మికా సింగ్ చెప్పుకొచ్చాడు. చదవండి: Mollywood: హిట్టయిన సినిమాలు ఇంతేనా? రూ.700 కోట్ల లాస్! -
ఓటీటీలో రూ.350 కోట్ల యాక్షన్ మూవీ.. ఎక్కడంటే?
ఈ ఏడాది వచ్చిన భారీ మల్టీస్టారర్ మూవీస్‌లో సింగం అగైన్ ముందు వరుసలో ఉంటుంది. ఇది సింగం మూవీ బ్లాక్‌బస్టర్ సిరీస్‌లో మూడో భాగం. అజయ్ దేవ్‌గణ్, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, కరీనా కపూర్, దీపికా పదుకొణె, అర్జున్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సింగం అగైన్ దాదాపు రూ.372 కోట్లు రాబట్టింది.తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించారు. డిసెంబర్ 27 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. కాగా 2011లో సింగం సినిమా రాగా దానికి సీక్వెల్‌గా 2014లో సింగం రిటర్న్స్ వచ్చింది. దశాబ్దకాలం తర్వాత దీనికి కొనసాగింపుగా సింగం అగైన్ తెరకెక్కించారు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రవి బర్సూర్ సంగీతం అందించాడు. ఈ చిత్రాన్ని దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. View this post on Instagram A post shared by prime video IN (@primevideoin)చదవండి: బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్.. మూడు వారాల్లో మరో రికార్డ్ -
భూత్ బంగ్లాలో టబు
హీరో అక్షయ్ కుమార్, దర్శకుడు ప్రియదర్శన్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘భూత్ బంగ్లా’. వామికా గబ్బి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో పరేష్ రావల్, రాజ్‌పాల్ యాదవ్, అస్రానీ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం టబును సంప్రదించారు. కథ నచ్చడంతో టబు కూడా ఓకే అన్నారు. ఇక 2000లో విడుదలైన హిందీ చిత్రం ‘హేరా ఫేరి’ తర్వాత హీరో అక్షయ్ కుమార్, హీరోయిన్ టబు, దర్శకుడు ప్రియదర్శన్‌లు కలిసి చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. అంటే... పదమూడు సంవత్సరాల తర్వాత ఈ ముగ్గురి కాంబినేషన్లో సినిమా కుదిరిందన్న మాట. ‘భూత్ బంగ్లా’ సినిమాను 2026 ఏప్రిల్ 2న విడుదల చేయాలని అనుకుంటున్నారు. -
ధర్మాటిక్ ఫ్యాషన్ ఫండ్ ఈవెంట్ లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
ఉదయాన్నే బూత్‌లకు వచ్చి ఓటేసిన ప్రముఖులు.. మహారాష్ట్ర ఎన్నికల పోలింగ్ చిత్రాలు ఇవిగో
-
‘మహా’ పోరు.. ఓటు వేసిన ప్రముఖులు వీరే..
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నేడు పోలింగ్ కొనసాగుతోంది. మహారాష్ట్రలో ఒకే విడతలో మొత్తం 288 నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైన వెంటనే బారామతిలో డిప్యూటీ సీఎం, ఎన్సీపీ అభ్యర్థి అజిత్ పవార్ ఓటు వేశారు. ముంబైలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే, నాగ్‌పుర్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఓటు వేశారు. అలాగే, ఎంపీ సుప్రియా సూలే తన కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.ముంబైలోని పలు పోలింగ్ బూత్‌లో క్రికెటర్ సచిన్ సహా ఆయన కుటుంబ సభ్యులు ఓటు వేశారు. బాలీవుడ్ దర్శకుడు కబీర్ ఖాన్, సినీ నటుడు రాజ్ కుమార్ రావ్, నటి గౌతమీ కపూర్, నటులు అక్షయ్ కుమార్, అలీ ఫజల్ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | | Former Indian Cricketer Sachin Tendulkar, his wife and their daughter cast their votes at a polling station in Mumbai#MaharashtraAssemblyElections2024 pic.twitter.com/JX8WASuy4Y— ANI (@ANI) November 20, 2024 #WATCH | Mumbai: Former Indian Cricketer Sachin Tendulkar, his wife Anjali Tendulkar and their daughter Sara Tendulkar, show their inked fingers after casting vote for #MaharashtraAssemblyElections2024 pic.twitter.com/ZjHix46qmb— ANI (@ANI) November 20, 2024 #WATCH | Filmmaker and actor Farhan Akhtar shows his inked finger after casting his vote for #MaharashtraAssemblyElections2024, at a polling booth in Bandra, Mumbai. pic.twitter.com/R9wyvbphFx— ANI (@ANI) November 20, 2024 #WATCH | Mumbai: Actor Ali Fazal shows his inked finger after casting his vote for #MaharashtraAssemblyElections2024 pic.twitter.com/GVspi9nAfA— ANI (@ANI) November 20, 2024 #WATCH | NCP-SCP MP Supriya Sule along with her family show their inked fingers after casting a vote for #MaharashtraAssemblyElections2024NCP has fielded Deputy CM Ajit Pawar and NCP-SCP has fielded Yugendra Pawar from the Baramati Assembly constituency. pic.twitter.com/x22KuN8OEI— ANI (@ANI) November 20, 2024 Superstar #AkshayKumar is among the first voters to cast their vote today.pic.twitter.com/EXKGNWZ0pq— Nitesh Naveen (@NiteshNaveenAus) November 20, 2024 -
సినిమా ప్లాప్ అయితే రెమ్యునరేషన్ వద్దు: స్టార్ హీరోలు
బాలీవుడ్ స్టార్ హీరోలు అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్‌లు తమ రెమ్యునరేషన్ల గురించి ఓపెన్‌గానే మాట్లాడారు. తాజాగా జరిగిన హిందూస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్ 2024లో వారిద్దరూ పాల్గొన్నారు. ఈ క్రమంలో బాలీవుడ్లో ఉన్న ఐక్యత గురించి కూడా చర్చించారు. ఒక సినిమా కోసం వారు ఎలా రెమ్యునరేషన్ తీసుకుంటారో చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలిసిన తర్వాత ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు.లాభాలు వస్తేనే రెమ్యునరేషన్: అక్షయ్ కుమార్ఒక సినిమాకు రెమ్యునరేషన్ అనేది స్క్రిప్ట్, కథలో ప్రాధాన్యతను బట్టే రెమ్యునరేషన్ తీసుకోవాలని అక్షయ్ కుమార్ అభిప్రాయపడ్డారు. అయితే, ప్రస్తుతం చాలామంది హీరోలు సినిమాకు వచ్చే లాభాల నుంచి షేర్ తీసుకునేందుకు ఒప్పందం చేసుకుంటారని ఆయన అన్నారు. అందులో తాను కూడా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో సినిమా అనుకున్న ఫలితం ఇవ్వకపోతే నిర్మాతకు రికవరీ ఉండదు. దీంతో హీరోలు తమ పారితోషికాన్ని పూర్తిగా వదులుకున్న సందర్భాలు చాలా ఉన్నాయని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇలా చేయడానికి ప్రధాన కారణం సినిమా పరిశ్రమపై ఉన్న మక్కువే అంటూ అక్షయ్ తెలిపారు. అయితే, సినిమా భారీ విజయం సాధిస్తే మాత్రం మంచి రెమ్యునరేషన్ వస్తుందని కూడా ఆయన అన్నారు. నిర్మాతకు వచ్చిన లాభంలో మాత్రమే తాము వాటా తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇలా చేయడం వల్ల నిర్మాత సేఫ్‌గా ఉంటారని అన్నారు. అదే సినిమా ప్లాప్ అయితే మాత్రం నిర్మాతతో పాటు తమకు కూడా నష్టాలు తప్పవని అక్షయ్ పేర్కొన్నారు.సినిమా ప్లాప్ అయితే రెమ్యునరేషన్ తీసుకోను: అజయ్ దేవగణ్చిత్ర పరిశ్రమలో సినిమా బడ్జెట్ పెరుగుతుందని అజయ్ దేవగణ్ అభిప్రాయపడ్డారు. తాను నటించిన సినిమా విజయం సాధించకపోతే రెమ్యునరేషన్ తీసుకోనని ఆయన బహిరంగంగానే వెల్లడించారు. సినిమాకు వచ్చిన కలెక్షన్స్ ఆధారంగానే తాను పారితోషకం తీసుకుంటానని చెప్పుకొచ్చారు. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమతో పోలిస్తే బాలీవుడ్లో అంతగా ఐక్యత లేదని ఆయన అన్నారు. సౌత్ సినీ ఇండస్ట్రీ తమ నటీనటులకు మద్దతుగా ఉంటుందని ఆయన గుర్తుచేశారు. అయితే, అక్షయ్ కుమారు, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్లు మాత్రం మంచి స్నేహంగా ఉంటారని అజయ్ దేవగణ్ తెలిపారు. ఈ క్రమంలో ఒక కొత్త ప్రాజెక్ట్ కోసం తానే డైరెక్షన్ చేయబోతున్నట్లు అజయ్ దేవగణ్ తెలిపారు. ఇందులో అక్షయ్ కుమార్ ఒక ప్రధాన పాత్రలో కనిపిస్తారని రివీల్ చేశారు.#AkshayKumar and #AjayDevgn talks about their fees. They are right if Akki is producer and movies like padman and toilet did 300 cr+ worldwide definitely he will earn 100 cr plus per movie. And if he sign other producers movie like bmcm he might get nothing. Its proper business. pic.twitter.com/OVlpOj2FXe— axay patel🔥🔥 (@akki_dhoni) November 16, 2024 -
స్టార్ హీరో ఫ్యాన్స్ నన్ను టార్గెట్ చేశారు: మహిళా ఎంపీ
ప్రముఖ హీరో అభిమానులు.. తనని సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేశారని మహిళా ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆరోపణలు చేశారు. డబ్బులిచ్చి మరీ ఇలా చేయిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ విషయం కాస్త బాలీవుడ్లో చర్చనీయాంశమైంది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ చరిత్రలోనే పరమ చెత్త కంటెస్టెంట్.. హరితేజ ఏమందంటే?)మహారాష్ట్రలో నవంబర్ 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాయి. రీసెంట్గా లాతూర్‌లో జరిగిన ర్యాలీలో తన సోదరుడు, కాంగ్రెస్ అభ్యర్థి ధీరజ్ దేశ్‌ముఖ్ కోసం బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్‌ముఖ్ ప్రచారంలో పాల్గొన్నాడు. బీజేపీ మత రాజకీయాలపై కాస్త గట్టిగానే విమర్శలు చేశాడు. మతాన్ని భోదించే వాళ్లకు చెప్పండి, మేం ధర్మాన్ని జాగ్రత్తగా చూసుకుంటాం, వీటి బదులుగా మన జీవితాల్ని ప్రభావితం చేసే నిజమైన సమస్యల గురించి మాట్లాడుకుందని అన్నాడు.రితేశ్ దేశ్‌ముఖ్ వీడియోని ప్రియాంక చతుర్వేది ట్విట్టర్లో షేర్ చేశారు. దీంతో బీజేపీ సపోర్ట్ చేసే అక్షయ్ కుమార్ అభిమానులు ఈమెని టార్గెట్ చేశారు. ఈమెకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇదే విషయమై ప్రియాంక ట్వీట్ చేశారు. తనని లక్ష్యంగా చేసుకుని హ్యాష్‌ట్యాగ్‌లు వైరల్ చేసేందుకు కొందరికి డబ్బు చెల్లించారని.. అక్షయ్ కుమార్ ఫ్యాన్ క్లబ్, పెయిడ్ బ్లూ టిక్ ఫిల్మ్ ఇన్ఫ్లుయెన్సర్లకు హ్యాష్‌ట్యాగ్స్ ఇచ్చి మరీ తనపై ట్వీట్లు వేస్తున్నారని ఈమె ఆరోపించారు. అయితే ఇదంతా ఎవరు చేస్తున్నారో తనకు తెలుసని ఈమె చెప్పడం సంచలనంగా మారింది.(ఇదీ చదవండి: ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మపై కేసు)Today some Akshay Kumar fan club and paid blue tick film influencers have been given a hashtag and drafted tweets to target me.🥱 Easy to guess where it’s coming from thanks to grammatical errors in the drafted tweet bank 😂IYKYK— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) November 11, 2024 -
ఏడ్చుకుంటూ డైరెక్టర్‌తో గోడు వెల్లబోసుకున్న స్టార్ హీరో
ప్రతి నటుడి కెరీర్లో హిట్టు, ఫ్లాప్ రెండూ ఉంటాయి. సక్సెస్ సాధించినప్పుడు పొగిడేవారికన్నా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు విమర్శించేవారే ఎక్కువమంది ఉంటారు. అలా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ వరుస బాక్సాఫీస్ వైఫలయ్యాలతో బాధపడుతున్నప్పుడు ఓ నిర్మాత చులకనగా చూశాడట!ఆ మూవీతో హిట్ ట్రాక్1997లో అక్షయ్ నటించిన మిస్టర్ అండ్ మిసెస్ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత కూడా తన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి. 1999లో జాన్వార్ మూవీతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆనాటి సంగతులను జాన్వార్ డైరెక్టర్ సునీల్ దర్శన్ తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. 'అక్షయ్ సినిమాలు వరుసగా ఫెయిలవుతున్న సమయంలో జాన్వార్ తెరకెక్కించాం.సంపాదించిదంతా ధారపోశా..ఈ సినిమా షూటింగ్ దాదాపు 110 రోజుల్లో పూర్తి చేశాం. ఇందులో అక్షయ్ కళ్లతోనే ఎమోషన్స్ పలికించాడు. సినిమా కొనేందుకు ఏ డిస్ట్రిబ్యూటర్ ముందుకు రాలేదు. దీంతో నేను సంపాదించిదంతా ఈ చిత్రం కోసమే ధారపోశాను. సినిమా టైటిల్, కథ, సంగీతం అన్నీ సరిగ్గా కుదరడంతో ప్రమోషన్స్ కూడా బాగానే చేశాం. అయితే మా సినిమా కంటే ముందు అక్షయ్ నటించిన మూవీ ఒకటి రిలీజ్ కావాల్సి ఉంది. ఎక్కడా బ్యానర్లు వేయలేదు. ఎందుకని అక్షయ్ నిర్మాతను అడగ్గా.. నీ కోసం బిల్‌బోర్డు పెట్టేంత సీన్ లేదని చులకనగా మాట్లాడాడు. జాన్వార్ మూవీలోని ఒక దృశ్యంఏడ్చేసిన అక్షయ్ఆ విషయం నాతో చెప్తూ అక్షయ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అది చూసి చలించిపోయిన నేను జుహులో అక్షయ్ కుమార్ జాన్వార్ సినిమా బ్యానర్ పెద్దది పెట్టించాను. ఇకపోతే జాన్వార్ కొన్నిచోట్ల 100 రోజులు ఆడితే మరికొన్నిచోట్ల పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. దీంతో నేను నిరాశ చెంది నా నెక్స్ట్ సినిమాను హృతిక్ రోషన్‌తో తీస్తున్నానని అక్షయ్ పొరపడ్డాడు. నేను అలాంటిదేం లేదని క్లారిటీ ఇవ్వడంతో అతడితోనే 100 సినిమాలు తీయమని కోరాడు' అని చెప్పుకొచ్చాడు.కాంబినేషన్ రిపీట్జాన్వార్ హిట్ సాధించిన తర్వాత అక్షయ్- సునీల్ కాంబినేషన్లో ఏక్ రిష్తా, తలాష్: ద హంట్ బిగిన్స్, దోస్తి: ఫ్రెండ్స్ ఫరెవర్, మేరే జీవన్ సాతి చిత్రాలు తెరకెక్కాయి. అక్షయ్.. హా మైనే బీ ప్యార్ కియా, అండాజ్ సినిమాలకు దర్శన్ నిర్మాతగానూ వ్యవహరించాడు.చదవండి: వెండితెర అద్భుత దృశ్య కావ్యం...తొలి పాన్ ఇండియా చిత్రం -
'స్కై ఫోర్స్' టీమ్‌తో సర్జికల్ స్ట్రైక్ చేయనున్న బాలీవుడ్ స్టార్స్
బాలీవుడ్లో వరుస విజయాలతో ప్రముఖ నిర్మాత దినేష్ విజన్ దూసుకుపోతున్నారు. ఈ ఏడాదిలో విడుదలైన తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా, ముంజ్యా, స్త్రీ 2 చిత్రాలు బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. ఇదే ఊపుతో ఆయన తదుపరి బిగ్ ప్రాజెక్ట్లపైన కసరత్తు ప్రారంభించారు. దినేష్ విజన్ నిర్మాణ భాగస్వామ్యంతో 'స్కై ఫోర్స్, ఛావా' వంటి భారీ చిత్రాలను విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు.విక్కీ కౌశల్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న 'ఛావా' సినిమా ఈ ఏడాది డిసెంబర్ 6న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ భారీ అంచనాలను పెంచేసింది. మరోవైపు అక్షయ్ కుమార్, సారా అలీ ఖాన్, వీర్, నిమ్రత్ కౌర్ నటించిన 'స్కై ఫోర్స్' 2025లో విడుదల కానుంది. రిపబ్లిక్ డే కానుకగా ఈ చిత్రాన్ని జనవరి 24న విడుదల చేయనున్నారు. యాక్షన్, డ్రామా, భావోద్వేగాలతో పాటు థ్రిల్స్, బలమైన దేశభక్తి థీమ్‌తో నిండి ఉందని చిత్ర నిర్మాతలు దినేష్ విజన్, అమర్ కౌశిక్ టీమ్ పేర్కొంది. పాకిస్థాన్‌పై భారతదేశం జరిపిన మొదటి వైమానిక దాడి నేపథ్యంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఈ మూవీ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేస్తుందని వారు పేర్కొన్నారు.'స్కై ఫోర్స్' సినిమాలో VFX వర్క్ బాగా వర్కౌట్ అయింది. జాతీయ, ఆస్కార్ అవార్డు గెలుచుకున్న DNEG సంస్ధ వారు ఈ సినిమా VFX కోసం పనిచేశారు. ఈ చిత్రంలో ఉత్కంఠభరితమైన వైమానిక దృశ్యాలు అందరినీ మెప్పిస్తాయి. అక్షయ్ కుమార్, వీర్ మధ్య ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ స్టాండ్ అవుట్‌గా ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఈ మూవీ ట్రైలర్ క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. బాలీవుడ్లో ఎన్నటికి నిలిచిపోయేలా స్కై ఫోర్స్ చిత్రం ఉంటుందని మేకర్స్ పేర్కొన్నారు. -
OTT Movie Review: ఈ ఆట మామూలుగా ఉండదు
‘ఖేల్ ఖేల్ మే’... ‘పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్’ అనే ఇటలీ సినిమాకి హిందీ రీమేక్ ఇది. ఈ ఇటలీ సినిమా ఇప్పటికే రెండు సార్లు మలయాళంలో మరోపాతిక సార్లు వివిధ దేశాలలో... మొత్తంగా ప్రపంచ దేశాల్లో 27 సార్లు రీమేక్ అయింది. తొలుత ఈ చిత్రాన్ని ఇటలీ దర్శకుడుపావోలో 2016లో తీశారు. ఈ సినిమా ఎన్నో ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో చోటు సంపాదించుకోవడమే కాదు ఎన్నో అవార్డులు రివార్డులతోపాటు విమర్శకుల ప్రశంసలు కూడా సంపాదించుకుంది. ఇక ‘ఖేల్ ఖేల్ మే’ సినిమా విషయానికి వస్తే... ముదస్సర్ అజీజ్ అనే దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.అక్షయ్ కుమార్, తాప్సీ, ఫర్దీన్ ఖాన్, ప్రగ్యా జైస్వాల్ వంటి స్టార్స్ ఈ చిత్రంలో నటించారు. కథాపరంగా... ‘ఖేల్ ఖేల్ మే’ చాలా సింపుల్ మరియు సెన్సిబుల్ లైన్. మూడు జంటలు జైపూర్‌లో ఓ పెళ్ళిలో కలుస్తారు. పెళ్ళి ఉదయం కావడంతో రాత్రంతా నిద్రపోవడమెందుకని సరదాగా అందరూ ఓ ఆట ఆడదామనుకుంటారు. ఆ ఆటే ఈ సినిమా. ఆటేమిటంటే... ఉన్న ఆరుమంది కలిసి వాళ్ళ ఫోన్లు టేబుల్ మీద పెట్టి ఆట అయ్యేంతవరకు ఏ ఫోన్లో మెసేజ్ లేక కాల్ వచ్చినా అందరి ముందూ చదవాలి, చూపించాలి. ఇలా ఆట మొదలవగానే ఒక్కొక్కరికి వ్యక్తిగత మెసేజ్, కాల్స్ వస్తుంటాయి.దాంతో వాళ్ళపార్టనర్స్తో వాళ్లకు గొడవలు మొదలవుతాయి. ఈ చిత్రంలో రిషబ్ మాలిక్పాత్రను అక్షయ కుమార్ హుందాగా ΄ోషించారు. మిగిలిన వారందరూ వారిపాత్రలకు న్యాయం చేశారు. మామూలు సూపర్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ మించి ఉంటుంది ఈ సినిమా స్క్రీన్‌ప్లే. ఒక్కొక్కరి ఫోన్లో వ్యక్తిగత విషయాలు బయటపడుతూ ఉంటే దానికి వాళ్ళ టెన్షన్ ఒక ఎత్తయితే చూసే ప్రేక్షకుడు అంతకు మించి ఫీలవుతాడు. ఏదేమైతేనేం సినిమా మాత్రం మంచి ఎంటర్టైనర్. ఆఖరుగా ఒక్క మాట... ఈ సినిమా చూసేంతవరకు అయితే ఫర్వాలేదు, కానీ ఇంట్లో మాత్రం దీనిని ఆడవద్దని మనవి. ఎందుకంటే ఈ ఆట మామూలుగా ఉండదు. – ఇంటూరు హరికృష్ణ -
26 సార్లు రీమేక్ అయిన సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, తాప్సి ప్రధాన పాత్రలో మదస్సర్ అజీజ్ తెరకెక్కించిన కామెడీ డ్రామా చిత్రం 'ఖేల్ ఖేల్ మే'. టీ-సిరీస్ నిర్మించిన ఈ చిత్రం ఆగష్టు 15న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రేక్షకులను ఈ మూవీ ఆకట్టుకోలేకపోయింది. అయితే, ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీలో ఫర్దీన్ ఖాన్, వాణీ కపూర్, ప్రగ్యా జైస్వాల్, ఆదిత్య సీల్ కీలక పాత్రల్లో నటించారు.దసరా కానుకగా అక్టోబర్ 09 నుంచి 'ఖేల్ ఖేల్ మే' చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. సుమారు రూ. 100 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 60 కోట్ల వరకు రాబట్టింది.మూడు జంటల చుట్టూ తిరిగే కథతో, నవ్వులు పూయించే సన్నివేశాలతో ఉండే ఈ సినిమా ఇప్పటి వరకు ఏకంగా 26సార్లు రీమేక్ అయి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ చోటు సంపాదించుకుంది. 2016లో పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్ పేరుతో మొదట ఇటాలియన్లో విడుదలైంది. ఈ ఎనిమిదేళ్లలో 26సార్లు ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. ఫ్రెంచ్, కొరియన్, మాండరిన్, రష్యన్, ఐస్‌ల్యాండిక్, తెలుగులో (రిచి గాడి పెళ్లి), మలయాళం (12th మ్యాన్), కన్నడలో (లౌడ్ స్పీకర్) పలు భాషల్లో ఈ చిత్రం రీమేక్ చేశారు. హిందీలో 'ఖేల్ ఖేల్ మే'గా ఈ చిత్రం ఈ ఏడాది విడుదలైంది. -
ఓటీటీలో అక్షయ్ కుమార్ రీమేక్ సినిమా 'సర్ఫిరా'
అక్షయ్ కుమార్ లేటెస్ట్ మూవీ 'సర్ఫిరా' ఓటీటీలో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుధా కొంగర తెరకెక్కించిన ఈ చిత్రం జులై 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సూర్య ప్రధాన పాత్రలో నటించిన 'ఆకాశమే నీ హద్దురా' చిత్రానికి రీమేక్‌గా సర్ఫిరా బాలీవుడ్లో రిలీజ్ అయింది. ఇందులో రాధిక మదన్, పరేష్ రావల్ కీలక పాత్రలలో నటించారు. బాక్సాఫీస్ వద్ద 'సర్ఫిరా' చిత్రానికి నిరాశే మిగిలింది. అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదు. అయితే, సుమారు మూడు నెలల తర్వాత ఓటీటీలోకి విడుదల అవుతుంది.సర్ఫిరా చిత్రాన్ని ఈ చిత్రాన్ని అబండెన్షియా ఎంటర్టైన్మెంట్, సూర్య హోం బ్యానర్ 2డీ ఎంటర్టైన్మెంట్, కేప్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించాయి. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం భారీ నష్టాలను మిగిల్చింది. సుమారు రూ. 80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తే.. రూ. 30 కోట్లు మాత్రమే రాబట్టినట్లు బాక్సాఫీస్ లెక్కలు చెబుతున్నాయి. అయితే, ఇప్పుడు ఓటీటీలో సత్తా చాటేందుకు 'సర్ఫిరా' సినిమా వస్తుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో అక్టోబర్ 11 నుంచి 'సర్ఫిరా' స్ట్రీమింగ్ అవుతుందని అక్షయ్ కుమార్ అధికారికంగా ప్రకటించారు.ఎయిర్ డెక్కన్ సంస్థను స్థాపించి అందరికీ తక్కువ ధరకే విమాన ప్రయాణ సౌకర్యం అందించిన కెప్టెన్ గోపీనాథ్ జీవితంలోని పలు కీలక అంశాలను ఆధారం చేసుకుని సర్ఫిరా చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ఆశించనంతగా ప్రేక్షకులను మెప్పించలేదు. కానీ, ఇదే సినిమాకు మాతృక సూర్య నటించిన 'ఆకాశమే నీ హద్దురా' మాత్రం ఓటీటీలో భారీ విజయం సాధించింది.Apne sapnon ko poora karne ke liye, #Sarfira hona padta hai!Watch the dreams of a common man soar in Sarfira, streaming only on Disney+ Hotstar from October 11.@DisneyPlusHS pic.twitter.com/gLOZ2oXCtw— Akshay Kumar (@akshaykumar) September 26, 2024 -
శ్రీలంకవైపు ఇండియన్ సినిమా చూపు
శ్రీలంక అడవుల్లో రిస్కీ ఫైట్స్ తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి విజయ్ దేవరకొండ ఇటీవల శ్రీలంక వెళ్లొచ్చారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఆ మధ్య శ్రీలంకలో జరిగింది. అక్కడ ఓ భారీ రిస్కీ ఫైట్‌ని చిత్రీకరించారని సమాచారం. అటు బాలీవుడ్ వైపు వెళితే... అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో ప్రియదర్శన్ దర్శకత్వంలో రానున్న హారర్ కామెడీ చిత్రంలోని కీలక సన్నివేశాలను శ్రీలంకలో చిత్రీకరిస్తున్నారు. ఇవి కాకుండా కొన్ని దక్షిణాసియా చిత్రాలు కూడా లంకలో షూటింగ్స్ జరుపుకుంటున్నాయి.లంకలో ప్యారడైజ్మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై ప్రముఖ దర్శకుడు మణిరత్నం సమర్పణలో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘ప్యారడైజ్’ను పూర్తిగా శ్రీలంకలోనే చిత్రీకరించారు. మలయాళ నటుడు రోషన్ మ్యాథ్యూ ఇందులో హీరోగా నటిస్తే ప్రముఖ శ్రీలంక దర్శకుడు ప్రసన్న వితనకే డైరెక్ట్ చేశారు. ఇక మమ్ముట్టి, మోహన్ లాల్ కాంబినేషన్ లో త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న మలయాళం మూవీని 30 రోజుల పాటు శ్రీలంకలోనే షూట్ చేయనున్నురు. ఈ చిత్రానికి లంక ప్రభుత్వం ఎంతటిప్రాధాన్యత ఇచ్చిందంటే నిర్మాత, దర్శకుడితో ఆ దేశ ప్రధానమంత్రి నినేష్ గుణవర్దెన నేరుగా చర్చలు జరిపారు. ఇక ఫ్యూచర్ప్రాజెక్ట్స్కు షూటింగ్ లొకేషన్ గా శ్రీలంకను ఎంచుకోవాలని మలయాళ ఫిల్మ్ ప్రోడ్యూసర్స్ అసోసియేషన్ భావిస్తోంది.ఇండియన్ సినిమాకి రెడ్ కార్పెట్ఒకప్పుడు శ్రీలంకలో సినిమా షూటింగ్స్ వ్యవహారం ఓ ప్రహసనంలా సాగేది. దేశ, విదేశీ సినిమాల షూటింగ్స్ అనుమతుల కోసం 41 ప్రభుత్వ విభాగాలను సంప్రదించాల్సి వచ్చేది. దీంతో భారత్‌తో పాటు ఇతర దేశాల చిత్ర నిర్మాతలు లంక లొకేషన్స్ కు దూరమవుతూ వచ్చారు. దీనికి తోడు 2022 నాటి ఆర్థిక సంక్షోభం ఆ దేశాన్ని రోడ్డున పడేసింది. అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో దేశాన్ని పునర్నిర్మించడం ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారింది. అప్పటివరకు టూరిస్ట్ డెస్టినేషన్ గా ఉన్న శ్రీలంకకు పర్యాటకులు రావడం కూడా తగ్గిపోయింది.దేశాన్ని గాడిలో పెట్టేందుకు ఎన్నో మార్గాలు అన్వేషించిన లంక పాలకులకు భారతీయ సినీ రంగుల ప్రపంచం జీవనాడిలా కనిపించింది. మళ్లీ పర్యాటకులను ఆకర్షించడంతో పాటు సినిమా షూటింగ్స్‌తో దేశాన్ని కళకళలాడేలా చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. సినిమా షూటింగ్స్ కోసం తమ దేశంలో అడుగుపెట్టే ఎవరికైనా సింగిల్ విండో ద్వారా అనుమతులు మంజూరు చేసే విధానాన్నిప్రారంభించింది. ముఖ్యంగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్రాలకు సంబంధించిన షూటింగ్స్ కోసం అనుమతులను వేగవంతం చేసింది. భారతీయ సినీ ప్రముఖులకు అక్కడి టూరిజం ప్రమోషన్ బ్యూరో రెడ్ కార్పెట్ పరిచింది. దీంతో ఇండియన్ మూవీ షూటింగ్స్‌కు శ్రీలంక కేరాఫ్ అడ్రెస్‌గా మారిపోయిందిఆర్థిక అస్త్రంగా...ఫిల్మ్ టూరిజాన్ని లంక ప్రభుత్వం ఆర్థిక అస్త్రంగా ఎంచుకోవడం వెనక మరో కారణం కూడా ఉంది. ఇండియన్ మూవీస్ అంటే సింహళీయుల్లో విపరీతమైన క్రేజ్. బాలీవుడ్‌తో పాటు ఇతర భారతీయ చిత్రాలు లంక థియేటర్స్‌లో నిత్యం స్క్రీనింగ్ అవుతాయి. షూటింగ్స్ కోసం భారతీయ సినీ ప్రముఖులు లంక బాటపడితే దేశ పర్యాటక రంగానికి కూడా కొత్త ఊపు వస్తుంది. విదేశీ మారక ద్రవ్యం కూడా పెరుగుతుంది. లంక ప్రభుత్వం వేసుకున్న ప్రణాళికకు తగ్గట్టుగానే షూటింగ్స్ కోసం ఇండియన్ డైరెక్టర్స్,ప్రోడ్యూసర్స్ లంక వైపు చూస్తున్నారు. ఆ దేశం కల్పించే ప్రత్యేక సదుపాయాలను ఉపయోగించుకుంటూ అందమైన లంక లొకేషన్స్ ను షూటింగ్ స్పాట్స్‌గా మార్చేశారు. ఒక రకంగా లంక ఎకానమీకి భారతీయ చిత్ర పరిశ్రమ వెన్నెముకగా మారిపోయింది. – ఫణికుమార్ అనంతోజు శ్రీలంక పిలుస్తోంది.... రారమ్మంటోంది.... అందుకే ఈ మధ్య కాలంలో ఇండియన్ ఫిల్మ్స్ శ్రీలంకకు క్యూ కడుతున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్... ఇలా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ శ్రీలంక వైపు చూస్తోంది. సినిమా షూటింగ్స్ కోసం ఏకంగా శ్రీలంక ప్రధానమంత్రితో కూడా భారతీయ సినీ నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు. ఒకప్పుడు విదేశాల్లో షూటింగ్స్ అంటే అమెరికాతో పాటు యూరప్ దేశాల పేర్లు ఎక్కువగా వినిపించేవి. కానీ ఇప్పుడు ఇండియన్ సినిమా రూటు మార్చింది. ఆ విశేషాల్లోకి...పచ్చందనమే... పచ్చందమనే పచ్చదనమే అన్నట్లు... శ్రీలంక గ్రీనరీతో అందంగా ఉంటుంది. పాటల చిత్రీకరణకు బెస్ట్ ప్లేస్. ఫైట్లు తీయడానికి దట్టమైన అడవులు ఉండనే ఉన్నాయి. అలాగే అబ్బురపరిచే చారిత్రక కట్టడాలూ, కనువిందు చేసే సముద్ర తీరం ఉన్నాయి. వీటికి తోడు భారతీయులకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుబంధం ఉండటంతో ఇండియన్ ఫిల్మ్ మేకర్స్‌ను తమ దేశంవైపు తిప్పుకుంటోంది లంక సర్కార్. శ్రీలంకలో గతంలోనూ షూటింగ్స్ జరిగాయి. అక్కడ షూట్ చేయడం కొత్త కాకపోయినా ఆ దేశం భారతీయ చిత్ర నిర్మాణాలకు ఇప్పుడు సింగిల్ డెస్టినేషన్ గా మారిపోయిందని అనొచ్చు. 2022 నాటి ఆర్థిక సంక్షోభం నుంచి ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేకపోతున్న శ్రీలంక గతంలో ఎప్పుడూ లేని విధంగా ఫిల్మ్ టూరిజాన్ని ్రపోత్సహిస్తూ తమ దేశ ఎకానమీకి ఊతమిచ్చే ప్రయత్నాలు చేస్తోంది. -
అక్షయ్ కుమార్ బర్త్ డే.. కన్నప్ప టీం స్పెషల్ పోస్టర్!
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న చిత్రం కన్నప్ప. ఈ సినిమాను ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు.అయితే ఈ రోజు కన్నప్ప నటుడు అక్షయ్ కుమార్ బర్త్ డే కావడంతో చిత్రబృందం విషెస్ తెలియజేసింది. ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. చేతికి రుద్రాక్ష మాల ధరించిన ఫోటోను అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా.. ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్‌బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం లాంటి స్టార్స్ సైతం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శివ భక్తుడైన కన్నప్ప కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో రూపొందుతోంది.A Heartfelt Birthday wish to @akshaykumar! 🎉🙏 Your portrayal of Lord Shiva in this film is a testament to your unwavering dedication. Team #Kannappa🏹 celebrates you today and always.🌟 #HappyBirthdayAkshayKumar #HarHarMahadevॐ #TeamKannappa@themohanbabu @ivishnumanchu… pic.twitter.com/d6jqUpI8Z1— Kannappa The Movie (@kannappamovie) September 9, 2024 -
Bollywood Stars: అక్కడ హీరో.. ఇక్కడ విలన్
బాలీవుడ్ నుంచి ఎక్కువగా హీరోయిన్లు టాలీవుడ్‌కి వస్తుంటారు. ఈసారి పలువురు నటులు తెలుగు తెరకు పరిచయం కానున్నారు. ఈ ఏడాది ఇప్పటికే కొందరు నటులు, నటీమణులు కనిపించగా... త్వరలో రానున్న బాలీవుడ్ స్టార్స్ గురించి తెలుసుకుందాం. కన్నప్పతో ఎంట్రీబాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హిందీలో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా దూసుకెళుతున్నారు. ఆయన తొలిసారి తెలుగులో ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘కన్నప్ప’. హీరో మంచు విష్ణు కలల ప్రాజెక్టుగా ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రమిది. ఈ మూవీకి ‘మహాభారత్’ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీలో పలు భాషలకు చెందిన స్టార్ హీరోలు, ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. ప్రభాస్, మోహన్‌బాబు, మోహన్ లాల్, శరత్‌కుమార్, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్, మధుబాల, ప్రీతీ ముకుందన్ వంటి వారు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ‘కన్నప్ప’ చిత్రంలో అక్షయ్ కుమార్ కీలకమైన అతిథి పాత్రలో నటించారు. ఇప్పటికే తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ కోసం హైదరాబాద్‌కి వచ్చి, తన పాత్ర షూటింగ్‌ని అక్షయ్ కుమార్ పూర్తి చేసి వెళ్లారు. అక్షయ్ వంటి స్టార్ హీరో ‘కన్నప్ప’లో భాగస్వామ్యం కావడంతో ఈ సినిమాపై బాలీవుడ్‌లోనూ ఆసక్తి నెలకొంది. అయితే అక్షయ్ కుమార్ ఏ పాత్రలో నటించారు? అనే విషయాన్ని చిత్రయూనిట్ ఇప్పటి వరకూ స్పష్టం చేయలేదు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో రూపొందుతోన్న ‘కన్నప్ప’ డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓమీ భాయ్బాలీవుడ్ సీరియల్ కిస్సర్‌గా పేరు తెచ్చుకున్నారు ఇమ్రాన్ హష్మీ. హీరోయిన్లతో ముద్దు సన్నివేశాలు, రొమాంటిక్ సన్నివేశాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్‌ని సొంతం చేసుకున్న ఆయన తొలిసారి తెలుగులో నటిస్తున్న చిత్రం ‘ఓజీ’. పవన్ కల్యాణ్, ప్రియాంకా అరుళ్ మోహన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు ఇమ్రాన్ హష్మీ. మార్చిలో ఇమ్రాన్ హష్మీ పుట్టినరోజుని పురస్కరించుకుని, ఈ చిత్రంలో ఆయన చేస్తున్న ఓమీ భాయ్ పాత్రని పరిచయం చేస్తూ, ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. తన లుక్‌పై ఇమ్రాన్ హష్మీ ‘ఓజీ’ సినిమాలోని ఓ డైలాగ్‌తో స్పందించారు. ‘గంభీరా... నువ్వు తిరిగి బాంబే వస్తున్నావని విన్నా. ్ర΄ామిస్... ఇద్దరిలో ఒకరి తలే మిగులుతుంది’ అంటూ ట్వీట్ చేశారాయన. ఇక గూఢచారితోనూ తెరపై కనిపించనున్నారు ఇమ్రాన్. అడివి శేష్ నటించిన హిట్ మూవీ ‘గూఢచారి’ (2018)కి సీక్వెల్‌గా రూపొందుతోన్న చిత్రం ‘జీ 2’ (గూఢచారి 2). వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, అనీల్ సుంకర, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోనూ ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నారు. ఆయన నటిస్తున్న రెండో తెలుగు చిత్రం ‘జీ 2’. ఈ మూవీలో ఆయన ఏ పాత్రలో నటిస్తున్నారు? అనేది తెలియాల్సి ఉంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమా రిలీజ్ కానుందని టాక్. దేవరతో జోడీఅతిలోక సుందరి శ్రీదేవి తెలుగు ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ గుర్తుండి΄ోయే ΄ాత్రలు చేశారు. ఆమె కుమార్తె జాన్వీ కపూర్ బాలీవుడ్లో సినిమాలు చేస్తున్నారు. అయితే ఆమె తెలుగు సినిమాల్లో నటిస్తే చూడాలని ఉందని శ్రీదేవి అభిమానులు ఎప్పటి నుంచో వేచి చూస్తున్నారు. వారి నిరీక్షణ ఫలించనుంది. ‘దేవర’ చిత్రం ద్వారా తెలుగులో హీరోయిన్గా పరిచయమవుతున్నారు జాన్వీ కపూర్. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూ΄÷ందుతోంది. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతోంది. ఈ చిత్రం నుంచి విడుదలైన ‘చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు..’పాటలో జాన్వీ కపూర్ ఫుల్ గ్లామరస్‌గా కనిపించడంతో ఈ సాంగ్ ఇప్పటికే ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది. మరి సినిమా విడుదల తర్వాత జాన్వీకి ఎంతమంది ఫ్యాన్స్ అవుతారో వేచి చూడాలి. కాగా ‘దేవర’ తొలి భాగం సెప్టెంబరు 27న విడుదల కానుంది. ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే జాన్వీకి మరో తెలుగు సినిమాలో నటించే అవకాశం వచ్చింది. వెండితెరపై చిరంజీవి–శ్రీదేవిలది సూపర్ జోడీ. వారి వారసులు రామ్ చరణ్– జాన్వీ కపూర్ తొలిసారి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆర్సీ 16’ (వర్కింగ్ టైటిల్). ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. తెలుగులో ఆమెకు ఇది రెండవ చిత్రం. ఒకప్పటి హిట్ జోడీ అయిన చిరంజీవి–శ్రీదేవిల వారసులు రామ్‌చరణ్–జాన్వీ కపూర్ నటిస్తున్న ఈ ΄ాన్ ఇండియా సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో, సినీ అభిమానుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. వీరమల్లుతో పోరాటం గత కొన్నేళ్లుగా బాబీ డియోల్ కెరీర్ ఆశాజనకంగా సాగడం లేదు. అయితే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ‘యానిమల్’ (2023) సినిమా తర్వాత ఈ బాలీవుడ్ నటుడి క్రేజ్ ఒక్కసారిగా ఊపందుకుంది. ఆ సినిమాలో ఆయన నటించిన విలన్ పాత్రకి అద్భుతమైన పేరు రావడంతో విపరీతమైన డిమాండ్ పెరిగింది. హిందీలోనే కాదు.. తెలుగు, తమిళ భాషల నుంచి కూడా అవకాశాలు వెతుక్కుంటూ వెళుతున్నాయి. ఆయన నటిస్తున్న తొలి స్ట్రయిట్ తెలుగు చిత్రం ‘హరి హర వీరమల్లు’. పవన్ కల్యాణ్, నిధీ అగర్వాల్ జంటగా నటిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ మూవీ ప్రారంభమైంది. అయితే ఈ ప్రాజెక్టు ఆలస్యం అవుతుండటంతో ఆయన తప్పుకున్నారట. దీంతో నిర్మాత ఏఎమ్ రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారని సమాచారం. ఏఎమ్ రత్నం, ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల శకం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబరులో విడుదల కానుందని టాక్. ఇదిలా ఉంటే బాలకృష్ణ హీరోగా బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న ‘ఎన్బీకే 109’ (వర్కింగ్ టైటిల్) సినిమాలోనూ బాబీ డియోల్ నటిస్తున్నారు.బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూడా ప్రస్తుతం తెలుగు సినిమాలపై దృష్టి పెట్టారు. 1998లో విడుదలైన హీరో నాగార్జున ‘చంద్రలేఖ’ సినిమాలో తొలిసారి అతిథి పాత్రలో కనిపించారు సంజయ్ దత్. దాదాపు ఇరవైఆరేళ్ల తర్వాత ఆయన పూర్తి స్థాయిలో నటించిన తెలుగు సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదలైంది. విలన్ బిగ్ బుల్ పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకున్నారు సంజయ్ దత్. ఆయన నటిస్తున్న మరో తెలుగు చిత్రం ‘రాజా సాబ్’. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలోనూ ఆయన కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ‘ఆదిపురుష్’ (తెలుగు–హిందీ) సినిమాతో తెలుగులో పరిచయమైన సైఫ్ అలీఖాన్ ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తొలి భాగం జూన్ 27న విడుదలైంది. ఈ సినిమా రెండో భాగంలోనూ దీపిక నటించనున్నారు. వెర్సటైల్ యాక్టర్‌గా పేరొందిన నవాజుద్దీన్ సిద్ధిఖీ కూడా ఈ ఏడాది ‘సైంధవ్’ చిత్రం ద్వారా తెలుగుకి పరిచయమయ్యారు. వికాస్ మాలిక్‌గా విలన్ పాత్రలో తనదైన శైలిలో అలరించారాయన. ఇలా ఈ ఏడాది ఇప్పటికే పలువురు బాలీవుడ్ స్టార్స్ తెలుగుకి పరిచయం కాగా... మరెందరో రానున్నారు. -
అక్షయ్ కుమార్ పేరెంటింగ్ స్టైల్!..తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సినవి..!
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన స్క్రీన్‌పై యాక్షన్ హీరో అయినా ఆఫ్ స్క్రీన్‌పై మాత్రం ఓ మంచి తండ్రిగా కుటుంబంతో గడిపేందుకే ప్రాధాన్యత ఇస్తాడు. తన తల్లిదండ్రులు ఎలాంటి విలువలు నేర్పారో అవే తన పిల్లలకు నేర్పించానని సగర్వంగా చెబుతుంటాడు. ఇక్కడ అక్షయ్ దంపతుల నుంచి ప్రతి తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన కీలక విషయాలేంటో సవివరంగా చూద్దాం..!.చెఫ్‌గా మొదలైన అక్షయ్ కుమార్ ఇప్పుడు బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ స్టార్‌లో ఒకడిగా చెలామణి అవుతున్నాడు. ఆయన ఎన్నో వెవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాగే బుల్లితెరపై యాంకర్‌గా ఫియర్ ఫ్యాక్టర్ సిరీస్‌తో అలరించాడు కూడా. అలాంటి ఆయన ఓ ఫ్యామిలీ మ్యాన్‌గా ఎంతలా ఉంటాడో చాలామందికి తెలియదు. ఆఫ్ స్క్రీన్‌పై తన భార్య ట్వింకిల్ ఖన్నా, ఇద్దరు పిల్లలతో టైం స్పెండ్ చేసేందుకే ఇష్టపడతాడు. ఆయనకు మొదటి సంతానంగా 21 ఏళ్ల ఆరవ్, రెండో సంతానంగా 11 ఏళ్ల నితారా అనే కుమార్తె ఉంది. ఆయన ఓ తండ్రిగా, భర్తగా ఏం చేయాలో అవన్నీ పుల్‌ఫిల్ చేస్తుంటాడు. అతడి పేరెంటింగ్ నుంచి నేర్చుకోవాల్సినవి ఇవే..సమాయన్ని కేటాయించడం..నటుడిగా ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా పిల్లల కోసం సమయం కేటాయిస్తాడు. వాళ్లతో కలిసి వాకింగ్ లేదా పార్కులో గడుపుతాడు. పిల్లలు కూడా ఫిట్నెస్తో ఉండేలా కేర్ తీసుకుంటాడు. కాస్త విరామం దొరికిన పిల్లలతో గడిపేందుకు ప్రాధాన్యత ఇస్తాడు.కలిసి చదవడం..తన కూతురు నితారా చిన్నప్పటి నుంచి ఆమె చదువు బాధ్యత అంతా అక్షయ్‌నే చూసుకున్నాడు. తనతో కలిసి కొత్త పదాలు నేర్చుకోవడం, చదవడం, వినడం వంటివి చేస్తానని పలుమార్లు ఇంటర్వ్యూలలో చెప్పారు అక్షయ్. అలాగే ఆమెకు కథ చెప్పే నైపుణ్యం నేర్పించడమే గాక, కొన్ని విలువలను కథల రూపంలో అర్థమయ్యేలా వివరించేవాడినని అంటారు అక్షయ్. కూతురికి తండ్రిగా ఉండటాన్ని గర్వంగా ఫీలవుతాడు..కూతురికి తండ్రి అవ్వటం సిగ్గుపడే విషయం కాదని అంటాడు. తన కూతురు నితారాతో కలిసి డాల్ హౌస్‌లను నిర్మించడం, ఆమె క్రియేటివిటీని తన కాలి గోళ్లపై నెయిల్ పాలిష్ రూపంలో ఆమె చేత వేయించుకుంటాడు. పిల్లలు ఎలా ఉండాలనుకుంటారో అలానే ఫ్రీగా ఉండనిస్తా..ఎట్టిపరిస్థితుల్లోనూ బలవంతం చెయ్యను. కొన్ని విషయాల్లో మాత్రం హద్దులు పెడతాను, స్ట్రిక్ట్‌గా ఉండాల్సిన వాటిల్లో ఉంటానని నొక్కి చెబుతున్నారు అక్షయ్. పిల్లలకు సరైన విలువలను నేర్పడం అత్యంత ముఖ్యం. అవే తన తల్లిదండ్రులు తనకు నేర్పించారని తాను కూడా వారి బాటనే అనుసరిస్తున్నానని సగర్వంగా చెప్పారు. జీవిత పాఠాలు..అక్షయ్ తన పిల్లలు కష్టపడి సంపాదించటం గురించి, దాని ప్రాముఖ్యతను తెలుసుకునేలా చూసుకుంటానని అన్నారు. కొడుకు ఆరవ్‌కి కష్టం విలువ నేర్పించాడు. అలాగే నైతికత అంటే చెబుతానని, కష్టపడి పనిచేస్తేనే ప్రత్యేక హక్కు వస్తుందని వివరిస్తానని చెప్పారు. ఇటీవల తాము సెలవుల్లో విహార యాత్రకు వెళ్లాలనుకున్నాం. అయితే తన కొడుకు ఆరవ్ బిజినెస్ క్లాస్‌లో వెళ్లాలనుకున్నాడు. అందుకోసం కష్టపడి మంచి మార్కులు తెచ్చుకుంటేనే తల్లిదండ్రులను ఖరీదైన కోరికలు కోరుకునే హక్కు ఉంటుందని చెప్పాను. ఆరవ్ కూడా దాన్నే నిజం చేస్తూ..ఫస్ట్-డిగ్రీ బ్లాక్ బెల్ట్ సాధించి తన కోరిక నెరవేర్చుకున్నాడని వివరించారు. ఇలాంటివే పిల్లలకు నేర్పించాలే తప్ప ఏది అడిగితే అదే తెచ్చే తండ్రిలా పెంచి పిల్లలను భారంగా మార్చుకోవద్దని సూచిస్తున్నారు అక్షయ్. అలాగే కృజ్ఞతతో కలిగి ఉండటం, బాధ్యతయుతంగా వ్యవహరించడం వంటివి తెలియజేయాలని చెబుతున్నారు. పనులు పంచుకోవడం..ప్రతి ఒక్కరికీ కుటుంబ సమయం ముఖ్యం. పిల్లలు తమ తల్లితో సమయం గడపేలా తండ్రే బాధ్యత తీసుకోవాలి. అందుకే తాను కొన్ని ఇంటి పనుల్లో బాధ్యత తీసుకుంటానని అన్నారు. తద్వారా ఇంటి భారమంతా మహిళలపైనే పడదు. అలాగే ఇంట్లో వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుందని అన్నారు. పిల్లలను తన భార్య ట్వింకిల్ ఖన్నా చాలా బాగా పెంచిందన్నారు. నిజానికి వివాహం తర్వాత ఆమె నన్ను కూడా తల్లిలా బాగా చూసుకుందని ఆనందంగా చెప్పారు. ఇక్కడ తల్లిదండ్రులుగా పిల్లలకు కలిసి నేర్పించాల్సిన విషయాలు, విలువలను ఇరువురు సఖ్యతతో నేర్పిస్తేనే..పిల్లలు మంచిగా పెరుగుతారని చెప్పకనే చెప్పారు.(చదవండి: నోట్లో వేసుకుంటే కరిగిపోయే 'పైన్ నట్స్'..ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!) -
స్టార్ హీరో అన్నదానం.. ప్లేటులో వడ్డించి మరీ..
అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదంటారు. ఒకరి కడుపు నింపితే వచ్చే ఆనందం వెలకట్టలేనిది. తాజాగా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ముంబైలోని తన ఇంటి ఆవరణలో అన్నదానం చేసి మంచి మనసు చాటుకున్నాడు. ముఖానికి మాస్కు ధరించిన ఆయన పలువురికీ ప్లేటులో భోజనం వడ్డించి ఇచ్చాడు.మా మనసులు గెలుచుకున్నావ్ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు అక్షయ్‌ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. అక్కి అన్న.. నువ్వు మా మనసులు గెలుచుకున్నావ్, నీది ఎంత మంచి మనసో అని కామెంట్లు చేస్తున్నారు.రెండు ఫ్లాప్స్కాగా అక్షయ్ కుమార్‌కు కరోనా సోకగా ఇటీవలే దాని నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఈయన ప్రధాన పాత్రలో నటించిన ఖేల్ ఖేల్ మే సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. ఇందులో వాణి కపూర్, తాప్సీ, అమ్మీ విర్క్, ఫర్దీన్ ఖాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ ఏడాది అక్షయ్.. బడే మియా చోటే మియా, సర్ఫిరా చిత్రాలతో అలరించాడు. అయితే ఈ రెండూ ఫ్లాప్ కావడంతో ప్రస్తుతం అతడు ఖేల్ ఖేల్ మే సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. Video: @akshaykumar sir spotted feeding needy people in Mumbai today. pic.twitter.com/HDk2ta7X7g— Akshay Kumar 24x7 (@Akkistaan) August 6, 2024 -
'ఖేల్ ఖేల్ మే' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మెరిసిన వాణి కపూర్ , ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)
-
మోసపోయా.. ఇప్పటికీ నాకు పారితోషికం చెల్లించలేదు: స్టార్ హీరో
రెమ్యునరేషన్.. సమయానికి ఇవ్వకుండా నిర్మాతలు వేధిస్తున్నారని పలువురు సెలబ్రిటీలు సందర్భం వచ్చినప్పుడల్లా చెప్తూనే ఉన్నారు. కొందరైతే డబ్బు ఇవ్వకుండా ఎగ్గొట్టారని, ఎన్నిసార్లు వారి చుట్టు తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. అందుకు తాను కూడా మినహాయింపు కాదంటున్నాడు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్.మోసపోయా..ఈయన ప్రధాన పాత్రలో నటించిన సర్ఫిరా మూవీ థియేటర్లలో ఆడుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అక్షయ్ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'నేను కొన్నిసార్లు మోసపోయాను. అలాంటప్పుడు ఏం చేస్తానంటే వారితో మాట్లాడటం మానేస్తాను. కొందరు నిర్మాతలు నాకు ఇవ్వాల్సిన పారితోషికాన్ని పూర్తిగా చెల్లించలేదు. ఇది మోసమే కదా! ఇప్పటికీ నాకు అందాల్సిన డబ్బు చేతికి రాలేదు' అన్నాడు.ఆ రోజే రిలీజ్కాగా అక్షయ్ ప్రస్తుతం ఖేల్ ఖేల్ మే సినిమా చేస్తున్నాడు. తాప్సీ పన్ను, వాణి కపూర్, అమ్మీ విర్క్, ఆదిత్య సీల్, ప్రగ్యా జైస్వాల్, ఫర్దీన్ ఖాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. అదే రోజు స్త్రీ 2 కూడా రిలీజవుతోంది.చదవండి: Pranitha: రెండోసారి గుడ్ న్యూస్ చెప్పిన హీరోయిన్ -
బాక్సాఫీస్ డిజాస్టర్స్.. ఆకలిని పెంచుతాయి: స్టార్ హీరో
సెట్లో పని చేసే బాయ్స్ నుంచి హీరోలదాకా అందరూ సినిమా కోసం ఎంతగానో కష్టపడతారు. ప్రేక్షకులు ఆనందించేలా ఉండాలని తహతహలాడతారు. కానీ అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేవు. కొన్నిమాత్రమే సినీప్రియుల మెప్పు పొందుతాయి. అలా ఇటీవలి కాలంలో మూవీ లవర్స్‌ను ఆకట్టుకోలేకపోతున్నాడు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్. వందల కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టే ఈ హీరో ఈ మధ్య కాలంలో హాఫ్ సెంచరీ కూడా కొట్టలేదు. వరుస వైఫల్యాలుఈ ఏడాది ఆరంభంలో వచ్చిన బడే మియా చోటే మియా, లేటెస్ట్ రిలీజ్ సర్ఫిరా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో దారుణంగా విఫలమయ్యాయి. వరుస అపజయాలతో అక్షయ్ ఒకింత నిరాశకు లోనయ్యాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'ప్రతి సినిమా వెనక ఎంతో కష్టం దాగి ఉంటుంది. అలాంటిది ఏదైనా చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయిందంటే ఎవరికైనా మనసు ముక్కలవుతుంది.ఫెయిల్యూర్స్‌తో బాధకానీ ఈ ఫెయిల్యూర్స్ గుణపాఠాలు నేర్పుతాయి. సక్సెస్ ఎంత అవసరమనేది గుర్తుచేస్తాయి. విజయాన్ని అందుకోవాలనే ఆకలిని పెంచుతాయి. అదృష్టవశాత్తూ కెరీర్ ప్రారంభంలోనే జయాపజయాలను ఎలా డీల్ చేయాలనేది నేర్చుకున్నాను. అయినప్పటికీ ఫెయిల్యూర్స్ మనసుకు కొంత బాధను, మనపై కొంత ప్రభావాన్ని కలుగజేస్తాయి. అయినా తగ్గనుఅయినా మనం సినిమా తలరాతను మార్చలేం. దాని ఫలితాలు మన చేతిలో ఉండవు. కేవలం సినిమా కోసం ఎంత కష్టపడతాం, ఎంత అద్భుతంగా మలుస్తామనేది మాత్రమే మన నియంత్రణలో ఉంటుంది' అని చెప్పుకొచ్చాడు. సర్ఫిరా విషయానికి వస్తే.. సూరరై పోట్రు (తెలుగులో ఆకాశమే నీ హద్దురా) అనే తమిళ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం ఇప్పటిదాకా రూ.21 కోట్లు రాబట్టింది.చదవండి: హీరో బర్త్‌డే.. సంతోషమే లేకుండా పోయింది! -
టికెట్ కొంటే ఛాయ్, సమోసా ఫ్రీ.. కానీ సినిమాకి జనాలు రావట్లేదు!
ఇప్పుడు కొత్త సినిమాల పరిస్థితి ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా తయారైంది. కంటెంట్ ఉంటేనే చూస్తున్నారు లేదంటే ఎంత పెద్ద స్టార్ హీరో మూవీ అయినా సరే నిర్దాక్షిణ్యంగా పక్కనబెట్టేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ లేటెస్ట్ మూవీకి తాజాగా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఎంతలా అంటే ఏకంగా మల్టీఫ్లెక్స్‌లు టికెట్ కొంటే ఫుడ్ ఫ్రీ ఇచ్చేంతలా!(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)అక్షయ్ కుమార్ లేటెస్ట్ మూవీ 'సర్ఫిరా'.. మూడు రోజుల క్రితం థియేటర్లలోకి వచ్చింది. అప్పుడెప్పుడో కరోనాలో నేరుగా ఓటీటీలో రిలీనైన సూర్య 'ఆకాశమే నీ హద్దురా' చిత్రానికి రీమేక్ ఇది. ఆల్రెడీ రీమేక్‌ని చాలామంది చూసేయడం, రిలీజ్‌కి ముందు సరైన బజ్ లేకపోవడం 'సర్ఫిరా'కి ఘెరమైన మైనస్ అయ్యాయి. ఇదంతా వసూళ్లపై ప్రభావం పడింది.ఒకప్పుడు వందల కోట్ల వసూళ్లు చూసిన అక్షయ్ కుమార్.. ఇప్పుడు 'సర్ఫిరా'తో మూడు రోజుల్లో కేవలం రూ.12 కోట్లు కలెక్షన్స్ రావడం షాకయ్యేలా చేసింది. దీంతో సినిమాని ప్రదర్శిస్తున్న థియేటర్ల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. దీంతో పీవీఆర్ మల్టీఫ్లెక్స్.. టికెట్ కొని 'సర్పిరా' చూస్తే సమోసా, ఛాయ్ ఫ్రీగా ఇస్తామని ఆఫర్ పెట్టడం చూస్తుంటే జనాలు ఎలా మొహం చాటేస్తున్నారో అర్థమవుతోంది.(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరంతో పెళ్లి... తేదీ రివీల్ చేసిన హీరోయిన్)Chase your hunger away with this totally Sarfira combo! ☕️🎬 This yummy combo includes 2 samosas and tea. Plus, get a free merchandise with your order. Now screening at PVR INOX!Book now: https://t.co/WyiWtS0CBM*T&Cs Apply #AkshayKumar #RadhikaMadan #Sarfira #PareshRawal pic.twitter.com/f7OUtXVia2— P V R C i n e m a s (@_PVRCinemas) July 14, 2024 -
గత పదిహేనేళ్లలో ఇలాంటి కలెక్షన్లు ఎవ్వరూ చూసుండరు..
-
పేరుకు పెద్ద స్టార్ కలెక్షన్స్ మాత్రం నిల్..
-
‘హౌస్‌ఫుల్ ’ఫ్యామిలీలోకి సంజయ్‌దత్
హిందీ హిట్ ఫ్రాంచైజీ ‘హౌస్‌ఫుల్’లో ‘హౌస్‌ఫుల్ 5’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్‌ముఖ్, కృతీ సనన్, అనిల్ కపూర్ ఈ సినిమాలో లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. తరుణ్ మన్సుఖాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో సంజయ్ దత్ నటించనున్నట్లు చిత్రయూనిట్ శనివారం అధికారికంగా ప్రకటించింది. హౌస్‌ఫుల్ ఫ్యామిలీలోకి స్వాగతం అంటూ సంజయ్ దత్‌ను ఈ ఫ్రాంచైజీలోకి స్వాగతించారు నిర్మాత సాజిద్ నడియాడ్వాలా. కాగా ‘హౌస్‌ఫుల్ 5’ సినిమాను తొలుత ఈ ఏడాది దీ΄ావళి సందర్భంగా విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆ తర్వాత వచ్చే ఏడాది జూన్ 6న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ తెలిపారు. -
15 ఏళ్లలోనే తొలిసారి.. అత్యంత దారుణమైన కలెక్షన్స్
సూర్య హీరోగా నటించిన సూరరై పోట్రు (ఆకాశమే నీ హద్దురా) మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. కెప్టెన్ గోపినాథ్ నిజ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దీన్ని హిందీలో సర్ఫిరా పేరుతో రీమేక్ చేశారు. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా నటించాడు. ఒరిజినల్‌కు దర్శకత్వం వహించిన లేడీ డైరెక్టర్ సుధా కొంగర ఈ మూవీని డైరెక్ట్ చేసింది. దారుణమైన వసూళ్లుజూలై 12న విడుదలైన ఈ చిత్రం తొలి రోజు దారుణమైన వసూళ్లు రాబట్టింది. కేవలం రూ.2.40 కోట్లు మాత్రమే సంపాదించింది. ఓవైపు కమల్ హాసన్ 'భారతీయుడు 2', మరోవైపు ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' నుంచి గట్టి పోటీ ఉండటంతో సర్ఫిరాకు పెద్ద దెబ్బే పడింది. ఇటీవల వచ్చిన అక్షయ్ కుమార్ బడే మియా చోటే మియా సినిమా.. సర్ఫిరా కంటే ఎక్కువే రాబట్టింది. తొలి రోజు రూ.16 కోట్లు వసూలు చేసింది. పూర్తి రన్ టైమ్‌లో దాదాపు రూ.60 కోట్లు తెచ్చిపెట్టింది. అయినా కూడా దాన్ని ఫ్లాప్‌గా నిర్ధారించారు.తక్కువ ఓపెనింగ్స్గత 15 ఏళ్లలో అక్షయ్ కుమార్ సినీలైఫ్లో అత్యంత తక్కువ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా సర్ఫిరా నిలిచింది. 2009లో '8 x 10 తస్వీర్' కేవలం రూ.1.8 కోట్లు వసూలు చేసింది. మిషన్ రాణిగంజ్ రూ.2.8 కోట్లు, సెల్ఫీ రూ.2.5 కోట్లు, బెల్‌బాటమ్ రూ.2.7 కోట్ల ఓపెనింగ్‌తో సరిపెట్టుకున్నాయి. అప్పుడు వరుస హిట్లుభారీ తారాగణం, అధిక బడ్జెట్‌తో తెరకెక్కిన బచ్చన్ పాండే, రామ సేతు రూ.15 కోట్లలోపే ఓపెనింగ్స్ రాబట్టడం గమనార్హం. 2019లో మిషన్ మంగళ్, హౌస్‌ఫుల్ 4, గుడ్ న్యూస్ సినిమాలతో వరుసగా మూడుసార్లు రూ.200 కోట్ల క్లబ్బులో చేరిన అక్షయ్ కుమార్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. త్వరలోనే అతడు మళ్లీ హిట్స్ అందిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.చదవండి: బరాత్‌లో దుమ్ము లేపిన బ్యూటీలు.. అతడిని నెట్టేసి మరీ..! -
అనంత్ అంబానీ పెళ్లికి బాలీవుడ్ స్టార్ డుమ్మా.. ఎందుకంటే?
అంబానీ ఇంట ఫంక్షన్ అంటే అందరు సెలబ్రిటీలు ఉండాల్సిందే! ఇప్పటికే ప్రీవెడ్డింగ్ వేడుకలకు సినీతారలు హాజరై ఆ సెలబ్రేషన్స్‌ను రెండింతలు చేశారు. అత్యంత ముఖ్య ఘట్టమైన పెళ్లి కోసం ఎక్కడెక్కడో ఉన్న తారలంతా ముంబై పయనమయ్యారు. రామ్‌చరణ్, మహేశ్‌బాబుతో పాటు బాలీవుడ్, హాలీవుడ్ స్టార్స్ అంతా వివాహ వేడుకల్లో తళుక్కుమని మెరవనున్నారు.హీరోకు అస్వస్థత!ఈ లిస్టులో స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా ఉన్నాడు. కానీ ఇంతలోనే ఆయన తన ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. కారణం.. కొద్దిగా అస్వస్థతకు లోనైన అక్షయ్ పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అటు అంబానీ పెళ్లికి, ఇటు తన సినిమా సర్ఫిరా (ఆకాశమే నీ హద్దురా హిందీ రీమేక్) ప్రమోషన్స్‌కు డుమ్మా కొట్టనున్నాడని గాసిప్.ఇప్పటికే రెండుసార్లుఅక్షయ్ గతంలో రెండుసార్లు కరోనా బారిన పడ్డాడు. 2021లో ఓసారి, 2022లో మరోసారి కోవిడ్‌తో పోరాడాడు. ఆ మహమ్మారిపై విజయం సాధించినప్పటికీ కోవిడ్ లక్షణాలు మాత్రం తనను వెంటాడుతున్నాయని గతంలో వెల్లడించాడు. మునుపటిలా ధృడంగా ఉండలేకపోతున్నానని పేర్కొన్నాడు.చదవండి: 'భారతీయుడు 2' ఆ ఓటీటీలోనే.. ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే? -
యంగ్ హీరోకి వెరైటీగా బర్త్ డే విషెస్ చెప్పిన స్టార్ హీరో
సాధారణంగా పుట్టినరోజు విషెస్ అంటే ట్వీట్ లేదంటే ఇన్ స్టాలో పోస్ట్ పెట్టి విషెస్ చెప్పొచ్చు. కానీ కొందరు మాత్రం డిఫరెంట్‌గా ట్రై చేస్తుంటారు. ఇప్పుడు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఇలానే ప్రయత్నించాడు. తన తోటీ హీరో అయిన రణ్వీర్ సింగ్‌కి క్రేజీ వీడియోతో శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇప్పుడిది వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: 'కల్కి' రికార్డుల పరంపర.. నైజాం, ఓవర్సీస్లో తగ్గేదే లే)బ్యాక్ గ్రౌండ్ లేకుండా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్ స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో వీళ్లిద్దరూ కలిసి సూర్యవంశీ, సింగం-2 సినిమాల్లో కలిసి నటించారు. అలా వీరిద్దరి మధ్య బాండింగ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే తాజాగా రణ్వీర్ పుట్టినరోజు సందర్భంగా అక్షయ్ డ్యాన్స్ వీడియో పోస్ట్ చేసి మరీ విషెస్ చెప్పాడు.గతంలో మూవీ షూటింగ్ టైంలో తీసిన పాత వీడియోలో భాగంగా రణ్వీర్, అక్షయ్ క్రేజీ స్టెప్పులేస్తూ కనిపించారు. ఇకపోతే విషెస్ చెబుతూ రణ్‌వీర్‌ని అక్షయ్ పవన్ హౌస్‌తో పోల్చడం విశేషం. నిజం చెప్పాలంటే బాలీవుడ్లో ఈ ఇద్దరు హీరోలు పవర్ హౌస్ లాంటివాళ్లే. కానీ గత కొన్నాళ్ల నుంచి వీళ్లకు సరైన హిట్ పడట్లేదు. (ఇదీ చదవండి: డైరెక్టర్ రాజమౌళి జీవితంపై మూవీ.. ఓటీటీలో నేరుగా రిలీజ్) View this post on Instagram A post shared by Akshay Kumar (@akshaykumar) -
నా పెళ్లికి తప్పకుండా రావాలి.. హీరోల ఇంటికి వెళ్లిన అనంత్ అంబానీ
దిగ్గజ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ కళ్లు చెదిరేలా జరిగాయి. మరికొద్ది రోజుల్లోనే పెళ్లి జరగబోతుండగా ఈ శుభాకార్యానికి రావాలంటూ పెళ్లి పత్రికలు పంచుతున్నారు. ఈ వెడ్డింగ్ కార్డ్స్ కూడా ఎంతో వెరైటీగా డిజైన్ చేశారు. చిన్నపాటి దేవుడి మందిరాన్నే కానుకగా ఇచ్చారు. అందులోనే పెళ్లి పత్రికను పొందుపరిచారు.తాజాగా అనంత్ అంబానీ.. తమ పెళ్లికి రావాలంటూ ఇద్దరు హీరోల ఇంటికి వెళ్లి మరీ పిలిచాడు. బుధవారం రాత్రి తన రోల్స్ రాయిస్ కారులో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఇంటికి వెళ్లాడు. అక్షయ్‌కు స్వయంగా కార్డు ఇచ్చి కుటుంబసమేతంగా తన పెళ్లికి రావాలని ఆహ్వానించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అలాగే అక్షయ్ దేవ్‌గణ్‌ను సైతం కలిసి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చాడు. అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ల పెళ్లి సెలబ్రేషన్స్ మూడు రోజుల పాటు ఘనంగా జరగనున్నట్లు తెలుస్తోంది. జూలై 12, 13, 14 తేదీల్లో జరగనున్న ఈ వివాహ వేడుకకు ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ వేదికగా మారనుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: ‘కల్కి 2898 ఏడీ’ టాక్ ఎలా ఉందంటే..? -
ఈ స్టార్ హీరో డబ్బు కోసం పని చేయడు: కొరియోగ్రాఫర్
చెప్పిన సమయానికల్లా రెడీ అయి ఉండటం కొందరికే సాధ్యమవుతుంది. కానీ ఓ హీరో చెప్పిన టైం కంటే అరగంటే ముందే సిద్ధంగా ఉంటాడని చెప్తున్నాడు కొరియోగ్రాఫర్, నిర్మాత అహ్మద్ ఖాన్. ఇంతకీ సమయపాలకు మారుపేరుగా నిలిచిన హీరో మరెవరో కాదు ఖిలాడీ అక్షయ్ కుమార్. తనకు పని చేయడమే తెలుసని, బాక్సాఫీస్ కలెక్షన్ల గురించి పెద్దగా పట్టించుకోడని చెప్తున్నాడు.డబ్బు వెంట పరిగెత్తడుఅహ్మద్ ఖాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అక్షయ్ ఎన్ని సినిమాలు చేస్తున్నాడో చూడండి. డబ్బు అవసరమై ఆయన పని చేస్తున్నారా? ఆయనకు డబ్బు వెంట పరిగెత్తాల్సిన అవసరం ఉందా? అయినా ఎందుకు చేస్తున్నాడో తెలుసా? తనెప్పుడూ ఒక మాట అంటుంటాడు. మన చేతిదాకా వచ్చిన పనిని వదిలేయొద్దు. ఇదే చివరి అవకాశం అనుకుని చేస్తూ పోవాలి. అందుకోసం ఎంతైనా కష్టపడాలి అని చెప్తుంటాడు.దాని గురించి మాట్లాడడుచేసే పనిని చాలా గౌరవిస్తాడు. సినిమా కోసం పూర్తి స్థాయిలో కృషి చేయాలని ఆలోచిస్తాడే తప్ప కలెక్షన్స్ రాలేదేంటని ఎక్కువగా దిగులు చెందడు. ఫెయిల్యూర్స్ గురించి ఎవరితోనూ పంచుకోడు. కానీ సెట్లో ఉదయం 7 గంటలకల్లా ఉండాలంటే ఆరున్నరకే ఉండేవాడు. మేము ఆలస్యంగా వెళ్లినా సరే మాపై కోప్పడేవాడు కాదు అని చెప్పుకొచ్చాడు. కాగా అక్షయ్ కుమార్ చివరగా బడే మియా చోటే మియా సినిమాలో నటించాడు. తను నటించిన సర్ఫిర (ఇది సూరరై పోట్రుకు రీమేక్‌గా తెరకెక్కింది) జూలై 12న విడుదల కానుంది. చదవండి: ప్రభాస్ అతిథి పాత్రలో నటించిన సినిమా ఏదో తెలుసా? -
సూర్య హిట్ సినిమా అక్షయ్ కుమార్ రీమేక్.. ట్రైలర్ విడుదల
సౌత్ ఇండియా స్టార్ సూర్య ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం 'ఆకాశమే నీ హద్దురా'. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ సినిమాను సుధా కొంగర దర్శకత్వం వహించారు. అయితే, ఇప్పుడు 'సర్ఫిరా' పేరుతో బాలీవుడ్లో రీమేక్ చేశారు. ఇందులో అక్షయ్ కుమార్ నటిస్తున్నారు. రాధిక మదన్, పరేష్ రావల్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది.సూర్య నిర్మాతగా 2020లో 'ఆకాశమే నీ హద్దురా' చిత్రం డైరెక్ట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. కానీ, సినిమాకు మంచి ఆదరణ దక్కింది. ఇప్పుడు కూడా సర్ఫిరా చిత్రానికి కూడా జ్యోతిక, సూర్య నిర్మాతలుగా ఉంటే సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఎయిర్ డెక్కన్ సంస్థను స్థాపించి అందరికీ తక్కువ ధరకే విమాన ప్రయాణ సౌకర్యం అందించిన కెప్టెన్ గోపీనాథ్ జీవితంలోని పలు కీలక అంశాలను ఆధారం చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సర్ఫరా ట్రైలర్ చూస్తూంటే అభిమానుల అంచనాలకు తగ్గట్టు ఉంది. సూర్య కూడా ఇందులో ప్రత్యేక పాత్రలో కొంత సమయం పాటు కనిపిస్తారని తెలుస్తోంది. జులై 12 ఈ చిత్రం విడుదల కానుంది. -
'సింగం అగైన్' విడుదల తేదీలో మార్పు
బాలీవుడ్లో 'సింగం' ఫ్రాంఛైజీ చిత్రాలకు భారీగానే ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సీరిస్‌లో మూడో చిత్రంగా 'సింగం అగైన్' తెరకెక్కుతుంది. అజయ్ దేవగణ్, దీపిక పదుకొణె జంటగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లో రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్నారు. ఇదొక కాప్ యూనివర్స్ చిత్రం. ఇందులో రణ్వీర్ సింగ్, జాకీ ష్రాఫ్, టైగర్ ష్రాఫ్, కరీనా కపూర్ కూడా నటిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. దీన్ని ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే, ఈ చిత్ర విడుదల విషయంలో మార్పులు చేశారు. దీపావళి కానుకగా 2024 నవంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా 'సింగం అగైన్' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. వీఎఫ్ఎక్స్ తదితర కారణాలతో విడుదల విషయంలో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. వాస్తవంగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన యముడు సినిమాకు రీమేక్‌గా బాలీవుడ్లో ఈ ఫ్రాంఛైజీ మొదలైంది. సౌత్‌లో సూర్య సినిమాలు ఎంత హిట్ అయ్యాయో తెలిసిందే.. బాలీవుడ్లో కూడా సింగం చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద మంచి ఆధరణ లభించింది. -
నా బయోపిక్‌లో ఈ హీరోల్లో ఎవరు నటించినా ఓకే.. నేను కూడా..
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా తాజాగా ద గ్రేట్ ఇండియన్ కపిల్ షోకు హాజరైంది. బాక్సర్ మేరీ కోమ్, బ్యాడ్మింటన్ సైనా నెహ్వాల్, షార్ప్ షూటర్ సిఫ్త్ కౌర్‌తో కలిసి ఈ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా కపిల్ శర్మ సానియాను ఆసక్తికర ప్రశ్న అడిగాడు. ప్రియాంక చోప్రా మేరీ కోమ్ బయోపిక్‌లో నటించింది. ప్రియాంక కజిన్ పరిణతి చోప్రా.. సైనా నెహ్వాల్ బయోపిక్‌లో మెరిసింది. మంచి నటీనటులు ఎందరో..మరి మీ జీవిత చరిత్ర కథ సంగతేంటి? అని ఆరా తీశాడు. అందుకు సైనా నవ్వుతూ.. మన దేశంలో చాలామంది మంచి యాక్టర్స్ ఉన్నారు. ఎవరు నటించినా నాకు ఓకే.. లేదంటే నా పాత్రలో నేనే నటిస్తాను అని చెప్పుకొచ్చింది. దీంతో వెంటనే కపిల్ శర్మ.. నువ్వు ప్రేమించే వ్యక్తి పాత్రలో నటించాలనుందని గతంలో షారుక్ ఖాన్ చెప్పాడని గుర్తు చేశాడు. అందుకు సానియా.. అలాగైతే ముందు నేనెవర్నైనా ప్రేమించాలి కదా! అని బదులిచ్చింది.ఆ హీరోలైతేనే..షారుక్ ఖాన్ లేదా అక్షయ్ కుమార్ నా బయోపిక్‌లో నటిస్తానంటే కచ్చితంగా నా పాత్రలో నేనే నటిస్తాను అని చెప్పుకొచ్చింది. కాగా సానియా మీర్జా- షోయబ్ మాలిక్ ఇటీవలే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే! సానియాకు విడాకులిచ్చిన వెంటనే షోయబ్ పాకిస్తాన్ నటి సనా జావెద్‌ను మూడో పెళ్లి చేసుకున్నాడు.చదవండి: Pihu Review: ఓటీటీలోనే బెస్ట్ చైల్డ్ మూవీ.. కానీ చూస్తే భయపడతారు! -
ఓటీటీలో రూ. 350 కోట్ల బడ్జెట్ సినిమా
బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన చిత్రం ‘బడేమియా ఛోటేమియా’. అలీ అబ్బాస్ జాఫర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా, మానుషి చిల్లర్, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు కీలక పాత్రలలో నటించారు. భారీ అంచనాలతో ఏప్రిల్ 11న విడుదలైన ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. అయితే, ఇప్పుడు ఓటీటీలోకి రానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటన చేసింది.కొన్నేళ్ల నుంచి వరుస ప్లాపులతో ఉన్న అక్షయ్‌కుమార్ ‘బడేమియా ఛోటేమియా’తో హిట్ కొట్టాలని చాలా కష్టపడ్డాడు. కానీ, ఫలితం మారలేదు. మరో డిజాస్టర్ ఆయన ఖాతాలో చేరిపోయింది. సుమారు రూ. 350 కోట్ల బడ్జెట్‌తో భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే, ఈ సినిమాకు కేవలం రూ. 90 కోట్ల వరకు మాత్రమే కలెక్ట్ చేసింది. ఇందులో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా కనిపిస్తే.. సానాక్షి సిన్హా ఓ కీలక పాత్రలో కనిపించింది. జూన్ 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందని అధికారికంగా ప్రకటన వచ్చేసింది. దేశభక్తి ప్రధానంగా ఈ సినిమా కథ ఉంటుంది. ఇందులో భారీ తారాగణంతో పాటు కావాల్సినంత సాంకేతిక హంగులు, మంచి లొకేషన్లు ఉన్నాయి. యాక్షన్ సీన్స్‌లలో గన్నులు, ట్యాంకర్లు, హెలికాఫ్టర్లు అడుగడుగునా ఉపయోగించి భీకర పోరాటాలు చేసినా సరైన కథ, కథనాలు లేకపోవడంతో సినిమాకు బాగా మైనస్ అయింది. జూన్ 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న 'బడేమియా ఛోటేమియా'ను ఇంట్లోనే చూసేయండి. -
స్టార్ హీరో కొడుకు సెకండ్ హ్యాండ్ బట్టలు వాడతాడు!
సినిమా హీరోలు అనగానే కాస్ట్ లీ బట్టలు, ఖరీదైన కార్లు, లగ్జరీ లైఫ్.. చాలామందికి ఇవే గుర్తొస్తాయి. కానీ వీళ్లలో చాలా తక్కువ మంది మీడియా కంటికి కనిపించకుండా చాలా సాధారణంగా జీవిస్తుంటాడు. ఇప్పుడు చెప్పబోయేది కూడా అలాంటి ఓ స్టార్ హీరో కొడుకు గురించి. ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసే స్టార్ హీరో తండ్రిగా ఉన్నాడు. కోట్లు సంపాదిస్తున్నాడు. కానీ కొడుకు మాత్రం సెకండ్ హ్యాండ్ బట్టలే వాడుతున్నాడట.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)బాలీవుడ్ స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకడు. హిట్ ఫ్లాప్‌తో వరస మూవీస్ చేస్తూనే ఉంటాడు. రీసెంట్‌గానే 'బడే మియా చోటే మియా' సినిమాతో వచ్చాడు. కానీ ఘోరమైన ఫెయిల్యూర్ అందుకున్నాడు. తాజాగా టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ హోస్టింగ్ చేస్తున్న 'ధావన్ కరేంగే' అనే టాక్ షోకు అక్షయ్.. గెస్ట్‌గా వచ్చాడు. తన కొడుకు ఆరవ్ గురించి ఎవరికీ తెలియని విషయాల్ని బయటపెట్టాడు.'నేను, ట్వింకిల్ (అక్షయ్ భార్య).. ఆరవ్‌ని పెంచిన విధానంపై నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే అతడు చాలా సాధారణమైన అబ్బాయి. ఇది చెయ్ అది చెయ్ అని అతడిని ఎప్పుడూ బలవంత పెట్టలేదు. వాడికి సినిమాలపై ఇంట్రెస్ట్ లేదు. కానీ ఫ్యాషన్‌పై ఆసక్తి ఉంది. ఆరవ్.. 15 ఏళ్లకే లండన్ యూనివర్సిటీలో చదువుకోవడానికి వెళ్లాడు. అయితే అతడి వెళ్లాలని మేం కోరుకోలేదు. కానీ వెళ్తుంటే ఆపలేదు. ఎందుకంటే నేను కూడా 14 ఏళ్లప్పుడే ఇంటి నుంచి బయటకొచ్చాను. ఆరవ్.. ఇంటి పనులన్నీ స్వయంగా చేసుకుంటాడు. మంచి డబ్బున్న ఫ్యామిలీ నుంచి వచ్చాడు కానీ ఖరీదైన బట్టలు కొనడు. సెకండ్ హ్యాండ్ బట్టలమ్మే థ్రిప్టీ అనే షాప్‌కి వెళ్తాడు. అతడికి డబ్బు వేస్ట్ చేయడం ఇష్టం లేదు. అందుకే ఇలా చేస్తున్నాడు' అని అక్షయ్, తన కొడుకు గురించి సీక్రెట్స్ అన్నీ చెప్పేశాడు.(ఇదీ చదవండి: నటి, యాంకర్ శ్యామలపై తప్పుడు కథనాలు.. చట్టపరంగానే ముందుకెళ్తానన్న వార్నింగ్) -
భారత పౌరసత్వం పొందిన తర్వాత మొదటి ఓటేసిన అక్షయ్ కుమార్
దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఐదో విడుత కొనసాగుతుంది. నేడు (మే 20) ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మహారాష్ట్రలో లోక్ సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్ జరుగుతుండగా బాలీవుడ్ నటీనటులు తమ ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు క్యూలు కట్టడం విశేషం.తాజాగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తన ఓటు హక్కును ఉపయోగించుకున్నాడు. భారత పౌరసత్వం తిరిగి పొందిన తర్వాత తొలిసారిగా తను ఓటు వేశాడు. ఈ సమయంలో అక్షయ్ కుమార్ చాలా సంతోషంగా కనిపించాడు. సిరా వేసిన వేలిని అందరికీ చూపుతూ.. పోలింగ్ బూత్ వెలుపల మీడియాతో మాట్లాడాడు. ఆగస్టు 2023లో భారత పౌరసత్వం పొందిన తర్వాత తొలిసారిగా ఓటు వేయడం పట్ల అక్షయ్ కుమార్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. 'నా భారత దేశం అభివృద్ధి చెందాలని, బలంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దానిని దృష్టిలో ఉంచుకుని నేను ఓటు వేశాను. ప్రతి భారత పౌరుడు ఓటు వేయాలి. అప్పుడే ఓటింగ్ శాతం బాగుంటుందని నేను భావిస్తున్నాను. అని ఆయన అన్నారు.కెనడా పౌరసత్వం ఎందుకు తీసుకున్నాడంటేకెనడా పౌరసత్వం తీసుకోవడానికి గల కారణాన్ని అక్షయ్ కుమార్ గతంలో ఓ ఇంటర్వ్యూలో ఇలా వివరించాడు. '1990ల్లో నా సినిమాలన్నీ వరుసగా ప్లాప్ అయ్యాయి. అప్పుడు ఏకంగా 15 సినిమాలు పరాజయం చెందాయి. అప్పుడు నేను చాలా నిరుత్సాహపడ్డాను. దీంతో కెరియర్ కాస్త ఇబ్బందుల్లో పడింది. ఆ సమయంలో కెనడాలో ఉన్ననా స్నేహితుడి సలహా మేరకు అక్కడికి వెళ్లి పనిచేయాలని నిర్ణయించుకున్నా. అప్పుడే కెనడా పాస్‌పోర్ట్ తీసుకున్నాను. నేను ఇండియా నుంచి వెళ్లిపోదామనేకునే సమయంలో నా రెండు సినిమాలు ఘన విజయం సాధించడంతో నాలో మళ్లీ ఆత్మవిశ్వాసం వచ్చింది. దీంతో అక్కడికి వెళ్లలేదు. ఈ క్రమంలోనే పాస్‌పోర్ట్ విషయం మరిచిపోయా.' అని అక్షయ్ చెప్పుకొచ్చాడు. #WATCH | Actor Akshay Kumar shows the indelible ink mark on his finger after casting his vote at a polling booth in Mumbai.He says, "...I want my India to be developed and strong. I voted keeping that in mind. India should vote for what they deem is right...I think voter… pic.twitter.com/mN9C9dlvRD— ANI (@ANI) May 20, 2024 -
పదేళ్ల తర్వాత మళ్లీ చాన్స్.. ఆనందంలో ప్రగ్యా జైస్వాల్
‘కంచె, ఆచారి అమెరికా యాత్ర, అఖండ’ వంటి పలు తెలుగు చిత్రాల్లో నటించిన హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఖుషీగా ఉన్నారు. ఆమె ఆనందానికి కారణం అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ‘ఖేల్ ఖేల్ మే’ సినిమాలో చాన్స్ రావడమే. పదేళ్ల క్రితం చేజారిన అవకాశం ఇప్పుడు రావడంతో ప్రగ్యా తన ఆనందాన్ని పంచుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రగ్యా జైస్వాల్ మాట్లాడుతూ– ‘‘అక్షయ్ కుమార్ హీరోగా దర్శకుడు క్రిష్ ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ సినిమా తీశారు. ఆ మూవీ కోసం 2014లో ఆడిష¯Œ ఇచ్చాను. కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలో నటించే అవకాశం నాకు రాలేదు. అప్పుడు నిరుత్సాహపడ్డాను. అయితే పదేళ్ల తర్వాత ఇప్పుడు అక్షయ్‌గారి ‘ఖేల్ ఖేల్ మే’లో నటించే చాన్స్ రావడం హ్యాపీ. ఈ చిత్రంలో కీలక పాత్ర చేస్తున్నాను’’ అన్నారు. ముదాస్సర్ అజీజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తాప్సీ, వాణీ కపూర్ నటిస్తున్నారు. ఇదిలా ఉంటే... హిందీలో ‘టిటూ ఎమ్బీఏ’ (2014) చిత్రంలో హీరోయిన్గా నటించారు ప్రగ్యా. బాలీవుడ్లో ఆమెకు అది తొలి చిత్రం. పదేళ్లకు ప్రగ్యా మళ్లీ హిందీలో అవకాశం తెచ్చుకున్నారు. -
16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. ఇప్పుడు స్టార్ హీరోకు అత్తగా..
డింపుల్ కపాడియా… బాలీవుడ్లో ఒకప్పుడు తన అందచందాలతో భారీగా ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్న బ్యూటీగా పేరుగాంచింది. డింపుల్ అంటేనే అందం అనేంతగా యూత్ పరవశించిపోయేవారెందరో ఉన్నారు. బాలీవుడ్ షో మ్యాన్ రాజ్ కపూర్ దర్శకత్వంలో రిషీ కపూర్‌ను హీరోగా తెరకెక్కించిన ‘బాబీ’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయం అయిన డింపుల్. తొలి మూవీతోనే హిట్ కొట్టి ఓవర్ నైట్ బాలీవుడ్ స్టార్ అయిపోయింది. ఆ సినిమా నాటికి ఆమె వయసు 16 ఏళ్లు మాత్రమే. డింపుల్ కపాడియా 'రుడాలి'లో తన నటవిశ్వరూపం చూపించి, జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగానూ నిలచింది.16 ఏళ్ల వయసులోనే గర్భండింపుల్ కపాడియా 1957లో బొంబాయిలో ఒక సంపన్న గుజరాతీ వ్యాపారవేత్త కుటుంబంలో జన్మించింది. చిన్నతనంలో ఆమెను అమీనా అని పిలిచేవారు కానీ డింపుల్గానే ఆమె పేరు స్థిరపడింది. బాలీవుడ్ హిట్ చిత్రం బాబీలో నటించిన డింపుల్ తన కంటే 15 ఏళ్లు సీనియర్ అయిన సూపర్ స్టార్ రాజేష్ ఖన్నాతో డేటింగ్ చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలో ఆమె ప్రెగ్నెంట్ అయినట్లు కూడా ఆప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో 1973లో డింపుల్ తనకంటే 15 ఏళ్లు పెద్దవాడు అయిన రాజేష్ ఖన్నాను పెళ్లిచేసుకుని వార్తల్లో నిలిచింది. బాబీ సినిమాతోనే ఆమె సినిమా కెరియర్‌కు ఫుల్స్టాప్ పడిపోయింది. తన భర్త కోరిక మేరకు సినిమాలను వదిలేసింది. ఈ సంఘటనలతో ఆమె స్టార్డమ్ ఒక్కసారిగా కోల్పోయింది.స్టార్ హీరోకు అత్తగా..1974లో ట్వింకిల్ ఖన్నాకు ఆమె జన్మనిచ్చింది. అంటే ఆమె 16 ఏళ్ల వయసులోనే గర్భం దాల్చారు. ట్వింకిల్ ఖన్నాను అక్షయ్ కుమార్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం స్టార్ హీరో అక్షయ్ కుమార్‌కు పిల్లనిచ్చిన అత్తగానే కాకుండా ప్రత్యేకమైన పాత్రలతో పలు సినిమాల్లో డింపుల్ కపాడియా బిజీగా ఉంది.పిల్లల కోసం విడాకులకు దూరం1982లో రాజేశ్ ఖన్నా, డింపుల్ కపాడియా విభేదించి విడిపోయారు. 1985లో ఇచ్చిన ఇంటర్వ్యూలో, 'నేను, రాజేశ్ ఖన్నా వివాహం చేసుకున్న రోజుతోనే నా జీవితం ముగిసిపోయింది. ఆపై సంతోషం కూడా ముగిసింది.' అని చెప్పింది. రాజేశ్ ఖన్నా తనను మోసం చేశారని డింపుల్ రోపించింది. ఆ ఆరోపణలను రాజేశ్ ఎప్పుడూ ఖండించలేదు. పిల్లల కోసం ఈ దంపతులు విడాకులు కూడా తీసుకోలేదు. రాజేశ్ ఖన్నా ఢిల్లీ లోక్ సభ నియోజకవర్గం నుండి పోటీ చేయగా, ఆయన తరపున ప్రచారం కూడా చేసింది డింపుల్. వీరిద్దరూ విడిపోయిన తర్వాత 1984లో, డింపుల్, రిషి కపూర్ జంటగా సాగర్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకుంది. తరువాతి 10 సంవత్సరాలలో వరుస హిట్లు అందుకున్న డింపుల్ కపాడియా బాలీవుడ్లో అగ్ర కథానాయికలలో ఒకరిగా స్థిరపడింది.సన్నీ డియోల్‌తో ప్రేమకథరాజేశ్ ఖన్నాతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న డింపుల్‌కూ సన్నీ డియోల్ మంచి సోల్‌మేట్ అయ్యాడు. కష్టకాలంలోఆమెకు అండగా నిలబడ్డాడు.వారిద్దరి ప్రేమకథ చిత్రసీమలో భలేగా చక్కర్లు కొట్టింది. 1998లో సినిమా ఛాన్స్‌లు తగ్గిపోవడంతో కొవ్వొత్తుల వ్యాపారం ప్రారంభించింది. సన్నీతో సన్నిహితంగా ఉన్నప్పటికీ.. చివరి దాకా భార్యగా రాజేశ్ కు సపర్యలు చేసింది డింపుల్. 2012 జూలై 18న రాజేశ్ ఖన్నా మరణించారు.ఇప్పుడేం చేస్తుందిదిల్ చాహ్తా హై, లక్ బై ఛాన్స్, కాక్టెయిల్, దబాంగ్, బ్రహ్మాస్త్ర, పఠాన్ వంటి చిత్రాలలో డింపుల్ కనిపించింది. 2020లో, ఆమె 62 సంవత్సరాల వయసులో క్రిస్టోఫర్ నోలన్ హిట్ సినిమా 'టెనెట్'లో సహాయక పాత్ర ద్వారా హాలీవుడ్ అరంగేట్రం చేసింది. 2024లో, ఆమె రెండు చిత్రాలలో కనిపించింది. -
కన్నప్పకి బై బై
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ‘కన్నప్ప’కి బై బై చెప్పారు. తన పాత్రకి సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేసిన ఆయనకి చిత్ర యూనిట్ వీడ్కోలు పలికింది. విష్ణు మంచు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్‌బాబు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైన షెడ్యూల్లో అక్షయ్ కుమార్ జాయిన్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా తన సీన్లకు సంబంధించిన షూట్‌ను ఆయన పూర్తి చేశారు. ‘‘అక్షయ్ కుమార్‌గారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఈ ప్రయాణం ఎంతో విలువైనది’’ అని సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు విష్ణు మంచు. ‘‘ధైర్యవంతుడైన యోధుడు, శివ భక్తుడైన కన్నప్ప కథతో ఈ చిత్రం అద్భుతంగా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది’’ అన్నారు మేకర్స్. -
జాలీ రైడ్
బాలీవుడ్ హిట్ మూవీ ఫ్రాంచైజీలో ‘జాలీ ఎల్ఎల్బీ’ ఒకటి. ఈ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటికే విడుదలైన ‘జాలీ ఎల్ఎల్బీ’, ‘జాలీ ఎల్ఎల్బీ 2’ సినిమాలకు మంచి ప్రేక్షకాదరణ లభించింది. తాజాగా ఈ ఫ్రాంచైజీ నుంచి థర్డ్ పార్ట్ ‘జాలీ ఎల్ఎల్బీ 3’ సినిమా రానుంది. ‘జాలీ ఎల్ఎల్బీ’ ఫ్రాంచైజీలోని తొలి రెండు భాగాలకు దర్శకత్వం వహించిన సుభాష్ కపూరే మూడో భాగాన్నీ తెరకెక్కిస్తున్నారు.అక్షయ్ కుమార్, అర్షద్ వార్షి లీడ్ రోల్స్ చేస్తున్న ఈ సినిమాలో సౌరభ్ శుక్లా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. తాజాగా ఈ సినిమా సెట్స్‌లో జాయిన్ అయ్యారు అక్షయ్ కుమార్. ‘‘ఒరిజినల్ ఎవరో, డూప్లికేట్ ఎవరో తెలియడం లేదు. కానీ ఈ సినిమా మాత్రం ఓ జాలీ రైడ్‌గా ఉండబోతోంది’’ అంటూ ‘జాలీ ఎల్ఎల్బీ 3’ సినిమా షూటింగ్లో తాను పాల్గొంటున్నట్లుగా వీడియోను షేర్ చేశారు అక్షయ్ కుమార్. నకిలీ లాయర్ల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందనే టాక్ వినిపిస్తోంది. -
కన్నప్పలో అక్షయ్ కుమార్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ‘కన్నప్ప’ చిత్రం షూటింగ్లో జాయిన్ అయ్యారు. విష్ణు మంచు టైటిల్ రోల్లో రూపొందుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్‌బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షూటింగ్లో జాయిన్ అయ్యారు అక్షయ్ కుమార్. ఈ సందర్భంగా మోహన్‌బాబు, విష్ణు మంచు కలిసి అక్షయ్‌కి స్వాగతం పలికారు. ‘‘శివ భక్తుడైన కన్నప్ప కథను ‘కన్నప్ప’గా తెరపైకి తీసుకొస్తున్నాం. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఈ మూవీ రూపొందుతోంది. హైదరాబాద్‌లో మూడో షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. అక్షయ్‌తో పాటు ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం’’ అన్నారు మేకర్స్. -
రూ. 350 కోట్ల సినిమా.. 1+1 ఆఫర్ ఇచ్చినా చూసేవాళ్లు లేరు
బాలీవుడ్లో అక్షయ్‌కుమార్, టైగర్ ష్రాఫ్ ఇద్దరు కలిసి నటించిన చిత్రం 'బడేమియా ఛోటేమియా'. అలీ అబ్బాస్ జాఫర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈద్ సందర్భంగా ఏప్రిల్ 10న ఈ చిత్రం విడుదలైంది. హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ రిలీజ్ అయింది. హైవోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైనా.. బాక్సాఫీస్ వద్ద నిరాశపరుస్తోంది. సుమారు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీకి నాలుగు రోజులకు గాను రూ.96 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకుంది. దీంతో ఫస్ట్ వీకెండ్లో రూ.100 కోట్ల మార్క్ కూడా దాటలేకపోయింది. ఈ చిత్రాన్ని పూజ ఎంటర్టైన్మెంట్స్, ఏఏజెడ్ ఫిల్మ్స్ బ్యానర్లపై జాకీ భగ్నానీ, వశు భగ్నానీ, దీప్షికా దేశ్‌ముఖ్, అలీ అబ్బాస్ జాఫర్, హిమాన్షు కిషన్ సంయుక్తంగా నిర్మించారు. సుమారు రూ.400 కోట్లు అందుకుంటుందని అంచనా వేసి సినిమా విడుదల చేస్తే.. భారీ డిజాస్టర్ దిశగా కొనసాగుతుంది. ఓ మై గాడ్ 2 తర్వాత అక్షయ్ కుమార్ నుంచి వస్తున్న సినిమా కావడం.. ఆపై ఈ చిత్రంలో జాన్వీ కపూర్, మానుషి చిల్లర్, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు కీలక పాత్రలు నటించడంతో మొదటిరోజు కలెక్షన్స్ కాస్త మెరుగ్గానే వచ్చాయి. ఆ తర్వాత సినిమా బాగాలేదని టాక్ రావడంతో రెండో రోజే కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. దీంతో ఆదివారం నాడు బుక్ మై షోలో వన్ ప్లస్ వన్ ఆఫర్‌ను ప్రకటించేశారు. ఈ నిర్ణయంతో ఆదివారం బుకింగ్స్ కాస్త పెరిగాయని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఆఫర్లు ప్రకటించినా కూడా రూ. 350 కోట్లు పెట్టిన సినిమాకు నాలుగురోజుల్లో రూ. 100 కోట్ల మార్క్ దాటకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. -
అక్షయ్ కుమార్ నుంచి కత్రినా వరకు.. డైట్ సీక్రెట్స్ ఇవే..
బాలీవుడ్ టీవీ నటుడు, ప్రముఖ కమిడియన్, ప్రోడ్యూసర్, సింగర్ అయిన కపిల్ శర్మ సెటబ్రిటీలతో చేసిన 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోతో మంచి పేరు సంపాదించికున్నాడు. ఇటీవల ఆ షో ఫస్ట్ ఎపిసోడ్ నెట్పిక్స్లో విడుదల అయ్యింది అక్కడ కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఆ షోలో సెలబ్రిటీలు రణబీర్ కపూర్, నీతూ కపూర్ మరియు రిద్ధిమా కపూర్ సహానితో షేర్ చేసుకున్న ఆసక్తికర విషయాల తోపాటు హాస్యంతో కూడిన చిందులు అన్నింటిని ప్రేక్షక్షులు అలరించాయి. ఆ ఐదు షోల్లో ప్రముఖ సెలబ్రిటీలు ఫాలో అయ్యే డైట్ సీక్రెట్స్ కూడా కపిల్ వెల్లడించడం జరిగింది. స్రీన్‌పై మంచి అందంతో, పిట్‌నెస్‌తో కనిపించే హీరో/హీరోయిన్ల బ్యూటీ, ఫిట్నెస్ సీక్రెట్స్ తెలుసుకోవాలన్న కుతుహలం అందరికీ ఉంటుంది. అది కపిల్ శర్మ షో ద్వారా ప్రేక్షకులు తెలుసకునే అరుదైన అవకాశం లభించింది. అవేంటీ, ఎవరెవరు? ఎలాంటి డైట్స్ ఫాలో అవుతారో సవివరంగా చూద్దామా..! జాన్ అబ్రహం బాలీవుడ్ నటుడు, మోడల్, నిర్మాత అయిన జాన్అబ్రహం ఫిజిక్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఆరడుగుల ఆజానుబాహుడు అంటే అతడేనేమో అన్నట్లు ఉంటుంది అతడి ఆహార్యం. చక్కటి బాడీని మెయింటెయిన్ చేస్తూ మంచి ఫిట్నెస్తో కనిపిస్తాడు. 2021లో తన మూవీ 'సత్యమేవ జయతే2' ప్రమోషన్ సందర్భంగా కపిల్ శర్మ షోకి వచ్చినప్పుడూ తన ఫిట్నెస్ సీక్రెట్స్‌ని పంచుకున్నాడు. మంచి బాడీ మెయింటెయిన్ చేయాలంటే మంచి ఆహారం అనేది చాలా ముఖ్యం అని చెప్పాడు. అలాగే ఆహారంపై నియంత్రణ ఉండాలని అన్నారు. ప్రోటీన్ కోసం నాన్‌వెజ్ తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పారు. చాలామంది శాకాహారంతో ప్రోటీన్లు అందుతాయని చెబుతారు గానీ అందులో నిజం లేదని జాన్ చెప్పడం జరిగింది. ఇక్కడ జాన్ కండల దేహ సౌష్టవాన్ని చూస్తే.. పోషకాల తోకూడిన ఆహారం తినాల్సిందేనని స్పష్టమవుతుంది. అక్షయ్ కుమార్ ఇక అక్షయ్ కుమార్ తన 'హౌస్‌ఫుల్ 3' చిత్రం ప్రమోట్ చేసేందుకు కపిల్ శర్మ షోకి రావడం జరిగింది. ఆ షోలో ఆ మూవీ నటులంతా రావడం జరిగింది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ ఆ షోలో అక్షయ్ కుమార్ ఫాలో అయ్యే స్ట్రీట్ డైట్ గురించి వెల్లడించారు. "తాను రితేష్ చక్కగా వ్యాయామం చేసి అలసిపోయి ఉన్నాం. అందువల్ల చాలా ఆకలిగా అనిపించి బటర్ చికెన్ తినాలని అనుకున్నాం. అయితే ఆ టైంలో అక్షయ్ వారికి ఉడకబెట్టిన క్యారెట్లు, బచ్చలి కూర ఇచ్చాడని, కనీసం అన్నం గానీ రోటీ గానీ లేదు. ఇంత స్ట్రీట్‌గా డైట్ ఫాలో అవుతాడని,అందువల్లే అక్షయ్ ఇప్పటికీ యంగ్ లుక్‌లోనే కనిపస్తాడని". అమితాబ్ అన్నారు. కేక్ అంటే చాలా ఇష్టం: కత్రినా కైఫ్.. కపిల్ శర్మ షోకి సంబంధించి ఒక ఎపిసోడ్లో కత్రినా తన డైట్ గురించి మాట్లాడింది. "నిజంగా ఆరోగ్యకరమైన డైట్ ఫాలో అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నాకు కేక్‌లంటే మహా ఇష్టం కానీ దాన్ని తింటే జిమ్‌లో ఎక్కువసేపు గడపక తప్పదు. అందుకని ప్రతి ఆదివారం మనం కలుసుకుందామని కేక్‌తో సర్ది చెప్పుకుని నోటిని కంట్రోల్ చేసేందుకు కష్టపడతానని అంటోంది." కత్రినా. ఇక్కడ సెలబ్రిటీలు కూడా మనలానే ఒక్కోసారి ఫుడ్ స్కిప్ చేస్తారు. ఐతే తినాలనుకుంటే మాత్రం కంట్రోల్గానో లేక ఏదో ఒక రోజు కేటాయించుకుని పరిమితంగా తిని ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తారు. గులాబ్ జామూన్లు, సమోసాలు తినాల్సిందే: రాజ్‌కుమార్ రావ్ కపిల్ శర్మ షో 2020లో రాజ్‌కుమార్ రావ్ సందడి చేశారు. అయితే రాజ్ కుమార్ తనకు తినడమంటే ఇష్టమని చెప్పాడు. ఐతే రాజ్ ఫిటనెస్ చూస్తే.. ఆయన చెబుతుంది నమ్మశక్యంగా లేదని కపిల్ ఆ షోలో అభిప్రాయం వ్యక్తం చేయడంతో తన డైట్ గరించి క్లియర్‌గా చెప్పారు. "తనకు గులాబ్ జామూన్లు, సమోసాలంటే ఎంతో ఇష్టమో ఎలా తినేసేవాడో చెప్పారు. టీనేజ్‌లో ఉండగా వర్కౌట్స్ అయ్యాక తిన్నగా స్వీట్ షాక్కివెళ్లి ఏకంగా ఆరు గులాబ్ జామూన్లు, రెండు సమోసాలు తినాల్సిందే. అయితే సినీ పరిశ్రమలో ప్రవేశించాక డైట్ మీద దృష్టికేంద్రీకరించడంతో అలా తినడం మానేశానని, స్వీట్ తినాలనుకుంటే మాత్రం లిమిట్‌గా తింటానని అన్నారు." ఆదిత్య రాయ్: అరకేజీ ఐస్‌క్రీమ్ ఉండాల్సిందే.. ఇక ఆదిత్య రాయ్ మృణాల్ ఠాకూర్‌తో కలిసి కపిల్ శర్మ షోకి వచ్చి డైట్‌కి సంబంధించిన ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు. తాను రాత్రిపూట ఏకంగా అరకేజీ ఐసీక్రీం తినేవాడినని అన్నారు. చాల సమయం డైట్‌లోనే ఉంటాను కాబట్టి సడెన్‌గా నాలోపల ఉన్నవాడికి తినాలనే కోరిక మొదలవ్వగానే వెంటనే వెళ్లి ఏదో ఒకటి రెండు ఐస్‌క్రీమ్‌లు కాదు ఏకంగా 1/2 కేజీ ఐస్‌క్రీం లాగించేస్తాను. ఆ తర్వాత రోజు పూర్తిగా డైట్లో ఉండి, కసరత్తు చేస్తుంటానని అన్నారు. బరువు తగ్గే యత్నంలో ఉన్నప్పుడూ రోజుకి 1700 కేలరీలు ఉండే పిండి పదార్థాలు, కొవ్వు తక్కువుగా ఉన్నా ఆహారం, అలాగే 15 నుంచి 20 నిమిషాలు కార్డియో సెషన్లు చేయండి చాలు. మంచి ఫిట్నెస్గా ఉంటారు. ఇలా చేసే క్రమంలో ఒక్కోసారి డైట్ స్కిప్ అవుతుంది. అంతమాత్రాన వదిలేయకుండా మరసటి రోజు నార్మల్‌గా డైట్ ఫాలో అయిపోవాలంతే అన్నారు ఆదిత్య రాయ్. ఈ సెలబ్రిటీల డైట్ సీక్రెట్స్ అన్ని చూశాక కచ్చితంగా ఎవ్వరైనా అంతలా నోరు కట్టేసుకుని ఉండటం ఈజీ కాదు. అలా అని నోరు కట్టేసుకుని ఇబ్బంది పడక.. తినాలనిపించిన ఐటెమ్స్ హాయిగా తినేసి కాస్త వర్కౌట్ డోస్ పెంచడం తోపాటు డైట్లో కేలరీల తక్కువగా ఉన్నవి తీసుకుంటే చాలు. ఒక్కరోజుని డైట్‌ని స్కిప్ చేసినంత మాత్రన పూర్తిగా వదిలేయకూడదన్నది క్లియర్‌గా అర్థమవుతుంది. సో..! మీరు కూడా మీ వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణుల సాయంతో మంచి ఆరోగ్యకరమైన డైట్‌ని ఫాలో అవ్వండి, మంచి ఫిట్ నెస్‌తో బరువుని అదుపులో ఉంచుకోండి. -
ఒకప్పుడు అద్దె ఇంట్లో.. ఆ జ్ఞాపకాలు తెంచుకోలేక..
కష్టాలనే విజయానికి మెట్లుగా మెలుచుకుని ఎదిగిన హీరోలు ఎందరో! చీవాట్లు తిన్నచోటే చప్పట్లు కొట్టించుకుని, చులకనగా చూసిన కళ్లతోనే ఆరాధించేలా చూసుకుని, ఆఫీసుల చుట్టూ తిప్పుకున్నవాళ్లనే తన ఇంటి ముందుకు రప్పించుకున్నవాళ్లు ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు. వారిలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఒకరు. ప్రస్తుతం ఇతడు 'బడే మియా చోటే మియా' సినిమాతో ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఒకప్పుడు తాను అద్దెకు ఉన్న ఇంటిని కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు చెప్పాడు. రూ.500 అద్దె కట్టేవాళ్లం అక్షయ్ మాట్లాడుతూ.. 'నా బాల్యంలో నివసించిన ఇంటికి వెళ్తుంటే నా మనసుకు ఎంతో ఉల్లాసంగా అనిపిస్తుంది. దీని వెనక సైకాలజీ ఏంటో నాకు తెలీదు గానీ ఆ పాతింటికి వెళ్లడం నాకెంతో ఇష్టం. మేము ఆ ఇంట్లో ఉండేందుకు రూ.500 అద్దె చెల్లించేవాళ్లం. ఇప్పుడా బిల్డింగ్‌ను రెనోవేట్ చేస్తున్నారని తెలిసి ఆ భవంతిలోని మూడో అంతస్థును నేను కొనాలనుకుంటున్నట్లు చెప్పాను. ఆ ఇంటితో మాకు విడదీయరాని అనుబంధం ఉంది. ఆ ఎదురుచూపులు.. నాన్న ఉద్యోగానికి వెళ్తే.. నేను, చెల్లి.. ఆయన ఎప్పుడు వస్తాడా? అని గుమ్మం దగ్గర ఎదురుచూసేవాళ్లం. ఆ విజువల్స్ ఇప్పటికీ కళ్ల ముందు కనిపిస్తున్నాయి. ఇంటి ముందు జామ చెట్టు ఉండేది. చెట్టెక్కి వాటిని తెంపుకుని తినేవాళ్లం. ఇప్పటికీ ప్రతి నెలా అక్కడికి వెళ్లినప్పుడల్లా జామకాయలు తెంపుతూ ఉంటాను. అక్కడి నుంచే వచ్చాను. కాబట్టి ఆ ఇంటితో బంధాన్ని అలాగే కొనసాగించాలనుకుంటున్నాను' అని అక్షయ్ కుమార్ చెప్పుకొచ్చాడు. చదవండి: గ్రాండ్‌గా బుల్లితెర నటి సీమంతం.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతోంది! -
అలాంటి వార్తలతో నా కెరియర్ నాశనమైంది: స్టార్ హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్, అక్షయ్ కుమార్.. ఒకరంటే ఒకరికి ఇష్టం. ‘మొహ్రా’ సినిమా సెట్స్‌లో. రవీనా బోల్డ్ అండ్ బ్యూటీఫుల్నెస్కి ఫిదా అయ్యాడు అక్షయ్. ఉరకలేసే అతని ఉత్సాహానికి మనసిచ్చేసింది రవీనా. ఆ ప్రేమను రహస్యంగా ఉంచలేదు ఆ జంట.‘ఇద్దరూ పంజాబీలే. ఈడుజోడూ బాగుంది’ అని వాళ్లను చూసి ముచ్చట పడింది బాలీవుడ్ ఇండస్ట్రీ. అందురూ అనుకుంటున్న విధంగానే వారు పెళ్లి వార్త చెప్పారు. కానీ పెళ్లి తర్వాత రవీనా సినిమాలు చేయకూడదనే కండీషన్ పెట్టాడు అక్షయ్.. ఎందుకంటే.. తనను గృహిణిగానే ఉండాలని కోరుకున్నాడు అక్షయ్. కొన్నిరోజుల తర్వాత వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. ఆ తర్వాత అక్షయ్ మీద పలు వదంతులు వచ్చాయి. అతను మరో హీరోయిన్‌కు దగ్గరగా ఉంటున్నాడని ఆమెకు తెలిసింది. అక్షయ్ కోరిక మేరకు అప్పటికే రవీనా సినిమాలు ఆపేసింది. అలాంటి సమయంలో అక్షయ్‌పై రూమర్స్ రావడంతో బ్రేకప్ చేప్పేసి మళ్లీ సినిమాల్లో నటించడం ప్రారంభించింది. ఆత్మహత్య అంటూ తప్పుడు కథనాలు తప్పుడు సమాచారం, నకిలీ వార్తలు డిజిటల్ యుగంలో ఎక్కువయ్యాయని రవీనా తెలిపింది. ఇటీవలి ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 90వ దశకంలో ఒక పత్రిక తన అనారోగ్యాన్ని ఆత్మహత్యాయత్నంగా తప్పుగా నివేదించిందని రవీనా టాండన్ పేర్కొంది. చిత్ర పరిశ్రమలో తన ప్రతిష్టను దిగజార్చడంతో ఒక బాధాకరమైన అనుభవాన్ని కలిగించిందని తెలిపింది. 'అక్షయ్‌తో బ్రేకప్ జరగడం వల్లే నేను ఆత్మహత్యకు ప్రయత్నించానని పరోక్షంగా తప్పుడు కథనాలు రాసింది. ఆ సమయంలో నాకు బ్రెయిన్ ఫీవర్ వచ్చింది. దీంతో సుమారు 20 రోజులపాటు ఆస్పత్రిలో ఉండి చికిత్స తీసుకున్నాను. ఓ రకంగా ఆ వార్తలతో నా సినిమా కెరియర్ కూడా దెబ్బతినింది. నేను ఆత్మహత్య చేసుకునే రకం కాదు.. జీవితంలో పోరాడే రకం.' అని ఆమె చెప్పింది. ఇతరులపై గర్ల్‌ఫ్రెండ్‌ని ప్రయోగిస్తారు '1990లలో నటీనటుల మధ్య పోటీ చాలా ఎక్కువగానే ఉండేది. కానీ సెట్లో హీరోహీరోయిన్ల నటన, అఫైర్లు, వివాదాల గురించి చెప్పుకుంటూ సరదాగ అందరం మాట్లాడుకునే వాళ్లం. కానీ కొన్నిసార్లు ఇది శృతి మించి పోయే సందర్భాలు కూడా ఉన్నాయి. ఎవరైతే తమ కెరీర్ పట్ల అభద్రతా భావంతో ఉంటారో వారందరూ కూడా ఇతరుల విజయాన్ని ఓర్వలేకపోయేవాళ్లు. అలాంటి వారిలో కొందరు ఇతర నటీమణులను కిందికి లాగాలని ప్రయత్నించేవారు. అందుకోసం వాళ్ల బాయ్‌ఫ్రెండ్ లేదా గర్ల్‌ఫ్రెండ్‌ని ఇతరులపై ప్రయోగించేవాళ్లు. ఇలాంటి పరిస్థితి నేను కూడా ఎదుర్కొన్నాను. అలాంటి వారి వల్ల పలు ఇబ్బందులు కూడా పడ్డాను. అయితే నాకు తెలిసి ఉద్దేశపూర్వకంగా ఎవరి అవకాశాలను నిలువరించలేదు. ఎవరి మనసూ గాయపరచలేదు. ఎవరినీ సినిమాలోంచి తీసేయించాలని ప్రయత్నించలేదు. నాకు తెలియకుండా అలా జరిగి ఉంటే క్షమాపణ చెప్పడానికి ఇప్పటికీ నేను రెడీ’ అని చెప్పారు. నా ఎఫైర్స్ గురించి పిల్లలకు చెప్పాను 2004లో బిజినెస్మెన్ అనిల్ తడానీని పెళ్లి చేసుకుంది. వీరికి రాశా, రణ్‌బీర్ వర్దన్ సంతానం. పెళ్లికి ముందే 1995లో ఇద్దరు చిన్నారుల(పూజ, ఛాయ)ను దత్తత తీసుకుని వారికి తల్లయింది రవీనా. అయితే తన పిల్లల దగ్గర గతంలోని ప్రేమకథలతో సహా ఏదీ దాచనంటోంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నా ఎఫైర్స్ గురించి పేపర్లో కథలు కథలుగా రాస్తారు. అలాంటప్పుడు నేను తప్పించుకోలేను. అది చూసి నా పిల్లలు కంగారుపడొద్దు. అందుకే పత్రికలవారికంటే ముందే నేనే అన్ని నిజాలు పిల్లలకు చెప్పేస్తూ ఉంటాను. ఒకవేళ నేను చెప్పకుండా దాస్తే ఆ విషయం ఈరోజు కాకపోయినా రేపైనా ఎలాగోలా తెలిసిపోతుంది. అప్పుడు పరిస్థితులు దారుణంగా మారుతాయి. -
దిల్ సే సోల్జర్స్... దిమాక్ సే సైతాన్స్!
అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించిన యాక్షన్ చిత్రం ‘బడే మియా చోటే మియా’. మానుషీ చిల్లర్, ఆలయ హీరోయిన్లుగా పృథ్వీరాజ్ సుకుమారన్ , సోనాక్షీ సిన్హా కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించారు. జాకీ భగ్నానీ, వసు భగ్నాని, దీప్సిఖా దేశ్‌ముఖ్, అలీ అబ్బాస్ జాఫర్, హిమాన్షు కిషన్ మెహ్రా నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘ఎవరు నువ్వు..’, ‘ప్రళయం నేను..’, ‘ప్రపంచం ఇలాంటి ఓ యుద్ధాన్ని ఇప్పటివరకూ చూసి ఉండదు. మీ దగ్గర మూడే రోజులు ఉన్నాయి. మీరు ఇప్పుడు రెస్పాండ్ అవ్వాల్సిందే’, ‘అలాంటి ఓ సైకోని పట్టుకోవాలంటే ... ఆ సైకోను మించి సైకోలుగా మేం మారాల్సిన అవసరం ఉంది’, ‘దిల్ సే సోల్జర్స్.. దిమాక్ సే సైతాన్స్ హై ఓ’ అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. భారతదేశాన్ని నాశనం చేయాలనుకునే ఓ సైకో సైంటిస్ట్‌ను ఇద్దరు భారత సోల్జర్స్ ఏ విధంగా అడ్డుకున్నారు? అన్నదే ఈ చిత్రకథ. -
యాక్షన్ లవర్స్ గెట్ రెడీ.. 'బడే మియా చోటే మియా' వచ్చేస్తున్నారు!
ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలిసి నటిస్తున్న భారీ యాక్షన్ మూవీ ‘బడే మియా చోటే మియా’ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ కళ్ళు చెదిరే పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. మార్చి 26న ఈ చిత్ర ట్రైలర్ ని హిందీ, తెలుగు, తమిళం, మలయాళీ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ట్రైలర్ రిలీజ్ అనౌన్స్మెంట్ పోస్టర్ లో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ యాక్షన్ అవతారంలో కనిపిస్తున్నారు.భారీ బడ్జెట్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో ఉత్కంఠని పెంచే కథాంశం, నటీనటుల పెర్ఫామెన్స్, హై ఆక్టన్స్ యాక్షన్ సన్నివేశాలు అలరించబోతున్నాయి. అలీ అబ్బాస్ జాఫర్ రచన దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వశు భగ్నానీ, దీప్షిక దేశముఖ్, జాకీ భగ్నానీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రంజాన్ కానుకగా ఈ చిత్రం ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. REAL ACTION ka ek bada dose lekar aa rahe hain #BadeMiyanChoteMiyan!#BadeMiyanChoteMiyanTrailer out on March 26! 👊 🤜🤛 IN CINEMAS ON 10th APRIL! #BadeMiyanChoteMiyanOnApril10 #BadeMiyanChoteMiyanOnEid2024 pic.twitter.com/Wzw1BbpwYf — Akshay Kumar (@akshaykumar) March 23, 2024 -
IPL 2024 Opening Ceremony: అట్టహాసంగా ఆరంభం
IPL 2024 Opening Ceremony: ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ ఆరంభ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ డ్యాన్స్‌తో దుమ్ములేపారు. జోష్‌గా స్టెప్పులేస్తూ చెపాక్ స్టేడియాన్ని హోరెత్తించారు. 𝗣𝗼𝘄𝗲𝗿𝗵𝗼𝘂𝘀𝗲 💥@iTIGERSHROFF starts the #TATAIPL Opening Ceremony with his energetic performance 😍👏 pic.twitter.com/8HsssiKNPO — IndianPremierLeague (@IPL) March 22, 2024 𝙀𝙡𝙚𝙘𝙩𝙧𝙞𝙛𝙮𝙞𝙣𝙜 ⚡️⚡️ Chennai erupts in joy as @akshaykumar leaves his mark at the #TATAIPL Opening Ceremony 🥳 pic.twitter.com/TMuedfuvyU — IndianPremierLeague (@IPL) March 22, 2024 💃🕺 Chennai grooves to the melodies of Sonu Nigam during the Opening Ceremony#TATAIPL pic.twitter.com/jVnlskQKQj — IndianPremierLeague (@IPL) March 22, 2024 అనంతరం సోనూ నిగమ్ మధుర గాత్రంతో వందేమాతరం ఆలాపనతో ప్రేక్షకుల్లోని దేశభక్తిని తట్టిలేపగా... ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ మా తుజే సలాంతో గూప్‌బంప్స్ తెప్పించాడు. ఆ తర్వాత మోహిత్ చౌహాన్ కూడా ఈ స్వర తరంగానికి తోడయ్యాడు. భల్లే లక్కా, మసక్కలి, ఛయ్య ఛయ్య పాటలతో దుమ్ములేపాడు. అనంతరం లేడీ సింగర్లు నీతి మోహన్ బర్సోరే సాంగ్‌తో శ్రోతల చెవుల్లో స్వాతి చినుకుల వర్షం కురిపించింది. 𝙰 𝙼𝚞𝚜𝚒𝚌𝚊𝚕 𝙼𝚊𝚜𝚝𝚎𝚛𝚢 🎶@arrahman has left everyone in awe of his brilliance at the #TATAIPL Opening Ceremony 😍 🙌 pic.twitter.com/tbiiROXdog — IndianPremierLeague (@IPL) March 22, 2024 బీసీసీఐ బాస్‌లు, కెప్టెన్ల ఆగమనం వినోద కార్యక్రమాలు ముగిసిన తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా మిగతా ఆఫీస్ బేరర్లు వేదిక మీదకు విచ్చేశారు. ఆ తర్వాత ఢిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్-2024 ట్రోఫీని స్టేజీ మీదకు తీసుకువచ్చాడు. అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కూడా వేదిక మీదకు చేరుకున్నాడు. అంతా కలిసి ట్రోఫీతో ఫోజులిచ్చారు. అనంతరం ఆరంభ మ్యాచ్‌కు సిద్ధమయ్యారు. -
ఐపీఎల్ 2024 ఓపెనింగ్ సెర్మనీలో పెర్ఫార్మ్ చేయబోయేది వీరే..!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 17వ ఎడిషన్ మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియం (చెపాక్) వేదికగా మార్చి 22న జరుగనుంది. ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఆర్సీబీతో తలపడుతుంది. భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ఈ మెగా ఫైట్ ప్రారంభమవుతుంది. AR Rahman, Sonu Nigam, Akshay Kumar and Tiger Shroff will perform at the IPL opening ceremony. pic.twitter.com/9kR2dpyOOV — Mufaddal Vohra (@mufaddal_vohra) March 20, 2024 సీజన్ తొలి మ్యాచ్ కావడంతో మ్యాచ్‌కు ముందు ఓపెనింగ్ సెర్మనీ అరేంంజ్ చేశారు నిర్వహకులు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ నటులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్, సింగర్ సోనూ నిగమ్ పెర్ఫార్మ్ చేయనున్నారు. ఈ కార్యక్రమం మ్యాచ్ ప్రారంభానికి గంట ముందు (6:30 గంటలకు) జరుగనుంది. ఈ ఈవెంట్‌ను స్టార్ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనుండగా.. జియో సినిమాలో డిజిటల్ స్ట్రీమింగ్ జరుగనుంది. ఇదిలా ఉంటే, సీఎస్కే-ఆర్సీబీ మధ్య హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఐదు సార్లు ఛాంపియన్ అయిన సూపర్ కింగ్స్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఘనమైన రికార్డు ఉంది. ఈ ఇరు జట్లు ఐపీఎల్లో 31 సార్లు ఎదురెదురుపడగా.. సీఎస్కే 20, ఆర్సీబీ 10 సందర్భాల్లో విజయం సాధించాయి. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. చెపాక్ విషయానికొస్తే.. ఈ మైదానంలో సీఎస్కే ఆర్సీబీపై సంపూర్ణ ఆధిపత్యం కలిగి ఉంది. ఇక్కడ ఇరు జట్లు 8 మ్యాచ్‌ల్లో తలపడగా.. సీఎస్కే ఏకంగా ఏడు మ్యాచ్‌ల్లో జయకేతనం ఎగురవేసింది. కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఆర్సీబీ విజయం సాధించింది. -
Viral Video: అక్షయ్ కుమార్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన సచిన్ టెండూల్కర్
లోకల్ టాలెంట్‌ను వెలికి తీసి సాన పెట్టడమే లక్ష్యంగా పురుడుపోసుకున్న ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ టీ10 లీగ్ (ఐఎస్పీఎల్) ఇవాళ (మార్చి 6) ప్రారంభమైంది. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పోటీపడనుండగా.. ఈ జట్లను టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ తారలు కొనుగోలు చేశారు. Sachin & Raina in the frame in ISPL. - The iconic duo of 2011 World Cup. pic.twitter.com/bArjQcB0a4 — Johns. (@CricCrazyJohns) March 6, 2024 మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును కొనుగోలు చేయగా.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మఝీ ముంబైను.. అక్షయ్ కుమార్ శ్రీనగర్ వీర్‌ను.. హృతిక్ రోషన్ బెంగళూరు స్ట్రయికర్స్‌ను.. సైఫ్ అలీ ఖాన్-కరీనా కపూర్ టైగర్స్ ఆఫ్ కోల్‌కతాను.. తమిళ సూపర్ స్టార్ సూర్య చెన్నై సింగమ్స్ జట్లను కొనుగోలు చేశారు. .@sachin_rt x @AlwaysRamCharan ft. Naatu Naatu.pic.twitter.com/2OeKsz0HcN — CricTracker (@Cricketracker) March 6, 2024 ఐఎస్పీఎల్ ప్రారంభానికి ముందు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్, సూర్య, అక్షయ్ కుమార్‌లతో కలిసి హైదరాబాద్ జట్టు ఓనర్ రామ్‌చరణ్ సందడి చేశారు.చెర్రీ వీరందరితో ట్రిపుల్ ఆర్ ఫేమ్ నాటు నాటు పాటకు స్టెప్పులేయించాడు. Sachin Tendulkar in action. 😍pic.twitter.com/a4cZsm2qof — Mufaddal Vohra (@mufaddal_vohra) March 6, 2024 Suriya in action! 🔥 pic.twitter.com/OB9kj4IiZ6 — Mufaddal Vohra (@mufaddal_vohra) March 6, 2024 అనంతరం సచిన్ సారథ్యంలోని టీమ్ మాస్టర్స్ ఎలెవెన్ జట్టు.. అక్షయ్ కుమార్ నేతృత్వంలోని టీమ్ ఖిలాడీతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో సచిన్.. అమిర్ హుసేన్ అనే దివ్యాంగ క్రికెటర్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అక్షయ్ కుమార్ వేసిన తొలి ఓవర్లోనే సచిన్ భారీ సిక్సర్ బాదాడు. Kareena Kapoor and Saif Ali Khan at the ISPL inauguration. pic.twitter.com/BuH2koP5zo — Mufaddal Vohra (@mufaddal_vohra) March 6, 2024 దీనికి సంబంధించిన వీడయో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. కాగా, ఈ ప్రాకీస్ మ్యాచ్ అనంతరం లీగ్ తొలి మ్యాచ్ మొదలైంది. రాత్రి 7 గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో అమితాబ్ జట్టు మఝీ ముంబై.. అక్షయ్ కుమార్ జట్టైన శ్రీనగర్ వీర్‌తో తలపడుతుంది. Suriya hugging Sachin Tendulkar. - A beautiful moment in ISPL. pic.twitter.com/U5b8ThihXb — Johns. (@CricCrazyJohns) March 6, 2024 SACHIN TENDULKAR LEAD TEAM WON THE ISPL FRIENDLY MATCH.....!!! 👌 pic.twitter.com/JZLtOHfIyr — Johns. (@CricCrazyJohns) March 6, 2024 -
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ టీ10 లీగ్ నేటి నుంచి ప్రారంభం
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ టీ10 లీగ్ (ఐఎస్పీఎల్) తొలి ఎడిషన్ నేటి నుంచి (మార్చి 6) ప్రారంభంకానుంది. ఈ కొత్త క్రికెట్ లీగ్ భారత దేశపు నలుమూలల్లో దాగివున్న యంగ్ టాలెంట్‌ను వెలికితీయడమే లక్ష్యంగా రూపొందించబడింది. ఈ లీగ్ ద్వారా పరిచమయ్యే ఆటగాళ్లకు సరైన శిక్షణ ఇచ్చి, తగు ప్రోత్సాహకాలతో పోటీ ప్రపంచంలో నిలబెట్టాలన్నది నిర్వహకుల ఆలోచన. జట్లను కొనుగోలు చేసిన ప్రముఖ సినీ తారలు.. ఐఎస్పీఎల్లో వివిధ ప్రాంతాలకు చెందిన ఆరు జట్లు పోటీపడనున్నాయి. ఈ జట్లను టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ తారలు కొనుగోలు చేశారు. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును కొనుగోలు చేయగా.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మఝీ ముంబైను.. అక్షయ్ కుమార్ శ్రీనగర్ వీర్‌ను.. హృతిక్ రోషన్ బెంగళూరు స్ట్రయికర్స్‌ను.. సైఫ్ అలీ ఖాన్-కరీనా కపూర్ టైగర్స్ ఆఫ్ కోల్‌కతాను.. తమిళ సూపర్ స్టార్ సూర్య చెన్నై సింగమ్స్ జట్లను కొనుగోలు చేశారు. చీఫ్ మెంటార్‌గా రవిశాస్త్రి.. ఈ లీగ్‌కు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి చీఫ్ మెంటార్‌గా వ్యవహరించనుండగా.. భారత మాజీ ఆటగాళ్లు ప్రవీణ్ ఆమ్రే, జతిన్ పరంజపే సెలెక్షన్ కమిటీ హెడ్లుగా పని చేయనున్నారు. అమితాబ్ వర్సెస్ అక్షయ్.. ఈ లీగ్‌లోని తొలి మ్యాచ్‌లో అమితాబ్ మఝీ ముంబై.. అక్షయ్ కుమార్ శ్రీనగర్ వీర్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ థానేలోని దాదోజీ కొండదేవ్ స్టేడియంలో జరుగనుంది. ఈ లీగ్‌లోని అన్ని మ్యాచ్‌లు ఇదే వేదికగా జరుగనున్నాయి. రాత్రి 7 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లను సోనీ స్పోర్ట్స్ టెన్ 2 టీవీ ఛానెల్లో చూడవచ్చు. అలాగే సోనీ లివ్ యాప్‌లోనూ వీక్షించవచ్చు. సచిన్ జట్టుతో తలపడనున్న అక్షయ్ టీమ్.. ఇవాళ జరుగబోయే ఓపెనింగ్ మ్యాచ్‌కు ముందు ఓ ప్రత్యేక క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సారథ్యంలోని టీమ్ మాస్టర్స్ ఎలెవెన్ జట్టు.. అక్షయ్ కుమార్ నేతృత్వంలోని టీమ్ ఖిలాడీతో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుంది. -
గౌతమ్ గంభీర్ స్థానంలో అక్షయ్ కుమార్?
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీల్లో హుషారు పెరిగిపోతోంది. తూర్పు ఢిల్లీ నుంచి భారతీయ జనతా పార్టీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఆయన ఒక ట్వీట్లో తనను రాజకీయ బాధ్యతల నుంచి తప్పించాలని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలను కోరారు. అదే సమయంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌ను బీజేపీ ఇక్కడి నుంచి ఎన్నికల రంగంలోకి దించవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గౌతమ్ గంభీర్ తాను ఇకపై తన క్రికెట్ కమిట్మెంట్లపై దృష్టి పెడతానని అంటున్నారు. ఈ నేపధ్యంలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌ను బీజేపీ.. ఢిల్లీలోని ఒక స్థానం నుండి ఎన్నికల్లో పోటీ చేయమని కోరనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఆయనతో కొందరు పార్టీ నేతలు టచ్‌లో ఉన్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అక్షయ్ కుమార్ కూడా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్షయ్ కెరీర్ గ్రాఫ్ పడిపోతోంది. అతని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. దీంతో ఆయన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ సీటు నుంచి ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల అభ్యర్థులు బరిలో నిలిచారు. నాటి ఎన్నికల్లో గౌతమ్ గంభీర్ 6,96,156 ఓట్లతో విజయం సాధించారు. -
Lok Sabha elections 2024: చాంద్నీ చౌక్ నుంచి అక్షయ్‌కుమార్ ?
సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో చాంద్నీ చౌక్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యరి్థగా బరిలో దిగొచ్చని వార్తలొచ్చాయి. దీనిపై ఇప్పటికే పార్టీ నేతలు అక్షయ్‌ను ఒకసారి సంప్రదించారని జాతీయ మీడియాలో వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఢిల్లీలో గతంలో గెలిచిన మొత్తం 7 లోక్‌సభ స్థానాలను తిరిగి ఈసారి కూడా దక్కించుకోవాలని కమలదళం పట్టుదలతో ఉంది. సినిమాల్లోకి రాకముందు గతంలో చాలా సంవత్సరాలు ఢిల్లీ చాంద్నీ చౌక్ ప్రాంతంలో అక్షయ్‌కుమార్ నివసించారు. అందుకే స్థానికతను దృష్టిలో ఉంచుకుని అక్షయ్‌కుమార్‌ను బరిలోకి దింపితే ఎలా ఉంటుంది అని బీజేపీ లోతైన లెక్కలు వేస్తోందని సమాచారం. గడిచిన 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ అన్నిస్థానాలను స్వీప్ చేసింది. ఈ ఏడాది అదే ఊపు కొనసాగించాలని భావిస్తోంది. అయితే ప్రస్తుత ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్‌ల మధ్య పొత్తులు కుదరడంతో మూడు స్థానాల్లో కాంగ్రెస్, 4 స్థానాల్లో ఆప్ బరిలో దిగాలని నిర్ణయించుకున్నాయి. దీంతో ఈ ఏడు స్థానాల్లో త్రిముఖపోరు కాస్తా ద్విముఖ పోరుగా మారింది. దీంతో అభ్యరి్థని మరింత ఆచితూచి ఎంపికచేయాలని బీజేపీ భావిస్తోంది. -
స్టార్ హీరో ఫ్లాట్ కొనుక్కున్న మిమిక్రీ క్వీన్, ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు!
బాలీవుడ్ స్టార్హీరోయిన్ అలియాభట్‌ను అనుకరించి పాపులర్ ముద్దుగుమ్మ చాందినీ భబ్దా గుర్తుందా? ఇపుడు మరో ఇంట్రస్టింగ్ న్యూస్‌తో వార్తల్లో నిలిచింది. విషయం ఏమిటంటే...! కంటెంట్ క్రియేటర్, చాందినీ భాబ్దా తన మిమిక్రీతో సోషల్ మీడియాలో బాగా పాపులర్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమె ఫాలోవర్ల సంఖ్య 4.5 లక్షల కంటే ఎక్కువే. తాజాగా తన లైఫ్‌లో ఒకముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. చాందినీ ముంబైలో ఒక విలాసవంతమైన ఫ్లాట్‌ని కొనుగోలు చేసింది. అదీ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఫ్లాట్‌ను కొనుగోలు చేసిందట. ఈఎంఐ అయినా.. 25ఏళ్ల లోపే సొంత ఇల్లు అంటూ ఆనందంలో మునిగి తేలుతూ సంబంధించిన సమాచారాన్ని ఇన్‌స్టాలో తన ఫ్యాన్స్‌తో షేర్ చేసింది. కుటుంబ సభ్యులతో కలిసి గృహ ప్రవేశ పూజాకార్యాక్రమాలను నిర్వహించింది. అంతేకాదు తనదైన స్టయిల్లో రెన్నోవేషన్ కూడా చేయనుందట త్వరలోనే. యాక్టింగ్‌పై కూడా అభిరుచి ఉన్న ఈ అమ్మడు ‘కానిస్టేబుల్ గిరాప్డే’ అనే కామెడీ టీవీషోలో అలరించింది. ప్రస్తుతం బాలీవుడ్లో అవకాశకాశాల కోసం ఎదురు చూస్తోంది. వృత్తిరీత్యా న్యాయవాది అయిన చాందినీ భబ్దా అలియాతో పాటు హీరోయిన్లు అనన్య పాండే, కంగనా రనౌత్ వాయిస్‌లను కూడా బాగా అనుకరిస్తుంది. అయితే తన వాయస్‌ను అనుకరించడంపై స్పందించిన అలియా చాందినినీ ప్రశంసల్లో ముచెత్తడం,దీనికి చాందినీ సంతోషంగా ఉబ్బితబ్బిబ్బవడం తెలిసిందే. View this post on Instagram A post shared by Chandni Bhabhda 🧿 (@chandnimimic) -
నా కూతుర్ని కుక్కపిల్ల కరిచింది: హీరోయిన్
ఒకప్పుడు బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణించింది ట్వింకిల్ ఖన్నా. తెలుగులోనూ ఓ సినిమా చేసింది. వెంకటేశ్ హీరోగా నటించిన శీను మూవీలో యాక్ట్ చేసింది. ఎప్పుడైతే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌ను పెళ్లాడిందో అప్పుడే సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది. నటిగా మళ్లీ పూర్తిస్థాయిలో వెండితెరపై కనిపించలేదు. 2010లో వచ్చిన తీస్మార్ ఖాన్‌లో మాత్రం అతిథి పాత్రలో మెరిసింది. నటనకు దూరమైనా నిర్మాతగా కొన్ని చిత్రాలు తెరకెక్కించింది. అనంతరం రచయిత్రిగానూ మారి పుస్తకాలు రాసింది. కుక్క కరిచింది.. ఇక అక్షయ్-ట్వింకిల్ దంపతులకు కుమారుడు ఆరవ్(21), కూతురు నితార(11) సంతానం. ఈ మధ్య తన కూతురికి కుక్క కరిచిందని చెప్పుకొచ్చింది ట్వింకిల్. 'క్రిస్మస్ రోజు ఎవరో అనుకోకుండా మా కుక్కపిల్ల ఫ్రెడ్డీ కోసం ప్లేటులో చికెన్ పెట్టి అది మా పిల్లల ముందు పెట్టారు. అది చూసిన ఫ్రెడ్డీ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ముక్కల్ని కొరకడం ప్రారంభించింది. అయితే ఆ చికెన్ ముక్కలు వెదురు పుల్లలకు తగిలించి ఉన్నాయి. అవి ఎక్కడ కుక్క గొంతులో ఇరుక్కుపోతాయో, అలాగే మింగేస్తే దానికి హాని కలుగుతుందేమోనన్న భయంతో నా కూతురు వాటిని దాని నోటిలో నుంచి తీయడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో కుక్క తన చేతుల్ని కొరికింది. ఏం కాదులే అని శునకాన్ని వెనకేసుకొచ్చింది వెంటనే తనకు రేబిస్, టెటానస్ ఇంజక్షన్స్ వేయించాను. అయినా తనేమాత్రం భయపడలేదు, బాధపడలేదు. పైగా ఫ్రెడ్డీని వెనకేసుకొచ్చింది. ఇది అనుకోకుండా జరిగిపోయిందిలే.. అదేం కావాలని కరవలేదు.. ఫ్రెడ్డీకి బాగుంటే అంతే చాలని చెప్పింది. ఒకవేళ నేను పొరపాటున తన వేళ్లను కట్ చేసినా, అనుకోకుండా గాయపర్చినా నామీద ఎన్ని నిందారోపణలు వచ్చేవో! ఇప్పుడే కాదు ఇంకో 20 ఏళ్ల తర్వాత కూడా దాని గురించి సీరియస్‌గా మాట్లాడుకునేవారు' అని అభిప్రాయపడింది. View this post on Instagram A post shared by Nitara bhatia (@nitara_kumar) చదవండి: స్టార్ హీరో సినిమాలో గూండాగా.. ఎందుకు చేశానా? అని బాధపడ్డా.. -
బడే మియా ఛోటే మియా మూవీ టీజర్
-
'మాతో పెట్టుకోకండి, మేం భారతీయులం..' బాలీవుడ్ మూవీ టీజర్ చూశారా?
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘బడే మియా ఛోటే మియా’. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవలే ఫస్ట్ పోస్టర్ బయటకి వచ్చింది. ఇందులో అక్షయ్, టైగర్ ఇద్దరు గన్స్ పట్టుకోని యాక్షన్ మోడ్‌లో కనిపించారు. ఈ పోస్టర్లో రిలీజ్ డేడ్ను కూడా ప్రకటించారు. ఈద్ సందర్భంగా ఏప్రిల్‌లో బడే మియా చోటే మియా సినిమా రిలీజ్ కానుంది. టీజర్ రిలీజ్ గురువారం ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. పృథ్వీరాజ్ సుకుమారన్ వాయిస్ ఓవర్‌తో టీజర్ మొదలైంది. "ప్రళయం రాబోతోంది.. ఆ మహా ప్రళయం భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలను మార్చేస్తుంది... ఆ మహా ప్రళయం మంచి చెడుల మధ్య జరిగే సంఘర్షణలను శాశ్వతంగా నిర్ములిస్తుంది. హిందుస్తాన్ నాశనమైపోతుంది. మమ్మల్నెవరు ఆపుతారు? అన్న డైలాగ్ వినిపిస్తుంది. మాతో పెట్టుకోకండి, మేం భారతీయులం.. సరిగ్గా అప్పుడే రంగంలోకి దిగిన ఇద్దరు హీరోలను చూపిస్తారు. 'సైనికుడి వీరత్వం, సైతాన్ క్రూరత్వం మా సొంతం. మాతో పెట్టుకోకండి, మేం భారతీయులం' అనే డైలాగ్ గూస్బంప్స్ తెప్పిస్తోంది. ఈ సినిమాకు ఏక్ థా టైగర్, సుల్తాన్ సినిమాల ఫేమ్ అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తుండగా.. మానుషి చిల్లర్, సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా నటిస్తున్నారు. -
రంజాన్‌కు పెద్దోడు.. చిన్నోడు...
రంజాన్‌కు థియేటర్స్‌కు వస్తున్నారు ‘బడే మియా చోటే మియా’ (పెద్దోడు.. చిన్నోడు). అక్షయ్‌కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటిస్తున్న యాక్షన్ ఫిల్మ్ ‘బడే మియా చోటే మియా’. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, సోనాక్షీ సిన్హా, మానుషీ చిల్లర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హిందీలో ‘సుల్తాన్’, ‘టైగర్ జిందా హై’ వంటి హిట్ సినిమాలను తీసిన దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. స్కాట్లాండ్, యూఎస్, ఇండియా, లండన్ వంటి లొకేషన్స్‌లో కొంత భాగం చిత్రీకరణ జరిగింది. కాగా ఈ చిత్రం టీజర్‌ను ఈ నెల 24న విడుదల చేయనున్నట్లు, ఈ ఏడాది రంజాన్ సందర్భంగా సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించి, కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘ప్రపంచం అంతం అవుతుందన్నప్పుడు మా హీరోలు మాత్రం రైజ్ అవుతుంటారు’ అనే క్యాప్షన్‌ని ఈ పోస్టర్‌కు జత చేశారు. -
సూపర్ విమెన్‌ను పెళ్లి చేసుకున్నా..భర్తగా గర్వంగా ఉంది: అక్షయ్ కుమార్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సతీమణి ట్వింకిల్ ఖన్నా తాజాగా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది. 50 ఏళ్ల వయసులో లండన్ యూనివర్సీటీ((గోల్డ్స్మిత్స్) నుంచి మాస్టర్స్ గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అక్షయ్ తన సోషల్ మీడియా ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. (చదవండి: నేనే పాపం చేశాను.. నాపై ఎందుకింత పగ?: నటి) ‘చదువుకోవాలని ఉందని రెండేళ్ల క్రితం నువ్వు నాతో చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను. కానీ చాలా కష్టపడి అనుకున్నది సాధించావు. ఇల్లు, కెరీర్, పిల్లలను అన్నింటిని చూసుకుంటూ చదువు ప్రయాణాన్ని కొనసాగించి, విజయం సాధించావు. నేను సూపర్ విమెన్‌ను పెళ్లి చేసుకున్నా. భర్తగా ఎంత గర్వపడుతున్నానో చెప్పేందుకు నేనూ ఇంకా చదువుకోవాలనుకుంటున్నా. కంగ్రాట్స్ మై లవ్’ అని ఇన్‌స్టాలో రాసుకొస్తూ.. ట్వింకిల్ పట్టా అందుకున్న సందర్భంగా ఆమెతో దిగిన ఫోటోని షేర్ చేశాడు. అక్షయ్ పోస్ట్‌పై ట్వింకిల్ ఖన్నా స్పందిస్తూ.. ‘ప్రొత్సహించిన భర్త దొరకడం నా అదృష్టం’అని అన్నారు. (చదవండి: అరెరె... ఇది తెలీక వేరే కథతో సినిమా తీస్తున్నానే..: మారుతి) ఇక ట్వింకిల్ ఖన్నా విషయానికొస్తే.. తల్లిదండ్రులు డింపుల్ కపాడియా, రాజేశ్ ఖన్నా వారసురాలిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ‘బర్సాత్’(1995) ఆమె తొలి చిత్రం. ఆ తర్వాత ‘జాన్’, ‘దిల్ తేరా దీవానా’, ‘ఇంటర్నేషనల్ ఖిలాడి’ తదితర చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి మెప్పించింది.వెంకటేష్ హీరోగా నటించిన ‘శీను’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో చాలా ఆఫర్స్ వచ్చినప్పటికీ.. ట్వింకిల్ నటించలేదు. అక్షయ్‌తో పెళ్లి తర్వాత నటనతో గుడ్‌బై చెప్పింది. వీరిద్దరికి వీరికి కుమారుడు ఆరవ్ (21), కుమార్తె నితారా (11) ఉన్నారు. View this post on Instagram A post shared by Akshay Kumar (@akshaykumar) -
టిపు టిపు బర్సా పానీ వానై కురిసింది మనీ
దేశాలకు సరిహద్దులు ఉండవచ్చుగానీ పాటలకు ఉండవు. ఒక పాట సూపర్ డూపర్ హిట్ అయితే అది ఏ దేశం పాట అయినా ‘ఇది మన పాటే’ అన్నట్లుగా జనాలు ఇష్టపడతారు. దీనికి తాజా ఉదాహరణ ఈ వీడియో. అప్పుడెప్పుడో వచ్చిన అక్షయ్ కుమార్, రవీనా టాండన్ సినిమా ‘మోహ్రా’లోని ‘టిపు టిపు బర్సా పానీ’ పాట ఎంత హిట్టో తెలిసిందే. ఇప్పటికీ ఫంక్షన్లలో, పెళ్లి ఊరేగింపులలో ఈ పాట వినిపిస్తూనే ఉంటుంది. ఈ సూపర్ హిట్ సాంగ్‌ను పాకిస్థాన్‌లోని ఒక బృందం డోలక్ వాయిస్తూ పాడుతున్న వీడియో వైరల్ అయింది. పాట పాడుతున్నంతసేపు కాసుల వర్షం కురుస్తూనే ఉంది! -
2024లో బాలీవుడ్ నుంచి సత్తా చాటేది ఎవరు..?
కొత్త ఏడాదిలో బాలీవుడ్ నుంచి చాలా సినిమాలు లైన్లో ఉన్నాయి. 2023లో పఠాన్, జవాన్, గదర్ 2, యానిమల్ చిత్రాలు మాత్రమే మెప్పించాయి. గతేడాదిలో బాలీవుడ్లో పెద్దగా సినిమాలు సందడి చేయలేదు. గతేడాది చివర్లో సలార్, యానిమల్ చిత్రాలే అక్కడ ఎక్కువగా మెప్పించాయి. 2024లో కూడా బాలీవుడ్ నుంచి పెద్దగా చిత్రాలు లేవని చెప్పవచ్చు. దీంతో ఇతర భాషా చిత్రాలకు అక్కడ మరింత గుర్తింపు తెచ్చుకుంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కొత్త సంవత్సరంలో అజయ్ దేవగన్ 'సింగమ్ ఎగైన్', హృతిక్ రోషన్ 'ఫైటర్' అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కాంబినేషన్ నుంచి 'బడే మియాన్ చోటే మియాన్ ', 'జిగ్రా' టైటిల్‌తో అలియా భట్ వస్తుండగా.. 'వెల్కమ్ టు ది జంగిల్' చిత్రంతో మరోసారి అక్షయ్ కుమార్ 2024లో పలకరించనున్నారు. కొత్త ఏడాదిలో అక్షయ్, యాదృచ్ఛికంగా, తనకు ఇష్టమైన యాక్షన్- కామెడీ జానర్‌కి తిరిగి రావడం విశేషం. ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వస్తున్న పాన్- ఇండియా చిత్రం ‘కల్కి 2898 AD’ కూడా బాలీవుడ్లో ఈసారి మరింత జోష్ నింపడం దాదాపు ఖాయం. ఇందులో ప్రభాస్, దీపికా పదుకొనే, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్స్ ఉన్నారు. 2024లో టబు, కరీన్ కపూర్, కృతి సనన్ల ‘ది క్రూ’ చిత్రంతో పాటు కాజోల్ నటించిన ‘దో పట్టి’ మూవీపై కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ ఏడాది బాలీవుడ్లో హీరోయిన్ ఓరియంటేడ్ చిత్రాలు కూడా కనిపిస్తాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు దేశం మొత్తం ఓటు వేయడానికి రెడీగా ఉంది. ఇలాంటి సమయంలో పంకజ్ త్రిపాఠి నటించిన దివంగత ప్రధాని అటల్ బీహార్ వాజ్‌పేయి బయోపిక్ (Main Atal Hoon) విడుదల చేయేనున్నారు. రాజకీయ డ్రామాగా ఈ చిత్రం రానుంది. మరొక చిత్రం కంగనా రనౌత్ నిర్మిస్తున్న 'ది ఎమర్జెన్సీ' కూడా ఇదే ఏడాదిలో రానుంది. ఇందిరా గాంధీ పాత్రను కంగనా పోషిస్తుంది. -
పొగాకు ఉత్పత్తుల ప్రకటనల్లో పాల్గొంటున్నందుకు..
లక్నో: పొగాకు కంపెనీల తరఫున ప్రకటనల్లో కన్పిస్తున్న బాలీవుడ్ నటులు షారూక్ ఖాన్, అక్షయ్‌కుమార్, అజయ్ దేవ్‌గణ్‌లకు కేంద్రం నోటీసులు పంపింది. ప్రజల ఆరోగ్యానికి చేటు తెస్తున్న పొగాకు ఉత్పత్తుల ప్రకటనల్లో సెలబ్రిటీలు, ముఖ్యంగా పద్మ అవార్డు గ్రహీతలు నటిస్తుండటంపై మోతీలాల్ యాదవ్ అనే న్యాయవాది గతంలో అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. కేంద్రం స్పందించడం లేదని, ఇది ధిక్కరణేనని పిటిషనర్ మరోసారి కోర్టుకు వెళ్లారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం న్యాయస్థానం విచారణ చేపట్టింది. షారూక్, అక్షయ్, అజయ్‌లకు సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అక్టోబర్ 20వ తేదీనే నోటీసులిచ్చిందని కేంద్రం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఎస్బీ పాండే కోర్టుకు తెలిపారు. ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నందున పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు. విచారణ 2024 మే 9కి వాయిదా పడింది. -
చచ్చినా సరే ఆ స్టార్ హీరోకి తల్లిగా మళ్లీ నటించను: ప్రముఖ నటి
నటులు అన్నాక ఏ పాత్రయినా సరే చేయాలి. అలా వయసు తక్కువగా ఉన్నాసరే కొందరు లేడీ యాక్టర్స్.. తల్లి, ఆంటీ తరహా పాత్రలు చేస్తుంటారు. గుర్తింపుతో పాటు ఫన్నీ ట్రోల్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఇలాంటి క్రిటిసిజం ఎదుర్కొన్న ఓ నటి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఓ స్టార్ హీరోకి తల్లిగా జీవితంలో మళ్లీ నటించనని క్లారిటీ ఇచ్చింది. (ఇదీ చదవండి: ప్రేమలో పడిన మరో తెలుగు హీరోయిన్.. త్వరలో పెళ్లి!) ఇంతకీ ఏమైంది? 'రంగీలా' సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన షెఫాలీ షా.. సత్య, గాంధీ లాంటి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది. 2005లో రిలీజైన 'వఖ్త్: ద రేస్ ఎగైనెస్ట్ టైమ్' మూవీలో అక్షయ్ కుమార్‌కి తల్లిగానూ నటించింది. ఆ సినిమాలో నటించేటప్పటికీ.. అక్షయ్ కంటే షెఫాలీ నాలుగేళ్లు చిన్నది. కానీ మదర్ క్యారెక్టర్ చేసింది. తాజాగా ఈ మూవీ గురించి మాట్లాడుతూ.. జీవితంలో మరోసారి అక్షయ్‌కి తల్లి పాత్ర చేయనని కుండ బద్ధలు కొట్టేసింది. గత 25-30 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాసరే గత నాలుగేళ్లుగానే బాగా పనిచేస్తున్నట్లు షెఫాలీ షా చెప్పుకొచ్చింది. షారుక్, అమితాబ్ బచ్చన్ ఎప్పటికీ స్టార్స్ అని చెప్పిన ఈమె.. ప్రస్తుత జనరేషన్లో అయితే రణ్వీర్ సింగ్, ఆలియా భట్ స్టార్స్ అని తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. అయితే తాను మాత్రం ఎప్పటికీ స్టార్ యాక్టర్ కావాలనుకోవట్లేదని చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: మూడు రోజుల వేడుక.. వరుణ్-లావణ్య పెళ్లి ముహూర్తం టైమ్ ఇదే!) -
ఆస్కార్ రేసులో...
ఆస్కార్ రేసులో హిందీ చిత్రం ‘మిషన్ రాణిగంజ్’ను ప్రవేశపెట్టారు. టినూ సురేష్ దేశాయ్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్, పరిణీతీ చోప్రా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మిషన్ రాణిగంజ్’. ఈ నెల 6న విడుదలైన ఈ సినిమా వసూళ్ల పరంగా చెప్పుకోదగ్గ విధంగా లేనప్పటికీ మేకింగ్ పరంగా మెప్పించింది. పశ్చిమ బెంగాల్‌లోని ఓ బొగ్గు గనిలో వరదలు సంభవించినప్పుడు జస్వంత్ సింగ్ గిల్ అనే ఇంజనీర్ 65 మంది కార్మికులను ఏ విధంగా రక్షించాడు? అన్నదే ఈ చిత్రకథ. జస్వంత్ సింగ్ గిల్‌గా అక్షయ్ కుమార్ నటించారు. ఇక 96వ ఆస్కార్ అవార్డ్స్ పోటీకి జనరల్ కేటగిరీలో ఇండిపెండెంట్‌గా ఆస్కార్ నామినేషన్ కోసం ఈ చిత్రం యూనిట్ దరఖాస్తు చేసిందని బాలీవుడ్ టాక్. ఇదే తరహాలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం కూడా ఆస్కార్ రేసులో నిలిచి, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డు గెలుచుకుంది. మరి.. ‘మిషన్ రాణిగంజ్’కు ఆస్కార్ నామినేషన్ దక్కుతుందా? నామినేషన్ దక్కించుకుంటే.. ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్‌ని తీసుకువచ్చినట్లే ఈసారి ఈ సినిమా తెస్తుందా? అనేది 2024 మార్చిలో తెలిసిపోతుంది. మార్చి 10న ఆస్కార్ అవార్డుల ప్రదానం జరగనుంది. మరోవైపు ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో నామినేషన్ కోసం మలయాళ చిత్రం ‘2018’ పోటీలో ఉన్న విషయం తెలిసిందే. -
ఓటీటీలోకి ‘ఓ మై గాడ్ 2’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..?
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఓ మై గాడ్ 2’. అక్షయ్ దేవుడి పాత్రలో నటించి మెప్పించిన ఓ మై గాడ్ చిత్రానికి సీక్వెల్ ఇది. ఆగస్ట్ 11న థియేటర్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. . లైంగిక విద్య ప్రాధాన్యతను తెలియజేస్తూ దర్శకుడు అమిత్ రాయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇందులో అక్షయ్ శివుడి దూతగా నటించాడు. పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమ్, గోవింద్ నామ్‌దేవ్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. అక్టోబర్ 8 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ సంస్థ ఎక్స్(ట్విటర్)వేదికగా తెలియజేసింది. OMG 2 కథేంటంటే..? శివ భక్తుడి కాంతి శరణ్ ముగ్దల్(పంకజ్ త్రిపాఠి) తన గ్రామంలోని ఆలయం పక్కనే పూజా స్టోర్ నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. అతని కొడుకు వివేక్(ఆరుష్ వర్మ) స్కూల్లో అసభ్యకరంగా ప్రవర్తించడంతో సస్పెండ్‌కు గురవుతాడు. అంతేకాదు అతను స్కూల్ వాష్‌రూమ్‌లో చేసిన పనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దీంతో పరువు పోయిందని భావించిన ముగ్దల్.. భార్య, కొడుకుని తీసుకొని వేరే ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధపడతాడు. అదే సమయంలో దేవదూత(అక్షయ్ కుమార్)ప్రత్యేక్షమై.. కొడుకు చేసిన పనికి భయపడకుండా దానిపై పోరాటం చేయాలని సూచిస్తాడు. దేవదూత మాటలు విన్న ముగ్దల్ ఎలాంటి పోరాటం చేశాడు? అతను కోర్టు మెట్లు ఎందుకు ఎక్కాల్సి వచ్చింది. ఈ పోరాటంలో ముగ్దల్‌కు దేవదూత ఎలాంటి సహాయం చేశాడు? చివరకు ఏం జరిగింది అనేదే మిగతా కథ. We’ve got great news for you, and OMG can you tell we’re 2 excited? #OMG2 arrives 8 October, on Netflix! pic.twitter.com/1XLpd1sVej — Netflix India (@NetflixIndia) October 3, 2023 -
మీరు చూసే గ్లామర్ వెనుక ఇలాంటి ఎన్నో బాధలు ఉంటాయ్: టాప్ హీరోయిన్
ఒకప్పుడు దేశాన్ని ఓ ఊపు ఊపిన వాన పాట ‘టిప్ టిప్ బర్సా పానీ’. 1994లో విడుదలైన 'మోహ్రా' చిత్రం కోసం అక్షయ్ కుమార్‌తో కలిసి రవీనా టాండన్ దుమ్ములేపారు. ఈ ఐకానిక్ పాట చిత్రీకరించడం గురించి ఆమె తాజాగా పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. (ఇదీ చదవండి: రాఘవేంద్ర రావు చెంప చెళ్లుమనేలా కౌంటర్లు ఇస్తున్న నెటిజన్లు) నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్‌లో ఆ పాటను షూట్ చేయడంతో చాలా ఇబ్బంది పడినట్లు రవీనా చెప్పుకొచ్చింది. అక్కడ చుట్టూ ఇనుప చువ్వలతో పాటు అపరిశుభ్రంగా ఉంది. దీంతో పాట చిత్రీకరణలో తాను ఎంతో ఇబ్బంది పడినట్లు రవీనా తెలిపింది. అంతేకాకుండా చెప్పులేకుండా చీర ధరించి వర్షంలో అలాంటి మూమెంట్స్ చేయడం చాలా కష్టమనిపించినట్లు చెప్పింది. షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఇంటికి వెళ్లి చూసుకుంటే మోకాళ్లకు తీవ్రమైన గాయాలయ్యాయి. అప్పుడు ఆ బాధను భరిచలేకపోయానని తెలిపింది. దీంతో వెంటనే ఆస్పత్రికి వెళ్లి టీటీ ఇంజెక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. (ఇదీ చదవండి: భక్త కన్నప్పలో ప్రభాస్.. అదిరిపోయే అప్డేట్) ఆ పాట దెబ్బతో సుమారు మూడు రోజులకు పైగానే అనారోగ్యానికి గురికావడం జరిగిందని గుర్తుచేసుకుంది. తెరపై ప్రేక్షకులు చూసే గ్లామర్... తెరవెనుక చెప్పలేనన్ని కథలను దాచిపెడుతుంది. రిహార్సల్స్ సమయంలో గాయాలు మామూలే, అయినా తామందరం వాటిని సహిస్తామని తెలిపింది. పాట చిత్రీకరణ సమయంలో ఎన్నో ఇబ్బందులు పడినా అదీ విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్‌తో ఆ బాధలన్నీ మరిచిపోయామని రవీనా టాండన్ చెప్పింది. ఇదే పాటను 2021లో విడుదలైన ‘సూర్యవంశీ’ సినిమాలో కూడా రీమేక్ చేశారు. అందులో అక్షయ్‌కుమార్ - కత్రినాకైఫ్ నటించారు. -
‘భారత్’గా మారిన అక్షయ్ కొత్త సినిమా పేరు
ముంబై: భారతదేశం పేరును అధికారికంగా ఇండియా నుంచి భారత్‌కు మార్చాలన్న ప్రతిపాదనలు, వివాదాల నేపథ్యంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కొత్త సినిమా పేరు మారింది. ‘మిషన్ రాణీగంజ్: ది గ్రేట్ ఇండియన్ రెస్క్యూ’ పేరులోని ఇండియా పదాన్ని తొలగించి భారత్ పదాన్ని చేర్చారు. దీంతో సినిమా పేరు ‘మిషన్ రాణీగంజ్: ది గ్రేట్ భారత్ రెస్క్యూ’గా మారింది. ఈ రోజే(గురువారం) ఈ సినిమా థియేటర్లలో విడుదలకాబోతోంది. 1989 నవంబర్‌లో పశి్చమబెంగాల్‌లోని రాణిగంజ్‌లో వరదమయమైన బొగ్గు గనిలో చిక్కుకున్న వారిని సాహసోపేతంగా రక్షించిన సహాయక బృందానికి సారథ్యం వహించిన మైనింగ్ ఇంజనీర్ దివంగత జస్వంత్ సింగ్ గిల్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమాను రూపొందించారు. -
రక్తసంబంధం లేకున్నా ఆ పిల్లల కోసం సుస్మితా సేన్ ఏం చేసిందంటే
బాలీవుడ్ నటి సుస్మితా సేన్ తాజాగా ‘తాలీ’ వెబ్ సీరిస్తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం ఇది జియో టీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సీరిస్ ట్రైలర్ విడుదలైనప్పుడు తీవ్రంగా విమర్శలు ఎదుర్కొన్న ఆమె ఇందులో ట్రాన్స్‌జెండర్‌గా అద్భుతంగా నటించి విమర్శించిన వారికి సమాధానం చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ జర్నీ ఎలా ముగిసింది. అప్పుడు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంది. అనే అంశాలపై సుస్మిత కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సుస్మితా సేన్ తన కుమార్తె యొక్క ఆరోగ్య సమస్యల గురించే కాకుండా తన బిడ్డ పట్ల ఎలాంటి విధులను నిర్వహించింది అనే దాని గురించి మాట్లాడారు. ఒక సంఘటనను గుర్తుచేసుకుంటూ.. ఈ సంఘటనతో సినిమాలకు దూరం సుస్మితా సేన్‌కు 24 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఒక కుమార్తెను దత్తత తీసుకుంది. ఆ సమయంలో తన తల్లి వద్దని వారించినా మెండిగా నిర్ణయం తీసుకుంది. అప్పుడు ఆమెకు పలు భారీ సినిమా అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పలువురు సన్నిహితులు కూడా వద్దని చెప్పినా సుస్మిత మనుసు మార్చుకోలేదు. కుమార్తెను దత్తత తీసుకుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇలా చెప్పింది. 'రెనీ నా జీవితంలోకి వచ్చినప్పుడు తన ఆరోగ్యం మెరుగ్గాలేదు. అదే సమయంలో నేను కెనడాలో ఉన్నాను. అక్షయ్ కుమార్, కరీనాతో కలిసి ఒక సినిమా చిత్రీకరణలో ఉన్నాను. పాపను అలా వదిలి రావడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు.. కానీ తప్పలేదు. (ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాజమౌళి) అలా షూటింగ్లో ఉండగా నా తండ్రి నుంచి ఫోన్ వచ్చింది. పాపకు సీరియస్‌గా ఉంది. ఆస్పత్రిలో చేర్పించామని నాన్న చెప్పాడు. అలాంటి సమయంలో నేను షూటింగ్లో పాల్గొనలేకపోయాను. తనను నేను నవమాసాలు మోసి కనకపోయినా అంతే సమానమైన బంధం రెనీతో ఉంది. దీంతో సినిమా షూటింగ్లో ఒక్క క్షణం ఉండలేకపోయాను.. సెట్లో అందరి ముందు విషయం చెప్పి కెనడా నుంచి తిరిగి ముంబయ్‌కు బయల్దేరాను. విదేశాల్లో షూటింగ్లో ఉన్న నేను సినిమాను మధ్యలో ఆపేసి వచ్చేశాను. ఆ క్షణమే నాకు తెలుసు నా సినిమా కెరీర్ ఇక్కడితో ముగిసిందని. అప్పట్లో నాకు కెరీర్‌పై సీరియస్‌నెస్ లేదని, అందుకే 24 ఏళ్లకే తల్లినయ్యానని కామెంట్స్ చేసేవారు ఎందరో. దీంతో నా పనిలో ఇంకా ఎక్కువ కష్టపడేదానిని కానీ, అప్పటికే నాకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.’ అని సుస్మిత తెలిపింది. 1994లో విశ్వ సుందరిగా నెగ్గిన సుష్మితా సేన్ బాలీవుడ్‌తో పాటు తెలుగు సినిమాల్లో కూడా నటించింది. తర్వాత ఆమెకు పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. (ఇదీ చదవండి: అందరిలా నేనెందుకు ఆనందంగా లేనంటే: టాప్ హీరోయిన్) భారత మెగా టీ20 క్రికెట్ లీగ్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీతో కొంత కాలం సుష్మిత డేటింగ్లో ఉన్నారు. సుష్మితా సేన్ చేసిన సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా 2013లో మదర్ థెరిసా అంతర్జాతీయ అవార్డును ఆమె పొందింది. ప్రస్తుతం ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిద్దరూ కూడా దత్తత తీసుకున్నవారే కావడం విశేషం. -
ఆ హీరో వల్ల డిప్రెషన్లోకి వెళ్లిపోయా: స్టార్ హీరోయిన్
హీరోయిన్ భానుప్రియ గుర్తుందా? కచ్చితంగా గుర్తుండే ఉంటుంది. ఈమె చెల్లెలు శాంతిప్రియ కూడా తెలుగులో హీరోయిన్గా చేసింది. కాకపోతే తమిళ, హిందీలో వచ్చినన్ని ఛాన్సులు ఇక్కడ రాలేదు. అయితే కొన్నాళ్ల ముందు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈమె.. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. తనని గతంలో అతడు బాడీ షేమింగ్ చేశాడని చెప్పుకొచ్చింది. ఇప్పుడు మరిన్ని విషయాలు బయటపెట్టింది. ఏం జరిగింది? అక్షయ్-శాంతిప్రియ కలిసి 'ఇక్కె పె ఇక్కా' సినిమా చేశారు. ఓ మిల్లులో షూటింగ్. గ్లామర్ రోల్ కావడం వల్ల హీరోయిన్ శాంతిప్రియ కాస్త పొట్టిబట్టలు వేసుకుని ఉంది. దీంతో ఆమె మోకాలు కనిపించింది. అయితే అది చూసిన అక్షయ్.. ఏమైంది? మోకాలికి దెబ్బ తగిలాందా అని అన్నాడు. అంత నల్లగా ఉన్నాయేంటి అని కూడా కామెంట్ చేశాడు. దీంతో సెట్లోని ఉన్నవాళ్లందరూ శాంతిప్రియని చూసి నవ్వారు. (ఇదీ చదవండి: అనసూయ బాధని అర్థం చేసుకున్న ఆ వ్యక్తి!) డిప్రెషన్‌తో బాధపడ్డా 'నాకు అప్పుడు 22-23 ఏళ్లు ఉంటాయి. అక్షయ్ చేసిన బాడీ షేమింగ్ కామెంట్స్ వల్ల నేను డిప్రెషన్‌కి గురయ్యాను. ఆ సమయంలో అమ్మ నాకు అండగా నిలబడింది. నేను మాత్రమే కాదు అక్క భానుప్రియ కూడా ఇలాంటివి ఫేస్ చేసింది. నార్త్‌లోని కొన్ని మ్యాగజైన్స్ అయితే.. ముఖంపై మొటిమలు(పింపుల్స్) సంఖ్య బట్టి భానుప్రియ, తన సినిమాలకు పారితోషికం తీసుకుంటోందని రాసుకొచ్చారు' సారీ చెప్పలేదు తన స్కిన్ కలర్‌పై అప్పట్లో కామెంట్స్ చేసిన అక్షయ్ కుమార్.. ఇప్పటికీ క్షమాపణ చెప్పలేదని శాంతిప్రియ పేర్కొంది. ఓసారి ఈ విషయమై మాట్లాడుతూ.. జోక్ చేశానని అన్నాడు తప్పితే సీరియస్‌గా సారీ లాంటిదైతే అస్సలు చెప్పలేదని ఈమె తెలిపింది. ఇదిలా ఉండగా 1994 తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన శాంతిప్రియ.. 2014లో రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం హిందీలో పలు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 కొత్త సినిమాలు) -
అక్షయ్ కుమార్ పారితోషికంపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
అక్షయ్ కుమార్ కీలక పాత్రలో అమిత్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఓ మై గాడ్ 2' ఎన్నో వివాదాల మధ్య విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమ్, గోవింద నామ్‌దేవ్ కీలక పాత్రలు పోషించారు. అయితే దీని కోసం అక్షయ్ కుమార్ భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా వీటిపై నిర్మాతల్లో ఒకరైన అజిత్ అంధరే స్పందించారు. ఈ సినిమా కోసం అక్షయ్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సినిమా విడుదలైన రోజు నుంచే మంచి టాక్ తెచ్చుకోవడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పటి వరకు రూ.150కోట్లు వసూళ్లు చేసిందని చిత్రబృందం ప్రకటించింది. అక్షయ్ కుమార్ శివుడి పాత్రను పోషించగా ఆయన భక్తుడిగా పంకజ్ త్రిపాఠి నటించారు. (ఇదీ చదవండి: రెమ్యునరేషన్ తిరిగిచ్చేసిన మెగాస్టార్.. ఎంతో తెలుసా..?) అక్షయ్ రెమ్యునరేషన్‌పై 'ఓమైగాడ్2' నిర్మాతల్లో ఒకరైన అజిత్ అంధరే ఇలా స్పందించారు 'ఈ సినిమా ప్రకటించిన సమయం నుంచి అక్షయ్ రెమ్యునరేషన్‌పై వస్తున్న వార్తలు చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆయన భారీగా పారితోషికం తీసుకున్నారని ప్రచారం జరిగింది. అందులో ఏ మాత్రం నిజం లేదు. ఈ సినిమా కోసం అక్షయ్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఇంకా చెప్పాలంటే సినిమాకు బడ్జెట్ విషయంలో లోటుపాట్లు ఉంటే ఆయనే ఆర్థికంగా సాయం చేశారు. మా మధ్య ఉన్న స్నేహం ఇప్పటిది కాదు. 'ఓ మైగాడ్' మొదటి భాగం వచ్చినప్పటి నుంచి మేము కలిసి సినిమాలు తీస్తున్నాం.' అని అన్నారు. ఈ సినిమా నిర్మాతల్లో అక్షయ్ కూడా ఒకరని అజిత్ అంధరే తెలిపారు. కాబట్టి సినిమాకు వచ్చిన లాభాల్లో మాత్రమే ఆయనకు షేర్ ఉంటుందని చెప్పారు. -
IPL: ‘ఢిల్లీ క్యాపిటల్స్’ కోసం కోట్లు వదులుకున్న సూపర్‌స్టార్.. అందుకే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే కాసుల వర్షం. క్యాష్ రిచ్ లీగ్‌గా పేరొందిన ఈ మెగా క్రికెట్ ఈవెంట్లో భాగమైన ఫ్రాంఛైజీలలో అత్యధికం బడా సంస్థలకు చెందినవేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఐపీఎల్లో సక్సెస్ అయితే ఎంతటి క్రేజ్ వస్తుందో.. ఏమాత్రం తేడా జరిగినా అదే స్థాయిలో నష్టాలు చవిచూడాల్సి వస్తుంది! ఐపీఎల్ రెండో సీజన్(2009)లో విజేతగా నిలిచిన దక్కన్ చార్జర్స్ ఆ తర్వాత కనుమరుగైన తీరే ఇందుకు నిదర్శనం. అయితే, అదే ఏడాది.. ఢిల్లీ క్యాపిటల్స్ తాము కూడా చార్జర్స్ మాదిరే చేతులు కాల్చుకోకుండా తీసుకున్న కీలక నిర్ణయం గురించి, దానితో బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్‌కు ఉన్న సంబంధం గురించి బీసీసీఐ మాజీ జీఎం అమృత్ మాథూర్ సంచలన విషయాలు తాజాగా వెల్లడించాడు. బాలీవుడ్‌తో అనుబంధం ఐపీఎల్‌కు ప్రాచుర్యం కల్పించే క్రమంలో బాలీవుడ్‌ను కూడా ఇందులో మమేకం చేసిన విషయం తెలిసిందే. బీ-టౌన్ బాద్షా షారుక్ ఖాన్, అలనాటి హీరోయిన్ జూహీ చావ్లా కోల్‌కతా నైట్ రైడర్స్‌కు యజమానులు కాగా.. శిల్పా శెట్టి కుంద్రా రాజస్తాన్ రాయల్స్‌కు, ప్రీతి జింటా పంజాబ్ కింగ్స్‌కు సహ యజమానిగా ఉన్న విషయం తెలిసిందే. ఫ్రాంఛైజీ ఓనర్లుగానే గాకుండా ప్రమోషన్లలో భాగమైన, భాగమవుతున్న స్టార్లు కూడా చాలా మందే ఉన్నారు. ఈ క్రమంలో 2009లో ఢిల్లీ క్యాపిటల్స్(ప్రస్తుతం ఢిల్లీ డేర్‌డెవిల్స్) సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, అక్కీతో అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోగా ఆర్థికపరంగా నష్టాలూ చవిచూసింది. అనవసర ఖర్చులు ఎందుకు? అనవసర ఖర్చులు తగ్గించుకునే క్రమంలో అతడితో బంధాన్ని తెంచుకునేందుకు సిద్ధమైంది. ఇందుకు చట్టపరంగా చిక్కులు ఎదరవుతాయని భావించినా.. అక్షయ్ కుమార్ పెద్ద మనసుతో ఈ సమస్య నుంచి ఫ్రాంఛైజీ తేలికగా బయటపడేలా చేశాడు. ‘‘ప్రమోషనల్ ఫిల్మ్స్, మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్ల కోసం అక్షయ్ కుమార్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. కోట్లా మైదానంలో విన్యాసాలు మినహా క్యాపిటల్స్‌కు అతడి వల్ల పెద్దగా ఒరిగిందేమీ లేదు. నిజానికి అతడి సేవలు వినియోగించడంలో యాజమాన్యం విఫలమైంది. నష్టాలు వెంటాడాయి. దీంతో అర్ధంతరంగా అక్కీతో డీల్ ముగించాలని భావించింది. న్యాయపరంగా చిక్కులు.. అయితే న్యాయపరంగా అందుకు అనేక అడ్డంకులు ఉండటంతో అక్షయ్ కుమార్ దయపైనే అంతా ఆధారపడి ఉన్న సందర్భం. అక్కీ లాయర్లతో విషయం గురించి చెప్పాం. ఆ తర్వాత ఓరోజు సినిమా షూటింగ్లో ఉన్నపుడు.. షాట్ ముగిసిన తర్వాత అక్షయ్ వానిటీ వ్యాన్‌లోకి నేను వెళ్లాను. మరేం పర్లేదన్న అక్షయ్ కుమార్ సంశయిస్తూనే.. ఢిల్లీ క్యాపిటల్స్ ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల గురించి.. డీల్ రద్దు చేసుకోవాలనుకోవడం వెనుక ఉన్న కారణాల గురించి వివరించాను. కానీ అక్షయ్ మాత్రం ఎంతో హుందాగా స్పందించాడు. మరేం ప్రాబ్లం లేదండి! ఒకవేళ ఇదంతా వర్కౌట్ కాదనుకుంటే.. వెంటనే రద్దు చేసేయండి. పర్లేదు అన్నాడు. నేను విన్నది నిజమేనా నేను విన్నది నిజమేనా అన్న సందేహంలో కొట్టుమిట్టాతుండగా.. ‘‘మీరేం ఇబ్బంది పడకండి. ఎలాంటి సమస్య రాకుండా దీనిని ఎలా ముగించాలో మా లాయర్లతో నేను మాట్లాడతా అని మళ్లీ అక్షయ్ క్లారిటీ ఇచ్చాడు’’ అని అమృత్ మాథుర్ పేర్కొన్నాడు. ఈ మేరకు తన ఆత్మకథలో నాటి ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించాడు. ఇదిలా ఉంటే.. ఢిల్లీ జట్టు ఇంత వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ చాంపియన్‌గా నిలవలేదన్న విషయం తెలిసిందే. తాజా సీజన్లోనూ దారుణ ప్రదర్శనతో తొమ్మిదో స్థానానికి పరిమితమైంది. ఇక అక్షయ్ కుమార్ విషయానికొస్తే.. అతడు నటించిన ఓ మై గాడ్ 2 సినియా ఇటీవలే విడుదలైంది. చదవండి: APL 2023: తొలిరోజు మ్యాచ్‌కు శ్రీలీల.. జట్ల వ్యూహాలివే! లక్కీడిప్‌లో ఆ అదృష్టం మీదైతే! -
స్టార్ హీరో.. ఇన్నాళ్లకు భారతీయుడు అయ్యాడు!
స్టార్ హీరో అక్షయ్ కుమార్... 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారతీయ పౌరసత్వం అందుకున్నాడు. అదేంటి... గత 30 ఏళ్లకు పైగా మన సినిమాల్లో హీరోగా చేస్తున్నాడు. మన దేశస్తుడు కాకపోవడం ఏంటని మీరు అనుకోవచ్చు. కానీ అదే నిజం. ఇంతకీ అక్షయ్ పౌరసత్వం సంగతేంటి? అతడు ఇన్నాళ్లు ఏ దేశ పౌరుడు అనేది ఇప్పుడు కాస్తంత వివరంగా చెప్పుకొందాం. నటుడు కాకముందు మార్షల్ ఆర్ట్స్ నిపుణుడిగా పనిచేసిన అక్షయ్ కుమా.. 1987లో 'ఆజ్' అనే సినిమాలో సహాయ పాత్రలో నటించి కెరీర్ ప్రారంభించాడు. 1991లో 'సౌగంధ్' మూవీతో హీరోగా మారాడు. ఇక అప్పటి నుంచి మెల్లమెల్లగా సినిమాలు చేస్తూ స్టార్‌గా ఎదిగాడు. ప్రస్తుతం బాలీవుడ్ లోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న స్టార్ హీరోల్లో అక్షయ్ ఒకడని చెప్పొచ్చు. (ఇదీ చదవండి: కులాలంటే నాకు అసహ్యం: నటుడు మోహన్‌బాబు) ఇన్నాళ్లుగా హిందీ సినిమాలు చేస్తున్నప్పటికీ అక్షయ్‌కి కెనడా పౌరసత్వం ఉండేది. దీంతో చాలామంది ఈ విషయమై ఇతడిని విమర్శించేవారు. గతంలో ఓసారి ప్రధాని మోదీని, అక్షయ్ కుమార్ ఇంటర్వ్యూ చేశాడు. అప్పుడు కూడా పౌరసత్వం విషయమై ట్రోల్ చేశారు. దీంతో 2019లో భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు పెట్టుకున్నాడు. కొవిడ్ వల్ల అది ఇన్నాళ్లు పాటు ఆలస్యమైంది. తాజాగా 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తాను భారతదేశ పౌరసత్వ అందుకున్నట్లు ఓ ఫొటో పోస్ట్ చేసి ఆనందం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండగా ఈ మధ్య 'ఓ మై గాడ్ 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన అక్షయ్.. త్వరలో 'ద గ్రేట్ ఇండియా రెస్క్యూ' చిత్రంతో రాబోతున్నాడు. వీటితో పాటు మరో నాలుగు మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నాడు. Dil aur citizenship, dono Hindustani. Happy Independence Day! Jai Hind! 🇮🇳 pic.twitter.com/DLH0DtbGxk — Akshay Kumar (@akshaykumar) August 15, 2023 (ఇదీ చదవండి: ఆ హీరోయిన్‌కి క్షమాపణలు చెప్పిన రానా) -
ఆ హీరోని చెంపదెబ్బ కొట్టినా, అతనిపై ఉమ్మినా..రూ.10 లక్షలు నజరానా!
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్రం 'ఓ మై గాడ్ 2'(OMG 2). భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(ఆగస్ట్ 11) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజే పాజిటివ్ టాక్ని సంపాదించుకుంది. ఫలితంగా ఫస్ట్‌డే రూ. 10 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. లైంగిక విద్య ప్రాధాన్యతను తెలియజేస్తూ దర్శకుడు అమిత్ రాయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇందులో అక్షయ్ శివుడి దూతగా నటించాడు. ఆ పాత్రే ఇప్పుడు వివాదానికి కారణమైంది. (చదవండి: సిద్ధార్థ్... నాతో నటించడానికి భయపడ్డాడు: ప్రముఖ నటుడు) శివుడి భక్తులను అవమానించేలా సినిమా ఉందంటూ కొన్ని హిందూ సంఘాలు ‘ఓ మై గాడ్ 2’ చిత్రబృందంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రీయ హిందూ పరిషత్ సభ్యులు కొన్ని థియేటర్ల ముందు అక్షయ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. సినిమాను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఇక ఆగ్రాకు చెందిన ఓ హిందూ సంస్థ అయితే అక్షయ్ కుమార్‌ను చెంపదెబ్బ కొట్టినా, ఉమ్మివేసినా రూ. 10లక్షల బహుమతి అందజేస్తామని ప్రకటించింది. OMG 2 కథేంటంటే..? శివ భక్తుడి కాంతి శరణ్ ముగ్దల్(పంకజ్ త్రిపాఠి) తన గ్రామంలోని ఆలయం పక్కనే పూజా స్టోర్ నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. అతని కొడుకు వివేక్(ఆరుష్ వర్మ) స్కూల్లో అసభ్యకరంగా ప్రవర్తించడంతో సస్పెండ్‌కు గురవుతాడు. అంతేకాదు అతను స్కూల్ వాష్‌రూమ్‌లో చేసిన పనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దీంతో పరువు పోయిందని భావించిన ముగ్దల్.. భార్య, కొడుకుని తీసుకొని వేరే ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధపడతాడు. అదే సమయంలో దేవదూత(అక్షయ్ కుమార్)ప్రత్యేక్షమై.. కొడుకు చేసిన పనికి భయపడకుండా దానిపై పోరాటం చేయాలని సూచిస్తాడు. దేవదూత మాటలు విన్న ముగ్దల్ ఎలాంటి పోరాటం చేశాడు? అతను కోర్టు మెట్లు ఎందుకు ఎక్కాల్సి వచ్చింది. ఈ పోరాటంలో ముగ్దల్‌కు దేవదూత ఎలాంటి సహాయం చేశాడు? చివరకు ఏం జరిగింది అనేదే మిగతా కథ.