సినిమా ప్లాప్‌ అయితే రెమ్యునరేషన్‌ వద్దు: స్టార్‌ హీరోలు | Akshay Kumar And Ajay Devgn Says Actors Remuneration Depend On Box Office Recoveries, Check Out More Insights | Sakshi

సినిమా ప్లాప్‌ అయితే రెమ్యునరేషన్‌ వద్దు: స్టార్‌ హీరోలు

Published Sun, Nov 17 2024 11:52 AM | Last Updated on Sun, Nov 17 2024 3:05 PM

Akshay Kumar and Ajay Devgn Says Actors Remuneration Depend On Box Office Recoveries

బాలీవుడ్ స్టార్‌ హీరోలు  అజయ్ దేవగన్‌, అక్షయ్ కుమార్‌లు తమ రెమ్యునరేషన్‌ల గురించి ఓపెన్‌గానే మాట్లాడారు. తాజాగా జరిగిన  హిందూస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్ 2024లో వారిద్దరూ పాల్గొన్నారు. ఈ క్రమంలో బాలీవుడ్‌లో ఉన్న ఐక్యత గురించి కూడా చర్చించారు. ఒక సినిమా కోసం వారు ఎలా రెమ్యునరేషన్‌ తీసుకుంటారో చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలిసిన తర్వాత ఫ్యాన్స్‌ కూడా షాక్‌ అయ్యారు.

లాభాలు వస్తేనే రెమ్యునరేషన్‌: అక్షయ్‌ కుమార్‌
ఒక సినిమాకు రెమ్యునరేషన్‌ అనేది స్క్రిప్ట్‌, కథలో ప్రాధాన్యతను బట్టే రెమ్యునరేషన్‌ తీసుకోవాలని అక్షయ్‌ కుమార్‌ అభిప్రాయపడ్డారు. అయితే, ప్రస్తుతం చాలామంది హీరోలు  సినిమాకు వచ్చే లాభాల నుంచి షేర్‌ తీసుకునేందుకు ఒప్పందం చేసుకుంటారని ఆయన అన్నారు.  అందులో తాను కూడా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో సినిమా అనుకున్న ఫలితం ఇవ్వకపోతే నిర్మాతకు రికవరీ ఉండదు. దీంతో  హీరోలు తమ పారితోషికాన్ని పూర్తిగా వదులుకున్న సందర్భాలు చాలా ఉన్నాయని ఆయన గుర్తు చేసుకున్నారు. 

ఇలా చేయడానికి ప్రధాన కారణం  సినిమా పరిశ్రమపై ఉన్న మక్కువే అంటూ అక్షయ్‌ తెలిపారు. అయితే, సినిమా భారీ విజయ​ం సాధిస్తే మాత్రం మంచి రెమ్యునరేషన్‌ వస్తుందని కూడా  ఆయన అన్నారు. నిర్మాతకు వచ్చిన లాభంలో మాత్రమే తాము వాటా తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇలా చేయడం వల్ల నిర్మాత సేఫ్‌గా ఉంటారని అన్నారు. అదే సినిమా ప్లాప్‌ అయితే మాత్రం నిర్మాతతో పాటు తమకు కూడా నష్టాలు తప్పవని అక్షయ్‌ పేర్కొన్నారు.

సినిమా ప్లాప్‌ అయితే రెమ్యునరేషన్‌ తీసుకోను: అజయ్‌ దేవగణ్‌
చిత్ర పరిశ్రమలో సినిమా బడ్జెట్‌ పెరుగుతుందని అజయ్‌ దేవగణ్‌ అభిప్రాయపడ్డారు. తాను నటించిన సినిమా విజయం సాధించకపోతే రెమ్యునరేషన్​ తీసుకోనని ఆయన బహిరంగంగానే వెల్లడించారు. సినిమాకు వచ్చిన కలెక్షన్స్‌ ఆధారంగానే తాను పారితోషకం తీసుకుంటానని చెప్పుకొచ్చారు. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమతో పోలిస్తే బాలీవుడ్‌లో అంతగా ఐక్యత లేదని ఆయన అన్నారు. 

సౌత్ సినీ ఇండస్ట్రీ తమ నటీనటులకు మద్దతుగా ఉంటుందని ఆయన గుర్తుచేశారు. అయితే, అక్షయ్ కుమారు, షారుక్ ఖాన్‌, సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్‌లు మాత్రం మంచి స్నేహంగా ఉంటారని అజయ్‌ దేవగణ్ తెలిపారు.  ఈ క్రమంలో ఒక కొత్త ప్రాజెక్ట్‌ కోసం తానే డైరెక్షన్‌ చేయబోతున్నట్లు అజయ్‌ దేవగణ్‌ తెలిపారు. ఇందులో అక్షయ్‌ కుమార్‌ ఒక ప్రధాన పాత్రలో కనిపిస్తారని రివీల్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement