
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, కత్రీనా కైఫ్ జంట నటిస్తున్న తాజా చిత్రం ‘సూర్యవంశీ’. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అజయ్‌దేవ్‌గణ్, రణ్‌వీర్ సింగ్ కూడా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 5న థియేటర్స్‌లో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ పారంభించింది ఈ చిత్రబృందం. ఆ సమయంలో తీసిన ఓ ఫన్నీ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది క్యాట్. మా బోయ్స్ ఎంత ఉత్సాహంగా ఉన్నారో చూడండంటూ అక్షయ్, రోహిత్‌ను చూపించింది ఈ బ్యూటీ. అందులో అక్షయ్ కళ్లు మూసుకొని, రోహిత్ కాళ్లపై తలపెట్టి పడుకొని ఉన్నాడు.
కత్రీనా వీడియో తీయడం చూసిన రోహిత్, అక్షయ్ రికార్డు చేయొద్దు అంటూ పరుగు లంకించుకున్నారు. ‘ఇప్పుడు మేము అంతా బాగా కనిపించడం లేదు. మాకు ఫేమ్ ఉంది. రికార్డు చేయొద్దు’ అంటు పరిగెత్తుతున్న అక్షయ్ కిందపడ్డాడు. అది చూసిన పట్టువదలని ఈ భామ గొల్లున నవ్వుతూనే వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో మూవీ ప్రమోషన్స్ గురించి వారు ఎంత ఎక్సయిట్‌మెంట్‌తో ఉన్నారో చూడండి అంటూ వెటకారమాడింది ఈ బ్యూటీ. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: OMG 2: శివుడిగా అక్షయ్ కుమార్.. లుక్ అదిరిందిగా!
Comments
Please login to add a commentAdd a comment